హైదరాబాద్ :మహబూబ్‌నగర్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.....మహబూబ్‌నగర్కు చెందిన చెన్నయ్య కుమార్తె సింధూ హైదరాబాద్‌లో ఉండే మేనమామ ఇంటికి వచ్చింది. మార్చి 17న తిరిగి మహబూబ్‌నగర్‌కు బయలుదేరింది. బస్టాండ్ వరకు తోడుగా వెళ్లిన మేనమామ ఆమెను ఎంజీబీఎస్‌లో మహబూబ్‌నగర్ వెళ్లే బస్పు ఎక్కించారు.
అయితే సింధూ మహబూబ్‌నగర్ చేరలేదు. కుమార్తె ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రులు బంధువులందరినీ వాకబు చేసినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చివరకు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. బాలికను ఎవరైనా అపహరించి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.