
సార అనిత (ఫైల్)
రాయికోడ్(అందోల్): మండలంలోని హస్నాబాద్‌కు చెందిన బాలిక అదృశ్యమైంది. స్థానిక ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి కథనం మేరకు... గ్రామానికి చెందిన సార కిషన్ మూడవ కూతురు సార అనిత (17) సోమవారం ఇంటి నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా అనిత ఆచూకీ తెలయక పోవడంతో ఆమె తండ్రి కిషన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనిత ఆచూకీ తెలిసిన వారు 94409 01829, 08451 286733 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్‌ఐ సూచించారు.