బాలిక అదృశ్యం | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Published Wed, May 22 2019 8:39 AM

Girl Child Missing in hyderabad - Sakshi

శంషాబాద్‌: బాలిక అదృశ్యమైన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా పెద్దలింగారెడ్డిపల్లికి చెందిన కె.శ్రీనివాస్‌ భార్యాపిల్లలతో కలిసి శంషాబాద్‌ రాళ్లగూడలో నివాసముంటూ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌ కుమార్తె పల్లవి (13) నర్కూడలోని ప్రభుత్వ పాఠశాలో ఏడో తరగతి పూర్తి చేసింది. ఈ నెల 18 సరుకుల కోసం కిరాణ దుకాణానికి వెళ్లిన పల్లవి తిరిగి రాలేదు. అన్నిచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పల్లవి తండ్రి ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement