
ఖాదర్ మున్ని (ఫైల్)
పెండ్లిమర్రి(అన్నమయ్య జిల్లా): మండలంలోని ఎగువపల్లె గ్రామానికి చెందిన దుత్తలూరు ఖాదర్ మున్ని (16) సోమవారం అదృశ్యం అయినట్లు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆ బాలిక పదో తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉన్నది. తల్లిదండ్రులు ఉదయం కూలీ పనులకు వెళ్లారు.
చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు
వారు తిరిగి ఇంటికి వచ్చే సరికి బాలిక ఇంటి వద్ద లేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు, బంధువులు గ్రామం చుట్టు పక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా కనిపించలేదు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు నంబర్: 9121100527కు ఫోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment