Annamayya District
-
ప్రేమ వివాహం చేసుకున్నారంటూ వరుడి ఇంటిపై దాడి
-
టీడీపీ నేత కుమార్తెతో ప్రేమ.. పెళ్లి చేసుకున్నాడనే కారణంతో..
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేత కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా వరుడి ఇంటిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత సుంకర వెంకటరమణ కుమార్తె శివలీల, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వరుడు వెంకటేశ్వర్లుపై వెంకటరమణ, ఆయన మద్దతు దారులు కక్ష పెంచుకున్నారు. దీంతో, వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, రాడ్లతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. -
భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా: మంచు విష్ణు
సాక్షి, రాజంపేట: హీరో మంచు విష్ణు (Vishnu Manchu) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలోని ఊటుకూరు భక్తకన్నప్ప గుడిని శనివారం సందర్శించాడు. కన్నప్ప చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తమ గ్రామానికి విచ్చేసిన విష్ణుకు.. స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.చరిత్ర తెలియజేయాలనే..ఆలయ దర్శనానంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్తకన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే కన్నప్ప సినిమా (Kannappa Movie) తీశాం. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తాను. ఆలయ పెద్దలతో మాట్లాడి గుడికి కావాల్సిన అవసరాలను తీరుస్తాను అని హామీ ఇచ్చాడు.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. కన్నప్ప పాత్రలో విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల -
పోసానిపై ‘పచ్చ’ పగ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి దగ్గర్నుంచి ఈరోజు(శనివారం) రిమ్స్ ఆస్పత్రి తరలించే విషయంలోనూ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది పోసాని అనారోగ్యంతో ఉన్నా పోలీసుల వేధింపుల పర్వం మాత్రం కొనసాగుతోంది. అరెస్టు సమయంలో తన అనారోగ్యం సమస్యలను పోసాని, ఆయన కుటుంబ సభ్యులు.. పోలీసులకు చెప్పారు. అరెస్ట్ చేసేటప్పుడు తనకు రేపు ఎంఆర్ఐ స్కాన్ ఉందని పోలీసులకు స్పష్టం చేశారు. అయినా వినిపించుకోకుండా పోసానిని అరెస్ట్ చేశారు. తమ వద్ద మంచి డాక్టర్లు ఉన్నారంటూ జీపులో ఎక్కించుకుని పోసానిని తీసుకువెళ్లారు సంబేపల్లి ఎస్ఐ.తెల్లారిదాకా జీప్‌లో తిప్పుతూ..ఇలా తెల్లారిదాకా జీపులోనే తిప్పుతూ పోసానిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఖాకీలు. 27వ తేదీ మధ్యాహ్నం ఓబులవారి పల్లె పీఎస్ కు తరలించారు. అప్పుడు కూడా పోసానిని 9 గంటల పాటు విచారించారు. కోర్టుకు తరలించే ముందు పీహెచ్ సీ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. గొంతు, చేయి నొప్పితో ఉన్న పోసానికి బీపీ, షగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా పోసానిని ఖాకీలు ఇబ్బంది పెట్టారు. రాజంపేట జైలుకు తరలించిన తర్వాత ఛాతి నొప్పితో పోసాని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక జైలు నుంచి ఆస్పత్రికి తరలింపులోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడింది. తీవ్రంగా నొప్పితో బాధపడుతున్నా మధ్యాహ్నం వరకూ ఆస్పత్రికి తరలించకుండా వేధింపులకు గురిచేశారు. ఈసీజీ పరీక్షల్లో హార్ట్ బీట్ తేడా కనపించడంతో కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ కు పోసానిని తరలించే విషయంలో కూడా అలక్ష్యం ప్రదర్శించారు. చాతి నొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్ లో కాకుండా పోలీస్ వ్యాన్ లో తరలించడం పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి అద్దం పడుతోంది. -
పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత
అన్నమయ్య జిల్లా: కూటమి సర్కార్ అక్రమంగా పెట్టిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు.. ఈసీజీతో పాటు మరికొన్ని రక్ష పరీక్షలు నిర్వహించారు. బీపీతో పాటు ఈసీజీలో తేడాలున్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం పోసానిని కడప రిమ్స్‌కు తరలించారు. గత రాత్రి నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్న పోసాని.. కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. తీవ్రమైన గొంతునొప్పితో కూడా బాధపడుతున్న పోసాని.. మాట్లాడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు.పోసాని తీవ్రమైన గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారు. అబ్డామిన్ హెర్నియా సర్జరీలో ఇన్ఫెక్షన్ వల్ల పోసానికి తీవ్రమైన సమస్య ఉంది. హెర్నియా సర్జరీ తర్వాత నెలరోజులు ఆస్పత్రిలోనే పోసాని చికిత్స తీసుకున్నారు తీవ్రమైన వెన్నునొప్పితో మూడుసార్లు వోకల్ కార్డు సర్జరీ జరిగింది.కొద్ది రోజుల క్రితం పోసానికి గుండెకు సంబంధించిన చికిత్స జరగగా, హార్ట్ సర్జరీ చేసిన స్టంట్ వేశారు వైద్యులు. హార్ట్ సర్జరీ తర్వాత ఛాతిలో నొప్పితో బాధపడుతున్నారు పోసాని కాగా, పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్ సాయితేజ్.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్ఐ పి.మహేష్‌నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్ జైలు వద్దకు తీసుకొచ్చారు. -
పోసాని ఆరోగ్యం బాగోలేదు: ఎమ్మెల్యే ఆకేపాటి
అన్నమయ్య, సాక్షి: కూటమి కుట్రలతో జైలు పాలైన ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ నేతలు శనివారం పరామర్శించారు. అయితే ములాఖత్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్‌పై గతంలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సినీ పరిశ్రమలో కులాల పేరుతో చిచ్చు పెట్టేలా మాట్లాడారని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో అరెస్టైన పోసాని.. రిమాండ్‌లో ఉన్నారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆయనకు వైఎస్సార్సీపీ అన్నివిధాల అండగా ఉంటుందని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో.. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళితో స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు.. ములాఖత్ కోసం రైల్వే కోడూరు మాజీ MLA కొరముట్ల శ్రీనివాసులు పెట్టుకున్న విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో సబ్ జైలర్ మల్ రెడ్డిపై కొరముట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. పోసాని బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: పొన్నవోలు
సాక్షి, అన్నమయ్య జిల్లా: ‘పోసాని కృష్ణమురళి కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. సెక్షన్లు 111, 67 వర్తించవని రైల్వే కోడూరు కోర్టు చెప్పింది.. అయినప్పటికీ పోసానికి రిమాండ్ విధించటం సరికాదు‘‘ అని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు. కోర్టు ధిక్కారణ కింది హైకోర్టు లో కేసు వేస్తాం’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.‘‘పోసాని కృష్ణమురళి పై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయ పోరాటం కొనసాగిస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యం గా ఉండాలి’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.కాగా, పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం మార్చి 13 వరకు (14 రోజులు) రిమాండ్ విధించింది. పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎస్ఎన్ 111 యాక్ట్నమోదు చేయడంపై పొన్నవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డనైజ్డ్ క్రైమ్స్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని పొన్నవోలు వాదించారు.రాత్రి 9 గంటల నుంచి కోర్టులోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. రాత్రి 9.20 గంటలకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. రాత్రి నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సుమారు 8 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. ఉదయం 5 గంటల వరకు వాదనలు సాగాయి. అంతకు ముందు ఓబువారి పల్లె పీఎస్‌లో 9 గంటల పాటు పోసాని విచారణ సాగింది. ఎస్పీ విద్యాసాగర్ పోసానిని స్వయంగా విచారించారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్ వికటాట్టహాసంరెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా బరితెగింపురెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది.జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు.ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి. -
రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడి
సాక్షి, అన్నమయ్య జిల్లా: కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులకు కూడా రక్షణ కొరవడింది. మదనపల్లి పట్టణం దేవతా నగర్లో ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. కొడవలితో నరికేందుకు యత్నించారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావుపై కొడవలితో దాడి చేసేందుకు యత్నించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావు మొబైల్ ఫోన్,విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్ మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో డ్రైవర్ గణేష్ గాయపడ్డారు. ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాలని అధికారులు కోరారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావు, వీఆర్వో ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. -
భక్తుల మృతి అత్యంత బాధాకరం: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. ‘‘శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి చేయడం అత్యంత బాధాకరం. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’’ అని వైఎస్ జగన్ కోరారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడుగా గుర్తించారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి నడుచుకుని వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి. -
భక్తులపై ఏనుగులు దాడి .. ముగ్గుర్ని తొక్కి..!
-
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు భక్తులు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారి పల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి సందర్భంగా వై.కోట సమీపంలోని గుండాల కోనకు దర్శనానికి బయలుదేరిన భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా సమాచారం. మృతులను వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడుగా గుర్తించారు.పార్వతీపురం మన్యం జిల్లాలో..మరో ఘటనలో పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు హల్చల్ చేశాయి. తెల్లవారుజామున సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి మిల్లులోనికి చొరబడ్డాయి. మిల్లులో భద్రపరిచిన ధాన్యం, బియ్యం నిల్వలను నాశనం చేశాయి. నెల రోజుల్లో రెండు సార్లు ఇదే మిల్‌పై దాడి చేయడంతో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దశాబ్దాలుగా ఏనుగుల సమస్య..కాగా, చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. -
ఆకేపాటి అమర్నాథరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
అన్నమయ్య జిల్లా: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. తాజాగా రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం వేధింపులకు దిగింది. ఆకేపాడు గ్రామంలో భూములు ఆక్రమించారంటూ ఆకేపాటికి జిల్లా అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆకేపాటికి జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే దళితుల ఇళ్లు, షాపులు కూలదోసారని ప్రశ్నించిన ఆకేపాటిని టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే చర్యల్లో భాగంగా భూముల ఆక్రమణ అంటూ సరికొత్త డ్రామాకు తెరలేపింది.ప్రజల పక్షాన ఉన్నందుకే నోటీసులుతాను ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించినందుకే నోటీసులు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. తనకు ఎన్ని నోటీసులు ఇచ్చినా, వేధింపులకు దిగినా భయపడేది లేదని ఆకేపాటి స్పష్టం చేశారు. తన భూముల్లో ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్న ఆకేపాటి.. తాను విచారణకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. మీరేమి చేసుకున్నా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని ఎమ్మెల్యే ఆకేపాటి పేర్కొన్నారు. -
ప్రేమోన్మాది కోసం గాలింపు
-
యాసిడ్ తాగించి.. కత్తితో పొడిచి!
గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా), మదనపల్లె, పీలేరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయలేరనే ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్‌తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన బాధితురాలు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వారం క్రితం నిశ్చితార్థం.. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఇక జీవితమంతా ఆనందంగా సాగుతుందని కలలు కన్న ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజు రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకొంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి తండ్రి సంకారపు మురళి మదనపల్లె, కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రధాన అనుచరుడైన మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది.వేధింపులతో ఉద్యోగం మానేసి..ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21) డిగ్రీ తరువాత బ్యూటీషియన్ కోర్సు చేసి మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. మదనపల్లెలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ (24) ప్రేమ పేరుతో బాధితురాలిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు మూడు నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లెలో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. పీలేరుకు చెందిన మేనత్త కుమారుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌తో ఈనెల 7వ తేదీన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 29 తేదీన వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించారు. ఏడాదిగా బాధితురాలిని వేధిస్తున్న నిందితుడు గణేష్ ఆమెను అంతమొందించేందుకు 15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు. తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోశాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పొలం నుంచి పరుగులు తీస్తూ..బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఈ దాష్టీకం ఎవరి కంట పడలేదు. అయితే తన తల్లి సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతినిత్యం మహిళలపై దాడులు..యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
అన్నమయ్య జిల్లా: వాలెంటైన్స్ డే రోజున ప్రేమోన్మాది యాసిడ్ దాడి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజున అమానుష ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. రాబోయే ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. అనంతరం, ఈరోజు దాడికి పాల్పడ్డారు.గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇక, నిందితుడిని మదనపల్లె అమ్మచెరువుమిట్టకు చెందినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమి వద్దకు జడ్జీ వెళ్లి బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఏపీలో జోరుగా కల్తీ మద్యం దందా
-
జడ్పీటీసీ రమాదేవి ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు
-
ఎన్నికల వేళ కూటమి నేతల అరాచకం.. అర్ధరాత్రి రమాదేవి ఇంటిపై దాడి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరులో భాస్కర హోటల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు నిర్బంధించారు. హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి బయటకు వెళ్లకుండా ప్లాన్ చేశారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు రాకుండా కూటమి నేతలు హోటల్లో నిర్బంధించారు. కార్పొరేటర్లు బయటకు రాకుండా కూటమి నేతలు కార్లను అడ్డంగా పెట్టారు. రౌడీయిజం చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను విడిపించేందుకు వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని కూడా కూటమి నేతలు నిర్బంధించారు.హోటల్ వద్దకు అభినయ్ రెడ్డి వెళ్లడంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్, టీడీపీకి సంబంధించి జేబీ శ్రీనివాసులు, మాజీ టౌన్ చైర్మన్ పులిగోరు మురళీ, క్రిష్ణా యాదవ్ తదితరులు రౌడీలతో ముట్టడించారు. అనంతరం, పోలీసులు అక్కడికి రావడంతో కూటమి వెనక్కి తగ్గారు. దీంతో, భాస్కర హోటల్ నుంచి తిరుపతికు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులు బయలుదేరారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు కత్తులతో దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేశారు. గర్భవతి అని కూడా చూడకుండా జెడ్పీటీసీ రమాదేవి కోడలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లో ఆవరణలో ఉన్న బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ ఇంటిపై దాడి చేయించాడని ఆరోపించారు. దాడి జరగక ముందే జెడ్పీటీసీ భర్తను చంపేస్తామని మంత్రి ఫోన్ చేసి బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. టీడీపీ మూకలు మంకీ క్యాప్‌లు ధరించి కత్తులతో ఇంటిపై దాడికి తెగబడినట్లు తెలిపారు. దీంతో, అర్ధరాత్రి గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. -
మహిళా జెడ్పీటీసీ ఇంటిపై టీడీపీ మూకల దాడి
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య దంపతుల ఇంటిపై టీడీపీ మూకలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం పరిధిలోని జాండ్రపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. దాడి జరగక ముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. లక్కిరెడ్డిపల్లె టీడీపీ నేత మదన్మోహన్ సెల్ ద్వారా వాట్సాప్ కాల్ చేసి ‘నిన్ను చంపేస్తాం’ అని బెదిరించాడని మాజీ ఎంపీపీ రెడ్డయ్య ఆరోపించారు. రెండు సుమోలు, మరో మూడు వాహనాలలో 60 మందికి పైగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు మంకీ క్యాపులు పెట్టుకుని మచ్చు కత్తులు, ఇనుప రాడ్లతో తమ ఇంటిపై దాడికి తెగబడ్డారని రమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.తన భర్త రెడ్డయ్య, కుమారుడు రమేష్‌ను కాపాడుకునేందుకు ఇంటి వెనక డోర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తుండగా, ఆడవాళ్లు అని కూడా చూడకుండా తమపై దాడి చేశారని వాపోయారు. తమ కోడలు ఆరు నెలల గర్భిణి అని, ఆమె జోలికి వెళ్లొద్దని ప్రాథేయపడినా వినకుండా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తమ ఇంటి బయట ఉన్న బుల్లెట్ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని, మరో బుల్లెట్ వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. అంతలో గ్రామస్తులు అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకోబోగా, జగన్మోహన్ ప్రసాద్ అనే వ్యక్తిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపరిచారన్నారు.ఇంట్లోకి దూరి తలుపులు, కిటికీల అద్దాలు, సామాన్లు, ఫర్నీచర్, టీవీలు, సోఫా సెట్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు బయట నిద్రిస్తున్న రెడ్డయ్య తల్లి లేవలేని స్థితిలో మంచానపడి ఉన్నా కూడా కనికరించలేదని, ఆమెపై కూడా దాడి చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో తాము ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డిలు రమాదేవికి ధైర్యం చెప్పారు. -
AP: మహిళా పోలీసు అనుమానాస్పద మృతి.. కారణం అదేనా?
సాక్షి, మదనపల్లె: సచివాలయ మహిళా పోలీసు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రామారావుకాలనీ స్టోర్‌వీధికి చెందిన అరుణమ్మ, రెడ్డెప్పల కుమార్తె రెడ్డిరోజా(35)ను, పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డు విద్యోదయా కాలనీకి చెందిన లక్ష్మీరవికుమార్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. రెడ్డిరోజా కలికిరి మండలం పారపట్ల సచివాలయంలో మహిళా పోలీస్‌గా పనిచేస్తుండగా, కలికిరి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో లక్ష్మీరవికుమార్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులు ఇద్దరూ కలికిరిలో నివాసం ఉంటున్నారు.రెడ్డిరోజా శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చిన అనంతరం మదనపల్లెలో బంధువుల ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి హాజరైంది. సాయంత్రం భర్తతో కలిసి రామారావుకాలనీలోని ఇంటికి వెళ్లింది. అక్కడే ఇద్దరూ ఒకే గదిలో ఉండగా, భర్త టీ కోసం బయటకు వచ్చి పది నిమిషాల అనంతరం గదిలోకి వెళ్లాడు. అప్పటికే రెడ్డిరోజా చీరచున్నీతో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండగా కిందకు దించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడి నుంచి హుటాహుటిన రెడ్డిరోజాను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ రమణ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు.అయితే, గత 15 సంవత్సరాలుగా తమకు పిల్లలు లేకపోవడం, అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో తన భార్య రెడ్డిరోజా తీవ్ర మనస్తాపానికి గురైందన్నారు. పలుమార్లు ఈ విషయమై తన వద్ద బాధపడేదని, శనివారం శుభకార్యంలో మరోసారి రెడ్డిరోజా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని భర్త లక్ష్మీరవికుమార్ చెప్పారు. కాగా, రెడ్డిరోజా తల్లిదండ్రులు అరుణమ్మ, రెడ్డెప్పలు బంధువులతో కలిసి ఆస్పత్రికి చేరుకుని తమ బిడ్డ మృతికి అల్లుడు లక్ష్మీ రవికుమార్ కారణమని ఆరోపిస్తూ గొడవకు దిగారు. గదిలో ఉన్న 10 నిమిషాల్లోనే తమ కుమార్తె ఎలా ఉరివేసుకుంటుందని వాదనకు దిగారు. ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బంది వారికి సర్దిచెప్పి, స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో అక్కడి నుంచి వెళ్లి వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అక్కడి ఆచారం.. సంక్రాంతికి దూరం
గుర్రంకొండ: సంక్రాంతి విశిష్టత.. ఆ పండుగ సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే అలాంటి పర్వదినానికి కొన్ని గ్రామాలు కొన్నేళ్ల నుంచి దూరంగా ఉంటున్నాయి. ఇది అక్కడి ఆచారంగా కొనసాగుతుండటం గమనార్హం. ఇలాంటి పల్లె సీమలు అన్నమయ్య జిల్లా గుర్రకొండ మండలంలో 18 ఉన్నాయి. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని.. ఆ గ్రామాల వాసులు ఆధునిక కాలంలో కూడా పాటిస్తుండటం విశేషం. ఎప్పుడో పెద్దలు ఏర్పాటు చేసుకొన్న కట్టుబాట్లను కలసికట్టుగా అమలు చేస్తుండటం వారి ప్రత్యేకత. మార్చిలో ఉత్సవాలే వారికి సంక్రాంతి మండలంలోని మారుమూల టి.పసలవాండ్లపల్లె పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల వాసులందరూ కలిసి టి.పసలవాండ్లపల్లెలో ఉన్న శ్రీ పల్లావలమ్మ అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తారు. ఏటా మార్చిలో నిర్వహించే గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ జాతర ఉత్సవాలే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి పండుగ. శ్రీ పల్లావలమ్మ ఆజ్ఞానుసారం ఈ పర్వదినం జరపకూడదంటూ పూర్వకాలంలో గ్రామపెద్దలు నిర్ణయించారు. వారి ఆదేశాలనే నేటికీ పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని పశువులను గ్రామదేవత పల్లావలమ్మ పేరుమీద వదిలేసి కొందరు వాటిని మేపుతుంటారు. వాటిలో ఆవులను అమ్మవారి ఉత్సవాల రోజున అందంగా అలంకరించి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వాటికి భక్తిశ్రద్ధలతో అందరూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదే వారికి సంక్రాంతి పండుగ. పాడి ఆవులతో వ్యవసాయం నిషేధంపాడి ఆవులపై ఎంతో ప్రేమ కలిగిన ఈ గ్రామాల్లో.. పాడి ఆవులతో వ్యవసాయం చేయడం నిషేధం. సాధారణంగా రైతులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ 18 గ్రామాల్లో మాత్రం పాడిఆవులతో వ్యవసాయ పనులు చేయరు. గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించే సంస్కృతి ఇక్కడ ఎప్పటి నుంచో కొనసాగుతుండటం విశేషం. పూర్వపు తమ పెద్దల ఆచారం ప్రకారమే ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఆచారాలను మరువబోం మా పూరీ్వకులు ఆచరించిన ఆచారాలను మరవబోము. గ్రామ దేవత శ్రీపల్లావలమ్మ ఉత్సవాల రోజున అమ్మవారి ఆవులను ఆలయం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తాం. అదే మాకు సంక్రాంతి. –బ్రహ్మయ్య, ఆలయ పూజారి, బత్తినగారిపల్లె పూర్వీకుల అడుగుజాడల్లో.. పూర్వీకుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ నేటికీ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాం. మా ప్రాంతంలోని 18 గ్రామా ల ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోబోము. మా పెద్దోళ్ల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ సంస్కృతిని ముందు తరాల వారు కూడా పాటిస్తారని నమ్ముతున్నాం. – కరుణాకర్, టి.గొల్లపల్లె, టి.పసలవాండ్లపల్లె పంచాయతీ -
అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం..
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు గుర్తు తెలియని దుండగులు వ్యాపారులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు గాయాలయ్యాయి.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం మాధవరం గ్రామం మద్దెలకుంట దగ్గర గుర్తు తెలియని దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. పాత సామాగ్రి వ్యాపారులపై నాటు తుపాకితో కాల్పులు జరిపారు. వీరి కాల్పుల్లో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని కడపలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతిచెందగా.. రమణి ప్రాణాల కోసం పోరాడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు.ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్ సహా సీఐలు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరికాసేపట్లో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుంటుందని తెలిపారు. ఘటన నేపథ్యంలో అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. -
తిరుపతిలో దంచికొడుతున్న వర్షం..
సాక్షి, తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేశారు.తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శుభం భన్సల్. మరోవైపు.. వరద నీటి భారీగా వచ్చి చేరుతుండటంతో స్వర్ణముఖి నది పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ వద్ద 7 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు అధికారులు. బాలిరెడ్డిపాలెం-గంగన్నపాలెం మధ్య స్వర్ణముఖి నది బ్రిడ్జిపై నీటి ప్రవాహం ఏడు అడుగులకు చేరుకుంది. దీంతో, 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. రోడ్లు, ఆనకట్టలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్లో, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు. జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9849904062సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9441984020తిరుపతి ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 6281156474👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు: నలుగురి దుర్మరణం
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం సొరకాయలపేటకు చెందిన హేసానుల్లా, దిల్షాద్, వల్లి, సదుం మండలం, నెల్లిమంద గ్రామానికి చెందిన బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు రాయచోటిలో వారి బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా.. చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వల్లి, బుజ్జమ్మ, పకీర్, ఖాదర్‌వల్లిలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ హేసానుల్లా, దిల్షాద్, సారాలను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. బస్సు డ్రైవర్ పరార్ కాగా, ప్రమాదస్థలాన్ని రాయచోటి డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు పరిశీలించారు. -
భూకబ్జాను అడ్డుకున్న దళితులపై హత్యాయత్నం
ఓబులవారిపల్లె/రాజంపేట రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్న టీడీపీ నేతలు సోమవారం అన్నమయ్య జిల్లాలో దళితులపై హత్యాయత్నానికి తెగబడ్డారు. భూకబ్జాను అడ్డుకున్నందుకు కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1150లో దాదాపు 221 ఎకరాల భూమిని పెరుమాళ్లపల్లె దళితవాడ గ్రామస్తులు తాతల కాలం నుంచి వినియోగించుకుంటున్నారు. చదును చేసుకుంటున్నారు. ఈ భూమిలో తమకు పట్టాలివ్వాలని గతం నుంచే అధికారుల్ని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల కాకర్లవారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నారు. సోమవారం జేసీబీ యంత్రాలతో చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని పెరుమాళ్లపల్లి దళితవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు తన అనుచరులతో కలిసి పథకం ప్రకారం తెచ్చుకున్న కర్రలతో ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. వీళ్లు తీవ్రంగా కొట్టడంతో పంట కృష్ణయ్య, పంట నరసింహులు, మడగలం ప్రభుదాస్, జనార్దన్, మరికొందరు గాయపడ్డారు.వీరిలో కృష్ణయ్య, నరసింహులు, ప్రభుదాస్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓబులవారిపల్లె ఎస్ఐ మహేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు, కస్తూరి ఉమా, కస్తూరి శివయ్యనాయుడు, కస్తూరి కోటయ్య తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ భూములకు సంబంధించి సమన్వయం పాటించాలని, దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రైల్వేకోడూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.కార్యకర్తల కోసం ప్రాణమిస్తా.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల రైల్వేకోడూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సమస్యలొస్తే వాటి పరిష్కారం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెడతానని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చెప్పారు. టీడీపీ నేతల హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన రాజంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. భూ కబ్జాలు, దాడులు సర్వసాధారణం అయిపోయాయని వాపోయారు. మహిళలకు సైతం రక్షణ లేకపోవడం బాధిస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఎస్సీలపై దాడి చేయటం హేయమైన చర్యగా అభిప్రాయ పడ్డారు. ఉన్నతస్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంట పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి తదితరులున్నారు. -
చంద్రబాబుపై కేసు విత్‌డ్రా చేసుకో.. వైఎస్సార్సీపీ నేతకు బెదిరింపులు
సాక్షి, అన్నమయ్య జిల్లా: వైఎస్సార్సీపీ నేత, అంగళ్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డిని విచారణ పేరుతో మదనపల్లి తాలూకా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. ఆయనను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.అయితే, 2023లో చంద్రబాబుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తుండగా, ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఉమాపతిరెడ్డి తేల్చి చెప్పారు. పోలీసులు గత పది రోజులుగా ఇబ్బందులు పెడుతున్నారని.. విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఉమాపతిరెడ్డి అన్నారు.ముదివేడు ప్రాజెక్టును అడ్డుకున్న చంద్రబాబు తీరుపై ప్రశ్నించేందుకు రైతులు అందరూ వెళ్తే మాపై దాడి చేయాలని చంద్రబాబు ఆరోజు సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ కేసు విషయంలో చార్జిషీట్ వెంటనే వేయాలి. హైకోర్టులో పిటిషన్ వేశాను. అక్కడే తేల్చుకుంటా’’ అని ఉమాపతిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఎవరికోసం ఈ అవతారం? -
‘చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు’
అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థల మీద రాజకీయం చేస్తుంటాడని, ఇప్పుడు ఏదీ లేక వెంకటేశ్వరస్వామితో రాజకీయం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. వెంకటేశ్వరస్వామితో రాజకీయం చేసే చంద్రబాబు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు.వంద రోజుల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడని, అసలు పరిపాలన ఏం చేశాడని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చని చంద్రబాబు.. ఇప్పుడు ఆర్భాటాలతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయలేక, యూట్యూబ్‌లో యాడ్స్లాగా డైవర్ట్ చెయ్యడానికి తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ మైసూర్లో ఉంటే, గుజరాత్‌లోని ల్యాబ్‌లో లడ్డు టెస్ట్ చేయించారన్నారు. అందులో మర్మం ఏమిటని శ్రీనివాసులు నిలదీశారు. శ్రీవెంకటేశ్వరస్వామికి ఒక్కసారి కూడా తలనీలాలు ఇవ్వని చంద్రబాబుకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్రకు ముందు తరువాత తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు శ్రీనివాసులు. -
టీడీపీలో విభేదాలు.. దర్జాగా దోపిడీ
రాజంపేట: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు గుప్పుమన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జినైన తనకు మంత్రి అస్సలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బాలసుబ్రమణ్యం సోమవారం విరుచుకుపడ్డారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.ఇసుక, మట్టి దోపిడీలో.. ఎర్రచందనం అక్రమ రవాణాలో, బదిలీలకు సిఫారసు లేఖలను అమ్ముకుంటూ మంత్రి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం గుండ్లపల్లెలో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం ఏమన్నారంటే..ఇసుక అక్రమ రవాణాలో మంత్రికి వాటాలు..కేవీ పల్లెలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుంటే సుండుపల్లెలో పోలీసులకు అడ్డుకునే హక్కులేనప్పుడు, రాయచోటి మండలంలో అనుంపల్లె మట్టి ఎత్తితే, దానిని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా? రాజంపేట మండలంలోని ఆర్.బుడుగుంటపల్లె ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి రాజంపేట ఇన్చార్జిగా ఉన్న నన్ను పిలవలేదు. మంత్రికి ఇసుకలో వాటా ఉందని కలెక్టరేట్లో చర్చించుకుంటున్నారు. అలాగే, అధికారుల బదిలీలకు సంబంధించి మంత్రి తన సిఫార్సు లేఖలను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. మంచి పోస్టుకు రూ.5 లక్షలు, గ్రామస్థాయి పోస్టుకైతే రూ.30వేలు వసూలుచేస్తున్నారు. మట్టి అక్రమ రవాణాపై కలెక్టర్ ప్రేక్షకపాత్ర..అలాగే, సుండుపల్లె మండలం తిమ్మసముద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తుంటే నేను, మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఆయన తెలియనట్లు వ్యవహరించారు. తహసీల్దారును కలెక్టరు మొక్కుబడిగా మందలించారుగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనుంపల్లె నుంచి మట్టి తోలుతుంటే తనకు సంబంధంలేదని తహసీల్దారు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న వారిని అడ్డుకుంటాం.నా సభలకు అధికారులను అడ్డుకుంటున్నారు..మరోవైపు.. నేను పాల్గొంటున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ సభలకు అధికారులను రానివ్వకుండా సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లె గ్రామ పెద్దలకు ఫోన్‌చేసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరగకూడదని చెప్పాడు. కానీ, గ్రామస్తులు జిల్లా అధ్యక్షుడి మాట లెక్కచేయకుండా ఈ సభ నిర్వహించారు. వాస్తవానికి.. రాంగోపాల్‌రెడ్డి సీఎం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నియమించిన వ్యక్తి కాదు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా.సభ్యత సంస్కారం లేనివారిని పదవుల్లో పెట్టుకోవడంవల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఇక మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వైఎస్సార్సీపీలోని తన బంధువులకు వత్తాసు పలుకుతూ వారికి పనులు చేసిపెడుతున్నాడు. రాయచోటిలో టీడీపీ సీనియర్లందరూ కలిసి పనిచేస్తేనే రాంప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారన్న విషయం ఆయన మర్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఆశయాలకు మంత్రి తూట్లు పొడుస్తున్నారు. రవాణాశాఖలో ఆయన లీలలు, బాగోతాలు పత్రికల్లో వస్తున్నాయి. -
అన్న క్యాంటీన్లో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. టీడీపీ నేతల కుమ్ములాటతో అధిపత్య పోరు బయటపడింది. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య తోపులాట జరిగింది. మేం ప్రారంభించాలంటే.. మేమంటూ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.కత్తెరని లాక్కుని ప్రారంభోత్సవం చేసేందుకు ఇరువర్గాలు ప్రయత్నించాయి. పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్రాజు చొక్కా సుగవాసి వర్గీయులు పట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్మరో వైపు, అన్నక్యాంటీన్లను పైసా వసూల్ కేంద్రాలుగా చంద్రబాబు సర్కార్ మార్చేసింది. ప్రజల సొమ్మును దోచుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. అన్నా క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మాట మార్చేశారు. ఇన్నాళ్లు డబ్బాకొట్టి.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
బాలికపై ప్రిన్సిపాల్ భర్త లైంగిక దాడికి యత్నం
లక్కిరెడ్డిపల్లి: ఐదో తరగతి చదువుతున్న బాలికపై 55 ఏళ్ల ఓ కామాంధుడు అఘాయిత్యానికి యతి్నంచాడు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పరిమళ భర్తగా చెప్పుకొనే బాలసుబ్బయ్య ఆదివారం సాయంకాలం లడ్డూ ఆశ చూపి చిన్నారిని ప్రిన్సిపాల్ రూమ్‌లోకి పిలిచి లైగింక దాడికి యతి్నంచాడు. బాలిక ఎదురు తిరగడంతో దాడి చేశాడు. దీంతో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని హాస్టల్ భవనంలోకి వెళ్లిపోయింది. తోటి విద్యార్థులకు విషయం చెప్పడంతో వారు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయం ఎవరికీ చెప్పొద్దొని ప్రిన్సిపాల్ విద్యార్థులను హెచ్చరించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విషయం బయటకు పొక్కడంతో లక్కిరెడ్డిపల్లె పోలీసులు పాఠశాలకు చేరుకుని బాలసుబ్బయ్యను అదుపులోకి తీసుకున్నారు. రోజూ సాయంత్రం ప్రిన్సిపాల్ భర్త మరో ఇద్దరిని వెంటబెట్టుకుని పాఠశాల ఆవరణలోకి చొరబడతారని, తాము దుస్తులు మార్చుకుంటుంటే సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తారంటూ విద్యార్థులు విలపించారు. అనంతరం ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు.. అంటూ విద్యార్థులు పాఠశాల గేటు ఎదుట నినాదాలు చేశారు. అంతలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఆర్డీవో రంగస్వామి, తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులను సముదాయించారు. తమ పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కాగా, బాలిక బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల అదుపులో ఉన్న బాలసుబ్బయ్యకు దేహశుద్ధి చేశారు. బాలసుబ్బయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీంద్రబాబు చెప్పారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ పరిమళ, హెల్త్‌సూపర్‌వైజర్ లక్ష్మీదేవి, సెక్యూరిటీ గార్డు నాగలక్ష్మీలను సస్పెండ్ చేశారు. -
కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి అన్నమయ్య జిల్లా: కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేగింది. కడప జిల్లా, మైదుకూరు మండలం జీవి సత్రానికి చెందిన ప్రవీణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.ఈ నెల 12న కలికిరి జెన్టీయూలో బీటెక్ చదివేందుకు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ప్రవీణ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఈ నెల 26న రాత్రి ఇంటికెళ్లి విషం తాగాడు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలికిరి సిఐ.. ప్రిన్సిపల్, తోటి విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్ నిజమని తేలితే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ర్యాగింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత బంధువులు కోరుతున్నారు. -
పెళ్లిలో ప్రియురాలి హల్చల్.. పెళ్లికొడుకుపై దాడికి యత్నం
అన్నమయ్య: తనకు తెలియకుండా మరో అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడని ఓ ప్రియురాలు పెళ్లిలో హల్చల్ చేసింది. ఆగ్రహంతో పెళ్లి కొడుకుపై దాడికి దిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో ఈ రోజు వివాహం జరగుతున్న సమయంలో ప్రియురాలు రంగంలోకి దిగింది. సయ్యద్ భాషా.. తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సయ్యద్ భాషా తనను కాదని వేరే అమ్మాయినీ వివాహం చేసుకోవడానికి సిద్దపడడంతో జయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షాదిఖానాలో పెండ్లి కొడుకు సయ్యద్ బాషాపై కత్తి, యాసిడ్‌తో దాడి యత్నించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో యాసిడ్ పడి ఒక్క మహిళలకు తీవ్రంగా, మరో మహిళలు స్వల్పంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు జయను అదుపులోకి తీసుకొని నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అన్నమయ్య జిల్లాలో కాల్పులు..
-
రచ్చ కోసం రెచ్చగొట్టిన టీడీపీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగటంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారించి పలుసార్లు అడ్డుకున్నా ఖాతరు చేయకుండా నాలుగు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితుల్ని సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచి్చన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి వీరంతా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నివాసం వద్దకు వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.సోమవారం నుంచి ఎమ్మెల్యే ఇంటివద్దే ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు మంగళవారం అక్కడికి వెళ్లి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని భావించారు. ఈ సమాచారం తెలిసి డీఎస్పీ ప్రసాదరెడ్డి పలువురు సీఐలు, ఎస్సైలను రప్పించారు. పోలీసు అధికారులు టీడీపీ శ్రేణులను నిలువరించి వెనక్కి వెళ్లాలని సూచించినా.. పట్టించుకోకుండా మమ్మల్లే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించారు.కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి సమీపంలోని మదనపల్లి రోడ్డులోని లేఅవుట్ ఆర్చ్ వద్దకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులను మళ్లీ అక్కడ పోలీసులు నిలువరించారు. రెండు గంటలకు పైగా వారికి నచ్చజెప్పేందుకు పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించినా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో టీడీపీ శ్రేణులు ఈలలు, సవాళ్లతో బిగ్గరగా కేకలు వేశారు.దీంతో ఎమ్మెల్యే ఇంటివద్ద ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలతో గొడవలు సృష్టించేందుకు రెచ్చగొడుతున్నారన్న విషయం వారికి అర్థమైంది. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూసేందుకు ములకలచెరువు సీఐ మధు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని వివరించి సంయమనం పాటించాలని కోరారు. తాము ఎమ్మెల్యేని కలిసేందుకు వచ్చామని, టీడీపీ శ్రేణుల వ్యవహారం తమకు తెలియదని వైఎస్సార్సీపీ శ్రేణులు తెలిపాయి. ఇంతలో టీడీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు శృతిమించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పోలీసులు రాత్రి 9 గంటలకు కూడా తంబళ్లపల్లెలో పోలీసు పహారా కొనసాగుతోంది. -
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం కారును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. దీంతో, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. అయితే, సదరు కారు కడప నుంచి రాయచోటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళపై టీడీపీ నేత అఘాయిత్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: వీరబల్లి మండలం ఒదివీడు గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళపై టీడీపీ నేత పెద్ద రెడ్డయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగా అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డయ్య బాత్రూంలో దూరి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో అక్కడ నుండి నిందితుడు పరారయ్యాడు.బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ వీరబల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయకపోగా, ఆమె పట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తనకు న్యాయం జరగకపోతే చావేశరణ్యమని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఆగని టీడీపీ దాడులు
-
ఇద్దరితో సహజీవనం.. అడ్డుకున్న తండ్రిని హత్య చేసిన కూతురు
-
అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో భారీ బందోబస్తు
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)
-
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ సెంచురీకి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన... వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు నెగ్గాలని పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రజలతో మమేకమవుతున్న జగన్, నేనున్నానంటూ సీఎం భరోసా
-
YSRCP అన్నమయ్య జిల్లా అభ్యర్థులు వీళ్లే
అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
బిల్డప్ బాబాయ్ అసలు గుట్టు బట్టబయలు
మదనపల్లె: మదనపల్లె టీడీపీ రేసులో ఉన్న బిల్డప్ బాబాయ్ కోడికొళ్ల అమరనాథ్ అసలు గుట్టు బయటపడింది. అతని ప్రధాన అనుచరుడు రాయల్ గణి మీడియా సమావేశం పెట్టి అతని చిట్టా బయటపెట్టాడు. అరచేతిలో స్వర్గం చూపించే రకం అమర్నాథ్.. గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబునే మించిపోయి నియోజకవర్గ ప్రజలను మోసగించేందుకు పలు గిమ్మిక్కులకు పాల్పడ్డాడు. వీటన్నింటిని అతని అనుచరుడు రాయల్ గణి మంగళవారం మీడియాకు వెల్లడించాడు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం రంగసముద్రానికి చెందిన వ్యక్తి కోడికళ్ల అమరనాథ్ గతంలో రైతుల నుంచి చీనీ, మామిడి, వేరుశెనగ కొనుగోలు వ్యాపారం చేసేవాడు. రైతులకు డబ్బులివ్వకుండా మోసం చేయడంతో మదనపల్లెతో పాటు కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పలు స్టేషన్లలో అతనిపై 420, చెక్‌బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం మదనపల్లె వన్‌టౌన్‌లో కేసు నమోదయ్యాక బెంగళూరు పారిపోయి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు బెంగళూరు నుంచి అద్దె గన్మెన్లు, బౌన్సర్లను వెంటేసుకుని హఠాత్తుగా మదనపల్లెలో ప్రత్యక్షమయ్యాడు. పట్టణానికి చెందిన రాయల్ గణిని వెంటేసుకుని టీడీపీ నాయకుడిగా ప్రచారం చేసుకుంటూ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆదికేశవులునాయుడు కుటుంబానికి సన్నిహితుడినని, బలిజ సామాజికవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని టీడీపీ ముఖ్యనాయకుల్ని కలిసి అభ్యర్థించాడు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు. బాబు సీఎం కావాలని 10 వేల మంది ముస్లింలకు అజ్మీర్ యాత్ర చేయిస్తున్నానని, దానికి రూ.కోటి చెక్కు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. 20 వేల మంది హిందువులను కాశీయాత్రకు సొంత ఖర్చులతో పంపుతానని, పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చాడు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి సీతారామ లక్ష్మణ పంచలోహ విగ్రహాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేశాడు. ఇటీవల పీలేరులో జరిగిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెబుతున్నట్లు నటించి, ఫొటోలు తీయించుకుని, బాబుకు అత్యంత సన్నిహితుడినని ప్రచారం చేసుకున్నాడు. అయితే రాయల్గణితో అతనికి తేడా రావడంతో మీడియా ముందు అతని శిష్యుడే అక్రమాల్ని వెల్లడించాడు. అమర్నాథ్ పెద్ద మోసగాడని, ఆదికేశవులునాయుడు కుటుంబానికి, అతనికి ఏమీ సంబంధం లేదని గణి తెలిపాడు. అంబానీ, అదానీ, అమిత్‌షాతో తనకు వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడం పచ్చి అబద్ధమని, అతడిపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని వెల్లడించాడు. అజ్మీర్ యాత్ర పేరుతో రూ.కోటి చెక్కు డ్రామా అని తెలిపాడు. అతని విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇదీ చదవండి: టీడీపీ ‘ఐ’ గేమ్..! -
అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ నేతల గూండాగిరి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. కలికిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి నేతృతంలో దళితుల గృహ నిర్మాణాలపై దాడులకు పాల్పడారు. ఈ ఘటనలో ఇరువురు గాయపడ్డారు. దళితుల వాహనాలను కూడా ధ్వంసం చేసి.. బీరు బాటిల్స్‌తో బీభత్సం సృష్టించారు. సర్వేనెంబర్1098/2 గృహ నిర్మాణాలను పచ్చమూకలు ధ్వంసం చేశాయి. కన్నీరు మున్నీరుగా బాధితులు విలపిస్తున్నారు. టీడీపీ నేత అవినాష్‌రెడ్డి తోపాటు దాడిలో పాల్గొన్న వారిపై పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రణన్నినాదం
సాక్షి, రాయచోటి: ఇన్నాళ్లూ సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చామని, కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఒక విధానంలా అమలు చేశారని బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ నేతలు కొనియాడారు. సామాజిక విప్లవమే జగనన్న విధానం అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రింగ్‌రోడ్డు సర్కిల్ నుంచి శివాలయం వరకు మెయిన్‌రోడ్డు మీదుగా వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు ఎంతో మేలు మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలు అంతా ఇంతా కాదని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖాన్ చెప్పారు. ఆయన చేసిన మేలును ముస్లిం మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మరిచిపోవన్నారు. దేశ చరిత్రలో ముస్లింలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనేనని వారు కొనియాడారు. పేదల బతుకుల్లో వెలుగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన అదృష్టమన్నారు. జగనన్నలా ఏ ఒక్కరూ చేయలేదు..: రాజ్యాంగ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా చేశారన్నారు. డీబీటీ రూపంలో దాదాపు రూ.2.4 లక్షల కోట్లు వారి ఖాతాల్లో వేశారని చెప్పారు. సంక్షేమ సారథి.. జగనన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచిపోయారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి అని గుర్తు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,289 కోట్ల ప్రయోజనం కల్పించారని వెల్లడించారు. -
రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోంది. రాయచోటిలో గురువారం మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ బస్సు యాత్రలో పలువురు మంత్రులతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం రింగ్‌రోడ్డు నుంచి బంగ్లా వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రజాప్రతినిధులు, నేతలు మాట్లాడారు. బీసీల పేరు చెప్పుకుని చంద్రబాబు మోసం: అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారని మండిపడ్డారు. 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు టీడీపీ బీసీల పార్టీ అంటాడు.. బీసీల పేరు చెప్పుకుని మోసం చేశాడు. మన ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు. మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలా? సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ కావాలా? అని ప్రశ్నించారు. మైనార్టీని మంత్రి చేయని వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసి డిప్యూటీ సీఎంను చేశాడు. రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ను శాసన మండలి డిప్యూటి ఛైర్మన్‌ను చేశారు. చరిత్ర రాయాలంటే వైఎస్ కుటుంబానికే సాధ్యమౌవుతుంది. అందరిని నా వాళ్లు అని పిలిచే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. రాయచోటి ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చెందింది. రాయచోటి అభివృద్దిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది’’ అని అంజాద్ బాష ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో నక్కలు, కుక్కలు, పందులు ఏకమవుతున్నాయి. అయినా భయపడేది లేదు .. సింహం వైఎస్ జగన్ సింగిల్‌గా వస్తారు. 175 స్దానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుంది. 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్దులు లేరు. మేము ఏరిపారేస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత: ఎంపీ సురేష్ వైఎస్సార్ ఫ్యామీలిని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ తేడా చూసి వైఎస్సార్సీపీని గెలిపించండి. సీఎం వైఎస్ జగన్ కోసం పోరాడే సైనికుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు మన పిల్లలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతున్నారంటే ఇది సీఎం జగన్ పాలన ఘనత. కార్యాలయాల చుట్టూ తిరగకుండా పథకాలు అందిస్తున్న వ్యక్తి జగన్’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. -
నేడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో సామాజిక సాధికార యాత్ర
-
నేడు చోడవరం, రాజంపేట నియోజకవర్గాల్లో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అనకాపల్లి జిల్లాలో చోడవరం, అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. బడుగు, బలహీన, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలును యాత్రలో ఆ వర్గాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించనున్నారు. -
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె తెలుగుదేశంలో గందరగోళం
-
తంబళ్లపల్లెలో సంక్షేమ యాత్ర
బి.కొత్తకోట: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యల ఫలితం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రతిబింబించింది. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువెత్తారు. సీఎం జగన్ తమకు చేసిన మేలును వివరిస్తూ యాత్రలో సాగారు. పీటీఎం నుంచి మద్దయ్యగారిపల్లె వరకు పాదయాత్ర సాగింది. అనంతరం ములకలచెరువులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పెద్ద ఎత్తున పాల్గొని, జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును మంత్రులు, నాయకులు వివరించారు. సామాజిక సాధికారతను నిజం చేసిన సీఎం జగన్: మంత్రి మేరుగు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ మేలు చేసి ప్రతి గుండెలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ కలలుగన్న సామాజిక సాధికారతను సీఎం జగన్ ఆచరణలో నిజం చేస్తున్నారని అన్నారు. దేశ ప్రధానులకే సాధ్యంకాని సామాజిక విప్లవానికి సీఎం వైఎస్ జగన్ నాంది పలికారని అన్నారు. చంద్రబాబు 2014లో 645 హామీలతో గెలిచి ప్రజలను మోసం చేశారన్నారు. 2024లో మరోసారి మోసం చేసేందుకు బాబు వస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా, రాజకీయంగా మరింతగా ఎదగడానికి సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్‌తోనే స్వాతంత్య్రం: మంత్రి గుమ్మనూరు జయరాం 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బీసీల్లోని అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. జగన్ అనే శక్తి లేకపోతే, పార్టీ పెట్టకపోతే ఈ మార్పు ఉండేది కాదని అన్నారు. స్కీం సీఎం జగన్ : మంత్రి ఉషశ్రీ చరణ్ ఏపీలో స్కీం సీఎం జగన్ అయితే స్కాం సీఎం చంద్రబాబు అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మహిళలను కార్పొరేషన్ చైర్మన్లు చేసిన ఘనత జగన్‌దేనని చెప్పారు. కనకదాస్, వాల్మికి జయంతిని అధికారికంగా నిర్వహించి గౌరవం పెంచారన్నారు. టీడీపీ నేతల మాటలు ఎవరూ వినడంలేదు: మాజీ మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబును స్థానిక ఎన్నికల్లో సొంత జిల్లా చిత్తూరు ప్రజలే తిప్పికొట్టారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ,బీసీలు మైనార్టీలంతా వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు గడ్డపై ఓ బీసీకి టికెట్ ఇచ్చి రెండుసార్లు గెలిపించి మంత్రిగా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కష్టంతో పాలు పోసిన వారి ఆదాయంతో చంద్రబాబు హెరిటేజ్ ఆస్తులు పెరిగాయని అన్నారు. ఎన్నికల్లో కిలో బంగారం, బెంజి కారు ఇస్తామని చెబుతారని, అలాంటి వారి మాటలకు మోసపోవద్దని కోరారు. సామాజిక సాధికార యాత్రలో నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలపాలని టీడీపీ నేతలంటున్నారని, వారి మాటలు ఎవరూ వినడంలేదని చెప్పారు. -
‘ఏపీలో సామాజిక విప్లవం.. ఆ ఘనత సీఎం జగన్‌దే’
సాక్షి, అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం కేజీఎన్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభమైంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. సాయంత్రం ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ది సీఎం జగన్ పాలనలోనే జరిగిందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. వెనుకబడిన వర్గాల సాధికారతే సీఎం జగన్ లక్ష్యం. ఏపీలో సామాజిక విప్లవానికి నాంది పలికిన నేత వైఎస్ జగన్. ఆయన పాలనలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు న్యాయం చేసిన ఘనత జగన్‌దే’’ అని మంత్రి కొనియాడారు. ‘‘దళితులను అడుగడుగునా అవమానించిన వ్యక్తి చంద్రబాబు. అర్హత ఉంటే చాలు అన్ని సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగన్. లక్షా 76 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఖాతాల్లో జమ చేశాం. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, పవన్ మళ్లీ కలిసొస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చదవండి: పురందేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు: మంత్రి సీదిరి -
నేడు అన్నమయ్య జిల్లాలో సామాజిక జైత్రయాత్ర
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 13వ రోజు షెడ్యూల్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(శుక్రవారం) 13వ రోజు సామాజిక సాధికారిత బస్సుయాత్ర పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఉదయం గం. 10.30ని.లకు సీతానగరం మండలం లచ్చయ్యపేటలో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం ఉంటుంది. ఉదయం 11గంటలకు కాశయ్యపేట సచివాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ జరుగనుంది. ఈ సభలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధరణికోటలో వ్యాపార, ఉద్యోగ ప్రతినిధులతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు విలేకర్ల సమావేశం, గం. 3.45ని.లకు ధరణికోట బేబీ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం గం. 4L45ని.లకు గ్రామ సచివాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించనున్నారు. సాయంత్రం గం. 5:30 ని.లకు అమరావతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లోలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం గం. 12:15ని.లకు పెద్దతిప్పసముద్రం నుండి బైక్ ర్యాలీ, ఒంటి గంటకు కేజీఎన్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం గం. 2:30 ని.లకు బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్ ర్యాలీ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
-
వైఎస్సార్ జిల్లా పర్యటన..షెడ్యూల్ ఇదే
-
ఈరోజు, రేపు అన్నమయ్య, YSR జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రేపు సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పర్యటన
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లాల్లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 09, 10వ తేదీల్లో ఆయన అక్కడికి వెళ్లనున్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆపై మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలోనూ పాల్గొంటారు. అటు నుంచి సొంత నియోజకవర్గం పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా)లో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. పులివెందులలోనే శిల్పారామంను ప్రారంభిస్తారు. ఆపై శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఏపీ కార్ల్ ప్రాంగణంలో అగ్రిక్లచర్, హార్టికల్చర్ కాలేజీలు స్టేట్ ఆఫ్ ఆర్ట్‌సెంట్రల్ టెస్టింగ్ లేబరేటరీ, అగ్రికల్చర్ హార్టికల్చర్ ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. ఆపై ఆదిత్య బిర్లా యూనిట్‌ను సీఎం జగన్ సందర్శిస్తారు. అనంతరం సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. ఆ రాత్రికి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్‌హౌజ్‌లో బస చేస్తారు. ఇక 10వ తేదీ ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం ఎకో పార్క్ వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. -
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అన్నమయ్య: ఘోర ప్రమాదంతో జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్న భక్తుల వాహనం.. లారీతో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున పీలేరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు.. బాధితులను కర్ణాటక వాసులుగా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక బెల్గాం జిల్లా అత్తిని మండలం బడచిగ్రామానికి చెందిన 14 మంది.. తిరుమల దర్శనం కోసం ఓ తుఫాన్ వాహనంలో వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా.. తెల్లవారు మూడు గంటల సమయంలో మఠంపల్లి క్రాస్(కె.వి పల్లి మండలం) వద్ద వాళ్ల వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని తొలుత పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
Live : బాబు కేసు & పాలిట్రిక్స్ అప్డేట్స్.. Click & Refresh
Updates.. 06:10 PM రాజమండ్రి : లాయర్ సిద్ధార్థ్ లూథ్రాపై ఫిర్యాదు ►బాబు లాయర్ సిద్ధార్థ లూద్రాపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ►రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన న్యాయవాదే రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని ఫిర్యాదు ►మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు ఫిర్యాదు 06:10 PM రాజమండ్రి : బాలయ్య బిజీ బిజీ ►కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో బాలకృష్ణ సమావేశం ►చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చల ప్రస్తావన ►రెండు రోజుల్లో విజయవాడలో టీడీపీ, జనసేన నేతల మీటింగ్ ► క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై చర్చ ► కొందరికి టికెట్లు ఇవ్వకపోతే వచ్చే అసంతృప్తిపై చర్చ ► రెండు పార్టీల క్యాడర్ సహకరించుకుంటారా? విభేదించుకుంటారా? ►ఈ నెల 19న చంద్రబాబు కేసు విచారణ తర్వాత అప్పటి పరిస్థితులను అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు 06:10 PM రాజమండ్రి ►రేపట్నుంచి సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ►తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవు తీసుకున్న సూపరింటెండెంట్ ►కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కు జైలు ఇన్ ఛార్జ్ బాధ్యతలు 05:30 PM విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు ►బెయిల్ పిటిషన్ పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ►కస్టడీ పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందన్న న్యాయమూర్తి ►కస్టడీ పిటిషన్ కు, బెయిల్ కు సంబంధం లేదన్న న్యాయవాది సుబ్బారావు ►పిటిషన్‌కు లిస్టింగ్ ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని CIDకి సూచించిన కోర్టు 04:46 PM పేర్ని నాని, వైఎస్సార్సిపి ప్రెస్‌మీట్ ►చంద్రబాబును ఓదార్చడానికి పవన్ వెళ్లాడనుకున్నాం ►పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లాడా? ►చంద్రబాబుతో బేరం మాట్లాడ్డానికి వెళ్లాడా? ►చంద్రబాబుతో ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలింది ►బీజేపీతో పవన్ ది తాత్కాలిక పొత్తు మాత్రమే ►తెలుగుదేశంతోనే పవన్ కు శాశ్వత పొత్తు ►పవన్ కు క్లారిటీ ఉంది... బీజేపీకే లేదు ►బీజేపీ ఎప్పటికప్పుడు పిల్లిమొగ్గలు వేస్తోంది ►పవన్ పొత్తు పాత వార్తే... ఇందులో కొత్తదనం లేదు ►తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ అంతర్భాగం ►కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమే ►చంద్రబాబుతో పవన్ వ్యాపారం మాట్లాడుకుని వచ్చాడా? ►తన కార్యకర్తలకైనా పవన్ ఈ విషయం చెప్పాలి ►పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి డీల్ చేసుకుని వచ్చారు ►ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా? ►ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం? ►అవినీతిపై పవన్ రాజీ లేని పోరాటం చేస్తానన్నాడు ►మరి అవినీతిపరుడైన చంద్రబాబుకు ఎలా మద్దతు ప్రకటిస్తాడు ►తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా? ►లోకేష్ తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా? ►తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడు ►సినిమాల్లోనే పవన్ హీరో... బయట మాత్రం జోకర్ ►25 స్థానాలకు పవన్ అభ్యర్ధులను సప్లై చేస్తాడు 04:00 PM ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► స్కిల్ స్కామ్ లో రూ.371 కోట్ల అవినీతి జరిగింది ► ఈ స్కామ్ లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయి ► నిబంధనలకు విరుద్ధంగా నిధులను రిలీజ్ చేశారు ► అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు ► తప్పుడు డాక్యుమెంట్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు ► ప్రభుత్వ జీవోకు, అగ్రిమెంట్ కు చాలా తేడాలు ఉన్నాయి ► అగ్రిమెంట్ లో జీవో నెంబర్ ను చూపించలేదు ► జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు ► సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు ► ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు ► కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ► కార్పొరేషన్ ఏర్పాటులో విధివిధానాలు పాటించలేదు ► స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ఖజానాను దోచేశారు ► రూ.3,300 కోట్లు ఫ్రీగా సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు ► ఏపీ ఖజానా నుండి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కు చెల్లించారు ► పైలట్ ప్రాజక్టు అమలు చేయాలన్న అధికారుల వాదనను పట్టించుకోలేదు 03:13 PM లోకేష్, బాలకృష్ణ ప్రెస్‌మీట్ లోకేష్ ► జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం ► ఉమ్మడి కార్యాచరణ రేపటి నుంచే అమల్లోకి వస్తుంది ► సీట్ల పంపిణీతో పాటు అన్ని అంశాలు చర్చించుకుంటాం ► కొందరు అధికారులపై సివిల్ వార్ ప్రకటిస్తున్నాను ► చంద్రబాబు కట్టిన జైలులో ఆయన్నే పెడతారా? ► పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రోడ్డుపైనే కూర్చోబెడితే ఎలా? ► జనసేనతో కలిసి సివిల్ వార్ ప్రకటిస్తున్నాం బాలకృష్ణ ►అన్న ఎన్టీఆర్ తెలుగువారికి ఆత్మగౌరవం తెచ్చారు ►చంద్రబాబు చాలా ఇన్నోవేటివ్, ఎక్కడా సంతకం పెట్టలేదు ►ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారో చెప్పాలి ►యువగళంలో లోకేష్‌కు వస్తున్న ఆదరణ చూసి బాబును అరెస్ట్ చేశారు 03:13 PM బాబు బెయిల్ పిటిషన్‌పై నోటీసులు జారీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు నోటీసులు ►స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు . ►అయితే.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా బెయిల్ పిటిషన్ ఎలా వేశారని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు ►సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగే అవకాశం 03:05 PM పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుంది: బీజేపీ ►పవన్ పొత్తు వ్యాఖ్యల పై స్పందించిన ఏపీ బీజేపీ ►పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది ►ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది ►ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే బీజేపీ పొత్తు ఉంది : ఏపీ బీజేపీ ►తెలుగుదేశంతో ఎలాంటి పొత్తు లేదు : ఏపీ బీజేపీ 03:00 PM లోకేష్, బాలకృష్ణ పోటాపోటీ భేటీలు ► అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో పవన్, లోకేశ్, బాలకృష్ణ సమాలోచనలు ► రేపటి నుంచి ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై బాలకృష్ణ చర్చ 02:36 PM చంద్రబాబు కుటుంబంతో పవన్ భేటీ ► పరామర్శ పేరిట.. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ►చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాబు తనయుడు నారా లోకేష్, లోకేష్ సతీమణి బ్రహ్మణి, చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ► అంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలులో.. ములాఖత్ పేరిట పవన్ రాజకీయం నడిపారు. 01:30 PM ప్యాకేజ్ బంధం బయటపడింది ►పవన్‌కు YSRCP స్ట్రాంగ్ కౌంటర్ ►నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది దీని కోసమేనా? ►పొత్తును ఖాయం చేసుకునేందుకేనని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది ►ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు ►ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం ►ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం ►జైల్లోనూ పాలిట్రిక్స్ వదిలి పెట్టరా అంటూ పవన్, చంద్రబాబులకు చురకలు “ప్యాకేజ్ బంధం బయటపడింది” నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDPతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు.… pic.twitter.com/MCjVLq26zb — YSR Congress Party (@YSRCParty) September 14, 2023 12:50 PM సెంట్రల్ జైల్ పాలిట్రిక్స్ : ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్ ►వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నాం ►ఈ విషయం జనసేన కార్యవర్గం అర్థం చేసుకోవాలి ►తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని నేను ఇవ్వాళ నిర్ణయం తీసుకున్నాను ► విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్‌సిపిని ఆపలేం ► BJP మాతో కలుస్తుందో లేదో వాళ్లే తేల్చుకోవాలి ► ఇక నుంచి టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ► తెలుగుదేశం నేతలతో కలుస్తున్నానంటే అది పాలకపక్షం వల్లే ► ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్‌ల మధ్య ఉన్నానంటే అది పాలకపక్షం వల్లే ► ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును చట్టవ్యతిరేకంగా జైల్లో పెట్టారు ► చంద్రబాబుకు నా మద్ధతు ప్రకటిస్తున్నా ► గతంలో విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలున్నాయి ► అందుకే 2019లో వేర్వేరుగా పోటీ చేశాం ► 2014లో విభజన జరిగినపుడు రాష్ట్రానికి నష్టం కలిగింది ► 2014లో నేను నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపాను ► భారత్ మీద తరచుగా ఉగ్రదాడులు జరిగినపుడు బలమైన నాయకత్వం కావాలనుకున్నాను ► నాడు నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే నేను వెళ్లాను తప్ప.. నా అంతట నేను కాదు ► చంద్రబాబుతో నాడు ప్రత్యేక హోదా కోసం విభేదించాను తప్ప.. ఆయనంటే నాకు నమ్మకం ► చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకు విశ్వాసం ఉంది ► బ్యాంకులో తప్పు జరిగితే .. బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఉంది ► చంద్రబాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించాలి కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తుంది? 12:40 PM మూడు అంశాలపై ముగ్గురితో మంతనాలు ► పూర్తిగా రాజకీయ ఎజెండాతో చంద్రబాబు ములాఖత్ ► మొదటి అంశం : లోకేష్ పాదయాత్ర కంటిన్యూ చేయాలా? ఆపేయాలా? ► రెండో అంశం : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఏం చేయాలి? ► మూడో అంశం : పొత్తుల విషయం ఏం చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు? ► పార్టీలో బాలకృష్ణ పాత్ర ఏంటీ? ఇక ముందు టిడిపికి ఎవరు నేతృత్వం వహించాలి? 12:30 PM ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ► విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు ► స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కదా అని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు జడ్జి ► బెయిల్ పిటిషన్ పరిశీలించి లిస్టింగ్ ఇస్తామన్న ఏసీబీ కోర్టు జడ్జి 12:16 PM చంద్రబాబుతో ముగ్గురు నేతల ములాఖత్ ► రాజమండ్రి జైలు కేంద్రంగా చంద్రబాబుతో రాజకీయ మంతనాలు ► బాలకృష్ణ, పవన్, లోకేశ్‌లతో చంద్రబాబు చర్చలు ► దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం 12:10 PM ఎన్నికలొస్తున్నాయ్.. కిం కర్తవ్యం.? ► జైల్లో బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లతో చంద్రబాబు మంత్రాంగం ► ఎవరెవరు ఏ ఏ విభాగాలు చూసుకోవాలన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ► విజయవాడ కేంద్రంగా బాలకృష్ణ, రాజమండ్రి కేంద్రంగా లోకేష్, గ్రౌండ్లో పవన్.? ► ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జైలు నుంచే చంద్రబాబు వ్యూహరచన ► పొత్తులపైనా చర్చలు, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలో సమాలోచనలు 11:59 AM బెయిల్‌పై వెనక్కి..ముందుకు.. ► విజయవాడ ACB కోర్టులో బెయిల్ పిటీషన్ వేసే ఆలోచనలో చంద్రబాబు లాయర్లు ► ఇప్పటివరకు స్క్వాష్‌పై నమ్మకం పెట్టుకున్న బాబు లాయర్లు ► ఆలస్యం అవుతుండడంతో ముందు బెయిల్ కోసం లాయర్ల యోచన ► స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ తయారీ ► ఎప్పుడు వేయాలన్నదానిపై లాయర్ల మల్లగుల్లాలు 11:45 AM రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వచ్చిన పవన్ కళ్యాణ్ ► ఆరు వాహనాల కాన్వాయ్‌తో వచ్చిన పవన్ కళ్యాణ్ ► ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని సూచించిన అధికారులు ► పవన్ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ప్రయత్నం ► ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం ► జనసేన నేత కందుల దుర్గేష్‌ను వెనక్కి పంపిన అధికారులు 11:30 AM జైలు ముందు కూడా డ్రామాలా? ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న బాలకృష్ణ లోకేష్ ► వారితోపాటు జైలు వద్దకు వచ్చిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చౌదరి ►ముందస్తు అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లేందుకు బుచ్చయ్య చౌదరి యత్నం ► బుచ్చయ్యని వారించి, వెనక్కు పంపిన జైలు అధికారులు ►అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య ►ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోకుండా రావడం సరికాదన్న అధికారులు ►అనుమతి తీసుకున్న వారిని మాత్రమే లోపలికి పంపిన జైలు అధికారులు 11:20 AM జైలు నుంచే రాజకీయం ► ఇవ్వాళ చంద్రబాబును కలవనున్న బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, లోకేష్ ► పార్టీకి సంబంధించి బాధ్యతల పంపిణీపై బాబు మాట్లాడతాడని ప్రచారం ► విజయవాడ కేంద్రంగా బాలకృష్ణ, రాజమండ్రి కేంద్రంగా లోకేష్, గ్రౌండ్లో పవన్.? ► ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జైలు నుంచే చంద్రబాబు వ్యూహరచన 11:15 AM లూథ్రా ట్వీట్ల పరమార్థమేంటీ? ► పూర్తిగా నిర్వేదంలోకి వెళ్ళినట్టు కనిపిస్తోన్న సిద్ధార్థ లూథ్రా ► నిన్న గురు గోవింద్ సింగ్ .. ఈ రోజు స్వామి వివేకానంద !!! ► ఇంతటి క్లిష్టమైన కేసును చూడలేదన్నట్టుగా ట్వీట్లు ► చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలుండడంతో చేష్టలుడిగిపోయిన లూథ్రా ► కేసులో అన్ని దారులు మూసుకుని పోవడంతో ఫ్రస్ట్రేషన్ నుంచి ఫిలాసఫీలోకి వచ్చాడంటున్న టిడిపి నేతలు 11:00 AM పోటాపోటీ క్యాంపులు ► రాజమండ్రి రూరల్ కాతేరు వద్ద లోకేష్ క్యాంప్ ఏర్పాటు ► టిడిపి శ్రేణులతో చర్చలు జరుపుతున్న లోకేష్, భువనేశ్వరి ►పార్టీ కార్యాలయం కేంద్రంగా బాలకృష్ణ, అంతే స్థాయిలో కాతరు క్యాంపులో లోకేష్ ►పార్టీపై పట్టుకు ఇద్దరు నేతల ప్రయత్నాలు ►తల్లి భువనేశ్వరీని తనతో పాటు చర్చల్లో కూర్చోపెడుతున్న లోకేష్ 10:50 AM బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ► అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా. ► ఈ కేసులో విచారణను ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. 10:00 AM చీమ చిటుక్కుమన్నా.. పట్టేస్తారు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో భారీగా భద్రత పెంపు. ►జైలు బయట అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు. ►చంద్రబాబు భద్రతను స్వయంగా పరిశీలిస్తున్న జైలు శాఖ డీఐజీ రవికిరణ్. 9:00 AM ఇంటిని మరిపించేలా రోజువారీ కార్యకలపాలు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు నాలుగు రోజు ►ఉదయం అల్పాహారం తీసుకున్న చంద్రబాబు ►అంతకు ముందు కాసేపు వ్యాయామం, పేపర్లు చదివిన చంద్రబాబు ►చంద్రబాబును కలిసేందుకు ములాఖత్‌కు రానున్న పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ, లోకేష్ 7:45 AM ► నేడు రాజమండ్రికి పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ. ► జైలులో ఉన్న చంద్రబాబుతో వీరు ములాఖత్. ► మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్న లోకేష్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ► రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రత ► ఉదయం 10 గంటలకు రాజమండ్రికి చేరుకోనున్న పవన్, బాలకృష్ణ 7:30 AM ► నాలుగోరోజు రాజమండ్రి జైలులో చంద్రబాబు ► తెల్లవారుజామున నిద్రలేచిన చంద్రబాబు. ► జైలులో చంద్రబాబు యోగా, పేపర్ రీడింగ్ ► నేడు అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ► ఈ కేసుపై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు. ► అంగళ్లులో టీడీపీ నేతల దాడి కేసులో A1గా ఉన్న చంద్రబాబు. ► అన్నమయ్య జిల్లా, అంగళ్లు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేకపోతున్నానని తెలిపారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని, తనకు మాత్రం బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు న్యాయస్థానాన్ని కోరారు. ► ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్స్ తెచ్చుకున్నప్పటికీ ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం హైకోర్టుకు రాలేదు. తనకేం కాదులే అనే ధీమాతో ఉన్న ఆయన.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి, జైల్లో ఉండటంతో ఒక్కసారిగా మేల్కొన్నారు. ఎందుకైనా మంచిదని బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ►ఆగస్టు 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు. ►యాత్ర సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, రైతులను చూసి చంద్రబాబు ఊగిపోయారు. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. వాహనంపై ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఎన్.అమరనాథ్‌రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తదితర నేతలు కూడా వైఎస్సార్సీపీ నేతలవైపు చేతులు చూపుతూ, కేకలు వేస్తూ హెచ్చరికలు చేస్తూనే.. సైగలతో దాడులకు ప్రేరేపించారు. ► మరికొందరు స్థానిక నేతలు ఈలలు వేస్తూ, తొడ గొడుతూ.. బూతులు తిడితూ కొట్టండి అంటూ దాడికి ప్రోత్సహించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే సిద్ధం చేసుకున్న మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ► ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, దాడిని అడ్డుకోబోయిన పోలీసులు కూడా గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, మహేష్, ఓ విలేకరి శ్రీనివాసులు, ముదివేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రోడ్డుపై పగిలిన బాటిళ్లు, ఇటుకలు, కర్రలు పడి ఉన్నాయి. కొందరు స్థానికులు వైఎస్సార్సీపీ నేతలను రక్షించారు. లేనిపక్షంలో కొందరు హత్యకు గురయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు
సాక్షి, అన్నమయ్య జిల్లా: ముదివేడు పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో గత శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు, పూతలపట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులను ఇష్టానుసారం మాట్లాడారు. డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు. చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు కాగా, పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది: చంద్రబాబు
సాక్షి, అన్నమయ్య/చిత్తూరు: చంద్రబాబు నాయుడిలో పరాకాష్టానికి చేరిన ఉన్మాదం మరోసారి బయటపడింది. శుక్రవారం అంగళ్లులో తన పర్యటనతో కల్లోల పరిస్థితికి కారణమైన ఆయన.. టీడీపీ కార్యకర్తలను నిలువరించాల్సిందిపోయి ఇంకా రెచ్చిపోయేలా మాట్లాడారు. పచ్చ దండును ఉసిగొల్పి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ సిబ్బందిపైనా దాడులు జరిపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూర్లోనూ ఉద్రికత్తలకు కారణమైంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల దాడిలో ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలూ గాయపడ్డారు. ఈ క్రమంలో.. అధికార పక్షానికి సవాల్ పేరిట ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు. తమాషాలు చేస్తున్నారా నా కొడుకులు అంటూనే.. తరమండిరా అంటూ టీడీపీ కార్యకర్తలకు హుకుం జారీ చేశాడు. ‘‘టైం చెప్పండి.. ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం.’’ ‘‘నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా. బాంబులకే భయపడలేదు. నన్ను బెదిరించడం.. మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు’’. ‘‘కర్రలతో వస్తే కర్రలతో వస్తా.. రౌడీలకు రౌడీగా ఉంటా, ఏయ్ పోలీస్ వాళ్లను పంపించూ’’ అంటూ తన బావ బాలయ్య రేంజ్లో డైలాగులు పేల్చాడు. ఈ క్రమంలో డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ.. ఆ బట్టలు తీసేయండయ్యా.. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాను మాత్రం సిబ్బందితో షీల్డ్ అడ్డుపెట్టించున్నారు. నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది. దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ని. మగాళ్లైతే పోలీసులు లేకుండా రండి.. తేల్చుకుందాం. ఏయ్ పోలీస్ బట్టలిప్పూ.. రోషం లేని జీవితం నాశనం. మీ పతనం చూసేవరకు వెంటపడతా.. అంటూ పుంగనూరులో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో టీడీపీ గూండాలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా దాడులకు తెగబడ్డారు. ఓపెన్ టాప్ వాహనంలో చంద్రబాబు తన కార్యకర్తలను ఉద్దేశించి పరిస్థితిని మరింత దిగజార్చేలా మాట్లాడడం గమనార్హం. -
అన్నమయ్య: టీడీపీ నేతల అరాచకం.. కర్రలు, రాళ్లతో దాడి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇక, టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు దిగారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఇక, ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న టీడీపీ నేతలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపైకి కూడా రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ‘ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే పవన్‌ను పట్టించుకునేవారేమో’ -
విపరీతంగా పెరిగిపోతూ డబుల్ సెంచరీ కొట్టిన టమాట
-
మదనపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.196
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్ చరిత్రలో పాత రికార్డులన్నింటినీ బద్దలు కడుతూ.. తాజాగా టమాటా కిలో రూ.196 ధర పలికింది. టమాటా ధర మరింత పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఆకాశాన్ని అంటిన టమాటా ధర.. తాజాగా శనివారం మరింత పెరిగింది. మొదటి రకం టమాటాకు ఈ రేటు పలకగా.. నాణ్యత కాస్త తక్కువగా ఉన్న టమాటాలకు కిలో రూ.140 పలికింది. మార్కెట్‌కు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం టమాటా మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, గుర్రంకొండ, అంగళ్లు, ములకలచెరువు.. కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లె మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. దేశవ్యాప్తంగా టమాటాకు ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, చత్తీస్గడ్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈ ప్రాంతాల్లో మకాం వేసి అధిక ధరలకు టమాటాను కొనుగోలు చేస్తున్నారు. వచ్చిన సరుకు వచ్చినట్లే అధిక ధరలకు అమ్ముడవుతుండటంతో తీసుకొచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె మార్కెట్లో రైతుల నుంచి సగటున కిలో రూ.104 చొప్పున టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు కిలో రూ.50 చొప్పున విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు మరో నెలవరకు ఇలాగే కొనసాగుతాయని, అప్పటికి మదనపల్లె మార్కెట్లో సీజన్ పూర్తయితే అనంతపురం, డోన్, గుత్తి మార్కెట్లలో సరుకు లభ్యత వస్తుందన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె పరిధిలోని జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి Kachidi Fish: కాకినాడలో కాస్ట్లీ చేప.. వేలంలో రూ.3లక్షల 10వేలు!.దీని ప్రత్యేక ఇదే -
నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో..
సాక్షి, అన్నమయ్య: నర్సింగ్ చదువుతున్న అమ్మాయిల వెంటపడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలకు దిశ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో, పోకిరీలు.. దిశ పోలీసులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. మరొకసారి అమ్మాయిల వెంటపడి, వేధింపులకు గురిచేయమని ఇద్దరు యువకులు పోలీసులకు లేఖ రాసి ఇచ్చారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందలూరులో నర్సింగ్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు శనివారం కాలేజ్‌కు వెళ్తున్నారు. ఇద్దరు యువకులు అమ్మాయిలను అనుసరించి వేధింపులకు గురిచేశారు. దీంతో, బాధిత యువతులు దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కేవలం ఆరు నిముషాల వ్యవధిలో దిశ టీమ్ విద్యార్థినుల ఉన్న లొకేషన్‌కు చేరుకున్నారు. అనంతరం, నర్సింగ్ కాలేజ్ అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న సురేష్, చంద్ర శేఖర్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకుల తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొక్కమారు అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేయమని యువకులు లిఖితపూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చారు. ఇక, దిశ యాప్‌ను కొన్ని రోజుల కిందటే డౌన్లోడ్ చేసుకున్నట్లు బాధిత యువతి స్పష్టం చేసింది. దిశ SOSకు కాల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు చాలా బాగుందని విద్యార్థినిలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
రెండు నిమిషాల్లో ఇంటికి చేరేలోపే ఘోరం
అన్నమయ్య : మదనపల్లె నుంచి పీలేరుకు 50 కిలోమీటర్లుపైగా క్షేమంగా పయనించి... రెండు నిమిషాలు ఆగితే ఇంటికి చేరుతారనగా.. ఇంతలోనే కర్ణాటక ఆర్టీసీ బస్సు రూపంలో ఆ ఇద్దరినీ మృత్యువు కబళించింది. పీలేరు పట్టణం కొండారెడ్డిసర్కిల్ వద్ద టాటాఏఎస్ – కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇర్షాద్, విజయకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ► పీలేరు పట్టణంలోని సరోజినీదేవి వీధికి చెందిన ఇర్షాద్ (27)కు భార్య రోషిణి తోపాటు కుమారుడు అమాన్, కుమార్తె ఫిదా ఉన్నారు. టాటాఏస్ వాహనం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇర్షాద్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. రోషిణిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ► పీలేరు పట్టణం ఇందిరమ్మకాలనీకి చెందిన విజయకుమార్ (50) టాటాఏస్కు కూలీగా వెళుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య చిట్టెమ్మ, కుమారుడు శివనాగరాజు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న విజయకుమార్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అన్నమయ్య: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పీలేరులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. వివరాల ప్రకారం.. పీలేరులోని ఎంజేఆర్ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, తుఫాన్ వాహనం నంద్యాల నుంచి తిరువన్నమలైకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది కూడా చదవండి: ‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం -
అన్నమయ్య జిల్లా: గృహ ప్రవేశం జరుగుతున్న ఇంట విషాదం
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గృహప్రవేశం కార్యక్రమంలో ఇంటికి వచ్చిన బంధువులపై కరెంట్ తీగలు తెగిపడటంతో నలుగురు మృతిచెందారు. దీంతో, వేడుక జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగమాకులపల్లెలో గృహప్రవేశం జరిగిన ఇంట విషాదం నెలకొంది. ఓ ఇళ్లు గృహప్రవేశానికి వేసిన షామియాన గాలికి కరెంట్ తీగలపై పడింది. దీంతో, ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగి.. అక్కడున్న వారిపై పడటంతో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరికొందరు గాయపడటంతో వారిని వెంటనే బి.కొత్తకోట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. కాగా, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వేడుక జరుగుతున్న ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నారు. మృతుల వివరాలు ఇవే.. 1. లక్ష్మమ్మ 75, 2.ప్రశాంత్ 26, 3. లక్ష్మన్న 53, 4. శాంతమ్మ 48. -
వరప్రదం.. దేవర వృషభం
సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మలు గ్రామసీమలు. అవి సంబరాలకు నెలవులు. విశిష్ట ఆచారాలకు పుట్టినిళ్లు. అలాంటి గ్రామాల్లో కొనసాగుతున్న ఒక అరుదైన విశేషమే.. దేవరెద్దు, దేవరభక్తుల పరంపర.. (షేక్ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్) : దేవరెద్దులు.. అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. అనాదిగా వస్తున్న ఆచారానికి ఇవి ప్రతీకలుగా ఉంటున్నాయి. గ్రామానికి శుభం చేకూరుస్తాయనే ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రామాలు సస్యశ్యామలం దేవరెద్దులు కలిగిన గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని నమ్మకం. దేవరెద్దును పోషిస్తున్న భక్తుల వంశాభివృద్ధి చెంది, సుఖసంతోషాలతో ఉంటారని విశ్వాసం. దాన్ని మేపడానికి వదిలేసినప్పడు ఏ పొలంలో అయినా మేయవచ్చు. అది మేసిన పొలం యజమానులు తమ అదృష్టంగా భావిస్తారు. అలాగే గ్రామస్తులు తమకు తోచిన పదార్థాలను ప్రసాదంగా దేవరెద్దుకు అందజేస్తుంటారు. దేవరెద్దు మృతి చెందితే ఆ ఊరికి, గ్రామస్తులకు అరిష్టం జరుగుతుందనే భయంతో తక్షణం కొత్తదాన్ని ఎంపిక చేస్తారు. విశేషాల సమాహారం దేవరెద్దు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ఎన్నో వేడుకలు నిర్వహిస్తారు. వీటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా దేవరభక్తులుంటారు. తిరునాల, ఉత్సవాల సందర్భంగా వీటిని అలంకరించి సంబరాలు చేసుకుంటారు. దేవరెద్దును దేవుడిలా పూజిస్తారు. దీని పై ఎవ్వరూ దెబ్బ వేయరు. ఇది చనిపోయినా.. కొత్త దేవరెద్దును, దేవరభక్తులను ఎంపిక చేయాలన్నా వేడుక నిర్వహిస్తారు. బంధుమిత్రులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా తరలివస్తారు. సంప్రదాయ వాయిద్యాలతో పాటు మద్దిళ్లు, కొమ్ములు ఊదడం, పలకలు కొట్టడం లాంటివి చేస్తారు. కొత్త ఎద్దును ఎంపిక చేసిన తర్వాత దానికి సంప్రదాయ అలంకరణ అనంతరం ఊరేగిస్తారు. దేవరెద్దు చనిపోతే... ఎక్కడైనా దేవరెద్దు చనిపోతే అంత్యక్రియలు వేడుకలా నిర్వహిస్తారు. అడవికి వెళ్లి పచ్చారు కొయ్యలు తెస్తారు. వాటితో విశ్వబ్రాహ్మణుల ద్వారా ప్రత్యేకంగా రథం తయారు చేయిస్తారు. ఎద్దు ప్రాణంతో ఉన్నప్పుడు ఎలా పడుకుని ఉంటుందో.. ఆ విధంగా రథంలో ఉంచుతారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఊరేగింపుగా తీసుకెళ్తారు. చెక్కభజనలు, పిల్లనగ్రోవి, డప్పులు, సాంస్కతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా సేవ చేస్తారు. భూమిలో గుంత తీసి ఖననం చేసే సమయంలో కూడా ఎద్దును కూర్చున్న స్థితిలోనే ఉంచుతారు. ఈ కార్యక్రమం ఒక తిరునాళ్లలా జరిపిస్తారు. దీనికి ఇతర గ్రామాల్లోని దేవరెద్దులు, దేవరభక్తులు కూడా తరలివస్తారు. నియమానుసారం.. దేవరభక్తులను నియమించడానికి గ్రామస్తులు స్నానం ఆచరించి నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ చేతిలో పండ్లు, ప్రసాదం పట్టుకుని కూర్చుంటారు. దేవరెద్దును తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు. మొదటిసారి ఎవరి ప్రసాదం స్వీకరిస్తే వారిని ఎద్దుభక్తుడిగా ఎంపిక చేస్తారు. ఈ విధంగా వరుసగా కదిరిభక్తుడు, గుర్రప్ప భక్తుడు, పూల భక్తుడులను నియమిస్తారు. ► దేవరభక్తుడు దేవరెద్దుకు పూజలు చేయడంతో పాటు ఉత్సవాలకు తీసుకెళ్లాలంటే ప్రత్యేకంగా అలంకరించాల్సి ఉంటుంది. కత్తి (బెత్తం) చేతపట్టుకుని దేవరెద్దుతో పాటు ఊరేగింపుగా వెళతాడు. ► కదిరి భక్తుడు నరసింహస్వామికి పూజలు చేయాల్సి ఉంటుంది. ఉత్సవాలకు నరసింహస్వామి చిత్రపటంతో వెళతాడు. ► గుర్రప్పభక్తుడు ఎద్దుకు సంబంధించిన ఆభరణాలు, ఉత్సవ సామగ్రి, గుర్రప్పస్వామి శిలతో కూడిన ఓ పెట్టెను ఎత్తుకుని వెళ్లాల్సి ఉంటుంది. ► పూల భక్తుడు ఏదైనా ఉత్సవాలు, తిరునాళ్లు జరిగినప్పుడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి భక్తులను ఆహ్వానించాల్సి ఉంటుంది. కేవీ పల్లెలో.. అధిక సంఖ్యలో.. అన్నమయ్య జిల్లాలోని కేవీపల్లె, కురబలకోట, కలికిరి, సంబేపల్లె మండలాల్లో ప్రధానంగా దేవరెద్దుల సంస్కృతి ఉంది. కేవీపల్లె మండలంలో 12 గ్రామాల్లో ఒక్కో దేవరెద్దు చొప్పున ఉన్నాయి. తోటి దళితవాడ, నారమాకుపల్లె, గొర్లకణంపల్లె, గుట్టలపై బండకాడపల్లె, దిగువగడ్డ, పెండ్లిపెంట, పేయలవారిపల్లె, తీతవగుంటపల్లె, తువ్వపల్లె, బొప్పసముద్రం, తిమ్మాపురం, వంకవడ్డిపల్లెలో దేవరెద్దులు ఉన్నాయి. సంబేపల్లె మండలంలో అన్నప్పగారిపల్లె, శెట్టిపల్లె, గున్నికుంట్ల, గురిగింజకుంట, కలకడ మండలంలో పాళెంమూల, బాలయ్యగారిపల్లె పంచాయతీ నాయనవారిపల్లె, కలికిరి మండలంలో అద్దవారిపల్లెలోనూ దేవరెద్దులు ఉన్నాయి. కురబలకోట మండలంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి. కాగా.. ఒకటి, రెండు గ్రామాల్లో మాత్రమే కొత్తగా దేవరెద్దులు పుట్టాయి. దేవరెద్దు అంటే.. ఏ గ్రామంలో అయినా పుట్టిన దూడ వారం రోజులైనా పాలు తాగకుండా ఉంటే.. దాన్ని దేవాలయం వద్దకు తీసుకెళ్లి ప్రసాదం పెడతారు. అది తింటే దానిని దేవరెద్దుగా పరిగణిస్తారు. దానిని సంరక్షించుకుంటే గ్రామాలకు శుభం కలుగుతుందని నమ్ముతారు. ఉత్సవాలకు ఊరేగింపుగా.. దేవరెద్దు ఉన్న ఊళ్లతో పాటు సమీప ప్రాంతాల్లో ఎక్కడ ఉత్సవాలు జరిగినా వీటిని ప్రత్యేకంగా ఊరేగింపుగా తీసుకెళతారు. ప్రధానంగా శివరాత్రి సందర్భంగా జరిగే ఝరి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఇవి నిలుస్తాయి. ఆ రోజున జాగరణ నిర్వహించిన ప్రజలు మరుసటి రోజు ఉదయాన్నే ఝరికోనలో స్నానమాచరిస్తారు. అక్కడికి దేవరెద్దును, నాణ్యాలు(దెవరెద్దు పూజసామగ్రి)ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీనిని చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తారు. పూజ సామగ్రి కోసం దేవరిల్లు దేవరెద్దు కోసం ప్రత్యేకంగా ఇల్లు ఏర్పాటు చేస్తారు. దానిని దేవరిల్లు అంటారు. అందులో దేవుని చిత్రపటాలు ఉంచుతారు. దేవరెద్దు అక్కడే ఉంటుంది. దానికి అలంకరణ సామగ్రి కోసం ప్రత్యేకంగా పెట్టె ఉంటుంది. గంట, గజ్జెలు, మువ్వలు, మల్లముట్లు, గొడుగులు, వస్త్రం తదితరాలుంటాయి. వాటిని దేవరింటిలో భద్రపరుస్తారు. కొత్త దేవరెద్దు ఎంపిక ఇలా.. దేవరెద్దు చనిపోయిన స్థానంలో కొత్త దాన్ని ఎంపిక చే సేందుకు గ్రామస్తులంతా పూజలు నిర్వహిస్తారు. గ్రా మంలో పండ్లు, ప్రసాదాలు పెట్టి దూడలు, ఎద్దులను ఒక చోట వదులుతారు. ఏది అయితే ప్రసాదం స్వీకరిస్తుందో.. దాన్ని దేవరెద్దుగా పరిగణిస్తారు. కొత్తగా దేవరెద్దు ఎంపికైన అనంతరం మూడేళ్లకు తిరునాల నిర్వహిస్తారు. దానికి మిగతా గ్రామాల్లోని దేవరెద్దులను కూడా ఆహ్వానిస్తారు. గ్రామానికి వచ్చిన వాటికి మంగ ళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలుకుతారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు చేసుకుంటారు. దేవర భక్తులు.. సదా సంరక్షకులు గ్రామంలో దేవరెద్దును సంరక్షించడానికి, పూజలు చేయడానికి, ఉత్సవాలకు తీసుకు వెళ్లడానికి నలుగురు వ్యక్తులుంటారు. వీరిని దేవర భక్తులు అంటారు. ఎక్కువగా ఏళ్ల తరబడి ఒకే కుటుంబ సభ్యులు దేవరెద్దు భక్తులుగా ఉంటారు. వారిని ఎద్దు భక్తుడు, కదిరి భక్తుడు, గుర్రప్పభక్తుడు, పూల భక్తుడిగా పిలుస్తారు. నిష్టగా ఉంటాం మేము చాలా నిష్టగా ఉంటాం. భక్తుడిగా నియమించినప్పటి నుంచి ఎద్దు బాగోగులు నేనే చూసుకుంటున్నా. 25 ఏళ్లుగా మా వంశస్తులే దేవరెద్దు భక్తులుగా ఉన్నాం. దేవరెద్దు భక్తులతో పాటు ఇతర భక్తులు దేవరెద్దుకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. – యల్లయ్య, వీఆర్ఓ, ఎద్దు భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం. పురాతనకాలం నుంచి వస్తున్న ఆచారం మా గ్రామంలో దేవరెద్దును సంరక్షించడం, పూజలు నిర్వహించడం పురాతన కాలం నుంచి ఆచారంగా వస్తోంది. కొన్ని కట్టుబాట్లు పాటిస్తూ దేవరెద్దును సంరక్షించడం జరుగుతోంది. – నాగులయ్య, గుర్రప్ప భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం అదృష్టంగా భావిస్తున్నాం దేవరెద్దు రూపంలో దేవుడే ప్ర త్యక్షంగా కన్పిస్తున్నాడు. అలాంటి దేవరెద్దుకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. పండుగలు, ఉత్సవాలతోపాటు ప్రతి శనివారం క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తాం. – నాగరాజ, పూల భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం ఒక్కపొద్దు పాటిస్తున్నాం ప్రతి శనివారం, పండుగల సమయంలో మేము ఒక్కపొద్దు పాటిస్తాం. దేవరింటిలో పూజ లు నిర్వహించడంతో పాటు అక్కడే భోజనం వండుకుని దేవరెద్దుకు పూజలు నిర్వహించిన తరువాతనే ఒక్కపొద్దు విడుస్తాం. – శశికుమార్, కదిరి భక్తుడు, తోటిదళితవాడ, కేవీపల్లె మండలం గౌరవంగా చూసుకుంటాం దేవరెద్దు సంప్రదాయం పెద్దల కాలం నుంచి వస్తోంది. ఎద్దును గౌరవంగా చూసుకుంటున్నాం. మాలో ఎవరైనా చనిపోతే కొత్త భక్తుడిని దేవరెద్దే ఎంపిక చేసుకుంటుంది. – కె.వంశీ, దేవరభక్తుడు, దిగువబోయపల్లె, కురబలకోట మండలం 40 ఏళ్లుగా.. దేవరెద్దును దేవుడితో సమానంగా చూస్తారు. పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో అలంకరించి ఊరేగిస్తారు. 40 ఏళ్లుగా భక్తుడిగా ఉన్నా. – శిద్దప్ప, దేవరభక్తుడు, మండ్యంవారిపల్లె, కురబలకోట మండలం -
‘చిగు’రిస్తున్న ఆశలు!
సాక్షి రాయచోటి: మామిడి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. తొలి విడతలో వచ్చిన పూతకు కాయలు కనిపిస్తుండగా.. ప్రస్తుతం రెండో విడతలో కూడా పూత కనిపిస్తుండడంపై ఆశలు కొత్తగా చిగురిస్తున్నాయి. ఎక్కడ చూసినా పూత, పిందెతో చెట్లు కనిపిస్తుండడం.. గతేడాది కంటే ఈసారి ధర కూడా బాగానే ఉండే అవకాశాలు ఉండడంతో కొత్త ఆశలు మొలకెత్తాయి. అన్నమయ్య జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్ల వరకు మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో సరాసరిన 20 వేల హెక్టార్లలో పెద్ద చెట్లు (కాయలు కాచే) ఉండవచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ఒకవైపు కాయలు.. మరోవైపు పూత అన్నమయ్య జిల్లాలో మామిడి పంటకు సంబంధించి రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పంట విస్తారంగా సాగులో ఉంది. ముందుగా రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన కాయలు మార్కెట్‌కు వస్తాయి. తర్వాత మిగతా ప్రాంతాల్లోని కాయలు కూడా అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పిందెలతో కూడిన కాయలు కనిపిస్తుండగా మరోవైపు పూత కూడా ఇప్పుడే విరివిగా కనిపిస్తోంది. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో శీతాకాలంలో పూత విపరీతంగా వచ్చినప్పటికీ శీతల ప్రభావానికి కొంతమేర ముసురుకుంది. అయితే మంచుకు తట్టుకుని నిలబడిన తోటల్లో ప్రస్తుతం కాయలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే వరుసలో రెండవ విడతగా పూత కూడా విస్తారంగా రావడంతో ఈసారి కూడా భారీగా మామిడి కాయలు అన్నమయ్య జిల్లా నుంచి మార్కెట్‌కు రానున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు మార్కెట్లో కాయలు మామిడి పంటకు సంబంధించి కాయలు మార్చి నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. మనకు తొలుత కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మార్చి నెలలో ఇక్కడి మార్కెట్లకు కాయలు రానున్నాయి. తర్వాత రైల్వేకోడూరుతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తనుంది. ఏప్రిల్ నెలనుంచి జూన్ వరకు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పలు మండలాల నుంచి భారీగా మామిడి కాయలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూర, బేనీషా, నీలం, ఇమామ్ పసంద్, లాల్ బహార్, ఖాదర్, చెరుకు రసం, మల్లిక, సువర్ణ రేఖ, దసేరి, మల్గూబా తదితర రకాల కాయలను సాగు చేశారు. మార్చి రెండవ వారం నుంచి జూన్ నెలాఖరు వరకు కాయలు ఇక్కడి మార్కెట్లలో కళకళలాడనున్నాయి. రెండుమార్లు పూత మామిడి పంటకు సంబంధించి ప్రస్తుతం పూత విరివిగా కనిపిస్తోంది. గత నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన పూతకు లేలేత కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వచ్చిన పూత కూడా నిలబడింది. దిగుబడి కూడా ఈసారి అనుకున్న మేర ఆశాజనకంగా ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో మామిడి పంట సాగులో ఉంది. జిల్లా వ్యాప్తంగా 37 వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా...సరాసరిన 20 వేల హెక్టార్లలో కాయలు కాసే చెట్లు ఉన్నాయి. ఈసారి దిగుబడి కూడా బాగా వస్తుందని అంచనా వేస్తున్నాం. – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
Annamayya District: ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ పాఠాలు
మదనపల్లె సిటీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మెరుగైన ర్యాంకులు తప్పకుండా సాధించాలి. ఇందుకు జాతీయ స్థాయి విద్యా విధానం (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కీలకంగా మారింది. ఈ తరుణంలో నగరాలు, పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితౖమైన సీబీఎస్ఈ సిలబస్ ఇక మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అందనుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్ లక్ష్యంగా మరింత నాణ్యమైన, ఖరీదైన విద్య చేరువ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న సీబీఎస్ఈ సిలబస్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా బడుల్లో ప్రధానోపాధ్యాయులు, సహాయ ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు. ప్రస్తుతం జాతీయస్థాయి పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సీబీఎస్ఈ సిలబస్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ను సీబీఎస్ఈ సిలబస్‌లో పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తా చాటేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరో తరగతిలో చేరితే +2 (ఇంటర్) విద్య వరకు విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. పది అంశాలపై నివేదిక సీబీఎస్‌ఈను అమలు చేయనున్న పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం ముందుగా పది అంశాలపై కేంద్ర విద్యామండలికి నివేదిక అందజేసింది. పాఠశాలల గుర్తింపు, ఫైర్‌సేఫ్టీ, ధ్రువపత్రం, పాఠశాల యాజమాన్య కమిటీ, ఈపీఎఫ్ గుర్తింపు సంఖ్య, ఏకో ఫ్రెండ్లీ వాతావరణం, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విద్యార్హతలు, వెబ్సైట్ తదితర వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు జిల్లాలో 30 మండలాల పరిధిలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన అమలు కానుంది. అనంతరం సాధ్యాసాధ్యాలను పరిశీలించి మిగిలిన పాఠశాలల్లో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లాలో సీబీఎస్ఈకి ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ విధాననం ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో కూడా లేదు. కార్పొరేట్ పాఠశాలల్లో తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయనుంది. పేద విద్యార్థులకు వరం సీబీఎస్ఈ విధానం విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు కార్పొరేట్, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే ఉన్న ఈ విధానం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావడం శుభపరిణామం. కేంద్ర విద్యా మండలి నిబంధనల మేరకు అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న పాఠశాలల ఎంపిక వెబ్సైట్ ద్వారా జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం 9 వ తరగతి నుంచి ఈ విధానం అమలు చేసేందుకు ఇప్పటి నుంచే 8వ తరగతి విద్యార్థులను సన్నద్దం చేస్తున్నాం. – క్రిష్ణప్ప, డివైఈఓ, మదనపల్లె మంచి నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య అందే అవకాశం ఉంటుంది. – పి.మహమ్మద్‌ఖాన్, టీచర్, జెడ్పీహెచ్ఎస్,మదనపల్లె -
మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా వాగ్వాదాలకు, ఘర్షణలకు తెర తీశారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు కాస్తా మరింత దిగజారిపోయిందనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారు. అధినేత వద్ద మెప్పుకోసం ఒకరు.. అధిష్టానంలో పలుకుబడి కోసం మరొకరు అన్నట్లు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం తప్పడం లేదు. ఎక్కడ చూసినా ప్రధాన నేతల మధ్య వర్గ విభేదాలతో ఉన్న కాస్త పార్టీ పరువు గంగలో కలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక అల్లాడిపోతున్న టీడీపీకి ఈ వర్గ విభేదాలు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎవరికి వారే... యమునా తీరే! జిల్లా కేంద్రమైన రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో కార్యక్రమం నిర్వహించగా, నియోజకవర్గ, టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులు ప్రత్యేకంగా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు కలిసి ఒకేచోట పాల్గొన్న పరిస్థితులు కనిపించలేదు. నేతలు తలోదారి కావడంతో తమ్ముళ్లు కూడా ఎవరికి తోచిన రీతిలో ఏ వర్గానికి ఇష్టమున్న నాయకుడిని పిలిపించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి హరహరిలు పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగిలిన వర్గాలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అలా వివిధ చోట్ల నాయకులు ఎవరికి వారుగా నిర్వహించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేటలోనూ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తే, మరో వర్గానికి చెందిన టీడీపీ నేత జగన్మోహన్రాజు విడిగా తన వర్గంతోకలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. చిట్వేలిలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. చిట్వేలిలో చీలిన నాయకులు.. చిట్వేలి: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే విషయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ వర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తుల సూచన మేరకు కొంతసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. కస్తూరి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లిపోగా, అనంతరం నరసింహ ప్రసాద్ వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటం పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదనపల్లెలో మూడుముక్కలాట మదనపల్లె: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తొలుత పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈలోపు రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటానరహరి మదనపల్లెలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో దొమ్మలపాటిరమేష్ ఆయన కోసం అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి నియోజకవర్గ ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్‌ను మాటవరుసకైనా పలుకరించకుండానే పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎంపీ అభ్యర్థి గంటానరహరి తంబళ్లపల్లె ఇన్చార్జి శంకర్‌తో కలిసి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత దొమ్మలపాటి రమేష్ ఆయన వాహనంలో ఎక్కి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరం ప్రా రంభోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంటా నరహరి రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిని జరగనీయకుండా, ఆలస్యం చేయించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దొమ్మలపాటి రమేష్ గంటానరహరిని మండలంలోని సీటీఎంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా మరో ఎమ్మెల్యే ఆశావహుడు శ్రీరామినేని జయరామనాయుడు శివనగర్‌లోని తన కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ నిమ్మనపల్లె సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు వేర్వేరుగా బుధవారం నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మరో ఆశావహుడు చమర్తి జగన్‌మోహన్‌రాజులు తమ వర్గీయులతో వేర్వేరుగా పలు మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బత్యాలకే టికెట్ అని ఆయన వర్గీయులు, కాదు చమర్తికే టికెట్ అని ప్రత్యర్థి వర్గీయులు గళం విప్పారు. (క్లిక్ చేయండి: ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
ఎంపీ మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
-
మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, అన్నమమ్య: మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ వేళ బంధువుల ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. వివరాల ప్రకారం.. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తుండగా మార్గ మద్యంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన ఓ కారు మిథున్ రెడ్డికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ కారు పల్టీలు కొట్టి కిందపడిపోయింది. కాగా, ప్రమాద సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కారులో మిథున్ రెడ్డి ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇక, ఈ ప్రమాదంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సైకో చంద్రబాబు గో బ్యాక్.. పీలేరులో ఫ్లెక్సీల ఏర్పాటు
సాక్షి, అన్నమయ్య: చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మత కలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీల దర్శనమిచ్చాయి. ‘ గోబ్యాక్ చంద్రబాబు.. పుంగనూరులో మత కలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు గో బ్యాక్.. సైకో చంద్రబాబు గో బ్యాక్’ అని కొందరు బాబు రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలతో నిరసించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడులు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ గాయపడిన వారి ఫోటోలను ఫ్లెక్సీల్లో ఉంచారు. కాగా, పీలేరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి సోమవారం చంద్రబాబు వెళ్లారు. ములాఖత్‌కు బాబుతోపాటు ఆరుగురు అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ఫ్లెక్సీలు కనిపించాయి. బాబు పీలేరు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు హాట్‌టాపిక్‌గా మారాయి. -
చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో ఫ్లెక్సీలు
-
రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు పంచాయతీలో ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.10 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని సోమవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తూ ప్లాట్లు అమ్ముకుంటున్నారని కోళ్లబైలు గ్రామస్తులు గత సోమవారం స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై ఆర్డీవో ఎం.ఎస్.మురళి తక్షణమే స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన కోళ్లబైలు సర్వే నంబర్లు 889/5లోని 1.11 ఎకరాలు, 891/1లోని 0.62 సెంట్ల భూమికి జారీ చేసిన పట్టాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అని అందులో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ భూమిలోకి ప్రవేశిస్తే చట్టప్రకారం శిక్షార్హులుగా పేర్కొన్నారు. అయితే అప్పటికే సదరు స్థలంలో ఆక్రమణదారులు అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు చేస్తుండటంతో వారందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో అంతటితోనే నిలిపేయాలని హెచ్చరించారు. -
బొప్పాయి పాలు.. రైతుకు లాభాలు
సాధారణంగా బొప్పాయి తోటలు అనగానే బొప్పాయి కాయలే గుర్తుకు వస్తాయి. అయితే అందులో మరో కోణం దాగి ఉంది. బొప్పాయి కాయలు తినడానికే కాకుండా బొప్పాయి పాలు, ఆకులు మందుల తయారీలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం నైపుణ్యం కలిగిన కూలీలు తోటల వద్దనే మకాం వేసి మరీ పాలసేకరణ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నేరుగా తోటల వద్దకే వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు. బొప్పాయి పాల కోసం ఎకరం తోటకు రూ. 20వేలు, బొప్పాయి ఆకు కోసం ఎకరం తోటకు రూ.15వేలు కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు పాలసేకరణ బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం 6 గంటల నుంచి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. ఆ తరువాత కూలీలకు ఎలాంటి పని ఉండదు. జిల్లాలోని రైల్వేకోడూరు నుంచి ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను తీసుకొస్తున్నారు. కూలీలు బొప్పాయి తోటల్లోనే గుడిసెలు వేసుకొని పాలసేకరణ పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉంటారు. కూలీలందరూ ఉదయం ఆరు గంటల నుంచి పదిగంటల వరకు పాలసేకరణ చేస్తారు. ఎకరానికి ఎనిమిది క్యాన్ల పాలసేకరణ ఎకరం బొప్పాయి తోటలో కూలీలు ఎనిమిది క్యాన్ల వరకు పాలసేకరణ చేస్తారు. ఒక్కో కూలీ కనీసం రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తారు. ఒక క్యాన్ పాలు సేకరిస్తే కూలీలకు కాంట్రాక్టర్ రూ. 1500 చెల్లిస్తారు. కనీసం పది మంది కూలీలు గుంపులు, గుంపులుగా బొప్పాయి తోటల్లో మకాం వేసి పాలు సేకరిస్తుంటారు. ప్రత్యేక పద్ధతుల్లో పాలసేకరణ బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో సేకరిస్తుంటారు. ముళ్ల కంప లాంటి వస్తువుతో ముందుగా బొప్పాయి కాయలపై గాట్లు వేస్తారు. అనంతరం బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసిన ఓ జల్లెడలాంటి అట్టను కింద ఉంచుతారు. బొప్పాయి కాయల్లో నుంచి కారే పాలన్నీ కింద ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో పడతాయి. పాలు కింద పడిన కొద్దిసేపటికే అవి గడ్డగా మారిపోతాయి. పా«లధార నిలిచిపోయిన తరువాత గడ్డగా మారిన పాలను ప్లాస్టిక్ క్యాన్లలో నింపుతారు. సాధారణ, ఆయుర్వేద మందుల తయారీలో వినియోగం ఇక్కడి బొప్పాయి తోటల్లో సేకరించిన పాలను క్యాన్ల ద్వారా కాంట్రాక్టర్లు రైల్వే కోడూరులోని ఫ్యాక్టరీలకు చేరుస్తారు. అక్కడి నుంచి ఈ బొప్పాయి పాలను ట్యాంకర్ల ద్వారా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తారు. సాధారణ అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేద మందుల తయారీలో ఈపాలను వినియోగిస్తుండడంతో వీటికి మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎకరం తోట రూ.20వేలు పాలసేకరణ కోసం కాంట్రాక్టర్లు ఎకరం బొప్పాయి తోటలకు రూ. 20 వేలు వరకు చెల్లిస్తుంటారు. పాలసేకరణ పూర్తి అయిన తరువాత బొప్పాయి ఆకు ను కూడా కత్తిరించి టన్ను రూ. 15 వేలు చొప్పున విక్రయిస్తుంటారు. బొప్పాయి పాలతో పాటు ఆకు కూడా మందుల తయారీలో వినియోగిస్తుంటా రు. దీంతో పాలతో పాటు ఆకుకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఆకు, పాలసేకరణ ముగిసిన తరువాత తోటల్లో మిగిలిన కాయల్ని ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. బొప్పాయి పచ్చికాయల నుంచి స్వీట్లు, బ్రెడ్లు, కేక్‌ల తయారీలో వినియోగించే స్వీట్ చిప్స్‌ను తయారు చేస్తారు. మందుల తయారీలో పాలను వాడతారు బొప్పాయి పాలను మందులు తయారు చేసే ప్రక్రియలో భాగంగా వాడతారు. బొప్పాయి పాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తీసుకెళుతుంటారు. మేము బొప్పాయి తోటలను కాంట్రాక్ట్ తీసుకొని పాలను సేకరిస్తాము. బొప్పాయి పాలతో పాటు ఆకు కుడా మందుల తయారీలో వినియోగిస్తారు. చివరగా మిగిలిన కాయలు స్వీట్ చిప్స్ తయారీకి వాడతారు. సిద్ధార్థ, కాంట్రాక్టర్, రైల్వేకోడూరు రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తాం బొప్పాయి తోటల్లో రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తాము. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు మాత్రమే పాలసేకరణకు అనుకూల సమయం. ఒక క్యాన్‌కు కాంట్రాక్టర్ రూ. 1500 ఇస్తాడు. పదిమంది ఒక బృందంగా ఏర్పడి బొప్పాయి తోటల్లోనే గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండిపోతాం. 15 రోజుల వరకు ఒక తోటలో పాలసేకరణ చేస్తాము. శీను, రైల్వేకోడూరు -
కన్నా.. ఇక మిమ్మల్ని చూడటానికి రానురా!
సాక్షి, అన్నమయ్య: భార్య దూరమైందన్న బాధ.. పిల్లల సంరక్షణ భారంగా అనిపించి పిరికి చర్యకు పూనుకున్నాడు ఆ వ్యక్తి. ఆ దంపతుల నడుమ గొడవలు.. ఆపై బలవన్మరణాలతో పిల్లలను అనాథలను చేశారు. కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్ వాళ్లు చెప్పినట్లు వినాలి. బాగా చదువుకోవాలి అంటూ తండ్రి చెప్పిన చివరి మాటలు గుర్తు చేసుకుంటున్నారు. తల్లి దూరమైన రెండు వారాలకే తండ్రి కూడా చనిపోవడంతో కన్నీటి పర్యంతరం అవుతున్నారు ఆ చిన్నారులు. కలమడి ప్రసాద్‌బాబు (35), సుకన్య (28) దంపతులు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. బేల్దారి పనులు చేసుకుంటూ ప్రసాద్‌బాబు కుటుంబాన్ని పోషించేవాడు. అయితే.. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. రెండు వారాల కిందట గొడవ పెద్దది కావడంతో.. సుకన్య క్షణికావేశంతో ఉరేసుకుంది. అప్పటినుంచి ప్రసాద్‌బాబు మనోవేదనకు గురయ్యాడు. భార్య దూరం కావడం, పిల్లలను పోషించడం తన వల్ల అవుతుందో లేదో అని బెంగ పెట్టుకున్నాడు. స్థానిక అంగన్వాడీ సిబ్బంది ద్వారా పిల్లలను గత నెల 29న ఐసీడీఎస్ అధికారులకు అప్పగించాడు. తాను వారిని పోషించలేనని, మీరే చూసుకోవాలంటూ లేఖ రాసిచ్చాడు. వారు పోలీసుల సమక్షంలో బాలలను సంరక్షణలోకి తీసుకుని రాజంపేట బాలసదన్‌లో చేర్చారు. అయితే.. ఆదివారం కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రసాద్‌బాబు పిల్లల వద్దకు వెళ్లాడు. వాళ్లకు మంచి చెప్పాడు. తాను ఇంక చూడడానికి రాలేనని చెప్పడంతో వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఉదయం రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే..
మదనపల్లె సిటీ: ఎంతో అత్రుతగా ఎదురుచూసే అనపకాయల సీజన్ వచ్చేసింది. మార్కెట్‌ను అనపకాయలతో ముంచెత్తుతుంది. అన్నమయ్య జిల్లాలోని పడమటి మండలాల్లో ఖరీఫ్ సీజన్లో వేరుశనగతో పాటు అనపకాయలు పండిస్తారు. నవంబర్ నుంచి జనవరి చివరి వరకు సీజన్ ఉంటుంది. రామసముద్రం, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం, పీలేరు ప్రాంతాల్లో అనపకాయలు పండిస్తున్న రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. కిలో రూ.30 వంతున విక్రయిస్తున్నారు. అనపకాయలతో చేసే పితికిపప్పు కూర దోసెలు, రాగిసంగటిలో వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. భోజనప్రియులు పితికిపప్పు కూరను ఎంతో ఇష్టంగా తింటారు. సంక్రాంతి వరకు ఘుమఘుమలే అనపకాయలు సంక్రాంతి దాకా విరివిగా లభ్యమవుతాయి. దీంతో ఇళ్లల్లో వారానికి మూడు సార్లయినా పితికిపప్పు రుచి చూడాల్సిందే. కేవలం వర్షా«ధారంగా చేళ్లల్లో పండిన నాటు అనపకాయలు మాత్రమే చాలా రుచిగా ఉంటాయి. వీటిని ముట్టుకోగానే బంకగా ఉండి, వాటి వాసన గంటసేపు ఉంటుంది. అబ్బా దాని రుచే వేరు అనపగింజలను గింజల కూర, చారు, సాంబారు చేస్తారు. అనపకాయలు ఒలిచి గింజలను గిన్నెలో నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు గింజలను పితికి పప్పు కూరలు, చారుగా చేస్తారు. ఉదయమే దోసెల్లో పితికిపప్పు ఇష్టంగా తింటారు. కొందరు పితికిపప్పును ఎండబెట్టి నూనెలో వేపుడు చేసి తింటారు. పొరుగు రాష్ట్రాలకు.. మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో అనపకాయలకు మార్కెట్ ఉంది. రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె, కురబలకోట, వాల్మీకిపురం ప్రాంతాల నుంచి మార్కెట్‌కు రైతులు ప్రతి రోజు సాయంత్రం అనపకాయలు సంచుల్లో తెస్తారు. ఇక్కడి నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి చెన్నై, వేలూరు, బెంగళూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్‌కు ప్రతి రోజు 5 వేల కేజీల అనపకాయలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అనపకాయలకు మంచి డిమాండ్ ఉంది. రుచిగా ఉండటంతో వీటిని బాగా ఇష్టపడతారు. వర్షాలకు పంట దెబ్బతినింది అనపచెట్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పురుగు పట్టడం వల్ల దిగుబడి తగ్గింది. ఎకరాలో అనపపంట సాగు చేశాను. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. – మణి, రైతు, ఒంటిమిట్ట వారానికి రెండు, మూడు సార్లు వండుతా ఇది సీజన్. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే కాయలు. అందుకే మదనపల్లె మార్కెట్‌కు వెళ్లి అనపకాయలు తెచ్చుకుంటా. వారంలో మూడురోజులైనా పితికిపప్పు కూర వండుతాం. పిల్లలు ఇష్టంగా తింటారు. – మంజుల, గృహిణి, సిటిఎం పోషకాలు మెండు ఈ సీజన్లో మాత్రమే లభించే అనపకాయలు, పితికిపప్పు మంచి పోషకాలు ఉంటాయి. క్రిమిసంహారక మందులు లేకుండా వర్షాధారంగా చేలల్లో పంట పండుతుంది. ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. – డాక్టర్ సరస్వతమ్మ, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె -
భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: భారీ వరద వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా పింఛా ప్రాజెక్టును ప్రభుత్వం పునరుద్ధరించనుంది. గతేడాది నవంబర్‌లో వచ్చిన ఆకస్మిక వరదలకు దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును రూ.68.32 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించనుంది. ఇందుకోసం లంప్సమ్ – ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో ఈ నెల 5న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న ఆర్థిక బిడ్‌ను తెరిచి, రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం ముడుంపాడు వద్ద పింఛా నదిపై 1954లో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కుడి కాలువ కింద 2211.31 ఎకరాలు, ఎడమ కాలువ కింద 1562.10 ఎకరాలు మొత్తం 3,773.41 ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ (పిల్ల కాలువలు)లను అభివృద్ధి చేసింది. అప్పట్లో పింఛాకు గరిష్టంగా 58 వేల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో ప్రాజెక్టు నిర్మించారు. గతేడాది నవంబర్ 14 నుంచి నల్లమల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పింఛా నది ఉప్పొంగింది. దాంతో గతేడాది నవంబర్ 18న లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. వరద ధాటికి పింఛా ప్రాజెక్టు రింగ్ బండ్, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పింఛాకు ఎంత వరద వచ్చినా చెక్కుచెదరకుండా ఉండేలా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పింఛాకు గరిష్టంగా వచ్చే వరదపై మళ్లీ అధ్యయనం చేసిన అధికారులు.. రూ.84.33 కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. దాంతో పనరుద్ధరణ పనులకు 68.32 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు టెండర్లు పిలిచారు. -
సత్యప్రమాణాలకు నిలయం.. తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయం
గుర్రంకొండ: నిజం పలికించే బలిపీఠం తరిగొండలోని శ్రీలక్ష్మినరసింహ్వామి ఆలయం. సత్యప్రమాణాలకు నిలయంగా అన్నమయ్య జిల్లాలోని ఏకైక ఆలయంగా శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి ఆలయంలోని సత్యప్రమాణాలు చేసే బలిపీఠం దుర్వాసమహర్షి ప్రతిష్టించాడని పురాణ కథనం. తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణం చేయాలంటే భయపడడం ఇక్కడి ప్రత్యేకత. ఆధునిక సమాజంలో సత్యప్రమాణాల నిలయంగా తరిగొండ శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం విరాజిల్లుతుండడం విశేషం. దుర్వాస మహర్షి ఇక్కడి ఆలయంలో బలిపీఠం ప్రతిష్టించారని పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఆలయం వెలుపల స్వామివారికి ఎదురుగా ఈ బలిపీఠం ఉంది. అత్యంత శక్తివంతమైన శ్రీచక్రయంత్రం పీఠం కింద ఏర్పాటు చేసి బలిపీఠానికి అత్యంత శక్తిని చేకూర్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ బలిపీఠమే కాలక్రమేణా సత్యప్రమాణాలకు నిలయంగా మారింది. బలిపీఠం ముందరే ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు శ్రీవెంగమాంబ ఆలయం ఉంది. ఉమ్మడి రాయలసీమజిల్లాలో కాణిపాకం తరువాత ఎక్కువగా సత్యప్రమాణాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆచారం ప్రకారమే సత్యప్రమాణాలు: ఇక్కడి ఆచారం ప్రకారమే ఎవరైనా సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేసేవారు ముందుగా ఆలయ ప్రాంగణంలోని బావినీటితో స్నానం ఆచరించాలి. తడిబట్టలతో బలిపీఠం వద్దకు చేరుకొని ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం సత్యప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆలయప్రాముఖ్యత, స్వామివారి మహత్యం తెలిసినవారు ఎవ్వరు కూడా తప్పు చేసి ఇక్కడ సత్యప్రమాణం చేసే సాహసం చేయరు. చాలా మంది స్నానాలు చేసి ప్రమాణం చేసే ముందు ఆలయ అర్చకులు చెప్పేమాటలు విని వెనకడగు వేసి నిజం అంగీకరించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. తప్పుడు ప్రమాణాలు చేస్తే వారి వంశం నిర్వీర్యమవుతుందనేది భక్తుల నమ్మకం. ఈ విషయాన్ని దుర్వాస మహాముని ఇక్కడ శాసనం చేసినట్లు ఆలయ అర్చకులు చెబుతుంటారు. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి సత్యప్రమాణాలు చేసేందుకు వస్తుంటారు. దేవుడిపై నమ్మకం ఎక్కువ తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహాస్వామి మీద భక్తులకు, గ్రామస్తులకు నమ్మకం ఎక్కువ. ఆలయంలోని బలిపీఠం మీద సత్యప్రమాణాలు చేయాలంటే తప్పు చేయలేదనే భావన ఉండాలి. ఆధునికంగా ఎంతో టెక్నాలజి అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడి ఆలయంలో సత్యప్రమాణంపై భక్తులకు సడలని నమ్మకం ఉంది. ఎక్కడెక్కడి నుంచో సత్యప్రమాణాలు చేసేందుకు ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. – ప్రకాష్‌రెడ్డి, గ్రామస్తులు, తరిగొండ సత్యప్రమాణం చేయాలంటే భయం తప్పు చేసిన వారు ఇక్కడ సత్యప్రమాణాలు చేయడానికి భయపడతారు. తప్పు చేసి కావాలనే తప్పుగా ప్రమాణం చేస్తే అందుకు తగిన శిక్ష అనుభవిస్తారు. బలిపీఠం గురించి చెప్పే మాటలు విని సాధ్యమైనంత వరకు బలిపీఠం దగ్గరకు వచ్చి చాలా మంది నిజం అంగీకరించి వెనుదిరిగి వెళ్లిపోతుంటారు. ఎలాంటి తప్పు చేయని వాళ్లు మాత్రమే సత్యప్రమాణం చేసేందకు ధైర్యం ఉంటుంది. – గోపాలబట్టర్, ఆలయ అర్చకులు, తరిగొండ -
CM Jagan: చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లెలో బుధవారం సీఎం వస్తున్న దారిలో హమీదా అనే మహిళ తన ఏడాదిన్నర వయసున్న చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని ‘జగనన్నా.. నా బిడ్డను కాపాడన్నా’ అని వేడుకుంది. బస్సులో నుంచి ఆ దృశ్యం గమనించిన సీఎం.. ఆమెను సభాస్థలి వద్దకు పిలిపించారు. ‘అన్నా.. నా కుమారుడు షేక్ మహమ్మద్ అలీ తల రోజు రోజుకూ పెరిగిపోతోంది. వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చూపించాం. తలకు ఆపరేషన్ చేయాలని, చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. మేం పేదోళ్లం. ఎలాగైనా మీరే ఆదుకోవాలి’ అని కన్నీటిపర్యంతమైంది. చిన్నారి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. తక్షణ వైద్య ఖర్చులకు రూ.లక్ష, చిన్నారికి రూ.3 వేల పింఛన్ మంజూరు చేయాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గిరీషా హమీదాకు రూ.లక్ష సాయం అందజేశారు. స్విమ్స్‌లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. చదవండి: జన సునామీ.. మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం -
తొలిసారి అన్నమయ్య జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా విచ్చేస్తున్న సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ గిరీషా.పీఎస్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిలుపునిచ్చారు. జగనన్న విద్యాదీవెన నాలుగో విడత పంపిణీకి సంబంధించి ఈనెల 25న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మదనపల్లెకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ తలశిలరఘురాం, ఎస్పీ హర్షవర్దన్‌రాజు, జేసీ తమీమ్‌అన్సారియా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు సభాస్థలి, హెలిప్యాడ్, రోడ్‌షో ఏర్పాట్లపై పట్టణంలోని టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్, బీటీ కళాశాల గ్రౌండ్స్, చిప్పిలి విజయాడెయిరీ వెనుకవైపు మైదానాలను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో సభా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అన్నమయ్య జిల్లాలో తొలిసారిగా చేస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి అధికారి ఆయా శాఖల పరిధిలో వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం పంపిణీ సభకు టిప్పుసుల్తాన్ మైదానాన్ని ఎంపిక చేశామన్నారు. చదవండి: (ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్ ఏంటి బాబు?) హెలిప్యాడ్, సభావేదిక, బారికేడ్లు, పార్కింగ్ వసతి, ఫైర్‌సేఫ్టీ, భద్రతాసౌకర్యం, ప్రొటోకాల్, విద్యుత్‌సరఫరా, ఆహారం, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వైద్యసదుపాయాలు సమకూర్చాలన్నారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి చేరుకునేంతవరకు సీఎం పర్యటించే రహదారి పొడవునా ప్రతి 100 మీటర్లకు ఒక అధికారిని నియమించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, సభాస్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ వసతులను కల్పించాలని మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీలను ఆదేశించారు. మదనపల్లె సీఎం పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి పర్యవేక్షణ జేసీ తమీమ్‌అన్సారియా, ఆర్డీఓ ఎం.ఎస్.మురళీకి కేటాయించారు. రాజంపేట ఆర్డీఓ కోదండరెడ్డికి హెలిప్యాడ్, రాయచోటి ఆర్డీఓ రంగస్వామికి వేదిక ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిలరఘురాం మాట్లాడుతూ... విద్యాదీవెన కార్యక్రమానికి తక్కువ వ్యవధి ఉన్న నేపథ్యంలో సరైన ప్రణాళికతో పూర్తిస్థాయిలో కార్యక్రమం విజయవంతానికి అధికారులు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీచైర్మన్ శ్రీనివాసులు, ఏపీఎండీసీ చైర్పర్సన్ షమీంఅస్లాం, జెడ్పీటీసీ ఉదయ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, వైస్‌చైర్మన్ జింకా చలపతి, వైఎస్సార్ సీపీ నాయకులు బాబ్జాన్, జబ్బలశ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ రాజ్‌కమల్, జిల్లా ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హార్సిలీ హిల్స్‌తో సూపర్‌స్టార్ కృష్ణకు విడదీయరాని అనుబంధం
తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సూపర్‌స్టార్ కృష్ణకు అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. తాను నటించిన ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. వేసవిలో హార్సిలీహిల్స్‌పై విడిది చేసేవారు. ఇలా హార్సిలీహిల్స్‌తో కృష్ణకు పెనవేసుకున్న కొండంత అనుబంధం సాక్షి పాఠకుల కోసం.. బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌తో సినీనటుడు ఘట్టమనేని కృష్ణకు విడదీయరాని అనుబంధం ఉంది. పర్యాటక, వేసవి విడిది కేంద్రమైన బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై సినిమా షూటింగులకు ఆద్యుడు ఆయనే. చిత్రపరిశ్రమకు హార్సిలీహిల్స్‌ను పరిచయం చేసింది కృష్ణనే. ఆయన రెండో చిత్రం కన్నెమనుసులు 1966లో విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ భాగాలు కొండపైనే చిత్రీకరించారు. ఈ ఏడాదిలో మొదలు పెట్టిన సినిమాల చిత్రీకరణ 1997 వరకు కొనసాగింది. కొండపై తీసిన కృష్ణ మొదటి సినిమా కన్నెమనుసులు కాగా చివరి సినిమా పాతికేళ్ల క్రితం 1997లో ఎన్కౌంటర్ తీశారు. ఆ తర్వాత సినిమాలు చిత్రీకరించనప్పటికి 2007లో ఒకసారి విజయనిర్మల, నరేష్‌తో కలిసి కొండపై ఒక రోజు విడిది చేసి వెళ్లారు. ఆ తర్వాత కృష్ణ ఇక్కడికి రాలేదు. తొలి సెట్టింగ్ గాలిబండపై సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లో కృష్ణ సినిమాల చిత్రీకరణలు జరిగాయి. కృష నటించిన కన్నెమనసులు చిత్రం కోసం గాలిబండపై తొలి సెట్టింగ్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది. వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించగా అందులో ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్ బంగ్లా, దాని ఆవరణలో కృష్ణ, ఇతర నటులతో చివరి భాగం నిర్మించారు. ఈ చిత్రంతో కృష్ణకు కొండతో అనుబంధం ఏర్పడింది. దీని తర్వాత అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం తదితర 25కుపైగా సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. 1997 అగస్టు 14న విడుదలైన ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా అత్యధికభాగంగా, పాటలను నెలరోజులు హార్సిలీహిల్స్ అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మే 31న కొండపై జన్మదినవేడుకలు జరుపుకోగా సతీమణీ విజయనిర్మల, ప్రముఖ నటులు వేడుకలకు హజరయ్యారు. చిత్రీకరణ పూర్తయ్యేవరకు అటవీశాఖ అతిథి గృహాలైన హార్సిలీ సూట్, మిల్క్హౌస్లో విడిది చేశారు. కాగా హార్సిలీహిల్స్‌పై షూటింగ్‌లను ప్రారంభించింది తానేనని, ఆ తర్వాత మిగతా నటులు ఇక్కడికి వచ్చారని ఎన్కౌంటర్ షూటింగ్ సందర్బంగా కృష్ణ చెప్పారు. తాను నటించిన అత్యధిక చిత్రాల షూటింగ్ హార్సిలీహిల్స్లోనే జరిపినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మారనని ప్రకటన 1997 మేనెలలో ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ హార్సిలీహిల్స్‌పై జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మారనని, ఏ పార్టీలో చేరనని, కొత్త పార్టీ పెట్టనని ప్రకటించారు. నెలరోజులు షూటింగ్ కోసం కొండపై ఉన్నారు. ఈ సమయంలో ఆయన తాను రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్‌లో చేరానని, ఆయ న మరణించాక పార్టీలో క్రీయాశీల రాజకీయాల్లో ఉండలేనని చెప్పారు. ఓసేయ్ రామ్ములమ్మ సినిమాలో కొన్ని వ్యవస్థల తీరుపై కృష్ణ వ్యాఖ్యలపై ఆయన విజయశాంతితో కలిసి పార్టీ పెట్టబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయన అప్పట్లో అన్న మాటకు చివరిదాకా కట్టుబడ్డారు. సతీమణీ విజయనిర్మల టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసినా అండగా నిలవలేదు. అతిథిగృహం కోసం ప్రయత్నం నటుడు కృష్ణ ప్రతివేసవి ఊటీలో గడుపుతారు. అయితే హార్సిలీహిల్స్‌పైనా అతిథిగృహం ఉండాలని కృష్ణ ఆశించారు. దీనికోసం 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చారు. ఇక్కడి సొసైటీ స్థలాలను పరిశీలించారు. శరత్‌బాబుకు చెందిన అసంపూర్తి అతిథిగృహం చూశారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. అతిథిగృహం నిర్మించుకోలేకపోయారు. మదనపల్లె అంటే భలే అభిమానం మదనపల్లె సిటీ: సూపర్‌స్టార్ కృష్ణకు మదనపల్లె అంటే ఎంతో అభిమానం. 1962లో కృష్ణ, విజయనిర్మల నటించిన రక్తసంబంధం సినిమా విజయోత్సవ సభకు మదనపల్లెకు వచ్చారు. స్థానిక పంచరత్న టాకీసులో సినిమా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పంచరత్న టాకీసు అధినేత బాబా వరప్రసాద్ ఇంటికి వెళ్లి అతిథ్యం స్వీకరించారు. 1976లో పాడిపంటలు సినిమా విజయోత్సవాలకు కూడా హాజరయ్యారు. కృష్ణ మృతితో పట్టణంలోని అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో... 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండులో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. విగ్రహం మార్పుపై వైవీయూ వీసీ క్లారిటీ
సాక్షి, వైఎస్సార్ కడప: యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహ ఏర్పాటుని రాజకీయం చేయొద్దని యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి కోరారు. న్యాక్ గ్రేడింగ్‌లో యూనివర్శిటీ అభివృద్ధి చూసే ఏ గ్రేడ్ ఇచ్చారని తెలిపారు. అభివృద్ధి పనులలో భాగంగానే వేమన విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరుతో ఉన్న యూనివర్శిటీ కాబట్టి ప్రధానం ద్వారం వద్ద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 'ఎవరికీ ఇబ్బంది లేకుండా వేమన విగ్రహాన్ని మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశాము. యూనివర్సిటీ స్థాపకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనుక ఖాళీ అయిన వేమన విగ్రహ స్థలంలో వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టాము. కొత్త విగ్రహాలు ఏవీ తీసుకుని రాలేదు.. ఉన్న విగ్రహాలనే వేరేచోట మార్చడం జరిగింది. నూతన వైఎస్సార్ పరిపాలన భవనం అని పేరు పెట్టినందున వలన అక్కడే ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశాం' అని వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి తెలిపారు. చదవండి: (యోగివేమన విశ్వవిద్యాలయంకు ‘విశ్వ’ఖ్యాతి) -
Balaji Division: బాలాజీ పట్టాలెక్కేనా!
సాక్షి, రాజంపేట: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించడంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నా తమ చిరకాల వాంఛ నెరవేరలేదనే భావన ఉమ్మడి వైఎస్సార్ జిల్లా రైలు ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులను వేధిస్తోంది. కొత్త జోన్ ఏర్పడిన తరుణంలో కొత్త డివిజన్‌గా యేళ్లతరబడి ప్రతిపాదనలో ఉన్న బాలాజీ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. తూర్పుకోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్లో కొంతభాగం విశాఖ రైల్వేజోన్‌లో కలపడం కన్నా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌గా చేయాలని సీమ వాసుల నుంచి కేంద్రానికి వినతులు వెళుతున్నాయి. గుంతకల్‌కు వెళ్లాలంటే దూరాభారం... తరచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసి విశాఖజోన్‌లో కలిపితే బాగుంటుందని రైల్వే నిపుణులు అంటున్నారు. ఆ దిశగా ఎంపీలు రైల్వేమంత్రిత్వశాఖపై వత్తిడి తీసుకురావాలని సీమవాసులు కోరుతున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే.. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96 కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39 కి.మీ), పాకాల–మదనపల్లె (83 కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102 కి.మీ)లైను గుంటూరు డివిజన్‌లోకి విలీనం చేయాలని పరిశీలించారు. కాగా జిల్లా మీదుగా వెలుగొండ అడవుల్లో నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్‌లోకి వెళ్లింది. కొత్తడివిజన్ ఏర్పడితే నందలూరుకు పూర్యవైభవం.. కొత్త డివిజన్ ఏర్పడితే బ్రిటీషు కాలం నాటి రైల్వేకేంద్రానికి పూర్వవైభవం సంతరించుకుంటుంది. బాలాజీ డివిజన్ కేంద్రానికి దగ్గరలో ఉన్న రేణిగుంట జంక్షన్ తర్వాత నందలూరు రైల్వేకేంద్రం రైల్వేపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. డివిజన్‌కు రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా రాజ్యసభలో నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వేపరిశ్రమ వస్తే గుంతకల్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుందని రైల్వే ఉన్నతాధికారులు భావించినట్లు తెలుస్తోంది. విశాఖ జోన్ ఏర్పడిన నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వరకు బాలాజీ డివిజన్‌గా ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు పాలకులు నడుం బిగించాలని పలువురు కోరుతున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరం బాలాజీ డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖజోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజన్ ఉంటుంది. డివిజన్ కావడానికి అన్ని అర్హతలు బాలాజీ డివిజన్‌కు ఉన్నాయి. అందరికి ఉపయోగకరం. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా అడుగులు వేయాలి. –షేక్ కమాల్‌బాషా, మాజీ కార్మికనేత, రైల్వే మజ్దూర్ యూనియన్ దశాబ్దాల నుంచి బాలాజీ డివిజన్ ప్రతిపాదన బాలాజీ డివిజన్ ఏర్పాటైతే నందలూరుకు మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నట్లే. రైల్వేపరిశ్రమ పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. బాలాజీ డివిజన్లో రేణిగుంట తర్వాత ప్రాముఖ్యత కలిగిన రైల్వేకేంద్రం నందలూరు. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది. –పులి భాస్కరయ్య, రిటైర్డ్ లోకోపైలెట్, నందలూరు బాలాజీ డివిజన్‌ను బలపరచాలని ఎంపీలను కోరుతాం విశాఖ జోన్ ఏర్పాటు నిర్ణయం శుభపరిణామం. ఈ నేపథ్యంలో బాలాజీ డివిజన్ ప్రతిపాదనను బలపరచాలని ఎంపీలను కోరతాము. గుంతకల్ కారణంగా నందలూరుకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. బాలాజీ డివిజన్ ఏర్పాటు వల్ల నందలూరుకు పూర్వవైభవం వస్తుందని రైల్వేనిపుణులు చెబుతున్నారు. –సయ్యద్‌అమీర్, వైఎస్సార్సీపీ, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య ప్రధాన రైల్వేకేంద్రం: నందలూరు ప్రధాన స్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె ఉమ్మడి వైఎస్సార్ జిల్లా మీదుగా నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్) గూడ్స్రైళ్లు: 40 స్టేషన్లు: 25 కార్మికులు: 4000 కిలోమీటర్లు: 180 -
మార్కెట్లో భారీగా పతనమైన టమాట ధరలు
సాక్షి, గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా): మార్కెట్లో టమాట ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అత్యధికంగా రూ.15 వరకు పలుకుతోంది. వారం రోజుల్లో సగానికిపైగా తగ్గిపోయాయి. బయట రాష్ట్రాల్లో టమాట దిగుబడి ప్రారంభం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల క్రితం కిలో రూ. 36 ఉండేది. ఈసీజన్లో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 14వేల ఎకరాల్లో టమాట సాగు చేశారు. పదిహేనురోజుల కిందట 25 కేజీల క్రీట్ రూ. 900 నుంచి రూ.750 వరకు ధర పలికింది. ప్రస్తుతం వారం రోజులుగా మార్కెట్లో 15కేజీల టమాటా క్రీట్ ధర రూ. 185 కాగా 25కేజీల క్రీట్ ధర రూ. 375 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం మొదటిరకం టమాటాకిలో రూ.15, రెండోరకం కిలోరూ.8, మూడో రకం రూ.5 వరకు ధరలు పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి మార్కాపురం, నరసరావుపేట, విజయవాడ, గుంటూరు, తమిళనాడు, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లకు ఇక్కడి టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దిగుబడులు ఊపందుకున్నాయి. అక్కడి మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 300 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతి చేసే టమాట ధరలు పతనం కావడంతో వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో బయట రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేశారు. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గు ముఖం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు.. ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్సులు, అమ్మాయిల నృత్యాలు హోరెత్తాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మత్తెక్కించే, హుషారైన ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్లో జరిపిన వేడుకల్లో నడిరోడ్డుపైనే కార్యక్రమాలు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే నాయకులు, అభిమానులు, కార్యకర్తల కోసం మాజీ ఎమ్మెల్యే రమేష్ ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్సులు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయి. -
టెర్రకోట కళకు ఆధునికత అండ.. అరగంటలో మట్టి సిద్ధం!
కురబలకోట: ఆశావాదికి ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్ కమ్ చెబుతుందంటారు. అన్నమయ్య జిల్లా కుమ్మరుల జీవితాల్లో అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం ఆనాటి పెద్దలు మట్టితో కుండలు, కడవలు, బానలు, వంట పాత్రలు తయారు చేసి ఎడ్లబండిపై ఊరూరా తిరిగి అమ్మేవారు. వచ్చిన దాంతో కాలం వెళ్లదీసేవారు. అల్యూమినియం, ఇతర వంట పాత్రలు మార్కెట్లోకి రావడంతో కుమ్మరుల నుంచి మట్టి కుండలు, పాత్రలు కొనేవారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆనాటి రిషివ్యాలీ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ విక్రమ్ పర్చూరే వీరి పాలిట ఆశాజ్యోతిగా మారారు. ఆయనే రాష్ట్రంలో టెర్రకోట ప్రక్రియకు ఆద్యుడని చెప్పకతప్పదు. తొలుత కురబలకోట మండలంలోని దుర్గం పెద్ద వెంకట్రమణ, అసనాపురం రామయ్యలకు ఈయన టెర్రకోట ప్రక్రియలో కుండలు, బొమ్మలు చేయడం నేర్పించాడు. వారి ద్వారా ఇవి వారసత్వంగా ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సీటీఎం, ఈడిగపల్లె, సదుం, కాండ్లమడుగు, కుమ్మరిపల్లె తదితర ప్రాంతాల్లో ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు వంట ఇంటకే పరిమితమైన ఇవి నేడు నట్టింట ఇంటీరియర్ డెకరేటివ్గా మారాయి. పల్లెలు, సంతల్లో అమ్ముడయ్యే ఇవి ఇప్పుడు ఎంచక్కా హైవేపక్కన కొలువు దీరాయి. నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. మట్టితో ఎన్నో కుండలు, బొమ్మలు చేస్తూ కొత్త కళ తెప్పిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలలో తిష్ట వేశాయి. పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా ఇవి చోటు సంపాదించుకున్నాయి. ఎగ్జిబిషన్లలో ఆకట్టుకుంటున్నాయి. అదే మట్టి అదే కుమ్మరులు.. కానీ మారిందల్లా పనితనమే. రూపం మార్చారు. దీంతో విలువ పెరిగింది. ఇందుకు ఆధునిక మిషన్లు ఆయుధంగా మారాయి. ఇదే వారికి సరి కొత్తదారిని చూపింది. తక్కువ సమయంలో ఎక్కువ తయారు చేసుకోగలుగుతున్నారు. కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు. కురబలకోట, సీటీఎంకు చెందిన ముగ్గురికి టెర్రకోట కళలో రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వరించాయి. అన్నమయ్య జిల్లాకే మకుటాయమానంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కూడా ఇవి నిలుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 652 కుటుంబాల దాకా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పేదరికం జయించి జీవన ప్రమాణాలు పెంచుకున్నాయి. జీవన శైలి కూడా మారింది. ఆధునిక మిషన్లతో తగ్గిన శ్రమ పెద్దల కాలం నుంచి మట్టి పిసికి కాళ్లతో తొక్కి సిద్ధం చేసేవారు. దీని వల్ల శారీరక శ్రమ ఎదురయ్యేది. ఒక రోజంతా మట్టి సిద్ధం చేసుకుని మరుసటి రోజున పని మొదలుపెట్టేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ ద్వారా వివిధ రకాల మిషన్లను వీరికి ఉచితంగా అందజేసింది. దీంతో సునాయాసంగా కుండలు, బొమ్మలకు కావాల్సిన మట్టిని సిద్ధం చేసుకోగలుతున్నారు. దశాబ్దాలుగా సారెపై వీటిని చేసేవారు. దీని స్థానంలో పాటరీ వీల్‌ను ఇచ్చారు. ఇది రూ.16 వేలు. కరెంటుతో నడుస్తుంది. కూర్చునే పనిచేయవచ్చు. చక్రం తిప్పే పనిలేదు. ఆన్/ఆఫ్ బటన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ప్లగ్ వీల్ అనే మరో మిషన్ కూడా ఇచ్చారు. ఇందులో మట్టి వేస్తే అది కుండలు, బొమ్మలు చేయడానికి అనువుగా మట్టి ముద్ద తయారై వస్తుంది. ఇది రూ.33 వేలు. వీటికి తోడు కొత్తగా క్లే మిక్సర్ రోలర్ మిషన్ వచ్చింది. ఇది రూ.75 వేలు. మట్టి ఇందులో వేస్తే ఇసుక, రాళ్లు లాంటివి కూడా పిండిగా మారి బొమ్మలు, కుండలకు అనువుగా మట్టి తయారవుతుంది. ఇదివరలో మట్టిని సిద్ధం చేసుకోడానికి రోజంతా పట్టేది. ఈ మిషన్‌తో ఇప్పుడు అరగంటలో మట్టి సిద్ధం అవుతోందని టెర్రకోట కళాకారులు సంతోషంగా వెల్లడిస్తున్నారు. ఈ మిషన్లను డీఆర్డీఏ కళాకారులకు ఉచితంగా అందజేసింది. సీఎఫ్‌సీ సెంటర్లు కూడా కట్టించి ఇచ్చారు. టెర్రకోటతో కొత్త బాట టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్థం. కుండలు, బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చే ప్రక్రియనే టెర్రకోటగా వ్యవహరిస్తున్నారు. పెద్దల కాలంలో సాధారణ మట్టి కుండలు చేసే మాకు టెర్రకోట కొత్త బతుకు బాట చూపింది. వీటిలో ప్రావీణ్యం సాధించిన మేము దేశ విదేశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. మాకు ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ వృత్తే ఆధారం. కొత్త జీవనం, కొత్త జీవితాన్ని ఇచ్చింది. – దుర్గం మల్లికార్జున, టెర్రకోట కళాకారుల సంఘం నాయకులు, అంగళ్లు 70 శాతం కష్టం తగ్గింది ఈ మిషన్ల ద్వారా 70 శాతం శారీరక కష్టం తగ్గింది. ఇదివరలో మట్టిని.. శుభ్రం చేయడం, నీళ్లు చల్లి కాళ్లతో తొక్కి సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యే లేదు. మిషన్లతో మట్టిని ముద్ద చేయడం, కుండలు, బొమ్మలకు అనువుగా మట్టిని మార్చుకోవడం ఇప్పుడు గంటలో పని. అధునాతన మిషన్లు మా వృత్తిని సులభతరం చేశాయి. నాణ్యత, నవ్యత పెరిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తక్కువ సమయంలో ఎక్కువ కుండలు, బొమ్మలు తయారు చేసుకోగలుగుతున్నాం. నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా సంపాదించుకోగలుగుతున్నాం. – రాజగోపాల్, రాష్ట్ర అవార్డు గ్రహీత, అంగళ్లు వీటికే ఎక్కువ డిమాండ్ టెర్రకోట కళ గురించి తెలియని వారు అరుదు. 250 రకాలు కుండలు, బొమ్మలు చేస్తున్నాం. వీటిలో మట్టి వంట పాత్రలకు అధిక డిమాండు ఉంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. మట్టి పాత్రల్లో వంట శ్రేష్టమని భావిస్తున్నారు. దీంతో వీటికి గిరాకీ పుంజుకుంటోంది. వివిధ నగరాల హోటళ్లకు కూడా బిర్యానీ కుండలు వెళుతున్నాయి. వీటి తర్వాత ఇంటిరియర్ డెకరేటివ్ పార్ట్స్‌కు, ఆ తర్వాత గార్డెన్ ఐటెమ్స్‌కు ఆదరణ ఉంటోంది. 80 శాతం వీటినే ఆదరిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కుండలు, బొమ్మలు చేస్తున్నాం. బతుకుతెరువుకు ఏ మాత్రం ఢోకా లేదు. – డి.కళావతి, టెర్రకోట హస్తకళాకారిణి, అంగళ్లు -
అన్నమయ్య జిల్లా పీలేరులో వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ
-
సర్పంచులుగా ఉన్నా వీడని వృత్తులు.. సాదాసీదాగా జనంతో మమేకం
బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా): సాధారణంగా చిన్న పదవికే డాబు, దర్పం ప్రదర్శించేవాళ్లను చూస్తుంటాం. ఆ పదవితో చేస్తున్న వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుని అవతారం ఎత్తేస్తారు. అయితే గ్రామానికి ప్రథమపౌరులై ఉండి, మన దేశంలో ప్రధానికైనా లేని చెక్‌పవర్ కలిగిన సర్పంచులు సాదాసీదాగా, చేస్తున్న వృత్తికే అంకితమై ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము సర్పంచులం, మనకొక హోదా, గుర్తింపు, సమాజంలో, అధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉందన్న అహం కొందరిలో మచ్చుకైనా కనిపించడం లేదు. సర్పంచులు కాక ముందు ఏ వృత్తిలో ఉండి జీవనం సాగించేవాళ్లో ఇప్పుడూ వాటినే కొనసాగిస్తూ పంచాయతీ ప్రజల్లో మన్ననలు పొందుతున్నారు. సర్పంచు అయ్యాక మనోడు మారలేదు అనుకునేలా అందరితో కలిసిపోతూ మమేకమవుతున్నారు. అలాంటి సర్పంచుల్లో కొందరి గురించి... మోటర్ మెకానిక్‌గానే... అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళెంకు చెందిన సి.జయరామిరెడ్డి వైఎస్సార్సీపీ మద్దతుతో నాయనబావి సర్పంచుగా పోటీ చేసి అధిక మెజార్టితో గెలుపొందారు. అప్పటివరకు వ్యవసాయ మోటార్లకు రిపేర్లు చేసే మెకానిక్‌గా గ్రామస్తులకు పరిచయం. సర్పంచు పదవితో రాజకీయాల్లో బీజీ అయిపోతాడని గ్రామస్తులు భావించారు. డిగ్రీ ఫైయిల్ అయిన జయరామిరెడ్డి భిన్నంగా ఉన్నాడు. సర్పంచు పదవి ఇప్పుడొచ్చింది, నాకు జీవితాన్నిచ్చిన వృత్తిని వదిలేదిలేదని నిక్కచ్చిగా చెప్పేశాడు. సర్పంచుగా అధికారుల సమావేశాలకు హజరువుతూ, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మోటార్ల రిపేరు పనిని కొనసాగిస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం పెద్దమండ్యం మండలం కోటకాడపల్లె సర్పంచు కే.భూదేవి చదివింది ఐదో తరగతి. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఆమె సర్పంచు అయింది. భర్త పెద్దరెడ్డెప్పకి ఒకటిన్నర ఎకరా పొలం, అందులో బోరు ఉంది. మొదటినుంచి మహిళా రైతుగా వ్యవసాయం చేస్తోంది. కోటకాడపల్లె సర్పంచు పదవికి పోటీచేసి గెలుపొందినా ఆమె రైతు జీవితాన్ని వీడలేదు. సర్పంచుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రోజూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. తాను గ్రామానికి ప్రథమ పౌరురాలిని అన్న దర్పం చూపకుండా టమాట, వేరుశెనగ పంటల సాగు పనులు చేస్తున్నారు. మహిళా సర్పంచు అయినప్పటికి మహిళా రైతు జీవితాన్ని వీడలేదు. పదవిలో రాణిస్తూ.. వృత్తిలో కొనసాగుతూ.. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె సర్పంచుగా పదో తరగతి చదివిన ఓ సాధారణ బోర్ మెకానిక్ ఎస్.మౌలాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పైసా ఖర్చు లేకుండా ఏకగ్రీవమంటే ఆ సర్పంచు డాబు చూపాల్సిందే. అయితే ఈయన సర్పంచుగా కంటే బోర్ మెకానిక్‌గానే గుర్తింపు కోరుకొంటున్నాడు. పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఈయన ఈ ప్రాంతంలో బోర్లలో మోటార్లను వెలికితీయడం, కాలిపోయిన మోటార్లకు వైండింగ్ పనులు చేస్తున్నారు. సర్పంచుగా విధులు నిర్వర్తిస్తూనే మెకానిక్ పని చేస్తున్నాడు. తన వృత్తికి సర్పంచు పదవి అడ్డంకికాదని, అందరూ తనను మెకానిక్‌గానే అభిమానిస్తారని అంటున్నాడు మౌలాలి. సమస్యలు పరిష్కరిస్తూ.. దుకాణం నడుపుతూ.. బి.కొత్తకోట మండలం కనికలతోపుకు చెందిన ఆర్.రుక్మిణి ఇంటర్ ఫెయిల్. తుమ్మణంగుట్ట సర్పంచు పదవి జనరల్ మహిళ కావడంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. భర్త అమరనాథరెడ్డితో కలిసి చిల్లర దుకాణం, చికెన్ సెంటర్ నడుపుతూ వస్తున్నారు. సర్పంచుగా గెలుపొందినా వృతిని వీడలేదు. సర్పంచుగా సమావేశాలకు హజరవుతూ, పల్లెల్లో పర్యటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అయినప్పటికి సాధారణ గృహిణిలా, దుకాణంలో పనులు చేసుకుంటూ కనిపిస్తారు. (క్లిక్: ఆ నిబంధనతో పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్య..) -
బైక్‌లోకి దూరిన పాము.. బండి స్టార్ట్ చేయగానే బుసలు కొట్టుకుంటూ..
సాక్షి, వైఎస్సార్ కడప: సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్ రూం, షూలలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో పాము కలకలం రేపింది. చిన్నమండెం మండలం బోనమల ఎంపీటీసీ వెంకటప్పనాయుడు పని నిమిత్తం బైక్‌లో మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాడు. వాహనాన్ని ఆవరణలో నిలబెట్టి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చిన ఆయనతో స్థానికులు బైక్‌లో పాము దూరిందని ఆయనకు తెలియజేశారు. సీటు తీసి పరిశీలించగా పాము కనిపించలేదు. వాహనాన్ని స్టార్ట్ చేసి పక్కన వేచి ఉండగా శబ్దానికి బైక్‌లో నుంచి పాము బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. దీంతో స్థానికులు దానిని కొట్టి చంపారు. -
కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్: డబ్బులు ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!
చక్రాయపేట మండలానికి చెందిన కరోనా బాధిత కుటుంబానికి ఫలానా వారు ఫోన్ చేస్తారని ఆశా వర్కర్ తెలియజేశారు. కొద్దిసేపటిలోనే సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసి వివరాలన్నీ తీసుకున్నారు. అయితే బా«ధిత కుటుంబీకుల ఖాతాలో సొమ్ములు లేకపోవడంతో మీ సంబంధీకులతో మాట్లాడించాలని సూచించారు. దీంతో వీరబల్లి మండలానికి చెందిన బంధువుతో మాట్లాడించగా, వారి వివరాలు కనుగొని ఖాతా నుంచి సుమారు రూ. లక్ష వరకు సులువుగా దోచేశారు. సాక్షి రాయచోటి : అవకాశం దొరికితే ఎవరినైనా బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇంతకుమునుపు ఇంగ్లీషులోనో...హిందీలోనో మాట్లాడుతూ మనుషులను ఏదో ఒక రకంగా మాయ చేసి సొమ్ము కాజేసేవారు. ఈజీగా మనీ సంపాదించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒకసారి ఈకేవైసీ, మరోసారి బ్యాంకులో సాంకేతిక సమస్య ఇలా చెబుతూ పోతే అనేక సమస్యలు వెతికి బా«ధితులను బుట్టలో వేసుకుంటున్న మాయదారి మోసగాళ్లు కొత్త తరహా మోసానికి తెర తీశారు. బాధితులు నమ్మరన్న సాకుతో ఆశా వర్కర్లతోనే ఫలానా వారు ఫోన్‌చేస్తారని చెప్పించి.. తర్వాత వీడియో కాల్ చేసి తెలుగులో మాట్లాడుతూ సొమ్ములు వేస్తున్నామని చెప్పి వివరాలు రాబట్టి అకౌంటులో ఉన్న మొత్తాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల అధికమయ్యాయి. కరోనా సొమ్ము పేరుతో టోకరా నాలుగైదు రోజులుగా అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో కలెక్టరేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ముందుగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లేదా వలంటీర్లకు ఫోన్ చేసి కరోనాతో మృతి చెందిన వారికి సంబంధించి పరిహారం (ఇన్‌స్రూెన్స్) వచ్చిందని నమ్మబలుకుతున్నారు. అయితే సైబర్ నేరస్తులు కలెక్టరేట్ పేరు చెప్పడంతో నిజంగా నమ్మి బాధిత కుటుంబాలకు పరిహారం సొమ్ము వచ్చిందని భావించి వివరాలు అందిస్తున్నారు. అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు సంబంధిత ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్లతోనే బాధితులకు ఫోన్ చేయించి ఫలానా వారు ఫోన్ చేసి వివరాలు అడుగతారని, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నేరుగా బాధితులకు ఫోన్ చేసి వివరాలు అడగడంతోపాటు వీడియో కాల్ చేసి తెలుగులో మాట్లాడుతూ మేము చెప్పిన విధంగా అప్లోడ్ చేయాలని బాధితులను పక్కదారి పట్టిస్తున్నారు. అందులోనూ మీ అకౌంటులో కొంత మొత్తం ఉంటేనే ఈ పరిహారం సొమ్ము పడుతుందని చెప్పి.. వీడియో కాల్‌లోనే ఓటీపీ అడిగి తీసుకుని సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు వైఎస్సార్ జిల్లాలో కనిపించాయి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. రోజుకో మోసం ప్రజలకు సంబంధించి ఏదో ఒక సమస్యపై సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రకంగా మోసం చేస్తున్నారు. అప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. చివరకు కరోనాతో కుటుంబీకులను కోల్పోయిన బాధితులను కూడా పరిహారం డబ్బుల ఆశ పేరుతో మోసం చేస్తున్నారు. వివరాలు, ఇతరత్రా చెప్పకపోతే సొమ్ములు రావేమోనన్న భయంతో అప్పటికప్పుడు బాధితులు వారు అడిగివన్నీ తెలియజేస్తూ దారుణంగా మోసపోతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుశాఖ కూడా సీరియస్‌గా దృష్టి సారించింది. వీడియో కాల్లో తెలుగులో మాట్లాడుతూ మోసం చేస్తున్న వైనంపై ఇప్పటికే గ్రామీణ స్థాయిలో మహిళా పోలీసులతోపాటు పోలీసుస్టేషన్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మనల్ని మనం కాపాడుకునే ఆయుధం పెట్టుకోవాలి మనం ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటికి తాళం వేస్తాం. ఒకటి, రెండుసార్లు సరిగా వేశామో, లేదో తనిఖీ చేసి బయటికి వెళతాం. అలాగే సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం) ఫోన్ పాస్‌వర్డ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తేలికైన పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్ల చేతికి తాళాలు మనమే ఇచ్చినట్లుగా భావించాలి. పుట్టిన తేదీ, పెళ్లిరోజు, పిల్లలు, భాగస్వామి పేరు లాంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినప్పుడు వెంటనే చెక్ చేయడం ద్వారా ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. పాస్వర్డ్ ఎనిమిది అంకెలకు తక్కువ లేకుండా అక్షరాలతోపాటు నంబర్లు, గుర్తులను పెట్టుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ మార్చుకుంటే మంచిది. కరోనా ఆర్థికసాయం పేరుతో కాల్స్ వస్తే నమ్మరాదు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందని నైబర్ నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. అలాంటి ఫేక్ కాల్స్ నమ్మరాదు. ఈ విధంగా కరోనా పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడి పలువురు మోసపోయినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా బారినపడి మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికసాయం అందించే యాప్‌లుగానీ, లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. బ్యాంకు ఖాతాలో కనీసం రూ. 50 వేలు ఉండాలని చెబుతూ సదరు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెబితే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి మోసగిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసినా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరాదు. -
Guvvalacheruvu Palakova: గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్!
సాక్షి రాయచోటి: గువ్వలచెరువు పాలకోవా.. నోటి తీపికే కాదు.. ఊరూరా గుర్తింపు పొందింది. రాష్ట్రాలే కాదు.. ఖండాతరాలు దాటి వెళుతోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని అనేక మంది ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. అక్కడ కూడా గువ్వలచెరువు పాలకోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల కాలం నుంచి ఇక్కడివారు పాలకోవా తయారు చేస్తూ రుచిలో శుచిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గువ్వల చెరువు మెయిన్‌రోడ్డు మీద ఉండే 60 షాపులే కాకుండా గ్రామంలో పాలకోవాను తయారు చేసే బట్టీలు 15 వరకు ఉన్నాయి. కోవా అనగానే గువ్వలచెరువు నుంచి తెచ్చారా? అనడం చూస్తే ఆ కోవాకు ఎంతటి గుర్తింపు ఉందో అర్థమవుతుంది. ప్రతిరోజు ఐదు వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా... 2000 కిలోల వరకు పాలకోవాను తయారు చేసి విక్రయిస్తుంటారు. గువ్వల చెరువు గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉంది. అధికభాగం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు నాయుళ్లు, వడ్డెర, గిరిజన కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. గ్రామంలో తరతరాల నుంచి అంటే దాదాపు వందేళ్లకు పైగా కోవా తయారు చేస్తూ వస్తున్నారు. ప్రతినిత్యం 100 కుటుంబాల వారు కోవా తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్ కావడంతో జీవనోపాధిని వదులుకోలేక కొనసాగిస్తున్నారు. తయారు చేసే సమయంలో కూడా అనేక రకాల కష్టాలు ఉన్నాయి. గోలాల్లో పాలు పోసి ఐదు గంటలపాటు వేడి చేసే సమయంలో విపరీలమైన వేడి పొగతో కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం, మంటకు గురికావడం జరుగుతుంది. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపైన గ్రామం ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు గువ్వల చెరువు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో పదుల సంఖ్యలో లారీలో ఆగి ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, మహరాష్ట్ర, పంజాబ్, కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లే లారీల వారు పాలకోవాను ఆర్డర్లపై తీసుకెళుతుంటారు. అంతేకాకుండా కువైట్, సౌదీ అరేబియా, మస్కట్, ఖత్తర్, దుబాయ్, బెహరీన్ తదితర దేశాలకు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా పాల కోవాను ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. పాలకోవా సుదీర్ఘకాలంపాటు నిల్వ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర దేశానికి తరలిస్తుంటారు. దీని తయారీకి అవసరమైన పాలను తయారీదారులు ప్రత్యేకంగా ఆటోల ద్వారా పీలేరు, రాయచోటి, మదనపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. పాలకోవాను గ్రామంలో బట్టీల వద్ద తయారు చేసిన అనంతరం పెద్దపెద్ద పాత్రలలో రోడ్డుపై ఉన్న షాపులకు సరఫరా చేస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా రుచికరంగా మంచి గుర్తింపు ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళుతుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు 15 ఆటోల ద్వారా వివిధ జిల్లాలకు కూడా తీసుకెళ్లి విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో వెళుతున్న జాతీయ నేతలైన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతోపాటు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సైతం గువ్వుల చెరువు పాలకోవా రుచిచూసి మెచ్చుకున్నట్లు పలువురు గ్రామస్తులు తెలియజేశారు. తయారీ విధానం పాలకోవాను తయారీదారులు ముందుగా పాలను తీసుకొచ్చి పెద్ద గోలాల్లో వేసిసుమారు ఐదు గంటలపాటు మరగబెడతారు. ఒకవైపు గరిటెతో కలియబెడుతూ చిక్కదనం కోసం పొంగు రాకుండా చూసుకుంటారు. పాలు బాగా మరిగిన తర్వాత చక్కెర, ఇతర పదార్థాలు వేసి మరో అరగంట నుంచి గంటపాటు వేడి చేస్తారు. తద్వారా పాలకోవా రూపుదిద్దుకుంటుంది. అవసరమైన కట్టెలనుకూడా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తీసుకొస్తారు. గోలంలో పాలు ఉడికిస్తున్న ఇతని పేరు షేక్ జమాల్‌వలి. గువ్వలచెరువు గ్రామం. ఎన్నో ఏళ్ల నుంచి పాలకోవా తయారు చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి పాలను ప్రత్యేకంగా ఆటోలో క్యాన్ల ద్వారా పీలేరు, మదనపల్లె, రాయచోటిలకు వెళ్లి తెచ్చుకుంటారు. ఈ ప్రాంతానికి చెందిన వారు అధికంగా ఇతర దేశాల్లో చాలా మంది ఉండడంతో అక్కడకి తీసుకెళ్లేందుకు ఆర్డర్లు ఇస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు, ప్రొద్దుటూరు, కడప, మదనపల్లె, రాజంపేట, రాయచోటితోపాటు వివిధ ప్రాంతాల్లోని బేకరీలకు కూడా గువ్వలచెరువు నుంచే పాలకోవాను పంపిస్తుంటారు. (క్లిక్: వెయ్యేళ్ల చరిత్రకు పూర్వ వైభవం.. నాడు రాజుల నేతృత్వంలో.. నేడు సీఎం హోదాలో!) కల్తీ లేని కోవా కల్తీ లేకుండా నాణ్యమైన పాలకోవా అందిస్తాం. ఇక్కడి పాలకోవా మంచి రుచికరంగా ఉంటుంది. గ్రామంలో తయారు చేసి దుకాణాలకు ఆర్డర్లపై అందజేస్తారు. సుమారు 100 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సరుకు తీసుకెళుతుంటారు. – అబ్దుల్ మతిన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు వ్యాపారం బాగుంది పాలకోవాను నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడ ఆగుతాయి. కార్లలో ప్రత్యేకంగా వచ్చి కోవాను తీసుకెళుతుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీల డ్రైవర్లు, క్లీనర్లు కూడా తీసుకెళతారు. ప్రతిరోజు మా షాపులో రూ. 4 వేల వరకు వ్యాపారం జరుగుతుంది. పదిహేనేళ్ల నుంచి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాం. – పఠాన్ అజీజ్‌ఖాన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్‌గా పోలీసులకు పట్టించిన భార్య
మదనపల్లె టౌన్(అన్నమయ్య జిల్లా): భర్త వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్న భార్యపై భర్త, అతని స్నేహితురాలు, అత్తమామలు దాడి చేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె మండలం కొత్త ఇండ్లు (రంగారెడ్డి) కాలనీలో కాపురం ఉంటున్న ఎం.శంకప్పనాయుడు, సుశీలమ్మ కుమారుడు ఎం.బాలప్రసాద్‌కు కర్ణాటక రాష్ట్రం కోలారు బేత మంగళంలోని శ్యామరహల్లికి చెందిన ఎం.సుధతో 2014లో పెళ్లి జరిగింది. చదవండి: ‘అక్కా.. అమ్మ నాన్నను బాగా చూసుకో, సారీ మీ మాట విననందుకు’ వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి సంసారం కొంత కాలం సజావుగా సాగింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పట్నుంచి భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధించి చిత్రహింసలు పెట్టి పుట్టింటికి తరిమేశాడు. భార్య పుట్టింటిలో ఉండగా మండలంలోని బండకిందపల్లెకు చెందిన ఓ మహిళను ఇంట్లో ఉంచుకుని సహజీవనం సాగిస్తున్నాడు. సుధ రూరల్ పోలీసులను ఇంటికి తీసుకెళ్లి భర్తతోపాటు అతనితో సహజీవనం చేస్తున్న స్నేహను పట్టించింది. దీంతో రెచ్చిపోయిన భర్త, స్నేహ, అత్తమామలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. -
AP: పెళ్లింట విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి.. ఏం జరిగింది?
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే దారుణం జరిగింది. శోభనం గదిలోనే వరుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. మదనపల్లెలో తులసీప్రసాద్, శిరీషకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో, సోమవారం వీరికి పెళ్లి జరిగింది. కాగా, పెళ్లి రోజులు రాత్రి వారికి ఇరు కుటుంబాల పెద్దలు శోభనం జరిపాలని నిర్ణయించారు. అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, గదిలోకి ముందుగానే వెళ్లిన తులసీప్రసాద్ బెడ్‌పై నిర్జీవంగా పడిపోయాడు. గదిలోకి వెళ్లిన నవ వధువు శిరీష్.. తులసీప్రసాద్ గదిలో పడిపోయి ఉండటంతో టెన్షన్‌కు గురైంది. ఈ విషయాన్ని అత్తామామలకు చెప్పింది. వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తులసీప్రసాద్‌కు పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు నిర్ధారించారు. నవ వరుడు పెళ్లి జరిగిన 24 గంటల్లోనే ఇలా మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకింది. నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, వరుడు తులసీప్రసాద్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. -
నందిరెడ్డిగారిపల్లె ప్రత్యేకత ఏంటో తెలుసా!
కురబలకోట(అన్నమయ్య జిల్లా) : ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బేల్దార్లు (తాపీ మేస్త్రీలు), భవన నిర్మాణ కార్మికులున్న ఊరుగా కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లె పెట్టింది పేరు. ఇది కష్టజీవుల ఊరు. ఏ ఇంట్లో చూసినా తాపీ, గజం కట్టి, టేపు, మూల మట్టం కన్పిస్తాయి. వీరు కూడా అంతా ముస్లిం మైనార్టీలే. 40 ఏళ్ల క్రితం తొలుత ఆ ఊరికి చెందిన షేక్ నూరాసాబ్ ఈ వృత్తికి ఆద్యులుగా చెబుతారు. ఆ తర్వాత దర్గా ఖాదర్‌వల్లీ ఈ వృత్తిని స్వీకరించడంతో అతని వద్ద మరికొందరు బేల్దార్లు, మేస్త్రీలు తయారయ్యారు. ఇలా ఒక్కరొక్కరుగా పనికి వెళుతూ మిగిలిన వారు కూడా కాలక్రమంలో బేల్దార్లు అయ్యారు. ఇప్పుడు ఆ ఊరిలో 75 శాతం మందికి ఇదే జీవనాధారం. ఈ వృత్తినే పరంపరగా సాగిస్తున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు కూడా బేల్దార్లు ఉన్నారు. చేతిపని కావడంతో వచ్చే ఆదాయం ఇళ్లు గడవడం ఇతర అత్యవసరాలు తీరడానికి సరిపోతోందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పనికి బయలు దేరి సాయంత్రం ఐదు గంటల వరకు పనులు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. మంగళవారం మదనపల్లె సంత కావడంతో సెలవు తీసుకుంటారు. ఈ ఊరిలో 2221 జనాభా, 621 కుటుంబాలు, 1063 మంది ఓటర్లు ఉన్నారు. 90 శాతం అక్షరాస్యత ఉంది. ఈ ఊరి తర్వాత మండలంలోని సింగన్నగారిపల్లె, పందివానిపెంట కూడా భవన నిర్మాణ కార్మికులకు పెట్టింది పేరు. మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాలకు వీరు పనులకు వెళతారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి వీరికోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. (క్లిక్: చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట) యువతరం చదువులపై దృష్టి నేటి తరం చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ వృత్తి పట్ల యువకులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ ఉర్దూ యూపీ స్కూల్ ఉంది. ఈ ఊరిలో సచివాలయం కూడా ఉంది. వెనుకబడిన ఆ ఊరు ఇప్పుడిప్పుడే వివిధ ప్రభుత్వ పథకాలతో క్రమేణా పేదరికం నుంచి బయటపడుతోంది. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్లు కట్టుకున్నాం. మా ఇళ్లను మేమే ఉన్నంతలో సంతోషంగా కట్టుకుంటాం. – మోదీన్ సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకాలేదు ఈ వృత్తితో ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకా లేదు. కట్టడాలు, భవన నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయి. పని లేదన్న చింత లేదు. సీఎం జగన్ ప్రభుత్వంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ భవనాలు, జగనన్న ఇళ్లు లాంటి తదితర ఎన్నో అభివృద్ధి పనుల వల్ల రెండు చేతులా తరగని పని ఉంది. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ వచ్చింది. యంత్రాల సాయంతో పని కూడా సులభతరంగా మారింది. తాపీనే మాకు పెట్టుబడి.. ఆపై జీవనాధారం. ఖర్చులు పోను నెలకు రూ. 20 వేలు వరకు మిగులుతుంది. – కమాల్‌సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె అభివృద్ధి బాటపడుతోంది ఈ ఊరు దశాబ్దాలుగా పేదరికాన్ని అనుభవించింది. సచివాలయాలు రాక మునుపు సరైన రోడ్డు లేదు. వీధులు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు పక్కా రోడ్డు ఉంది. పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. పింఛన్లు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. 31 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటి ద్వారా రూ. 3 కోట్లు టర్నోవర్ ఉంది. డబ్బుకు ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సిన పనిలేదు. ఈ ఊరు మదనపల్లె పట్టణానికి సమీపంలోనే ఉంది. ఇది కూడా వీరికి కలసి వచ్చింది – సఫియా, గ్రామ కార్యదర్శి, నందిరెడ్డిగారిపల్లె నాడు రూ. రెండున్నర.. నేడు రూ.800 మేము పనిచేసే తొలి నాళ్లలో బేల్దార్లకు రోజుకు రెండున్నర రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంది. గుర్తుంపు కార్డులు ఇచ్చారు. వాటి అవసరం పెద్దగా ఏర్పడ లేదు. అల్లా దయవల్ల ప్రమాదకర ఘటనల బారిన పడలేదు. సత్తువ, శక్తి ఉన్నన్నాళ్లు ఈ పని చేసుకోవచ్చు. ఎప్పటికీ డిమాండు ఉంటుంది. – హైదర్‌వల్లీ, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె -
చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట
మదనపల్లె : పిట్ట కొంచెం కూత ఘనం.. అన్నట్లుగా ‘ఉష’ చదివింది ఏడో తరగతి అయినప్పటికీ నాదస్వర సాధనలో దిట్ట. ఊపిరి బిగబట్టుకుని సప్తస్వరాలను సన్నాయిలో వినిపించేందుకు మగవారు సైతం జంకే పరిస్థితుల్లో 22ఏళ్ల ఉష నిష్ణాతురాలిలా ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రశంసలు పొందుతోంది. ఆమె నాదస్వరగానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శ్రోతలను సంగీత, ఆధ్మాతికలోకంలోకి తీసుకెళుతుంది. తండ్రి నుంచి నేర్చుకున్న విద్యను.. సాధన చేసి మెరుగుపరచుకుని.. కళను కాపాడుకావాలనే లక్ష్యంతో.. భర్త ప్రోత్సాహంతో ముందుకెళుతున్న నాదస్వర కళాకారిణి ఉషపై సాక్షి ప్రత్యేక కథనం... కర్నాటక సంగీతంలోని గమకాలను యథాతథంగా పలికించగల వాయిద్యాల్లో అగ్రతాంబూలం నాదస్వరానిదే. పురాతనమైన ఆ వాయిద్యం ఎంతో మంగళప్రదమైనది కూడా. అందుకే శుభ కార్యాలలో ఆ వాద్య శ్రవణం చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది. నాదస్వరాన్ని తెలుగులో సన్నాయిగా పిలుస్తారు. తెలుగునాట నాదస్వరంలో నిష్ణాతులైన విద్వాంసులు అరుదనే చెప్పుకోవాలి. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కళలో మహిళలు రాణించడం అరుదైన విషయం. అందులోనూ ఓ 22 ఏళ్ల యువతి రాణించడం విశేషం. కర్నాటకలోని గౌనిపల్లెకు చెందిన నాదస్వర విద్వాంసులు సుబ్రహ్మణికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి శ్వేత, చిన్నమ్మాయి ఉష. తన వారసత్వ కళను తన పిల్లల్లో ఒకరికి నేర్పిస్తే చాలనుకున్న సుబ్రహ్మణి ఇద్దరు పిల్లలు ఇష్టంగా నేర్చుకునేందుకు ముందుకు రావడంతో ఇంటిపట్టునే సాధన చేయించి నాదస్వరంలో దిట్టలుగా మలిచారు. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కళలో వారికి ఏమాత్రం తీసిపోకుండా తన ఇద్దరు పిల్లలకు నాదస్వర విద్యను నేర్పించి ప్రావీణ్యతను సాధింపజేశారు. ఉష అక్క శ్వేత నాదస్వరాన్ని నేర్చుకునే క్రమంలో ఇంటిపట్టున సాధన చేస్తుండేది. దీన్ని చూసిన ఉష అక్కతో పాటుగా నాదస్వరం నేర్చుకుంటానని పట్టుబట్టింది. 11వ ఏట సన్నాయిని చేతపట్టిన ఉష సుమారు ఏడేళ్లపాటు కఠోర సాధనతో రాగం, తాళం, స్వరాలపై మంచి పట్టును సాధించింది. తండ్రి సుబ్రహ్మణి తనతోపాటుగా దేవాలయాలు, శుభకార్యాలు, కచేరీలకు పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పించేవారు. ఈ క్రమంలో పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు కావడంతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిపోయారు. వివాహరీత్యా అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ–2, వైఎస్సార్ కాలనీలో స్థిరపడిన ‘ఉష’.. భర్త పురుషోత్తం, అత్తామామల ప్రోత్సాహంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో జరిగే సంగీతకార్యక్రమాలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ‘ఉష’ నాదస్వరాలాపన ప్రత్యేక ఆకర్షణగా మారింది. తండ్రి వారసత్వం ఉష నాన్న సుబ్రహ్మణి నాదస్వర విద్వాంసులు. ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. కోలారు, బెంగళూరు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల్లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చి పలువురి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో తొలిసారిగా ఉష తండ్రితో కలిసి తన 17 ఏళ్ల వయస్సులో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. మొదటి ప్రయత్నంలోనే తన నాదస్వరంతో శ్రోతలను ఆకట్టుకోవడంతో ప్రతిభను మరింత మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేసింది. సరళి స్వరాలు, జంటలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, కృతులు, వర్ణాలు, అన్నమాచార్య కీర్తనలు, లయ, తాళం, రాగం, శృతులను నేర్చుకుంది. మాఘ, చైత్ర, వైశాఖ, శ్రావణమాసాల్లో జరిగే సంగీత కార్యక్రమాల్లో నాదస్వరంలో రాణిస్తూ.. పలు ప్రశంసాపత్రాలు, షీల్డులు అందుకుంది. సన్మానాలు పొందింది. డోలు.. సన్నాయి.. ఉష సన్నాయి కళాకారిణి అయితే ఆమె భర్త పురుషోత్తం డోలు విద్వాంసుడు. డోలు, సన్నాయి వేర్వేరు వాయిద్యాలు అయినప్పటికీ ఆ రెండూ కలిస్తే అద్భుతమైన కలయిక. వాటి నుంచి వెలువడే మంగళ వాయిద్యం వినేందుకు ఎంత అద్భుతంగా ఉంటుందో... ఉష, పురుషోత్తంలు కలిసి ఇస్తున్న ప్రదర్శనలు అంతే గొప్పగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పురుషోత్తం తిరుపతి ఎస్వీ మ్యూజికల్ కళాశాలలో ఆరేళ్లపాటు డోలు విద్యలో కోర్సు పూర్తిచేశారు. తిరుమల నాద నీరాజనం, తిరుపతి త్యాగరాజ కళామండపం, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. భగవంతుడి అనుగ్రహంతో ఒక్కటైన ఈ జంట.. డోలు, సన్నాయిలా కలిసిపోయి ఒకవైపు వివాహబంధాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు వాయిద్య ప్రదర్శనలతో పలువురిని ఆకట్టుకుంటున్నారు. -
మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే?
సాక్షి రాయచోటి(అన్నమయ్య జిల్లా): బ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే.. ఇది అన్నమాచార్యులు చెప్పిన మాట. రూపాలు ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కడే..లింగ, వర్గ, జాతి బేధాలు లేకుండా దేవుని దృష్టిలో అందరూ సమానమే..కానీ అక్కడ మహిళల పట్ల వివక్ష కాదుగానీ..పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం ఆనవాయితీ. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత. చదవండి: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే ఆలయ పరిసరాల్లో అన్ని పనులు మగవారే చేస్తారు. పూజారి పురుషుడే...నైవేద్యం పెట్టాలన్నా.. పూజ చేయాలన్నా వారే చేయడం విశేషం. ఆడవాళ్లకు ప్రవేశం లేదు. అందులోనూ సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం మగవాళ్లు మడికట్టుకుని వరుసగా పెట్టే పొంగళ్లు, కుండలతో ఊరంతా సందడిగా మారుతుంది. తిప్పాయపల్లెలో కొనసాగుతున్న పురాతన సంప్రదాయంపై ప్రత్యేక కథనం. పుల్లంపేట మండలంలోని తిప్పాయపల్లె గ్రామం. చుట్టూ పూలు, అరటి, మామిడి చెట్లతో, శేషాచలం అడవులతో పల్లె అందంగా కనిపిస్తోంది. గ్రామం లోపల పురాతన కాలం నాటి సంజీవరాయస్వామి ఆలయం ఉంది. ఒకప్పుడు గ్రామస్తులు వ్యవసాయం, పశుపోషణ జీవనాధారంగా సాగించేవారు. క్రీ.శ. 1716లో తీవ్రమైన కరువు కాటకాలు ఎదురయ్యాయని అప్పట్లో తాగడానికి నీరు, తినడానికి తిండిలేక పశుపోషణ భారమైన పరిస్థితులు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఊరిలోకి ఓ వేద పండితుడు వచ్చివెళ్లేవారని తెలిసింది. నైవేద్యం సిద్ధం చేస్తున్న పురుషులు(ఫైల్) పొలాల్లోనే నివాసం ఉండే పండితుడు ప్రజలకష్టాలు తొలగించడానికి నైరుతి మూలలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి సంజీవరాయస్వామిగా నామకరణం చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆ పండితుడు ఆంజనేయస్వామికి మహాభక్తుడు కావడంతో ఆడవారు ఎవరూ ఆలయంలోకి రాకూడదని సూచించారని తెలిసింది. అప్పటి నుంచి ఆలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం కల్పించడం సంప్రదాయంగా మారింది. నాటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ వస్తున్నారు. సంక్రాంతికి ముందు కొత్త సందడి తిప్పాయపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు వచ్చి పొంగళ్ల అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. మగవారే స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామంలోని వీధులన్నీ పేడతో అలికి...ముగ్గులు వేసి వాటిపై పదుల సంఖ్యలో పొంగళ్లు పెట్టి వంట వండుతారు. అగ్గి మంట మొదలుకొని అన్నం అయ్యే వరకు అన్నీ వారే చూసుకుంటారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు మండలంనుంచే కాక చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఆనవాయితీని కొనసాగిస్తున్నాం మా గ్రామంలో పెద్దల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. సంక్రాంతికి ముందు వచ్చే పొంగళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటాం. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మండల వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తారు. – కేశవరెడ్డి, మాజీ సర్పంచ్, తిప్పాయపల్లె, పుల్లంపేట మండలం ఎంతో సందడిగా ఉంటుంది సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం పొంగళ్లు నిర్వహించడం సంతోషదాయకంగా ఉంటుంది. ముందస్తుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్లుగా..కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఊరికి రావడంతో ఊరంతా జాతరను తలపించేలా ఉంటుంది. –ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తిప్పాయపల్లె, పుల్లంపేట మండలం -
లక్షల్లో వేతనాలు వదిలిన జంట.. ‘పంట’ భద్రులైంది!
ఆ దంపతులు ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ అర్హతతో మెట్రో నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు. లక్షల్లో వేతనాలు తీసుకుంటూ ఆనందమయమైన జీవితం గడుపుతూ వచ్చారు. అయితే వారి మదిలో ఓ వినూత్న ఆలోచన మెదిలింది. వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించి తాము కూడా వ్యవసాయంలో ఏదో ఒక విజయాన్ని సాధించాలని భావించారు. అనుకున్నదే తడవుగా తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి పల్లెబాట పట్టారు. పల్లెలో తమకున్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలు సాగు చేస్తూ ఆదాయం ఆర్జించడమే గాక, అందరినీ అబ్బుర పరుస్తున్నారు. దాదాపు 30 ఆవులను సైతం పెంచుతూ ప్రకృతి వ్యవసాయంలో పరవశించిపోతున్నారు. భర్త చేస్తున్న వ్యవ‘సాయం’లో భార్య సైతం భాగస్వామి అవుతూ భర్తకు తోడునీడగా ఉంటోంది. సాక్షి, రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గోపగుడిపల్లె పంచాయతీలోని నాగరాజుపల్లెకు చెందిన అశోక్‌రాజు, అపర్ణలు ఇంజినీరింగ్ పట్టభద్రులు. సుమారు పదేళ్లపాటు హైదరాబాదు, ఢిల్లీలోని పలు ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారు. అశోక్‌కు నెలకు రూ. 1.20 లక్షల వరకు వేతనం వచ్చేది. అపర్ణకు రూ. 60–70 వేల వరకు వచ్చేది. ఎప్పటినుంచో వ్యవసాయంపై మక్కువ ఉన్న వారు సెలవు రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలను వెళ్లి పరిశీలించేవారు. ఈ క్రమంలోనే అందరి కంటే భిన్నంగా వ్యవసాయం చేయాలన్న తలంపు వారిలో మొదలైంది. అనుకున్నదే తడవుగా ఉన్న ఉద్యోగాలను వదిలేసి సొంతూరి వైపు నడిచారు. అమ్మానాన్నల సమక్షంలో ఉన్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలను వేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. 30 ఆవులను పెంచుతున్నారు. అరుదైన పంటల సాగు ప్రస్తుతం అశోక్‌రాజు తనకున్న పొలంలో అరుదైన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలను ఎకరాలో సాగు చేశారు. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం ఉంటుందని భావించి మొక్కలను పెంచుతున్నారు. డ్రాగన్‌ఫ్రూట్స్ వంగడాలను థాయిలాండ్ (తైవాన్) నుంచి దిగుమతి చేసుకుని పొలంలో ఒక్కొక్క రాతి స్తంభానికి నాలుగు మొక్కలను నాటారు. తోటలో 350 రాతి స్తంభాలు అంటే 1500 డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. రూ. 8 లక్షల వరకు డ్రాగన్ ఫ్రూట్స్ మీదనే ఖర్చు చేశారు. జూన్ నుంచి మొదలైతే డిసెంబరు వరకు ప్రతి 45 రోజులకు ఒక క్రాప్ వస్తూనే ఉంటుంది. కిలో రూ. 200 చొప్పున నెల్లూరు, హైదరాబాదు, తిరుపతి, మదనపల్లె, చిత్తూరు, పుత్తూరు, కడప ఇలా ఆర్డర్ల మీదనే సరఫరా చేస్తున్నారు. ఎవరికి అవసరమైనా బాక్సులో భద్రపరిచి బస్సుల ద్వారా రవాణా చేస్తున్నారు. నీరు లేకున్నా.. చెట్లు తట్టుకుని నిలబడతాయి. ఎప్పటికీ పంట కాస్తూనే ఉండడంతో మంచి ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు 4–5 టన్నుల వరకు దిగుబడి వస్తుండగా, రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు టన్ను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తోటలోని డ్రాగన్ ఫ్రూట్స్ అంట్లు తయారు చేసి ఒక్కొక్క మొక్క రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క డ్రాగన్ ఫ్రూట్స్‌నే కాకుండా వరిలో కూడా వినూత్న వంగడాలు జీర సాబ, కుచిపటాలై, క్షేత్రాయ మహరాజ్, నవారు (షుగర్‌ను కంట్రోల్ చేసే వంగడంగా గుర్తింపు) లాంటివి సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయంతోనే వేరుశనగ, మామిడి, నన్నారి సాగుకు కూడా శ్రీకారం చుట్టారు. చెరకు వేసి.. బెల్లం తీసి.. అశోక్‌రాజు దంపతులు ప్రకృతి వ్యవసాయంతో చెరకు పంటను పండిస్తున్నారు. సుమారు రెండు ఎకరాల్లో చెరకు పండించి తర్వాత రెండు నెలలపాటు కటింగ్ చేస్తూ వస్తారు. ప్రతిరోజు తోట సమీపంలోనే ఇంటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గానుగ మిషన్ ద్వారా పాలు బయటికి తీసి పాకం పట్టి బెల్లం తయారు చేస్తున్నారు. రోజూ 200 కిలోలు చొప్పున తీస్తున్న బెల్లానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు తయారు చేసిన బెల్లంను నేరుగా వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. వినూత్న పంటలతోపాటు వ్యవసాయంలోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న అశోక్‌రాజు దంపతులు 2021లో రైతు నేస్తం అవార్డును అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఆనందంగా ఉంది వ్యవసాయంలో చాలా సంతృప్తి ఉంది. అంతకంటే ఆరోగ్యం, ఆనందం కూడా ఉన్నాయి. అందుకే అందరి కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాల పంటలను పండిస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా ఇప్పటికే లక్షల్లో ఆదాయం వచ్చింది. ఆర్డర్ల మీద వాటిని పంపిస్తుంటాము. అలాగే చెరకు ద్వారా బెల్లం కూడా తయారు చేస్తున్నాము. వరిలో కూడా అద్భుతమైన వంగడాలను తీసుకొచ్చి పండిస్తున్నాం. ఈసారి కొత్తగా నన్నారి సాగు కూడా మొదలెట్టాం. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కంటే ప్రకృతి మధ్య చేసే వ్యవసాయంలో ఉన్న ఆనందమే వేరు. – ముప్పాళ్ల అశోక్‌రాజు, ప్రకృతి వ్యవసాయ రైతు, నాగరాజుపల్లె, రామాపురం మండలం -
Horsley Hills: అదిరేటి అందం.. ఆంధ్ర ఊటీ సొంతం
సాక్షి, బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ వేసవి విడిది కేంద్రంగా ఎలా మారింది, దీని వెనుక చరిత్ర ఏమి అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరచే ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులవుతారు. చిరుజల్లులు కురిస్తే ఆ ప్రకృతి అందానికి మైమరచే ప్రకృతి ప్రేమికులెందరో. అలాంటి అందమైన హార్సిలీహిల్స్‌ను 153 ఏళ్ల క్రితమే బ్రిటీష్ ప్రభుత్వం వేసవి విడిది కేంద్రంగా ప్రకటించి ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత బ్రిటిష్ కలెక్టర్ హార్సిలీ కొండపై చేపట్టిన పనులు, దాని చరిత్ర ఆనవాళ్లు ఇప్పటికి కళ్లముందు కనిపిస్తున్నాయి. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్‌పై దీన్ని కనుగొన్న డబ్ల్యూడీ హార్సిలీ చెరగని ముద్రవేశారు. డబ్ల్యూడీ హార్సిలీ తొలుత మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై కడప కలెక్టర్ అయ్యాక గుర్రంపై కొండకు రాకపోకలు సాగించారు. మద్రాసు ప్రభుత్వ అనుమతితో వేసవి విడది కేంద్రంగా మార్చారు. తొలి అతిథి గృహ నిర్మాణం కోసం అనుమతి పొంది వాటికి కావాల్సిన పెంకులను ఓడ ద్వారా ఇంగ్లాండు నుంచి దిగుమతి చేసుకొని కొండకు తరలించుకొన్నారు. ఒకప్పటి దట్టమైన అడవితో నిండిన హార్సిలీహిల్స్‌పై భూమి అంతా అటవీశాఖదే. వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు దక్కిన 90 ఏళ్ల తర్వాత అంటే 1959లో అటవీశాఖ 103 ఎకరాలను రెవెన్యూశాఖకు బదలాయించింది. లేదంటే ఈ రోజుకు హార్సిలీహిల్స్ మొత్తం నిషేధిత రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలో ఉండేది. అతిథి గృహానికి ఇంగ్లాండ్ పెంకులు వేసవి విడిది కేంద్రంగా హార్సిలీహిల్స్‌కు బ్రిటీష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇక్కడ విడిది చేసేందుకు అతిథిగృహం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ హార్సిలీ మద్రాసు ప్రభుత్వానికి లేఖ రాయగా రిజర్వ్ ఫారెస్ట్‌లో బంగ్లా నిర్మించుకునేందుకు 1869 జూన్9న జీఓఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది. దీంతో 1869లోనే తొలి అతిథి గృహ నిర్మాణం మొదలైంది. హార్సిలీ ఇంగ్లాండ్ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండకు రవాణా చేయించుకున్నారు. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పుడు కళ్యాణి అతిథిగృహంగా పిలుచుకునే గది పైకప్పుకు ఈ పెంకులు వాడారు. ఇంగ్లాండ్‌లో 1865లో బేస్డ్ మిషన్ టైల్ వర్క్స్ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు పెంకులపై అక్షరాలు, కంపెనీ వివరాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొన్నేళ్లకు ఘాట్‌రోడ్డు నిర్మాణం చేసింది కూడా బ్రిటిష్ ప్రభుత్వంలోనే. 4,141 అడుగుల ఎత్తులో బావి హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా మార్చుకోవడం, అతిథిగృహం నిర్మించుకొన్న కలెక్టర్ హార్సిలీకి నీటికోసం ప్రస్తుత అటవీ ప్రాంగణంలో బావిని తవ్వించగా పుష్కలంగా నీళ్లు లభ్యమయ్యాయి. బావి చుట్టూ ఇటుకల్లా బండరాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం అప్పట్లో అద్భుతంగా చెప్పబడుతోంది. బావి నిర్మాణంలో నేటికి ఒక్క రాయి కూడా చెక్కుచెదరలేదు. నీళ్లు నిండుగా ఉంటాయి. కరువు పరిస్థితుల్లో బావి ఎండినా సాధారణ రోజుల్లో నీళ్లుంటాయి. 1869 నుంచి వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్‌ను అధికారిక విడిది కేంద్రంగా చేసుకునేందుకు అప్పటి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ కడప కలెక్టర్ హార్సిలీ లేఖ పంపారు. ఈ లేఖపై బ్రిటీష్ మద్రాసు ప్రభుత్వం హార్సిలీహిల్స్‌ను వేసవి విడిది కేంద్రంగా ప్రకటిస్తూ 1869 మే4న జీఓఎంఎస్ నంబర్ 11579ను జారీచేసింది. అప్పటినుంచి 153 ఏళ్లుగా వేసవి విడది కేంద్రంగా హార్సిలీహిల్స్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. 60 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు కూడా అధికారికంగా ఇది వేసవి విడిది కేంద్రంగా గుర్తించారు. పలువురు గవర్నర్లు ఇక్కడ విడిది చేశారు. ఒకేరోజు జననం, మరణం హార్సిలీహిల్స్‌పై మక్కువ పెంచుకొన్న కలెక్టర్ హార్సిలీ నిండుగర్భిణి అయిన సతీమణీతో కొండపై విడిది చేశారు. 1864 మే 31న ప్రసవం జరిగి కుమారుడు జన్మించగా అదేరోజు చనిపోయాడు. ఈ పసిబిడ్డకు జార్జ్హార్సిలీ అని నామకరణం చేసి కొండపై (టూరిజం ముఖద్వారం వద్ద) ఖననం చేశారు. హార్సిలీకి ఇష్టమైన విడిదిచోటనే బిడ్డ పుట్టడం, ఆ ఆనందం అదేరోజు ఆవిరి కావడం బాధాకరం. 90 ఏళ్లకు డీ రిజర్వ్ ఫారెస్ట్ హార్సిలీహిల్స్‌పై రెవెన్యూ, ఇతర శాఖలకు అడుగుపెట్టేందుకు చోటులేదు. 1869లోనే వేసవి విడిది కేంద్రంగా ప్రకటించినప్పటికి అటవీశాఖకు తప్ప ఎవరికి ప్రవేశంలేని పరిస్థితి. బ్రిటీష్ పాలన అంతమైనా మార్పులేదు. వేసవి విడిది కేంద్రంగా మారిన 90 ఏళ్ల తర్వాత 1959 ఏప్రిల్ 15న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 101523/సీ1/58–5 మెమో జారీ చేసింది. ఈ మెమో ద్వారా కోటావూరు రెవెన్యూ గ్రామం పరిధిలోని హార్సిలీహిల్స్‌పై సర్వేనంబర్ 538లోని 103 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను డీ రిజర్వ్‌ఫారెస్ట్‌గా మార్పుచేసింది. ఈ 103 ఎకరాలను రెవెన్యూశాఖ 1959 జూలై 25న స్వాధీనం చేసుకొంది. -
Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!
గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఇక్కడే మకాం సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మకాం వేస్తుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు. లోడింగ్ కూలీల ప్రత్యేకత కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్‌తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. ఢిల్లీ కటింగ్‌కు ప్రత్యేకం సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్‌కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు. ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు. ఢిల్లీ కంటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత. బొప్పాయికి భలే డిమాండ్ బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్) తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. – సుధాకర్‌రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె మూడు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. – రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె -
Madanapalle: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్
సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి సంబంధించి కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అమృత్ పథకంలో భాగంగా పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ(పీకేఎం–ఉడా) ఆధ్వర్యంలో స్కై గ్రూప్ కన్సల్టెంట్ సహకారంతో జీఐఎస్(జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఆధారిత మాస్టర్‌ప్లాన్–2041 రూపకల్పన జరిగింది. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి రూపొందించే మాస్టర్‌ప్లాన్‌ను పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, పట్టణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్రంగా తయారుచేయించారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రజల పరిశీలన కోసం 15 రోజుల పాటు పీకేఎం–ఉడా కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు తెలపాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో చేయాల్సిన మార్పులపై సుమారు 25వరకు అర్జీలు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరణ చేసిన ప్లాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్(డీటీసీపీ)కు పంపుతామని, అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త మాస్టర్‌ప్లాన్ ఆధారంగా చేసుకుని నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం. జిల్లాలో అతిపెద్ద పట్టణం మదనపల్లె. 35వార్డులు, 44 వార్డు సచివాలయాలు, 14.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. సుమారు 2లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పట్టణంలో గృహ, వాణిజ్యసముదాయాల నిర్మాణాలకు సంబంధించి జీఓ.ఎం.ఎస్.నెం.447, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.5.10.2001న ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌ను ఆధారంగా చేసుకుని అనుమతులు మంజూరుచేస్తున్నారు. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలుకు ముందు డ్రాఫ్ట్‌ప్లాన్‌ను ప్రజల పరిశీలనకు ఉంచి, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డీటీసీపీ అనుమతులతో అమలుచేయాల్సి ఉంటుంది. మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించి రానున్న 20 ఏళ్లలో ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ పథకం కింద అధునాతన సాంకేతికత సహాయంతో జియోగ్రాఫిక్ ఇన్ఫరేషన్ సిస్టమ్(జీఐఎస్) పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్–2041ను సిద్ధంచేశారు. రూపకల్పన జరిగిందిలా.. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా స్కై గ్రూప్ ఏజెన్సీ వారు మొదట పట్టణాన్ని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. పట్టణ అభివృద్ధి దృష్ట్యా మెయిన్‌రోడ్లు ఎంత వెడల్పు ఉండాలో అంచనా వేసుకున్నారు. మున్సిపల్ లిమిట్స్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్ యూజ్, ఇండస్ట్రియల్, పబ్లిక్, సెమీపబ్లిక్, రిక్రియేషన్ జోన్లను గుర్తించారు. గతానికి, ఇప్పటికి చేయాల్సిన మార్పులను గుర్తించి, వాటిని కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పరిధి 14.20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అలాగే కనపరుస్తూ విస్తరణ చేయాలనుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఏఓఐ(ఏరియా ఆఫ్ ఇంటరెస్ట్) కింద అన్నివైపులా మూడుకిలోమీటర్ల రేడియస్ పెంపుతో 37.26 చదరపుకిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌లో మార్పులు పట్టణంలోని కోమటివానిచెరువు పాతమాస్టర్‌ప్లాన్‌లో రిక్రియేషన్ గ్రీన్‌లో ఉండేది. కొత్తప్లాన్‌లో చెరువుచుట్టూ ప్రాంతాన్ని బఫర్‌జోన్‌గా మార్చారు. గతంలో రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న కదిరిరోడ్డు, చౌడేశ్వరిగుడి పరిసరప్రాంతాలు, గొల్లపల్లెరోడ్డు, నిమ్మనపల్లెరోడ్డు, సీటీఎంరోడ్డు, బెంగళూరురోడ్డు, పుంగనూరురోడ్డు ప్రాంతాలన్నీ కమర్షియల్‌లోకి మార్పు జరిగాయి. ఇన్నాళ్లు వీటిలో రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు జరపాలంటే టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై ఆ సమస్య ఉండదు. రెడ్డెప్పనాయుడు కాలనీలో కొంతభాగం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేది. ప్రస్తుతం దాన్ని రెసిడెన్షియల్ జోన్లోకి మార్చారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 40–60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్స్‌గా ఏర్పాటుచేశారు. 60అడుగుల రోడ్లను 80–100 అడుగులుగా, పట్టణం మీదుగా వెళుతున్న స్టేట్ హైవేను 100 అడుగుల రోడ్లు చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. (క్లిక్: థ్యాంక్యూ.. సీఎం సార్) సమగ్రంగా పరిశీలించాకే ఫైనల్ ప్లాన్ ఖరారు.. పట్టణ మాస్టర్‌ప్లాన్–2041కు సంబంధించి ప్రధానంగా పట్టాభూములను రిక్రియేషన్ జోన్లో పెట్టారని, వాటిని డిలీట్ చేయాల్సిందిగా, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అనుమతిలేని లేఔట్లను మార్చమని, రోడ్ల వెడల్పు మార్చాల్సిందిగా, జోనింగ్‌లకు సంబంధించి, ఎగ్జిస్టింగ్ రోడ్లను మాస్టర్‌ప్లాన్‌రోడ్డుగా చేయమని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పీకేఎం–ఉడా అధికారులకు పంపాం. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్నాక సవరణలు చేసి డీటీసీపీ అనుమతులకు పంపి ఫైనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రకటిస్తారు. – కే.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, మదనపల్లె -
AP Government: రైతన్నలకు వెన్నుదన్ను
‘మానవత్వంతో నిండిన ప్రభుత్వం మాది... రైతులకు సంబంధించి చిన్నపాటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటున్నాం. అన్నదాతలకు పంట సాగుకు ముందే విత్తనాలు, ఎరువులు ఇస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వేగంగా పరిహారం అందిస్తున్నాం. అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం ఇవ్వడంలో కమిటీల పేరుతో కాలయాపన చేసేవారు. అందరికీ కాకుండా కొందరికే అది కూడా రూ. 5 లక్షలు అందించేవారు. ఆ పరిస్థితి నుంచి పరిహారం సొమ్మును రూ. 7 లక్షలకు పెంచాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 7లక్షలు జమ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం’’ – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్రెడ్డి సాక్షి రాయచోటి : వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నదాతలకు పూర్తిగా అండగా ఉంటోంది. ఏ కష్టం వచ్చినా సకాలంలో ఆదుకుంటోంది. క్రమక్రమంగా కరువు పారిపోతోంది....వర్షాలు సకాలంలో కురుస్తుండడం...›ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తుండడం....కాలువల్లో జలాలు ఉరకలెత్తుతుండడంతో పంట పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా పల్లె ముంగిట రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి అన్నదాతకు అండగా నిలుస్తోంది. వైఎస్ జగన్ సర్కార్ రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ప్రజల్లో ముద్ర వేసుకుంటోంది. ఇదే తరుణంలో 2014 నుంచి ఇప్పటివరకు పంటలపై అప్పుల భారం పెరిగి ఆత్మహత్య లు చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేస్తోంది. టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా పెంచిన పరిహారం సొమ్మును అందిస్తూ మానవత్వం ఉన్న ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతోంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కు టుంబాలకు వేగవంతంగా పరిహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తద్వారా ఆ కుటుంబాలకు పరిహారం వెంటనే అందుతోంది. 156 కుటుంబాలకు పరిహారం అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి పరిహారం రూ. 7 లక్షలు చొప్పున అందించింది. ∙2014 నుంచి ఇప్పటివరకు అన్నమయ్య జిల్లాలో 58 మంది ఆత్మహత్య చేసుకోగా 53 మందికి పరిహారం కింద రూ. 2.82 కోట్లు అందించారు. వైఎస్సార్ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా 103 కుటుంబాలకు రూ. 7.21 కోట్లు అందించారు. అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాను కలుపుకుని మొత్తంగా ఇటీవల కాలంలో మృతి చెందిన 10 మందికి పరిహారం అందాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ పరిహారం అందిస్తోంది. అయితే ప్రతిపక్షం, జనసేన నాయ కులు కావాలనే నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున జనసేన పార్టీ తరుపున అందిస్తున్నా... అంతకుమునుపే రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ రూ. 7 లక్షలు చొప్పున పరిహారం అందించడం కొసమెరుపు. -
అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తల నరికిన అత్త.. కారణం అదే?
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ అత్త.. తన కోడలి తల నరకడం సంచలనంగా మారింది. అనంతరం తలపట్టుకుని పోలీసు స్టేష్టన్కుఉ వెళ్లడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. రాయచోటిలోని కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ.. తన కోడలు వసుంధరను దారుణంగా హత్య చేసింది. కత్తితో తన కోడలి తల నరికింది. అనంతరం వసుంధర తలను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. కాగా, కవర్లో ఉన్న వసుంధర తలను చూసి పోలీసులు షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాల ప్రకారం.. వసుంధర భర్త, ఆమె సొంత అత్త కొన్నేళ్ల క్రితం మరణించారు. దీంతో, ఆమె పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వసుంధర మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం. కాగా, భర్త మరణానంతరం ఆస్తులు అన్ని వసుంధర పేరు మీదకు బదిలీ అయ్యాయి. దీంతో, వసుంధర ఆస్తులను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి రాసివ్వాలనే ప్రయత్నాలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది. దీంతో, వసుంధర భర్త తమ్ముడు చందు, ఆమె చిన్నత్త సుబ్బమ్మ కలిసి వసుంధరను హత్య చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం వసుంధర తల నరికి మొండాన్ని వేరు చేశారు. అనంతరం, పట్టణంలో పట్టపగలే సుబ్బమ్మ ఇలా తల పట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విద్యార్థినితో చనువుగా తిరిగి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
Organic Farming: నలభై ఎకరాల భూమి.. ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...
బాధ్యతల బరువు దించుకున్నాక సామాన్యుల కోసం ఏమైనా చేయగలనా అనుకుంది. సొంత లాభం కొంతమానుకుని నలుగురికి ఉపయోగపడాలని అనుకున్న ఆలోచన ఆమెను వ్యవసాయం దిశగా నడిపించింది. ప్రకృతి సేద్యంతో పదిమందికి చేయూతనిస్తూ తన జీవనాన్ని అర్థవంతంగా మార్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కొల్లావారిపల్లెకు చెందిన శవన హైమావతి. ఆరోగ్యసిరిగా అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. కొడుకు, కూతురు విదేశాలలో స్థిరపడ్డారు. చిన్నకొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త మరణం తర్వాత ఒంటరి జీవితం ఆమెను వ్యవసాయం వైపు దృష్టి మళ్లించేలా చేసింది. వారసత్వంగా ఉన్న భూమిని తనే స్వయంగా సాగులోకి తీసుకురావాలనుకుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తన ద్వారా తన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంది. పదిహేనేళ్లుగా ప్రకృతిసేద్యంతో పంటసిరులను కురిపిస్తోంది హైమావతి. ప్రయోగాలతో సేద్యం... హైమావతి కుటుంబానికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి నలభై ఎకరాలు ఉంది. అందులో మొదట్లో కొద్దిపాటి భూమిని స్వయంగా సేద్యం చేసుకుంటూ, ప్రకృతి సేద్యంపట్ల అవగాహన కల్పించుకుంటూ చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చింది. పదిహేనేళ్లుగా చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు 34 ఎకరాలకు విస్తరించింది. సుభాష్ పాలేకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమావేశాలకు హాజరవుతూ, వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ప్రకృతిసేద్యంలో పూర్తి నైపుణ్యం సాధించింది. రసాయనాలు వాడకుండా ఎరువులు మొదలుకొని పురుగు మందుల వరకు అన్నీ సొంతంగా తయారు చేస్తుంది. స్వయంగా ఎరువుల తయారీ... స్కూల్ చదువు దగ్గరే ఆగిపోయిన హైమావతి ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో ఎంతోమందికి సలహాలు ఇచ్చేంతగా ఎదిగింది. ఎరువుల కోసం పాడి ఆవుల పెంపకాన్ని చేపట్టింది. పురుగులు, తెగుళ్లను నివారించేందుకు స్వయంగా మిశ్రమాలను తయారుచేస్తూ చుట్టుపక్కల గ్రామాల రైతులకు అవగాహన కలిగిస్తోంది. ఎండిన ఆకులతో, మగ్గబెట్టిన చెత్తాచెదారం, పండ్లు, కూరగాయల వ్యర్థాలతో ఎరువులు, యూరియా వంటివి తయారు చేస్తూ రసాయనాల వాడకం లేకుండానే అధిక దిగుబడులు సాధిస్తోంది. నామమాత్రపు ధర... మామిడి, చెరకు, నిమ్మ, జామ, సపోట, నేరేడు, ఉసిరి, పనస, చీనీ.. పండ్ల తోటల సాగుతోపాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. వీటిని తన చుట్టుపక్కల వారికి ఇవ్వడంతో పాటు మిగతా వారికి నామమాత్రపు ధరలతో అందిస్తున్నారు. అందరికీ ఇవ్వగా మిగిలిన ఉత్పత్తులను రాజంపేట పాత బస్‌స్టాండు వద్ద షాపును ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా అందజేయడంతో పాటు మిగతా ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తోంది. అందరి ఆరోగ్యం ఈ కంప్యూటర్ యుగంలో ఎక్కడ చూసినా కల్తీ సరుకులే. వీటితో ఎంతోమంది అనారోగ్యం బారిన పడటం చూస్తున్నాను. రసాయనాలు లేని సేంద్రియ వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులను అందరూ ప్రోత్సహించాలి. అందుకే ఈ పనిని ఎంచుకున్నాను. ఎటువంటి లాభాలూ ఆశించకుండా నా చుట్టూ ఉన్నవారికి సేంద్రియ ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. – శవన హైమావతి పురస్కారాల పంట... ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న హైమావతిని ప్రతి యేటా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది మహిళా దినోత్సవ సందర్భంగా మాతృభూమి ఫౌండేషన్ నుంచి తెలంగాణ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా హైమావతికి అవార్డును ప్రదానం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతిది క్షుణ్ణంగా తెలుసుకుంటూ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న హైమావతికి అభినందనలు చెబుదామా!- – బసిరెడ్డి వెంకట నాగిరెడ్డి, సాక్షి, అన్నమయ్యజిల్లా చదవండి: Sagubadi: మూడు చక్రాల బుల్లెట్ బండి! లీటర్ డీజిల్‌తో ఎకరం దున్నుకోవచ్చు! -
Horsley Hills: పర్యాటక నిధి.. హార్సిలీహిల్స్
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో వేసవి విడిది కేంద్రంగా, ఆంధ్రా ఊటీగా విరాజిల్లుతున్న హార్సిలీహిల్స్‌పై కోవిడ్ ప్రభావం ఆర్థికంగా దెబ్బతీసింది. సందర్శకులు కరువై ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. కోవిడ్ అనంతర పరిస్థితులతో పర్యాటకం గాడిలో పడటంతో సందర్శకుల రాకతో పాటు, వారిని ఆకట్టుకునే చర్యలు సఫలమై ఆదాయం పెరుగుతోంది. 2000 ఏడాదిలో కొండపై టూరిజం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఏడాదికి రూ.20 లక్షల ఆదాయంతో మొదలై ప్రస్తుతం రూ.4 కోట్లను దాటింది. అత్యధికంగా వేసవి, సెలవురోజుల్లో పర్యాటకులు ఇక్కడికి వస్తారు. బెంగళూరు, చెన్నై, చిత్తూరు, తిరుపతి, పుట్టపర్తి, అనంతపురం జిల్లాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు బృందాలుగా ఇక్కడికి వచ్చి విడిది చేస్తారు. ప్రయివేటు కంపెనీలు తమ సిబ్బందిని విహారయాత్రగా పంపుతుంటారు. ఈ కంపెనీలను ముందుగా టూరిజం అధికారులు సంప్రదించడం ద్వారా హార్సిలీహిల్స్‌కు పంపేలా కృషి చేస్తుంటారు. ఒక్కో కంపెనీ నుంచి కనీసం లక్షకుపైబడిన ఆదాయం సమకూరుతుంది. దీనిపైనే స్థానిక టూరిజం అధికారులు దృష్టిపెట్టి ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే అతిథులకు అందించే సౌకర్యాలు, సేవలు సందర్శకులను ఆకట్టుకునేలా ఉంటాయి. దీనివల్ల ఒకసారి వచ్చివెళ్లిన సందర్శకులు మళ్లీ వస్తుంటారు. గత ఏడాది కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ఆదాయం మొదలైంది. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఈ 12 నెలల కాలంలో రూ.4,02,53,364 ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే టూరిజం అభివృద్ధి విషయంలో చర్యలు మొదలయ్యాయి. కొండను ప్రత్యేక ప్రాంతంగా తీర్చిదిద్దడమే కాకుండా స్టార్ హోటల్ స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు టూరిజం ఎండీ కన్నబాబు ఇటీవల హార్సిలీహిల్స్‌పై పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఎకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల పర్యాటకశాఖ ఉన్నతాధికారులు కొండకు వచ్చి చేపట్టాల్సిన అభివృద్ధిపై పరిశీలించి వెళ్లారు. దీనిపై ప్రణాళిక రూపుదిద్దుకొంటోంది. అభివృద్ధికి నిధులు హార్సిలీహిల్స్ యూనిట్ ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గదుల ఆధునీక రణ, ఇతర పనులకు రూ.3 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు, చెన్నై పర్యాటకులను ఆకర్షిస్తున్న హార్సిలీహిల్స్‌పై స్టార్‌హోటల్ స్థాయి వసతులు కల్పించేందుకు పర్యాటకశాఖ దృష్టికి తీసుకెళ్లాం. – మిట్టపల్లె భాస్కర్‌రెడ్డి, ఏపీటీడీసీ డైరెక్టర్ పరిశీలన పూర్తి హార్సిలీహిల్స్‌పై టూరిజం కార్యకలాపాల విస్తరణ, ఆధునీకరణ పనులపై ఉన్నతస్థాయి అధికార బృందం పరిశీలనలు పూర్తి చేసింది. భవిష్యత్తులో హార్సిలీహిల్స్ ఆదాయం భారీగా పెంచుకునేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. –నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, టూరిజం మేనేజర్, హార్సిలీహిల్స్ -
ఊరటనివ్వని టమాట!
బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లాలోని దక్షిణ ప్రాంతం టమాట సాగుకు పెట్టింది పేరు. దేశంలోనే అత్యధిక టమాట సాగు చేసే ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు టమాట ఎగుమతులు అవుతాయి. జిల్లాలో అత్యధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగవుతుంది. ఈ నియోజకవర్గంలో 9,044 హెక్టార్లలో, పీలేరు నియోజకవర్గంలో 4,117 హెక్టార్లలో, మదనపల్లె నియోజకవర్గంలో 3,240 హెక్టార్లలో టమాట సాగవుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో 41,002 ఎకరాల్లో టమాట ఏడాది పొడవునా సాగులో ఉంటుంది. ఈ నేపథ్యంలో టమాట దిగుబడి భారీగా పెరిగి, ధరలపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు సరిహద్దు కర్ణాటకలోని శ్రీనివాసపురం, చింతామణి, కోలారు, ముళబాగిలు, బాగేపల్లె నియోజకవర్గాల్లో టమాట దిగుబడులు మొదలు కావడంతో జిల్లా టమాట ధరలపై ప్రభావం చూపుతోంది. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, కలికిరి టమాట మార్కెట్లలోనూ ధరల తగ్గుదల నెలకొంది. మదనపల్లె మార్కెట్లో గురువారం కిలో టమాట మొదటి రకం రూ.8.40–10, రెండో రకం రూ.5.00–8.20 మధ్యన పలికింది. దిగుబడి ప్రభావమే మూడు నియోజకవర్గాల్లో పెరిగిన టమాటకు అదనంగా అనంతపురం జిల్లా, కర్ణాటకలో దిగుబడులు మొదలయ్యాయి. దీనితో టమాట పంట రెండువైపులా విక్రయానికి వస్తోంది. అలాగే అనంతపురం జిల్లాలో టమాట మార్కెట్లు ఆగస్టు 15 తర్వాత ప్రారంభమవుతాయి. ఈసారి జూలై మొదటి వారంలోనే మార్కెట్లు ప్రారంభమై, విక్రయాలు సాగుతున్నాయి. ట్రేడర్లు ఇక్కడికి కూడా వెళ్లి టమాట కొంటున్నారు. దిగుబడి పెరగడం, ఇతర చోట్ల మార్కెట్లు ప్రారంభం వల్ల ధరలు తగ్గాయి. ఏడు రాష్ట్రాలకు ఎగుమతులు మదనపల్లె టమాట మార్కెట్ నుంచి గురువారం ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయ్యింది. ఒక్కరోజే 1,269 మెట్రిక్ టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. ఈ టమాటలో 60శాతం తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, వరంగల్, మహరాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్, జగదల్పూర్, విహిల్, అంబికాపూర్, బవోదాబాద్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, జబల్పూర్, పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా, గుజరాత్‌లోని జోధ్‌పూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్, దేశ రాజధాని ఢిల్లీకి ఎగుమతి అయ్యింది. 40శాతం టమాట రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కాకినాడ, తుని, నర్సీపట్నం, అనకాపల్లె, కంచిలి, ఏలూరులకు ఎగుమతి అయ్యింది. అమావాస్య ప్రభావం కూడా గురువారం అమావాస్య కావడంతో తెలంగాణ మార్కెట్లు మూతబడ్డాయి. ఇదికూడా ధర తగ్గడానికి కొంత కారణం అయినప్పటికీ ఇప్పడు వస్తున్న దిగుబడిలో నాణ్యత తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నట్టు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో వచ్చేనెలలో మార్కెట్లు ప్రారంభమై ఉంటే ధరలు కొంత పెరిగి ఉండేవని కూడా అంటున్నారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు టమాట ఎగుమతులు ఉన్నందునే ఈ ధరైనా పలుకుతోందని, లేదంటే ధరలు పతనమయ్యే పరిస్థితి వచ్చేదని అంటున్నారు. -
కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట
సాక్షి, రాయచోటి(అన్నమయ్య జిల్లా) : మన పూర్వీకుల కాలంలో బందిపోటు, గజదొంగలు, శత్రువులు గ్రామాలపై దాడి చేసి దోచుకొని వెళ్తుండేవారు. అప్పట్లో గ్రామాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం యువత కర్రసాము విద్యను అభ్యసించి ప్రావీణ్యం పొందేవారు. ఇందుకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటుచేసి కర్రసాములో శిక్షణ ఇచ్చే వారు. కర్రసాములో బాగా రాణించిన వారికి సంఘంలో ప్రత్యేక ఆదరణ లభించేంది. కాలానుగుణంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో కర్రసాము విద్య మరుగున పడిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఆనాటి కర్రసాములో ప్రావీణ్యం పొందిన వారు ఉన్నారు. పెళ్లిసందడి, జాతర్లలో, ఉరుసు ఉత్సవాలతోపాటు పండుగ, పబ్బాల సమయంలోనూ కర్రసాము తళుక్కుమంటోంది. పూర్వకాలం నుంచి వస్తున్న అనేక విద్యల్లో కర్రసాము అనేది విలువైనదిగా గ్రామీణ ప్రాంత జనం భావించేవారు. కాలంలో మార్పు.. కంప్యూటర్ యుగం రాకతో పాతకాలం సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అయితే ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన పలువురు యువకులు, చిన్నారులు కర్రసాము పట్ల ఆసక్తి చూపడంతోపాటు నేర్చుకోవడం విశేషం. అలా గిర్రున తిప్పేస్తున్నారు.. అంతే..! మంగంపేట గ్రామస్తులు తమ పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో పునరావాస కాలనీ కోసం ఏర్పాటు చేసిన మైదానంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ కర్రసాముపై శిక్షణ పొందుతూ వస్తున్నారు. వై.కోట గ్రామానికి చెందిన గురువు బాబు వేసవి సెలవుల నుంచి ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో కర్రసాము నేర్పించారు. ఇదే వరుసలో గ్రామానికి చెందిన యువత కూడా ఆసక్తి చూపుతూ కర్రసాములో భాగంగా కట్టెను అలా గిర్రున తిప్పేస్తున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉన్న పిల్లలు కర్రసాముపై మక్కువ పెంచుకొని ప్రతి రోజూ సాధన చేయడంతో ఇప్పుడుతిప్పడంలో ఆరితేరిపోయారు. గ్రామానికి చెందిన దాదాపు 40 మంది పిల్లలు కర్రసాములో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. మంగంపేట పునరావాస కాలనీకి చెందిన ఎన్ఆర్ఐ బాబాయి, అబ్బాయిలైన బంగారపు నరసింహులు, బంగారపు పీరయ్య గ్రామంలో యువకులు, పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో వై.కోట గ్రామానికి చెందిన బాబు అనే గురువును ఏర్పాటు చేశారు. తొలుత పది మంది పిల్లలతో ప్రారంభించారు. అయితే కర్రసాములో యువకులు, పిల్లలు కొద్ది కాలంలోనే బాగా రాణిస్తుండంతో వీరిని చూసి మరికొంత మంది కర్రసాము నేర్చుకొనేందుకు ముందుకు వచ్చారు. ఏది ఎమైనా అంతరించి పోయిన కర్రసాము విద్యను మంగంపేట గ్రామస్తులు నేర్చుకుంటూ పది మందికి మళ్లీ పరిచయం చేస్తున్నారు. కర్ర తిప్పడం అప్పుడు కష్టం... ఇప్పుడు ఇష్టం కర్ర తిప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. గురువు సలహాలు, సూచనలతో వేళ్ల చేతితో కర్రను తిప్పడం సులువు కాదు. సాధన చేయగా తిప్పడం సులువుగా మారింది. తిప్పడంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కట్టె తిప్పుతూ ముందుకు నడుస్తూ, కాళ్ల కింద నుంచి తిప్పడం లాంటి మెలకువలు నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా అందరం కలిసి సాధన చేయడం ద్వారా కర్రసాములో ప్రావీణ్యత సాధించాం. – ఎం.రామ్‌చరణ్, 10వ తరగతి, మంగంపేట, అన్నమయ్య జిల్లా వేసవి విడిదిలో పిల్లలకు నేర్పించాలని అనుకొన్నాను నేను గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చి ఇంటి వద్ద మా పిల్లలకు కర్రసాము నేర్పించాలని అనుకున్నాను. మరి కొంత మంది పిల్లలు ఆసక్తి చూపడంతో గురువును ఏర్పాటు చేసి ప్రతి రోజూ నేర్పిస్తున్నాను. – బంగారపు నరసింహులు, ఎన్ఆర్ఐ మంగంపేట, ఓబులవారిపల్లె శారీరకంగా, మానసికంగా ఉపయోగకరం దాదాపు నలభై మంది పిల్లలు కర్రసాము నేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే మెలకువలు తెలుసుకొని బాగా రాణిస్తున్నారు. పిల్లలు నేర్చుకునే సమయంలో చాలా ఆసక్తిగా కనిపించారు. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో నేర్చుకోవడంతో శారీరకంగా, మానసికంగా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – బి.పీరయ్య, మంగంపేట, ఓబులవారిపల్లె. వేసవి సెలవుల్లో నేర్చుకున్నా ! నా పేరు ఎం.సుశాంత్. మంగంపేటలో నివాసముంటున్నాను. మక్కా స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో ఏదో ఒక విభాగంలో నైపుణ్యం పెంచుకుంటే బాగుంటుందని భావించి కర్రసాము నేర్చుకున్నాను. దాదాపు 45 రోజుల వ్యవధిలో కర్ర బాగా తిప్పుతు న్నాను. చదువుతోపాటు ఆత్మరక్షణకు సంబంధించిన కర్రసాములో నైపుణ్యం సాధించాను. (క్లిక్: అవధాన ఉద్దండుడు.. నరాల రామారెడ్డి) -
చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే?
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): రాజంపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీదేవి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి అశోక్ చెంప ఛెళ్లుమనిపించారు. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఏబీవీపీ నాయకులు మంగళవారం విద్యాసంస్థల బంద్ చేపట్టారు. అశోక్ ఏబీవీపీ నాయకులను వెంటపెట్టుకొని ఉదయం 11 గంటలకు జెడ్పీ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి.. విద్యార్థులను ఇళ్లకు పంపించేయాలని హెచ్ఎం లక్ష్మీదేవిని కోరారు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక.. విద్యార్థులకు భోజనం పెట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి సెలవు ఇస్తానని హెచ్ఎం ఏబీవీపీ నాయకులకు తెలిపారు. అందుకు అశోక్ ససేమిరా అన్నాడు. విద్యార్థులను ఇళ్లకు పంపితే వండిన భోజనం, కోడి గుడ్లు వృథా అవుతాయని, చాలా మంది విద్యార్థినుల తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఉంటారని, పిల్లలు ఇప్పుడు ఇళ్లకు వెళితే మధ్యాహ్నం భోజనంలేక పస్తులుండాల్సి వస్తుందని హెచ్ఎం వివరంగా తెలియజేశారు. అయినప్పటికీ వినిపించుకోని అశోక్ ‘మీకు మెంటలా? చెబుతుంటే అర్థం కావటం లేదా?’ అని పరుష పదజాలంతో గద్దిస్తూ, దురుసుగా ప్రవర్తించటంతో హెచ్ఎం లక్ష్మీదేవి అతని చెంప ఛెళ్లుమనిపించారు. -
దారి తప్పుతున్న యువత.. ప్రమాదంలో భవిత
‘రాయచోటికి చెందిన ఐదుగురు యువకులు పగలు కూలి పనులు చేస్తూ రాత్రులలో చోరీలు చేసేవారు. చెడు వ్యసనాలకు బానిసలు కావడంతో వచ్చే కూలీ డబ్బులు సరిపోక కనిపించిన వస్తువు ఎంత విలువైనది అనేది కాకుండా అన్నింటినీ చోరీ చేసేవారు. ఆటోలకు ఉన్న బ్యాటరీలు, సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు వంటివి దోచుకెళ్లి జల్సాలు చేసుకునేవారు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు’. ‘మదనపల్లె టూటౌన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి చోరీ చేసే ముఠాను పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరూ పాతికేళ్ల వయస్సు కుర్రాళ్లే. వీరు టెన్త్, ఇంటర్ చదివి విలాసాలకు అలవాటు పడి నేరస్తులుగా మారారు’. ‘మదనపల్లె మండలానికి చెందిన వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతూ ఖర్చులకు డబ్బులు లేక రాత్రి పూట రహదారుల్లో తిరుగుతూ దోపిడీలకు పాల్పడేవారు. మారణాయుధాలతో వాహనదారులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను దోపిడీ చేసేవారు. ఎట్టకేలకు పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు’. ‘అతడు విద్యావంతుడు. విలాసాలకు అలవాటు పడి మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు చోరీ చేసేవాడు. ఇతని వయస్సు కేవలం 25 ఏళ్లే. బైకు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు’. ‘చెడు అలవాట్లకు బానిసలై.. గంజాయి సేకరించి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను మదనపల్లె పట్టణ పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు’. ‘మదనపల్లెకు చెందిన నలుగురు యువకులు కలిసి కార్లను బాడుగకు తీసుకువచ్చి కుదవకుపెట్టి, మళ్లీ అదే కార్లను చోరీ చేసేవారు. వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు’. సాక్షి, మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలపై పెద్దల పర్యవేక్షణ కొరవడటం, వారితో తగినంత సమయం గడపలేకపోవడం వంటివి ఈ తరహా ప్రవర్తనకు కారణమవుతున్నాయి. అరచేతిలో ఇమిడిన సాంకేతిక ఆయుధం సెల్‌ఫోన్ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పిల్లలే ప్రపంచంగా కష్టపడుతున్న తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మెలిగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అనర్థాలపై యువకులకు అవగాహన నేరాల వల్ల జరిగే అనర్థాల గురించి యువకులకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాం. యువత మంచి మార్గంలో నడవాలి. బిడ్డలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. వారిని వదిలేస్తే చెడుదారుల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడతారు. – రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె. నైతిక విలువలు ప్రధానం పిల్లలకు మార్కులు కాదు. బిహేవియర్ క్వాలిటీస్ ప్రధానం. నైతిక విలువలు బోధించే పెద్దలు ఇంట్లో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. నీతి శతకాలు, పురాణగాథలు చిన్నారులకు సన్మార్గంలో నడిపించడానికి ఎంతో ఉపకరిస్తాయి. – జల్లా లలితమ్మ, బాలల హక్కుల ఐక్య వేదిక అధ్యక్షురాలు విలువలు నేర్పించాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలి. దీని బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తీసుకోవాలి. పిల్లలు అధిక సమయం పాఠశాలల్లోనే గడుపుతారు. వారికి నీతి కథలు, మంచి, చెడు గురించి సూక్తులు బోధించాలి. – ఎస్.మహమ్మద్ అయూబ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రాయచోటి. సమాజం పెను సవాళ్లను ఎదుర్కొంటోంది యువత వ్యసనాలకు లోనై నేరమార్గం వైపు అడుగులు వేస్తున్నారు. మద్యం, మత్తు మందులు, సిగరెట్లను స్టేటస్ సింబల్‌గా, హీరోయిజంగా భావిస్తున్నారు. చదువులకు క్రమంగా దూరమై కొత్తదనం కోరుకుంటూ నేరపూరిత వాతావరణంలోకి జారిపోతున్నారు. విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తనను నేర్పేందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. – డాక్టర్ రాధిక, మానసిక వైద్యనిపుణురాలు, మదనపల్లె -
పండుగలా వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలు
సాక్షి, అనకాపల్లి/సాక్షి ప్రతినిధి ఒంగోలు/సాక్షి రాయచోటి: వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహం నడుమ పండుగ వాతావరణంలో ప్లీనరీలు జరిగాయి. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించిన ప్లీనరీలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ప్లీనరీ పరిశీలకుడు చొక్కాకుల వెంకట్రావ్, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమిట్టలో నిర్వహించిన ప్లీనరీకి టీటీడీ బోర్డు సభ్యుడు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ అధ్యక్షత వహించగా.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ప్లీనరీ పరిశీలకుడు తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకటరాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిర్వహించిన ప్లీనరీలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ్‌బాషా, ప్లీనరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్ తదితరులు పాల్గొన్నారు. -
జంగిల్ సఫారీ.. ఆనందాల సవారీ
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రెడ్‌ఉడ్ జంగిల్ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించే విధంగా హోర్డింగ్స్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. తెల్లదొరల కాలం నుంచే.... తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. శేషాచలం ఇలా.. రాజంపేట డివిజన్లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్‌గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్‌వుడ్ జంగిల్ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. పర్యాటకులకు అనుకూలంగా.. అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్ పార్కు, ఐరన్‌వాచ్‌టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్‌టవర్‌ను ఏర్పాటుచేశారు. జంగిల్ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం సేదతీరే..సఫారీ నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. పర్యాటకులకు అనుమతితో సఫారీకి వెళుతుంటారు. ఇందుకోసం గతంలో వాహనాలను కూడా అందుబాటులో ఉంచేది. వనవిహారం స్కీం.. వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాలు, సోలార్ విద్యుత్‌ను ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 లు ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రాత్రి వేళలో ఉండేందుకు వీలులేని పరిస్థితి. జంగిల్ సఫారీ వాహనం రూ.2 లక్షలతో మరమ్మతులు చేసి పర్యాటకుల తిరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్‌వుడ్ జంగిల్ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్‌లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
పెళ్లి తర్వాత ప్రేమ.. అనాలోచిత నిర్ణయం తెచ్చిన అనర్థం
నిమ్మనపల్లె (అన్నమయ్య జిల్లా): ఒక్క అనాలోచిత నిర్ణయం..నిండు జీవితాన్ని బలితీసుకుంది. ఉన్నతంగా చదువుకొన్న విద్యాధికులు ఉన్నంతంగా ఆలోచించలేకపోవడం...చదువుతో పాటు నేర్చుకోలేని సంస్కారం.. కారణంగా రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. యువతి వందేళ్ల జీవితం మూడు నెలల కాలానికే మృత్యువుకు అర్పితమైంది. వైవాహిక జీవితంపై సరైన అవగాహన లేక ..పెళ్లి తరువాత ప్రేమిస్తే వచ్చే అనర్థాలను గుర్తించలేక ఒకరు ప్రాణాలను కోల్పోతే..మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు... మరొకరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహారంపంచాయితీ రెడ్డివారిపల్లెకు చెందిన యువతి మూగలమర్రి హర్పిత(27), అనాలోచిత నిర్ణయం నేపథ్యం..రెడ్డివారిపల్లె గ్రామంలోని ఎం.నరసింహులు, క్రిష్ణమ్మ దంపతులకు కుమారుడు అరవింద్, కుమార్తె హర్పితలు ఉన్నారు. తండ్రి నరసింహులు వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామంలో లాండ్రీషాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు తిరుపతిలో ప్రైవేట్‌జాబ్ చేస్తుండగా, హర్పిత సైతం తిరుపతిలోని జ్యువలరీ షాపులో సేల్స్‌గర్లగా పనిచేస్తోంది. తెలుగు సబ్జెక్టులో బీఎడ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఈమెకు గత మార్చి నెల20వ తేదీన చిత్తూరు జిల్లా పలమనేరు గంట ఊరుకు చెందిన జాషువాతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరి మధ్య సఖ్యతలేకుండా పోయింది. కారణం..ఆమెకు పుంగనూరు మేలుపట్ల చెందిన రాజేష్‌రెడ్డితో పరిచయం ఉండటమే. మేలుపట్లకు చెందిన వెంకటరమణారెడ్డికి రాజేష్‌రెడ్డి సొంత కొడుకు కాగా, జాషువాను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. జాషువా పౌల్ట్రీ రంగంలో పనిచేస్తూ నిమ్మనపల్లె మండలంలో కోళ్ల ఫారాలకు అవసరమైన మందులు సరఫరా చేస్తూ ఉండేవాడు. రాజేష్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో స్కిల్‌డెవలప్‌మెంట్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్డివారిపల్లెకు చెందిన హర్షితతో జాషువాకు పెళ్లి నిశ్చతమైంది. అయితే పెళ్లిచూపుల సమయంలో, షాపింగ్‌లో, ఫంక్షన్లో వీరిద్దరూ హర్పితతో కలిసి తిరిగారు. ఈ సమయంలో రాజేష్‌రెడ్డితో హర్పితకు పరిచయం ఏర్పడి బలపడింది. జాషువాతో పెళ్లి జరిగిపోయింది. భర్తపై నిరాసక్తత ప్రదర్శించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. విషయం తెలిసిన రాజేష్‌రెడ్డి తల్లి హర్పితను మందలించింది. భర్తతో సఖ్యతగా ఉండాలంటూ సూచించింది. అయితే ఆ మాటలను పెడచెవిన పెట్టింది. రాజేష్‌రెడ్డితో పరిచయం కొనసాగించింది. యధావిధిగా తిరుపతిలోని జ్యువలరీషాపులో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. ప్రమాద నేపథ్యం ఈనెల13వ తేదీ సోమవారం రాత్రి రాజేష్‌రెడ్డి ఇంటి వద్ద రూ.లక్ష నగదు తీసుకుని కారుతోపాటు అదృశ్యమయ్యాడు. కుమారుడి అదృశ్యంపై తండ్రి వెంకటరమణారెడ్డి పుంగనూరు పోలీస్టేషన్లో14వ తేదీ ఫిర్యాదు చేశాడు. రాజేష్‌రెడ్డి ఉపయోగించిన కారు మదనపల్లెలోని దేవతానగర్ వద్ద పోలీసులు గుర్తించారు. కారులో సీట్లుకాలిపోవడం, పెట్రోల్ , డీజిల్ వాసన రావడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజేష్‌రెడ్డి ఉన్న లొకేషన్ గుర్తించి తండ్రి వెంకటరమణారెడ్డి, పుంగనూరు పోలీసులు ఇన్నోవా వాహనంలో విజయవాడకు వెళ్లారు. అక్కడ రాజేష్‌రెడ్డితో హర్పిత ఉండడం గుర్తించారు. వారిని తీసుకుని వస్తుండగా ఒంగోలు వద్ద హైవేపై వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొని , లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హర్పిత అక్కడికక్కడే మృతి చెందింది. రాజేష్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్ తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితుల్లో ఒంగోలు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహం రాక ఆలస్యం శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హర్పిత మృతదేహం శనివారం రాత్రి వరకు స్వగ్రామం రెడ్డివారిపల్లెకు చేరుకోలేదు. తండ్రి నరసింహులు సోదరుడు అరవింద్ శుక్రవారమే ఒంగోలుకు వెళ్లారు. మృతదేహంకోసం గ్రామంలోకుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. హర్పిత తెలుగు బీఎడ్ పూర్తి చేసింది. రాజేష్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఉన్నతంగా చదువుకున్నా ఉన్నతంగా ఆలోచించలేకపోయారు. చదువుతోపాటు నేర్చుకున్న సంస్కారాన్ని మరిచిపోవడంతోఒకరు తనువు చాలిస్తే, మరొకరు సమాజంలో గౌరవం కోల్పోవాల్సి వచ్చింది. మరొకరి జీవితం ప్రశ్నార్థకం అయింది. పెళ్లి తర్వాత ప్రేమ అనర్థమే.. పెళ్లి తరువాత ప్రేమైనా వ్యామోహమైనా , అక్రమ సంబంధాలైనా అనర్థాలే తెచ్చిపెడుతాయి. వీటివల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్న జంటలను నిత్యం చూస్తున్నాం. ఇప్పటికైనా యువతీ యువకుల ఆలోచనలోమార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది -
88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..
రాయచోటిటౌన్: అక్రమ మద్యంపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో ధ్వంసం చేశారు. అడిషనల్ ఎస్పీ రాజ్‌కమల్ కథనం మేరకు.. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.92 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. (క్లిక్: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!) -
ఆశాజనకంగా వంగ సాగు
రైల్వేకోడూరు: ప్రస్తుతం రైతులు ఆరుతడి, అంతర పంటలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలో వంగ పంటను సుమారు 130 ఎకరాలలో సాగుచేశారు. ఈ ఏడాది వంకాయలు కిలో రూ. 50 నుంచి రూ. 60 ధర పలకడంతో రైతులు ఆశాజనకంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు వంగ నారును అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, బాకరాపేట నర్సరీల నుంచి సేకరించి నారుమడులలో పెంచుతారు. అనంతరం ఆధునిక వ్యవసాయ పద్ధతిలో దుక్కి దున్నిన పొలంలో వంగ నారుని నాటుతారు. సాధారణంగా ఎకరా వంగ సాగుకు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరాకు సుమారు 10 నుంచి 13 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే గత ఏడాది వంగ కిలో 40 రూపాయలు ధర ఉండగా ప్రస్తుతం కిలో రూ. 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. ఎకరానికి ఖర్చులు పోను రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోందని రైతులు అంటున్నారు. ►ముఖ్యంగా వంగను ఎక్కువగా నల్లిపురుగు, బూడిదతెగులు, కాండం తొలుచు పురుగు, పచ్చ పురుగు అధికంగా ఆశిస్తాయి. వీటిని సకాలంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని రైతులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో పండించిన వంగ పంటను రైల్వేకోడూరు మార్కెట్లోను, తిరుపతి మార్కెట్‌కు తరలిస్తుంటారు. ఈ ఏడాది వంగసాగు ఆశాజనకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
రాయచోటి టౌన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని డ్వామా డీడీ చిన్నపెద్దయ్య సూచించారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటి డ్వామా కేంద్రంలో జిల్లాలోని మండలాల జాతీయ ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీవోలు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత మూడు సంవత్సరాలుగా జరిగిన ఉపాధి పనులపై సమీక్షించుకోవాలని చెప్పారు. వీటిలో ఏ సంవత్సరంలో ఎక్కువ పనిదినాలు జరిగాయనే అంశాలను తీసుకొని జరిగిన ఎక్కువ రోజులకు మరో 20శాతం కలుపుకొని దానినే టార్గెట్‌గా చేసుకోవాలన్నారు. రాబోవు రోజులలో దీనినే టార్గెట్ చేసుకొని ఆ పద్ధతి ప్రకారం పనిదినాలు పెంచాలని చెప్పారు. అలాగే పర్యావరణాన్ని కాపాడే విధంగా అన్ని ప్రధాన రోడ్ల వెంట మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను అధికారులందరూ కలసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జీఎస్ కౌన్సిల్ సభ్యుడు విశ్వనాథం, పీడీ శివప్రసాద్, ఏపీడీలు, ఏసీలు, ,అధికారులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు కొత్త కళ
బి.కొత్తకోట : అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా రెండోదశ సాగు, తాగునీటి ప్రాజెక్టులో అంతర్భాగంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే రామసముద్రం ఉపకాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ పనులకు సర్వేకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా ఆ పనులు పూర్తయ్యాయి. ఈ రెండింటికి పాలనాపర అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. గుర్రంకొండ మండలంలో కొత్తగా రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కార్యరూపం దాల్చుతోంది. దీనికి సంబంధించి స్టేజ్–1 పనులు పూర్తయ్యాయి. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల 13న జరిగే రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలపనుంది. గడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానుండగా, కుప్పం ఉపకాలువ మిగులు పనులు సత్వరమే పూర్తి చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కొత్త పథకాల రూపకల్పనతో ప్రాజెక్టు విస్తరణ పెరిగి, రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలగనుంది. రూ.359 కోట్లతో రెడ్డెమ్మకోన రిజర్వాయర్ గుర్రంకొండ మండలం చెర్లోపల్లె వద్ద ప్రభుత్వం ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించింది. దీనికి సంబంధించి తొలిదశ సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక పూర్తయ్యాయి. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను రిజర్వాయర్‌కు మళ్లించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ నుంచి కృష్ణా జలాలను తరలించి ఎగువతోటపల్లె వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. 5 వేల ఎకరాలకు సాగునీరు, వాయల్పాడు, గుర్రంకొండ మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. హరిహరాదుల చెరువుకు 35 ఎంసీఎఫ్‌టీ, రామానాయినిచెరువుకు 35 ఎంసీఎఫ్‌టీల నీటిని మళ్లించి నింపుతారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.359 కోట్లతో ప్రభుత్వానికి నివేదించారు. స్టేజ్–1 స్థాయి పనులు పూర్తి కావడంతో పాలనాపరమైన అనుమతి కోసం నివేదికను చీఫ్ ఇంజినీర్, ప్రభుత్వానికి పంపారు. రామసముద్రం ఉపకాలువ మదనపల్లె నియోజకవర్గం నుంచి పుంగనూరు ఉప కాలువ సాగే సుగాలిమిట్ట వద్ద 183.3 కిలో మీటర్ నుంచి రామసముద్రం ఉపకాలువ మొదలవుతుంది. ఇక్కడికి 750 మీటర్ల దూరంలో ఒక ఎత్తిపోత ల పథకాన్ని నిర్మించి రామసముద్రం వరకు 28 కిలోమీటర్ల ఉపకాలువను తవ్వుతారు. దీనికింద 60 చెరువులకు సాగునీరు, 84వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. రామసముద్రం సమీపంలో ఒక రిజర్వాయర్‌ను నిర్మించి, ఇక్కడినుంచి తాగునీటిని గ్రామాలకు సరఫరా చేయాలని ప్రతిపాదన ఉంది. కాలువ సర్వే, సమగ్ర నివేదిక కోసం ప్రభు త్వం రూ.1.03కోట్లను మంజూరు చేయగా టెండర్ పొందిన సంస్థ సర్వే పూర్తిచేసి నివేదిక సమర్పించింది. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవా ఉపకాలువ ప్రారంభం అవుతుంది. ఇది చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కమ్మపల్లె మీదుగా సాగుతుంది. కమ్మపల్లె వద్ద 54.350 కిలోమీటర్ నుంచి రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల మట్టికాలువను తవ్వుతారు. కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించడంతోపాటు రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, పులిచర్ల మండలాల్లోని 25వేల మంది జనాభాకు తాగునీ టిని అందించాలన్నది లక్ష్యం. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను నీ వా కాలువ ద్వారా మళ్లిస్తారు. దీని సమగ్ర సర్వే, ప్రా జెక్టు నివేదిక రూపొందించడం కోసం రూ.59.22 లక్షలతో సర్వే పనులు పూర్తవగా రూ.73.43 కోట్లతో ప నులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికింద 24 చెరువులకు నీటిని అందించి 2,580 ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్నది లక్ష్యం. త్వరలో గుడిసిబండ పనులు ప్రాజెక్టు పరిధిలోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో 4వేల ఎకరాలకు సాగునీరు అందించే గుడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 1,400 ఎకరాలు చెరువులకింద, 2,600 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఈ పనులకు టెండర్లు పూర్తవగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించనున్నారు. రూ.21.05 కోట్లతో పనులకు ఒప్పందం జరిగింది. బాహూదాకు కృష్ణా జలాలు నిమ్మనపల్లె మండలంలోని బాహూదా రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించే ప్రతిపాదన ప్రభుత్వానికి వెళ్లింది. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనుల్లో భాగంగా ఈ నీటిని తరలించే పనులను కలిపారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 173.00 నుంచి పిల్లకాలువను తవ్వి బాహుదా ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను తరలిస్తారు. అలాగే వాయల్పాడు మండలంలో పాలమంద డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. వాయల్పాడు ఉపకాలువ కిలోమీటర్ 23.500 వద్ద నుంచి పిల్లకాలువ తవ్వి 2,100 ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. దీని ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. పీబీసీపై 13న ఎస్‌ఎల్‌టీసీ భేటీ పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై ఈ నెల 13న జలవనరులశాఖ రాష్ట్రస్థాయి సాంకేతిక క మిటీలో చర్చించి అమోదం తెలపనుంది. రూ.1,929 కోట్లతో ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు, సాంకేతిక అనుమతులను ఇప్పటికే మంజూరు చేసింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె వద్ద కిలోమీటర్ 79 నుంచి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం తిమ్మిరెడ్డిపల్లె వద్ద 220.350 కిలోమీటర్ వరకు పుంగనూరు ఉపకాలువ సాగుతుంది. ఈ కాలువ 140.75 కిలోమీటర్లు ఉండగా కుడివైపున కాలువను 4.8 మీటర్ల వెడల్పు చేయనున్నారు. కాలువ సామర్థ్యం ప్రకారం ఒక్కో పంపు 100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. కాలువలో 1,180 క్యూసెక్కుల నీళ్లు ప్రవహించేలా నిర్మాణాలు చేపడతారు. వేగంగా చర్యలు హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పూర్తికి వేగంగా చర్యలు చేపట్టాం. రెడ్డెమ్మకోన రిజర్వాయర్, రామసముద్రం కాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి పాలనాపర ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాం. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై కమిటీ నిర్ణయం తర్వాత చర్యలు వేగవంతం అవుతాయి. కొత్త పథకాలకు రూపకల్పన చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించాం. – రాజగోపాల్‌రెడ్డి, ఎస్ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు కుప్పంకు కొత్త కాంట్రాక్టర్ గత టీడీపీ హయాంలో కుప్పం ఉపకాలువ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ అందినంత దోచుకొని 2019 నుంచి పనులను నిలిపివేసింది. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా ఖాతరుచేయలేదు. మిగిలిపోయిన రూ.117.18 కోట్ల పనులను కాంట్రాక్ట్ సంస్థ నుంచి తొలగించారు. ఇదే విలువకు పనులు చేపట్టాలని పలు కాంట్రాక్ట్ సంస్థలను ప్రభుత్వం కోరగా హైదరాబాద్‌కు చెందిన నాలుగైదు నిర్మాణ సంస్థలు స్పందించాయి. ఆ కంపెనీల సాంకేతిక అధికారులు ప్రస్తుతం కుప్పం కాలువలో మిగిలిన పనులను పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక మిగులుపని విలువతో పనులు చేసేందుకు ముందుకొస్తే టెండర్లు లేకుండా అప్పగించేందుకు నిర్ణయిస్తారు. లేనిపక్షంలో ప్రస్తుత నిర్మాణ ధరల ప్రకారం అంచనావేసి టెండర్లను ఆహ్వానించనున్నారు. -
'టెన్'షన్ వద్దు!
మదనపల్లె సిటీ: కోవిడ్ మహమ్మారితో రెండు సంవత్సరాలుగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు సజావుగా నిర్వహించారు. ఎలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. అనంతరం మూల్యాంకనాన్ని శరవేగంగా పూర్తి చేశారు. ఈ కసరత్తు పూర్తి కావడంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర స్థాయిలో ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు 153 కేంద్రాల్లో నిర్వహించగా 23,752 మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు విడుదలవుతుండటంతో పిల్లలకు మార్కులు ఎలా వస్తాయోనని తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరో వైపు జిల్లా ఏ స్థానంలో నిలుస్తుందోనని అ«ధికారుల్లో సైతం ఆసక్తి నెలకొంది. గతంలో పరీక్షలలో మార్కులు తగ్గాయంటూ చాలా మంది పిల్లలు అ«çఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటనలూ లేకపోలేదు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చిన సందర్భాలు కనిపించేవి. ఈ నేపథ్యంలో సోమవారం పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయి. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రుల బాధ్యత తదితర అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక వైద్యనిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫలితాలు ర్యాంకులే జీవితం కాదు జీవితంలో పరీక్షా ఫలితాలు వాటి ర్యాంకులే ముఖ్యం కాదు. కాలం, ప్రాణాన్ని మించి ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఓటమి గెలుపునకు తుదిమెట్టు అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించుకోవాలి. ఫలితాలు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుంది. క్షణికావేశానికి లోనుకావద్దు పది పరీక్షల ఫలితాలు వచ్చిన సమయంలో విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకూడదు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగితే జీవిత లక్ష్యాలను చేరుకోవచ్చు. మార్కులు తక్కువ వచ్చాయని ఒత్తిడికి గురై క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని బుగ్గిపాలు చేస్తాయి. ఒక్క నిమిషం ఆలోచిస్తే సమస్య పరిష్కారానికి పలు మార్గాలు లభిస్తాయి. –ఎల్.బి.మహేష్‌నారాయణ, విద్యావేత్త, మదనపల్లె భయాందోళనకు గురిచేయవద్దు పది ఫలితాల వ్యత్యాసం చూపుతూ పిల్లల్ని భయాందోళనలకు గురి చేయరాదు. విద్యార్థులు కూడా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పది పరీక్షలే జీవితాన్ని నిర్దేశించే పరీక్షలేమి కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. –డాక్టర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె ప్రోత్సహించండి మార్కులు తక్కువ వచ్చాయని అఘాయిత్యాలకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. ఉద్యోగాలు సాధించేందుకు, ఉన్నత చదువులకు వెళ్లేందుకు మార్కులు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. నైపుణ్యాలు పెంచుకుని భవిష్యత్తులో మంచి ప్రతిభ కనబరిస్తే సరిపోతుంది. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. వారిలో ధైర్యాన్ని నింపాలి. –ఎం.జయకుమార్, సైకాలజిస్టు, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె -
అరటి సాగు.. రైతన్నలకు కాసుల వర్షం
రాజంపేట టౌన్: అరటి సాగు అనగానే రైతులకు, ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు. అనాదిగా ఈ నియోజకవర్గాల్లోని రైతులు అధికంగా అరటి సాగుచేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రస్తుతం ఉన్న ధరలు ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం టన్ను (బాక్సుల్లో ఎగుమతి చేసేవి ) 18వేల రూపాయలకు పైగా ధర పలుకుతుంది. ఈ విధానంలో ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు ఖర్చులు పోను పది లక్షల రూపాయల వరకు లాభాలను అర్జిస్తున్నారు. అలాగే గెలలతో ఎగుమతి చేసే అరటి 16వేల రూపాయిలకు పైగా ధర పలుకుతోంది. ఈ విధానంలో అరటిని ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు తొమ్మిది లక్షల రూపాయలకు పైగా లాభాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉంటే 2017వ సంవత్సరంలో ఇలాంటి ధరలే పలికాయి. అనంతరం ఇంతటి ధర ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేక పోవడంతో రైతులకు లాభాలు అంతంత మాత్రమే ఉండేవి. హెక్టారుకు డెబ్బై టన్నుల దిగుబడి ఈ ఏడాది అరటి దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది. హెక్టారుకు దాదాపు 70 టన్నుల దిగుబడి వచ్చింది. ఫలితంగా రైతులు ఘననీయంగానే ఆదాయం పొందుతున్నారు. ఒక హెక్టారు అరటి పంట సాగు చేసేందుకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఇందువల్ల టన్ను 18 వేలకు విక్రయించే వారికి ఖర్చులు పోను పది లక్షలకు పైగా, 16వేలకు విక్రయించే రైతులకు తొమ్మిది లక్షలకు పైగా మిగులుతుంది. ప్రస్తుతం పచ్చఅరటి, అమృతపాణి, కర్పూర చక్కర కేలి, సుగంధాల రకాల అరటిని రైతులు కోస్తున్నారు. ధర పెరుగుదల ఎందుకంటే..... అరటి పిలకలను పూడ్చిన తర్వాత ఏడాదికి పంట చేతికి వస్తుంది. గత ఏడాది మే నెలలో వేసిన పంట ఇప్పుడు చేతికి వచ్చింది. అయితే గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో సంభవించిన భారీ వరదలకు అనేక మందికి చెందిన అరటి తోటలు వరల ధాటికి కొట్టుకు పోయాయి. ఫలితంగా పంట భారీగా తగ్గింది. ప్రస్తుతం అమాంతంగా పెరిగిన ధరలకు పంట తక్కువగా ఉండటమేనని రైతులు అంటున్నారు. అస్సలు ఊహించలేదు ప్రస్తుతం అరటి పంటకు ఉన్న ధరను అసలు ఊహించలేదు. నేను పదకొండు ఎకరాల్లో అరటి సాగుచేశాను. వరదలకు నా పంట దెబ్బతినలేదు. ప్రస్తుతం ఉన్న ధరకు నాకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆదాయం వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. – ముక్కా చెంగల్‌రెడ్డి, రైతు, కొర్లకుంట, ఓబులవారిపల్లె మండలం ఐదు రాష్ట్రాలకు ఎగుమతి రాజంపేట, రైల్వేకోడూరు నియోజవర్గాల్లోని రైతులు పండించే అరటి నాణ్యత ఉంటుంది. అందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారులు పంట కోతకు రావడానికి రెండు నెలల ముందు నుంచే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతారు. ఈ నియోజకవర్గాలకు చెందిన రైతులు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తమ పంటను ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం చాలామంది రైతులకు చెందిన పంట కోతకు రావడంతో పల్లెసీమల నుంచి జోరుగా అరటి రవాణా సాగుతుంది. -
రెండు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం
మోపిదేవి (అవనిగడ్డ)/మదనపల్లె టౌన్: రాష్ట్రంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి బృందంతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడి కృష్ణా జిల్లాలో ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన మరో ఘటనలో నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పి చెరువులో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలులో జరుగుతున్న శుభకార్యానికి సుమారు 30 మందితో చల్లపల్లి మండలం చింతలమడ నుంచి ట్రక్కు బయలుదేరింది. డ్రైవర్ బత్తు రామకృష్ణ అతి వేగంతో ట్రక్కు నడపడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కోన వెంకటేష్(70), భూరేపల్లి కోటేశ్వరమ్మ(55), భూరేపల్లి రమణ(45)లు అక్కడికక్కడే మృతిచెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మాధవరావు, గుర్రం విజయ (48) చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇద్దరు పిల్లలతో సహా భార్యభర్తల దుర్మరణం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గంగిరెడ్డి.. పలమనేరులో బుధవారం సాయంత్రం జరిగిన వివాహానికి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యాడు. సోదరి ఇంట జరిగే గృహ ప్రవేశానికి హాజరవ్వాలన్న ఆత్రుతతో గురువారం వేకువ జామునే కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరాడు. మదనపల్లెకు మరో 5 నిమిషాల్లో చేరుకుంటాడనగా 150వ మైలు వద్ద మెరవపల్లె చెరువు కల్వర్టును కారు ఢీకొట్టి చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గంగిరెడ్డి(40)తో పాటు అతడి భార్య మధుప్రియ(28), కుమార్తె ఖుషితారెడ్డి(5), కుమారుడు దేవాన్స్‌రెడ్డి(3)లు దుర్మరణం పాలయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతితో రెడ్డివారిపల్లె కన్నీటి సంద్రమైంది. -
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లి గ్రామ పరిధిలోని పుంగనూరు రోడ్డులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల ప్రకారం.. పుంగనూరు రోడ్డులోని 150 మైలు వద్ద కారు కల్వర్టును ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాద ఘటనపై స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులందరూ మదనపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఇది కూడా చదవండి: స్నేహితుడికి నమ్మక ద్రోహం.. అంతటితో ఆగకుండా.. -
హార్సిలీహిల్స్‌లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రెవెన్యూ భూ ఆక్రమణలపై మదనపల్లె ఆర్డీఓ ఎంఎస్.మురళీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం తహసీల్దార్ కీతలం ధనుంజయలు, ఎంపీడీఓ శంకరయ్య, డీఎల్పీఓ లక్ష్మీ, ఏఈ సంతోష్‌గౌడ్‌లతో సమావేశమయ్యారు. ఇక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం టూరిజం అసిస్డెంట్ మేనేజర్ నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, అధికారులతో కలిసి కొండపై ప్రతి నిర్మాణాన్ని, ఆక్రమిత స్థలాలను స్వయంగా పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ ప్రాంగణానికి తాళం కొండపై బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్వహణ కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. ఈ భవనాన్ని ప్రయివేటు వ్యక్తులకు లీజుకు అప్పగించడంతో ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు, పాత భవనాన్ని ఆధునికీకరించడం, ఖాళీ స్థలంలో కొత్తగా నిర్మాణాలు, అతిథిగృహలను నిర్మించారు. వీటిని పరిశీలించిన ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో ఆధునికీకరణకు, అతిథిగృహల నిర్మాణాలకు ఎవరి అనుమతి పొందారు, లీజు నిబంధనలు ఏమిటి, దేన్ని లీజుకు ఇచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి అనుమతి ఉందని అక్కడివారు చెప్పడంతో పత్రాలతో కార్యాలయానికి రావాలని అంతవరకు పనులు నిలిపివేసి తాళం వేయాలని ఆర్డీఓ ఆదేశించగా గేటుకు తాళం వేశారు. బీఎస్ఎన్ఎల్కు కేటాయించిన రెవెన్యూ భూమి కేటాయింపును రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ ప్రకటించారు. కొండపై కోర్టుకేసులు నడుస్తున్న వివాదాస్పద భూముల్లో జరిగిన భారీ నిర్మాణాలను ఆర్డీఓ పరిశీలించారు. వీరు నిర్మాణాలు చేసుకోవడమేకాక రోడ్డును అక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తీర్ణం గుర్తించేందుకు తక్షణం సర్వే నిర్వహించి మార్కింగ్ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. కొండపై రెవెన్యూ స్థలాలను ఆక్రమించుకొని వాణిజ్య, గృహ నిర్మాణాలు చేసుకొన్న వారితో ఆర్డీఓ మాట్లాడారు. ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. మీరు నిర్మించుకున్న నిర్మాణాలకు స్థలాన్ని ఎవరు కేటాయించారు, ఎవరి అనుమతి పొందారని ప్రశ్నించారు. కొండపై రెవెన్యూ భూమిని ప్రయివేటు సంస్థలకుకాని, వ్యక్తులకు కాని కేటాయించలేదు. అలాంటప్పుడు ఎలా ఇంటి నిర్మాణాలు చేశారని ప్రశ్నిస్తూ..ఇకపై గృహలు, దుకాణాలు హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీకి చెందుతాయని, ఎవరైనా ఇక్కడ ఉండాలంటే అద్దెలు చెల్లించాలని కోరారు. విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు రెవెన్యూ స్థలాల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకొన్న వారికి డిస్కం అధికారులు ఏ హక్కు పత్రాలతో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని ఆర్డీఓ మురళీ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై డిస్కం అధికారులతో సమావేశం నిర్వహించి కనెక్షన్లను టౌన్షిప్ కమిటీ పేరుపై బదిలీ చేయిస్తామని చెప్పారు. కొండపై ఇటుక పేర్చాలన్నా, కదిలించాలన్నా టౌన్షిప్ కమిటీ అనుమతి తప్పనిసరని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపై ప్రభుత్వశాఖలకు కేటాయించిన భూములు, వాటి స్థితిగతులు, అసంపూర్తి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను పరిశీలించారు. -
కొలువు సొంతమ(వు)ను
నేటి పోటీ ప్రపంచంలో చదువులు, మార్కులతోపాటు భావ వ్యక్తీకరణ, సాఫ్ట్‌స్కిల్స్ అవసరం.సాంకేతిక విషయ పరిజ్ఞానం, ఆంగ్లభాషపై పట్టు, అంకితభావం విజయంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సీటీ (మను) ఉర్దూ పాలిటెక్నిక్ విద్యార్థులు అంగ్ల మాధ్యమంలోనే కాదు ఉర్దూ మీడియంలో చదువుతూ ఉద్యోగాలను సాధించవచ్చని నిరూపించారు. ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలు సాధించి కొలువులు పొందారు. సంతోషంగా జీవ నం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సీటీ (మను) అనుబంధ సంస్థ అయిన మను పాలిటెక్నిక్ కళాశాల వైఎస్సార్ జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. మను ఆధ్వర్యంలో 2018లో దీనిని దేవుని కడప వద్ద ఏర్పాటు చేశారు. తర్వాతఈ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం కడప రిమ్స్ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్,మినిస్ట్రియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆర్థిక సహాయం రూ. 20 కోట్లతో నూతన భవనాలు నిర్మించారు. అలాగే రూ. 5 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ , కళాశాల ఆవరణ మొత్తం ప్రహరీని ఏర్పాటు చేశారు. నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్‌లోని దర్బాంగ, ఒరిస్సాలోని కటక్, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వందశాతం ఉత్తీర్ణత: ఈ కళాశాలలో 2021 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతను సాధించారు. గతేడాదికి సంబంధించి పలువురు విద్యార్థులు కొలువులను సాధించారు. ఈ సంవత్సం పలువురు ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌ను తీసుకుంటున్నారు. ఇందులో రేణిగుంటలోని అమర్‌రాజా కంపెనీ, కడప ఎండీహెచ్ గ్రూపు, బెంగళూరు మెగాస్ట్రక్చర్, బీహార్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ముంబై, ఝార్జండ్లోని ఆల్ట్రాటెక్లలో అప్రెంటీస్ పూర్తి చేసి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలను పొందారు. ఉద్యోగాలకు ఎంపికైన కంపెనీల్లో వార్షిక జీతం 1.50 లక్షల నుంచి 3 లక్షల వరకు పొందుతున్నారు. అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన నేటి సాంకేతిక యుగంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మను ఉర్దూ పాలిటెక్నిక్ కళాశాలలో కోర్సులు రూపకల్పన చేశారు. ఇందులో డిప్లమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు టెక్నికల్ పరంగా ఉండటంతో కొలువులు అందిపుచ్చుకుంటున్నారు. యూనివర్సిటీలో పలువురు ఉన్నత చదువులు ... మను పాలిటెక్నిక్‌లో కోర్సులు పూర్తి చేసిన మరి కొంత మంది విద్యార్థులు పలు యూనివర్సిటీలలో ఉన్నత చదువులు చదువుతున్నట్లు కళాశాల సిబ్బంది తెలిపారు. మను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న 27 మంది చెన్నైలోని పోరెసియా ఇండియా లిమిటెడ్, మరో 10 మంది హిందూపూర్‌లోని టెక్స్ఫోరులో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ ముఖ్సిత్‌ఖాన్, ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ డ్టాక్టర్ హకీముద్దీన్ తెలిపారు. తొలిప్రయత్నంలోనే... నేను మదరసా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి కడప మను పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే సౌదీ అరేబియాలో బేటూర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా ఎంపికయ్యాను.నెలకు రూ.40 వేల జీతం వస్తుంది. నేను మను పాలిటెక్నిక్‌లో చదువుకున్నందుకు గర్వంగా ఉంది. – ఆతిఫ్ ఆలం, దర్బాంగ, బీహార్. సంతోషంగా ఉంది... నేను మోకానికల్ ఇంజినీరింగ్ చేశాను. చదువు పూ ర్తికాగానే కడపలోని ఎండీహెచ్ హుందాయిలో స్పేర్‌పార్ట్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రస్తుతం నెలకు 10 వేలు జీతం వస్తుంది. – అసదుల్లాహ్ అజాం, ఉత్తరప్రదేశ్ ఆనందంగా ఉంది నా పేరు షేక్ నిజాముద్దీన్, కడపలోని మాసాపేట. నేను కడపలోని మున్సిపల్ ఉర్దూ బాయిస్ హైస్కూల్ ఉర్దూ మీడియం చదివా. తరువాత మనులో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను, ఇటీవల కొప్పర్తిలోని త్రివిసిన్ కంపెనీలో క్వాలిటీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది. నా జీతం ఏడాదికి 1,32,000 . చాలా సంతోçషంగా ఉంది. – షేక్ నిజాముద్దీన్, మాసాపేట, కడప. అమర్‌రాజా బ్యాటరీస్‌లో.. నేను మను పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. అమర్‌రాజా బ్యాటరీస్‌లో జె పవర్ సొల్యూషన్స్‌గా పనిచేస్తున్నాను. నాకు ఏడాదికి 1,44,000 జీతం వస్తుంది. నేను ఉర్దూ మీడియంలో చదివినా ఉద్యోగాన్ని సులభంగా తెచ్చుకున్నాను. – షేక్ ముస్తఫా, కడప ఏపీ ప్రజలకు వరం... మను ఉర్దూ పాలిటెక్నిక్ కళాశాలను కడపలో ఏర్పాటు చేయడం వైఎస్సార్‌జిల్లా ప్రజలతోపాటు ఏపీ ప్రజలకు వరం. ఎలాంటి ఖర్చు లేకుండా ఫీజులతోమాత్రమే పాలిటెక్నిక్‌ను పూర్తి చేయవచ్చు. చదువుకునే విద్యార్థులకు నేషనల్ స్కాలర్ షిప్స్ వంటివి కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ కళాశాలలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖడ్, బెంగాల్, తెలంగాణా రాష్ట్రాలతోపాటు ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. – డాక్టర్ ఎండీ అబ్థుల్ ముఖ్సిత్‌ఖాన్,ప్రిన్సిపాల్, మనుపాలిటెక్నిక్ కళాశాల, కడప ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తున్నాను.. నేను మనులో అప్పీరెల్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్నాను, ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లో భాగంగా హిందూపూరులో టెక్స్ఫోర్టు అప్పిరెల్ స్లీవ్ యూనిట్లో శిక్షణ తీసుకుంటున్నాను. నాతోపాటు మరికొందరు శిక్షణ తీసుకుంటున్నారు. – మొఘల్ నబియా, కడప. సామాజిక బాధ్యత గురించి అవగాహన విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక బాధ్యత అంటే ఏమిటో ఎన్ఎస్ఎస్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఎన్ఎస్ఎస్ క్యాంపుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించడం, రోడ్లు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను చేయిస్తున్నాం. అలాగే మద్యం తాగడం వల్ల ఏం జరుగుతుందో కూడా వివరిస్తున్నాం. – మహమ్మద్ సికిందర్ హుస్సేన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ పోగ్రాం కోఆర్డినేటర్. -
‘ఎర్ర’బంగారం వైపు చూస్తే ఖబడ్దార్
సాక్షి రాయచోటి : అన్నమయ్య జిల్లాలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీసుశాఖ నిఘాను ముమ్మరం చేసింది. సీసీ కెమెరాల ఏర్పాటు మొదలుకొని అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అడవుల్లో అత్యధికంగా విస్తరించిన ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా స్మగ్లర్లు ఎర్రచందనం కూలీలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతోపాటు ఇసుక దొంగలు, మట్కా, గ్యాంబ్లింగ్, దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తులను స్టేషన్‌కు పిలిచి బైండోవర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం అన్ని స్టేషన్లలో నిర్వహించేలా ఎస్పీ హర్షవర్దన్‌రాజు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వేళ్లూనుకున్న నాటుసారా స్థావరాలను కూకటివేళ్లతో పెకలించేలా పోలీసులను కదిలిస్తున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో గొడవలకు సంబంధించి అనుమానాస్పద వ్యక్తులుగా ముద్రపడిన వారితోపాటు రౌడీషీటర్లు, దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులు, ఇసుక దొంగలు, పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. బైండోవర్‌లో భాగంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష, కేసులను బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు బైండోవర్ చేస్తున్నారు. అయితే పాత నేరస్తులకు గతం గతించింది...ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి...అలా కాకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే కచ్చితంగా బైండోవర్ ప్రకారం కేసులతోపాటు పూచీకత్తు కింద రాసిన సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని కరాఖండిగా వివరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నెల రోజుల వ్యవధిలో 850 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం విశేషం. జిల్లాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులతో కలిసి పోలీసులు సంయుక్త దాడులు చేస్తున్నారు. నాటుసారా కాస్తున్న ప్రాంతాలకు వెళ్లి బట్టీలను ధ్వంసం చేయడంతోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 95 నాటుసారా బట్టీలను ధ్వంసం చేయడమే కాకుండా 35 మందిపై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లోకి వెళ్లి నాటుసారా వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఎవరూ కూడా బట్టీలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ‘ఎర్ర’బంగారం వైపు చూస్తే ఖబడ్దార్ జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు ప్రాంతాల్లో విస్తరించిన శేషాచలం, పాలకొండలు ప్రాంతాల్లోని ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ రవాణా నిరోధానికి సంబంధిత స్మగ్లర్లతోపాటు కూలీలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాత కేసులు ఉన్న వారిని కూడా డీఎస్పీ స్థాయి అధికారుల ద్వారా హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని సుమారు 250 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలు, సానుభూతి పరులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు అక్రమ వ్యవహారానికి పాల్పడితే పీడీ యాక్టు నమోదు లాంటి కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లొద్దు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా వాతావరణం కల్పిస్తున్నాం. రౌడీ షీటర్లు, సమస్యలు సృష్టించేవారు, ఇసుక అక్రమ రవాణా చేసేవారు, దొంగతనాలకు పాల్పడే వారిపై ఇప్పటికే పెద్ద ఎత్తున బైండోవర్ కేసులు పెట్టాం. అలా కాదని మళ్లీ నేరాలకు పాల్పడితే కేసులతోపాటు కఠిన చర్యలు ఉంటాయి. ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చెక్‌పోస్టులతోపాటు పోలీసుల వ్యూహాలు అమలు చేస్తున్నాం. ఇప్పటికే 250 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. ప్రతిరోజు ప్రత్యేకంగా అక్రమ రవాణా అడ్డుకోవడం కోసమే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం రౌడీషీటర్లు, ఇతర నేరస్తులు స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసేలా చర్యలు తీసుకున్నాం. నాటుసారాపై కొరడా ఝళిపిస్తున్నాం. – వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ -
ముక్తి పథం.. బ్రహ్మ రథం
బ్రహ్మంగారిమఠం(అన్నమయ్య జిల్లా): పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు. అనంతరం దివంగత మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి దంపతులతోపాటు ఆయన తమ్ముళ్లు, రెండవ భార్య కుమారులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు స్థానిక మఠం మేనేజర్ ఈశ్వరాచారితో కలిసి రథం వద్దకు చేరుకోగానే ఆలయ పూజారులు పూజలు చేశారు.అనంతరం గోవింద నామ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ వెంకటరమణ, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం పరిపాలన ఫిట్పర్సన్ శంకర్ బాలాజీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, ఈశ్వరీదేవిమఠం పీఠాధిపతి వీరశివకుమారస్వామి పాల్గొన్నారు. కిక్కిరిసిన భక్తజనం వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మంగారు, గోవిందమాంబలను కళ్లారా చూసి తరించారు. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా రథోత్సవాన్ని తిలకించేందుకు గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు వేచి ఉండడమేగాకుండా రథోత్సవం ముగిసేంత వరకు ఉన్నారు. రథోత్సవ శుభ్రత బాధ్యత లింగాలదిన్నెపల్లె భక్తులదే ఆరాధన మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మరథోత్సవ శుభ్రత బాధ్యతను మండలంలోని లింగాలదిన్నెపల్లె భక్తుడు ఎల్.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన భక్తులు మూడు రోజుల పాటు చేపట్టారు. గురువారం రథోత్సవం రోజు కూడా కీలకంగా వ్యవహరించారు. రాత్రి గజవాహనోత్సవంలో బ్రహ్మంగారు, గోవిందమాంబలు పురవీధుల్లో తిరిగారు. భారీ పోలీసు బందోబస్తు: మైదుకూరు డీఎస్పీ మురళీదర్‌గౌడ్, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిల ఆధ్యర్యంలో ఎస్ఐ విద్యాసాగర్ పర్యవేక్షణలో జిల్లా నుంచి సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సీలతోపాటు 400 మంది పోలీసులు, హోంగార్డులు, మహిళా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. -
లెక్చరర్ పాడుబుద్ధి.. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ..
తంబళ్లపల్లె(అన్నమయ్య జిల్లా): విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదైంది. వివరాలు.. ఎస్వీయూ సంస్కృత విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న మాధవరెడ్డిని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఓ డిగ్రీ కాలేజీలో పరీక్షల పరిశీలకుడిగా నియమించారు. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ మంగళవారం విద్యార్థినితో మాధవరెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, ములకలచెరువు సీఐ షాదిక్ అలీ, ఎస్ఐ శోభారాణి.. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆరోపణలు నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్! -
పెరటింట..ప్రకృతి తోట
సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయ పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇటు కూరగాయల పంటలకు అంతే ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఒక సెంటు నుంచి ఐదు సెంట్ల ఖాళీ జాగాల్లో కిచెన్ గార్డెన్స్, ఇంటి ఆవరణలో న్యూట్రి గార్డెన్స్, ఇంటిపైన టెర్రస్ గార్డెన్స్ పేరుతో పలు రకాల కూరగాయల పంటలను ప్రోత్సహిస్తోంది. దీనిపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తోంది. ప్రకృతి వ్యవసాయంలో పెరటి తోటలు హైబ్రీడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకానికి స్వస్తి పలికి ప్రభుత్వ సూచనలతో ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గుచూపుతున్న రైతులు అదే సమయంలో ఈ విధానంలో కూరగాయల పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులే కాకుండా భూములు లేని ప్రజలు సైతం తమ ఇళ్ల వద్దనే కొద్దిపాటి స్థలంలో ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు విభాగం సలహాలు, సూచనలతో ఈ తరహా వ్యవసాయానికి వేలాది మంది ఇప్పటికే ›శ్రీకారం చుట్టారు. కొందరు పంట పొలాల్లోనే ఇతర పంటలతోపాటు కూరగాయలు పండిస్తుండగా చాలామంది ఇళ్ల వద్దనే కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 75,452 కిచెన్ గార్డెన్స్ ఏర్పాటయ్యాయి. ఇందులో భూమి లేని పేదలు 24,399 మంది తమ ఇళ్ల వద్దనే ఉన్న ఖాళీ స్థలంలో నేచురల్ ఫార్మింగ్ ద్వారా పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇక నూట్రిగార్డెన్స్ 274 ఉండగా, 186 టెర్రస్ గార్డెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కేవలం పకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తున్న ప్లాంట్లు కావడం గమనార్హం. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని బద్వేలు, కమలాపురం, పులివెందుల, మైదుకూరు, రాయ చోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలతోపాటు పలు నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన నేచురల్ ఫార్మింగ్ కిచెన్ గార్డెన్స్‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ ప్రాజెక్టు కృషి చేస్తోంది. ఈ విభా గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్స్, ఇంటర్నల్ కమ్యూనిటీ సోర్స్ పర్సన్స్, నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు గ్రామాల్లోని గ్రామ సంఘాల ద్వారా అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కిచెన్ గార్డెన్స్, న్యూట్రి గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్‌లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గార్డెన్స్ ఏర్పాటు చేసిన వారు 15–30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు తదితర వాటిని ఈ తరహా వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా పురుగు మందులు ఇక పంటలకు సోకిన తెగుళ్లను నివారించేందుకు నీళ్లలో వేపాకు పిండి, పేడ, కుంకుడు కాయల పొడి తదితర వాటిని కలిపి వడగట్టి దోమపోటుతోపాటు ఇతర తెగుళ్లకు పిచికారీ చేస్తున్నారు. రసాయనిక ఎరువులు,పురుగు మందులు లేకుండా.. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా కిచెన్గార్డెన్స్ను నిర్వహిస్తున్నారు.పోషకాహారం ఎరువు స్థానంలో ఘన జీవామృతం పేరుతో పేడ, పప్పుదినుసులు పిండి, నల్లబెల్లం, పుట్టమట్టి, ఆవు లేదా ఇతర పశువుల మూత్రం కలిపి ఘన జీవామృతాన్ని, ఇదే వస్తువులను నీటిలో కలిపి జీవామృతం పేరుతో డ్రిప్ లేదా స్ప్రింకర్ల ద్వారా ఎరువుగా పంటకు అందజేస్తున్నారు. ఆరోగ్యమే ప్రధానం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ అధికంగా పొందే అవకాశం ఉంటుంది. తద్వారా అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని కలుషిత రహిత ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని గార్డెన్స్ ఏర్పాటు చేసిన వారు పేర్కొంటున్నారు. కిచెన్ గార్డెన్స్‌లో పండించిన ఉత్పత్తులను అమ్ముకుంటూ ఇంటి ఖర్చులను పూడ్చుకుంటున్నట్లు పలువురు పేర్కొంటుండడం గమనార్హం. విటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతి ఒక్కరూ కూరగాయల పంటలు పండించేలా చూస్తున్నాం. ఇంటిపైన ఖాళీ స్థలంలోనూ టెర్రస్ గార్డెన్స్ పేరుతో కూరగాయలు సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అందరినీ ప్రోత్సహిస్తున్నాం. – సంధ్య, మాస్టర్ ట్రైనర్, హెల్త్, న్యూట్రిషియన్, కడప ప్రకృతి వ్యవసాయంతోనే కూరగాయలు పండిస్తున్నాం మా ఇంటి వద్ద ఐదు సెంట్ల ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు, క్యారెట్, ఇతర వాటిని కూడా పండిస్తున్నాం. తోట పెట్టి నాలుగు నెలలైంది. మేము ఆరోగ్యకరమైన కూరగాయ లు తినడమే కాకుండా మిగిలిన వాటిని అమ్ముతున్నాం. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఎరువులు, జీవామృతం తదితర వాటితో కూరగాయలు పండిస్తున్నాం. –సునీత, సింగరాయపల్లె, కలసపాడు మండలం పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 75 వేలకు పైగా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేశాం. రైతులతోపాటు ఇళ్ల వద్ద తోటల పెంపకానికి మొగ్గుచూపే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, పండించుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరం. – రామకృష్ణరాజు, డీపీఎం,ప్రకృతి వ్యవసాయం,కడప -
అన్నదాతకు మద్దతు
సాక్షి, రాయచోటి: ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాలా మద్దతు కల్పిస్తోంది. దళారుల ప్రమేయం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ అండగా ఉన్నామని భరోసానిస్తోంది. ప్రతి సీజన్లోనూ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తూ.. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులకు సంబంధించిన సరుకుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సకాలంలో బిల్లులు చెల్లించడంతోపాటు పంట సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. దిగుబడి వచ్చిన తర్వాత అన్నదాతలు అమ్ముకోవాలంటే అనేక రకాల ఇబ్బందులు పడేవారు. ఒకవైపు దళారులు, మరోవైపు వ్యాపారులు కుమ్మక్కై ఏదో ఒక రకంగా అన్నదాతను దెబ్బతీసే పరిస్థితి నుంచి ప్రభుత్వం మంచి ధరను అందించి కొనుగోలుకు శ్రీకారం చుడుతూ వస్తోంది. ఈ రబీ సీజన్‌కు సంబంధించి కూడా సుమారు 21 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలో 40 కొనుగోలు కేంద్రాలు రబీ సీజన్లో వరి సాగు చేసిన రైతులకు సంబంధించి ప్రస్తుతం కొన్నిచోట్ల నూర్పిళ్లు జరుగుతుండగా, మరికొన్నిచోట్ల పూర్తయ్యాయి. ప్రస్తుతం సీజన్ కావడంతో రబీలో పండించిన పంట కొనుగోలుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసింది. వైఎస్సార్ జిల్లాలో సుమారు 29 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుండగా, అన్నమయ్య జిల్లాలో 11 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘాలతోపాటు డీసీఎంఎస్, మార్కెటింగ్ శాఖల సంయుక్త సహకారంతో కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలోని 134, వైఎస్సార్ జిల్లాలో 224 రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలు రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించారు. మంచి ధర వరి పండిస్తున్న రైతులకు మంచి మద్దతు ధరను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ధరను నిర్ణయించారు. మార్కెట్ రేటును పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా మంచి రేటును అందించారు. వరి ధాన్యా నికి సంబంధించి గ్రేడ్ –ఏ రకం క్వింటాకు రూ. 1960 (టన్ను రూ. 19,600), సాధా రణ రకం క్వింటా రూ. 1940 (టన్ను రూ. 19,400) ధరతో ధాన్యం తీసుకుంటున్నారు. సరుకు కొనుగోలు చేసిన తర్వాత వెంటనే రైతుల ఖాతాలకు సొమ్మును జమ చేస్తున్నారు. 21,000 మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఈసారి సుమారు 21000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఎక్కడికక్కడ అన్నదాతల ద్వారా ధాన్యం సేకరించి మిల్లులకు పంపించనున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే 72 మంది రైతుల నుంచి సుమారు 420 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అన్నమయ్య జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పుడిప్పుడే కొనుగోలుకు అధికారులు అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 14 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యం కాగా, అన్నమయ్య జిల్లాలో ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. ప్రతి రైతు నుంచి కొనుగోలు చేస్తాం అన్నమయ్య జిల్లాలో వరి సాగు చేసిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టాం. మంచి గిట్టుబాటు ధర కల్పించి రబీ సీజన్ ధాన్యాన్ని సేకరిస్తున్నాం. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. – తమీమ్ అన్సారియా,జాయింట్ కలెక్టర్, అన్నమయ్య జిల్లా రైతుల శ్రేయస్సే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సే లక్ష్యంగా మంచి మద్దతు ధరను అందించి ధాన్యం సేకరిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే సుమారు 400 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించారు. సుమారు 14 వేల మెట్రిక్ టన్నులు రబీ సీజన్లో సేకరించాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. జిల్లాలో 29 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము. – సాయికాంత్‌వర్మ,జాయింట్ కలెక్టర్, వైఎస్సార్ జిల్లా -
ఉద్యానకేంద్రంగా అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లాలో విస్తారంగా పండ్లతోటలు సాగవుతున్నాయి. మామిడి,చీనీ, అరటి,టమాట,బొప్పొయి, కర్బూజ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. పండ్లతోటల పెంపకానికి ఉపాధినిధులు తోడ్పాటు అందిస్తున్నాయి. ఉద్యానకేంద్రంగా జిల్లా విరాజిల్లనుంది. బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా పండ్లతోటలకు కేరాఫ్‌గా మారనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యానపంటల సాగుతో ప్రత్యేక గుర్తింపు కూడా దక్కించుకోనుంది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఉద్యానవన పంటల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో జిల్లాకు రెండో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 75,731 హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. ఇందులో మామిడి, టమాట ఒకటి, రెండుస్థానాల్లో ఉండగా అన్ని ఉద్యాన పంటల సాగు సమాహారంగా జిల్లాకు గుర్తింపు వచ్చింది. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజక వర్గాల్లో టమాట సాగు ప్రథమస్థానంలో ఉంది. మామిడి జిల్లా అంతటా విస్తరించింది. అరటి, పసుపు, బత్తాయి, నిమ్మ తోటలు రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరులో సాగులో ఉన్నాయి. మొత్తమ్మీద అన్ని రకాల పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. టమాట కేరాఫ్ తంబళ్లపల్లె టమాట సాగులో తంబళ్లపల్లె నియోజకవర్గానిదే అగ్రస్థానం. దశాబ్దాలుగా దీనిపైనే రైతులు ఆధారపడ్డారు. ప్రత్యామ్నయ పంటలవైపు వెళ్లడం లేదు. తంబళ్లపల్లె తర్వాత మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో టమాట సాగువుతోంది. ఉద్యానవన పంటల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో టమాటనే అధికం. రాయచోటి, చిన్నమండెం, గాలివీడు ప్రాంతాల్లో కొద్దిపాటి కనిపిస్తుంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో టమాట సాగు కనిపించదు. ఈ ప్రాంతాల్లో కట్టెలతో టమాటను సాగు చేస్తారు. దిగుబడి ఎలా ఉన్నా వీటి ధరలు నిలకడగా ఎప్పుడూ ఉండవు. అయినప్పటికీ రైతులు దీని సాగును వదలరు. ఇదే పంటతో కోట్లకు పడగలెత్తిన రైతులు లేకపోలేదు. తర్వాత మామిడితోటల పెంపకం ఉంది. పండ్లతోటలకు అందే ఉపాధి సహయం మామిడికి రూ.1,02,756, జీడిమామిడికి రూ.94,019, బత్తాయికి రూ.1,05,521, అసిడ్లైమ్కి రూ.1,41,515, నాటుజామకి రూ.1,41,784, తైవాన్జామకి రూ.2,30,023, సపోటకి రూ.88,255, కొబ్బరికి రూ.88,821, సీతాఫలంకి రూ.1,70,603, దానిమ్మకి రూ.2,48,845, నేరేడుకి రూ.18,124, చింతకి రూ.89,120, ఆపిల్బేర్కి రూ.1,06,962, డ్రాగన్ప్రూట్కి రూ.1,79,626, గులాబీకి రూ.1,92,500, మల్లెకి రూ.1,09,672, మునగకు రూ.1,01,541లు ప్రభుత్వం పూర్తి రాయితీగా అందిస్తోంది. ఈ పండ్లతోటలకు మంజూరైన ఉపాధి నిధుల రాయితీ సొమ్మును పంటల సాగునుబట్టి రెండు, మూడేళ్లపాటు అందించడం జరుగుతుంది. పోలాల్లో గుంతలు తవ్వి, మొక్కలు నాటి, సంరక్షణ, పంటల దిగుబడి వచ్చే వరకు రాయితీని విడతల వారీగా అందిస్తారు. ఇది పండ్ల రైతాంగానికి ఎంతో ప్రయోజనకరం. అరటికి కేరాఫ్ ఇవే జిల్లాలో అత్యధికంగా సాగయ్యే మూడో పంట అరటి. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేలి, రాజంపేటలో మాత్రమే ఈ పంట సాగు చేస్తున్నారు. బొప్పాయిని పెనగలూరు కలుపుకొని పై ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగులో 95శాతం వాటా ఈ ప్రాంతాలదే. పసుపు అక్కడక్కడ సాగవుతోంది. మామిడితోటల పెంపకం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతోంది. రెండోస్థానంలో జిల్లా పండ్లతోటల పెంపకంలో అన్నమయ్య జిల్లా రెండోస్థానంలో ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో సాగులోని ఉద్యానవన పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. అనంతపురంజిల్లా మొదటిస్థానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. జిల్లాకు రెండవ స్థానం దక్కితే పండ్లతోటలకు నిలయంగా మారినట్టే. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా ఉంటుంది. –రవీంద్రనాధ్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి, రాయచోటి ఐదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు రాయితీ పండ్లతోటల పెంపకం కోసం ఉపాధి రాయితీని ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఒక మొక్కకు నీరుపోసినందుకు రూ.17, సంరక్షణకు రూ.10 చొప్పున నెలకు రూ.27 చెల్లిస్తాం. జాబ్‌కార్డు, ఐదెకరాలోపు భూమి కలిగిన ప్రతి రైతు రాయితీ పొందడానికి అర్హులు. రైతులు సద్వినియోగం చేసుకొని పండ్లతోటల పెంపకంతో ఆదాయం పొందాలి. ఈ పంటలసాగుతో కొన్నేళ్లపాటు ఆదాయం పొందవచ్చు. –ఎస్.మధుబాబు, డ్వామా ఏపీడీ, ములకలచెరువు -
జలం.. పుష్కలం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ప్రజలకు శాశ్వత తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేసింది. తద్వారా వచ్చే 30 ఏళ్ల వరకు(2054) నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించే వాటర్ గ్రిడ్ పథకానికి ప్రభుత్వం రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపర ఉత్తర్వులను ఫిబ్రవరిలోనే జారీ చేసింది. దీంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమగ్ర నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ఐదు నియోజకవర్గాల్లోని 4,938 పల్లెలు, రెండు మున్సిపాలిటీలకు తాగునీరు అందుతుంది. నిధుల వినియోగం ఇలా రూ.2,400 కోట్ల వ్యయంతో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, ఈ రెండు జిల్లాల్లోని మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు అమలు చేస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.1,550 కోట్లతో పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో రూ.850 కోట్ల పనులకు పాలనాపర అనుమతి రావాల్సి ఉంది. రూ.1,550 కోట్లలో కేంద్రం జల్‌జీవన్ మిషన్ కింద రూ.755 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.755 కోట్లు ఖర్చు చేయనుంది.్ల గండికోట రిజర్వాయర్ నుంచి 3.37 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఇంటింటికి శుద్ధిచేసిన జలాన్ని కుళాయిల ద్వారా అందిస్తారు. పైప్‌లైన్ ఇలా: మామిళ్లవారిపల్లె రీట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి ఎడమవైపు పైప్‌లైన్ ద్వారా గుర్రంకొండ, వాయల్పాడు, కలికిరి, కలకడ, కేవీపల్లె, పీలేరు, సదుం, రొంపిచర్ల, పులిచర్ల మండలాలకు,కుడివైపు పైప్‌లైన్ ద్వారా పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కురబలకోట మీదుగా మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లె, సోమల వరకు సాగుతుంది. 165 కిలోమీటర్ల పైప్‌లైన్ వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నుంచి జిల్లాలోని గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు కృష్ణా జలాలను తరలించేందుకు 165 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మిస్తారు. నీటి తరలింపు కోసం గండి, కొండప్పగారిపల్లె, గాలివీడు, కార్లకుండ, గాలివీడు, కలిచర్ల వద్ద 25వేల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన సంపులు నిర్మిస్తారు. రూ.850 కోట్లకు అనుమతి రావాలి మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో వాటర్‌గ్రిడ్ అమలు కోసం రూ.850 కోట్లకు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతి రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతానికి మంజూరైన ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పనుల అమలు ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించాం. –ఎండీ.అబ్దుల్ మతీన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, మదనపల్లె -
Girl Missing: బాలిక అదృశ్యం.. పాపం ఏమైందో?
పెండ్లిమర్రి(అన్నమయ్య జిల్లా): మండలంలోని ఎగువపల్లె గ్రామానికి చెందిన దుత్తలూరు ఖాదర్ మున్ని (16) సోమవారం అదృశ్యం అయినట్లు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆ బాలిక పదో తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉన్నది. తల్లిదండ్రులు ఉదయం కూలీ పనులకు వెళ్లారు. చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు వారు తిరిగి ఇంటికి వచ్చే సరికి బాలిక ఇంటి వద్ద లేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు, బంధువులు గ్రామం చుట్టు పక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా కనిపించలేదు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు నంబర్: 9121100527కు ఫోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు. -
Horsley Hills: షూటింగ్‌లకు ఆద్యుడు కృష్ణ
బి.కొత్తకోట(వైఎస్సార్ కడప): పర్యాటక, వేసవి విడిది కేంద్రంగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ అందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ సినిమా షూటింగులకు ఆద్యుడు, చిత్రపరిశ్రమకు ఈ అందమైన ప్రాంతాన్ని పరిచయం చేసింది మాత్రం సూపర్ కృష్ణనే. మొట్టమొదటగా ఆయన సినిమాలు ఇక్కడ చిత్రీకరించడం మొదలయ్యాకే.. మిగిలిన నటులు హార్సిలీహిల్స్ దారిపట్టారు. కృష్ణ షూటింగుల వల్లే హార్సిలీహిల్స్‌కు ప్రాచు ర్యం వచ్చింది. అప్పటి వరకు సినిమా స్టూడియోలకే పరిమితమైన షూటింగులను ఔట్‌డోర్ చిత్రీకరణ మొదలైందని చెప్పవచ్చు. 1966లో కృష్ణ నటించిన కన్నెమనసు సినిమా చాలా భాగం హార్సిలీహిల్స్‌లో చిత్రీకరణ జరిగింది. కొండపై కృష్ణ తొలి సినిమా షూటింగ్ ఇదేనని చెప్పవచ్చు. చల్లటి వాతావరణం, సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లోనే సిని మా చిత్రీకరణలు జరిగాయి. కృష్ణ నట జీవితంలో హార్సిలీహిల్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నటుడిగా అప్పుడప్పుడే గుర్తింపు లభిస్తున్న రోజుల నుంచే తాను నటించే చిత్రాలను హార్సిలీకొండపై చిత్రీకరించే వారు. కన్నెమనసులు చిత్రం ఎక్కువ భాగం కొండపైనే చిత్రీకరించారు. కొండపై తొలి సినిమా సెట్టింగ్ వేసింది ఈ సినిమాకే. గాలిబండపై వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించి ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్‌బంగ్లా, ఆవరణలో కృష్ణ, ఇతరా నటులతో చివరి భాగం నిర్మించారు. అప్పటి నుంచే కృష్ణకు కొండపై అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత నటించిన అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం ఇలా సుమారు 25కు పైగా సినిమాల నిర్మాణం జరుపుకొంది. ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా అత్యధిక భాగంగా, పాటలను కొండపైన, అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కొండపై జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. కృష్ణ తర్వాత ఎన్టీఆర్, శోభన్‌బాబు, నాగార్జున, రాజేంద్రప్రసాద్, కాంతారావు ఇలా ఎందరో నటుల సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన సినిమాలు అత్యధికంగా ఇక్కడ నిర్మాణం జరుపుకొన్నాయి. కాగా హార్సిలీహిల్స్‌తో తనకు ప్రత్యేక అనుబంధముందని 1997లో ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ సమయంలో చెప్పుకొన్నారు. చివరగా కృష్ణ 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చివెళ్లారు. కొండపై నటుడు శరత్‌బాబు ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక్కడ నిర్మించుకొన్న ఇంటిని ప్రముఖ నటి జమున విక్రయించుకొన్నారు. అయినప్పటికీ ఇప్పటికి జమునా బిల్టింగ్ అనే పిలుస్తారు. -
తరగని కీర్తి.. తరతరాలకు స్ఫూర్తి
గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, బ్రిటీషువారి పాలనకు నిలువుటద్దం గుర్రంకొండ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా.. చరిత్రాత్మాక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శాతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది.శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పుసూల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషువారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘనచరిత్ర కలిగిన ఈకోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు, ఆకట్టుకొనే కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచేకాక కర్ణాటకా నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. శత్రుదుర్భేద్యం.. కోటముఖద్వారం గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. వీటిల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా నీటిలో మొసళ్లును వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించేవారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది. -
సారూ... పిల్లలతో పని చేయిస్తే ఎలా?
కేవీపల్లె(అన్నమయ్య జిల్లా): ‘సారూ.. మేము పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే.. మీరు పని చేయిస్తే ఎలా?’ అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులకు తాళం వేశారు. ఈ సంఘటన మారేళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆవరణలో స్టేజీ నిర్మించాలని ప్రధానోపాధ్యాయులు గంగాధరం, ఉపాధ్యాయులు భావించారు. బుధవారం విద్యార్థులతో గుణాతం తవ్వకం పని చేపించారు. గురువారం నిర్మాణానికి అవసరమయ్యే కట్రాళ్ల కోసం వారిని ఓ బండకు పంపించి ట్రాక్టర్‌కు లోడు చేయించారు. సిమెంట్ బస్తాలను ఆటోకు లోడు చేయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెంది పాఠశాల వద్దకు వచ్చారు. స్థానిక సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి సహకారంతో శుక్రవారం తరగతి గదులకు తాళాలు వేశారు. తమ బిడ్డలతో పనులు చేయించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తాళాలు తీయరాదని డిమాండ్ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు చెట్ల కింద తరగతులు నిర్వహించారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉపాధ్యాయులను నిలదీశారు. గురువారం హెచ్ఎం గంగాధరం లేకపోయినా, ఆయన ఆదేశాల మేరకే పిల్లలతో పని చేయించామని ఇన్చార్జి హెచ్ఎం వెంకటసుబ్బయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ది చెప్పి తాళాలు తెరిపించారు. అనంతరం విద్యార్థులకు ఆలస్యంగా సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించారు. జరిగిన సంఘటనపై ఎంఈవో రెడ్డిబాషాను వివరణ కోరగా విచారణ జరిపి డీఈవోకు నివేదిక పంపిస్తామని తెలిపారు. పిల్లలచే పని చేయించడం అన్యాయం మా పిల్లలతో పని చేయించడం అన్యాయం. మేము కష్టపడి పిల్లలను బాగా చదివించుకోవాలని పాఠశాలకు పంపిస్తున్నాం. అయితే ఎర్రటి ఎండలో బండపైకి పంపించి కట్రాళ్లు ట్రాక్టర్‌కు లోడు చేయించడం ఎంత వరకు సమంజసం. పాఠశాల పేరెంట్స్ కమిటీకి ఉపాధ్యాయుల జవాబుదారీతనం లేదు. – రమణయ్య, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ -
మామిడికి మంచి రోజులు
కరోనా కారణంగా గత రెండేళ్లుగా నష్టాలు చవిచూసిన మామిడి రైతులకు మంచి రోజులొచ్చాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మార్కెట్లో మామిడికి డిమాండ్ పెరిగి రెట్టింపు ధర పలుకుతోంది. ఈ సారి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కడప: మామిడి పంటకు మంచికాలం కనిపిస్తోంది. కళ్లెదుటే డిమాండుతోపాటు ధరలూ బాగుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధర మరింత పెరుగుతూ జూన్ వరకు కొనసాగితే మామిడి రైతును రాజుగా అభివర్ణించవచ్చు. గత ఏడాది చివరిలో వర్షాలు విపరీతంగా పడడంతో ఎక్కడికక్కడ మామిడి పొలాలన్నీ నీటితో తడిసిపోయాయి. పొలంలో తేమశాతం అధికంగా ఉండడంతో ఎక్కువగా చిగుర్లు రావడం..పూత తగ్గడంతో అనుకున్న మేర కాపు రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కాయలకు డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి మామిడి కాయలు వస్తున్నాయి. ఈనెల 10 నుంచి కాయలు బయటి మార్కెట్లోకి వస్తుండగా.. జూన్ చివరి నాటి వరకు మామిడి కాయలు కనిపించనున్నాయి. అన్నమయ్య జిల్లాలో మామిడి పంటను పెద్ద ఎత్తున సాగు చేయడంతోపాటు అనేక రకాల మామిడి కాయలను దిగుబడి తీస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో అనేక రకాలు జిల్లాలో అనేక రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ప్రధానంగా వీరబల్లి బేనీషా, తోతాపురి, అంటుమామిడి, నీలం, మల్లిక, అల్ఫన్స్, బంగినపల్లి, హిమామ్‌పసంద్ లాంటి రకాలను పండిస్తున్నారు. పంటలు పండించే రైతులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ధరలు పలికే మామిడి వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వీరబల్లి బేనీషాకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ప్రతి సీజన్లోనూ ఇక్కడి సరుకును వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌కు సంబంధించి ఇబ్బందులు పడకుండా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులు గ్రూపులుగా ఏర్పడి కొనుగోలు కేంద్రం ఒకచోట ఏర్పాటు చేసుకుంటే దానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ఆశాజనకంగా మామిడి ధరలు అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లె తదితర ప్రాంతాలతోపాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ మామిడి పంటను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 36 వేల హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్లు ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బంగినపల్లి మామిడికి సంబంధించి టన్ను «ధర రూ. 90 వేల నుంచి లక్ష వరకు పలుకుతోంది. గతేడాది కూడా రూ. 75 వేల పైచిలుకు ధర కనిపించింది. అయితే ప్రస్తుతం ప్రారంభంలోనే టన్ను రూ. లక్ష వరకు ఉండడంతో రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంటు మామిడి, తోతాపురికి సంబంధించి టన్ను రూ. 30–35 వేల మధ్య పలుకుతోంది. ఇతర రాష్ట్రాలకు అన్నమయ్య మామిడి అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న మామిడికి ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన అంటు మామిడి కాయలను చిత్తూరులోని జ్యూస్ ఫ్యాక్టరీతోపాటు బెంగళూరుకు కూడా తరలిస్తున్నారు. అంతేకాకుండా బంగినపల్లి మామిడి గుజరాత్, మహరాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. అయితే సాధారణంగా హెక్టారు మామిడి తోటకు సంబంధించి ఐదు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి కేవలం టన్ను నుంచి 1.5 టన్ను మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో డిమాండు కూడా ఎక్కువగా ఉంది. నా పేరు అయూబ్‌ఖాన్. మాది మండల కేంద్రమైన చిన్నమండెం. మాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. అందులో ప్రస్తుతం దిగుబడి రావడంతో మార్కెట్‌కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం టన్ను ధర బాగానే పలుకుతోంది. రైతులకు ఉద్యానశాఖ తోడ్పాటు జిల్లాలో మామిడి పంట అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉండడంతో ధర కూడా బాగానే ఉంది. రైతులు గ్రూపుగా ఉండి అమ్ముకునేందుకు ఒకచోట ఏర్పాటు చేసుకునే షెల్టర్‌కు కూడా ఉద్యానశాఖ తోడ్పాటు అందిస్తోంది. – మూలి రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, రాయచోటి -
అంతులేని విషాదం: దేవుడా ఇక మేం ఎవరి కోసం బతకాలి..
ఆరు నెలల పసిప్రాయంలోనే కూతురు చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని కన్నవారు ఎన్నో కలలు కన్నారు. అమ్మానాన్నల ఆశలను ఆవిరి చేస్తూ తనయుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. దేవుడా ఇక మేం ఎవరి కోసం బతకాలి.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. సాక్షి, అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం కాట్నగల్లుకు చెందిన కొక్కల శ్యామలమ్మ, నారాయణ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు సంతానం. ఆరు నెలల వయసులోనే కుమార్తె మృతి చెందింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు జగదీష్ (25)ను బాగా చదివించారు. గత రెండేళ్ల నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉన్నాడని ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు. రెండు నెలల నుంచి వారు తమ కుమారుడిని ఓ ఇంటివాడిని చేయాలని భావించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగదీష్ ఐదు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. జ్వరం తగ్గుముఖం పట్టడంతో ఇంటికి వచ్చేశారు. కాగా గురువారం మళ్లీ జ్వరం వచ్చి స్పృహ కోల్పోవడంతో వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అప్పటికే యువకుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తమ కళ్లెదుటే చెట్టంత కొడుకు మరణించాడనే వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే యువకుడు హఠాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చదవండి👉🏾 (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి) -
ఎర్రకోటకు ఎగబాకిన టెర్రకోట!
బి.కొత్తకోట: టెర్రకోట కళాకృతులు అంటే కంటేవారిపల్లె గుర్తుకొస్తుంది. ఎలాంటి యంత్ర, అచ్చు పరికరాల ప్రమేయం లేకుండా, కేవలం చేతి వేళ్లతో 700 రకాల మట్టి కళాకృతులను తీర్చిదిద్దే స్థాయికి తెచ్చిన ఘనత అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లెకు చెందిన ఎ.రామయ్య(77)దే. ముంబై–చెన్నై జాతీయ రహదారిపై ఉన్న కంటేవారిపల్లెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి, ఎంతో మంది ఉపాధి పొందడానికి మార్గదర్శి అయ్యాడాయన. శిక్షణతో వెలుగులోకి టెర్రకోట.. రిషివ్యాలీ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తిగత వైద్యుడి కుమారుడు, క్రాఫ్ట్ టీచర్ విక్రం పర్చురే (బెంగళూరు) ఇక్కడికి రావడంతో టెర్రకోట కళ గురించి ప్రపంచానికి తెలిసింది. 1983లో ఆయన రిషివ్యాలీ పాఠశాలలో కంటేవారిపల్లెకు చెందిన ఎ.రామయ్య, ఎ.వెంకటరమణ, డి.పెద్దవెంకటరమణకు చిత్రాలు గీసి ఇచ్చి వాటిలాగే మట్టిబొమ్మలు తయారు చేసి ఇవ్వాలని కోరారు. ఇందుకోసం నెలకు రూ.400 వేతనం చెల్లించేవారు. కొన్నాళ్లకు కంటేవారిపల్లెలోని పూరిగుడిసెలో రామయ్య 1985లో సొంతంగా టెర్రకోట మట్టిబొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. దీనికి విక్రం పర్చురే సహకారం అందించారు. 2వేలకు పైగా గీసిన బొమ్మల చిత్రాలను అందించారు. ఈ నేపథ్యంలో రామయ్య తాను తయారుచేసిన బొమ్మలను రహదారిపై ఉంచి విక్రయాలు ప్రారంభించడంతో అందరి దృష్టి పడింది. రామయ్యతో ప్రారంభమైన టెర్రకోట కళ ఆయన వద్ద శిక్షణ పొందిన వారితో విస్తరించింది. సింగపూర్‌కు ఎగుమతి దేవుని గదిలో ఉంచే దీపాల నుంచి హోదా, దర్పాన్ని గుర్తుకు తేచ్చే విలాసవంతమైన బొమ్మల దాకా టెర్రకోట ఆకృతులు అధికంగా సింగపూర్‌కు ఎగుమతి అవుతాయి. 1986 నుంచి ప్రభుత్వ సౌజన్యంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో టెర్రకోట మట్టి బొమ్మల ప్రదర్శన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా తయారీదారులకు ఆదాయం, ప్రాచుర్యం లభించింది. దీంతోపాటు ఇటీవలి కాలంలో మళ్లీ మట్టి పాత్రల్లో వంటలు చేయడం మొదలైంది. ప్రజలు మట్టికుండలు, వంటపాత్రలు, మట్టితో చేసిన వాటర్ బాటిళ్లు, టీ కప్పులు, ప్లేట్లు, పొయ్యిలు, మట్టి కొళాయి కుండలను అధికసంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. అందరికీ సీఎఫ్‌సీ కురబలకోట మండలం అంగళ్లులో టెర్రకోట కళాకారుల కోసం కేంద్రజౌళిశాఖ కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కళాకారులు బొమ్మలు చేసుకునేందుకు వీలుగా పనిముట్లు, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. తయారీ ఇలా.. అందరూ ఇష్టపడే టెర్రకోట బొమ్మల తయారీకి అవసరమైన నాణ్యమైన చెరువుమట్టి ఈ ప్రాంతంలోనే లభ్యం కావడం విశేషం. ముందుగా చెరువుమట్టిని నీటిలో నానబెట్టి జల్లెడపట్టిన ఇసుకను అందులో కలుపుతారు. ఒకరోజు తర్వాత మట్టిని కాలితో తొక్కుతారు. చక్రంమీద మట్టిపెట్టి ఆకృతులను తయారు చేస్తారు. మట్టితో సిద్ధం చేసిన ఆకృతులను పదిరోజులు నీడలో ఆరబెట్టాక ఒకరోజు ఎండలో ఉంచుతారు. మరుసటిరోజు బట్టీలో వాటిని పేర్చి 12 గంటలు కాల్చుతారు. బొమ్మలు ఎర్రరంగులో ఉండాలంటే కట్టెలతో, నల్లరంగులో ఉండాలంటే వరిపొట్టు, బొగ్గులతో కాల్చుతారు. బోధి వృక్ష బుద్ధుడికి అవార్డు కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఎ.నాగరాజు టెర్రకోట కళాకారుడు. బోధి వృక్షం కింద ధ్యానంలో కూర్చున్న బుద్ధుడి బొమ్మను 2018లో మట్టితో తయారు చేశాడు. ఈయన సృజనకు మెచ్చిన రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ రూ.25వేలు, ప్రశంసాపత్రంతో సత్కరించింది. కష్టాల నుంచి గట్టెక్కించాయి.. నాన్న వారసత్వంగా కుమ్మరి వృత్తితో మట్టికుండలు తయారుచేసి పల్లెలు, సంతల్లో విక్రయిస్తే వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. విక్రం పర్చురే సహకారంతో వందల రకాల బొమ్మలు తయారు చేయడం నేర్చుకొన్నా. చాలామందికి శిక్షణ ఇచ్చా. సెంటు భూమిలేని నేనిప్పుడు 10 ఎకరాల భూమిని కొని బోరు వేయించి పంటలు సాగు చేస్తున్నా. సొంతింటిని నిర్మించుకొన్నా. మా కళను గుర్తించిన ప్రధాని పీవీ నరసింహారావు టెర్రకోట బొమ్మలు చూసి ఆశ్చర్యపోయారు. 1991లో తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ వేదికపై రూ. 1,116 ఇచ్చి సత్కరించారు. – ఎ.రామయ్య, టెర్రకోట కళాకారుడు -
మహిళపై టీడీపీ సర్పంచ్ దౌర్జన్యం
కలకడ : ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి.. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత చొరబడి నానా దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలకడ మండలం కలకడదొడ్డిపల్లెలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ సోదరుడు, కె.దొడ్డిపల్లె సర్పంచ్ మద్దిపట్ల నాగరాజ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్థరాత్రి సమయంలో చరపల్లె. శ్రీనివాసులునాయుడు భార్య అలివేలమ్మను నిద్ర లేపి తనకు ఓటు వేయలేదని నానా దుర్భాషలాడి కత్తితో చంపుతానని బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
హృదయ విదారకం.. చెదిరిన కల.. అనాథలుగా ఇలా!
సాక్షి,పెద్ద తిప్పసముద్రం(అన్నమయ్య జిల్లా): ‘మంచంపైన నాన్నను పడుకోబెట్టారు.. అందరూ పూల దండలు వేస్తూ నాన్నకు నమస్కరిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్లంతా బోరున విలపిస్తున్నారు. అసలు ఏం జరిగింది నాన్నకు. అమ్మను అడుగుదామంటే అమ్మ ఎవరో కూడా గుర్తు లేదు. అసలు ఎక్కడుందో తెలియదు.. అమ్మ ప్రేమకు దూరమైన ఆ చిన్నారులు నాన్న శవం వద్ద నిలబడి బిక్క చూపులు చూస్తుంటే ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదురా దేవుడా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు’. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లిలో జరిగింది. వివరాలిలా.. బూర్లపల్లి రామకృష్ణ (37), నాగరత్న దంపతులు. వీరికి మోహన్ (9), చరణ్ (7)లు సంతానం. కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. చిన్న కుమారుడు చరణ్‌కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే నాగరత్న భర్త, పిల్లలను వదిలి కర్నాటక రాష్ట్రం కంచార్లపల్లి వద్ద ఉన్న నందగామలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలను తండ్రితో పాటు అవ్వా, తాతలైన నారెప్ప, వెంకటలక్ష్మిలు కంటికి రెప్పలా చూసుకునేవారు. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం రామకృష్ణ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆసుపత్రిలో చూపించారు. రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి మదనపల్లిలో డయాలసిస్ చేయించుకునేవాడు. మూడు నెలల క్రితం తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి గ్రామంలో పర్యటించినప్పుడు తన దయనీయ స్థితిని చెప్పుకోగా స్పందించిన ఎమ్మెల్యే నెలకు రూ.10 వేల పింఛన్‌ను మంజూరు చేయించారు. ఇంతలోనే పరిస్థితి విషమించి సోమవారం రాత్రి రామకృష్ణ మృతి చెందాడు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. అటు తల్లి ప్రేమకు నోచుకోక.. ఇటు నాన్న తోడు దూరమై అనాథలుగా మారిన ఆ చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
AP New Cabinet: అంజద్‌బాషాను రెండోసారి వరించిన మంత్రిపదవి
కడప కార్పొరేషన్: కడప గడపకు మరోమారు మంత్రి హోదా దక్కింది. సమర్థత, విశ్వాసం, సామాజిక సమతుల్యత నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషాకు రెండోసారి అరుదైన అవకాశం లభించింది. ఈయనను మంత్రివర్గంలోకి తీసుకొని ముస్లీం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రపీఠం వేశారు. శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యే అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లాయి. వ్యాపారవేత్తగా కడప వాసులకు సుపరిచితుడైన అంజద్‌బాషా 2005లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, వైఎస్ కుటుంబాన్ని అనుసరిస్తూ వైఎస్సార్సీపీ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికై వైఎస్సార్సీపీ ఉన్నతికి కృషి చేశారు. అనంతరం 2014లో శాసనసభకు పోటీచేసే అవకాశం దక్కింది. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో ఆపార్టీ అధికారం చేజేక్కించుకోలేకపోయింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, ప్రత్యక్ష పోరాటాల్లో తనవంతు పాత్రను పోషించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. తర్వాత వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా ఎంపికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల మేనిఫేస్టో కమిటీ మెంబర్‌గా అంజద్‌బాషా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన ఆయన మరోమారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆనక ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆయనకు రెండవసారి మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విధేయుత..విశ్వాసం..సమర్థత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల విశ్వాసం, ముస్లీం మైనార్టీ వర్గీయుడైనా అత్యంత సమర్థత కల్గిన నాయకుడుగా ఎస్బి అంజద్‌బాషా గుర్తింపు దక్కించుకున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకపోగా, వైఎస్సార్ జిల్లాలో ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే దిశగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టిన అటువైపు మొగ్గు చూపకుండా విశ్వాసంగా ఉండడం, పార్టీ కోసం శక్తికి మించి శ్రమించడం ఇవన్నీ కలిసివచ్చాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పాతవారిని తొలగించి కొత్తవారిని మంత్రులుగా తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అంజద్‌బాషాను మళ్లీ మంత్రిపదవి వరించిందని పరిశీలకులు భావిస్తున్నారు. చేపట్టిన పదవులు అంజద్‌బాషా మదీనా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్‌గా,బుఖారియా విద్యాసంస్థ ఉపాధ్యక్షుడిగా, అల్ హజ్ ఎస్బి అబ్దుల్ ఖాదర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి, హరూన్ ఛారిటబుల్ ట్రస్టు, నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూల్ అల్యూమిని అసోషియేట్లకు అధ్యక్షుడిగా ఉన్నారు. హౌస్ మసీదు కమిటీ కోశాధికారిగా, ఏపీ ముస్లిం కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా, ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్సీపీ కడప సమన్వయకర్త. 2014లో వైఎస్ఆర్సీపీ తరుపున పోటీ చేసి 45వేలపైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2016లో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు. 2018లో జనరల్ సెక్రెటరీ,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్. సార్వత్రిక ఎన్నికల్లో 54వేల మెజార్టీతో విజయం సాధించారు. కుటుంబ నేపథ్యం కడప జిల్లా సిద్దవటంకు చెందిన జనాబ్ ఎస్బి హరూన్ సాహెబ్ 1935 నుంచి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలు సిద్దవటం సర్పంచ్‌గా పనిచేశారు. సిద్దవటంలో హరూన్ సాహెబ్ అందించిన సేవలకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. హరూన్ సాహెబ్ కుమారుడైన అబ్దుల్ ఖాదర్ పెద్ద కుమారుడే ఎస్బి అంజద్‌బాషా. 1963లో వారి కుటుంబం వ్యాపార పరమైన సౌకర్యాల కోసం కడప నగరంలో స్థిరపడ్డారు. కడప, కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి. నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూలులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాగుణంతో అంజద్‌బాషా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సేవా తత్పరతను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2005లో కాంగ్రెస్ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. కడపకు మరో అవకాశం.. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాకు మంత్రిహోదా దక్కడంతో కడప నియోజకవర్గానికి మరోసారి అవకాశం దక్కింది. ఇదివరకు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రి హోదా దక్కించుకున్న వారి జాబితాలో అంజద్‌బాషా రెండోసారి చేరారు. ఎస్ రామమునిరెడ్డి(1983), సి రామచంద్రయ్య(1985), డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషా(1999), ఎస్ఎండీ అహమ్మదుల్లా (2009), ఇదివరకు మంత్రి పదవులు అలంకరించారు. తాజాగా 2019లో అంజద్‌బాషాకు ఆ హోదా దక్కింది. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. కడప నుంచి మంత్రి హోదా దక్కించుకున్న వారిలో ఈయన ఐదో ఎమ్మెల్యే కాగా, గడిచిన 3 పర్యాయాలు పరిశీలిస్తే పదేళ్లకు ఓమారు కడప నియోజకవర్గానికి మంత్రి హోదా దక్కుతూ రావడం మరో విశేషం. -
9న ఒంటిమిట్ట కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట(సిద్దవటం): ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరగనుంది.10 తేదీన ఉదయం 8నుంచి 9 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహనం, 11న వేణుగాన అలంకారం, హంసవాహనం, 12న వటపత్రశాయి అలంకారం, సింహవాహనం, 13న నవనీత కృష్ణ అలంకారం, హనుమత్సేవ, 14న మోహినీ అలంకారం, గరుడసేవ, 15న శివధనుర్భాలంకారం, రాత్రి 8 గంటలకు శ్రీ సీతా రాముల కల్యాణం, గజవాహనం, 16న రథోత్సవం, 17న కాళీయమర్ధన అలంకారం, ఆశ్వవాహనం, 18న చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావ రోహణం, 19న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరగనున్నాయి. కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ కడప అర్బన్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్సోత్సవాల్లో భాంగా ఈనెల 15న నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి విచ్చేయనుండటంతో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధికసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయపరిసరాలు, కల్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్ డిఎస్పీ రమణయ్య, కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ బాలస్వామిరెడ్డి, ఎస్బి సీఐలు వెంకటకుమార్, రెడ్డెప్ప, ఆర్ఐ మహబూబ్‌బాషా, కడప ఒన్‌టౌన్ సీఐ టివి సత్యనారాయణ, అర్బన్ సీఐ ఎస్ఎం ఆలీ తదితరులు పాల్గొన్నారు -
ఆ'క్యాష్' మిర్చి: రూటే సపరేటు.. కిలో రూ.120 నుంచి రూ.140
కారంలోనే కాదు.. లాభాల్లోనూ నాలుగు రెట్లు ఘాటు అధికం..ఆ మిర్చి. ఆ రకం వంగడానికి కార్పొరేట్ కంపెనీలే దాసోసం అన్నాయి. అందుకే ఆ మిర్చి రకం కాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఫలితంగా కర్షకుడి ఇంట సిరులు పంట పండుతోంది. సాగుదారుకు అధిక క్యాష్ ఇస్తున్నదే.. ఆకాష్ మిర్చి వంగడం. దీనిపై ప్రత్యేక కథనం. గుర్రంకొండ: కొత్తరకం ఆకాష్ మిర్చి(డెమెన్ ఎఫ్–1) సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. ప్రస్తుతం కిలో మిర్చి మార్కెట్లో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. సాధారణ మిర్చితో పోల్చితే ఈ రకం మిర్చి నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. బయట రాష్ట్రాల్లో ఈ రకం మిర్చికి అధికంగా డిమాండ్ ఉంది. సాధారణ మిర్చి కొమ్మకు కింది వైపు కాయగా ఆకాష్ మిర్చి కొమ్మకు పైభాగంలో ఆకాశాన్ని చూస్తుండటం వీటి ప్రత్యేకత. పంట సాగుతో రైతుకు నిలకడైన ఆదాయం వస్తుండడంతో గత మూడేళ్లుగా ఈ ప్రాంతం రైతులు మిర్చి పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కర్ణాటకలో కొత్త వంగడం: ఆకాష్ మిర్చి రకం విత్తనాలు మొదట కర్ణాటక రాష్ట్రంలో నాలుగేళ్ల కిందట కనుగొన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ వారు ఈ రకం విత్తనాలు ఉత్పత్తి చేసి, మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడేళ్లుగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పెద్దమండ్యం, గుర్రంకొండ మండలాల్లో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా కారం ఉండడంతో ప్రముఖ కంపెనీలైన ఆశీర్వాద్, ఆచీ కంపెనీలు తాము తయారు చేసే కారం పొడుల్లో ఆకాష్ మిర్చిని ఎక్కువగా వినియోగస్తుండడంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎకరా సాగుకు రూ. 1.50 లక్షలు ఖర్చు ఆకాష్ మిర్చి ఎకరం సాగుకు రూ.1.50 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో రబీ సీజన్ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా నారు నాటుకోవాలి. ఎకరం పొలానికి రూ.10 వేల మొక్కల నారు అవసరం. మార్కెట్లో 10 వేల మొక్కల నారుకు రూ.10 వేలు చెల్లించాలి. దుక్కి నుంచి మల్చింగ్, డ్రిప్ పైపులు, వారానికి రెండు సార్లు పురుగు నివారణ మందుల పిచికారీ, ఎరువులు తదితర అన్ని ఖర్చులు ఎకరాకు రూ. 1.50 లక్షలు వరకు అవుతాయి. ఎకరానికి సుమారు రూ.20 లక్షల ఆదాయం ప్రస్తుతం మార్కెట్లో కిలో మిర్చి రూ. 120 నుంచి రూ.130 వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్ అంతా సరాసరి రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు తగ్గకుండా పలుకుతుంటాయి. దీంతో సాగు ఖర్చు పోను ఎకరానికి సరాసరి కనీసం రూ. 10 లక్షల నుంచి అత్యధికంగా రూ.20 లక్షల వరకు రైతులకు మిగులుతోంది. ఒక వేళ ధరలు లేక పోయినా ఎండుమిర్చి కింద వీటిని వాడుకున్న రైతులకు సాగు పెట్టుబడికి ఢోకా ఉండదు. నాలుగు రెట్లు అధిక కారం ఆకాష్ మిర్చి సాధారణ మిర్చి కంటే నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. సా«ధారణ మిర్చి తొడిమి ఒక ఇంచి లోపు ఉండగా ఈ రకం మిర్చి తొడిమి రెండు నుంచి రెండున్నర అంగుళాల పొడవు ఉండడం విశేషం. సాధారణ మిర్చి నాలుగు కిలోలకు ఆకాష్మిర్చి ఒక కిలో సమానం అవుతుంది. దీంతో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా హోటళ్లు, పీజీ హాస్టళ్లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మొక్కలో ఆకాశం వైపు చూస్తున్న మిరప కాయలు ఎకరానికి 10 నుంచి 20 టన్నుల దిగుబడి మొక్క నాటిన 80 నుంచి 90 రోజులకు పంట దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎకరం పంటకు అత్యల్పంగా 10 టన్నుల నుంచి అత్యధికంగా 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు కాయల దిగుబడి వస్తుంది. మంచి ఎరువులు వాడుతూ పంటను కాపాడుకుంటే అత్యధికంగా నాలుగు నెలల వరకు దిగుబడి వస్తుంది. లాభదాయక పంట ఆకాష్ మిర్చి మంచి లాభదాయక పంట. మిగిలిన పంటలతో పోల్చితే ఈ రకం మిర్చి సాగుతో ఎప్పుడు నష్టం ఉండదు. మార్కెట్లో సాధారణ ధరలు ఉన్నా కిలో రూ. 70 వరకు ధర పలుకుతుంది. మంచి డిమాండ్ ఉంటే కిలో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతుంది. – జయమ్మ, మహిళా రైతు, దిగువ పల్లె మూడేళ్లుగా సాగు చేస్తున్నా ఆకాష్ మిర్చి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నా. ఎకరానికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఎప్పుడూ నష్టాలు రాలేదు. అన్ని సార్లు పెట్టుబడి పోను లాభాలే వచ్చాయి. – చెంగల్రాయులు, రైతు, కొత్తపల్లె ఇక్కడి వాతావరణం అనువైంది కొత్త రకం ఆకాష్ మిర్చి పడమటి మండలాల వాతావరణానికి అనువైంది.మార్కెట్లో ఈ రకం మిర్చికి మంచి గిట్టుబాటు ధరలున్నాయి. దీంతో నిలకడైన ఆదాయం ఉన్న ఈ పంట రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. – శైలజ, ఉద్యానవనశాఖాధికారి, వాల్మీకిపురం క్లస్టర్