
అశోక్‌పై చేయిచేసుకుంటున్న హెచ్‌ఎం లక్ష్మీదేవి
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): రాజంపేట బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీదేవి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి అశోక్ చెంప ఛెళ్లుమనిపించారు. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఏబీవీపీ నాయకులు మంగళవారం విద్యాసంస్థల బంద్ చేపట్టారు. అశోక్ ఏబీవీపీ నాయకులను వెంటపెట్టుకొని ఉదయం 11 గంటలకు జెడ్పీ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి.. విద్యార్థులను ఇళ్లకు పంపించేయాలని హెచ్‌ఎం లక్ష్మీదేవిని కోరారు.
చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక..
విద్యార్థులకు భోజనం పెట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి సెలవు ఇస్తానని హెచ్‌ఎం ఏబీవీపీ నాయకులకు తెలిపారు. అందుకు అశోక్ ససేమిరా అన్నాడు. విద్యార్థులను ఇళ్లకు పంపితే వండిన భోజనం, కోడి గుడ్లు వృథా అవుతాయని, చాలా మంది విద్యార్థినుల తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఉంటారని, పిల్లలు ఇప్పుడు ఇళ్లకు వెళితే మధ్యాహ్నం భోజనంలేక పస్తులుండాల్సి వస్తుందని హెచ్‌ఎం వివరంగా తెలియజేశారు. అయినప్పటికీ వినిపించుకోని అశోక్ ‘మీకు మెంటలా? చెబుతుంటే అర్థం కావటం లేదా?’ అని పరుష పదజాలంతో గద్దిస్తూ, దురుసుగా ప్రవర్తించటంతో హెచ్‌ఎం లక్ష్మీదేవి అతని చెంప ఛెళ్లుమనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment