
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. కలికిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి నేతృతంలో దళితుల గృహ నిర్మాణాలపై దాడులకు పాల్పడారు. ఈ ఘటనలో ఇరువురు గాయపడ్డారు.
దళితుల వాహనాలను కూడా ధ్వంసం చేసి.. బీరు బాటిల్స్‌తో బీభత్సం సృష్టించారు. సర్వేనెంబర్1098/2 గృహ నిర్మాణాలను పచ్చమూకలు ధ్వంసం చేశాయి. కన్నీరు మున్నీరుగా బాధితులు విలపిస్తున్నారు. టీడీపీ నేత అవినాష్‌రెడ్డి తోపాటు దాడిలో పాల్గొన్న వారిపై పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment