kalikiri
-
Kalikiri Meeting Photos: జగన్ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)
-
టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!
-
ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)
-
దళితులపై టీడీపీ గుండాల దౌర్జన్యం..
-
అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ నేతల గూండాగిరి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. కలికిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి నేతృతంలో దళితుల గృహ నిర్మాణాలపై దాడులకు పాల్పడారు. ఈ ఘటనలో ఇరువురు గాయపడ్డారు. దళితుల వాహనాలను కూడా ధ్వంసం చేసి.. బీరు బాటిల్స్‌తో బీభత్సం సృష్టించారు. సర్వేనెంబర్1098/2 గృహ నిర్మాణాలను పచ్చమూకలు ధ్వంసం చేశాయి. కన్నీరు మున్నీరుగా బాధితులు విలపిస్తున్నారు. టీడీపీ నేత అవినాష్‌రెడ్డి తోపాటు దాడిలో పాల్గొన్న వారిపై పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వరాల దేవత.. ఎల్లమ్మ తల్లి
కలికిరి: కలికిరి పట్టణంలో వెలసిన కలికిరి గ్రామ దేవత, భక్తులు కోర్కెలు తీర్చే చల్లని తల్లి ఎల్లమ్మ తిరుణాల శనివారం నుంచి ప్రారంభమవుతుందని ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతరలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని వివరించారు. జాతరలో భాగంగా ఆలయ ఆవరణంలో శనివారం రాత్రి అమ్మవారి హరికథా కాలక్షేపం, జాగరణ జరుగుతుందన్నారు. ►ఆదివారం ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తేరులో ప్రత్యేక అలంకరణ మధ్య కలికిరి పట్టణంలో ఊరేగింపు, తదుపరి సిద్దపూజ, అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులు అమ్మవారికి దీలు, బోణాలు సమర్పణ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే రాత్రికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రంగు రంగుల విద్తుత్దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన చాందినీ బండ్లు ఊరేగింపు, ప్రదర్శన చేపడతారన్నారు. ►సోమవారం నుంచి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం, రాత్రి లంకాదహనం, తేరులో పుష్పపల్లకి సేవ నిర్వహిస్తామన్నారు. మంగళవారం జరుగు పార్వేట ఉత్సవంతో జాతర ముగుస్తుందని చెప్పారు. జాతరకు 27 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు.. కలికిరి ఎల్లమ్మ జాతరను పురస్కరించుకుని పీలేరు ఆర్టీసీ డిపో నుంచి 27 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు పీలేరు డీఎం కె.కుమార్ తెలిపారు. 17న ఆదివారం, 18న సోమవారం రెండు రోజుల పాటు పీలేరు–కలికిరి 5 సర్వీసులు, కలికిరి–కలకడ మార్గంలో 6 సర్వీసులు, సోమల–కలికిరి 6, మదనపల్లి–కలికిరి 5 సర్వీసులు, కలికిరి–సదుం మార్గంలో 3, కలికిరి–వాయల్పాడు 2, మొత్తం 27 సర్వీసులను భ క్తుల సౌకర్యార్థం నడపనున్నామని, ఈ సదుపాయా న్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. రెండు శతాబ్దాల నాటి ఆలయ చరిత్ర.. సుమారు రెండు శతాబ్దాల క్రితం కలికిరి పంచాయతీ చెరువుముందరపల్లికి చెందిన వర్తకులు వ్యాపార నిమిత్తం కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు వెళ్లేవారని, అక్కడ కొనుగోలు చేసిన సరుకులను ఎడ్లబండి ద్వారా కలికిరి ప్రాంతానికి తీసుకువస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో వ్యాపారులు సరుకులు తరలిస్తున్న ఎడ్లబండి ఇప్పుడు ఆలయం ప్రాంతంలోకి వచ్చి కదలకుండా నిలిచి పోయేది. వ్యాపారులు ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఆ బండి ముందుకు సాగక పోవడంతో బండిలో ఉన్న బస్తాలను కిందకు దించుతుండగా వక్కల బస్తాలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మవారిని అదే ప్రాంతంలో విగ్రహ ప్రతిష్ట చేయించి ఆలయం నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు కలికిరి గ్రామ దేవతగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ►ఆలయం ఏర్పాటైన నాటినుంచి కలికిరి రెడ్డివారిపల్లికి చెందిన రెడ్డివారి కుటుంబీకులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ అంచెలంచెలుగా ఆలయాన్ని అభివృద్ధి చేపట్టారు. అలాగే ఉమ్మడిశెట్టి కుటుంబీకులు ఆలయ అర్చకులుగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆషాడమాసంలో అమ్మవారికి పెద్ద ఎత్తున తిరుణాల నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కలికిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి కలికిరి క్రాస్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. కలికిరి పట్టణానికి చెందిన మస్తాన్‌వలీ(45) పీలేరు పట్టణంలో పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. బుధవారం రాత్రి పని నిమిత్తం తన బంధువు నూర్‌మహమ్మద్(42)తో కలిసి కలికిరి రాజువారిపల్లికి వెళ్లి వస్తుండగా క్రాస్ రోడ్డు సమీపంలోని నగిరిపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన పీలేరు ఆర్టీసీ డిపో బస్సు ఢీకొంది. ప్రమాదంలో మస్తాన్ వలీ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు, నూర్మొహమ్మద్కు కాలు విరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మస్తాన్ వలీ మరణించినట్లు ధ్రువీకరించారు. నూర్‌మహమ్మద్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కారు ధ్వంసం మదనపల్లె టౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక వస్తున్న కారు మరో ద్విచక్ర వాహనం బస్సును ఢీకొని« ధ్వంసమైన సంఘటన మదనపల్లె రూరల్‌లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదపల్లెకు చెందిన రామకృష్ణ రూ.14 లక్షల కారును కొనుగోలు చేసి అమ్మవారి ఆలయంలో పూజ చేయించేందుకు బయలుదేరాడు. రోడ్డుకు కుడివైపున ఆలయానికి వెళ్లేందుకు కారు ఇండికేటర్ వేసి మలుపు తిప్పుతుండగా ఆర్టీసీ ఆద్దె బస్సు వేగంగా వచ్చిన కారును వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కొత్తకారు వెనుకభాగం పూర్తిగా దెబ్బతినింది. బస్సు కారును ఢీకొట్టి సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న బి.కొత్తకోట చెందిన నవీన్ కారు ముందు భాగం ధ్వంసమైంది. ఆ కారు వెనుకనే వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈడిగపల్లెకు చెందిన సంతోష్(21) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. హైవే పట్రోల్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటుచేసుకున్న నగదు అక్రమాల కేసులో గురువారం పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో 11 మంది బీవోబీ ఉద్యోగులు, మెసెంజరు సయ్యద్ అలీఖాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) మహేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బీవోబీలో స్వయం సహాయక సంఘాల నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘమిత్ర ప్రసన్నలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది ప్రమేయంతో మెసెంజరు రూ.1.6కోట్ల (ఎస్‌హెచ్‌జీ) నిధులను పక్కదారి పట్టించినట్లు విచారణలో వెల్లడైంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కొల్లగొట్టడం, నకిలీ పత్రాలు, పాస్వర్డ్లు వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అక్రమాలకు పాల్పడ్డారని తేలిన 16 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.20లక్షలు, మెసెంజరు అలీఖాన్‌కు చెందిన రూ.48.16లక్షలు విలువ చేసే 1.12 కిలోల తాకట్టు బంగారు నగల పత్రాలు, ఎనిమిది ఖాతాలను ఫ్రీజ్ చేసి, మూడు ద్విచక్రవాహనాలు, 12 సెల్ఫోన్లు మొత్తం రూ.70.20లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచారు. కాగా మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, కలికిరి ఎస్ఐ లోకేష్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. -
కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో విచారణ వేగవంతం
సాక్షి, చిత్తూరు: కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మరో ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు బ్యాంక్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. బదిలీపై వెళ్లిన అసిస్టెంట్ మేనేజర్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఆర్ఐ ఖాతాల నిధులు కూడా దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా 120 పొదుపు సంఘాల ఖాతాలను విచారించాల్సిఉంది. ఇవీ చదవండి: నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు! టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు -
కలికిరి బ్యాంక్ అఫ్ బరోడా కేసులో విచారణ వేగవంతం
-
నలుగురు కలికిరి బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్
-
ప్రేమించిన యువతితో వరుస కాదనడంతో.. ఇంటి నుంచి వెళ్లి..
సాక్షి, చిత్తూరు: మండలంలోని గుండ్లూరు గ్రామం కొర్నమిట్టపల్లె చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబసభ్యుల కథనం మేరకు... కొర్నమిట్టపల్లెకు చెందిన సుబ్బరాజ కుమారుడు కే.అశోక్ బాబు(23) తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో తన సమీప బంధువుల అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆ అమ్మాయితో నీకు వరుసలేదని, వద్దని మందలించారు. దీంతో మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొర్లకుంట గ్రామం టి.మాదిగపల్లె సమీపంలోని అటవీప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు అశోక్‌బాబుగా గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు ఆత్మహత్యకు పాల్పడిందని తమ కుమారుడేనని చూసి గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సుబ్బరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సైనిక్ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 18 ► పోస్టుల వివరాలు: టీజీటీ–02, ఎల్డీసీ–02, ఎంటీఎస్–14 తదితరాలు. ► టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/బీఏ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది. ► ఎల్డీసీ: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18 నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. ► ఎంటీఎస్: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021 ► వెబ్సైట్: https://sskal.ac.in -
కలికిరి సైనిక్ స్కూల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 23 ► పోస్టుల వివరాలు: హెడ్మాస్టర్–01, ప్రీ ప్రైమరీ టీచర్లు–03, ప్రైమరీ టీచర్లు–06, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్–01, మ్యూజిక్/ డ్యాన్స్ టీచర్–01, స్పెషల్ ఎడ్యుకేటర్–01, పీఈటీ–01, హెడ్ క్లర్క్–01, అకౌంట్ క్లర్క్–01, డ్రైవర్–01, ఆయాలు–04, ఎంటీఎస్–02. ► హెడ్ మాస్టర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు. ► ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత: ఇంటర్మీడియట్, ఎన్టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ప్రైమరీ టీచర్లు: అర్హత: గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత కలిగి ఉండాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్: అర్హత: బీఎఫ్ఏ, టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► మ్యూజిక్/డ్యాన్స్ టీచర్: అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► స్పెషల్ ఎడ్యుకేటర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► హెడ్‌క్లర్క్: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► అకౌంట్ క్లర్క్: అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► డ్రైవర్: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంటీఎస్: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021 ► వెబ్సైట్: www.sskal.ac.in ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండి -
టీడీపీలో ‘నల్లారి’ చేరికకు రంగం సిద్దం!
కలికిరి: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికలలో జై సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే గత మూడు సంవత్సరాలుగా నల్లారి సోదరులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయినప్పటికి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీలో చేరుతారని పుకార్లు షికార్లు చేశాయి. ఏడాది కాలంగా ఏదో ఒక పార్టీలో చేరుతారని, నేడో రేపో ప్రకటన చేస్తారంటూ ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఇంతలో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇటీవల టీడీపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరనాధరెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ, జడ్పీ చైర్మెన్ గీర్వాణీ చంద్రప్రకాష్ తదితర ప్రముఖులు ఆదివారం సాయంత్రం నగిరిపల్లిలో నల్లారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ తంతులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే కిషోర్‌కుమార్‌రెడ్డి సైతం టీడీపీలో చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో తాను పార్టీలో చేరుతానని అయితే తనకు రాజంపేట ఎంపీ టికెట్‌తో పాటు, టీటీడీ చైర్మన్ పదవి అడిగినట్లు సమాచారం. ఎంపీ టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధినేత సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా తన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై మాజీ ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేయనట్లు విశ్వసనీయ సమాచారం. -
కనికరం లేని కొడుకులు
ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాడు.. కడుపుకట్టుకుని పెంచి పెద్దచేశాడు.. సంపాదించిన ఆస్తిపాస్తులూ సమానంగానే పంచిపెట్టాడు.. బిడ్డలపై భారం కాకూడదని సొంతంగానే బతకడం నేర్చుకున్నాడు.. వయసు మీదపడింది.. బతుకు భారమైపోయింది.. భిక్షమెత్తినా భుక్తి దొరకడం గగనమైపోయింది.. అవసాన దశలో కన్నబిడ్డల చెంతే కన్నుమూయాలనుకున్నాడు.. కానీ కనికరం లేని ఆ కుమారులు రక్తం పంచి ఇచ్చిన తండ్రినే వద్దనుకున్నారు.. నిర్ధాక్షణ్యంగా రైల్వేస్టేషన్లో వదిలివెళ్లిపోయారు.. ఈ ఘటన కలికిరిలో ఆదివారం సంచలనం రేపింది. కలికిరి:కలికిరి పట్టణం అమరనాధరెడ్డి కాలనీలో వున్న కాములూరి బాషా(60)కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. కొడుకుల్లో ఒకరు ఆర్టీసీబస్టాండ్ సమీపంలో టీస్టాల్ నడుపుతున్నాడు. మరొకరు తిమ్మారెడ్డి కాంప్లెక్స్‌కు ఎదురుగా బజ్జీలకొట్టు పెట్టుకున్నాడు. ఇంకో కుమారుడు సౌదీలో ఉంటున్నాడు. అందరూ ఆర్థికంగా స్థిరపడ్డా తండ్రిని పట్టించుకోక వదిలేశారు. చేసేదిలేక బాషా బెంగుళూరుకు వెళ్లిపోయాడు. భిక్షాటన చేసుకుంటూ అక్కడ ఐదేళ్లు జీవించాడు. చివరి రోజుల్లో బిడ్డలను చూసి వారివద్ద తనువు చాలించాలనుకున్నాడు. రెండు రోజుల క్రితం కలికిరికి వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడిని కుమారులిద్దరూ రైల్వేస్టేషన్లో వదిలి చేతులు దులుపుకున్నారు. స్థానికులు గుర్తించి ఆదివారం రాత్రి ఎస్ఐ పురుషోత్తరెడ్డికి సమాచారమందించారు. ఎస్ బాషా కుమారులతో మాట్లాడినా వారు స్పందించకపోవడంతో వృద్ధుడిని స్టేషన్‌వద్దకు తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవసాన దశలో ఇంటికి వచ్చిన తండ్రిని వదిలించుకోవాలనుకున్న వారిపై స్థానికులు మండిపడుతున్నారు. -
ఎంపీడీవోపై మాజీ సీఎం వర్గీయులు దౌర్జన్యం
తిరుపతి: చిత్తూరు జిల్లా కలికిరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక ఎంపీడీవో రాజశేఖరరెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. రాజశేఖరరెడ్డి తనకు అనుకూలంగా వ్యవహారించడం లేదని ఓ ఉద్యోగి మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వర్గీయులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగంలోకి దిగి.... ఈ రోజు ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయం గది నుంచి రాజశేఖరరెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా బయటకు నెట్టి... రాజశేఖరరెడ్డి గదికి తాళం వేశారు. -
ఇంటర్నెట్ ప్రేమపెళ్లి
కలికిరి, న్యూస్‌లైన్: అమ్మాయి అనంతపురం జేఎన్టీయూ కళాశాల విద్యార్థిని, అబ్బాయి బెంగళూరు ఆర్మీలో ఉద్యోగి. ఇంటర్నెట్ సాయంతో ఇరువురూ ప్రేమించుకున్నారు. ఫేస్బుక్లో మనసులు కలిశాయి. పెద్దల ప్రమేయం లేకుండా ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించడంతో కథ సుఖాంతమైంది. వివరాలిలా ఉన్నాయి. కలికిరి మండలం మేడికుర్తి పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన ఎం.సహదేవయ్య కుమారుడు మహేంద్ర బెంగళూరులో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా ధర్మవరం కేశవనగర్‌కు చెందిన సత్యనారాయణ కుమార్తె ఎస్.రాజరాజేశ్వరి జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇరువురూ ఇంటర్నెట్ ద్వారా రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఫేస్బుక్లో ఇద్దరి మనసులూ కలవ డంతో రెండు రోజుల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆదివారం మదనపల్లె డీఎస్పీని కలిశారు. ఆయన సూచనల మేరకు కలికిరి పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ. సోమశేఖర్‌రెడ్డి సోమవారం ఇరు కుటుంబాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. తామిద్దరం మేజర్లమని, ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రేమికులిద్దరూ తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో కొత్త జంట పసలవాండ్లపల్లెకు వెళ్లింది. మంగళవారం ధర్మవరం బయలుదేరింది. -
బరి తెగించిన కాంగ్రెస్, కలికిరిలో ఉద్రిక్తత