బరి తెగించిన కాంగ్రెస్, కలికిరిలో ఉద్రిక్తత | Desperate Congress leaders turn towards tension at Kalikiri | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 13 2013 3:16 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సొంత మండలం చిత్తూరు జిల్లా కలికిరిలో కాంగ్రెస్‌ వర్గీయులు బరి తెగించారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను శనివారం అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు వచ్చిన సాక్షి మీడియాపై కూడా దాడి చేశారు.కెమెరాను ధ్వంసం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి అండ చూసుకునే కాంగ్రెస్‌ నేతలు రెచ్చి పోతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నామినేషన్లు వేసే హక్కు అందరికీ ఉందని అడ్డుకోవడం సరికాదని అన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా దాడి ఘటనపై జిల్లా అధికారులను ఎన్నికల కమిషన్ వివరణ కోరింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement