pileru
-
యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్ అరెస్ట్
సాక్షి,అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ‘ఇంటర్,డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ ,గౌతమి ఒకే కాలేజీలో చదువుకున్నారు. గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్‌గా మదనపల్లి బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంటపడేవాడు.ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్‌తో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉంటున్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు, అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమె నోటిలో పోశాడు.తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ కేసులో నిందితుడైన గణేష్‌ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. బాలికలు యువతులు మహిళలను ఎవరైనా వేధిస్తే సహించేది లేదు. వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి’అని ఎస్పీ కోరారు. -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు: వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం:యువతిపై ప్రేమోన్మాది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఈ మేరకు కళ్యాణి శుక్రవారం(ఫిబ్రవరి14) మీడియాతో మాట్లాడారు. ‘కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. యువతిపై యాసిడ్ దాడి చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.యాసిడ్ బాధిత మహిళకు ప్రభుత్వం అండగా నిలబడాలి.యువతకు మెరుగైన వైద్యం అందించాలి.రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికి వదిలేశారు.జనసేన నేత కిరణ్ రాయల్ వలన మహిళకు అన్యాయం జరిగితే తిరిగి అదే మహిళ మీద కేసు పెట్టారు’అని కళ్యాణి గుర్తుచేశారు. -
యువతిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పీలేరులో యువతిపై ప్రేమోన్మాది చేసిన దాడిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ శుక్రవారం(ఫిబ్రవరి 14) ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.కాగా,అన్నమయ్య జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమోన్మాది అమానుషానికి ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. -
దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు : చింతల రామచంద్రారెడ్డి
-
ప్రారంభోత్సవానికి సిద్ధంగా పీలేరు ఆస్పత్రి
-
ఎంత పని చేశావు తల్లీ..!
సాక్షి, రాయచోటి: కడుపులో పెరుగుతున్నప్పటి నుంచే తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. భూమి పైకి వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుతుంది. కట్టుకున్న భర్త పట్టించుకోకపోయినా.. నా అన్న వారు పలకరించకపోయినా.. చివరికి తాను ఏకాకైనా సరే సర్వం ధారపోసి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మ తన కడుపున పుట్టిన బిడ్డను తన చేతులతోనే కర్కోటకంగా గొంతు నులిమి చంపిన సంఘటన రాయచోటిలో చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె గ్రామం పొలాల వద్ద ఉన్న నక్కలగుట్టలో జరిగింది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, అనవసర భయంతో ఆమె ఈ దుర్ఘటనకు పాల్పడింది. అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరులోని చెన్నారెడ్డి వీధికి చెందిన షేక్ మహమ్మద్ బాషా సంబేపల్లె మండలం చౌటపల్లె గ్రామం షేక్ ఫాతిమాను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి రుక్సానా (10 నెలల) కుమార్తె ఉంది. ఫాతిమా మానసిక స్థితి సరిగా లేదు. ఆమె భర్త ఇంటి నుంచి అప్పుడప్పుడూ చెప్పకుండా పుట్టింటికి వచ్చేది. తన ఆరోగ్యం సరిగా లేదని, త్వరగా చనిపోతానని భావించింది. తాను చనిపోతే తన బిడ్డను ఎవరు చూసుకుంటారు అనే అనుమాన పడింది. ఎవరూ చూసుకోరనే నిర్ణయానికి వచ్చింది. అనుకున్నదే తడువుగా శనివారం తన పసిబిడ్డను తీసుకొని రాయచోటికి వచ్చింది. అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లేందుకు మనసు నచ్చక రాయచోటిలోనే ఆగిపోయింది. రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె సమీపాన ముళ్ల పొదల వద్ద ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి కుమార్తె గొంతు నులిమి చంపేసింది. కుమార్తె మృతదేహాన్ని తన భుజాలపై వేసుకొని రాయచోటికి వచ్చి, అక్కడి నుంచి తిరిగి పీలేరుకు వెళ్లింది. అప్పటికే రాత్రి కావడంతో పీలేరు నుంచి భర్త బంధువులకు ఫోన్ చేసి తన బిడ్డను చంపేశానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి విగతజీవిగా పడి ఉంది. బంధువులు పాప శవాన్ని తీసుకొని రాయచోటి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సైకో చంద్రబాబు గో బ్యాక్.. పీలేరులో ఫ్లెక్సీల ఏర్పాటు
సాక్షి, అన్నమయ్య: చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మత కలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీల దర్శనమిచ్చాయి. ‘ గోబ్యాక్ చంద్రబాబు.. పుంగనూరులో మత కలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు గో బ్యాక్.. సైకో చంద్రబాబు గో బ్యాక్’ అని కొందరు బాబు రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలతో నిరసించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడులు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ గాయపడిన వారి ఫోటోలను ఫ్లెక్సీల్లో ఉంచారు. కాగా, పీలేరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి సోమవారం చంద్రబాబు వెళ్లారు. ములాఖత్‌కు బాబుతోపాటు ఆరుగురు అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ఫ్లెక్సీలు కనిపించాయి. బాబు పీలేరు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు హాట్‌టాపిక్‌గా మారాయి. -
చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో ఫ్లెక్సీలు
-
టీడీపీకి మరో షాక్ ..!
-
అన్నమయ్య జిల్లా పీలేరులో వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ
-
దిన్నెమీద గంగమ్మ లేఅవుట్ పరిశీలన
పీలేరు : మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను రాయచోటి ఆర్డీఓ రంగస్వామి పరిశీలించారు. దిన్నెమీద గంగమ్మ లేఅవుట్ జగనన్న కాలనీ, ఆటో నగర్లో ఆక్ర మణలు జరిగినట్లు కొత్తపల్లెకు చెందిన దేవేంద్రరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం ఆర్డీఓ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను ఆటో నగర్‌లోని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇది వరకే దిన్నెమీద గంగమ్మ లేఅవుట్లో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వీఆర్వో హేమంత్ నాయక్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఆసిఫ్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ స్థలాలను పరిశీలించారు. అలాగే మండలంలో ల్యాండ్ కన్వర్షన్ స్థలాలు పరిశీలించారు. పీలేరు పంచాయతీ సర్వే నెంబరు 42లో 3.60 ఎకరాలు, ముడుపులవేములలో సర్వే నెంబరు 405/3లో ఒక ఎకరా, బోడుమల్లువారిపల్లెలో సర్వే నెంబరు 731లో ఒక ఎకరా, 715లో రెండు ఎకరాలు, 711లో 90 సెంట్లు, 636లో 83 సెంట్లు, 639లో 1.84 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవి, ఆర్ఐలు రాజశేఖర్, భార్గవి, సర్వేయర్ దేవి పాల్గొన్నారు. -
Papaya Fruits Packing: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!
గుర్రంకొండ: అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయిని ప్రత్యేక పద్ధతుల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి లోడింగ్ అన్నిటికంటే భిన్నంగా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఇందుకోసం కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలివైపు ప్యాకింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.18 వరకు పలుకుతోంది. దీంతో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయి కాయలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు ఇక్కడే మకాం సాధారణంగా పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు జులై నెలలో ఇక్కడికి చేరుకొంటారు. ముఖ్యంగా మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మకాం వేస్తుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ నెల వరకు ఇక్కడే ఉండి బొప్పాయి కొనుగోలు చేసి ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏజెంట్లను నియమించుకొని బొప్పాయి సాగు చేసిన రైతుల వివరాలు సేకరించి తోటలవద్దకు వెళ్లి వారే నేరుగా రైతుల వద్ద నుంచి కాయల్ని కొనుగోలు చేస్తారు. లోడింగ్ కూలీల ప్రత్యేకత కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాలకు చెందిన కూలీలు ఈ తరహా కటింగ్, లోడింగ్ కోసం వస్తుంటారు. బొప్పాయి తోటల్లో వెళ్లే కూలీలు ఎగుమతికి పనికొచ్చే కాయలను చెట్టునుంచి కింద పడకుండా కిందికి దించుతారు. ఆ తరువాత ప్రతి కాయను పేపర్‌తో చుడతారు. లారీలోకి బొప్పాయి కాయల్ని లోడ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తారు. లారీ లోపల, కింద భాగంలో నాలుగువైపులా ఎండుగడ్డిని ఏర్పాటు చేస్తారు. పేపర్ చుట్టిన కాయల్ని లారీల్లో లోడ్ చేసి మళ్లీపైన కూడా ఎండుగడ్డిని ఎక్కువగా వేసి లోడ్ చేయడం వీరి ప్రత్యేకత. వందలాది మంది కూలీలు బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతుండడం గమనార్హం. ఢిల్లీ కటింగ్‌కు ప్రత్యేకం సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. ఢిల్లీ కటింగ్‌కు మాత్రం ఎంతో తేడా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బొప్పాయి సన్నని సూది లావు అంత లేత పసుపు రంగు వర్ణం రాగానే వాటితో పాటు వాటిపైనున్న రెండు కాయల్ని కోత కోస్తారు. ఇందుకోసం అనుభవం కలిగిన కోత కూలీలను ఏర్పాటు చేసుకొంటారు. లోడింగ్ చేసేందుకు అనుభవం ఉన్న బయట ప్రాంతాల హమాలీలను తీసుకొస్తుంటారు. ఢిల్లీ కంటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరి మరీ కోస్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయడం కూలీల ప్రత్యేకత. బొప్పాయికి భలే డిమాండ్ బయట రాష్ట్రాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గతంలో కురిసిన వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.18 వరకు ధర పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. (క్లిక్: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్) తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ముందుగా తమను సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. – సుధాకర్‌రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె మూడు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ. 18 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. – రామయ్య, బొప్పాయి రైతు, కొత్తపల్లె -
ప్రాణం తీసిన ఈత సరదా
పీలేరురూరల్: ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని జాండ్ల పంచాయతీ గుండాల మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం శ్రీనాథపురం కాలనీకి చెందిన షేక్ రియాజ్ కుమారుడు షేక్ సుహేల్ (18) తన స్నేహితుడు కట్టుకాలువ వీధికి చెందిన షేక్ మాలిక్ బాషా ఇద్దరూ పట్టణంలోని ఓ చికెన్ సెంటర్లో పని చేసేవారు. శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో సరదాగా ఈత కొట్టడానికి అడవిపల్లె గుండాల మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వాగు వద్ద వెళ్లారు. పై నుంచి నీటిలో దూకాడు. నీటిలోపల ఉన్న రాళ్లలో ఇరుక్కుపోయాడు. ఎంతకు పైకిరాకపోవడంతో గట్టుపై ఉన్న మాలిక్ వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుహేల్ నీటిలోని రాళ్లలో ఇరుక్కుని మృతి చెంది ఉండగా గుర్తించి వెలుపలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. -
చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు మంజూరు
పీలేరురూరల్ : మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ని యోజకవర్గాల్లో 12 చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు నిధులు మంజూరైనట్లు మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేంద్రరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చింతలచెరువు అభివృద్ధి పనులను ఆయన ప రిశీలించారు. ఆయన మాట్లాడుతూ పీలేరు నియో జకవర్గంలో పీలేరు మండలం చింతలచెరువుకు రూ.22 లక్షలు, కేవీపల్లె మండలం అమ్మగారిచెరువు కు రూ. 29 లక్షలు, కలకడ మండలం కదిరాయుని చెరువుకు రూ. 24 లక్షలు నిధులు మంజూరు అ య్యాయని చెప్పారు. అలాగే కలికిరి మండలంలో పెద్ద ఒడ్డు, మల్లిసముద్రం, దిగువ చెరువుకు రూ. 57.50 లక్షలు, తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం పెద్దచెరువుకు రూ. 22 లక్షలు, బి.కొత్తకోట మండలం పెద్దచెరువుకు రూ. 33 లక్ష లు, పీటీఎం మండలం పెద్దచెరువుకు రూ. 49 లక్ష లు, తంబళ్లపల్లె మండలం రాతిచెరువుకు రూ. 47 లక్షలు, పెద్దమండ్యం మండలంలో మర్రికుంట చెరువు, పొట్టివానికుంట, ముసలికుంటకు రూ. 43 లక్షలు, మదనపల్లె మండలం సీటీఎం పెద్దచెరువుకు రూ. కోటి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ డీఈ ప్రసన్నకుమారి, ఏఈ ఎత్తిరాజులు పాల్గొన్నారు. -
చిత్తూరు అబ్బాయి, కశ్మీర్ అమ్మాయి.. బెర్లిన్‌లో ప్రేమ..
సాక్షి, పీలేరు(చిత్తూరు): బెర్లిన్‌లో ప్రేమించుకున్న ప్రేమజంటకు పీలేరులో వివాహం జరిగింది. పీలేరు మండలం కాకులారంపల్లెకు చెందిన కాకులారం మోహన్‌రెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డి గత మూడేళ్లుగా బెర్లిన్‌లోని చార్టీ రాష్ట్రంలో ఓ సైన్స్ పరిశోధనా కేంద్రంలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. అక్కడే కశ్మీర్‌కు చెందిన రూఫ్‌కిషన్ రైనా కుమార్తె షికా రైనా కూడా బెర్లిన్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో కుమార్‌రెడ్డి, షికా రైనాలు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించడంతో ఆదివారం స్థానిక పీలేరు ఎంఎన్ఆర్ కల్యాణమండపంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. చదవండి: (ట్రైనింగ్‌లో మొగ్గతొడిగిన ప్రేమ.. పెద్దల సమక్షంలో ఎస్ఐల పెళ్లి) -
'నా బిడ్డను అన్యాయంగా చంపేశారు..'
సాక్షి, పీలేరు/కేవీపల్లె: ‘‘నా బిడ్డను అన్యాయంగా చంపేశారు... నిందితులను కఠినంగా శిక్షించండి.’’ అంటూ హతుడి తల్లి బోరున విలపించింది. కేవీపల్లె మండలం ఎగువమేకలవారిపల్లె సమీపంలోని బొప్పాయితోటలో హత్యకు గురైన తేజేష్‌రెడ్డి తల్లి జ్యోతి గురువారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎదుట తనగోడు వెల్లబోసుకుంది. తేజేష్‌రెడ్డి(8) మృతదేహానికి గురువారం పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్యే ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుని బంధువులను ఓదార్చే ప్రయత్నం చేశారు. జ్యోతి మాట్లాడుతూ, తాము ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదని, గతంలో అప్పు చేసినా తీర్చేశామని పేర్కొంది. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అభంశుభం తెలియని బాలుడిని హత్య చేయడం అత్యంత కిరాతకమైన సంఘటనగా అన్నారు. నిందితులు ఎంతటి వారైనా, ఎవరైనా ఉపేక్షించబోమని కఠిన శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ విచారణ తేజేష్‌రెడ్డి హత్యాఘటనపై గురువారం రాత్రి ఎస్పీ సెంథిల్‌కుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. వివిధ కోణాల్లో గ్రామస్తులను సమాచారం అడిగి తెలుసుకుని వివరాలు నమోదు చేశారు. ప్రధానంగా తేజేష్‌రెడ్డి తల్లిదండ్రుల ఆర్థిక లావాదేవీలు కారణమై వుండవచ్చన్న అనుమానాలున్నాయి. ఎస్పీతోపాటు సీఐ, ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు. చదవండి: (Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?) సంకేనిగుట్టపల్లెలో విషాదఛాయలు పోస్టుమార్టం చేసిన మృతదేహాన్ని గ్యారంపల్లె పంచాయతీ సంకేనిగుట్టపల్లెకు తరలించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తల్లి జ్యోతితోపాటు బంధువుల రోదనలు కలచివేశాయి. కువైట్‌లో ఉన్న తండ్రి నాగిరెడ్డి స్వగ్రామానికి వస్తున్నట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. -
నల్లారి కుటుంబంపై పీలేరు ఎమ్మెల్యే సవాల్
-
జగనన్న కాలనీలో గృహప్రవేశం
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని యర్రగుంటపల్లె లే అవుట్‌లోని జగనన్న కాలనీలో ఒక లబ్ధిదారు గృహప్రవేశం చేశారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా పీలేరు పట్టణానికి చెందిన రెడ్డిరాణి, రెడ్డీశ్వర్‌రెడ్డి దంపతులకు ఇల్లు మంజూరైంది. స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టి 2 నెలల్లో పూర్తిచేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ మండల నాయకుడు కంభం సతీష్‌రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డిరాణి, రెడ్డీశ్వర్రెడ్డిలను ఆదర్శంగా తీసుకుని మిగిలిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జగన్మోహన్రెడ్డి, హబీబ్‌బాషా, ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డి, నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వినోద్‌కుమార్, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌ల నిర్మాణం: మంత్రి అనిల్ ఏపీ: 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ సొంతింటి కల నెరవేరింది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని మాకు సొంతింటి కల నెరవేరింది. కొన్నేళ్లుగా సొంతిళ్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా మాకు ఇల్లు మంజూరైంది. జగనన్న కాలనీలో మా ఇంట్లోకి గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉంది. – రెడ్డిరాణి -
వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆకతాయిల లైంగిక వేధింపులు తాళలేక ఓ మైనర్ బాలిక సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పీలేరులో జరిగింది. పీలేరు బండ్ల వీధికి చెందిన విజయలక్ష్మిని అదే వీధికి చెందిన కొంత మంది యువకులు వేధించడంతో మనస్తాపం చెంది ఈ రోజు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. (చదవండి: బైక్ తాకినందుకు రోడ్డుపైకి ఈడ్చి దాడి) -
ఈఎస్ఐ స్కామ్ సిగ్గు చేటు: ఎమ్మెల్యే చింతల
-
వివాహేతర సంబంధం: గదిలో అఘాయిత్యం
-
ఆలస్యంగా వస్తామంటూ..
సాక్షి, పీలేరు: మండలంలోని నెట్టిబండ సమీపంలో సోమవారం ఇద్దరు యువకులు రైలు పట్టాల వద్ద గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలై వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. స్థానిక కావలిపల్లెకు చెందిన సాయి (19), యర్రావారిపాళెం మండలం, ఓఎస్ గొల్లపల్లెకు చెందిన బి. శివకుమార్ (26) ఇరువురూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం విదితమే. చిత్తూరు మార్గంలోని రైల్వే గేటు నుంచి తిరుపతి రైల్వే మార్గంలో 3 కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు ఉన్నట్లు సోమవారం తెల్లవారుజామున 5–6 గంటలకు గుర్తించారు. మృతదేహాల వద్ద లభించిన ఏటీఎం కార్డు ఆధారంగా మృతులను పోలీసులు గుర్తించి సమాచారం చేరవేయడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ కుమారులు ఆత్మహత్య చేసుకోడానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, ఎవరో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రైలు పట్టాలపై పడేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయంగా శివకుమార్ తండ్రి వెంకట్రమణ, సాయి తండ్రి రాజన్న మంగళవారం పీలేరులో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వస్తామంటూ.. శివకుమార్, సాయి ఇరువురూ ఆదివారం రాత్రి తమ తల్లిదండ్రులతో మాట్లాడారు. పీలేరులో ఉన్నామని, ఆలస్యంగా ఇంటికి వస్తామని చెప్పారని వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఆది వారం రాత్రి పొద్దుపోయినా సాయి ఇంటికి రాకపోవడంతో అదేరోజు రాత్రి 11 గంటలకు అతడి తండ్రి సాయికి ఫోన్ చేశారు. తాను క్రాస్ రోడ్డులో ఉన్నానని, ఇంటికి వస్తానని సాయి చెప్పడంతో తల్లిదండ్రులు ధైర్యంగా ఉండిపోయారు. అయితే సాయి, శివకుమార్ మృతదేహాలు రైలు పట్టాలపై పడి ఉన్నాయని తెలియడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సెల్ఫోన్లు ఏమయ్యాయి..? సాయి, శివకుమార్ వద్ద ఎప్పుడూ సెల్ఫోన్లు ఉంటాయని, ప్రమాదం జరిగిన తరువాత అవి ఏమయ్యాయో తెలియడం లేదని మృతుల తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తమ కుమారుల మృతిపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. మృతదేహాలకు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్వీయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పీలేరులో అధికారుల నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు రావడంతో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించటం వల్ల తాము సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఈ నెల 14, 15 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి యధావిథిగా పరీక్షలు జరగాల్సి ఉండగా, ఇప్పుడు కూడా పరీక్ష కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించడంతో 399 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
పీలేరు బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
-
‘శిల్ప మృతికి లైంగిక వేధింపులే కారణం’
-
‘శిల్ప మృతికి లైంగిక వేధింపులే కారణం’
తిరుపతి: ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని సీఐడీ తేల్చింది. ఈ మేరకు సీఐడీ డీఎస్పీ అమ్మిరెడ్డి నివేదిక వివరాలను మీడియాకు వివరించారు. ఈ ఏడాది ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లో శిల్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఈ ఆత్మహత్య ఘటనపై డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగా సీఐడి విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. డాక్టర్ శిల్పను ముగ్గురు ప్రొఫెసర్లు రవికుమార్, శశికుమార్, కిరీటీ లైంగికంగా వేధింపులకు గురిచేశారని సీఐడీ నివేదిక తేల్చింది. ఈ ఘటనకు సంబంధించి 47 మందిని విచారించినట్లు అమ్మిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో డిజిటల్ ఆధారాలు , సిట్ దర్యాప్తు బృందం, వివిధ కమిటీల రిపోర్టులను సేకరించినట్లు అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. శిల్ప మైగ్రేన్‌తో తీవ్రంగా బాధపడుతూ ఉండేదని, ఈ క్రమంలోనే వైద్యుల లైంగిక వేధింపులు తోడవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. శిల్ప మరణానికి భర్త, బంధువులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే బెయిల్ కోసం నిందితులు హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారని, ఆత్మహత్యపై త్వరలోనే ఛార్జిషీటును దాఖలు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఇక్కడ చదవండి: ‘అలా చేసుంటే శిల్ప బతికేది’ నిర్లక్ష్యమే ఉసురు తీసిందా!? -
పీలేరులో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఐదేళ్ల క్రితం రూపేశ్ కుమార్ అనే వ్యక్తితో శిల్పకు ప్రేమ వివాహం జరిగింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలోని పీడీయాట్రిక్ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది. శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిన్న సాయంత్రం విడుదలైన పీజీ ఫలితాల్లో శిల్ప ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే కావాలని ప్రొఫెసర్లు ఫెయిల్ చేశారని, ఆ బాధతోనే శిల్ప ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై విద్యార్థిని ఆత్మహత్య
పీలేరు: మండలంలోని పచ్చారమాకలపల్లె తండాలో శుక్రవారం రాత్రి ప్రేమ విఫలమై విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ పీవీ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు.. జాండ్ల పంచాయతీ పచ్చార్లమాకలపల్లె తండాకు చెందిన హిమబిదు(19) అమ్మానాన్నలు గోపీనాయక్, శాంతమ్మ చనిపోవడంతో అవ్వాతాతలు రేవతి, మహేంద్రనాయక్ వద్ద ఉంటోంది. ఆమె ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన చంద్రనాయక్ కుమారుడు మణికుమార్నాయక్తో ఏర్పడిన పరిచ యం ప్రేమగా మారింది. వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏమి జరిగిందో కానీ పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో శుక్రవారం సాయంత్రం హిమబిందు పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. మణికుమార్నాయక్ మోసం చేయడంవల్లే తన మనవరాలు ఆత్మహత్య చేసుకుందని మహేంద్రనాయక్ వాపోయాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని తానావడ్డెపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టి జాతరకు వెళ్తున్న కళాకారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మృతులు నిమ్మనపల్లె మండలం కొండసానివారిపల్లె వాసులుగా గుర్తించారు. కళాకారులు డప్పు వాయిస్తూ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్టీ బలోపేతంలో యువత పాత్ర కీలకం
పీలేరు : వైఎస్సార్సీపీ బలోపేతంలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పీలేరులో పార్టీ యువ నేత కృష్ణచైతన్యరెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. వైఎస్సార్సీపీ జెండా రంగులో రూపిందించిన కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకూ తీసుకెళ్లి వివరించడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని కాదని, ముగిసిపోయిన అధ్యాయమని అవహేళన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. హోదా కోసం ఉద్యమించిన ఎమ్మెల్యేలు, నాయకులు, యువకులపై అక్రమ కేసులు పెట్టించిన సీఎం ఉన్నఫలంగా యూటర్న్ తీసుకుని మరోమారు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. సీఎం డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.. తన ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో సీఎం హోదా అంటూ కొత్తనాటకానికి తెరలేపారని విమర్శించారు. రూ. 30 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్ష చేసి తన ధ్వంద నీతిని సీఎం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. సీఎం మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్తాపితం చేయడంలో యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వినర్ నారే వెంటక్రమణారెడ్డి, పార్టీ నాయకులు ఎం. భానుప్రకాష్‌రెడ్డి, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, చైతన్యరెడ్డి, ఆనంద్, శ్యామ్‌రెడ్డి, ఉదయ్, హరి, వెంకటేశ్వర్‌రెడ్డి, జీవన్, నవీన్, సుధాకర్, కిషోర్, మణి తదితరులు పాల్గొన్నారు. భాస్కర్‌నాయుడు కుటుంబానికి పరామర్శ కలకడ: స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు నీళ్ల భాస్కర్‌నాయుడు కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఆదివారం మండలంలోని కె.బాటవారిపల్లెలో భాస్కర్‌నాయుడు తమ్ముడు భార్య సూర్యకుమారి శుభస్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మనోహర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకట్రమణరెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేఎస్ మస్తాన్ తదితరులు ఉన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలి కేవీపల్లె: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ నగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ జి. జయరామచంద్రయ్య, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, రమేష్, ధర్మారెడ్డి, నాగసిద్ధారెడ్డి, గణపతిరెడ్డి, సైఫుల్లాఖాన్, అమరేంద్రనాయుడు, యర్రయ్య, చిన్నబ్బ, చెంగయ్య, ప్రభాకర, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి ఇంట విషాదం
మరో గంటన్నరలో పెళ్లి వేదిక వద్దకు చేరాల్సిన వారు అనుకోని ప్రమాదానికి లోనయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యం.. విధి ఆడిన నాటకంలో ఓ మహిళ ఓడిపోగా.. పెళ్లి కుమారుడు సహా 17 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన పీలేరులో విషాదాన్ని నింపింది. బంధువుల ఆర్తనాదాలు చూపరులకు కన్నీళ్లు తెప్పించాయి. పీలేరు : పీలేరు–కడప జాతీయ రహదారిలోని ముడుపులవేముల పంచాయతీ యల్లంపల్లె వద్ద ఆదివారం పెళ్లి వ్యాను బోల్తా పడింది. దీంతో ఒక మహిళ దుర్మరణం చెందగా పెళ్లి కుమారుడితోపాటు 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. కడపకు చెందిన గోవిందాచారి కుమారుడు ప్రదీప్‌కు చిత్తూరులో సోమవారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కుమారుడు ప్రదీప్ తోపాటు బంధువులు తుపాన్ వ్యాన్‌లో బయలుదేరారు. పీలేరు సమీపంలోని యల్లంపల్లె క్రాస్ వద్ద వేగంగా వెళుతున్న వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న సూచిక బోర్డుపై దూసుకుపోయి పక్కనే గుట్టను ఢీకొంది. అందులోని వారు చెల్లాచెదురుగా కింద పడిపోయారు. ఈ క్రమంలో పెళ్లి కుమారుడి చిన్నమ్మ సుధ (55) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఉమామహేశ్వరి, గోవిందాచారి, వరలక్ష్మి, చిత్రలేఖ, పెళ్లి కొడుకు ప్రదీప్, భాస్కర్, కళావతి, గణేష్ ఆచారి, మోహిత్‌కుమార్, సుమతి, శివకృష్ణ, శ్రీవల్లి, హేమలత, నవీన, నాగమణి, డ్రైవర్ సయ్యద్‌బాషా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పీలేరు సీఐ కె.వేణుగోపాల్, ఎస్ఐ పీవీ సుధాకర్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 14 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. సుధ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో పెళ్లి బృందం ఆర్తనాదాలు మిన్నంటాయి. మరో గంటన్నర సమయంలో వివాహ వేదికకు చేరుకునే లోపే ఊహించని విధంగా ఘోర ప్రమాదానికి గురికావడంతో పెళ్లి ఇంట విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నేడు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాక
పీలేరు: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి పీలేరు కు రానున్నారు. గురువారం రాత్రి పీలే రు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో కేవీ పల్లె మండలం గ్యారంపల్లెకు చెందిన సమైక్యాంధ్ర పార్టీ నేత వెంకట్రమణారెడ్డి కుమార్తె వివాహానికి ఆయన హాజ రుకానున్నారు. గురువారం ఉదయం బెంగళూరు నుంచి స్వగ్రామమైన కలికిరి నగిరిపల్లెకు చేరుకుంటారు. అనంతరం రాత్రి పీలేరుకు వ చ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారని ఆయన అనుచరులు తెలిపారు. -
పీలేరులో నల్లారికి షాక్
హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. రాష్ట్రంలో ఆ పార్టీ తరపున ఒక్కరూ గెలిచే పరిస్థితి లేకపోగా.. సొంత నియోజకవర్గంలోనూ నల్లారికి షాక్ తగిలింది. కిరణ్ స్వయానా సోదరుడినే గెలిపించుకోలేకపోయారు. కిరణ్‌కుమార్ రెడ్డి ఓటమి భయంతో ఈసారి ఎన్నికల నుంచి తప్పుకుని సోదరుడు కిషన్ కుమార్ రెడ్డిని బరిలో దింపారు. అయితే ప్రజలు ఈసారి నల్లారి కుటుంబంపై దయ చూపలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి .. కిషన్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. -
మైనారిటీలకు బాబు వెన్నుపోటు
- పీలేరులో జై సమైక్యాంధ్ర పార్టీకి సహకరిస్తున్న టీడీపీ - ఆత్మవంచన చేసుకోలేని టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు - మైనారిటీలకు టికెట్టు ఇచ్చినట్టే ఇచ్చి వెన్నుపోటు రాజకీయం చేస్తున్న బాబు - తొలి నుంచి చంద్రబాబుకు సహకరించినందుకే కిరణ్ సోదరునికి మద్దతు సాక్షి, తిరుపతి: పీలేరులో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డికి టీడీపీ బహిరంగంగా మద్దతు పలుకుతోంది. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి తెచ్చి, గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ప్రగల్బాలు పలికిన చంద్రబాబు పోలింగ్‌కు ముందు రోజు తన సహజ స్వభావాన్ని బయటపెట్టారు. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని శ్రేణులను ఆదేశిస్తున్నారు. దీంతో కిందిస్థాయి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొందరు ఈ విషయమై నేతలను ప్రశ్నించడంతో పాటు తిరుగుబాట్లకు సిద్ధమయ్యారు. ఇంతకాలం కిరణ్‌కు వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు సహరించడమంటే ఆత్మవంచన చేసుకోవడమేనని మదనపడుతున్నారు. కార్యకర్తల్లో వచ్చిన తిరుగుబాటు అసలుకే ఎసరు పెట్టేట్టు కనిపించడంతో నేతలు బుజ్జగించే పనిలో ఉన్నారు. పీలేరు అభ్యర్థి ఎంపికలో కిరణ్, బాబుల డ్రామా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను తెలుగుదేశం, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆఖరు నిమిషం వరకు ప్రకటించలేదు. ముందుగా జరిగిన ఒప్పందం మేరకే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేశారని అంటున్నారు. ఓటమి భయం పట్టుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధ్యక్షుని హోదాలో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉన్నందునే సోదరుడిని బరిలోకి తెచ్చానని ఇచ్చిన వివరణ జనాన్ని సంతృప్తిపరచలేదు. తండ్రి అమరనాథరెడ్డి హయాం నుంచి తమ కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చిన ద్వితీయశ్రేణి నాయకులు వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లడంతో కిరణ్‌కు ఓటమి భయం పట్టుకుంది. దీంతో పోలింగ్‌రోజున కిషోర్‌కు సహకరించే విధంగా చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. పీలేరులో విజయంపై చంద్రబాబుకు ఆశలు లేకపోవడంతో రాష్ట్రంలో ఒక్క సీటైనా మైనారిటీలకు ఇవ్వాల్సి ఉన్నందున అది ఇక్కడ ఇచ్చినట్టు ఇచ్చి వెన్నుపోటుకు సిద్ధమయ్యారు. మైనారిటీలకు ఇచ్చే ప్రాధాన్యం ఇలాగేనా? ఈ ఎన్నికల్లో బీజేపీతో అంటకాగుతున్న చంద్రబాబు మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యం ఇదేనా అని పీలేరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ విశ్వాసాన్ని చూరగొనేందుకు మైనారిటీలకు ఓడిపోయే టికెట్టు ఇచ్చి చివరి నిమిషంలో అనధికారికంగా మరో పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసే పరిస్థితి తీసుకురావడం అంతా ఒక వ్యూహం ప్రకారం నడిపారనే అనుమానాలు మైనారిటీల్లో వ్యక్తమవుతున్నాయి. బెడిసికొడుతున్న వ్యూహం మంగళవారం ఉదయం నుంచి నియోజకవర్గంలో టీడీపీ నేతలు జై సమైక్యాంధ్ర పల్లవి ఎత్తుకోవడంతో టీడీపీ శ్రేణులతో పాటు జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు తమకు చేస్తున్న అన్యాయంపై కసితో ఉన్నారు. ఇంత దారుణంగా మోసగిస్తారని ఊహించలేదని ఒక మైనారిటీ నేత వాపోయారు. జై సమైక్యాంధ్ర నేతలు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తూ ఒక ఓటు జేఎస్పీకి మరో ఓటు బీజేపీకి వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓటర్లు కూడా అక్కడక్కడా నిలదీసినట్టు తెలుస్తోంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు రెండు ఓట్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలనే నిర్ణయానికి అక్కడి ఓటర్లు వస్తున్నారు. -
ఎన్నికల బరి నుంచి తప్పుకున్నకిరణ్
-
ఎన్నికల బరి నుంచి తప్పుకున్నకిరణ్ కుమార్ రెడ్డి
పీలేరు : మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ఆయన తన సోదరుడిని పోటీకి దించారు. కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా తాను పోటీలో ఉంటే పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం కష్టమవుతోందని కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడిగా కిరణ్ ప్రజలను ఆకర్షించలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు వాదులాడుకుంటున్నారు. అదేవిధంగా ఆశించినంతగా నేతలు పార్టీలో చేరకపోవడం కూడా ప్రజలు కిరణ్ పార్టీని ఆదరించడం లేదని తెలుస్తోంది. నిన్నటిదాకా కిరణ్ గురించి గొప్పగా చెప్పిన ఎంపీలు హర్షకుమార్, సబ్బంహరి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు కూడా ఆయన పేరు ఎత్తడానికి సాహసం చేయలేదు. పార్టీ అధ్యక్షుడే పోటీకి దూరంగా ఉంటే ఇక ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావటం లేదు. -
'పీలేరులో కిరణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవు'
జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గమైన పీలేరులో అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితి కిరణ్దంటూ ఆయన ఎద్దేవా చేశారు. అరాచక శక్తులతో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని కిరణ్ వర్గం ప్రయత్నిస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఎన్ని దౌర్జన్యాలైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి స్ఫష్టం చేశారు. పీలేరులో కిరణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని తమ పార్టీపై దుష్పచారం చేస్తున్నాయని మిథున్ రెడ్డి ఈ సందర్బంగా సదరు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పీలేరులో దారుణం
పీలేరు, న్యూస్‌లైన్: పీలేరు పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు అటు పోలీసులు, ఇటు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన ఇంటికి ముందు, వెనుకవైపు ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతుండడంతో జన సంచారం అధికంగా ఉంది. అయినప్పటికీ దుండగులు వృద్ధురాలి గొంతుకోసి సొత్తు దోచుకెళ్లడం సంచలనం రేకెత్తిస్తోంది. పీలేరు దుర్గానగర్‌లో ఎనిమిదేళ్లుగా శివలింగం, జ్యోతి దంపతులు కాపురం ఉంటున్నారు. ఇరువురూ ఉపాధ్యాయులు. జ్యోతి తల్లి యశోదమ్మ ఇంటి వద్దనే ఉంటున్నారు. శనివారం ఉదయం శివలింగం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గం టలకు జ్యోతి కూడా తలపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం 12.19 గంటలకు 08584-242305 నంబర్ నుంచి శివలింగంకు ఫోన్‌కాల్ వెళ్లింది. తన పేరు ప్రవీణ్ అని, కలికిరి నుంచి ఫోన్ చేస్తున్నానని తెలిపాడు. కోడ్ నెంబర్ గమనించిన శివలింగం కలికిరి కాదు పీలేరు నుంచే మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. ఎన్ని గంటలకు ఇంటికి వస్తావంటూ మరోమారు ఫోన్లో ఆగంతకుడు వాకబు చేశాడు. ఈ ఫోన్‌కాల్‌తో అనుమానం వచ్చిన శివలింగం వెంటనే ఇంటికి వచ్చేశారు. ఇంటి ముఖద్వారం గేటుకు తాళం వేసి ఉండడంతో అత్తను పిలిచారు. ఆమె పలకక పోవడంతో అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిచి తన అత్త బాత్రూములో ఉందేమో చూడమన్నారు. అయితే ఇంటి ముఖ ద్వారం కొద్దిగా తెరచి ఉండడంతో ఇంటిలోకి వెళ్లి పరిశీలించారు. ఓ గది లో రక్తపు మడుగులో అత్త యశోదమ్మ మృతదేహాన్ని చూసి బిగ్గరగా కేకలు వేశారు. భోరున విలపిస్తూ భార్య జ్యోతికి ఫోన్‌ద్వారా విషయం తెలి పారు. అలాగే పీలేరు పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే భారీ సంఖ్యలో జనం సంఘటన స్థలానికి చేరుకున్నారు. పీలేరు సీఐ టి.నరసింహులు, ఎస్ఐ సిద్ధతేజ మూర్తి, ఎన్నికల బందోబస్తు నిమిత్తం మదనపల్లెకు వెళ్లడంతో భాకరాపేట ఎస్ఐ నెట్టికంఠయ్య ముందుగా సం ఘటన స్థలానికి చేరుకున్నారు. చిత్తూ రు నుంచి వేలిముద్ర నిపుణులు, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని పిలిపించి ఆధారాలు సేకరించారు. పోలీస్ జాగిలం కడప మార్గంలో కొంతదూరం వరకు వచ్చి ఓ కల్వర్టు వద్ద ఆగిపోయింది. అక్కడ లభించిన రెండు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన ఇంటిలో వేలిముద్రలను సేకరించారు. శివలిం గంకు వచ్చిన ల్యాండ్‌లైన్ నెంబరుపైనా పోలీసులు కూపీ లాగుతున్నా రు. అనంతరం పీలేరు సీఐ, ఎస్ఐ హత్య విషయం తెలుసుకుని ఎన్నికల విధుల నుంచి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులను అడిగి వివరాలు సేకరించారు. పట్టపగలు వృద్ధురాలి ని హతమార్చి 150 గ్రాముల బంగా రు, రూ.35 వేల నగదు దోచుకెళ్లడం సర్వత్రా సంచలనం రేకెత్తించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పీలేరులో దళితుల ధర్నా
పీలేరు, న్యూస్‌లైన్: అగ్రకులస్తుల దాడిలో గాయపడిన దళితుడు మృతి చెందడంతో పీలేరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతదేహంతో దళితులు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలంలోని యర్రగుంట్లపల్లె పంచాయతీ మారెంరెడ్డిగారిపల్లెలో ఈ ఏడాది జనవరి 2న దళితులపై అగ్రకుల స్తులు దాడికి పాల్పడడంతో గాయపడిన సీ.వెంకట్రామయ్య మంగళవారం తెల్లవారు జామున తిరుపతి రుయాలో మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన వివిధ దళిత సంఘా ల నాయకులు, మారెంరెడ్డిగారిపల్లె దళితులు పెద్దఎత్తున మంగళవారం మధ్యాహ్నం పీలేరు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వెంకట్రామయ్య మృతదేహంతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ వెంకట్రామయ్య భార్య సీ.నాగమ్మకు గానీ, చిన్న కుమార్తె సీ.సంతోషమ్మకు గానీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన బాధితులందరికీ 2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి మంజూరు చేయాలని, బాధిత కుటుంబాలకు పునరావాసం కింద ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. అలాగే బాధిత కుటుంబాల పిల్లలందరికీ ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలలో, వసతి గృహాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధితులకు ఎస్సీ, ఎస్టీ పీవో యాక్టు ప్రకారం రావాల్సిన నష్టపరిహారం తక్షణం అందించాలన్నారు. దాడులకు ప్రధాన కుట్రదారులైన బాలం నరేంద్రరెడ్డి, లక్ష్మీకర్, ప్రసాద్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, కుట్రదారులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని, అగ్ర కులస్తులకు కొమ్ముకాసిన, చట్టాన్ని దుర్వినియోగం చేసిన అప్పటి పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీలేరు తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ.నరసింహులు దళిత నాయకులతో మాట్లాడారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుం టామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదించి కేసు రీ ఓపన్ చేస్తామన్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయినా దళితులు శాంతించలేదు. విషయం తెలుసుకున్న మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ధనుంజయరావు మంగళవారం రాత్రి పీలేరు చేరుకున్నారు. బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు మృతుని కుమారులిద్దరికీ ఇళ్లు మంజూ రు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నాలుగు గంటల అనంతరం దళితులు ధర్నా విరమించారు. ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అడిషనల్ ఎస్పీ అన్బురాజన్, పీలేరు సీఐ టీ.నరసింహులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో దళిత నాయకులు గుండాల నాయక్, ధనశేఖర్, రిటైర్డ్ డీఎస్పీ రామచంద్ర, చం ద్రయ్య, గట్టప్ప, రాజమ్మ, శ్రీనివాసు లు, ప్రసాద్‌రావ్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ జాగా..వేసేయ్ పాగా
పీలేరు, న్యూస్‌లైన్: పీలేరు మెట్ట ప్రాంతంలోని ఓ చిన్న పట్టణం. ఇది ఒకప్పుడు. ఇప్పుడు రాష్ర్ట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి పీలేరుపై పడింది. ఈ ప్రాంతం అభివృద్ధికి పీలేరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పడా)ని ఏర్పాటు చేశారు. వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భూముల రేట్లు అ మాంతంగా పెరిగిపోయాయి. అక్రమార్కుల కన్ను ఖా ళీస్థలాలపై పడింది. రాత్రికి రాత్రే కోట్లు విలువజేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.అధికార పార్టీకి చెందిన నేతల సహకారంతోనే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీలేరు పట్టణం, దీనికి ఆనుకుని బోడుమల్లువారిపల్లె, ఎర్రగుంట్లపల్లె, కాకులారంపల్లె, దొడ్డిపల్లె, వేపులబైలు, ముడుపులవేముల పంచాయతీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్రమార్కులు ఈ ప్రాంతంలో డీకేటీ, అసైన్డ్, పొరంబోకు భూముల వివరాలను సేకరిస్తున్నారు. వా టిల్లో ఖాళీగాఉన్న భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా తెలిసినా రెవె న్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పీలేరులో అధికార పార్టీ నేతల అండదండలతో రెవెన్యూ అధికారుల సహకారంతో, అనర్హులకు ఇళ్ల స్థలాలను కట్టబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా పీలేరు శివారు ప్రాంతం తిరుపతి మార్గంలోని జాతీయ రహదారికి ఇరువైపులా, నూనెవిత్తుల కర్మాగారం సమీపంలో, పీలేరు పట్టణ శివారు ప్రాంతం నాగిరెడ్డి కాలనీ పరిసర ప్రాంతాలు, మదనపల్లె మార్గంలోని పెద్దిరెడ్డి కాలనీ, రజకులు, నాయీబ్రాహ్మణులు, పంచాయతీ వర్కర్లు, ఎమ్మార్పీఎస్, ఐకేపీ, ఈజీఎస్ తదితర కుల సంఘాలకు ఇచ్చిన పట్టాల్లో స్థానికేతరులు, అనర్హులే ఎక్కువ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మదనపల్లె సబ్‌కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఏడాదిన్నర కాలంలో పీలేరు పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల్లో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. అయితే కిందిస్థాయి సిబ్బంది తీరు మొక్కుబడిగా ఉంది. ప్రస్తుతం చేనేత కార్మికులు, నాయీబ్రాహ్మణులకు పంపిణీ చేసిన పట్టాలపై విచారణ జరుగుతోంది. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో నివాసముంటున్నా తమను కాదని స్థానికేతరులు, అనర్హులకే అగ్రపీఠం వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
దళితులపై నిర్లక్ష్యం వద్దు
పీలేరు, న్యూస్‌లైన్: దళితులపై దాడి చేసి 16 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయకపోవడంపై వ్యవసాయ వృత్తిదారుల యూని యన్ ఆధ్వర్యంలో శుక్రవారం పీలేరులో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. దళితులపై నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర స్థాయి లో ఆందోళన ఉధృతం చేస్తామని వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జాతీయ నాయకుడు పి. చెన్నయ్య, జిల్లా నాయకుడు కె.గట్టప్ప హెచ్చరించారు. పీలేరు మండలం యర్రగుంట్లపల్లె పంచాయతీ మారెంరెడ్డిగారిపల్లె దళితులపై అగ్రవర్ణాల దాడికి నిరసనగా నాలుగు రోడ్ల కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు శుక్రవారం నిరసన ర్యాలీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిలో ఎనిమిది మందిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన నరేంద్రరెడ్డి, లక్ష్మీకర్, వెంకటేశ్వర్రాజును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో చట్టాన్ని అగ్రవర్ణాల వారు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారు గ్రామంలోనే తిరుగుతున్నా అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. దళితుల స్వేచ్ఛకు భంగం కల్గించి, వారి హక్కులను కాలరాస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి మానవహక్కుల, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఆశ్రయిస్తామన్నారు. అనంతరం తహశీల్దార్, పీలేరు సీఐకి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర మహిళా నాయకురాలు రాజమ్మ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటేశు, శాంతి చక్ర ఇంటర్నేషనల్ యూనియన్ నాయకులు రామచంద్రయ్య, చంద్రయ్య, వివిధ మండలాల నాయకులు ఎం.సీతాపతి, చంద్రమ్మ, మల్లికార్జున, రమణమ్మ, రమణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కమిటీ నాయకుడు జయన్న పాల్గొన్నారు. -
సీఎం ఇలాకాలో ‘ఎర్ర’ డంప్
తొలిసారి వెలుగుచూసిన వైనం పట్టుబడినవారికి అధికార పార్టీ అండదండలు! పీలేరులో ఆగని స్మగ్లింగ్ పెరిగిన నిఘా సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతి నిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పునాదులు ఉన్నాయని మరోమారు రుజువైంది. కేవీ.పల్లె మండలంలో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు ఆది వారం స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకుల అండదండలతో పీలేరు నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎర్రచందనం అక్రమరవాణాకు సహకరిస్తూ వస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ గతంలో చాలాసార్లు పట్టుబడినవారు పీలేరు నియోజకవర్గంలోని కె.వి.పల్లె, పీలేరు, కలకడ మండలాల్లో ఉన్నారు. వీరు అధికారపార్టీ నాయకులుగా ముద్ర వేసుకుని పోలీసులను ఉపయోగించుకుంటూ వచ్చారు. ఈ విషయమై ఎస్పీ రామకృష్ణ రహస్యంగా ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ క్రమంలో పీలేరు సీఐ పార్థసారథి, ఎర్రావారిపాళెం ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. పీలేరు సర్కిల్లోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమరవాణాపై దాడులు పెంచి నిందితులను పట్టుకోవాలని అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో స్మగ్లర్లు నిర్వహిస్తున్న ఎర్రచందనం డంప్‌ను కె.వి.పల్లె పోలీసులు ఆదివారం గుర్తించారు. కె.వి.పల్లె మండలం ఎం.వి.పల్లె పంచాయతీ ఊరమాదిగపల్లె సమీపంలో గుట్ట కింద దాచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయంగా కోటి రూపాయల వరకు ఉండవచ ్చని అంచనా. అసలు వ్యక్తులను పట్టుకుంటారా? కె.వి.పల్లె మండలంలో పట్టుబడిన ఎర్రచందనానికి సంబంధించి అసలు సూత్రధారులెవరనేది వెలుగు చూడాల్సి ఉంది. ఎర్రచందనం దుంగల అక్రమరవాణాతో సంబంధం ఉందని పోలీసులు కేవలం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే వీరితోపాటు, కాంగ్రెస్‌పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉంటూ, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నవారిని పీలేరు సర్కిల్ పోలీసులు కొన్నేళ్లుగా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇందుకు తాజా నిదర్శనమే కె.వి.పల్లెలో ఎర్రచందనం డంప్ స్వాధీనం, ఎర్రావారిపాళెంలో రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం, లారీల స్వాధీనం. ఇలాంటి డంప్లెన్నో పీలేరు పోలీస్ సర్కిల్లోని ఎర్రావారిపాళెం, రొంపిచెర్ల, భాకరాపేట, కె.వి.పల్లె, పీలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమరవాణా కోసం తాత్కాలిక స్థావరాలుగా వాడుతున్న డంప్‌లు చాలానే ఉన్నాయి. వీటికి సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నా గతంలో దాడులు నిర్వహించలేదు. చామల అటవీ రేంజ్‌లోని ముప్పాతిక భాగం పీలేరు పోలీస్ సర్కిల్లోనే ఉంది. ఇక్కడ అటవీ అధికారులు సమాచారమిచ్చినా రవాణా అవుతున్న ఎర్రచందనాన్ని పట్టుకోవటంలో, కేసులు పెట్టడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగడంతో ఇప్పుడు దాడులు నిర్వహిస్తుండడం గమనార్హం. -
పీలేరే స్మగ్లింగ్ కేంద్రం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజక వర్గం అడ్డాగా మారుతోంది. పీలేరు నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే రహదారులు ఉన్నాయి. ఎర్రచందనం ఎక్కువగా ఉన్న శేషాచలం అడవులు అక్కడకు దగ్గర. స్మగ్లర్లకు రాజకీయ నేతలు, అధికారుల సహకారం ఇవన్నీ కూడా అక్రమరవాణా పెరగడానికి కారణాలు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా అయిన చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు ఆదివారం రెచ్చిపోయి ఇద్దరు అటవీశాఖ అధికారులను హతమార్చడం, మరో ఆరుగురిని గాయపర్చడంతో పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా మరోమారు చర్చనీయాంశమైంది. అక్రమ రవాణా ద్వారా కిరణ్‌కుమార్ రెడ్డి ఆయన అనుచరులు వందల కోట్లు సంపాదించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలు పర్యాయాలు బహిరంగంగానే ఆరోపించారు. గతంలో పీలేరుకు ప్రాతినిధ్యం వహించిన అటవీశాఖా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో అడుగు ముందుకేసి పీలేరు కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరును బహిర్గతం చేశారు. పీలేరు నుంచే ముఖ్యమంత్రి అనుచరులు వందలాది మంది కూలీలను తరలిస్తున్న వైనాన్ని పెద్దిరెడ్డి బయటపెట్టినా సంబంధిత అధికారులెవ్వరూ స్పందించలేదు. ఈ ఆరోపణలకు ఎన్నడూ సమాధానం ఇవ్వని ముఖ్యమంత్రి స్మగ్లింగ్ నివారణకు తీసుకున్న చర్యలూ నామామాత్రమే. ఇవన్నీ కూడా అనుమానాలను పెంచుతున్నాయి. పైగా, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ మూడేళ్లలోనే ఎన్నడూ లేనంతగా వందల కోట్ల ఎర్రచందనం తరలిపోయింది. దట్టమైన అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికి రహదారులపై చేర్చేందుకు తమిళనాడు నుంచి వచ్చే వందలాది మంది కూలీలను ఎదుర్కొనేందుకు అటవీశాఖ బీట్ అధికారులకు తుపాకులిస్తామన్న ముఖ్యమంత్రి హామీ నేటికీ ఆచరణరూపం దాల్చలేదు. రెండేళ్ల క్రితం అటవీశాఖాధికారుల సమావేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అటవీశాఖాధికారులకు తుపాకులివ్వనున్నట్టు ఆయన ప్రకటిం చారు. ముఖ్యమంత్రి హామీ మేరకు వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు 400 తుపాకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. నేటికీ తుపాకుల కొనుగోలు జరగలేదు. ఆదివారం నాటి సంఘటనలో తుపాకులు లేకపోవడం వల్లే కూలీల దాడులను తిప్పికొట్టేలేక పోయామని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సిబ్బంది చెప్పారు. అధికార పార్టీ నేతలతో పాటు పోలీసు, అటవీ శాఖలకు చెందిన కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది స్మగ్లర్లకు సహకరిస్తూ టాస్క్‌ఫోర్స్‌ను నీరుగారుస్తున్నారు. మూడున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గ కేంద్రంలోనే పనిచేస్తున్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నా చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్పీ కాంతి రాణా టాటా సదరు సీఐకి ఈ ఆరోపణలపై మెమో కూడా ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి సోదరుడి అండదండలు ఉండడంతో ఆయనపై చర్యలు కాదుకదా బదిలీ కూడా చేయలేకపోయారు. ఇక టాస్క్ఫోర్సు అధికారులు కూడా ఎర్రచందనం కూలీల అరెస్టులకే పరిమితమై స్మగ్లర్లను ఏమీ చేయలేకపోతున్నారు. కూలీలు ఇచ్చే సమాచారం ఆధారంగా స్మగ్లర్ల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడులే ఇందుకు కారణమని చెబుతున్నారు. -
చప్పగా సాగిన సీఎం పర్యటన
సాక్షి ప్రతినిధి-తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటన చప్పగా సాగింది. జిల్లాకు మంజూరు చేసిన ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం బుధవారం వచ్చిన ఆయనను జనం పెద్దగా పట్టించుకోలేదు. సొంత నియోజకవర్గమైన పీలేరులోని కలకడలో నిర్వహించిన సభ జనం లేక వెలవెలపోయింది. అక్కడి రచ్చబండ కూడా అంతంతమాత్రంగానే సాగింది. సీఎం పర్యటనలో జిల్లా నేతల కంటే ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి, ఇన్చార్జి మంత్రి పార్థసారథి తదితరుల హడావుడే ఎక్కువగా కనిపించింది. గతంలో కంటే భిన్నంగా చిత్తూరు శాసనసభ్యుడు సీకే బాబుకు ఈ పర్యాయం కిరణ్ కాస్త ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశమైంది. తొలుత శ్రీసిటీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆ తరువాత తిరుపతి అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి, పద్మావతి మహిళా వైద్య కళాశాలకు, చిత్తూరు మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. జిల్లేళ్లమందలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారులు జనసమీకరణ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని విద్యాసంస్థల వాహనాలను మంగళవారం నుంచే తమ ఆధీనంలోకి తీసుకొని జనాన్ని సమీకరించడంతో ఆ కార్యక్రమం కాస్త బాగా సాగింది. ఆ తర్వాత జరిగిన కలకడ సభలో వేదిక ముందు ఏర్పాటు చేసిన వీఐపీ గ్యాలరీ సైతం ఖాళీగానే కనిపించింది. తిరుపతిలో జరిగిన శంకుస్థాపనలు కూడా మొక్కుబడిగానే సాగాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రాష్ట్ర విభజనకు వేగంగా పావులు కదుపుతుండడం ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్‌ను పూర్తిగా నిర్వేదంలో పడేసింది. ముఖ్యమంత్రికి గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు రాలేదు. తమ వల్లే వేల కోట్ల ప్రాజెక్టులు చిత్తూరుకు వస్తున్నాయని చెప్పుకొనే ప్రయత్నం కూడా ఆ పార్టీ నేతలు చేయకపోవడం గమనార్హం. రాష్ట్ర విభజన కసరత్తు జోరుగా సాగుతున్న సమయంలో సమైక్యవాదుల నుంచి ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్విమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సమైక్యవాదులు ముఖ్యమంత్రిని కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. -
కబ్జాలకు కేరాఫ్ పీలేరు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గం భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పీలేరుకు నాలుగువైపులా ఉన్న చిత్తూరు, తిరుపతి, రాయచోటి, మదనపల్లి రహదారులకు ఇరువైపులా రూ.200 కోట్లకు పైగా విలువజేసే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సీఎం ఆశీస్సులతో ఆయన సోదరుడే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఇటీవల ఆరోపించగా, తాజాగా పలు కబ్జాలపై టీఆర్ఎస్ మంగళవారం ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పీలేరు కబ్జాలు మరోమారు తెరపైకి వచ్చాయి. కబ్జాదారులు కాంగ్రెస్ నేతలు, సీఎం అనుచరులు కావడం వల్లే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు రహదారుల్లో బహిరంగంగా కనిపిస్తున్న కబ్జాలపై బుధవారం పీలేరు పర్యటనకు వస్తున్న సీఎం ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. పీలేరుకు ఆనుకొని ఉన్న ఎర్రగుంటపల్లె, దొడ్డిపల్లె, కాకులారంపల్లె, వేపులబైలు, ముడుపులవేముల, బోడుమల్లివారిపల్లె, గూడరేవుపల్లెలోని ప్రభుత్వ భూమలు, చెరువులు, కొండలు, వాగులు పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యాయి. ఒక్క బోడుమల్లివారిపల్లెలోనే 70 కోట్ల రూపాయల విలువచేసే భూములు కబ్జా అయ్యాయని, వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్వయంగా సర్పంచ్ రవీంద్రనాథరెడ్డి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కబ్జాల నివారణకు ఆయన నిరాహారదీక్షకు సిద్ధమౌతున్నారు. ఎర్రగుంటపల్లెలో 14.76 ఎకరాల ప్రభుత్వ భూమి, చిత్తూరు రోడ్‌లోని ఆటోనగర్‌లో 15 ఎకరాలకు పైగా కొండ కబ్జా అయ్యాయి. అప్పలనాయు డు చెరువు సప్లై కాల్వ భూమిని కాంగ్రెస్‌కే చెందిన పీలేరు సర్పంచ్ హుమయూన్ కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారనే ఆరోపణలు వచ్చినా దానిపై అధికారులు స్పందించడం లేదు. కబ్జాలకు సహకరించిన మండల స్థాయి అధికారికి మూడు కోట్లకు పైగా ముడుపులు ముట్టాయని, కింది స్థాయి అధికారిణి ఒకరికి తిరుపతిలో కబ్జాదారులు రూ.50 లక్షలతో ఇంటిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారని ప్రచారం జోరుగా సాగుతోంది. మదనపల్లి రోడ్‌లోని బడబళ్లవంక, ఎన్జీవో హోం స్థలం, ఆర్ అండ్ బీ అతిథిగృహం స్థలాలను కూడా కబ్జాదారులు వదల్లేదు. సమైక్యాంధ్ర హీరోగా కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్న కిరణ్‌కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉద్యమం కంటే జోరుగా కబ్జాలే జరిగాయి. వీటిపై ఫిర్యాదులు వెళుతున్నా అధికారులు స్పందించడం లేదు. రచ్చబండకు వచ్చే ముఖ్యమంత్రి కబ్జాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. -
చిల్లర మాటలకు చిరునామా కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చిల్లర మాటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చిరునామా అని వ్యాఖ్యానించారు. పీలేరులో కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి కిరణ్దని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేదని శ్రవణ్ అన్నారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి అనర్హుడని విమర్శించారు. తెలంగాణపై అసెంబ్లీకి తీర్మానం రాదని... కేవలం బిల్లు మాత్రమే వస్తుందని శ్రవణ్ కుమార్ అన్నారు. -
కబ్జాలకు కేరాఫ్ పీలేరు
తిరుపతి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన పీలేరు భూకబ్జాలకు కేరాఫ్‌గా మారింది. అధికారం చాటున అడ్డూ అదుపూ లేకుండా ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. భూ ఆక్రమణల్లో పట్టా భూములు, హైకోర్టు స్టే ఉన్న భూములను సైతం వదలక పోవడం చర్చనీయాంశమైంది. పీలేరు పట్టణానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గుట్టలను సైతం ఆక్రమించుకుని ఇళ్ల స్థలాలుగా మార్చేశారు. మరికొన్ని చోట్ల గుట్టలకు రాతి కుసాలు నాటేశారు. తాజాగా ఆదివారం పీలేరు శివారు ప్రాంతం తిరుపతి మార్గంలోని సర్వే నంబరు 658/2లోని భూమిని ఓ వైపు జనం, మరో వైపు జేసీబీలతో చదును చేయడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. సర్వే నంబరు 658/2లో పీలేరు పట్టణం నాగిరెడ్డి కాలనీలో కాపురముంటున్న దేవులపల్లె నాగిరెడ్డి 1994లో వారణాసి భానురేఖ వద్ద 3 ఎకరాల 25 సెంట్ల భూమిని కొన్నాడు. కొంత మేర ప్లాట్లు వేసి విక్రయించాడు. ఇంకా కొంత పట్టాభూమిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఈ భూమిలో ఆదివారం పలువురు ఆక్రమణకు పాల్పడినట్లు బాధితుడు నాగిరెడ్డి విలేకరులకు తెలిపాడు. తన పట్టాభూమిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల అనుచరులు ఆక్రమణకు పాల్పడ్డారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అదేవిధంగా రెండు రోజుల క్రితం మదనపల్లె మార్గంలోని కళాకారుల భూమిపై హైకోర్టు స్టే విధించింది. ఈ భూముల్లోనూ ఆక్రమణకు పాల్పడ్డారని కళాకారులు ఆరోపిస్తూ పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమైక్య ఉద్యమ చాటున రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే రెండు నెలల వ్యవధిలోనే భూదందాల పరంపర పతాక స్థాయికి చేరిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల భూదందాలపై వైఎస్సార్ సీపీ నేతలు హైదరాబాద్‌లోని ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కేసు వేస్తామని ప్రకటించారు. మరోవైపు పీలేరు పట్టణానికి కూతవేటు దూరంలోని బోడుమల్లువారిపల్లె సర్పంచ్ రవీంద్రనాథరెడ్డి తన పంచాయతీ పరిధిలో దాదాపు రూ.వంద కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకపోతే దీక్ష చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. -
సీఎం సొంతనియోజకవర్గంలో అధికార దుర్వినియోగం
-
బరి తెగించిన కాంగ్రెస్, కలికిరిలో ఉద్రిక్తత