'పీలేరులో కిరణ్కు డిపాజిట్లు కూడా దక్కవు' | Peddireddy Mithun Reddy takes on N. Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'పీలేరులో కిరణ్కు డిపాజిట్లు కూడా దక్కవు'

Published Fri, Apr 4 2014 9:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

'పీలేరులో కిరణ్కు డిపాజిట్లు కూడా దక్కవు'

'పీలేరులో కిరణ్కు డిపాజిట్లు కూడా దక్కవు'

జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గమైన పీలేరులో అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితి కిరణ్దంటూ ఆయన ఎద్దేవా చేశారు. అరాచక శక్తులతో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని కిరణ్ వర్గం ప్రయత్నిస్తుందంటూ ఆయన ఆరోపించారు.

 

ఎన్ని దౌర్జన్యాలైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి స్ఫష్టం చేశారు. పీలేరులో కిరణ్కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని తమ పార్టీపై దుష్పచారం చేస్తున్నాయని మిథున్ రెడ్డి ఈ సందర్బంగా సదరు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement