peddireddy mithun reddy
-
టీడీపీ నుంచి మళ్లీ వైఎస్సార్సీపీలోకి..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇటీవల టీడీపీ నేతల బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గి ఆ పార్టీలో చేరిన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిపోయారు. తల్లి లాంటి వైఎస్సార్సీపీ కుటుంబాన్ని వదిలి తప్పుచేశానని, అక్రమ కేసులు పెడతామని భయపెట్టడంవల్ల ఆత్మసాక్షిని చంపుకుని టీడీపీలో చేరామని వారు వెల్లడించారు. తమ తప్పు తెలుసుకుని తిరిగి పారీ్టలో చేరుతున్నట్లు అలీం బాషా తెలిపారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబంతోనే ఉంటామని వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము స్పష్టంచేశారు. వరద బాధితులకు హెలికాప్టర్ ఎందుకు పంపలేదు? ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాసమస్యలు గాలికొదిలేసి, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోపించారు. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగి్నప్రమాదం జరిగితే.. కావాలనే ఫైల్స్ అన్నీ కాల్చేశారని, ఏమీ జరక్కపోయినా ఏదో జరిగిపోయినట్లు నానాయాగీ చేసి హెలికాప్టర్లో డీజీపీ, సీఎస్‌ని పంపించారని ఎంపీ గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు అంతకన్నా ముఖ్యంగా వరదల్లో ప్రజలు చిక్కుకుని విలవిల్లాడుతుంటే హెలికాప్టర్ పంపి వారినెందుకు రక్షించటంలేదని మిథున్‌రెడ్డి చంద్రబాబుని ప్రశి్నంచారు. అలాగే, గుడ్లవల్లేరు ఘటనలో ఆడబిడ్డల తరఫున నిలబడాల్సిన ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయతి్నస్తుండడంపై మండిపడ్డారు. కళాశాలలో చదువుకునే విద్యార్థినులు భయంతో వణికిపోతుంటే.. వారికి ధైర్యం చెప్పి నిందితులను కఠినంగా శిక్షించాల్సింది పోయి.. ఏమీ జరగలేదని తండ్రీకొడుకులు ప్రకటించటం న్యాయమేనా? అని నిలదీశారు. -
కుప్పంలో ఇప్పటికీ లెక్క తేలని 36 వేల ఓట్లు
సాక్షి, కుప్పం(చిత్తూరు జిల్లా) : మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలోని బోగస్ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నారని రాజంపేట ఎంపీ, లోకసభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం ప్రాంత వాసులకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న సంబంధాలతో బోగస్ ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలుకు ఓట్లుండగా, ప్రభుత్వం సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా ఆధార్ కార్డులతో లింక్ అయిన వారు 1.83 లక్షల మంది ఓటర్లే ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో 17 శాతం అంటే.. ఇంకా 36 వేల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారిందని, ఈ ఓటర్లు ఎక్కడి వారో, ఎక్కడ ఉన్నారో తేల్చలేకపోతున్నారని చెప్పారు. రామకుప్పం మండలం విజలాపురంలో కుమార్ అనే వ్యక్తికి విజలాపురంలో ఓటు హక్కు ఉందని, ఇతను పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోనూ ఓటు వినియోగించుకుంటున్నాడని మిథున్‌రెడ్డి చెప్పారు. కంగుంది గ్రామానికి చెందిన అమ్మణ్ణమ్మ కంగుందిలో, పక్కనే ఉన్న విజలాపురం పంచాయతీలోనూ ఓటు వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి బోగస్ ఓట్లతో చంద్రబాబు ఏళ్ల తరబడిగా కుప్పంలో గెలుస్తున్నారని.. కుప్పంలోని బోగస్ ఓట్లపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్‌కుమార్ తదితరులున్నారు. చదవండి: (రోడ్లపై సభలు, రోడ్‌షోల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు) -
సీఎం జగన్ మదనపల్లె పర్యటన వాయిదా
మదనపల్లె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదనపల్లె పర్యటన వాయిదా పడిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా ప్రకటించారు. మిథున్‌రెడ్డి, నవాజ్‌బాషా మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ 25వ తేదీన సీఎం జగన్ మదనపల్లెలో పర్యటించాల్సి ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, భద్రతా కారణాల వల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు వివరించారు. తిరిగి ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 29 లేదా 30న ఉండవచ్చని, సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామన్నారు. -
మోహిత్ పాదయాత్ర చరిత్రాత్మకం
తిరుపతి రూరల్: ఏడు నెలల పాటు 2,005 పల్లెలు, 115 సచివాలయాల పరిధిలో 1.46 లక్షల ఇళ్లకు తిరుపతి ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేపట్టిన 1,600 కిలోమీటర్ల మహా పాదయాత్ర చరిత్రాత్మకమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశంసించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడైన మోహిత్‌రెడ్డి చేపట్టిన గడపగడపకు మహాపాదయాత్ర శనివారం పదో రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరుగుతున్న ఈ పాదయాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి కూడా పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఏ పనినైనా చిత్తశుద్ధితో విజయవంతంగా పూర్తి చేసే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న మోహిత్‌రెడ్డి మంచి నాయకుడుగా ఎదుగుతారని చెప్పారు. జగనన్న స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా మహాపాదయాత్ర చేస్తున్నట్లు మోహిత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ముస్లిం మైనారిటీలకు అండగా సీఎం వైఎస్ జగన్
కలికిరి: రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లవేళలా అండగా ఉన్నారని లోక్‌సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో మంగళవారం జరిగిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గం మహల్‌కు చెందిన డాక్టర్ ఇక్బాల్ అహ్మద్‌ఖాన్‌కు రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించడం సీఎం జగన్ ఘనత అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు ఒక్క రాష్ట్రస్థాయి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు ముస్లిం మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకుగా పరిగణించి వాడుకుని వదిలేశారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో హిజాబ్ సమస్య, మసీదుల్లో మైకుల నిషేధం, ముస్లింలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాలు గమనిస్తున్నామన్నారు. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉండటంతో ముస్లింలకు సముచిత స్థానం, భద్రత ఉంటున్నాయని చెప్పారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఉన్నతాధికారులు పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రాకి వస్తున్న పరిస్థితి ఉందన్నారు. రాబోయే రోజుల్లో మూడు పార్టీలు ప్రజల ముందుకు వచ్చి తప్పుదోవ పట్టిస్తాయని, వారి అసత్యాలను నమ్మకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయనకోరారు. -
'విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం'
న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నాయకులు పీవీ మిధున్ రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (అబద్ధాలు, వితండవాదంతో కథనాలు: సజ్జల) -
'30 సంవత్సరాలుగా రౌడీయిజం చేస్తున్నదెవరో అందరికీ తెలుసు'
సాక్షి, చిత్తూరు: కుప్పంలో అధికార పార్టీ అభ్యర్థులకు మంచి ప్రజాదరణ లభిస్తుంటే టీడీపీ కనీస ఆదరణకు నోచుకోలేకపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. కుప్పంలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఓటమి భయంతనే టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. టీడీపీ అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కుప్పంలో 30 సంవత్సరాలుగా ఎవరు రౌడీయిజం చేస్తున్నారో అందరికీ తెలుసు. మున్సిపల్ కమిషనర్ మీద దాడి చేసిన ఘనత టీడీపీది. ఇప్పుడు చంద్రబాబు కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నాడు. కుప్పంలో ప్రశాంత వాతావరణం ఉంది. స్వేచ్ఛగా వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రజల తీర్పును గౌరవిస్తాం. ఎన్నికల ఫలితాలు వచ్చే 15వ తేదీ వరకు వేచి ఉండండి. ఇప్పటి నుంచే అనవసరమైన గొడవలు చేయకండి. కుప్పం ప్రజల తీర్పు వైఎస్సార్సీపీకే ఉంటుంది అని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. దమ్ముంటే సవాల్ స్వీకరించు: పలమనేరు ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. టీడీపీ ఓడిపోతే కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద క్షమాపణ చెప్తావా అంటూ టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దమ్ముంటే సవాల్ స్వీకరించు. ఈ రోజు సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉంటా. సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డిలు మాకు శాంతియుతంగా ప్రచారం చేయమని చెప్పారు. టీడీపీ మాత్రం అరాచకాలకు పాల్పడుతోంది. ప్రజలే గుణపాఠం చెబుతారు అని ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. చదవండి: (‘చంద్రబాబు అంటేనే గూండాగిరి రాజకీయాలకు పెట్టింది పేరు’) -
బాబు పాలనలో కుప్పంలో బాగుపడింది ఐదుగురు మాత్రమే: మిథున్ రెడ్డి
సాక్షి, చిత్తూరు: కుప్పం ప్రజలను పచ్చిగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు జగనన్న అమలు చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. పేదలకు నివాస గృహాలు ఇస్తుంటే ఎందుకు చంద్రబాబుకు కడుపు మంట..?. కోర్టుల్లో తప్పుడు కేసులు వేయిస్తున్నారు. పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలు, మహిళల బంగారు నగల రుణాలు మాపీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చలేదు. చంద్రబాబు పాలనలో కుప్పంలో బాగుపడింది ఐదుగురు మాత్రమే. ఆ ఐదు మంది పెద్దపెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. పేదలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు. కుప్పంలో త్వరలోనే 10 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కావాలి' అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ ఈ నీతిమాలిన రాజకీయమేంటి..?) -
తిరుపతి–మదనపల్లె ఫోర్లేన్కు శ్రీకారం
సాక్షి, మదనపల్లె : తిరుపతి– మదనపల్లె ఫోర్‌లేన్ రోడ్డుకు ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఫలించింది. ఇటీవల ఆయన కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో సమావేశమై ఎన్‌హెచ్–71 నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరడంతో ప్రక్రియ ప్రారంభమైంది. మదనపల్లె నుంచి చెర్లోపల్లె (తిరుపతి) వరకు 103 కిలోమీటర్ల రహదారిలో తొలిదశగా రూ.1,474.54కోట్ల అంచనా వ్యయంతో మదనపల్లె–పీలేరు మధ్య 55.90 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఓటీ) విధానంలో రహదారి నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించారు. ఎన్హెచ్ఏఐ పోర్టల్‌లో ఈ–ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో డిసెంబర్ 13 లోపు ఈ–టెండర్లు దాఖలు చేయాలని కోరారు. డిసెంబర్ 14న టెండర్లను ఖరారు చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి రోడ్డు నిర్మాణం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. ఫోర్‌లేన్ రోడ్డు మంజూరుకు చొరవ చూపిన ఎంపీ మిథున్‌రెడ్డికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (రైల్వే స్టేషన్లో పేలుడు.. నలుగురు జవాన్లకు తీవ్రగాయాలు) -
చంద్రబాబుకు ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: అమరావతిలో తన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆస్తులపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడిన మిథున్‌రెడ్డి.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పునరుద్ఘాటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని, దమ్ముంటే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. (చదవండి: 48 గంటలు గడువిస్తున్నా) చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే సాక్షి, తిరుపతి: అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండి పడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలు పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం తన ప్రయోజనాలకోసం అమరావతిని కోరుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో తమ పార్టీ నుంచి లాక్కొన్న ఎమ్మెల్యేలతో ఆనాడు ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. చేయించలేదన్నారు. కాలక్షేపం కోసం, స్వప్రయోజనాల కోసం పాకులాడే చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే సమయం వృథా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. (ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు) -
రాష్ట్రానికి శాశ్వత సీఎం జగనన్నే...
సాక్షి, రాయచోటి/వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసే ప్రతీ అడుగు ప్రజల కోసమే అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ వంటి నాయకుడితో కలిసి పనిచేయడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ రాయచోటి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం జగన్‌ది ఉక్కు సంకల్పం అని వ్యాఖ్యానించారు. ‘రైతులకు అండగా నిలిచారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించారు. రూ. 23 కోట్లతో వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. రాయచోటి పట్టణాభివృద్ధికి రూ. 340 కోట్లు కేటాయించారు. మహిళ భద్రత కోసం దిశ చట్టం తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. సీఎం జగన్ వేసే ప్రతీ అడుగు ప్రజలకోసమే’ అని ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. నేనున్నానని హామీ ఇచ్చి.. రాయచోటి వెనుకబడిన ప్రాంతమని.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు.. ‘రాయచోటి నేనున్నా’ అని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు గాలేరు- నగరి నీటి తరలింపునకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని తెలిపారు. శాశ్వత సీఎం జగనన్నే.. గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు... సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆనాడు ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే మొన్నటి వరదల్లో అదనంగా 50 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రాయచోటి అభివృద్ధికి రూ. 2 వేల కోట్లతో శంకుస్థాపన చేశారని తెలిపారు. చంద్రబాబు మరో జన్మ ఎత్తినా ముఖ్యమంత్రి కాలేరని.. ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి జగనన్నే అని అనిల్ వ్యాఖ్యానించారు. -
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్ట సభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధాని మోదీ సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతోపాటు వైఎస్సార్ సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొని పలు ప్రతిపాదనలు లేవనెత్తారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేయాలని, సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేని జిల్లాలకు కొత్తవి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు 2017–18, 2018–19 సంవత్సరాలకు రూ.700 కోట్లు విడుదల చేయాలని, ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకారం రూ.24 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని సమావేశంలో లేవనెత్తినట్టు విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. ఉభయ సభల్లో వివిధ అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనేందుకు ప్రతి పారీ్టకి కనీసం 10 నిమిషాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. -
ఏపీ సమస్యల ప్రస్తావనకు సమయమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలను లేవనెత్తేందుకు తగిన సమయం కేటాయించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు. శనివారం ఢిల్లీలో స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి, వైఎస్సార్ సీపీ, ఫ్లోర్‌లీడర్ మిథున్‌రెడ్డి సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ కోరారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం మంజూరు చేయాల్సిన నిధులు, ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన నిధులు, పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణ దూరం పెంపు, కొత్త మెడికల్ కాలేజీల సాధనపై పోరాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా ఎంపీలు కలసికట్టుగా కృషి చేస్తారని మిథున్‌రెడ్డి మీడియాకు తెలిపారు. -
ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాం: మిథున్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాగా సమావేశం అనంతరం లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి మేలు చేసే ప్రతీ విషయంలో ఎంపీలు ముందుండాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం సభలో ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని పేర్కొన్నారు. పోలవరం నిధుల సత్వరమే విడుదలయ్యేలా ప్రయత్నిస్తామన్నారు. అదే విధంగా ప్రాజెక్టు భూసేకరణ కోసం కూడా ఒత్తిడి తీసుకువస్తామని మిథున్‌రెడ్డి వెల్లడించారు. అలాగే రామాయపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాల నిధుల కోసం పోరాటం చేస్తామన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఇక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిధుల కోసం పోరాడాలని ముఖ్యమంత్రి సూచించినట్లు పేర్కొన్నారు. -
పార్లమెంటు స్టాడింగ్ కమిటీల్లో ఎంపీలకు చోటు
సాక్షి, కడప : ప్రత్యేక హోదానే ఎజెండాగా వారిద్దరు పోరాటాలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచారు. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసిన నేతలుగా గుర్తింపు పొందారు.వారే కడప, రాజంపేట పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. వీరికి పార్లమెంట్ స్టాడింగ్ కమిటీల్లో కీలకమైన పదవులు లభించాయి. పరిశ్రమలశాఖ వ్యవహారాల పార్లమెంటు స్టాడింగ్ కమిటీ సభ్యునిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి...ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యునిగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలకు అవకాశం కల్పిస్తూ లోక్‌సభ సెక్రటేరియేట్ బులిటిన్ విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ ఎంపీలకు పార్లమెంట్ స్టాడింగ్ కమిటీలో పదవులను అప్పజెప్పింది. జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎంపీలకు కమిటీల్లో చోటు లభించడంపై పార్టీతోపాటు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్ జగన్
-
ఓట్ల తొలగింపుపై విచారణ చేస్తే నీకెందుకు భయం?
సాక్షి, హైదరాబాద్: ఓట్ల తొలగింపుపై పోలీసులు విచారణ చేస్తే మీకెందుకు భయం పట్టుకుందని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన కురబలకోట మండలం జెడ్పీటీసీ ధనలక్ష్మి భర్త ఎం.రంగారెడ్డితో కలిసి లోటస్‌పాండ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఏ విధంగా ఓట్లు తొలగిస్తుందో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కుటుంబసభ్యుల ఓట్లనే తొలగించే ప్రయత్నం చేశారంటే.. ఇక సాధరణ ప్రజల పరిస్థితేంటో అర్థం చేసుకొవచ్చన్నారు. టీడీపీ కుట్రలకు వివేకానందరెడ్డి ఓటు తొలగింపే సాక్ష్యమన్నారు. సర్వేల పేరిట ఇళ్లకు వచ్చి ఓట్లు తొలగిస్తున్న టీడీపీ కుట్రను బయటపెట్టామన్నారు. దీంతో ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపారన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని అంత సులభంగా వదలమని చెప్పారు. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని.. ఈ విషయంలో ఎంత వరకైనా వెళ్తామని చెప్పారు. తప్పు చేయడం వల్లే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీకి చంద్రబాబు తనయుడు నారా లోకేశే పెద్ద ఆస్తి అని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు ఓటు విలువ తెలియదని.. ఓటింగ్ ద్వారా గెలిచింది కూడా లేదని ఎద్దేవా చేశారు. లోకేశ్ తెలివితక్కువ స్టేట్మెంట్ల వల్ల వైఎస్సార్సీపీకే ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. కాగా, రంగారెడ్డి చేరికతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో పార్టీకి బలం చేకూరిందని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ కుటుంబానికి రంగారెడ్డి సన్నిహితుడని.. ఆయనకు ప్రజల్లో మంచి పేరుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి వైఎస్ జగన్‌కు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రజలు కృతనిశ్చయానికి వచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న నాయకులంతా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చి చేరుతున్నారన్నారు. -
వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
వైఎస్ఆర్ జిల్లా, నందలూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, అలాగే రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన భాధ్య త కూడా మనందరిపై ఉందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక గొబ్బిళ్ల శంకరయ్య మెమోరియల్ పాఠశాల ఆవరణలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు సిద్దవరం గోపిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మిథున్‌రెడ్డితో పాటు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డిలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలను ,అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తదేనన్నారు. ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆదుకుంటామన్నారు. నీతి నిజాయితీకి మారుపేరు వైఎస్సార్సీపీ అన్నారు. రానున్నది జగనన్న రాజ్య మని ప్రతిఒక్కరికీ అండగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ... తాను మొదటి నుంచి దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం మనిషినేనన్నారు. అనివార్య కారణాలవల్ల తెలుగుదేశం పార్టీలో కొనసాగానన్నారు. తిరిగి వైఎస్సార్సీపీలోకి రావడంతో తాను తన సొంతకుటుంబంలోకి వచ్చినట్లు సంతోషంగా ఉందన్నారు. ఆకేపాటి, మిథున్‌రెడ్డి సహాయసహకారాలతో నియోజకవర్గం అభివృద్దికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు సిద్దవరం గోపిరెడ్డి, గడికోట వెంకటసుబ్బారెడ్డి, నడివీధి సుధాకర్, గంపా సుధాకర్, గొబ్బిళ్ల త్రినాథ్, గుండు మల్లికార్జునరెడ్డి, పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి, ఆకేపాటి జగదీశ్వర్‌రెడ్డి, గుండు గోపాల్‌రెడ్డి, అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ పాల్గొన్నారు. -
అధైర్య పడొద్దు...అండగా ఉంటాం
కడప కోటిరెడ్డి సర్కిల్: డీఆర్డీఏ, వెలుగు ఉద్యోగులు అధైర్యపడొద్దని, వారి ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ అండదండగా ఉంటుందని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల జేఏసీ చేస్తున్న సమ్మెకు ఆయన, వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్న ఘనత డీఆర్డీఏ, వెలుగు ఉద్యోగులదేనన్నారు. వారి మనోస్థైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీయడం బాధాకరమన్నారు.నాలుగున్నరేళ్లుగా వారికి ఇచ్చిన మాట తప్పడమేగాక బ్లాక్ మెయిల్ చేస్తూ ఒత్తిడికి గురి చేయడం అన్యాయమన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబొస్తుందని ఊదరగొట్టారని, ఇప్పుడు ఉండే ఉద్యోగాలకు ఎసరు వస్తోందన్నారు. వైఎస్ జగన్ ఒక మాట చెప్పాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని, మాట చెబితే దానికి కట్టుబడి ఉంటారని అన్నారు. చంద్రబాబు మాత్రం చెప్పింది చేయరని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవేనని, వారి సమస్యలను వైఎస్ జగన్ దృíష్టికి తీసుకెళతామని మని హామీ ఇచ్చారు. మరో నాలుగు నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆయువుపట్టులాంటి వెలుగు ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. పదిరోజులుగా సమ్మెచేస్తుంటే ఉన్నతాధికారులు వారి వద్దకి వచ్చి సమస్యలు వినకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులు చేసే ఆందోళనకు వైఎస్ఆర్సీపీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 600 హామీలిచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం 22 సంక్షేమ పథకాల అమలుకు వెలుగు ఉద్యోగులను వాడుకుంటూ వారిని కరివేపాకులా తీసివేస్తోందన్నారు. ఐదువేలమంది ఉద్యోగులను పర్మినెంట్ చేయలేని ముఖ్యమంత్రి పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు. సీఎం అనుభవం ఇక్కడ ఎందుకు పనిచేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వారికి ఉద్యోగ భద్రత కల్పించి, సరైన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు బండి జకరయ్య, ఎస్ఏ సత్తార్ సమ్మెకు మద్దతు తెలిపి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుదర్శన్‌రెడ్డి, పంజం సుకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు’
తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిన వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించిన తీరు సరిగా లేదని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు కనీసం వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. పైపెచ్చు వైఎస్సార్‌సీపీపైనే నింద వేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇది చాలా దారుణమన్నారు. వైఎస్ జగన్ జాగ్రత్త పడకపోయి ఉంటే ఆ రోజు ఆయన ప్రాణాలకే ముప్ఫు ఏర్పడేదని వ్యాఖ్యానించారు. ఈ దాడి విషయంలో చంద్రబాబు కనీసం సానుభూతి కూడా తెలపలేదని అన్నారు. అలిపిరి ఘటన జరిగినపుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చి చంద్రబాబును పరామర్శించారు కానీ జగన్ విషయంలో చంద్రబాబు హుందాగా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. సిట్ విచారణ తీరు సరిగా లేదని, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. అందుకే సీబీఐ చేత విచారణ చేయాలని కోరుతున్నామని తెలిపారు. నిందితులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. -
నాడు ఎగతాళి.. నేడు చంద్రబాబు చేసేదేంటి?
సాక్షి, హైదరాబాద్ : మొదట్నుంచీ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉందని, టీడీపీ అప్పుడే కళ్లు తెరిచి ఉంటే ఏపీకి ప్రయోజనం కలిగేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో ఎంత విలువ ఉందో మొన్నటి అవిశ్వాస తీర్మానం సమయంలో దేశం మొత్తానికి తెలిసిందని ఎద్దేవా చేశారు. హోదా అనేది టీడీపీ వ్యక్తిగత విషయం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశమన్నారు. ఈ సారి ప్రజలు ఎట్టి పరిస్థిత్తుల్లోనూ చంద్రబాబును నమ్మరని, ఏపీలో వైఎస్సార్సీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఏపీ ప్రయోజనాలు, విభజనచట్టం, ప్రత్యేక హోదా లాంటి పలు కీలక అంశాలపై మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ నేతృత్వంలో హోదా సాధిస్తాం హోదా విషయంలో మేం రాజకీయాలు పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్ చేయగానే సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు ఎగతాళి చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశం బీజేపీకి లేదు. హోదా వల్ల అనేక పరిశ్రమలొస్తాయి. యువతకు ఉపాధి పెరుగుతుంది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఉత్తరాఖండ్‌లో పరిశ్రమలు స్థాపించి రాయితీల ద్వారా లబ్ది పొందుతున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం చేసే బదులు పందుల పోటీ పెట్టుకోండంటూ నాడు సుజనా చౌదరి ఎగతాళి చేశారు. మొదటగా అవిశ్వాసం పెట్టింది కూడా వైఎస్సార్సీపీనే. హోదా కోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం. హోదా సాధన విషయంలో వైఎస్ జగన్ స్పష్టంగా ఉన్నారు. ప్రజలందరి మద్దతుతో వైఎస్ జగన్ నేతృత్వంలో హోదా సాధించి తీరుతాం. వైఎస్ జగన్ ఒకే మాటపై నిలిచే వ్యక్తి. సభలో ఏ పార్టీ కూడా చంద్రబాబు వాదనకు మద్దతివ్వలేదు. రాహుల్ గాంధీ కూడా దాటవేసే ధోరణిలో మాట్లాడారు. మేం మాత్రం నిరంతరం హోదా కోసం డిమాండ్ కొనసాగించడం వల్ల దేశ వ్యాప్తంగా హోదాపై చర్చ జరుగుతోంది. నిద్రలేచిన టీడీపీ ఇప్పుడు నాటకాలు కుప్పంలో అరాచకం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. ప్రధాని మోదీ ఉచ్చు, ట్రాప్ అంటూ శ్రతువులన్నట్లుగా మాట్లాడారు. కానీ గత సమావేశాల్లో మేం 13సార్లు అవిశ్వాసం పెట్టినా చర్చకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ పారిపోయింది. మరోవైపు ఆనాడు చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని హోదా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు యత్నించారు. పార్లమెంట్లో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదనే విషయం మాకు తెలిసింది. నాలుగేళ్ల నుంచి పార్లమెంట్లో మేం హోదాపై మాట్లాడుతున్నామని, ఇప్పుడు నిద్రలేచి టీడీపీ హోదా అని నాటకాలు ఆడుతోంది. మేం మాత్రం ఎంపీ పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి.. ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించాం. మేం రాజీనామాలు చేశామన్న కోపం ప్రధాని మోదీ మాటల్లో కనిపించింది. టీడీపీ-బీజేపీలు మిత్రులే బీజేపీతో ఎవరు క్లోజ్‌గా ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు మా మిత్రుడేనని సభలో స్వయంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఎప్పుడూ రెండు ఆప్షన్లతో ముందుకెళ్తాడు. పొత్తుకోసం బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నా ఘనతే అని చెప్పుకునే మనస్తత్వం చంద్రబాబుది. మాట ఇస్తే కమిట్మెంట్తో ఉండే మనస్తత్వం వైఎస్ జగన్‌ది. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు హోదా కోసం మాట్లాడలేకపోయారు. తప్పును ఒప్పు చేయడంతో, ఒప్పును తప్పు చేయడంలో బాబు నేర్పరి. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అందుకే హోదా కోసం అడగలేదు. నాలుగేళ్లుగా స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఒక్క లేక రాయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుంది. హోదా కోసం రాజకీయాలు వద్దు.. అందరం కలిసి పోరాడుదాం. చంద్రబాబు 5 సంతకాల మాటేంటి? సీఎం కాగానే చంద్రబాబు 5 సంతకాలు చేశారు. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు, బెల్ట్ షాపులు సహా ఏ హామీలు కూడా అమలు కాలేదు. అసలు 5 సంతకాలు చంద్రబాబుకు గుర్తున్నాయో.. లేదో..! 600 హామీలున్న మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్లో లేకుండా చేశారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు, దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని టీడీపీ అబద్ధాలు చెబుతోంది. అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. -
వైఎస్ జగన్ నేతృత్వంలో హోదా సాధిస్తాం
-
టీడీపీ భయపడుతోంది : మిథున్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచటమే రాజీనామాల ముఖ్య ఉద్దేశ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. రాజీనామాల ఆమోదం కోసం కూడా ఆలస్యం చేశారంటే వారు ఎంత బయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసం పెడతామంటే ఐదు మందితో ఏం పెడతారని టీడీపీ నేతలు నవ్విన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని పార్టీలను కలిసి అవిశ్వాసం పెడితే దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. మేము ప్రజల కోసం పని చేసేవాళ్లం.. టీడీపీ కామెంట్స్ పట్టించుకోమని తెలిపారు. వాళ్ల సర్టిఫికెట్ మాకు అవసరం లేదని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘పార్టీ మారిన ఎంపీలపై ఫిర్యాదు చేసినా మూడేళ్లుగా చర్యలు లేవు. మా రాజీనామాల ఆమోద తాత్సరం టీడీపీ బీజేపీతో లాలూచీకి నిదర్శనం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పదవులు పోయినా ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని’ మిథున్ రెడ్డి తెలిపారు. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేసి చూపించిందని ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోదా సాధన విషయంలో ఏ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో దీంతో తేలిపోయిందని వారు అంటున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : ఒకటే మాట.. ఒకటే బాట ‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’ ‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’ వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి.. ఢిల్లీ అహంకారానికి పోరాటం
-
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి.. ఢిల్లీ అహంకారానికి పోరాటం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధన కోసం మా పార్టీ ఎంపీలం రాజీనామాలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ రాద్ధాంతం చేయడం మంచిది కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. గతంలో మమ్మల్ని రాజీనామాలు చేయలేదని అడిగారు.. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజీనామాలతో వచ్చే ఉప ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య పోరాటంగా అభివర్ణించారు. ప్రత్యేక హోదానా.. ప్రత్యేక ప్యాకేజీనా అనేది ప్రజల్లోనే తేల్చుకుందాం రమ్మన్నారు. వివక్షతో కళ్లు మూసుకుపోతే వారికి ఏం ప్రయోజనాలు కనిపించవు. మమ్మల్ని విమర్శించే వాళ్లు జూన్ 4, 2019 వరకూ 15 నెలలపాటు ఎంపీలుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్న విషయాన్ని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. అన్నీ తానే చేశానని చెప్పుకునే చంద్రబాబు మాకు మాత్రం ఓ సాయం చేయాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేయబోయే రాజీనామాలు అమలయ్యేలా చేయడంతో పాటు మా పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వచ్చేలా చూడాలన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. కానీ, బీజేపీ-టీడీపీలు కలిసి ఆడుతున్న డ్రామాలవల్లే హోదా సాధ్యం కావడం లేదు. చంద్రబాబు తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా! సీఎం చంద్రబాబు మళ్లీ రెండు నాల్కల సిద్ధాంతంతో తెరపైకి వచ్చారు. తెలంగాణలో నా వల్లే రాష్ట్రం వచ్చిందని చెప్పారు. ఏపీకి వచ్చి మనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పింది చంద్రబాబే. ఇప్పు మళ్లీ అలాగే చేయాలని యత్నిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది. మనమే ఎక్కువ సాధించాం. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు సాధించామని చంద్రబాబే స్వయంగా ప్రకటనలు చేసిన విషయాన్ని ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. సింగపూర్, జపాన్ లో దిగిన ఫొటోలు తప్ప చంద్రబాబు అమరావతిలో సాధించిందేమీ లేదు. విశాఖలో నిర్వహించిన సదస్సు కారణంగా రూ.15 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయన్నారు. డీఐపీపీ లెక్కల ప్రకారం కేవలం రూ.4.5 వేల కోట్ల పెట్టుబడులే వచ్చాయన్నది వాస్తవం. ప్రతి సీఎం హయాంలోనూ ఇలాగే పెట్టుబడులు ఏపీకి వచ్చాయి తప్ప. ఇందులో చంద్రబాబు ఘనతేం లేదన్నారు. బీజేపీ, టీడీపీ రెండు కారణమే ప్రభుత్వ భూమిలో నాణ్యత లేని తాత్కాలిక కట్టడాలకు ఇంత డబ్బు అవసరమా. బీజేపీ, టీడీపీ మధ్య పంపకాలు జరిగాయని మా అనుమానం. బడ్జెట్ ప్రవేశపెట్టి 15 రోజులు గడిచినా చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు.. మీడియా ముందుకు రావడం లేదు.. వాళ్ల ఎమ్మెల్యే డబ్బులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే చంద్రబాబు ఎవరి కాళ్లు పట్టుకొని కేసు మాఫీ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు 18 సార్లు వచ్చింది, కానీ స్టేలు తెచ్చుకుని నడుస్తున్న బాబు కేసులే లేవనడం హాస్యాస్పదంగా ఉంది. వందల కోట్ల అవక తవకలు జరిగాయని కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) నివేదిక ఇచ్చింది. పాదయాత్ర మహా యజ్ఞం. వైఎస్ జగన్ అది వదిలి రారు. పార్టీ సీనియర్ నేతలంతా ఢిల్లీలో ధర్నాలు చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు. హోదా తాకట్టులో టీడీపీ, బీజేపీ ఇద్దరూ దోషులే అని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. -
‘చంద్రబాబు నట్టేట ముంచారు’
సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు అబద్ధపు హామీలతో రైతులను నట్టేట ముంచారని వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే నీళ్లు ఇస్తామని మాట తప్పారని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి 80 శాతం పూర్తిచేస్తే మిగిలిన 20 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తిచేయలేకపోయారని తెలిపారు. తన హెరిటేజ్ డెయిరీ కోసం రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదయితే, లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించిన ఘనత వైఎస్ జగన్‌దని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర రోజు రోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని మిథున్‌రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. కాగా, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ డెయిరీలకు రైతులు అమ్మే ప్రతి లీటరు పాలకు నాలుగు రూపాయల సబ్సిడీ ఇస్తామని, ప్రభుత్వ రంగంలో మూతపడిన పాల ఫ్యాక్టరీలన్నింటినీ తిరిగి తెరిపిస్తామని వైఎస్ జగన్ హామీయిచ్చారు. -
‘చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు’
తిరుపతి: రాయలసీమలో కరువు తాండవిస్తున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరువు పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కరువును జయించామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. నారా లోకేశ్ మంత్రి అయినా చిత్తూరు జిల్లాకు జరిగిందేమీ లేదని తెలిపారు. -
ఇదేనా మీ నీతి చంద్రబాబూ: మిథున్ రెడ్డి
తాను నిజాయితీ పరుడినని, నిప్పునని పదే పదే ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారితో రాజీనామా చేయించకుండానే మంత్రులుగా ఎలా ప్రమాణం చేయిస్తారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్సీసీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకుని చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై చిత్తూరు జిల్లా పీలేరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దోపిడీకి టీడీపీ ప్రభుత్వం కేంద్రబిందువుగా మారిందన్నారు. రాజధాని నిర్మాణం పేరిట కోట్ల రూపాయలు దండుకుంటూ ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనడమేనా చంద్రబాబు నీతి అంటూ ప్రశ్నించారు. తాను దేశ రాజకీయాల్లో సీనియర్ని అని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను కేబినెట్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తన కుమారుడు లోకేష్‌ని మంత్రిని చేయడం కోసమే మంత్రివర్గ విస్తరణ అంటూ నాటకాలు ఆడారని విమర్శించారు. సుమారు 16 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు, ఎస్టీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడం ద్వారా చంద్రబాబు నిజస్వరూపం బయట పడిందనని మిథున్ రెడ్డి విమర్శించారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. -
మేం గెలిస్తే... టీడీపీని మూసేసుకుంటారా ?
హైదరాబాద్ : గెలిచే సత్తా ఉంటే రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి.మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్‌లో పి.మిథున్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి... ఆ పార్టీనే విమర్శించడం ఎంత వరకు సమంజసం అని పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే పార్టీ మారామని అంటున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి జరిగింది... ఎక్కడ జరిగిందని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యే సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే... టీడీపీని మూసేసుకుంటారా? అని ఆ పార్టీ నేతలకు మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి సమక్షంలో చిత్తూరు జిల్లా బైరెడ్డి పాలెం ఎంపీపీ విమల చేరారు. తన ప్రమేయం లేకుండానే పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి.. బలవంతంగా టీడీపీ కండువా కప్పారని ఆమె ఆరోపించారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని... ఆ పార్టీలోనే కొనసాగుతానని ఎంపీపీ విమల స్పష్టం చేశారు. -
ఇది ముమ్మాటికీ బాబు వైఫల్యమే
పీలేరు: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ఖాళీగంప సీఎం చేతికిచ్చి చేతులు దులుపుకున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం కేవీ పల్లె మండలం మహల్రాచపల్లెలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి పార్టీ అయినప్పటికీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా చేశారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం తరచూ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, సింగపూర్, జపాన్ అంటూ చక్కర్లు కొడుతున్నారు తప్ప సాధించింది శూన్యమన్నారు. రైల్యే బడ్జెట్లోనూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినా కేంద్రాన్ని అడిగే దమ్ము సీఎంకు లేదన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఇక ఆ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందని ప్రశ్నించారు. కేంద్రం పూర్తి స్థాయిలో రాష్ట్రానికి మొండిచేయి చూపించినా బాబు ఏమీ అడగలేని నిస్సహాయ స్థితిలో ఉండడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. బడ్జెట్ పేదల మనోబావాలకు విరుద్ధంగా ఉందన్నారు. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధర పెంచి సామాన్యుల నడ్డివిరిచారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నారని విమర్శించారు. రాష్ర్టంలో ఒక్క రైతుకు కూడా రుణ మాఫీ జరిగిన దాఖలాలు లేవన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మహిళలకు మోసం చేశారనిఆరోపించారు. సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ఐదు సంతకాలకు దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వంపై ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మాటమీద నిలబడలేని మోసపూరిత వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర పుటల్లో నిలిచిపోతారన్నారు. ఐదేళ్లు రాష్ట్రంలో దుర్దినాలేనని, భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ గల్లంతుకావడం తథ్యమని చెప్పారు. విశాఖను కుదిపేసిన హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి కేంద్రం రూ. 1000 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిందని, అయితే ఇప్పటివరకు రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన రూ. 600 కోట్లు రాబట్టడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు జీ. జయరామచంద్రయ్య, రెడ్డిరాజ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎం. వెంకటరమణారెడ్డి, నాయకులు లక్ష్మిరెడ్డి, గంగిరెడ్డి, లిఫ్ట్ కంపెనీ ఎండీ సురేంద్రనాథరెడ్డి, రామకొండారెడ్డి, పెద్దసిద్దయ్య, వెంకటసిద్దులు, చక్రీ, ధర్మా, ద్వారకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చకుండా సంబరాలా?
-
రూ.5 కోట్లతో తాగునీటి బోర్ల డ్రిల్లింగ్
మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లను డ్రిల్లింగ్ చేయనున్నట్లు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో తన నిధుల నుంచి రూ.5 కోట్లను బోర్ల డ్రిల్లిం గ్‌కు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 7 నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్న 400 గ్రామాలను ఎంపిక చేశామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డ్రిల్లిం గ్ చేస్తున్నట్లు వివరిం చారు. శాశ్వత పరిష్కారానికి అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్లు తెలి పారు. వెలుగోడు ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా మంచినీళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశామని, అయితే టీడీపీ నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ పనులను నిలుపుదల చేశారని ఆరోపించారు. కొంతవరకైనా సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశంతో నిధులను అధికంగా మంజూరు చేశానన్నారు. హంద్రీ- నీవా జలాశయంతోనైనా సమస్య శాశ్వత పరి ష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
అక్రమ కేసులు ఎత్తివేయాలి: రోజా
చిత్తూరు: నాయకులపై కేసులు పెడితే కార్యకర్తలు పారిపోతారని అధికార టీడీపీ నాయకులు భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తమ నేతలపై అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తివేయాలని గురువారం ఆమె డిమాండ్ చేశారు. కేసులు ఎత్తివేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు పెడితే సహించేది లేదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఆయన తెలిపారు. -
'మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరు'
అనంతపురం: మోసం, అబద్దాలకు చంద్రబాబు పెట్టింది పేరని వైఎస్సార్ సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామని, ముఖ్యమంత్రి అయ్యాక ఆంక్షల పేరుతో జారుకుంటున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ పోరాటాల పార్టీ అని, చంద్రబాబు మోసాలపై నిరంతరం ఉద్యమిస్తామని చెప్పారు. రుణమాఫీ కోరుతూ ఈనెల 16న నిర్వహించే ధర్నాలు విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. -
'ఫించన్లు ఇవ్వని ఘనత చంద్రబాబుదే'
చిత్తూరు: అర్హులైన వారికి ఫించన్లు ఇవ్వని ఘనత చంద్రబాబు సర్కారుకే చెందుతుందని వైఎస్ఆర్ సీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని ఆయన ధ్వజమెత్తారు. సీఎం సొంత జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. నిరుద్యోగ భృతి, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ గాలికొదిలేశారని విమర్శించారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలే అడ్డుకుంటున్నారని మిథున్‌రెడ్డి తెలిపారు. -
బాబుపై ప్రజలు తిరగబడడం ఖాయం
పశుపోషణ శిబిరాలు ఏర్పాటు చేసి పాడి రైతులను ఆదుకోండి మదనపల్లె: సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రజలు ఆరు నెలల్లో తిరగబడడం ఖాయమని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో శుష్క వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి బాబు ప్రజలను తీవ్రంగా మోసం చేశారన్నారు. రుణమాఫీకి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించకపోవడంతో ఇక అది అసాధ్యమని తేలిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అయిందని, మరో నాలుగు నెలలు చూసి ప్రజలు తిరగబడడం తథ్యమని అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తోందన్నారు. కొత్త రాజధాని ఏర్పాటు కూడా కలగానే మిగలనుందని, ఇందుకు నిధుల లేమి ప్రధాన కారణమని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడిందని, మూగజీవాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పశుపోషణ శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ నిధులను రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికే ఖర్చు చేయనున్నామని వివరించారు. మదనపల్లె నీటి సమస్యపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో చర్చించానని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం తన సొంత జిల్లాపై శీతకన్ను వేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. జిల్లా కు రూ.100 కోట్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ఎంపీపీలు సుజన, జరీనాహైదర్, సర్పంచ్ శరత్‌రెడ్డి, నేతలు మాధవరెడ్డి, మెట్రో బాబ్జాన్, హర్షవర్ధన్‌రెడ్డి, రెడ్డిశేఖర్‌రెడ్డి, తట్టినాగరాజరెడ్డి, నవాజ్, రఫీ పాల్గొన్నారు. -
కమిటీలతో కాలయాపన చేస్తారా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తక్షణమే సరిచేయాలని రైల్వే మంత్రి సదానందగౌడను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డి మాండ్ చేశారు. మంగళవారం రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ మొదట తనను గెలిపించి సభలోకి పంపిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాజంపేట పార్లమెంట్ స్థానం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రైల్వే బడ్జెట్లో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 29 ప్రాజెక్టులను పూర్తిచేయడానికి సరిపడా నిధులు కేటాయించకుండా.. సమన్వయ కమిటీని ఏర్పాటుచేయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. సమన్వయ కమిటీని నియమించడమంటే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయకుండా నాన్చడమేనన్నారు. తగినన్ని నిధులు కేటాయించి రైలుమార్గాలను పూర్తిచేయిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. బెంగళూరు-కడప రైలుమార్గానికి కేవలం రూ.30 కోట్లే కేటాయించడం దారుణమన్నారు. 2015 నాటికే పూర్తికావాల్సిన ఆ రైలుమార్గం, నిధులు ఇలానే కేటాయిస్తూ పోతే రెండు దశాబ్దాలకు కూడా పూర్తి కాదన్నారు. కడప-బెంగళూరు రైలుమార్గానికి భారీ ఎత్తున నిధులు కేటాయించి.. యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నుంచి మదనపల్లె, గుత్తి మీదుగా హైదరాబాద్‌కు రోజూ నడిచేలా ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరు చేయాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా నందలూరు లోకోషెడ్‌ను తక్షణమే ప్రారంభించాలని కోరారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటుచేయలేదని విమర్శించారు. రోజూ వేలాదిగా భక్తులు వచ్చి వెళ్లే తిరుపతి రైల్వేస్టేషన్లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సౌకర్యాలను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. -
ప్రజాసమస్యలు గాలికొదిలి మైండ్‌గేమ్‌లా?
బాబుపై ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట ధ్వజం హైదరాబాద్: ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు ఏమాత్రం ఫలించవని, ఇక మీదట రోజురోజుకూ బలహీనపడేది తెలుగుదేశం పార్టీయేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. టీడీపీ ప్రలోభాలకు లొంగి ఒకరిద్దరు పార్టీ ఫిరాయించినంత మాత్రాన పార్టీ బలహీనపడదని సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు... తమ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించేలా ‘మైండ్ గేమ్’ ఆడటం సరికాదన్నారు. ‘‘ఎన్నికల ముందు ఇచ్చిన సాధ్యం కాని హామీలను చంద్రబాబు నెరవేర్చకపోతే ఆరు నెలల్లో టీడీపీలోని వాళ్లే ఇతర పార్టీల వైపు చూడాల్సి వస్తుంది. ఓవైపు విభజన వల్ల తలెత్తిన స్థానికత సమస్యతో విద్యార్థులు, ఉద్యోగులు సతమతమవుతున్నారు. మరోవైపు రాజధాని ఎక్కడో, ఏ ఆఫీసు ఎక్కడుంటాయో తెలియని స్థితిలో ప్రజలుంటే బాబు వాటిని పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మళ్లిం చేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. రుణాల మాఫీ వంటి వాటిపై తొలి సంతకం చేయాల్సి వస్తుందనే భయంతోనే.. పార్టీ గెలిచినా ప్రమాణ స్వీకారం చేసే తేదీని బాబు నిర్ణయించుకోలేదు’’ అని దుయ్యబట్టారు. రాజకీయ డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. -
మిథున్ అఖండ విజయం
పుంగనూరు, న్యూస్‌లైన్ : ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని రాజంపేట లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి, ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి, సాయిప్రతాప్ త మ శక్తియుక్తులు దారపోసి మిథున్‌రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారు. మిథున్‌రెడ్డి, ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చతురత ముందు ప్రత్యర్థుల ఆటలు సాగలేదు. యువనేత మిథున్‌రెడ్డి సుమారు 1,74,762 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. పుంగనూరు నియోజకవర్గంలో మిథున్‌రెడ్డికి 1,05,772 ఓట్లు లభించాయి. పురందేశ్వరికి 60,674 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి సాయిప్రతాప్‌కు 4,927 ఓట్లు మాత్రమే పోలయ్యూరుు. పుంగనూరులో మిథున్‌రెడ్డికి 46,009 ఓట్ల మెజారిటీ లభించింది. నిత్యం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు సొంత నిధులు ఖర్చుచేస్తున్న తండ్రీతనయులను ప్రజలు ఆదరించారు. విశేష అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
గుడిసెలు లేని రాష్ట్రం జగనన్న లక్ష్యం
కుమ్మక్కు కుట్రలే కిరణ్, చంద్రబాబు నైజం సీమాంధ్రలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ గల్లంతు ‘న్యూస్‌లైన్’తో రాజంపేట లోక్‌సభ వెఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పీలేరు, న్యూస్‌లైన్: ఐదేళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే వైఎస్.జగన్మోహన్రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ సీపీ రాజంపేట లోక్‌సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఏడాదికి పది లక్షల ఇళ్లు చొప్పు న ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. గూడులేని ప్రతి పేదవాడికి పక్కాఇల్లు నిర్మిస్తామని చెప్పారు. అక్కాచెల్లెళ్ల ఆర్థిక స్వావలంబన కోసం రూ. 20 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నట్టు తెలిపారు. సీమాం ధ్రలో రోజురోజుకీ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజాదర ణ పెరుగుతోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామన్న భయంతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభంజనంలో కాంగ్రెస్, టీడీపీ, జే ఎస్పీ, బీజేపీ గల్లంతు కావడం తధ్యమన్నారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన కిరణ్ తమ్ముడి చేతిలో బ్యాట్ పెట్టి పోటీ నుంచి నిష్ర్కమించారని పేర్కొన్నారు. సమైక్య ముసుగులో రాష్ట్రాన్ని నిలువు నా ముక్కలు చేసిన ఘనత కిరణ్‌కే దక్కుతుందన్నా రు. మరోమారు సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం కోసం జైసమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. కుమ్మక్కు కుట్రలు కిరణ్, చంద్రబా బు నైజమన్నారు. టీడీపీ గెలుపునకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీని స్థాపిం చారని ఆరోపించారు. మూడున్నరేళ్లు కిరణ్ ప్రభుత్వా న్ని చంద్రబాబు భుజాన పెట్టుకుని మోసినందుకే ఈ ఎన్నికల్లో ఆయనకు పూర్తి సహకారం అందిస్తున్నారని విమర్శించారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హ యాంలో ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. నిత్యం అభూత కల్పనలను తన అనుకూల మీడియా లో రాయించుకుని జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నా రు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదమన్న చంద్రబాబు నేడు నిస్సిగ్గుగా అదే పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో కాం గ్రెస్, టీడీపీ, బీజేపీ భూస్థాపితం కావడం తధ్యమన్నారు. దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబును మించిన అవినీతిపరుడు మరొకరు ఉండరని ఆరోపించారు. మహానేత ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడుతున్న జగన్‌పై ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరలేదన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు మహానేత మరణానంతరం ఆయన కుటుం బాన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత రుణం తీర్చుకోవడానికి ఈ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓట్లేసి వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిం చాలని ఆయన కోరారు. రాష్ట్రాభివృద్ధి జగన్మోహన్రెడ్డికే సాధ్యమని తెలిపారు. బడుగుబలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. -
జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం
రాజంపేట, న్యూస్‌లైన్: ‘ప్రస్తుత ఎన్నికల్లో మాకు పోటీగా ధనికులు, కేంద్ర మాజీ మంత్రులు బరిలో ఉన్నారు.. అయితే మాకు రెండు కవచాలు ఉన్నాయని.. అవి జగన్ ఓదార్పు యాత్ర.. షర్మిల పాదయాత్ర అని’ వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. సోమవారం రాజంపేటలోని వైఎస్సార్ సర్కిల్ (పాత బస్టాండు)లో జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలతో పాటు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డిలు పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాజన్నపాలనను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారన్నారు. పేద ప్రజలను ఆలోచింపచేసేలా వైఎస్సార్ పాలన ఉందన్నారు. ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యశ్రీ గొప్పతనం గురించి లబ్ధిదారులు చెపుతున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు అందుతున్న పింఛన్‌ను జగన్ సీఎం అయితే పెంచుతారన్న ఆశతో ఉన్నారన్నారు. డ్వాక్రా రుణాలుమాఫీ చేస్తామన్నారు. ఆకేపాటి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని రాష్ట్రాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రగతిపథంలో నడిపించారన్నారు. ై వెఎస్సార్ను పొగిడిన నేతలే ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసి కష్టాలపాలు చేశారన్నారు. ఎన్నికల సమయంలో న్యాయం కోసం వైఎస్సార్సీపీ ఓటు అనే ఆయుధంతో న్యాయం చేయాలని కోరుతుందన్నారు. కిరణ్, చంద్రబాబుపాలనలో ప్రజలు అనేక కష్టాలు చవిచూశారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ మాటలను ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారన్నారు. ఉచిత విద్యుత్ విషయంలో తీగలపై దుస్తులు ఆరేసుకుంటారని చంద్రబాబు అన్న మాటలను గుర్తు చేశారు. పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రులు పోటీ చేస్తున్నారని, వారు ధనబలంతో ముందుకొస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో 39వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు రుణపడి ఉంటానని అన్నారు. రాజంపేట ఆర్ఓబీని మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారని, దాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి తాను చేసినట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి సోదరులు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డి, మాజీ ఎంపీపీ కడవకూటి సాయిబాబా, వైఎస్సార్సీపీ పట్టణ కన్వినర్ పోలా శ్రీనివాసులురెడ్డి, ప్రముఖ న్యాయవాది కొండూరు శరత్‌కుమార్‌రాజు, రాజం పేట మార్కెట్ కమిటీ మాజీ చెర్మైన్లు చొప్పా యల్లారెడ్డి, పోలి సుబ్బారెడ్డి, గ్రంధాలయ సంస్థ మాజీ చెర్మైన్ రామప్రసాద్‌రెడ్డి, మైనార్టీ నేతలు మసూద్అలీఖాన్, జాహిద్‌అలీ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీలోకి భారీగా వలస
కలకడ, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జై సమైక్యాంధ్ర, తెలుగుదేశం నాయుకులు, వూజీ సర్పంచ్, ఎంపీటీసీ వూజీ సభ్యులు చేరారు. ఆదివారం వుండలంలో వైఎస్ఆర్ సీపీ ఇంటింటి ప్రచారం కార్యక్రవూనికి హాజరైన ఆ పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు అసెంబ్లీ అభ్యర్థి చింతల రావుచంద్రారెడ్డి సవుక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వుండలంలోని నడిమిచెర్ల పంచాయుతీకి చెందిన వూజీ సర్పంచ్ లింగాల రాజారెడ్డి తన అనుచరులు వంద వుందితో చేరారు. ఆయున వెంట ఎంపీటీసీ వూజీ సభ్యుడు భవానీ పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కోన పంచాయుతీకి చెందిన వూజీ వార్డు సభ్యుడు బి.వెంకటరవుణ ఆధ్వర్యంలో తెలుగుదేశం నుంచి 50 వుంది కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీలో చేరారు. అనంతరం మిథున్‌రెడ్డి వూట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేవు పథకాలు తిరిగి అవులు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి వుుఖ్యవుంత్రి కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జై సమైక్యాంధ్ర పార్టీలు కుమ్మక్కు రాజకీయూలతో ప్రజల వద్దకు వస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు రోజుకోవూట, పూటకో వేషం వేసి ప్రజలను వుభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన వూట నిలబెట్టుకునేది ఒక్క వైఎస్ కుటుంబమేనన్నారు. ఉదయుం గుర్రంకొండ వుండలం రావూపురం వూజీ సర్పంచ్ ఆకుల రెడ్డెప్ప తన అనుచరులు వందవుందితో చేరారు. బాబురెడ్డి, సుబ్బారెడ్డి, నాగభూషణ్, రాజశేఖరాచారి, రాజశేఖర్‌రెడ్డి, షఫీ, లింగాల వెంకట్రవుణరెడ్డి, వెంకటశేషురెడ్డి, ఎ.శివారెడ్డి, ఎ.రంగారెడ్డి, ఎం.నల్లపాపిరెడ్డి, కోన గ్రావుం నుంచి నాగరాజ, గురుస్వామి, వెంకట్రవుణ తదితరులు చేరిన వారిలో ఉన్నారు. -
నాపై పోటీకి దమ్ముందా?
* సమైక్యద్రోహి కిరణ్ *కమీషన్ల కోసమే కండలేరు తాగునీటి పథకం * ప్రజల సొమ్ము దోచుకోలేదని ప్రమాణానికి సిద్ధమేనా ? * రాజంపేట వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి ధ్వజం పీలేరు, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఆయన సోదరుల్లో ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై పోటీ చేసి డిపాజిట్టు తెచ్చుకున్నా రాజకీయాల నుంచి వైదొలగడానికి సిద్ధమేనన్నారు. మూడన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల దాహార్తి తీర్చలేని కిరణ్ ఏ మొహం పెట్టుకుని నామినేషన్ వేస్తార ని ప్రశ్నించారు. ప్రజలు రోజూ బిందె నీరు రూ. 3 నుంచి రూ. 5కు కొనుక్కోవాల్సిన దుస్థితి ఆయనవల్లే వచ్చిందని కిరణ్‌పై మండిపడ్డారు. పీలేరు లో ప్రభుత్వ భూముల తోపాటు గుట్టలు, పుట్టలు, చెట్లు, వాగులు, వంకలు ఆక్రమించి వందల కోట్లు దండుకున్నది ఆయన అనుచరులేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదవిపోయే ముందు కమీషన్ల కోసం కండలేరు నుంచి తాగునీరు జిల్లాకు తరలించే ప్రక్రియ చేపట్టలేదా ? అని ప్రశ్నించారు. కమీషన్లు, ప్రజాధనాన్ని మూడన్నరేళ్లలో దోచుకోలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ నల్లారి సోదరులకు సవాల్ విసిరారు. రూ. 9 కోట్లతో ఏర్పాటు చేసిన కాంతి కిరణాలు మొహం చాటేశాయని, వీటిని ఏర్పాటు చేసిందీ కమీషన్ కోసం కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమైక్య ద్రోహిగా మొదటి స్థానం కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆయన సమైక్యవాదినంటూ ఇప్పుడు డ్రామాలాడితే ప్రజలు నమ్మరన్నారు. సమైక్య ద్రోహులు జై సమైక్యాంధ్ర అంటూ పార్టీని ఏర్పాటు చేయడం సిగ్గు చేటన్నారు. ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలన్నారు. పీలేరు ప్రజలు కిరణ్ సోదరుల మాయమాటలు నమ్మే పరిస్థితిలో ఇక ఎన్నడూ ఉండరని తెలిపారు. రూ. 7 కోట్లతో పీలేరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించవచ్చని, సీఎంగా ఈ పని కూడా చేయని కిరణ్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క రోజైనా అన్నదమ్ములు ఎండలో కష్టపడ్డారా ? వ్యాపారాలేమైనా చేశారా ? ఏమి చేయకనే వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కిరణ్ రోడ్‌షోలు జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని కూడా తన వెంట పెట్టుకోలేని కిరణ్‌కు ఆయన సత్తా ఏ పాటిదో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్న చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు. ముస్లిం మైనారిటీలు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్రలో 130 నుంచి 150 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నారే వెంకట్రమణారెడ్డి, మల్లెల రెడ్డిబాషా, బీడీ నారాయణరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, షామియానా షఫీ, లోకనాథరెడ్డి, ఎస్ హబీబ్‌బాషా, దండు జగన్మోహన్రెడ్డి, సదుం నాగరాజ, మల్లికార్జునరెడ్డి, గడిబాషా, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, అల్లాబక్షు, మల్లెల మస్తాన్, బాబ్జిరెడ్డి, మధుకర్‌రెడ్డి, ఆదినారాయణ, శ్రీనాథపురం మణి, జయపాల్‌రెడ్డి, వెంకటరమణ, మార్కొండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'పీలేరులో కిరణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవు'
జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గమైన పీలేరులో అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితి కిరణ్దంటూ ఆయన ఎద్దేవా చేశారు. అరాచక శక్తులతో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని కిరణ్ వర్గం ప్రయత్నిస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఎన్ని దౌర్జన్యాలైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి స్ఫష్టం చేశారు. పీలేరులో కిరణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని తమ పార్టీపై దుష్పచారం చేస్తున్నాయని మిథున్ రెడ్డి ఈ సందర్బంగా సదరు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చిత్తూరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిక
హైదరాబాద్: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన కె.వి.భాస్కర్‌నాయుడుతో సహా పలువురు నేతలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని పెద్దసంఖ్యలో చిత్తూరు నేతలు, కార్యకర్తలు ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయన వారిని పార్టీలో చేర్చుకున్నారు. సత్యవేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు భాస్కర్‌నాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటుగా పార్టీలో చేరినవారిలో కె.కైలాష్‌రెడ్డి(పిచ్చాటూరు మాజీ ఎంపీపీ), ముద్దుకృష్ణమరాజు(మాజీ జడ్పీటీసీ)తో సహా పలువురు ఉన్నారు. జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ నారాయణస్వామి, సత్యవేడు అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆదిమూలం, జిల్లా ట్రేడ్‌యూనియన్ నాయకుడు బీరేంద్రవర్మ వారితో ఉన్నారు.