గుడిసెలు లేని రాష్ట్రం జగనన్న లక్ష్యం | peoples are looking for ys jagan ruling | Sakshi
Sakshi News home page

గుడిసెలు లేని రాష్ట్రం జగనన్న లక్ష్యం

Published Wed, Apr 30 2014 2:42 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

గుడిసెలు లేని రాష్ట్రం జగనన్న లక్ష్యం - Sakshi

గుడిసెలు లేని రాష్ట్రం జగనన్న లక్ష్యం

  •  కుమ్మక్కు కుట్రలే కిరణ్, చంద్రబాబు నైజం
  •  సీమాంధ్రలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ గల్లంతు
  •  ‘న్యూస్‌లైన్’తో రాజంపేట లోక్‌సభ వెఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
  •  పీలేరు, న్యూస్‌లైన్: ఐదేళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ సీపీ రాజంపేట లోక్‌సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఏడాదికి పది లక్షల ఇళ్లు చొప్పు న ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. గూడులేని ప్రతి పేదవాడికి పక్కాఇల్లు నిర్మిస్తామని చెప్పారు. అక్కాచెల్లెళ్ల ఆర్థిక స్వావలంబన కోసం రూ. 20 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నట్టు తెలిపారు. సీమాం ధ్రలో రోజురోజుకీ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజాదర ణ పెరుగుతోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామన్న భయంతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభంజనంలో కాంగ్రెస్, టీడీపీ, జే ఎస్పీ, బీజేపీ గల్లంతు కావడం తధ్యమన్నారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన కిరణ్ తమ్ముడి చేతిలో బ్యాట్ పెట్టి పోటీ నుంచి నిష్ర్కమించారని పేర్కొన్నారు.
     
     సమైక్య ముసుగులో రాష్ట్రాన్ని నిలువు నా ముక్కలు చేసిన ఘనత కిరణ్‌కే దక్కుతుందన్నా రు. మరోమారు సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం కోసం జైసమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. కుమ్మక్కు కుట్రలు కిరణ్, చంద్రబా బు నైజమన్నారు. టీడీపీ గెలుపునకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీని స్థాపిం చారని ఆరోపించారు. మూడున్నరేళ్లు కిరణ్ ప్రభుత్వా న్ని చంద్రబాబు భుజాన పెట్టుకుని మోసినందుకే ఈ ఎన్నికల్లో ఆయనకు పూర్తి సహకారం అందిస్తున్నారని విమర్శించారు.  మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హ యాంలో ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. నిత్యం అభూత కల్పనలను తన అనుకూల మీడియా లో రాయించుకుని జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నా రు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదమన్న చంద్రబాబు నేడు నిస్సిగ్గుగా అదే పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో కాం గ్రెస్, టీడీపీ, బీజేపీ భూస్థాపితం కావడం తధ్యమన్నారు. దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబును మించిన అవినీతిపరుడు మరొకరు ఉండరని ఆరోపించారు.
     
    మహానేత ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడుతున్న జగన్‌పై ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరలేదన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు మహానేత మరణానంతరం ఆయన కుటుం బాన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత రుణం తీర్చుకోవడానికి ఈ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓట్లేసి వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిం చాలని ఆయన కోరారు. రాష్ట్రాభివృద్ధి జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని తెలిపారు. బడుగుబలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement