
రాజంపేట మాజీ ఎంపీ పెద్ది రెడ్డి మిధున్ రెడ్డి
తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిన వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యవహరించిన తీరు సరిగా లేదని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు కనీసం వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. పైపెచ్చు వైఎస్సార్‌సీపీపైనే నింద వేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇది చాలా దారుణమన్నారు. వైఎస్ జగన్ జాగ్రత్త పడకపోయి ఉంటే ఆ రోజు ఆయన ప్రాణాలకే ముప్ఫు ఏర్పడేదని వ్యాఖ్యానించారు.
ఈ దాడి విషయంలో చంద్రబాబు కనీసం సానుభూతి కూడా తెలపలేదని అన్నారు. అలిపిరి ఘటన జరిగినపుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చి చంద్రబాబును పరామర్శించారు కానీ జగన్ విషయంలో చంద్రబాబు హుందాగా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. సిట్ విచారణ తీరు సరిగా లేదని, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. అందుకే సీబీఐ చేత విచారణ చేయాలని కోరుతున్నామని తెలిపారు. నిందితులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment