సాక్షి, తిరుపతి: అమరావతిలో తన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆస్తులపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడిన మిథున్‌రెడ్డి.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పునరుద్ఘాటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని, దమ్ముంటే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.
(చదవండి: 48 గంటలు గడువిస్తున్నా)
చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే
సాక్షి, తిరుపతి: అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండి పడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలు పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం తన ప్రయోజనాలకోసం అమరావతిని కోరుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో తమ పార్టీ నుంచి లాక్కొన్న ఎమ్మెల్యేలతో ఆనాడు ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. చేయించలేదన్నారు. కాలక్షేపం కోసం, స్వప్రయోజనాల కోసం పాకులాడే చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే సమయం వృథా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు.
(ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు)
Comments
Please login to add a commentAdd a comment