అక్రమ కేసులు ఎత్తివేయాలి: రోజా
చిత్తూరు: నాయకులపై కేసులు పెడితే కార్యకర్తలు పారిపోతారని అధికార టీడీపీ నాయకులు భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తమ నేతలపై అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తివేయాలని గురువారం ఆమె డిమాండ్ చేశారు. కేసులు ఎత్తివేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు పెడితే సహించేది లేదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఆయన తెలిపారు.