వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచటమే రాజీనామాల ముఖ్య ఉద్దేశ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. రాజీనామాల ఆమోదం కోసం కూడా ఆలస్యం చేశారంటే వారు ఎంత బయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసం పెడతామంటే ఐదు మందితో ఏం పెడతారని టీడీపీ నేతలు నవ్విన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని పార్టీలను కలిసి అవిశ్వాసం పెడితే దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు.
మేము ప్రజల కోసం పని చేసేవాళ్లం.. టీడీపీ కామెంట్స్ పట్టించుకోమని తెలిపారు. వాళ్ల సర్టిఫికెట్ మాకు అవసరం లేదని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘పార్టీ మారిన ఎంపీలపై ఫిర్యాదు చేసినా మూడేళ్లుగా చర్యలు లేవు. మా రాజీనామాల ఆమోద తాత్సరం టీడీపీ బీజేపీతో లాలూచీకి నిదర్శనం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పదవులు పోయినా ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని’ మిథున్ రెడ్డి తెలిపారు.
నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేసి చూపించిందని ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోదా సాధన విషయంలో ఏ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో దీంతో తేలిపోయిందని వారు అంటున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి :
‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’
‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’
వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం
మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్
చిత్తశుద్ధి నిరూపించుకున్నాం..
చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి..
వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!
Comments
Please login to add a commentAdd a comment