resignations accepted
-
ఏపీ: మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదించారు. ఈ ఖాళీలకు సంబంధించి కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 11న ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో 24 మంది మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది: సజ్జల) -
ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. -
‘మీ టూ’కు తొలి వికెట్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం తెల్సిందే. అక్బర్ రాజీనామాను ప్రధాని మోదీ, ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. అక్బర్ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు. తాజా పరిణామంలో సత్యం గెలిచిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై అక్బర్ దాఖలుచేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీలోని పాటియాలా కోర్టులో గురువారం విచారణ ప్రారంభంకానుంది. వ్యక్తిగతంగానే పోరాడుతా.. వ్యక్తిగతంగానే కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అక్బర్ అన్నారు. ‘పదవికి రాజీనామా చేసి నాపై వచ్చిన ఆరోపణల్ని వ్యక్తిగతంగానే కోర్టులో సవాలుచేయడం సరైనదని భావించి రాజీనామా చేశా’ అని అన్నారు. దోవల్‌ను కలిశాకే నిర్ణయం.. ప్రధానికి సన్నిహితుడిగా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యాకే అక్బర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అక్బర్‌పై ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికే 20దాటిందని, మరింత మంది ప్రియా రమణికి మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయని నిఘా నివేదికలొచ్చాయని అక్బర్‌కు దోవల్ తెలిపారు. అక్బర్ వేధింపులకు పాల్పడిన వీడియోలూ బయటికొచ్చే చాన్సుందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్బర్‌పై∙ఆరోపణలు పార్టీకి నష్టంతెస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రధాని సూచనతో అక్బర్ రాజీనామా చేసినట్లు సమాచారం. -
టీడీపీ భయపడుతోంది : మిథున్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచటమే రాజీనామాల ముఖ్య ఉద్దేశ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. రాజీనామాల ఆమోదం కోసం కూడా ఆలస్యం చేశారంటే వారు ఎంత బయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసం పెడతామంటే ఐదు మందితో ఏం పెడతారని టీడీపీ నేతలు నవ్విన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని పార్టీలను కలిసి అవిశ్వాసం పెడితే దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. మేము ప్రజల కోసం పని చేసేవాళ్లం.. టీడీపీ కామెంట్స్ పట్టించుకోమని తెలిపారు. వాళ్ల సర్టిఫికెట్ మాకు అవసరం లేదని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘పార్టీ మారిన ఎంపీలపై ఫిర్యాదు చేసినా మూడేళ్లుగా చర్యలు లేవు. మా రాజీనామాల ఆమోద తాత్సరం టీడీపీ బీజేపీతో లాలూచీకి నిదర్శనం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పదవులు పోయినా ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని’ మిథున్ రెడ్డి తెలిపారు. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేసి చూపించిందని ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోదా సాధన విషయంలో ఏ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో దీంతో తేలిపోయిందని వారు అంటున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి : ఒకటే మాట.. ఒకటే బాట ‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’ ‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’ వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం మీ త్యాగం వృథా కాదు : వైఎస్ జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి.. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు! ‘వంచన’పై వైఎస్సార్ సీపీ గర్జన! -
‘స్పీకర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడం హర్షణీయమన్నారు. సంవత్సరం పాటు పదవులను వదులుకోవడం మాములు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం ఎవరు పోరాటం చేసిన వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని చలసాని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని ఆయన అన్నారు. హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, అధికార పార్టీ మాత్రం ప్రత్యేక హోదా విషయంలో తమ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా కాలం గడిపేస్తోంది. -
బీజేపీ మంత్రుల రాజీనామాల ఆమోదం
శ్రీనగర్: కఠువా హత్యాచార కేసులో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామాలను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదివారం ఆమోదించి గవర్నర్‌కు పంపారు. కఠువాలో చిన్నారి అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ మంత్రులు లాల్ సింగ్, చంద్ర ప్రకాశ్ గంగలు పాల్గొనడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వారిద్దరి చేత బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించింది. సీబీఐ విచారణ జరపాలి.. కఠువా హత్యాచార కేసులో సీబీఐ చేత విచారణ జరిపించాలని నిందితుల కుటుంబం డిమాండ్ చేసింది. క్రైం బ్రాంచ్ విచారణపై తమకు నమ్మకం లేదని, తమ తండ్రి, సోదరుడు దోషులని తేలితే ఉరి తీయాలని నిందితుడు సంజీరామ్ కూతుళ్లు చెప్పారు. ఈ కేసు విషయమై జమ్మూ హైకోర్టు, కఠువా న్యాయవాదులు చేస్తున్న సమ్మెను విరమించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆదేశించింది. -
పురందేశ్వరి,మాగుంట రాజీనామాల ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పురందేశ్వరి, ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామాలను ఆమోదించారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామాను కూడా ఆమోదించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు నిన్న లోక్‌సభలో ఆమోదం పొందడంతో వీరు ముగ్గురూ తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. నిన్న లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంతో పురందేశ్వరి మంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సీమాంధ్రల అభిప్రాయాలను గౌరవించకుండా లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తీరు సరిగా లేనందునే పార్టీని వీడుతున్నట్లు ఆమె తెలిపారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందటంతో లగడపాటి లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఆమోదించారు. లగడపాటి రాజీనామా లేఖను స్పీకర్ సభలో చదివి వినిపించారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానన్న లగడపాటి, ఆ మాట ప్రకారం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఇదే అంశంపై లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.