
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు.