Akula Satyanarayana
-
జనసేన పార్టీకి మరో షాక్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముగిసినా... టీడీపీ, జనసేనకు చెందిన పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే సంపాదించుకున్న జనసేన పార్టీకి మరో షాక్ తగలనుంది. ఓటమిపై నేతలు అధైర్యపడవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా అవేమీ వారిలో ధైర్యాన్ని నింపడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ...జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారు. తిరిగి ఆయన సొంతగూటికి (బీజేపీ)కి చేరుకోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి జనసేన తరఫున ఎంపీగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు రావెల కిషోర్ బాబు కూడా జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. పలువురు టీడీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, వారంతా త్వరలోనే బీజేపీలో చేరతారంటూ చెబుతున్నారు. -
తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష
-
మద్యం తాగి బస్సు నడిపాడని..
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల గత మూడేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేక హెచ్చరికలు చేసినా ప్రమాదాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నందిగామలో విధులు నిర్వర్తిస్తున్న బస్సు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న మేక బుజ్జికి జైలు శిక్షతో పాటు అతడి డ్రైవర్ లైసెన్స్ సైతం రద్దు చేయాలని నందిగామ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆకుల సత్యనారాయణ అదేశాలు జారీ చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష -
ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. -
జనసేన పార్టీలోకి ఆకుల సత్యనారాయణ
-
బీజేపీ ఎమ్మెల్యే ఆకుల రాజీనామా
తాడితోట(రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆదివారం తన పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌రావుకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పంపించారు. సోమవారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. సినీ నటుడు పవన్‌కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరేందుకే పదవులకు రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించడంలో బీజేపీ అధినాయకత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో, కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడంలో, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వడంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, దీంతో మనస్తాపానికి గురై బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణకు లేఖ రాసారు. రేపు (సోమవారం) తన సతీమణితో కలిసి సత్యనారాయణ ఓ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
40 ఏళ్ల ఇండస్ట్రీ బాబుకు ఏమైందని జనం సెటైర్లు
-
దేనికైనా సిద్ధం.. నిరూపించండి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతలతో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశమయ్యారని, ఆ సమావేశానికి బుగ్గనను తానే తీసుకెళ్లానని వచ్చిన ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఉదయం ఆయన ఇక్కడ ఏపీ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ఎవరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రభుత్వ అతిథి గృహం. ప్రజాప్రతినిధులు ఇక్కడ తారసపడడం, మాట్లాడుకోవడం సహజం. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇక్కడ కలిశారు. ఇద్దరం కలిసి పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశాం. ఇందులో రహస్యం ఏముంది? కానీ మీరు చిలువలు పలువలు చేసి.. అబద్ధాలు, అవాస్తవాల మీద బతుకుతున్నారు. బుగ్గనని అమిత్‌షా వద్దకు గానీ, రామ్‌మాధవ్ వద్దకు గానీ తీసుకెళ్లినట్టు నిరూపించండి. నేను సవాలు చేస్తున్నా. దేనికైనా సిద్ధంగా ఉన్నా. నా చాలెంజ్ స్వీకరిస్తారో లేదో చెప్పాలి. అసత్యాలు ప్రచారం చేసిన ఏబీఎన్‌పై లీగల్ చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తాం. పబ్లిక్ అకౌంట్ కమిటీలో చైర్మనే కాదు.. సభ్యులు కూడా ఉంటారు. మా పార్టీ నేత విష్ణుకుమార్‌రాజు దాంట్లో సభ్యుడు. కాగితాలు కావాలంటే ఆయన తెచ్చుకోలేరా? వాస్తవాలను పక్కదారి పట్టించి మీరు చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నా. ఏపీ భవన్లో కలిస్తే రహస్యం ఏముందో లోకేశ్ నిరూపించాలి.’ అని సత్యానారాయణ అన్నారు. -
ఎందుకంత భయం బాబూ?
సాక్షి హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విషయానికీ భయపడుతున్నారు, అభద్రతాభావానికి, ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. వారి అవినీతి, అక్రమాలే వారిలో భయాన్ని మరింతగా పెంచేస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి నేను కేవలం భోజనానికి వెళ్తేనే టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నిజంగానే కలిస్తే వారి ఆరోగ్యాలు ఏమైపోతాయో’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తాను, సత్యనారాయణ కలిసి ఢిల్లీలో రహస్యంగా బీజేపీ బాస్‌లను కలిసినట్లుగా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బుగ్గన శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని టీడీపీ నేతలు రంగంలోకి దించి, తానేవో డాక్యుమెంట్లను అందజేశానని, అది ప్రివిలేజ్ కదా.. పీఏసీ రాజ్యాంగ బద్ధమైన కమిటీ కదా అని మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందని చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా భయపడుతోందో అర్థం కావడం లేదన్నారు. బుగ్గన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘చంద్రబాబు మాదిరిగా అర్ధరాత్రి వెళ్లి చిదంబరంను, నితిన్ గడ్కరీని కలిసే ఖర్మ మా పార్టీ నేతలకు పట్టలేదు. మాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు తలెత్తుకొని జీవించడం నేర్పించారు. నేను పీఏసీ ఛైర్మన్‌గా ఏవైనా డాక్యుమెంట్లు ఇవ్వాల్సి వస్తే ఢిల్లీకి వెళ్లి అందజేయాలా? విజయవాడలో ఇవ్వలేనా? విశాఖలో ఇవ్వలేనా? పీఏసీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేడా? ఢిల్లీలోని ఏపీ భవన్లో నాకు వ్యక్తిగతంగా స్నేహితుడైన ఆకుల సత్యనారాయణను కలిశా. మేమిద్దరం కలిసి పక్కనే ఉన్న షాంగ్రిల్లా హోటల్‌కు మధ్యాహ్నం భోజనానికి వెళ్లాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాలేజీలో నా క్లాస్‌మెట్. ఏపీ భవన్లో నన్ను ఆయన ఆలింగనం చేసుకున్నారు. మరి ఆ ఫొటోను ఎందుకు బయటపెట్టడం లేదు? నేను బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి భోజనానికి వెళ్తేనే ఇంతగా ఉలిక్కిపడుతున్నారంటే.. నిజంగానే కలిస్తే టీడీపీ నేతల ఆరోగ్యాలు ఏమైపోతాయో! కూన రవికుమార్ నాతో మాట్లాడాడారు. అంటే ఆయన వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లా? బీజేపీపై పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు టీటీడీ బోర్డులో మహారాష్ట్ర మంత్రి భార్యను సభ్యురాలిగా ఎందుకు నియమించారో చెప్పాలి. బీజేపీని పూర్తిగా సొంతం చేసుకున్నామని టీడీపీ భావిస్తోంది. అందుకే బీజేపీ నేతలతో ఎవరు మాట్లాడినా టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. లోకేశ్ ఫొటోల సంగతేంటి? మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ చూస్తుంటే ఆకాశం విరిగి మీదపడుతుందని పరుగెత్తిన కుందేలు, జింక, గుంటనక్క కథ గుర్తుకొస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకోవడం తప్పయితే.. లోకేశ్ విదేశాల్లో చేసిన విహారాలపై సోషల్ మీడియాలో చాలా ఫొటోలు వచ్చాయి, వాటి గురించి ఏం సమాధానం చెబుతారు? ఆయన ఎందుకింత అమాయకంగా ప్రవర్తిస్తున్నారు. అమెరికాలో లోకేశ్ చదువుకున్న యూనివర్సిటీపై సందేహం కలుగుతోంది. ఆకుల సత్యనారాయణ, నేను మెట్లపై కలిస్తేనే టీడీపీ అంతా కదులుతోంది. ఇది టీడీపీ నేతల అమాయకత్వమా లేక విపరీతమైన భయమా? లోకేశ్ మైక్ ముందుకు వస్తే అర్థంపర్థం లేకుండా మాట్లాడుతారు. అందుకే ఆయనను ట్వీట్లకే పరిమితం చేశారనే అనుమానం కలుగుతోంది. కీలకమైన పంచాయతీరాజ్ శాఖను సీనియర్లను కాదని లోకేశ్‌కు అప్పగిస్తే ఆయన తన బాధ్యతలను పక్కనపెట్టి ఢిల్లీలో ఎవరు తిరుగుతున్నారు? ఏ హోటల్‌కు వెళ్తున్నారు? అని ట్వీట్లు చేయడం ఏమిటి? టీడీపీలో ఒక నాయకుడు ఇంకో నాయకుడితో కలవకూడదు, ఒక కులం ఇంకో కులంతో, ఒక మతం ఇంకో మతంతో కలవకూడదన్న విభజించి పాలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక మనిషి ఇంకో మనిషిని.. ఒక పార్టీ వాళ్లు ఇంకో పార్టీ వాళ్లను కలవకూడదా? ఇదేమైనా చట్టమా? తెలుగుజాతి పరువు తీస్తున్నారు టీడీపీ అనైతిక రాజకీయాలు, జర్నలిజంలో కొందరు అనుసరిస్తున్న తీరు తెలుగు జాతి పరువు తీస్తున్నాయి. నేను ఢిల్లీకి వ్యక్తిగత పనుల మీదనే వెళ్లా. ఏపీ భవన్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ ఉంటారు. అక్కడ లాబీల్లో ఇద్దరు ఎమ్మెల్యేల మర్యాదపూర్వక సమావేశం చుట్టూ కథ అల్లడం టీడీపీ అభద్రతా భావానికి నిదర్శనం. చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ‘‘రాజ్యాంగం గురించి టీడీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేయడం, అందులో నలుగురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగబద్ధమా? తప్పుంటే తప్పు అని అంటాం, ఒప్పుంటే ఒప్పని అంటాం. టీడీపీ నేతల్లాగా అర్ధరాత్రి రాజకీయాలు చేయం. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలకు భయం పట్టుకుంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ అవినీతికి చరమగీతం పాడడం ఖాయం’’ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తేల్చిచెప్పారు. నీచ రాజకీయాలకు పరాకాష్ట అధికార టీడీపీ నీతిమాలిన రాజకీయాలకు, ఆ పార్టీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారానికి ఇది పరాకాష్ట. ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చెందిన వాహనాలను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా వాడుకున్నారు. ఆ వాహనాల వివరాలను ఏపీ భవన్ లాగ్‌బుక్‌లో నమోదు చేశారు. అవి ఎప్పుడు, ఎక్కడెక్కడ తిరిగాయో అందులో పేర్కొన్నారు. ఇతర అధికారులు ఏ ప్రాంతాలకు వెళ్లారో రాశారు. బుగ్గన 14వ తేదీన సౌత్ ఎవెన్యూకు వెళ్లినట్లు నమోదు చేశారు. తర్వాత దాన్ని ట్యాంపరింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సౌత్ ఎవెన్యూ ముందు ‘27’ అని దిద్దినట్లు కనిపిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు స్పష్టమవుతోంది. ఇతర అధికారులు ఏ ప్రాంతాలకు వెళ్లారో రాశారు గానీ కచ్చితంగా ఫలానా కార్యాలయానికే వెళ్లారని పేర్కొనలేదు. బుగ్గన విషయంలో మాత్రం లాగ్‌బుక్‌ను ట్యాంపరింగ్ చేశారు. దీని ఆధారంగా... బుగ్గన ఫలానా చోట బీజేపీ నేతలతో సమావేశమయ్యారంటూ టీడీపీ నేతలు గగ్గోలు ప్రారంభించారు. -
‘అది ప్రభుత్వ గెస్ట్‌హౌస్.. ఎవరైనా రావచ్చు’
సాక్షి, న్యూఢిల్లీ: అబద్ధాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను అమిత్‌షాతో వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ను కలిపానన్న ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్దమన్నారు. ఈ క్రమంలో మంత్రులు అచ్చెనాయుడు, అమర్నాథ్ రెడ్డి, లోకేశ్, చంద్రబాబు నాయుడులకు ఆయన సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు తనపై మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఏపీ భవన్ ప్రభుత్వ గెస్ట్‌హౌస్ ఎవరైనా రావచ్చు.. దానికి రాజకీయాలను అపాదించడం సరికాదన్నారు. ఇప్పుడు కుట్ర రాజకీయలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు అర్థం అవుతుందని తెలిపారు. తనని బుగ్గన రాజేంద్రనాథ్ కలిసిన మాట వాస్తవమని, ఇద్దరం కలిసి శాంగ్రీల హోటల్లో కలసి భోజనం చేసిన మాట నిజమేనన్నారు. అయితే ఇందులో రహస్య సమావేశం ఎక్కడ ఉందో లోకేష్ వివరణ ఇవ్వాలన్నారు. టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తోంది. మల్టీ నేషనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన ఇస్తారని.. ఏపీ ప్రజలు ఎన్నుకున్నారు.. కానీ దానికి విరుద్ధంగా టీడీపీ పనిచేస్తుందని విమర్శించారు. స్పీకర్ వ్యవస్థను టీడీపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ స్థాయిలో తాను ఎవరిని కలవలేదని ఆయన స్పష్టం చేశారు. -
టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది
-
అప్పుడు ఎందుకు తీసుకెళ్లలేదు?
సాక్షి, అమరావతి : అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 2014 నుంచి ఒక్క అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. అమరావతిలోని బీజేపీ కార్యాలయంలో రాజమండ్రి అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పార్టీ నాయకుడు మాధవ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడిగిన వారిపై ఎందుకు దాడులు చేయించారని చంద్రబాబును ప్రశ్నించారు. బాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇప్పుడు హడావిడిగా అఖిలపక్షం ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. అఖిలపక్షాన్ని రాత్రికి రాత్రికి ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. సీఎం 29సార్లు ఢిల్లీకి తీసుకెళ్లినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని సూటిగా అడిగారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. కులాల మధ్య సీఎం చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ ప్రభుత్వం భయపడటం లేదని తెలిపారు. -
చంద్రబాబే హోదా వద్దన్నారు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా వద్దని గతంలో సీఎం చంద్రబాబే చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా వల్ల రూ. 3 వేల కోట్లకు మించి రాష్ట్రానికి రాదని పలుమార్లు సీఎం చంద్రబాబు అన్నట్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఆ క్లిప్పింగ్‌లు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదాతో పూర్తి స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదని సీఎం వ్యాఖ్యానించారన్నారు. మంగళవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రసంగించారు. మిత్రపక్షం ఎమ్మెల్యే ప్రసంగానికి సీఎం చంద్రబాబు అడ్డుకున్నారు. సభను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ప్రత్యేక హోదాతో రూ. 3 వేల కోట్లు వస్తాయని తానెప్పుడూ అనలేదన్నారు. ఒకవేళ తాను అన్నట్లు ‘సాక్షి’ పత్రికలో వచ్చి ఉంటే తానేమీ చెప్పలేనన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చమని మాత్రమే కేంద్రాన్ని కోరుతున్నాం తప్ప అదనంగా ఏమీ అడగడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. దక్షిణాదిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.35 వేలు తక్కువగా ఉందన్నారు. బీజేపీ నేతలు ఇక్కడ అనవసరంగా మాట్లాడకుండా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి ఏం చేశారో సమీక్ష చేయించాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రసంగం కొనసాగిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా కొనసాగుతుందనే ప్రచారం వాస్తవం కాదన్నారు. విభజన చట్టంలో లేనివి కూడా రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందన్నారు. కేంద్రం అన్ని ప్రాజెక్టులకు రూ.9,750 కోట్లు సాయం చేసిందని, ప్రపంచ బ్యాంకు నుంచి హుద్‌హుద్ తుపాను సాయానికి రూ.2,500 కోట్లు, డ్వాక్రా గ్రూపులకు రూ.750 కోట్లు, విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.6,500 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. 2014–15 రెవెన్యూ లోటు అంకెల్లో కేంద్రం, రాష్ట్రం మధ్య వ్యత్యాసం ఉందన్నారు. రైల్వే జోన్ కోసం వైజాగ్‌లో నిరసన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో ప్రధాని మోదీ మాస్క్ ధరించిన వ్యక్తిని మహిళలతో కొట్టించడం దారుణమన్నారు. ఎయిమ్స్‌కు కేటాయించిన స్థలంలోని టవర్‌ను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడున్నరేళ్ల సమయం పట్టిందన్నారు. -
‘సీరియస్ రాజకీయాలు చెయ్యాలి..!’
సాక్షి, రాజమండ్రి: గత కొద్దిరోజులుగా అధికార టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు ఒక్కరినొక్కరు విమర్శించుకోవడం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ టీడీపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ ఉద్దేశ పూర్వకంగానే రాజకీయాల కోసం బీజేపీని టార్గెట్ చేస్తోందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రకరమైన పరిస్థితి నెలకొందన్నారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరి మంత్రులు అయిపోతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడుతున్నారు. ఆ ట్రాప్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పడరని అనుకుంటున్నాను. అంతేకాక బీజేపీలో సీరియస్ రాజకీయాలు చెయ్యాలి.. కాజువల్ మాటలు సరికాదని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హితవు పలికారు. -
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వల్లే రాజీనామా
రాజమహేంద్రవరం సిటీ : బీజేపీలో సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య గల ఆధిపత్య పోరుతో పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇమడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నామని మజ్దూర్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వాసంశెట్టి గంగాధరరావు, షబ్బితి ఫణీశ్వరరావు ప్రకటించారు. బుధవారం రాజమహేంద్రవరంఆనం రోటరీ హాల్లో విలేకరులతో మాట్లాడుతూ నాయకులు వ్యక్తిగత స్వార్థంతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. తాము పార్టీలో పనిచేసిన రెండున్నర ఏళ్లలో మానసిక వేదన అనుభవించామని, ఆత్మాభిమానం చంపుకోలేక పార్టీని వీడాల్సి వస్తోందన్నారు. నగరంలో ఆటోస్టాండ్ బోర్డు విషయంలో నెలకొన్న వివాదంలో నాయకత్వం స్పందించలేకపోయిందన్నారు. రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్న తమకు ఏమాత్రం తెలియకుండానే జిల్లా మజ్ధూర్మోర్చ అధ్యక్షురాలిగా కార్మిక సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేని మహిళను నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చోటులేకుండా పోయిందన్నారు. జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాళం వెంకటేశ్వరరావు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. -
'ముద్రగడను రక్షించుకుంటాం'
రాజమండ్రి : కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను రక్షించుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రిలో ఆకుల సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. మా డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముద్రగడ వైపు నుంచి కూడా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆకుల సత్యనారాయణ చెప్పారు. -
టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
రాజమండ్రి: టీడీపీ నేతలపై రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమది నీతి, నిజాయితీలతో కూడిన పార్టీ అని.. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. గురువారం ఉదయం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుసుకుని మాట్లాడాలని రాజేంద్రప్రసాద్ అనటం సరికాదన్నారు. తమకు టీడీపీ నాయకులు హితభోద చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించటంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టీడీపీ దేనని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగానా, వ్యక్తిగతమా అనేది స్పష్టం చేయాలని రాజేంద్రప్రసాద్ బుధవారం డిమాండ్ చేశారు. -
దోస్తీ మే సవాల్!
♦ అమలాపురంలో రచ్చకెక్కిన మిత్రభేదం ♦ టీడీపీ అవినీతిపై ధ్వజమెత్తిన బీజేపీ ♦ అభివృద్ధి నిరోధకులని ‘దేశం’ ప్రత్యారోపణ ♦ ఆర్డీఓ కార్యాలయం వద్ద పోటాపోటీ ధర్నాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఓ వైపు ఆదివారం స్నేహితుల దినోత్సవం జరగనుండగా అంతకు ఓ రోజు ముందే మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీలు అమలాపురంలో కత్తులు దూసుకున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీనీ అధికారంలోకి వచ్చే వ్యూహంతోనే ఈ రెండు పార్టీలూ మిత్రపక్షాలయ్యాయి. అటువంటి పక్షాల మధ్య జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విభేదాలు రగులుకున్నారుు. తాజాగా కోనసీమ కేంద్రం అమలాపురంలో రెండు పార్టీల నేతలు ‘బస్తీ మే సవాల్’ అంటూ జబ్బలు చరుచుకుని రోడ్డెక్కాయి. మిత్రపక్షాలకు చెందిన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ (బీజేపీ), గోరంట్ల బుచ్చయ్యచౌదరి (టీడీపీ)ల మధ్య నిన్నమొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితి. పుష్కరాల్లో సైతం వీరి మధ్య అంతరం తగ్గలేదు. బీజేపీకే చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పుష్కరాల పనుల్లో అవినీతి జరిగిందని నిప్పులు చెరిగింది టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీల పైనేనంటున్నారు. రాజమండ్రిలో టీడీపీ, బీజేపీల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు అమలాపురాన్ని తాకాయి. బీజేపీ నేతలు నేరుగా అక్కడి టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుపై అవినీతి అస్త్రాలు సంధించడమే కాక శనివారం ధర్నా కూడా చేపట్టారు. ఇందుకు పోటీగా టీడీపీ నేతలు కూడా ధర్నాకు దిగారు. చాలా కాలం నుంచే అంతర్గత పోరు అల్లవరం మండలం ఓడలరేవులో ఓఎన్జీసీ ప్లాంట్ విస్తరణ కోసం300 ఎకరాల భూ సేకరణలో టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఇందులో ప్రధాన పాత్ర అధికారపార్టీకి చెందిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుదేనంటోంది. ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. అల్లవరం మండలానికి చెందిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబుకు, ఎమ్మెల్యే ఆనందరావుకు మధ్య అంతర్గత పోరు చాలా కాలంగా కొనసాగుతున్నా ఇప్పుడు రెండు పక్షాలు అధికారంలో ఉండటంతో తారాస్థాయికి చేరుకుంది. గతంలో అల్లవరం మండలంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై తలెత్తిన వివాదానికి ఓఎన్జీసీ భూ సేకరణపై అవినీతి ఆరోపణలతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అవినీతిపై విచారణకు డిమాండ్ అల్లవరం మండలంలో ఇటీవల జరిగిన పుష్కర ఘాట్ల నిర్మాణంలో అవినీతికి కూడా ఎమ్మెల్యే ఆనందరావే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. అవినీతిని నిరసిస్తూ వారు ఆర్డీఓ కార్యాలయం వద్ద శనివారం ఉదయం, వారికి పోటీగా టీడీపీ నాయకులు సాయంత్రం ధర్నాలకు ఉపక్రమించారు. అవినీతికి సం బంధించి అధిపార పార్టీ నాయకుల పైనా, వారికి అండగా నిలిచిన అధికారులపైనా విచారణ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దొరబాబుతో పాటు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా వంటి నాయకులు ఆందోళనలో ముందుండటం గమనార్హం. టీడీపీ కూడా హడావిడిగా ప్రతి ఆందోళనకు దిగి కమలనాథులకు సవాల్ విసిరింది. ఆర్డీవో కార్యాలయం వద్ద పోటీ ధర్నా చేపట్టి ఎమ్మెల్యేపై బీజేపీ నాయకుల ఆరోపణలను ఖండించింది. నియోజవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించింది. బీజేపీ నాయకులవి దళిత వ్యతిరేక విధానాలని నిరసించింది. మిత్రపక్షాల మధ్య రగిలిన విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏ పరిణామానికి దారి తీస్తాయో వేచి చూడాల్సిందే. -
బీజేపీ ఆగ్రహం... టీడీపీ విస్మయం
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో సభ్యులుగా కొందరి పేర్లు అనూహ్యంగా తెరమీదకు రావడం అటు తెలుగుదేశంలో, ఇటు మిత్రపక్షమైన బీజేపీలోనూ కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలపై రాష్ట్ర బీజేపీ నేతల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పార్టీ టీడీపీ నేతలను సైతం ఈ నియామకాలు విస్మయానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి పేరు జాబితాలో చేరడంపై రెండు పార్టీల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ నాయకుల సిఫారసు మేరకో, తమిళనాడుకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతల సిఫారసు మేరకో ఆయన పేరు ఖరారైందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ నేతలంటున్నారు. తమ నేతలను పక్కదారి పట్టించడానికి జరుగుతున్న ప్రచారంగా వారు పేర్కొంటున్నారు. మరోవైపు మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి ఒకరు మధ్యవర్తిగా ఉండి వ్యవహారం నడిపించారని, కృష్ణమూర్తిని సభ్యుడిగా నియమించే విషయంలో స్వయంగా చంద్రబాబే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలే అంటుండడం గమనార్హం. ఆయన నియామకం విషయంలో తెరవెనుక మతలబు వేరే ఉందని వారంటున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితాలో తన పేరు ఖాయంగా ఉంటుందని 4 నెలల నుంచే కృష్ణమూర్తి ప్రచారం చేసుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఇదిలావుండగా గత ఆదివారం ఉదయం సీఎం చంద్రబాబుతో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరమే టీటీడీ పాలకవర్గం పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఆ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీఅవడం గమనార్హం. వారి పేర్లు తొలగించడం వెనుక మతలబు! బీజేపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(ఖైరతాబాద్), ఏపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ(రాజమండ్రి), చిత్తూరు జిల్లా తిరుపతి నేత భానుప్రకాష్‌రెడ్డికి అవకాశం కల్పిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరిగింది. చింతల రామచంద్రారె డ్డికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్వయంగా ఫోన్ చేసి టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా నియమితులవుతున్నారంటూ అభినందనలు సైతం తెలిపారు. దీంతో రామచంద్రారెడ్డిని పార్టీ నేతలు అభినందనలతో ముంచెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వీట్లు కూడా పంచుకున్నారు. మిగిలిన ఇద్దరు నేతలు సైతం సహచరుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఇంత జరిగిన తర్వాత హఠాత్తుగా జాబితా నుంచి వారి పేర్లు తొలగించడం వెనుక పెద్ద మతలబే ఉందని వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలను బుజ్జగించాలన్న లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా ఆ పార్టీ జాతీయ నేతలు అమిత్‌షా, ఉమాభారతి, రాజ్‌నాథ్‌సింగ్ తదితరుల సిఫారసు మేరకు నియమించినట్టు లీకులిచ్చారని వాదన కూడా వినిపిస్తోంది. -
‘స్లమ్’స్యలు లేని సిటీగా..
రాజమండ్రి సిటీ :చారిత్రక రాజమండ్రి నగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే రాజీవ్ ఆవాస్ యోజన పథకం ద్వారా చేపట్టిన సర్వేను అమలు పరచాలని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మంగళవారం నగర మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఏర్పాటు చేసిన స్లమ్ ఫ్రీ సిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి తదితర నాయకులు, సిబ్బందితో సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఆర్థిక సహకారంతో మురికవాడల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఏవిధమైన చర్యలు చేపట్టాలనే విషయమై ప్రజాప్రతినిధులతో చర్చించారు. నగరంలో మురికివాడలను గుర్తించి ఏవిధమైన వసతులు అందించాలనే విషయమై ఆర్వీ అసోసియేట్స్ చేపట్టిన సర్వేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈసందర్బంగా అసోసియేట్స్ అసిస్టెంట్ మేనేజర్ బెజవాడ రఘురామ్ మాట్లాడుతూ నగరంలో 88 మురికివాడల్లో పేదలను సర్వే చేయడం ద్వారా 4200 మందికి ఇళ్లు వేవని గుర్తించామన్నారు. వీరికి 13 ఎకరాల్లో 390 కోట్ల వ్యయంతో జీ ప్లస్ త్రీలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా పేదరికం నిర్మూలించే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దీనిలో 50 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 15 శాతం కార్పొరేషన్, పదిశాతం లబ్ధిదారులు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయమై సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నూతన సర్వేలో అంశాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఏవిధమైన సమస్యలు తలెత్త్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మరోసారి అందరితో సమావేశమై చర్యలు చేపట్టనున్నట్టు మేయర్ రజనీ శేషసాయి పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, నగర కమిషనర్ రవీంద్రబాబు, వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముదిరిన మిత్రభేదం
సాక్షి, రాజమండ్రి : రాష్ట్ర రాజకీయాల్లో రాజమండ్రి సెంటిమెంట్ బలంగానే ఉంది. అనేక పార్టీలు పలు కీలక కార్యక్రమాలను, ప్రభుత్వాలు పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించిన దాఖలాలున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల స్నేహబంధం విచ్ఛిన్నానికీ ఈ నగరమే శ్రీకారం చుట్టనుందా అన్న అనుమానం తలెత్తుతోంది. ఇక్కడి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో చెరొకటీ గెలుచుకున్న ఆ పార్టీలు ఆది నుంచే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. బీజేపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీకి చెందిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య లోపాయకారీగా రగులుతూ వచ్చిన చిచ్చు ఇసుక రీచ్‌ల పుణ్యమా అని ఇప్పుడు ర చ్చకెక్కింది. ఈ పరిణామాలతో రెండు పార్టీల శ్రేణులూ శత్రువుల్లా మారినట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతలు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘పట్టణ వ్యవహారాల్లో మీ జోక్యం ఎందుకని’ గోరంట్లను ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యే జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పుష్కరాలు సజావుగా సాగాలంటే కేంద్రం నిధులు ఇవ్వక తప్పదన్నారు. ‘మాకు మెజారిటీ ఉన్నా మిమ్మల్ని కలుపుకొంటున్నాం’ అని గుర్తు చేశారు. కాగా టీడీపీ నేతలు బీజేపీ నాయకుల మాటల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. గోరంట్ల అనుచరులు ఆయనతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఇరు పార్టీల మధ్య దూరం పెంచుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా మొదలయ్యాయి మిత్రభేదాలు.. సిటీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ గోరంట్ల అధిష్టానం వద్ద పట్టుబట్టి రూరల్ టిక్కెట్ సంపాదించారు. అయితే సిటీపై కూడా పట్టు సాధించాలని ముందు నుంచీ పావులు కదుపుతూనే ఉన్నారు. సిటీ ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమాలకు హాజరవుతూ తన చర్యలను సమర్థించుకున్నారు. తాను సిటీ టీడీపీ ఇన్చార్జినంటూ నగరపాలక సంస్థ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లతో తరచూ సమావేశమవుతూ సిటీ ప్రాంత పరిపాలనలో కూడా జోక్యం చేసుకుంటుండడం సిటీ ఎమ్మెల్యే ఆకులకు రుచించడంలేదు. పలు సందర్భాల్లో ‘నీకు రాజకీయాలు కొత్త.. నేను సీనియర్‌ను’ అని ప్రజావేదికల వద్ద కూడా ప్రస్తావిస్తుండడం’ అటు బీజేపీ నేతల్లో, ఎమ్మెల్యేలో వ్యతిరేకతకు దారి తీసింది. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు దివంగత నేతలు జక్కంపూడి రామ్మోహనరావు, ఏసీవై రెడ్డిలతో కూడా గోరంట్ల ఇదే వైఖరి అవలంబించారని, కానీ మిత్రపక్షమైన తమతోనూ ఇదే వైఖరి ఏమిటని నేడు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా మిత్రపక్ష ఎమ్మెల్యేలు కలిసికట్టుగా రానున్న పుష్కరాలకు నగరాన్ని అభివృద్ధి చేస్తారనుకున్న నగర ప్రజలకు నిరాశే మిగులుతోంది. గతంలో ఏడాది ముందు నుంచి పుష్కర ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు ఇంకా ఏడు నెలలు గడువు లేకపోయినా చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం అంచనాకు కూడా రాలేదు. గోదావరి పుష్కరాలకు అంతా తానై వ్యవహరించాలని చూస్తున్న గోరంట్ల వైఖరి మిత్రభేదాన్ని రానున్న రోజుల్లో మరింత జటిలం చేస్తుందని, ఈ ప్రభావం పుష్కరాలపై పడుతుందని నగర వాసులు నిట్టూరుస్తున్నారు. -
రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే
పులపర్తి, నామనల మధ్య విభేదాలు రాంయపునకు అనుమతించకుంటే పదవికి రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే ఆ వ్యవహారంలో తన ప్రమేయం లేదని పార్టీ నాయకులకు జెడ్పీ చైర్మన్ వివరణ! సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఇసుక రీచ్‌లపై ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీలో దుమారాన్ని రేపుతోంది. నిన్నగాక మొన్న రాజమండ్రి కుమారి టాకీస్ వద్ద గోదావరిలో ఇసుక తవ్వకాన్ని డ్వాక్రా మహిళలకు కేటాయించే విషయమై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ (బీజేపీ), రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య పరోక్షంగా అగ్గి రాజేసింది. ఇక్కడ ఇసుక తవ్వకాలపై టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, అన్ని అర్హతలున్నా తమకు అప్పగించలేదని ఉల్లితోట మహిళా సమాఖ్య ఆందోళనకు దిగింది. తవ్వకాలను ప్రారంభించేందుకు వచ్చిన సిటీ ఎమ్మెల్యే ఆకులను మహిళలు నిలదీశారు. కావాలనే గోరంట్ల వర్గీయులకు ఇక్కడ తవ్వకాలు కట్టబెట్టారని మహిళా సంఘాలు, ఆకుల వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాజమండ్రిలో రాజుకున్న అగ్గి ఇంకా చల్లారకుండానే టీడీపీకి చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ నామన రాంబాబుల మధ్య ఇసుక జగడం మొదలైంది. కోనసీమలోని పి.గన్నవరం ఇసుక ర్యాంపునకు అనుమతి రాకపోవడమే వీరి మధ్య వివాదానికి కారణమైంది. పి.గన్నవరం అక్విడెక్టుకు ప్రమాదం సంభవిస్తుందని అధికారులు ఇక్కడ తవ్వకాలకు అనుమతి నిరాకరించారు. అయితే కావాలనే ర్యాంప్‌ను నిలిపివేశారంటూ ఎమ్మెల్యే పులపర్తి ర్యాంపునకు అనుమతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ర్యాంపునకు అనుమతి ఇవ్వకుంటే పదవికి రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడేది లేదని పరోక్షంగా హెచ్చరించారని సమాచారం. అధికారుల అభ్యంతరం మాటున.. కోనసీమలోని ఐదు నియోజకవర్గాల్లో కొత్తపేట పరిధిలోని రావులపాలెం తరువాత పి.గన్నవరం పరిధిలో ఇసుక తవ్వకాలు అత్యధికంగా ఉండే పి.గన్నవరం, లంకల గన్నవరం, ముంజువరం కలిపి ఒక ప్యాకేజీ. బోట్స్‌మెన్ సొసైటీ పేరున వేలంలో దక్కించుకుని ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుపుతుంటారు. గత ఏడాది పడవలు వెళ్లే అవకాశం లేదని మొర పెట్టుకోవడంతో ర్యాంపు వేసేందుకు అనుమతి ఇచ్చారు. విజయవాడకు చెందిన బడా వ్యాపారులు బోట్స్‌మెన్ పేరున ఇక్కడ ఇసుక వ్యాపారం చేపట్టారు. అడ్డూఅదుపులేకుండా, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అక్విడెక్టుకు 500 మీటర్లలోపు ఇరువైపులా తవ్వకాలు చేయరాదనే నిబంధనలు ఉండగా, పాటదారులు 200 మీటర్ల సమీపంలో ఇసుక తవ్వారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్.గన్నవరంలో డ్రెడ్జర్ తరహా మోటార్లతో ఇసుక తవ్వగా ఇరిగేషన్ హెడ్‌వర్క్స్ అధికారుల అభ్యంతరంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఇవే కారణాలతో ఈ ఏడాది తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే అనుమతి ఇవ్వకుండా కొర్రీలు వేయడం వెనుక జెడ్పీ చైర్పర్సన్ నామన పాత్ర ఉందని ఎమ్మెల్యే పులపర్తి గట్టిగా నమ్ముతున్నారు. అధికారుల అభ్యంతరాలను సాకుగా చూపి నామన తవ్వకాలను అడ్డుకున్నారని పులపర్తి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, శనివారం కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి వచ్చిన పులపర్తి.. గన్నవరం రీచ్‌కు అనుమతి నిరాకరించడంపై మైన్స అధికారులను నిలదీశారు. దీనిపై పరిశీలనకు అధికారులను పంపుతానని కలెక్టర్ ఆయనకు హామీ ఇచ్చారు. ఆధిపత్య పోరే అసలు కారణం.. ఇసుక రీచ్ వ్యవహారంలో వీరి వివాదం తెరపైకి వచ్చినా అసలు కారణం ఆధిపత్య పోరేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మామిడికుదురు మండలానికి చెందిన నామన టీడీపీ ఆవిర్భావం నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచి టీడీపీ ముఖ్యనేతలతో నామన మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. నామనతో సమానంగానే పులపర్తి కూడా ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తూ వస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో పులపర్తికి మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. అదృష్టం కలిసివచ్చి నామన జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఇక అప్పటి నుంచే వీరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమై ఇప్పుడు ఇసుకరీచ్ వ్యవహారంలో బహిర్గతమైంది. పి.గన్నవరం కేంద్రంగా రెండు అధికార కేంద్రాలు ఏర్పడటంతో ఇవన్నీ సహజమేనని పార్టీ నేతలు తేలిగ్గా తీసుకుంటున్నా పార్టీ శ్రేణులు మాత్రం ‘అడకత్తెరలో పోక చెక్క’...సామెతగా నలిగిపోతున్నారు. ఒకపక్క ఎమ్మెల్యే, మరోపక్క జెడ్పీ చైర్పర్సన్ ఎవరి పక్కన నిలవాలనేది తేల్చుకోలేక తలలుపట్టుకుంటున్నారు. ఇసుకరీచ్‌లో తవ్వకాలకు అనుమతి రాకపోవడంలో తన ప్రమేయం లేదని నామన పార్టీ నేతలకు వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటానంటున్న ఎమ్మెల్యే ఆమరణ దీక్ష చేస్తానంటూ హెచ్చరించడం వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనడానికి నిదర్శనం. పార్టీ నాయకత్వం ఈ వివాదాన్ని ఏరకంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
నా నియోజకవర్గంలోకి రావద్దు: బుచ్చయ్య
-
నా నియోజకవర్గంలోకి రావద్దు: బుచ్చయ్య
రాజమండ్రి : రాజమండ్రిలో ఇసుక వ్యవహారం టీడీపీ, బిజెపీల కార్యకర్తల మధ్య చిచ్చు రేపింది. దాంతో అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇసుక ర్యాంప్‌ను బుచ్చయ్య చౌదరి ప్రారంభించడాన్ని ఉల్లికోట మహిళా సంఘం సభ్యులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే కుమారి టాకీస్ ఇసుక ర్యాంపు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ప్రారంభించేందుకు వెంకటేశ్వర సొసైటీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అర్బన్ ఏరియాలోని ర్యాంపు విషయంలో రూరల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరువురి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తన ఏరియాలో జరుగుతున్న వ్యవహారాల్లో అర్బన్ ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారంటూ బుచ్చయ్య బాహాటంగా విమర్శలకు దిగారు. తన నిమోజకవర్గంలోకి అడుగు పెట్టవద్దని బుచ్చయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకులను హెచ్చరించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సేలతో పాటు కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం పెరిగింది. ఒక దశలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు తోపులాటకు దిగారు. కాగా టీడీపీ ఆవిర్భావం నుంచి రాజమండ్రి నగరంలో గోరంట్ల అనుబంధం కేడర్‌తో మమేకమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ఎన్నికల్లో సీట్ల సర్ధుబాట్లలో భాగంగా టీడీపీ రాజమండ్రి అర్బన్ సీటును బీజేపీకి కేటాయించింది. అధికారికంగా గోరంట్ల రూరల్ నియోజకవర్గానికి చెందడంతో నగర పార్టీ దేశం కేడర్ నగర ఎమ్మెల్యే ఆకులతో సయోధ్యగా లేదు. దాంతో శాసన సభ్యులుగా ఎన్నికైన నాటి నుండి వారిద్దరి మధ్య ప్రోటోకాల్ విషయంలో చాలాసార్లు వివాదం చోటుచేసుకుంది. -
ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా రాజు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఎంపికయ్యారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను పార్టీ విప్‌గా నియమితులయ్యారు. మంగళగిరిలో గురువారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కె. హరిబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర శాసనసభలో బీజేపీకి నలుగురు సభ్యుల బలం ఉంది. వీరిలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌లకు టీడీపీ మంత్రివర్గంలో పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు సందర్భంగా ఇచ్చిన హామీల అమలకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశం ముగిసిన తర్వాత హరిబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
గోదావరి పుష్కరాలకు సన్నాహాలు
హైదరాబాద్: రాజమండ్రిలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లకోసం సన్నాహాలు ప్రారంభించినట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతోపాటు రైల్వేమంత్రిని కలిశామని చెప్పారు. రాజమండ్రి, కొవ్వూరుల్లో కల్పించాల్సిన సదుపాయాలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని వారు సంబంధిత అధికారుల్ని ఆదేశించారని వివరించారు. రాజమండ్రిలోని అగ్రికల్చరల్ కాలేజీకి భూమి కేటాయింపు అంశం రెండేళ్లుగా కేంద్ర కేబినెట్ అనుమతికోసం పెండింగ్‌లో ఉండగా... మోడీ సర్కారు ఈ నెల 17న ఈ భూమిని కాలేజీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చిందని ఆయన తెలిపారు. -
బీజేపీ ఎల్పీ నేతగా సత్యనారాయణ!
అధినాయకత్వం ఆమోదం కోరిన ఏపీ శాఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ పక్ష నేతగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను నియమించవచ్చని భావిస్తున్నారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర పార్టీ నాయకత్వం జాతీయ నాయకత్వం అనుమతి కోరినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర శాసనసభలో బీజేపీకి నలుగురు సభ్యుల బలం ఉంది. వీరిలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌లకు టీడీపీ మంత్రివర్గంలో పదవులు దక్కాయి. సత్యనారాయణను శాసనసభాపక్ష నేతగా, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును పార్టీ విప్‌గా నియమించాలని రాష్ట్ర శాఖ ఆలోచన.