
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణకు లేఖ రాసారు. రేపు (సోమవారం) తన సతీమణితో కలిసి సత్యనారాయణ ఓ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment