
బీజేపీ ఎల్పీ నేతగా సత్యనారాయణ!
అధినాయకత్వం ఆమోదం కోరిన ఏపీ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ పక్ష నేతగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను నియమించవచ్చని భావిస్తున్నారు. ఈమేరకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర పార్టీ నాయకత్వం జాతీయ నాయకత్వం అనుమతి కోరినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర శాసనసభలో బీజేపీకి నలుగురు సభ్యుల బలం ఉంది. వీరిలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌లకు టీడీపీ మంత్రివర్గంలో పదవులు దక్కాయి. సత్యనారాయణను శాసనసభాపక్ష నేతగా, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును పార్టీ విప్‌గా నియమించాలని రాష్ట్ర శాఖ ఆలోచన.