మీ ఆశకు అంతుండాలి.. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ ఫైర్‌ | BJP MLA Vishnu Kumar Raju Fire On Vizag Steel Plant Union Workers, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

మీ ఆశకు అంతుండాలి.. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ ఫైర్‌

Published Tue, Jan 21 2025 2:48 PM | Last Updated on Tue, Jan 21 2025 4:02 PM

Bjp Mla Vishnu Kumar Raju Fire On Vizag Steel Plant Union Workers

విశాఖ, సాక్షి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల్ని బీజేపీ నేతలు అవమానిస్తున్నారు. మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీపై కార్మికుల ఆశకు అంతుండాలి. అర్థం పర్థం లేకుండా యూనియన్‌ నేతలు మాట్లాడుతున్నారు. కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల వలనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడడం సరికాదు. మీకు ఇష్టమైతే ఉండండి లేదా రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ మండిపడ్డారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆగ్రహం

అంతకు ముందు కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు కంటితుడుపు చర్యగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీంతో  కూుర్మాన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ శిబిరం వద్ద బీజేపీ సంబరాలు జరుపుకుంది. ఈ క్రమంలో​ కార్మిక సంఘాల నేతలను బీజేపీ నేత మాధవ్ అవమానించారు. పోరాటాన్ని శంకించే విధంగా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ యూనియన్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు.

‘‘సమస్య పరిష్కారం కావాలని కార్మిక సంఘాలకు లేదు. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే వారికి కూడు దొరుకుతుందని వారి భావన.. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లు అన్ని కుహనా యూనియన్లు. ప్రైవేటికరణ ఆపేస్తామని ఏమి చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుంది’’ అంటూ నోరు పారేసుకున్నారు. తాజాగా, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ సైతం అవమానించేలా మాట్లాడడం స్టీల్‌ ఫ్లాంట్‌ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement