
మీడియాతో మాట్లాడతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పొత్తుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు.
‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో మాట్లాడారు. కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా చేయాలని టీడీపీ చూస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలు చేశారు.
చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నేతలు గత కొంతకాలంగా గళమెత్తుతున్నారు. వీటిపై నేరుగా స్పందించని ముఖ్యమంత్రి ‘బంధం’లో ఉండాలనుకుంటున్నారో? తెంచుకోవాలనుకుంటున్నారో? ఆలోచించుకోవాలని నర్మగర్భంగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment