vishaka steel plant
-
బాబుకు బిగ్ షాక్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్
-
జగన్ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది: మంత్రి కుమారస్వామి
-
మీ ఆశకు అంతుండాలి.. స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఫైర్
విశాఖ, సాక్షి : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని బీజేపీ నేతలు అవమానిస్తున్నారు. మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీపై కార్మికుల ఆశకు అంతుండాలి. అర్థం పర్థం లేకుండా యూనియన్ నేతలు మాట్లాడుతున్నారు. కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల వలనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడడం సరికాదు. మీకు ఇష్టమైతే ఉండండి లేదా రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ మండిపడ్డారు. అంతకు ముందు కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు కంటితుడుపు చర్యగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీంతో కూుర్మాన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ శిబిరం వద్ద బీజేపీ సంబరాలు జరుపుకుంది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలను బీజేపీ నేత మాధవ్ అవమానించారు. పోరాటాన్ని శంకించే విధంగా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీ యూనియన్ నేతలు నిరంతరం విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించారు.‘‘సమస్య పరిష్కారం కావాలని కార్మిక సంఘాలకు లేదు. సమస్య పరిష్కారం కాకుండా ఉంటే వారికి కూడు దొరుకుతుందని వారి భావన.. కార్మిక సంఘాలే కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లు అన్ని కుహనా యూనియన్లు. ప్రైవేటికరణ ఆపేస్తామని ఏమి చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుంది’’ అంటూ నోరు పారేసుకున్నారు. తాజాగా, ఎమ్మెల్యే విష్ణుకుమార్ సైతం అవమానించేలా మాట్లాడడం స్టీల్ ఫ్లాంట్ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ జగన్ చర్యల వల్లే ప్రైవేటీకరణ ఆగింది: అమర్నాథ్
-
ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ కు ఒరిగేది లేదు.. బాబుపై కార్మికులు ఆగ్రహం
-
మా జీతాలు మాకివ్వండి.. స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నా!
-
విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రెండో రోజు పోరాట కమిటీ నిరహార దీక్ష
-
బాబు తీరుపై మండిపడుతున్న కార్మికులు
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై బాబు పాత పాటే
-
విశాఖ ఉక్కుపై కూటమిని నిలదీసిన వైఎస్సార్సీపీ
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు
-
విశాఖ ఉక్కు కార్మికులకు అందని జీతాలు
-
విశాఖ ఉక్కు కార్మికుల కఠిన నిర్ణయం..
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటం
-
జాబులు పోవాలంటే బాబే కదా రావాలి: విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి: జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? అని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కుపరిపశ్రమలో ఉద్యోగాలు తొలగించడంపై విజయసాయిరెడ్డి శుక్రవారం(అక్టోబర్ 4) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. విశాఖ స్టీల్‌లో తొలి విడతగా 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘జాబ్ పోవాలి అంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? సంపద సృష్టి, బాబు వస్తే జాబు.. అంటే ఇదేనా తెలుగు తమ్ముళ్లూ? ఇది ప్రైవేటీకరణకు మరో మెట్టు కాదా బాబూ ....చంద్రబాబూ ?’అని విజయసాయిరెడ్డి తన ట్వీట్లో ప్రశ్నించారు. ఇదీ చదవండి: వంచించిన చంద్రబాబు.. దగాపడ్డ రైతన్న -
మూడో రోజుకు ఉక్కు ఉద్యమం.. సీఎండీ ని కలవనున్న కార్మిక నేతలు
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం ఉధృతం
-
సీఎం చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో ధ్వజం
-
ప్రైవేటీకరణ దిశగా వైజాగ్ స్టీల్ ప్లాంట్
-
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వని పవన్ కళ్యాణ్
-
3 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల నిరసన..
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ వాయిస్.. కొమ్మినేని ప్రశ్నలకు బీజేపీ నేత సైలెంట్..
-
చంద్రబాబు, పవన్ మాట నిలబెట్టుకోవాలంటున్న కార్మికులు
-
విశాఖ స్టీల్ అమ్మే తీరుతాం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ కుట్ర
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స్టాండ్..కూటమిని ఓడిద్దాం..
-
విశాఖ ఉక్కుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి... కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పైత్యపు రాతలపై ఉక్కు పిడుగు
-
50% రిజర్వేషన్లతో 4వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదు : కేంద్రం
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి రోడ్డెక్కిన ఉద్యోగులు
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదు
-
స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ అసత్య ప్రచారం
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
-
విశాఖ ఉక్కుపై టాటా స్టీల్ కన్ను
న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్) కొనుగోలుపై దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది. లాంగ్ ప్రోడక్ట్‌ల విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. తీర ప్రాంతంలో ప్లాంటు ఉండటం వల్ల అటు తూర్పు, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉండగలవని నరేంద్రన్ వివరించారు. అలాగే ఆగ్నేయాసియా మార్కెట్లలో మరింత చొచ్చుకుపోయేందుకు సైతం ఇది దోహదపడగలదని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కులో 100 శాతం వాటాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం లావాదేవీ సలహాదారుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఒడిశా కేంద్రంగా ఉన్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్) కొనుగోలు కోసం కూడా టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈవోఐ) దాఖలు చేసినట్లు నరేంద్రన్ చెప్పారు. -
స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద కార్మికుల నిరసన..
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద ఎత్తున కార్మికులు అడ్మిన్ భవనం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. స్టీల్ ప్లాంట్‌కు చేరుకునే అన్ని మార్గాలను దిగ్భంధించేందుకు కార్మికులు యత్నించారు. కాగా, భారీవర్షంలోనూ గొడుగులు పట్టుకుని మరీ.. కార్మిక సంఘాల నేతలు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. -
ఉక్కు పోరాటం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదన్న కేంద్రం
సాక్షి, న్యూ ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం పేర్కొంది. అదే విధంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. -
స్టీల్ ప్లాంట్ దగ్గర సీపీఐ నారాయణకు చేదు అనుభవం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈనెల 29న సమ్మె
-
‘విశాఖ స్టీల్ ప్లాంట్’పై చిరంజీవి సంచలన ట్వీట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు 100టన్నుల ఆక్సిజన్ని ఉత్పత్తి చేసి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. అలాంటి కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయడం ఎంత వరకు సమంజసం అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈరోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్ని మహారాష్ట్రకు తీసుకెళ్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పిత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతోంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్‌పరం చేయడం ఎంత వరకు సమంజసం??? మీరే ఆలోచించండి’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రముఖులు తప్పబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Let us THINK.. #VizagSteelPlant #OxygenForIndia pic.twitter.com/6MjSKp7jVB — Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021 చదవండి: చిరంజీవిపై గవర్నర్ తమిళి సై ప్రశంసల జల్లు కరోనాతో డ్రైవర్ మృతి.. టెన్షన్లో మెగా ఫ్యామిలీ! -
దేశానికి ఊపిరిపోస్తోన్న విశాఖ స్టీల్ ప్లాంట్
-
మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం
లక్డీకాపూల్ (హైదరాబాద్): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మరోసారి స్పందించారు. ‘స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తే ఏపీ విషయాలు నీకెందుకని అంటున్నారు. దేశంలో ఏపీ రాష్ట్రం కాదా’అని ప్రశ్నించారు. ‘తెలంగాణ జీవితం– సామరస్య విలువలు’అనే అంశంపై శుక్రవారం ఇక్కడ తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడతారు. ఏపీకి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సంబంధమని నోరు మెదపకుండా ఉంటే ఎలా’ అని ఎదురు ప్రశ్నించారు. ఏపీ విషయంలో నోరు మూసుకుని కూర్చోబోమని స్పష్టం చేశారు. ‘రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు. మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాల’ని కేటీఆర్ అన్నారు. బీజేపీ జాతీయవాదంలో తెలంగాణ జాతి ప్రయోజనం ఎందుకు లేదని నిలదీశారు. బీజేపీ ధోరణి చూస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్‌పరం చేస్తామంటారేమో అని ఎద్దేవా చేశారు. సీఈవోలను పెట్టి పాలిస్తామంటారేమో నన్నారు. తనకు కూడా బూతులు వచ్చు.. మోదీని తిట్టలేనా? అని అన్నారు. వారంతా వాట్సాప్ యూనివర్సిటీ బీజేపీలో పనిచేసే విద్యార్థులు రాష్ట్ర యూనివర్సిటీలలో చదవలేదని, వారంతా వాట్సాప్ యూనివర్సిటీలలో చదువుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజకీయాలకు తావు లేకుండా వీసీలుగా నియమించి నిజాయితీ చాటుకున్నామని చెప్పారు. హెచ్‌సీయూ వీసీ నియామకంలో రాజకీయం చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాల వల్ల రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివాదాలకు పోకుండా అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. విభజన చట్టంలో సమస్యలు ఉన్న ప్పటికీ మనం ఆరున్నరేళ్ల సమయం లోనే ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. 2016లో కేంద్రం ఇచ్చిన పీఆర్సీ కేవలం 14 శాతం మాత్రమే అని స్పష్టం చేశారు. 14 శాతం పీఆర్సీ ఇచ్చినోడు వచ్చి 43 శాతం పీఆర్సీ ఇచ్చినవారిని ప్రశ్నించే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, అడ్వకేట్లు, జర్నలిస్టు మిత్రులతో తమది పేగుబంధం అని పేర్కొన్నారు. గత పదిరోజులుగా ఉద్యమ సహచరులను కలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్‌తోపాటు పాపిరెడ్డి, నర్సింహారెడ్డి, వెంకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్ శనివారం లేఖ రాశారు. మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైఎస్సార్సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను చాటిచెప్పారు. ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాబోతుంది. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినేట్ ఎకనామిక్ అఫైర్స్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది. విశాఖ ఉక్కు సంస్థలో 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం 2002 నుంచి 2015 వరకు లాభాలు ఆర్జించింది. 2015 నుంచి 2018 వరకు నష్టాలు చవిచూసింది. 2018-19లో 97 కోట్ల రూపాయలు లాభం సాధించినా తర్వాత మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకుంది. చదవండి: 'విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాజేయాలని చూస్తే ఊరుకోం' -
విశాఖ స్టీల్‌ప్లాంట్ పదోన్నతుల్లో అక్రమాలు
-
కలెక్టర్ సతీమణి జిల్లాకు బదిలీ
సాక్షి, కరీంనగర్ : జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య సతీమణి విజయలక్ష్మి బదిలీపై జిల్లాకు వస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆమెను.. కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరబ్రహ్మయ్య ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందారు. ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం రోజుల్లో ఆయన విధులకు హాజరుకానున్నారు. ఆయన అనారోగ్యం కారణంగా విజయలక్ష్మిని బదిలీ చేయాలని నిర్ణయించారు.