
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తరువాతనే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్ శనివారం లేఖ రాశారు. మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను చాటిచెప్పారు. ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment