విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద ఎత్తున కార్మికులు అడ్మిన్ భవనం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. స్టీల్ ప్లాంట్‌కు చేరుకునే అన్ని మార్గాలను దిగ్భంధించేందుకు కార్మికులు యత్నించారు. కాగా, భారీవర్షంలోనూ గొడుగులు పట్టుకుని మరీ.. కార్మిక సంఘాల నేతలు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు.
స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద కార్మికుల నిరసన..
Published Tue, Aug 17 2021 11:04 AM | Last Updated on Tue, Aug 17 2021 1:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment