Privatisation
-
ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌పరం.. ప్రజల ప్రాణాలతో వ్యాపారమా బాబూ?: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే అత్యంత అద్భుతమైన పథకంగా ఉన్న ఆరోగ్యశ్రీని తమ స్వార్థం కోసం ప్రైవేటు బీమా కంపెనీకి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆక్షేపించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఆయన వెల్లడించారు.గోపిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:దురుద్దేశ ఆలోచన. చర్యలు:కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు బీమా కంపెనీకి కేటాయించి నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఒక అద్భుతమైన పధకంగా గుర్తింపు పొందింది. వైఎస్సార్ ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది దేశంలోనే ఆదర్శవంతమైన పథకంగా అందరి మన్ననలను అందుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి ఈ పథకాన్ని పరిశీలించి తమ రాష్ట్రాల్లో అమలు చేశారు. ప్రాణాంతకమైన గుండె జబ్బులకు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలను కోల్పోతున్న ఎందరో పేదలకు ఈ ఆరోగ్యశ్రీ అపర సంజీవనిలా వారి ప్రాణాలను కాపాడింది. ఈ పథకం వల్ల ఎందరో పేదలు కార్పొరేట్ వైద్యాన్ని పొందారు. ముఖ్యమంగా గుండె ఆపరేషన్లు, వివిధ రకాల ఆపరేషన్లను చేయించుకున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పేర్లు మారాయే తప్ప ఈ పథకాన్ని తీసేసే సాహసం ఎవరూ చేయలేదు. అంత గొప్పగా ఈ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లింది.బీమా సంస్థకు అప్పగిస్తే..:ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తివేసి, బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంది. అదే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించినా, చికిత్స వ్యయంలో కేవలం రూ.2.5 లక్షల వరకు ఆ సంస్థ నుంచి చెల్లింపులు జరుగుతాయి. అంతకంటే ఎక్కువ అయితే దాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పొందాల్సి వస్తుంది.ఆ ప్రొసీజర్లన్నింటినీ అనుమతిస్తారా?:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని బాగా విస్తరించి, మొత్తం 3257 ప్రొసీజర్లను అనుమతించాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించి చేతులు దులుపుకుంటే, మరి ఆ మొత్తం ప్రొసీజర్లను ఆ బీమా కంపెనీ కవర్ చేస్తుందా? అది ఖరీదైన వైద్యానికి చెల్లింపులు చేస్తుందా?. ఉదా: కాంక్లియార్ ఇంప్లాంటేషన్‌కు దాదాపు రూ.6.5 లక్షల చొప్పున రూ.13 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంకా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయా? అందుకు బీమా కంపెనీ ఒప్పుకోకపోతే, రోగుల పరిస్థితి ఏమిటి?.ఎందుకంటే, బీమా కంపెనీలు 60 ఏళ్లు దాటిన వారికి, ఏదైనా దీర్ఘకాల వ్యాథులతో బాధ పడుతున్న వారికి, బీమా చెల్లింపుల్లో పలు ఆంక్షలు విధిస్తాయి. బీమా ప్రీమియం చెల్లించిన తరువాత ఏడాది, కొన్ని వ్యాధులకు కనీసం మూడేళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తాయి. ఉదా: హిప్ రీప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ఆ సర్జరీ చేసేవాళ్లు. మరి ఇదే చికిత్సకు ప్రైవేటు బీమా కంపెనీలు కనీసం ఏడాది పాటు వెయిటింగ్ పీరియడ్ తరువాతే అంగీకరిస్తాయి. బీమా కంపెనీలు ఎప్పుడైనా, ఏదో ఒక విధంగా క్లెయిమ్స్ తగ్గించుకోవాలనే చూస్తాయి. అందుకే చిన్న చిన్న అంశాలను కూడా సీరియస్‌గా తీసుకుని క్లెయిమ్స్ నిరాకరిస్తుంటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని ప్రొసీజర్లను బీమా కంపెనీ ఆమోదిస్తుందా? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?.చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ:చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ గుర్తుకు వస్తుంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు కూడా అంతే. గ్రామాల్లో అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు, నాడు గత ప్రభుత్వం ప్రారంభించిన 10,300 విలేజ్ హెల్త్‌క్లినిక్స్‌ను ఇప్పటికే నిర్వీర్యం చేశారు. వాటిని జగన్‌గారు ప్రారంభించారనే కోపంతో వాటిని పనికి రాకుండా చేశారు. 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ హయాంలో తీసుకువస్తే, వాటిలోని సీట్లను కూడా ప్రైవేటుపరం చేసేలా విధానాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో అది ప్రభుత్వ బాధ్యత:ప్రజాస్వామ్యంలో ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వీటిని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం దారుణం. ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా సంస్థకు అప్పగిస్తే, ఆస్పత్రులన్నీ ఆ కంపెనీ చుట్టూ తిరిగి, క్లెయిమ్స్ పొందాల్సి వస్తుంది. నిబంధనలకు కట్టుబడి ఎన్ని ఆస్పత్రులు, ఎన్ని క్లెయిమ్స్ తెచ్చుకోగలవు? కోవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్యశ్రీ నిబంధనలను వెంటనే మార్చుకుని ప్రజలకు అవసరమైన సేవలను అందించారు. అదే బీమా సంస్థ నిర్దేశించే నిబంధనలు మార్చాలంటే చాలా జాప్యం జరుగుతుంది. అప్పటి వరకు ప్రజల ఆరోగ్యానికి ఎవరు జవాబుదారీ? ప్రభుత్వానికి ఏదైనా జబ్బును ఆరోగ్యశ్రీ కింద చేర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే బీమా కంపెనీ పరిధిలోకి తీసుకురావడం అంత సులభం కాదు.ఆలోచన వీడండి:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద 45,10,645 మందికి ఉచితంగా వైద్య సేవలందించి వారి ఆరోగ్యాలకు అండగా నిలిచింది. అందుకు రూ.13,421.43 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం గొప్పగా తీర్చిదిద్దిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన వీడాలి. నిరుపేదలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా అందించే ఆ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలి. అందుకే ప్రజల మనోభావాలు, వారి అవసరాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.ఇదీ చదవండి: టార్గెట్ సజ్జల.. ఎల్లోమీడియాపై భగ్గుమన్న వైఎస్సార్సీపీకూటమి ప్రభుత్వానికి తొలి నుంచే..:ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి నుంచే కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా, దాదాపు రూ.3 వేల కోట్లు బకాయి పడింది. దీంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆపేసిన ఆస్పత్రులు, ఈనెల 6 నుంచి వాటిని పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే మందు, ప్రభుత్వం ఏ కసరత్తు చేసింది? కనీసం ఆస్పత్రులు, వైద్య రంగం ప్రతినిధులతో అయినా మాట్లాడారా? కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు నాలుగైదు గంటల్లో ప్రైవేటు బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ అనుమతి రావడం చాలా కష్టం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద దాదాపు 300 మంది కేవలం క్లెయిమ్లపైనే పని చేసేవారు. మరి బీమా కంపెనీ ఆ స్థాయిలో పని చేస్తుందా?లోకేష్ సొంత మనుషులు.. బీమా కంపెనీ:మంత్రి నారా లోకేష్ తన సొంత మనుషులతో బీమా కంపెనీని పెట్టించి, వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది తమకు కావాల్సిన వారికి దోచిపెట్టే ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన ఉన్న పథకం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందిన పథకం ఇది. దీనిని కూడా నిర్వీర్యం చేయాలని అనుకోవడం దుర్మార్గం. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేలా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, పోరాడతామని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. -
ఏపీలో ఇకపై ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌పరం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక ప్రైవేట్ పరం కానుంది. బీమా కంపెనీలకు చంద్రబాబు సర్కార్.. ఆరోగ్యశ్రీని అప్పగించేసింది. ఎన్టీఆర్ వైద్యసేవకు అనుసంధానంగా ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడ్ తీసుకొస్తున్నామని వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. రూ.2.50 లక్షల లోపు బిల్లులను ఇకపై ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లిస్తాయని పేర్కొన్నారు.మరో వైపు.. ‘ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాం’ అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!కాగా, గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని కేంద్రమంత్రి చెప్పి మూడు నెలలైంది.. ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు.కాగా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని ఆ సంఘాల నేతల విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు. -
సీఎం చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో ధ్వజం
-
ఉక్కు పోరాటం ఉధృతం
-
విశాఖ ఉక్కు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
సీతమ్మధార: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేన పార్టీలను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. నేను పార్లమెంట్లో ప్రశ్నించగా.. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి బదులిచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని చెప్పారు. ఎంతోమంది ప్రాణత్యాగంతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్ కోసం పోరాడేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు వెంటనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వారి వైఖరిని స్పష్టం చేయాలి.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకపోతే.. టీడీపీ, జనసేన పారీ్టలు మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీయే నుంచి తప్పుకుంటారో? ప్రజలను మోసం చేస్తారో? చెప్పాలి. టీడీపీ, జనసేన వెంటనే ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. లేకపోతే లక్షలాది మంది ఉద్యోగులు, కారి్మకులు రోడ్డున పడతారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది’ అని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారు ఆస్పత్రుల్లో మళ్లీ పాత రోజులు
-
సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధం
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదు
-
సింగరేణిపై ప్రధాని మాట తప్పారు
బెల్లంపల్లి/కాగజ్‌నగర్ టౌన్: సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటు సాక్షిగా నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తామని ప్రకటించడం.. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రధాన మంత్రి సింగరేణిపై మాట తప్పారని, బొగ్గు గనులు, విశాఖ ఉక్కుతోపాటు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేల వంటి ముఖ్యమైన సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతోందని విమర్శించారు. కాగా, కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ప్రారంభించనున్న వైద్య కళాశాలల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియ వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు కానుందని చెప్పారు. గురువారం ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రం, కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో రూ.5 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆస్పత్రిని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉండాలని, ప్రభుత్వపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యులను నియమిస్తామని, వారంరోజుల్లోగా కాగజ్‌నగర్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆసిఫాబాద్‌లో 340 పడకల ఆస్పత్రి నిర్మాణంతోపాటు వైద్య కళాశాల ప్రారంభానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి సిర్పూర్ (టీ), ఆసిఫాబాద్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, త్వరలోనే ఆ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవనున్నామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్.దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
రైల్వే ప్రైవేటీకరణ.. అబ్బే అదేం లేదే, పార్లమెంట్లో మంత్రి అశ్వినీ వైష్ణవ్
భారతీయ రైల్వేలో 80 శాతం రైల్వే టిక్కెట్లు ఆన్ లైన్లో అమ్ముడవుతున్నాయని, రైల్వే సేవలు, డేటాబేస్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రిజర్డ్వ్, అన్ రిజర్డ్వ్ టికెట్ల బుకింగ్‌తో పాటు ఇతర రైల్వే సేవలను అందించడానికి వివిధ ప్లాట్‌ఫామ్‌లపై మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. భారతీయ రైల్వేలు వినియోగించే టెక్నాలజీతో ప్రయాణీకులు- సరుకు రవాణా, ప్రాజెక్ట్, ఆపరేషన్స్ -నిర్వహణ, తయారీ, కార్యకలాపాలు - నిర్వహణ, ఫైనాన్స్, మెటీరియల్స్ - మానవ వనరుల వంటి విభాగాల్లో అవసరాలు తీరుస్తాయని అన్నారు. అంతేకాకుండా, భారతీయ రైల్వే కొత్త 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద 1,000 చిన్న ఇంకా ముఖ్యమైన స్టేషన్లను ఆధునీకరించాలని యోచిస్తోంది. ప్రత్యేక పునరాభివృద్ధి కార్యక్రమం కింద 200 పెద్ద స్టేషన్లను పునరుద్ధరించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆ ఆలోచనే మాకు లేదు భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. గతంలో తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని, మరోసారి భారతీయ రైల్వే ప్రైవేటీకరణ కాదని తేల్చి చెప్పారు. రైల్వే మంత్రి ప్రకటన అనంతరం రైల్వే ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్టైంది. -
సింగరేణి ప్రైవేటీకరణ .. తెలంగాణను కుప్పకూల్చడమే!
సాక్షి, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే తెలంగాణను కుప్పకూల్చడమేనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చే స్తోందని, అందులో భాగంగానే బొగ్గు గనులను ప్రైవేటీకరించే ప్రయత్నంలో ఉందని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. తక్కువ కా లంలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణపై బీజేపీ కక్ష కట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. పార్లమెంటులో బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు తాజాగా చేసిన ప్రకటన ఇందులో భాగమేనన్నారు. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్న కేంద్రం.. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు మాత్రం నామినేషన్ పద్ధతిన గుజరాత్లో లిగ్నైట్ గనులు కేటాయించిందని తెలిపారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేంద్రం అప్పజెప్పిన గనుల కేటాయింపు, వాటి పర్యావరణ అనుమతుల ప్రక్రియ తాలూకు పత్రాలను కేటీఆర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణపై ఈర్ష్యతోనే వేలం ‘గుజరాత్ మాదిరే తెలంగాణలోని సింగరేణికి సై తం బొగ్గు గనులను కేటాయించాలని గత కొంతకాలంగా తమ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెడుతోంది. సొంత రా ష్ట్రం కోసం తమ వేలం పాలసీలను పక్కన పెట్టిన ప్రధానమంత్రి మోదీ.. తెలంగాణ సమాజంపై ఈర‡్ష్యతో సింగరేణి గనులను వేలం వేస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు సింగరేణిని ప్రైవేటీకరించబోమని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో సింగరేణి బొగ్గు గనులను వేలానికి పెట్టారు. ఉత్పత్తిలో, లాభాల్లో ప్రతి ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ, దేశంలోనే అత్యధికంగా పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించిన సింగరేణికి చెందిన బ్లాకులను ఎలా వేలం వేస్తారు? బొగ్గు తవ్వకమే ప్రధాన విధిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం పేరుతో సంస్థపై భారీగా ఆర్థిక భారం మోపే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా నష్టాల పాల్జేసి, అమ్మకానికి పెట్టినట్లుగానే సింగరేణిని కూడా అంతిమంగా తన కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పే కుట్రలను చేస్తోంది. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని గత ఏడాది డిసెంబర్ 7న సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. అయినా కేంద్రం కార్మికుల ఆందోళనలను, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా మొండిపట్టుతో ముందుకు పోతోంది. బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమే..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరిస్తే తెలంగాణలో చీకటే.. ‘సింగరేణి ప్రైవేటీకరణ సమస్య బొగ్గు గనులు ఉ న్న ఏడెనిమిది జిల్లాలది కాదు. ఇది సమస్త తెలంగా ణకు సంబంధించిన అంశం. బోర్ల నీటిపై ఆధారపడిన రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, పంట భూములను పచ్చగా మారుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు కల్పించాలనే కుట్రలకు కేంద్రం తెరలేపింది. రైతులకు, రాష్ట్రంలోని దళిత, గిరిజన, కుల వృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ వంటి పథకాలపై అక్కసు కూడా ఈ కుట్ర లో భాగమే. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నా ల్లో కేంద్రం విజయం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుంది. సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు..’అని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఎంపీ గొంతు ఎత్తాలి ‘గనుల వేలంపై కేంద్రం మొండిగా ముందుకు వెళితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం తప్పదు. తెలంగాణ ఉద్యమం ఎగిసినట్టుగానే, మరోసారి సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలి. సింగరేణి భుజంపై నుంచి తెలంగాణ ప్రజలపై గన్ను పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. సింగరేణి మెడపై కేంద్రం ప్రైవేట్ కత్తి పెడితే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై వేటు వేయడం ఖాయం. 150 సంవత్సరాలకు పైగా తెలంగాణకు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి చీకటి సూర్యుల బతుకులను చిదిమేసే కుట్రలు కేంద్రం ఇకనైనా ఆపాలి..’అని కేటీఆర్ కోరారు. -
ఎన్ఎండీసీ నగర్నార్ ప్లాంటుకు బిడ్ల ఆహ్వానం
న్యూఢిల్లీ: ఎన్ఎండీసీకి చెందిన నాగర్నాల్ ఉక్కు ప్లాంటులో వ్యూ హాత్మక వాటాలను విక్రయించేందుకు కేంద్రం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. సందేహాలను సమర్పించేందుకు డిసెంబర్ 29, బిడ్లను దాఖలు చేసేందుకు 2023 జనవరి 27 ఆఖరు తేదీ అని దీపం తెలిపింది. చత్తీస్‌గఢ్‌లోని నగర్నార్లో ఎన్ఎండీసీ 3 మిలి యన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఎన్ఎండీసీ నుండి ఎన్ఎండీసీ స్టీల్‌గా విడగొట్టి, ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
సింగరేణి ప్రైవేటీకరణ అబద్ధం.. ఆయన మాటలే నిజం కావాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 నవంబర్ 12న ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేశారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధమని తేల్చిచెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయితే గతంలో జరిగిన మీడియా ఇంటర్వ్యూలో ప్రభుత్వ పరిశ్రమల భవిష్యత్తు గురించీ, ప్రభుత్వం అవలంబించే కార్యాచరణను కూడా ప్రకటిస్తూ... ప్రభుత్వ పరిశ్రమలను అమ్మివేస్తామని లేదా బంద్ పెడతామని కరాఖండిగా తెలిపారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణ చర్యలు వేగిరమైనాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో 2015 మార్చిలో ‘బొగ్గు గనుల నిబంధనల ప్రత్యేక చట్టం 2015’ను ఆమోదింపజేసి అక్టోబర్ 21 (బ్యాక్ డేట్) నుండి అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ బొగ్గు పరిశ్రమలైన ‘కోల్ ఇండియా లిమిటెడ్’ (సీఐఎల్), ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ (ఎస్సీసీఎల్)లకు అండగా ఉన్న ‘1973 బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం’ను 2018 జనవరి 8న రద్దు చేశారు. 2019 ఫిబ్రవరి 20న ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గ సంఘం (సీసీఈఏ) పెద్ద, మధ్య, చిన్న స్థాయి బొగ్గుగనులను ప్రైవేటుకు ఇవ్వడానికి అనుమతించింది. 2019 ఆగస్ట్ 28న కేంద్ర క్యాబినెట్ బొగ్గు రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది. 2019 సెప్టెంబర్ 13న రెవెన్యూ, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ పాల్గొన్న సమావేశం బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరించే సంస్కరణలను సిఫారసు చేసింది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది. ప్రధాని అసత్యం మాట్లాడారనే కదా! ఆయన అన్నట్టుగానే సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రం బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు అనుకూలంగా తెచ్చిన కొత్త చట్టాలను రద్దుచేసి ‘బొగ్గుగనుల జాతీ యీకరణ చట్టం 1973’ను యధాతథంగా కొనసాగించాలి. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) – మేరుగు రాజయ్య, గోదావరిఖని -
ఐడీబీఐ వివరాలకు మరింత గడువు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆధ్యర్యంలోని ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రాసెస్‌కు ఆర్థిక శాఖ తాజాగా గడువును పొడిగించింది. ఆసక్తిగల సంస్థలు నవంబర్ 10లోగా వివరాలు తెలుసుకునే(క్వెరీస్) వెసులుబాటును కల్పించింది. తదుపరి డిసెంబర్ 16లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. ఐడీబీఐ బ్యాంకులో 61 శాతం వాటా విక్రయించేందుకు ఈ నెల 7న ఆర్థిక శాఖ బిడ్స్‌కు ఆహ్వానం పలుకుతూ ప్రాథమిక సమాచార వివరాల(పీఐఎం)కు తెరతీసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా క్వెరీస్‌కు అక్టోబర్ 28వరకూ గడువు ప్రకటించింది. అయితే దీపమ్ తాజాగా పీఐఎంను సవరిస్తూ నవంబర్ 10వరకూ గడువు పెంచింది. తద్వారా మార్చికల్లా ఫైనాన్షియల్ బిడ్స్‌కు వీలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి అర్ధభాగంలో బ్యాంకు ప్రయివేటైజేషన్‌ను పూర్తి చేయగలమని ఆశిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం, ఎల్ఐసీకి బ్యాంకులో గల 94.72 శాతం సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు బీఎస్ఈలో స్వల్పంగా బలపడి రూ. 45 వద్ద ముగిసింది. చదవండి: World smallest TV ప్రపంచంలోనే చిన్న టీవీ ఆవిష్కారం, ధర వింటే? -
‘విద్యుత్’ను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తు అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: పేదలకు, వృత్తిదారులకు, రైతు సంక్షేమానికి విఘాతంగా మారిన విద్యుత్ సవరణ బిల్లు–2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈ జేఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను అంబాని, అదానీలకు కట్టబెట్టడం దారుణమని విమర్శించింది. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అంతకు ముందు మింట్ కాంపౌండ్ నుంచి ఎన్టీఆర్మార్గ్ మీదుగా ఇంజనీర్లు ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జాతీయ చైర్మన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ స్టాడింగ్ కమిటీ ఆమోదం లేకుండా విద్యుత్ సవరణ బిల్లును దొడ్డిదారిలో పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకునేందు కు పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి ఉందని, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపాలని సూచించారు. విద్యుత్‌ప్రైవేటీకరణతో భవిష్యత్తులో పేదల జీవితాల్లో చీకట్లు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వినోద్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందని కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబు, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రతినిధులు సాగర్, మోహన్‌శర్మ, జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్‌పరం కానున్న ఐడీబీఐ బ్యాంక్, ఎప్పటికంటే
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్రం, ఎల్ఐసీ వాటాల విక్రయ ప్రక్రియ వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి మార్చి నాటికల్లా ఆర్థిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం, జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ 30.24 శాతం .. వెరసి 60.72 శాతం వాటాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. గత వారమే ఇందుకోసం ప్రాథమిక బిడ్లను ఆహ్వానించారు. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డిసెంబర్ 16 ఆఖరు తేదీ. రిజర్వ్ బ్యాంక్ అసెస్మెంటు పూర్తి చేసుకుని, హోమ్ శాఖ నుంచి భద్రతా క్లియరెన్సులు పొందిన బిడ్డర్లకు బ్యాంకు డేటా రూమ్ అందుబాటులోకి వస్తుంది. వివిధ అంశాలన్నింటిని మదింపు చేసుకున్న తర్వాత బిడ్డర్లు ఆర్థిక బిడ్లు దాఖలు చేస్తాయి. ఈ ప్రక్రియకు కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఐడీబీఐ బ్యాంకును ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుగా వర్గీకరిస్తున్నప్పటికీ అందులో కేంద్రం, ఎల్ఐసీకి ఏకంగా 95 శాతం వాటా ఉన్నందున ప్రభుత్వ రంగ సంస్థగానే పరిగణిస్తున్నారు. ప్రత్యేక కేసు కావడంతో వాటాల అమ్మకానికి సంబంధించి సాంకేతిక కారణాల వల్ల ప్రైవేటీకరణ పదం వాడకుండా వ్యూహాత్మక విక్రయం అని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 49.24 శాతం, కేంద్రానికి 45.48 శాతం, సాధారణ షేర్హోల్డర్లకు 5.2 శాతం వాటాలు ఉన్నాయి. విక్రయం అనంతరం బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీల వాటా 94.72 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతుంది. -
షిప్పింగ్ కార్ప్ విక్రయానికి సిద్దమవుతున్న రంగం: త్వరలోనే బిడ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ) ప్రయివేటీకరణకు ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) చివరి త్రైమాసికంలో ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానించే వీలుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం కంపెనీకి చెందిన కీలకంకాని, భూమి సంబంధ ఆస్తుల విడదీతను ప్రారంభించింది కూడా. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రానున్న మూడు నెలల్లోగా పూర్తికావచ్చని అంచనా వేశారు. దీంతో జనవరి-మార్చి(క్యూ4)కల్లా అర్హతగల కంపెనీల నుంచి ఫైనాన్షియల్ బిడ్స్‌కు ఆహ్వానం పలికే వీలున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే నెలలో కీలకంకాని ఆస్తుల విడదీతకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా షిప్పింగ్ హౌస్, ముంబై, మ్యారిటైమ్ ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్, పోవైసహా ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్(ఎస్‌సీఐఎల్‌ఏఎల్)ను విడదీయనుంది. తద్వారా ఎస్‌సీఐఎల్‌ఏఎల్ పేరుతో విడిగా కంపెనీ ఏర్పాటుకు తెరతీయనుంది. -
బ్యాంకుల ప్రైవేటీకరణ.. అలా చేస్తే మంచి కన్నా చెడు ఎక్కువ: ఆర్బీఐ
ముంబై: వేగవంతంగా, ఒక్కసారిగా పెద్ద ఎత్తున చేపట్టే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ప్రైవేటీకరణ మంచికన్నా ఎక్కువ చెడు పరిణామాలకే దారితీస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులిటిన్‌లో జారీ అయిన ఆర్టికల్స్ రచయితలు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ అంగీకరించాల్సిన అవసరం లేని ఈ ఆర్టికల్ అభిప్రాయాల ప్రకారం, ఒక క్రమ పద్దతిలో మంచి, చెడులను పరిగణనలోకి తీసుకుంటూ ఆచితూచి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ప్రైవేటీకరణ జరిగితే తగిన మెరుగైన ఫలితాలను చూడవచ్చు. ఈ పక్రియ హడావిడిగా జరగడం ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం అనుసరించే ప్రైవేటీకరణ విధానం సామాజిక లక్ష్యాన్ని నెరవేరుస్తుందో లేదో జాగ్రత్తగా పరిశీలించాలని ఆర్టికల్ సూచించింది. అందరికీ బ్యాంకింగ్‌లో భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా విలీన పక్రియ జరగాలని సూచించింది. 2020లో కేంద్రం 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీన ప్రక్రియను నిర్వహించింది. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గింది. 2017లో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. చదవండి: Emirates Airbus A380: ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. మొదటిసారిగా ఆ నగరానికి! -
తగ్గేదేలే! ఈ రెండు బ్యాంకులకు కేంద్రం మంగళం..అమ్మకానికి సర్వం సిద్ధం?
మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. దీంతో పాటు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో ఈ దిశగా తగు చర్యలు ప్రకటిస్తుందని వివరించాయి. అలాగే బీపీసీఎల్‌లో వాటాల విక్రయం అంశం కూడా పరిశీలనలోనే ఉందని, ప్రభుత్వం కొత్తగా బిడ్లను ఆహ్వానించనుందని పేర్కొన్నాయి. బరిలో ఒకే బిడ్డరు మిగలడంతో వాటాల విక్రయాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాన్కోర్) వ్యూహాత్మక విక్రయ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి పరిష్కారమయ్యాక ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపాయి. ప్రైవేటీకరించబోయే రెండు పీఎస్‌బీల జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన సిఫార్సులకు ప్రధాని నేతృత్వం లోని క్యాబినెట్ తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. మరో వైపు, బీపీసీఎల్‌లో తనకున్న మొత్తం 52.98% వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2020 మార్చిలో బిడ్లను ఆహ్వానించగా నవంబర్ నాటికి మూడు బిడ్లు వచ్చాయి. రెండు సంస్థలు వెనక్కి పోవడంతో చివరికి ప్రస్తుతం ఒక్క కంపెనీ బరిలో నిల్చింది. -
ప్రభుత్వ సంస్థలను అమ్మి ఏం సాధిస్తారు? ఆ చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉందా?
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనులను, ఆదిలాబాద్‌లో సీసీఐకి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు అమ్మడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ఏం సాధించాలనుకుంటోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. వీటిని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బును తెలంగాణ కోసమే వినియోగిస్తారా అని నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని బుధవారం ఆమె ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి చర్చించారన్నారు. పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ కూడా చాలాసార్లు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. సిమెంటు ఫ్యాక్టరీని తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా అమ్మకానికి పెట్టడం వెనక ఉన్న ఉద్దేశమేంటని నిలదీశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్మి, వచ్చే డబ్బుతో అసలేం చేయబోతున్నారో చెప్పే చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉందా? అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా దేశంలో ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని కవిత అన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే జాతీయ పార్టీల మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండా ఉందని, రాహుల్‌గాంధీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ తరహాలో ప్రాంతీయ పార్టీలకు నాయకత్వ సంక్షోభం లేదన్నారు. -
వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం
ఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయం కేంద్రం వేగం పెంచింది. గతంలో తరహాలో కేంద్ర కేబినేట్, సబ్ కమిటీ తదితర విషయాలేవీ లేకుండా త్వరగా పెట్టుబడులు ఉపసంహరించేలా కొత్త విధానాలు అమలు చేయబోతున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. డైరెక్టర్లకే అధికారం వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలలో వేంగా పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. వీటితో పాటు పలు సంస్థల్లో ఉన్న మైనార్టీ భాగస్వామ్యాలను సైతం వదులుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ ప్రక్రియలో వేగం పెంచేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయ అధికారం ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో అయితే కేబినేట్ జోక్యం ఇందులో ఉండేది. సబ్సిడరీల మూసివేత పలు కీలక విభాగాల్లో ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడి పెట్టింది. వీటికి అనుబంధంగా పలు సబ్సిడరీ కంపెనీలు కూడా నెలకొల్పింది. అయితే తాజాగా సబ్సిడరీ సంస్థలను మూసివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఉమ్మడి నిర్వహణ సంస్థల యంత్రాంగం మార్పు అధికారం డైరెక్టర్లకే కట్టబెట్టింది. దీని ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రక్రియలో భాగంగా బిడ్లను ఆహ్వానించడం. ఆ తర్వాత పరిశీలించడం.. ఆపై నిర్ణయం తీసుకోవడం వంటి సుదీర్ఘ ప్రక్రియను కుదించింది కేంద్ర కేబినేట్. అందులో భాగంగా ప్రభుత్వ సంస్థల అమ్మకం ప్రక్రియను వేలం పాట ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ఒకే దశలో ప్రైవేటీకరణ పూర్తయిపోతుంది. పరిమిత ప్రమేయం ప్రైవేటీకరణ జరిగగా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని కేంద్ర కేబినేట్ తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రంగా పని చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం డైరెక్టర్లకు అప్పగించబోతున్నారు. ఇథనాల్ తప్పనిసరి బయో ఫ్యూయల్ పాలసీలో కేంద్రం పలు మార్పులు చేస్తూ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కొత్తగా ఫీడ్ స్టాక్ కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు 2030 నాటికి పెట్రోల్ లో 20 శాతం ఇతర ఇథనాల్ కలపడం తప్పనిసరి చేయనున్నారు. బయో ఫ్యూయల్ ప్రోగ్రాం కింద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రోత్సహకాలు అందివ్వాలని కేబినేట్ నిర్ణయించింది. రత్నాలను అమ్మేస్తాం ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్ముతాం అంటు చెప్పిన కేంద్రం ఇప్పుడు సరికొత్తగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రైవేటీకరిస్తామని చెబుతోంది. ఈ మేరకు తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో మహారత్న, నవరత్న, మినీ రత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది. చదవండి: ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు! -
ఐడీబీఐలో కొంత వాటాకు ఓకే..బ్యాంకెస్యూరెన్స్ కోసం ఎల్ఐసీ యోచన!
న్యూఢిల్లీ: బ్యాంకెస్యూరెన్స్ చానల్‌తో లబ్ది పొందేందుకు వీలుగా ఐడీబీఐ బ్యాంకులో బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా బ్యాంకులో ప్రభుత్వంసహా ఎల్ఐసీ వాటా విక్రయించే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం ఎల్ఐసీ ఈ నెల 4న ప్రారంభంకానున్న సొంత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన రోడ్‌షోల నిర్వహణలో ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులో పూర్తి వాటాను విక్రయించబోమని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం బ్యాంకులోగల 45 శాతం వాటా విక్రయ ప్రణాళికల్లో ఉంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ జరుగుతున్నదని, ఎంతమేర వాటాను విక్రయించేదీ ఎల్ఐసీ రోడ్‌షోల తదుపరి నిర్ణయించనున్నట్లు గత వారం దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. కాగా.. 2019 జనవరి 21నుంచి ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ అనుబంధ సంస్థగా మారిన విషయం విదితమే. ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. బ్యాంక్ బ్రాంచీల నెట్వర్క్, కస్టమర్ల ద్వారా ఇన్సూరెన్స్ ప్రొడక్టుల విక్రయానికి బ్యాంకెస్యూరెన్స్ దోహదపడుతుంది. దీంతో ఎల్ఐసీ బ్యాంకులో కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉన్నట్లు కుమార్ తెలియజేశారు. -
ఆ బొగ్గుబ్లాక్‌ను రాష్ట్రమే ప్రైవేటుకు అప్పగించింది: కిషన్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి: సింగరేణిలోని తాడిచెర్ల బొగ్గుబ్లాక్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్‌కు అప్పగించిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించా రు. మరో 4 బొగ్గుబ్లాక్‌లను ప్రైవేట్‌కు అప్పగించవద్దని రాష్ట్రం దరఖాస్తు చేసుకుంటే వాటిని సింగరేణికి అప్పగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిని, కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణివ్యాప్తంగా చేపడుతున్న కార్మిక చైతన్య యాత్రను సోమవారం భూపాలపల్లి ఏరియాలో నిర్వహించారు. మధ్యాహ్నం ఏరియాలోని కేటీకే ఐదో గనిలో జరిగిన యాత్రలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గని ఆవరణలో కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.23వేల కోట్లు చెల్లించడంలో రాప్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ పరిధిలోని కోల్ఇండియా సంస్థలకు కల్పిస్తున్న హక్కులు, సౌకర్యాలను రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల ఆదాయపన్ను చెల్లిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, కిషన్‌రెడ్డి రేగొండ మండలంలోని పాండవులగుట్టను సందర్శించారు. గుట్ట అభివృద్ధికి అవసరమైన నిధులపై జిల్లా అటవీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. మీ దౌర్జన్యం ప్రజల తిరుగుబాటుతో పతనం ప్రజల తిరుగుబాటుతో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ దౌర్జన్యం పతనం కాక తప్పదని, నియంతృత్వ పోకడ, అహంకారం, కుటుంబపాలన త్వరలోనే పోతుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ మోసం చేశారని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయలేదని, కనీస క్వార్టర్స్ సౌకర్యం కల్పించడం లేదని, యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదన్నారు. -
ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణకు వచ్చే ప్రభుత్వరంగ కంపెనీలను మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు చేయకుండా కేంద్ర ఆర్థిక శాఖ నిషేధాన్ని విధించింది. యాజమాన్య నియంత్రణ ఒక ప్రభుత్వరంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ అయితే, సహజసిద్ధంగా ఉన్న అసమమర్థతలన్నవి కొనసాగొచ్చని.. ఇది నూతన ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్ఈ) విధానానికి విరుద్ధమని పేర్కొంది. గతంలో కొన్ని సీపీఎస్ఈల్లో తనకు ఉన్న మెజారిటీ వాటాలను అదే రంగంలో పనిచేసే మరో ప్రభుత్వరంగ సంస్థకు విక్రయించడం గమనార్హం. ఆర్ఈసీలో తన వాటాలను పీఎఫ్సీకి విక్రయించడం తెలిసిందే. అలాగే, హెచ్పీసీఎల్లో వాటాలను ఓఎన్జీసీకి కట్టబెట్టింది. -
బీపీసీఎల్ ప్రయివేటైజేషన్, కొత్త దారిలో అమ్మకానికి సన్నాహాలు!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్‌ను సరికొత్త రీతిలో చేపట్టవలసి ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. వాటా అమ్మక నిబంధనల సవరణ తదితర చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. వెరసి బీపీసీఎల్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ అంశంలో తిరిగి డ్రాయింగ్ బోర్డుకు వెళ్లవలసి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. కన్సార్షియం ఏర్పాటు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఇంధన మార్పులు తదితర సవాళ్లున్నట్లు తెలియజేశారు. కంపెనీలో ప్రభుత్వం 52.98 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వేదాంతా గ్రూప్‌సహా మూడు కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానించవలసి ఉంది. పర్యావరణ అనుకూల, పునరుత్పాదక ఇంధనాలవైపు ప్రపంచం దృష్టిసారించిన నేపథ్యంలో బీపీసీఎల్ ప్రస్తుత ప్రయివేటైజేషన్ ప్రక్రియకు సవాళ్లు ఎదురుకానున్నట్లు ప్రభుత్వ అధికారి వివరించారు. -
సంతకం పెట్టని టీడీపీ
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టీడీపీ సమర్థిస్తోందా? నిరసన కార్యక్రమాలు బూటకమేనా? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ద్వంద్వ నీతిని మరోసారి బయట పెట్టుకున్నారా? అనే ప్రశ్నలకు ఆ పార్టీ ఎంపీల తీరు అవుననే సమాధానం ఇస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ (ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేలా) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చే వినతిపత్రంపై సంతకం చేయాలని టీడీపీ ఎంపీలు కె.రామ్మోహన్నాయుడు, కేసినేని నాని, గల్లా జయదేవ్, కె.వరప్రసాద్‌లను వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి కోరారు. ఆ వినతిపత్రంలో లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్షాల్లో వైఎస్సార్సీపీతోపాటు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, శివసేన, ఐయూఎంఎల్, ఆర్జేడీ, బీజేడీ, సీపీఎం, ఎన్సీపీ, ఎన్సీ, ఎంఐఎం, ఆర్ఎల్పీ, ఆర్ఎస్పీ, కేసీ(ఎం) తదితర పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కూడా సంతకాలు చేసి, మద్దతు తెలిపారు. కానీ.. టీడీపీ ఎంపీలు మాత్రం సంతకాలు చేయడానికి నిరాకరించారు. దీన్ని బట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ చేస్తున్న కార్యక్రమాలన్నీ బూటకమేనని స్పష్టమవుతోందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ అంగీకరించినట్లే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆదినుంచి వైఎస్సార్సీపీ పోరాటం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆదిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ అధీనంలో లాభసాటిగా నడిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. వైఎస్సార్సీపీ ఇటు క్షేత్ర స్థాయిలో, అటు పార్లమెంట్లో తన వాణి గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా మిగతా పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ ఎంపీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మొత్తంగా 120 మంది వినతిపత్రంపై సంతకాలు చేయగా, ఒక్క టీడీపీ మాత్రం నిరాకరించడం గమనార్హం. ఈ వినతిపత్రాన్ని శుక్రవారం విజయసాయిరెడ్డి ప్రధానికి అందజేశారు. దీన్ని బట్టి స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ ఎంపీలు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చిత్తశుద్ధి ఏ పాటితో స్పష్టమవుతోంది. బీజేపీకి మరింత దూరమవుతామని చంద్రబాబు భయపడే వినతిపత్రంపై సంతకాలు చేయొద్దని టీడీపీ ఎంపీలను ఆదేశించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ప్రభుత్వ సంస్థ అమ్మకంపై కేంద్రం యూటర్న్, ఆర్థికశాఖ సహాయ మంత్రి కీలక ప్రకటన!
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)ని ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కే కరాద్ రాజ్యసభలో తెలిపారు. 2021 మార్చి 31వ తేదీ నాటికి ఎల్ఐసీ, జీఐసీ మొత్తం ఆస్తుల విలువ వరుసగా రూ. 38.04 లక్షల కోట్లు, రూ. 1.35 లక్షల కోట్లుగా ఉన్నాయని కరాద్ స్పష్టం చేశారు. బ్యాంకుల్లో డిపాజిటర్లకు ఎక్కువ రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో డీఐసీజీసీ కింద బ్యాంకులలో డిపాజిటర్లకు బీమా కవర్ పరిమితిని ఒక్కో డిపాజిటర్‌కు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి వివరించారు. 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ అన్ని ‘బీమా చేయబడిన’ బ్యాంకులు, వాటి డిపాజిటర్లకు ఒకే విధంగా వర్తిస్తుందని ఆయన చెప్పారు. ‘‘దీనితోపాటు డిపాజిట్ ఇన్సూరెన్స్– క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (సవరణ) చట్టం, 2021 గత ఏడాది ఆగస్టు 13వ తేదీన రాష్ట్రపతి ఆమోదాన్ని పొందింది. అదే ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం బ్యాంకులపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో డీఐసీజీసీ మధ్యంతర చెల్లింపుల ద్వారా డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ మేరకు డిపాజిటర్లు తమ డిపాజిట్లను సులభంగా, తగిన కాలపరిమితితో పొందేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తున్నాయి’’ అని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్, డబ్బులు ఇప్పుడే డ్రా చేసుకోండి!
బ్యాంక్ ఖాతాదారులకు గమనిక. పలు బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు మార్చి28, మార్చి 29 బ్యాంక్‌ల బంద్ జరగనుంది. దీంతో ఎస్బీఐ బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బ్యాంక్ ఖాతాదారులు ముందస్తుగానే అవసరానికి కావాల్సిన డబ్బుల్ని డ్రా చేసుకోవాలని బ్యాంక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బంద్ ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండింటిని ప్రయివేటైజ్ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ రానున్న రోజుల్లో కేబినెట్ అనుమతి కోరే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949కు సవరణలు ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను వ్యతిరేకిస్తూ యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంక్ సేవలకు విఘాతం ఎస్బీఐ వివరాల ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ లు నేషనల్ వైడ్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ఈ బందు కారణంగా ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం కార్యకలాపాలకు విఘాతం కలగనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి
-
ప్రైవేటు రైళ్లా ? మాకొద్దు బాబోయ్ !
న్యూఢిల్లీ: రైల్వే విభాగంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించడం తదితర చర్యలతో రైల్వే అసెట్స్‌ను మానిటైజ్ చేయాలన్న ప్రతిపాదనకు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. మానిటైజేషన్ ప్రక్రియను సరిగ్గా రూపొందించకపోవడం ఇందుకు కారణం కావచ్చని .. ఈ నేపథ్యంలో సదరు ప్రణాళికలను రైల్వే శాఖ పునఃసమీక్షిస్తోందని ఆయన తెలిపారు. కచ్చితంగా రాబడులు వస్తాయంటేనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ముందుకు వస్తుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అసెట్ మానిటైజేషన్ ప్రణాళికలో పేర్కొన్న రూ. 6 లక్షల కోట్ల అసెట్స్ నుంచి కచ్చితంగా ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంత్ వివరించారు. చదవండి: ఎల్ఐసీ ఐపీవో వాయిదా! -
బీఎస్ఎన్ఎల్కు అన్యాయం...ప్రైవేటులో భాగస్వామ్యం!
వొడాఫోన్– ఐడియా కంపెనీలో కేంద్రం 35.8% వాటా పొందుతుందని, అలాగే టాటా టెలీలో కేంద్రం 9.5% వాటా పొందుతుందని ఆయా కంపెనీలు ప్రకటించాయి. టాటా టెలీ మహారాష్ట్ర కూడా తమ కంపెనీ కేంద్రానికి వాటా ఇస్తోందని పేర్కొంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రైవేటు టెలికాం కంపెనీలు లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీలు కలిపి దాదాపు రూ.1,60,000 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని 10 ఏళ్లలో వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటు, స్పెక్ట్రమ్ చార్జీలపై వడ్డీ చెల్లింపును ఈక్విటీగా మార్చుకునే వెసులుబాటు, బ్యాంకు రుణాలపై బ్యాంకు గ్యారెంటీ తగ్గింపు వంటి రాయితీలు కేంద్రం ఇచ్చింది. వొడాఫోన్–ఐడియా స్పెక్ట్రమ్ వడ్డీ రూపంలో దాదాపు రూ. 16,000 కోట్లు చెల్లించాలి. ఈ వడ్డీని చెల్లించలేమని, 2021 ఆగస్ట్ 14 నాటి షేరు రేటు ప్రకారం కేంద్రానికి 35.8% వాటా ఇవ్వాలని వొడాఫోన్ ఐడియా బోర్డు నిర్ణయించింది. ఇదే ప్రకారం టాటా టెలీ కంపెనీ తాము చెల్లించాల్సిన రూ.850 కోట్ల వడ్డీ మొత్తాన్ని ఈక్విటీగా మార్చి 9.5% వాటాను కేంద్రానికి కేటాయించాలని నిర్ణయించారు. కేంద్రం ఈ విషయంపై వివరణ ఇస్తూ... టెలికాం కంపెనీలకు వాటాల కేటాయింపు కోసం ఎలాంటి డబ్బు చెల్లించడం లేదనీ, కేవలం వడ్డీ రూపంలో తమకు చెల్లించాల్సిన డబ్బును వాటా లుగా మార్చడానికి అంగీకరించామనీ, టెలికాం రంగంలో ఒకటి, రెండు కంపెనీలు ఉంటే గుత్తాధి పత్యం ఏర్పడి ధరలు పెరుగుతాయనీ, దాని నివారణకు ఈ చర్య అవసరమని పేర్కొన్నారు. ఆయా టెలికాం కంపెనీలకు ఉన్న అప్పులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఆ విధంగా టెలికాం కంపెనీల నుండి హామీ పొందామని కమ్యూనికేషన్ మంత్రి తెలిపారు. వొడాఫోన్–ఐడియా టెలికాం కంపెనీలో కేంద్రానికి 35.8% వాటా ఉండగా, వొడాఫోన్‌కు 28.5%, ఆదిత్య బిర్లాకు 17.8% వాటాలు ఉంటాయి. ఆ రకంగా వొడాఫోన్ – ఐడియాలో కేంద్రానికి మెజా రిటీ వాటాలు లభిస్తాయి. కానీ మెజారిటీ వాటా కేంద్రానికి ఉన్నా ఆ కంపెనీని పాత యాజ మాన్యమే నిర్వహిస్తుందని కమ్యూనికేషన్లమంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో వొడాఫోన్ – ఐడియాకు దాదాపు రూ. 1.95 లక్షల కోట్లు అప్పు ఉండటం గమనార్హం. బీఎస్ఎన్ఎల్కు ద్రోహం అప్పుల్లో ఉన్న ప్రైవేటు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వెనుకాడని కేంద్రం... సొంత కంపెనీ బీఎస్ఎన్ఎల్కు 3జీ స్పెక్ట్రమ్ ఇచ్చేందుకు దాదాపు 3 ఏళ్ళు ఆలస్యం చేసింది. దీనివల్ల బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు 4జీ స్పెక్ట్రమ్ ఇవ్వకుండా సాకులు చెబుతోంది. ప్రైవేటు టెలికాం కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు పెట్టని ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ మాత్రం భారత్‌లో తయారైన 4జీ టెక్నాలజీని మాత్రమే వాడాలని నిబంధనలు పెట్టింది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్కు దేశ వ్యాప్తంగా ఆరు లక్షల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నిర్మించడానికి భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్కు లిమిటెడ్ (బీబీఎన్ఎల్) పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి రూ. 20000 కోట్ల విలువైన పనిని అప్పగించింది. ఇప్పుడు దీనిని పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పేరుతో ప్రైవేటుకు అప్పగించి, బీబీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో కలిపేసి రూ.20000 కోట్ల కాంట్రా క్టును రద్దు చేసి నష్టం కలిగించింది. బీబీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కనెక్టివిటీ నిర్వహణ భారం బీఎస్ఎన్ఎల్పై పడుతుంది. ఇది అదనపు భారం. బీఎస్ఎన్ఎల్కు ఉన్న 78,568 మంది ఉద్యోగు లను 2020 జనవరి 31న వీఆర్ఎస్పై ఇంటికి పంపిన కేంద్రం, కంపెనీకి వచ్చే నష్టాలకు ఉద్యో గుల ఖర్చే కార ణంగా చెప్పింది. నిజానికి దానికి ఉన్న అప్పు రూ. 30,000 కోట్లు మాత్రమే. వొడా ఫోన్ ఐడియాకు ఉన్న అప్పు దాదాపు రూ. 1,95,000 కోట్లు. అక్కడ మాత్రం నష్టాలకు, అప్పు లకు ఉద్యోగులను కారణంగా చూపకుండా లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒకే టెలికాం రంగంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకని, అందుకే ఎంటీఎన్ఎల్ నిర్వహణ బీఎస్ఎన్ఎల్కు అప్ప గించామని పేర్కొన్న కేంద్రం, ప్రైవేటు టెలికాం కంపెనీలలో వాటాలు తీసుకోవడానికి సిద్ధపడింది. మరో ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేస్తారా? అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశం లేదని కమ్యూనికేషన్ల మంత్రి పేర్కొన్నప్పటికీ, బీఎస్ఎన్ఎల్లో వ్యూహాత్మక భాగస్వామి చేరికకు, ప్రయివేటీకరణకు రంగం సిద్ధమవుతోందా అన్న అనుమానం మాత్రం కలుగుతోంది. కేంద్రం సావర్న్ గ్యారెంటీతో రూ. 8,500 కోట్లు బాండ్ల రూపంలో బీఎస్ఎన్ఎల్ సమీకరించింది. బాండ్ల రూపంలో రుణం సమీరించారు కనుక నిబంధనల ప్రకార ం బీఎస్ఎన్ఎల్ను స్టాక్ ఎక్చేంజి బోర్డు ఆఫ్ ఇండియాలో లిస్ట్ చేయడం ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది. వ్యాసకర్త: మురాల తారానాథ్ టెలికాం రంగ విశ్లేషకులు -
ఎల్ఐసీ, బీపీసీఎల్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర సర్కారు పెట్టుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ప్రధానంగా రెండు లావాదేవీలు ప్రభుత్వ లక్ష్యానికి కీలకం కానున్నాయి. అందులో బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న వాటాను పూర్తిగా ప్రైవేటు సంస్థకు విక్రయించడం. ఈ రూపంలోనే కేంద్రానికి రూ.50వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. ఎల్ఐసీలో కొంత వాటాను ఐపీవో రూపంలో విక్రయించాలన్నది మరో ముఖ్యమైన లక్ష్యం. ఈ రెండు లావాదేవీల రూపంలోనే కేంద్ర సర్కారుకు రమారమి రూ.1.5 లక్షల కోట్లు సమకూరుతుంది. కానీ, చూస్తుంటే బీపీసీఎల్ ప్రైవేటీకరణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.75 లక్షల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకోవాలన్నది కేంద్ర సర్కారు బడ్జెట్ లక్ష్యం. ఎల్ఐసీ ఐపీవో మార్చిలోపు పూర్తి చేయగలమన్న విశ్వాసంతో కేంద్రం ఉంది. ఒకవేళ ఎల్ఐసీ ఐపీవోను పట్టాలెక్కించినా, బీపీసీఎల్ లావాదేవీ పూర్తికాకపోతే రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం దిగువకు సవరించుకోవాల్సి వస్తుంది. కేంద్ర సర్కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ వాటాల విక్రయం రూపంలో సమకూర్చుకున్న మొత్తం రూ.9,330 కోట్లుగానే ఉంది. ఎన్ఎండీసీ, హడ్కోలో మైనారిటీ వాటాలను విక్రయించడం రూపంలో ఈ మొత్తం లభించింది. అనుకున్నట్టుగానే ఎల్ఐసీ ఐపీవో.. దేశంలోనే అతిపెద్ద ఐపీవో (సుమారు రూ.లక్ష కోట్లు)గా భావిస్తున్న ఎల్ఐసీ వాటాల విక్రయం ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మార్చిలోపు పూర్తవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్ వాటాల విక్రయం తదుపరి ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంలో 2021–22 ఆర్థిక సంవత్సరం వాటాల విక్రయ లక్ష్యాన్ని రూ.50,000కోట్లు తక్కువకు సవరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ‘‘ఎల్ఐసీ ఐపీవో ఈ ఏడాది పూర్తవుతుందన్న విశ్వాసం మాకుంది. చాలా వరకు పని (విలువ మదింపు) వేగంగా పూర్తయింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి (దీపమ్) ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే విషయంలో చక్కని ట్రాక్ రికార్డు ఉంది’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘‘ప్రైవేటీకరణ అన్నది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎయిర్ ఇండియా ప్రక్రియ ముగిసిందని..ఇతర పెద్ద ప్రైవేటీకరణ ప్రణాళికలు కూడా అంతే వేగంగా పూర్తవుతాయని అనుకోవద్దు’’ అంటూ సదరు అధికారి పేర్కొన్నారు. ఎల్ఐసీ, బీపీసీఎల్ లావాదేవీల్లో జాప్యం నెలకొనడంతో వాస్తవ లక్ష్యంలో ఇప్పటి వరకు సమకూర్చుకున్నది చాలా స్వల్ప మొత్తంగానే కనిపిస్తోంది. ఒక్క ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి చేసుకోగలిగింది. ఇంకా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పవన్ హన్స్ తదితర కంపెనీల్లో వాటాల విక్రయం కూడా ముగియాల్సి ఉంది. నత్తనడకనే.. బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి సంబంధించి పెద్దగా పురోగతి లేదని అధికార వర్గాలు అంటున్నాయి.చాలా వరకు బిడ్డర్లు ఈ డీల్‌కు సరిపడా నిధులను సమకూర్చుకునేందుకు తగిన భాగస్వాములను ఎంపిక చేసుకోలేకపోయినట్టు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత వాతావరణానికి తోడు.. ఇంధన మార్కెట్లలోని ఆటుపోట్లను కారణంగా పేర్కొంటున్నాయి. పైగా విక్రయానికి సంబంధించి ఎన్నో అంశాలపై సందేహాల నివృత్తికి సమయం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆసక్తి కలిగిన బిడ్డర్లు బీపీసీఎల్‌కు సంబంధించి ఆర్థిక డేటాను గతేడాది ఏప్రిల్‌లనే పొందినట్టు వెల్లడించాయి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఆయా అంశాలపై చర్చలకు చాలా సమయం పట్టినట్టు వివరించాయి. కరోనా రాక ముందు వరకు అంటే 2020 ఫిబ్రవరి నాటికి బీపీసీఎల్‌ను ఎయిర్ ఇండియా కంటే ముందే విక్రయించగలమన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది. ఎయిర్ఇండియా తీవ్ర నష్టాల్లో నడుస్తుంటే.. బీపీసీఎల్ లాభాల వర్షం కురిపిస్తున్న కంపెనీ కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయగా దిగ్గజ ఇంధనరంగ కంపెనీలకు అదిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుకూల మార్గం అవుతుందని అభిప్రాయపడింది. కానీ కరోనా రాకతో అవన్నీ తారుమారయ్యాయి. అధిక వ్యయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున.. ఒకవైపు పన్నుల రూపంలో ఆదాయం పెరిగినా కానీ, పెట్టుబడుల ఉపంసంహరణ రూపంలో ఆదాయానికి తొర్ర పడితే జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 6.8 శాతాన్ని ఎలా అధిగమించగలదో చూడాల్సి ఉంది. చదవండి: ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం -
ప్రైవేట్ చేతుల్లోకి ఎయిర్‌పోర్ట్‌లు
సాక్షి, అమరావతి : భారీ నష్టాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన మూడు విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 136 ఎయిర్‌పోర్టులను కలిగి ఉంటే, అందులో ఆరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఇందులో ఒక్క దొనకొండ తప్ప మిగతా రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కడప నుంచి ప్రతి రోజు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ విమానాశ్రయాల నష్టం ప్రతి ఏటా భారీగా పెరుగుతుండటంతో వీటిని నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కింద దశల వారీగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2022 నుంచి 2025 లోగా మొత్తం 25 ఎయిర్‌పోర్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలవనుంది. మొత్తం 50 ఏళ్లు నిర్వహించుకునే విధంగా టెండర్లు పిలవనున్నారు. తొలి దశలో చేపట్టిన 25 విమానాశ్రయాల్లో రాష్ట్రానికి చెందిన రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఉండటంతో ఈ రెండింటికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని అంచనా. విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొత్తగా భోగాపురంలో నిర్మించడానికి ఇప్పటికే జీఎంఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఏఏఐ ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయం కడప ఒక్కటే మిగిలి వుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయంగా కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం మిగలనుంది. రాష్ట్ర వాటాపై స్పష్టత లేదు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కానీ ఇంకా విధివిధానాలు పంపలేదు. ఈ మూడు విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించి ఇచ్చింది. అందువల్ల రాష్ట్ర వాటాపై స్పష్టత రావాలి. విధివిధానాలు వస్తేనే ఆ విషయం తేలుతుంది. – వీఎన్ భరత్ రెడ్డి, రాష్ట్ర విమానయాన సలహాదారు రూ.191 కోట్లకు చేరిన నష్టాలు రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో ఒక్క విశాఖ విమానాశ్రయం తప్ప మిగిలిన విమానాశ్రయాలు ఒక్కసారి కూడా లాభాలు నమోదు చేయలేదని ఏఏఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018–19లో మొత్తం ఆరు విమానాశ్రయాల నష్టం రూ.130.24 కోట్లు ఉండగా, అది 2020–21 నాటికి రూ.191.5 కోట్లకు చేరింది. 2019–20లో విశాఖ విమానాశ్రయం రూ.2.29 కోట్ల లాభాలను నమోదు చేయగా, కోవిడ్ దెబ్బతో 2020–21 నాటికి రూ.29.37 కోట్ల నష్టాలను ప్రకటించింది. దొనకొండ ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్వహణలో లేకపోయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది కోసం ఏటా కొన్ని లక్షలు వ్యయం చేయాల్సి వస్తోంది. -
అమ్మకానికి మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు!
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ తాజాగా ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్(పీడీఐఎల్)తోపాటు హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో వాటా విక్రయానికి తెరతీసింది. ఇందుకు అనుగుణంగా ఈ పీఎస్‌యూల కొనుగోలుకి ఆసక్తిగల కంపెనీల నుంచి గ్లోబల్ బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. బిడ్స్ దాఖలుకు 2022 జనవరి 31 చివరి తేదీగా ప్రకటించింది. పీఎస్‌యూల ప్రయివేటైజేషన్‌లో భాగంగా కొనుగోలుకి ఆసక్తి(ఈవోఐ)ని వ్యక్తం చేసేందుకు 45 రోజులకుపైగా గడువును ఇచ్చినట్లు దీపమ్ ట్వీట్ చేసింది. మినీరత్న కేటగిరీ–1 కంపెనీ పీడీఐఎల్ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. కంపెనీ ప్రధానంగా డిజైన్, ఇంజినీరింగ్, కన్సల్టెన్సీ, తత్సంబంధిత ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సర్వీసులను అందిస్తోంది. ఇక హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఇప్పటివరకూ ఎస్యూయూటీఐతో కలిపి సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 9,330 కోట్లు సమకూర్చుకున్నట్లు ఈ సందర్భంగా దీపమ్ వెల్లడించింది. చదవండి: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు -
రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేయనున్నట్లు 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రకటించారు. ‘‘డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించిన వివిధ అంశాల పరిశీలన, ఇందులో బ్యాంకు(ల) ఎంపిక అంశాలను క్యాబినెట్ కమిటీ పరిశీలిస్తుంది. క్యాబినెట్ కమిటీ ఈ విషయంలో (ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ) ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆమె తాజాగా లోక్‌సభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియ ద్వారా రూ.175 లక్షల కోట్ల సమీకరించాలని కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
‘కాంకర్ని కూడా ప్రైవేటీకరిస్తాం’.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనిట్లలో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగే ప్రక్రియేనని.. ఈ జాబితాలో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సభ్యుల ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ మొదలు పెట్టింది కాంకర్లో పెట్టుబడుల ఉపసంహరణ అన్నది 1994–95 కాంగ్రెస్ పాలనలోనే మొదలైనట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనూ కాంకర్లో పెట్టుబడుల విక్రయానికి ప్రయత్నించినట్టు గుర్తు చేశారు. ‘1994–95లో కాంకర్లో 20 శాతం వాటాను విక్రయించారు. 995–96లోనూ కాంగ్రెస్ సర్కారు మరో 3.05 శాతం వాటాను విక్రయించింది. కాంగ్రెస్ హయాంలో కాంకర్లో మొత్తం 24.35 శాతం వాటాను విక్రయిస్తే.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు 20.3 శాతం వాటాను విక్రయించాయి’’ అని సభ ముందు వివరాలు ఉంచారు. -
బొగ్గు బావుల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిని ప్రైవేట్‌పరం చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సింగరేణిలో ఉన్న బొగ్గు బావులను ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకొన్నది. ప్రైవేటీకరణ ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా సింగరేణిని నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల జీవితాల మీద దెబ్బకొడుతుంది. ప్రస్తుతం నాలుగు బావులతో మొదలుపెట్టి ఆ తర్వాత సింగరేణి బావుల మొత్తాన్ని ప్రైవేట్‌పరం చేయడానికే కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3, శ్రావణపల్లి గని, కేకే–6 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెండర్లు పూర్తి చేసింది. సింగరేణి బ్లాకులన్నీ ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేస్తారు. అప్పడు సింగరేణిలో కొత్త గనులు రావు. ప్రస్తుత కారుణ్య నియామకాల ద్వారా చేపడుతున్న వారసత్వ ఉద్యోగాలు ఉండవు. క్రమంగా సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పుడు అమలు చేస్తున్న హక్కులు, బోనస్‌లు, అలవెన్స్‌లను తగ్గిస్తుంది. దీనితో కార్మికుల మీద భారం పడుతుంది. వారు ఆర్థికంగా దెబ్బతిని కుంగిపోతారు. వారి కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి బొగ్గు బావులు ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి. (చదవండి: ‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?) ముందు సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల హక్కులపై దృష్టి పెట్టండి. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి. సింగరేణిలో పని చేస్తున్న అన్ని కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయండి. కరోనా వల్ల మరణించిన సింగరేణి కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించండి. సింగరేణిలో ఉన్న ఓపెన్‌కాస్ట్‌లో మట్టి తొలగింపు విధానం, అండర్‌గ్రౌండ్ గనుల్లో కాంట్రాక్ట్ పద్ధతిని నిలిపివేయండి. గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు వెంటనే సహాయం అందించండి. సింగరేణి కార్మికుల హక్కులను హరించి వేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న బొగ్గు బావుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగారు కావున సింగరేణిలో జరిగే 72 గంటల సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మికులు కర్షకులు, మేధావులు, ప్రజలపై ఉంది. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) – కనికరపు లక్ష్మీకాంతం, కార్మిక సంఘాల జేఏసీ -
రాజకీయ ఒత్తిడిపై దృష్టి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బొగ్గు బ్లాక్‌లను అమ్మే ప్రయత్నా లపై సమ్మె అస్త్రం ప్రయోగించిన సింగరేణి కార్మిక సంఘాలు రాజకీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కార్మిక సంఘాల జేఏసీ 72 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రైవేటీకరణ ప్రయ త్నాలను విరమించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురా వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం రాష్ట్ర రాజధానికి చేరుకున్న కార్మిక సంఘాల జేఏసీ నేతలు సింగరేణి యాజమాన్యంతో చర్చించారు. సమ్మె విర మించాలని కోరినా ససేమిరా అన్నారు. అక్కడే బస చేసి శని వారం డైరెక్టర్(పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వెల్ఫేర్–పీఏ డబ్ల్యూ)ను కలసి ప్రైవేటీకరణను రద్దు చేయాలనే కీలక అంశంతోపాటు కార్మికుల సమస్యలతో కూడిన సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్ర టరీ, సంస్థ మాజీ సీఎండీ నర్సింగ్రావును కలసి సీఎం కేసీ ఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలన్నారు. ఆ తర్వాత అన్ని పార్టీల నేతలు, పార్టీ ఎంపీలను కలవాలని నిర్ణయించారు. తొలుత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. మరోవైపు సింగరేణి బొగ్గు బ్లాక్‌ల బిడ్‌లో పాల్గొంటే ఇక్కడ వ్యతిరేకతతోపాటు హైదరాబాద్‌లోని బిడ్ కాంట్రాక్టుకు చెందిన కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. కాగా, సింగరేణి సంస్థ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని సంఘాలు ఏకమై సమ్మెకు పిలుపునివ్వగా కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) అధికారుల సంఘం ఇప్పటివరకు తన వైఖరిని వెల్లడించలేదు. -
మహారత్న కంపెనీపై ప్రైవేటీకరణ కత్తి.. ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా ప్రైవేట్ భాగస్వాములతో కలిసి పనిచేసేలా ప్రభుత్వ రంగ ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా సాధ్యమైన చోట్ల ప్రైవేట్ రంగ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లను కూడా భాగస్వాములను చేయాలని ఓఎన్జీసీకి ప్రభుత్వం సూచించినట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ తెలిపారు. ‘దేశీయంగా మరిన్ని చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ మరింతగా అన్వేషించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. ఓఎన్జీసీ మరింతగా కృషి చేయాలి‘ అని ఆయన పేర్కొన్నారు. తాను స్వంతంగా అన్వేషించలేని సంక్లిష్టమైన ప్రదేశాల్లో ఓఎన్జీసీ ప్రైవేట్, విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయాలని కపూర్ సూచించారు. సాంకేతిక సహకారం తీసుకోవడం మొదలుకుని పాక్షికంగా అన్వేషించిన, పూర్తిగా అభివృద్ధి చేయని నిక్షేపాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం మొదలైన అంశాలు పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రస్తుత క్షేత్రాల నుంచి ఉత్పత్తిని మరింత పెంచుకోవడంలోనూ ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిని చేయవచ్చని తెలిపారు. మహారత్న కంపెనీ అయినందున ఓఎన్జీసీకి ప్రభుత్వం సూచనలు మాత్రమే చేయగలదని, అంతిమ నిర్ణయం కంపెనీ బోర్డ్ తీసుకోవాల్సి ఉంటుందని కపూర్ తెలిపారు. ముంబై హై, బసేన్ అండ్ శాటిలైట్ (బీ అండ్ ఎస్) వంటి కీలక క్షేత్రాల్లో ప్రైవేట్ సంస్థలకు 60 శాతం దాకా వాటాను ఇవ్వడం పరిశీలించాలంటూ పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి అమర్నాథ్ ఇటీవలే ఓఎన్జీసీకి లేఖ రాసిన నేపథ్యంలో కపూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆర్థిక వివక్ష విసురుతున్న సవాలు
సమాజం తాను ఏ రకంగా రూపుదిద్దుకోదలిచిందో నిర్ణయించుకొని, అందుకు తగిన లక్ష్యాలను విద్యా రంగానికి నిర్దేశిస్తుంది. విద్యా లక్ష్యాలను సమాజం నిర్దేశిస్తే, సమాజ నిర్మాణాన్ని విద్య ప్రభావితం చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన విద్య కాలక్రమేణా లింగ, కుల, మత, వర్ణ వివక్షత చవి చూసింది. కొన్ని వర్గాలకే పరిమితమైన వేద కాలం నాటి నుంచి నేటి అందరికీ విద్య వరకు సమాజాన్ని మాత్రమే కాకుండా తనను తానూ సంస్కరించుకుంటూ వచ్చింది. సామాజిక వివక్షలెన్నింటినో అధిగమించి సామాజిక వికాసానికి దోహదపడిన విద్య ఇప్పుడు ఆర్థిక వివక్ష (పెట్టుబడి) విసురుతున్న సవాలును స్వీకరించే మలుపు వద్ద నిలిచి, వేచి ఉంది. అనాదిగా సమాజం విద్యను, విద్య నేర్పే గురువును అత్యున్నత స్థానంలో నిలుపుతూ వచ్చింది. కానీ, నేడు సమాజానికి, ప్రభుత్వ విద్యకు మధ్య ఘర్షణను నెలకొల్పడం జరుగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదివించరని, ఆదాయం సమకూరే ఇతర పనులు ఎందుకు చేస్తున్నట్లనే ప్రశ్నలు అందులో భాగమే. సమాజం మొత్తం డబ్బు చుట్టూ, విలాసవంతమైన జీవితం కోసం పరిగెడుతూ తనను మాత్రం అందుకు అతీతంగా జీవిం చాలంటే ఎలా సాధ్యమని ఉపాధ్యాయుడి వాదన. సమాజానికి, ఉపాధ్యాయుడికి మధ్య జరుగుతున్న ఈ సంభాషణను రెండు వర్గాలకు చెందకుండా, మూడో పక్షంగా బయట నుంచి చూసినప్పుడు మాత్రమే నిజానిజాలను విశ్లేషించడం సాధ్యం. ప్రభుత్వవిద్య పరిరక్షణ సమాజానికి సంబంధం లేనిదిగా మారితే, ఉపాధ్యాయునికి అప్రధానమైనదిగా మారింది. విద్య పరాయీకరణ (ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ)ను ఈ రెండు విషయాలే సులభతరం చేస్తున్నాయి. వీట న్నింటినీ బట్టి పెట్టుబడి ఎంతటి బలమైన బంధాలు, అనుబంధాల మధ్యనైనా ఘర్షణ సృష్టించగలదని స్పష్టమవుతోంది. అది నేర్పుతున్న భావజాలం విద్యను, సమాజాన్ని కూడా మింగే శక్తిమంతమైనదని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్పష్టతను అర్థం చేసుకోగలిగే వివేచన, అవకాశం, అవసరం ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం అందరికీ విద్య అనే జనామోదిత నినాదంతో జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డీపీఈఎఫ్) పేరుతో విద్యా రంగంలోకి ప్రపంచ బ్యాంకు ప్రవేశించింది. దాని ద్వారా అమెరికా, బ్రిటన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుండి విదేశీ పెట్టుబడి ప్రవాహం మొదలైంది. సేవ, సాయం పేరుతో ఎల్లలు దాటిన ద్రవ్యం వామన పాదంలా మారి సంప్రదాయ, ప్రభుత్వ విద్యా వ్యవస్థలన్నిటినీ అణగదొక్కిన స్థితి కళ్ళ ముందు ఉంది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ ఆవాస ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ ఉపాధ్యాయ పోస్టులనే నేడు హేతుబద్ధీకరణ పేరుతో మిగులుగా ముద్ర వేస్తున్నారు. నాడు ఏర్పాటైన ఏక గదితో కూడిన ఏకోపాధ్యాయ పాఠశాలలే నేడు మూసివేతకు గురవుతున్నాయి. ఇవే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అప్రతిష్ఠ మూటగట్టుకోవడానికి మూల కారణం. ఇవే పదిహేనేళ్ల తర్వాత అంటే సుమారు 2010 నుండి ఊపందుకున్న విద్యా వ్యాపారానికి, బోధనా దుకాణాలకు పెట్టుబడి వ్యూహకర్తలు వేసిన పునాదిరాళ్లు. ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాల కంటే పక్కనే 10 మంది ఉపాధ్యాయులున్న ప్రైవేట్ బడి వైపు తల్లిదండ్రుల దృష్టి మరల్చింది. దానికి తోడు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్న ఆంగ్ల మాధ్యమం ఆకర్షణ మంత్రంగా మారింది. మాతృభాషలో విద్యా బోధనను ప్రైవేట్ వ్యవస్థలో అమలు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం కొనసాగించింది. ఇవన్నీ ప్రభుత్వ బడి, ఉపాధ్యాయుల మీద కావల్సినంత దుష్ప్రచారం చేయడానికి భూమికను అందించాయి. విద్య తనను తాను కాపాడుకోవడానికి సంఘటిత ఉపాధ్యాయ శక్తి కోసం ఎదురుచూస్తుందనేది కళ్ళ ముందున్న వాస్తవం. సంఘటితంగా ఉద్యమించి, విద్యా వినాశకర వ్యూహాలను చిత్తు చేయకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని, చరిత్ర దోషులుగా నిలబెడుతుందనేది కూడా స్పష్టం. దోషులుగా కాకుండా పెట్టుబడి చెరలో చిక్కిన విద్యను విడుదల గావించిన మహోద్యమకారులుగా నిలిచిపోగల అరుదైన అవకాశం ఈ తరానికి ఉంది. బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ, పెట్టుబడి అనర్థాల పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ, ఆ ప్రజలను పోరాటాలలో భాగస్వామ్యం చేయాల్సి ఉంది. అంటే మండల, జిల్లా, రాజధాని కేంద్రాలతో పాటు ప్రతీ గ్రామాన్ని ఒక విద్యా ఉద్యమ క్షేత్రంగా మార్చాలి. అప్పుడు మాత్రమే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. అది మాత్రమే చరిత్ర సృష్టించగలదు. ప్రభుత్వ విద్యను పరిరక్షించగలదు. - చుంచు శ్రీశైలం ఉపాధ్యాయులు -
పవన్ కల్యాణ్ ఒక స్థిరత్వంలేని వ్యక్తి: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
-
పవన్.. ప్రశ్నించాల్సింది ఎవరిని?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ అజెండాను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భుజానికెత్తుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతిని«ధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నా«థ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విశాఖ ఉక్కు కార్మిక నాయకులంతా ఆయన వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. ఆదివారం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని చెబుతూ ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఎంత తెలివిగా మోసం చేస్తున్నారో వేదికపైనున్న కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నామన్నారు. అమర్నాథ్ ఇంకా ఏమన్నారంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయలేను: పవన్ కల్యాణ్ ఎవరు బాధ్యులు? ► విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అలాంటి ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ ప్రభుత్వంపై పల్లెత్తు మాట కూడా అనలేదేమి? ఈ విషయం తెలిసీ కూడా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చావు? ► 260 రోజులుగా ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ పేరుతో ఉక్కు కార్మిక సంఘాలు, విశాఖ ప్రజలు పోరాటం చేస్తుంటే..‘ఊళ్లో దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయన్నట్లు’ ఇప్పుడు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నాడు. ► ‘దేశాన్ని దృష్టిలో పెట్టుకునే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు.. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు.. వ్యాపారం చేయదు’ అని అప్పుడు ఎందుకు చెప్పావు? ► ప్లాంట్ విషయమై వైఎస్సార్సీపీ ఎంపీలు చట్టసభల్లో మాట్లాడలేదని అనడం ఆశ్చర్యంగా ఉంది. పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పలుసార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. మా ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం నీకు తెలీదా? ► గెలిపిస్తే పోరాటం చేసేవాడిని.. అన్నావు. మీరు వచ్చినా రాకపోయినా స్టీల్ ప్లాంట్ కోసం ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో కేంద్రంపై పోరాటం చెయ్యి. -
‘విద్యుత్’ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలకు టీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం సంస్కరణల పేరుతో దొడ్డిదారిలో చట్టాలు తెస్తోందని ఇవి తెలంగాణ ప్రజలకు ఉరి తాళ్లుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణను సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, ఆర్థికంగా భారం లేని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యుత్ వినియోగంలో దేశ సగటును రాష్ట్రం దాటి పోయిందన్నారు. విద్యుత్ కోసం పరిశ్రమల యాజమాన్యాలు ధర్నాలు చేసిన చరిత్ర ఉమ్మడి ఏపీలో ఉంటే.. రాష్ట్రం వచ్చిన తరువాత 50 వేల పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. అంతకుముందు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు, 1104 యూనియన్ సభ్యులు కీలక పాత్ర పోషించారన్నారు. కార్మికుల సంక్షేమ కోసం యూనియన్ పోరాటం చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోసం పోరాటం చేస్తే కాల్చి చంపారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదన్న వారి వాదనను తిప్పికొట్టి మిగులు రాష్ట్రంగా నిలిచిందన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులే విద్యుత్ సంస్థకు ప్రత్యక్ష దేవుళ్లని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో రఘుమారెడ్డి -
ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న సంతోషం ఆస్వాదించకముందే టాటా గ్రూపుకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరోసారి మహారాజా స్టేటస్‌ని తెచ్చి పెట్టాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. ఆస్తులపై పేచీ ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల టాటా సన్స్ రూ. 18,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించి ఎయిరిండియాను దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా స్థిర, చర ఆస్తులన్నీ టాటా సన్స్ స్వంతం అవుతాయి. ఇందులో బోయింగ్ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్, కార్గో స్టేషన్లు ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి. క్వార్టర్లు ఖాళీ చేయండి నిబంధనల ప్రకారం ప్రైవేటీకర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆరు నెలలలోపు ప్రస్తుతం ఎయిరిండియా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బంది వాటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిరిండియా కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎయిరిండియా ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉన్న పళంగా మమ్మల్ని క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణమంటూ మండి పడుతున్నారు. సమ్మెకు రెడీ ఎయిరిండియాలో ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగులు 8084, కాంట్రాక్టు ఉద్యోగులు 4001 మంది ఉన్నారు. ఇందులో చాలా మందికి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర ఏరియాల్లో క్వార్టర్లు కేటాయించారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకోకుంటే నవంబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. కనీసం మాట్లాడరా ? ఎయిరిండియాను ప్రైవేటీకరించిన తర్వాత సెటిల్మెంట్, తమ భవిష్యత్తుకు భరోసా అందించేందుకు కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కానీ ఇప్పటికిప్పుడు ఇళ్లు వదిలేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇవ్వడం అమానవీయమని ఉద్యోగులు అంటున్నారు. కనీసం తమతో చర్చలు జరిపేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిక్కుముళ్లు ఏవియేషన్ రంగంలో తమదైన ముద్ర వేయాలని టాటాగ్రూపు ఎప్పటి నుంచో ఆశిస్తోంది. విస్తారాలో పెట్టుబడులు పెట్టినా పూర్తి స్థాయిలో టాటాల ఆశయం నెరవేరలేదు. ఈ సమయంలో ఎయిర్ ఇండియా ద్వారా ఏవియేషన్ రంగంలో దూసుకుపోవాలని టాటా యోచిస్తోంది. అయితే అంతకు ముందు ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్లు తదితర చిక్కుముళ్లు వీడాల్సి ఉంది. చదవండి : ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే ! -
ప్రైవేట్‌పై చైనా కొరడా మతలబు?!
మావో అనంతర పాలకులు కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, రాజ్యాంగాన్ని మార్చడంద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, పట్టణ–గ్రామీణ, తీరప్రాంత– మైదాన ప్రాంతాల మధ్య విభజనలు బాగా పెరిగాయి. గత మూడు దశాబ్దాలుగా చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాంతానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయత్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యాసాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆర్థిక కొలమానాల్లో అత్యున్నత స్థానంలో ఉంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితిలో మాత్రం లేదు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి పరిణామాలు, ప్రత్యేకించి అలీబాబా గ్రూప్, ఎవెర్ గ్రాండే వంటి ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొన్న సమస్యలు... చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త్రీ రెడ్ లైన్ పాలసీపై, ప్రైవేట్ రంగంపై ప్రభుత్వ వైఖరి, దాని ఉద్దేశాలపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. చైనా స్థూల దేశీయోత్పత్తిలో 60 శాతం, సాంకేతిక ఆవిష్కరణల్లో 70 శాతాన్ని ప్రైవేట్ రంగమే అందిస్తోంది. 1995లో ప్రైవేట్ రంగం చైనాలో 18 శాతం ఉద్యోగా లను కల్పించగా 2018లో అది 87 శాతానికి పెరిగింది. చైనా ఎగు మతులు ఇదే కాలానికి గాను 34 శాతం నుంచి 88 శాతానికి పెరి గాయి. పై ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందు చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్మాణమైందో మనం అర్థం చేసుకోవడానికి అయిదు అంశాలను పరిశీలించాలి. మొదటిది: 1950లు, 60లలో మావో సేటుంగ్ పాలనలో నిఖా ర్సైన కమ్యూనిస్టు సైద్ధాంతిక పునాదిపై, అటు సోవియట్ సహాయం, ఇటు స్వావలంబనకు పిలుపివ్వడం అనే రెండింటి సమ్మేళనంతో, దేశంలో పారిశ్రామిక పునాదిని నిర్మించడంపై చైనా గట్టిగా కృషి చేసి మరీ విజయం సాధించింది. అయితే 1970లు, 80లలో డెంగ్ జియాంవో పింగ్ అంతర్జాతీయ సహకారంతో ఆర్థికాభివృద్ధిపై ఎక్కు వగా దృష్టిపెట్టారు. 1990లలో నాటి దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ సైద్ధాంతిక, ఆర్థిక రంగాల్లో సంస్కరణలతో చైనాను అత్యధిక వృద్ధి స్థాయికి తీసుకెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, ఈ మేరకు రాజ్యాం గంలో కూడా మార్పులు తీసుకోవడం ద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ యాజమాన్యానికి పలు హక్కులు కల్పిస్తూ ఒక నిబంధనను చేర్చారు. ప్రైవేట్ వ్యాపారులు కమ్యూనిస్టు పార్టీ నియం త్రణలో పనిచేయాల్సి ఉందని, పార్టీ పాలనకు వారు బేషరతుగా లోబడి ఉండాలని షరతు కూడా విధించారు. రెండు: ఈ విధానాల ఫలితంగా, 1978 నుంచి 2003 నాటికి ఎగుమతుల పరిమాణం 28 రెట్లకు పెరిగింది. 1952 నుంచి 1978 కాలంలో ఎగుమతుల్లో సాధించిన రెండు రెట్ల వృద్ధితో పోలిస్తే ఇది భారీ స్థాయి వృద్ధి అని చెప్పాలి. 1978–2003 కాలంలో సంస్కరణలు అమలు చేసి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించడానికి సుంకాలు, పన్నులు, వాణిజ్య ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తూ నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పారు. ఎగుమతులను, అత్యున్నత టెక్నాల జీని దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించడమే వీటి లక్ష్యం. దీంతో 1952లో చైనా జీడీపీలో పారిశ్రామిక రంగ వాటా 8 శాతం మాత్రమే ఉండగా, 2003 నాటికి 52 శాతానికి పెరిగింది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 1952లో 4.6 శాతం ఉండగా 2003 నాటికి 15 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామికోత్పత్తిలో విదేశీ మదుపు సంస్థల వాటా 1990లో 2.3 శాతం ఉండగా 2003 నాటికి అది 35.9 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. మూడు: 2003 నుంచి 2013 వరకు ఒక దశాబ్ది కాలంలో చైనా వార్షిక వృద్ధి రేటు 10.3 శాతంగా నమోదైంది. 2007 నాటికి 14.2 శాతం నమోదుతో ప్రపంచంలోనే అత్యన్నత వృద్ధి రేటును చైనా సాధించింది. 2008–2019 దశాబ్దంలో ఆర్థిక మాంద్య కాలంలో చైనా సగటు వృద్ధి రేటు 7.99 శాతానికి నమోదైంది. ఇది ఆ దశాబ్దంలో ఏ దేశమూ సాధించినంత అధిక వృద్ధి రేటు. 2004లో చైనా వస్తుతయారీ రంగం 625 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేయగా 2019 నాటికి అది 3,896 బిలియన్లకు అమాంతంగా పెరిగింది. ఈ అసాధా రణమైన వృద్ధిరేటు వల్ల చైనా 2011లోనే ప్రపంచ తయారీరంగ కార్ఖానాగా మారింది. ఆ నాటికి ప్రపంచ తయారీరంగ ఉత్పత్తిలో చైనా వాటా 28.4 శాతంగా నమోదైంది. 2010లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. నాలుగు: ఆర్థిక రంగ సంస్కరణలు ప్రైవేట్ భాగస్వామ్యానికి చోటు కల్పించినప్పటికీ, చైనా ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం జీడీపీలో 23 నుంచి 27 శాతం వాటాను సాధించాయి. ఇవి పారి శ్రామిక రంగంలో 21 శాతం వాటాను కలిగి ఉండగా, నిర్మాణ రంగంలో 38.5 శాతం, హోల్‌సేల్, రిటైల్ రంగంలో 39 శాతం వాటాను, రవాణా, నిల్వ రంగంలో 77 శాతం వాటాను సాధించాయి. ఇక మొత్తం ద్రవ్యరంగంలో 88 శాతం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో 24.6 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ సంస్థలకు చోటు దక్కగా చైనా నుంచి 9 సంస్థలు స్థానం సంపాదించాయి. 2017 నాటికి ఈ జాబితాలో మొత్తం 102 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 77 సంస్థలు చైనాకు సంబంధించినవే ఉండటం గమనార్హం. చైనా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు 2017లో 22,310 బిలియన్ డాలర్లతో రికార్డు సృష్టించాయి. కాగా మొత్తం 7,676 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సరకులను అమ్మగలిగాయి. ప్రత్యేకించి బొగ్గు, ఇనుము పెద్దగా లేని లోహాలు, ఉక్కు, విద్యుత్తు, నిర్మాణ పరి శ్రమ వంటి రంగాల్లోకి చైనా భారీ పెట్టుబడులను తరలించింది. వీటిలో కొన్ని పరిశ్రమలను అధికోత్పత్తి సామర్థ్యతతో నిర్మించారు. చైనా 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరింది. అప్పటినుంచి 2015 నాటికి 15 సంవత్సరాల వ్యవధిలో ఏటా 13 శాతం సగటు ఉత్పత్తి రేటుతో చైనా ఉక్కు ఉత్పత్తిని అతి భారీ స్థాయిలో కొనసాగించింది. ఒక్క ఉక్కు రంగంలోనే 2018లో 8.1 శాతం వృద్ధి రేటుతో 928 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని, సిమెంట్ రంగంలో 895 మిలియన్ టన్నుల అధికోత్పత్తి సామర్థ్యాన్ని చైనా సాధించింది. ఇది ప్రపంచ అధికోత్పత్తి సామర్థ్యంలో 45 శాతా నికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయిదు: చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థ 2016 నాటికి యూరో పియన్ యూనియన్ బ్యాంకింగ్ వ్యవస్థకంటే పెద్దదిగా మారింది. చైనా బ్యాంకుల సొంత ఆస్తుల విలువ 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది చైనా జీడీపీకి 3 రెట్లు ఎక్కువ. 2001 నుంచి చైనా బ్యాంకులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారీ స్థాయి మౌలిక వస తుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు అందించాయి. దీంతో అధికోత్పత్తి సామర్థ్యం కలిగిన చైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లు నిర్మాణ రంగ సామగ్రిని ఈ దేశాలకు భారీగా పంపించగలిగాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ 2017లో నిర్వహించిన 19వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మార్క్సిస్ట్ దృక్పథం, వైధానికం తోడుగా 2049 నాటికి చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా మలుద్దామని పిలుపు నిచ్చింది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, గత మూడు దశాబ్దాల్లో పట్టణ–గ్రామీణ, తీరప్రాంత–మైదాన ప్రాంతాల మధ్య విభజనలు పెరి గాయి. 2019 నాటికి ఈ విభజన భారీ స్థాయికి చేరుకుంది. తీర ప్రాంతాల్లో నివసించే ఒక శాతం జనాభా దేశ మొత్తం సంపదలో 13 శాతాన్ని అదుపులో ఉంచుకున్నది. దీంతో చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాం తానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయ త్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యా సాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపి స్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు చైనా ఆర్థిక వ్యవస్థ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితితో అయితే లేదు. డా. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ ‘ మొబైల్: 79089 33741 -
ఐడీబీఐ బ్యాంక్ అమ్మకం, ప్రక్రియకు గడువు కోరిన మర్చంట్ బ్యాంకర్లు
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకు విక్రయ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్లు 52 వారాల గడువును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు యాజమాన్య నియంత్రణతోపాటు.. డిజిన్వెస్ట్మెంట్కు మే నెలలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆపై వాటా విక్రయ వ్యవహారాన్ని నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి జులై 13కల్లా బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ పేర్కొంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఏడు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు రేసులో నిలిచాయి. అయితే వీటిలో అధిక శాతం సంస్థలు విక్రయ ప్రాసెస్‌కు 52 వారాల గడువును కోరుతున్నట్లు తెలుస్తోంది. పలు దశలలో బ్యాంకు ప్రయివేటైజేషన్ ప్రక్రియను చేపట్టవలసి ఉన్నట్లు ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఐడీబీఐ బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్‌ను పూర్తిచేయాలని భావిస్తోంది. వెరసి మర్చంట్ బ్యాంకర్లు 26 వారాలు లేదా ఆరు నెలల్లోగా కొనుగోలుదారుడిని వెదకవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ విక్రయాన్ని చేపట్టేందుకు డెలాయిట్ టచ్ టోమత్సు ఇండియా, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కేపీఎంజీ, ఎస్బీఐ క్యాపిటల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంకు వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు కేపీఎంజీ రూ. 1కే బిడ్ దాఖలు చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకులో ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ఇతరులు 5.29 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2021–22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాదిలోగా ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్‌ను పూర్తిచేయనున్నట్లు ప్రతిపాదించిన విషయం విదితమే. చదవండి: నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ!! -
విద్యారంగాన్ని వ్యాపారం చేసిన కేసీఆర్
నవాబుపేట: విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపారం చేసిన సీఎం కేసీఆర్, ప్రైవేటు సంస్థలకు కొమ్ముకాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా నవాబుపేట మం డలం మమ్మదాన్‌పల్లిలో ఆయన పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ..కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడానికే విద్యాసంస్థలను ప్రారంభించారన్నారు. ఫీజులు వసూలు చేసుకోగానే విద్యా సంస్థలను మళ్లీ మూసివేస్తారని ఆరోపించారు. ఉన్న పాఠశాలలను మూసి వేసి, వాటి స్థానంలో కిలోమీటర్‌కో బార్ షాపును తెరుస్తున్న కేసీఆర్‌కు ఉపాధ్యాయులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. తన తండ్రి ఉపాధ్యాయుడు కావడంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చి శక్తిమంతమైన తెలంగాణను నిర్మించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన వంద మంది నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్య«క్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి పాల్గొన్నారు. -
200వ రోజుకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేటితో(సోమవారం) 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. సాయంత్రం క్యాండిల్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఇక ఉద్యమంలో భాగంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిన్న 10వేల మందితో మానవహారం చేపట్టారు. కాగా ఉద్యమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటి నుంచి అండగా ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ చేయొద్దంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. చదవండి: ‘టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి’ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్ణయం తెలిసిన నాటి నుంచి స్టీల్‌ప్లాంట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు, బంద్‌లు, సమ్మెలు నిర్వహించారు. అప్పటి నుంచి కూర్మన్నపాలెం కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాలు చేసే ఉద్యమాలకు రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తూ కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తోంది. చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ -
స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద కార్మికుల నిరసన..
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద ఎత్తున కార్మికులు అడ్మిన్ భవనం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. స్టీల్ ప్లాంట్‌కు చేరుకునే అన్ని మార్గాలను దిగ్భంధించేందుకు కార్మికులు యత్నించారు. కాగా, భారీవర్షంలోనూ గొడుగులు పట్టుకుని మరీ.. కార్మిక సంఘాల నేతలు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. -
విశాఖ ఉక్కు కోసం న్యాయస్థానాలను ఆశ్రయిద్దాం: విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీలో వరుసగా రెండో రోజు నిర్వహిస్తున్న ధర్నాకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఆంధ్రా భవన్ ఆవరణలో మంగళవారం ఉక్కు కార్మికులు చేపట్టిన ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఉక్కు కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదు’’ అని తెలిపారు. ఒక సంవత్సరం పాటు పోరాటాన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియపై స్టే తీసుకురావాలని సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయని.. అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు అన్నారు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఉక్కు కార్మికుల పోరాటంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
విశాఖ పట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవెటీకరణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం అఫిడివిట్ దాఖలు చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం చేస్తున్నారు. గురువారం.. స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్వంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున స్టీల్‌ప్లాంట్ ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతే కాకుండా విధులకు వెళుతున్న కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకుంటున్నారు. కాగా, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.కేంద్రం చర్యలపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. -
Vizag Steel Plant: ‘ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’
సాక్షి,ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది. శనివారం ఉక్కు పరిరక్షణ సమితి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం కొత్త పరిశ్రమలు ఇవ్వకుండా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మణిహారంలాంటి విశాఖ స్టీల్‌ను కాపాడుకోవాలని పేర్కొన్నారు. రూ.వేలకోట్ల విలువైన విశాఖ స్టీల్‌ను చౌకగా అమ్మేస్తున్నారని, స్టీల్‌ప్లాంట్ అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని విపక్షాలను కోరతామని చెప్పారు. తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, పార్లమెంటరీ పార్టీ నాయకులు స్టీల్ ప్లాంట్ సమస్యకు మద్దతు పలికారని వెల్లడించారు. -
మీకిదే చివరి అవకాశం.. కౌంటర్ దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు మరికొంత గడువునిచ్చింది. తదుపరి విచారణ కల్లా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలులో జాప్యం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో జాప్యం తగదన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దాన్ని రద్దు చేయాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ (జేడీ లక్ష్మీనారాయణ) పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలుకు మరో వారం గడువు కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. జేడీ లక్ష్మీనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 29న బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తోందన్నారు. అలాంటిదేం లేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. -
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం
సాక్షి, ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా లీగల్ అడ్వైజర్ (న్యాయæ సలహాదారు), ట్రాన్సాక్షన్స్ అడ్వైజర్ (వ్యవహారాలు సలహాదారు)ల కోసం ప్రభుత్వం బుధవారం బిడ్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్ణయం తెలిసిన నాటి నుంచి స్టీల్‌ప్లాంట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు, బంద్‌లు, సమ్మెలు నిర్వహించారు. అప్పటి నుంచి కూర్మన్నపాలెం కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాలు చేసే ఉద్యమాలకు రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తూ కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు సార్లు కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది. గత నెలలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో స్వయంగా కేంద్ర ఉక్కుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జరిపిన చర్చల్లో కూడా స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని కోరడం జరిగింది. అయినా కేంద్రం తన దూకుడును కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గత నెల 22న న్యూఢిల్లీలో జరిగిన దీపమ్ సమావేశంలో లీగల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్లను నియమించాలని నిర్ణయించారు. బిడ్లకు సంబంధించిన దరఖాస్తులను బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ప్రీ బిడ్ మీటింగ్ ఈనెల 15న ఏర్పాటు చేశారు. ఈనెల 28న దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. టెక్నికల్ బిడ్‌ను ఈనెల 29న తెరవనున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ఈ ఏడాదిలోనే ప్రైవేటీకరణ పూర్తి!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ పలు సవాళ్లు విసురుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లోగా ఎంపిక చేసిన పీఎస్‌యూల ప్రైవేటీకరణను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ తదితరాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ దిగ్గజాలలో ఇప్పటికే వాటా విక్రయ(డిజిన్వెస్ట్‌మెంట్) సన్నాహాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుత ఏడాది ముగిసేలోగా ప్రయివేటైజేషన్‌ను పూర్తి చేయాలని కాంక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే మహమ్మారి కారణంగా ప్రయాణాలపై ఆంక్షలకు తెరలేచిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీల కొనుగోలుకి సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికలను రూపొందించడం తదితర అంశాలకు విఘాతం కలుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సెప్టెంబర్ నుంచీ పరిస్థితులు అనుకూలించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రయివేటైజేషన్ ప్రక్రియలో రెండో దశకు చేరిన కంపెనీల జాబితాలో ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్‌తోపాటు.. పవన్ హంస్, బీఈఎంఎల్, ఎన్ఐఎన్ఎల్ చోటు చేసుకున్నాయి. ఈ సీపీఎస్ఈలలో వాటా కొనుగోలుకి ఇప్పటికే పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం(ఈవోఐ) చేశాయి. ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే రూ. 32,835 కోట్లు అధికంకాగా.. తాజా లక్ష్యంలో రూ. లక్ష కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో వాటా విక్రయం ద్వారానే సమీకరించాలని ఆశిస్తుండటం గమనార్హం! -
‘ప్రైవేటు’తో అంబేడ్కర్ ఆశయాలకు గండి
భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జన్మదినోత్సవం అంటే ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ చాలా ముఖ్యమైంది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సాధించాల్సిన భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు వెన్నెముక వంటివి. వాటిని నాశనం చేయడానికి కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ విధానాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వాలు 1991 నుండి డిజిన్వెస్టుమెంటు పేరుతో కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రభుత్వ వాటాలను 24 శాతం, 49 శాతం, 74 శాతం చొప్పున ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకొంటూ వస్తున్నాయి. ఇప్పుడు 100 శాతం వాటాలను, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలనే స్వదేశీ విదేశీ మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పనంగా అప్పగించడానికి మోదీ ప్రభుత్వం తెగబడింది. 2021–22 కేంద్ర బడ్జెట్‌ని సమర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 2021 ఫిబ్రవరి 24న ఒక వెబినార్‌లో సందేశం యిస్తూ ‘ప్రభుత్వం బిజినెస్ చేయకూడదు, బిజి నెస్ సంస్థలను మోనిటర్ చేయడం, వాటికి అవసరమైన వసతులు, సదుపాయాలు సమకూర్చడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి’ అని చెప్పుకొచ్చారు. ప్రధాని వ్యాఖ్య భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన బీఆర్ అంబేడ్కర్ ఆశయానికి అశనిపాతం వంటిది. 1944 ఆగస్టు 24న కలకత్తాలో చేసిన ప్రసంగంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విద్య, పరిశ్రమలకు ప్రథమ ప్రాధాన్యత ఉండాలని అంబేడ్కర్ చెప్పారు. ప్రైవేట్ సంస్థల దోపిడీ నుంచి రక్షణ కోసం పరిశ్రమలు, వ్యవసాయం ప్రభుత్వరంగంలో ఉండాలని రాజ్యాంగ రచనా కమిటీలో అంబేడ్కర్ గట్టిగా వాదించారు. భారత సమాఖ్య తన రాజ్యాంగ సూత్రాల్లో క్రింది చట్టపరమైన అంశాలు ప్రకటించాలని ప్రతిపాదించారు. కీలక పరిశ్రమలు, కీలకంగా ప్రకటించబోయే పరిశ్రమలూ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ప్రభుత్వమే వాటిని నడపాలి. మౌలిక పరిశ్రమలైన వాటిని ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలి. అంబేడ్కర్ సూచనలకు అనుగుణంగా 1948లో బాంబే ప్లాన్ పేరుతో మొదటి పారిశ్రామిక తీర్మానం చేశారు. 1950లో ప్రణాళికా సంఘం ఏర్పర్చారు. 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 1969లో 14 పెద్ద ప్రైవేట్ బ్యాంకులను, 1980లో మరో 6 బ్యాంకులను జాతీయం చేశారు. 1951లో 5 ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉండగా 2019 మార్చి నాటికి 348కి పెరిగి, దాదాపు రూ. 16.41 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉండేవి. 2018–19లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే రూ. 25.43 లక్షల కోట్లు ఆదాయాన్ని సంపాదించాయి, రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థల్లో అత్యధికం 1990 వరకు లాభాలు గడించాయి. 1990–91 ప్రపంచ ఆర్థిక మాంద్యంలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా భారత ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రభుత్వరంగ సంస్థలే ఆధారం. దేశ స్వావలంబనకు, ప్రజా సంక్షేమానికి పట్టుకొమ్మలుగా అలరారుతున్న సంస్థలను ‘ఆత్మ నిర్భర భారత్‘ పేరుతో అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది. కష్టపడి సంపాదించి సంసారాన్ని పోషించుకుంటూ భవిష్యత్ తరాల కోసం ఆస్తులను పోగేయడం చేతగానివారు తాతలు కూడబెట్టిన సంపదను తెగనమ్ముకొంటూ బడాయిగా బతుకుతుం టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని అదే. తొలి ప్రధాని జవహర్ లాల్ నుంచి దేవేగౌడ వరకు నడిచిన ప్రభుత్వాలన్ని ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు ప్రాధాన్యమిచ్చాయి. ఆ తర్వాతి ప్రధాన మంత్రుల ఏలుబడిలో ప్రభుత్వ సంస్థల్లోని పెట్టుబడుల వాటాలను అమ్ముకోవడం మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించక పోగా 338 సంస్థలను టోకుగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడానికి చర్యలు చేపట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుదించుకుపోయి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధి హరించుకు పోతుంది. రిజర్వేషన్లు డొల్లగా మారిపోతాయి. 30 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా 25 లక్షల మంది పనిచేసేవారు. నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో.. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం, డిజిన్వెస్టుమెంటుతో పోస్టులు రద్దు కావడం వలన ఉద్యోగుల సంఖ్య 75% పైగా తగ్గిపోయింది. ఎల్ఐసీ, బ్యాంకులు, కోల్ మైన్స్, రక్షణ రంగ సంస్థలు, ఎయిర్ లైన్స్, హైవేస్, రైల్వేస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వంటి సంస్థల్లో లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో రిజర్వేషన్ల అమలు వలన సగానికంటే ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల వారు వున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం వలన ప్రభుత్వ రంగ సంస్థలు ఎగిరిపోవడంతో అందరి ఉద్యోగాలతో పాటు బలహీన వర్గాల ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఫలితంగా.. సామాజిక న్యాయం సమసిపోతుంది, అంబేడ్కర్ ఆశయం అంతమవుతుంది. వ్యాసకర్త: నాగటి నారాయణ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు 94903 00577 -
ప్రయి‘వేటు’ పడగ నీడ!
ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. దీంతో ప్రపంచం లోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. చిత్తశుద్ది ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి– ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించింది. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడం విచిత్రం. ప్రభుత్వ రంగ సంస్థల స్థిరాస్తుల మీద కన్నేసిన కార్పొరేట్ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించుకుంటాయి? కార్యదక్షత తెలిసేది కష్టకాలంలోనే! అన్నీ సాఫీగా నడిచినపుడు కాక సంక్షుభిత సమయాలే పాలకుల్లో సమర్థత ఉందో, లేదో అద్దంపడుతాయి. ప్రజల పట్ల ప్రభుత్వాల నిబద్ధతను నిగ్గు తేలు స్తాయి. మాటకి–చేతకి పొంతన ఎంతో తేల్చి చెబుతాయి. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. కోవిడ్ మహమ్మారి కొట్టిన దెబ్బకు దేశంలోని కోట్లాది కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. సంవత్సరాల నుంచి ఉద్యోగమో, ఉపాధో అని నిరీక్షిస్తున్న కుటుంబాల గతి ఇప్పటికే దీనంగా ఉంటే, ఉన్న ఉద్యోగం–ఉపాధి కోవిడ్ వల్ల కోల్పోయి రొడ్డున పడ్డ జీవితాలు దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నాయి. తమ ఉద్దీపన చర్యలతో కోలుకుంటోందని ప్రభుత్వాలు ఊదరగొట్టిన ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ రెండో విజృంభణతో వెనక్కి జారుతోంది. పూర్తి మూసివేత (లాక్డౌన్) లేకపోయినా... దాదాపు అలాంటి పరిస్థితినే తలపిస్తున్న నిర్బంధాలు, నిషేధాలు, కఠిన ఆంక్షలు వివిధ కార్య కలాపాల్ని స్తంభింపజేస్తున్నాయి. సామాన్యుల మనుగడ దుర్భరం చేస్తూ ఆర్థిక వృద్ధిని అడ్డగిస్తున్నాయి. దినకూలీల ఉపాధి ఉట్టెక్కుతోంది. ఉద్యోగాలు ఊడుతున్నాయి. రాబడి తగ్గిన ఈ కష్టకాలం లోనే.. ఖర్చులు రమారమి పెరిగాయి. అత్యధికుల బతుకు దుర్భర మౌతోంది. ప్రకృతి దెబ్బకు ప్రభుత్వాల నిర్వాకంతోడై సమాజంలో ఆర్థిక అంతరాలు అధికమౌతున్నాయి. సంపన్నులు మరింత సంపన్ను లవుతుంటే, పేదలు నిరుపేదలవుతున్నారు. మధ్యతరగతి జీవులు దీనంగా దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. అశాంతి ప్రబలుతోంది. ఈ నెల 11తో ముగిసిన వారం నమోదైన జాతీయ నిరుద్యోగిత 8.58 శాతానికి చేరింది. గత నెలా ఖరుకున్న 6.65%పైన ఇది దాదాపు 2% పెరుగుదల. నగర–పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత సుమారు పది శాతానికి చేరుకున్నట్టు ‘భారత ఆర్థిక నిర్వహణ కేంద్రం’ (సీఎంఐఈ) అధ్యయనం చెబుతోంది. ఇవి ప్రమాద సంకే తాలు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. సర్కార్ల చిత్తశుద్ధే ముఖ్యం! ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావు. కనుకే, అందుకు తలపడవద్దని, పోరాడి నిలిచి–గెలవాలనీ అందరూ చెబుతారు. అయినప్పటికీ ఆత్మహత్య చేసుకునే వారి మానసిక పరిస్థితి గురించి ఒక క్షణం ఆలోచించాలి. ‘నేను చాతకాక చావటం లేదు, నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి.. ఆరేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఏ యత్నమూ ఫలించలేదు, సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తేవాలని...’ అంటూ వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్న కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సునీల్ నాయక్ ఒక హెచ్చరిక! మరో నిరుద్యోగి, నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, దుస్థితి తట్టుకోలేక తానూ బలవన్మరణంతో తనువు చాలించిన అతని భార్య అక్కమ్మ... ఇవన్నీ సమస్య తీవ్రతకు ప్రతీకలే! ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి–ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపించింది. వాలంటీర్లు, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులు, నర్సులు, టీచర్లు, పోలీసులు, సర్వీసు కమిషన్ ద్వారా ఉన్నతస్థాయి ఉద్యోగులు... ఇలా వివిధ విభా గాల్లో కలిపి రెండేళ్ల కాలంలోనే 4 లక్షల మందికి పైగా ఉద్యోగ–ఉపాధి కల్పించింది. వారంతా, రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడపడంలో భాగమౌతున్నారు. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టక పోవడం విస్మయం. ఖాళీలు భర్తీ చేయరు. వాటిని ఖాళీగా చూపించడం ఇష్టం లేక, విమర్శల్ని ఎదుర్కోలేక పోస్టుల్నే రద్దు చేస్తారు. అయినా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కింద కలిపి సుమారు 60 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం దేశవ్యాప్తం ఖాళీగా ఉన్నట్టు ఓ లెక్క! వాటిని భర్తీ చేసే ప్రయత్నం జరగటం లేదు. ఎన్నికవడానికి ముందు దేశ ప్రజలకు హామీ ఇస్తూ, ‘ఏటా కోటి నుంచి రెండు కోట్ల ఉద్యోగాలి స్తాం’ అన్నారు, ఏవీ? అలాంటిదే మరో ఎన్నికల హామీ, ‘రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం’ అన్నారు, అవెక్కడ? తెలంగాణలో పాలక– విపక్షాల మధ్య ఇదో నిత్యరగడ! ఆరేళ్లలో 1.35 లక్షల మందికి ఉద్యోగ –ఉపాధి కల్పించామని పాలకపక్షం అంటే, నిజానికి ఆ సంఖ్య 35 వేలే అని విపక్షాలంటున్నాయి. ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాలూ తమ ఘనతే అంటే, అక్కడ ఊడిపోతున్న అవకాశాలకూ సర్కార్లు బాధ్యత వహించాలి, వహిస్తాయా? పెరగాల్సిన ఉద్యోగులు తగ్గితే? ఏటా లక్షలాది మంది డిగ్రీలు పొంది ఉద్యోగాల కోసం వీధుల్లోకి వస్తు న్నారు. తగినన్ని అవకాశాలు ఉండటం లేదు. 2017–18 లో నిరుద్యోగిత తీవ్రస్థాయికి చేరింది. 1972–73 తర్వాత, 45 ఏళ్లలో ఇదే అత్యధికమని జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) వెల్లడించింది. 2017 నుంచి 2018 కి వచ్చే సరికి పెరగాల్సింది పోయి, 1.09 కోట్ల మంది ఉద్యోగులు తగ్గినట్టు సీఎంఐఈ అధ్యయనం తెలిపింది. ఖాళీలు భర్తీ చేయడం లేదు. ప్రయివేటు రంగంలోనూ విస్తరణలు ఆశించిన స్థాయిలో లేవు. పెద్ద కార్పొరేట్లు మధ్యతరహా పరిశ్రమల్నీ మననీయటం లేదు. ఉద్యోగిత పెంచే చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రభుత్వాలు తగినంత ప్రోత్సహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటివరకు దాదాపు 3 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయని ఒక అంచనా! 1.91 లక్షల ఖాళీలున్నాయని ఇటీవల పీఆర్సీ నివేదికే చెప్పింది. 25 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది యువకులు ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో.. కోవిడ్ పెద్ద దెబ్బే కొట్టింది. మొదటి విజృంభణలో గత సంవత్సరం కష్ట నష్టాలకోర్చి స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికుల్లో 38.6 శాతం మంది మాత్రమే, తమ పని ప్రదేశాలకు తిరిగి వెళ్లినట్టు ఓ అధ్య యనం చెప్పింది. ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకమే (ఎన్నార్ఈజీ) అత్యధికుల్ని ఆదుకుంది. ఈ పథకం ద్వారా 2019–20 లో 7.88 కోట్ల మంది, 2020–21 లో 11.17 కోట్ల మంది శ్రామిక ప్రజలు లబ్ధి పొందారు. కాలం మారుతోంది, కర్కశంగా... ఇదివరకెన్నడూ లేని విధంగా, ‘అవునూ, అన్నీ ప్రైవేటుపరం చేస్తాం, ఏమిటి తప్పు?’ అని దర్జాగా, ధాటిగా సర్కార్లు ఎదురు ప్రశ్నించే కాలం వచ్చింది. సంక్షేమ రాజ్యం–జవాబుదారీతనం అర్థాలే మారుతున్నాయి. ‘‘ప్రభుత్వ నిర్వాకాల వల్ల నష్టాలొస్తున్నాయి, అందుకే పబ్లిక్ రంగ సంస్థల్ని ఎంతో ‘సామర్థ్యం’ ఉన్న ప్రైవేటుపరం చేస్తు న్నామం’’టున్నారు. అంతటా ప్రైవేటు రంగానికి అంతటి సామర్థ్యమే ఉంటే, వాళ్లు తీసుకున్న అప్పులు, ఇన్నిన్ని బ్యాంకుల్లో ఇన్నేసి లక్షల కోట్లు నిరర్థక ఆస్తులు (ఎన్పీయే)గా ఎందుకు మారుతున్నాయి? ప్రజాధనాన్ని ఎందుకిలా కొల్లగొడుతున్నారు? ఇప్పటికే నదులు, సముద్రాలు, అడవులు, కొండలు, కోనలు, ఖనిజాలు.. ఇలా సహజ వనరుల్ని ప్రైవేటుపరం చేసి, కొత్త ఆశ్రిత వర్గాల్ని బలోపేతం చేసు కుంటున్నారు. పరిశ్రమలని, సెజ్లని, ఫార్మాసిటీలని ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తుల కిచ్చేస్తున్నారు. కర్షకులు, కార్మికులు, ఇతర పౌర సమాజం పోరాడి సాధించుకున్న చట్టాల్ని, హక్కుల్ని క్రమంగా నీరుగారుస్తున్నారు. చట్టాల్ని మారుస్తూ, ప్రజల దృష్టి ఏమారుస్తూ... ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. అరవై, డెబ్బై ఏళ్లుగా ప్రజాధనం వెచ్చించి, ఇటుక ఇటుకగా పేర్చి అభివృద్ధి చేసిన పబ్లిక్‌రంగ సంస్థల్ని (వ్యూహాత్మ కమైనవి తప్ప) అన్నింటినీ ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. పప్పు బెల్లాలకు ధారా దత్తం చేస్తున్నారు. అందులో నష్టాలొచ్చేవే కాదు, లాభాలు గడించేవీ ఉన్నాయి! వాటి స్థిరాస్తులమీద కన్నేసిన కార్పొరేట్ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించు కుంటాయి? జీతాలు కోస్తే అడిగేదెవరు? ఉద్యోగుల్ని తొలగిస్తే పట్టించుకునేదెవరు? అది పరోక్షంగా నిరుద్యోగితకే దారి తీస్తుంది. అందుకే అంటారు, విప్లవం ప్రత్యక్ష ఉత్పత్తి కాదు, విప్లవ పరిస్థితుల ఉప ఉత్పత్తి అని! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
Vijayawada: బేరానికి బెజవాడ రైల్వేస్టేషన్!
సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. రీ డెవలప్మెంట్ పేరిట 99 ఏళ్లు పాటు ప్రైవేటుకు ఇచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వేలో ప్రాధాన్యం కల్గిన ఈ స్టేషన్‌ను లీజుకు ఇవ్వనుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే నిర్ణయం.. విజయవాడ రైల్వే స్టేషన్‌ను కమర్షియల్‌గా హంగులతో ఆధునికీకరించేందుకు ప్రైవేటు బిడ్డర్లను పిలవాలని గతంలోనే రైల్వే బోర్డు నిర్ణయించింది. బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను కూడా కోరింది. అప్పట్లో బిడ్డర్లు ముందుకు వచ్చినా రైల్వే నిబంధనల కారణంగా వెనకడుగు వేశారు. అప్పట్లో 30 ఏళ్లు లీజు కాలంగా ప్రతిపాదించడంతో ఉపయోగం ఉండదని బిడ్డర్లు భావించారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు గుత్తగా రైల్వేస్టేషన్‌ను దీర్ఘకాలం అప్పగిస్తే మంచిదని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని ఏ1 రైల్వే స్టేషన్లను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ఎంపిక చేశారు. అందులో విజయవాడ రైల్వేస్టేషన్‌ను కూడా చేర్చారు. దీనిపై రైల్వే కార్మిక సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రాధాన్యం ఉన్న స్టేషన్.. విజయవాడ రైల్వేస్టేషన్ 1888లో ప్రారంభమైంది. మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 10 ప్లాట్ ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ గుండా కరోనాకు ముందు ప్రతి రోజు 250, ప్రస్తుతం 150 రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ గతంలో రోజుకు రెండు లక్షలు కాగా ప్రస్తుతం లక్ష వరకు ఉంటోంది. అన్ని సదుపాయాలూ ఉన్నా.. ఇక ఈ స్టేషన్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. పది ప్లాట్ ఫారాలు అనుసంధానం చేస్తూ మూడు ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు ఉన్నాయి. వీటిలో ఒకటి పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆరు మీటర్లు వెడల్పు 185 మీటర్లు పొడవుతో ఉంటుంది. రైల్వేస్టేషన్లో రిటైరింగ్ రూమ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్ల సదుపాయాలూ ఉన్నాయి. జనరల్, నాన్ ఏసీ, ఏసీ రెస్ట్ రూమ్‌లు ఉన్నాయి. పే అండ్ యూజ్ టాయిలెట్స్‌తో పాటు ప్రయాణికులకు డిస్ప్లే సిస్టమ్, ఆధునికీకరించిన ప్లాట్‌ఫారాలు, స్టాండర్స్ ఎక్విప్మెంట్ల వినియోగం, క్లీన్ అండ్ గ్రీన్ వంటి సదుపాయాలతో నేషనల్ గ్రీన్బిల్డింగ్ కౌన్సిల్ గోల్డెన్ అవార్డును సాధించింది. ఐఎస్ఓ హోదాను కల్గి ఉంది. ఆదాయం ఫుల్ అయినా.. విజయవాడ డివిజన్ నుంచి రైల్వేస్‌కు గణనీయమైన ఆదాయం వస్తోంది. నంబర్‌వన్ స్థానానికి పోటీ పడుతోంది. ఇటువంటప్పుడు ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేకంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకునైనా రైల్వేనే సొంతంగా రీ డెవలప్మెంట్ వంటి వాటితో పాటు కమర్షియల్‌గా అభివృద్ధి చేయవచ్చు. అలా కాకుండా ప్రైవేటు పరం చేసి 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తే ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ప్రయాణికులపైనా యూజర్‌చార్జీల భారం పడే అవకాశం ఉందని కార్మికులతో పాటు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. స్టేషన్ రీ డెవలప్మెంట్ కోసమే.. స్టేషన్‌ను రీడెవలప్మెంట్ చేయడానికి రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టు కింద తీసుకుని డెవలప్మెంట్ చేసేవారికి అప్పగిస్తారు. ఇప్పటికే గుజరాత్‌లోనూ, భోపాల్ వద్ద స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేశారు. డెవలప్మెంట్ చేసిన వాళ్లు యూజర్ చార్జీలు వసూలు చేసుకుంటారు. – పి.శ్రీనివాస్, డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రైవేటీకరణ తగదు రైల్వే స్టేషన్ ప్రైవేటీకరించాలనే ఆలోచన తగదు. ప్రైవేటు సంస్థలు ప్రయాణికులపై ఆర్థిక భారంమోపుతాయి. ముఖ్యంగా యూజర్ చార్జీల పేరుతో ఎక్కువ సొమ్ము వసూలు చేస్తాయి. ప్రస్తుతం స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా అవసరమైతే మెరుగైన సౌకర్యాలు రైల్వేశాఖే కల్పించాలి. – వడ్లమూడి రవి, ప్రయాణికుడు లీజుకు ఇవ్వడం సరికాదు.. దక్షిణ మధ్య రైల్వేలోనే మన స్టేషన్‌కు మంచి ఆదాయం వస్తుంది. అటువంటి స్టేషన్‌ను 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాలనుకోవడం సరియైన నిర్ణయం కాదు. అవకాశం ఉన్నంత వరకూ రైల్వే శాఖే స్టేషన్ల అభివృద్ధిని చేపట్టాలి. తద్వారా ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు మేలు జరుగుతుంది. – శ్రీనివాస్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు -
రోడ్లతో కాసుల వర్షం.. రూ.లక్ష కోట్లు!
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ద్వారా వచ్చే ఐదేళ్లలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.లక్ష కోట్లను సమీకరించే ప్రణాళికతో ఉన్నట్టు కేంద్ర రవాణా, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రంగంలోని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి మంచి అవకాశాలను సొంతం చేసుకోవాలని కోరారు. ఈ నిధులను తిరిగి మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్టు మంత్రి చెప్పారు. ఇది వృద్ధికి ఊతమిస్తుందన్నారు. జాతీయ అస్సెట్ మానిటైజేషన్ (ఆస్తులపై ఆదాయం రాబట్టుకోవడం) పైప్‌లైన్ మౌలిక సదుపాయాల రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే మంచి కార్యక్రమంగా మంత్రి అభివర్ణించారు. ప్రభుత్వం నూతన డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ)ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం దీనికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తన వాటాగా రూ.20,000 కోట్లను సమకూర్చనుంది. ఐదేళ్లలో దీని ద్వారా రూ.5 లక్షల కోట్ల రుణ వితరణ చేయాలన్నది లక్ష్యం. ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేక ఈ హైవే ఢిల్లీ– ముంబై మధ్యనున్న 1,300 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ రహదారి పొడవునా ప్రత్యేకంగా ఈ–హైవేను నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ–హైవేపై బస్సులు, ట్రక్కులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుంటుందన్నారు. దీనివల్ల రవాణా వ్యయం 70 శాతం తగ్గుతుందని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా మంత్రి తెలిపారు. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. -
రైల్వే సదుపాయాలను ప్రైవేటీకరించేది లేదు
న్యూఢిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధి కోసం ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించి నిధులు రాబట్టుకునే (మానిటైజేషన్) ప్రణాళికలతో ఉన్నట్టు రైల్వే మంత్రీ పీయూష్ గోయల్ రాజ్యసభకు శుక్రవారం తెలియజేశారు. ప్రయాణికుల రైళ్ల కార్యకలాపాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన చేపట్టనున్నామని.. తద్వారా రూ.30,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను తీసుకురానున్నట్టు తెలిపారు. ఈస్టర్న్, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లను ప్రారంభించిన తర్వాత మానిటైజేషన్ ప్రణాళికతో రైల్వే శాఖ ఉన్నట్టు చెప్పారు. అలాగే, పీపీపీ నమూనాలో స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికుల రైళ్లు, రైల్వే భూములు, బహుళ వినియోగ భవనాలు, రైల్వే కాలనీలు, రైల్వే స్టేడియమ్‌ల రూపంలో నిధులు రాబట్టుకోనున్నట్టు వివరించారు. ఆస్తుల నగదీకరణ వల్ల రైల్వేల అభివృద్ధికి కావాల్సిన నిధు లు సమకూరతాయన్నారు. సభ్యుల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ/మానిటైజేషన్ వేర్వేరు కాంగ్రెస్ సభ్యుడు జైరామ్‌రమేశ్ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ‘‘ప్రైవేటీకరణ చేయడం అంటే ఆస్తులను శాశ్వతంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేయడం. అందులో ఇక ఏ మాత్రం ప్రభుత్వ యాజమాన్యం ఉండదు. కానీ, రైల్వే అమలు చేయనున్న ప్రణాళిక ఏమిటంటే.. ఆస్తులను ఉపయోగించి నిధులను సమకూర్చుకోవడం (మానిటైజేషన్) ఎలాగన్నదే. ఇలా సమకూర్చుకునే నిధులు తిరిగి పెట్టుబడులు పెట్టి, వృద్ధి చెందేందుకే. రైల్వే మౌలిక ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేవేటీకరించము’’ అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్లు (డీఎఫ్సీ) ప్రత్యేక కార్పొరేట్ విభాగాలని.. రైల్వే మద్దతు వాటికి ఉంటుందన్నారు. డీఎఫ్సీ వేసే ట్రాక్‌లకు రైల్వే యజమానిగా లేదన్నారు. పెట్టుబడి ఆధారిత వృద్ధికి రైల్వే కీలకమైనదిగా మంత్రి పేర్కొన్నారు. ‘‘ఒక్క రోడ్డును నిర్మిస్తే ప్రతీ ఒక్కరూ దానిని వినియోగించుకుంటారు. అలాగే, ఒక నూతన రైల్వే ట్రాక్‌ను నిర్మించి వాటి నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించి ప్రోత్సహిస్తే.. అది కొత్త ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందే కానీ, ఉన్న ఉద్యోగాలకు నష్టం చేయదు’’ అని మంత్రి చెప్పారు. -
ప్రభుత్వరంగంపై ఇంత ఏవగింపా?
సంపద ఎక్కడ అపరిమి తంగా పోగు పడుతుందో అక్కడ అంతే తీవ్రంగా అస మానతలు పెరుగుతాయి. అది సామాజిక అశాంతిని సృష్టి స్తుంది. సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బల హీన పరుస్తూ, సమాజంలోని కొద్దిమందికే ఉపయోగపడు తున్నాయని గత ముప్పయ్యేళ్ల ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ కాలం నిరూపిస్తున్నది. జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షల వెలుగులో తక్కువ సమయంలో ఆర్థిక వ్యవస్థ వేగం పెంచడానికి, ప్రజల పేదరికం తొలగిపోవడానికి ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటైనాయి. ప్రజాస్వామ్య సోషలిస్టు వ్యవస్థ పరంగా ప్రపంచానికే ఒక శిక్షణాలయంగా మన దేశం మారాలని నెహ్రూ అనుకున్నారు. 1955లో యు.యన్. ఢేబర్ అధ్యక్షతన జరిగిన అవద్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద ప్రాతిపదికగా నవ సమాజ నిర్మాణ లక్ష్యం ప్రకటితమైంది. ఈ క్రమంలో 444 పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో స్థాపించారు. హిందూస్తాన్ మెషిన్ టూల్స్ (హెచ్ఎంటీ) స్థాపించిన తొలి రోజుల్లో ఉద్యోగులకు జపాన్‌లో శిక్షణ ఇప్పించారు. అది తర్వాత గడియా రాలు, ట్రాక్టర్ల తయారీలో రారాజుగా ఎదిగింది. రక్షణ, అణుశక్తి, అంతరిక్ష రంగంలో స్వావలంబన కోసం హెచ్ఏఎల్, బీఈఎంఎల్, బీడీఎల్, ఎన్ఎండీసీ వంటి సంస్థల స్థాపన జరిగింది. బొగ్గు గనులు, ముడి చమురు ఆధారిత ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఎన్టీపీసీ, లాంటి అనేక పరిశ్రమలు ఏర్పాటైనాయి. 1991 నూతన పారిశ్రామిక తీర్మానం పరిశ్రమల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతించింది. కొన్ని ప్రభుత్వ సంస్థలు కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక పద్ధతు లను అమలు చేయడంలో నిర్లక్ష్యం వల్ల, మరి కొన్ని యాజమాన్యాల అవినీతి వల్ల కుంటుపడ్డాయి. నూతన ఆర్థిక విధానాలకు తెరలేపిన ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రైవేట్ రంగంపై పరిమితులు ఎత్తివేసి, లైసెన్స్ రాజ్‌ను సరళీకృతం చేసింది. ఇక ఎన్డీయే హయాంలో పెట్టుబడుల ఉపసంహ రణ కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటైంది. 2014 వరకు చక్కగా పనిచేసే 200కు పైగా ప్రభుత్వ యాజ మాన్య పరిశ్రమల సంఖ్య 2019 నాటికి వందకు తగ్గింది. ఇదే కాలంలో భారత కుబేరుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. పవర్ గ్రిడ్, రూరల్ ఎలక్ట్రికల్ వంటి సంస్థలకు పరికరాలను సమకూర్చే బీహెచ్ఈఎల్కు ఆరేళ్ల నుండి ఎలాంటి ఆర్డర్లు రావడం లేదు. అదే సమయంలో ప్రైవేటుకు ప్రభుత్వం అపరి మిత స్వేచ్ఛను కల్పించింది. ఇవి తమకు కావాల్సిన పరికరాలను చైనా నుండి దిగుమతి చేసుకుంటు న్నాయి. రక్షణ, అంతరిక్ష రంగంలో క్షిపణులను, రాకెట్లను, తేలికపాటి హెలికాప్టర్లను తయారుచేసే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ 2014 వరకు ఇరవై వేల కోట్ల టర్నోవర్ కలిగివుంది. కానీ 2019 నాటికి వెయ్యి కోట్ల అప్పుతో మిగిలింది. ప్రభుత్వం దేశీయ ప్రైవేటు సంస్థలకు రక్షణ విభాగ కాంట్రాక్టులు ఇచ్చింది. ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అమెరికా వంటి ఆయుధ వ్యాపార దేశాల నుండి ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను బలహీనం చేసింది. లాభాదాయకంగా నడుస్తున్న ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, జీఏఐఎల్ లాంటి వాటిల్లో పెట్టుబడుల ఉపసంహరణకు తెగబడుతున్నారు. దీనికి పరాకాష్టగా ఇటీవల ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యాపారం చేయదు, అది దాని విధి కాదని విస్పష్టంగా ప్రకటించారు. వెనువెంటనే 12 ప్రభుత్వ సంస్థల ఆమ్మకానికి నీతి ఆయోగ్ సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. జాతీ యమైన 27 బ్యాంకులను విలీనం చేస్తూ 12 బ్యాంకు లుగా మార్చారు. జాతీయ బ్యాంకుల్లో మొండి బకా యిలన్నీ ప్రైవేటు సంస్థలవే. ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా అప్పులు ఎగ్గొట్టిన దాఖలా లేదు. ఈ చర్యలు భారత రాజ్యాంగ సామ్యవాద స్ఫూర్తికి విరుద్ధమైనవి. నీరు, నేల, అడవి అన్నీ కార్పొ రేట్ పరం అవుతున్నాయి. ప్రజాతంత్ర వాదులు తమ బుద్ధి, సమీకరణ శక్తిని పెంచి ప్రజాస్వామ్య సోషలిజం పరిరక్షణకు పని చేయాలి. శ్రామిక వర్గాల ప్రయోజ నాల బాధ్యతను మోయాలి. సుస్థిర సమ్మిళిత అభి వృద్ధికి ప్రభుత్వ రంగమే చోదకశక్తిగా మారాలి. అవి జాతి జనులకు అందాలి. -అస్నాల శ్రీనివాస్ వ్యాసకర్త దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ‘ మొబైల్ : 96522 75560 -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు విమానాశ్రయం ట్రీట్మెంట్
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటూ.. ప్రయాణికుల రైళ్లతో చేతులు కాల్చుకుంటున్న రైల్వే.. పాత విధానాలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. నేరుగా కాకుండా పరోక్షంగా ప్రైవేటీకరణ దిశగా పరుగుపెట్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెద్ద రైల్వే స్టేషన్లను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టి వాణిజ్యపరంగా ఆదాయాన్ని పొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా రైల్వేకు అనుబంధంగా ఏర్పాటైన ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎస్డీసీ) ఈ నెలలోనే కార్యాచరణ ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రణాళికను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇందుకు గాను ఆసక్తివ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) నోటిఫికేషన్‌ను ఈ నెలలోనే పిలవబోతున్నారు. సేవల విస్తరణ కంటే ఆదాయంపైనే దృష్టి.. దాదాపు ఐదున్నర ఎకరాల స్థలంలో లక్ష చదరపు మీటర్ల మేర నిర్మాణం రూపుదిద్దుకోనుంది. ఇక్కడ స్థలం లేక.. ఉన్న పది ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా కొత్తవి ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు కొత్త నిర్మాణంలో కూడా ఆ సంఖ్య పెరగదు. అంటే రైలు ప్రయాణానికి సంబంధించిన సేవల విస్తరణ ఉండదు. వెరసి రైలు ప్రయాణికుల సేవల కంటే ఆదాయం పెంచుకోవడంపైనే రైల్వే ఈ ప్రాజెక్టులో దృష్టి సారించింది. గతంలో రైల్వే అధికారులు పీపీపీ పద్ధతిలో రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం రెండుసార్లు టెండర్లు పిలవగా స్పందన రాలేదు. ఇక అలా లాభం లేదని, కేవలం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకే ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఐఆర్ఎస్డీసీని ఏర్పాటు చేసింది. దీంతో కొత్త పంథాలో దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నిర్మాణం, రైల్వేకు ఆదాయం, ఎంతకాలం లీజు.. తదితర వ్యవహారాలకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. దీనికోసమే ఆసక్తివ్యక్తీకరణ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అందులో ముందుకొచ్చే సంస్థలతో సంప్రదింపులు జరిపి కొత్త విధానాన్ని ఖరారు చేయనుంది. మెట్రో రైలుతో అనుసంధానం... కొత్త ఆలోచనలో మెట్రో రైలును కూడా చేర్చనున్నారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు ప్రత్యేకంగా మెట్రో రైలుతో అనుసంధానం చేయనున్నారు. సాధారణ రైలు దిగిన ప్రయాణికులు నేరుగా ఎస్కలేటర్ ద్వారా పక్కనే ఉన్న మెట్రో రైలు స్టేషన్లోకి చేరుకుంటారు. అక్కడ మెట్రో రైలు ఎక్కి గమ్యస్థానం వైపు వెళ్తారు. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం ఐఆర్ఎస్డీసీ ఎండీ మెట్రో రైలు అధికారులతో భేటీ అయ్యారు. అలాగే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కూడా కలిసి పనిచేయనున్నట్లు వారు పేర్కొంటున్నారు. నిర్వహణ భారం రైల్వేపై పడకుండా.. ప్రస్తుతం రైళ్లు, రైల్వేస్టేషన్ల నిర్వహణ అంతా రైల్వే శాఖనే చూస్తోంది. ఇక భవిష్యత్‌లో ఆ భారాన్ని పూర్తిగా వదిలించుకోనుంది. ప్రతిపాదిత స్టేషన్ల నిర్వహణ ఖర్చంతా ఐఆర్ఎస్డీసీనే చూస్తుంది. వాణిజ్యపరంగా స్టేషన్‌ను అభివృద్ధి చేసి భారీగా ఆదాయం పొందుతూ అందులో నుంచే ఖర్చును వెళ్లదీస్తుంది. అది పోనూ సాలీనా రైల్వేకు భారీ ఆదాయాన్ని ముట్టజెపుతుంది. దీనికి తగ్గ విధానాన్ని ఇప్పుడు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మాత్రమే దీని ప్రకారం అభివృద్ధి చేయనుండగా, ఆ తర్వాత నాంపల్లి, కాచిగూడ, బేగంపేట, లింగంపల్లి, కాజీపేట, వరంగల్, తాండూరు, వికారాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, ఖమ్మం తదితర స్టేషన్లను అధీనంలోకి తీసుకోనుంది. ఇలా చేస్తారు.. ప్రస్తుతమున్న రాతి కట్టడం ఎలివేషన్‌ను అలాగే ఉంచుతూ దాని మీదుగా మూడంతస్తులో భారీ భవన సముదాయం నిర్మితమవుతుంది. ప్లాట్‌ఫామ్ నం.1 ముందువైపు ఉండే ఖాళీ స్థలం, ప్లాట్‌ఫామ్ నం.10 వైపు ఉండే ఖాళీ స్థలాలను కలుపుతూ భారీ భవన సముదాయాన్ని నిర్మిస్తారు. దీనికి పూర్తిగా విమానాశ్రయాల ప్రణాళికను అమలు చేయనున్నారు. అరైవల్, డిపార్చర్‌కు విడివిడి సెక్షన్లు ఉంటాయి. భవనానికి దిగువన 450 వాహనాలు నిలిపేలా భారీ పార్కింగ్తో సెల్లార్ నిర్మిస్తారు. ప్రస్తుతం రైలు ట్రాక్‌పైన పూర్తి ఖాళీగా ఉంది. కొత్త ప్రణాళికలో.. అవి భవనం లోపలకు చేరతాయి. అంటే ట్రాక్ పైభాగంలో కూడా నిర్మాణం ఉంటుంది. టికెట్ కౌంటర్లు సహా ప్రయాణికులతో ముడిపడి ఉన్న ఇతర కార్యకలాపాలకు సంబంధించి వేర్వేరుగా ప్రాంగణాలు ఉంటాయి. ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. విమానాశ్రయంలోకి వెళ్లగానే ఉండే తరహా సెటప్ ఉంటుంది. పైఅంతస్తులు పూర్తిగా వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారు. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, గేమింగ్ జోన్, దుకాణ సముదాయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌ల సెటప్ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా మారిపోతుంది. చదవండి: ఇంటర్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తెలంగాణలో చాప కింద నీరులా కరోనా -
విమానాశ్రయాల్లో వాటాల విక్రయం!
న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రయివేటైజ్ చేసిన విమానాశ్రయాల్లో ప్రభుత్వానికి మిగిలిన వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాబితాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నాలుగు విమానాశ్రయాలలో ఎయిర్పోర్ట్ అథారిటీ(ఏఏఐ)కున్న వాటాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశాయి. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22)లో మరో 13 ఎయిర్‌పోర్టులను ప్రయివేటైజ్ చేసే ప్రణాళికల్లో ప్రభుత్వమున్నట్లు వివరించాయి. ఆస్తుల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని చూస్తున్న విషయం విదితమే. గత నెలలో అత్యున్నత కార్యదర్శుల కమిటీ ఈ మేరకు ప్రణాళికలు వసినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో నాలుగు ఎయిర్‌పోర్టుల భాగస్వామ్య సంస్థ(జేవీ)లలో ఏఏఐకుగల వాటాల విక్రయంపై పౌర విమానయాన శాఖ తగిన అనుమతులను పొందనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న కొద్ది రోజుల్లో అనుమతుల అంశం కేబినెట్‌కు చేరనున్నట్లు తెలియజేశాయి. కాగా.. వచ్చే ఏడాదిలో ప్రయివేటైజ్ చేయనున్న జాబితాలోని లాభదాయకం, లాభదాయకంకాని 13 ఎయిర్‌పోర్టులను మిక్స్ చేయడం ద్వారా ఆకర్షణీయమైన ప్యాకేజీకి మార్గమేర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి రౌండ్ ప్రయివేటైజేషన్‌లో భాగంగా అదానీ గ్రూప్ లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏఏఐ నిర్వహణలో దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలున్నాయి. వివరాలివీ ►నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలలో వివిధ సంస్థలకున్న వివరాలు ఎలా ఉన్నాయంటే.. ముంబై ఎయిర్‌పోర్టులో అదానీ గ్రూప్ 74 శాతం వాటాను కలిగి ఉంది. ఏఏఐకు 26 శాతం వాటా ఉంది. ►ఢిల్లీ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూప్ వాటా 54 శాతంకాగా.. ఏఏఐ 26 శాతం వాటాను పొందింది. ఫ్రాపోర్ట్, ఎరమన్ మలేషియా 10 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. ►హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు, ఏఏఐ 26 శాతం వాటాను పొందాయి. ఇదేవిధంగా కర్ణాటక ప్రభుత్వంతో కలసి బెంగళూరు ఎయిర్‌పోర్టులోనూ వాటాను కలిగి ఉంది. -
‘రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు’
సాక్షి, హైదరాబాద్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తే ఆంధ్రప్రదేశ్ విషయాలు నీకెందుకని అంటున్నారు.. ఏపీ దేశంలో రాష్ట్రం కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. ఇవాళ విశాఖ ఉక్కుపై పడ్డారు.. రేపు సింగరేణిని కూడా ప్రైవేట్‌పరం చేస్తామంటారు. ఏపీ విషయంలో నోరు మూసుకుని కూర్చోం. రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు. మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలి’’ అన్నారు కేటీఆర్. చదవండి: గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు ఆ అర్హత లేదా? -
ప్రశాంతంగా ఏపీ బంద్
-
ఏపీ బంద్: డిపోలకే పరిమితమైన బస్సులు
-
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్..
విశాఖపట్నం: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. మద్దిలపాలెం బస్టాండ్ వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్లాంట్ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు. మద్దిలపాలెం బస్ స్టాండ్ వద్ద బస్సులు నిలిపివేశారు. నిరసనలో ప్రజాసంఘాల జేఏసీ, సీఐటీయూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ నరసింగరావు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీ డ్రామాల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పోరాటం చేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరిస్తే లాభాలు వస్తాయని చెప్పారని తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్రానికి సీఎం జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన పది రోజులకు.. చంద్రబాబు స్పందించి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అంటేనే డ్రామాల పార్టీ అని, ఆయన కుమారుడు పప్పునాయుడని ఆయన విమర్శలు గుప్పించారు. నిలిచిన జన సంచారం.. తూర్పుగోదావరి: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపును ఇవ్వడంతో కాకినాడలో బంద్ ప్రభావం కనిపించింది. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్‌కి సంఘీభావం తెలిపాయి. జెఎన్టీయూలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసారు. కాకినాడ సీపోర్ట్ లో కార్మికులు బంద్ ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్కూల్స్, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, సినిమా హాల్స్ మూత పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ట్రావెల్స్, ఆటో డ్రైవర్ లు కూడా బంద్ పాటిస్తుండటంతో జన సంచారం నిలిచిపోయింది. కార్మిక సంఘాల నిరసన.. విజయవాడ: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్‌లో బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల నిరసన చేపట్టారు. కార్మిక సంఘాల నిరసనతో బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. బంద్‌లో వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. స్తంభించిన రవాణా.. కృష్ణా: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ కొనసాగుతుంది. మచిలీపట్నంలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితయ్యాయి. రవాణా స్తంభించింది. స్వచ్ఛందంగా దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌కు సంఘీభావం తెలిపాయి. వామపక్షాల భారీ ర్యాలీ అనంతపురం: నగరంలో వామపక్షాల భారీ ర్యాలీ నిర్వహించాయి. విశాఖ ఉక్కును ప్రవేటీకరించొద్దని డిమాండ్ చేశాయి. బంద్‌కు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కమ్యూనిస్టు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: చంద్రబాబుకు చుక్కలు చూపించిన న్యాయవాదులు ఏక కాలంలో అంగన్వాడీ భవనాల పనులు -
‘ఉక్కు’ సంకల్పంతో నేడు రాష్ట్ర బంద్
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నినాదంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగనుంది. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన ఈ బంద్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రకటించారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా ఐక్య కార్యాచరణ చేపట్టారు. నష్టాల పేరుతో బడా కార్పొరేట్ సంస్థలకు విశాఖ ఉక్కును ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు నినదిస్తున్నాయి. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు, సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బంద్‌ను విజయవంతం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాయి. సీపీఎం, సీపీఐలతోపాటు పలు కార్మిక సంఘాలతో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. వర్తక, వ్యాపార సంస్థలతోపాటు విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛదంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా తాము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బంద్ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. బంద్‌కు మద్దతుగా పలుచోట్ల బైక్ ర్యాలీలు విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో చేపడుతున్న బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించారు. కేంద్రం తీసుకున్న మొండి నిర్ణయంతో కార్మికులు రోడ్డున పడతారని, వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉ«ధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ బీసెంట్ రోడ్లో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, అనంతపురం తదితర జిల్లాల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు. చదవండి: (దేశవ్యాప్తంగా ఉత్తమ సిటీగా విశాఖ) -
బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం
-
బంద్‌కు ప్రభుత్వ మద్దతు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్ర నిర్ణయంపై వెల్లువెత్తుతున్న ప్రజా ఉద్యమానికి వైఎస్సార్సీపీ బాసటగా నిలుస్తుందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కార్మిక సంఘాలు శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జనవాణిని కేంద్రానికి వినిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదట్నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. నేలకొరిగిన తెలుగువారి త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు అన్న నిజాన్ని కేంద్రం ముందు నిక్కచ్చిగా చెబుతామన్నారు. కోట్లాది మంది ప్రజల మనోభీష్టానికి సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని చెప్పారు. కదం తొక్కుతున్న ప్రజాస్ఫూర్తిని నాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకేమన్నారంటే... ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా బంద్ చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం తర్వాత తిరిగేలా ఏర్పాట్లు చేశాం. ప్రజా వ్యతిరేకతను గుర్తించి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. విశాఖ ఉక్కును లాభాల్లోకి తేవచ్చని, నష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలను సీఎం సూచించారు. ఆర్టీసీని ప్రజల ఆస్తిగా మార్చిన సీఎం జగన్ కృషి అందరికీ ఆదర్శం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పులు చేస్తుంటే విపక్షం గగ్గోలు పెట్టడం అర్థరహితం. ప్రజలపై పన్నుల భారం మోపే ఆలోచన సీఎంకు లేదు. చదవండి: 'ఉక్కు' పిడికిలి బిగిసింది -
ప్రయివేటీకరణ: ఫలం తక్కువ.. ప్రమాదమెక్కువ
దేశంలో ఆర్థిక వృద్ధికి ప్రయివేటీకరణ సరైన మార్గమని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టుంది. ఆ అభిప్రాయం సరైందికాదు. అంతకు ముందున్న లైసెన్స్ రాజ్ దేశం లోని వృద్ధిని మందగింపజేస్తే, సరళీకరణ తర్వాత పరిణామాలు వృద్ధిని కొద్దిమంది చేతిలో బందీని చేశాయి. దేశానికి సొంత వనరుల్ని వాడుకుంటూ సృష్టించిన సంపద అతికొద్దిమంది చేతికే చెంది, అత్యధిక మందిని పేదలుగా ఉంచింది. దేశంలోని పెరిగే సంపదలో 70 శాతం కేవలం పది శాతంమంది దగ్గర పోగుపడడం, అసమానతల్ని పెంచే విధానాల్ని చెబుతోంది. కాబట్టి ఇప్పుడు దేశానికి కావాల్సింది సంపదల సరైన పంపిణీ. ఆర్థిక అసమానతల్ని, వీటికి మూలంగా నిల్చిన సామాజిక అసమానతల్ని రూపుమాపే కార్యక్రమం. సంపద సృష్టికి దోహదపడే వనరుల సృష్టి, వినియోగం. విలువైన మానవ వనరులు ఏర్పడేలా అందరికీ ఉచిత విద్యావకాశాలు, ఉచిత లేదా చవకైన ఆరోగ్య సేవలు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం అన్నవి దీర్ఘకాలికంగా దేశానికి లాభం చేకూర్చేవి. అన్ని ప్రభుత్వ సంస్థలూ అసమర్థమైనవి కావు, అన్ని ప్రయివేటు సంస్థలూ గొప్పవి కావు. నిర్వహణ బట్టీ ఫలితం. నిర్వహణలో లోపాల్ని సరిదిద్దితే గాడిన పడతాయి. ప్రైవేటు సంస్థ చెయ్యగలిగింది ప్రభుత్వం చెయ్యలేదంటే లాజిక్ లేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థ వల్ల ఉపాధి, ఉద్యోగాలు. వాటి ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమం సాధ్యపడుతుంది. ప్రయివేటులో యాజమాన్యానికి లాభం ముఖ్యమై, మిగతా విషయాల పట్టింపు ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు వ్యాపారం చెయ్యకూడదు అన్నది సరైంది కాదు. అది ప్రజల ధనంతో ప్రజలందరికీ న్యాయం, లాభం చేకూర్చగల మార్గం. గాంధీజీ దృష్టిలోనైనా వ్యాపారం తప్పు కాదు.. నైతికత లేని వ్యాపారమే పాపం. అదైతే ఎవ్వరూ చెయ్యగూడదు.. చెయ్యనివ్వగూడదు. – డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం మొబైల్ : 94408 36931 -
దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపు, హిందీ మాట్లాడని వారిపై..
సాక్షి, విశాఖ : కడప స్టీల్ ప్లాంట్..విభజన చట్టం హామీలోనే ఉందని, ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపని, హిందీ మాట్లాడేవాళ్ళు మాత్రమే భారతీయులు అనే వివక్షత ఉందని ఆరోపిచంచారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని విఙ్ఞప్తి చేశారు. మార్చి 5నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తాలని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పోస్కో కంపెనీని అడుగు పెట్టనివ్వమని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు వివరించారు. సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని తెలుగు వారందరూ ముందుకు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలో పోరాటం చేస్తామని, అక్కడ కూడా విఫలమైతే తక్షణమే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ శైలజానాథ్ వ్యాఖ్యలకు ఎంపీ ఘాటుగా బదులిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్‌కు 100 మంది ఎంపీలు ఉండి ఒక్కమాట మాట్లాడలేదని, ఈరోజు రాహుల్‌కు ఓటేయమని అడుగుతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటిగా మార్చాలిని డిమాండ్ చేశారు. -
బ్యాంకుల ప్రైవేటీకరణకు చట్ట సవరణలు
న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే దిశగా రెండు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో సవరణలు చేయనుంది. బ్యాంకింగ్ కంపెనీల చట్టం (సంస్థల కొనుగోలు, ట్రాన్స్ఫర్) 1970, బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1980లో నిర్దిష్ట సవరణలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగానే పలు ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారని, ప్రైవేటీకరణ చేయాలంటే వీటిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వివరించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 2021–22 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పీఎస్‌బీల ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. చదవండి: (టాటా ‘బిగ్‌బాస్కెట్ ’డీల్!) -
నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం నాలుగు మధ్య స్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌తో మొదలయ్యే 2021–2022 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల్లో రెండింటిని ప్రైవేటీకరించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సంఖ్యాపరంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో సిబ్బంది ఒక మోస్తరుగానే ఉన్నందున ముందుగా ఆ బ్యాంకుతోనే ప్రైవేటీకరణ ప్రారంభం కావచ్చన్న అంచనా లు ఉన్నాయి. అలాగే ఐవోబీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో దానిపై విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేయొచ్చని, దీంతో అందులోనూ వాటాల విక్రయం సజావుగా జరగవచ్చని ఆశిస్తోంది. ప్రైవేటీకరణ ప్రక్రియ వాస్తవంగా ప్రారంభం కావడానికి 5–6 నెలలు పట్టేయొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఉద్యోగుల సంఖ్య, ట్రేడ్ యూనియన్ల ఒత్తిళ్లు, రాజకీయపరమైన పరిణామాలు మొదలైనవి తుది నిర్ణ యంపై ప్రభావం చూపవచ్చని వివరించాయి. దీనివల్ల ఆయా బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయం ఆఖ రు నిమిషంలో కూడా మారవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి నాలుగింటినీ అనుకున్నా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే నాలుగు బ్యాంకులనూ ప్రైవేటీకరించాలని సర్కారు ముందుగా భావించినప్పటికీ ఉద్యోగుల యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు హెచ్చరించడంతో ప్రణాళికలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ విడతలో మధ్య స్థాయి, చిన్న స్థాయి బ్యాంకులనే ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. రాబోయే రోజుల్లో పెద్ద బ్యాంకులపైనా దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల వారికి రుణ లభ్యత పెంచడం తదితర లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మాత్రం మెజారిటీ వాటాలను కొనసాగించవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పెద్ద బ్యాంకులను పరిశీలించాలి: ఎన్పీఏలతో కుదేలవుతున్న బలహీన, చిన్న బ్యాంకులను తీసుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. పైగా వీటిని విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక వనరులు కూడా భారీగా సమకూరే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎన్బీ లేదా బీఓబీ వంటి పెద్ద బ్యాంకులను ప్రైవేటీకరించే అంశాన్ని పరిశీలించాలంటున్నారు. ప్రక్షాళనకు చర్యలు.. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే సింహ భాగం వాటా ఉంటోంది. అలాగే మొండిబాకీల (ఎన్పీఏ) విషయంలోనూ వీటిపై గణనీయంగా భారం పడుతోంది. కరోనా వైరస్ పరిణామాల కారణంగా కొన్ని పద్దులను మొండిబాకీలుగా వర్గీకరించడంపై ప్రస్తుతం ఆంక్షలు ఉన్నప్పటికీ .. ఇవి తొలగిన మరుక్షణం ఎన్పీఏలు భారీగా పెరిగిపోయే ముప్పు ఉందన్న భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొండిబాకీలు పేరుకుపోయి కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కానీ పీఎస్బీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో ప్రైవేటీకరణ ప్రక్రియపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఉదాహరణకు.. యూనియన్ల గణాంకాల ప్రకారం బీవోఐలో 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33,000 మంది, ఐవోబీలో 26,000 మంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు. ఎకాయెకిన పీఎస్‌బీలను భారీ యెత్తున ప్రైవేటీకరిస్తే ఇటు ఉద్యోగులపరంగా అటు రాజకీయంగా రిస్కీ వ్యవహారం అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రక్రియనైతే మొదలుపెట్టాలని మోదీ ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ: అమిత్ షాను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విన్నవించారు. అలానే రాష్ట్రంలో జరిగిన ఆలయాల ధ్వంసం వెనుక టీడీపీ పాత్ర ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాం. స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపేందుకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపాం. ప్రధాని మోదీతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని అమిత్ షా హామీచ్చారు’’ అన్నారు. దేవాలయాల ధ్వంసం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని విన్నవించాం అన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ‘‘అంతర్వేది రథం దగ్ధం, విగ్రహాల విధ్వంసంలో టీడీపీ పాత్ర ఉంది. ఆలయాల ధ్వంసం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయాలని కోరాం’’ అని తెలిపారు. చదవండి: ‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం.. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎన్నారైల సమరభేరి
వాషింగ్టన్ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అమెరికాలోని ఎన్నారైలు మేధోమధనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని తెలిపారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ప్రముఖ ఎన్నారై కేవీ రెడ్డి ఆధ్వర్యంలో మేధోమధనం కార్యక్రమాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా కేవీ రెడ్డి మాట్లాడుతూ..'మన ఉక్కు - మన హక్కు' అని అన్నారు. ఆనాడు సుమారు 32 మంది ఆంధ్రుల బలిదానంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారని, ప్రత్యక్షంగా 24వేల మంది, పరోక్షంగా లక్షమందికి పైగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగకుండా ఉండే మార్గాలను, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలా లాభాల్లోకి తీసుకుని రావచ్చనే విషయంపై మీద కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీట్ ప్లాంట్ అంశంపై వేగంగా స్పందించి కేంద్రానికి లేఖ రాశారని, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతఙతలు తెలిపారు. కార్యచరణ తీర్మానాలు : ♦ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా అవసరమైన గనులను కేటాయించాలి ♦ బాండ్స్ రూపంలో నిధులు సమీకరించడం ద్వారా ప్రజల భాగస్వామ్యతో ప్రజల ఆస్తిగా మార్చవచ్చు ♦ లోన్స్ ను ఈక్విటీలుగా మార్చడం ద్వారా ఇంట్రస్ట్ రేట్లను గణనీయంగా తగించవచ్చు. ♦ భవిషత్తులో ౩౦౦ మిలియన్ టన్నుల స్టీల్ అవసరాలు ఉంటాయన్నది అంచనా. అందువల్ల , ఉత్పత్తి పెంచడం ద్వారా ప్లాంట్నును లాభాల్లోకి తీసుకురావచ్చు. -
రెండు రోజులు బ్యాంకింగ్ సమ్మె!
సాక్షి, న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ, మార్చి 15 నుంచీ రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించాలని తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) మంగళవారం బ్యాంకింగ్‌కు పిలుపునిచ్చింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో.. తాము మార్చి 15 నుంచి సమ్మె చేయనున్నట్లుగా యూఎఫ్‌బీయూ స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది. 2019లో ఈ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్ఐసీకి విక్రయించింది. అలాగే గడచిన నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. -
స్టీల్ ప్లాంట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు బుధవారం టీడీఐ జంక్షన్ వద్ద భారీగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ, మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజు, ఐఎన్టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అదే విధంగా లెఫ్ట్ పార్టీ నేతలు నరసింగరావు, సత్యనారాయణ, ట్రేడ్ యూనియన్ నేతలు హాజరయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తన చేపట్టబోయే నిరసన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఐఎస్టీయూసీ పేర్కొంది. కూర్మన్నపాలెంలో వేలాది మంది కార్మికులతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపింది. 18న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, భార్యా పిల్లలతో నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించింది. కేంద్రం ఆధ్వర్యంలోనే స్టీల్‌ప్లాంట్ కొనసాగాలని, వేలాది మంది భూముల త్యాగంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందని ఐఎన్టీయూసీ డిమాండ్ చేసింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు: నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయాలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మొదటి నుంచి చెప్తున్నామని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకూడదన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాజకీయాలకతీతంగా ఉద్యమించి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేట్‌పరం చేయాలనే ఉద్దేశంతో సొంత గనులు ఇవ్వలేదని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానికి లేఖ రాసి, సూచనలు చేశారని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం కార్మిక సంఘాలతో కలిసి పోరాడతామని, అన్ని కార్మిక సంఘాలను ఢిల్లీ తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరతామని ఆయన తెలిపారు. చదవండి: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం -
కేంద్ర బడ్జెట్‌పై కార్మిక సంఘాల కన్నెర్ర
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇక కార్మిక సంఘాలు పోరాట బాట పట్టనున్నారు. ప్రైవేటీకరణతో పాటు బడ్జెట్లో పొందుపరిచిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్త నిరసనలకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు పేద కార్మికులకు ఆహారం, ఆదాయం కల్పించాలనే డిమాండ్‌పై 10 కార్మిక సంఘాలు ఆందోళనలు చేయనున్నాయి. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు మంగళవారం కార్మిక సంఘాల సంయుక్త ఫోరం ఓ ప్రకటన విడుదల చేసింది. నిరసనల్లో భాగంగా బుధవారం భారీ ప్రదర్శనలు, కార్యస్ధానాల్లో సమావేశాలు నిర్వహించి లేబర్ కోడ్స్‌ను ప్రతులను దగ్ధం చేస్తామని ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధ్వంసకర విధానాలకు నిరసనగా భవిష్యత్‌లో తమ పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన దిశగా ఉండటంతో పాటు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్‌పై ఫిబ్రవరి 3వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.