హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులందరికీ స్పెషల్ ఇంక్రీమెంట్ కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. త్వరలోనే దాదాపు 25 వేల కిలోమీటర్ల మేర రోడ్ల పునర్‌నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమని కేసీఆర్ స్పష్టం చేశారు.
గతంలో తాను రవాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అక్రమ రవాణను అరికట్టి ఆర్టీసీని రూ.11 కోట్ల లాభాల్లోకి తెచ్చిన విషయం గుర్తు చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో... కేసీఆర్ 80 కొత్త సిటీ మెట్రో లగ్జరీ ఏసీ బస్‌లను ప్రారంభించారు. అనంతరం బస్సు లోపలికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయం: కేసీఆర్
Published Sat, Nov 29 2014 1:56 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement