సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక ప్రైవేట్ పరం కానుంది. బీమా కంపెనీలకు చంద్రబాబు సర్కార్.. ఆరోగ్యశ్రీని అప్పగించేసింది. ఎన్టీఆర్ వైద్యసేవకు అనుసంధానంగా ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడ్ తీసుకొస్తున్నామని వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. రూ.2.50 లక్షల లోపు బిల్లులను ఇకపై ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లిస్తాయని పేర్కొన్నారు.
మరో వైపు.. ‘ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాం’ అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!
కాగా, గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment