Aarogyasri
-
నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన దాదాపు రూ.1,200 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తమ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసినట్లు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో రోగులకు వివరిస్తూ బోర్డులను కూడా తమ ఆసుపత్రుల ముందు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ సిబ్బంది కూడా రోగులకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి: తెన్హా నెట్వర్క్ పరిధిలోని 368 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్ఎస్ (ఉద్యోగులు), జేహెచ్ఎస్ (జర్నలిస్టులు) పథకాల కింద ప్రతి నెలా సుమారు రూ.100 కోట్ల విలువైన చికిత్సలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఇప్పటివరకు రూ. 1,030 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.730 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు. ఈ లెక్కన ఈ సంవత్సరానికి సంబంధించి రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించినట్లు తెన్హా చెబుతోంది.ఇంకా రూ.1,100 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని సంఘం నేతలు తెలిపారు. బకాయిలు చెల్లించకుంటే ఈ నెల 10 నుంచి సేవలు నిలిపివేస్తామని తెన్హా ప్రకటించటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివశంకర్ ఆ సంఘం నాయకులతో గురువారం చర్చలు జరిపారు. రూ.100 కోట్లను టోకెన్ కింద వెంటనే విడుదల చేస్తామని, వచ్చే నెలలో మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. దీంతో తెన్హా వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. కొత్తగా ఇచ్చిందేంటి? బకాయిల్లో కేవలం రూ.100 కోట్లువిడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తెన్హా తప్పు పట్టింది. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.100 కోట్ల విలువైన చికిత్సలు అందిస్తుంటే.. సంవత్సరం నుంచి రావాల్సిన రూ.1,200 కోట్లకుగాను రూ.100 కోట్లు ఇస్తామనటం సరికాదని పేర్కొంది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలకు సంబంధించి 18 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో శివశంకర్‌కు శుక్రవారం లేఖ రాస్తూ.. తమ బకాయిల పరిష్కారానికి కచ్చితమైన మార్గం చూపేంత వరకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది: విడదల రజిని
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
-
ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్
సాక్షి, తాడేపల్లి : నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు (aarogyasri) నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేయాలని హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.తొలివిడత కనీసం రూ.రెండు వేల కోట్లయినా రిలీజ్ చేయాలంటున్న నెట్ వర్క్ ఆస్పత్రులు (network hospitals) కోరుతున్నాయి. ఇవ్వాల్టి నుండి ఈహెచ్ఎస్ సేవలు, ఓపీని నిలిపేయాలని, 26 నుండి అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ మేలు చేకూర్చింది. ఏకంగా 45,10,645 మందికి ఉచిత వైద్యం అందించారు. ఇందుకోసం రూ.13,421 కోట్లు ఖర్చయ్యింది. కానీ నేడు చంద్రబాబు పైసా కూడా విదల్చకపోవటంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఉపక్రమించాయి. బకాయిలు చెల్లించాల్సిందేనెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ అవినాష్ మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవుతున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకాయిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేం సేవలు అందించలేం. పాత బకాయిలకు అదనంగా ప్రతినెలా వస్తున్న బిల్లులు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్పత్రులను నిర్వహించలేం. మాకు రావాల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమవారం నుంచి ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ (insurance) విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం.బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మాత్రమే వర్తించడంతో సేవాభావంతో వైద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెరగాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీనిపై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం’ అని స్పష్టం చేశారు. -
ఆరోగ్యశ్రీ రద్దు.. ప్రజలకు బాబు మరణ శాసనం!
-
ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు బంద్
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ), ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) సేవలను నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలటీ ఆస్పత్రుల సమాఖ్య (ఆశా) ప్రకటించింది. తమకు రావాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీరాలేదని, నోటీసులో పేర్కొనట్లుగా ఈనెల 6 నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. శనివారం విజయవాడలో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ అవినాష్ మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవుతున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకాయిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.కానీ, ఇప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేం సేవలు అందించలేం. పాత బకాయిలకు అదనంగా ప్రతినెలా వస్తున్న బిల్లులు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్పత్రులను నిర్వహించలేం. మాకు రావాల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమవారం నుంచి ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం. బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మాత్రమే వర్తించడంతో సేవాభావంతో వైద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెరగాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీనిపై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం. -
రూ.5800 కోట్ల దోపిడీకి కూటమి సర్కార్ కుట్ర: సీదిరి అప్పలరాజు
సాక్షి, పలాస: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకానికి నీరుగార్చడమే కాకుండా తాజాగా హైబ్రిడ్ మోడల్ పేరుతో దాదాపు రూ.6 వేల కోట్ల దోపిడికి కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పనంగా చెల్లించే ఆ డబ్బంతా తిరిగి నారా లోకేశ్ జేబుల్లోకే చేరబోతుందని పలాసలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రస్టు మోడల్ కన్నా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న హైబ్రిడ్ మోడల్‌తో ఏం ఉపయోగాలున్నాయో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.సీదిరి అప్పలరాజు ఇంకా ఏమన్నారంటే..దేశానికే తలమానికంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ట్రస్టు మోడల్ నుంచి హైబ్రిడ్ మోడల్లోకి మారుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఆదాయ పరిమితి ఉన్న 1.43 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల వరకు రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా అందించడం జరిగింది.ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం రూ.2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆపై మరో రూ.2.5 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలందిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే కాంక్లియర్ ఇంప్లాటేషన్, బోన్ మ్యారో సర్జరీ వంటి ఖరీదైన చికిత్సలు పేదవారికి ఉచితంగా అందే పరిస్థితి ఉండదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లైయిమ్లు తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటి? అత్యవసర వైద్యానికి అప్రూవల్ రావడంలో ఆలస్యమైతే ఎవరు బాధ్యులు?ఆరోగ్యశ్రీలో 3257 ప్రోసీజర్లకు వైద్యం అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే హైబ్రిడ్ మోడల్లో, అన్ని ప్రొసీజర్లకు వైద్యం అందుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఉచితంగా మందులు ఇవ్వరు. రోగి హెల్త్ ప్రొఫైల్‌ని పరిగణలోకి తీసుకుంటే ఇన్సూరెన్స్ వర్తింపజేయరు. ప్రైవేట్ ఇన్సూరెన్స్‌లో ఉన్న ఇబ్బందులను అధిగమించడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్ట్ మోడల్లో తీసుకొచ్చి వేగంగా వైద్య సేవలందించే విధానం తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు మళ్లీ పాత విధానానికి తీసుకెళ్తున్నారు.ఇదంతా మంత్రి లేదా నారా లోకేష్‌కు సంబంధించిన వారి బీమా కంపెనీ కోసమే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లలో రూ.12,677 కోట్లు ఖర్చు చేయగా.. రాష్ట్రంలో కోవిడ్ సమయంలో వైరస్ బారిన పడ్డ రెండు లక్షల మందికిపైగా బాధితులకు ఉచితంగా చికిత్స అందించి, అందు కోసం మరో రూ.744 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించిన హైబ్రిడ్ మోడల్లో ప్రీమియమ్ చెల్లింపులు, రాష్ట్రంలో పథకం లబ్ధిదారులను పరిగణలోకి తీసుకుంటే, దాదాపు రూ.19,218 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో కంటే, చాలా ఎక్కువగా వ్యయం చేస్తూ.. ఇందులో రూ.5,800 కోట్ల దోపిడికి కుట్ర కనిపిస్తోంది.కాగా, ఇప్పుడున్న రేట్ల ప్రకారమే ఇంత అదనంగా వెచ్చిస్తుంటే రాబోయే రోజుల్లో రేట్ల పెంపు పేరుతో మరింత దోపిడీకి పాల్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు జేబులు నింపుకోవడమే సంపద సృష్టి అనుకోవాలేమో!. ఏ పథకం అమలు చేయకుండానే కేవలం జీతాలు చెల్లించడానికి, పింఛన్లు ఇవ్వడానికి ఏడు నెలల్లో రూ.1.19 లక్షల కోట్ల అప్పు చేయడం ఏంటి?. ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులకు, చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదు. ఈ అప్పుల దెబ్బకు రాష్ట్రం శ్రీలంక కాదు. ఏకంగా సోమాలియా అయిపోతుందేమో అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. -
6 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. ఆందోళనకు నెట్వర్క్ ఆసుపత్రుల సిద్ధం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) బకాయిలపై నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు సర్కార్.. రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టగా, ఎల్లుండి (జనవరి 6) నుంచి ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌కు ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ, జనవరి 6వ తేదీ నుంచి క్యాష్ లెస్‌గా వైద్య సేవలు అందించలేమని తెలిపారు.తాము నోటీసులిచ్చిన కూడా ప్రభుత్వం నుంచి నామమాత్రపు స్పందన మాత్రమే వచ్చిందన్నారు. బకాయిల భారాన్ని మోయలేకపోతున్నాం... ఆసుపత్రులను నడపలేకపోతున్నాం.. వీలైనంత త్వరగా 50 శాతం బకాయిలు చెల్లించాలన్నారు. ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇన్స్యూరెన్స్‌కు ఇప్పగించే ముందు మా బకాయిలన్నీ తీర్చాలని విజయ్‌కుమార్ తెలిపారు.ఇదీ చదవండి: ‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’మరోవైపు, ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రూ.2.50 లక్షల వరకు వైద్య సేవలను బీమా పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2,500 చొప్పున ప్రీమియం చెల్లిస్తామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలోని 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తుందని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు బీమా వర్తింపజేస్తే ప్రైవేటు ఆస్పత్రులు మనుగడ సాగించడం కష్టమంటూ మంత్రి వ్యాఖ్యానించారు. -
ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌పరం.. ప్రజల ప్రాణాలతో వ్యాపారమా బాబూ?: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే అత్యంత అద్భుతమైన పథకంగా ఉన్న ఆరోగ్యశ్రీని తమ స్వార్థం కోసం ప్రైవేటు బీమా కంపెనీకి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆక్షేపించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఆయన వెల్లడించారు.గోపిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:దురుద్దేశ ఆలోచన. చర్యలు:కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు బీమా కంపెనీకి కేటాయించి నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఒక అద్భుతమైన పధకంగా గుర్తింపు పొందింది. వైఎస్సార్ ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది దేశంలోనే ఆదర్శవంతమైన పథకంగా అందరి మన్ననలను అందుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి ఈ పథకాన్ని పరిశీలించి తమ రాష్ట్రాల్లో అమలు చేశారు. ప్రాణాంతకమైన గుండె జబ్బులకు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలను కోల్పోతున్న ఎందరో పేదలకు ఈ ఆరోగ్యశ్రీ అపర సంజీవనిలా వారి ప్రాణాలను కాపాడింది. ఈ పథకం వల్ల ఎందరో పేదలు కార్పొరేట్ వైద్యాన్ని పొందారు. ముఖ్యమంగా గుండె ఆపరేషన్లు, వివిధ రకాల ఆపరేషన్లను చేయించుకున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పేర్లు మారాయే తప్ప ఈ పథకాన్ని తీసేసే సాహసం ఎవరూ చేయలేదు. అంత గొప్పగా ఈ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లింది.బీమా సంస్థకు అప్పగిస్తే..:ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తివేసి, బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంది. అదే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించినా, చికిత్స వ్యయంలో కేవలం రూ.2.5 లక్షల వరకు ఆ సంస్థ నుంచి చెల్లింపులు జరుగుతాయి. అంతకంటే ఎక్కువ అయితే దాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పొందాల్సి వస్తుంది.ఆ ప్రొసీజర్లన్నింటినీ అనుమతిస్తారా?:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని బాగా విస్తరించి, మొత్తం 3257 ప్రొసీజర్లను అనుమతించాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించి చేతులు దులుపుకుంటే, మరి ఆ మొత్తం ప్రొసీజర్లను ఆ బీమా కంపెనీ కవర్ చేస్తుందా? అది ఖరీదైన వైద్యానికి చెల్లింపులు చేస్తుందా?. ఉదా: కాంక్లియార్ ఇంప్లాంటేషన్‌కు దాదాపు రూ.6.5 లక్షల చొప్పున రూ.13 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంకా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయా? అందుకు బీమా కంపెనీ ఒప్పుకోకపోతే, రోగుల పరిస్థితి ఏమిటి?.ఎందుకంటే, బీమా కంపెనీలు 60 ఏళ్లు దాటిన వారికి, ఏదైనా దీర్ఘకాల వ్యాథులతో బాధ పడుతున్న వారికి, బీమా చెల్లింపుల్లో పలు ఆంక్షలు విధిస్తాయి. బీమా ప్రీమియం చెల్లించిన తరువాత ఏడాది, కొన్ని వ్యాధులకు కనీసం మూడేళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తాయి. ఉదా: హిప్ రీప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ఆ సర్జరీ చేసేవాళ్లు. మరి ఇదే చికిత్సకు ప్రైవేటు బీమా కంపెనీలు కనీసం ఏడాది పాటు వెయిటింగ్ పీరియడ్ తరువాతే అంగీకరిస్తాయి. బీమా కంపెనీలు ఎప్పుడైనా, ఏదో ఒక విధంగా క్లెయిమ్స్ తగ్గించుకోవాలనే చూస్తాయి. అందుకే చిన్న చిన్న అంశాలను కూడా సీరియస్‌గా తీసుకుని క్లెయిమ్స్ నిరాకరిస్తుంటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని ప్రొసీజర్లను బీమా కంపెనీ ఆమోదిస్తుందా? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?.చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ:చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ గుర్తుకు వస్తుంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు కూడా అంతే. గ్రామాల్లో అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు, నాడు గత ప్రభుత్వం ప్రారంభించిన 10,300 విలేజ్ హెల్త్‌క్లినిక్స్‌ను ఇప్పటికే నిర్వీర్యం చేశారు. వాటిని జగన్‌గారు ప్రారంభించారనే కోపంతో వాటిని పనికి రాకుండా చేశారు. 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ హయాంలో తీసుకువస్తే, వాటిలోని సీట్లను కూడా ప్రైవేటుపరం చేసేలా విధానాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో అది ప్రభుత్వ బాధ్యత:ప్రజాస్వామ్యంలో ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వీటిని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం దారుణం. ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా సంస్థకు అప్పగిస్తే, ఆస్పత్రులన్నీ ఆ కంపెనీ చుట్టూ తిరిగి, క్లెయిమ్స్ పొందాల్సి వస్తుంది. నిబంధనలకు కట్టుబడి ఎన్ని ఆస్పత్రులు, ఎన్ని క్లెయిమ్స్ తెచ్చుకోగలవు? కోవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్యశ్రీ నిబంధనలను వెంటనే మార్చుకుని ప్రజలకు అవసరమైన సేవలను అందించారు. అదే బీమా సంస్థ నిర్దేశించే నిబంధనలు మార్చాలంటే చాలా జాప్యం జరుగుతుంది. అప్పటి వరకు ప్రజల ఆరోగ్యానికి ఎవరు జవాబుదారీ? ప్రభుత్వానికి ఏదైనా జబ్బును ఆరోగ్యశ్రీ కింద చేర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే బీమా కంపెనీ పరిధిలోకి తీసుకురావడం అంత సులభం కాదు.ఆలోచన వీడండి:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద 45,10,645 మందికి ఉచితంగా వైద్య సేవలందించి వారి ఆరోగ్యాలకు అండగా నిలిచింది. అందుకు రూ.13,421.43 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం గొప్పగా తీర్చిదిద్దిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన వీడాలి. నిరుపేదలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా అందించే ఆ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలి. అందుకే ప్రజల మనోభావాలు, వారి అవసరాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.ఇదీ చదవండి: టార్గెట్ సజ్జల.. ఎల్లోమీడియాపై భగ్గుమన్న వైఎస్సార్సీపీకూటమి ప్రభుత్వానికి తొలి నుంచే..:ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి నుంచే కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా, దాదాపు రూ.3 వేల కోట్లు బకాయి పడింది. దీంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆపేసిన ఆస్పత్రులు, ఈనెల 6 నుంచి వాటిని పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే మందు, ప్రభుత్వం ఏ కసరత్తు చేసింది? కనీసం ఆస్పత్రులు, వైద్య రంగం ప్రతినిధులతో అయినా మాట్లాడారా? కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు నాలుగైదు గంటల్లో ప్రైవేటు బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ అనుమతి రావడం చాలా కష్టం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద దాదాపు 300 మంది కేవలం క్లెయిమ్లపైనే పని చేసేవారు. మరి బీమా కంపెనీ ఆ స్థాయిలో పని చేస్తుందా?లోకేష్ సొంత మనుషులు.. బీమా కంపెనీ:మంత్రి నారా లోకేష్ తన సొంత మనుషులతో బీమా కంపెనీని పెట్టించి, వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది తమకు కావాల్సిన వారికి దోచిపెట్టే ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన ఉన్న పథకం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందిన పథకం ఇది. దీనిని కూడా నిర్వీర్యం చేయాలని అనుకోవడం దుర్మార్గం. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేలా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, పోరాడతామని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. -
ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
ఏపీలో ఇకపై ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌పరం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక ప్రైవేట్ పరం కానుంది. బీమా కంపెనీలకు చంద్రబాబు సర్కార్.. ఆరోగ్యశ్రీని అప్పగించేసింది. ఎన్టీఆర్ వైద్యసేవకు అనుసంధానంగా ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడ్ తీసుకొస్తున్నామని వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. రూ.2.50 లక్షల లోపు బిల్లులను ఇకపై ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లిస్తాయని పేర్కొన్నారు.మరో వైపు.. ‘ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాం’ అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!కాగా, గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి. -
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్!
-
జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!
సాక్షి, అమరావతి: ‘ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాం’ అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవడం వల్ల ఆస్పత్రులకు మందులు, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు జరపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో విక్రేతలు నోటీసులు జారీ చేసి.. సరఫరాలను నిలిపివేశారని తెలిపింది.ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని వాపోయింది. ఈ సమస్యలను గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల వైద్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో సైతం పెండింగ్ బిల్లులకు నిధులు మంజూరుతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపునకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో తామెంతో నిరుత్సాహానికి గురయ్యామని పేర్కొంది. పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తే తప్ప.. ఆస్పత్రులు కోలుకోలేవని స్పష్టం చేసింది.అలాగే ప్రస్తుత ప్యాకేజీ ధరలను శాస్త్రీయంగా పునఃమూల్యాంకనం చేయాలని కోరింది. రూ.2 వేల కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేసి.. మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాలపరిమితిలోపు ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. గ్రీన్‌చానల్‌లో ప్రతి నెలా పెన్షన్లు, జీతాలతో పాటు ఆరోగ్య శ్రీ బిల్లులను కూడా క్రమబద్ధంగా చెల్లించాలని.. ఇందుకోసం చట్టబద్ధమైన చెల్లింపుల షెడ్యూల్లోకి చేర్చాలని కోరింది. -
పేదల ఆరోగ్యంతో బాబు చెలగాటం
-
బాబు పేల్చిన పెద్ద బాంబు.. ఆ కార్డులు చెల్లక అనంత లోకాలే శరణ్యమా
-
కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!
ఆరోగ్యశ్రీ అంటే రానివ్వడం లేదుతిరుపతి కొర్లగుంటలో ఉంటున్నాం. ఆటో డ్రైవర్‌గా పనిచేసే నా భర్తకు కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లగా కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు రూ.3 లక్షల విలువ చేసే సేవలు ఉచితంగా పొందాం. ఇప్పుడేమో ఆస్పత్రి లోపలకు కూడా అనుమతించడం లేదు. – రమణమ్మ, తిరుపతి⇒ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కావేరి డెంగీ బారిన పడటంతో ఈ ఏడాది ఆగస్టు 23న తల్లిదండ్రులు కర్నూలులోని ఓ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందకపోవడంతో చేతి నుంచి రూ.లక్షల్లో చెల్లించారు. బాధిత బాలిక చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది.⇒ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగేశ్వరరావుకు కొద్ది రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు, యాంజియో చేయాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని నాగేశ్వరరావు చెప్పడంతో.. ‘ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లవు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం’ అని అనడంతో చేసేదేమీ లేక చేతి నుంచి రూ.20 వేలు చెల్లించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన పామర్తి వీరవెంకట సత్యనారాయణ (55) రైతు కూలీ. ఎరువుల బస్తాతో సైకిల్‌పై వెళ్తుండగా జారి పడిపోవడంతో చువ్వలు వెన్నెముకకు గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించలేమని చేతులెత్తేశారు. దీంతో తెలిసిన వారి వద్ద అప్పుతెచ్చి కుటుంబ సభ్యులు అరకొర వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం అందక అనంతరం ఆయన మృతి చెందారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించి ఉంటే పెద్ద దిక్కును కోల్పోయే వాళ్లం కాదని సత్యనారాయణ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు.సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా కంపెనీని ప్రవేశపెట్టేందుకు ఆరునెలల్లో ఆరోగ్యశ్రీని కూటమి సర్కారు అంపశయ్య ఎక్కించింది. ఆరోగ్యశ్రీని అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే కుండబద్ధలు కొట్టారు. ప్రజలు ఉచిత వైద్యం కోసం రూ.25 లక్షల వరకూ పరిమితి ఉండే ఆరోగ్యశ్రీని కాకుండా.. కేంద్రం అమలు చేసే పీఎం జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్) పథకాన్ని వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు టీడీపీ కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయి పడటంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. పెద్ద మొత్తంలో బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ అనారోగ్యం పాలైతే నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో లబ్ధిదారులు ఆస్పత్రులకు వెళితే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచితంగా చికిత్సలు చేయలేం..’ అని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఖరాకండిగా చెబుతున్నాయి. చికిత్స కోసం చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. ఉచిత వైద్యం కలే..అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న రోగులు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని మొత్తుకుంటున్నా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆలకించడం లేదు. వాస్తవానికి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు వైద్య పరీక్షలు, అవసరమైన సర్జరీలు, అనంతరం వాడాల్సిన మందులను ఉచితంగా ఇవ్వాలి. కార్డుదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం.. నిర్వహణ భారంగా మారడంతో ఆస్పత్రులు నిక్కచ్చిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. ఓపీ, రకరకాల పరీక్షలు, మందులు కొనాలంటూ పేదల జేబులు గుల్ల చేస్తున్నాయి. కడుపులో గడ్డ, ప్రసవం, చిన్నపాటి ఎముకల ఫ్రాక్చర్ లాంటి సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లిన వారి నుంచి కొన్ని చోట్ల రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక గుండె, న్యూరో, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత అనారోగ్య బాధితులైతే రూ.50 వేల నుంచి రూ.లక్షలకు పైబడి వసూలు చేస్తున్నారు.ప్రజారోగ్యానికి పెద్దపీటప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి అండగా నిలిచారు. కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బుల బాధితులు, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి భరోసా కల్పించారు. వైరల్ జ్వరాలు, డెంగీ బారినపడిన వారికి పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైరల్ జ్వరాలు, డెంగీ బాధితులకు ఉచిత చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యం పాలైన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివస్తుంది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లభించకపోవడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి.ప్రభుత్వానికి ఆస్పత్రుల లేఖ..ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో అప్లోడ్ చేసినవి, చేయాల్సినవి కలిపితే రూ.3 వేల కోట్ల వరకూ ప్రభుత్వం బిల్లులు బకాయిపడింది. నెలల తరబడి చెల్లింపులు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి లేఖ రాసింది. త్వరితగతిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది.రోగులపై మందుల భారంరాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్థోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కారు మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు. బీపీ, షుగర్, గ్యాస్ బాధితులకు పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్సా్టర్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీషియా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉచిత వైద్యం లేదన్నారుగత నెలలో వైరల్ జ్వరం వచ్చింది. ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఆస్పత్రికి వెళ్లగా ఈ సమస్యకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లేదని చెప్పడంతో చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. రూ.20 వేలకు పైగానే ఖర్చు అయింది. – పి.వాణి, కాకినాడ జిల్లారూ.30 వేలు డిమాండ్ చేశారు ప్రమాదవశాత్తు కింద పడటంతో మోకాలికి తీవ్ర గాయమైంది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా. పథకం కింద ఉచితంగా సర్జరీ వర్తించినా రూ.30 వేలు అదనంగా ఇవ్వాలన్నారు. డబ్బు కట్టే స్థోమత లేక అనంతపురం జీజీహెచ్‌కు వెళ్లా. రూ.వేలు ఇవ్వాలంటే నాలాంటి పేదల పరిస్థితి ఏమిటి?– చంద్రశేఖర్, పోతులగాగేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాకార్డున్నా ఆపరేషన్ చేయలేదునా భర్త రఫీ కొద్ది నెలల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో ఎడమచేతికి గాయమైంది. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఫ్రాక్చర్ అయిందన్నారు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ ఉచిత చికిత్సకు నిరాకరించారు. – ఆసియా, అనంతపురంఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వైద్యం బంద్!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద క్యాన్సర్ రోగులకు పెద్ద కష్టం వచ్చిపడింది. విశాఖలో క్యాన్సర్ చికిత్సను అందించే ప్రముఖ ఆస్పత్రి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ద్వారా అందించే క్యాన్సర్ చికిత్సలను నిలిపివేసింది. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆస్పత్రికి భారీగా బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధునాతన పరికరాలతోపాటు వైద్య నిపుణులు, సిబ్బంది ఉన్న ఈ ఆస్పత్రికి ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. వారం రోజులుగా ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేయడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివంగత సీఎం వైఎస్ చొరవతో... ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గతంలో క్యాన్సర్‌కు చికిత్స కోసం హైదరాబాద్ లేదా ముంబైకి వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోనే క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ద్వారా 77 ఎకరాలను కేటాయించారు. రూ.540 కోట్లతో ఏర్పాటైన ఈ ప్రముఖ సంస్థలో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలతోపాటు మంచి వైద్య నిపుణులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ సెంటర్ల సంయుక్త సహకారంతో ఈ క్యాన్సర్ ఆస్పత్రి 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం సేవలు నిలిచిపోవడంతో క్యాన్సర్ బాధిత పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు మూడు రోజుల క్రితం మా మామయ్యని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. క్యాన్సర్ స్టేజ్–2లో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందుతాయని సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక వెనుదిరిగాం. ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించకపోవడం వల్లే నిలిపివేశామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. నిరుపేద రోగులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూడాలి. – ఎస్.శంకరరావు, అగనంపూడి నిర్వాసిత కాలనీ, విశాఖపట్నం -
ఆంధ్రప్రదేశ్ లో 108, 104 సేవలు అటకెక్కాయి: Vidadala Rajini
-
సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'?
ప్రభుత్వ నిర్లక్ష్యానికి తల్లీ కొడుకు మృతివిజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ ఇటీవల డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి అప్పటి నుంచి విధులకు వెళ్లకుండా ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే మృతిచెందాడు.రాష్ట్రంలో నాలుగు నెలలుగా అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఏ ప్రభుత్వ ఆస్పత్రిని తీసుకున్నా దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. విలేజ్ క్లినిక్‌లకు దిక్కు లేకుండా పోయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టకు తిలోదకాలిచ్చింది. 104 వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. పీహెచ్‌సీల్లో అక్కర్లేదంటూ స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించింది. చాలా చోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. మందుల కొరత వేధిస్తోంది. ఏ చిన్న మందు కావాలన్నా బయటకు రాసిస్తున్నారు. ఇక పరీక్షల సంగతి అయితే మాట్లాడుకోక పోవడమే మంచిది. కొంచెం క్రిటికల్ కేసు వస్తే చాలు.. రెఫర్ చేయడమే పరిపాటిగా మారింది. ఇదేంటయ్యా.. అని అడిగితే ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని సీరియస్ అవుతున్నారు. నాలుగవ తరగతి సిబ్బందిపై నియంత్రణ కరువైంది. ఏ అర్ధరాత్రుళ్లో ఎవరికైనా సీరియస్ అయితే దేవుడే దిక్కు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫీవర్ సర్వే ఊసే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజారోగ్యాన్ని దీన స్థితికి తీసుకొచ్చింది.బడి బల్లలే బెడ్లు... కిటికీలే సెలైన్ స్టాండ్లు సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో జూన్ నుంచి ప్రజలు జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. పెద్ద ఎత్తున డయేరియా కేసులు వెలుగు చూశాయి. తాజాగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా పంజా విసిరింది. 450 మందికిపైగా డయేరియా బారిన పడగా, వారిలో 11 మంది మృత్యువాతపడ్డారు. వెంటనే బాధితులకు మెరుగైన వైద్య సేవలు కల్పించి ప్రాణనష్టం జరగకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అక్కడా ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద సక్రమంగా ఉచిత వైద్యం లభించడం లేదు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ఆ పథకాన్ని ఇప్పటికే గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లో బీపీ, సుగర్ ఇతర జబ్బులతో బాధపడే వారికి క్రమం తప్పకుండా వైద్యం అందేది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు 104 వ్యవస్థ పని చేస్తోందా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ఉన్న 150 మంది స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించి కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. భయం గుప్పెట్లో గిరిజనం గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను డెంగీ, మలేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు చుట్టుముట్టాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు వ్యాధులతో బాధపడుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో మందులు, పరీక్షలు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి విష జ్వరం వస్తే వైద్యానికి కనీసం రూ.5 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి మూడు నెలల వ్యవధిలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదుగురు విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారినపడి మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో పాటు, తాగునీటిని సరిగా శుద్ధి చేయకపోవడంతో జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా డయేరియా ప్రబలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడటంతో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి, జూలైలో కర్నూలు జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా 250 మంది డయేరియా బారినపడ్డారు. వారిలో ఏడుగురు మరణించారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు జన్యు సంబంధమైన హీమోఫీలియా బాధితులకు మందులు సరిగా దొరకడం లేదు. వ్యాధిగ్రస్తుల్లో రక్తస్రావాన్ని నియంత్రించడానికి యాంటి హీమోఫీలియా ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను చికిత్సల్లో వినియోగిస్తారు. ఫ్యాక్టర్ 7, 8, 9 ఇలా వివిధ రకాల ఇంజెక్షన్లు అవసరం ఉండగా, చాలా వరకు జీజీహెచ్‌లలో ఇవి లేవని తెలుస్తోంది. అలాగే రోగ నిరోధకత బాగా తక్కువగా ఉండే క్యాన్సర్, న్యూరో, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం వాడే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు కూడా అన్ని జీజీహెచ్‌లలో లేవు. కేసులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాధులకు చికిత్సల్లో వినియోగించే అన్ని రకాల యాంటిబయోటిక్స్ సీడీసీ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లో ఉండటం లేదు. వైరల్ జ్వరాలకు వాడే ఎమాక్సిలిన్, మలేరియా చికిత్సకు అవసరమైన ఆర్టిసినేట్ ఇంజెక్షన్ చాలా ఆస్పత్రులకు సరఫరా కావడం లేదు. చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులకు పలు రకాల క్రీములు ఆస్పత్రుల్లో లేకపోవడంతో బయటకు రాస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్లలో మందులు సరిపడా లేవు. పెరిగిపోతున్న ఖాళీలు ⇒ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో ఏర్పడిన, కొత్తగా మంజూరైన పోస్టులను ఎప్పటికప్పుడే భర్తీ చేస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో 54 వేల పోస్టులు ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేశారు. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీరో వెకెన్సీ పాలసీకి బ్రేక్ వేసింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పారా మెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నియామకాల కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీలు 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదల చేశాయి. నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఈ నోటిఫికేషన్లను రద్దు చేశారు.⇒ ఓ వైపు ఆస్పత్రుల్లో ఎఫ్ఎన్వో, ఎంఎన్‌వో ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటే, ఆ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ఇక సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గతంలో గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సైతం స్పెషలిస్ట్ వైద్యుల కోసం పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలు ఇచ్చి మరీ పోస్టులు భర్తీ చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెకండరీ హెల్త్‌లోని గిరిజన, మారుమూల ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ల కొరత ఉన్నప్పటికీ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారు సైతం వెళ్లిపోవడం, ఇటీవల కాలంలో పదవీ విరమణలు, పదోన్నతుల అనంతరం డీఎంఈ ఆస్పత్రుల్లో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అదే విధంగా 900కుపైగా సీనియర్ రెసిడెంట్, 250కి పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం మన విద్యార్థులకు అన్యాయం చేసింది. ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయేలా చేసింది.అత్యవసర మందులూ బయటే⇒ 2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభుత్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన శ్రద్ధ.. ప్రజారోగ్య పరిరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టలేదని మండిపడుతున్నారు. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. ⇒ జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు ఉంచాలని వైద్య శాఖ నిర్ణయించింది. 372 మేర సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులన్నింటినీ మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. గురువారం (17వ తేదీ) అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్లు అందరూ మందుల కొరత అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినట్లు తెలిసింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉండటం లేదని, లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని మంత్రి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. స్థానికంగా కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడ ఉన్నాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే దీని అర్థం రోగులను బయట తెచ్చుకోమని చెప్పడమే. ⇒ ల్యాబ్‌లలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సరిపడా రసాయనాలు అందుబాటులో ఉండటం లేదు. పాడైన పరికరాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మార్చురీల్లోని శవాలకు కూడా భద్రత లేకుండాపోయింది. ఏలూరు ఆస్పత్రిలో అనాథ మృతదేహాలు మాయమైన ఘటన వెలుగు చూసింది. పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో డయేరియా విలయతాండవం చేస్తోంది. ఈ నిర్లక్ష్యం.. గర్భిణికి ఎంతకష్టం..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారానికి చెందిన గర్భిణి యర్రా శకుంతల జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె తల్లి కంటిపాటి ధనలక్ష్మి మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతుండగానే శనివారం ఉదయం ఆరు గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తన కుమార్తెకు పురిటినొప్పులు వస్తున్నాయని ధనలక్ష్మి నర్సులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. ఈలోగా శకుంతల బాత్రూమ్కు వెళ్లగా, అక్కడే తీవ్ర రక్తస్రావమై కడుపులోని బిడ్డ తల బయటకు వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి శకుంతల వెళ్లిపోయింది. ఇది గమనించిన తల్లి.. గట్టిగా కేకలు వేయగా, శిక్షణలో ఉన్న నర్సులు వచ్చి.. గర్భిణిని డెలివరీ రూమ్‌కు కాకుండా ప్రసూతి వార్డుకు తరలించారు. మంచంపై పడుకోబెట్టగా ఆ మంచంపైనే శకుంతల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీరిగ్గా నర్సులు శకుంతలను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి మాయ తొలగించి, కుట్లు వేశారు. నర్సింగ్ విద్యార్ధినులు సకాలంలో పట్టించుకోకపోయి ఉంటే గర్భిణి ప్రాణాలకే ముప్పు వచ్చేది. ఆస్పత్రిలో శకుంతల పడిన నరకయాతనను చూసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే అంత జరుగుతున్నా, సిబ్బంది చీమ కుట్టినట్లు కూడా స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతలో ఎంత మార్పు అంటూ నిట్టూర్చారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.పట్టించుకోరా అంటే.. బయటికి పొమ్మన్నారు విధుల్లో ఉన్న నర్సుల వల్లే నా బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు నా బిడ్డ ప్రాణాలతో దక్కింది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా కూతురిని పట్టించుకోకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా.. బయటకు పొమ్మంటూ దుర్భాషలాడారు. ఆస్పత్రిలో మూడురోజుల నుంచి నా కుమార్తె నొప్పులతో బాధపడుతోందని, పరీక్షించమని వేడుకున్నా ఒక్క నర్సు కూడా పట్టించుకోలేదు. డాక్టరు వస్తారు.. సమాచారం ఇస్తాం... అంటూ మమ్మల్ని పంపేశారు. ఆస్పత్రిలో సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ధనలక్ష్మి, గర్భిణి శకుంతల తల్లి, ఎల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం మండలం -
పేదలపై పిడుగు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషాతో ఏపీ స్పెషాలిటీ హాస్పటల్ అసోసియేషన్ చర్చలు విఫలమయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా రూ.2500 కోట్ల బకాయిలకు 200 కోట్లు తక్షణమే చెల్లిస్తామన్న ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషా.. మరో రూ.300 కోట్లు సోమవారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని అసోసియేషన్ తేల్చి చెప్పింది. చర్చలు విఫలం కావడంతో అత్యవసర సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌తో మంత్రి సత్యకుమార్ చర్చించనున్నారు.రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పథకం నిర్వహణకు డబ్బులు లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.మరోవైపు పథకం స్థానంలో బీమా ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్జుమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. -
చంద్రబాబుకి విడదల రజిని సూటి ప్రశ్న
-
రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు: సీఎం రేవంత్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు.అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందాలి: సీఎంకలెక్టర్ల సమీక్షలో ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్న సీఎం.. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఆసుపత్రుల్లో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని పేర్కొన్నారు.‘డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించాం. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించాం.ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు,చెవులు మీరే.. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలిఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు.మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది.ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి: సీఎంతెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం.విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి. -
AP: అప్పుడే మొదలైంది.. ఆరోగ్యశ్రీలో 134 చికిత్సలకు కోత
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆరోగ్యశ్రీ చికిత్సలకు అప్పుడే కోత మొదలైంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న 134 చికిత్సలను ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలని వైద్యవిద్యా సంచాలకులు నిర్ణయించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ప్రతిపాదనలు పంపించారు. వీటిలో మెజారిటీ చికిత్సలు జనరల్ సర్జరీకి సంబంధించినవే. గతంలో 171 చికిత్సలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసేవారు.ఇప్పుడు వీటికి అదనంగా 134 చికిత్సలను చేరుస్తూ ఆరోగ్యశ్రీ సీఈఓకు ప్రతిపాదన పంపించారు. తీవ్ర గాయాలై ఆపరేషన్లు చేయాల్సి రావడం, కడుపునొప్పి, హెరి్నయా వంటి జనరల్ సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ జరిగేవి. ఈ చికిత్సలన్నీ ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి.ఈ మేరకు బుధవారం అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరించినట్టు తెలిసింది. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని నిర్ణయించిన చికిత్సల్లో జనరల్ సర్జరీకి సంబంధించి 129, గైనకాలజీకి సంబంధించి 5 చికిత్సలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనతో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేసే చికిత్సల సంఖ్య 305కు చేరింది. తాజాగా ప్రతిపాదించిన 134 చికిత్సలను రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి తొలగించనున్నారు. ఈ విషయాన్ని డీఎంఈ తమకు వివరించారని అనంతపురం వైద్య కళాశాలకు సంబంధించిన ఓ అధికారి పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి పడనుంది. -
ఆరోగ్యశ్రీ పేదల పాలిట ఆరోగ్యప్రదాయిని: లబ్ధిదారులు
-
AP: 42 శాతం ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం సరికొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తోంది. విస్తరించిన ప్రయోజనాలు, సరికొత్త ఫీచర్లతో కూడిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా వేగంగా సాగుతోంది. ఇప్పటికే 42 శాతం లబ్ధిదారులకు కార్డులు అందాయి. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం కలిగిన 1.43 కోట్ల కుటుంబాలు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. వీరికి నూతన కార్డుల పంపిణీ డిసెంబరు నెలలో మొదలైంది. ఇప్పటివరకు 60,43,902 కుటుంబాలకు కార్డులను అందజేశారు. అత్యధికంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 7.16 లక్షల కార్డులు ఉండగా 3.45 లక్షలు, ప్రకాశం జిల్లాలో 6.45 లక్షలకు గాను 2.54 లక్షలు, కాకినాడ జిల్లాలో 4.67లక్షలకు గాను 4.67 లక్షల కార్డుల పంపిణీ పూర్తయింది. కొత్త కార్డులు అందజేయడంతోపాటు పథకం కింద ఉచితంగా పొందే వైద్య సేవలు, వాటిని ఎలా పొందాలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్విర్యం చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఈ పథకానికి ఊపిరిలూదారు. మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా పని చేసేలా తీర్చిదిద్దారు. గతంలో కేవలం తెల్లరేషన్ కార్డుదారులు మాత్రమే పథకం పరిధిలోకి వస్తుండగా, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలను కూడా పథకం పరిధిలోకి తెచ్చారు. అంతేకాకుండా పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. వందలాది చికిత్సలను కొత్తగా ఇందులో చేర్చారు. ఈ తరహా ప్రయోజనాలన్నింటితో కూడిన కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తోంది. సిటిజెన్ యాప్‌పై అవగాహన కార్డులు పంపిణీ సమయంలోనే ప్రతి కుటుంబానికి పథకం సేవలను సులువుగా ఎలా పొందాలో వివరిస్తూ బ్రోచర్‌ను అందజేస్తున్నారు. పథకం సమగ్ర సమాచారం ఈ బ్రోచర్లో ఉంది. ఇది ప్రజలకు ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లబ్దిదారుల మొబైల్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్ యాప్‌ను ఇన్స్టాల్ చేయిస్తున్నారు. అందులో లాగిన్ అయి ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తున్నారు. వైద్య సేవలు, రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల ఉండే నెట్వర్క్ ఆస్పత్రులు, వాటిల్లో ఏ ప్రొసీజర్స్‌కు వైద్యం చేస్తారనే సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఏ ఆస్పత్రి ఉందో కూడా తెలుసుకోవచ్చు. అక్కడకు చేరుకోవడానికి జీపీఆర్ఎస్ సౌకర్యం కూడా ఉంది. ఇక గతంలో పథకం ద్వారా పొందిన చికిత్సలు, రిపోర్ట్‌లను ఒక్క క్లిక్‌తో పొందడానికి వీలుంటుంది. కార్డులో ఉండేవివీ.. ♦ కుటుంబ యజమాని పేరు, జిల్లా, మండలం, గ్రామ/వార్డు సచివాలయం వివరాలు ♦ కుటుంబ సభ్యుల ఫోటోలు, వారి పేర్లు, ఇతర వివరాలు ♦ యూనిక్ హెల్త్ ఐడెంటిటి నంబర్ (యూహెచ్ఐడీ) ♦ క్యూఆర్ కోడ్ (వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆరోగ్యమిత్ర, వైద్యులు సులువుగా కేస్ రిజిస్ట్రే షన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. ♦ దీనివల్ల మరింత వేగంగా, సులభంగా వైద్య సేవలు అందుతాయి) -
దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు
-
Andhra Pradesh: అందరికీ ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా కల్పిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో పథకం గురించి తెలియని వారు ఏ ఒక్కరూ ఉండటానికి వీల్లేదని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందనే అవగాహన ఉండాలన్నారు. పథకాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ అమలు, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ, ప్రచార కార్యక్రమాలపై ఆరా తీసిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. చేతి నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు.. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలందిస్తూ అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు, చికిత్స వ్యయ పరిమితిని విప్లవాత్మక రీతిలో భారీగా పెంచాం. పేద, మధ్య తరగతి ప్రజలెవరూ వైద్యం కోసం చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడా రాకూడదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదు. తమకు దగ్గరలోని నెట్వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి. విస్తరించిన ప్రయోజనాలతో కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు కార్డుల పంపిణీ పూర్తి చేయాలి. జల్లెడ పట్టి గుర్తిస్తూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గుర్తించిన అనారోగ్య బాధితులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతోందో నిరంతరం సమీక్షించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రివెంటివ్ కేర్ అత్యంత ముఖ్యమైన అంశం. ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను గుర్తించి శిబిరాల ద్వారా అవసరమైన వైద్య సేవలు అందించాలి. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణాన్ని జల్లెడ పట్టాలి. శాచ్యురేషన్ విధానంలో ఈ ప్రక్రియ జరగాలి. ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్లు ఉన్నాయి? ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు? వారికి అందే వైద్యసేవలు ఏమిటి? తదితర అంశాలతో డేటా మ్యాపింగ్ చేపట్టాలి. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు, కాలానుగుణంగా మందులు అందించాలి. ఈ మొత్తం డేటాను ప్రతి ఆర్నెల్లకు ఒకసారి మీ రికార్డుల్లో అప్డేట్ చేయాలి. గ్రామంలో వంద శాతం ఇళ్లు, వ్యక్తులు ఈ ప్రక్రియలో కవర్ కావాలి. సదుపాయాలపై శ్రద్ధ.. ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్ అయినా సరే వారికి కూడా ఉచిత వైద్యం అందాలి. ప్రాథమిక వైద్య పరీక్షల్లో గుర్తించిన సమస్యలను నిర్ధారించేందుకు మరోసారి పరీక్షలు చేయాలి. సురక్ష రెండో దశ నిర్వహణ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి. గుండె పోటు బాధితులకు సత్వర వైద్యం కోసం ప్రవేశపెట్టిన స్టెమీ కార్యక్రమం వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి మొదలవ్వాలి. దీనిపై సిబ్బందికి అవగాహన కల్పించాలి. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సదుపాయాలపై ఫోకస్ పెట్టాలి. అవసరమైన అన్ని వసతులను కల్పించాలి. కర్నూలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ త్వరలో ప్రారంభం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కింద ఇప్పటివరకూ 1,338 శిబిరాలు నిర్వహించి 98,210 మందికి అక్కడే స్పాట్ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందినట్లు తెలిపారు. సురక్ష తొలి దశ కార్యక్రమం సందర్భంగా నేత్ర పరీక్షలు నిర్వహించి 5,76,493 మందికి కళ్లద్దాల అవసరం ఉందని గుర్తించగా 67 శాతం మందికి ఇప్పటికే పంపిణీ చేసినట్లు చెప్పారు. మిగిలిన వారికి అద్దాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్ఎన్సీయూలు, 5 ఎన్ఐసీయూలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలియచేశారు. విశాఖలోని మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్ స్టోర్స్, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బరŠన్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్‌ను అతి త్వరలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు ఆరోగ్య భారం తగ్గింది..!
-
జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రశంసలు
-
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్‌ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్‌లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్‌కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్‌స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్‌సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి సీఎం జగన్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్
-
పేదవాడికి ఆరోగ్యశ్రీ చేరువ చేయడమే లక్ష్యం: సీఎం జగన్
-
ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్ లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయ్యేలా చర్యలు
-
ఆరోగ్యశ్రీ కవరేజీ రూ. 10 లక్షలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినవిధంగానే ఆరోగ్యశ్రీ కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో పెరిగిన కవరేజీ అందుబాటులోకి రానుంది. వాస్తవానికి గతంలో ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు మాత్రమే కవరేజీ ఉండేది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కూడా ఆరోగ్యశ్రీతో కలిపి చేస్తుండటంతో కవరేజీని రూ.5లక్షలకు పెంచారు. ఇక నుంచి ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా ఇప్పటివరకు రూ. 800 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా, ఇకనుంచి అది రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు రాష్ట్రంలో 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ పెద్దాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే బకాయిలు పేరుకుపోవడంతోపాటు ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. 2013 ప్యాకేజీ ప్రకారమే ఆస్పత్రులకు సొమ్ము అందుతుంది. దీనిని సవరించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. అది పెంచకపోతే కవరేజీ రెట్టింపు చేసినా, తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. కానీ రాష్ట్రంలో అది జరగకపోవడంతో పథకం సక్రమంగా అమలు కావడం లేదు. కాగా, మరికొన్ని కొత్త వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్ణయించింది. 611 కొత్త వ్యాధులను తీసుకురావాలని ప్రతిపాదించగా, వాటిల్లో 539 కొత్త వాటిని ఖరారు చేశారు. -
ఆరోగ్య శ్రీ కింద రూ.25లక్షలు వరకూ ఉచితంగా వైద్యం
-
బాబు కోసం ఇంత బరితెగింపా!?
సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఈనాడు రామోజీరావు బరితెగింపు రోజురోజుకీ మితిమీరుతోంది. తన ఆత్మ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లోనైనా గట్టెక్కుతాడో లేదోనన్న అనుమానం ఆయనలో ఎక్కువైపోతోంది. దీంతో తన విషపుత్రిక ఈనాడులో ఏం రాస్తున్నారో కూడా చూసుకోలేని దుస్థితి ఆయనకు దాపురించింది. ఎందుకంటే.. తాజాగా ఈనాడులో ‘గుండె గోడు వినపడదా..?’ అంటూ మంగళవారం అచ్చేసిన ఓ తప్పుడు కథనం ఆయన పరిస్థితికి అద్దంపడుతోంది. నిజానికి.. వైద్యానికి డబ్బులేక ఏ ఒక్క పేద వ్యక్తి గుండె ఆగిపోకూడదనే సంకల్పంతో సీఎం జగన్ డాక్టర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తున్నారు. రాష్ట్రంతో పాటు, దేశంలోనే వైద్య రంగంలో ఇదొక విప్లవాత్మక పథకమని సాక్షాత్తు నీతిఆయోగ్ సైతం ప్రశంసించింది. కానీ, రామోజీరావుకు మాత్రం ఇది అర్థకాదు. నిత్యం పథకంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగమే ఈ క్షుద్ర రాతలు. అందులోని వాస్తవాలను పరిశీలిస్తే.. టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో మొక్కుబడిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేశారు. దీంతో అప్పట్లో జబ్బుల బారినపడిన నిరుపేద ప్రజలు ఉచితంగా వైద్యసేవలు అందక నానా అవస్థలు పడ్డారు. చేతి నుంచి డబ్బు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేక దేవుడిపై భారం వేసిన దుస్థితి వారిది. ఈ పరిస్థితుల్లో రామోజీ ఏనాడూ వీరి వేదనను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257 ప్రొసీజర్లతో పథకాన్ని అమలుచేస్తూ, చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా ద్వారా కూడా రోగులకు అండగా నిలుస్తుండడంతో రామోజీ జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబుకు ఇక ఎప్పటికీ అధికారం రాదనే కలవరంతో ఆయన ఇష్టమొచ్చింది చేతికొచ్చినట్లు రాసిపారేశారు. 4.53 లక్షల మందికి ఉచిత గుండె చికిత్సలు.. ఇక గుండె చికిత్సల విషయానికొస్తే.. 2019 నుంచి ఇప్పటివరకు సీఎం జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఏకంగా 4,53,486 మంది హృద్రోగ బాధితులకు ఉచితంగా చికిత్స చేయించింది. ఇందుకు రూ.2,074 కోట్లను ఖర్చుచేసింది. ఇందులో.. ♦ 23,789 మందికి కరోనరీ బైపాస్ సర్జరీలకు గాను రూ.278.88 కోట్లు.. ♦ 2,255 మందికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ ఆఫ్ ఏఎస్డీ సర్జరీకి రూ.17.66 కోట్లు చొప్పున వెచ్చించారు. ♦ అంతేకాక.. పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గత ఏడాది ప్యాకేజీ రివిజన్ ప్రక్రియలో టెక్నికల్ కమిటీ సలహాల మేరకు ఆరోగ్యశ్రీ చికిత్సలను ఆయుష్మాన్ భారత్, వివిధ రాష్ట్రాల ప్యాకేజీలతో సరిపోల్చి చాలావరకూ పెంచారు. -
AP : డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా తగ్గొద్దని సూచించారు. ‘‘ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. అలాగే.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలానికి మందులు అందించాలి. ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది లేదనే మాట వినపడకూడదు.. ఖాళీలు ఉండకూడదు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూత నిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలానికే ఇండెంట్ వస్తే వారికి తగిన సమయానికి మందులు ఇచ్చేందుకు వీలు అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేవా? అనే దానిపై పరిశీలన చేయాలి. జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండో దశ కార్యక్రమాలు నిర్వహించాలి’’.. అని అధికారులకు ఆదేశించారాయన. అలాగే.. చైనాలో ప్రస్తుతం విస్తరిస్తున్న H9N2 వైరస్ దృష్ట్యా ఇక్కడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్నమౌలిక సదుపాయాలపై సమీక్షచేయాలన్న సీఎం. -
సులభంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందేలా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోట్ల మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఆపద్భాందవి ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడినా, ప్రమాదానికి గురైనా సదరు వ్యక్తులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకం కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఈ పథకానికి సీఎం వైఎస్ జగన్ ఊపిరిలూదారు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్‌ను పథకం పరిధిలోకి తెచ్చారు. 1,059 నుంచి 3,257కు ప్రొసీజర్స్‌ను పెంచి ప్రజలకు ఆరోగ్య భరోసానిస్తున్నారు. ఇలాంటి పథకం గురించి తెలియక, సేవలు ఎలా వినియోగించుకోవాలో అవగాహన లేక పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం చేతి నుంచి డబ్బు పెట్టకూడదని ప్రభుత్వం భావించింది. దీంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పథకం పట్ల పూర్తి అవగాహన కల్పించడం కోసం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆరోగ్యశ్రీపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమానికి వైద్య శాఖ శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికీ వైద్య సిబ్బంది ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీపై విస్తృత అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ఆరోగ్యశ్రీ సేవలపై సవివరంగా రూపొందించిన బ్రోచర్‌ను ప్రతి ఇంటిలో అందజేస్తారు. ఏదైనా ఆరోగ్య సమస్య, ప్రమాదం సంభవిస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా, సులువుగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరిస్తారు. తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రులు, ఆయా ఆస్పత్రుల్లో అందే వైద్య సేవల గురించి చెబుతారు. సేవలు వినియోగించుకోవడంలో ఏమైనా సమస్యలు తలెత్తినా, సంతృప్తకర స్థాయిలో సేవలు అందకపోయినా 104కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవడంతో పాటు, ఎలా ఫిర్యాదులు చేయాలో వివరిస్తారు. ఎక్కడైనా లంచాలు డిమాండ్ చేస్తే 14400కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేసేలా చైతన్యం కల్పిస్తారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి భృతి అందిస్తున్న ఆరోగ్య ఆసరా గురించి తెలియపరుస్తారు. అర చేతిలో ఆరోగ్యశ్రీ ప్రజలకు మరింత సులువుగా పథకం సేవలు అందించడానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను వైద్య సిబ్బంది ప్రజల ఇంటి వద్దే తెలియజేసి వారి స్మార్ట్ ఫోన్లో యాప్‌ను ఇన్స్టాల్ చేయించి, ఎలా వినియోగించాలో వివరిస్తారు. యాప్ ద్వారా గతంలో చేయించుకున్న చికిత్సల మెడికల్ రిపోర్ట్‌లను భవిష్యత్‌లో ఎప్పుడైనా అవసరమైతే ఎలా పొందవచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడాన్ని తెలియపరుస్తారు. ఒక్కో కుటుంబానికి కనీసం 15 నిమిషాలు ఆరోగ్యశ్రీ పథకం సేవల గురించి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపై అవగాహన లేని కుటుంబం రాష్ట్రంలో ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పించేలా విస్తృత అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. ఏఎన్ఎం, సీహెచ్‌వో ప్రతి కుటుంబానికి కనీసం 15 నిమిషాలు కేటాయించి పథకం సేవలపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్‌ను ప్రతి ఇంటికి అందజేస్తారు. – డాక్టర్ వెంకటేశ్వర్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
రుణానికి పూర్తి బాధ్యత మేఘాదే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడటం అంటే గజదొంగే దొంగా.. దొంగా అని అరిచినట్లుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండిపడ్డారు. మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణను ఆయన ఖండించారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని బుగ్గన గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం కొత్తగా వచ్చిన ఓ నాయకుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ.2,000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారని, అసలు గ్యారెంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేదన్నారు. ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ అనేది ముమ్మాటికీ అబద్ధమన్నారు. ఇది ప్రభుత్వమిచ్చిన గ్యారెంటీ కాదని, ప్రభుత్వం కేవలం ప్రైవేట్ సంస్థకు బకాయిలెన్ని ఉన్నాయి అని వివరాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదికూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినదని, పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బ్యాంకుకు కట్టవలసిన వడ్డీ ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని తెలిపారు. వడ్డీ, అసలు కట్టే విషయంలో ఎలాంటి ఆలస్యమైనా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. బ్యాంకులు ఆ ప్రైవేట్ సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్లు ఇస్తున్నాయని బుగ్గన పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం విషయంలో చేసిన తప్పులే ప్రస్తుత పరిస్థితులకు కారణమని బుగ్గన విమర్శించారు. మీరు పెట్టిన బకాయిలను మేం చెల్లించాం ఆరోగ్యశ్రీ బిల్లులకు గ్యారెంటీ ఇవ్వరా అని అడుగుతున్నారని, టీడీపీ పాలనలో రూ. 800 కోట్లు పైచిలుకు చివరి 8 నెలల కాలంలో పెండింగ్‌లో పెట్టినప్పుడు చంద్రబాబు గ్యారెంటీ ఇచ్చారా? అని బుగ్గన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలు చెల్లించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సామర్థ్యం పెంచి పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీకి టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ. 5,177 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఈ నాలుగున్నరేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 9,514.84 కోట్లు వెచ్చించిందని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత టీడీపీకి ఎక్కడదని బుగ్గన అన్నారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉన్న రూ. 40,000 కోట్లు పెండింగ్ బిల్లులకు గ్యారెంటీ అడిగారా అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఇక ట్యాంకర్లతో అందించిన నీటికి బిల్లుల విషయంలోనూ టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ. 80 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం రాగానే చెల్లించిందని చెప్పారు. -
రాష్ట్ర వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ చెప్పారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న హరియాణ ట్రైనీ సివిల్ సర్విసెస్ అధికారుల బృందం బుధవారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో వైద్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ బృందానికి కమిషనర్ నివాస్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి వివరించారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలే ఈ ప్రభుత్వం వైద్యశాఖలో తెచ్చిన మార్పునకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వైద్యపరమైన సమస్యలు, అవసరాలు తీర్చేలా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.250 చొప్పున ఆరునెలల వరకు భృతిని ఇస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి పథకం బహుశా దేశంలోనే ఎక్కడా అమలులో లేదన్నారు. సీఎం చైర్మన్‌గా వ్యవహరించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీతో పాటు 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానమైన 104 మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం అమలు చేస్తున్నట్లు తెలిపారు. హరియాణ ట్రైనీ అధికారులు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యరంగంపై ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం అభినందనీయమని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరును తాము పరిశీలించామన్నారు. 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను నెలకొల్పడమే కాకుండా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న సీహెచ్‌వోలను నియమించి మారుమూల గ్రామాలకు సైతం వైద్యసేవల్ని విస్తరించడం ప్రశంసనీయమని చెప్పారు. అత్యధిక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లను సృష్టించడంలో కూడా దేశంలోనే ఏపీ ముందు నిలిచిందన్నారు. ఏపీలోని వలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను ఎంతో చేరువ చేశారని వారు పేర్కొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసింది. మానవ వనరుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తోంది. ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, తగినన్ని మందులు, ఇతర వనరులు సమకూర్చింది. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019 అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించారు. దీంతో 2018–19లో 1,22,626 సేవలు మాత్రమే నమోదు కాగా 2022–23లో ఏకంగా 4,42,929కు చేరాయి. దీంతో అదే మేర ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిధులు పెరిగాయి. ఆరోగ్యశ్రీ కింద 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రూ.200 కోట్ల విలువ చేసే వైద్య సేవలు అందించగా.. గత సంవత్సరం ఈ మొత్తం ఏకంగా రూ.350 కోట్లకు పెరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో ఆరోగ్యశ్రీ కింద అత్యధిక సేవలు అందిస్తూ విశాఖపట్నంలోని కేజీహెచ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత విజయవాడ, కర్నూలు ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల వాటా పెంచడానికి ప్రత్యేక చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు తావులేకుండా ఏకంగా 50 వేలకు పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఎప్పుడు ఖాళీ అయిన పోస్టులను అప్పుడే వెంటనే భర్తీ చేస్తోంది. దీనికి తోడు నాడు–నేడు కింద ఆస్పత్రులకు కొత్త భవనాలు సమకూర్చడంతో పాటు పాత భవనాలకు మరమ్మతులు చేపట్టింది. అత్యాధునిక వైద్య పరికరాలతో ఆపరేషన్ థియేటర్లను తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్యను వీలైనంత తగ్గించాలని వైద్య శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను గణనీయంగా పెంచడం ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద నమోదవుతున్న వైద్య సేవల్లో 69 శాతం మేర ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో, 31 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల వాటాను మరింతగా పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సేవల పెంపునకు ప్రత్యేక చర్యలు.. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలను మరింత పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు ఇన్సెంటివ్ నిధుల చెల్లింపునకు చర్యలు చేపట్టాం. – ఎం.ఎన్.హరేందిరప్రసాద్, సీఈవో, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ గతంతో పోలిస్తే మెరుగుపడ్డ సేవలు.. బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి. వీటిని మరింతగా పెంచడానికి ఆస్పత్రులకు విభాగాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నాం. గతేడాది నిర్వహించిన కేసుల కంటే ప్రస్తుత ఏడాది 20 శాతం ఎక్కువ కేసులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – డాక్టర్ నరసింహం, డీఎంఈ ఆరోగ్యశ్రీ సేవలు వేల నుంచి లక్షల్లోకి.. ఇక వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు 2018–19తో పోలిస్తే వేల నుంచి ప్రస్తుతం లక్షల్లోకి పెరిగాయి. అప్పట్లో ఏడాదికి 16 వేలు మాత్రమే ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు ఉండేవి. వీటికి సంబంధించి నిధుల వాటా కేవలం రూ.34.94 కోట్లు మాత్రమే ఉండేది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. 2022–23లో ఏకంగా రూ.151 కోట్ల విలువ చేసే వైద్యాన్ని 2.05 లక్షల కేసుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించారు. -
ఆరోగ్యశ్రీలో 648 క్యాన్సర్ ప్రొసీజర్లు
సాక్షి, అమరావతి: క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రంలోని పేద రోగులకు ఎంతో మేలు చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఎంతో దార్శనికతతో క్యాన్సర్ నియంత్రణకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ నివారణ–ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సకు ఏడాదికి రూ.600 కోట్లకు పైగా నిధులు ఒక్క ఆరోగ్యశ్రీకే ఖర్చు చేస్తోందని తెలిపారు. మొత్తం 648 క్యాన్సర్ ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 క్యాన్సర్ కేర్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని, అన్ని ఆస్పత్రుల్లో చికిత్స ఏకీకృతంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో 5 శాతం బెడ్లు పాలియేటివ్ కేర్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. క్రమ పద్ధతిలో ఆస్పత్రుల అభివృద్ధి: నోరి దత్తాత్రేయుడు ప్రతి టీచింగ్ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు చికిత్సను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందని మంత్రి తెలిపారు. కర్నూలు, కడపలో స్టేట్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు మొత్తం రూ.220 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ రెండు చోట్లా క్యాన్సర్ కేర్ సెంటర్లు అక్టోబర్ చివరి కల్లా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గుంటూరులోని క్యాన్సర్ కేర్ సెంటర్‌ను కూడా తొలి విడతలోనే పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. రెండో విడతలో అనంతపూర్, కాకినాడల్లో క్యాన్సర్ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఏపీలో ఒక క్రమపద్ధతిన క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, క్యాన్సర్ చికిత్సకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. దేశంలోనే క్యాన్సర్‌కు పూర్తి ఉచితంగా, అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉంటుందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రాణం నిలబెట్టిన వైఎస్ఆర్.. ప్రాణం తీసిన బాబు ప్రభుత్వం
-
దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు,లోకేష్ చర్చకు రావాలి: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఆరోగ్యశ్రీపై మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎవరి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైందో చర్చకు సిద్ధమా? దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు, లోకేష్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘‘గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. ఆరోగ్యశ్రీని వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్ చెప్పగలరా?. 3257 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌ది’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదు. మా హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్లు ఖర్చుపెట్టాం. నాలుగేళ్లలో 10,100 కోట్లు ఖర్చుపెట్టాం. వార్షికాదాయం 5 లక్షలు ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం. మా హయాంలో 2275 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందుతుంది’’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. చదవండి: ఇంత బిల్డప్ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం.. -
క్యాన్సర్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
గుంటూరు మెడికల్: క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఏడాదిలో రూ.600 కోట్లు క్యాన్సర్ చికిత్సల కోసం ఖర్చు చేసిందన్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో శుక్రవారం జరిగిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్ రాష్ట్రస్థాయి వార్షిక తొలి సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాధునిక క్యాన్సర్ వైద్యసేవలు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో గత ప్రభుత్వంలో 990 ప్రొసీజర్లు మాత్రమే ఉండేవని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో 3,257 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చారని వివరించారు. ముఖ్యమంత్రికి క్యాన్సర్ నియంత్రణకై ప్రత్యేకదృష్టి ఉందని, అందుకే ఆరోగ్యశ్రీ పథకంలో 638 ప్రొసీజర్లు కేవలం క్యాన్సర్ వ్యాధులకు చెందినవే అందుబాటులో ఉంచారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందన్నారు. ఇతర కళాశాలల్లో సైతం రెండోదశలో క్యాన్సర్ చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలులో రూ.120 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రూ.55 కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కడపలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్‌ను క్యాన్సర్ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా మార్చేందుకు రూ.45 కోట్లతో అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హరీంద్రప్రసాద్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక క్యాన్సర్ చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. నాట్కో ట్రస్టు వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేదలకు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలు, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి.వి.శివరామకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉమేష్‌శెట్టి, డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, యడ్లపాటి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామస్థాయిలోనే దంత వైద్యం
సాక్షి, అమరావతి : గ్రామస్థాయిలోనే అన్నిరకాల వైద్య సేవలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యయ, ప్రయాసలను తగ్గిస్తోంది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) స్థాయిలోనే వైద్యశాఖ దంత వైద్యసేవలు అందిస్తోంది. ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) పరిధిలోని ఆస్పత్రుల్లో 245 దంత వైద్య విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రజలకు దంత వైద్యసేవలను చేరువ చేసేందుకు ఏపీవీవీపీ ఆస్పత్రుల్లోని దంత వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,142 పీహెచ్‌సీలను అనుసంధానించారు. ఈ క్రమంలో దంత వైద్యులు నెలలో ఒకసారి ప్రతి పీహెచ్‌సీనీ సందర్శిస్తూ అక్కడే డెంటల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. 2.14 లక్షల మందికి సేవలు.. నిజానికి.. రెండేళ్ల క్రితం పీహెచ్‌సీల్లో డెంటల్ క్లినిక్స్ నిర్వహణను ప్రారంభించారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో 35,151 డెంటల్ క్లినిక్‌లను నిర్వహించారు. వీటిల్లో 2,14,410 మంది పీహెచ్‌సీల్లో దంత వైద్యసేవలు అందుకున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లే దంత వైద్యులు అక్కడే ప్రజలకు ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. చిన్నపాటి దంత సమస్యలకు పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం ఉంటే దగ్గర్లోని సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే సమస్యల గుర్తింపు చాలావరకూ ప్రజలు చిన్నచిన్న దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవి దీర్ఘకాలం పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. ప్రాథమిక దశలోనే దంత సమస్యలను గుర్తించి నివారించడానికి చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా పీహెచ్సీ స్థాయిలోనే డెంటల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నాం. తద్వారా ప్రజలు సులువుగా వైద్యులను సంప్రదించడానికి వీలుంటుంది. ఓరల్ స్క్రీనింగ్‌పై పీహెచ్సీ వైద్యులకు ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. దీంతో ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్తున్న పీహెచ్సీ వైద్యులు ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తింపునకు.. మరోవైపు.. ప్రాథమిక దశలోనే నోటి క్యాన్సర్ గుర్తించడానికి వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జిల్లా కడప, విజయవాడ డెంటల్ కళాశాలలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని బోధనాస్పత్రుల్లోని దంత వి భాగాలకు అధునాతన వెల్‌స్కోప్ పరికరాలను సమకూర్చారు. వీటిద్వారా నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి మే నెల మధ్య ఐదుచోట్ల 1,676 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 61 మందిలో నోటి క్యాన్సర్ నిర్ధారణ అయింది. బాధితులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. -
ఆరోగ్యానికి బలం!
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వైద్య, ఆరోగ్య రంగంలో నియామకాలతోపాటు పెద్ద ఎత్తున మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అనే మాటకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం మొదలు నాడు–నేడు ద్వారా వసతులతో తీర్చిదిద్దింది. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం లాంటి విప్లవాత్మక చర్యలతో ఆరోగ్య రంగం ముఖ చిత్రాన్నే మార్చేసింది. కొరతకు చెక్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 48,639 వైద్య సిబ్బంది పోస్టులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భర్తీ చేయడం గమనార్హం. పదవీ విరమణ తదితర కారణాలతో ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు గుర్తించి భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. కేవలం వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. నాడు–నేడుతో మహర్దశ టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రూ.16 వేల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. నాడు–నేడు కార్యక్రమంతోపాటు 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలున్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. 882 చోట్ల పనులు పూర్తి కావటంతో ఆస్పత్రులు అధునాతనంగా తయారయ్యాయి. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ ఏడాదే 5 కొత్త వైద్య కళాశాలలు వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు కల్పించాలని నిర్దేశించుకోగా ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. తద్వారా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు అందుబాటులోకి రానుండగా ఆ తర్వాత ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరగనుంది. ప్రజారోగ్యానికి రక్ష వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజారోగ్యానికి రక్షణ కల్పిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడంతో 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు 3,255కి పెరిగాయి. ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు సూచించిన మేరకు రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. 108 సేవలకు పూర్వ వైభవం దివంగత వైఎస్సార్ ప్రారంభించిన 108 అంబులెన్స్ సేవలను గత సర్కారు నిర్వీర్యం చేసింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3,300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను తొలుత మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి రావడంతో 104 ఎంఎంయూలు మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. పల్లెల్లోనే వైద్యం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నెలకు రెండు సార్లు గ్రామాలను సందర్శిస్తున్నారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగులను మధ్యాహ్నం నుంచి పరామర్శిస్తూ ఇంటి వద్దే వైద్య సేవలు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకూ వైద్యులు గ్రామాలకు వెళ్లి 1,17,08,895 మందికి వైద్య సేవలు అందించారు. -
వైద్యం.. కొత్త ముఖచిత్రం... నాలుగేళ్లలో విప్లవాత్మక సంస్కరణలు
మన బంధువులు, మిత్రులు, తెలిసిన వారెవరైనా మనకు తారసపడినప్పుడో లేక ఫోన్ చేసినప్పుడో వినిపించే తొలి పదం ‘బాగున్నారా..’ అని. ఆ తర్వాతే మిగతా విషయాలు. అంటే ఆరోగ్యంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. అప్పుడే అన్ని పనులను సవ్యంగా చేసుకోగలమని.. దేన్నయినా సాధించుకోగలమనే నమ్మకం ఉంటుంది. దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా, దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే గొప్పగా వైద్య, ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతోంది. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, కొత్త వైద్య.. నర్సింగ్ కళాశాలల ఏర్పాటు, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తోంది. మన ఇంట్లో వారికే బాగోలేకపోతే ఎలాంటి వైద్యం కోరుకుంటామో అచ్చంగా అలాంటి వైద్యాన్నే ప్రజల ముంగిటకు తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలన్నీ శభాష్.. అనేలా విప్లవాత్మక సంస్కరణలతో ఈ రంగం ముఖ చిత్రాన్నే మార్చివేసింది. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరుకు చెందిన నాగమణెమ్మ ఎనిమిదేళ్ల క్రితం నరాల బలహీనత వ్యాధికి గురై మంచానికే పరిమితమైంది. భర్త గంగన్న, కొడుకు, కూతురు ఆమె బాగోగులు చూస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా ప్రస్తుతం నాగమణెమ్మ ఇంటి వద్దకు నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యుడు వస్తున్నాడు. ఆమెకు బీపీ చూసి, ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆసుపత్రికి పోవాలంటే ఆటో బాడుగకు తీసుకుని, ఇంట్లో వాళ్లు కష్టపడి తీసుకెళ్లేవాళ్లు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. గతంలో వీలును బట్టి ఏదో ఒక ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లు. ఒక్కోసారి ఒక్కో వైద్యుడి వద్దకు వెళ్లడంతో ఆమె ఆరోగ్య చరిత్రపై వారికి అవగాహన లేక మందులు, వైద్యం విషయంలో కొంత గందరగోళం ఉండేది. ఇప్పుడు ఒకే వైద్యుడు క్రమం తప్పకుండా నాగమణెమ్మకు వైద్యం అందిస్తుండటంతో ఆ ఇబ్బందులేవీ లేవు. ప్రస్తుతం ఇలా ఊరూరా వైద్య సేవలందించేలా ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సాక్షి, అమరావతి : ప్రస్తుతం చిన్న చిన్న జబ్బులకు పీహెచ్సీ, సీహెచ్‌సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా.. గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్ క్లినిక్స్‌కు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు చూశాక, మధ్యాహ్నం నుంచి మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల గృహాలను సందర్శించి వారికి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఈ విధానంలో రాష్ట్రంలోని 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది. ఏ రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే.. ఇక్కడి నుంచే పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తారు. ఆ రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తరలించడం, అక్కడ అతనికి వైద్యం అందేలా చూడటం వంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్ఎం చూస్తారు. వీరు విలేజ్ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. 1.17 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్‌ను గత ఏడాదిలో ప్రారంభించి.. ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు. 10,032 విలేజ్ క్లినిక్‌లను వైద్యులు 1.14 లక్షల సార్లు సందర్శించారు. ఈ క్రమంలో 1,17,08,895 వైద్య సేవలు అందించారు. నాడు–నేడుతో మహర్దశ ఇది 2019కు ముందు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీ. నెర్రెలు చీలిన ప్రహరీ.. పిచ్చి మొక్కలు, గడ్డితో కూడిన ఆవరణ.. అపరిశుభ్ర వాతావరణం, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి. ఇక్కడికి రావాలంటేనే రోగులు వణికిపోయేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఆస్పత్రిలో నాడు–నేడు కింద పనులు చేపట్టింది. కుర్చీలు, ఓపీ గదులు, 10 పడకలతో ఇన్ పేషెంట్ వార్డు, కాన్పుల గది ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చూపించుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వాటికి శాశ్వత భవనాలు సమకూర్చే దిశగా అడుగులు వేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలు ఉన్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు, పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తుండగా 882 చోట్ల పనులు పూర్తయి అధునాతనంగా ఆస్పత్రులు తయారయ్యాయి. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా 443 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్వాష్) గుర్తింపుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గుజరాత్, కేరళ, హరియాణా, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాణ్యమైన ప్రసూతి సేవలకు గాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపులో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. వైద్య విద్యలో నవశకం రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. ఫలితంగా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున 750 సీట్లు పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు.. ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావుండదు. ప్రజలకు ఆరోగ్యశ్రీ రక్ష సీఎం జగన్.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేశారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడం ద్వారా 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 3,255కు పెంచారు. పేద, మధ్యతరగతి ప్రజలు శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీని కింద 1519 రకాల ప్రొసీజర్లలో చికిత్స అనంతరం వైద్యుడు సూచించిన విశ్రాంతి సమయానికి రోజు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. ఇంకా ఎన్నెన్నో సేవలు ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ), 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రతి మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను ప్రారంభంలో మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి సచివాలయాన్ని రెండు సార్లు నెలలో 104 ఎంఎంయూలు సందర్శించేలా మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ► గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, పీహెచ్‌సీల్లో 172, సీహెచ్‌సీ ఏరియా ఆస్పత్రుల్లో 330 రకాల మందులను సమకూరుస్తున్నారు. బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు రోగులకు పెట్టే ఆహారం విషయంలోను నాణ్యత ఉండేలా చర్యలు తీసుకున్నారు. ► వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంది. నీతి ఆయోగ్ వంటి సంస్థలు ప్రశంసించాయి. దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ అని ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ పేరుతో రూపొందించిన నివేదికలో నీతి ఆయోగ్ తెలిపింది. ► క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ► దేశంలో వంద శాతం పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న రాష్ట్రం ఏపీ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు నివేదికల్లో స్పష్టం చేసింది. ► హెపటైటిస్ నియంత్రణలో ఏపీ చర్యలు భేష్‌గా ఉంటున్నాయని కేంద్ర వైద్య శాఖ ప్రశంసిచింది. హైరిస్క్ వర్గాలకు ముందస్తుగా టీకా పంపిణీ చేపడుతున్న రాష్ట్రంగా కూడా రికార్డు సాధించింది. కొరతకు తావు లేకుండా.. రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటికి ఏకంగా 48,639 పోస్టులు భర్తీ చేశారు. ఇక్కడితో ఆగకుండా ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అత్యవసర అనుమతులు ఇచ్చింది. దేశంలో స్పెషాలిటీ వైద్యులు కొరత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61 శాతం మేర ఉండగా, ఏపీలో కేవలం 5 శాతం మేర ఉంటోంది. గైనకాలజిస్టుల సంఖ్య జాతీయ స్థాయిలో కొరత 50 శాతం ఉంటే, ఏపీలో 1.4 శాతం మాత్రమే ఉంది. స్టాప్నర్స్ల కొరత 27 శాతం ఉంటే.. రాష్ట్రంలో కొరతకే ఆస్కారం లేదు. ఫలితంగా డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 4,469 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. సగటున రోజుకు 1,360 సర్జరీలు బోధనాస్పత్రుల్లో 2018–19లో సగటున రోజుకు 817 మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించే వారు. 2022–23లో రోజుకు 1360 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అప్పట్లో రోజుకు 19 వేల చొప్పున ఓపీలు, 1900 మేర ఐపీలు ఉండగా, గత ఏడాది 22 వేలకు పైగా ఓపీల చొప్పున 83.16 లక్షలు, ఐపీలు రోజుకు 2,253 చొప్పున 8.22 లక్షలు నమోదు అయ్యాయి. నాటికి, నేటికి ఎంత తేడా! కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2019కి ముందు ఒక డాక్టర్, ఆరుగురు నర్సులు, ముగ్గురు టెక్నికల్ సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఉన్న ఒక్క వైద్యుడు సెలవు పెడితే అంతే సంగతులు. సీటీ సర్జన్ ఆపరేషన్ చేసే సమయంలో గుండె నుంచి రక్త ప్రసరణ నిలిపివేసి, మెషిన్ ద్వారా ఇతర శరీర భాగాలకు రక్తం సహా ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కీలకమైన మిషన్‌ను పర్ఫ్యూజనిస్ట్లు ఆపరేట్ చేస్తుంటారు. ఇంతటి కీలకమైన పోస్టు అప్పట్లో ఖాళీగా ఉండేది. దీంతో హైదరాబాద్ నుంచి కేసుల ప్రాతిపదికన పర్ఫ్యూజనిస్ట్ను పిలిపించుకుని సర్జరీలు చేసేవారు. అత్యవసర సమయాల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోయేవారు. దీంతో 2017–18లో ఈ విభాగంలో 120 సర్జరీలు మాత్రమే చేశారు. ఓపీలు నెలకు 80లోపే చూసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విభాగంలో అదనంగా ముగ్గురు వైద్యులు, నలుగురు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు రావడంతో పాటు పర్ఫ్యూజనిస్ట్ పోస్టు భర్తీ అయింది. దీంతో 2022–23లో ఏకంగా 1600 ఓపీలు నమోదు అయ్యాయి. మేజర్, మైనర్ కలిపి 566 సర్జరీలు చేశారు. మొత్తంగా 1500 పడకలున్న ఈ ఆస్పత్రిలో 2018–19లో 9.46 లక్షల ఓపీలు, 80 వేల ఐపీ, 29 వేల మైనర్, మేజర్ సర్జరీలు నమోదయ్యాయి. 2022–23లో 12 లక్షల మేర ఓపీ, లక్షకుపైగా ఐపీ సేవలు అందించడంతో పాటు, 41 వేల సర్జరీలు నిర్వహించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దాస్పత్రుల్లో పరిస్థితి మెరుగైంది. అనుబంధం ఏర్పడుతుంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ చర్యలపై సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడం మంచి పరిణామం. గర్భిణి, బాలింత.. బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులను రెండు, మూడు సార్లు చూస్తే వైద్యుడు వారిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఆ వైద్యుడికి ప్రజలకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఇది రోగికి మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఈ మానసిక బలం రోగి త్వరగా కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరం. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూల్ జీజీహెచ్ ప్రజారోగ్య రక్షణలో మంచి ఫలితాలు బీపీని నియంత్రణలో ఉంచుకోకపోవడంతో ప్రస్తుతం 20 శాతం పెరాలసిస్ కేసులు వస్తున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. మన దగ్గర 60 శాతం గ్రామీణ జనాభా ఉంది. గ్రామాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల కోసం 10–20 కి.మీ ప్రయాణించి చూపించుకోవడం వారికి అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో వైద్యుడే ఆయా గ్రామాలకు వెళ్లడం ప్రజారోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌లో గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. – డాక్టర్ బాబ్జీ, వైస్ చాన్స్‌లర్, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం -
‘ఆరోగ్యశ్రీ సేవలు యథాతధంగా కొనసాగుతాయి’
విజయవాడ: ఆరోగ్య శ్రీ సేవల యథాతధంగా కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ స్సష్టం చేసింది. పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) రూ. 368 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించినట్లు ఆయన తెలిపారు. -
AP: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
సాక్షి, అమరావతి: ఏపీలో ఉద్యోగులకు మేలు కలిగేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక, ప్రతీ ఏటా రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలు అందేలా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు ఆదేశించారు. -
రూపాయికే కార్పొరేట్ వైద్యం.. డాక్టర్ హర్షవర్ధన్ గొప్ప మనసు
ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే భావనతో.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తరువాత ఇల్లెందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లెందు వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ అప్‌గ్రేడ్ చేశారు. హర్షవర్ధన్‌కు ఆ ఆస్పత్రిలో సర్జన్‌గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆ ఆస్పత్రిలో ఈఎన్టీ విభాగంలో డాక్టర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం... ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రి. సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మథనం మొదలైంది. పుచ్చలపల్లి సోదరుడే స్ఫూర్తి.. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీ క్లినిక్ పేరిట రూ.10 ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకే చెందిన హర్షవర్ధన్... రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లెందు ఆంబజార్‌లో పెట్టిన సొంత క్లినిక్‌లో రూపాయి ఫీజుకే వైద్యం అందించడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు పూర్తయ్యాక, సాయంత్రం క్లినిక్‌లో సేవలందిస్తున్నారు. ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స కూడా చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాలు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు.. మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు, నడుము, మెడనొప్పి, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు అత్యాధునిక పద్ధతిలో వైద్యమందించారు. మోకాలు చిప్ప మార్పిడి చేశారు.. నడవడం ఇబ్బందిగా ఉండడంతో ఓ డాక్టర్ వద్ద పరీక్ష చేయించుకున్నా. మోకాలు చిప్ప అరిగిపోయిందని, మార్చాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఇల్లెందులో ప్రజా వైద్యం అందిస్తున్న హర్షవర్ధన్‌ను సంప్రదించాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మోకాలి మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నా. – వి.బాయమ్మ, మామిడిగూడెం, ఇల్లెందు మండలం పేదలను ఆదుకోవాలని..డాక్టర్ జి.హర్షవర్ధన్, ఆర్థోపెడిక్ సర్జన్ ప్రస్తుత వైద్యం అత్యంత ఖరీదైంది. సామాన్యులను అందకుండాపోతోంది. అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నా. ప్రభుత్వ వైద్యులుగా నాకు, నా భార్యకు వచ్చే వేతనం మా కుటుంబానికి సరిపోతుంది. అందుకే క్లినిక్‌లో నామమాత్ర ఫీజుతో వైద్యం చేస్తున్నా. -
ఆరోగ్య శ్రీలో 16.47 లక్షల మందికి లబ్ధి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా గత డిసెంబర్ వరకు 16,47,782 మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,999.66 కోట్లు వ్యయం చేసింది. కోవిడ్–19 చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి.. 2,14,135 మందికి రూ.743.22 కోట్లతో ఉచిత చికిత్స అందించింది. ఈ పథకం కింద చికిత్స అనంతరం కోలుకునే సమయంలో రోగుల జీవనోపాధి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద గత డిసెంబర్ ఆఖరు వరకు 17,06,023 మందికి రూ.903.90 కోట్లు సాయంగా అందజేసింది. ఈ విషయాలను 2022–23 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఈ ప్రభుత్వం వచ్చాక 108 అంబులెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి, కొత్తగా 432 అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. 108 అంబులెన్స్‌ల ద్వారా 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ వరకు అత్యవసర వైద్యం అవసరమైన 27,00,942 మందిని ఆస్పత్రులకు తరలించింది. ఇందులో 2,54,609 కోవిడ్ కేసులు కాగా, మిగతా 24,46,333 నాన్ కోవిడ్ కేసులు. -
ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేష్
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేషుగ్గా ఉందని ఆ సంస్థ డైరెక్టర్, సీఈవో డాక్టర్ ముఖేశ్ త్రిపాఠి చెప్పారు. ఎయిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని వివరించినట్టు తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఎయిమ్స్‌కు శాశ్వత నీటిసరఫరా పనులను ఈ ఏడాది జూలైలోగా పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినట్టు తెలిపారు. రహదారి సౌకర్యానికి సంబంధించి కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు లభించాయని, ఆర్అండ్బీ శాఖ రోడ్డు వేయడానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎయిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఎంవోయూ చేసుకున్నట్టు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద గత నవంబర్ నుంచి ఇప్పటివరకు 710 మంది రోగులు ఉచితంగా వైద్యసేవలు అందుకున్నారన్నారు. 2019 మార్చి 12వ తేదీన రోగుల సంరక్షణ సేవలు ప్రారంభించామని, ఈ నాలుగేళ్లలో 9,67,192 మంది ఓపీ, 7,477 మంది ఐపీ సేవలు అందుకున్నారని వివరించారు. ఇప్పటివరకు 2,590 మేజర్, 29,486 మైనర్ సర్జరీలు నిర్వహించామన్నారు. 37 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే కార్డియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందుకోసం వైద్యుల నియామకం చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం రోజకు సగటున 2,500 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నట్టు చెప్పారు. ఇన్‌పెషంట్స్ కోసం 555 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం, పరీక్షలకు రూ.వంద ఖర్చవుతుంటే.. తమవద్ద రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఖర్చవుతాయని చెప్పారు. ఆస్పత్రిలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలవుతోందని ఈ క్రమంలో ప్రజలు ఆన్లైన్లో ఓపీడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో పారామెడికల్ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రూ.1,680 కోట్లతో చేపట్టిన ఎయిమ్స్ ఏర్పాటు పనులు పూర్తికావచ్చాయని ఆయన తెలిపారు. చికిత్స పొందిన పలువురు రోగులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తమకు వైద్యసేవల్లో ఎయిమ్స్ చూపుతున్న చొరవను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు ప్రశంసించారు. సంఘం తరఫున డైరెక్టర్, డీన్లకు జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ల ఎయిమ్స్ ప్రస్థానంపై రూపొందించిన బ్రోచర్‌ను డైరెక్టర్, డీన్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జాయ్ ఎ ఘోషల్, డాక్టర్ శ్రీమంతకుమార్ దాస్, డాక్టర్ దీప్తి వేపకొమ్మ, డాక్టర్ వినీత్ థామస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకరన్, మీడియా సెల్ ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సర్కార్ సర్జరీ సూపర్.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం
సాక్షి హైదరాబాద్ : భాగ్యనగరంలోని ప్రభుత్వాస్పత్రులు ఆధునిక చికిత్సలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా’కు అనే స్థాయి నుంచి ‘పోదాం పద సర్కారు దవాఖానాకు’ అనే దశకు చేరుకున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా క్లిష్టమైన ఆపరేషన్లను సైతం చేస్తూ రోగులకు పునర్జన్మనిస్తున్నాయి. నిష్ణాతులైన వైద్య బృందాలతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కొంతకాలంగా అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఉస్మానియా, గాందీల్లో పూర్తి ఉచితంగా నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా తక్కువ మొత్తంలో ఆపరే షన్లు చేస్తున్నారు. కుటుంబసభ్యుల అవయవదానం, జీవన్‌దాన్ ద్వారా రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వాటిల్లో కొన్నింటిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 8 నెలల చిన్నారికి అరుదైన వైద్యం జగిత్యాల జిల్లాకు చెందిన నారాయణ, ప్రేమలత దంపతులది మేనరిక వివాహం. వారి 8 నెలల పాప నిస్ సిండ్రోమ్ అనే అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో నిలోఫర్‌కు వెళ్లగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు వెళ్లమన్నారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు. ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే నాలుగోది కాగా, భారత్‌లో మొదటిదని వైద్యులు తెలిపారు. లక్షలు ఖరీదుచేసే ఆపరేషన్‌ను రూపాయి కూడా తీసుకోకుండా 28 మంది వైద్యులు దాదాపు 18 గంటలపాటు సర్జరీ పూర్తి చేసి తమ పాపకు మళ్లీ జీవం పోశారని ఆ చిన్నారి తల్లి పేర్కొంది. 2 నెలల్లో 70 కిలోలు తగ్గింపు గుడిమల్కాపూర్‌కు చెందిన శివరాజ్‌సింగ్ కుమారుడు మునీందర్‌సింగ్ ఐదేళ్ల ప్రాయం నుంచి అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నాడు. 23 ఏళ్లకు దాదాపు 220 కిలోలతో నడవలేని స్థితికి చేరాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియాలో చేర్పించారు. చిన్నతనం నుంచే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తోపాటు శ్వాస సమస్యలు ఉన్నాయి. ఉస్మానియా వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. 2 నెలల్లోనే దాదాపు 70 కిలోల బరువు తగ్గాడు. ‘నన్ను చూసి చాలా మంది హేళన చేసేవారు. ఉచితంగా సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులకు కృతజ్ఞతలు’అని మునీందర్‌సింగ్ సంతోషంగా చెప్పాడు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో.. బోరబండకు చెందిన మల్లెల వాణి కాలేయంలో కుడివైపు పెద్ద కణితితో బాధపడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతాయనడంతో ఆమె ఉస్మానియాకు వెళ్లింది. సాధారణంగా ఎడమ వైపు కణితి ఏర్పడే అవకాశం ఉండగా వాణికి కుడివైపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. లాపరోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సను పూర్తి చేయడంతో రోగి వారంలోనే కోలుకుంది. ఓ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సర్జరీ చేయడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. రోజువారీ పని చేసుకుంటూ జీవిస్తున్న తనకు ఆపరేషన్ ఉచితంగా చేయడం పూర్వజన్మ సుకృతమని వాణి పేర్కొంది. ఆరోగ్యశ్రీతో గుండె మార్పిడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నర్సింహులు కుమారుడు వరుణ్‌తేజ్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు ఆ స్కూల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వరుణ్‌తేజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు వస్తే ఆపరేషన్ చేస్తామనడంతో కుటుంబసభ్యులు వరుణ్‌ను తీసుకెళ్లారు. ఒక్కరోజుకే అక్కడ రూ.10 వేలు ఖర్చవడంతో బంధువుల సలహా మేరకు వారు నిమ్స్‌ను ఆశ్రయించారు. కార్డియో థొరాసిక్ విభాగం వైద్యులు వరుణ్‌తేజ్‌కు ఆరోగ్యశ్రీ కింద గత నెల 28న గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరోగ్యం కుదుటపడటంతో రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశామని నిమ్స్ సీటీ సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ అమరే‹శ్ మాలెంపాటి తెలిపారు. ఒకే నెలలో 15 కిడ్నీల మార్పిడి దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసి నిమ్స్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా యురాలజీ, నెఫ్రాలజీ, అనస్తీషియా విభాగాలను మంత్రి హరీశ్‌రావు ఇటీవలే అభినందించారు. 2014 నుంచి ఇప్పటివరకు కిడ్నీ మార్పిళ్లు 839 (నిమ్స్), 700 (ఉస్మానియా) కాలేయ మార్పిళ్లు 25 (నిమ్స్), 26 (ఉస్మానియా) జరిగాయి. నిమ్స్‌లో గుండె (10), ఊపిరితిత్తుల మార్పిడి (01) శస్త్రచికిత్సలు జరిగాయి. దక్షిణాదిలోకెల్లా రికార్డు.. స్కోలియోసిస్ (గూని)తో ఇబ్బంది పడేవారికి చేసే వెన్నుపూస సర్జరీ చాలా క్లిష్టమైనది. సుమారు 12–14 గంటలు పడుతుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ రోగి రెండు కాళ్లు చచ్చుబడే ప్రమాదముంటుంది. నిమ్స్‌లో మూడేళ్లుగా 200 మందికి ఈ సర్జరీలు చేశారు. గత ఏడాదిలో ఏకంగా 80 సర్జరీలు నిర్వహించి దక్షిణాదిలో రికార్డు సొంతం చేసుకుందని ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగేష్ తెలిపారు. నిజాం కాలంలో బొక్కల దవాఖానా (ఆర్థోపెడిక్)గా ప్రారంభమైన నిమ్స్ నేడు వేర్వేరు సర్జరీలకు వేదికైందన్నారు. ఏడాదికి హిప్, నీ రీ ప్లేస్మెంట్లు 350, వెన్నెముక 80, ట్రామా 3వేలు, ఆంకాలజీ 60 చొప్పున సర్జరీలు నిర్వహిస్తూ తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటోందని నాగేశ్ తెలిపారు. 18 గంటలపాటు శ్రమించి.. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య (61) పోస్టల్ శాఖలో రికరింగ్ డిపాజిట్ ఏజెంట్. ఏడాది క్రితం కాళ్లు, చేతులు వాచిపోవడంతో కుటుంబసభ్యులు కర్నూలులోని ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. సత్యమయ్యకు హెపటైటీస్ బి, లివర్ సిర్రోసిస్, కాలేయ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించి కాలేయ మార్పిడి చేయాలన్నారు. వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్‌డెడ్ అవడంతో అవయవదానానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో నిమ్స్, ఉస్మానియా వైద్యులు సంయుక్తంగా 18 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. గాందీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ గాందీలో రూ.35 కోట్లతో స్టేట్‌ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. 4 ఆత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, స్టెప్‌డౌన్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు లు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఒకేచోట గుండె, మూత్రపిండాలు, తుంటి, కీళ్ల మార్పిడి, ఊపిరితిత్తులు, కాలేయం శస్త్రచికిత్సలు, కాక్లియర్ వంటి కృత్రిమ అవయవాల ఏర్పాటుతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. రెండోదశలో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం. –ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
AP: రైతన్నకు కంటి వెలుగును ప్రసాదించిన ఆరోగ్యశ్రీ.. తొలిసారి కంటి మార్పిడి
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నేత్ర విభాగంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఓ రైతన్నకు కంటి మార్పిడి (కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేసి చూపును ప్రసాదించారు. నెల్లూరు జీజీహెచ్‌లో తొలిసారి కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన సందర్భంగా ఆ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ శనివారం తెలియజేశారు. తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామానికి చెందిన రామయ్య (60) అనే రైతుకు 20 ఏళ్ల క్రితం కంటికి దెబ్బతగిలి నల్లగుడ్డు మీద పువ్వు ఏర్పడింది. దీంతో కంటి చూపు పూర్తిగా తగ్గి రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రామయ్య ఈ నెల 3న నెల్లూరు జీజీహెచ్‌కి రాగా, కంటి విభాగాధిపతి డాక్టర్ సంధ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి కంటి గుడ్డు మార్పిడి ద్వారా చూపును ప్రసాదించవచ్చని చెప్పారు. ఈ నెల 9న రాజయ్య కంటికి ఆపరేషన్ చేసి దాత నుంచి సేకరించిన నల్లగుడ్డును విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్‌ను విజయవంతంగా చేసిన డాక్టర్ సంధ్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. రోగి రామయ్య మాట్లాడుతూ తనకు చూపును ప్రసాదించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇకపై ఎయిమ్స్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలందనున్నాయి. ఈ మేరకు గురువారం మంగళగిరిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఎయిమ్స్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే సీఎం జగన్ ఆలోచనల మేరకు ఎయిమ్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 100 మందికి పైగా రోగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామన్నారు. 30 మందికి పైగా రోగులకు చికిత్సలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ట్రయల్ రన్ పూర్తవ్వడంతో అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలందేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యం అతి త్వరలో ఎయిమ్స్‌లో పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి రానుందని మంత్రి విడదల రజిని చెప్పారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ అవశేషాలున్నా సరే.. ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించాలనే సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌కు ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే జూన్ కల్లా పైపులైను పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎయిమ్స్ నుంచి రోగులను మంగళగిరికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి, ఎయిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ వంశీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్‌కుమార్, కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?) -
YSR Aarogyasri: ఇతర రాష్ట్రాల క్షతగాత్రులకూ చికిత్స.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురైన ఇతర రాష్ట్రాల వ్యక్తులకూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందనుంది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 8,000 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు, మరణాలను 15 శాతం తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురవుతోన్న ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్లు, రోజువారీ కూలీలు, ప్రయాణికులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలు అందించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యే ఇతర రాష్ట్రాల వ్యక్తులకు సీఎంసీవో కార్డును జారీ చేయడం ద్వారా నగదు రహిత చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందించనుంది. ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టాలని ఆరోగ్యశ్రీ సీఈవో, రవాణా శాఖ కమిషనర్లను ఆదేశించారు. -
అవీ సర్కారు ఆసుపత్రులు.. ఆరోగ్యశ్రీ లేకుంటే.. వైద్యమూ అందట్లే!
ఆమె పేరు శ్వేత (పేరు మార్చాం)... పది రోజుల క్రితం ప్రసవం కోసం నిలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు మగ బిడ్డ పుట్టాడు. డిశ్చార్జి సమయంలో మగబిడ్డ పుట్టినందున రూ.3 వేలు చెల్లించాలని అక్కడి సిబ్బంది ఒత్తిడి చేశారు. వైద్యాధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో రూ. 3 వేలు, ఇతరత్రా రూ.500 చెల్లించి బయటికొచ్చారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగికి ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే గుండె వైద్యం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌పేషంట్లుగా చేరే రోగులకూ చాలాచోట్ల సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. రెండు మూడు రోజులు ఇన్‌పేషంట్‌గా ఉంటే సొమ్ములు ఇవ్వాల్సిందే. లేకుంటే వారికి వైద్యసేవలు గగనమే. ఇలాంటి వాటిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధమేంటని.. ఎవరికైనా ఉచిత వైద్యం చేయాల్సిందే కదాని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉచిత వైద్యం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. కోట్లలో వసూలు... సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవానికి, ఇతర చికిత్సలకు ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్న పరిస్థితులున్నాయి. విచిత్రమేంటంటే కొన్ని చోట్ల కేసీఆర్ కిట్టు ఇచ్చినందుకూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి దందాల్లో కొందరు డాక్టర్లు సూత్రధారులుగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వసూలు చేసిన సొమ్మును డాక్టర్‌కు లేదా ఏజెన్సీ నిర్వాహకుడికి ఇచ్చి అంతా పంచుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో జరిగే కాసుల దందాతో ఏడాదికి రూ.కోట్లు వసూలు అవుతున్నాయి. నిలోఫర్‌లో ఏడాదికి రూ. 2 కోట్లు, గాం«దీలో రూ.కోటిన్నర, ఉస్మానియాలో రూ. కోటి వరకు వసూలు అవుతున్నట్లు అంచనా. జిల్లా ల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనూ జోరుగా వసూళ్లపర్వం సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 6 లక్షల కాన్పులు జరుగుతుండగా, వీటిలో 4 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. డబ్బులు వస్తేనే చేయగలం! యాంజియోగ్రాం చేసేటప్పుడు అవసరమైతే స్టెంట్లు వేయాలని, వాటికి ఖర్చవుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ అడుగుతున్నామని వైద్యులంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అయితే స్టెంట్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలోనూ ఇదే పద్ధతి నడుస్తోంది. కాగా, ‘గాంధీ’లోని ఒక గైనకాలజీ వైద్యురాలు ఆపరేషన్‌కు రూ.10 వేలు డిమాండ్ చేశారని ఒక బాధితురాలు ఇటీవల లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలోనూ వసూలు దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రసవానికి వచి్చన మహిళ నుంచి ఆడబిడ్డ పుడితే రూ. 2 వేలు, మగబిడ్డ పుడితే రూ.3 వేలు ఇవ్వాలన్న షరతు పెట్టారు. ఈ దందా వెనుక ఒక ప్రముఖ వైద్యుడు కీలకంగా ఉండటం గమనార్హం. కాసుల కక్కుర్తిలో మచ్చుకు కొన్ని... ► గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగంలో ఆడబిడ్డ పుడితే రూ. వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 1,500 వసూలు చేస్తున్నారు. ► పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రితోపాటు బేలాలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన వారి నుంచి అబ్బాయి పుడితే రూ.2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. ► హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే రూ.వెయ్యి, మగబిడ్డ పుడితే రూ. 2 వేలు డిమాండ్ చేస్తున్నారు. ► నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడ బిడ్డ పుడితే రూ.వెయ్యి, మగ బిడ్డ పుడితే రూ.1,500 వసూలు చేస్తున్నారు. డెలివరీ తరువాత ఆయాలకు రూ. 500 ఇవ్వాల్సి వస్తోంది. ► జనగామ జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆడబిడ్డ పుడితే రూ.500, మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి గుంజుతున్నారు. ► ఎంజీఎం ఆస్పత్రికి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ప్రభుత్వం మందులు సరఫరా చేస్తున్నా, అందుబాటులో లేని ఔషధాల కొనుగోలుకు బడ్జెట్ కేటాయించినప్పటికీ రోగులు ప్రైవేట్ దుకాణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఐదు రకాల మందులు రాస్తే కనీసం రెండు రకాల ఔషధాలు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిందే. నాకు ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ జన్మించాడు. గురువారం డిశ్చార్జి చేసేటప్పుడు అక్కడి సిబ్బంది రూ.వెయ్యి వసూలు చేశారు. అలాగే కేసీఆర్ కిట్టుకూ వంద రూపాయలు తీసుకున్నారు. - ఝాన్సీ, హైదరాబాద్ -
ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొదటి ఏఎన్ఎం ఖాళీ పోస్టుల భర్తీకి నెలారెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రెండో ఏఎన్ఎం మహాసభల్లో మంత్రి మాట్లాడారు. అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, రాబోయే రోజుల్లో కీమో, రెడియో థెరపీ కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్ఎంలది కీలక పాత్ర అని కొనియాడారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లు చాలా మందికి తెలియదని, అలాంటివారిని గుర్తించి ముందుగా చికిత్స అందిస్తే దీర్ఘకాలిక రోగాలు రావని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, ఫలితంగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖానాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరగగా, ఇప్పుడు అవి 67 శాతానికి పెరిగాయని మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ మూడోస్థానం దక్కించుకుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు చివరి స్థానంలో ఉందని, డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజినే తప్ప దాని వల్ల పేదలకు ఎలాంటి లాభం లేదని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం అవుతుందని తెలిపారు. జనవరి వరకు అన్ని జిల్లాల్లో టి–డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏఎన్ఎం పరిధిలో వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటట్టు చూడాలన్నారు. మొదటి ఏఎన్ఎం పోస్టుల ఖాళీల భర్తీలో కరోనా తర్వాత వెయిటేజీ ఇస్తున్నామని, ఏడాదికి 2 మార్కుల చొప్పున కలుపుతున్నామని చెప్పారు. టీవీవీపీలో 228 ఉద్యోగాలు ఇస్తే, 200 పోస్టులు ఏఎన్‌ఎంలకే వచ్చాయన్నారు. పూర్తిస్థాయిలో వయో పరిమితి సడలింపు ఇచ్చామని హరీశ్ తెలిపారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
ఆంధ్రజ్యోతి కథనం అవాస్తవం
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులు సరిగా జరగడంలేదంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనం అవాస్తవమని ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు క్లెయిమ్స్ చెల్లించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరానికి విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధుల్ని నెట్వర్క్ ఆస్పత్రులకు వినియోగించారనేది సత్యదూరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు నేషనల్ హెల్త్ ఏజెన్సీ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,790 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఈహెచ్ఎస్కు సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.199.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈహెచ్ఎస్ కింద ఈ ఏడాది ఇప్పటివరకు 3,25,390 మంది చికిత్స పొందారని వివరించారు. చదవండి: (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్) -
TS: ఆరోగ్యశ్రీ సేవలు పెంచండి..
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్: నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్, ఇతర ప్రభుత్వాస్పత్రులకు ప్రజలెంతో నమ్మకంతో వస్తున్నారని, అందుకనుగుణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ ఓపీ, ఐపీ సేవలు, అవయవ మార్పిడి సర్జరీలు పెంచాలని ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బుధవారం వైద్యశాఖపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. నిమ్స్‌లో 200 పడకలతో ఎంసీహెచ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంఎన్‌జే ఆసుపత్రిలో కొత్తగా నిర్మిస్తున్న భవనం అందుబాటులోకి వస్తే పడకల సంఖ్య 450 నుంచి 750కి పెరుగుతుందన్నారు. నిమ్స్ అధికారులకు మంత్రి క్లాస్ నిమ్స్ ఆస్పత్రి నిర్వహణలో అధికారులు అవలంభిస్తున్న వైఖరిపై హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజలు ఇక్కడి వైద్యంపై ఎన్నో ఆశలతో వస్తున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ముచేసేలా అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. నిమ్స్ డైరెక్టర్ ఎక్కువ సమయం ఆస్పత్రిలో ఉండాలని, మెడికల్ సూపరింటెండెంట్ రోజూ ఎమర్జెన్సీ వార్డును సందర్శించి, పడకల నిర్వహణ సరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ధర పెంపుతో పాల సేకరణ పెరిగింది పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖల పురోగతిపై ఆ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మరో మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్, ఆర్ధికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్, పశుసంవర్ధకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధర్‌సిన్హా, డైరెక్టర్ రాంచందర్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, మంజువాణి పాల్గొన్న ఈ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ విజయ డెయిరీ సేకరిస్తున్న పాల ధరను ఇటీవల పెంచడంతో, అదనంగా మరో 30 వేల లీటర్ల పాల సేకరణ పెరిగిందన్నారు. 5 లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో మెగా డెయిరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. -
ఆరోగ్యశ్రీకి అదనపు బలం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు సన్నద్ధమైంది. జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల నిర్వహణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కీలకం కానున్నాయి. ఈమేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన ఉన్నత సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం సమీక్షలోముఖ్యాంశాలు ఇవీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో 754 ప్రొసీజర్లను పథకంలో చేరుస్తున్నాం. కొత్తగా చేర్చే వాటితో కలిపి మొత్తం 3,118 ప్రొసీజర్లకు పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. సెప్టెంబరు 5వతేదీ నుంచి కొత్త ప్రొసీజర్లను అందుబాటులోకి తేవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య కళాశాల కేంద్రంగా.. గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోకి తేవాలి. వైద్య, పరిపాలన కార్యకలాపాలన్నీ వైద్య కళాశాల నుంచే నిర్వహించాలి. పకడ్బందీగా వైద్య సేవలు అందించడంతోపాటు అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయానికే ఈ చర్యలన్నీ. దీనికి సంబంధించి ఎవరెవరు ఏం చేయాలి? విధులు, బాధ్యతలు ఏమిటి? అనే అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించాలి. అన్ని జిల్లాల వైద్య కళాశాలల్లో మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయాలి. వైద్య కళాశాల నేతృత్వంలోనే హబ్స్ పని చేయాలి. హబ్స్ నుంచి కింది స్థాయి ఆస్పత్రుల్లో చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలి. 6,956 టెలీ మెడిసిన్ స్పోక్స్, 27 హబ్స్ ఏర్పాటు కావాలి. ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్), ఒక ఏఎన్ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారు. ఈ లెక్కన ప్రతి విలేజ్ క్లినిక్‌లో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది సమకూరుతారు. విలేజ్ క్లినిక్‌లో 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఎంఎల్‌హెచ్‌పీలను ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పిలవాలి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్ టీకా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ నియంత్రణ చర్యల్లో అలసత్వం వహించొద్దు. ప్రికాషన్ డోసు టీకా పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రెండు డోసులూ టీకా తీసుకుని అర్హులైన 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ టీకాలు ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్.. 3 అంశాలపై ఫోకస్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల భవనాలు, మానవ వనరులు, తగినన్ని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ అందుబాటులోకి తేవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పనులు ఎలా ముందుకు సాగుతున్నాయో రోజూ సమీక్షించాలి. మరో 432 ఎంఎంయూలు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కొత్త విధానాన్ని సంక్రాంతి వరకు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు చెప్పారు. మరోవైపు పీహెచ్‌సీలతో 104 మొబైల్ మెడికల్ యూనిట్ల మ్యాపింగ్ పూర్తైందని వెల్లడించారు. పీహెచ్‌సీలు, సచివాలయాల మ్యాపింగ్ కూడా పూర్తి చేస్తామన్నారు. 104 ఎంఎంయూలు ఇప్పటికే 656 పని చేస్తున్నాయని, మరో 432 వాహనాలను సమకూరుస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్, ప్రత్యేక కార్యదర్శి జి.ఎస్.నవీన్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
అపోలో, బసవతారకంలో ఉచిత వైద్యం అందించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అపోలో, బసవతారకం కేన్సర్ ఆస్పత్రులు.. ఉచిత ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది. దీనిపై డీఎంహెచ్ఓ పర్యవేక్షణ ఉంటుందని వివరించింది. ఈ మేరకు తాజా జీవో ప్రతిని మంగళవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర సర్కార్ నుంచి తక్కువ ధరలకు భూమి తీసుకున్న టైంలో.. జరిగిన ఎంవోయూల మేరకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని, కనీసం కరోనా కష్టకాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓమిమ్ మానెక్షా డెబారా, తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ‘ఎంఓయూల ప్రకారం రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. జరిమానా విధింపు అవకాశం కూడా ఉంది. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్ పేదలకు ఉచిత కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యింది. ఇక బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు, రోజూ 40% ఔట్పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యింది. ఇవి అమలు చేసే విధానాన్ని వివరిస్తూ ఈ నెల 16న రాష్ట్ర సర్కార్ మరో జీవో 80 జారీ చేసింది’అని ఏజీ వివరించారు. అనంతరం విచారణను ఆగస్టు 8న వాయిదా వేసింది. జీవో 80లోని ముఖ్యాంశాలు ♦ అపోలో, నందమూరి బసవతారకం మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రులు వరుసగా 15%, 25% పడకలను పేదల కోసం కేటాయించాలి. ♦ ఇది దాతృత్వం కాదు.. ఇది వారి కర్తవ్యం. ♦ ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూములను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం తక్కువ ధరకు ఇచ్చింది. ♦ ప్రధాన మంత్రి జీవన్ ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి. ♦ బసవతారకం ఆస్పత్రి 40% పేదలకు తప్పకుండా ఓపీ సేవలు ఉచితంగా అందించాలి. ♦ ఇవన్నీ సరిగా అమలవుతున్నాయా.. లేదా.. అన్నది డీఎంహెచ్ఓ అప్పుడప్పుడు పరిశీలించి ధ్రువీకరించాలి. ♦ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రత కార్డుదారులు ఉచిత ఓపీకి అర్హులు. ఇదీ చదవండి: ఇక అరచేతిలో ఆర్టీసీ బస్సు -
ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకి పోవచ్చుగా..
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలకు కేరాఫ్‌గా పేర్కొనే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో నిరుపేదలకు ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకు పోవచ్చుగా.. అక్కడ కాకపోతే ఇక్కడికి రావాలి కానీ.. అందరూ నిమ్స్‌కు వచ్చేస్తే ఎలా అంటూ ఓ ఉన్నతాధికారి అగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు వెనువెంటనే వైద్యం అందించాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నిమ్స్‌కు వచ్చిన ప్రతి రోగికీ మెరుగైన వైద్యసేవలను అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను మరింతగా ఆధునికీకరించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు సైతం ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు. ఆచరణలో నిమ్స్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పేద రోగులకు సరైన వైద్య సేవలు అందించకపోగా వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం బాధాకరంగా మారుతోందంటూ పేదరోగులు వాపోతున్నారు. గరీబోళ్లం సారూ.. డబ్బులు లేవంటే ఉన్నకాడికి కట్టించుకొని మిగతావి సీఎంఆర్ఎఫ్ నుంచి ఎన్వోసీ తెచ్చుకోమంటూ ఉచిత సలహాపడేస్తున్నారు. రేపు డిశ్చార్జి చేస్తాం.. పోయి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోవాలంటూ ఆయా రోగులపై ఒత్తిడి తేవడంతో జిల్లాలకు వెళ్లి ఎమ్మెల్యే ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్వోసీ లెటర్ తెచ్చుకోవాల్సి వస్తోంది. తీరా అప్పటికే నాలుగైదు రోజులు గడిచిపోతుండటంతో ఆ బిల్లు చెల్లించేదాకా డిశ్చార్జీ చేయడం లేదు. సారూ.. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే పది రోజులు ఆగి రమ్మంటున్నారు. పది రోజుల తర్వాత వస్తే టెస్టులన్నీ చేసి బెడ్లు లేవు వారం రోజులు ఆగాలంటున్నారు. డబ్బులు చెల్లిస్తే మాత్రం వెంటనే బెడ్ ఇచ్చి అడ్మిట్ చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా.. డబ్బులు కట్టించుకున్నారు.. ఆదిలాబాద్ జిల్లాకి చెందిన కళావతి(54) కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రతరం కావడంతో ఈ నెల 4వ తేదీన మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ను ఆశ్రయించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా రూ. 5 వేలు కట్టించుకొని మరీ అడ్మిషన్ చేయించుకున్నారు. చికిత్సలో భాగంగా ఇన్ఫెక్షన్ కారణంగా కాలేయంలో సగభాగాన్ని తొలగించారు. అందుకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు, చివరకు బ్యాండేజ్ సైతం బయట నుంచి తెచ్చుకోమన్నారు. అందుకు ఆమెకు రూ. 25 వేల వరకు ఖర్చయ్యింది. తీరా డిశ్చార్జి చేస్తాం.. సీఎంఆర్ఎఫ్ తెచ్చుకోమన్నారు. ప్రభుత్వం నుంచి రూ. 1.50 లక్షలు సహాయం అందింది. బుధవారం డిశ్చార్జి సమ్మరీని ఇచ్చిన అధికారులు ఇంకా రూ. 13 వేలు కట్టమన్నారు. అంతంతమాత్రంగా ఉన్న తమ ఆర్థిక పరిస్థితితో ఆ మొత్తాన్ని కూడా కట్టలేని పరిస్థితి. ఆ రోజంతా అధికారుల చుట్టూ ఎంత తిరిగి ప్రయోజనం లేకుండా పోయింది. ఆస్పత్రి మెడికల్ సూపరిండెంటెంట్ను కలిసి డబ్బులు లేవంటూ వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని కళావతి తనయుడు నరేష్ వాపోయారు. పైగా ఇక్కడికి ఎందుకొచ్చారు. గాంధీకో.. ఉస్మానియాకో వెళ్లాల్సింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సారూ.. అంటే ప్రభుత్వం ఎప్పుడో డబ్బులు ఇస్తుంది.. అప్పటివరకు ఆస్పత్రి ఎలా నడవాలి అంటూ ప్రశ్నించారన్నారు. మా దగ్గర ఊరికి పోయేందుకు డబ్బులు లేవు సార్.. వేరే వాళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్నాం.. అంటూ వేడుకున్నా నా పరిధిలో లేదు ఓ రెండు వేలు తగ్గిస్తా.. పొద్దున్నే మూడ్ ఆఫ్ చేయొద్దు.. వెళ్లిపోండి అంటూ ఆయన చిర్రుబుర్రులాడటంతో.. చివరికి మిత్రుల సహాయంతో ఆస్పత్రి నుంచి బయటపడ్డామని నరేష్ తెలిపారు. (క్లిక్: మంకీపాక్స్‌పై ఆందోళన వద్దు.. నిర్లక్యం చేయొద్దు!) -
పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ
వికారాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్‌సీలు) ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రజారోగ్య శాఖ డైరెక్ట ర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 53 రకాల సేవ లు అందించేలా ఏర్పాట్లు చేస్తోందన్నారు. శుక్రవా రం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా ధారూరు, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. తర్వాత మద్గు ల్ చిట్టెంపల్లి డీపీఆర్సీ భవనంలో వైద్యులు, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ అధికారులతో సమావేశమై ఆస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ చేరే ప్రతి రోగి తరఫున పీహెచ్‌సీకి ప్రభుత్వం రూ.2,100 చెల్లిస్తుం దన్నారు. ఇందులో 35 శాతం డబ్బును పీహెచ్సీలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తుందని, మిగిలిన 65 శాతం నిధులను ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పీహెచ్‌సీలు నిధుల కొరతను అధిగమించి బలోపేతం అవుతాయన్నారు. వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్: క్షేత్రస్థాయి లో పీహెచ్‌సీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీనివాసరావు చెప్పారు. 750 ఎం బీబీఎస్ వైద్యుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుందని తెలిపారు. పీహెచ్‌సీల్లో చేసే ప్రతి సాధారణ కాన్పుకు ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తుందని, ఈ మొత్తం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తుందన్నారు. దీంతో వైద్యుల్లో ఉత్సాహం పెరిగి నాణ్యమైన సేవలు అం దుతాయన్నారు. వైద్యులు స్థానికంగా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. స్థానికంగా ఉంటున్నారా..? లేదా నగరానికి వెళ్లి వస్తున్నారా..? అనే వివరాలు తెలుసుకునేందుకు వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్ అమరుస్తామని చెప్పారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్యులు, సిబ్బంది పని తీరును పర్యవేక్షించేలా ప్రతి పీహెచ్సీలో 3 సీసీ కెమెరాలు అమరుస్తామని తెలిపారు. ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మెడికల్ ఆఫీసర్లకు వెహికల్ అలవెన్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ బాగా తగ్గిందని శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 40 లోపు కేసులే నమోదవుతున్నాయని చెప్పారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఎనిమిది శాతం పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో సంబంధిత వైద్యులను, అధికారులను ఆయన అభినందించారు. ఈ సేవలను మరింత పెంచాలని పిలుపునిచ్చారు. సర్జరీలు పెరగాలని, అన్ని వైద్య పరికరాలు పూర్తిస్థాయి వినియోగంలో ఉండాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని వైద్యాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై మంత్రి నెలవారీ సమీక్ష గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈవో రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆరోగ్యశ్రీ అధికారులు, జిల్లా కో–ఆర్డినేటర్లు, టీమ్ లీడర్లు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, 2019–20లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరోగ్యశ్రీ సేవలు 35 శాతం ఉంటే, 2021–22లో అవి 43 శాతానికి పెరిగాయన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేయాలని, అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని సూచించారు. 26 సీఆర్మ్ మెషీన్లు పంపిణీ చేశామని, చిన్న చిన్న పరికరాలు అవసరం ఉంటే కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్థో సర్జరీలు పెరగాలని, మోకాలు ఆపరేషన్లు అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో చేయాలని, అందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల సహకారం తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అదే రీతిలో మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించాలని చెప్పారు. -
వైద్య సేవల్లో లోపాలుంటే 104కు చెప్పండి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి సమయంలో ఆపద్బాంధవిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన 104 కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎదురయ్యే సమస్యలపై ఈ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసే వీలును కల్పించబోతోంది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రచిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిరుపేద, మధ్యతరగతి రోగులు చికిత్స అనంతరం సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలనే సంకల్పంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నారు. ఈ కార్యక్రమానికి రూ.16వేల కోట్లకు పైగా భారీ నిధులను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బంది కొరతకు తావులేకుండా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్య శాఖలో 39వేల పోస్టుల భర్తీ చేపట్టింది. అవసరమైన మౌలిక వసతులనూ సమకూరుస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ ఇటీవల పలు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు ఇబ్బందులకు గురైన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో రోగులకు ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో 104 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కరోనా రోజుల్లో 12లక్షల మందికి సేవలు కరోనా కష్టకాలంలో 104 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్‌కు సంబంధించిన సమాచారం, వైద్య పరీక్షలు, ఇతర సేవలన్నింటినీ ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రజలకు అందించారు. 12 లక్షల మందికి పైగా ప్రజలు కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి కరోనా మూడు దశల్లో సేవలు పొందారు. ఫోన్‌చేస్తే కరోనా నిర్ధారణ పరీక్షలకు టోకెన్ రైజ్ చేయడం మొదలు, పాజిటివ్ అయితే ఆసుపత్రికి తరలించే అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం, ఆసుపత్రిలో బెడ్‌ను సమకూర్చడం ఇలా అనేక రకాల సేవలు కాల్ సెంటర్ ద్వారా అందాయి. వారం రోజుల్లో బలోపేతం ప్రభుత్వాస్పత్రుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా 104 కాల్ సెంటర్‌ను వారం రోజుల్లో బలోపేతం చేస్తాం. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం.. సెక్యూరిటీ, శానిటేషన్, మహాప్రస్థానం, అంబులెన్స్ సహా ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురైతే రోగులు ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తాం. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతాం. రోగులు ఏ చిన్న ఇబ్బందికీ గురికాకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటాం. – ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి -
గుండెఘోషకు ‘సూపర్’ వైద్యం
సాక్షి, అమరావతి: ముద్దులొలికే చిన్నారులు. ఆటపాటలతో బోసినవ్వులు చిందించే వయసు. కానీ, ఆ పసి గుండెల్లో పేరుకున్న విషాదంతో నిత్యం కన్నవారికి కన్నీరే.. ఆందోళనే. పైపెచ్చు పేదరికంతో ఎటూ పాలుపోని నిస్సహాయత. అయితే అమ్మవారి పాదాల సాక్షిగా తిరుపతిలో ప్రారంభమైన పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి వీరికి నిజమైన పండగ తీసుకొచ్చింది. ఆరంభమైన 4 నెలల్లో ఏకంగా 128 మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసి.. ఆ కుటుంబాలకు జీవితానికి సరిపడేంత సంతోషాన్నిచ్చింది. ఏపీలోనే మొట్టమొదటిది.. నిజానికి రాష్ట్రంలో గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడే పిల్లలకంటూ ప్రత్యేకించి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి వంటిదేమీ లేదు. ఇతర ఆసుపత్రుల్లోనే పిల్లలకూ కార్డియాక్ సేవలందిస్తున్నారు. దీంతో ఈ అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి... తిరుపతిని దీనికి వేదికగా చేసుకున్నారు. ఫలితంగా 70 పడకలతో తాత్కాలికంగా శ్రీ పద్మావతి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి ఏర్పాటు కావటం... గతేడాది ఆక్టోబరు 11న ముఖ్యమంత్రి ప్రారంభించటం సాధ్యమయ్యాయి. నిరుపేదలకు ఖరీదైన, సమర్థమైన వైద్యాన్ని అందించటమే లక్ష్యంగా ముందుకెళుతున్న సర్కారు సాయంతో ఈ 4 నెలల్లో ఆరోగ్య శ్రీ ద్వారా 128 మంది పిల్లలకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు చేయగలిగారు. తాత్కాలికంగా తిరుపతిలోని ‘బర్డ్’ ఆస్పత్రి పాత బ్లాక్‌లో పనిచేస్తున్న ఈ ఆస్పత్రికి టీటీడీ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తోంది. అత్యాధునిక పరికరాలతో పాటు 40 ఐసీయూ పడకలు... మూడు లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వ్యాధిగ్రస్త చిన్నారులు, వారి తల్లిదండ్రులు వేచి ఉండే ప్రాంతంతో పాటు ఔట్ పేషెంట్ బ్లాక్‌లో ఐదు కన్సల్టేషన్ సూట్లు ఏర్పాటు చేశారు. ఇంకా పది మంది రెగ్యులర్ స్పెషలిస్ట్‌లతో పాటు.. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి విజిటింగ్ నిపుణులు ప్రతివారం ఇక్కడకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఏటా 10 వేల మంది చిన్నారులకు... రాష్ట్రంలో ఏటా సుమారు 10 వేల మంది వరకూ చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో పుట్టడమో, పుట్టిన కొద్ది నెలల్లోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవటమో జరుగుతోంది. వీరిలో మూడొంతుల మంది పిల్లలది క్లిష్ట పరిస్థితి. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకమే. మరోవైపు.. రాష్ట్ర విభజన తర్వాత పిల్లల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఏపీలో ప్రత్యేకంగా ఆస్పత్రి అనేదే లేకుండా పోయింది. దీంతో ఈ తరహా చిన్నారులకు సరైన చికిత్స అందించాలన్న సీఎం ఆలోచనల్లోంచి పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి పుట్టుకొచ్చింది. 350 పడకలతో మరో ‘సూపర్ స్పెషాలిటీ’ తాత్కాలిక ఆసుపత్రి అందిస్తున్న సేవలు మరింత విస్తృతపరచాల్సి ఉన్న తరుణంలో... టీటీడీ 350 పడకలతో మరో సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. దీన్లో గుండె సంబంధిత చికిత్సలు మాత్రమే కాకుండా సబ్ స్పెషాలిటీలకు సంబంధించి పది ఇతర విభాగాలు ప్రారంభిస్తున్నారు. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఆసుపత్రిలో న్యూరో, జెనిటికల్ ఛాలెంజ్డ్, తలసేమియా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, ఆంకాలజీ, డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ మొదలైన 14 స్పెషాలిటీ సేవలందించేలా ప్రణాళిక రూపొందించారు. -
Andhra Pradesh: 3 క్యాన్సర్ ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించేలా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కనీసం మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. దీనివల్ల చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిస్థాయిలో చికిత్సలు, ఇతర సేవలు అందాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాల్టీ సేవలు అందుతాయని ఇవికాకుండా క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు. వీటితో పాటు గతంలోనే ప్రకటించిన విధంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ.. మరిన్ని సేవలకు గ్రీన్ సిగ్నల్ ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని సేవలందించేందుకు వీలుగా విశాఖ కేజీహెచ్‌లో కొత్త ఎంఆర్ఐ, కాకినాడ జీజీహెచ్‌లో ఎంఆర్ఐ, క్యాథ్‌ల్యాబ్, కర్నూలులో క్యాథ్‌ల్యాబ్, పాడేరు, అరకు ఆస్పత్రుల్లో అనïస్థీషియా, ఆప్తాలమిక్, ఈఎన్టీ సేవలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం దాదాపు రూ.37.03 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఆరోగ్యశ్రీ యాప్.. పటిష్టంగా ఆరోగ్యమిత్ర ఆరోగ్యశ్రీ సేవలు సమర్థంగా అందించేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో సందేహాల నివృత్తి ఏర్పాట్లు కూడా ఉండాలని స్పష్టం చేశారు. యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆరోగ్య మిత్రలకు సెల్ఫోన్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేసి రోగులకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఆరోగ్య సేవలపై సచివాలయాల్లో హోర్డింగ్స్ ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఆస్పత్రులపై అందరికీ అవగాహన కల్పించేలా గ్రామ సచివాలయాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు పొందాలంటే ఎక్కడకు వెళ్లాలో సూచిస్తూ సమాచారం ఉండాలని, ఇందుకు విలేజ్ క్లినిక్ రిఫరల్ పాయింట్ కావాలని స్పష్టం చేశారు. విలేజ్ క్లినిక్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంలు ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఆస్పత్రికి వెళ్లాలి? ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ లభిస్తాయన్నది రోగులకు స్పష్టంగా తెలియాలని, దీనిపై సరైన మార్గదర్శనం చేయాలన్నారు. 108లో కూడా ఇలాంటి సమాచారం ఉండాలని, ఈ మేరకు 104ను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీలో రిఫరల్ అన్నది చాలా కీలకమైన అంశమని, ఇది పథకాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అధికారులు దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. మంచి కండిషన్లో 108, 104 వాహనాలు.. 108, 104 వాహనాలు అత్యంత సమర్థంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. రోగులకు వేగంగా సేవలు అందించడంలో వాహనాలే కీలకమని, జిల్లాను యూనిట్‌గా తీసుకుని వాహనాలు మంచి కండిషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదనంగా బఫర్ వెహికల్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఆరోగ్య ఆసరా ద్వారా రోగులకు డిశ్చార్జి అయిన రోజు నుంచే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అందించాలని పునరుద్ఘాటించారు. ఫొటోలతో స్పష్టంగా వ్యత్యాసం విలేజ్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు–నేడు పనుల ప్రగతిని ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. నాడు – నేడు ద్వారా చేపడుతున్న ఏ కార్యక్రమమైనా సరే గతానికీ, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించాలన్నారు. గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో తెలియజేసేలా ఫొటోలు ఉండాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరగాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే సేవల పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగేలా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇందులో సిబ్బంది పాత్ర కీలకమని, ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలను వారికి వివరించాలన్నారు. వారి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలని అధికారులకు నిర్దేశం చేశారు. విలేజ్ క్లినిక్స్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఎప్పటికప్పుడు గాలి, నీరు, పరిసరాల పరిస్థితులపై నివేదికలు సిద్ధం చేసి వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, జేసీలను భాగస్వాములుగా చేయాలని సూచించారు. రక్తహీనత నివారణలో రాష్ట్రమే ఫస్ట్ రక్త హీనత నివారణకు ఆరు రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలియచేశారు. రక్త హీనత నివారణ చర్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలిచినట్లు వెల్లడించారు. దేశవ్యాప్త సగటు 40.5 శాతం కాగా 75.3 పాయింట్లతో ఇండెక్స్‌లో ఏపీ ప్రథమస్థానంలో ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు 58 పాయింట్లు వచ్చినట్లు వివరించారు. అంగన్వాడీలు, విలేజ్‌క్లినిక్స్ ద్వారా రక్తహీనత నివారణ కార్యక్రమాలు చురుగ్గా సాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీ వార్మింగ్‌కు వినియోగించే మందులు కచ్చితంగా జీఎంపీ ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. జనవరిలోగా డబుల్ డోసులు పూర్తవ్వాలి.. కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని నిర్దేశిత వయసు వారందరికీ జనవరిలోగా డబుల్ డోసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం జగన్ సూచించారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడమే కోవిడ్ నివారణకు ఉన్న పరిష్కారమని స్పష్టం చేశారు. హాజరైన మంత్రి, ఉన్నతాధికారులు.. సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ (వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ మేనేజ్మెంట్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఎ.బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్ నవీన్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్‌చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ మాటే వినిపించకూడదు.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందని అధికారులు వివరించారు. ప్రతి ఆస్పత్రిలో పడకలు, వైద్యులు సహా సిబ్బంది సంఖ్యపై బోర్డులు ప్రదర్శించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సిబ్బంది లేకపోవడం వల్ల సేవలు అందలేదన్న మాటే వినిపించకూడదన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు తగినంత మంది సిబ్బంది ఉండాలని, ఇవి రెండు అత్యంత ముఖ్యమైన అంశాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వారంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ► ఒమిక్రాన్ వేరియంట్ హెచ్చరికలతో ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఆంక్షలు ► మరో వారం రోజుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు ► ప్రస్తుతం కొనసాగుతున్న 32వ దఫా ఫీవర్ సర్వే ► రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ యాక్టివ్ కేసులు 1,912 ► రికవరీ రేటు 99.21 శాతం ► రోజూ పాజిటివిటీ రేటు 0.52 శాతం ► 104 కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్ 718 ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో 109 ప్రాంత్లాలో 144 ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ల ఏర్పాటు. ఇప్పటివరకు 121 ప్లాంట్ల పూర్తి. ఈ నెలాఖరు నాటికి అన్నిచోట్లా ప్లాంట్లు అందుబాటులోకి. ► 69 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు. ఇప్పటికే 43 ఆస్పత్రుల్లో సిద్ధం. ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 23,457. డీ టైప్ ఆక్సిజన్ సిలిండర్లు 27,311 -
43 కేంద్రాలు .. 42 లక్షల డయాలసిస్ సెషన్లు.. కిడ్నీ రోగులకు ఆరోగ్యశ్రీ అండ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూత్రపిండాల వైఫల్యం కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిలో కొందరికి క్రమం తప్పకుండా డయాలసిస్ (రక్తశుద్ధి) చేయాల్సి ఉంటోంది. కొందరికి వారానికి రెండుసార్లు... మరికొందరికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సిన అవసరముంటుంది. అయితే ఇదెంతో ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ప్రైవేటు ఆస్పత్రులు వేలల్లో వసూలు చేస్తుండటంతో పేదలు, మధ్యతరగతి రోగులకు ఈ చికిత్స భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు అందజేస్తోంది. ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా కాపాడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 43 కేంద్రాల ద్వారా రోగులకు పైసా ఖర్చు లేకుండా ఉచిత డయాలసిస్ నిర్వహిస్తున్నారు. డయాలసిస్ అవసరమైన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఈ చికిత్సల కోసం ప్రభుత్వం 2014–15 నుంచి 2021–22 నవంబర్ 16 వరకు రూ.575.92 కోట్లు వెచ్చించింది. పెరుగుతున్న కిడ్నీ వైఫల్యాలు రాష్ట్రంలో 2014–15లో 5,598 మంది మూత్రపిండాల వైఫల్య బాధితులు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదు కాగా..ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. ఆరేళ్లలో దాదాపు 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. 2015–16లో ఈ సంఖ్య 6,853కి చేరగా, 2016–17లో 7,612, 2017–18లో 8,786, 2018–19లో 10,452, 2019–20లో 10,848కి చేరినట్లు ఆరోగ్యశ్రీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020–21లో మాత్రం ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి 10,610గా నమోదయ్యింది. ఎప్పటికప్పుడు కొత్త కేసులు నమోదవుతున్నా ఏడాదికి సుమారు 2 వేల మందికి పైగా బాధితులు మృతి చెందుతుండడంతో గత మూడేళ్లుగా ఈ రోగుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల చోటు చేసుకోలేదని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఆరోగ్యశ్రీతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల్ని కూడా లెక్కిస్తే ఈ రోగుల సంఖ్య రెట్టింపు ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డిలో అత్యధికం మూత్రపిండాల వైఫల్య బాధితుల్లో అత్యధికులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. 02.06.2014 నుంచి 16.11.2021 వరకు రాష్ట్రంలో మొత్తం 42.61 లక్షల డయాలసిస్ సెషన్లు నిర్వహించగా హైదరాబాద్‌లో అత్యధికంగా 10,42,660 చికిత్సలు చేశారు. ఆ తర్వాత రంగారెడ్డిలో 4,87,696 చికిత్సలు జరిగాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో కూడా లక్షకు పైగా డయాలసిస్ చికిత్సలు జరిగాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 5,142 డయాలసిస్ చికిత్సలు నమోదయ్యాయి. మూత్రపిండాల మార్పిడి చికిత్సలు ఎక్కువగా జరగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. రోగుల సంఖ్య పెరుగు తుండడంతో డయాలసిస్ మెషీన్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేదలపై పంజా.. దేశంలోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా లక్ష మంది కిడ్నీ వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది. నిమ్స్ ఆసుపత్రి వైద్యుల నివేదిక ప్రకారం 2015లో ఏకంగా 1.36 లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో చనిపోయారు. దశాబ్దం క్రితం అంతగా లేని కిడ్నీ వ్యాధి ఇప్పుడు నాలుగైదు రెట్లు పెరిగింది. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. వివిధ సంస్థలు దేశంలోని 52,273 మంది వ్యాధిగ్రస్తులపై సర్వే నిర్వహించాయి. ప్రాంతం, సామాజిక, ఆర్థిక స్థాయిల వారీగా అధ్యయనం చేశాయి. దక్షిణాది నుంచి వ్యాధికి గురైన వారిలో నెలకు రూ.5 వేల లోపు ఆదాయం ఉన్నవారు ఏకంగా 44.3 శాతం మంది ఉండటం గమనార్హం. అలాగే రూ.20 వేల లోపు ఆదాయం కలిగినవారు 42.9 శాతం మందికి కిడ్నీ వ్యాధికి గురయ్యారు. దీనిని బట్టి కిడ్నీ రోగుల్లో ఎక్కువగా పేదలే ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. -
చిన్నారి ప్రాణం నిలిపిన ఆరోగ్యశ్రీ
సాక్షి, నందిగామ(కృష్ణా): అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణాజిల్లా నందిగామలోని 13వ వార్డుకు చెందిన ముంగి కోటయ్య 10 నెలల బాబు సంతోష్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తొలుత విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. రూ.10 లక్షల ఖరీదైన శస్త్ర చికిత్స ఈనెల 8న కిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా జరిగింది. చిన్నారి సంతోష్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు పట్టరాని సంతోషంతో వారి ఇంటి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం వల్లే తమ బిడ్డ తిరిగి వచ్చాడని, ముఖ్యమంత్రికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని చిన్నారి తండ్రి కోటయ్య పేర్కొన్నాడు. -
మణిపాల్‌లో ఆరోగ్యశ్రీ కింద బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్
తాడేపల్లిరూరల్: మణిపాల్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ కింద బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను చేస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కంటిపూడి సుధాకర్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మణిపాల్‌లో ఇప్పటివరకు 50 బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. క్లిష్టతరమైన, ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం అభినందించదగ్గ విషయం అన్నారు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ జి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ తరహా క్లిష్టమైన చికిత్సల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా మణిపాల్‌లో అద్భుతమైన చికిత్స లభిస్తోందని తెలిపారు. అంకాలజిస్ట్ డాక్టర్ మాధవ్ దంతాల మాట్లాడుతూ.. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రెండు రకాలని, వాటిలో ఒకటి ఆటోలోగస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని, రెండవది అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.శ్రావణ్‌కుమార్, డాక్టర్ సీహెచ్ మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి గుండెకు శ్రీవారి అభయం
తిరుపతి తుడా: చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు, సంబంధిత చికిత్సల కోసం ఇక పొరుగు రాష్ట్రాల్లోని మహానగరాలకు వెళ్లాల్సిన పనిలేదు. అత్యాధునిక వైద్య సామర్థ్యంతో చిన్నపిల్లల హృదయాలయాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి బర్డ్ ఆస్పత్రి వేదికగా శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ఏర్పాటు చేసింది. చిన్నారుల గుండెకు చిల్లులుపడి సరైన చికిత్స అందక ప్రాణాలను వదులుకునే పరిస్థితిని చూసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలించిపోయారు. ఇలాంటి పిల్లలకు ఉచితంగా చికిత్స అందించేలా ఆరోగ్యశ్రీని అమలు చేశారు. వేలమందికి పునర్జన్మను ప్రసాదించారు. చిన్నారుల గుండెకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని భావించారు. అదేబాటలో నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నపిల్లల కోసం ప్రత్యేక కార్డియాక్ సెంటర్ ఏర్పాటుకు సంకల్పించారు. ఈ బాధ్యతల్ని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి అప్పగించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ఆరునెలల్లో ప్రారంభానికి సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ చిన్నపిల్లలకు ప్రత్యేక కార్డియాక్ సెంటర్ ఇప్పటివరకు లేని లోటును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారు. తిరుపతిలో ఏర్పాటైన శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని ఈనెల 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. చిన్నపిల్లల కార్డియోథొరాసిక్ సర్జన్లు ముగ్గురు, కార్డియాక్ నిపుణులు, పీడియాట్రీషియన్లు, మత్తు వైద్యనిపుణులు ఐదుగురు వంతున, మెడికల్ ఆఫీసర్లు 10 మంది, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది 185 మందితో ఆస్పత్రిని సిద్ధం చేశారు. దేశంలోని ప్రముఖ చిన్నపిల్లల కార్డియాక్ వైద్యనిపుణుల సేవలను కూడా ఉపయోగించుకోనున్నారు. ఉచితంగా ఆస్పత్రికి వచ్చి చిన్నపిల్లలకు అరుదైన ఆపరేషన్లు చేసేందుకు వీలుగా వైద్య నిపుణులను ఆహ్వానిస్తూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ విధానం ప్రస్తుతం బర్డ్ ఆస్పత్రిలో విజయవంతంగా నడుస్తోంది. -
కోవిడ్ రోగుల చికిత్సకే రూ.685 కోట్ల వ్యయం
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా బాధితులకు ఆర్థిక భారం లేకుండా చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. 2 లక్షల మందికి పైగా బాధితులు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కోవిడ్‌కు ఉచితంగా చికిత్స చేయించుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇప్పటికీ అంటే సెప్టెంబర్‌లో కూడా 92 శాతం మంది కోవిడ్ రోగులు ఆరోగ్యశ్రీ కిందే ఉచితంగా చికిత్స పొందుతున్నారు. కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్)ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చిన సంగతి తెలిసిందే. అత్యంత ఖరీదైన చికిత్స అవసరమైన బ్లాక్ ఫంగస్‌ను పథకం పరిధిలోకి చేర్చడంతో చాలామంది ఆర్థిక భారం లేకుండా బయటపడ్డారు. రూ.685 కోట్ల వ్యయం రాష్ట్రంలో ఏ ఒక్కరూ కోవిడ్ వల్ల ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశంతో దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం రూ.685.72 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇంత మొత్తంలో ఖర్చు చేసిన రాష్ట్రాలు దేశంలో ఎక్కడా లేవు. పెద్ద రాష్ట్రాల్లో సైతం ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవకాశం లేకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో సొంతంగా డబ్బు చెల్లించి వైద్య సేవలు పొందారు. మన రాష్ట్రంలో మాత్రం ఉచితంగా చికిత్సలు అందించడమే కాకుండా కోవిడ్ నిర్ధారణ టెస్టులూ (ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్) రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఇవన్నీ ఒకెత్తయితే ఇంట్లో చికిత్స పొందుతున్న లక్షలాది మందికి కూడా ఉచితంగా హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేసింది. చదవండి: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్ సగటున ఒక్కొక్కరికి రూ.34 వేలు వ్యయం గతేడాది మార్చి 10న తొలి కోవిడ్ కేసు నమోదైంది. మే, జూన్ నెలల్లో కేసులు పెరిగాయి. సెప్టెంబర్ నాటికి కోవిడ్ తీవ్రరూపం దాల్చడంతో అప్పటికే చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. గతేడాది.. మొదటి వేవ్, ఈ ఏడాది.. సెకండ్‌వేవ్‌లతో కలిపి సగటున ఒక్కో కోవిడ్ రోగికి ప్రభుత్వం రూ.34 వేలు వ్యయం చేసినట్టు తేలింది. ఈ ఏడాది సెపెంబర్ 7 వరకు ఖర్చు చేసిన లెక్కలు ఇవి. కాగా, ఇప్పటికీ 490 మందికిపైగా బ్లాక్ ఫంగస్ బాధితులు ఆరోగ్యశ్రీ కిందనే ఉచితంగా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా డిశ్చార్జి అయ్యాక ఖరీదైన పొసకొనజోల్ మాత్రలను కూడా ఉచితంగా అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ చికిత్సకు పెద్ద ఎత్తున వ్యయం చేసింది రాష్ట్ర ప్రభుత్వమే అని పలువురు నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం ఇలా.. సంవత్సరం రోగులు వ్యయం (రూ.కోట్లలో) 2020–21 97,171 318.83 2021–22 1,04,288 366.89 మొత్తం 2,01,459 685.72 -
ఏపీలో అందరికీ ఆరోగ్య ధీమా
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా ఆరోగ్య బీమా వర్తిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఏపీలో 94.4 శాతం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ద్వారా ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులో ఉందని తెలిపింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 97.3 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తిస్తుండగా పట్టణాల్లో 86.8 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే ఆరోగ్య బీమాతో అత్యధికంగా ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాల కిందకు ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో సర్వేలో విశ్లేషించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 92 శాతం కుటుంబాలకు వర్తిస్తున్నట్లు తేలింది. తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకమే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో స్థానంలో నిలిచింది. గోవాలో ఆరోగ్య బీమా పథకం 80.4 శాతం కుటుంబాలకు వర్తిస్తోంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం 57.7 శాతం మందికే వర్తిస్తున్నట్లు సర్వే పేర్కొంది. మిగిలిన చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలు కాకుండా కేంద్ర పథకాలను వర్తింప చేస్తున్నప్పటికీ ఎక్కువ కుటుంబాలకు బీమా ప్రయోజనం దక్కడం లేదని సర్వే తెలిపింది. ఇవీ కారణాలు.... ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ బాధ్యతలు చేపట్టగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని గాడిలో పెట్టారు. తెల్లరేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు కోసం వార్షిక ఆదాయ పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచారు. వార్షిక ఆదాయ పరిమితిని పెంచడంతో నెలకు రూ.40 వేల ఆదాయం పొందే మధ్య తరగతి కుటుంబాలు కూడా పథకం పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్ నవశకం ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రత్యేకంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. దీంతో ఏపీలో అత్యధిక కుటుంబాలు ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చాయి. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరును నిరంతర ప్రక్రియగా ముఖ్యమంత్రి చేపట్టారు. గత ఏడాది జూన్ 9వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు 2.86 లక్షల మందికి కొత్తగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేశారు. -
ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వ ఆస్పత్రులకు అందుతున్న నిధులు గణనీయంగా పెరుగుతున్నాయి. చక్కటి మౌలిక వసతులు, వైద్య సిబ్బంది సేవలు మెరుగ్గా అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువ మంది రోగులు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ కేర్ ఆస్పత్రులైన వైద్య విధాన పరిషత్ పరిధిలోని సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు పెరగడం మంచి పరిణామంగా పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017లో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు రూ.16.10 కోట్ల మేర ఆరోగ్యశ్రీ నిధులు అందగా 2020లో రూ.35.78 కోట్లు విడుదలయ్యాయి. 100 శాతానికిపైగా నిధుల పెరుగుదల కనిపించింది. నాడు నేడు పనులు పూర్తయితే.. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో నాడు – నేడు ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొత్త భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ పూర్తయితే ఆరోగ్యశ్రీ చికిత్సలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 60 శాతం ఆరోగ్యశ్రీ నిధులు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళుతున్నాయి. అదే ప్రభుత్వ పరిధిలో అన్ని ఆస్పత్రుల అభివృద్ధి జరిగితే ఆ మేరకు నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకే అందే అవకాశం ఉంది. క్రమంగా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులను పెంపొందించి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉత్తమ చికిత్సలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. డాక్టర్ పోస్టుల భర్తీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారిం చిన విషయం తెలిసిందే. 2020లో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 232 మంది వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. తిరిగి 2021లో 460 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టారు. తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లోనూ 196 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 12 మంది డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించనున్నట్లు ప్రకటించారు. ఇవీ చదవండి: 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు రియా చక్రవర్తితో సంబంధమేంటి? -
కరోనా చికిత్సపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..!
Aarogyasri Covid Treatment: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్–19కు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. మలిదశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆయుష్మాన్ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో కరోనా రోగులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా ఆయా సర్కారు ఆస్పత్రులకు అందజేయనుంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నిటిలో ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచిత చికిత్స అందించాలని ప్రభుత్వం భావించింది. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది. దీంతో ఆరోగ్యశ్రీ అంటేనే పేదవారికి కార్పొరేట్ వైద్యమని, అలాంటిది ప్రైవేటులో చికిత్స చేయనిపక్షంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి ప్రయోజనమేమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు, ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు కవరేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇలావుండగా స్వైన్‌ఫ్లూను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్యాకేజీల వారీగా వైద్యం కరోనాతో వచ్చే పలురకాల వ్యాధులకు ప్యాకేజీల వారీగా చికిత్స అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కేటగిరీల్లో ప్యాకేజీల కింద వైద్య సేవలు అందుతాయి. ఆ ప్రకారమే ఆస్పత్రులకు ప్యాకేజీలు అందజేస్తారు. వైరస్ల కారణంగా వచ్చే అన్నిరకాల జ్వరాలకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది. అంటే తీవ్రమైన జ్వరాలు వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి వాటికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించే అవకాశం ఉందని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనాతో వచ్చే ఈ కింది వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స నిమోనియా అక్యూట్ ఫెబ్రిలి ఇల్నెస్ (జ్వరంతో కూడిన జబ్బు) నిర్ధారణ కాని జ్వరం (పైరిక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్) అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చే తీవ్రమైన నిమోనియా (నాన్ వెంటిలేటెడ్) అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చే తీవ్రమైన నిమోనియా (వెంటిలేటెడ్) ఏ కారణం చేతనైనా శ్వాస ఆగిపోయే పరిస్థితి (నాన్ వెంటిలేటెడ్) ఏ కారణం చేతనైనా శ్వాస ఆగిపోయే పరిస్థితి (వెంటిలేటెడ్) తీవ్రమైన స్వైన్‌ఫ్లూ న్యుమోనియా స్వైన్‌ఫ్లూ తీవ్రమై పలు అవయవాలు వైఫల్యం చెందడం స్వైన్‌ఫ్లూతో తీవ్రమైన రక్తస్రావం జరగడం శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ (వెంటిలేటెడ్) శ్వాసనాళాల్లో ఏర్పడ్డ తీవ్రమైన నిమ్ము (వెంటిలేటెడ్) స్వైన్‌ఫ్లూతో తీవ్రమైన రక్తస్రావం,నిమ్ము ఏర్పడటం ఊపిరితిత్తుల్లో శ్వాసకోశాలు చిట్లిపోవడం నిమోకోనియోసిస్ తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు 949 వ్యాధులకు చికిత్స అందుతోంది. తాజాగా కరోనా సంబంధిత వ్యాధులను, స్వైన్‌ఫ్లూను ప్రభుత్వం ఈ జాబితాలో చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77.10 లక్షల మంది కార్డుదారులు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులుగా ఉన్నారు. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ పథకం కింద కరోనా చికిత్స అందనుంది. -
శభాష్.. పది నిమిషాల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు అందించిన డిజిటల్ అసిస్టెంట్
కురబలకోట (చిత్తూరు జిల్లా): పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పెట్టి శభాష్ అనిపించుకుంది తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ఎర్రబల్లె సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మానస. ఎర్రబల్లె సచివాలయ పరిధిలోని సింగన్నగారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు యశ్వంత్ (4)కు బోన్ కేన్సర్. కుటుంబసభ్యులు చికిత్స కోసం ఇటీవల బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదని వైద్యం చేయడానికి అక్కడి వైద్యులు నిరాకరించారు. హైదరాబాద్ తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయం స్థానిక సర్పంచ్ ఉప్పతి నాగరత్న ఈశ్వర్‌కు తెలియడంతో ఎర్రబల్లె సచివాలయానికి చేరుకుని డిజిటల్ అసిస్టెంట్ మానసను సంప్రదించారు. ఆమె విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు చిన్నారి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి.. పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. గతంలో నెలలపాటు తిరిగినా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేది కాదని, ఇప్పుడు నిమిషాల్లో కార్డు చేతికందిందని చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తామని తెలిపారు. -
పల్లెకు ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలని, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీహెచ్‌సీలతో కూడా అనుసంధానం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒక మంచి ఉద్దేశంతో కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని, కార్పొరేట్ తరహా వాతావరణం అక్కడ కనిపించాలని సూచించారు. బెడ్ షీట్స్ దగ్గర నుంచి సేవల వరకు అన్ని విషయాల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా నిర్వహణ ఉండాలన్నారు. ఈ తరాలకే కాదు.. భవిష్యత్తు తరాలవారికి కూడా అత్యుత్తమ వైద్యం అందాలన్నదే తన కల అని సీఎం పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’ కార్యక్రమాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు డిసెంబర్‌కి అన్నీ పూర్తి.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానించాలి. ల్యాబ్స్తోనూ అనుసంధానం చేయడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలి. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ విలేజ్ క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలి. ఇదివరకే సేకరించిన డేటా వివరాలను ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానించాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు చికిత్సకు ఈ వివరాలెంతో సహాయపడతాయి. సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యమందించేందుకు దోహదపడుతుంది. డిసెంబర్ నాటికి విలేజ్ క్లినిక్స్ అన్నింటినీ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులే మదిలో మెదలాలి.. ఒక మంచి ఉద్దేశంతో 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టాం. అక్కడ కార్పొరేట్ తరహా వాతావరణం కనిపించాలి. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే అక్కడ అందే సదుపాయాలతో ఎలాంటి భావన కలుగుతుందో ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ప్రజలకు అదే రకమైన భావన కలగాలి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యం సరిగా లేకపోతే చికిత్స పొందేందుకు వాళ్ల ఆప్షన్ మనం కడుతున్న ప్రభుత్వాస్పత్రులే కావాలి. ఆ తరహాలో నాణ్యతతో కూడిన నిర్వహణ ఉండాలి. మెడికల్ కాలేజీల్లో సరైన యాజమాన్య విధానాలపై నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక(ఎస్వోపీ)లు రూపొందించాలి. మెడికల్ కాలేజీల ఆస్పత్రుల్లో వాతావరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, కొత్తగా కనిపించాలి. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందాలి. నిర్వహణపరంగా ఎలా ఉండాలి? నిర్మాణం పూర్తైన తర్వాత ఎలా ఉండాలి? అనే వాటిపై నిర్దిష్ట విధానాలతో నివేదిక రూపొందించాలి. మండలానికి రెండు పీహెచ్‌సీలు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ప్రజలకు సేవలందిస్తుండగా కొత్తగా మరో 176 ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్సీలుంటాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు చొప్పున విధులు నిర్వహిస్తారు. ఇలా ఒక్కో మండలంలో నలుగురు డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రకారం ప్రతి వైద్యుడు మండలంలోని 7 నుంచి 8 గ్రామాలను ఓన్ చేసుకుని వారానికి ఒకసారి ఏదైనా ఊరికి వెళ్లి వారికి అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారు. పురోగతిలో కాలేజీల పనులు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల పనుల పురోగతిని సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. పాడేరు, విజయనగరం, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనకాపల్లి, నంద్యాలలో మెడికల్ కాలేజీల స్థలాలపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలైనట్లు పేర్కొనటంతో వెంటనే పరిష్కారం దిశగా ప్రయత్నించాలని సీఎం సూచించారు. అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండల్లో వైద్య కళాశాలల పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా కాంట్రాక్ట్ సంస్థకు పనులు అవార్డ్ చేశామని, వెంటనే మొదలవుతాయని చెప్పారు. ప్రస్తుతం సేవలందిస్తున్న 11 బోధనాస్పత్రుల్లో కూడా ‘నాడు – నేడు’ ద్వారా అప్‌గ్రెడేషన్, సదుపాయాలను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో నాడు– నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గడువులోగా పనులు పూర్తయ్యేలా అన్ని వివరాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. విలేజ్ క్లినిక్స్‌లో సదుపాయాలు ఇలా ► విలేజ్ క్లినిక్స్‌లో ప్రజలకు అందుబాటులో 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు ► 14 రకాల టెస్టులు ► 65 రకాల ఔషధాలు ► 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ ► టెలీమెడిసిన్ సేవలు ► బీఎస్సీ నర్సింగ్, సీపీసీహెచ్ కోర్సు చేసిన ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్) సేవలు లభ్యం ► ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సేవలు ► ఔట్ పేషెంట్ పరీక్షల గది, ల్యాబ్, ఫార్మసీ, వెయిటింగ్ హాల్‌తోపాటు క్వార్టర్స్ ఏర్పాటు వల్ల 24 గంటలు ఏఎన్ఎం సేవలు అందుబాటులో -
జననాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి
మన్రో,న్యూజెర్సీ: ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే రాజశేఖరరెడ్డికి ముందు , రాజశేఖరరెడ్డికి తర్వాత అనే విధంగా ఆయన పరిపాలన చేశారని ప్రవాస భారతీయులు అన్నారు. ఒక రాజకీయ నాయకుడిని ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత మంది గుర్తు పెట్టుకుంటున్నారంటనే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని మన్రోలో వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి హాజరైన వారు వైఎస్సార్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని , తమ జీవితంలో వైఎస్ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యుడు ఆళ్ల రామిరెడ్డి మాట్లాడుతూ న్యూజెర్సీలో 2010లో వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలను అమెరికాలో 16 స్టేట్స్లో 19 నగరాల్లో ఘనంగా నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, ప్రేమ, భక్తితోనే తాము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీని ప్రజలెవరు మర్చిపోలేరని వైఎస్ఆర్ స్నేహితుడు డాక్టర్ కే రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడం అనవసరమని తనతో వైఎస్ఆర్ తనతో ఎప్పుడూ అంటుండే వారని అనుకోకుండా 60 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయారంటూ ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. డాక్టర్ వైఎస్సార్ లాంటి నాయకులు మళ్లీ మళ్లీ భారత దేశంలో పుట్టాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ రాఘవరెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ బతికుంటే అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఎంతో ముందుకు వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డారు. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మిన మహానేత రాజశేఖరరెడ్డి అని పి శ్రీకాంత్‌రెడ్డి . జలయజ్ఞం పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. పోలవరం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. -
మరపురాని మహానేత.. మా రాజన్న
వైఎస్సార్ మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు.. కానీ, తనదైన పాలనతో ప్రతి ఒక్కరి హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు. ఆయన రూపకల్పన చేసిన సంక్షేమం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి బాటలు వేసింది. ఆయన పేరు తలుచుకోగానే స్వచ్ఛమైన చిరునవ్వు కళ్ల ముందు మెదలుతుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే.. నమస్తే.. అన్న మాటలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్’.. తెలుగువాడి హృదయాల్లో చెక్కు చెదరని పేరు.. ఆ అక్షరాలు వింటే తెలుగు నేల పులకిస్తుంది.. పచ్చని పైరు నాట్యం చేస్తుంది.. పేదోడి మనసు ఉప్పొంగుతుంది.. అక్క చెల్లెమ్మల్లో కొత్త ఆనందం కనిపిస్తుంది.. రైతు మోములో తొలకరి సాక్షాత్కరిస్తుంది.. బడుగు బలహీనులకు కొండంత ధైర్యం వస్తుంది.. దగాపడ్డ గుండె గొంతుకకు భరోసా దక్కుతుంది.. ప్రజల గుండెల్లో ‘రాజ’న్నగా ముద్రవేసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతీక్షణం ప్రజలకే అంకితం చేశారు. ప్రజల పక్షాన్నే పోరాడారు. ప్రజాసంక్షేమమే పునాదిగా పనిచేశారు. ‘రాజన్న’ మాట చెబితే తప్పడు.. ఎన్ని అడ్డంకులెదురైనా మడమ తిప్పడు.. అన్నది ప్రజలు చెప్పే మాట. ఢిల్లీని సైతం ధిక్కరించి తన జనం కోసం నిలబడ్డ ధీరుడు. ఆయనే ఓ ధైర్యం రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలు రాక్షస క్రీడ ఆడుతున్న తరుణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో విపక్ష నేతగా జనం వాణి గట్టిగా వినిపించారు. అప్పటి టీడీపీ దోపిడీ పాలనపై నిప్పులు చెరిగారు. ఆ చీకటి పాలనతో నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రాజన్న జనం బాటపట్టారు. మండుటెండలో ఆయన సాగించిన 1,475 కిలోమీటర్ల పాదయాత్రలో జనం గుండె తలుపుతట్టారు. నేనున్నానని కొండంత భరోసా కల్పించారు. అలాగే, ‘వ్యవసాయం దండగ’ అని పరిహసించిన ఆనాటి పాలకుల చేష్టలకు దిగాలు పడ్డ రైతును ఓదార్చారు. జబ్బు చేస్తే ఇల్లూ వాకిలీ అమ్ముకునే సామాన్య జనం దయనీయ స్థితికి చలించిపోయారు. చదువు కోసం అప్పులపాలయ్యే కుటుంబాల దీనగాధలు విన్నారు. ఇలా నడిచొచ్చిన నాయకుడికి యావత్ తెలుగు జాతి నీరాజనాలు పట్టింది. 2004లో అత్యధిక మెజారిటీతో అక్కున చేర్చుకుని అందలం ఎక్కించింది. రాజన్నే ‘గుండె’బలం పేదోడికి జబ్బొస్తే ఇల్లూ వాకిలీ అమ్ముకోవడమే రాజన్న సీఎం అయ్యే వరకూ ఉన్న పరిస్థితి. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం దక్కే విప్లవాత్మక పథకం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. లక్షల మంది జీవితాల్లో ఈ పథకం వెలుగు నింపింది. క్యాన్సర్, గుండె జబ్బులు, న్యూరో, గర్భకోశ వ్యాధులు.. ఇలా 942 జబ్బులను ఈ పథకంలో చేర్చారు. రూ.1,400 కోట్లు పథకానికి వెచ్చించారు. చిన్నారుల్లో వినికిడి లోపం సరిచేసేందుకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ కోసం ఒక్కొక్కరికీ రూ.6.5 లక్షలు వెచ్చించిన ఘనత ఆయనదే. కాల్ చేస్తే ‘కుయ్.. కుయ్.. కుయ్..’ మంటూ ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్‌లు.. 104 వైద్య సేవలు.. ఇవన్నీ ఆయన తెచ్చిపెట్టినవే. పేదోడి ఇంట్లో మహానేత ముద్ర సొంతిల్లు కల వైఎస్వల్లే సాధ్యమైందని చాలామంది చెప్పుకుంటారు. 2004 వరకూ కేవలం రూ.500 కోట్లున్న గృహ నిర్మాణ బడ్జెట్‌ను 2009 నాటికి ఆయన రూ.5వేల కోట్లకు తీసుకెళ్లారు. కేవలం ఐదేళ్లలోనే 47 లక్షల ఇళ్లు నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. వృద్ధాప్యం భారమన్న వాదనను వైఎస్ దూరం చేశారు. పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చారు. 16 లక్షలున్న పెన్షన్లను 71 లక్షలకు పెంచి అర్హులందరికీ అందేలా చేశారు. అక్షర భిక్ష పెట్టిన నేత డాక్టర్, ఇంజనీర్ వంటి పెద్ద చదువులు పేదవాడి సొంతమైతేనే ఆర్థిక దుస్థితి మారుతుందని వైఎస్ బలంగా నమ్మారు. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మకమైన ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. 11 లక్షల మంది బీసీలకు, 5 లక్షల ఎస్సీ, 1.8 లక్షల ఎస్టీలకు, 7.5 లక్షల మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం పెద్ద చదువులకు అవకాశం కల్పించింది. ఈ పథకంవల్ల ఎంతోమంది పెద్ద చదువులకు వెళ్లారు. ఇదే కాదు.. అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ నిజమైన అన్నగా నిలబడ్డారు. ఆర్థిక స్వావలంబన దిశగా పావలా వడ్డీ రుణ పథకాన్ని దిగ్విజయంగా అమలుచేశారు. ఆయన హయాంలో 85 లక్షల మందికి రూ.7 వేల కోట్లు అందాయి. ఫలితంగా స్వయం సహాయ సంఘాలు వైఎస్ కాలంలో బలమైన శక్తులుగా అవతరించాయి. స్వర్ణయుగానికి నాంది మే 14, 2004న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణమే రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేశారు. అప్పటి నుంచి దాదాపు 35 లక్షల పంపుసెట్లకు పైగా ఉచిత విద్యుత్ అమలైంది. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ సబ్సిడీ క్రమంగా ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచితం హామీ చెక్కుచెదరలేదు. కరెంట్ చార్జీలు కట్టలేమన్న రైతుపై టీడీపీ ప్రభుత్వం పాశవికంగా పెట్టిన కేసులన్నీ ఎత్తేశారు. రూ.1,100 కోట్ల రైతు విద్యుత్ బకాయిలు ఒక్క సంతకంతో మాఫీ చేశారు. అప్పులపాలైన రైతన్నను రుణ విముక్తుల్ని చేశారు. నాణ్యమైన విత్తు, ఎరువు కోసం దిగ్గజ కంపెనీలతో రైతు కోసం పోరాడిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. రాజన్న పాలనలో మద్దతు రేటు పెరిగింది. తక్కువ వడ్డీ రుణాలతో దళారుల చెర నుంచి రైతు విముక్తి పొందాడు. -
ఆరోగ్యశ్రీ... ఏపీ భాగ్యం
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రూపుదిద్దుకున్న ఎన్నో సంక్షేమ, అభివృధ్ది పథకాలకు... అంతకు ముందు ఆయన సుదీర్ఘ ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఎదురైన అనుభవాలు, జనం అగచాట్లు స్వయంగా గమనించి చేసిన ఆలోచనలే మూలం. ఆయనను ప్రధానంగా కలచివేసిన అంశం, జబ్బుల బారిన పడిన పేద జనానికి మెరుగైన వైద్యం అందక ఆస్తులు అమ్ముకుని ప్రాణం కాపాడుకోవడానికి బడుగు జీవి పడిన పాట్లు ఒక డాక్టరుగా ఆయనలో సరికొత్త పథకానికి నాంది పలికింది. డబ్బులు ఉన్నవాడికే కార్పొరేట్ వైద్యం, లేనివాడు ఆరోగ్యం కోసం అప్పులపాలైనా కావాలి లేదా ప్రాణం మీద ఆశ వదులు కోవాలి. ఈ పరిస్థితిలో సమూల మార్పు తీసుకువచ్చి సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే ధన్వంతరి మంత్రంగా ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చింది. వాస్తవానికి వైఎస్సార్ సీఎంగా రోజులో ఎక్కువ సంతకాలు చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సాయం కోసం దరఖాస్తుల ఫైళ్లపైననే. 14.05.2004 నుంచి 26.06.2007 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 168.52 కోట్ల నిధులు విడుదల చేశారంటే పేదల ఆరోగ్యంపై ఎంతగా శ్రద్ధవహించేవారో అర్థం చేసుకోవచ్చు. జబ్బుపడ్డ పేదవాడి కుటుంబం ఆ ఆపత్కాలంలో సీఎం కార్యాలయం వరకు కలిగే ప్రయాసకు స్వస్తి చెప్పదల్చుకున్నారు వైఎస్సార్. డబ్బులు లేక వైద్యం అందని దుర్భర పరిస్థితులకు శాశ్వత పరిష్కారంగా ఆరోగ్యశ్రీని ప్రిస్క్రైబ్ చేసి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు డాక్టర్ వైఎస్సార్ చేసిన ప్రయత్నం, సాధించిన తక్షణ ఫలితాలు యావద్దేశం ఆరోగ్యశ్రీ వైపు దృష్టిపెట్టేట్టు చేశాయి. దేశంలో తొలిసారిగా బీపీఎల్ కుటుంబాలకు ఉచిత కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పిస్తూ ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. నేషనల్ హెల్త్ బిల్లులో, 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లు ఉన్నా ఆరోగ్యశ్రీ స్పూర్తిగా పేదలకు ఉచిత వైద్య బీమా పధకాలు అమలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోదీ హెల్త్ కేర్ వైఎస్సార్ తెచ్చిన ఆరోగ్యశ్రీ కోవలోనిదే. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని 229.11 లక్షల కుటుంబాలలో వైఎస్సార్ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 198.25 లక్షల కుటుంబాలు (87 శాతం) ప్రయోజనం పొందడానికి అర్హత కలిగి ఉండేవి. తన సొంతఊరు పులివెందులలో ఒక రూపాయి ఫీజు తీసుకునే డాక్టరుగా పేరొందిన వైఎస్సార్.. ఆరోగ్యశ్రీతో పాటు వైద్య సేవారంగంలో మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసును వైఎస్సార్ 2007 ఆగష్టు 15న ప్రారంభించారు. వైఎస్సార్ 108 సర్వీసును ప్రవేశపెట్టిన పదిరోజుల్లోగానే ఆగష్టు 29న అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ తమ రాష్ట్రంలో ఈ సర్వీసును అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీని వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మార్చి అమలు చేస్తూ ఈ స్కీంను మరింత విస్తృతం చేసి రాష్ట్ర జనాభాలో 90 శాతం పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అందుకోవడానికి వీలు కల్పించారు. తన హయాంలో వైఎస్సార్ 940 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే, వైఎస్ జగన్ జనరల్ సర్జరీ నుంచి సైక్రియాట్రీ వరకు లెక్కకు మించిన వైద్య చికిత్సలను ఈ స్కీంలో చేర్చి తండ్రికి తనయుడు అనిపించుకుంటున్నారు. కరోనా బారిన పడిన వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద అన్ని హాస్పిటల్స్‌లో ఉచిత చికిత్స అందించేందుకు ఆదేశాలిచ్చిన వైఎస్ జగన్.. దేశంలో కరోనా చికిత్సను ఫ్రీ హెల్త్ సర్వీస్ కిందకు తెచ్చిన తొలి ముఖ్యమంత్రి. బీఎస్ రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ -
మహానేత... నిన్ను మరువం: మా ‘గుండెచప్పుడు’ నువ్వే!
వెబ్‌డెస్క్ : అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకును పట్టి చూస్తే చాలు. అదే విధంగా సమాజంపై ఓ రాజకీయనేత ఎలాంటి ప్రభావం చూపాడనేది అంచనా వేయడానికి ఊరూరూ, ఇళ్లిళ్లు తిరగక్కర్లేదు. ఒక గ్రామం, ఒక ఇల్లు పరిశీలిస్తే చాలు ఆ నాయకుడి ముందుచూపు, సాటి మనిషి కష్టాల పట్ల స్పందించే గుణాలు ఇట్టే తెలిసిపోతాయి. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాజంపై ఎంతగానో ప్రభావం చూపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో పాటు పాదయాత్రలో ఎదురైన అనుభవాలు ఆయనను అంతకు ముందున్న నేతలకు భిన్నంగా మార్చాయి. అందుకు ఉదాహరణ శనిగపురం గ్రామం. అక్కడి ప్రజల అనుభవాలు. కులమతాలకు అతీతం మహబూబాబాద్ పట్టణాన్ని ఆనుకునే ఉంటుంది శనిగపురం గ్రామం. ఇటీవల మున్సిపాలిటీలో కూడా భాగం అయ్యింది. ఆ గ్రామంలో ఐదువేల మంది జనాభా నివసిస్తున్నారు. ఐదు వందల గడపల జనాభా. అన్ని కులాలు, మతాల వాళ్లు ఆ ఊళ్లో ఉన్నారు. మతాచారాలకు అనుగుణంగా ఎవరి దేవుడిని వారు పూజిస్తారు. కానీ కులమతాలకు అతీతంగా వారు దేవుడితో సమానంగా కొలిచే మరో వ్యక్తి ఉన్నారు. ఊళ్లో సగం ఇళ్లల్లో ఆయన ఫోటోలే దర్శనం ఇస్తాయి. ఆయన మరెవరో కాదు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన్ని ఆ గ్రామం గుండెల్లో పెట్టుకుంది. ఎందుకంటే ఆగిపోయే గుండెలను డబ్బు అవసరం లేకుండానే కొట్టుకునేలా ఆయన చేశారు. అందుకే ఆయనంటే వారికి అంత అభిమానం. ఇక్కడ ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కో రకంగా ఆ మహానేత గురించి చెబుతారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఓసారి ఆ మరువలేని జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. వైఎస్సార్ లేకుంటే ? పొలంలో కొట్టేందుకు పురుగుల మందు కొనుక్కుని ఇంటికి వెళ్తున్న రాములు నాయక్‌కి ఉన్నట్టుండి ఛాతీలో మంట మొదలైంది. చూస్తుండగానే నొప్పి పెద్దదైంది. కాళ్ల కింద భూమి కంపించిన ఫీలింగ్. భార్య, ఇద్దరు పిల్లలు కళ్ల ముందు కదలాడారు. కళ్లు తెరిస్తే ఆస్పత్రిలో ఉన్నాడు రాములు నాయక్. గుండె ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు, దానికి రూ. 5 లక్షల ఖర్చు అవుతుందన్నారు. రెండెకరాలు అమ్మినా అంత సొమ్ము రాదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో రాములు నాయక్‌కి ఆదుకుంది ఆరోగ్య శ్రీ పథకం. రాములు నాయక్‌కి ఉన్న రెండెకరాల పొలం అలాగే ఉంది. బయట నుంచి ఒక్క రూపాయి కూడా అప్పు తేలేదు. అయినా సరే హైదరాబాద్‌లో అపోలో ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ జరిగింది. ఈ ఘటన జరిగింది 2008లో అప్పుడు ఆయన వయస్సు 27 ఏళ్లు. డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే కష్టంగా ఉందంటూ కన్నీటితో చెబుతాడు రాములు నాయక్. అందుకే తనింట్లో దేవుళ్ల ఫోటోల పక్కన వైస్సార్ ఫోటో ఉంటుంది. మనలోనే ఉన్నాడు రాములు నాయక్ ఆపరేషన్ తర్వాత అదే ఊళ్లో బానోతు బుజ్జి, నేలమారి కాటం రాజులకు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా గుండె ఆపరేషన్ జరిగింది. అప్పటికే వ్యవసాయంలో ఆటుపోట్లు చూస్తున్న రైతన్నలకు రుణమాఫీ ద్వారా భారీ మేలు జరిగింది. అందుకే శనిగపురం గ్రామం వైఎస్సార్‌ను తమ గుండెల్లో పెట్టుకుంది. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి తమవాడే, తమ ఇంటి పెద్ద బిడ్డ అనుకునే ఇలాంటి శనగపురాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ మండలంలో నాలుగైదు ఉన్నాయి. ప్రతీ గడపకు ఆయన సేవలు అందాయి. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తులో, ఆసరా ఫించన్లు పొందుతున్న అవ్వా, తాతాల దీవెనల్లో, ఉచిత కరెంటు పొందుతున్న ప్రతీ రైతు కళ్లలో వెలుగై రాజన్న ఇంకా మన మధ్యే ఉన్నాడు. చిరకాలం అలాగే ఉంటాడు! -
కేసులు తగ్గుతున్నాయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. 3,540 సచివాలయాల పరిధిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, గ్రామాల్లోనూ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 30 నుంచి 40 కేసులున్న సచివాలయాలు 40 మాత్రమే ఉన్నాయని, 50కి పైన కేసులున్నవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న పిల్లలకు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, వాటిని నాలుగు చికిత్సలుగా విభజించి చేర్చామని చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల్లో చిన్నారులకు పడకల పెంపు రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో చిన్నారులకు ఐసీయూ, ఆక్సిజన్ పడకలు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని సింఘాల్ తెలిపారు. ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల్లోనూ వనరులను బట్టి బెడ్స్ పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16చోట్ల మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూములను గుర్తించామని చెప్పారు. ఈ ఆస్పత్రులు ఎలా ఉండాలో త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,17,97,000 డోసుల టీకా వేశామన్నారు. యాంపొటెరిసిన్ బి ఇంజెక్షన్లు 10వేల వరకూ అందుబాటులో ఉన్నాయని, పొసకొనజోల్ ఇంజెక్షన్లు, మాత్రల నిల్వలు పెంచామని వివరించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3.16 లక్షలకు పైగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకా వేశామన్నారు. -
చిన్నారులకు అత్యుత్తమ వైద్యం
ఆరోగ్యశ్రీ దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా నిలవాలి. ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వం నిర్ధారిస్తున్న రేట్లు ఇబ్బందులకు గురిచేసేలా కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఫిక్స్ చేయాలి. ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వారాల లోపే బిల్లులు చెల్లిస్తున్నాం. పథకం అమలులో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యం. సకాలంలో బిల్లుల చెల్లింపు ఆరోగ్యశ్రీ విశ్వసనీయతను పెంచుతుంది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఆరోగ్య ఆసరా కూడా ఒక విప్లవాత్మక చర్య. ప్రతి రోజూ ఆరోగ్యశ్రీ పథకంపై దృష్టి పెట్టాలి. అప్పుడే పేదల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్ తగ్గిన తరువాత ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యల బారిన పడుతున్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా హెల్త్ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, రెండు వారాల్లోగా హెల్త్ హబ్‌లపై విధివిధానాలను ఖరారు చేయాలని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కోవిడ్ కారణంగా మరణించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కుటుంబాలకు త్వరగా ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కోవిడ్ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బందికి కూడా ఆర్ధిక సహాయం అందించడంపై పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్... కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్ సంబంధిత అంశాల్లో నర్సులు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారులకు వైద్య చికిత్స సదుపాయాల గురించి అధికారులు వివరించారు. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తం 1,600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అదనంగా చిన్న పిల్లల వైద్యులు, స్టాఫ్ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. టైర్–1 నగరాల తరహాలో అత్యుత్తమ వైద్యం హెల్త్ హబ్‌లపై సమీక్ష సందర్భంగా జిల్లా కేంద్రాల్లో వీటి ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు ఏర్పాటు కావాలని సీఎం సూచించారు. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్స విధానాలు, టెక్నాలజీ, అత్యుత్తమ సదుపాయాలను ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకు రావాలన్నదే హెల్త్ హబ్‌ల వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకూ అందుబాటులోకి రావాలన్నారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), కోవిడ్ అండ్ కమాండ్ కంట్రోల్ చైర్పర్సన్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ.కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వారంలో గణనీయంగా తగ్గిన కోవిడ్ కేసులు (జూన్ 6–12 వరకు) ► జూన్ 12న 6.58 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు. మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం 8 అన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 17.5% లోపే. ► 7 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 0–9% లోపే. ► చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో 10–19 శాతం మధ్య పాజిటివిటీ రేటు ► 85,637కి తగ్గిన యాక్టివ్ కేసులు. 94.61 శాతానికి పెరిగిన రికవరీ రేటు. ► 104 కాల్ సెంటర్‌కు ఏప్రిల్ 15 నుంచి 5 లక్షలకుపైగా కాల్స్ అందగా ఔట్ గోయింగ్ కాల్స్ సంఖ్య 6,41,093. ప్రస్తుతం రోజు వారీ కాల్స్ సుమారు 2,700. ► జూన్ 12 వరకూ 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు, 157 మంది మృతి. -
ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు పైన వారికే వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్ వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేమని, ముందస్తు అంచనాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి కాబట్టి తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉండవచ్చన్నారు. వీరికి వ్యాక్సిన్ ఇవ్వడంపై వయసు నిబంధనలు సడలిస్తూ త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తామని తెలిపారు. భవిష్యత్ అంచనాలనుబట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వారం రోజుల్లోగా వసతులను పరిశీలించాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఈ అంచనా వేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో చిన్నారులకు అవసరమైన వెంటిలేటర్లు, వార్డులు తదితరాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు చిన్నపిల్లల ఆస్పత్రులు నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈనెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించాలని, ఈనెల 11 నుంచి సడలింపు సమయాన్ని 2 గంటలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునేవారు పెరిగారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం చికిత్స చేయించుకునేవారి సంఖ్య పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 21, 130 మందిలో 17,944 మంది (84.92 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉన్నారని చెప్పారు. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే చికిత్స పొందుతున్న 9,659 మందిలో 6,443 మంది (67 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు భారీగా తగ్గుతోందని తెలిపారు. రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్ చికిత్సకు 91 వేలకుపైగా యాంఫొటెరిసిన్ బి ఇంజక్షన్లకు ప్రభుత్వం ఆర్డర్లు పెడితే ఇప్పటివరకు కేంద్రం 13 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చిందన్నారు. పొసకొనజోల్ మాత్రలు, ఇంజక్షన్లను తగినన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 57,07,706 మందికి వ్యాక్సిన్ తొలిడోసు వేశామని, 25,80,432 మందికి రెండుడోసులు వేశామని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ వయసు వారిలో ఎంతశాతం కేసులు వచ్చాయి, రాష్ట్రంలో ఆ కేసుల శాతం ఎలా ఉంది అన్నదానిపై అంచనా వేసినట్లు ఆయన వివరించారు. -
Telangana: నేడు కాంగ్రెస్ ‘సత్యాగ్రహ దీక్షలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కరోనా బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బ్లాక్‌ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం ‘సత్యాగ్రహ దీక్షలు’చేపట్ట నుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ దీక్షలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడిం చాయి. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో కూడా ఈ దీక్షలు చేపట్టనున్నారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతో పాటు పలువురు నేతలు రాష్ట్రవ్యాప్తంగా పాల్గొననున్నారు. -
ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం .. డబ్బు వెనక్కు..
సాక్షి, తూర్పుగోదావరి : ఆరోగ్య శ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేస్తూ రోగి బంధువుల నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసిన ఇనోదయ ఆసుపత్రి పశ్చాత్తాపం చెందింది. ఆసుపత్రి యాజమాన్యం రోగి నుండి వసూలు చేసిన రూ.4.50 లక్షలు కలెక్టర్ సమక్షంలో తిరిగి బాధితుని బంధువులకు అందచేసింది. ఇనోదయ ఆసుపత్రి ఇటీవల పెద్దాపురంకు చెందిన ఒక కరోనా రోగికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేస్తూ..వారి బంధువుల నుండి అక్రమంగా రూ.4.50 లక్షలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని బాధితులు ఆశ్రయించడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇనోదయ ఆసుపత్రిని డి నోటిఫై చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి రూ.22,50,000 పెనాల్టీ విధించారు. -
2 Years YSJagan Ane Nenu: ప్రజల నాడి పట్టిన ప్రభుత్వం
అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టి టెలిమెడిసన్ వరకు వైద్య సేవలను విస్త్రృతం చేశారు. గత రెండేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వైద్యానికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సాయం పొందే వెసులుబాటు ఏపీ ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా క్యాన్సర్‌తో సహా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వెలుపల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలలోని 130కి పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలోని దాదాపు 95 శాతం కుటుంబాలు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చాయి. అంతేకాదు ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునే వరకు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని జననేత వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000ల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులూ రోగులకు ఆర్థిక భరసా కల్పిస్తున్నారు. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు రెండు చెవులకూ కాక్లియర్ పరికరం అమర్చడం వంటి అరుదైన సేవలందిస్తోంది. కార్పొరేటుకి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనే లక్క్ష్యంతో నాడు-నేడు పథకం కింద ఆసుపత్రుల ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు, 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆసుపత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనంత మంది సిబ్బంది ఉండాలనే లక్ష్యంతో గడిచిన రెండేళ్లలో 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందిని నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ వంతున కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు వీటికి తోడుగా కొత్తగా మూడు క్యాన్సర్, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు గిరిజన ప్రాంత ప్రజల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏల పరిధిలో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టారు. దశలవారీగా మూడేళ్లలో అన్ని పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 1,088 కొత్త అంబులెన్సులు ఆపత్కాలంలో రోగులకు అత్యసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం రూ.210 కోట్లతో 1,088 అంబులెన్సులు కొనుగోలు చేసింది. వీటిని 104, 108 సర్వీసులలో ఉపయోగిస్తున్నారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్ చేరుకునే వీలు చిక్కింది. మరోవైపు 104 సేవల్లో భాగంగా వైద్య సిబ్బంది పల్లెలకు వెళ్లి బీపీ, షుగర్, ఈసీజీ ఇలా 20 రకాల వైద్య సేవలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. 104, 108 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నేటి పరిస్థితులకు తగ్గ గౌరవ వేతనం అందిస్తున్నారు. కంటి వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా కంటి వైద్య సేవలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి కంటి అద్దాలు అందిస్తున్నారు. మరోవైపు అవ్వా తాతలకు గ్రామ సచివాలయాల్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేపడుతున్నారు. శస్త్ర చికిత్సలు జరిగిన వారికి ఇంటివద్దకే వచ్చి ఉచిత కంటి అద్దాలు అందచేసేలా ఈ పథకానికి సీఎం జగన్ రూప కల్పన చేశారు. టెలిమెడిసిన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,410 కాల్ సెంటర్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు అందిస్తోంది. ప్రతీ జిల్లాకు ఒక టెలిమెడిసిన్ సేవా కేంద్రంతో పాటు ప్రతీ కేంద్రంలో 10 నుంచి 15 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. వీరు రోగి నుంచి జబ్బు వివరాలు తెలుసుకొని మందులు, సూచనలను ఫోన్ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో టెలీమెడిసిన్ కేంద్రాల ద్వారా ప్రతి రోజు వేలాదిమంది రోగులకు ఆరోగ్య సేవలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. -
78 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స: సీఎం వైఎస్ జగన్
-
ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: వైఎస్ షర్మిల
హైదరాబాద్: వరి, మిర్చి పంటలు కొనుగోలు చేయాలని రైతన్నలు ఆందోళనలు ఓవైపు.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదనే మనస్తాపంతో మరోవైపు నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఇంకోవైపు. ఈ కరోనా కష్ట కాలంలో మహిళలు తమ కుటుంబ పోషణ కోసం తమ పేరుమీదున్న ఇళ్లను, బంగారాన్ని, చివరకు, మంగళ సూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి.. దీనస్థితిలో కాలం వెళ్ల దీస్తున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ తెలంగాణలోని వాస్తవ పరిస్థితి, కానీ ప్రభుత్వానికి ఇవేమి కనిపించడం లేదన్నారు. వైఎస్.షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరాశోభన్ తో కలిసి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కోవిడ్ మేనేజ్మెంట్ బాగుందని, టెస్టింగ్ గానీ, వ్యాక్సినేషన్ సిస్టమ్ గానీ, మెడికల్ సర్వీసెస్ అంతా బాగుందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ‘అన్నీ బాగున్నాయని మీకు మీరు సొంత డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అసలు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ముందు తెలుసుకోవాలన్నారు. అటు.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా.. సీఎం కేసీఆర్ కూడా తాను చేసే పనులు తెలంగాణ ప్రజలెవ్వరూ గమనించడం లేదనుకోవడం పొరబాటన్నారు. చికిత్స కోసం యశోద ఆసుపత్రి వెళ్లిన కేసీఆర్ పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతి రోజు తాము విన్నవిస్తున్నా.. దున్నపోతు మీద వాన పడ్డ చందంగా దాన్ని ఈ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. తమ ఒత్తిడి తట్టుకోలేక కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణలోని 26 లక్షల కుటుంబాలకే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి కేసీఆర్ దొర, దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నామన్నారు. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒట్టి దిక్కుమాలిన పథకం అన్న కేసీఆర్.. ఇప్పుడే అదే స్కీమ్‌లో ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అటు.. ఆయుష్మాన్ భారత్‌లో అన్ని వ్యాధులకు 5 లక్షల రూపాయల వరకే పరిమితి ఉందని, అదే ఆరోగ్యశ్రీలో కొన్ని పథకాలకు 13 లక్షల రూపాయల వరకు పరిమితి ఉందని షర్మిల తెలిపారు. కరోనా వైద్యానికి లక్షలకు లక్షలు ఖర్చువుతున్నాయని, ఈ డబ్బునంతా ఎవరు చెల్లిస్తారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలని మరోమారు డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ షర్మిల. ఇక కరోనా సమయంలో చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం డ్వాక్రా మహిళలు 10 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని, ఇది గత ఏడాదితో పోలిస్తే 60 శాతం అధికమని ఆమె చెప్పుకొచ్చారు. ఉపాధి లేక, ఆదాయం రాక, ప్రభుత్వం ఆదుకోక లక్షలాది మహిళలు అప్పుల పాలయ్యారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అటు.. వైఎస్సార్ పాలనలో మాదిరిగా ఇప్పుడున్న కేసీఆర్ పాలనలో విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అని మాట ఇచ్చి ఆ మాటను సీఎం కేసీఆర్ తప్పడం వల్లే, పిల్లల చదువుల కోసం మహిళలు అప్పులు చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పుడు వైద్యానికి తోడు, బతికేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మహిళా సాధికారతా..? ఆడవాళ్లు అప్పులు చేస్తే గానీ ఇళ్లు గడవలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉందన్నారు. ఇదేనా సంక్షేమం, ఇదేనా మహిళా సాధికారతా.. ముఖ్యమంత్రి ఆలోచన చేయాలన్నారు. మహిళలంటే సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ చులకనేనని అందుకే వారికి పదవులు ఇవ్వరన్నారు. ఒకవేళ వాళ్లు తిరగబడితే తెలంగాణ తల్లి సాక్షిగా వారిపై దాడులు చేసి అవమానిస్తారని వాపోయారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్ల, చేతగాని తనం వల్ల 10 లక్షలకు పైగా మహిళలు అప్పుల పాలయ్యారని, డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ‘గత మూడేళ్లుగా మహిళా సంఘాల రుణాల వడ్డీలకు ఎగనామం పెడుతున్నారు. ఆ వడ్డీ భారం కూడా అక్కచెల్లెమ్మల మీదే పడుతుంది. ఆ వడ్డీ, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇది కేసీఆర్ ప్రభుత్వ కనీస బాధ్యత’ అని అన్నారు. చదవండి: కరోనా కాలం: మరీ 70 వేల రూపాయలా?! సాకులతో సరి.. సీరియస్‌నెస్ లేదు మరి! -
ఆరోగ్యశ్రీలో చేరిస్తే నష్టమేంటి కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్‌ను దిక్కుమాలిన పథకంగా గతంలో వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్, ఇప్పుడు అదే స్కీంలో రాష్ట్రాన్ని ఎలా చేర్చారని, అసలు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరిస్తే ఆయనకు వచ్చే నష్టమేంటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటిపోయాక ఇప్పుడు ఆయుష్మాన్ భారత్‌లో చేరిస్తే పేదలకు ఎలా న్యాయం జరుగుతుందని నిలదీశా రు. గురువారం సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌లతో కలిసి జూమ్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దేశంలో ఈ వైరస్ ప్రవేశించిన నాటి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఎప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పినప్పటికీ, ప్రణాళిక లేని కేంద్ర ప్రభుత్వం, ప్రజలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే కేసుల సంఖ్య పెరుగుతుందనే ఆలోచనతోనే ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. శుక్రవారం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామగ్రామాన కరోనా బాధితులకు సాయం చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 50 మందికి మాస్కులు పంపిణీ చేయాలని, కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భోజన ఏర్పాట్లు చేయడంలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనా లని కోరారు. సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ వల్ల ఉపయోగం లేదని చెప్పిన కేసీఆర్ మళ్లీ అందులోనే చేరారని, ఏ పథకంలో చేరినా తమకు అభ్యంతరం లేదని, కానీ కరోనా చికిత్సను మాత్రం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోనికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎందుకు నిలిచిపోయిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులతో లాలూచీ: జీవన్‌రెడ్డి కరోనా చికిత్స విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడానికి తీసుకొచ్చిన జీవో అమలు కాకపోవడానికి ఆ ఆసుపత్రులతో ప్రభుత్వం లాలూచీ పడటమే కారణమని ఆరోపించారు. పీపీఈ కిట్ కూడా లేకుండా కేసీఆర్ గాంధీ ఆసుపత్రిలోని కరోనా వార్డును సందర్శించారా అని జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రావణ్ మాట్లాడుతూ, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ప్రభుత్వం ఎందుకు సమీక్షించడం లేదని, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ ఏమైందని ప్రశ్నించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సామాజిక భద్రత కల్పించాలని శ్రావణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
‘ఆయుష్మాన్ భారత్’తో పేదలకు అన్యాయమే
సాక్షి, హైదరాబాద్: ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేసేందుకు ఉన్న నిబంధనల దృష్ట్యా పేదలందరికీ ఉచిత వైద్యం అందే అవకాశం లేదని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారానే పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుతాయని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బుధవారం ఆమె బెంగళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, దీనివల్ల రాష్ట్రంలో కేవలం 26 లక్షల 11 వేల కుటుంబాలు మాత్రమే లబ్ధిపొందే అవకాశం ఉందని, ప్రభుత్వ నిర్ణయంతో మిగతా వారికి వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సంవత్సరానికి ఒక కుటుంబం గరిష్టంగా రూ. 5 లక్షల వరకే లబ్ధిపొందే అవకాశం ఉందని, గరిష్ట పరిమితి దాటిన పక్షంలో పేదలపై ఆర్థిక భారం తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్‌లో 1,350 వ్యాధులకు చికిత్స లభిస్తుండగా, అందులో లేని 540 వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స లభిస్తుందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి పూర్తిగా ఆయుష్మాన్ భారత్‌నే అమలు చేస్తారనే అనుమానం కలుగుతోందన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు చికిత్సలు నిరాకరిస్తున్న సందర్భాలు చూస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ అమలుతో ఇక కేంద్రం నుంచి ఎప్పటికి నిధులు వచ్చేనని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఒక పటిష్ట వ్యవస్థ ఉందని, ప్రభుత్వం పేదల వైద్యం విషయంలో తప్పించుకునే వైఖరిని మానుకుని, తక్షణం కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చి రాష్ట్రంలోని 80 లక్షల పేద కుటుంబాలకు భరోసా కల్పించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. -
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్
-
బ్లాక్ ఫంగస్‌పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
-
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఇప్పటికే కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తాజాగా బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడండంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, కోవిడ్ నుంచి కోలుకున్న వారు బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. -
ఆరోగ్యశ్రీలోకి 'బ్లాక్ ఫంగస్'
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. దీనికోసం అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోనూ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోనూ వైద్యం చేసే విధంగా ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదైనా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కొన్నింటిని కేంద్రం కేటాయించిందని, మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ టెండర్స్ నిర్వహించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. కోవిడ్‌తో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం రూ. 10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కర్ఫ్యూ తర్వాత రెండు జిల్లాల్లో కేసులు తగ్గాయని, మరికొన్ని జిల్లాల్లో నిలకడగా ఉన్నాయని, అందుకే ఈ నెల 31 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని సీఎం నిర్ణయించారని వివరించారు. ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటివరకూ 91 వేల మందికి జ్వర లక్షణాలున్నట్టు గుర్తించామని, వీరి ఆరోగ్యంపై రోజువారి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 67 శాతం మంది బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. కోవిడ్ విధుల్లోకి 17,901 మంది సిబ్బందిని తీసుకున్నామని, అవసరమైతే మరింత మందిని నియమిస్తామని సింఘాల్ వెల్లడించారు. ఆక్సిజన్ వృథా కాకుండా నేవీ బృందాలు చేస్తున్న సాయం అభినందనీయమన్నారు. సీమ జిల్లాల్లో 7 కేసులు రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిపైనా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఈ పరిశీలన జరుగుతోంది. కేసులకు సంబంధించి ఇప్పటికే నిపుణుల అభిప్రాయాలతో చికిత్సలు చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మ్యుకర్ మైకోసిస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయినా సరే దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. -
ఆరోగ్య శ్రీలో బ్లాక్ ఫంగస్ చికిత్స: ఆళ్ల నాని
సాక్షి, విజయవాడ: కోవిడ్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం’’ అన్నారు. చదవండి: కరోనా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య శ్రీ పథకం సంజీవనీ -
కోవిడ్‌కు పెట్టిన ఖర్చు రూ.2,229 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ కరోనా నియంత్రణ కోసం 2,229 కోట్ల పైచిలుకు వ్యయమైంది. అత్యాధునిక మౌలిక వసతుల కల్పనతో పాటు కోవిడ్ కేర్ కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ల నిర్వహణ, వాటికి కావాల్సిన కిట్లు, మందులు, రసాయనాలు.. తదితరాలకు భారీగా ఖర్చుపెట్టాల్సి వచ్చింది. విచిత్రమేంటంటే 2020 ఫిబ్రవరి 15 నాటికి మన రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతం 14 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి వరకూ కొద్ది రోజుల పాటు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి నమూనాలు పంపించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో రోజుకు దాదాపు లక్ష టెస్టులు చేసే సామర్థ్యానికి ల్యాబ్‌లు చేరుకున్నాయి. గతేడాది అంటే మొదటి వేవ్‌లో 18 వేల మంది సిబ్బందిని నియమించగా.. సెకండ్ వేవ్‌లో 19 వేల మందికి పైగా సిబ్బంది నియామకానికి ఆమోదం వచ్చింది. ఇప్పటికే 18 వేల మంది విధుల్లో చేరారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన మొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. -
కరోనా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య శ్రీ పథకం సంజీవనీ
సాక్షి, అమరావతి: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా కరోనా చికిత్సను ప్రభుత్వం కల్సిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చిన విషయం తెలిసిందే. కాగా గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ తో సుమారు లక్షా 11వేల 266 మందికి కరోనా చికిత్సను ఉచితంగా అందించారు. కరోనా ట్రీట్మెంట్కు ఇప్పటివరకు రూ.332 కోట్ల 41 లక్షలు పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనాకు ఉచిత వైద్యం అందిస్తోంది. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల ఇతర రాష్ట్రాల్లోనూ ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. దక్షిణాదిలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు: కేంద్రం దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.రోజు లక్షలాదిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశం మొత్తంలో 36 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. కాగా దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని కేంద్రం స్ఫష్టం చేసింది. రాష్ట్రాల్లో నెలకొన్న ఆక్సిజన్ సమస్యను ఈనెలాఖరులోగా పరిష్కరిస్తామని తెలిపింది.రాష్ట్రాల్లో 70:30 నిష్పత్తిలో సెకండ్, తొలి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియగా కొనసాగాలని కేంద్రం రాష్ట్రాలకు విన్నవించింది. చదవండి: Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే.. -
YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించి కరోనా కట్టడికై విశేష కృషి చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న వేళ.. రాష్ట్రంలో కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందిస్తూ ముందంజలో నిలుస్తోంది. కరోనా కష్టకాలంలో ప్రజలు చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చారు. ప్రభుత్వ జాబితా (ఎంప్యానెల్)లో ఉన్న అన్ని ఆస్పత్రులలో కోవిడ్ పేషెంట్లకు బెడ్లు ఏర్పాటు చేసి, ఉచిత వైద్యం అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు ఇబ్బందులు పడకుండా చిరునవ్వుతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లేలా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, ఎంప్యానెల్ లేని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కూడా పూర్తిస్థాయి కోవిడ్ చికిత్స అందించాలన్న సీఎం జగన్.. ఆదే విధంగా ప్రైవేటు ఆస్పత్రులో ప్రభుత్వం విధించిన రేట్లకు మాత్రమే కరోనా చికిత్స చేయాలని ఆదేశించి ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ప్రైవేటు ఆస్పతులు కరోనా పెషెంట్ల వద్ద అధిక మొత్తంలో ఫిజులు వసూలు చేస్తే చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశించి, ప్రైవేటు దోపిడీని అరికట్టేందుకు సమాయత్తమయ్యారు. కరోనా విపత్తు సమయంలో చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులను మూసివేసే అధికారం కూడా ఇస్తున్నట్లు తెలిపిన ఆయన, ప్రజారోగ్యమే ధ్యేయంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. చదవండి: ఏపీ: కోవిడ్ చికిత్సకు మరింత ఇద్దాం.. -
‘జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులకు వరం’
-
‘సీఎం జగన్ మీది ఏ పార్టీ.. ఏ మతం అని చూడడు’
సాక్షి, విజయవాడ: నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 50 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు 29,75,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష, సునీత, అనిత, లక్ష్మీ పతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ చూడం మతం చూడం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు సీఎంఆర్ఎఫ్పై పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించాం’’ అని తెలిపారు. ‘‘సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తెచ్చాం. ఆస్పత్రి ఖర్చు1000 రూపాయలు దాటిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్‌లో బకాయిలు లేకుండా చూస్తున్నాం. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
అధికారులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయించండి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల సేవల్లో లోపాలపై సంబంధిత అధికారులకు ముందుగా ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకపోతే కోర్టును ఆశ్రయించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని కట్టడి చేసేలా, వాటి పనితీరులో జవాబుదారీతనం పెంచేలా నిబంధనలు రూపొందించేందుకు నిపుణులతో కమిటీ వేయాలంటూ జర్నలిస్టు కాజీపేట నరేందర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. 2016లో నరేందర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఓ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన సోదరి మృత్యువాతపడ్డారని, ఇలా మరొకరికి జరగకుండా ఉండాలంటే నిపుణులతో కమిటీ వేసి కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరులో జవాబుదారీతనం పెంచాలని కోరారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. తమ వాదనను రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ సమర్థించారని పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్ నివేదించారు. అయితే ముందు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోతే తిరిగి పిటిషన్ దాఖలు చేసుకునేలా స్వేచ్ఛనిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆరోగ్యశ్రీ పథకం అమలులో లోపాలు ‘‘రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం అమలును పరిశీలించేందుకు 2009లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశాం. ఆరోగ్యశ్రీ కింద చేరే రోగులకు కన్సల్టేషన్ ఫీజు తీసుకోరాదని నిబంధనలు చెబుతున్నా తీసుకుంటున్నాయి. బయట ప్రైవేట్ ల్యాబ్స్‌లో స్కానింగ్ పరీక్షలు చేయించుకొని రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. ఉచితంగా రవాణా కల్పించడంలేదు. ఉచితంగా మందులు ఇవ్వడంలేదు. ఆరోగ్యశ్రీలో నిర్దేశించిన ఫీజులకన్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ మొత్తాన్ని రోగుల నుంచి వసూలు చేశాయి. శస్త్రచికిత్స తర్వాత వైద్యసహాయం అందివ్వాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ రూ.14 వేల స్టంట్స్‌ను వేసి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.30 వేలు తీసుకున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డబ్బు కడితేనే రోగులను చేర్చుకుంటామంటూ ఒత్తిడి చేస్తున్నాయి. మరో ఆసుపత్రి అయితే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకొని అదనంగా మరో రూ.40 వేలు రోగి నుంచి వసూలు చేసింది. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి’’అని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది తన కౌంటర్లో వివరించారు. ( చదవండి: జూబ్లీహిల్స్‌లో దారుణం: చంపి ఫ్రిజ్‌లో పెట్టారు ) -
8 గంటల్లో ఆరోగ్యశ్రీ కార్డు
తెర్లాం (బొబ్బిలి): గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంగా మారింది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణికి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం కావడంతో అత్యవసరంగా రూపొందించి 8 గంటల వ్యవధిలో నేరుగా ఆస్పత్రికి రాత్రి 11 గంటల సమయంలో అందించిన ఉద్యోగులు అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాలివీ.. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన పైల ధనలక్ష్మి ప్రసవం కోసం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కేర్ ఆస్పత్రిలో గురువారం ఉదయం చేరింది. ఆమెకు ప్రసవం చేసేందుకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరమని, దానిని వెంటనే తీసుకురావాలని అక్కడి వైద్యులు తెలిపారు. ధనలక్ష్మికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కుటుంబ సభ్యులు విజయరాంపురం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసి పరిస్థితిని సచివాలయ అధికారులకు తెలియజేశారు. స్పందించిన డిజిటల్ అసిస్టెంట్ కె.రామ్మోహన్ ఆరోగ్యశ్రీ కార్డును 8 గంటల వ్యవధిలో మంజూరు చేసి, దానిని గ్రామ వలంటీర్ వెంకటరమణతో కలిసి గురువారం రాత్రి 11 గంటల సమయంలో రాజాంలోని కేర్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లి గర్భిణికి అందజేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న సచివాలయ అధికారులు, సిబ్బందికి ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీవో శంబంగి రామకృష్ణ సచివాలయ సిబ్బందిని అభినందించారు. -
చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు
కొత్తూరు: క్యాన్సర్‌తో బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరైంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఓండ్రుజోలకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి వైద్యం కోసం తల్లిదండ్రులు గెల్లంకి రవికుమార్, సుధారాణిలు నానా అగచాట్లుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వలంటీర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రుల ఈకేవైసీ కోసం వలంటీర్ బెంగళూరు వెళ్లి ఈ నెల 14న తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలిముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. అనంతరం శనివారం ఆరోగ్యశ్రీకార్డు మంజూరు కావడంతో దానిని చిన్నారి తాతయ్య చలపతిరావుకు అందించారు. ఆరోగ్యశ్రీ కార్డు మంజూరైన విషయాన్ని తెలుసుకున్న బెంగళూరులోని చిన్నారి తల్లిదండ్రులు సంతోషంతో వలంటీర్‌కు, గ్రామ సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ మనువడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు తీసుకెళుతున్నట్టు చలపతిరావు చెప్పారు. -
చిన్నారి కోసం శ్రీకాకుళం నుంచి బెంగళూరుకు..
కొత్తూరు: గెల్లంకి రవికుమార్, సుధారాణిలది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రుజోల గ్రామం. అయితే కొద్ది రోజుల కిందట ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. అంతలో తమ రెండున్నరేళ్ల చిన్నారికి క్యాన్సర్ అని తెలిసింది. అక్కడే బిడ్డకు వైద్యం చేయిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.3.5 లక్షల అప్పులు చేశారు. అవి సరిపోలేదు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇక తమ బిడ్డను ఆదుకునేది ‘ఆరోగ్యశ్రీ’ మాత్రమేనని నమ్మి ఓండ్రుజోలలోని తమ వలంటీర్ బరాటం నరసింగరావుకు ఫోన్ ద్వారా విషయం చెప్పారు. తల్లిదండ్రులు ఈకేవైసీ చేయిస్తేనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందని వలంటీర్‌వారికి చెప్పడంతో.. తమ బిడ్డ ప్రమాదకర స్థితిలో ఉన్నాడని, ఈ పరిస్థితుల్లో ఊరికి రావడం తమకు అసాధ్యమని వారు కన్నీటి పర్యంతమయ్యారు. వారి దుస్థితికి చలించిపోయిన వలంటీర్ బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 13వ తేదీన ఒండ్రుజోల నుంచి బయల్దేరి వెళ్లాడు. బెంగళూరులోని సెయింట్ జాన్సన్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న చిన్నారి వద్దకు 14వ తేదీన చేరుకుని, తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలి ముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. ఇక ఆరోగ్య శ్రీ కార్డు మంజూరవుతుందని, సంక్రాంతి సెలవుల తర్వాత కార్డు ముద్రించి ఇస్తామని భరోసా ఇచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ చిన్నారి కోసం బెంగళూరు వచ్చిన వలంటీర్‌కు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. వలంటీర్ మానవత్వాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. -
‘ఆయుష్మాన్’తో ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం చేయించు కునేందుకు మన రాష్ట్ర పేదలకు వెసులుబాటు కలగనుంది. దీని ద్వారా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికొచ్చి వైద్యం పొంద డానికి అవకాశం ఏర్పడనుంది. కేంద్రం ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీ కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ పథకాలను అనుసంధానం ఎలా చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండింటినీ అమలు చేసేలా పథకాన్ని ఆధునీకరించే అవకాశముంది. ఆయుష్మాన్ పథకం రాష్ట్రంలో ప్రవేశపెట్టినా ఆరోగ్యశ్రీ పథకం కూడా దానితోపాటు అమలయ్యే అవకాశముంది. చదవండి: (రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్) ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో 77.19 లక్షల కుటుంబాలు అర్హులుగా ఉండగా, ఆయుష్మాన్ పథకంలోకి రాష్ట్రంలో 26.11 లక్షల కుటుంబాలు మాత్రమే వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆయుష్మాన్ భారత్ అమలుతో ఆరోగ్యశ్రీ పరిధిలో లేని దాదాపు 400కిపైగా చికిత్సలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు రూ.780 కోట్ల మేరకు ఖర్చుచేస్తోంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా రూ.2 లక్షలు పరిమితి ఉండగా, కొన్ని జబ్బులకు రూ.18 లక్షల వరకూ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. 946 చికిత్సలను ఈ పథకం కింద పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు ఆయుష్మాన్ భారత్‌లో ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకూ కేంద్రం ఖర్చు చేస్తుంది. 1,350 రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీలో లేనివి, ఆయుష్ వైద్య సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకం పరిధిలోకి ఇటీవలే కరోనా చికిత్సలను చేర్చడంతో ఆయా బాధితులకు కొంతమేరకు ఊరటగా ఉంటుంది. ఆరోగ్యశ్రీలో కిడ్నీ, లివర్, బోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటివి చేయడంతోపాటు జీవితకాలం మందులు వంటివి కూడా ఇస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ, ఆయుష్మాన్ భారత్‌లో ఇటువంటి వసతులు లేవు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలైతే రాష్ట్రానికి దాదాపు రూ. 250 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్యాకేజీ ధరలు పెంచాలంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీ కంటే ఆయుష్మాన్ భారత్ ప్యాకేజీలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రైవేట్ ఆసుపత్రులు అంటున్నాయి. అందువల్ల ప్యాకేజీ ధరలను పెంచకుండా చికిత్స చేయడం కష్టమని పేర్కొంటున్నాయి. వాస్తవంగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీలనే పెంచాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను యథాతథంగా అమలు చేస్తూనే, కొత్త చికిత్సలకు ఆయుష్మాన్ భారత్ ధరలను పర్తింపజేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తుంది. అందుకు సంబంధించి త్వరలో ఉమ్మడిగా మార్గదర్శకాలను జారీ చేసే అవకాశముంది. -
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకంతో కలిపి అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వయంగా తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరైన సీఎస్.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను ఆరోగ్యశ్రీతో కలిపి అమలు చేయనున్నట్టు నివేదించారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తదితర అధికారులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు
సాక్షి, అమరావతి : వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్‌లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో డిసెంబర్ 10 నాటికి ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య మిత్రలకు శిక్షణ కార్యక్రమం కూడా ముగించాలని చెప్పారు. హెల్ప్ డెస్కులలో ఆరోగ్యమిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్ఓపీ ఖరారు చేయాలని సూచించారు. ‘హెల్్ప డెస్క్‌లలో ఎందుకు కూర్చున్నాము? ఏం చేయాలి? తనపై సీసీ కెమెరా నిఘా ఎందుకు ఉంది? తాను రోగులకు ఏ రకంగా సహాయం చేయాలి?’ అన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు. అస్పత్రులలో 9,800 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5,797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 25న జగనన్న తోడు - జగనన్న తోడు పథకం నవంబర్ 25న ప్రారంభం అవుతుంది. వీధుల్లో చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు, వారికి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం ఇస్తాం. వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు కడుతుంది. - ఈ పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్ అయ్యాయి. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలి. ఈ నెల 24వ తేదీలోగా బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని కలెక్టర్లు పూర్తి చేయాలి. జాతీయ ఉపాథి హామీ పనులు - జాతీయ ఉపాథి హామీ పనులు బాగా జరుగుతున్నాయి. ఇంకా కొన్నింటిపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. దాదాపు రూ.150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారంలో జరుగుతున్నాయి. - అయితే కేవలం రూ.150 కోట్లు మాత్రమే బకాయి ఉండగా, ‘ఈనాడు’ పూర్తిగా తప్పుడు వార్తలు రాస్తోంది. గ్రామాల్లో పనులకు ఎవ్వరూ రాకుండా కుటిల ప్రయత్నం ఇది. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తోంది. ఇవి సకాలంలో పూర్తి కావాలి - గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి కావాలి. - బీఎంసీయూల నిర్మాణానికి సంబంధించి ఆర్బీకేల పక్కనే భూములు ఇచ్చేలా చూడండి. ఈ నెల 30 నాటికి స్థలం ఇవ్వడంతో పాటు, అన్నీ మంజూరు చేయాలి. వచ్చే నెల 15 నాటికి తప్పనిసరిగా పనులు మొదలు కావాలి. - ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలి. సకాలంలో అవి పూర్తి చేస్తే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు వస్తాయి. అన్ని పనుల్లో గ్రామ, సచివాలయాల్లో ఉన్న గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. నాడు-నేడు (స్కూళ్లలో) - నాడు-నేడు కింద తొలి దశలో 15,715 స్కూళ్లలో పనులు చేపట్టగా, 78 శాతం పూర్తయ్యాయి. డిసెంబర్ 31 టార్గెట్‌గా పనులు పూర్తి చేయాలి. దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. బాత్రూమ్ల శ్లాబ్ వంటి పనులు జరగాల్సిన 262 చోట్ల అవసరమైన ఇసుక, సిమెంటు సరఫరా చేయాలి. - పేరెంట్ కమిటీలపైనే పూర్తి భారం వేయకుండా జేసీలు బాధ్యత తీసుకుని ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలి. జగనన్న విద్యా కానుక - పిల్లలకు కిట్ ఇచ్చాం. అందులో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని సరిచేయండి. నాణ్యతపై పూర్తి దృష్టి పెట్టాలి. పిల్లలు ఎవరికైనా షూ సైజ్ సరిపోకపోయినా, లేక పెద్దగా అయినా తెలుసుకోండి. ఆ మేరకు ప్రతి స్కూల్లో నోటీసులు పెట్టి, పూర్తి వివరాలు సేకరించండి. - పిల్లలను వాటిని స్కూల్‌కు స్వయంగా తీసుకురమ్మని చెప్పి, అక్కడే పరిష్కారం చూపాలి. ఒక వేళ బ్యాగ్ ఎలా ఉందో చూడండి. చినిగిపోతే క్వాలిటీ పెంచాలి. పిల్లలకు అది ఒక ప్యాషన్. వారు బాగా చదువుకోవాలి. కాబట్టి కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రత్యేక శ్రద్ధ చూపాలి. - పిల్లలకు మూడు జతల యూనిఫామ్ కుట్టుకూలీ తల్లుల ఖాతాలో పడుతుందా? లేదా? అన్నది కూడా చూడాలి. వచ్చే సోమవారం నుంచి ఈ కార్యక్రమం జరగాలి. అంగన్వాడీ కేంద్రాలు (వైఎస్సార్ ప్రిప్రైమరీ స్కూళ్లు) - రాష్ట్రంలో 27,543 అంగన్వాడీలు అద్దె భవనాల్లో ఉన్నాయి. సొంత భవనాల నిర్మాణం కోసం 22,630 స్థలాలు గుర్తించారు. - ఊరిలోకి రాగానే సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఆర్బీకే, ప్రిప్రైమరీ స్కూల్.. ఇలా అన్నీ కనిపిస్తాయి. అంత చక్కటి పరిస్థితి మీరు చేశారంటే, మీ హయాంలో జరిగిందని అందరూ చెప్పుకుంటారు. అలా మీరు గుర్తుండిపోతారు. కాబట్టి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లు - వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు భవిష్యత్తులో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి. వాటిలో హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. ఆశా వర్కర్లు కూడా ఉంటారు. ఏ నిర్మాణంలో అయినా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. జేసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ - ఏ పంట అయినా అమ్ముడుపోకుండా ఉంటే, దానిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తూ గ్రామ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందాం. - ఆర్బీకేల స్థాయిలో 5,812 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటిలో వివిధ పంటలకు సంబంధించి 4,29,481 మంది రైతులు ఆర్బీకేల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, రాగి తదితర పంటలకు సంబంధించి రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. - ఆర్బీకేల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 15 రోజుల లోపలే ధాన్యం కొనుగోలు చేయాలి. అంత కంటే ఆలస్యం చేయొద్దు. రైతుల వివరాలు, సేకరణ వివరాలు ఆర్బీకేల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలి. - ధాన్యం సేకరించిన 15 రోజుల్లో తప్పనిసరిగా పేమెంట్లు జరగాలి. రైతుల పట్ల అందరూ మానవతా దృక్పథంతో ఉండాలి. ధాన్యం సేకరణలో ఈ-ప్రొక్యూర్మెంట్ తప్పనిసరి. ఎక్కడా మన రైతులకు నష్టం జరగకూడదు. ఎఫ్ఏక్యూ రిలాక్స్ - వేరుశనగ రైతుల కష్టాలు తీర్చేందుకు కనీస నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్ఏక్యూ) లేని పంటకు కూడా గ్రేడెడ్ ఎమ్మెస్పీ రూ.4,500 ప్రకటించాం. ఆ మేరకు ఎఫ్ఏక్యూలో మినహాయింపులు ఇచ్చాం. దీన్ని అన్ని ఆర్బీకేల వద్ద బాగా ప్రచారం చేయాలి. రబీ సాగు.. సన్నద్ధత - రబీ సీజన్‌కు ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిలలో అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అవసరం ఎంత అన్నది చూసి, వాటి లోటు లేకుండా చూడాలి. అన్నింటిలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కలెక్టర్లు, జేసీలు స్వయంగా మానిటర్ చేస్తే తప్ప సమస్యలు తెలియవు. వాటిని పరిష్కరించలేరు. - వ్యవసాయ సలహా మండళ్లు కూడా ఉన్నాయి. అవి ప్రతి శుక్రవారం సమావేశమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో అవి నివేదికలు ఇస్తున్నాయి. వాటిని జేసీలు మండల వ్యవసాయ అధికారి ద్వారా చూడాలి. ఆ మేరకు అన్నీ స్వయంగా పర్యవేక్షించాలి. - సీఎం-యాప్, ఈ-క్రాప్ డేటా నమోదు, వినియోగం ఎలా సాగుతోందని చూడాలి. కాబట్టి జేసీలు, కలెక్టర్లు తప్పనిసరిగా సచివాలయాలు, ఆర్బీకేలు సందర్శించాలి. ఈ-క్రాప్ డేటా ఆధారంగా, గ్రామంలో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయా? లేవా? అన్నవి చూడాలి. గుర్రపు డెక్క తొలగించాలి - ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గుర్రపు డెక్కతో కాలువలు పూడుకు పోయాయి. వాటిని తొలిగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలి. పోలవరం కాఫర్ డ్యామ్ పనులు జరుగుతాయి కాబట్టి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ 1 తర్వాత నీటి సరఫరా ఆగిపోతుంది. - అందువల్ల డిసెంబరు 31లోగా రబీకి సంబంధించి వరినాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలి. ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ, ధ్యాస పెట్టాలి. అందుకోసం రైతులతో మాట్లాడాలి. ఆ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు కూడా చొరవ చూపాలి. -
ఆరోగ్య శ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స
సాక్షి, అమరావతి: కోవిడ్ చికిత్సలను తొలిసారి ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి చికిత్సలందించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిన ఏపీ.. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ చికిత్సలనూ(కోవిడ్ సోకి కోలుకున్నాక వచ్చే దుష్పరిణామాలు) ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించి ప్రయివేట్ ఆస్పత్రులు ఎంత ధరలు వసూలు చేయాలో కూడా స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించామన్నారు. కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ స్కీంని కొత్తగా ప్రవేశ పెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ స్కీంను తక్షణమే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు ఆళ్ల నాని పేర్కొన్నారు. ధరలు ఇలా ఉన్నాయి ► ఆక్సిజన్, సీపాప్, బైపాప్‌తో చికిత్స అందిస్తూ.. ఐసొలేషన్ వార్డు/ఐసీయూ రెంటు, అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, నర్సింగ్, పర్యవేక్షణలన్నీ కలిపి రోజుకు రూ.900 ► కన్సల్టేషన్ చార్జీల కింద రూ.400 ► మందులు, నిర్ధారణ పరీక్షలకు రూ.700 ► ఆక్సిజన్, నెబులైజేషన్ చార్జీలు రూ.500 ► పోషకాహారానికి రూ.200 ► వైరస్ సోకకుండా డిస్ ఇన్ఫెక్షన్ చేసేందుకు రూ.230 ► రోజుకు రూ.2,930 వరకూ చెల్లిస్తారు. -
లోకం చూడకముందే కళ్లు మూస్తున్నారు
‘నల్లగొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన సుజాత నాలుగు రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. బిడ్డను తీసుకుని ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రికిచేరుకున్నారు. అయితే ఉదయం వరకు బిడ్డను ఎవరూ పట్టించుకోలేదు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది. రెండు రోజుల క్రితం బండ్లగూడకు చెందిన రాగిణి పేట్లబురుజు ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. కడుపులో ఉండగా ఉమ్మనీరు తాగడంతో బిడ్డను చికిత్స కోసం నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో శిశువు మృతి చెందింది‘. ఇలా ఒక్క సుజాత, రాగిణిల బిడ్డలే కాదు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకుంటున్న అనేక మందికి ఇదే అనుభవం ఎదురవుతుంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం..సకాలంలో వైద్యం అందకపోవడంతో అనేక మంది శిశువులు మృత్యువాతపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ బకాయిలు పేరుకపోవడంతో ఇటీవల ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బాధితులకు చికిత్సలను నిరాకరిస్తుండటంతో వారంతా నిలోఫర్‌ను ఆశ్రయిస్తున్నారు. సీరియస్ కండిషన్లో వస్తున్న రోగుల సంఖ్య ఇటీవల రెట్టింపైంది. ఆస్పత్రిలో వీరికి ఆశించిన స్థాయిలో వైద్యం అందకపోవడం, చికిత్సల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతోంది. ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, సరిహద్దులోని మహారాష్ట్ర, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తుండటం, నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించడం, పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడం, అవయవాల నిర్మాణం సరిగా లేకపోవడం, ఉమ్మనీరు మింగడం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో నిత్యం 1200 మంది చిన్నారులు చికిత్స పొందుతుంటారు. నిజానికి 2014తో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ (ఎమర్జన్సీ వార్డు)వచ్చాక అదనంగా మరో 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లు, వెంటిలేటర్లు, ఆల్ట్రా సౌండ్, ఎక్సరే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వైద్యపోస్టులు కూడా చాలా వరకు భర్తీ అయ్యాయి. మౌలిక సదుపాయాల పెంపు తర్వాత మరణాల రేటు తగ్గాల్సిందిపోయి...ఏటా మరింత పెరుగుతుండటం తల్లిదం డ్రులకు తీవ్ర ఆందోళన కలి గిస్తుంది. సంరక్షకులే నర్సుల అవతారం.. ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాలి. కానీ ఆస్పత్రిలో 130 మందే ఉన్నారు. 200 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 75 మంది, జనరల్ వార్డులో ప్రతి ఐదుగురు శిశువులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, యాభై మందికి ఒకరు, ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లో ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, ఇరువై మందికి ఒక నర్సు మాత్రమే ఉంది. ప్రతి వెంటిలేటరుకు కనీసం నాలుగు రౌండ్లకు కలిపి కనీసం నలుగురు నర్సులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పని చేస్తున్న పదిహేడు వెంటిలేటర్లకు కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు ఆస్పత్రిలో సరిపడా నర్సులు లేకపోవడంతో ఆ బాధ్యత కూడా సంరక్షకులే నిర్వహించాల్సి వస్తోంది. వీరంతా కాళ్లు చేతులు శుభ్రం చేసుకోకుండా పాదరక్షలతోనే వార్డుల్లోకి వెళ్తున్నారు. ఆసుపత్రికి ప్రస్తుతం 289 మంది నర్సుల అవసరం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం మూడేళ్ల క్రితం జీవో నెంబరు 88 ప్రకారం ఆ పోస్టులు మంజూరు చేసి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమాకాలు చేపట్టారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తల్లిదండ్రులకు తప్పని గుండె కోత.. హృద్రోగ సమస్యలతో నిత్యం 100 మంది వరకు శిశువులు వస్తుంటారు. వీరికి ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేయాలి.ఆస్పత్రిలో ఈ మిషన్లు లేక పోవడంతో రోగులను ఉస్మానియాకు తరలిస్తున్నారు. అప్పటికే అక్కడ రోగుల రద్దీ ఎక్కువ ఉండటంతో శిశువుల వైద్యపరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. న్యూరోసర్జరీ, న్యూరోఫిజీషియన్, నెఫ్రాలజీ, ఆర్ధో, కిడ్నీ వైద్య నిపుణులు లేకపోవడంతో ఆయా సమస్యలతో బాధపడుతున్న శిశువులను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే కీలక టెస్టులన్నీ కేవలం గంట వ్యవధిలోనే ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నా.. వాస్తవానికి అమలు కావడం లేదు. ఇన్ వార్డులతో పాటు క్యాజువాలిటీ, సర్జికల్, ప్రసూతి వార్డుల్లో సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, రాత్రి పొద్దుపోయిన తర్వాత వారు కన్పించడం లేదు. ఒక వేళ ఉన్నా రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కళ్లముందే కన్నబిడ్డ మృవాత పడుతుండటంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో వైద్యులపై దాడులకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
ఆరోగ్యశ్రీ కార్డుదారులకు షాక్
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగులకు ఓపీ సేవల్లో కోత విధించారు. ఇక్కడ అవుట్ పేషెంట్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటే 25 శాతం మేరకు ఆయా ఖర్చులను భరించాల్సిందే. సోమవారం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో 2 వేల రూపాయల వరకు రాయితీ కల్పిస్తున్నారు. ఇక మీదట ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం అర్హులైన రోగులకు వైద్య సేవలను అందించేందుకు యాజమాన్యం సమాయత్తమైంది. ఆస్పత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో ఓపీ సేవల్లో రాయితీలలో కోత విధించినట్టు సమాచారం. కోవిడ్–19 నేపథ్యంలో నిమ్స్‌లో కూడా ఉద్యోగులకు జీతాలను చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిమ్స్ ఆస్పత్రికి ఈ ఆరు నెలల్లో రూ. 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. సాధారణంగా నిమ్స్‌కు రోగుల నుంచి క్యాష్ కలెక్షన్స్ ద్వారా నెలకు రూ.8.5 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ లాక్డౌన్ కారణంగా ఆస్పత్రికి రూ. 2.5 కోట్ల వరకే ఆదాయం లభించింది. కాగా ఆస్పత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను చక్కదిద్దేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. ఆస్పత్రిలో క్యాష్ కలెక్షన్స్ గణనీయంగా పడిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దీంతో ఆరోగ్యశ్రీ ఓపీ సేవల్లో గతంలో వర్తింపచేసిన నిబంధనలనే అనుసరిస్తున్నామన్నారు. చదవండి: పోలీసు ఉద్యోగం.. విద్యార్థులకు శుభవార్త -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరు ప్రమాణాలు
ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్య మిత్రలను తప్పనిసరిగా వెంటనే నియమించాలి. ఆస్పత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు ఇక నుంచి గ్రేడింగ్ అమలు చేయాలి. ఆరోగ్య మిత్రలకు కూడా గ్రేడింగ్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా 15 రోజుల్లో పూర్తి కావాలి. కోవిడ్ ఆస్పత్రులు, ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అత్యంత నాణ్యతతో కూడిన వైద్య సేవలందాలి. దీనిపై వైద్య శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అన్ని ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం అమలవుతున్న మౌలిక వసతులు, అందుబాటులో వైద్యులు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్యమిత్రలు (హెల్ప్ డెస్క్).. ఈ ఆరు ప్రమాణాలు ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లోనూ కచ్చితంగా అమలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాణాలు పాటించని ఆస్పత్రులకు కొంత సమయం ఇవ్వాలని, అప్పుడు కూడా అవి మారకపోతే ప్యానెల్ నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. కోవిడ్ నివారణ చర్యలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు ఆరోగ్య మిత్రలు కీలకం ► రోగులకు వైద్యం అందేలా చూడటంలో ఆరోగ్య మిత్రలు కీలకం. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రల (హెల్ప్‌డెస్క్)ను నియమించారా? లేదా? వారెలా పని చేస్తున్నారు? అన్నది అధికారులు చూడాలి. ► ఒక రోగి ఆస్పత్రికి రాగానే ఆరోగ్యమిత్రలు వారి సమస్య తెలుసుకోవాలి. అక్కడ వారికి కావాల్సిన వైద్య సదుపాయం లేకపోతే ఏ ఆస్పత్రికి వెళ్లాలో సూచించి, అక్కడి వైద్యులతో మాట్లాడి.. రోగిని ఆ ఆస్పత్రిలో చేర్పించాలి. ► హోం ఐసొలేషన్‌లో ఉన్న వారితో ఏఎన్ఎంలు టచ్‌లో ఉండాలి. వారికి తప్పనిసరిగా మెడికల్ కిట్ అందించాలి. వైద్యులు కూడా వారితో టచ్‌లో ఉండి మెరుగైన సేవలందించాలి. 104కు మాక్ కాల్స్ తప్పనిసరి ► తమకు కోవిడ్ సోకిందని ఎవరైనా భావిస్తే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అన్నది అందరికీ తెలియాలి. అందుకు ఇప్పుడు మనకు 104 కాల్ సెంటర్ ఉంది. ► ఈ కాల్ సెంటర్ మరింత సమర్థవంతంగా పని చేయాలి. అధికారులు ఈ కాల్ సెంటర్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా మాక్ కాల్స్ చేయాలి. ఫోన్ చేసిన అర గంటలో బెడ్ కేటాయించాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందాలి. 15 రోజుల్లో గ్రేడింగ్ పూర్తి కావాలి ► వచ్చే 15 రోజుల్లో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవల ఆధారంగా గ్రేడింగ్ జరగాలి. ఆరోగ్యమిత్రల ఏర్పాటు, వారి సేవలను కూడా బేరీజు వేసి గ్రేడింగ్ ఇవ్వాలి. ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించకపోతే, వాటిని ప్యానల్ నుంచి తొలగిస్తామన్న మెసేజ్ వెళ్లాలి. ► ఐవీఆర్ఎస్ ద్వారా పొందుతున్న ఫీడ్ బ్యాక్, డేటా మేరకు, ఆ తర్వాత వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది చాలా ముఖ్యం. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీలో మార్పులు తెస్తున్నాం: ఈటల
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు తెస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లోపాలను సరిదిద్ది, ఆరోగ్యశ్రీలో రోగులను తిరస్కరించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన సోమవారం పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి మినహా అన్ని ఆస్పత్రుల్లో సాధారణ సేవలు మొదలైనట్లు చెప్పారు. కోవిడ్ డ్యూటీల్లో ఉన్నవాళ్లకు మాత్రమే క్వారంటైన్ సెలవులు వర్తిస్తాయని ఈటల తెలిపారు. కరోనా డ్యూటీల్లో లేని వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గిందని అయితే రానున్న బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఎవరి ఇంట్లో వాళ్లే నిర్వహించుకోవాలని లేకుంటే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే కరోనాను తరిమివేయవచ్చిని మంత్రి ఈటల పేర్కొన్నారు. -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు గ్రేడ్లు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. మూడు రకాలుగా గ్రేడ్లు పెట్టి, ఆ ప్రకారం ప్యాకేజీ ధరలను ఖరారు చేయాలని యోచిస్తోంది. ఏ, బీ, సీ గ్రేడ్లుగా ఆయా ఆసుపత్రులను విభజించే అవ కాశాలున్నాయి. ఆరోగ్యశ్రీలో సంస్కరణలు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తెచ్చేందుకు విధివిధానాలు తయారు చేయా లని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేం దర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. తద్వారా ఆరోగ్యశ్రీ, అలాగే ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాల (ఈజేహెచ్ఎస్) లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయిం చారు. సంస్కరణలపై మరోసారి నేడో రేపో సమావేశం కావాలని నిర్ణయించారు. గ్రేడ్లు.. మార్కులు.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 338 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో ఆరోగ్యశ్రీ కార్డు దారులు 77.19 లక్షల మంది ఉచితంగా వైద్యం పొందేందుకు వీలుంది. అలాగే ఈజేహెచ్ఎస్ కింద ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు లక్షలాది మంది వైద్యం పొందుతున్నారు. అయితే ఆరోగ్యశ్రీలోని ప్యాకేజీ ధరలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలన్న డిమాండ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆసుపత్రులను మూడు గ్రేడ్లుగా విభజించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. గ్రేడ్ ఏలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. గ్రేడ్ బీలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు.. గ్రేడ్ సీలో సాధారణ ప్రైవేట్ ఆసుపత్రులు వస్తాయి. ఈ గ్రేడ్లను ఖరారు చేయడానికి కొన్ని ప్రమాణాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఉన్న వైద్య వసతులు, అత్యాధునిక పరికరాలు, సదుపాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే సామర్థ్యం కలిగిన వైద్య నిపుణులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశముంది. వాటి ప్రకారం మార్కులు పెట్టి గ్రేడ్లు ఖరారు చేస్తారు. ఇటు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. మార్కులు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్యాకేజీలను ఖరారు చేస్తారు. అంతేకాదు వైద్య రంగంలో అనేక మార్పుల వచ్చాయి. అధిక ఖర్చయ్యే కేన్సర్, కిడ్నీ, కాలేయం వంటి శస్త్ర చికిత్సల విషయంలో అత్యాధునిక పరికరాలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ఔషధాల రేట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఇప్పుడు ప్యాకేజీ కూడా ఆ మేరకు తగ్గే అవకాశముందని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. ఇక కొన్ని రోగాలకు శస్త్రచికిత్స చేశాక ప్యాకేజీ ఖరారు చేసే సమయంలో వారం వరకు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం అది రెండు, మూడ్రోజులకే పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అనేక వ్యాధులకు చేసే శస్త్రచికిత్సల విషయంలో ఓ అంచనాకు రావాలని, నిపుణులతో చర్చించాక ప్యాకేజీ ధరలను ఖరారు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. అన్ని చికిత్సలూ చేయాల్సిందే.. అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఒకట్రెండు వ్యాధులనే ఆరోగ్యశ్రీలో చేర్చి వాటికే వైద్యం అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకుందాం.. అందులో గుండె, కేన్సర్, ఫల్మనాలజీ, ఊపిరితిత్తులు, న్యూరాలజీ వంటి పది రకాల వైద్య సేవలు చేసే అవకాశముంది. కానీ ఆ ఆసుపత్రి కేవలం లాభదాయకమైన ప్యాకేజీలు వర్తించే గుండె, కేన్సర్ చికిత్సలనే ఆరోగ్యశ్రీలో పేదలకు అందిస్తోంది. మిగిలిన చికిత్సలను చేయడం లేదు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తాజాగా చేయబోయే సంస్కరణల్లో భాగంగా అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వాటి వద్ద ఉండే అన్ని చికిత్సలనూ ఆరోగ్యశ్రీ కింద చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటి ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి అన్నింటిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశించనున్నారు. అలాగే కొత్తగా అనుమతులు పొందే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలని ఆదేశించనున్నారు. -
చంద్రబాబుకు కనిపించని అభివృద్ధి, సంక్షేమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్ నియంత్రణ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తుంటే చంద్రబాబుకు అవి కనిపించడంలేదని.. పైగా వాటిని వ్యతిరేకిస్తూ అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. అలాంటి చంద్రబాబు అడుగులకు ఆ రెండు పత్రికలు మడుగులొత్తుతున్నాయని.. ఇది దారుణమని ఆయనన్నారు. రోజుకు 70వేల టెస్టులు చేస్తున్నది బాబుకు తెలియదా.. వాస్తవాలను ప్రభుత్వం ప్రకటనల రూపంలో ఇచ్చినా వేయడం లేదంటే అవి ఎంతగా దిగజారాయో.. వాటి నైజం ఏమిటో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రంలో రోజుకో కుట్రకు తెరలేపుతూ చంద్రబాబు ప్రకటనలు చేయడం.. వాటిని ఈ పత్రికలు పతాక శీర్షికల్లో రాయడం సరైనది కాదు. ► చంద్రబాబు కోవిడ్ సమయంలో ఏ ఒక్క ఆస్పత్రినైనా సందర్శించారా? హైదరాబాద్ నుంచి జూమ్‌లో విమర్శలు చేయడమేమిటి? ► ప్రజలకు మనోధైర్యం కల్పించే పని ఒక్కటైనా చేశారా? ► ఒక్క ల్యాబొరేటరీ లేని పరిస్థితి నుంచి 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు తెచ్చినది బాబుకు తెలీదా.. స్వయంగా ప్రధానే ఏపీ చేస్తున్న పనులను ప్రశంసించారు. ► ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. ► ఆరోగ్యశ్రీ కింద బాబు పెట్టిన రూ.1,500 కోట్ల బకాయిలను చెల్లించాం. ► ఆరోగ్యశ్రీలో జబ్బుల సంఖ్యను పెంచాం.. కొత్తగా 16 వైద్య కళాశాలలను తెస్తున్నాం.. ఏజెన్సీల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నాయి. చంద్రబాబు అభద్రతా భావానికి లోనవుతున్నారు. -
ఆరోగ్యశ్రీలో సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడానికి, లీకేజీలు అరికట్టడానికి ఒక కమిటీ వేసి నివేదిక అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. పాత పద్ధతులను పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విధివిధానాలు తయారు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై బుధవారం మంత్రి ఈటల రాజేందర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. వివిధ జబ్బులకు చికిత్స విధానాలను, చెల్లిస్తున్న సొమ్మును ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలన్నారు. ఆరోగ్య శ్రీ జాబితాలోని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స చేయడానికి నిరాకరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అటువంటి ఆసుపత్రుల మీద ఫిర్యాదు చేయడానికి 104కి ఫోన్ చేయాలని ప్రజలకు మంత్రి సూచించారు. మోసం చేసే ఆసుపత్రుల మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రజాధనం వృ«థా కాకుండా చూడాలన్నారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు ఒక రోగి ఆరోగ్యశ్రీ కింద చేరితే ఇంటికి వెళ్లేంతవరకు పూర్తి ఉచితంగా చికిత్స అందించాలే తప్ప మంచి పరికరాలు వేస్తామని, మంచి రూమ్ ఇస్తామని కారణాలు చెప్పి ఆసుపత్రులు డబ్బులు వసూలు చేయకుండా చూడాలని మంత్రి ఈటల సూచించారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి విజిలెన్స్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. చికిత్స పొందిన వారి ఫీడ్‌బ్యాక్ తీసుకొని అవసరమైతే సంబంధిత ఆసుపత్రిని ఆరోగ్యశ్రీ జాబితా నుండి తొలగించాలన్నారు. ఆరోగ్యశ్రీ వార్డు అంటూ విభజన చేయకుండా అందరు రోగులతోపాటు చికిత్స అందించేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ జాబితాలో చేరడానికి దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ ఆసుపత్రులకు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తరువాతే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్లలో ఉండేవని, కానీ ఇప్పుడు కేవలం రూ.199 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని కూడా అతి త్వరలో చెల్లిస్తామన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య కార్డు ఉన్నవారికి ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. ఆరోగ్యశ్రీనే వంద రెట్లు మెరుగు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం 100 రెట్లు మెరుగైనదని మంత్రి ఈటల తెలిపారు. దానిలో లేని 517 చికిత్సలు మన ఆరోగ్యశ్రీలో ఉన్నాయన్నారు. పైగా ఇందులో 434 ఖరీదైన చికిత్సలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య పెంచాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స..ప్యాకేజీపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఆ పనిలో నిమగ్నమైంది. సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఉన్నత స్థాయిలో దీనిపై చర్చించాయి. ప్రైవేట్, కార్పొ రేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిన నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. డబ్బులు చెల్లించనిదే కొన్నిచోట్ల మృతదేహాలను కూడా ఇవ్వకపోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో సీఎం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ కోసం ఎదురుచూపు... కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పుడు నగ రాలు, పట్టణాలను దాటి పల్లెలపై పంజా విసురుతోంది. దీంతో పేదలు అనేకమంది కరోనా బారినపడుతున్నారు. బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే కరోనా వచ్చి సీరియస్ అయి ఆసుపత్రుల్లో చేరి ఆస్తులు అమ్ముకున్నవారు అనేకమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీలోకి కరోనాను ఎప్పుడు తీసుకొస్తారా అని రాష్ట్రంలోని పేదలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 338 నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుదారులు 77.19 లక్షల మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీలోకి కరోనాను తీసుకొస్తే పేద బాధితులు ప్రయోజనం పొందుతారు. ఇదిలావుంటే ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) పరిధిలోకి కూడా కరోనా చికిత్సను తీసుకురావాలని ఉద్యోగులు, పింఛన్‌దారులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ప్యాకేజీ ఖరారే కీలకం... కరోనా సాధారణ వైద్య చికిత్స మాత్రమే. ఇదేమీ ప్రత్యేకంగా నిర్దేశిత ఆపరేషన్ ప్రక్రియ కాదు. కాబట్టి ప్యాకేజీని ఆసుపత్రులు దుర్వినియోగం చేయకుండా చూడడమే ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న పెద్ద సవాల్. అందుకే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రెండు అంశాల ఆధారంగా ప్యాకేజీ ఖరారుపై దృష్టిసారించింది. ఒకటి ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద కరోనా ప్యాకేజీని అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి రావడం. రెండోది ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనాకు ఎంత ఫీజులు వసూలు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా ప్యాకేజీ ఖరారు చేయడం. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు రాష్ట్రంలో సర్కారు నిర్దేశించిన ఫీజు సాధారణ వార్డులో చికిత్స పొందితే రోజుకు రూ. 4 వేలు, ఆక్సిజన్ వార్డులో రూ. 7,500, ఐసీయూలో రూ. 9 వేల చొప్పున ఉంది. పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా వాటికి అదనంగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ ఇవి ఆచరణలో అమలు కాలేదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే పేదలందరికీ ఈ ఫీజుల ఆధారంగానే ప్యాకేజీ ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. అవసరమైతే పీపీఈ కిట్లు, మందుల ధరలు కొంత కలిపి ఒక నిర్దేశిత ప్యాకేజీ ఖరారు చేస్తామని చెబుతున్నాయి. చేరేవారు లేక ఖాళీగా పడకలు... అయితే ప్రస్తుతం సర్కారు నిర్దేశించిన ఫీజుల ప్రకారమే ఆరోగ్యశ్రీలో కరోనా ప్యాకేజీ ప్రకటిస్తే ఏంచేయాలన్న దానిపై ఆసుపత్రి వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఎందుకంటే 14 రోజులకు సాధారణ వార్డుల్లో ఉండే వ్యక్తి నుంచి రూ. 56 వేలు, ఆక్సిజన్‌పై ఉంటే రూ. 1.05 లక్షలు, ఐసీయూలో చికిత్స చేస్తే రూ. 1.26 లక్షలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా సేవలకు కలిపినా కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. ఇది తమకు గిట్టుబాటు కాదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు గతంలో ప్రభుత్వానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఇక ఇతర నెట్వర్క్ ఆసుపత్రులు ఎలా వ్యవహరిస్తాయన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ప్రస్తుతం 203 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందుబాటులోకి వచ్చింది. అందులో 10,660 పడకలు కరోనాకు కేటాయించారు. అయితే వాటిల్లో 4,248 పడకలే నిండగా, ఇంకా 6,412 పడకలు ఖాళీగా ఉన్నాయి. భారీగా పడకలు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీనే ఆసుపత్రులు ఒప్పుకోకతప్పదని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏ ప్యాకేజీ ఖరారు చేసినా దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెస్తాం
సాక్షి, హైదరాబాద్: కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కరోనాపై బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ తదితరులు చేసిన సూచనల్లో కొన్ని పాటించేవి ఉన్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే మన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీని, 108ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారని.. ఆ పథకాలు బాగున్నందువల్లే తాము వాటి పేరును కూడా మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నా మని స్పష్టంచేశారు. రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఆయుష్మాన్ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీని నడిపిస్తామని చెప్పామన్నారు. కేంద్రం అనుమతిస్తే రెండూ కలిపి వాడతామని వెల్లడించామన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే... కార్పొరేట్ ఆసుపత్రుల తీరు దుర్మార్గం.. కార్పొరేట్ ఆసుపత్రులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కరోనాతో చనిపోయినా, ఆ శవాలు ఇవ్వడానికి కూడా డబ్బులు అడుగుతూ పీడించడం సమంజసం కాదు. ఏ ఆసుపత్రిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. సీనియర్ ఐఏఎస్‌లతో కమిటీ వేస్తాం. టాస్క్‌ఫోర్స్ ఈ రోజే వేస్తాం. తీసుకున్న చర్యలపై వారానికోసారి బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలకు నివేదిక పంపిస్తాం. ప్రైవేట్ ఆసుపత్రులు లూటీ చేస్తాయని మొదట్లోనే చెప్పాను. అందుకే వాటికి అనుమతినివ్వలేదు. ఐసీఎంఆర్ 15 ఆసుపత్రులకు అనుమతినిచ్చింది. ఎవరో హైకోర్టుకు వెళ్లారు. ఇక హైకోర్టు ఆర్డర్లను అమలు చేశాం.. ప్రైవేటు దోపిడీ మొదలైంది. కరోనా అడ్డుకునే విషయంలో రూ.వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల జీతాలు 60 శాతం ఆపేసి చేశాం. రైతుబంధుకు నిధులిచ్చాం. అన్ని రకాల మందులు నూటికి నూరు శాతం ఉన్నాయి. నేను గాంధీ ఆసుపత్రికి వెళ్లలేదంటున్నారు. కానీ రేయింబవళ్లు దీనికోసం పని చేశాను. ఆర్థిక శాఖలో మూడు, నాలుగు కోట్లు కరోనా కోసం రిజర్వులో పెట్టాం. 20 వేల బెడ్లు ఒకేసారి అందుబాటులో ఉంచేలా చేశాం. లక్ష మందికి చికిత్స చేసేలా సిద్ధం చేశాం. ఉత్పాతం వస్తే ఏం చేస్తాం? బెంబేలెత్తిస్తామా? భరోసా కల్పిస్తామా? మేం ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉన్నాం. ప్రజల్లో భరోసా నింపుదాం. వారిలో భయాందోళన లు కలిగించకూడదు. ఈటల రాజేందర్‌ను అందరూ మెచ్చుకున్నారు. ఆయన పనితీరు ప్రశంసనీయమైంది. ఆయనకు రిలీఫ్ ఇచ్చేందుకు రెండ్రోజులు నియోజకవర్గానికి వెళ్లమని సూచించాను. మేం ప్రతిపక్షాలతో కలువం.. అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా మేం ప్రతిపక్షాలతో కలిసేది లేదు. వారు హుందాగా లేకుం టే ఎలా కలుస్తాం.. ముందే వ్యతిరేక భావనతో ఉంటే ఎలా కలసి మాట్లాడుతాం. మేం లాక్డౌన్ సమయంలో 2 లక్షల వలస కార్మికులను ఆదుకున్నాం. వాళ్ల ఊళ్లకు పంపించాం. కొందరిని రప్పించాం. పెన్షన్లు కొనసాగించాం. ఇప్పుడు నూటికి నూరు శాతం ఆక్సిజన్ బెడ్లు పడకలుండాలని చెప్పాం. వైన్ షాపులను పంజాబ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెరవలేదా భట్టి విక్రమార్క..? ఏప్రిల్‌లో రూ.15 వేల కోట్లకు వందల కోట్లే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. కొన్ని అప్పులు తెచ్చాం. ఆరోగ్య శాఖ ఏం చేయాలో అది చేస్తుంది. మొదటిదశలో ప్రభుత్వంలోనే పెట్టాం. కొందరు తమ ఇళ్లు పెద్దగా ఉన్నాయంటే హోం ఐసోలేషన్‌కు పంపించాం. వ్యాధి కంటే భయంతోనే ఎక్కువగా చనిపోతుంటారు. మరణాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే తక్కువున్నాయి. చావుల్లోనూ రాజకీయాలేనా? చావులను దాయడం సాధ్యమేనా? మేం తిరగలేదా? మా ఎమ్మెల్యేలూ కరోనా బారినపడ్డారు. లక్షల ప్యాకెట్లు ఇచ్చాం. భోజనాలు పెట్టాం. మంత్రులూ తిరిగారు. మేం పట్టించుకోనట్టు మాట్లాడొద్దు. ప్రభుత్వాన్ని తక్కువ చేయాలని అనుకుంటున్నారు. 2014లో 1,824 మంది డాక్టర్లు ఉంటే, ఇప్పు డు 3,550కు పెంచాం. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఇంకా పది వేల కోట్లయినా ఖర్చు చేస్తాం. ప్రజలు ఎవరికి వారే రక్షించుకోవాలి. అదే శ్రీరామరక్ష.. పరిస్థితి మన చేయిదాటి పోలేదు. రికవరీ, మరణాల్లో మనం మంచిగానే ఉన్నాం. కేసీఆర్ బతికే ఉన్నాడు. కాబట్టి ఎన్ని టెస్టులైనా చేస్తాం.. ధాన్యమంతా కొన్నాం.. కరోనా వస్తే ఏ ప్రభుత్వం కూడా మొత్తం ధాన్యం కొనలేదు. కానీ మేం అంతా కొనుగోలు చేశాం. పచ్చ జొన్నలు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్నలు కొన్నాం. సమాజంపై మాకు బాధ్యత లేదంటారా? ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టాం. రూ.17 వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం. డాక్టర్లు, పోలీసులకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. పేదలను హోం ఐసోలేషన్‌కు పంపొద్దని అంటే అలాగే విస్తృతంగా చేస్తాం. వ్యాధి ప్రమాదం ఇంక పొంచి ఉంది. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో పనిచేసే వారికి మేమే ప్రోత్సాహకాలిచ్చాం. ఫలితంగా సీజనల్ వ్యాధులు తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ కృషి బాగా ఉంది. త్వరలో కరోనా తగ్గుతుందని భావిస్తున్నాం. ఐసీఎంఆర్‌ను అనుసరించి ముందుకుపోతున్నాం. వాలంటరీ సంస్థలకు, సేవలు చేసిన వారందరికీ అభినందనలు. ప్రజాప్రతినిధులను అభినందిçస్తున్నాం. నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. అన్‌లాక్ తర్వాత రికవరీలో ముందున్నాం. డబ్బులకు గతిలేని పరిస్థితిలో లేం. పరిస్థితి ఇప్పుడు కాస్త బాగానే ఉంది. మజ్లిస్ కృషిని అభినందిస్తున్నాం. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని అనుకోవడం మంచిదికాదు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ కేంద్రం చెప్పినా అందులో నుంచి ఏమీ రాలేదు. మీరు కూడా నాకు ఒక ప్రతిపాదన పంపించండి. కరోనా సోకిన పేదలకు సాయంపై ఏ నిర్ణయం తీసుకోవాలో చేస్తాం. సచివాలయంలో మందిరం, చర్చి, మసీదులు ఏర్పాటు చేస్తాం. మాకూ సమయం ఇవ్వండి.. రామలింగారెడ్డి మరణిస్తే అందరినీ మాట్లాడించలేదు. దీంతో మా ఎమ్మెల్యేలు నన్ను నిలదీశారు. వారు కూడా మాట్లాడాలి కదా.. మా సభ్యులకు కూడా మాట్లాడటానికి అవకాశం కల్పించండి (స్పీకర్‌తో).. మాకూ న్యాయం చేయండి. శ్రీధర్‌బాబు కు పీవీతో ఎంతో అనుబంధముంది. ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేం వస్తుంది. మా గొంతే పెద్దది. నేను ఒకప్పుడు ఇందులో సింగిల్ సభ్యుడినే. నాకు 15 నిముషాలే ఇచ్చారు. అప్పుడు వీరంగం వేశానా? నిబంధనల ప్రకారమే అసెంబ్లీ నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ సభ్యులకు కూడా టైం ఇవ్వండి. లేకుంటే వారికి అన్యాయం జరుగుతుంది. మంచి సూచనలు చేస్తే బాగుంటుంది. రెవెన్యూపై శుక్రవారం మంచి సలహాలు ఇవ్వండి. సభ్యుల సంఖ్యను బట్టి పార్టీకి సమయం కేటాయిస్తారు. పార్లమెంటులోనైతే కనీసం విలేకర్లను కూడా రానీయలేదు. ఇక్కడ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉంచాలని, విలేకరులను రానీయాలని స్పీకర్‌ను కోరాం. కానీ పార్లమెంటులో అన్నీ ఎత్తేశారు. వారివి శుష్కప్రియాలు శూన్య హస్తాలు కరోనాపై కేంద్రానిది శుష్కప్రియాలు శూన్యహస్తాలు మాత్రమే.. ఎన్ఆర్హెచ్ఎం నుంచి రూ.265 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో రూ.90 కోట్లు ఇచ్చారు. కేంద్రం 647 వెంటిలేటర్లు ఇచ్చింది. వాటినీ గ్రాంట్‌లో కట్ చేస్తారు. మనం 700 వెంటిలేటర్లు కొన్నాం. ఏదీ ఉచితంగా ఇవ్వలేదు. రుణం రూపంలోనూ రాలేదు. ఎఫ్ఆర్బీఎం కూడా రాలేదు. దానికి షరతులు పెట్టారు. ప్రతీ పీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్ బెడ్లు ఉండాలని కోరాం. వచ్చే బడ్జెట్లో ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయిస్తాం. ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం కోర్టులో ఉంది. కోర్టు తీర్పు తర్వాత దీనిపై కలసి చర్చించి నిర్ణయం తీసుకుందాం. సీఎం వర్సెస్ అక్బరుద్దీన్.. కరోనాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎంకు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. కోవిడ్ వారియర్స్‌కు అభినందనలు, కానీ డాక్టర్లు, నర్సులు, ఇతర సేవలు చేసిన వారిని మంత్రి ఈటల తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అక్బరుద్దీన్ నిలదీశారు. ఒవైసీ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ కరోనాతో చనిపోయారు. వారియర్స్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పలేదన్నారు. మంత్రి ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్లాగానే ఉందని అక్బరుద్దీన్ విమర్శించారు. కరోనా వైరస్ వ్యవస్థపైనా, విద్యపైనా, పరిశ్రమలపైనా, వ్యవసాయంపైనా.. ఇలా అన్ని రకాల జీవితాలపై ప్రభావం చూపింది. కానీ ఇవన్నీ మంత్రి ప్రసంగంలో లేవన్నారు. దీనిపై మధ్యలో సీఎం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ మహాభారతం చెప్పినట్లు అంతా చెప్పరు కదా అని బదులిచ్చారు. అలా ఎందుకు గట్టిగా మాట్లాడుతారంటూ అక్బరుద్దీన్‌పై సీఎం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘కరోనాపై వివరాలు కావాలంటే సభ్యులకు వ్యక్తిగతంగా ప్రభుత్వం వివరాలిస్తుంది. వైరస్ ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉంది. అది ప్రభుత్వ వైఫల్యమంటే ఎలా? ఆరోగ్య కార్యకర్తలకు ప్రోత్సాహం ఇచ్చాం. మున్సిపల్ వర్కర్లకూ ఇచ్చాం’అని సీఎం అన్నారు. ఆ తర్వాత అక్బరుద్దీన్ మళ్లీ మాట్లాడారు. తాను ప్రభుత్వం విఫలమైందని అనడం లేదన్నారు. డాక్టర్లు, నర్సులకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. మళ్లీ సీఎం జోక్యం చేసుకుంటూ.. డాక్టర్లకు సెల్యూట్ చేస్తే ఎవరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంతకుముందే సెల్యూట్ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టడం సరైన పద్ధతి కాదన్నారు. తర్వాత అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ రాజ్యాంగ విరుద్ధం. కేంద్ర ప్రభుత్వం అది పెట్టిన సందర్భం మంచిది కాదు. కరోనా రెండో వేవ్ వస్తోంది.. యూరప్, అమెరికాల్లో మొదలవుతోంది. మనం దానికి ప్రిపేర్ కావాలి. దానికోసం ప్రత్యేక సమావేశం పెట్టాలి. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారు. కరోనా రోగులు అక్కడకు పోవడానికి భయపడుతున్నారు. ప్రజల్లో నమ్మకం కల్పించాలి. ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులను చేర్చుకోవాలి. ప్రజలకు ఉపాధి లేదు. ఆదాయం లేదు. అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆక్సిజన్ బెడ్లు హైకోర్టుకు ఒక లెక్క.. అసెంబ్లీలో ఒక లెక్క చూపిస్తున్నారు..’అని విమర్శించారు. గుణపాఠం నేర్పిన కరోనా.. కరోనా ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకో ప్రకటన చేస్తోంది. కేంద్రం కూడా నిర్దిష్టంగా చెప్పదు. ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది. బాధ్యత గల వ్యక్తులుగా ఈ వైరస్‌ను పారదోలాలి. కరోనా విషయంలో మనమే కేంద్రాన్ని అప్రమత్తం చేశాం. ప్రధానితో జరిగిన సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను పెంచాలని విన్నవించాను. అంతర్జాతీయ విమానాలు ఆపాలని కోరిన సీఎంను నేనే.. కరోనాతో కలసి బతకాల్సిందే. కరోనా ఒక గుణపాఠం చెప్పింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన విషయాన్ని వేలెత్తి చూపింది. ఈ విషయంలో ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా లేదు. మందులు ఫలానా అని ఏమీ లేవు. రెమిడెసివిర్ మందుల కోసం డబ్బులిచ్చాం. అయితే భయంతో చాలామంది చనిపోతున్నారు. ఆక్సిజన్ లేని బెడ్లు కాంగ్రెస్ నుంచే వచ్చాయి. మేం క్రియేట్ చేయలేదు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో ఆరోగ్య రంగానికి గణనీయంగా బడ్జెట్ పెంచాలన్నదే కరోనా చెప్పిన గుణపాఠం. -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్
కోవిడ్ ఆస్పత్రులపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో.. అదే రీతిలో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై సమీక్ష చేయాలి. వచ్చే సమావేశం నాటికి ఇందుకు సంబంధించిన పురోగతి వివరించాలి. కోవిడ్ టెస్టుల కోసం రూ.4.3 కోట్లు, ఆహారం కోసం రూ.1.31 కోట్లు, మందుల కోసం రూ.4.57 కోట్లు.. మొత్తంగా ప్రతి రోజూ రూ.10.18 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ పరిస్థితిలో కోవిడ్ వస్తే ఏం చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలన్న దానిపై ప్రచారం ఉధృతం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్య మిత్రలతో ఆ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరు గార్చేలా వ్యవహరిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్–19 పరిస్థితులపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. కోవిడ్ –19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య మిత్రలకు అవగాహన ► ఆరోగ్య మిత్రలకు ప్రొటోకాల్‌పై సంపూర్ణ అవగాహన ఉండాలి. ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా ఇస్తున్నారా? లేదా? అన్నది కూడా వారు చూడాలి. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని అందించాలి. ► రోగులు సంతృప్తి చెందేలా ఆరోగ్య మిత్రలు సేవలు అందించేలా చూడాలి. ఒక ఆస్పత్రిలో రోగులకు వైద్యం సరిగా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్య మిత్రలదే. ► ఆరోగ్యశ్రీ అమలుపై ఎప్పటికప్పుడు నిశిత పర్యవేక్షణ చేయాలి. ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలి. రిఫరల్ విధానం సమర్థవంతంగా ఉండాలి. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల మీద, వైద్య సేవల నాణ్యత మీద ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. మాక్ కాల్స్‌తో పనితీరు పరిశీలన ► కాల్ సెంటర్లకు అధికారులు రోజూ మాక్ కాల్ చేసి, వాటి పని తీరును పరిశీలించాలి. ప్రతి మాక్‌కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలి. ► ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలిక సదుపాయాలు.. ఈ నాలుగింటిపై ప్రశ్నలు వేసి.. అన్ని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. వీటి ద్వారా ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలి. ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే వెంటనే పరిస్థితులను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలి. ► ఆరోగ్య ఆసరా మీద కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. మనం తీసుకుంటున్న చర్యలపై రోగులంతా సంతృప్తి వ్యక్తం చేయాలి. టీచింగ్ ఆస్పత్రులు ► రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయి. అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణంపైనా చర్యలు తీసుకోవాలి. (అక్టోబర్ నాటికి టెండర్ల ప్రక్రియ ముగిస్తామని అధికారులు చెప్పారు.) ► సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డితో పాటు, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు.. వాస్తవాలు ► కోవిడ్ ఆస్పత్రుల్లో మొత్తం 37,441 బెడ్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం (శుక్రవారం నాటికి) సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్ సపోర్టుతో ఉన్నవి 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఖాళీగా ఉన్నాయి. (కొన్ని పత్రికలు విషపూరిత రాతలు రాస్తున్నాయనే చర్చ వచ్చింది.) ► మొత్తం 30,887 పోస్టులకు గాను 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ. ► రెగ్యులర్ రిక్రూట్మెంట్లో 9,971 పోస్టులు భర్తీ. అందులో 4,676 పోస్టులలో నియామకం, 5,295 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ. 10 రోజుల్లో పూర్తి. -
ఇతర రాష్ట్రాల్లో తొలిసారి ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స
సాక్షి, గుంటూరు: ఆంధ్రరాష్ట్ర విభజన అనంతరం 2016లో ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలు అనే వ్యాధిగ్రస్తునికి తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసినట్లు డా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి తెలిపారు. గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. గత నాలుగేళ్లుగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మూడు గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వెల్లడించారు. (పెద్ద కంపెనీలతో అనుసంధానం ముఖ్యం) కాగా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పొరుగు రాష్ట్రాల ముఖ్య నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని సూపర్ మల్టీస్పెషాలిటీ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత వైద్య చికిత్స అందించడం కోసం నవంబర్ 1, 2019 నుంచి ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారిలో ఆనంద్ అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్నాడని, ఈ క్రమంలో ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున సహాయంతో బెంగళూరు ఆస్పత్రిలో గుండె మార్పిడి చికిత్స జరిగిందన్నారు. (ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్) ఈ పథకం ద్వారా గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్యాకేజీలో భాగంగా పదకొండు లక్షల రూపాయల మొత్తాన్ని రోగికి అయిన ఖర్చును వైదేహి ఆస్పత్రికి అందించినట్లు తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా ఆనంద్ గుండె మార్పిడి చికిత్స పొందినట్లు ఆయన వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన అయిదో రోజున కోలుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ వారికి క`తజ్ఞతలు తెలియ జేసినట్లు తెలిపారు. -
ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం
భద్రాచలం అర్బన్: కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సీఎల్పీ బృందం చేపట్టిన ఆస్పత్రుల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ప్రారంభించారు. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. వారితో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే.. ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మంగపేట మండలం గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమీప ప్రాంతాల్లో ఇటీవల వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే సీతక్కతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మూడు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇలా అయితే రోగులకు సేవలెలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఉండాల్సిన పోస్టుల్లో కనీసం 1/3 వంతు మంది కూడా లేరన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాలు, ఇతర వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని, ఇక్కడ కూడా సరైన వైద్య సిబ్బందిని నియమించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సరిపడా సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఏజెన్సీ వాసులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. ములుగు: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ప్రజలకు ఇంతటి దీనస్థితి ఎందుకు ఎదురవుతుందో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, మేడారం పర్యటన సందర్భంగా భట్టి విక్రమార్క, సీతక్కలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకున్నారు. -
కోవిడ్ కట్టడిలో ప్రభుత్వ చర్యలు భేష్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కోవిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటోందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అన్నారు. కోవిడ్ కట్టడిలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలను రాష్ట్రంలోనే చేస్తున్నారని తెలిపారు. రోగులకు చికిత్స అందించడంలో ప్రభుత్వ చర్యలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. దేశంలోనే మెరుగైన వైద్యం రాష్ట్రంలో మాత్రమే అందుతోందని కుండబద్దలు కొట్టారు. కరోనా కష్టకాలంలోనూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద ఉన్న ఆస్పత్రులను ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. గతంలో బకాయిలు నెలల తరబడి రాక చాలా ఇబ్బందులు పడేవాళ్లమని.. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను కేవలం రెండు వారాల్లోనే చెల్లిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే సిబ్బందికి జీతాలివ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. అన్ని విధాలా తమకు సహకారమందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. సోమవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్రరెడ్డి ఏమన్నారంటే.. కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధం ► కరోనాపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ► రాష్ట్రంలోని 560 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ► ఏ జిల్లాలో ఎలాంటి సాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ► ప్రతి కోవిడ్ ఆస్పత్రిలో ఎన్ని పడకలు ఉన్నాయనే సమాచారం ఆన్లైన్లో కూడా ఉంది. ► ప్రతి ఆస్పత్రికి ప్రభుత్వం ఒక నోడల్ అధికారిని నియమించడంతోపాటు వలంటీర్ల ద్వారా రోగుల సమాచారాన్ని వారి బంధువులకు తెలియజేస్తోంది. ► ఆస్పత్రిల్లో బెడ్లు, వైద్యం అందవనే అనుమానాలు వద్దు. ► ప్రతి జిల్లాలో కలెక్టర్ల ద్వారానే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ► కరోనా వైరస్ నిర్ధారణకు సీటీ స్కాన్ ప్రామాణికం కాదు. ► ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కోవిడ్ రోగులకు చికిత్స అందిçస్తున్నారు. ► రాష్ట్రంలోనే మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ► ప్రజలు కోవిడ్ గురించి భయపడకుండా అవగాహన పెంచుకోవాలి. ► స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందొచ్చు. మధ్యస్థ స్థాయిలో లక్షణాలు ఉంటే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆస్పత్రిలో చేరాలి. ► ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రమేశ్, డాక్టర్ ఎ.వినయ్, డాక్టర్ నరేశ్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
560 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 560 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బూసి రెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతూ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గతంలో ఆస్పత్రి నిర్వహణ చాలా కష్టతరంగా ఉండేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 650 కోట్ల రూపాయల బకాయిలను తీర్చడం వల్ల కష్టాల నుంచి బయటపడ్డమని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఆరోగ్య శ్రీ ఆసుపత్రిలు ఉన్నాయని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ స్పందించి తగిన నిధులు కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము కూడా ప్రభుత్వానికి అండగా ఉంటూ కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తామని చెప్పారు. గతంలో పనిచేసినా నిధులు సరిపడా అందలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రెండు వారాల్లోనే నిధులు అందుతున్నాయని తెలిపారు. సోమవారం విజయవాడలో బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్య శ్రీ సేవలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. ఆరోగ్య శ్రీ కింద మరిన్ని సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నాం. కోవిడ్ పేషెంట్లకు కూడా ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నాం. కరోనా పై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. స్వల్ప లక్షణాలు ఉంటే హోం క్వారంటైన్‌లోనే ఉండాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటేనే ఆస్పత్రికి రావాలి. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నాయనే సమాచారం ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో కరోనా డెత్ రేట్ చాలా తక్కువుగా ఉంది. జిల్లా కలెక్టర్ ద్వారానే ఆసుపత్రిలలో ఆరోగ్య శ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రజలు కూడా కోవిడ్ పై భయాలు పెట్టుకోకుండా అవగాహన పెంచుకోవాలి. దేశంలోనే ఏపీలో కోవిడ్ రోగులకు మంచి వైద్యం అందుతుంది. ఏ జిల్లాలో ఎటువంటి సాయం కావాలన్నా ఆరోగ్యశ్రీ అధికారులను సంప్రదించవచ్చు.’ అని తెలిపారు. -
ఆరోగ్యశ్రీ ముసుగులో ‘రమేష్’ మోసాలు!
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ చికిత్స పేరుతో వైద్యానికి తమదైన వెలకట్టిన రమేష్ ఆస్పత్రి యాజమాన్యం గత సర్కారు హయాంలో భారీ ఎత్తున ఆర్జించినట్టు తెలుస్తోంది. నిర్దేశిత ప్యాకేజీ రేట్లకు మించి రోగుల నుంచి అదనంగా వసూళ్లు చేసినందుకు ఒక్క ఏడాదిలోనే రూ.7 లక్షల పెనాల్టీ విధించడం రమేష్ ఆస్పత్రి నిర్వాకాలను రుజువు చేస్తోంది. అక్రమాలపై క్షుణ్నంగా విచారణ జరుగుతుందనే భయంతోనే ఆరోగ్యశ్రీ చికిత్సకు యాజమాన్యం నిరాకరిస్తోందని భావిస్తున్నారు. బాధితుల నుంచి భారీగా .. ► టీడీపీ అధికారంలో ఉండగా రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ఎన్టీఆర్ వైద్యసేవ పేరుతో భారీగా రోగులను చేర్చుకుంది. ప్యాకేజీలో ఉన్న రేటుకంటే భారీగా వసూళ్లు చేశారు. దీనిపై అప్పట్లో కొందరు ఫిర్యాదులు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ► సాధారణ మెటాలిక్ స్టంట్ ధర ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో రూ.45 వేలు మాత్రమే ఉండగా ఇంపోర్టెడ్ స్టంట్ అమరుస్తున్నట్లు రూ.30వేల నుంచి రూ.50 వేల వరకూ అదనంగా వసూలు చేసినట్టు తేలింది. ► ఐదేళ్లలో అక్కడ ఎంతమంది ఆరోగ్యశ్రీలో చికిత్సపొందారు? అనే అంశాల ఆధారంగా విచారిస్తే మొత్తం వసూళ్లు వెలుగులోకి వస్తాయని ఓ అధికారి పేర్కొన్నారు. అదనపు వసూళ్లకు రూ.7 లక్షలు పెనాల్టీ ► నిబంధనలకు విరుద్ధంగా ప్యాకేజీ రేట్ల కంటే అధికంగా వసూళ్లు చేయడంపై పలువురు బాధితులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఫిర్యాదు చేశారు. గత 12 నెలల వ్యవధిలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి రూ.7 లక్షల జరిమానా విధించారంటే ఎంత దారుణంగావ్యవహరించారో అంచనా వేయవచ్చు. విచారణ భయంతోనే.. ► మూడు నెలల క్రితం అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయలేమని రమేష్ ఆస్పత్రి యాజమాన్యం లేఖ ఇచ్చింది. ► ఐదేళ్ల క్రితం పెద్ద ఎత్తున చికిత్సలు నిర్వహించిన యాజమాన్యం ఇప్పుడు నిరాకరించడానికి కారణాన్ని తేలికగానే ఊహించవచ్చని పేర్కొంటున్నారు. విచారణ భయంతోనే ఆరోగ్యశ్రీ సేవల నుంచి తప్పుకున్నట్లు పేర్కొంటున్నారు. ఆస్పత్రి నుంచి ఫైల్ రావటమే ఆలస్యం... ► చంద్రబాబు ముఖ్యమంత్రిగాఉండగా సీఎంవో అంతా తమదే అనే తరహాలో రమేష్ ఆస్పత్రి హవా కొనసాగింది. రాష్ట్రంలో అత్యధికంగాముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి (సీఎంఆర్ఎఫ్) నిధులు పొందింది రమేష్ ఆస్పత్రే కావడం గమనార్హం. ► గుంటూరులో మోకాలి చిప్ప ఆపరేషన్ నిర్వహించిన ఓ ఆస్పత్రి సీఎంఆర్ఎఫ్కు లేఖ పంపగా గత సర్కారు రూ.1.20 లక్షలు మంజూరు చేసింది. అదే రమేష్ ఆస్పత్రి నుంచి లేఖ అందితే రూ.1.60 లక్షలు మంజూరు చేసింది. టీడీపీ హయాంలో సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అధికారి రమేష్ ఆస్పత్రినుంచి వచ్చే ఏ ఫైలునైనా క్షణం కూడా జాప్యం చేసేవారు కాదని సచివాలయంలో అదే విభాగంలో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు. ► రమేష్ ఆస్పత్రికి అధికంగా చెల్లింపులపై అభ్యంతరం చెబితే తమకు బిల్లులు మంజూరయ్యేవి కావని గుంటూరుకు చెందిన ఓ ఆస్పత్రి యజమాని వాపోయారు. -
నవరత్నాల పాలన మాది..
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్థానాల్లో 90 శాతం 14నెలల్లోనే అమలు చేయడమే కాక మేనిఫెస్టోలో లేని మరో 39 పథకాలను కూడా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ 14 నెలల కాలంలో రూ. రూ.59,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 14 నెలల పాలన గురించి సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే... మేనిఫెస్టోను.. ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ మాదిరిగా భావించి అమలు చేస్తున్నాం. ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన హామీలు 129. ఇందులో ఇప్పటికే 83 అమలు చేయగా మరో 30 పథకాలకు ప్రారంభోత్సవ తేదీలు ప్రకటించాం. మిగిలిన 16 కూడా రాబోయే రోజుల్లో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో లేకపోయినా ఈ ఏడాదిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 39 పథకాలు అమలు చేస్తున్నాం. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ భేదాలకు అతీతంగా మన ప్రభుత్వం నవరత్నాల పాలన అందిస్తోంది. వేడుకల్లో పాల్గొన్న సీఎం తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతీరెడ్డి విద్యావిధానంలో భారీ మార్పులు.. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా విద్యా విధానంలో కరిక్యులమ్‌తో పాటు, పూర్తిగా మార్పులు చేర్పులు తీసుకువస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాల నుంచి కాలేజీల వరకు అన్నింటి రూపురేఖలు మారుస్తున్నాం. ఉన్నత విద్యలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు, విద్యార్థుల లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. అన్నింటికి మించి ప్రాథమిక విద్యలో అమ్మ ఒడి ద్వారా ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని భారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పిల్లలకు పుస్తకాలు మొదలు షూస్ వరకు అన్నీ నాణ్యమైనవి ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి రోజూ ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 100 శాతం విద్యార్థులకు పరీక్షలు జరిపి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కళ్లజోళ్లు అందించే కార్యక్రమం దాదాపుగా పూర్తి చేశాం. రైతు సంక్షేమం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతున్నాం. రైతు భరోసా ద్వారా రూ.11,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లభించేలా చూడడంతో పాటు, నాణ్యత ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. ఇలా రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒక్క చోటే లభించేలా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులకూ రైతు భరోసా వర్తింప చేశాం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా దాదాపు రూ.3,200 కోట్లకు పైగా మొత్తంతో పంటలు కొనుగోలు చేసి రైతులకు అండగా నిల్చాం. గోదాములు, నాణ్యమైన ఉత్పత్తుల గ్రేడింగ్, వాటి మార్కెటింగ్ వంటి సదుపాయాలను గ్రామస్థాయి నుంచి మొదలు పెడుతున్నాం. మండల స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు, అవసరమైన చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఆరోగ్యశ్రీని విస్తరించాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ రక్షణను మరో 1,000కి పైగా జబ్బులకు పెంచి 2,200 జబ్బులను దాని పరిధిలోకి తీసుకువచ్చాం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింప చేశాం. రూ.1,000 కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. దాదాపు 1,100 వాహనాలు కొని ఒకేసారి 108, 104 సేవల కోసం పంపించాం. దేశ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా ఆపరేషన్ అయిన రోగులకు కోలుకునే సమయం వరకు నెలకు రూ.5 వేల వరకు ఆసరాగా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల వరకు పింఛనుగా అందిస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ 14 నెలలలోనే మరో 16 కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అన్నింటి రూపురేఖలు మారుస్తున్నాం. క్యాన్సర్ వంటి రోగాలకు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం. కోవిడ్ వంటి మహమ్మారిని కూడా.. దేవుడి దయతో, మీ అందరి దీవెనలతో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. అక్క చెల్లెమ్మలకు తోడుగా.. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా 23 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించాం. అమ్మ ఒడి ద్వారా అక్షరాలా 43 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం. విద్యాదీవెన మొత్తాన్ని అమ్మ పేరుతో బ్యాంకులో వేస్తున్నాం. వసతి దీవెన ద్వారా పిల్లల లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చులన్నింటినీ కూడా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేసేలా సున్నా వడ్డీ డబ్బులు జమ చేశాం. అదే 91 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాలకు సమానమైన మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికి ఇచ్చే ఆసరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో అమలు చేస్తున్నాం. మద్య నియంత్రణ మద్యం మహమ్మారి అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతోందని గమనించి.. మద్య నియంత్రణ దిశగా అడుగులు వేశాం. అధికారంలోకి రాగానే 43 వేల బెల్టుషాపులు, 4,380 పర్మిట్ రూములు తొలగించి, అధికారిక దుకాణాల సంఖ్యను 33 శాతం తగ్గించాం. బెల్టు షాపులు అనేవి లేకుండా చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం విక్రయాలు జరుపుతూ మద్యం అమ్మే వేళలను కూడా కుదించాం. మద్యం ధరలను దాదాపు 100 శాతం పెంచి అమ్మకాలను భారీగా తగ్గించాం. అవినీతి లేని వ్యవస్థ అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్, జ్యూడిషియల్ ప్రివ్యూ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.59 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం. రివర్స్ టెండరింగ్, జ్యూడిషియల్ ప్రివ్యూ, గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆదా చేశాం. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. దిశ బిల్లును ఆమోదించాం. దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకు ఇస్తూ చట్టం తీసుకువచ్చాం. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధంగా ఉంది. -
‘2023 నాటికి కేసీఆర్ దొరల పాలన అంతం’
సాక్షి, వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్ రూపంలో ఉన్న దొరల పాలన 2023 నాటికి అంతం కాబోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మట్లాడుతూ.. తల్లి తెలంగాణా పుస్తకంలో 2003లోనే కేసీఆర్ దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అవుతాడని రాశానని గుర్తు చేశారు. నిండు అసెంబ్లీలో తాను దొరనే అని బాహాటంగా కేసీఆర్ ప్రకటించుకున్నాడని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని దుయ్యబట్టారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిందని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటను ధిక్కరించి కరోనా సోకిన ఎమ్మెల్యేలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ భారీ మూల్యం చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఆరు సంవత్సరాల కేసీఆర్ పాలనలో దళిత, గిరిజన వర్గాలకు భూపంపిణీ ఎందుకు జరగలేదని మండిపడ్డారు. (కేంద్రం ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి?) -
కరోనా రోగులు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లాలి
నెల్లూరు(అర్బన్): కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు తీసుకుని నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నాగార్జున బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులేకపోతే ఆధార్‌కార్డు ఆధారంగా సీఎంసీఓ లెటర్‌ను తీసుకెళ్లాలని తెలిపారు. అప్పుడు మాత్రమే ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలందుతాయన్నారు. కరోనా రోగులను తరలించేటప్పుడు 104, 108 సిబ్బంది తమతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని రావాలని రోగులకు చెప్పాలని కోరారు. ఈ విషయం తెలియక అనేక మంది రోగులు ఆస్పత్రులకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ప్యాకేజీలు ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. -
జగన్నాథ రథ చక్రాల్!
ఆరోగ్యశ్రీ పథకం మరో ఆరు జిల్లాలకి విస్తరించడం ఆనం దంగా ఉంది. చికిత్స ఉన్నా డబ్బుల్లేక మరణించడం చాలా దీనం. ఔను, గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ రోగు లపై చిన్నచూపు ఉండేది. కారణం వారివల్ల పడకలు నిండుతాయ్ గానీ గల్లాపెట్టెలు నిండవు. వారి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నించి రావాలి. అందునా చంద్ర బాబుకి విపరీతమైన ‘ధనబద్ధకం’ చేసిన చేతులకి ఎప్పటికి డబ్బు వస్తుందో ఆస్పత్రులకి తెలియదు. అందుకని రోగుల్ని అరువు కేసులుగా భావించేవారు. ఇప్పుడు జగన్ వేలకోట్ల బకాయిలు తరుగులు లేకుండా చెల్లించారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లు దర్జాగా తలెత్తుకుని వైద్యంకోసం వెళ్లాలని ఆకాంక్షించారు. అరువుని చిన్న బస్తీల్లో ‘గాత్రం’ పేరుతో వ్యవహ రిస్తారు. చాలా అవమానంగా అరువు బేరాన్ని చూస్తారు. నా చిన్నతనంలో సొంత అనుభవాలు.. కాదు అవమా నాలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మా నాన్న పల్లెటూరి బడిపంతులు ఉద్యోగం చేస్తుండేవారు. ఆ వచ్చే వందలోపు జీతం ఆరునెలలకో, తొమ్మిది నెలలకో విడు దల అయ్యేది. ఈలోగా అరువు బతుకులు వెళ్లదీస్తూ ఉండేవాళ్లం. రోజూ పాలుపోసే మంగమ్మ ఎన్ని నీళ్లు కలిపినా అడగటానికి లేదు. ఎందుకంటే అరువు. బియ్యంలో రాళ్ల గురించి నోరు విప్పకూడదు. ఇక చిల్లరకొట్టు షావుకారు దయమీద, శాంక్షన్ మీద ఆధార పడి సరుకులు వచ్చేవి. అమ్మ ఇచ్చిన జాబితాలో వీశ ఉంటే అరవీశ, సవాశేరు ఉంటే సవా పావు చాలని పొట్లాలు కట్టేవాడు. ఒకసారి పట్టీలో కొబ్బరికాయ రాసి వుంటే, ‘ఎందుకయ్యా రూపాయి పావలా టెంకాయ’ అన్నాడు వ్యంగ్యంగా కొట్టు షావుకారు. ‘దేవుడికి’ అన్నాను. పెద్దగా నవ్వి, ‘మీ అరువు రావాలని మేం కొట్టుకోవాలి దేవుడికి కొబ్బరికాయలు. మీకెందుకు బాబూ!’ అని ఎద్దేవా చేశాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. కానీ దరిద్రం సహ నాన్ని నేర్పుతుంది. అరువు కస్టమర్లు హేళనలు భరించా ల్సిందే! రేవులో నావ దగ్గర కూడా, డబ్బున్నవాళ్లు ముందు ఎక్కండి.. లేనోళ్లు కాస్త ఆగండి’ అని అరుస్తూ ఉంటాడు సరంగు. అరువు బేరాల్లో తూకంలో తేడా ఉంటుంది. కాటాని గమనిస్తున్నా కిమ్మనడానికి భయం. ఖాతాలో పుస్తకంలో కూడా అంతో ఇంతో హెచ్చుగానే అంకెలు పడేవి. ఇంటికెళ్లాక నాన్న కూడా చూసీ చూడ నట్టే ఉండేవారు. చిన్నతనంవల్ల అజ్ఞానం వల్ల నెత్తురు వేడెక్కేది. పెద్దయ్యాక వీళ్లందర్నీ గొడ్డలి, కొడవళ్లతో నరికెయ్యాలనుకునేవాణ్ణి. అవేం చెయ్యలేక పోయాగానీ జీవితంలో అరువుబేరాలు చెయ్యరాదని శపథం చేశా. ఉంటే తినడం లేదంటే లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరాలుగా కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగినా బకాయి వ్యవహారాల్లో ఉండే చిన్నచూపు గురించి ఆయనకు ఎట్లా తెలుసో, బడుగుల అసలైన నేతకి తెలిసి ఉండటం చాలా ముఖ్యం అనిపించింది. ఊరికే ప్రతిమాటకి ముందూ ఆత్మ గౌరవం నినాదాన్ని పలికితే చాలదు. ధనబద్ధకం వది లించుకుని చేతల్లో చూపించాలి బాబూ! జనం ఏదీ పట్టించుకోరనీ, మన సుదీర్ఘ సుత్తి ప్రసంగాలకు పడిపోతారనీ భ్రమలో ఉండకూడదు. నిజానికి ఆభ్రమే చంద్రబాబుని భూస్థాపితం చేసింది. చంద్రబాబు ఉత్తుత్తి మాటలు.. జరిగిన ఎన్నికలు కాదు, జరగబోయే మరో రెండు ఎన్నికల దాకా సరిపడే ప్రఖ్యాతిని మూటకట్టి ఇచ్చాయి. దేవుడి దయవల్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయి. నేల తడిస్తే రైతుల మనసులు చల్లపడతాయి. ఇప్పుడు రైతులు క్యాపిటల్ ఎక్కడున్నా పట్టించుకోరు. ఈ సంవత్సరం రుతుపవనాలు అనుకూలంగా ఉంటాయ్. రైతుల కృషి ఫలిస్తుంది. సర్కార్ చేయూత పుష్కలంగా ఉంది, ఇంకా ఉంటుంది. కాసేపు అర్థం పర్థం లేని విమర్శల్ని ఆరోపణల్నీ పక్కనపెట్టి, ప్రజలకి మేలు కలిగే సూచనలు ఇవ్వండి. ఎన్ని మాటలైనా బుక్కెడు కొర్రలకు సరికావని సామెత. శ్రీశ్రీ మహాకవి ఏనాడో ‘‘ఏడవకండేడవకండి, నేనున్నా నేనున్నా పతితు లార! భ్రష్టులార! బా«ధాసర్పద్రష్టులార!’’ అని ఎలుగెత్తి పాడినపుడు అదో కలవరింత అనిపించింది. కానీ ఇప్పుడు ‘జగన్ నాథ రథ చక్రాలొస్తున్నాయ్, వస్తు న్నాయ్!’ అనే సింహగర్జన నిజం.. ముమ్మాటికీ నిజం అనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ విస్తరణతో అందరికీ కొత్త బతు కులు, కొత్త ఆశలు ప్రసాదించిన జననేతకు సర్వం శుభ మగుగాక! దీర్ఘాయుష్మాన్ భవ! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఏపీ సీఎం సహాయనిధికి విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ నవ్యాంధ్రప్రదేశ్ తరపున 1 కోటి 13 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. 285 నెట్వర్క్ హాస్పిటల్స్ తరపున విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అసోసియేషన్ ప్రతినిథులు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ కె మోహన్ రెడ్డి, డాక్టర్ త్రినాథ్ తదితరులు ఉన్నారు.(చదవండి: కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు) -
ఆరోగ్యశ్రీలో నవశకం
-
ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్య శ్రీ
సాక్షి, అమరావతి: వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. దీంతో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించనుంది. సోమవారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మల్లికార్జున్‌తో సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. (ప్రతి మూడు వారాలకు ఆరోగ్య శ్రీ బిల్లులు) ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తామని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. అందులో భాగంగా అప్పటివరకూ ఉన్న 1,059 వైద్య ప్రక్రియలకు, కొత్తగా మరిన్ని చేరుస్తూ మొత్తం 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేశారు. ఆ తర్వాత అనేక అంశాలను పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు. ఆ తర్వాత అమలయ్యే వైద్యప్రక్రియల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. (‘ఆరోగ్యశ్రీ’మంతుడు) నెట్వర్క్ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపచేసేవారు. అదికూడా నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి దాపురించేది. వీటిపైనా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతోపాటు, నెట్వర్క్ ఆస్పత్రులో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణయాలు తీసుకున్నారు. 2019 జూన్ నుంచి రూ.1,815 కోట్లను, మరో రూ.315 కోట్లను ఈహెచ్ఎస్ కింద ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం చెల్లించింది. (ఏపీ: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా ) -
‘మాస్క్ లేకుండా పని చేస్తానని మాయమయ్యారు’
సాక్షి, హైదరాబాద్: మాస్క్ లేకుండానే కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు.. కనిపించడం లేదు అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శనివారం ఆయన మాట్లాడారు. ‘సీఎల్పీ లీడర్ గా చాలా ఆవేదన, బాధతో మాట్లాడుతున్న. రాష్ట్రం మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా వచ్చిన రోగులకు వైద్యం అందుబాటులో లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాజిటివ్ వస్తే తప్ప చికిత్స లేదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతున్నారు. ధనవంతులు ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ పేదలు రోడ్డెక్కకపోతే పూట గడవడం లేదు. ప్రజలందరూ భయంతో బతుకుతుంటే సీఎం కేసీఆర్ చేతులెత్తేసి ఫామ్ హౌస్‌కి వెళ్లారు’ అని ఆయన ఆరోపించారు. (కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్) ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీలో కరోనా 2.8 శాతం ఉంటే తెలంగాణలో 22శాతం ఉంది. జాతీయస్థాయిలో చూస్తే ఇది 7.14 శాతంగా ఉంది. అతి తక్కువ టెస్టులకే 22 శాతంగా ఉంది అంటే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేసే శక్తి ఉన్న రాష్ట్రానికి.. కరోనా టెస్టులు చేయడానికి కుదరడం లేదా. ఆనాడు అవసరం లేకున్నా సమగ్ర కుటుంబ సర్వే చేశారు. మరి ఇవ్వాళ అవసరం ఉన్నా కరోనా టెస్టులు చేయడం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి 50 శాతం బెడ్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు చికిత్స అందించాలి. ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక యాప్ తయారు చేసి బెడ్స్ వివరాలు అందులో పొందుపరచాలి’ అని భట్టీ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసేలా కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి. ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి... ప్రభుత్వం వారికి ధైర్యాన్ని చెప్పాలి. హైదరాబాద్, జిల్లా హోటల్స్‌లో 50శాతం బెడ్స్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని కరోనా హోమ్ క్వారంటైన్ కోసం వినియోగించాలి. డెంగ్యూ,జనరల్ ఫ్లూ వ్యాధులపై ముందస్తు చర్యలు చేపట్టాలి. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షణ చేపట్టాలి. ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది. కవులు, కళాకారులు, పోరాట సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం వీటి పై దృష్టి సారించాలి’ అని భట్టీ విక్రమార్క డిమాండ్ చేశారు. -
కరోనా: ‘ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు’
సాక్షి, గుంటూరు : పేదల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసిందని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ విస్తృతమవుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈమేరకు గురువారం లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలిపారు. కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధమైందని, వైద్యం కోసం ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమన్నారు. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ తరుపున జీవో 77 విడుదలైందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో ప్రజలకు ఉపశమనం ఖాయమని తెలియజేశారు. (కరోనా టెస్టుల్లో దూసుకుపోతున్న ఏపీ..) ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారని.. తాజాగా ఆయా ఆసుపత్రుల వర్గీకరణ, వైద్యానికి ధరలు నిర్ణయించడంతో మార్గం సుగమం అయిందన్నారు. ఇటీవల తెలంగాణలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా వైద్య సహాయం పొందుతున్న వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం కలవరం కలిగించిందని, చాలామందిని ఆందోళనకు గురిచేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయకుండా, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల్లో ఫీజులు గుంజుతున్న తీరుపై తెలంగాణలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కరోనా బాధితుల పట్ల ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతీఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల విధుల నిర్వహణకు సిబ్బంది నియామకం.. వైద్యుల రిక్రూట్మెంట్ చేయడంతో పాటు సదుపాయాలు కల్పించేందుకు వివిధ ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. అదే సమయంలో ఉచితంగా కరోనా సేవలు అందించేందుకు ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతినిస్తోందని లక్ష్మణరెడ్డి తెలిపారు. (అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై దళిత నేతల హర్షం) బాధితులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉన్న ఆసుపత్రులను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయా ఆసుపత్రిలో వైద్యానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. నాన్ క్రిటికల్ పేషెంట్లకు రోజుకి రూ.3250 క్రిటికల్ కేర్ ఐసీయూలో వెంటిలేటర్ , ఎఐవీ అవసరం లేకుండా రోజుకి రూ.5,480.. ఐసీయూలో ఎన్ఏవీ చికిత్స రూ. 5980 అని తెలిపారు. అలాగే ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స రూ. 9,580.. వెంటిలేటర్ లేకుండా సెప్సిస్ చికిత్స రూ. 6,280 వెంటిలేటర్‌తో సెప్సిస్ చికిత్స రూ.10,380 ..నాన్ క్రిటికల్ పేషెంట్లు ఎవరైనా ప్రత్యేక రూమ్ కావాలని ఆశిస్తే అదనంగా రోజుకి రూ.600 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వైద్య సేవలు మరింత విస్తృతమవడమే కాకుండా ప్రజల్లో ఆందోళన తొలగి, కరోనాని ఎదుర్కొనే అవకాశం దక్కుతుందని లక్ష్మణరెడ్డి తెలియజేశారు. -
‘ఆరోగ్యశ్రీ’మంతుడు
డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 71వ జన్మదినం నేడు. ఆయన 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపాలనలో నవశకం మొదలయింది. ‘ఆరోగ్యశ్రీ’ పథకం వై.ఎస్. ప్రభుత్వానికి ప్రాణదాతగా పేరు తెచ్చింది. ప్రజల్లో ప్రభుత్వాల మీద అపారమైన నమ్మకాన్ని పెంచింది. నిరుపేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకం ద్వారా కార్పోరేట్ వైద్యానికి నోచుకున్నాయి. సకల సౌకర్యాలు గల ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందారు. తమ రోగాన్ని నయం చేసుకొని ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లే ప్రజలు రాజశేఖరరెడ్డి పేరును ‘రాజన్న’గా మార్చుకొని ఇంటికెళ్ళారు. ప్రత్యామ్నాయపార్టీలు ఎన్నికల్లో పోటీచేసి అస్పష్ట పరిస్థితులు సృష్టించినా రెండోసారీ డాక్టర్ వైఎస్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు. అందుకే ఇది ప్రజల విజయం, పేదల విజయమని స్వయంగా ఆయన చెయ్యెత్తి చాటారు. నాన్నగారి నడకను, నడతను నరనరానా నింపుకుని ‘రాజన్న’ బాటలోనే నేటి యువముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని నిలిపారు. ఈ జూలై ఒకటిన ‘‘ప్రతిప్రాణానికీ విలువనిచ్చే ప్రభుత్వమిది’’ అనే నినాదంతో ‘ఆరోగ్యశ్రీ’ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వెయ్యీ ఎనభైఎనిమిది అంబులెన్సులు, సంచార వైద్యశాలలు రాష్ట్రం నలుమూలల కదలాడుతున్నాయి. రాజశేఖరరెడ్డి ఒక యోగిలా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలను కలుపుకుంటూ చేవెళ్ళ నుంచి ఇచ్ఛాపురం వరకు 1475 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి పేదల జీవితాల్లోకి తొంగిచూశారు. అడుగడునా ఆకలి అలికిడిని పసిగట్టారు. బీటలువారిన బీడు భూముల్లో కాలుపెట్టారు. రైతు కడుపుకోతకు కారణాలను కనుగొన్నారు. ఆత్మహత్యల అంతరంగాన్ని అధిమిపట్టారు. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెనువెంటనే రైతుకు ఉచిత విద్యుత్ దస్త్రం మీద తొలిసంతకం చేశారు. మధ్యంతరంగా ఆగిన అన్ని నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అట్టడుగు ప్రజానీకం ‘అన్నం రాజన్న స్వరూపం’గా శ్లాఘించారు. ముసలివాళ్ళ మనస్సు ఎరిగిననేతల్లో అగ్రగణ్యుడు కూడా రాజన్నే. నెలొచ్చేసరికి ప్రభుత్వం నుంచి వాళ్ళ చేతికి నాలుగు డబ్బులు అందేలా చేయాలనుకున్నాడు. రాజన్న తన పాదయాత్రలో అడుగడుగున ఇటువంటి పేదరికపు అనుభవాలను పెనవేసుకున్నారు. అందుకే వృద్ధాప్యఫించన్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పావలావడ్డీ ప్రదాత, సున్నావడ్డీ స్ఫూర్తి ప్రదాత కూడా రాజన్నే. చేతిలో చిల్లుగవ్వలేక ఇంట్లోంచి వీధిలోకి రాని చెళ్ళమ్మలకు అక్కయ్యలకు, అమ్మలకు, అవ్వలకు ఆప్యాయతను పంచి, ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఆదర్శనాయకుడు రాజన్న. ‘‘చెల్లమ్మలకూ... అక్కయ్యలకూ..’’ అంటూ తన కుడి చేయి పైకెత్తి అభివాదంతో రాజన్న తన ఉపన్యాసం ప్రారంభిస్తే చాలు మహిళాలోకం మైమరచిపోయేది. విద్యపట్ల ఆసక్తి, విద్యార్థి పట్ల ఆదరణ, సరికొత్త విద్యాసంస్థల పట్ల శ్రద్ధ వహించి జిల్లాకో విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన చదువుల సంస్కర్త డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆర్ధికస్తోమత అందక చదువులకు స్వస్తిపలికిన ఎందరో విద్యార్థులను వెతికి వెలికితీశారు. విద్యార్థులతో కళాశాలలు కలకలాడేలా చేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ సంక్షేమవిధానం గ్రామీణ, పట్టణ పేదల బతుకుల్లో కాంతులీనాయి. వైఎస్ ఆలోచనలు ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకుంటాయి. జనం నోళ్ళల్లో నానుతాయి. దార్శనికునిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చెరగనిముద్ర వేసుకున్న డాక్టర్ వైఎస్సార్ పాలన నాటికి, నేటికి, ఏనాటికీ చిరస్మరణీయం. వ్యాసకర్త: డాక్టర్ జికెడి ప్రసాద్, ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం ‘ మొబైల్ : 93931 11740 -
ఏడాదిలో ఎంత తేడా!
‘అవినీతికి తావులేకుండా, పైసా దారి మళ్లకుండా ఏడాదిలో 3.58 కోట్ల మంది ప్రజలకు రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. పింఛన్ల కోసం గత ప్రభుత్వం నెలకు రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మేం నెలకు రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం విస్మరించిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.686 కోట్లు చెల్లించడంతో పాటు ఆరోగ్య ఆసరా అనే కొత్త పథకాన్ని ప్రారంభించాం. విద్యాదీవెన, వసతి దీవెన. పిల్లల చదువులకు భరోసా, కంటి వెలుగు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, గోరుముద్దతోపాటు అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తున్నాం’ జగన్ అనే నేను.. మీ బిడ్డగా, సీఎంగా ఏడాది క్రితం చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా స్పష్టం చేస్తున్నా. ఈ ఏడాది పాలన చిత్తశుద్ధి, నిజాయతీ, నిబద్ధతతో సాగిందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గత సర్కారు పాలనకు, ఏడాదిగా తమ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ఒకసారి చూడాలని, మేనిఫెస్టో హామీల అమలులో వ్యత్యాసాన్ని మనస్సాక్షిగా గమనించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలోని 90 శాతం వాగ్దానాలను ఏడాదిలోనే అమలు చేశామని గర్వంగా చెప్పగలనని, ఈ విషయాన్ని ప్రజలే లెక్క తేల్చాలని కోరారు. మేనిఫెస్టోలో 129 హామీలిస్తే 77 హామీలను అమలు చేశామని, మరో 36 హామీలు అమలుకు తేదీలతో క్యాలెండర్ ప్రకటించామని, ఇంకా 16 హామీలు మాత్రమే మిగిలాయని, వాటిని కూడా ఈ ఏడాది పరుగులు పెట్టిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని 40 అంశాలను అమలు చేశామని వివరించారు. వలంటీర్ల ద్వారా మేనిఫెస్టోను ఇంటింటికీ పంపిస్తామని, అందులో ఏమేం అమలు చేశామో మీరే లెక్క తేల్చాలని ప్రజలను కోరారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 10,641 రైతు భరోసా కేంద్రాలను శనివారం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఏడాది పాలన పూర్తి చేసిన తాను మలి ఏడాదిలో చేస్తున్న తొలి సంతకంగా దీన్ని అభివర్ణించారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది రైతులు, అధికారులనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సీఎం ప్రసంగం వివరాలివీ.. ఎంతో సంతోషంగా ఉంది.. ఈరోజుతో మన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఇవాళ రైతులతో గడపడం ఎంతో ఆనందంగా ఉంది. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మాది. తొలి ఏడాదిలోనే రైతు భరోసా–పీఎం కిసాన్ పథకాన్ని తెచ్చి సుమారు 49 లక్షల మంది రైతు కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ.10,200 కోట్లు జమ చేశాం. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, విపత్తు వస్తే ఆదుకోవడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేశాం. ఆ దిశగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 11 ఏళ్ల ప్రయాణంలో నలుమూలలా తిరిగా.. నా రాజకీయ జీవితం ప్రారంభమై 11 ఏళ్లు అవుతోంది. 2009లో ఎంపీగా ఎన్నికయ్యా. కోట్ల మంది ప్రజలను కలిసి ఉంటా. ప్రతి ప్రాంతం సమస్యను తెలుసుకునేందుకు రాష్ట్రం నలుమూలలా అడుగులు వేశా. 3,648 కి.మీ పాదయాత్రతో ప్రతి జిల్లాలో తిరిగా. నా రాజకీయ జీవితంలో దాదాపు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఉంటా. స్థోమత లేక కొంతమంది చదువుకోలేకపోయారని తెలిసి బాధపడ్డా. వైద్యం కోసం అప్పుల పాలు కావడం చూశా. క్యాన్సర్ వస్తే అరకొర చికిత్స అందించడం చూశా. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు, రైతుల కష్టాలను చూశా. కనీస ధర లేక పంటలు పొలాల్లోనే విడిచిపెడుతున్న వారిని చూశా. అక్క చెల్లెమ్మల బాధలు చూశా. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను చూశా. వారి కన్నీరు తుడిచి జీవితాలను మార్చాలనే ఆలోచన చేశా. ► ప్రజల సమస్యలన్నింటినీ చాలా దగ్గరగా చూశా. వాటన్నిటికీ సమాధానంగా మేనిఫెస్టో రూపొందించాం.కులం, మతం, పార్టీలు చూడకుండా, మాకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలని తలిచా. కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశాం. ఏడాది కాలంలోనే దాదాపు 90 శాతం హామీలను నెరవేర్చానని గర్వంగా చెబుతున్నా. ‘గత ప్రభుత్వం 650కి పైగా వాగ్దానాలు చేసి పేజీల కొద్దీ మేనిఫెస్టోను విడుదల చేసి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు మాఫియా ముఠాలుగా మారి ప్రతి పనికి లంచం దండుకున్నాయి. ఇప్పుడు ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పూర్తి పారదర్శకతతో అమలవుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి’ ‘‘చెప్పింది చేయడమే తప్ప ఏడాదిగా మరో ఆలోచన చేయలేదు. అవ్వాతాతల మీద గుండె నిండా ప్రేమతో, అక్కా చెల్లెమ్మల పట్ల మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో.. అన్ని వర్గాల ఆరోగ్యంపై శ్రద్ధతో ఏడాదిగా పనిచేస్తున్నాం’’ విత్తనాలకూ భరోసా.. ► గతంలో కల్తీ విత్తనాలు, పురుగు మందులు అన్నీ టీడీపీకి చెందిన వారే సరఫరా చేశారు. ఇవాళ ప్రభుత్వం నాణ్యతను నిర్ధారించి సరఫరా చేస్తోంది. 18వ తేదీ నుంచి విత్తనాలు సరఫరా చేస్తున్నాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా స్లిప్‌లు, సమయం సూచిస్తూ పంపిణీ చేస్తున్నారు. నాడు అధికార పార్టీ నాయకులకే ప్రాసెసింగ్ యూనిట్లు, కంపెనీలు.. ఒకటి గల్లా. మరొకటి శ్రీని ఫుడ్స్. ► ఈ ఏడాదిలో రూ.2200 కోట్లతో రైతులు ఇబ్బంది పడకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ అమలు చేశాం.టమాటా, ఉల్లి, మొక్కజొన్న, అరటి, బత్తాయిలు, బొప్పాయి కొంటున్నాం. గుంటూరులో సీఎం వైఎస్ జగన్ ఫొటోకు పూలాభిషేకం చేస్తున్న అమ్మఒడి, పింఛను లబ్ధిదారులు, ఆటో డ్రైవర్లు ఇలాంటి విపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం.. మేం రాజధాని ప్రాంతంలో పేదలకు భూములిస్తామంటే డెమొగ్రఫిక్ బ్యాలెన్స్ (సామాజిక సమతుల్యం) దెబ్బ తింటుందని కోర్టులో వాదించారు. భూములు సేకరిస్తుంటే కోర్టుకు వెళ్లిన విపక్షాలను చూశాం కానీ ఇక్కడ పేదలకు ప్రభుత్వ భూములు ఇస్తుంటే కూడా కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం. నాడు మాఫీ మాయ.. నేడు రైతన్నకు భరోసా గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది. రూ.87,612 కోట్లకు గానూ ఐదేళ్లలో కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మేం ఏడాది తిరగక ముందే రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. తొలిసారిగా కౌలు రైతులను కూడా ఆదుకుంటున్నాం. సున్నా వడ్డీ పథకం ద్వారా జూలైలో రూ.2 వేల కోట్లు వడ్డీ కింద ఇవ్వబోతున్నాం. ఇదీ తేడా... గతంలో ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల మాఫియా సంతకాలు, లంచాలు కావాలి. ఇవాళ ఎవరి ప్రమేయం, సిఫార్సు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ, గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారైనా సరే ఇంటి తలుపు తట్టి ప్రభుత్వ పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నాం. మీ కళ్ల ముందే గ్రామ సచివాలయాల ద్వారా గడువు విధించి మరీ 540 రకాల సేవలు అందిస్తున్నాం. దరఖాస్తు మొదలు లబ్ధిదారుల జాబితా వరకు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. ఒకటో తారీఖునే పండగైనా, ఆదివారం అయినా సరే తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి అవ్వాతాతలకు వలంటీర్లు చిరునవ్వుతో పెన్షన్ ఇస్తున్నారు. ► గతంలో స్కూళ్లు దారుణంగా ఉండేవి. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు నెలల తరబడి పెండింగ్ పెట్టేవారు. ఆయాలకు ఇచ్చే రూ.1000 గౌరవ వేతనం కూడా ఇచ్చేవారు కాదు. ఇవాళ ప్రతి స్కూల్లో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ సరుకుల బిల్లులు ఆలస్యం కాకుండా గ్రీన్‌ఛానల్‌లో పెట్టడమే కాకుండా, ఆయాల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచాం. పేద బిడ్డల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు తెచ్చాం. విద్యా సంస్థలపై నియంత్రణ కోసం స్కూళ్లు, కాలేజీలకు వేర్వేరుగా రెండు రెగ్యులేటరీ సంస్థలు తెచ్చాం. ► గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు చెల్లించలేదు. రూ.686 కోట్లు బకాయిలు పెట్టింది. అవన్నీ చెల్లించి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చేశాం. దీంతో తిరిగి చక్కటి చికిత్స అందిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలో కూడా ఆరోగ్యశ్రీలో చికిత్స అందుతోంది. నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం. లబ్ధిదారులు 3.58 కోట్ల మంది ఏడాదిలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 3.58 కోట్ల మంది కాగా వారి ఖాతాల్లో రూ.40,627 కోట్లు జమ చేశాం. వీరిలో 1.78 కోట్ల మంది బీసీలకు రూ.19,309 కోట్లు అందించాం. 61.28 లక్షల మంది ఎస్సీలకు రూ.6,500 కోట్లు ఖర్చు చేశాం. 18.40 లక్షల మంది ఎస్టీలకు రూ.2,136 కోట్లు ఇచ్చాం. 19.05 లక్షల మంది మైనారిటీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు రూ.1,722 కోట్లు ఇచ్చాం. 77.84 లక్షల మంది ఇతరుల కోసం రూ.10,768 కోట్లు ఖర్చు చేశాం. . ► గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రూ.39 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. రూ.2.60 లక్షల కోట్ల మేర అప్పులు చేసింది. దీనికి వడ్డీతో పాటు విద్యుత్ సంస్థలకు మరో రూ.20 వేల కోట్లు బకాయిలు పెట్టింది. ► మేం రివర్స్ టెండర్ల ద్వారా దాదాపు రూ.2,200 కోట్లు ఆదా చేశాం. అవినీతికి తావు లేకుండా జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. పోలీసులకు వీక్లీ ఆఫ్.. గతంలో పోలీసులతో బండ చాకిరీ చేయించుకునేవారు. ఏనాడూ వారి కుటుంబాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు వారికి వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో పోలీసు మిత్రలను ఏర్పాటు చేశాం. మద్యానికి కళ్లెం.. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి. దాదాపు 43 వేల బెల్టు షాపులు, మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో అక్కాచెల్లెమ్మలు ఇబ్బంది పడ్డారు. ఇవాళ 43 వేల బెల్టు షాపులు రద్దు చేయడంతోపాటు 33 శాతం దుకాణాలు తగ్గించాం. ధరలు పెంచడం వల్ల బీర్ల అమ్మకాలు 55 శాతం తగ్గాయి. ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు 24 శాతం తగ్గాయి. గతంలో వారానికి 5 నుంచి 6 బాటిళ్ల మద్యం తాగితే ఇప్పుడు 2 మాత్రమే తాగుతున్నారు. సామాజిక న్యాయం.. గత ప్రభుత్వానికి మాటలు తప్ప బీసీలపై ప్రేమ లేదు. సామాజిక న్యాయం అసలే లేదు. మా మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారు. డిప్యూటీ సీఎం పదవులు ఈ వర్గాలకే ఇచ్చాం. సచివాలయ ఉద్యోగాలలో 82.5 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. దుర్గ గుడి పాలక మండలిలో తొలిసారిగా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాం. కృష్ణా ఏఎంసీలో కూడా వారికే స్థానం దక్కేలా చేశాం. ఎస్సీలకు మూడు వేర్వేరు కమిషన్లతోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం.. పేదలకు ఇళ్ల స్థలాలు.. వైఎస్సార్ జయంతి రోజు 29 లక్షల ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేస్తాం. రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం అందిస్తాం. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి రూ.24 వేలతోపాటు చేపల వేటపై నిషేధం సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున సాయం చేశాం. ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు ఇబ్బంది పడకుండా సాయమందించాం. అందరి సంక్షేమం కోసం.. అవ్వాతాతల మీద గుండెనిండా ప్రేమతో, అక్కా చెల్లెమ్మల మీద మమకారంతో, రైతుల పట్ల బాధ్యతతో, అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో, మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో, మీ అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో, మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నా. -
13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభించామని, విశాఖ కేజీహెచ్‌లో కూడా డి ఎడిక్షన్ సెంటర్‌ను మొదలు పెట్టామని మంత్రి అవంతి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. విశాఖలో ఆయన మీడియతో మాట్లాడుతూ...‘ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి లక్షలాది మందికి ప్రాణదానం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా లక్షలాది మందికి ఆరోగ్య శ్రీ అందిస్తున్నారు. రాష్ట్రంలో 11 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులున్నారు. వారికి ప్రభుత్వం త్వరలోనే సేవలనందించనుంది. ఆరోగ్య శ్రీ ఒక్క ఏపీలోనే కాక చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డయాలసిస్ చేసుకున్న ప్రతి కిడ్నీ రోగికి ప్రభుత్వం 10 వేల రూపాయలు అందిస్తుంది. విద్య, వైద్య రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. గతంలో నిర్లక్ష్యానికి గురైన 108, 104 సేవలకు తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తున్నాం. విశాఖ జిల్లాలో 41 కొత్త 108 అంబులెన్సులు, 104 కోసం 27 మొబైల్ టీంలు ఏర్పాటు చేశాం అని అవంతి తెలిపారు. ('బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా') ఇంకా ఆయన మాట్లాడుతూ... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి పేదవాడికి వైద్యసేవలు అందించాలన్నదే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా పాడేరులో మెడికల్ కాలేజ్ శంఖుస్థాపన జరుగుతుందని అవంతి చెప్పారు. కరోనా కట్టడి కోసం సేవలందిస్తున్న పోలీసులకు, వైద్యులకు అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 31113 మందికి కరోన పరీక్షలు చేయడమైందని చెప్పారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి 80 వేల పీపీఈ కిట్లు, 49వేల ఎన్95 మాస్క్‌లు, 7 లక్షల 3 వేల సర్జికల్ మాస్క్‌లు, 2 లక్షల 40 వేల గ్లౌజ్‌లు, 436 ధర్మా మీటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పాడేరుతో పాటు అనకాపల్లిలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, అందుకు సంబంధించిన స్థల సమీకరణ కూడా పూర్తి అయ్యిందని తెలిపారు. త్వరలోనే ఇవి కార్యరూపం దాల్చనున్నాయి అని వెల్లడించారు. (మోదీ, జగన్ మధ్య సత్సంబంధాలు: రామ్‌మాధవ్) -
‘సీఎం జగన్ దేవుడిలా ఆదుకుంటున్నారు’
సాక్షి, అమరావతి: ఒకప్పుడు డబ్బులు లేక వైద్యం చేయించుకోలేకపోయామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడి రూపంలో తమని ఆదుకుంటున్నారని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు ఎన్.నారాయణ కొనియాడారు. సీఎం ఉచితంగా వైద్యసాయం అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో నాడు- నేడుపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రితో తమ అనుభవాలను పంచుకున్నారు. (ఆరోగ్య రంగంలో అనేక మార్పులు: సీఎం జగన్) వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు : కె.నరేష్, పూడివలస, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా ‘ప్రతినెలా ఒకటో తేదీ కల్లా వాలంటీర్ వచ్చి తెల్లవారు ఆరోగంటకే నా ఇంటిగుమ్మం దగ్గరకి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. దాంతో నేను నా భార్యా, పిల్లలు చాలా సంతోషంగా బతుకున్నాం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నా. నాకు ఒంట్లో ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రికి వెళితే డాక్టర్లు నీకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను, కానీ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ చేస్తారని చెప్పారు. అంతే కాకుండా ఉచితంగా రూ.పదివేలు పింఛన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు’ ఎం. రామ్మోహన్ రెడ్డి, వేంపల్లె, కడప జిల్లా ‘ముఖ్యమంత్రిగారికి పాదాభివందనాలు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. డిసెంబరు 14వ తేదీన గుండెనొప్పి వచ్చింది, కడప వెళ్తే హైదరాబాద్ పోవాలన్నారు. హైదరాబాద్ పోయి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేపించుకున్నాం. ఆపరేషన్ చేపించుకున్న తర్వాత డిశ్చార్జ్ అయినంక ఎలా బతకాలని నాకు నిద్రపట్టేది కాదు. డిశ్చార్జ్ అయిన మరుక్షణమే రూ.9500 వైయస్సార్ ఆసరా కింద డబ్బులు పడ్డాయి. చాలా సంతోషం అనిపించింది. ఇట్టాంటి పథకాలు మీకు(శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి) మాత్రమే వస్తాయనిపించింది. ఇలాంటి పథకాలు ఇంకా చేయాలని కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను’ ఏఎన్ఎమ్ లత : ‘ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. మీరు ప్రవేశపెట్టిన పథకాలనుప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. కరోనా టైంలో టెలిమెడిసన్ ద్వారా మేం మందులు ఇంటికి తీసుకెళ్లి రోగులకు ఇస్తున్నాం. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా సర్వే ఇంటింటికీ చేశాం. ఇప్పుడు ఐదో విడత చేస్తున్నాం. సిటిజన్ యాప్అని స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లకి ఆ యాప్ డౌన్ లోడ్ చేయిస్తున్నాం. గతంలో పదివేల మందికి ఒక ఏఎన్ఎం సర్వే చేసేవారం. ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా వచ్చిన ఏఎన్ఎంల సహాయంతో రెండు వేల మంది జనాభాకి సర్వే చేస్తున్నాం. మీకు ధన్యవాదములు’ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారు హేమ : ‘నా పాప పేరు హాసిని, పాపకి తలసేమియా, తనకి పింఛన్ వస్తుంది. దాన్ని నేను మాటల్లో చెప్పలేను, మా కుమార్తెకు పింఛన్ ఇచ్చి మా జీవితాల్లో మీరు వెలుగును చూపించారు. ఉచిత వైద్యం మాత్రమే కాదు నేనున్నానని భరోసా కల్పించారు. మీరు మాకు ఆశాజ్యోతి సార్. నా కృతజ్ఞతను ఎలాగైనా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మందులు విరివిగా దొరికేలా చేస్తారని నా మనవి. మా జగనన్నకి శతకోటి ప్రణామాలు’ వెంటనే జోక్యం చేసుకున్న సీఎం జగన్.. తలసేమియా వంటి పేషెంట్లకు పీరియాడికల్‌గా మందులు హోం డెలివరీ చేసే దిశగా ఆలోచించడమో.. లేక వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూడమని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సత్యవాణి, అడ్డతీగల, రాజవొమ్మంగి, ఐసీడీఎస్ వర్కర్ ‘మా ఏజెన్సీలో శిశుమరణాలు, బాలింత మరణాలు గతంలో ఎక్కువగా ఉండేవి. మీరు వచ్చిన తర్వాత వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం తీసుకోవడం వల్ల గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డకు జన్మనిస్తుంది. గర్భం దాల్చిన నుంచి వాళ్లు పుట్టిన తర్వాత పిల్లలకు కూడా పోషకాలు మీరు అందిస్తున్నారు. ఏజెన్సీలో పనులుకు వెళ్తే గాని పూటగడవని స్ధితిలో ఉంటే ప్రభుత్వం మాకు ఉచితంగా రేషన్ ఇచ్చి ఆదుకున్నారు. మీకు ధన్యవాదములు. మాకు చాలా చోట్ల అద్దె భవనాలున్నాయి. అంగన్వాడీ సెంటర్లకి కూడా శాశ్వత భవనాలు ప్రభుత్వం నిర్మించి ఇస్తే బాగుంటుంది. ఆసుపత్రులు నాడు–నేడు తరహాలో చేస్తే బాగుంటుంది. పేదవాడి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను.. మీరే పదికాలాలు పాటు సీఎంగా ఉండాలి సార్’ -
ప్రతి మూడు వారాలకు ఆరోగ్య శ్రీ బిల్లులు
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలుఅన్నింటినీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం. ఇకపై ప్రతి మూడు వారాలకు ఒకసారి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ కావాలి. ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలి. ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం కొత్తగా ప్రారంభించింది. రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తిరిగి పనులు చేసుకునే వరకు వైద్యుల సూచన మేరకు ఆర్థికంగా వారికి సహాయం అందించే ఈ కార్యక్రమం అమలులో ఇబ్బంది రాకుండా చూడాలి. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఏ లోటూ లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి మూడు వారాలకు ఒకసారి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బిల్లులను ఆయా ఆసుపత్రులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే.. ఆ వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. ఆరోగ్య ఆసరా కార్యక్రమం విషయంలో కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలు.. చేపలు, రొయ్యలకు ధర కల్పించడం తదితర అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సేవలు ► సీఎం ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ వైద్య సేవలను గుర్తించామని అధికారులు వెల్లడించారు. గర్భిణులు, కీమోథెరఫీ, డయాలసిస్ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందరినీ గుర్తించామన్నారు. షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. ► షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్ చేసి, వైద్య సేవల కోసం వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారని వివరించారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నారని తెలిపారు. ► జూలై 1వ తేదీన 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను ప్రారంభించాలని నిర్ణయించారు. టెలి మెడిసిన్ కోసం కొత్త బైకులను వెంటనే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ► కోవిడ్ పరీక్షలు రెండు లక్షలు దాటాయని, యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్ ► రాష్ట్రంలో స్థానికంగా చేపలు, రొయ్యలు విక్రయించేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలని చెప్పారు. దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చేపలకు ధర, మార్కెటింగ్ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవిని ఆదేశించారు. ► రైతులు పండించిన ఇతర ఉత్పత్తులకు కూడా కనీసం 30 శాతం స్థానికంగా వినియోగం ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ► ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, ఇతర రాష్ట్రాల తరహాలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. ► రాయలసీమ తదితర జిల్లాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమాటాలకు మరింత మార్కెట్ కల్పించాలని సీఎం సూచించారు. కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ► ఈ సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టెలీమెడిసిన్ కోసం కొత్త బైక్‌లు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : టెలీమెడిసిన్ కోసం కొత్త బైక్‌లను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ఎమెర్జెన్సీ సేవలకు కూడా ఏ లోటూ చూడాలన్నారు. బుధవారం ఆయన కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలన్నారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. (చదవండి : 2 లక్షలు దాటిన కరోనా వైద్య పరీక్షలు ) పక్కాగా ఆరోగ్య ఆసరా ►ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ►ఇది ఈ ప్రభుత్వంలో కొత్తగా పెట్టిన కార్యక్రమమని, అమల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఏ లోటూ లేకుండా ఎమర్జెన్సీ సేవలు ►సీఎం ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ సేవలను గుర్తించామన్న అధికారులు. ►గర్భిణీలు, కీమోథెరఫీ, డయాలసిస్ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందర్నీ గుర్తించామని చెప్పారు. ►షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు ►షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్ చేసి వైద్య సేవల కోసం వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారని సీఎం జగన్‌కు వివరించారు. ►క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు ►గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించామని వెల్లడి. ►ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్లోడ్ కావాలని, ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలన్న సీఎం ►ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం జూలై 1న 108 సర్వీసులు ప్రారంభం ►108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం ►అలాగే టెలి మెడిసిన్ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్ ►రాష్ట్రంలో స్థానికంగా విక్రయించేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం ►దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి ►కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలి ►దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం ►అలాగే రైతులు పండించిన ఇతర ఉత్పత్తులు కూడా కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలి ►చేపలకు ధర, మార్కెటింగ్ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సీఎం ఆదేశం ►ట్రేడర్లతో మాట్లాడాలని సీఎం ఆదేశం ►అలాగే ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్ ఇతర రాష్ట్రాల్లో లభించేలా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్‌కు సీఎం ఆదేశం. పండ్ల ఉత్పత్తులు ►రాయలసీమ తదితర జిల్లాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెట్. ►కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం. -
దేశ సగటు కంటే ఎక్కువగా టెస్టులు ఏపీలో చేస్తున్నాం
-
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నమూనాల సేకరణ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ కరోనా లక్షణాలున్న వారి నమూనాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సేకరించి వైరాలజీ ల్యాబొరేటరీలకు పంపిస్తున్నారు. ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నమూనాలు సేకరించి ల్యాబొరేటరీలకు పంపించేలా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో డా.మల్లికార్జున అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ► అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులతోపాటు, నెట్వర్క్ పరిధిలో లేని ఆస్పత్రుల్లోనూ నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపించవచ్చు. ► ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించే శాంపిల్ తీయాలి. నిర్ధారణ కోసం దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపితే పీపీఈ కిట్లు, హ్యాండిలింగ్, ప్యాకేజీ, రవాణా చార్జీల కింద రూ. 1,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. ► రాష్ట్రంలోని వైరాలజీ ల్యాబొరేటరీకి నిర్ధారణకు పంపిస్తే రవాణా ఛార్జీల కింద ఒక్కో నమూనాకు రూ. 200 చెల్లిస్తుంది. ► అనుమానిత లక్షణాలున్న వారికి వైద్యమందిస్తే రూ. 16,405, పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తే కేసును బట్టి రూ. 65 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు చెల్లించేలా ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయం తెలిసిందే. ► ఎక్కడైనా వైద్యం తీసుకుంటూ పేషెంటు మృతి చెందితే ఎన్నిరోజులు వైద్యమందించారో అన్నిరోజులకు బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. ► ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, ఆరోగ్య రక్షలో ఉన్న వాళ్లందరికీ ఈ వైద్యం వర్తిస్తుంది. ► ఏరోజుకారోజు అనుమానిత లక్షణాలున్న, పాజిటివ్ వివరాలను ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్లకు ఇవ్వాలి. -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స
-
ఏపీ: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా
సాక్షి, అమరావతి: కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు. కరోనా వైరస్ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే రూ.10,774 చెల్లిస్తారు. దీంతో పాటు వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కింద మరో రూ. 5,631 చెల్లిస్తారు. అంటే మొత్తం రూ.16,405 ఆస్పత్రులకు చెల్లిస్తారు. నిర్ధారణ కేసులకు రూ.65 వేల నుంచి రూ. 2.15 లక్షల వరకూ కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించారు. తక్షణమే ఈ ఆదేశాలు పాటించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ఆదేశించారు. సామాన్యుల రక్షణకు సర్కార్ చర్యలు అభినందనీయం సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా మహమ్మారి నుంచి సామాన్య ప్రజల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్– ఏపీ విభాగం పేర్కొంది. ఈ మేరకు వ్యవస్థాపక సభ్యుడు భూపతిరాజు రామకృష్ణంరాజు, కన్వీనర్లు బుద్దా చక్రధర్, ఇమాన్యుయల్, శ్రీనివాసగౌడ్, చలపతిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. అందులో ఏముందంటే.. ► ఒక్క రోజులో 53 లక్షల మంది ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేయడం అద్భుతం. ► లాక్డౌన్ దృష్ట్యా గత నెల 29న రేషన్ పంపిణీ చేయడం వల్ల పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు మేలు జరిగింది. ► ప్రభుత్వం చేపట్టిన విభిన్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల వల్ల అసంఘటిత, రోజువారీ వేతన కూలీలు, వ్యవసాయ కార్మికులు, సన్న, చిన్నకారు రైతులు, ఉపాధి కూలీలు, వృద్ధాప్య, వితంతు పెన్షనర్లు, గూడు లేని యాచకులతో పాటు అన్ని వర్గాల పేదలకు భరోసా లభించింది. చదవండి: రెడ్ జోన్ల వారీగా పరీక్షలు -
కోవిడ్ భయం వద్దు
సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్–19) వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఆందోళనకర పరిస్థితి లేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 70 అనుమానిత కేసులు నమోదు కాగా.. 57 కేసులకు సంబంధించిన పరీక్షల్లో కరోనా లేదని నిర్ధారణ అయినట్లు తెలిపింది. మరో 12 నమూనాలకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని, నెల్లూరులో ఒక కేసు మాత్రమే పాజిటివ్‌గా నమోదైందని వెల్లడించింది. కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో ఈనెల 13న చేర్పించిన వృద్ధురాలికి కరోనా లేదని తేలిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.గిరిధర్ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు సర్వే –విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రతి జిల్లాలోనూ వైద్య, ఆరోగ్య శాఖ సర్వే చేపట్టింది. – ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి శనివారం నాటికి 1.20 కోట్ల కుటుంబాలను సర్వే చేశారు. – ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు 6 వేల మంది వరకూ ఉన్నట్టు గుర్తించారు. మరో రెండు రోజులపాటు సర్వే కొనసాగుతుంది. – సర్వే ద్వారా గుర్తించిన వారిలో ఎక్కువ మంది దుబాయ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. – ఒక్క కడప జిల్లాలోనే 1,700 మంది దుబాయ్ నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. – వీరంతా 14 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. – ప్రతి జిల్లాలో నలుగురు అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలూ వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకున్నారు. ఇంట్లో ఉంచడమే ప్రత్యేక వ్యూహం విదేశాల నుంచి వచ్చిన వారిని బయటకు రానివ్వకుండా ఇంట్లోనే ఉంచడమే ప్రత్యేక వ్యూహంగా ముందుకెళుతున్నాం. వైరస్ సోకిన వారికి వైద్యం చేయడం సులభం. కానీ.. వ్యాప్తిని నిరోధించడమే ముఖ్యమైన పని. అందుకే ఈ చర్యలు తీసుకున్నాం. –డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ 50 ప్రత్యేక గదులు ఈ నెల 20వ తేదీ నాటికి కరోనా వైరస్ లక్షణాలున్న వారి కోసం 50 ప్రత్యేక గదులు (ఐసోలేటెడ్ రూమ్స్) ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు రెండ్రోజుల శిక్షణ ఇస్తున్నాం. మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. అవగాహనతో వ్యక్తిగత శుభ్రత పాటిస్తే సరిపోతుంది. –వి.విజయరామరాజు, ఇన్చార్జి కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ అందరికీ మాస్కులు అవసరం లేదు జనాభా మొత్తానికి మాస్కులు అవసరం లేదు. అనుమానిత లక్షణాలున్న వారికి, వైరస్ సోకిన వారికి, వైద్యమందించే వారికి మాత్రమే ఇవి అవసరం. అనుమానితుల కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం 900 పడకలు సిద్ధంగా ఉంచాం. – డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈఓ, ఆరోగ్యశ్రీ -
ఆరోగ్యశ్రీలో కేన్సర్‌ను చేర్చేందుకు ప్రయత్నిస్తా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ దేశంలోని అత్యధిక మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోందని.. అత్యంత క్లిష్టమైన కేన్సర్ల చికిత్సకూ ఇందులో అవకాశం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదని, తమదైన ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ లో కేన్సర్ చికిత్సను కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన ఇండియన్ కోఆపరేటివ్ ఆంకాలజీ నెట్వర్క్ (ఐకాన్) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై గవర్నర్ మాట్లాడారు. కేన్సర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి 42 ఏళ్లుగా కేన్సర్ విషయంలో విశేష కృషి చేస్తున్న ఐకాన్ సంస్థ ప్రజా చైతన్యం విషయంలో మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐకాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పర్వేశ్ పారీఖ్, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి డాక్టర్ సాయిరామ్, సీనియర్ ఆంకాలజిస్ట్ కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. గవర్నర్ అధికారిక కార్యక్రమాలు రద్దు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శనివారం నుంచి తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. -
అంధత్వ శాతం తగ్గించడమే లక్ష్యం
-
అవ్వాతాతలకు వైఎస్సార్ కంటి వెలుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కర్నూలులో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్ కంటి పరీక్షలను సమాంతరంగా ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. అద్దాలు అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత పక్షం రోజుల్లో వలంటీర్ల ద్వారా పెన్షన్లతో పాటు కళ్ల జోళ్లను కూడా అందజేయనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. మార్చి 1వ తేదీ నుంచి గుర్తించిన ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తారు. తొలుత 175 నియోజకవర్గాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మరో మండలంలో పూర్తి చేస్తారు. ఇలా అన్ని మండలాల్లో కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. అంధత్వ శాతం తగ్గించడమే లక్ష్యం ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రస్తుతం 1 శాతం ఉన్న అంధత్వాన్ని 0.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 5.30 కోట్ల మందికి ప్రభుత్వం కంటి వైద్య పరీక్షలు చేపట్టింది. రూ.560 కోట్ల వ్యయంతో 2022 జనవరి 31కి ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొలి విడత గత ఏడాది అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని (ప్రభుత్వ, ప్రైవేట్) 60,401 పాఠశాలల్లో 66,15,467 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 4,36,979 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించారు. రెండవ విడత కార్యక్రమంలో వీరికి పరీక్షలు నిర్వహించి 2,40,997 మందికి ఔషధాలు పంపిణీ చేశారు. 1,52,779 మంది విద్యార్థులకు కళ్లద్దాలు ఇవ్వాలని వైద్యులు సూచించగా, ఈ నెల 15వ తేదీ వరకు 56,767 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 46,286 మంది విద్యార్థులకు మూడోసారి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 2,177 మంది విద్యార్థులకు శస్త్ర చికిత్స అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరతారు. 10.30 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రథమ, ద్వితీయ దశల్లో చికిత్స చేయించుకున్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేస్తారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రధాన మంత్రి వందన యోజనను అమలు చేసినందుకు జాతీయ అవార్డులు పొందిన మెడికల్ అధికారులను సత్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరం వెళ్లి, తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత సీఎం తొలిసారి జిల్లా పర్యటనకు వస్తుండడంతో 25 వేల మందితో మానవహారం ద్వారా ఘన స్వాగతం పలకనున్నారు. నాడు–నేడులో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాలకు శంకుస్థాపన నాడు–నేడు కార్యక్రమం కింద గ్రామీణ స్థాయిలో ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాలను ‘హెల్త్ అండ్ వెల్నెస్’ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలులో శంకుస్థాపన చేస్తారు. సభా ప్రాంగణంలో నిర్మించిన మోడల్ ‘హెల్త్ అండ్ వెల్నెస్’ సెంటర్‌ను సందర్శిస్తారు. - కంటి పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ఏ రోజుకారోజు ఏఎన్ఎంలు గ్రామ సచివాలయం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంప్యూటరీకరించనున్నారు. - ప్రాథమిక స్కీనింగ్ బృందం రోజుకు 50 నుంచి 100 మందికి పరీక్షలు చేయనుంది. - మంచంలో ఉన్న అవ్వాతాతల ఇళ్లకే వెళ్లి ప్రాథమిక స్క్రీనింగ్ చేయనున్నారు. - వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అవ్వాతాతలను గ్రామ సచివాలయాల్లోని స్క్రీనింగ్ కేంద్రాలకు తీసుకువస్తారు. అక్కడే ప్రాథమిక స్క్రీనింగ్, అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. -
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసే ఆసుపత్రులకు రూ.234 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డులతో వైద్యం చేసిన ఆసుపత్రులకు నిధులు విడుదల చేశామన్నారు. ఈ క్రమంలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కింద వైద్యం చేసిన ఆసుపత్రులకు రూ.127 కోట్లు విడుదల చేశామన్నారు. తద్వారా ఉద్యోగులు, ప్రజల వైద్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. (ఉషస్సులు నింపుతున్న ఆరోగ్యశ్రీ) చదవండి: కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్య భరోసా