
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కరోనా బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బ్లాక్‌ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం ‘సత్యాగ్రహ దీక్షలు’చేపట్ట నుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ దీక్షలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడిం చాయి.
అన్ని జిల్లా కేంద్రాలతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో కూడా ఈ దీక్షలు చేపట్టనున్నారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతో పాటు పలువురు నేతలు రాష్ట్రవ్యాప్తంగా పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment