
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ కరోనా నియంత్రణ కోసం 2,229 కోట్ల పైచిలుకు వ్యయమైంది. అత్యాధునిక మౌలిక వసతుల కల్పనతో పాటు కోవిడ్ కేర్ కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ల నిర్వహణ, వాటికి కావాల్సిన కిట్లు, మందులు, రసాయనాలు.. తదితరాలకు భారీగా ఖర్చుపెట్టాల్సి వచ్చింది. విచిత్రమేంటంటే 2020 ఫిబ్రవరి 15 నాటికి మన రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు.
ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతం 14 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి వరకూ కొద్ది రోజుల పాటు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి నమూనాలు పంపించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో రోజుకు దాదాపు లక్ష టెస్టులు చేసే సామర్థ్యానికి ల్యాబ్‌లు చేరుకున్నాయి. గతేడాది అంటే మొదటి వేవ్‌లో 18 వేల మంది సిబ్బందిని నియమించగా.. సెకండ్ వేవ్‌లో 19 వేల మందికి పైగా సిబ్బంది నియామకానికి ఆమోదం వచ్చింది. ఇప్పటికే 18 వేల మంది విధుల్లో చేరారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన మొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment