
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 477 ఎంప్యానల్డ్ హాస్పిటళ్ల లో, అధిక శాతం ఆసుపత్రులు ఆరో గ్యశ్రీ సేవలను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేవలం 50 లోపు ఆసుపత్రులలోనే వైద్య సేవలు నిలిచిపోయాయని వివరించారు. వాటి లో కూడా సేవలు కొనసాగించాలని ఆయన ఆయా ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆయా ఆసుపత్రులకు ప్రభు త్వం అండగా ఉంటుందని, సేవలు నిలిపివేయాలని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.