ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలు బంద్‌ | Aarogyasri And EHS Services To Stop From January 6th In AP Private Hospitals, Know More Details Inside | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలు బంద్‌

Published Sun, Jan 5 2025 5:59 AM | Last Updated on Sun, Jan 5 2025 11:06 AM

Aarogyasri and EHS services closed

రేపటి నుంచి నిలిపివేయనున్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులు 

బకాయిల చెల్లింపులపై స్పందించని కూటమి ప్రభుత్వం 

రూ.3,000 కోట్ల బకాయిలు అడిగితే బడ్జెట్‌ లేదంటున్నారు  

ప్రభుత్వం తెచ్చే బీమా స్కీంపై మాకు అభ్యంతరాలున్నాయి 

ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సమాఖ్య వెల్లడి

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూ­ర్పు­) : ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ), ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) సేవలను నిలిపి­వేయ­నున్న­ట్లు  ఏపీ స్పెషాలటీ ఆస్పత్రుల సమా­ఖ్య (ఆశా) ప్రకటించింది. తమకు రావాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసినా ప్ర­భుత్వం నుంచి స్పష్టమైన హామీ­రాలేదని, నోటీ­సులో పే­ర్కొ­నట్లుగా ఈనెల 6 నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌­ఎస్‌ సేవలను నిలిపివే­స్తున్నట్లు తెలిపింది. 

శనివా­రం విజ­యవా­డలో నెట్‌­వర్క్‌ ఆస్ప­త్రుల యాజ­మాన్యంతో సమావేశం అనంతరం అసోసి­యేషన్‌ అధ్యక్షు­డు డాక్టర్‌ విజయ్‌కుమార్, కార్య­దర్శి డాక్టర్‌ సీహెచ్‌ అవినాష్‌ మీడియాతో మాట్లా­డారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవు­తున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకా­యిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తా­మని ­హామీ ఇ­చ్చా­రు.

కానీ, ఇప్పటికీ దానిపై  ఎ­లాంటి ప్రక­టనా చేయలేదు. అడిగితే బడ్జెట్‌ లేదంటున్నారు. ఈ పరి­స్థితుల్లో మేం సేవలు అందించ­లేం. పాత బకా­యిలకు అదనంగా ప్రతినెలా వస్తు­న్న బిల్లు­లు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్ప­త్రు­లను నిర్వహించలేం. మాకు రావా­ల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సే­వలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమ­వారం నుం­చి ఈహెచ్‌ఎస్‌ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.

బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..
ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం. 

బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మా­త్రమే వర్తించడంతో సేవాభావంతో వై­ద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెర­గాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీని­పై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25­లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement