Black Fungus In Aarogyasri: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్‌ నిర్ణయం - Sakshi
Sakshi News home page

ఆరోగ్య శ్రీలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స: ఆళ్ల నాని

Published Mon, May 17 2021 4:06 PM | Last Updated on Mon, May 17 2021 7:49 PM

Alla Nan Said Black Fungus Treatments Under Aarogyasri - Sakshi

సాక్షి, విజయవాడ: కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు.

ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నాం’’ అన్నారు. 

చదవండి: కరోనా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య శ్రీ పథకం సంజీవనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement