
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్న ‘ఒమిక్రాన్’పై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడుతూ కొత్త వేరియంట్ విషయంలో విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించి, పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్‌కు పంపిస్తామన్నారు.
104 సహా అవసరమైన సహాయ చర్యల సన్నద్ధతపై చర్చించారని, అలాగే జనవరి 15లోగా రెండు కోట్ల మందికి వ్యాక్సిన్‌లు వేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా అమలు చేస్తామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసు నమోదు కాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.
చదవండి: (వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్.. లైట్ తీసుకోవద్దు ప్లీజ్!)
Comments
Please login to add a commentAdd a comment