Black Fungus Treatment In Andhra Pradesh: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు - Sakshi
Sakshi News home page

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Published Wed, May 19 2021 5:35 PM | Last Updated on Wed, May 19 2021 9:15 PM

Black Fungus Treatment To Be Covered Under Aarogyasri, Andhra Pradesh Government Issues Orders - Sakshi

సాక్షి, విజయవాడ: ఇప్పటికే కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తాజాగా బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడండంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

కాగా, కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement