Fungus
-
అంతరించిపోయే స్టేజ్‌లో బనానా!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
కాలుష్యం లేదా కొన్ని రకాల చీడపీడల కారణంగా పూర్వం నాటి ప్రముఖ పండ్లు, కూరగాయాలు అంతరించిపోవడం జరిగింది. వాటి విత్తనాలు సైతం కనుమరగవ్వడం. అందుబాటులో ఉన్న మొక్కల సాయంతోనే కొత్త రకాల వంగడాలను సృష్టించడం వంటివి చేశారు శాస్త్రవేత్తలు. ఇలా ఎందుకు జరుగుతుందని శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఇప్పుడు ఆ స్టేజ్‌లోకి బనానాలు కూడా వచ్చేశాయి. ఔను!.. మనం ఎంతో ఇష్టంగా తినే అరటిపండ్లు అంతరించే పోయే ప్రమాదంలో ఉన్నాయని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందువల్ల అరటిపండ్లు అంతరించిపోతున్నాయి? రీజన్ ఏంటి? తదితరాల గురించే ఈ కథనం!. పేదవాడు సైతం కొనుక్కుని ఇష్టంగా తినగలిగే పండు అరటిపండు. అరటిపండులో ఉండే పోటాషియం వంటి విటమిన్లు ఎన్నో రకాల వ్యాధులను దరి చేరకుండా రక్షిస్తుంది. అలాంటి పోషకవిలువలు కలిగిన పండు ప్రస్తుతం కనుమరగయ్యే స్థితిలో ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రజలు ఇష్టంగా తినే అరటి పండ్లలలో కావెండిష్ అరటిపండ్లు ఒకటి. ఇది వాణిజ్యం పరంగా అధికంగా ఎగుమతయ్యే అరటిపండు కూడా ఇదే. ఈ అరటిపండ్ల చెట్లకు పనామా అనే ఉష్ణమండల జాతికి చెందిన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని. ఇది చెట్టు మూలల్లో అటాక్ చేసి నాశనం చేస్తుందని చెబుతున్నారు. ఇది చెట్టు మొదలులోనే రావడంతో ముందుగా మొక్కను నీటిని గ్రహించనీయకుండా చేస్తుంది. తద్వారా కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేని పరిస్థితి మొక్కలో ఏర్పడి చివరికి మొక్క చనిపోతుంది. దీంతో ఈ కావెండీష్ రకం అరటిపండ్లు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నట్లు వెల్లడించారు. సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఉన్నామని "ది ఫేట్ ఆఫ్ ది ఫ్రూట్ దట్ చేంజ్ ది వరల్డ్" అనే పుస్తకంలో రచయిత డాన్ కోపెల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శాస్త్రవేతలు ఈ అరటిపండ్లకు ఈ ఫంగల్ తెగులుని తట్టుకునే విధంగా వ్యాధి నిరోధకతను పెంచేలా జన్యు మార్పులు చేసే పనిలో ఉన్నారన్నారు. రైతులు కూడా ఈ రకం అరటి సాగుకి సంబంధించి ప్రత్యామ్నాయా మార్గాలపై దృష్టిసారించడం లేదా ఈ పండ్ల సాగును మానేయడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ కావెండిష్ రకం పండ్లను 1989లో తైవాన్‌లో గుర్తించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు విస్తరించింది. అక్కడ నుంచి భారత్, చైనాలోకి ప్రవేశించి, ప్రధాన అరటి ఉత్పత్తిలో ఒకటిగా నిలిచింది. ఆఖరికి ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పండిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యాధి దక్షిణాఫ్రికాలోని అరటి చెట్లలో కూడా కనిపించిందని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ప్రోఫెసర్ జేమ్స డేల్ తెలిపారు. ఈ రకమైన వ్యాధి అరటి చెట్లకు ఒక్కసారి వస్తే వదిలించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇలానే గతంతో గ్రోస్ మిచెల్ అనే రకం అరటిపండుకి టీఆర్ 4 అనే తెగులు వచ్చింది. దీంతో రైతులు మరో రకం అరటిపళ్లను సాగు చేయడంపై దృష్టిసారించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ రకం అరటిపండు క్రమేణ కనుమరుగయ్యింది. దాని స్థానంలోనే ఈ కావెండిష్ రకం అరటిపళ్లు వచ్చాయి. అయితే ఇది గ్రోస్ మిచెల్లా కావెండిష్ రకం అరటిపళ్లు అంతరించడానికి టైం పడుతుందని, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడానికి కనీసం దశాబ్దం పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈలోగా ఆ వ్యాధిని నివారించేలా జన్యుపరమైన మార్పులు చేయడం లేదా మొక్కల్లో వ్యాధినిరోధక స్థితిని పెంచి ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలిగేలా చేయగలమని కొందరూ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. (చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..) -
వేపకు మళ్లీ ‘డై బ్యాక్’ ముప్పు!
ల్లెపల్లెనా, రోడ్ల పక్కన, అడవుల్లో విస్తృతంగా పెరిగే మన వేపచెట్లకు మరోసారి ‘డై బ్యాక్’జబ్బు ముప్పు పొంచి ఉంది. సుమారు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ‘టీ మస్కిటో’, ఫంగస్ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న లక్షలాది వేపచెట్లు ఈ ఏడాది ఉగాది తర్వాత కోలుకుంటున్న క్రమంలో మళ్లీ టీ మస్కిటో దాడి మొదలుపెట్టింది. ఈసారి ఫిబ్రవరి నుంచి అకాల వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పంజా విసురుతోంది. ఫలితంగా చెట్లన్నీ కొమ్మలతో సహా ఎండి పోవడంతోపాటు ఆకులు రాలిపోతున్నాయి. దీనివల్ల చెట్లకు పోషకాలు అందక క్రమంగా చచ్చిపోతున్నాయి. దీన్నే డై బ్యాక్‌గా పిలుస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ తగ్గనున్న వేప విత్తన దిగుబడి... రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చని శాస్త్రేవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెగుళ్లు సోకడం వేపవిత్తనాల దిగుబడి భారీగా తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది 50 నుంచి 80% దాకా విత్త నాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, దీని ప్రభావం వేప ఉత్పత్తులు, నీమ్కేక్స్, నీమ్ ఆయిల్, నీమ్ కోటింగ్‌పై ఆధారపడిన పరిశ్రమలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డై బ్యాక్ జబ్బును జాతీయ స్థాయిలో దీనిని కట్టడి చేసేందుకు కార్యాచరణను చేపట్టక పోతే భవిష్యత్‌లో వేప ఆధారిత ముడిపదార్థాలను విదేశాల నుంచి దివగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎదురుకావొచ్చని చెబుతున్నారు. కొనసాగుతున్న పరిశోధనలు.. ఈ సమస్యపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రిసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఐఐసీటీ, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విడి విడిగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వేపచెట్లకు ఎదురవుతున్న కీటక దాడు లు, చెదలు, ఫంగస్‌లను ఎలా కట్టడి చేయాలనే దాని పై పరిష్కారాలు కనుగునేందుకు కృషి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఐలో పరి శోధన నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.జగదీశ్‌కుమార్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఫోమోప్సిస్ అజాడిరాచ్టే అనే పాథోజెన్ ద్వారా వేప చెట్లకు ఈ జబ్బు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ పాథోజెన్ గాలి ద్వారా సులభంగా వ్యాప్తికి అవకాశం ఉన్నందున వేపచెట్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. రాష్ట్రమంతటా వేప చెట్లు విస్తరించి ఉన్నందున అన్నింటికీ వివిధ రసా యన మిశ్ర మాలతో పిచికారీ చేయడం అసాధ్యంగా మారిందని వివరించారు. అయితే వేపకు బతికే శక్తిసామ ర్థ్యాలు ఎక్కువగా ఉన్నందున పెద్దచెట్లకు అంతగా నష్టం ఉండదని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం రిటైర్డ్ సంచాలకుడు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ అభిప్రాయపడ్డారు. కానీ గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు ఎక్కువ కావడంతో వేపచెట్టు నుంచి విత్తనం నేలపై పడి తిరిగి మొలకెత్తడం తగ్గిపోయిందన్నా రు. అందు వల్ల వేప ముడిపదార్థాల ఉత్పత్తి, సరఫరాలో తగ్గుదల కనిపిస్తోందని సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. -
చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!
ఆయనకు 67 ఏళ్లు. తలపండిన రైతు, అంతకుమించిన శాస్త్రవేత్త. చదివింది 8వ తరగతే. అయినా.. జ్ఞాన సంపన్నుడు. పురుగులను అరికట్టే బవేరియా బాసియానా అనే శిలీంద్రాన్ని 44 ఏళ్ల క్రితం ఆయన గుర్తించే నాటికి దాని గురించి శాస్త్రవేత్తలకే తెలీదు. అప్పటి నుంచి జీవన పురుగుమందు(బయో పెస్టిసైడ్)లను సొంతంగా తయారు చేసుకొని మిరప, పత్తి, మామిడి తదితర పంటలపై వాడుతున్నారు. అనేక సరికొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దేశ విదేశీ యూనివర్సిటీలతో కలసి సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో శాస్త్రజ్ఞులతో కలిసి 3 పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఘనాపాటి ఆయన. ప్రకృతి వ్యవసాయానికి బయో పెస్టిసైడ్స్ ఎంతో అవసరమంటున్న విలక్షణ రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్‌పై ప్రత్యేక కథనం. స్వీయ అనుభవ జ్ఞానంతో వ్యవసాయ రంగంలో అద్భుత ఆవిష్కరణలు వెలువరిస్తున్న తపస్వి కొంగర రమేష్. వ్యవసాయ కుటుంబంలో ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో. రైతు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నది విశాఖ జిల్లా ఆనందాపురం మండలం తర్లువాడలో. సొంతంగా తయారు చేసుకున్న జీవన పురుగుమందులతో మిరప, పత్తి, మామిడి వంటి పంటలను సాగు చేయటంతో పాటు.. అనేక విశిష్టమైన వంగడాలకు రూపుకల్పన చేసి భళా అనిపించుకుంటున్నారు. ఎంతకాలమైనా నిల్వ ఉండే, అత్యంత తీపి, సువాసన కలిగిన మామిడి వంగడాలు.. విలక్షణమైన మిరప వంగడం.. ఆవులకు ప్రాణాంతకమైన బ్రూస్లోసిస్ వ్యాధిని హోమియో వైద్యంతో తగ్గించడం.. ఇవీ రైతు శాస్త్రవేత్తగా రమేష్ సాధించిన కొన్ని విజయాలు. బయో పెస్టిసైడ్స్పై ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న పరిశోధనల గాథ ఆసక్తిదాయకం.. ‘బవేరియా’ అప్పటికి ఎవరికీ తెలీదు సొంత పొలంలో పత్తి తదితర పంటల ఆకులు తినే పురుగుల్ని చంపుతున్న బవేరియా బాసియానా అనే శిలీంధ్రాన్ని 1978లో 22 ఏళ్ల యువ రైతుగా రమేష్ తొలుత గుర్తించారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో లెక్కలేనన్ని పక్షులు మత్యువాత పడ్డాయి. పురుగులను తినే పక్షులు లేనందున వాటి సంఖ్య ఉధృతంగా పెరిగిపోయింది. ఒక పొలం నుంచి మరో పొలంలోనికి పురుగుల మంద గొర్రెల మందలా వచ్చేవి. ఏమి చేయాలో పాలుపోని ఆ దశలో.. కొన్ని పురుగులు సహజసిద్ధంగా చనిపోతున్నట్లు ఆయన గమనించారు. ఒక్కోసారి గుంపులో 90% పురుగులు చనిపోతూ ఉండేవి. చనిపోయిన పురుగులపై బూజు మాదిరిగా పేరుకొని ఉండేది. ఏదో ఒక ఫంగస్ ఈ పురుగులను చంపగలుగుతోందని రమేష్ గమనించారు. ఆ ఫంగస్‌ను తిరిగి వాడుకొని పురుగులను చంపగలమా? అన్న జిజ్ఞాస కలిగింది. ఫంగస్ సోకి చనిపోయిన పురుగులను బాపట్ల వ్యవసాయ కళాశాల, గుంటూరు లాం ఫారం, హైదరాబాద్‌లోని ఇక్రిశాట్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు యూపీలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. ఆరేళ్లపాటు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలిసి వివరించినా దీనిపై వారు సరైన అవగాహనకు రాలేకపోయారని రమేష్ తెలిపారు. రమేష్ మాత్రం పట్టువీడలేదు. ప్రయత్నం మానలేదు. చివరికి 1984లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల వ్యవసాయ కళాశాలలో పాథాలజిస్టు డాక్టర్ మొహిద్దీన్ దీన్ని ఇంగ్లాండులోని మైకలాజికల్ సొసైటీకి పంపంగా.. ఇది పురుగుల పాలిట మృత్యుపాశం వంటి ‘బివేరియా బాసియానా’ అనే శిలీంధ్రం అని వెల్లడైంది. ఆ తరువాత కాలంలో శాస్త్రజ్ఞుల సూచనలతో రమేష్ స్వయంగా పరిశోధనలు చేపట్టారు. చనిపోయిన పురుగుపై నుంచి సేకరించిన ఈ ఫంగస్‌ను వేరు చేసి, తన వ్యవసాయ అవసరాల మేరకు శుద్ధమైన బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని అభివృద్ధి చేయటం, పంటలపై వాడి ఫలితాలు సాధించడం నేర్చుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో బవేరియా బాసియానా వంటి జీవన పురుగుమందులను పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెస్తే రసాయనిక పురుగుమందుల అవసరం లేకుండా చేయవచ్చని రమేష్ భావించారు. 1987లో రాజేంద్రనగర్‌లో జరిగిన పత్తి శాస్త్రవేత్తల జాతీయ సదస్సులోనూ బవేరియా బాసియానాపై లోతైన పరిశోధనలు చేస్తే జల్లెడ పురుగులు, తెల్లదోమ ఆట కట్టించవచ్చని సూచించినా ఎవరికీ పట్టలేదు. అయినా రమేష్ తన పరిశోధనలు కొనసాగించారు. రూ. 200 ఖర్చుతో పురుగులకు చెక్ బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్ వంటి శిలీంధ్రాలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసుకుని జాగ్రత్తగా వినియోగిస్తే ఎకరాకు సుమారు రూ. 200 ఖర్చుతోనే మిర్చి, పత్తి, మామిడి, కూరగాయ పంటల్లో పురుగుల బెడదను తప్పించుకోవచ్చని రమేష్ అంటున్నారు. మిరప తదితర పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్ల తామర (బ్లాక్ త్రిప్స్)పై బవేరియా బాసియానా పని చేస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర రకాల ఫంగస్‌లతో కలుషితమై ప్రతికూల పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో ఇలాంటి బయో ఫెస్టిసైడ్‌ను వాడిన అనుభవం రైతులకు లేనందున శాస్త్రజ్ఞులు సరైన విధానాలను రైతులకు వివరించాలన్నారు. ఏ స్ట్రెయిన్? ఏ పురుగు? బవేరియా బాసియానా శిలీంద్రానికి సంబంధించి అనేక స్ట్రెయిన్లు ఉంటాయి. ఏ స్ట్రెయిన్ ఏ పంటపై, ఏయే పురుగులపై పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్థానికంగా పరిశోధనలు చేసి, జీవన పురుగుమందులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీవన ఎరువులపై పరిశోధనలు కొంత మెరుగ్గా జరుగుతున్నప్పటికీ.. జీవన పురుగుమందులపై పరిశోధనలు మన దేశంలో చురుగ్గా జరగటం లేదని రమేష్ తెలిపారు. బవేరియా శిలీంధ్రం అనేక దేశాల్లో 200 వరకు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్నదని రమేష్ తెలిపారు. 16 మందికి డాక్టరేట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ తర్లువాడలోని తన క్షేత్రంలో పత్తి పంటపై బవేరియా ప్రభావంపై చింతా విశ్వేశ్వరరావు సహకారంతో పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్స్‌లో రమేష్ ముఖ్య పరిశోధకుడిగా 3 పరిశోధనా పత్రాలు అచ్చయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 16 మంది శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు వచ్చాయి. ఈ పరిశోధనలు అడకమిక్ స్థాయిలోనే ఆగిపోయాయి. బవేరియాకు చెందిన 4–5 స్ట్రెయిన్లను వేరు చేసి యూనివర్సిటీలో భద్రపరచటం సాధ్యపడిందే తప్ప.. వాటిని విస్తృతంగా రైతుల దగ్గరకు తీసుకెళ్లటం సాధ్యపడలేదని రమేష్ తెలిపారు. జర్మనీ శాస్త్రవేత్తలు తమ కాకుమాను పొలంలో నుంచి మట్టి నమూనాలు సేకరించి తీసుకువెళ్లి ఈ ఫంగస్‌ను వాడుతున్నా తెలిపారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో వైజాగ్‌లోని గీతం విశ్వవిద్యాలయంతో కలసి రమేష్ పరిశోధనలు చేశారు. గీతం యూనివర్సిటీ తన పేరుతో పేటెంట్‌కు దరఖాస్తు చేయబోగా, రమేష్ పేరును మొదటి ఆవిష్కర్తగా పెట్టాలని నాబార్డ్ సూచించింది. అయితే, వారు అంగీకరించకపోవటంతో వారితో నాబార్డ్ నిధులు ఇవ్వటం నిలిపివేసింది. నూనెతో కలపి చల్లాలి బవేరియా బాసియానా వంటి శిలీంధ్రాలతో తయారు చేసిన జీవన పురుగుమందులను సాయంత్రం పూట, తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నీటిలో కాకుండా ఏదో ఒక నూనె (ఎకరానికి 2 లీ.)లో శిలీంధ్రాన్ని కలిపి హెలీస్ప్రేయర్/డ్రోన్‌తో సాయంకాలం పూట పిచికారీ చేయాలని రమేష్ సూచిస్తున్నారు. రైతులు నీటితో కలిపి చల్లుతున్నారని, నీటి తేమ ఆరిపోతే శిలీంద్రపు బీజాలు చనిపోయి పురుగులపై ప్రభావం చూపలేకపోవచ్చు. అందుకని ఏదో ఒక నూనెలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం బాగుంటుందన్నారు. నిద్రాణంగా ఉండే శిలీంద్రపు బీజాలకు తేమ తగిలితే జర్మినేట్ అవుతాయని, ఆ తర్వాత కొద్ది గంటల వరకే బతికి ఉంటాయి. ఆ లోగానే పురుగు వాటిని తినటం లేదా దాని శరరీంపై ఇవి పడటం జరిగితే.. ఆ శిలీంద్రం పురుగు దేహంలో పెరిగి దాన్ని చంపగలుగుతుంది. అందుకు రెండు–మూడు రోజుల సమయం పడుతుంది. నూనెతో కలిపి చల్లితే బీజాలు వారం, పది రోజుల పాటు గింజగానే ఉంటాయని.. పురుగులు ఈ బీజాలను తిన్నా, వాటి శరీరానికి తగిలినా చాలు. (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) శిలీంధ్రం బారిన పడిన చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక పురుగులో కోట్ల కొలదీ శిలీంధ్రపు బీజాలు పెరిగి, గాలి ద్వారా వ్యాపించి, పురుగులను నాశనం చేస్తాయి. ఇందువల్లనే జీవన పురుగుమందులు రసాయన పురుగు మందుల్లా వెంటనే కాక రెండు రోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. రీసైక్లింగ్ పెస్టిసైడ్గానూ పనిచేస్తాయి. రైతులు చల్లిన గంటలోనే ఫలితం ఆశిస్తున్నారు తప్ప తర్వాత రోజుల్లో ఏమి అవుతుందో గమనించడం లేదని, ఈ విషయమై రైతుల్లో అవగాహన కలిగించాలని రమేష్ సూచిస్తున్నారు. జీవన పురుగుమందుల వల్ల పర్యావరణానికి, మనుషులకు, ఇతర జీవులకు ఎటువంటి సమస్యా ఉండదు. – గేదెల శ్రీనివాసరెడ్డి, సాక్షి, తగరపువలస, విశాఖ జిల్లా ప్రకృతి వ్యవసాయానికి తప్పనిసరి అవసరం రైతులకు మోయలేని ఆర్థిక భారంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న రసాయనిక పురుగుమందులకు ఎన్నో విధాలుగా చక్కటి ప్రత్యామ్నాయం జీవన పురుగుమందులే. బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్, వర్టిసెల్ల లకాని వంటి శిలీంధ్రాలతో కూడిన జీవన పురుగుమందులపై ప్రభుత్వం విస్తృతంగా పరిశోధనలు జరపాలి. ఏయే పురుగులపై ఏయే స్రెయిన్లు పనిచేస్తున్నాయో నిర్థారించాలి. వ్యవసాయ వర్సిటీ నిపుణుల పర్యవేక్షణలో జీవన పురుగుమందులను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి రైతులకు అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి రైతులను ముందుగా చైతన్యవంతం చేయాలి. ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి బయో పెస్టిసైడ్స్ తప్పనిసరి అవసరం. – కొంగర రమేష్, నవనీత ఎవర్గ్రీన్స్, తర్లువాడ, విశాఖ జిల్లా -
వేపను వదలని శిలీంధ్రం
సాక్షి, హైదరాబాద్: గతేడాది వేప చెట్లను అతలాకుతలం చేసిన ఫంగస్ ఇక కొన్నేళ్లపాటు ఆ వృక్ష జాతి పాలిట ‘సీజనల్ వ్యాధి’గా కొనసాగనుంది. వచ్చే ఐదారేళ్లపాటు ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో ఆ శిలీంధ్రం ఆశించి వేప చెట్లకు నష్టం చేసే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం తాజాగా ఈ విషయం గుర్తించింది. ఈ నెల 15 నుంచి జరిపిన పరిశోధనలో, గతేడాది తీవ్ర ప్రభావం చూపిన ఫోమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం అనే ఫంగస్ వేప చెట్లకు మళ్లీ ఆశించినట్టు తేల్చారు. గతేడాది ప్రభావం తీవ్రంగా ఉండగా, ఈసారి కాస్త తక్కువగా ఉంది. దాదాపు 20 శాతం చెట్లు చనిపోతాయన్న అంచనా గతేడాది వ్యక్తమైనా, చివరకు ఔషధ వృక్షంగా పేరుగాంచిన వేప తనను తాను బతికించుకుంది. అతి తక్కువ సంఖ్యలోనే చెట్లు చనిపోయాయి. ప్రభావం తీవ్రంగా ఉన్నా చివరకు ప్రమాదం నుంచి వాటంతట అవే బయపడడాన్ని చూసి శిలీంధ్రాన్ని విజయవంతంగా జయించినట్టేనని, ఇక ఆ శిలీంద్రం అంతమైనట్టేనని భావించారు. కానీ, సరిగ్గా మళ్లీ గత ఆగస్టు చివరికల్లా కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మల చివర్లు ఎండిపోవటం మొదలైంది. క్రమంగా సమస్య పెరుగుతుండటంతో ఈ నెల రెండో వారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ఆదేశం మేరకు డాక్టర్ సి.నరేందర్‌రెడ్డి, డాక్టర్ ఎస్జే రహమాన్, డాక్టర్ జి.ఉమాదేవి, డాక్టర్ ఎస్.హుస్సాని, డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం.వెంకటయ్య, డాక్టర్ బి.రాజేశ్వరి, డాక్టర్ మాధవిలతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి వేప నమూనాలు సేకరించి యూనివర్సిటీ ల్యాబ్‌లో వారం పాటు బీఓడీ ఇంక్యుబేటర్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఫొమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం ఫంగస్ భారీగానే ఉన్నట్టు తేలింది. అయితే ఈసారి వాటిపై రసాయనాలు పిచికారీ చేయాల్సిన అవసరం లేదని, మళ్లీ పొడి వాతావరణం వచ్చేసరికి ఫంగస్‌ను వేప జయిస్తుందని పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ పేర్కొన్నారు. భారీ వర్షాలతోనే.. గతేడాది ఆశించిన శిలీంధ్రం పూర్తిగా మాయం కాకముందే వరసపెట్టి భారీగా కురిసిన వర్షాలతో మళ్లీ అది ఉత్తేజితం అయిందని జగదీశ్వర్ చెప్పారు. మధ్యలో దాదాపు పక్షం రోజుల పాటు పూర్తి పొడి వాతావరణం కొనసాగిన సమయంలో వీచిన గాలులకు శిలీంద్రం వాతావరణంలో కలిసి మిగతా ప్రాంతాలకు వేగంగా విస్తరించిందని పేర్కొన్నారు. అయితే దాన్ని తట్టుకునే శక్తి వేపకు ఈపాటికే వచ్చిందని, భారీ నష్టం లేకుండానే క్రమంగా అది తగ్గుముఖం పడుతుందని వివరించారు. కానీ సీజనల్ వ్యాధి మాదిరి కొన్నేళ్లపాటు వేపను ఆశించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది క్రిమినాశకాలు, శిలీంధ్ర నాశకాలను ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ, ఈ సారి మాత్రం అలాంటి సిఫారసులు చేయటం లేదని తెలిపారు. నర్సరీల్లో పెంచే వేప మొక్కలకు మాత్రం మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కార్బెండిజమ్, మాంకోజెబ్, థియామెథాక్సమ్, అసెటామాప్రిడ్లను పిచికారీ చేయొచ్చని సూచించారు. -
వేపచెట్టు మళ్లీ ఎండిపోతోంది
సాక్షి, హైదరాబాద్: వేపకు మళ్లీ ఫంగస్ సవాల్ విసురుతోంది. గతేడాది ఆగస్టు–సెప్టెంబర్ మాసాల్లో వేపకొమ్మల చివర్లు మాడిపోయి.. చూస్తుండగానే చెట్టు మొత్తం ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడూ సరిగ్గా అదే సమయంలో వేపచెట్ల చివర్లు ఎండిపోవటం మొదలైంది. దీంతో ఈ ఫంగస్ సమస్య వేపచెట్ల పాలిట సీజనల్ దాడిగా మారనుందనే నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం పది రోజులుగా నగర శివారుల్లో, శంషాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లో వేపచెట్ల కొమ్మ చివరి భాగాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. అయితే గతేడాది స్థాయిలో తీవ్రత లేకున్నా, కొన్ని ప్రాంతాల్లో ఈ ఎండిపోతున్న తీరు వేగంగా విస్తరిస్తోంది. మళ్లీ అదే ఫంగస్ వ్యాప్తి? గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికిపైగా వేపచెట్ల కొమ్మలు ఎండిపోయాయి. వీటిలో 10 శాతం చెట్లు నిలువునా ఎండిపోయాయి. కానీ ఔషధ వృక్షమనే పేరున్న వేపచెట్లు తమను తాము కాపాడుకుని.. ఉగాదికల్లా మళ్లీ చిగురించాయి. మురికినీళ్లు నిరంతరం నిలిచే ప్రాంతాలు, మొదలు వద్ద కాంక్రీట్ చేసిన ప్రాంతాల్లోని చెట్లు మాత్రం ఎండిపోయాయి. వేపను సాధారణంగా ఆశించే టిమస్కిటో బగ్ అనే పురుగు కాటువేయటం, ఆ ప్రాంతం నుంచి ‘పోమోస్సిస్ అజాడిరెక్టే’ అనే ఫంగస్ లోపలికి ప్రవేశించి చెట్లు ఎండిపోయేలా చేసినట్టు నిపుణులు గుర్తించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిపుణులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎండిన వేపకొమ్మలు తెచ్చి పరిశోధించారు. వివిధ పరీక్షల్లో పోమోప్సిస్ అజాడిరెక్టే ప్రభావం చాలా ఎక్కువుందని, ప్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్‌లు సోకాయని తేలింది. వీటి నివారణకు కొన్ని మందులను సూచిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. మళ్లీ పరీక్షలు ప్రారంభం ఇప్పుడు మళ్లీ వేపకొమ్మలు ఎండిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు శంషాబాద్ సమీపంలోని కొన్ని చెట్ల నమూనాలను సేకరించి కల్చర్ పరీక్షలు చేస్తున్నారు. ఫిర్యాదులొచ్చిన మిగతా ప్రాంతాల నుంచి కూడా నమూనాలు సేకరిస్తున్నామని పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ సాక్షితో చెప్పారు. ‘వాతావరణంలో ఫంగస్‌లు కలిసిపోయినప్పుడు తదుపరి సంవత్సరాల్లోనూ అవి మళ్లీ ప్రభావం చూపుతాయి. కొన్నిచోట్ల చెట్లు ఎండిపోవటానికి ఇదే కారణం కావచ్చు. ఈ నెలలో సమస్య విస్తరిస్తే, ఈసారీ ఫంగస్ ప్రభావం ఉన్నట్టేనని భావించాల’ని వివరించారు. -
ఒక చావు.. మరో పుట్టుక.. ఈగను చంపేసి వృద్ధి చెందిన ‘జాంబీ’ ఫంగస్
ఈ ఫొటో చూశారా? ‘బీఎంసీ ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్ ఇమేజ్’ పోటీలో మొదటిస్థానం దక్కించుకుంది. అందులో ప్రత్యేకత ఏముందనేగా సందేహం? ఈగలోకి ప్రవేశించిన ‘జాంబీ’ ఫంగస్ ఈగను చంపేసి.. అది వృద్ధి చెందింది. ఈగ మరణించి... ఫంగస్ బతకడమే కాదు, మరింత విస్తరించటానికి ఉపయోగపడింది. ఒక చావు.. మరో పుట్టుక. జీవ పరిణామ క్రమమే అది కదా! సైన్స్ ఫిక్షన్‌ను తలపిస్తున్న ఈ చిత్రాన్ని పరిణామ జీవశాస్త్రవేత్త రాబర్టో గ్రాసా రో, పెరూలోని తంబోపత నేషనల్ రిజర్వ్‌లో క్యాప్చర్ చేశాడు. రిలేషన్షిప్స్ ఇన్ నేచర్, బయోడైవర్సిటీ అండర్ థ్రెట్, లైఫ్ క్లోజప్, రీసర్జ్ ఇన్ యాక్షన్ అనే నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో... జాంబీ ఫంగస్ ఫొటో టాప్ ప్రైజ్ గెలుచుకుంది. చదవండి: మిస్టరీ కేసు: ఆన్లైన్ వేలంలో కొన్న సూట్‌కేసులో ఏముందంటే... -
గాంధీ ఆస్పత్రికి కోవిడ్ బాధితుల క్యూ
Covid Patients At Gandhi Hospital: గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధితులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. ఇన్‌పేషెంట్ వార్డుల్లో సుమారు 70 నుంచి 80 మంది మాత్రమే ఉండగా, తాజాగా ఈ సంఖ్య 111కు చేరింది. ఫలితంగా మెయిన్ బిల్డింగ్‌లోని సెకండ్ ఫ్లోర్ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు కూడా ఉన్నారు. తగ్గినట్లే తగ్గిన ఇన్‌పేషంట్ల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వంద మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ఒమిక్రాన్ బాధితులే. చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.. -
38 సార్లు మందు కొట్టినా.. చేతికి అందలేదు
సాక్షి, కోదాడ(నల్లగొండ): గతేడాది మిర్చికి మార్కెట్లో మంచి రేటు ఉండటంతో ఈ ఏడాది రైతులు ఎంతో ఆశతో మిరప సాగు చేపట్టారు. కానీ, తెగుళ్ల తీవ్రతతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. విపరీతమైన తెగుళ్లతో పంట ఎదుగుదల లేక, పూత రాక.. వచ్చినా కాత నిలవకుండా పోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రెడ్లకుంటకు చెందిన అంబటి నారాయణ రెండు ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు. సాగు చేసిన తర్వాత పంటకు విపరీతంగా తెగుళ్లు సోకడంతో పురుగు మందులతో పాటు సేంద్రియ ద్రావణాలను కూడా దాదాపు 38 సార్లు స్ప్రే చేశాడు. రెండు ఎకరాల సాగు కోసం రూ.లక్షా 25 వేల పెట్టుబడి పెట్టాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. క్వింటా మిరప కూడా దిగుబడి రాలేదు. చేసేదేం లేక గత వారం రోజులుగా పంటపొలంలో గేదెలు మేపుతున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..
ప్రస్తుతం ప్రపంచమంతా పెనిస్ మష్రూమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీని శాస్త్రీయనామం ఫాలస్ రూబికండస్. ఇది స్టిన్క్హాన్ కుటుంబానికి చెందిన ఫంగస్. దీనిని 1811లో కనిపెట్టారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఘనా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రిక వంటి ఉష్ణమండల దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఐతే దీనికి సంబంధించిన ఇమేజ్ను తాజాగా సైన్స్ అలర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏమిటి ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత పెనిస్ పుట్టగొడుగులు ఎటువంటి మట్టిలోనైనా బతుకుతాయి. ఐతే మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీలు మాత్రం ఈ పుట్టగొడుగులను జిరి-ఫిరి అని పిలుస్తారు. భరియా, బైగా ఆదివాసీల సంప్రదాయ ఔషధాల్లో ఇది ప్రముఖమైనది. ఈ పుట్టగొడుగులను టైఫాయిడ్, పేగు జ్వరాల నివారణకు ఔషధంగా వినియోగిస్తారు. చక్కెరతో ఈ పుట్టగొడుగులను బాగారుద్ది, ఎండబెట్టి పొడిచేస్తారు. ఈ పొడిని ప్రసవ సమయంలో మహిళలకు టీ స్పూను చొప్పున అందిస్తే సుఖ ప్రసవం జరుగుతుందట. అలాగే టైఫాయిడ్‌తో బాధపడుతున్నవారికి రోజుకు మూడు స్పూనుల చొప్పున పట్టిస్తే నయం అవుతుంది. ఈ విధంగా గిరిజనులు వివిధ రోగాలను నయంచేయడానికి పెనిస్ పుట్టగొడుగులను ఉపయోగిస్తుంటారు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మన దేశంలోనేకాకుండా, ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీలు లైంగిక శక్తిని పెంచే ఔషధంగా దీనిని ఉపయోగిస్తారు. ఐతే దాని వాసన చాలా ప్రమాదకరమైనది. ఈ పుట్టగొడుగుల వాసన కీటకాలను ఆకర్షిస్తుంది. సాధారణంగా వర్షాల తర్వాత చాలా దేశాలలో పెరుగుతోంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
ప్రకృతే పరమౌషధం!
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. హా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్‌పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్‌లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్‌ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్‌ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్‌ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
కణితి అని భావిస్తే.. వైట్ ఫంగస్‌గా తేలింది
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ విభిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మెదడులో కణితి ఉందని భావించిన వైద్యులు ఆపరేషన్ తీసి దాన్ని తొలగించారు. తీరా చూస్తే అది కాస్త వైట్ ఫంగస్‌గా తేలింది. దాంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన కలా బాయ్ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెకు తన శరీరం కుడి భాగం విపరీతంగా లాగడం ప్రారంభించింది. దాంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేసి.. మెదడులో కణితి ఏర్పడినట్లు గుర్తించారు. ప్రాణాంతక కణితిని వెంటనే తొలగించాలని సూచించారు. వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత కణితికి బయాప్సి నిర్వహించగా షాకింగ్ విషయం తెలిసింది. వైద్యులు భావించినట్లు అది కణితి కాదు.. వైట్ ఫంగస్ అని తేలింది. ఈ సందర్భంగా కలా బాయ్‌కు ఆపరేషన్ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ‘‘ఎంఆర్ఐ స్కాన్‌లో ఫంగస్ కణితిలానే కనిపించింది. పైగా కణితి ఏర్పడినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో కలా బాయ్‌లో అవే లక్షణాలు కనిపించాయి. ఆమె అదృష్టం బాగుండి ఫంగస్ మిగతా భాగాలకు చేరేలోపే దాన్ని తొలగించగలిగాము. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం’’ అని తెలిపారు. చదవండి: శరీర బరువులో సగం ఉన్న కణితి, తొలగించిన డాక్టర్లు -
బ్లాక్-వైట్-ఎల్లో... ఈ ఫంగస్‌లతో ప్రమాదమేంటి?
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని మహమ్మారిగా ప్రకటించారు. మరోవైపు కొత్తగా వైట్, ఎల్లో ఫంగస్ కేసులూ నమోదవుతున్నాయి. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో.. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి కోమార్బిడిటీస్ ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గి.. ఫంగస్‌లు దాడి చేస్తున్నాయి. మరి ఈ ఫంగస్‌లు ఏమిటి? ఎలా సోకుతాయి? వాటితో లక్షణాలు, ప్రమాదాలు ఏమిటనే వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకరి నుంచి మరొకరికి సోకవు బ్లాక్, వైట్, ఎల్లో... ఫంగస్ ఏదైనా సరే నిజానికి మన చుట్టూ ఉండే పరిసరాలు, వాతావరణంలోనే ఉంటాయి. వాటిని మన శరీరం తరచూ ఎదుర్కొంటూనే ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో అవి మనను ఏమీ చేయలేవు. శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి తగ్గిపోయినవారిపై మాత్రమే ప్రభావం చూపుతాయి. వైరస్, బ్యాక్టీరియాల తరహాలో ఒకరి నుంచి మరొకరికి సోకుతాయన్న ఆందోళన అవసరం లేదు. ముందే గుర్తిస్తే చికిత్స సులువు ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ముందుగా గుర్తించగలిగితే సులువుగానే చికిత్స చేయవచ్చని వైద్య నిపు ణులు చెప్తున్నారు. ఒక స్థాయి వరకు సాధారణ మందులతోనే బయటపడొచ్చని పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయికి చేరి శరీర భాగాలు దెబ్బతినడం మొదలైతే.. ప్రభావవంతమైన యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుందని, శస్త్రచికిత్సలు చేసి ఫంగస్ సోకిన కణజాలా న్ని తొలగించాల్సి వస్తుందని వివరిస్తున్నారు. చదవండి: వైట్ ఫంగస్: పేగులకు రంధ్రాలు బ్లాక్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ అసలు పేరు మ్యూకోర్ మైకోసిస్. సాధారణంగా మన పరిసరాల్లోనే ఉండే ఈ ఫంగస్.. శరీరం బలహీనమై, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ఏవైనా వ్యాధులకు గురై స్టెరాయిడ్లు, యాంటీ బయాటిక్స్, యాంటీ వైరల్ మందులు అధికంగా వాడినప్పు డు, శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు, మధుమేహం, షుగర్ పెరిగిపోయినప్పుడు ఈ ఫంగస్ దాడిచేసే అవకాశాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 12 వేల మందికి పైగా బ్లాక్ ఫంగస్ బారినపడినట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లక్షణాలు ఇవీ.. తీవ్రమైన తలనొప్పి, ముక్కు బిగుసుకుపోవడం, ముక్కు నుంచి ఆకుపచ్చ రంగులో స్రావం, ముక్కులోంచి రక్తం కారడం, గొంతు నొప్పి, పంటి నొప్పి, పళ్లు వదులుకావడం, కళ్ల చుట్టూ, ముఖం ఉబ్బడం, చర్మం రంగుమార డం వంటివి బ్లాక్ ఫంగస్ సాధారణ లక్ష ణా లు. ముక్కు లోపలిభాగంలో, కొండనాలుక ఉండే చోట నల్ల రంగు మచ్చలు కనిపిస్తాయి. ► ఈ ఫంగస్ ఊపిరితిత్తులకు వ్యాపిస్తే.. జ్వరం, ఛాతీలో నొప్పి, నోట్లోంచి రక్తం పడటం వంటివి ఏర్పడతాయి. ► బ్లాక్ ఫంగస్ జీర్ణ వ్యవస్థకూ సోకే ప్రమా దం ఉంది. అదే జరిగితే కడుపునొప్పి, పొ ట్ట ఉబ్బడం వంటి లక్షణాలు ఉంటాయి. ► ఈ ఫంగస్ సోకినవారిలో కొందరికి కళ్లు, ముక్కు లోపలి భాగంలో కండరాలను తొలగించాల్సి వస్తుంది. చదవండి: బ్లాక్ ఫంగస్: నెల రోజుల్లో జిల్లాలో 23 కేసులు ఎవరికి ప్రమాదకరం? బ్లాక్ ఫంగస్ బారినపడుతున్న వారి లో 90 శాతానికిపైగా మధుమేహం ఉన్నవారు/ స్టెరాయిడ్లు అధికమో తాదులో వాడినవారేనని ఎయిమ్స్ డైరెక్టర్ ఇటీవలే తెలిపారు. ► అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న వారు, ఐసీయూలో దీర్ఘకాలం చికిత్స పొందుతున్న వారికి సోకే అవకాశం ఉంది. ► వెరికొనజోల్ థెరపీ (ఊపిరితిత్తులకు సోకే ఓ రకం ఫంగస్ వ్యాధికి చికిత్స) తీసుకుంటున్న వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వైట్ ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా మరింత ప్రమాదకరమైనది ఎల్లో ఫంగస్. దీనిని మ్యూకోర్సెప్టిక్గా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజి యాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసును గుర్తిం చారు. బ్లాక్, వైట్ ఫంగస్ల లక్షణాలు ఎక్కువగా బయటికి కనిపిస్తే.. ఎల్లో ఫంగస్ లోలోపలే వ్యాపిస్తూ ఉంటుంది. బయటికి పెద్దగా లక్షణాలు కనబడకపోవడంతో దానిని గుర్తించేసరికే ప్రాణాంతకంగా మారు తుందని ఘజియాబాద్ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ త్యాగి తెలిపారు. సాధారణంగా ఎల్లో ఫంగస్ ఎక్కువగా సరీసృపాల (పాములు, బల్లులు, ఇతర పాకే జంతువుల)కు సోకుతుందని.. మనుషు ల్లో దాని ప్రభావంపై అధ్యయనం చేయాల్సి ఉందని ఐసీఎంఆర్‌లో అంటువ్యాధుల విభాగం చీఫ్ సమీరన్ పండా చెప్పారు. లక్షణాలు ఇవీ.. బద్ధకం, ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం వంటివి సాధారణంగా ఎల్లో ఫంగస్ లక్షణా లు. ఈ వ్యాధి ముదిరితే.. గాయాలు తగ్గకపోవడం, చిన్న గాయాలైనా సరే చీము పట్టడం, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడం వంటివి కనిపిస్తాయి. చివరికి అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ఎల్లో ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా మరింత ప్రమాదకరమైనది ఎల్లో ఫంగస్. దీనిని మ్యూకోర్సెప్టిక్గా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజి యాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసును గుర్తిం చారు. బ్లాక్, వైట్ ఫంగస్ల లక్షణాలు ఎక్కువగా బయటికి కనిపిస్తే.. ఎల్లో ఫంగస్ లోలోపలే వ్యాపిస్తూ ఉంటుంది. బయటికి పెద్దగా లక్షణాలు కనబడకపోవడంతో దానిని గుర్తించేసరికే ప్రాణాంతకంగా మారు తుందని ఘజియాబాద్ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ త్యాగి తెలిపారు. సాధారణంగా ఎల్లో ఫంగస్ ఎక్కువగా సరీసృపాల (పాములు, బల్లులు, ఇతర పాకే జంతువుల)కు సోకుతుందని.. మనుషు ల్లో దాని ప్రభావంపై అధ్యయనం చేయాల్సి ఉందని ఐసీఎంఆర్‌లో అంటువ్యాధుల విభాగం చీఫ్ సమీరన్ పండా చెప్పారు. లక్షణాలు ఇవీ.. బద్ధకం, ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం వంటివి సాధారణంగా ఎల్లో ఫంగస్ లక్షణా లు. ఈ వ్యాధి ముదిరితే.. గాయాలు తగ్గకపోవడం, చిన్న గాయాలైనా సరే చీము పట్టడం, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడం వంటివి కనిపిస్తాయి. చివరికి అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ఎవరికి ప్రమాదకరం? ఎల్లో ఫంగస్ ప్రత్యేకంగా ఎవరికి సోకుతుందన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని వైద్యులు చెప్తున్నారు. రోగ నిరోధకశక్తి తగ్గినవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, కేన్సర్ చికిత్స పొందుతున్నవారు, ఇతర కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ ప్రభావం చూపుతుందంటున్నారు. ఎవరికి ప్రమాదకరం? ఎల్లో ఫంగస్ ప్రత్యేకంగా ఎవరికి సోకుతుందన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని వైద్యులు చెప్తున్నారు. రోగ నిరోధకశక్తి తగ్గినవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు, కేన్సర్ చికిత్స పొందుతున్నవారు, ఇతర కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ ప్రభావం చూపుతుందంటున్నారు. చికిత్స దాదాపు ఒకేలా.. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్.. ఇలా ఏదైనా దాదాపుగా చికిత్స ఒకే రకంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. చాలా రకాల ఫంగస్‌లను నిర్మూలించగల ‘ఆంఫొటెరిసిన్ బి’ని చికిత్సలో వాడతారు. కాస్త తక్కువ సామర్థ్యం ఉండే ఇతర యాంటీ ఫంగల్ మందులనూ వినియోగిస్తారు. ఫంగస్ ఎక్కువుంటే శస్త్రచికిత్సలు చేసి.. ఫంగస్ సోకిన కణజాలాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, మధుమేహం నియంత్రణలో లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు ఈ మూడు కూడా ఫంగస్ వ్యాధులకు ఉమ్మడి కారణాలు. ► కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్లు వాడితే ఇమ్యూనిటీ శక్తి దెబ్బతింటుంది. అవసరమైన మేరకే ఉపయోగించాలి. ► మధుమేహం ఉంటే మరింత జాగ్రత్త అవసరం. షుగర్ స్థాయిని తరచూ చెక్ చేసుకుంటూ, మందులు వాడుతూ ఉండాలి. ► పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు పెట్టినప్పుడు వాటిల్లోని హ్యుమిడిఫయర్లు, పైపులను తరచూ శుభ్రం చేయాలి. లేకుంటే ఫంగస్ పెరిగి.. నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ► ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కలప, కాగితం, అట్టడబ్బాలపై ఫంగస్ పెరుగుతుంది. అలాంటివి లేకుండా చూడాలి. ►ఇంట్లో నిల్వ ఆహార పదార్థాలపై ఫంగస్ పెరుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు బయటపడేయాలి. ► గదుల్లో తేమ (హ్యుమిడిటీ) తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హ్యుమిడిటీ పెరి గితే ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది. -
వైట్ ఫంగస్: పేగులకు రంధ్రాలు
న్యూఢిల్లీ: కరోనా కంటే ఎక్కువగా ఫంగస్ కేసులు జనాలను తీవ్రంగా భయపెడుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించే లోపలే ఫంగస్ వ్యాప్తి ప్రాణాలకు మీదకు తెస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బ్లాక్, వైట్, యెల్లో అంటూ వేర్వేరు ఫంగస్‌లను గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైట్ ఫంగస్ బారిన పడిన వ్యక్తిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. ఫంగస్ వల్ల బాధితురాలి చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. ఈ తరహా కేసు ప్రపంచంలో ఇదే మొదటిదన్నారు. ఆ వివరాలు..ఈ నెల 13న 49 ఏళ్ల మహిళ ఒకరు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరింది. ఇక బాధితురాలు క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందే ఆమెకు కీమో థెరపీ చేయించారు. ఆ తర్వాత ఆమె కడుపునొప్పితో బాధపడుతుండటంతో గంగా రామ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు ఆమెకి సీటీ స్కాన్ చేయగా పేగులకు రంధ్రాలు పడినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ ప్యాంక్రియాటికోబిలియరీ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ (ప్రొఫెసర్) అమిత్ అరోరా మాట్లాడుతూ.. ‘‘నాలుగు గంటల పాటు సాగిన శస్త్రచికిత్స ద్వారా, మహిళ ఆహార పైపు, చిన్న పేగు, పెద్ద పేగులలోని రంధ్రాలు మూసివేశాము. బాధితురాలి శరీరం లోపల ద్రవం లీకేజీని ఆపడానికి ఈ శస్త్రచికిత్స సహాయపడుతుంది’’ అని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ స్టెరాయిడ్ వాడకం వల్ల ఇటీవల పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల్లో కొన్ని చోట్ల పేగులకు రంధ్రాలు పడిన కేసులు కొన్ని వెలుగు చూశాయి. అయితే వైట్ ఫంగస్ కేసులో.. పేగుల్లో రంధ్రాలు ఏర్పడిన కేసు ప్రపంచంలో ఇది మొదటిది అన్నారు. చదవండి: 4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి.. -
ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఆ రెండింటి కన్నా డేంజర్
లక్నో: కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ రూపంలో మరో ప్రమాదం భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఫంగస్ బారిన పడిన వారు ప్రారంభంలోనే దాన్ని గుర్తించకపోతే.. ప్రాణాలే పోతున్నాయి. ఈ రెండు ఫంగస్‌లు జనాలను భయభ్రాంతలకు గురి చేస్తుండగా.. తాజాగా యెల్లో ఫంగస్ రూపంలో మరో ముప్పు ముంచుకొస్తుంది. బ్లాక్, వైట్ ఫంగస్‌లకన్నా ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలిసారి ఈ యెల్లో ఫంగస్ కేసును గుర్తించారు వైద్యులు. ప్రస్తుతం బాధితుడికి నగరంలోని ప్రసిద్ధ ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యెల్లో ఫంగస్ లక్షణాలు.. బద్ధకం, ఆకలి తక్కువగా ఉండటం.. లేదా అసలు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం యెల్లో ఫంగస్‌లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఫంగస్ తీవ్రమైతే చీము కారడం, శరీరం మీద ఉన్న గాయాలు, లోపలి గాయాలు నెమ్మదిగా మానడం, పోషకాహార లోపం, అవయవాలు వైఫల్యం చెందడం, చివరికి నెక్రోసిస్ కారణంగా కళ్ళు పోవడం జరుగుతుంది అంటున్నారు వైద్యులు. యెల్లో ఫంగస్ ఒక ప్రాణాంతక వ్యాధి.. ఎందుకంటే ఇది అంతర్గతంగా మొదలవుతుంది. అందువల్ల పైన చెప్పిన ఏదైనా లక్షణాలను గమనించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు. యెల్లో ఫంగస్ వ్యాప్తికి కారణాలు.. యెల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా అపరిశుభ్ర వాతావరణం వల్ల వ్యాప్తిస్తుంది. కనుక ఇంటిని.. చుట్టుపక్కల పరిసరాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నివారించడానికి మిగిలిపోయిన ఆహారాలు, మల పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. ఇంటిలోని తేమ కూడా బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి. సరైన తేమ స్థాయి 30% నుంచి 40% వరకు ఉంటుంది. కనుక ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు. చదవండి: బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద మందు -
బ్లాక్ ఫంగస్ అంటువ్యాధా.. డాక్టర్లు ఏమంటున్నారు?
సాక్షి, రామగుండం: రాష్ట్రంలో కరోనా రెండో దశ రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో వైరస్ కట్టడికి మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలి. అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండడం మంచిది’ అని యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుమార్ అన్నారు. పాజిటివ్ వచ్చినా ఆందోళన చెందకుండా మనోధైర్యంతో వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఆసుపత్రికి వెళ్లకుండా 14 రోజులు క్యారంటైన్లో ఉండాలంని తెలిపారు. ఈమేరకు ‘సాక్షి’కి పలు విషయం వివరించారు. చదవండి: బ్లాక్ ఫంగస్ మహమ్మారే! ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది? జవాబు: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై కరోనా వైరస్ 2–3 రోజులు మాత్రమే ఉంటుంది. శానిటైజేషన్ చేసి వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రశ్న: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధా..? జవాబు: మ్యూకార్ మైకోసిస్ అనే ఫంగస్‌తో వచ్చేది బ్లాక్ ఫంగస్. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు. ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తికి దగ్గు ఎన్ని రోజుల వరకు ఉంటుంది.? జవాబు: కరోనా నుంచి కోలుకున్నాక 14 రోజుల తర్వాత తిరిగి పరీక్ష అవసరం లేదు. మందులు వాడిన తర్వాత వైరస్ చనిపోయి వ్యక్తి శరీరంలో 3 నెలల వరకు ఉంటుంది. కాని దీని ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందదు. అలాగే దగ్గు రెండుమూడు నెలల వరకు ఉండవచ్చు. దాని ప్రభావంతో ఆయాసం వస్తే వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. ప్రశ్న: జ్వర సర్వేతో ఉపయోగం ఉందా..? జవాబు: జ్వర సర్వేతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి ముందస్తు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. వ్యక్తి పరిíస్థితిని బట్టి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాలని సూచనలు ఇచ్చి ప్రాణపాయ íస్థితి నుంచి రక్షించవచ్చు. బాధితుల ఫోన్‌నంబర్ తీసుకొని వారికి అవసరమైన మందులతో పాటు సలహాలు, సూచనలు అందిస్తారు. ఫలితంగా ఇతరులకు వైరస్ సోకకుండా కట్టడి చేసే అవకాశం చాలా ఉంటుంది. జ్వర సర్వేకు ప్రజలందరూ సహకరించాలి. ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది? జవాబు: కరోనా సోకిన వ్యక్తి ముట్టుకున్న వస్తువులపై కరోనా వైరస్ 2–3 రోజులు మాత్రమే ఉంటుంది. శానిటైజేషన్ చేసి వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రశ్న: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధా..? జవాబు: మ్యూకార్ మైకోసిస్ అనే ఫంగస్‌తో వచ్చేది బ్లాక్ ఫంగస్. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు. ప్రశ్న: కరోనా సోకిన వ్యక్తికి దగ్గు ఎన్ని రోజుల వరకు ఉంటుంది.? జవాబు: కరోనా నుంచి కోలుకున్నాక 14 రోజుల తర్వాత తిరిగి పరీక్ష అవసరం లేదు. మందులు వాడిన తర్వాత వైరస్ చనిపోయి వ్యక్తి శరీరంలో 3 నెలల వరకు ఉంటుంది. కాని దీని ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందదు. అలాగే దగ్గు రెండుమూడు నెలల వరకు ఉండవచ్చు. దాని ప్రభావంతో ఆయాసం వస్తే వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. ప్రశ్న: జ్వర సర్వేతో ఉపయోగం ఉందా..? జవాబు: జ్వర సర్వేతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి ముందస్తు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. వ్యక్తి పరిíస్థితిని బట్టి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాలని సూచనలు ఇచ్చి ప్రాణపాయ స్థితి నుంచి రక్షించవచ్చు. బాధితుల ఫోన్‌నంబర్ తీసుకొని వారికి అవసరమైన మందులతో పాటు సలహాలు, సూచనలు అందిస్తారు. ఫలితంగా ఇతరులకు వైరస్ సోకకుండా కట్టడి చేసే అవకాశం చాలా ఉంటుంది. జ్వర సర్వేకు ప్రజలందరూ సహకరించాలి. -
బ్లాక్ ఫంగస్: అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్
జైపూర్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతోంది. కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారినపడ్డారు, వారిలో కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్తకాదు. మన పూర్వీకులు ఎదుర్కొన్న అంటురోగాల్లో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్న విషయం తెలిసిందే.అయితే మహమ్మారి రూపంలో ప్రపంచాన్ని భయపెట్టిన కొన్ని అంటువ్యాధులు కాలక్రమేణా అంతమైపోయాయి. బ్యుబోనిక్ ప్లేగు, మశూచి, కలరా, ఇన్ఫ్లుయెంజా, సార్స్ వ్యాధులు వల్ల ఎంతో మంది మృతి చెందారు. ఇక దేశమంతా కరోనా వైరస్ ఉధృతితో వణుకుతుంటే మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మ్యుకర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) వ్యాధి లక్షణాలు కరోనా బాధితుల్లో కనిపించడం కలవరపెడుతోంది. తాజాగా బ్లాక్ ఫంగస్‌ను(మ్యూకోర్‌మైకోసిస్‌ను) రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో దాదాపు 100మంది బ్లాక్‌ఫంగస్ బారిన పడినట్టు గుర్తించారు. వీరికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు. ‘రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చాం’ అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. బ్లాక్ ఫంగస్, కరోనా వైరస్‌కు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అరోరా తెలిపారు. మధుమేహ రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఢిల్లీలో 75, ఉత్తరప్రదేశ్‌లో 50, మధ్యప్రదేశ్ 19, ఉత్తరాఖండ్‌లో 38, హర్యానాలో 115, మహారాష్ట్రలో 201 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు తెలుస్తోంది. (చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!) -
బ్లాక్ ఫంగస్ నియంత్రణకు చర్యలు
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. కేంద్రం ఈ జబ్బు నియంత్రణకు 1,650 వయల్స్ (ఇంజక్షన్లు) కేటాయించిందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సొంత నిధులతో మూడు కంపెనీల (మైలాన్, భారత్ సీరం, సన్‌ఫార్మా) నుంచి 15 వేల ఇంజక్షన్లు కొనుగోలు చేస్తోందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంజక్షన్లు రానున్నాయన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఒక్కో పేషెంటుకు 60 ఇంజక్షన్ల వరకు అవసరం అవుతాయని చెప్పారు. ఇది ఖరీదైన చికిత్స కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీలో చేర్చిందన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉండగా, కేంద్రం 625 టన్నులకు ఆమోదం తెలిపిందన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే ఆక్సిజన్ కోటా తగ్గనుందన్నారు. గతంలో ప్రొడక్షన్ కెపాసిటీ నుంచే కాకుండా స్టోరేజీ నుంచి కూడా కలిపి మొత్తం 170 మెట్రిక్ టన్నులు తీసుకునే వాళ్లమని చెప్పారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోవడంతో ప్రొడక్షన్ కెపాసిటీ 130 మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుందని తెలిపారు. ఇందువల్ల అంగూల్, రూర్కెలా ప్లాంట్ల కేటాయింపులు పెంచారన్నారు. ఈనెల 23వ తేదీలోగా మరో 4 క్రయోజనిక్ ట్యాంకర్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, వాటి ద్వారా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని చెప్పారు. 104 కాల్సెంటర్లో రిజిస్టర్ అయిన వైద్యుల సంఖ్య 4,293కు పెరిగిందని, వీరిలో 188 మంది స్పెషలిస్టులున్నారని తెలిపారు. బుధవారం 12,679 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులతో వైద్యులు మాట్లాడారని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లను బలోపేతం చేయడం వల్ల 104కు వచ్చే ఫోన్‌కాల్స్ తగ్గుముఖం పట్టాయని, త్వరలోనే వైరస్ అదుపులోకి వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. బ్లాక్‌ఫంగస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం, కోవిడ్‌తో తల్లిదండ్రులు మృతిచెండటం వల్ల అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు రోజూ సమావేశాలు నిర్వహించి.. ఫీవర్ సర్వే, హోం ఐసొలేషన్ కిట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. -
ఆరోగ్యశ్రీలోకి ‘బ్లాక్ ఫంగస్’
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఫంగస్ జబ్బు వస్తోంది. స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం తదితర కారణాల వల్ల ఫంగస్ ఎక్కువగా సోకుతుండటం, వైద్యం ఖరీదు కావడంతో రకరకాల వైద్య పరీక్షలతో పాటు చికిత్సలు, శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చారు. సీటీ/ఎంఆర్ఐ, ఫంగల్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ (కిడ్నీ), షుగర్ టెస్ట్‌లు, హెచ్‌బీఏ1సీ, నాజల్ ఎండోస్కొపీ వంటివన్నీ ఉచిత చికిత్సలో భాగంగా చేయాలి. అంతేకాకుండా యాంటీబయాటిక్, ఐవీ ఫ్లూయిడ్స్, లింఫొసొమాల్ (యాంపొటెరిసిన్ బి) లేదా ఓరల్ పొసకొనొజోల్ ఇవ్వాలి. వైద్య పరీక్షల ఆధారంగా 2 వారాల నుంచి 3 వారాల పాటు ఈ వైద్యం చేయాల్సి ఉంటుంది. చికిత్స అనంతరం ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినా అదనంగా కూడా కేటాయిస్తామని ఉత్తర్వుల్లో చెప్పారు. సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొప్టొసిస్కు రూ. 50 వేలు, యాంటీబయోటిక్స్, మందుల ప్యాకేజీకి రూ. 41,968, ఆఫ్తాల్మాలజీ ఆర్బిటొటొమి చికిత్సకు రూ. 27,810, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీకి రూ. 16,932, ఎక్స్ంటరేషన్ ఆఫ్ ఆర్బిట్ చికిత్సకు రూ. 10,180 నిర్ణయించారు. లింఫొసొమాల్ (యాంఫొటెరిసిన్ బి), పొసకొనొజోల్ ఇంజక్షన్లకు ఎంఆర్పీ ధరలు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ చికిత్స ఉచితంగా చేయాలని స్పష్టం చేశారు. -
Black Fungus: రూ.314 ఇంజెక్షన్ రూ.50 వేలకు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కోవిడ్ చికిత్సలో కీలకంగా వాడే రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన కేటుగాళ్లు తాజాగా బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే ఔషధాలను కూడా అదే బాట పట్టిస్తున్నారు. అయితే ఈ దందా వెనుక ఏకంగా వైద్యులు కూడా ఉండటం జోరుగా సాగుతున్న బ్లాక్ మార్కెట్ పరిస్థితికి అద్దం పడుతోంది. ముఠా సమాచారాన్ని అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురు నిందితుల్ని వలపన్ని పట్టుకుని అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి ఐదు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలను ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు మీడియాకు వెల్లడించారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో దీనికి వాడే ఇంజెక్షన్లకూ డిమాండ్ వచ్చింది. దీన్ని గమనించిన లంగర్‌హౌస్‌కు చెందిన డాక్టర్ బి.రామచరణ్, మలక్‌పేటకు చెందిన డాక్టర్ గాలి సాయినాథ్, గాజులరామారం ప్రాంతానికి చెందిన బి.సురేశ్, బాలానగర్ వాసి కె.శ్రీకాంత్, కూకట్‌పల్లికి చెందిన జి.సాయి వర్ధన్‌గౌడ్ ఓ ముఠాగా ఏర్పడి నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న చిల్లగొల్ల రవితేజ చౌదరి ద్వారా ఆంపోటెరిసీన్ బీ ఇంజెక్షన్లను అక్రమంగా సమీకరించారు. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 314 ఉండగా దీన్ని రూ.50 వేలకు అమ్మేందుకు ప్రయత్నించారు. దీనిపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో బుధవారం లంగర్‌హౌస్ ప్రాంతంలో వలపన్ని మొత్తం ఐదుగురిని పట్టుకుని అరెస్టు చేశారు. మరో వైద్యుడు రవితేజ పరారీలో ఉన్నారు. కాగా, వీరిలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. -
బ్లాక్ ఫంగస్‌పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
-
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఇప్పటికే కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తాజాగా బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడండంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, కోవిడ్ నుంచి కోలుకున్న వారు బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. -
ఫంగస్ పంజా: జిల్లాలో ముగ్గురి మృతితో ఆందోళన
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. వేరువేరు ప్రాంతాలకు చెందిన వీరు ఇరవై నాలుగు గంటల్లోనే మృతి చెందడంపై జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. కాగా ఈ మరణాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా గుర్తించాల్సి ఉంది. నవీపేట మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐకే ఫారానికి చెందిన బెజవాడ హరిబాబు (35), బోధన్‌లోని శక్కర్‌నగర్‌కు చెందిన మర్రి రాజేశ్వర్ (39), వేల్పూరు మండలం సాహెబ్‌పేట గ్రామానికి చెందిన ఉట్నూర్ చిన్న గంగారాం (65) హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారం రోజుల క్రితం నగరంలోని ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడడంతో హైదరాబాద్ వెళ్లి చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు సరస్వతినగర్‌లో స్కానింగ్ చేయడంతో ఈ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. వైద్యుడిని సంప్రదించగా ముక్కువద్ద ఇన్ఫెక్షన్ ఉండడం, నల్లటి చారలు కలిగి ఉండడంతో బ్లాక్ ఫంగస్‌గా గుర్తించి హైదరాబాద్ రిఫర్ చేశారు. అలాగే కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో నిజామాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఇలా ఒక్కొక్కటి కేసులు బయటపడుతున్నాయి. వీరికే వచ్చే అవకాశం.. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నవారు ము ఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణా లు కనిపిస్తున్నాయి. షుగర్ అదుపులో లేకపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఫంగస్ వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ తగ్గించేందుకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ అధికంగా వాడడంతో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఫంగస్ పంజా బ్లాక్ ఫంగస్ జాడలు వెలుగు చూడటంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. ఇరవై నాలుగు గంటల్లోనే జిల్లాకు చెందిన ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరెంత మంది దీనిబారిన పడ్డారో స్పష్టత రావడం లేదు. ఈ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులను వైద్యులు హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. లక్షణాలు.. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి తలనొప్పి, ముక్కుదిబ్బడ, కంటిచూపు తగ్గడం, పంటినొప్పి, దవడనొప్పి, ఛాతినొప్పి, ముక్కునుంచి నల్లటి రక్తస్రావం రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. కంటి గుడ్డుకింద ఎర్రబడి దురదగా ఉండడం. ముక్కు ఎర్రబడడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అప్రమత్తత అవసరం.. జిల్లాలో ప్రస్తుతం 58,670 మంది కరోనా పాజిటివ్ లక్షణాలతో ఉన్నారు. ఇందులో రెండు వేల వరకు యాక్టివ్ కేసులున్నాయి. ఇటీవల పాజిటివ్ రేటు తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వెయ్యికి పైగా నమోదయ్యాయి. ఇందులో ఐసీయూలో చికిత్స పొందుతున్నవారే 500 మంది వరకూ ఉన్నారు. చికిత్స తీసుకుంటూ కరోనా తగ్గించుకున్నవారు కూడా ఉన్నారు. ఆస్పత్రుల్లో పది రోజుల వరకు చికిత్స పొందుతూ స్టెరాయిడ్లు వాడిన వారు, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందిన వారికి బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కేసులు వెలుగులోకి రావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసులను వైద్య శాఖ అధికారికంగా గుర్తించలేదు. వీటిపై విచారణ జరుగుతోంది. బ్లాక్ ఫంగస్ అవునా..కాదా అనే ది నిర్ధారించిన తర్వాతే స్పందిస్తామంటోంది. తక్షణమే స్పందించాలి.. కరోనా సోకిన వారు చికిత్స అనంతరం శరీరంలో వచ్చే మార్పులను గమనించాలి. అధికంగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. – బి.రాజేశ్వర్, ఛాతి వైద్యనిపుణులు -
ఆరోగ్యశ్రీలోకి 'బ్లాక్ ఫంగస్'
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. దీనికోసం అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోనూ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోనూ వైద్యం చేసే విధంగా ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదైనా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కొన్నింటిని కేంద్రం కేటాయించిందని, మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ టెండర్స్ నిర్వహించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. కోవిడ్‌తో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం రూ. 10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కర్ఫ్యూ తర్వాత రెండు జిల్లాల్లో కేసులు తగ్గాయని, మరికొన్ని జిల్లాల్లో నిలకడగా ఉన్నాయని, అందుకే ఈ నెల 31 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని సీఎం నిర్ణయించారని వివరించారు. ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటివరకూ 91 వేల మందికి జ్వర లక్షణాలున్నట్టు గుర్తించామని, వీరి ఆరోగ్యంపై రోజువారి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 67 శాతం మంది బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. కోవిడ్ విధుల్లోకి 17,901 మంది సిబ్బందిని తీసుకున్నామని, అవసరమైతే మరింత మందిని నియమిస్తామని సింఘాల్ వెల్లడించారు. ఆక్సిజన్ వృథా కాకుండా నేవీ బృందాలు చేస్తున్న సాయం అభినందనీయమన్నారు. సీమ జిల్లాల్లో 7 కేసులు రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిపైనా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఈ పరిశీలన జరుగుతోంది. కేసులకు సంబంధించి ఇప్పటికే నిపుణుల అభిప్రాయాలతో చికిత్సలు చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మ్యుకర్ మైకోసిస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయినా సరే దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. -
బ్లాక్ మార్కెట్లో బ్లాక్ ఫంగస్ ఔషధం
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడ్డ కొంతమందిలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ వ్యాధి ‘నల్ల దళారీ’లకు కొత్త వ్యాపారంగా మారింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంఫైట్ 50 ఎంజీ ఇంజెక్షన్లనూ అదేబాట పట్టిస్తున్నారు. ఇలా బ్లాక్ మార్కెట్లో మందులు విక్రయిస్తున్న ఓ నలుగురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదు యాంఫైట్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పీర్జాది గూడకు చెందిన నరిమెల్ల యాదయ్య మెడిసిన్స్ సప్లయర్‌గా, బండ్లగూడకు చెందిన పి.సతీశ్, కోఠికి చెందిన సాయికుమార్లు మెడికల్ షాపుల్లో, మణికొండకు చెందిన బి.రాజశేఖర్‌రెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో దీనికి వాడే ఇంజెక్షన్లకు డిమాండ్ రావడంతో యాంఫైట్ ఇంజెక్షన్లను అక్రమంగా సేకరించారు. ఒక్కొక్కటి రూ.7,858 ఖరీదు చేసే వాటిని రూ.50 వేలకు అమ్మడానికి సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని నలుగురినీ పట్టుకుని అరెస్టు చేశారు. -
Black Fungus: తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలట్లేదు. బ్లాక్‌ఫంగల్ ఇన్ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా బ్లాక్‌ఫంగస్ లక్షణాలు కన్పిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే వెలుగుచూసిన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు రాష్ట్రం లోనూ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు, నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు బ్లాక్‌ఫంగస్‌తో మృతిచెందారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో 16 మంది చికిత్స పొందుతుండగా, కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పదిమంది చనిపోయారు. బ్లాక్‌ఫంగస్ కేసుల చికిత్సకు వీలుగా ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్ సెంటర్‌గా ప్రకటించారు. ఈ కేసులకు సంబంధించి కచ్చితమైన నిర్ధారణ కోసం కొందరి నమూనాలను బయాప్సీకి పంపారు. అలాగే, బ్లాక్‌ఫంగస్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రి 7వ అంతస్తులో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. బాధితులకు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు గాంధీ ఈఎన్టీ విభాగం ముందుకు రావడంతో ఇక్కడే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను రెండ్రోజుల్లో అందుబాటులోకి తేవాలని ఆస్పత్రి పాలన యంత్రాంగం నిర్ణయించింది. ఎందుకు సోకుతుందంటే.. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో కోలుకున్న అనంతరం బాధితులు బ్లాక్‌ఫంగస్ బారిన పడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మధుమేహం, కిడ్నీ, కాలేయం ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ మోతాదుకు మించి ఇస్తుండటంతో.. కోవిడ్‌తో విముక్తి లభించిన తర్వాత బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతోంది. సాధారణ వాతావరణంలో కూడా ఉండే బ్లాక్‌ఫంగల్.. రోగనిరోధక శక్తి లేనివారికి త్వరగా సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చీదినప్పుడు నల్లటి పదార్థం బయటికి రావడం, ముక్కు లోపల వాపు, నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కరోజే నలుగురు మృతి.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎల్కే ఫారమ్ గ్రామానికి చెందిన బెజవాడ హరిబాబు (35) కరోనాతో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ముక్కు, చెవుల నుంచి రక్తం రాగా బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా భావించి శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు. వేల్పూర్ మండలం సాహెబ్పేట్కు చెందిన ఉట్నూర్ చిన్న గంగారాం (65) రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డారు. కోలుకున్న కొద్దిరోజులకే మళ్లీ తిరగబెట్టడంతో నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి మూడ్రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మరణించారు. బోధన్ పట్టణం శక్కర్‌నగర్ కాలనీకి చెందిన మర్రి రాజేశ్వర్ (39) పదిరోజుల క్రితం కరోనా బారినపడి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నాల్రోజుల కిత్రం బాధితుడిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం రాత్రి మృతిచెందారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెంకు చెందిన ల్యాధా గండయ్య (57) కరోనా బారినపడ్డారు. మూడ్రోజుల క్రితం గండయ్యకు ఒళ్లు నొప్పులు, జ్వరంతోపాటు కంటిచూపు మందగించింది. ఆదివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకురాగా..వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి వైద్యం చేశారు. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. పెరుగుతున్న కేసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజాపురం గ్రామానికి చెందిన తూనుకుంట్ల సులోచనరాణి ఈనెల 10న కరోనా బారినపడ్డారు. సోమవారం ఆమెకు కన్ను, ముఖం వాచిపోవడంతో పెనుబల్లిలోని ఆస్పత్రికి రాగా, వైద్యులు బ్లాక్‌ఫంగస్‌గా నిర్ధారించి ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కె.సత్యనారాయణరెడ్డి (35)కి వారం క్రితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అకస్మాత్తుగా కంటిచూపు మందగించి, కళ్లు వాచిపోవడంతో కుటుంబసభ్యులు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య (44) కరోనా బారినపడి ఇటీవలే కోలుకున్నారు. ఆదివారం దవడ, ముక్కులోంచి చీము కారడంతో ఆయనను హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లారు. సోమవారం పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (40) కరోనా నుంచి కోలుకున్న మూడ్రోజులకే అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడగా, ఆయనకు వైద్యులు సోమవారం ఒక కన్ను తొలగించారు. స్టెరాయిడ్స్ మోతాదు మించడం వల్లే.. రోగ నిరోధకశక్తి తక్కువున్నవారిపై ఫంగస్ ప్రభావం చూపుతోంది. ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముక్కు, కన్ను, మెదడు, పై దవడ, సైనస్‌లు దెబ్బతింటాయి. ఎంత వేగంగా విస్తరిస్తుందో.. అంతే వేగంగా కణాలను, ఎముకలను దెబ్బతీస్తుంది. కోవిడ్ చికిత్సల్లో మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇచ్చిన మధుమేహ బాధితుల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. – డాక్టర్ మేఘనాథ్, ఈఎన్టీ నిపుణుడు, ’మా’ ఆస్పత్రి కోలుకున్నాక కూడా మాస్క్ వాడాలి కరోనా బాధితులకు స్టెరాయిడ్స్ ఏ దశలో ఎంత మోతాదులో వాడాలనేది చాలామందికి అవగాహన లేదు. స్టెరాయిడ్స్ కరోనా లక్షణాల నుంచి ఉపశమనం కల్పిస్తున్నా.. రోగ నిరోధకశక్తిని తగ్గిస్తాయి. కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా మాస్క్ ధరిస్తే ఫంగస్ బారినపడకుండా ఉండొచ్చు. – డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ నిపుణుడు, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి అందరికీ రాదు.. కరోనా బాధితుల్లో ప్రతి వందమందిలో ఒకరిద్దరికే బ్లాక్‌ఫంగస్ వస్తుంది. తొలిదశలో గాంధీలో చికిత్సపొందిన 10 మందిలో దీన్ని గుర్తించాం. ఒకరిద్దరు మినహా అంతా చికిత్సకు కోలుకున్నారు. పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మాంసాహారం, సీ విటమిన్ ఎక్కువ లభించే పండ్లు తీసుకోవాలి. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి