
ఫార్మర్స్ లంగ్...
మెడిక్షనరీ
‘వ్యవసాయదారుల ఊపిరితిత్తి’ అని రైతుల పేరిట ఉన్న ఈ ఆరోగ్య సమస్య కేవలం రైతులకే కాదు... ఎవరికైనా రావచ్చు. గాదెల్లోనూ, గరిసెల్లోనూ ధాన్యం నిల్వ చేసినప్పుడు, ఆ గింజల మీద ఉండే తేమపై పెరిగే థెర్మోయాక్టినోమైసిటిస్ అనే ఫంగస్ కారణంగా ఇది వస్తుంది. ఈ వ్యాధి న్యుమోనియాను కలిగించే ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది.
అయితే వృత్తిరీత్యా ఇది వ్యవసాయదారులకూ, ఆ వృత్తితో సంబంధం ఉన్నవారికి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి దీనికి ఫార్మర్స్ లంగ్ అని పేరు. చెరుకుపంటపై నుంచి వచ్చే ధూళిని పీల్చేవారిలోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ.