న్యూఢిల్లీ: కోవిడ్‌ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వారిని కలవర పెడుతోంది. కోవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్ మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దేశంలో ఈ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ శుక్రవారం పలు సూచనలు చేశారు. ఈ ఫంగస్ కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతుండడంతో.. తొలినాళ్లలోనే గుర్తించి చికిత్స చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా బ్లాక్ ఫంగస్‌ను నిరోధించవచ్చని ఆయన తెలిపారు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు, దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకితే తీసుకునే చర్యల వంటి వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి హర్ఫ వర్ధన్ ట్విట్టర్‌లో పలు వివరాలను వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వారికే సోకుతోంది. ఇతర రోగకారక క్రిములతో పోరాడే శక్తిని తగ్గించేస్తోంది. ఇతర వాధ్యులు, వొరికొనజోల్ ఔషధాలు వాడేవారు, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లు వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోయినవారు, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారు దీని బారిన పడుతున్నారు.
#Mucormycosis, commonly known as '#BlackFungus' has been observed in a number of #COVID19 patients recently.
— Dr Harsh Vardhan (@drharshvardhan) May 14, 2021
Awareness & early diagnosis can help curb the spread of the fungal infection. Here's how to detect & manage it #IndiaFightsCorona @MoHFW_INDIA pic.twitter.com/lC6iSNOxGF
లక్షణాలు..
కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు. అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు వెల్లడించారు.
నివారణకు చేపట్టాల్సిన చర్యలు..
- మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. కోవిడ్ సోకి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మధుమేహులు.. కోలుకున్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించువాలి.
- స్టెరాయిడ్లను వైద్యుల సూచనతో పద్ధతి ప్రకారం వాడాలి. ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యుమిడీఫయర్స్ కోసం పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. చికిత్సలో నిర్ధారిత మోతాదు ప్రకారమే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్ ఔషధాలను వాడాలి.
చేయకూడనవి
- లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యంగా ఉండడం.
- కరోనా సోకి చికిత్స తీసుకునేటప్పుడు ముక్కులు మూసుకుపోతే బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ అనుకోవడం.
- బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంగా ఉండడం.
- రెమిడిసివిర్ అనవసరంగా వాడితేనే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment