Harsh Vardhan
-
7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు... → రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది. → వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్‌లు ఎక్కువగా ఉండవచ్చు. → ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక అంశాలు ఉన్నాయి. → భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము విశ్వసిస్తున్నాం. → వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది. → టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది. -
వక్ఫ్ బోర్డు పునర్నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ప్రభుత్వం పునర్నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ శుక్రవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. వక్ఫ్ యాక్ట్–1995 సవరణ చట్టం–2013(సెక్షన్ 27) ప్రకారం 8మందితో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు సభ్యుల నియామకం చేపట్టినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యుల నుంచి ఎండీ రుహుల్లా(ఎమ్మెల్సీ), షేక్ ఖాజా(ముతవల్లీ)లను నియమించింది. మహ్మద్ నసీర్(ఎమ్మెల్యే), సయ్యద్ దావుద్ బాషా బాక్వీ, షేక్ అక్రమ్, అబ్దుల్ అజీజ్, హాజీ ముకర్రమ్ హుస్సేన్, మహ్మద్ ఇస్మాయేల్ బేగ్‌లను వక్ఫ్‌బోర్డు సభ్యులుగా నామినేట్ చేసింది. తలా తోకలేని జీవో విడుదల చేసిన ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు కమిటీ నియామకంలో కూటమి ప్రభుత్వం తలాతోక లేని జీవో ఇచ్చిందని ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా శుక్రవారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం పునర్నియామక జీవో ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించలేదన్నారు. పునర్నియామకం అంటే గత జీవో ఏ సెక్షన్ల కింద సభ్యుల నియామకం జరిగిందో అదే సెక్షన్ల మేరకు సభ్యుల నియామకం చేయాలన్నారు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిoదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంపీ, అడ్వకేట్, మహిళా, అధికారిక విభాగాల నుంచి సభ్యులకు చోటు లేకుండా చేశారని నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఇక రాజకీయాలకు సెలవు’..బీజేపీ నేత కీలక ప్రకటన
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్ష వర్ధన్ కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి రీటైరవుతున్నట్లు చెప్పారు. ‘ముప్పై సంవత్సరాలకు పైగా అద్భుతమైన రాజకీయ జీవితం. ఐదు అసెంబ్లీ, రెండు పార్లమెంటరీ ఎన్నికలలో గెలిచాను. పార్టీలో,రాష్ట్రంలో,కేంద్రంలో అనేక కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు తిరిగి వైద్య వృత్తిలో కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు. After over thirty years of a glorious electoral career, during which I won all the five assembly and two parliamentary elections that I fought with exemplary margins, and held a multitude of prestigious positions in the party organisation and the governments at the state and… — Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2024 మానవాళికి సేవ చేయాలనే నినాదంతో నేను యాభై ఏళ్ల క్రితం కాన్పూర్‌లోని జీఎస్వీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరాను. కోవిడ్-19 మహమ్మారి వంటి కఠిన సమయాల్లో ప్రాణాలతో పోరాడుతున్న లక్షల మంది ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఢిల్లీ కృష్ణా నగర్‌లోని నా ఈఎన్టీ క్లీనిక్‌లో వైద్య సేవలందిస్తా. నాకోసం క్లీనిక్ ఎదురు చూస్తోంది అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. -
అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్
‘‘మేం ఒక్క పాత్ర చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్ ఏకంగా మూడు పాత్రలు చేశారు.. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు శర్వానంద్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల అతిథులుగా హాజరయ్యారు. ‘‘సుధీర్ మూడు పాత్రలు చేశారంటే కథ ఎంత విలక్షణంగా ఉండి ఉంటుందో అర్థమవుతోంది’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘సుధీర్ కొత్త రకం కథలు ప్రయత్నిస్తుంటారు’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘మామా మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం.. అన్నీ ఉంటాయి’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘ఇది ఒక అమ్మ, తండ్రీకూతుళ్ల కథ’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘రచయితల నుంచి డైరెక్టర్స్‌గా మారిన త్రివిక్రమ్, కొరటాల శివల్లా హర్షవర్ధన్ కూడా పెద్ద డైరెక్టర్ కావాలి’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
అజ్ఞానం అనే వైరస్‌కు వ్యాక్సిన్ లేదు
న్యూఢిల్లీ: జూలై నెల ప్రవేశించినా దేశంలో ప్రజలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి రాలేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మండిపడ్డారు. అజ్ఞానం అనే వైరస్‌కు టీకా లేదంటూ ఆయన తిప్పికొట్టారు. ‘జూలై నెల వచ్చేసింది. కోవిడ్ టీకాలు ఇంకా రాలేదు. ఎక్కడ వ్యాక్సిన్లు’ అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్లో ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రి హర్షవర్ధన్ స్పందిస్తూ..‘దేశంలో ఈ నెలలో వ్యాక్సిన్ల అందుబాటును వివరిస్తూ గురువారం గణాంకాలను విడుదల చేశాను. రాహుల్ సమస్యేంటో అర్థం కావడం లేదు. ఆయనకు చదవడం రాదా? అర్థం చేసుకోలేడా? అజ్ఞానం అనే వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. నాయకత్వ సమగ్రతపై కాంగ్రెస్ పార్టీ తప్పక ఆలోచించాలి’ అంటూ చురకలంటించారు. 51 జూలైలు(రాహుల్ వయస్సు 51) వచ్చినా ఆయనకింకా పరిణతి, బాధ్యత, తెలివి ఎందుకు రాలేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
Rajasthan Cm: కోటి వ్యాక్సిన్లు ఓ రోజుకి సరిపోవు
జైపూర్: కోవిడ్ దేశంలోని ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడి వందల కొద్దీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే తాగాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..కోవిడ్-19 వ్యాక్సిన్ల లభ్యతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేయకుండా ఉండాలని హితవు పలికారు. దేశ ప్రజలు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో దేశంలో తగినంత ఆక్సిజన్ ఉందని ఆయన పేర్కొనడం బాధాకరమని అన్నారు. ఈ రోజు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర మంత్రి అన్నారు. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రజలకు వ్యాక్సిన్లను అందిస్తే అవి ఓ రోజుకి సరిపోవని గెహ్లాత్ దుయ్యబట్టారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో 9.24 లక్షల మంది కరోనా బారిన పడగా..8.29 లక్షల మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి 7,911 మంది బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. (చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’) -
‘‘2-డీజీ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది’’
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం డీఆర్డీఓ, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్ (2–డీజీ) అనే ఔషధాన్ని అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ 2-డీజీ డ్రగ్ భారత్‌ను మాత్రమే కాక ప్రపంచాన్ని కాపాడగలుగుతుంది అన్నారు. హర్ష వర్ధన్ ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మద్దతుతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన కోవిడ్ డ్రగ్ 2-డీజి మొదటి దేశీయ పరిశోధన ఆధారిత ఫలితం. దీని వినియోగం వల్ల కోవిడ్ వ్యాప్తిని అరికట్టడమే కాక ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ ఔషధం రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మాత్రమే కాక మొత్తం ప్రపంచాన్ని కోవిడ్ బారి నుంచి కాపాడుతుంది’’ అన్నారు. ఇక డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ ఔషధం పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని నీటిలో కలుపుకుని నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్ సోకిన కణాలలో పేరుకుపోయి వైరల్ సంశ్లేషణ, శక్తి ఉత్పత్తిని ఆపడం ద్వారా వైరస్ పెరుగుదలను నిరోధిస్తుంది అని డీఆర్డీఓ తెలిపింది. చదవండి: 2–డీజీ.. గేమ్ చేంజర్.. అన్ని స్ట్రెయిన్ల మీదా పని చేస్తుంది -
Black Fungus: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచనలు
న్యూఢిల్లీ: కోవిడ్‌ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరో సమస్య వారిని కలవర పెడుతోంది. కోవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్ మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దేశంలో ఈ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ శుక్రవారం పలు సూచనలు చేశారు. ఈ ఫంగస్ కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతుండడంతో.. తొలినాళ్లలోనే గుర్తించి చికిత్స చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా బ్లాక్ ఫంగస్‌ను నిరోధించవచ్చని ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు, దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకితే తీసుకునే చర్యల వంటి వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి హర్ఫ వర్ధన్ ట్విట్టర్లో పలు వివరాలను వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వారికే సోకుతోంది. ఇతర రోగకారక క్రిములతో పోరాడే శక్తిని తగ్గించేస్తోంది. ఇతర వాధ్యులు, వొరికొనజోల్ ఔషధాలు వాడేవారు, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లు వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోయినవారు, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారు దీని బారిన పడుతున్నారు. #Mucormycosis, commonly known as '#BlackFungus' has been observed in a number of #COVID19 patients recently. Awareness & early diagnosis can help curb the spread of the fungal infection. Here's how to detect & manage it #IndiaFightsCorona @MoHFW_INDIA pic.twitter.com/lC6iSNOxGF — Dr Harsh Vardhan (@drharshvardhan) May 14, 2021 లక్షణాలు.. కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు. అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు వెల్లడించారు. నివారణకు చేపట్టాల్సిన చర్యలు.. మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. కోవిడ్ సోకి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మధుమేహులు.. కోలుకున్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించువాలి. స్టెరాయిడ్లను వైద్యుల సూచనతో పద్ధతి ప్రకారం వాడాలి. ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యుమిడీఫయర్స్ కోసం పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. చికిత్సలో నిర్ధారిత మోతాదు ప్రకారమే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్ ఔషధాలను వాడాలి. చేయకూడనవి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యంగా ఉండడం. కరోనా సోకి చికిత్స తీసుకునేటప్పుడు ముక్కులు మూసుకుపోతే బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ అనుకోవడం. బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంగా ఉండడం. రెమిడిసివిర్ అనవసరంగా వాడితేనే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. చదవండి: ‘బ్లాక్ ఫంగస్’: పట్టించుకోకపోతే ప్రాణాలే పోతాయి.. -
తెలంగాణకు కోటా పెంచుతాం!: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందుల సామగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బుధవారం రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రగతిభవన్ నుంచి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా తొలివేవ్‌తో పోలిస్తే రెండో వేవ్ నాటికి రాష్ట్రంలో వైద్య సదుపాయాలను ప్రభుత్వం గణనీయంగా పెంచిందన్నారు. కరోనా చికిత్స బెడ్లను 18,232 నుంచి 53,775కు, ఆక్సిజన్ బెడ్లను 9,213 నుంచి 20,738కు, ఐసీయూ బెడ్లను 3,264 నుంచి 11,274కు పెంచామని వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కూడిన 27,039 బృందాలు ఇంటింటికీS తిరిగి సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. 60 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించామని, ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాల రోగులను పరిగణనలోకి తీసుకోవాలి... తెలంగాణ మెడికల్ హబ్ కావడంతో చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారు తెలంగాణకు వచ్చి చికిత్స పొందుతుండటంతో కోవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తోందని హరీశ్ చెప్పారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదికన కాకుండా, రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులకు.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా కేసులను కలుపుకొని బెడ్ల సంఖ్య ఆధారంగా ఆక్సిజన్, మందులు, ఇతర కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మందుల కొరత పెరగడానికి లెక్కల్లో ఈ తేడాలే ప్రధాన కారణమన్నారు. ఆక్సిజన్ కేటాయింపులను 450 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు. ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా, దగ్గరలోని ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. కేసీఆర్ ఇప్పటికే కోరిన విధంగా 20 వేల రెమిడెసివిర్ ఇంజెక్షన్లను సరఫరా చేయాలని విజ్ఞప్తిచేశారు. టోసిలీ జుమాబ్ ఇంజెక్షన్లను 810 నుంచి 1,500కు పెంచాలని, రోజుకు 2లక్షల టెస్టింగ్ కిట్లను సరఫరా చేయాలని కోరారు. మొదటి డోస్ కోసం 96 లక్షల వ్యాక్సిన్లు, రెండో డోస్ పూర్తికి 33 లక్షల వ్యాక్సిన్లు కలిపి మొత్తం కోటి 29 లక్షల వ్యాక్సిన్లు అవసరమని తెలిపారు. ఈనెలాఖరులోగా 10 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, 3 లక్షల కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కలిపి మొత్తం 13 లక్షల వ్యాక్సిన్లు తక్షణంగా కావాలని, ఈ మేరకు రాష్ట్రానికి సరఫరా చేయాలన్నారు. 2వేల వెంటిలేటర్లు రాష్ట్రానికి కావాలని, తక్షణమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తుల పట్ల కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, టెక్నికల్ అడ్వయిజర్ గంగాధర్ పాల్గొన్నారు. -
180 జిల్లాల్లో కనిపించని వైరస్ జాడ
సాక్షి, న్యూఢిల్లీ: వారం రోజులుగా దేశవ్యాప్తంగా 180 జిల్లాలు, 14 రోజులలో 18 జిల్లాలు, 21 రోజులుగా 54 జిల్లాలు, 28 రోజుల్లో 32 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్ బాధితుల్లో పరిస్థితి క్లిష్టంగా ఉండి ఐసీయూలో 4,88,861 మంది, వెంటిలేటర్ సపోర్ట్‌పై 1,70,841 మంది, ఆక్సిజన్ సపోర్ట్‌పై 9,02,291 మంది ఉన్నారని వెల్లడించారు. మొత్తం బాధితుల్లో 1.34% మంది ఐసీయూలో, 0.39% వెంటిలేటర్లపై, 3.70% మంది ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం 25వ సమావేశానికి మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. మూడు రోజుల్లో 53 లక్షల డోసుల టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇప్పటివరకు 17,49,57,770 డోస్‌లను రాష్ట్రాలకు పంపిణీ చేయగా, అందులో 16,65,49,583 డోస్‌ల వినియోగం జరిగిందని మంత్రి తెలిపారు. ఇంకా 84,08,187 డోస్‌లు ఇప్పటికీ రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 53,25,000 వ్యాక్సిన్ డోస్‌లు సిద్ధంగా ఉన్నాయనీ, రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్–19 నుంచి పూర్తి రక్షణను పొందేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ప్రజలందరూ వ్యాక్సిన్ రెండు డోస్‌లను పొందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పెరిగిన పరీక్షల సామర్థ్యం దేశం రోజుకు 25 లక్షల టెస్ట్‌ల పరీక్షా సామర్థ్యాన్ని చేరుకుందని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 30,60,18,044 పరీక్షలు జరిగాయని, ఇందులో గత 24 గంటల్లో 18,08,344 పరీక్షలు ఉన్నాయని అన్నారు. అంతేగాక గతంలో పుణేలోని ఎన్ఐవీ కేవలం ఒక ల్యాబ్ ఉన్న పరిస్థితి నుంచి, ప్రస్తుతం దేశంలో 2,514 ల్యాబ్‌ల ద్వారా సేవలు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసుల నేపథ్యంలో టైర్ –2, టైర్–3 నగరాల్లో టెస్టింగ్ సెంటర్లు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచే అవసరం, ప్రాముఖ్యత ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ స్పష్టంచేశారు. గత ఏడు రోజుల్లో సంక్రమణ కేసులు మహారాష్ట్ర (1.27%), కర్ణాటక (3.05%), కేరళ (2.35%), ఉత్తరప్రదేశ్ (2.44%), తమిళనాడు (1.86%), ఢిల్లీ (1.92%), ఆంధ్రప్రదేశ్ (1.90%), పశ్చిమ బెంగాల్ (2.19%), ఛత్తీస్‌గఢ్(2.06%), రాజస్తాన్ (2.99%), గుజరాత్ (2.40%), మధ్యప్రదేశ్ (2.24%) రాష్ట్రాల్లో అధికంగా నమోదయ్యాయని తెలిపారు. బెంగళూరు (అర్బన్), గంజాం, పుణే, ఢిల్లీ, నాగపూర్, ముంబై, ఎర్నాకులం, లక్నో, కోజికోడ్, థానే, నాసిక్, మలప్పురం, త్రిస్సూర్, జైపూర్, గురుగ్రామ్, చెన్నై, తిరువనంతపురం, చంద్రాపూర్, కోల్‌కతా, పాలక్కడ్ జిల్లా/ మెట్రో నగరాల్లో యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయని వివరించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయ, నిత్యానంద్ రాయ్, అశ్విని కుమార్ చౌబే, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమెరికా ఆరోగ్య మంత్రితో హర్షవర్ధన్ చర్చలు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ శనివారం అమెరికా ఆరోగ్య మంత్రి జేవియర్ బెసెర్రాతో ఫోన్లో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందని బెసెర్రా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా, కోవిడ్ వ్యాక్సిన్లపై మేథో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు మున్ముందు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)తో జరిగే చర్చల్లో ఇదే విధమైన వెసులుబాటు కల్పిస్తామన్నారు. కోవిడ్‌పై పోరాటంలో భారత్‌కు సహకరించడానికి అధ్యక్షుడు బిడెన్ కూడా కట్టుబడి ఉన్నారని బెసెర్రా తెలిపారని హర్షవర్ధన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. -
ఏపీలో వలంటీర్ల విశేష కృషికి ధన్యవాదాలు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వలంటీర్ల వ్యవస్థ చేసిన విశేష కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ వలంటీర్ల వ్యవస్థ కృషిని ప్రస్తావించారు. భవిష్యత్తు ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ఇదే సరైన సమయమని డాక్టర్ బీవీ సత్యవతి చేసిన సూచన బాగుందన్నారు. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలో ఏపీలో గ్రామ వలంటీర్ల వ్యవస్థ చేసిన కృషిని వివరించారు. భవిష్యత్తు వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. దిశ చట్టం కార్యరూపం దాల్చేలా చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం కార్యరూపం దాల్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగ గీత కేంద్రాన్ని కోరారు. జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) అమెండ్మెంట్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఓ దుర్ఘటన నేపథ్యంలో ఓ సోదరుడిగా స్పందించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ బిల్లుకు రూపకల్పన చేశారని చెప్పారు. గర్భిణులకు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా అంగన్వాడీ సెంటర్లలో తరగతులు బోధించేందుకు సైకాలజిస్టులను అందుబాటులోకి తేవాలని సూచించారు. అనంతరం ఈ చర్చకు సమాధానమిచ్చిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతీ ఇరానీ మాట్లాడుతూ సైకాలజిస్టుల ద్వారా గర్భిణులు, పిల్లలకు శిక్షణ ఇప్పించాలని వంగ గీత చేసిన సూచనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సరికాదు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని వైఎస్సార్ సీపీ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ప్లాంట్‌ను నష్టాల నుంచి తొలగించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. -
తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా విషయంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మూడు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచితంగా కరోనా టీకా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. వీరిలో కోటి మంది హెల్త్‌కేర్ వర్కర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉంటారని వెల్లడించారు. అలాగే మరో 27 కోట్ల మంది వివరాలు ఖరారు చేస్తున్నట్టు కేంద్రమంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా పలుచోట్లు అసలు వ్యాక్సిన్ ఇవ్వడం మినహా, డ్రిల్ సమయంలో మిగిలిన ప్రక్రియను అనుసరిస్తున్నట్లు వర్ధన్ తెలిపారు. (కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్) భారతదేశంలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ తొలిమొదటి స్థావరంలో 3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఉచిత కరోనావైరస్ వ్యాక్సిన్లు అందించనున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం తెలిపారు. ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించే డ్రై రన్‌ను సమీక్షించిన తరువాత వర్ధన్ మీడియాతో మాట్లాడారు. అలాగే టీకా భద్రత, సమర్ధతకు సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగుతోంది. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ సాగుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ నిర్వహించింది. వీటితోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ చేపట్టనున్నారు. అటు ఆక్స్ఫర్డ్ సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌నునిపుణుల కమిటీ (ఎస్ఇసీ) శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ నివేదిక మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇవ్వాల్సి ఉంది. -
కేంద్ర మంత్రితో భేటీ కానున్న బుగ్గన
సాక్షి, ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో భేటీ కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ఆయన కేంద్రమంత్రితో సమావేశం అవుతారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర సహకారాన్ని మంత్రి బుగ్గన కోరనున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వైద్యారోగ్య రంగాల్లో చేపడుతున్న పలు పథకాలు, ప్రాజెక్టులపై బుగ్గన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లన్నున్నారు. -
కరోనా కట్టడి : కేంద్ర మంత్రి కీలక సూచన
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రానున్న పండుగ సీజన్లో ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడరాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. భగవంతుడి పట్ల, మతం పట్ల మీ విశ్వాసం నిరూపించుకునేందుకు పెద్దసంఖ్యలో ఒకేచోట గుమికూడాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో మనం ఇలా చేస్తే ఇబ్బందుల్లో పడతామని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు లక్ష్యంపైనే గురిపెట్టాలని, ఈ వైరస్‌ను తుదముట్టించి మానవత్వాన్ని కాపాడటమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. ఇదే మన మతమని, ప్రపంచ అభిమతమూ ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ రీతిలో స్పందించాలని అన్నారు. ప్రార్థనలు చేసేందుకు మీరు విధిగా ఆలయాలు, మసీదులు సందర్శించాలని ఏ దేవుడూ, మతం చెప్పలేదని పేర్కొన్నారు. పండుగలు జరుపుకునేందుకు మన జీవితాలను పణంగా పెడతామా అని మంత్రి ప్రశ్నించారు. ‘ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతోంది..భారత్ ఈ మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తోంది..ఈ పోరాటంలో జన్ ఆందోళన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చార’ని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం నిర్ధేశించిన భౌతిక దూరం నిబంధలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 70 లక్షలు దాటాయి. 60 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా లక్ష మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చదవండి : వైరస్ విజృంభణ, 70 లక్షలు దాటిన కేసులు -
కరోనా : కీలక దశలో నాలుగు వ్యాక్సీన్లు
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. దేశంలో నాలుగు కంటే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై పార్లమెంటులో ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనాపై పోరులో భాగంగా 30 టీకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. వీటిలో ప్రీ-క్లినికల్ ప్రయోగాల్లో అధునాతన దశల్లో నాలుగు, ఫేజ్-1, 2, 3 దశల ప్రయోగాల అడ్వాన్స్ డ్ స్టేజ్ లో మూడు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. (పీఎం కేర్స్ : వెంటిలేటర్లకు రూ. 894 కోట్లు) ప్రపంచ వ్యాప్తంగా నూట నలభై ఐదు వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ దశలో ఉండగా, 35 కు పైగా క్లినికల్ ట్రయల్స్ లో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిల్లా ప్రయోగ ఫలితాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న వారిలో భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఒకటి. అలాగే పూణేకు చెందిన సీరం ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారతదేశంలో 86,961తాజా కేసులతో సోమవారం నాటికి 54.87 లక్షల మంది వైరస్ వ్యాధి బారిన పడగా, 87,882 మంది ప్రాణాలు కోల్పోయారు. (కరోనా : షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్ ) -
పీఎం కేర్స్ నిధి : వెంటిలేటర్లకు రూ. 894 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్‌కి సంబంధించి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కీలక విషయాన్ని వెల్లడించారు. పీఎం-కేర్స్ ఫండ్ నుండి 893.93 కోట్ల రూపాయలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందినట్టు లోక్‌సభలో ప్రకటించారు. 50 వేల వెంటిలేటర్ల తయారీకి ఈ మొత్తాన్ని కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఆదివారం కరోనాపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా కేంద్ర మంత్రి ఈ సమాచారం అందించారు. కరోనా కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది వలస కార్మికుల పునరావాసం కోసం పీఎం కేర్స్ నిధులు కేటాయించాలని కూడా రంజన్ చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రణాళికను అమలు చేసి ఉండి ఉంటే, ప్రజలు కష్టాలను, మహమ్మారి తీవ్రతను నివారించ గలిగేవారమన్నారు. అంతేకాదు దేశంలో కోవిడ్-19 మరణాలపై సరైన సమాచారం లేదని కూడా రంజన్ చౌదరి విమర్శించారు. కాగా కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో నిధుల సేకరణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిఎం కేర్స్ ఫండ్‌ను మార్చి 27న ప్రకటించారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ .3,076 కోట్లు వచ్చాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. పీఎం రిలీఫ్ ఫండ్ లేదా ప్రధానమంత్రి సహాయ నిధి ఇప్పటికే ఉండగా, మరో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు అవసరంపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి. అలాగే పీఎం కేర్స్ ఫండ్ నిధులను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఆడిట్‌ను డిమాండ్ చేస్తోంది. -
కోవిడ్-19 వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వేచిచూసే కోట్లాది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా వ్యాక్సిన్ ప్రయత్నాల్లో నిమగ్నమైందని, మూడు దేశీ కోవిడ్-19 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోందని ప్రణాళికాబద్ధంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. రాజ్యసభలో గురువారం హర్షవర్ధన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆరంభం నాటికి భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. భారత్‌లో జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్లు రెండూ తొలి దశ పరీక్షలను పూర్తి చేసుకున్నాయి. ఇక డీసీజీఐ అనుమతులు లభించిన వెంటనే ఆస్ర్టాజెనెకా, ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసే వ్యాక్సిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సిద్ధమైంది. చదవండి : 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్ -
వ్యాక్సిన్ తొలి ప్రయోగం నామీదే : కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కంట్రోల్‌కి రాకపోవడంతో వ్యాక్సిన్ తయారీ మరింత వేగవంతమైంది. ఇప్పటికే చాలా జౌషద సంస్థలు రెండోదశ ప్రయోగాలను పూర్తి చేసుకుని మూడో స్టేజ్‌కు ప్రవేశించాయి. ఇక భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో వైరస్ వ్యాప్తి, వాక్సిన్ తయారీపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరోనా విరుగుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వైరస్‌పై పోరులో ముందుండి ప్రజలను రక్షిస్తున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి తొలుత వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. (భారీ రికవరీ, అంతకుమించి కేసులు) అయితే ప్రయోగాల అనంతరం తొలి వ్యాక్సిన్ తీసుకోవాడానికి ఎవరూ ముందుకు రాకపోతే తానే స్వయంగా వ్యాక్సిన్‌ను వేసుకుంటానని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. టీకాపై ప్రజలకు మరింత భరోసా కల్పించడానికి తొలి ప్రయోగంగా తాను అందుబాటులో ఉంటానన్నారు. ఇక ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి భారత్‌లో చాలావరకు తక్కవగా ఉందన్నారు. అంతేకాకుండా రికరీ రేటు కూడా పెద్ద ఎత్తున ఉందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ సోషల్ మీడియా వేదికగా ‘సండే సంవాద్’ అనే కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. (పార్లమెంట్లో కరోనా కలకలం..!) దేశంలో వైరస్ వెలుగుచూసిన మొదట్లో కనీసం పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవని, ఇతర దేశాల నుంచి దిగువతి చేసుకున్న పరిస్థితి ఉందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్వదేశంలో తయారు చేసిన కిట్లనే వాడుతున్నామని చెప్పారు. కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 97,570 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు వెలుగుచూసిన కేసుల సంఖ్య 46,59,984 కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం పరీక్షల సంఖ్య 5,62,60,928 చేరుకుంది. -
వాక్సిన్: భారతీయ కంపెనీలపై ప్రశంసలు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నిరోధక వ్యాక్సిన్ రూపకల్పనలో భారతీయ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ అన్నారు. భారత్‌కు చెందిన రెండు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. కరోనా ఉపశమన చర్యలకై కంపెనీలు, శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగ దశ ఫలితాలకు సంబంధించిన వివరాలతో కూడిన.. ‘‘సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్) టెక్నాలజీస్ ఫర్ కోవిడ్-19 మిటిగేషన్’’ కంపెడియం(సారాంశపట్టిక)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. కోవిడ్-19పై పోరులో అలుపెరుగక కృషి చేస్తున్న వైద్య నిపుణులపై ప్రశంసలు కురిపించారు. దాదాపు 150 దేశాలకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయడంలో పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయన్నారు. కోవిడ్-19 అభివృద్ధిలో రెండు భారతీయ కంపెనీలు ముందంజలో ఉండటం గొప్ప విషయమన్నారు.కాగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇప్పటికే ‘కోవాక్సిన్’ మానవ పరీక్షలు ప్రారంభించగా, పుణే కేంద్రంగా పనిచేసే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. (కరోనా : భారత్‌లో మరో రికార్డు ) ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలకు చేరువగా ఉన్న నేపథ్యంలో.. రికవరీ రేటు ఊరట కలిగించే విషయమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మందికి పైగా పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. మిగతా పేషెంట్లు కూడా త్వరలోనే కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువగా ఉండటం సానుకూల అంశమని తెలిపారు. కాగా గత 24 గంటల్లో దేశంలో (బుధవారం నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు) 52,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 775 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. -
మాస్కు ధరించి వ్యాయామం చేస్తున్నారా?
న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని కొందరు శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెప్తున్నారు. మొదట దీన్ని అంగీకరించని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గాలి ద్వారా వైరస్ సంక్రమణ జరుగుతుందని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలతో సహా లేఖ రాయడంతో ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. కాబట్టి ముందుజాగ్రత్తగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాల్సిందేనంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం చేసే సమయంలో మాస్కు పెట్టుకోవాలా? వద్దా? అన్న సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. కానీ వ్యాయామం చేసినప్పుడు మాస్కు పెట్టుకుంటే ఊపిరి ఆడటం కష్టమవుతుంది. (మాస్క్ చాలెంజ్!) కాబట్టి ఎక్సర్సైజ్ చేసేటపుడు మాస్కు పెట్టుకోకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఆ సమయంలో మాస్కు ధరిస్తే వచ్చే ప్రతికూలతలను కూడా వివరించారు. 'వ్యాయామం వల్ల వచ్చే చెమటతో మాస్కు నానిపోతుంది. అది వైరస్ వంటి సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు ఒక మీటర్ కన్నా ఎక్కువగా భౌతిక దూరం పాటిస్తే సరిపోతుంద'ని సూచించారు. (కరోనా: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు) Can people wear #Masks while exercising? People should NOT wear masks when exercising, as masks may reduce the ability to breathe comfortably.#IndiaFightsCorona @MoHFW_INDIA pic.twitter.com/5RV0vWvEcP — Dr Harsh Vardhan (@drharshvardhan) July 16, 2020 -
కరోనా: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 9 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, 23వేల మంది ప్రాణాలు విడిచారు. దీంతో భారత్‌లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్(సామాజిక వ్యాప్తి) నడుస్తోందని చాలామంది భావిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సైతం ఈ దశలోకి మనం అడుగుపెట్టామని వాదిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ కొట్టిపారేశారు. దేశం ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ధారావి, ముంబై వంటి వంటి ప్రదేశాల్లో స్థానిక సంక్రమణ ప్రారంభమైనప్పటికీ దాన్ని సమర్థవంతంగా నియంత్రించామని తెలిపారు. ముఖ్యంగా దేశంలో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు దాదాపు 60 శాతంగా ఉండటం సానుకూల అంశంగా పేర్కొన్నారు. (ఒక్కరోజులో 2.3 లక్షల కేసులు) ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అభివృద్ధికి సమయం పడుతుందని, కానీ అందుకు నెల, సంవత్సరమా అన్న విషయం ఎవరూ చెప్పలేరన్నారు. కాగా కోవ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి అందరికీ అందుబాటులోకి తెస్తామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రకటన జారీ చేసి నాలుక్కరుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై అనేక విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తడటంతో అత్యంత వేగవంతంగా వ్యాక్సిన్ తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేసింది. (డబ్ల్యూహెచ్ఓలో కీలక బాధ్యతలు చేపట్టిన భారత్) కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే..? దీనికి ప్రత్యేక నిర్వచనం అంటూ ఏదీ లేదు. అయితే దీన్ని వైరస్ వ్యాప్తి మూడో దశగా పిలుస్తారు. కరోనా ఉన్న వ్యక్తితో కాంటాక్ట్ అవకపోయినా, లేదా వైరస్ ప్రబలిన ప్రాంతానికి వెళ్లకపోయినా కరోనా సోకడాన్ని కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌గా పిలుచుకుంటున్నాం. అంటే ఇది సమాజంలో స్వేచ్ఛగా వ్యాపిస్తుంది. ఇలాంటి సంక్రమణను గుర్తించి, నియంత్రించడం ప్రభుత్వాలకు కష్టతరమవుతుంది. (ఉచిత ఆక్సిజన్ సిలిండర్లకు బ్రేక్!) -
డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి
న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నియమితులయ్యారు. మే 22న ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా అధికారులు తెలిపారు. 34 మంది సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ప్రస్తుతం జపాన్‌కు చెందిన హిరోకి నకటాని ఉన్నారు. హిరోకి పదవీకాలం ముగియడంతో హర్షవర్దన్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.హర్షవర్ధన్ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. డబ్ల్యూహెచ్ఓ విధానపరమైన నిర్ణయాల్లో కార్యనిర్వాహక బోర్డు కీలక భూమిక పోషిస్తుంది. డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా భారత ప్రతినిధిని నియమించే ప్రతిపాదనకు మంగళవారం 194 దేశాల సభ్యత్వం ఉన్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ పదవికి భారత్‌ను నామినేట్ చేస్తూ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య గతేడాదే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్షవర్దన్ నియామకం లాంఛనప్రాయం అయినట్టుగా కనిపిస్తోంది. (చదవండి : డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం) -
‘పొగాకు ఉత్పత్తుల విక్రయంపై నిషేధం’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు పొగాకు ఉత్పత్తుల విక్రయం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడంపై నిషేధం విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ దిశగా రాజస్ధాన్, జార్ఖండ్ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ మేరకు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. పొగాకు ఉత్పత్తులను నమిలేవారు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వల్ల కోవిడ-19, టీబీ, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు రాసిన లేఖలో హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్పత్తుల వాడకంతో అపరిశుద్ధ్య వాతావరణం నెలకొని వ్యాధుల వ్యాప్తికి దారితీస్తాయని అన్నారు. ఈ ఉత్పత్తులను విక్రయించే దుకాణాల వద్ద ప్రజలు గుమికూడటం కూడా వ్యాధుల ముప్పును పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నివారించాలని ఐసీఎంఆర్ కూడా విజ్ఞప్తి చేసిందని ఆయన గుర్తుచేశారు. చదవండి : లాక్‌డౌన్‌తో 80 శాతం కుటుంబాలు కుదేలు.. -
మహమ్మారిపై పోరులో గెలిచితీరుతాం..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసుల్లో నిలకడ కనిపిస్తుందని, రికవరీ రేటు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనా మహమ్మారిపై గెలుపు దిశగా భారత్ పయనిస్తోందని, కోవిడ్-19ను మట్టికరిపించడంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ 10,000 మంది కోవిడ్-19 రోగులు కోలుకున్నారని చెప్పారు. ఈ మహమ్మారి నుంచి పెద్దసంఖ్యలో కోలుకునే రోగుల సంఖ్య పెరుగుతోందని, వైరస్ నుంచి కోలుకుని వారు ఇంటికి వెళుతున్నారని తెలిపారు. తాజా కేసుల సంఖ్య సైతం నిలకడగా ఉందని, కేసులు రెట్టింపయ్యేందుకు పట్టే సమయం కూడా మెరుగవుతోందని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ పది లక్షలకు పైగా కరోనా టెస్ట్‌లు నిర్వహించామని, రోజుకు 74,000 పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశమంతటా దాదాపు 20 లక్షల పీఈపీ కిట్లను వైద్య సిబ్బందికి అందచేశామని చెప్పారు. వంద దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్, పారాసిటమాల్ మాత్రలను సరఫరా చేశామని తెలిపారు. కోవిడ్-19 బాధితులు, వైద్యుల పట్ల వివక్ష చూపరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చదవండి : కరోనా.. వనస్థలిపురంలో 8 కంటైన్మెంట్ జోన్లు -
కరోనా కట్టడికి కేంద్రం సరికొత్త వ్యూహం..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఇప్పటి వరకు కేవలం వైరస్ బారినపడిన, అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగంచెల వ్యూహంతో కరోనా సోకిన వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నియంత్రణకు దక్షిణ కొరియా అనుసరించిన విధానాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై పలు విషాయలను కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్ ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సరికొత్త విధానాలను అనుసరించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. (కేంద్రమంత్రిని వెంటాడుతున్న కరోనా భయం!) దీనిలో భాగంగానే వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం (ట్రేస్) పరీక్షలు నిర్వహించడం (టెస్ట్) క్వారెంటైన్‌కు పంపడం (ఐసోలేషన్) వైద్య చికిత్స అందించడం (ట్రీట్) లాంటి వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. దీని వల్లన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే చివరి నాటికి రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, లాక్డౌన్, సామాజిక దూరంతోనే పూర్తిగా అంతం చేయగలమని అన్నారు. (ఒక్కరోజులో 1,975 కేసులు) కాగా దక్షిణ కొరియా ఎలాంటి కఠిన చర్యలు పాటించకుండానే విజయవంతంగా కోవిడ్19 మహమ్మారిని తమ దేశంలో నిరోధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాలో అత్యధికంగా 909 కేసులు నమోదు కాగా, మార్చి 17 నాటికి ఇది 74 కేసులకు తగ్గింది. పెద్ద ఎత్తున వైరస్ బాధితులను గుర్తించి పరీక్షలు నిర్వహించడంలో ఆ దేశం విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరించిన విధానాల వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అదే బాటలో నడవాలని భావించింది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 24 గంటల వ్యవధిలో 47 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 27,892కు, మరణాల సంఖ్య 872కు చేరిందని ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. -
థాంక్యూ.. సందేహాలు ఉంటే అడుగవచ్చు!
తిరువనంతపురం: కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్, ఆయన సహచర సిబ్బంది కఠిన పరిస్థితుల్లో ఎంతో గొప్పగా విధులు నిర్వర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువనంతపురం ఇకపై హాట్‌స్పాట్ లిస్టులో ఉండబోదని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే 3 వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు నిబంధనలు సడలిస్తున్నట్లు పేర్కొంది. కరోనా ప్రభావం ఆధారంగా వివిధ జిల్లాలను జోన్ల వారీగా విభజించి అక్కడ చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది.(లాక్డౌన్ సడలింపు: కేరళ సీఎం కీలక నిర్ణయం) ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురం జిల్లాను కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన శశి థరూర్.. తిరునంతపురం కలెక్టర్ వెల్లడించిన కరోనా వివరాలను జోడించి.. ‘‘ఇంత గొప్ప రికార్డు ఉన్న తిరువనంతపురాన్ని ఎందుకు హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ఈ విషయం గురించి స్పష్టతనివ్వగలరా’’అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ట్యాగ్ చేశారు. ఇక ఇందుకు స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్... ‘‘ ఈనాటి వరకు 170 హాట్‌స్పాట్ జిల్లాలు, 207 నాన్- హాట్‌స్పాట్, కరోనా లేని జిల్లాలను గుర్తించాం’’అంటూ హాట్‌స్పాట్ వర్గీకరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. (ప్రతీకారం తప్పదు.. ఇలాంటి వాళ్లను చూడలేదు) ఇందుకు ప్రతిగా ఆయనకు శశి థరూర్ ధన్యవాదాలు తెలపగా.. ‘‘ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా వివరాలు కావాలంటే నన్ను సంప్రదించడానికి సందేహించకండి’’అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్ నిబంధనలు పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో బేసి- సరి విధానంలో వాహనాలను రోడ్ల మీదకు అనుమతించనున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. అదే విధంగా కరోనా తీవ్రత ఆధారంగా జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించనున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో తిరువనంతపురాన్ని మూడో జోన్ కిందకు తెస్తామన్న విజయన్.. అక్కడ పాక్షికంగా లాక్డౌన్ నిబంధనలు సడలిస్తామని పేర్కొన్నారు. A but curious as to why Thiruvananthapuram is listed as a #Covid19 hotspot when it has such a great track record!? Perhaps @MoHFW_INDIA can enlighten us? @drharshvardhan @vijayanpinarayi @CMOKerala @kgkrishnan05 https://t.co/RWjjW3TiMp — Shashi Tharoor (@ShashiTharoor) April 16, 2020 -
దేశంలో 28 కరోనా కేసులు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటివరకు 28 మందికి కోవిడ్-19(కరోనా వైరస్) సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడి కారణంగా ఆగ్రాలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు ఆరుగురికి వైరస్ సోకింది. దేశంలో పర్యటిస్తున్న 21 మంది ఇటలీ జాతీయుల్లో 16 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వారిని చావ్లాలో ఉన్న ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసు క్వారంటైన్‌కు తరలించాం’’ అని పేర్కొన్నారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 5,89,000 వేల మందికి ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహించామని పేర్కొన్నారు. అదే విధంగా నేపాల్ సరిహద్దులో సైతం స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికి స్క్రీనింగ్ తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. (హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!) అదే విధంగా విదేశాల్లో ఉండి కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్న భారత పౌరుల గురించి మాట్లాడుతూ... ఇరాన్ గనుక సహకరించినట్లయితే అక్కడ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తద్వారా స్క్రీనింగ్ చేసిన అనంతరం వారిని భారత్‌కు రప్పించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల ధర పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు కరోనా వైరస్ కట్టడిపై చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రుల బృందం భేటి కానుంది. 28 పాజిటివ్ కేసులు: ఢిల్లీ -1 తెలంగాణ- 1 ఆగ్రా- 6 కేరళ- 3 16 మంది ఇటాలియన్ టూరిస్టులు వారితో పాటు ప్రయాణించిన డ్రైవర్(ఇండియన్ డ్రైవర్) -
దీపావళికి పర్యావరణహిత టపాసులు
న్యూఢిల్లీ: సాధారణ టపాసుల కంటే 30 శాతం తక్కువ ఉద్గారాలను వెలువరించే పర్యావరణహిత టపాసులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. ప్రజల మనోభావాలను పరిగణనలో ఉంచుకొని పర్యావరణానికి హాని కలిగించని టపాసులను అందిస్తున్నామని స్పష్టం చేశారు. వీటిని శాస్త్రీయ పరిశ్రమల పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) తయారు చేసింది. 2018లో దీపావళి పండుగను పర్యావరణహిత టపాసులతోనే జరపాలని సూచిస్తూ కాలుష్యాన్ని కలిగించే టపాసుల తయారీ పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణహిత టపాసులు తయారు చేయాలని సూచించింది. -
డాక్టర్‌పై చేయిచేసుకుంటే పదేళ్ల జైలు!
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య నిపుణులపై దాడి చేసే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలు కల్పించే ముసాయిదా బిల్లును రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. వైద్యులు, వైద్యసేవా నిపుణులను తీవ్రంగా గాయపరిచిన వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా, అదేవిధంగా, ఆస్పత్రిపై దాడి చేసి నష్టం కలిగించిన వారికి ఆరు నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.50వేల నుంచి 5లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచామన్నారు. త్వరలోనే దీనిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు. దీని తర్వాత బిల్లును కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళుతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా జూన్‌లో దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. -
‘కర్మభూమితో పాటు కన్నభూమికీ సేవలు’
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో సేవలందిస్తున్న భారతీయ వైద్యులు తమను కన్న భూమి సేవకూ ముందుకు రావా లని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కర్మభూమి అయిన అమెరికాలో ఉండి అత్యుత్తమ సేవలందిస్తున్నారని వైద్యులను ప్రశంసిస్తూనే.. మాతృభూమి భారత్‌లోని గ్రామాలను దత్తత తీసుకుని సేవలందించడంపై దృష్టిసారించాలని వారికి సూచించారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియిన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్’ (ఏఏపీఐ) ఆధ్వర్యంలో ‘గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్–2019’ పేరుతో తాజ్‌కృష్ణా హోటల్లో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారత్‌లో యాంటీ బయోటిక్స్ నిరోధక వ్యవస్థ క్షీణించడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు భారత వైద్యులతో కలిసి అమెరికాలోని భారత సంతతి వైద్యులు పనిచేయాలని కోరారు. అమెరికాకు వెళ్లి చదువుకోవడం అక్కడ పనిచేయడం తప్పుకాదని.. అలా చేస్తూనే మాతృ భూమికి కొంతైనా రుణం చెల్లించేందుకు ముందుకు రావా లన్నారు. ప్రపంచ వైద్య వ్యవస్థకు భారత్ దీపస్తంభమని శుశ్రుతుడు, చరకుడు వంటి వారు నిరూపించారన్నారు. చాలా దేశాల నుంచి భారత్‌కు వైద్యసేవల కోసం వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. గతంతో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం 69 ఏళ్లకు పెరిగిందని, ఇదంతా వైద్యుల కృషి ఫలితమేనన్నారు. సామాజిక వైద్య బాధ్యతలతో ఆరోగ్య భారత్ లక్ష్యం సులువుగా సాధించవచ్చని అన్నారు. అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరికి భారత వైద్యులే సేవలందిస్తున్నారని తెలిపారు. ఇదంతా నాణేనికి ఒకవైపేనని ఇంకా చాలాచోట్ల ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు లేవనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. గ్రామాల వరకు వైద్య సేవల విస్తరణకు ఒక్క ప్రభుత్వం పనిచేస్తేనే సరిపోదని, ప్రైవేటురంగం కూడా చొరవ చూపాలని అన్నారు. సంస్కరణల వేగం... ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అన్న ఉప రాష్ట్రపతి దేశంలో సంస్కరణలు వేగం పుంజుకున్నాయని తెలిపారు. త్వరలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం పెద్ద విషయం కాదని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, మూడీస్ రేటింగ్ తదితర సంస్థలు చెబుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు చెందిన సావనీర్‌ను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం ‘రేషికేషన్ కౌన్సిల్’వారు రూపొందించిన కాంప్రహెన్సివ్ కార్డియో లైఫ్ సపోర్ట్ (సీసీఎల్ఎస్) మాన్యువల్‌ను ఆవిష్కరించారు. సింగిల్ విండో అనుమతులు: హర్షవర్ధన్ శాస్త్ర విజ్ఞాన రంగంలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. దేశంలో వైద్య సేవలు అందించాలనుకునే భారత సంతతి వైద్యులకు సింగిల్ విండో అనుమతులు ఇప్పిస్తామన్నారు. తెలంగాణలో చేపడుతున్న ఆరోగ్యశ్రీ, కంటివెలుగు, హరితహారం వంటి పథకాలను రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ సదస్సులో వివరించారు. ఈ కార్యక్రమంలో అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ‘ఆపి’అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు, నోరి దత్తాత్రేయుడు, అమెరికాలో భారత సంతతి వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్త ఏఏపీఐ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
డాక్టర్లపై ఎవరు దాడులు చేసినా.. కఠిన శిక్షే
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులపై ఎవరు దాడి చేసినా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని దాడుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రులను కోరారు. గతవారం కోల్‌కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 85 ఏళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి.. దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందితోపాటు పలువురు జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వైద్యుల నిరసన తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇప్పటికే మమతకు సూచించారు. ఈ నేపథ్యంలోనే విధుల్లో ఉన్న వైద్యులకు తగిన రక్షణ కల్పించాలంటూ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మరోవైపు ఆందోళనకు దిగిన జూడాలను చర్చలకు మమత ప్రభుత్వం ఆహ్వానించగా జూడాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తమ ఉద్యమాన్ని నీరు గార్చే కుట్రలో భాగంగానే ఈ చర్చల నాటకం ఆడుతున్నారంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. -
ఆర్థిక సవాళ్లకు సిద్ధమా?
యవ్వనం నుంచి వృద్ధాప్యం సమీపించే వరకు ఉండే 40 ఏళ్ల కాలం ఎంతో విలువైనది అవుతుంది. ఈ కాలంలో ఆర్థికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎన్నో లక్ష్యాలు తెరపైకి వస్తాయి... కనుక ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ సదా సన్నద్ధులు కావాలి. ఉదాహరణకు రూ.40 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల వ్యవధిపై తీసుకున్నారనుకోండి... ఇంకా 18 ఏళ్ల కాలం మిగిలి ఉంది. కానీ, వచ్చే పదేళ్లలోనే రుణాన్ని పరిపూర్ణంగా ముగించేయాలన్నది హైదరాబాద్‌కు చెందిన హర్షవర్ధన్ నిర్ణయం. ఇందుకోసం అతను ప్రతీ నెలా చెల్లించాల్సిన రూ.37,500 ఈఎంఐను పెంచుతూ వెళ్లాలనుకున్నాడు. లక్ష్యాన్ని చేరుకునే విషయంలో అతనికి సందేహం లేదు. ఎందుకంటే సొంతింటిని సమకూర్చుకోవాలనుకున్న వెంటనే అతడు పొదుపు ప్రారంభించి రూ.19 లక్షల డౌన్ పేమెంట్‌ను సిద్ధం చేసుకున్న చరిత్ర ఉంది. పొదుపు చేయడం ఎలాగో హర్షవర్ధన్‌కు తెలుసు. ‘‘విలువ తరిగిపోయే ఆస్తుల కొనుగోలుకు దూరంగా ఉంటాను. నా స్నేహితులు ఖరీదైన మొబైల్స్, డ్రెస్‌లు, కార్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొంత కాలం తర్వాత అవి ఎందుకూ పనికిరావు’’ అని హర్షవర్ధన్ తెలిపారు. అంటే విలువను సృష్టించడం అన్నది హర్షవర్ధన్‌కు తెలిసిన విషయం. ఆర్థిక విషయాల్లో ఈ తరహా క్రమశిక్షణ ఉన్న వారే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు... సవాళ్లకు సై అంటారు. బడ్జెట్, పొదుపు, ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి తదితర అంశాలకు అందులో చోటు ఉండాలి. పన్ను ఆదా కోసం అయితే ఈఎల్ఎస్ఎస్ పథకాలను పరిశీలించొచ్చు. మిలీనియల్ జనరేషన్‌కు (1981–1996 మధ్య జన్మించిన వారు/22–37 వయసు) ఈక్విటీ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు వారి వయసు అనుకూలమైనది. ఎందుకంటే రిటైర్మెంట్కు దీర్ఘకాలం మిగిలి ఉంటుంది. కనుక రిస్క్ తీసుకోవడం ద్వారా అధిక రాబడులు అందుకోవచ్చు. ముప్పైల్లోనే పునాది 30 ఏళ్ల వయసుకొచ్చే సరికి ప్రతీ వ్యక్తికి బాధ్యతలు తెలిసివస్తాయి. వివాహం, పిల్లలు, ఇంటి కొనుగోలు ఇలా ఎన్నో లక్ష్యాలు, అవసరాలు ఎదురవుతాయి. కనుక కుటుంబం కోసం, మీపై ఆధారపడిన వారి పట్ల దృష్టి సారించాల్సిన వయసు ఇది. విశాఖపట్నానికి చెందిన రాధిక (27), పవన్‌కుమార్ (31) గతేడాదే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలసి వెడ్డింగ్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తమకు పుట్టబోయే పిల్లల గురించి వీరు ముందుగానే ఆలోచన కూడా చేశారు. పిల్లల విద్యావసరాల కోసం పెళ్లయిన మూడు నెలల్లోనే ప్రతీ నెలా రూ.6,000 చొప్పున రికరింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. పదేళ్లలో రూ.10.36 లక్షల రూపాయలైనా సమకూర్చుకోవాలన్నది వారి లక్ష్యంగా ఉంది. లక్ష్యానికంటే ముందుగానే సన్నద్ధం కావడం ఓ మంచి ఆలోచన అవుతుంది. కాకపోతే అనుకున్నట్టు ప్రణాళికలను అమల్లో పెట్టడమే కష్టమైన టాస్క్. హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కూడా అంతే. బహుళజాతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే క్రాంతి పదేళ్ల క్రితమే... వచ్చే పదేళ్లలో ఇంటి కోసం రూ.80లక్షలు సమకూర్చుకోవాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టు ఇన్వెస్ట్ చేశాడు. లక్ష్యంలో సఫలం కూడా అయ్యాడు. ఈ మొత్తాన్ని ఇంటి కొనుగోలు కోసం వినియోగించుకోవాలన్నది అతడి ఆలోచన. పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం, తన రిటైర్మెంట్ అవసరాల కోసం సిప్ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 40ల్లో మల్టీటాస్క్ 40ల్లోకి ప్రవేశించిన వారు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉంటారు. అందుకోసం తగినంత నిధిని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరో 15–20 ఏళ్లకు చెప్పుకోతగ్గ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ‘‘రిస్క్ తీసుకోలేని సంప్రదాయ ఇన్వెస్టర్లు పీపీఎఫ్‌ను ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్‌ను తీసుకునేందుకు సిద్ధపడేవారు ఈక్విటీలను పరిశీలించాలి. రెండో ఇంటిని కొనుగోలు చేయడం కూడా మంచి ఆలోచనే అవుతుంది’’ అని ఇండియన్‌మనీ వ్యవస్థాపకుడు సుధీర్ తెలిపారు. ఇక 40ల్లో రుణ భారం లేకుండా ఉండడం అనేది పెద్ద సవాలే. 50కు దగ్గరపడితే అన్ని రకాల రుణాలను తీర్చివేసి, రిటైర్మెంట్ ప్రణాళికపై దృష్టి సారించడం మంచిదన్నది నిపుణుల సూచన. ఒకవేళ పిల్లల ఉన్నత విద్యకు నిధులు సర్దుబాటు అవకపోతే విద్యా రుణ మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అంతేకానీ, రిటైర్మెంట్ నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దన్నది సూచన. ఎందుకంటే వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడకుండా, తమ జీవన అవసరాలను సాఫీగా సాగిపోవాలంటే అందుకు నిధి తప్పనిసరి. దీని అవసరాన్ని గుర్తించి ముందుగానే కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. లేకపోతే జీవన అవసరాల విషయంలో రాజీ పడాల్సి రావడంతోపాటు, పిల్లలపై ఆధారపడాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. 50–60ల్లోకి ప్రవేశించిన తర్వాత విశ్రాంత జీవనానికి పదేళ్ల కాలమే మిగిలి ఉంటుంది. కనుక ఈ వయసులో రిస్క్ తీసుకోరాదు. సురక్షిత సాధనాలవైపు చూడాలి. రుణాలు తీసుకుని ఉంటే వాటిని చెల్లించే మార్గాలను అన్వేషించాలి. రిటైర్మెంట్ 55 లేదా 60 ఏళ్లు అనుకుంటే దానికి రెండు మూడేళ్ల ముందే బాధ్యతలన్నీ పూర్తయ్యేట్టు చర్యలు తీసుకోవాలి. రిటైర్మెంట్ సమయం తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ప్రధానమంత్రి వయవందన యోజన వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవాలి. -
నియంతను తలపిస్తున్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తనను ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తోందన్నారు. కాకినాడలో సమస్యలపై నిలదీసిన ఒక మహిళను ‘ఫినిష్ చేస్తానంటూ..’ గూండాలా బెదిరించడం దారుణమని మండిపడ్డారు. ఇదే రీతిలో అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని బెదిరించిన విషయం గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో ఎన్ని చేయాలో అన్నీ చేశారని దుయ్యబట్టారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించనంటున్నారంటే ఏమనాలని ప్రశ్నించారు. కేంద్రం పరిధిలో ఉన్న ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని అంతమొందిస్తే ఆ నేరం కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు ప్లాన్ చేశారని రోజా చెప్పారు. కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు ఇస్తే నిందితుడు శ్రీనివాస్‌కు లేని బాధ చంద్రబాబుకు, లోకేశ్‌కు ఎందుకని నిలదీశారు. ‘ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును మీరు ఎన్ఐఏకి అప్పగిస్తే అది సమాఖ్య స్పూర్తికి విరుద్ధం కాదా? కిడారి కేసును బదిలీ చేసినట్టే జగన్ హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి ఎందుకు ఇవ్వలేదు?’ అని రోజా నిలదీశారు. సినిమాలు లేని శివాజీ అనే నటుడితో ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు చెప్పించింది నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్నం నూటికి నూరు శాతం చంద్రబాబే చేయించారన్నట్టుగా ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయన్నారు. హర్షవర్ధన్ మీ బినామీ కాదా? ‘ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ అధినేత హర్షవర్ధన్ చౌదరి మీకు బినామీ కాదా?, ఆ రెస్టారెంట్‌ను ప్రారంభించింది మీరు కాదా? శ్రీనివాస్ ఉపయోగించిన కత్తి హర్షవర్థన్ రెస్టారెంట్లో ఎంతో కాలంగా ఉన్నది నిజం కాదా? మీకు సంబంధం లేనప్పుడు కేసును ఎన్ఐఏకి అప్పగించాలి కదా. ఎన్ఐఏకి కేసు అప్పగించాలని అధికారులు కోరితే రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించడం లేదు..’ అని రోజా నిలదీశారు. తిరిగి తాను అధికారంలోకి రాను అని భావించిన చంద్రబాబు.. జగన్‌ను భౌతికంగా లేకుండా చేసేందుకు ప్లాన్ చేసినా భగవంతుడి దయవల్ల ఆయన బయటపడ్డారన్నారు. బీజేపీతో లాలూచీ పడింది, మోదీకి ఊడిగం చేస్తోంది కూడా చంద్రబాబేనన్నారు. ఏపీలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ‘కేంద్రంపై యుధ్దం అని పైకి చెబుతూ నీతి ఆయోగ్ మీటింగుకి వెళ్లి వంగి వంగి దండాలు పెట్టింది మీరు కాదా? కర్ణాటక ఎన్నికలయ్యాక తనను అరెస్ట్ చేయబోతున్నారని, తనను రక్షించుకోవాలని బహిరంగంగా ప్రజలను కోరలేదా? అయినా ఈరోజు వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదంటే అర్ధం ఏమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోనివి అంటున్న చంద్రబాబు తన చుట్టూ కేంద్రం కల్పించిన జడ్ కేటగిరీ భద్రతను పంపేయాలన్నారు. -
అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్
న్యూఢిల్లీ: అమెరికాలో భారత నూతన రాయబారిగా హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్షవర్ధన్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా నవ్‌తేజ్ సర్నా కొనసాగుతున్నారు. త్వరలోనే హర్షవర్ధన్ కొత్త రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం హర్షవర్ధన్ బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. హెచ్1బీ వీసా, అమెరికా వద్దని వారించినా రష్యా నుంచి ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఇరాన్ నుంచి చమురు దిగుమతులు వంటి కీలక అంశాల్లో భారత్‌పై ట్రంప్ నేతృత్వంలోని అమెరికా సర్కారు ధోరణిని హర్షవర్ధన్ సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది. హర్షవర్ధన్ గతంలో థాయ్‌లాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో భారత రాయబారిగా సేవలందించారు. -
హర్షవర్థన్@రూ. 35లక్షలు
శ్రీకాకుళం అర్బన్: ప్రతిష్టాత్మక గూగుల్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్లో శ్రీకాకుళానికి చెందిన పొన్నాడ హర్షవర్ధన్ ఎంపికయ్యాడు. గూగుల్ ఎంపికచేసిన షార్ట్‌లిస్ట్‌లో ఆసియాలోనే 36వ ర్యాంకు దక్కించుకున్న హర్షవర్ధన్ బెంగళూరులోని 12వారాల గూగుల్ ఇంటర్న్‌షిప్‌లో అత్యద్భుతమైన ప్రావీణ్యతను సాధించడంతో తుది లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. దీంతో ఆ సంస్థ ఏడాదికి రూ.35లక్షల జీతం చెల్లింపునకు అంగీకరించి ఉద్యోగానికి ఎంపికచేసింది. సరస్వతీ పుత్రునిగా రాణింపు.. జిల్లాలోని పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన పొన్నాడ హర్షవర్ధన్ చిన్ననాటి నుంచే సరస్వతీ పుత్రునిగా రాణిస్తూ వస్తున్నాడు. తండ్రి పొన్నాడ వెంకటరమణ, అడ్వకేట్‌గా, పూర్వపు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సేవలందించారు. తల్లి అమ్మాజీ గృహిణి. ప్రస్తుతం వీరు శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. టెన్త్‌క్లాస్‌లో హైదరాబాద్ శ్రీచైతన్య స్కూల్లో 9.7గ్రేడ్ పాయింట్లు, ఇంటర్మీడియెట్‌లో 967 మార్కులు మార్కులు సాధించాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌లో 226ఓబీసీ, 1842 ర్యాంకు సాధించగా, మెయిన్స్‌లో ఏఐఆర్ 1345 ర్యాంకు దక్కించుకున్నాడు. ఎంసెట్ ఓపెన్‌లో 448 మెరుగైన ర్యాంకు సొంతం చేసుకున్నాడు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్(ఐఐఎస్సీ)లో, అలాగే బెంగళూరులోనే ఇండియన్ స్టాటికల్ ఇనిస్టిట్యూట్(ఐఎస్ఐ)లో ప్రవేశం పొంది కోర్సులను పూర్తిచేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మక కెవీపీవై స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. తాజాగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న గూగుల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. తమ కుమారుడు హర్షవర్ధన్ ప్రతిభపై తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ర్యాంకుల గిరిపుత్రుడు
జన్నారం (ఖానాపూర్): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పరీక్షల్లో ర్యాంకులు పొంది పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఈ గిరిపుత్రుడు. నీట్లో ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన ఇతను ఇప్పుడు జిప్మర్లో ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు ౖకైవసం చేసుకుని తన సత్తా చాటాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం రూప్‌నాయక్ తండాకు చెందిన లావుడ్యా హరిరాం, హారిక దంపతుల కుమారుడు హర్షవర్దన్. శుక్రవారం విడుదలైన జిప్మర్ ‡(జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ప్రవేశ పరీక్షలో ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించాడు. చురుకైన విద్యార్థి హర్షవర్దన్ మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 986 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధిం చాడు. ఇటీవల కేవీపీవై (కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన) 2018 పరీక్షలో అఖిల భారత స్థాయి లో 35వ ర్యాంకు సాధించాడు. హర్షవర్దన్ అక్క హరిప్రియ జైపూర్ నిట్ (జాతీయ విజ్ఞాన సంస్థ)లో ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ కోర్సు చేస్తూ ఎయిర్‌పోర్టు అథారిటీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. తండ్రి స్ఫూర్తితో క్రీడల్లోనూ.. హర్షవర్దన్ క్రీడల్లోనూ మంచి ప్రావీణ్యం కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. తండ్రి లావుడ్యా హరిరాం గురుకుల కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన పీహెచ్డీ చేస్తున్నారు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువుల్లో ప్రతిభ కనబరుస్తున్న సరస్వతీ పుత్రుడు హర్షవర్దన్ ఇటీవలే ఎయిమ్స్ ఎంట్రన్స్ కూడా రాశాడు. అందులోనూ మంచి ర్యాంకు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. -
2030 నాటికి పరిశోధనల్లో అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర పరిశోధనల్లో భారత్‌ను 2030 నాటికి ప్రపంచంలోనే టాప్–3 దేశాల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేయాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్–జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ)ను ఆయన సందర్శించారు. ప్రయోగశాలల్లో జరిగే పరిశోధనలను సమాజానికి ఉపయోగపడేలా మార్చాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశంలోని 100 వెనుకబడిన జిల్లాలతో పాటు ఈశాన్య భారత్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ జిల్లాల్లోని ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని కోరారు. తాగు, సాగునీటి కొరతపై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలకుగాను సీఎస్ఐఆర్ డైరెక్టర్ వి.ఎం.తివారీ నేతృత్వంలోని యువ శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. -
రుతురాగాలతో నటజీవితం ప్రారంభం
విజయనగరం టౌన్: రుతురాగాలు సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అంచలంచెలుగా ఎదిగి అమృతం సీరియల్‌తో అందరి మన్ననలు పొంది, లీడర్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి హిట్ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన మన జిల్లావాసి ఎమ్.హర్షవర్దన్ ఆదివారం గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆత్మీయకలయిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... అప్పుడు మొదలైంది.. దూరదర్శన్‌లో ప్రసారమైన రుతురాగాలతో నట జీవితాన్ని ప్రారంభించాను. పుట్టింది రాజాంలోనైనా విద్యాభ్యాసం, పెరిగిందంతా విజయనగరంలోనే కావడం నా అదృష్టం. రుతురాగాలు తర్వాత కస్తూరీ, శాంతినివాసం సీరియల్స్‌లో నటించాను. అమృతం సీరియల్ ఎక్కువ పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చింది. సినీరంగ ప్రవేశంలో లీడర్, అనుకోకుండా ఒకరోజు వంటి చిత్రాలు బాగా పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చాయి. గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే దర్శకునిగా పనిచేశాను. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నాను. సినిమా అంతా విజయనగరం పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నాను. యాంకర్ శ్రీముఖి ఇందులో హీరోయిన్గా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. 1989లో పల్లెటూర్లో జరిగిన యధార్ధ సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నాను. -
పెళ్లి సింపుల్‌గా.. షష్టిపూర్తి ఘనంగా...
నటుడు, రచయిత హర్షవర్ధన్ తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మురళి, శ్రీముఖి, కిశోర్, అజయ్ గోష్, హర్షవర్ధన్ ముఖ్య తారలుగా అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె. విశ్వేష్‌బాబు సమర్పణలో అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ– ‘‘పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. కానీ, షష్టిపూర్తి కార్యక్రమాలు అలా జరగడం లేదు. పెళ్లి సైలెంట్‌గా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలనే ఆలోచన నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. సినిమాలో ఏకైక లేడీ పాత్రను శ్రీముఖి చేశారు. 1988–89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు పక్కా కమర్షియల్ అంశాలూ ఉంటాయి. సంగీత దర్శకుడు కావాలనే నేను హైదరాబాద్ వచ్చా. అందుకే ఈ చిత్రానికి సంగీతం అందించా’’ అన్నారు. శ్రీముఖి, విశ్వేష్, కిశోర్, మురళి, సంతోష్, సురేష్, శ్రీధర్, కమల్, టిఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు. -
మూఢ నమ్మకాల నేపథ్యంలో...
‘పంచమి’ చిత్రదర్శకురాలు సుజాత భౌర్య దర్శకత్వంలో మరో సినిమా ఆరంభమైంది. హర్షవర్ధన్, సుజయ్, వేణు, శాంతి మహరాజ్, మమతా కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై చల్లా విజయ్‌కుమార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సిరాజ్ క్లాప్ ఇచ్చారు. దర్శకురాలు మాట్లాడుతూ– ‘‘దర్శకురాలిగా నాకిది మూడవ చిత్రం. కామెడీ, హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. మూఢ నమ్మకాలను ఆధారం చేసుకుని కథ సిద్ధం చేశా. ఇందులో బాలిక పాత్ర హైలెట్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘కథ వినగానే ఎగై్జట్ అయ్యా. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా’’ అన్నారు నిర్మాత విజయ్ కుమార్. తనికెళ్ల భరణి, జయసుధ, ఉత్తేజ్, జీవా, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నందర్ కృష్ణ, సంగీతం: శ్రీ కోటి. -
ఎవడు అడ్డొచ్చినా తాట తీస్తా : ఘంటా రవి
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్ వంటి అగ్రహీరో లతో సినిమాలు చేసిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఘంటా శ్రీనివాసరావు తనయుడు ఘంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ, జయంత్ దర్శకత్వంలో శారద ఆర్ట్స్‌పై అనిల్‌కుమార్ కిశన్ నిర్మిస్తోన్న ‘కాళహస్తి’ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత డి.సురేశ్‌బాబు క్లాప్ ఇచ్చారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘మంచి కోసం దూసుకెళ్తా.. ఎవడు అడ్డొచ్చినా తాట తీస్తా’ అని ఘంటా రవి తొలి డైలాగ్ చెప్పారు. ‘‘ప్రేక్షకులను థ్రిల్ చేసే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘జయంత్గారి దర్శకత్వంలో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం’’ అని ఘంటా రవి అన్నారు. ఈ చిత్రానికి కథ: దీన్‌రాజ్, మాటలు: హర్షవర్ధన్, ఛాయాగ్రహణం: ఎం.ఎన్.జవహర్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ప్రశాంత్. -
ఇక ముందంతా వర్షాభావమే
న్యూఢిల్లీ: రుతపవనాల ఆగమనం ఆలస్యంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలపై దీని ప్రభావం ఉంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అరేబియా మహాసముద్రంలో నెలకొన్న యాంటీ సైక్లోన్ ప్రభావం నేపథ్యంలోనే ఈ పరిణామం ఏర్పడుతోందని వాతావరణ విభాగం తెలిపింది. వాతావరణ శాఖ అంచనాలు వల్ల నిజంకాకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. మరోవైపు అసలే అకాల వర్షాలు, కరువుతో అల్లాడిపోతున్న రైతులోకానికి ఇది పిడుగులాంటి వార్త అని వాతావరణ శాఖ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాగల సంవత్సరానికి వర్షపాతం శాతం 93 నుంచి 88 కనిష్టానికి పడిపోతుందనే అంచనా మరింత ఆందోళన కలిగిస్తోందంటున్నారు. దీని ప్రభావం వర్షాధారంగా సాగే ఖరీఫ్ సాగుపై ఎక్కువగా ఉంటుందంటున్నారు. -
ఓటు హక్కు నివియోగించుకున్న కేంద్ర మంత్రి
-
హస్తిన పీఠం కమలానికే!
ది వీక్-ఐఎంఆర్బీ సర్వేలో వెల్లడి ఎన్నికల్లో ఆప్-బీజేపీ పోటాపోటీ: ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే బీజేపీ వైపే ఓటరు చూపు: ఇండియా టీవీ-సీటీవీ న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకునే అసెంబ్లీ ఎన్నికల రేసులో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. దాంతో ఓటరు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టనున్నాడో తెలుసుకునేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో 36 సీట్లను బీజేపీ కైవసం చేసుకోనుందని ‘ది వీక్-ఐఎంఆర్బీ’ సర్వేలో తేలింది. ఆప్‌కు 29 సీట్లు, కాంగ్రెస్‌కు కేవలం నాలుగు సీట్లు వస్తాయని తెలిపింది. 39 శాతం మంది ఓటర్లు బీజేపీకి జై కొడుతున్నారని తేల్చింది. ఆప్ నేత కేజ్రీవాల్ సీఎం కావాలని 40 శాతం మంది ఓటర్లు, బీజేపీ నాయకురాలు కిరణ్ బేడీ సీఎం కావాలని 39 శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారు. కేజ్రీవాల్, బేడీ, మనీష్ సిసోడియాలు స్పష్టమైన మెజారిటీతో నెగ్గుతారని సర్వే తెలిపింది. ఎన్నికల్లో బీజేపీకి 37 సీట్లు, ఆప్ 28 సీట్లు, కాంగ్రెస్‌కు 5-8సీట్లు రావొచ్చని ఇండియా టీవీ-సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఇక, బీజేపీ 37 సీట్లు, ఆప్ 29, కాంగ్రెస్ 4 సీట్లు పొందొచ్చని తలీమ్ రీసెర్చ్ ఫౌండేషన్-జీ న్యూస్ సర్వేలో వెల్లడైంది. సీఎం పదవికి కేజ్రీవాల్, బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ ‘స్నాప్ పోల్’లో వెల్లడైంది. సీఎం పదవికి ఉత్తమ అభ్యర్థిగా కేజ్రీవాల్ 47 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, 44 శాతం ఓట్లతో బేడీ రెండోస్థానంలో నిలిచారు. మహిళా ఓటర్లలో 50 శాతం మంది కేజ్రీవాల్ వైపు మొగ్గుచూపగా, బేడీకి 41.4 శాతం మద్దతు తెలిపారు. ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని న్యూస్ నేషన్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. -
ధర్నాలా.. అభివృద్ధా?
ఏది కావాలో తేల్చుకోండి: మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలను చూడండి మాకే పూర్తి మెజారిటీ ఇవ్వండి ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని చూడండి.. కమలానికే పట్టం కట్టండి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీకి బాధ్యతాయుత ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. ఢిల్లీ సమస్యలను పక్కనపెట్టి.. టీవీలు, మీడియాలో కనిపించేందుకు ధర్నాలు చేసేవారితో ప్రయోజనమేమీ ఉండదని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు. సమస్యల నుంచి పారిపోయేవారిని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వారిని దూరంగా ఉంచాలని కోరారు. కిందటి ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ ఇవ్వకపోవడంతో ఏడాది కాలం వృథా అయిందని, ఈసారి అలా కాకుండా బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలన్నారు. మోదీ అదృష్టం కారణంగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపైనా మోదీ తనదైన శైలిలో స్పందించారు. ‘‘వాళ్లు చెబుతున్నదే నిజమనుకుందాం. మీకు అదృష్టవంతులు కావాలా..? దురదృష్టవంతులా? నా అదృష్టం కారణంగా మీకు ధరలు తగ్గితే మంచిదేగా. మోదీ అదృష్టం దేశానికి ఉపయోగపడుతుందంటే ఇంతకు మించిన అదృష్టం మరేమీ ఉంటుంది? ఇక దురదృష్టవంతులను తీసుకురావాల్సిన అసరమేముంది? ’’ అని ప్రశ్నించారు. నినాదాలు చేసేవారు, తప్పుడు హామీలు ఇచ్చేవారు బీజేపీకి వ్యతిరేకంగా తెరవెనక బేరసారాలు చేస్తుంటారని ఆరోపించారు. కిందటిసారి ఆప్, కాంగ్రెస్ తెరవెనుక చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మీడియాలో కనిపించేందుకు వారే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అమాయకపు ముఖాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో బీజేపీ సర్కారు ఉంటే సీఎంకు.. తనపైన ఉండే మోదీ, కేంద్ర ప్రభుత్వం భయం ఉంటుందన్నారు. అలాకాకుండా వేరేవారికి పీఠం అప్పగిస్తే.. ఆయనపైన ఎవరూ ఉండరని, ఢిల్లీని ఇంకాస్త వెనక్కు తీసుకువెళ్తారని చెప్పారు. -
కిరణ్‌బేడీకి వెన్నుదన్నుగా హర్షవర్ధన్
న్యూఢిల్లీ: కృష్ణానగర్ నియోజకవర్గ ఓటర్లు కిరణ్‌బేడీ విషయంలో ఎంతమాత్రం సుముఖంగా లేరంటూ వచ్చిన వార్తలు బీజేపీలో కలవరం రేకెత్తించాయి. దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకుగాను స్థానికంగా ఎంతో ప్రాబల్యం కలిగిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర ్ధన్ను ఆమెకు మద్దతుగా రంగంలోకి దించింది. బేడీ సునాయాస విజయం కోసం ఆమెకు మద్దతుగా పనిచే యాల్సిందిగా హర్షవర్ధన్‌ను అధిష్టా నం ఆదేశించిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ సంప్రదాయ సీటుగా భావించే ఈ నియోజక వర్గంలో 1993 నుంచి 2013 ఎన్నికల వరకూ హర్షవర్ధన్ విజయపరంపరను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన చాందినీచౌక్ స్థానంలో విజయకేతనం ఎగురవేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో హర్షవర ్ధన్ కు బదులు కిరణ్‌బేడీని బీజేపీ రంగంలోకి దించడంతో పార్టీ కార్యకర్తలు నిరాశకు లోనయ్యారని, ఆమెను వారంతా బయటి వ్యక్తిగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నియోజక వర్గంలో కిరణ్‌బేడీ చేపడుతున్న రోడ్‌షోలు, ఎన్నికల ప్రచార సభలకు స్పందన ఆశించినరీతిలో ఉండడం లేదంటున్నారు. ఈ పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని తమ పార్టీ భావించిందన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కిరణ్‌బేడీ బరిలోకి దిగినప్పటికీ ఆమెకు మద్దతుగా హర్షవర ్ధన్ తోనూ ప్రచారం చేయాలని నిర్ణయించిందంటున్నారు. కిరణ్‌బేడీ ఎట్టిపరిస్థితుల్లోనూ విజయకేతనం ఎగురవేసేలా చూడాలంటూ హర్షవర ్ధన్ ను ఆదేశించిందని చెబుతున్నారు. ఇరువురి మధ్య విభేదాలు ఇదిలాఉంచితే కిరణ్‌బేడీ, హర్షవర ్ధన్ మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత నెల 15వ తేదీన బేడీ... బీజేపీలో చేరారు. అదే నెల 20వ తేదీన నగరానికి చెందిన ఏడుగురు ఎంపీలను తేనీటి విందుకు ఆహ్వానించారు. ఆ విందుకు హర్షవర ్ధన్ ఆలస్యంగా వచ్చారు. బేడీ ఆయనను కలవకుండానే అక్కడ నుంచి నిష్ర్కమించారు. వీరిరిరవురి మధ్య దూరం నానాటికీ పెరుగుతుండడం అధిష్టానాన్ని ఆందోళనకు లోనుచేసింది. ఈ నియోజకవర్గంలో బేడీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బేడీకి అన్నివిధాలుగా అండదండగా నిలవాలని, ఆమె నిర్వహించే రోడ్‌షోలు, ఎన్నికల సభల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఆప్ దూకుడుకు కళ్లెం వేసేదెలా? ప్రస్తుత ఎన్నికల్లో తమ ప్రత్యర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఎంతమేరకు ఎదుర్కోగలమనే సందేహాలు బీజేపీని వేధిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆప్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో బీజేపీ విఫలమైంది. దీంతో ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోన్న బీజేపీ... ఆప్‌పై విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీని ఓఅరాచకవాది నడిపిస్తున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం నగరంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ యంత్రాంగంతో పాటు కేంద్ర మంత్రులను కూడా కమలదళంప్రచారంలోకి దింపింది. ఎనిమిది మంది మినహా మిగిలిన కేంద్ర మంత్రులు, ఎంపీలంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యేలా పార్టీ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా తమ కార్యకర్తలను ప్రచారానికి పంపింది. గత ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొని ఆప్ 28 చోట్ల గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఇప్పటికీ ఆప్ పరిస్థితి అంతంతగానే ఉంది. రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఆధ్వర్యంలో ఔత్సాహికులతో గజిబిజి భావాజాలంతో ఆ పార్టీ నడుస్తోంది. అంతే కాకుండా షాజియా ఇల్మీలాంటి ముఖ్యనాయకులు కూడా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆప్ 49 రోజుల పాలన తర్వాత ఆ పార్టీ నాయకులపై ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు, వేళాకోళాలు అధికమయ్యాయి. కేజ్రీవాల్‌ను... మోదీ వ్యంగ్యంగా ఏకే-47 అని పిలవడం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రతికూలతలను పక్కన పెడితే నగరంలోని పేదలు, మైనారిటీలు ఆప్ వైపు మొగ్గుచూపుతున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలు, మురికి వాడల్లో నివశించే జుగ్గీజోపడీ సమూహాలను నైపుణ్యంతో కేజ్రీవాల్ ఆకట్టుకున్నారు. పోలీసుల చేతివాటాన్ని, అధికారుల ఉదాసీనత వల్ల వీరంతా అనేక బాధలను ఎదుర్కొంటున్నారు. అలాగే హిందుత్వ సంప్రదాయవాదుల మతతత్వ అజెండా కారణంగా మైనారిటీలు ఒంటరివారయ్యారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా ఆప్ కనిపించింది. ఆ వర్గాలన్నీ ఇప్పుడు ఆ పార్టీపైనే ఆశలు పెట్టుకున్నాయి. అయితే కాంగ్రెస్ మరీ అంత బలహీనంగా లేదని, ఆ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం ఉందని, అది తమకు లాభిస్తుందని బీజేపీ మంత్రి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. -
బేడీ వైపు ఢిల్లీవాలా మొగ్గు
ఢిల్లీ మహిళలు కిరణ్‌బేడీ వైపు అధికంగా మొగ్గుతున్నారు. రకరకాల చింతలతో నిత్యం కుతకు తలాడే దేశ రాజధానిలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని ఆమె అయితేనే అర్థం చేసుకోగలరని భావిస్తున్నారు. అవినీతి నిర్మూలన, భద్రత, మెరుగైన జీవితం అనే మూడే ఢిల్లీ ఓటర్ల ప్రాథమిక డిమాండ్లు. మోదీ నాయకత్వం, బేడీ పరిపాలనాధికారం కలసి ఓటర్లకు నమ్మిక కలిగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉద్వేగభరితమైన ఓటర్ల నుంచి లేదా భయం రాజకీయాలతో బాధపడుతున్న వారి నుంచి ప్రధానంగా మద్దతు లభిస్తోంది. శాసనసభ ఎన్నికలకు ముందు ఢిల్లీలోని ఓ గోదాములోకి ఐదు వేల విస్కీ సీసాలను తరలించడానికి ఎంత మంది కావాలి? నిస్సందేహంగా సీసాలతో ప్రభావితం చేయాలనుకునే వారికంటే చాలా తక్కువే. ఎన్నికల కమిషన్ జరిపిన దాడిలో దొరికిన ఆ సీసాలు అక్రమంగా నిల్వచేసినవి. అంటే ఓటర్ల ను ప్రభావితం చేయడానికి దాచినవేననేది స్పష్టమే. చట్టబద్దంగా మద్యాన్ని అమ్ముకునేవారెవరికీ అక్రమంగా నిల్వచేయాల్సిన అవసరం ఉండదు. అవినీతికి కూడా మంచి నిర్వహణా నైపుణ్యాలు కొన్ని ఉండటం అవసరమనడానికి ఇదే ఆధారం. దోషిగా ఆరోపణకు గురైన వ్యక్తి, తనను తాను పవిత్రమూర్తిగా భావించుకునే ఒక పెద్దమనిషి పార్టీకి చెందినవారు. తానేతప్పూ చేసి ఎరుగనని సదరు అభ్యర్థి ఖండిస్తారనడంలో సందేహం లేదు. తప్పును అంగీకరించడమంటే ఎన్నికల కమిషన్ విధించే శిక్షను ఆహ్వానించడమే. ఇలాంటి వ్యవహారాల విచారణకు సమయం పడుతుంది. అది పూర్తయ్యేసరికి ఎన్నికలు జరిగిపోయి చాలా కాలమే అయిపోతుంది. ఆలోగా ఈ పొగమంచులో నిజాన్ని మీడియా నుంచి దాచేసి, నిస్సిగ్గుగా ఎన్నికల ప్రచారం కొనసాగించవచ్చు. అయిచే నిజాన్ని ఎరిగిన బాపతు కూడా ఉన్నారు... వారు ఓటర్లు. ఎంతైనా మందు కొట్టడమమేది మహోత్సాహంగా సాగే వ్యవహారం. తాగుబోతులో లేదా మానసికంగా కుంగిపోయినవాళ్లో మాత్రమే ఒంటరిగానే ఆ పని కానిచ్చేస్తారు. శ్రీమాన్ ఐదు వేల సీసాల వారు కాస్త పాత కాలపు సజ్జు అని ఓ మోస్తరు విచారణ జరిపినా తెలిసిపోతుంది. అదే లక్ష్య సాధన కోసం ఇంతకంటే తెలివైన పద్ధతిని కనిపెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు ప్రత్యక్ష పంపిణీ కిందకు వచ్చే సీసాలను పంపిణీ చేయరు. సంతకాలు, ఆనవాలు లేని చిట్టీలను పంపిణీ చేస్తారు. ఆచూకీ కనిపెట్టడం కష్టమయ్యే ఆ చిట్టీలను పుచ్చుకుని సంబంధిత మద్యం వ్యాపారి మందు సీసా అప్పగించేస్తాడు. ఈ ఘటన ఒకటి రెండు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఇప్పుడు దొరికినది మొత్తం నిల్వ చేసిన దాన్లో ఓ చిన్న భాగమే అనే సమంజసమైన సూత్రాన్ని బట్టి చూద్దాం. శ్రీమాన్ ఐదువేల సీసాల వారి అవసరం పట్టుబడ్డ వాటికంటే తేలికగానే రెండు లేదా మూడున్నర రెట్లు ఉండవచ్చు. కాబట్టి ఆయన రాజకీయ విస్కీ వ్యయం కనీసం రూ. 20 లక్షలు. అంతకంటే ఎక్కువేనని దాదాపు నిశ్చయంగా చెప్పొచ్చు. అంటే ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఆ అభ్యర్థి మొత్తం ఎన్నికల వ్యయం రెండు కోట్ల రూపాయలకు పైనే. ప్రజా జీవితంలోని నిజాయితీయే తమ అత్యంత మౌలిక సూత్రమని చెప్పుకునే పార్టీ అభ్యర్థి ఆయన. అలాంటి నిజాయితీ నుంచి ఢిల్లీని ఆ భగవంతుడే కాపాడాలి. ఇంతకు ఈ లంచం పనిచేస్తుందా? మహా అయితే పాక్షికంగా పనిచేస్తుంది. మన సమాజం స్థిరంగానూ, ప్రగతిశీలంగానూ పరిణామం చెందుతోంది. కులం, మతం ప్రాతిపదికగా కలిగిన సంప్రదాయకమైన గెలుపు లెక్కలకు అతీతంగా ఓటు చేసే వర్గం ఒకటి దేశంలో ఆవిర్భవించిం దని తాజా ఎన్నికల జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. ఇది ఒక ఆరోగ్యకర పరిణామం. సంప్రదాయకమైన పాత లెక్కలూ ఇంకా ఉన్నాయి, ఢిల్లీ ఎన్నికల్లోనూ అవి కనిపిస్తాయి. కానీ ఎన్నికల ప్రక్రియలో వాటికి ఇప్పుడు అంత ప్రాధాన్యం లభించడం లేదు. ఇటీవలి జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించిన గణాంకాలలో ఒక అంశం ప్రత్యేకించి ఆసక్తికరం. శ్రీనగర్ అంచున, దాల్ లేక్ ఒడ్డునున్న హజరత్బల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మసూద్ అల్ హస్సన్‌కు 2,635 మంది కశ్మీరీలోయ ఓటర్లు ఓటు చేశారు. ఇదేమంత పెద్ద సంఖ్య కాదనిపిస్తుంది. కానీ అవి మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 10 శాతం, కాంగ్రెస్‌కు లభించిన వాటికి రెండున్నర రెట్ల కంటే ఎక్కువ. హజరత్బల్ చాలా ప్రత్యేకమైన స్థలం. మొహమ్మద్ ప్రవక్త శిరోజం మె-ఎ ముకద్దాస్ అనే పవిత్ర అవశేషం ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ప్రార్థనా స్థలం. అక్కడ కమలం గుర్తుకు అనుకూలంగా ఓటింగ్ మిషన్ మీటను నొక్కిన ఓటర్లు ఎవరు? వాళ్లదొక కొత్త వర్గం. జాతి లేదా భావోద్వేగాలపరమైన అంశాలకంటే అభివృద్ధి, ఉద్యోగాలను మరింత ముఖ్యమైనవిగా భావించే బాపతు. దేశంలో ఇతర చోట ్లకూడా అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చే ఇలాంటి వర్గం ఓటర్లలో అధిక భాగంగా మారుతోంది. ఈ ఓటర్లలో మహిళలు, యువతదే అగ్రశ్రేణి. రెండు కారణాల వల్ల ఢిల్లీ మహిళలలో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గుతున్నారు. లైంగిక సమానత్వం, మహిళా సాధికారతలను ప్రధాని నరేంద్ర మోదీ తన పరిపాలనలోని విలక్షణ ఇతివృత్తంగా మలచారు. శక్తివంతమైన ఆయన ఉపన్యాసాలలోనూ, ‘‘బేటీ బచావో, బేటీ పడావో’’ ఉద్యమం వంటి విధానాలలోనూ కూడా ఇది కనిపిస్తుంది. అప్పుడే అది ప్రబల స్థాయి సహానుభూతిని కలగజేసింది. ఇక రెండవది, రకరకాల చింతలతో నిత్యం కుతకుతలాడే దేశ రాజధాని నగరంలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని కిరణ్‌బేడీ అర్థం చేసుకోగలరని వారికి నమ్మిక కలిగింది. అనుభవంగల పోలీసు అధికారిణి అయిన ఆమె అయితేనే మాటల హామీలకు మించి మరేమైనా చేస్తారని కూడా వారు విశ్వసిస్తున్నారు. అవినీతి నిర్మూలన, భద్రత, మరింత మెరుగైన జీవితం అనే మూడు అంశాలే ఢిల్లీ ఓటర్ల ప్రాథమిక డిమాండ్లు. నరేంద్ర మోదీ నాయకత్వం, ఢిల్లీలో బేడీ పరిపాలనాధికారం కలసి ఆ మూడు అంశాలకు సంబంధించి ఓటర్లకు తిరిగి నమ్మిక కలిగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఉద్వేగభరితమైన ఓటర్ల నుంచి లేదా భయం రాజకీయాలు సోకి బాధపడుతున్న వారి నుంచి ప్రధానంగా మద్దతు లభిస్తోంది. ఇది క్షేత్రస్థాయి వాస్తవికతను ప్రతిఫలించే అంచనాయే తప్ప తీర్పు కాదు. ఆ అర్థంలో ఆప్ గతించిన కాలానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఢిల్లీ ఓటర్లది అత్యంత మిశ్రమ సంపుటి. ఆ అంశమే దే శంలోని ఇతర ప్రాంతాలకు ఆ నగరం సూక్ష్మ రూపమని వ్యాఖ్యానించేట్టు ప్రేరేపిస్తుంది. అయితే అది కట్టుకథ. ప్రతి ఓటరూ తన తక్షణ ఆవరణంలోని సమస్యల ప్రాతిపదికపైనే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి బిహార్‌లో జనతాదళ్ (యూ) కొంత వరకు పనిచేయవచ్చు. కానీ ఢిల్లీలోని బిహార్ సంతతి ఓటర్లలో సైతం అది పనిచేయదు. మనం కోరుకునే పార్టీయే గెలవాలని అంతా ఆశిస్తాం. శ్రీమాన్ ఐదు వేల సీసాలవారు ఓటమిపాలు కావాలని కూడా అంతగానూ మనం అంగీకరిస్తాం. -
విపత్త్తులను ముందే పసిగట్టగలం
టీఈడబ్ల్యూసీ సదస్సులో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ పదేళ్ల కిందటి సునామీ బాధితులకు ఇంకా పునరావాసం అందలేదని వ్యాఖ్య టీఈడబ్ల్యూసీ సదస్సులో ప్రసంగించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: సునామీ, తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగ ట్టే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. హైదరాబాద్‌లోని భారత జాతీయ మహా సముద్రాల సమాచార వ్యవస్థ (ఇన్కాయిస్) ప్రాంగణంలో ఉన్న ‘సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం (టీఈడబ్ల్యూసీ)’ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన కేంద్రంగా పేరుగాంచిందని ఆయన చెప్పారు. ‘టీఈడబ్ల్యూసీ సాధించిన పురోగతి, భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై శుక్రవారం ‘ఇన్కాయిస్’లో జరిగిన సదస్సులో హర్షవర్ధన్ మాట్లాడారు. ఏడేళ్ల కింద ఏర్పాటైన సునామీ హెచ్చరికల కేంద్రం దేశవ్యాప్తంగా సముద్ర తీరాల్లో 350 చోట్ల పరికరాలను ఏర్పాటు చేసుకుని, తీరప్రాంత ప్రజలకు నిత్యం ప్రమాద హెచ్చరికలను అందజేస్తోందని తెలిపారు. పదేళ్ల కింద 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీతో దేశవ్యాప్తంగా వేలాదిమంది చనిపోయారని, తల్లిదండ్రులను కోల్పోయి ఎంతోమంది చిన్నారులు అనాథలయ్యారని ఆయన పేర్కొన్నారు. ఆ ఘటన జరిగి పదేళ్లుదాటినా గత ప్రభుత్వాలు బాధితులకు సరైన పునరావాసం కల్పించలేకపోయాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 26 శాతం మంది ప్రజలు సముద్రతీరానికి సమీపంలో నివసిస్తున్నారని, వైపరీత్యాల సమయంలో వారి ప్రాణాలను రక్షించేందుకు టీఈడబ్ల్యూసీ కేంద్రం ఎంతగానో దోహదపడుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఇటీవలి హుద్‌హుద్ తుపాను నుంచి ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోగలిగామన్నారు. హిందూ, పసిఫిక్ మహా సముద్రాల పరిధిలోని 16 దేశాలకు ఈ సునామీ హెచ్చరికల కేంద్రం సేవలందిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. వైపరీత్యాల నిర్వహణపై శిక్షణ.. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లకు శిక్షణ ఇప్పించే యోచన చేస్తున్నామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి తెలిపారు. జపాన్ వంటి దేశాలు తమ సునామీ హెచ్చరికల కేంద్రాన్ని రూ. 1,200 కోట్లతో ఏర్పాటు చేసుకోగా... మనదేశంలో కేవలం రూ. 240 కోట్లతో ఏర్పాటైన టీఈడబ్ల్యూసీ ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచిందని చెప్పారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలతో సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఇటువంటి వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి శైలేశ్‌నాయక్, మాజీ కార్యదర్శులు పీఎస్ గోయల్, హర్షగుప్తా, ఇన్కాయిస్ డెరైక్టర్ సతీష్ షెనాయ్ తదితరులు పాల్గొన్నారు. పోలియో సమూల నిర్మూలనకు వ్యాక్సిన్ పోలియో వ్యాధి సమూల నిర్మూలనకు, రాబోయే తరాలు దీని బారిన పడకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యాక్సిన్ తయారీకి చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోది ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రణాళికలను సాకారం చేసే దిశలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) రంగంలో వివిధ ప్రాజెక్టులను రూపుదిద్దేక్రమంలో తమ శాఖ కీలకపాత్రను పోషించనున్నదని చెప్పారు. సునామీ హెచ్చరికలపై హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ ఐఐసీటీ, ఐఐటీ, ఐఐఎం, తదితరాల ఆర్ అండ్ డి సెంటర్లను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉన్నా, దక్షిణాదిలో ఎందుకు అంతగా పుంజుకోలేకపోతోందన్న ప్రశ్నకు ఈ రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉందని, పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందన్నారు. వారంతా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని, దీనిని పార్టీ కార్యకర్తలు బలంగా ఉపయోగించుకోవాలన్నారు. కేంద్రమంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు ప్రకాష్‌రెడ్డి, హనీఫ్ అలీ, ఎం. చంద్రయ్య తదితరులున్నారు. -
స్టూడెంట్ వార్!
విద్యార్థుల మధ్య పెరుగుతున్న వైషమ్యాలు పత్తాలేని ర్యాగింగ్ నిరోధక కమిటీలు సుప్రీం కోర్టు ఉత్తర్వులు బేఖాతర్ చేష్టలుడిగి చూస్తున్న పోలీసులు అంతవరకూ సరదాగా ఉండే విద్యార్థుల మధ్య అపోహలు... చిన్నపాటి ఘర్షణలు రక్తపాతానికి దారి తీస్తున్నాయి. కళాశాలల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి. క్షణకాల ఆవేశం తోటి వారి ప్రాణాలను బలిగొంటోంది. తమ బిడ్డను కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులకే కాదు... దానికి కారకుడైన సహచరుడి కన్నవారినీ శోక సంద్రంలో ముంచుతోంది. నగరంలోని వివిధ కళాశాలల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. శనివారం ప్రగతి మహా విద్యాలయ కళాశాలలో ఇదే తరహాలో హర్షవర్ధన్ అనే విద్యార్థి సహచరుడి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. సిటీబ్యూరో: విజ్ఞానాన్ని పంచుతూ.. క్రమశిక్షణను అలవరచి... నైతిక విలువలను బోధించవలసిన విద్యాసంస్థలు విద్యార్థుల మధ్య ఘర్షణలు... కొట్లాటలకు కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యార్థుల మధ్య తలెత్తే అభిప్రాయ బేధాలు చినికి చినికి గాలివానలా మారుతున్నాయి. తీవ్రమైన ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి సంఘటనల విషయంలో విద్యా సంస్థల యాజమాన్యాలూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పోలీసులూ పెద్దగా స్పందించడం లేదు. ఫలితంగా విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. కోఠిలోని ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ కళాశాలలో శనివారం చోటుచేసుకున్న సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. విద్యార్థుల మధ్య మనస్పర్ధలను తొలగించి ఉంటే...హర్షవర్ధన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయేవాడు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడు యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందే స్పందించి ఉంటే... రెండు నెలలుగా కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొని ఉంది. యాజమాన్యం కానీ, అధ్యాపకులు కానీ దీన్ని నివారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. నగరం, శివారు ప్రాంతాల్లోని అనేక విద్యాసంస్థలు, ఇంజినీరింగ్, ఫార్మా కళాశాలల్లో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. విద్యార్థుల మధ్య వైషమ్యాలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యవస్థ, యంత్రాంగం లేకపోవడం, వారి సమస్యలను అధ్యాపకులు పట్టించుకోకపోవడం వల్ల వాతావరణం దెబ్బ తింటోంది. మరోవైపు ఇలాంటి సమస్యలకు కారణమవుతున్న ర్యాగింగ్ నిరోధంపైనా దృష్టి పెట్టడం లేదు. కమిటీలు ఏవీ? ఫీజుల వసూలుపై కళాశాలలకు ఉన్న శ్ర ద్ధ విద్యార్థుల ప్రవర్తన, సమస్యల విషయంలో కనిపించడం లేదు. అన్ని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. కమిటీలను ఏర్పాటు చేయని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను అరెస్టు చేసే అధికారం పోలీసులకు సుప్రీం కోర్టు ఇచ్చింది. ఇదంతా కాగాతాలకే పరిమితం. ఫలితంగా తరచూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల బాధ్యత ఈ పరిస్థితికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిందే. కళాశాలలో ఏ విద్యార్థితోనైనా గొడవలు, మనస్పర్ధలు, వైషమ్యాలు ఉన్నాయా? అనే విషయమై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకునే ధైర్యం పిల్లల్లో కల్పించాలి. వెంటనే కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లను కలిసి పరిష్కరించుకోవాలి. అలాంటి చొరవ తల్లిదండ్రుల వైపు నుంచి కనిపించడం లేదు. గతంలో జరిగిన సంఘటనలు గత ఏడాది జూన్‌లో మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సినీ నటుడు నిఖిల్ సోదరుడు రోహిత్సిద్ధార్థపై సీనియర్ విద్యార్థులు హరికృష్ణ, లక్ష్మణ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డిలు క్యాంటిన్లో దాడి చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 10న దుండిగల్‌లోని ఓ మేనేజ్మెంట్ కళాశాలలో ఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతున్న శ్రవణ్ కుమార్ అనే విద్యార్థి అదే కళాశాలకు చెందిన హేమంత్, సురేష్‌ల ర్యాగింగ్ భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న శంకర్‌పల్లికి చెందిన అజయ్గౌడ్పై సీనియర్లు దాడి చేశారు. గత ఏడాది మార్చి 22న పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సంతోష్, అబ్దుల్‌లను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో పాటు తీవ్రంగా గాయపరిచారు. ర్యాగింగ్ నిరోధక కమిటీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి కళాశాలలోనూ ర్యాగింగ్ నిరోధక కమిటీనిఏర్పాటు చేయాల్సిందే. ఈ కమిటీలో స్వచ్ఛంద సంస్థ, పోలీసు శాఖ, కళాశాల నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మానసిక నిపుణులు ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. వీరిని సమన్వయపరిచి కమిటీ ఏర్పాటు చేసే బాధ్యత కళాశాలపైనే ఉంటుంది. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. విద్యార్థుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. తరగతి, హాస్టల్ గదులు, లైబ్రరీ, క్యాంటిన్, బస్సులు, బస్ స్టాప్‌లలో నిఘా పెడుతుంది. ర్యాగింగ్‌కు అవకాశాలు ఉన్న ప్రతి చోటా ఈ స్క్వాడ్ పరిశీలిస్తుంది. యాంటీ ర్యాగింగ్ కమిటీల తీరుతెన్నులను అధ్యయనం చేస్తుంది. ప్రతిజ్ఞ చేయించాలి... కళాశాలలో చేరే ప్రతి విద్యార్థి ర్యాగింగ్ నిరోధానికి ప్రతిజ్ఞ చేయాలి. లిఖిత పూర్వకంగా ఒక నోట్‌ను కళాశాల నిర్వాహకులకు అందజేయాల్సి ఉంటుంది. నోట్ ఇవ్వని విద్యార్థికి కళాశాలలో చేర్చుకోరు. ► కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్‌కు సంబంధించిన పోస్టర్లతో పాటు కరపత్రాలు, ర్యాగింగ్ చట్టం పత్రాలు నోటీసు బోర్డులో పెట్టాలి. ► అలా పెట్టని కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం సుప్రీంకోర్టు పోలీసులకు కల్పించింది. ► ఇలాంటి కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను అరెస్టు చేయవచ్చు. ► ర్యాగింగ్‌కు పాల్పడితే విధించే శిక్షలను ప్రతి విద్యార్థికీ కళాశాల యాజమాన్యం వివరించాలి. ► ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు ముందుగా కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకె ళ్లాలి. ► ఇలాంటి ఫిర్యాదుపై కళాశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ► ర్యాగింగ్ విషయాన్ని దాచిపెట్టినా, సహకరించినా యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ► అలాంటి కళాశాలలపై కేసు నమోదు చేస్తారు. ర్యాగింగ్ అంటే... ► బలవంతంగా విద్యార్థితో పనులు చేయించడం ► అశ్లీల చిత్రాలు చూపడం, అసభ్య ప్రశ్నలు వేయడం ► బట్టలు ఊడదీయడం ► బట్టలు ఉతికించడం ► కాళ్లు మొక్కించుకోవడం ► నోట్స్ రాసిపెట్టమని బలవంతం చేయడం ► అసభ్యంగా ప్రవర్తించమని చెప్పడం ► వేధింపులకు గురిచేయడం ► {పాణం పోవడానికి, ఆత్మహత్యకు ప్రేరేపించడం ఇతరత్రా వే ధింపులు. ► ర్యాగింగ్‌కు పాల్పడితే.... ► నేరం తీరు శిక్ష ► టీజింగ్ 6 నెలలు జైలు ► కొడితే ఏడాది జైలు (రూ.5 వేలు ఫైన్) ► బంధించడం రెండేళ్ల జైలు ► కిడ్నాప్, రేప్ 5 ఏళ్ల జైలు (రూ.10వేలు ఫైన్) ► ర్యాగింగ్‌లో చనిపోతే.. ► జీవిత కాలం శిక్ష (పదేళ్ల జైలు, రూ 50 వేల ఫైన్) మొదటి మూడు నేరాలకు పాల్పడిన విద్యార్థిని కళాశాల నుంచి సస్పెండ్ చేస్తారు. చివరి నేరానికి పాల్పడితే ఏకంగా డిస్మిస్ చేస్తారు. అంటే ఇతర ఏ కళాశాలలోనూ విద్యార్థిని చేర్చుకోరు. సూడో హీరోయిజానికి నిదర్శనం సినిమాల ప్రభావం యూత్‌పై బాగా ఉంది. టీనేజ్ విద్యార్థులు సినిమాల ప్రభావం, హార్మోన్ల కారణంతో సూడో హీరోయిజానికి పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యాసంస్థలపైఉంది. చిన్న వయస్సులో డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటికి పిల్లలు అలవాటు పడుతున్నారు. దాంతో క్షణికమైన ఉద్రేకాలు, భావోద్వేగాలు, హింసను ప్రేరేపించే ఆలోచనలు పిల్లల్లో చెడు లక్షణాలకు దారి తీస్తున్నాయి. - డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్య నిపుణుడు -
యాంటీబయో‘కిల్స్’
ఐదేళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో 71 శాతం పెరిగిన యాంటీ బయోటిక్స్ వినియోగం ఏటా రూ. 5 వేల కోట్ల అమ్మకాలు ప్రభుత్వాసుపత్రులు వాటా రూ.123 కోట్లు ఈ మందుల వినియోగం పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాంటీబయోటిక్స్ మందుల వినియోగం తీవ్రమైంది. చిన్నపాటి జలుబు చేసినా ఈ తరహా మందులు వాడటం ఎక్కువైంది. వీటితో ప్రమాదం పొంచి ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 71 శాతం యాంటీబయోటిక్స్ మందుల వినియోగం పెరిగినట్టు తేలింది. రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధుల బాధితులకు మధుమేహం ఒక కారణమైతే.. రెండో కారణం యాంటీబయోటిక్స్ మందులేనని వైద్యులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) ఒక్కొక్కరు ఏడాదికి సగటున 13 నుంచి 16 యాంటీబయోటిక్స్ మాత్రలు (ఇంజక్షన్లు కాకుండా) వినియోగిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మందుల వినియోగం దేశవ్యాప్తంగా కూడా గత ఐదేళ్లలో 62 శాతం పెరిగినట్టు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం తాజాగా తమ పరిశోధనలో తేల్చింది. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ కంటే తెలుగురాష్ట్రాల్లోనే ఈ మందుల వినియోగం ఎక్కువని తేలింది. ఇటీవలే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ యాంటీబయోటిక్స్ మందుల వినియోగం పెరుగుదల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ మందుల వినియోగం వల్ల దుష్ఫలితాలు ఏటికేడాదిపెరుగుతున్నాయి. సూక్ష్మక్రిములు (మైక్రోబ్యాక్టీరియా) నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. దీంతో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఏటా 30 శాతం యాంటీబయోటిక్ మందులు పనిచేయకపోతుండటంతో కొత్త మందులను వాడుతున్నట్టు తేలింది. మోతాదు పెంచడం వల్ల అది మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాకుండా నరాలు, ఎముకల సంబంధిత వ్యాధులూ వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. మైక్రోబ్యాక్టీరియా సామర్థ్యం పెంచుకునే కొద్దీ కొత్తరకాల వ్యాధులు వస్తున్నట్టు కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. రూ. 5 వేల కోట్లకు పైనే వ్యాపారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా ఒక్క యాంటీబయోటిక్స్ మందులుపై రూ. 5,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఔషధ నియంత్రణ మండలి ఇచ్చిన లెసైన్సులను బట్టి రెండు రాష్ట్రాల్లో 50 వేల మందుల షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో రోజూ 10 నుంచి 15 శాతం యాంటీబయోటిక్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆర్ఎంపీలు, ఫార్మసిస్ట్‌లు కూడా స్పెషలిస్ట్ డాక్టర్ అనుమతి లేకుండా హైడోస్ (మోతాదుకు మించిన) యాంటీబయోటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రులకు ఏటా రూ. 130 కోట్ల యాంటీబయోటిక్స్ మందులు కొనుగోలు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యాంటీబయోటిక్స్‌పై అవగాహన లేకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. బలం పెంచుకుంటున్న బ్యాక్టీరియా యాంటీబయోటిక్స్ పదే పదే వాడటం వల్ల క్రిములు ఆ మందును తట్టుకునేలా బలాన్ని పెంచుకుంటున్నాయి. దీనివల్ల ఏటా కొత్త జబ్బులు వస్తున్నాయి. పైగా అర్హతలేని వైద్యులు కూడా ఈ మందులను ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నారు. యాంటీబయోటిక్స్ వల్ల కిడ్నీలపై ఎక్కువ ప్రభావం పడుతోంది. దీనివల్ల కిడ్నీరోగుల సంఖ్య పెరుగుతోంది. కఠినమైన నిబంధనలు విధిస్తే తప్ప వీటిని నివారించడం కష్టమైన పని. -డాక్టర్ జె.రంగనాథ్, మూత్రపిండాల వైద్య నిపుణులు, మల్లిక కిడ్నీసెంటర్, హైదరాబాద్ భవిష్యత్‌లో దొరక్కపోవచ్చు.. చిన్నచిన్న జబ్బులకు కూడా అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడుతున్నాం. వీటిని వాడటం వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకోవడమే కాకుండా, సూక్ష్మక్రిములు మరింత రాటుదేలి పోతున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఈ స్థాయిలో బలమైన యాంటీబయోటిక్స్‌ను మనం తయారు చేసుకోలేక పోవడం గానీ, దొరక్కపోవడం గానీ జరగవచ్చు. -డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్,సిటీ న్యూరో సెంటర్, హైదరాబాద్ -
విభిన్నంగా గాంధీ జయంతి అందరి చేతిలో చీపురు
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ జయంతి వేడుకలు ఈ ఏడాది విభిన్నంగా జరిగాయి. ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు, రాజకీయ నేతలు, అధికారులు... అంతా చీపుళ్లు పట్టారు. గాంధీజీ కలలు కన్నవిధంగా భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ్ భారత్ అభియాన్ని గురువారం ప్రారంభించడంతో వీవీఐపీల నుంచి మొదలుకుని సామాన్యుల వరకు అందరూ లాంఛనంగా చీపుళ్లు పట్టి ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందించారు. వీధులు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అనేక ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. ఇదో వరం లాంటిది: హర్షవర్ధన్ స్వచ్ఛ్ భారత్ అభియాన్ దాచిఉంచిన ఓ వరం లాంటిదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర ్ధన్ పేర్కొన్నారు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’లో భాగంగా లేడీ హార్డింగే ఆస్పత్రి ఆవరణలో గురువారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రత్యేకించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇదో మంచిరోజు. ఇంకా చెప్పాలంటే దాచిఉంచిన వరం లాంటిది. కార్యాలయాలు, ఆవాసాల పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టడం వల్ల వ్యాధులను నియంత్రించేందుకు వీలవుతుంది. ఇందువల్ల మన సొమ్మేమీ ఖర్చు కాదు. పారిశుధ్యం, ఆరోగ్య పరిరక్షణ ఏకకాలంలో జరిగిపోతుంటాయి’ అని అన్నారు. పోలియో నిర్మూలన కార్యక్రమం తొలుత జాతీయ రాజధాని నగరంలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా అమలైందని అన్నారు. కాగా అంతకుముందు ఆయన తన మంత్రిత్వ శాఖ సిబ్బందితో స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో... జనక్‌పురిలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్టీ రామారావు మెమోరియల్ సీనియర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పాలుపంచుకున్నారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ లత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞచేసి తరగతి గదులతోపాటు పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రసాద్‌నగర్‌లో: ప్రసాద్‌నగర్‌లోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ డా. బి.వి. నాథ్ అండ్ టి. ఆర్ రావు మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూలులో గురువారం స్వచ్ఛ్ విద్యాలయ్, స్వచ్ఛ్ ఢిల్లీ కార్యక్రమం జరిగింది. మేనేజర్ ఐ.ఎస్. రావు, ప్రిన్సిపల్ ధనలక్ష్మి, వైస్‌ప్రిన్సిపల్ ఉమాపతినాయుడు ,ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కాగా ఈ కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిర్విహ స్తామని ఇకో క్లబ్ అధ్యక్షురాలు బి.వి. ప్రసన్నలక్ష్మి తెలిపారు. మురుగుకాల్వను శుభ్రం చేసిన కేజ్రీవాల్ స్వచ్ ్ఛ భారత్ అభియాన్‌కు మద్దతు ఇస్తానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రధానమంత్రి నివాసం వద్ద నున్న ఓ కాలనీలో మురికికాలువను శుభ్రం చేశారు. దిగువ ఆదాయ వర్గాలు ఎక్కువగా నివసించే బీఆర్ క్యాంపులో ఆయన నాలాను శుభ్రం చేశారు. ఎన్డీఎంసీ పారిశుధ్య పనివారితో కలిసి నాలాను శుభ్రం చేసిన కేజ్రీవాల్ ఆ తరువాత వారితో కలిసి తేనీరు తాగారు. బీఆర్ క్యాంపు కేజ్రీవాల్ నియోజకవర్గమైన న్యూఢిల్లీ పరిధి కిందికి వస్తుంది. మిగతా ఆప్ శాసనసభ్యులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక బీజేపీ నేతలు కూడా తమ కార్యకర్తలతో కలసి పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిలర్లు, ఇంకా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తన డిపోలు, పరిసరాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) అధికారులు బస్టాపులతోపాటు షెల్టర్లలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ు. జామియా మిలియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తలత్ అహ్మద్ ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేయిం చారు. ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దినేష్‌సింగ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని గాంధీభవన్‌లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు. కాగా, స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో ఢిల్లీ పోలీసు శాఖ, ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ), ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ తదితర ప్రభుత్వ సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ విషయమై ప్రభుత్వ కార్యదర్శి మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులు, అన్ని విభాగాల అధిపతులను ఆదేశించినట్టు తెలిపారు. తరచూ తాము తనిఖీలు చేపడతామన్నారు. -
'అవయవ దానంపై చిన్నారుల్లో అవగాహన కల్పిస్తాం'
న్యూఢిల్లీ: చిన్నారులు అవయవ దానం చేసేలా ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా నేత్రదానంపై సానుకూల దృక్ఫథం ఏర్పడేలా చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. చిన్నారుల్లో అవయవదానంపై అవగాహన కలిగేలా పాఠ్యపుస్తకాల్లో ఈ అంశాన్ని చేర్చాలని మానవ వనరుల అభివద్ధి శాఖకు సూచించినట్టు పేర్కొన్నారు. హర్షవర్ధన్ శనివారం ఢిల్లీలో జరిగిన షరోఫ్ చారిటీ నేత్ర వైద్యశాల శతవార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్నియల్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న వారి సంఖ్య భారత్‌లోనే అధికమని, దేశంలో ఏటా లక్ష కార్నియాలు కావాలని, అయిలే 17 వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. -
ప్రజారోగ్యంతో పరాచికం
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్లు లెసైన్స్డ్ కంపెనీల లేబుళ్లను వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతుండడమేగాక, నాణ్యత లేని నీరు సరఫరా చేస్తున్నాయి. సంబంధితశాఖల అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇవి యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీ: చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి ఎద్దడి కొనసాగుతుండగా, నగరవ్యాప్తంగా ఉన్న 10 వేల అక్రమ నీటి సీసాల యూనిట్లతో పరిస్థితి మరింత విషమిస్తోంది. ఇవి లెసైన్స్డ్ కంపెనీల లేబుళ్లను వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతుండడమేగాక, నాణ్యత రహిత నీళ్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. జాతీయ రాజధాని ప్రాంతంలో 64 సంస్థలకు మాత్రమే వాటర్ బాట్లింగ్ లెసైన్సులు ఉన్నాయని బాటిల్డ్ వాటర్ ప్రాసెసెర్ల సంఘం అధ్యక్షుడు పంకజ్ అగర్వాల్ అన్నారు. ‘ఈ వేల యూనిట్లు సరఫరా చేసే బాటిళ్ల పరిమాణం లెసైన్స్డ్ యూనిట్లు సరఫరా చేసేవాటికంటే చాలా ఎక్కువ. ఈ పరిణామం మమ్మల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్లన్నీ ఎక్కువగా మురికివాడలు, అనధికార కాలనీల్లో ఉంటున్నాయి. నీటి శుద్ధతకు సంబంధించిన ఎటువంటి ప్రమాణాలనూ ఇవి పాటించడం లేదు. ఇరుకు ప్రాంతాల్లో ఉండడం వల్ల అధికారుల తనిఖీల నుంచి తప్పించుకుంటున్నాయి’ అని అగర్వాల్ వివరించారు. పశ్చిమ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇటీవల సరఫరా చేసిన నీటి డ్రముల్లో బొద్దింకలు కనిపించడంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై విచారణ నిర్వహించగా సరఫరాదారుడు అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్ యజమాని అని తేలింది. రికార్డుల్లో సదరు సంస్థ వివరాలు లేకపోవడంతో దాని చిరునామాను కూడా కనుక్కోలేకపోయారు. నోయిడాలోని ఒక మీడియా సంస్థకు సరఫరా చేసిన నీటిలోనూ పురుగులు కనిపించాయి. ‘రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి ? అయితే ఈ సమస్యపై మా దగ్గర అధికారిక వివరాలు ఏవీ లేవు. ఇలా అక్రమంగా నడుస్తున్న వాటర్ బాట్లింగ్ యూనిట్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం మాకు అందజేయాలి. అప్పుడే మేం దీనిపై ఏమైనా చేయగలుగుతాం. ఇలాంటి పరిశ్రమల మూసివేత కోసం కఠిన నిబంధనలను అమలు చేస్తాం’ అని కేంద్ర వైద్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఢిల్లీవ్యాప్తంగా దాదాపు 10 వేలకుపైగానే అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్లు ఉండవచ్చని ఉత్తరఢిల్లీ మేయర్ యోగేంద్ర చందోలియా అన్నారు. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది కాబట్టి ఇలాంటి వ్యాపారాలు బాగా లాభసాటిగా ఉంటాయని తెలిపారు. ‘ఈ ఏడాది మేం నిర్వహించిన సర్వేలో.. ఉత్తర ఢిల్లీలోనే దాదాపు రెండువేల మంది అక్రమంగా వాటర్ బాట్లింగ్ యూనిట్లు నడిపిస్తూ మాకు చిక్కారు. అయినా వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో వాళ్లంతా స్వేచ్ఛగా మళ్లీ వ్యాపారాలు కొనసాగించారు’ అని వివరించారు. బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా ఏర్పాటైన వాటర్ బాట్లింగ్ యూనిట్లన్నింటినీ మూసివేయించాలని ఢిల్లీ హైకోర్టు 2010 మేలోనే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ఈ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదు. నిబంధనల ప్రకారం లెసైన్స్డ్ వాటర్ బాట్లింగ్ యూనిట్లన్నీ నీటిని పరీక్షించడానికి ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి, అందులో రసాయనాలు, సూక్ష్మజీవులు ఉన్నదీ లేనిదీ నిర్ధారించాలి. ప్రతి వారం నివేదికలను బీఐఎస్‌కు పంపించాలి. ప్రభుత్వ లాబొరేటరీకి కూడా నీటి నమూనాలు పంపించాలి. లెసైన్సు ఫీజుగా ఏటా రూ.లక్ష చెల్లించాలి. అక్రమంగా ఏర్పాటైన వాటర్ బాట్లింగ్ యూనిట్లేవీ ఈ నిబంధనలను పాటించడం లేదని అగర్వాల్ తెలిపారు. వాళ్ల దగ్గర కనీసం నీటి శుద్ధీకరణ పరికరాలు కూడా లేవన్నారు. ‘లెసైన్స్డ్ వాటర్ బాట్లింగ్ సంస్థలు రోజుకు 10 వేల వరకు నీటి సీసాలు అమ్ముతుండగా, అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్లు ఏకంగా 40 వేల సీసాల దాకా అమ్ముతున్నాయి. ఇది మాకు మరింత ఆందోళన కలిగి స్తోంది. గత రెండేళ్లలో ఇలాంటి యూనిట్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది’ అని తెలిపారు. నగరంలో అక్రమంగా ఏర్పాటైన వాటర్ బాట్లింగ్ యూనిట్లలో 50 శాతం అర్జున్‌నగర్, ద్వారక, జామియా నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. చిన్న చిన్న గదులు, ఇళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి పైసా అయినా చెల్లించకుండానే వీటి యజమానులు నీటి సీసాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారని నోయడాలో డైమండ్ డ్యూ పేరుతో లెసైన్స్డ్ వాటర్ బాట్లింగ్ యూనిట్ నిర్వహించే రాకేశ్ కుమార్ సూరి అన్నారు. ఈ యూనిట్లు నాణ్యత లేని నీరు సరఫరా చేయడమేగాక, కనీసం 15 శాతం అమ్మకపు పన్నును కూడా చెల్లించడం లేదని చెప్పారు. నిర్జన ప్రాంతాల్లో సీసాలు తయారు చేస్తారు కాబట్టి కరెంటు బిల్లుల బెడద కూడా లేదని సూరి వివరించారు. భూగర్భ జలాలను వినియోగించేందుకు వాటర్ బాట్లింగ్ యూనిట్లన్నీ లెసైన్సులను రిన్యూవల్ చేయించుకోవాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన లెసైన్స్డ్ యూని ట్లకు మాత్రమే వర్తిస్తుందని, అక్రమంగా ఏర్పాటైన వారు పైసా కూడా చెల్లించబోరని అగర్వాల్ తెలిపారు. లెసైన్స్డ్ వాటర్ బాట్లింగ్ యూనిట్‌కు కనీసం రూ.2-3 కోట్ల వరకు వ్యయమవుతుంది. దీనికితోడు భారీ ఎత్తున పన్నులు చెల్లించాలి. సంబంధిత అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోనంత వరకు ఇలాంటి అక్రమ సంస్థలు ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటూనే ఉంటాయని అగర్వాల్ ముక్తాయించారు. -
అవగాహనే అసలు మందు
న్యూఢిల్లీ: సమగ్ర వ్యాధి నిరోధక కార్యక్రమం(యూఐపీ)ని దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మరణిస్తున్న పిల్లల్లో 95 శాతం మందిని కాపాడుకునే అవకాశమున్నా కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధినిరోధక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా దాదాపు పిల్లలకు వచ్చే 80 శాతం వ్యాధులను అడ్డుకోవచ్చని చెప్పారు. డయేరియాకు కారణమయ్యే రోటా వైరస్‌పై నగరంలో జరిగిన 11వ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన మంత్రి అనంతరం దేశంలోని ప్రజల ఆరోగ్య స్థితిపై మాట్లాడారు. పజల్లో ఆరోగ్య స్పృహను కల్పించడం ద్వారా, మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేయడం ద్వారా 80 శాతం వ్యాధులను అడ్డుకోవచ్చన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు జరిగినంత మాత్రాన వ్యాధులను అడ్డుకోలేమన్నారు. అయితే వ్యాధుల నియంత్రణ కోసం దేశంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వ్యాధులపట్ల, ఆరోగ్యకరమైన జీవన విధానంపట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించే ప్రయత్నంలో ఉందని చెప్పారు. అయితే రూపొందించే ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమయ్యేలా కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా తల్లీ, బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక కార్యచరణ అవసరమని, ఆ దిశగా ముందు విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ వర్మ మాట్లాడుతూ... డయేరియా నియంత్రణ కార్యక్రమం ఆగస్టు 8తో ముగిసిందని, పక్షం రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో అవగాహన కల్పించిందన్నారు. శిశు మరణాల్లో ఎక్కువ మంది డయేరియా కారణంగానే మరణిస్తున్నారని, రోటా వైరస్ వ్యాక్సినేషన్ వల్ల శిశుమరణాలు మరింత తగ్గే అవకాశముందన్నారు. -
మహిళ శరీరం దేవాలయం: హర్షవర్ధన్
అత్యాచారం అనేది చాలా చిన్న విషయమంటూ ఇటీవల వివాదం రేపిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. తాజాగా మరో వ్యాఖ్య చేశారు. మహిళల శరీరం దేవాలయమంటూ ఆయన అభివర్ణించారు. దేశ రాజధానిలోని ఓ మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ యువతులలో ఇటీవలి కాలంలో అనారోగ్యాలు ప్రబలిపోతున్నాయని చెబుతూ ఆయనీ మా టఅన్నారు. ''మహిళ శరీరం దేవాలయం లాంటిది. ఒక కొత్తతరాన్ని రూపొందించాలంటే ఆరోగ్యవంతులైన మహిళలు అవసరం. వాళ్లే అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం కుటుంబం మీద, సమాజం మీద, జాతిమీద కూడా పడుతుంది'' అని హర్షవర్ధన్ చెప్పారు. ఈ వ్యాఖ్య ట్విట్టర్లో పెను దుమారమే రేపింది. అనేకమంది యూజర్లు దీనిపై విమర్శలు గుప్పించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన భాషను సంస్కరించుకోవాలంటూ మండిపడ్డారు. -
జన్‌ధన్ యోజనను ప్రారంభించిన హర్షవర్ధన్
న్యూఢిల్లీ: స్వాంతంత్య్ర దినోత్సవాల్లో మోడీ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన’ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం నగరంలో ప్రారంభించారు. ఢిల్లీవాసులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్ పిలుపునిచ్చారు. కోట్లాదిమందికి ప్రయోజనకరమైన ఈ పథకం దేశంలోని ఏడు కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలను తెరవనుందన్నారు. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కోటి ఖాతాలను ప్రారంభించినట్లు చెప్పారు. బ్యాంకు ఖాతాలున్నవారు.. లేనివారిని ఖాతా ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉన్నందున పేదలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని హర్షవర్ధన్ చెప్పారు. -
త్వరలో సమగ్ర ఆరోగ్య విధానం
న్యూఢిల్లీ: ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రధాన వ్యాధులకు సం బంధించి త్వరలో సమగ్ర ఆరోగ్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. తన శాఖకు చెందిన ఉన్నతాధికారులతో దాదాపు మూడుగంటలపాటు సమావేశమైన వర్ధన్... ఆరోగ్య రంగం, కొత్త కొత్త కార్యక్రమాలపై వారితో చర్చలు జరిపా రు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య రంగంపై తమ శాఖ దృష్టి సారించిందన్నా రు. ఇందులోభాగంగా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడతామన్నారు. ఆరోగ్యాన్ని ఓ సామాజిక ఉద్యమంగా మలుస్తామన్నారు. వివిధ వ్యాధులపై ప్రజ లకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందుకు సంబంధించి తమ శాఖ అనేక మంది నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. వర్ధన్ నివాసం ఎదుట ఆప్ నిరసన ప్రదర్శన ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి (సీవీఓ) సంజీవ్ చతుర్వేదిని పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నివాసం ఎదుట సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులను చేబూనిన వీరంతా వర్ధన్‌కు వ్యతిరేకంగా నినదించారు. బీజేపీ నేత అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చాడనే కోపంతోనే సంజీవ్‌ను బలి పశువు చేశారన్నారు. కాగా ఈ నెల 20వ తేదీన ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి (సీవీఓ) సంజీవ్ చతుర్వేదిని కేంద్ర ప్రభుత్వం అకారణంగా పదవినుంచి తప్పించిన సంగతి విదితమే. ‘కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రోజుకో రీతిలో వ్యవహరిస్తున్నారు. తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు వీలుగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. -
ఆస్పత్రుల్లోని అవినీతి తెలుసు!
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ న్యూఢిల్లీ: వైద్య, ఆరోగ్య రంగంలో అవినీతిని సహించేది లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తేల్చి చెప్పారు. వైద్యరంగంలో నెలకొని ఉన్న వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత అవినీతిని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో దేశంలోని అన్ని కేంద్ర ఆసుపత్రుల్లోని అన్ని రకాల వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ‘ఆస్పత్రుల్లో ఎన్ని రకాలుగా అవినీతి జరుగుతుందో డాక్టరుగా నాకు తెలుసు. ఆస్పత్రి సామగ్రి కోసం సప్లైయర్ల నుంచి లంచం తీసుకోవడం నుంచి రోగులకు సేవలందించేందుకు డబ్బులు తీసుకోవడం వరకు అంతా అవినీతే. ఉద్యోగులు, వీఐపీలకు బెడ్లను రిజర్వ్ చేయడం, ప్రత్యేకంగా సౌకర్యాలు అందించడం అవినీతి కిందకే వస్తుంది. వీటన్నింటినీ సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అన్నారు. తన శాఖలో 500% పారదర్శకతను తీసుకురావడంతో పాటు అవినీతికి అసలేమాత్రం సహించబోనని మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే స్పష్టం చేశానన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ)గా ఉన్న సంజీవ్ చతుర్వేదిని తొలగించడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ.. సీవీఓగా చతుర్వేది నియామకాన్ని సీవీసీ వ్యతిరేకించిందని తెలిపారు. -
చతుర్వేది తొలగింపు కరెక్టే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని ఆ పదవి నుంచి తొలగించడం సబబైన చర్యేన ని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. చీఫ్ విజి లెన్స్ అధికారి పదవికి అతడు అనర్హుడని హర్షవర్ధన్ అన్నారు. కేంద్ర విజి లెన్స్ కమిషన్‌కు సమాచార మివ్వకుండా ఎక్కడా సీవీవోను నియమించకూడదని ఆయన చెప్పారు. చతుర్వేది నియామకం నిబంధనలకు విరుద్ధం గా జరిగిందని భావించడం వల్లే తాము అతడిని పదవి నుంచి తొలగించినట్లు తెలి పారు. ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికా రి పదవి నుంచి తొలగిస్తూ బుధవా రం కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఎటువంటి కారణాలు చూపకుండానే ఈ చర్య తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చతుర్వేది బాధ్యతలను కేంద్ర ఆరోగ్యశాఖ సీవీ వో, జాయింట్ సెక్రటరీ అయిన విశ్వాస్ మెహతాకు అప్పగించారు. మూడు నెలల పాటు ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆ శాఖ పేర్కొంది. -
సతీష్ బాధ్యతల స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా సతీష్ ఉపాధ్యాయ శనివారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇంతకాలం ఢిల్లీ ఈ పదవిలో కొనసాగిన కేంద్ర మంత్రి డా. హర్షవర్ధన్ ఆయనకు లాంఛనంగా ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు తమ పార్టీపై నమ్మకం ప్రకటించారని, అందువల్ల వారికి అన్ని విధాలా సేవ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లను కాదని ప్రజలు తమపై విశ్వాసం కనబరిచారని ఆయన చెప్పారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఏ రాజకీయ నేపథ్యం లేకుండా సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన వ్యక్తి ఈ స్థానానికి చేరుకోవడం కేవలం బీజేపీలోనే సాధ్యమని ఆయన చెప్పారు. తాను ప్రతి దశలో అగ్ర నాయకుల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఉపాధ్యాయ తెలిపారు. ఈ పదవిని చేపట్టిన తర్వాతకూడా వారి నుంచి నేర్చుకోవడానికి సంకోచించబోనని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు డా. హర్షవర్ధన్ మాట్లాడుతూ సతీష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యాయ నేతృత్వంలో పార్టీ మున్మందు మరిన్ని విజయాలను కైవసం చేసుకుంటుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయకు అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించిందని, ఈ పదవిలో రాణిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా సతీష్ ఉపాధ్యాయను రాష్ర్ట బీజేపీ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుఈ నెల తొమ్మిదో తేదీన ప్రకటించిన సంగతి విదితమే. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. హర్షవ ర్ధన్ కేంద్ర మంత్రి పదవీబాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్ష పదవిలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. కాగా సతీష్ ఉపాధ్యాయ పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. అంతేకాకుండా టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికలకు ఉపాధ్యాయ ఇం దుకు సారథ్యం వహించాల్సి ఉంటుంది. మాల వీయనగర్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఉపాధ్యాయ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్న సంగతి విదితమే. -
లైంగిక విద్యను నిషేధించాలని ప్రతిపాదించలేదు
న్యూఢిల్లీ: లైంగిక విద్యను నిషేధించాలని తానెప్పుడూ ప్రతిపాదించలేదని కేంద్ర ఆరో్గ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. పాఠశాలల్లో లైంగిక విద్యను నిషేధించాలంటూ ప్రతిపాదన చేసినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. తన వెబ్సైట్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమని హర్షవర్ధన్ చెప్పారు. కౌమార దశ విద్యా పథకాన్నియథారూపంలో ప్రవేశపెట్టాలన్న యూపీఏ ప్రభుత్వ నిర్ణయంపై తన అభిప్రాయాలను తెలియజేశానని అన్నారు. శాస్త్రీయంగా, సాంస్కృతికంగా ఆమోదయోగ్యమైన లైంగిక విద్యకు ఓ మెడికల్ ప్రొఫనల్గా మద్దతు తెలుపుతానని చెప్పారు. -
విరివిగా రక్తదానం చేయొచ్చు
న్యూఢిల్లీ: ప్రజలు క్యాన్సర్, గుండెపోటుకు దూరంగా ఉండేందుకు క్రమం తప్పకుండా రక్తదానం చేయొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తరచుగా రక్తదానం చేయవచ్చని అన్నారు. ‘‘వైద్య పరిశోధనల ప్రకారం... తరచుగా రక్తదానం చేసే వారికి గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం 80 శాతం తక్కువ’’ అని చెప్పారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మొదటగా తానే రక్తదానం చేశారు. రాష్ట్ర రక్తమార్పిడి మండలి, ఔషధ మార్పిడి విభాగం, ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి, బ్లడ్ ఫర్ ఆల్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ, వచ్చే రెండేళ్లలో దేశంలోని అన్ని జిల్లాల్లో బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న పౌరులందరూ ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అపోలో ఆస్పత్రికి చెందిన ఔషధ మార్పిడి విభాగం డెరైక్టర్ ఆర్ఎన్ మక్రూ మాట్లాడుతూ, దేశంలో ఏడాదికి 10 నుంచి 11 మిలియన్ యూనిట్ల రక్తం అవసరమని, కానీ 8.5 నుంచి 9 మిలియన్ యూనిట్ల రక్తం మాత్రమే సేకరించగలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారి సంఖ్య 70 శాతం మాత్రమేనని, అది ఒక్కసారి మాత్రమే వారు ముందుకు వస్తున్నారని మక్రూ పేర్కొన్నారు. నేడు వర్ధన్‌కు డీఎంఏ సన్మానం తమ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఆదివారం సన్మానిస్తామని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ (డీఎంఏ) తెలిపింది. నిష్కళంకుడు, సమర్థుడైన వర్ధన్ నగరవాసులకు సుపరిచితుడని, తమ సంస్థ పూర్వ అధ్యక్షులలో వర్ధన్ ఎంతో పేరు ప్రఖ్యాతులుగలవాడని డీఎంఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిమ్స్‌లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సన్మాన కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది. -
ఎయిమ్స్ ‘ఎమర్జెన్సీ’ని మెరుగుపరచాలి
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అత్యవసర విభాగం పనితీరును మరింత మెరుగుపరచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. రోగులకు నిత్యం సేవలు అందించేందుకు ఇక్కడ పూర్తి కాలం పని చేసే రెసిడెంట్ డాక్టర్లు, నర్సులను నియమించాలని సూచిం చారు. ఎయిమ్స్ యాజమాన్యం, వైద్యులు, నర్సులనుద్దేశించి మంత్రి గురువారం ప్రసంగించారు. వయోవృద్ధులకే అన్ని చెకప్‌లకు ఒకే చోట రిజిస్ట్రేషన్ ఉండేలా చూడాలని చెప్పారు. రక్త పరీక్ష, సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు ఒకేసారి నిర్వహిం చాలని సూచించారు. ఔట్ పేషెంట్ విభాగంలో కూర్చున్న పలువురు రోగులతో మంత్రి మాట్లాడా రు. డాక్టర్లను కలవడానికి ముందు రోగులు ఎంత సమయం వేచి చూడాల్సి వస్తుందో ఆయన తెలుసుకున్నారు. నిర్దేశించిన రోజున అపాయింట్మెంట్ దొరకని పక్షంలో మరుసటి రోజుకు అపాయింట్మెంట్ మార్చినప్పుడు వేచి చూసే సమయాన్ని పూర్తిగా తగ్గించాలని సూచించారు. ఈ మార్పు వల్ల రోగులు, వారి బంధువులపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. రోగులతో సున్నితంగా, ప్రేమగా వ్యవహరించాలని వర్దన్ డాక్టర్లకు, నర్సులకు ఉద్బోధించారు. ఎయిమ్స్‌లో పచ్చదనాన్ని పరిశీలించేందుకు ఆయన ఈ ఆస్పత్రిని సందర్శించారు. -
ఆర్ఎంఎల్లో పారిశుధ్యంపై కేంద్ర మంత్రి సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ఆ విభాగం మంత్రి హర్షవర్ధన్ బుధవారం ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు గంట సమయం ఆస్పత్రిలో గడిపిన మంత్రి పారిశుధ్య పరిస్థితిపై సమీక్షించారు. ఎమర్జెన్సీ, కార్డియాలజీ విభాగాలతో పాటు ప్లాస్టిక్ సర్జరీ, కాలిన గాయాలకు చికిత్స చేసే విభాగాలను కూడా సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలోని సెంట్రల్ పార్కును, ఎదురుగా ఉన్న పచ్చదనాన్ని పరిశీలించిన వర్ధన్ మొక్కలు, చెట్ల పరిరక్షణకు ఆస్పత్రి యాజమాన్యం చూపుతున్న శ్రద్ధను ప్రశంసించారు. ఆ తరువాత పీజీఐఎంఆర్‌కు చెందిన వివిధ విభాగాధిపతులను ఉద్దేశించి వర్ధన్ ప్రసంగిస్తూ ఆర్ఎంఎల్ ఆస్పత్రిని ఓ విశిష్టమైన వైద్య కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నట్లు తెలి పారు. ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది పోస్టుల సమస్యపై చర్చించిన వర్ధన్ ఆస్పత్రిలో సౌరశక్తి వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఆస్పత్రిలో 280 డాక్టర్ పోస్టులకు గాను 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 800 నర్సుల ఉద్యోగాలకు గాను 200 ఖాళీగా ఉన్నాయి. ఇక పారా మెడికల్ సిబ్బంది పోస్టులు మూడింట ఒకవంతు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని ఆర్ఎంఎల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్‌కే కర్ చెప్పారు. వ్యర్ధ జలాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల రూ.3.6 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రి మూసివేతకు ఆదేశం న్యూఢిల్లీ: అర్హతలేని వైద్యుడి చికిత్స కారణంగా రోగి మృతి ఘటన నేపథ్యంలో పశ్చిమ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రోహిణీ ప్రాంతంలోని సెక్టార్-16లోగల సత్యం ఆస్పత్రి మూసివేతకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ (డీఎంసీ) నివేదికను పరిశీలించిన అనంతరం లెసైన్సును తక్షణమే రద్దు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ ఎన్.వి.కామత్ ఆస్పత్రికి సమాచారం అందించారు. కాగా అర్హతలేని వ్యక్తి వైద్యసేవలు అందించిన కారణంగానే సదరు ఆస్పత్రిలో చేరిన కామిని సోలంకి అనే రోగి మృతి చెందిందని నివేదిక పేర్కొంది. -
హరిత ఆస్పత్రిగా ఎయిమ్స్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను హరిత ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న సంప్రదాయ ఇంధన వినియోగం నుంచి ఎయిమ్స్‌ను దూరం చేస్తామని అన్నారు. వాతావరణ మార్పులపై పోరాడాలని తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే ‘గ్రీన్ ఎయిమ్స్’కు ప్రణాళిక రూపొందిస్తామని వర్ధన్ చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకొని సౌరశక్తి, ఇతర సహజ వనరులపై ఆధారపడేందుకు ప్రయత్నించాలని సూచించారు. పరివర్తన చెందిన ఎయిమ్స్‌లో నీటి సంరక్షణ వ్యవస్థ, మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలుంటాయని మంత్రి పేర్కొన్నారు. ఇంధన వినియోగంపై తరచుగా తనిఖీలుండాలని, ఎయిమ్స్ ఆవరణలోని భవనాలను మరింత ఇంధన సామర్థ్యం గలవిగా రూపొందించేందుకు దశల వారీగా పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించాలని వర్ధన్ సూచించారు. ఆస్పత్రిలో ఉత్పత్తి అయ్యే మొత్తం వ్యర్థ పదార్థాలను తగ్గించేందుకు లేదా పునర్వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రోగులకు హాని చేయకుండా నివారించేందుకు కాలుష్యకారకమైన ధూళి కణాలను ఆకర్షించే చెట్లను ఆస్పత్రి చుట్టూ నాటాలని మంత్రి సూచించారు. ఇంధన పొదుపులో ప్రయత్నాలకు గాను అనేక భవనాలు అవార్డులు పొందాయని, కానీ ఆ జాబితాలో ఆస్పత్రుల పేర్లు ఎప్పుడూ కానరాలేదని హర్షవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అవార్డులు పొందేందుకు ఆస్పత్రులు ఎందుకు ప్రయత్నించకూడదని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, సమాజ ఆరోగ్యానికి ఆస్పత్రులు బ్రాండ్ అంబాసిడర్లుగా రూపొందాలని పేర్కొన్నారు. పభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో నాటుకున్న అభిప్రాయాన్ని తొలగించాలని చెప్పారు. కొన్ని రోగాల విషయంలో ఆరోగ్య సంస్థల వద్ద ఉన్న అసమగ్ర గణాంకాల పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు భారీగా వలసలు పోవడం వల్ల, సంస్థలు, రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధానితో చర్చిస్తానని అన్నారు. దేశంలో దురదృష్టవశాత్తు ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రం గానే ఉన్నాయని వర్ధన్ అంగీకరించారు. మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపే వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన ఆరోగ్య కార్యకర్తలను సత్వరమే తయారు చేసుకోవాలని అన్నారు. -
సీటు బెల్టు ధరిస్తే ముండేకి ప్రాణాపాయం తప్పేది
సాక్షి, న్యూఢిల్లీ: సీటు బెల్టు ధరిస్తే గోపీనాథ్ ముండేకి ప్రాణాపాయం తప్పేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. వాహన ప్రయాణం చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ మంత్రిత్వశాఖ త్వరలో ప్రచార ఉద్యమం చేపట్టనుందన్నారు. ముండే అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం బుధవారం మహారాష్ట్రలోని బీడ్‌కు బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. సీటు బెల్టు ధరించి ఉన్నట్టయితే ముండే ప్రాణాలు దక్కేవని, సీటు బెల్టు అలంకారప్రాయమేనన్న అపోహ కారణంగా తాను మంచి స్నేహితుడిని కోల్పోయానన్నా రు. వెనుక సీట్లలో ఉండేవారు బెల్టులు కేవలం అలంకారప్రాయమేనని చాలామంది అనుకుంటారని, అయితే నిజానికి ముందు సీట్లలో ఉన్న సీటు బెల్టు ధరించడం ఎంత ముఖ్యమో వెనుక సీట్లలో ప్రయాణించేవారు కూడా ధరించడం అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. ఇందుకోసం స్వయంసేవా సంస్థల సహకారంతో ప్రచారం చేసే అంశాన్ని పరిశీ లిస్తున్నట్లు ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో చిన్నారుల మరణాలు, తల్లిదండ్రుల మరణం వల్ల అనాథలుగా మారే చిన్నారుల గురించి ప్రధానంగా ప్రచారం చేస్తామన్నారు. పిల్లలు సరైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోరని, అయితే వాహనాలను నిర్లక్ష్యంగా నడిపేవారిని ఆరాధించేలా చూడడానికి బదులు సరైన జీవన శైలిని గురించి వారికి తెలియజెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముండేవిషాద, అకాల మర ణం వాహన చోదకులకు మేల్కొలుపు కావాలని ఆయన చెప్పారు. సీటు బెల్టు ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడంవల్ల జరిగే ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల ఆప్తులు అనుభవించే బాధ ఎలాంటిదనే విషయం తనకు ముండే మరణంతో తెలిసొచ్చిం దని ఆయన చెప్పారు. సీటు బెల్టు ధరించినట్లయితే డయానా, సాహెబ్ సింగ్ వర్మ ప్రాణాలకు ముప్పు వాటిల్లేదికాదని ఆయన గుర్తుచేసుకున్నారు. -
కేబినెట్లోకి హర్షవర్ధన్ కొత్త సారథి ఎవరో?
న్యూఢిల్లీ: డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన నేపథ్యంలో బీజేపీ రాష్ర్ట శాఖ నూతన అధ్యక్షుడు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి పదవీబాధ్యతలనైనా అవలీలగా నిర్వర్తించగలడనే అపార నమ్మకంతోనే బీజేపీ అధిష్టానం ఆయనను కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకుంది. మరికొద్ది నెలల్లోనే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. విజయ్‌గోయల్ తర్వాత గత ఏడాది ఆయనను బీజేపీ అధిష్టానం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించిన సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ భావించింది. అయితే ఈసారి యువకుడికి ఈ బాధ్యతలను అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని తెలియవచ్చింది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీ కమల దళానికి బలమైన నాయకుడిని అధిపతిగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసిన తరువాత ఈ దిశగా చర్చలు జరిగే అవకాశముంది. నూతన అధ్యక్షుడు వీలైనంత త్వరగా బాధ్యతలు చేపడితే బాగుంటుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక అనేది వ్యవస్థాగతమైన మార్పులకు కూడా దారితీస్తుందని వారంతా ఆశిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎక్కువస్థానాలను గెలుచుకునేందుకు వీలుంటుందనేది వారి భావనగా కనిపిస్తోంది. కాగా ఈ పదవి కోసం అనేకమంది పోటీ పడే అవకాశముంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సైతం హర్షవర్ధన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మేమంతా కలసికట్టుగా పనిచేయాల్సి ఉంది. అంతకంటే ముందు వర్క్ ఆడిట్ కూడా చేయాల్సి ఉంది. వర్క్ ఆడిట్ ద్వారా పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిని గుర్తించి మంచి పదవులను కేటాయించాల్సి ఉంది. అవసరమైన సమయంలో కొన్ని వ్యవస్థాగతమైన మార్పులు కూడా చేపడతాం’ అని ఆయన చెప్పారు. ఇదిలాఉంచితే త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు అప్పగించే అవకాశముందని వారంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యరీతిలో ఫలితాలు వచ్చిన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతోందని బీజేపీ భావిస్తోంది. స్పష్టమైన మెజారిటీ రావొచ్చని ఆశిస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సి ఉందన్నారు. గత ఎన్నికల్లో ఏయే ప్రాంతాల్లో తమ పార్టీకి ఎక్కువ ఓట్లు రాలేదో అక్కడ సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించాల్సి ఉందన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందువల్ల ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపడం అత్యంత సులువవుతుందన్నారు. ఈ అంశాన్నే తాము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని అన్నారు. -
పాలనలో పారదర్శకత
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకువస్తానని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అనుభవజ్ఞుల సలహాలతో ప్రజలకు ఉపయోగపడే విధానాలను రూపొందించి విజయవంతంగా అమలుచేస్తామని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత కల్పించి అవినీతి జరగకుండా చూస్తామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులపై పట్టు బిగించేందుకు అధికారులతో సమావేశమవుతానని తెలిపారు. ‘ఆస్తుల కన్నా ఆరోగ్యం ప్రధానం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ప్రభుత్వ విధి. ఇందుకోసం తానేమీ కార్యక్రమాలు చేపట్టాలనుకునే విషయాలు కొద్ది రోజుల్లోనే మీడియాకు వివరిస్తాన’ని హర్షవర్ధన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం సరికొత్త ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించడకపోవడం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారని డాక్టర్ హర్షవర్ధన్ సింగ్ అన్నారు. ప్రజలకు అన్ని రోగాలపై అవగాహన కలిగించేలా కూడా వివిధ కార్య క్రమాలకు శ్రీకారం చుడుతామని వివరించారు. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. తన మంత్రిత్వ శాఖ చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలియజెప్పేందుకోసం మీడియాతో మాట్లాడుతానని వెల్లడించారు. మంత్రులకు శాఖల కేటాయింపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీ నుంచి కేబినెట్లో చోటు దక్కించుకున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్‌కు ఊహించినట్లుగానే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ లభించింది. స్వతంత్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన జనరల్ వీకేసింగ్కు ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ , రావ్ ఇందర్జీత్సింగ్కు ప్రణాళీకరణ, స్టాటిస్టిక్స్, కార్యక్రమాల అమలు స్వత ంత్ర శాఖలతో పాటు రక్షణ శాఖ (సహాయ మంత్రి) అప్పగించారు. కృష్ణపాల్కు రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన సహాయ మంత్రిత్వ శాఖ కేటాయించారు. తమ శాఖ బాధ్యతలు చేపట్టిన వీరు దేశాభివృద్ధి కోసం సత్వర నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా పాలన సాగిస్తామన్నారు. -
ఒకే ఒక్కడు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేబినెట్ టీమ్‌లో మన డాక్టర్ సాబ్ హర్షవర్ధన్‌కు చోటు దక్కింది. రాష్ట్రపతి భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 21 ఏళ్ల నుంచి రాజకీయ సేవలు అందిస్తున్న హర్షవర్ధన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలు కమలనాథుల ఖాతాల్లో వేయడంలో కీలకపాత్ర పోషించారు. ఢిల్లీ బీజేపీ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి అద్భుత ఫలితాలను రాబట్టారు. చాందినీ చౌక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్పై గెలిచారు. ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు... చిన్నప్పటి నుంచే రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యుడిగా హర్షవర్ధన్ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరవుతుండేవారు. అక్కడి నుంచి ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో బీజేపీలో చేరారు. 1993లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైద్య, న్యాయ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఇదే సమయంలో 1994, అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని భారీ ఎత్తున పోలియో కార్యక్రమాన్ని నిర్వహించి ఒక్కరోజులోనే 12 లక్షల పిల్లలకు పోలియో చుక్కలు అందేలా చూశారు. అప్పుడు పది శాతం ఉన్న పోలియో కేసులు ఆ తర్వాత పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. 1996లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన 1998, 2003 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హర్షవర్ధన్ గెలిచారు. అదే సీటు నుంచి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన దీపికా కుల్లార్‌పై 3,204 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తూ ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతూ అందరి బాగోగులు తెలుసుకుంటుండేవారు. మొదటి నుంచి ఇప్పటివరకు పోటీచేసిన ఎన్నికల్లో ఓటమెరుగని హర్షవర్ధన్ పనితనాన్ని గుర్తించి బీజేపీ అధిష్టానం 2013 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 23న ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే హర్షవర్ధన్ బీజేపీ నేతలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని విజయపథాన తీసుకెళ్లారు. అయితే దురదృష్టవశాత్తూ డిసెంబర్ ఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో 70 సీట్లకు గానూ 32 స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు నాలుగు సీట్ల ఆమడదూ రంలోబయోడేటా... 1953 డిసెంబర్ 13న ఢిల్లీలో ఓంప్రకాశ్ గోయ ల్, స్నేహలతలకు హర్షవర్ధన్ జన్మించారు. 1971లో దర్యగంజ్‌లోని ఆంగ్లో సంస్కృత్ విక్టోరి యా జూబ్లీ సీనియర్ సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. 1979లో కాన్పూర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచ్‌లర్ ఆఫ్ సర్జరీ గ్రాడ్యుయేట్ చేశారు. 1983లో అదే కాలేజీ నుంచి ఒట్టోలరినాలాజీలో మాస్టర్ ఆఫ్ సర్జరీ పట్టా పొందారు. హర్షవర్ధన్‌కు భార్య న్యూటన్, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎన్సీఆర్ నుంచి ముగ్గురు సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ మంత్రివర్గంలో జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) నుంచి ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి. గుర్గావ్ ఎంపీ రావ్ ఇందర్జీత్ సింగ్, ఘజియాబాద్ పార్లమెంట్ సభ్యుడు రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, ఫరీదాబాద్ ఎంపీకృష్ణపాల్ సోమవారం సాయంత్రం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వీకేసింగ్. రావ్ ఇందర్జీత్ సింగ్ స్వతంత్ర మంత్రిత్వశాఖ, కృష్ణపాల్ సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
సంపూర్ణ రాష్ట్ర హోదా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించేందుకు కృషి చేస్తామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ పేర్కొన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీతో చర్చించే తొలి డిమాండ్ ఇదేనని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు. ‘ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల అధికారులు ఎదుర్కొంటున్న బహుళ సమస్యలను అధిగమించే అవకాశముంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పాలన సజావుగా సాగేందుకు వీలవుతుంది. వివిధ సంస్థల మధ్య సమన్వయం సాధించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ అధికారాలు రావడం వల్ల నగరాభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయ’ని వివరించారు. ప్రస్తుతం ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా లేకపోవడం వల్ల అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి వస్తోందని, దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని హర్షవర్ధన్ వివరించారు. ‘ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీనిచ్చింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో సుమారు లక్షకు పైగా నుంచి 2.6 లక్షల ఆధిక్యంతో బీజేపీ సభ్యులు గెలిచారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు రుణం తీర్చుకుంటామ’ని ధీమాను వ్యక్తం చేశారు. ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదాకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సూచించిన రిజర్వేషన్లను అనుసరించే పార్లమెంటరీ కమిటీ ముందుకు ఆ బిల్లును తీసుకెళ్లాం. అయితే దురదృష్టవశాత్తూ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు అధికారం దక్కలేదు. అయితే అధికార పగ్గాలు చేపట్టిన యూపీఏ ప్రభుత్వం ఆ బిల్లును అసలు పట్టించుకోలేదని హర్షవర్ధన్ ఆరోపించారు. అయితే మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం దృష్టికి ఢిల్లీవాసులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీసుకెళతామన్నారు. ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2021కు సంబంధించి సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన సమస్యలపై కూడా దృష్టి సారిస్తామన్నారు. ఢిల్లీలో తాగునీరే ప్రధాన సమస్యగా మారిందని, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం నగరానికి 1,100 ఎంజీడీ(రోజుకు మిలియన్ గ్యాలన్ల) నీరు అవసరముండగా, ఢిల్లీ జల్ బోర్డు కేవలం 800 ఎంజీడీల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. 2017లో 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేవరకు 1,400 ఎంజీడీల వరకు నీటి డిమాండ్ పెరగొచ్చు. ఈ తాగునీరు గురించి ఢిల్లీ ఎక్కువగా పొరుగురాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్లపై ఆధారపడుతోందని హర్షవర్ధన్ చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థల్లోనూ సంస్కరణలు తీసుకురావాలని, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల రోజువారీ విధులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రతిపక్షం బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన 2012లో షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు విభాగాలుగా విభజించిందన్నారు. పట్టణ అభివృద్ధి సమస్యలపైనే దృష్టి సారించాల్సిన అవసరముందని తెలిపారు. మోడీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్నానని హర్షవర్ధన్ చెప్పారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 33.07 ఉంటే, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 46.1 శాతానికి చేరుకుంద’న్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తప్పుకోవడంతో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి ఫిబ్రవరి 17 నుంచి కేంద్రం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతల లాబీయింగ్ షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హర్షవర్ధన్ చాందినీచౌక్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందడం, మోడీ మంత్రి మండలిలో ఆయనకు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో హర్షవర్ధన్ స్థానం కోసం పార్టీలో లాబీయింగ్ జోరందుకుంది. మంత్రిమండలిలో హర్షవర్ధన్‌కు చోటుదక్కితే ఆయన జాతీయ రాజకీయాలకే పరిమితం కావాల్సి వస్తుందని, దీంతో ఢిల్లీ బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుందని భావిస్తున్న బీజేపీ నేతలు అధ్యక్ష పదవిని తమకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ముందుగా అధ్యక్ష పీఠం దక్కితే ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఈ అభిప్రాయంతో ఉన్న నేతల్లో దాదాపు అరడజను మంది ఢిల్లీ బీజేపీ అధ్యక్షపదవి కోసం లాబీయింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. వీరిలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన జగ్దీశ్ ముఖీ, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ప్రవేశ్ వర్మ, మాజీ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆశీష్ సూద్, ఢిల్లీ మాజీ మేయర్ ఆర్తీ మెహ్రా, పృథ్వీరాజ్ సహానీ, విజయ్ జోలీలతోపాటు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతలను సంప్రదించి కొత్త అధ్యక్షుణ్ని నియమించనుండడంతో పార్టీ అధ్యక్షపీఠం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ కార్యాలయం కేశవ్‌కుంజ్ చుట్టూ, బీజేపీ అగ్రనేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో జగ్దీశ్ ముఖీకి, ప్రవేశ్ వర్మకు అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికలలో సత్తా నిరూపించుకున్న ఈ ఇరువురికీ ఆర్ఎస్ఎస్ అండదండలు కూడా ఉన్నాయంటున్నారు. అనుభవజ్ఞుడైన నేతను ఎంపికచేయాలనుకుంటే జగ్దీశ్ ముఖీని, యువనేతను ఎంపిక చేయాలనుకుంటే ప్రవేశ్ వర్మను ఢిల్లీ బీజేపీ అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టే అవకాశం ఉందంటున్నారు. -
ఈ ప్రశ్నలకు బదులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. గుజరాత్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అదంతా బీజేపీ నాయకులు చేసుకుంటున్న ప్రచారమంటూ ప్రియాంక గాంధీ చేసిన విమర్శలకు బీజేపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రియాంకగాంధీకి బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పది ప్రశ్నలు సంధించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్న ప్రియాంక గాంధీ తన భర్తపై వచ్చిన ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రియాంక గాంధీ ముందు తాను అడిగే పది ప్రశ్నలకు 48 గ ంటల్లో సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హర్షవర్ధన్ అడిగిన ప్రశ్నలు.. నరేంద్రమోడీ గుజరాత్‌ను అభివృద్ధి చేయకపోతే అక్కడి ప్రజలు వరుసగా మూడు సార్లు ఆయనను ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నారు? నరేంద్రమోడీ అభివృధ్ధి మోడల్‌పై వ్యాఖ్యలతో ఆరు కోట్ల మంది గుజరాతీయులను అవమానించినట్టు కాదా? మీ భర్త రాబర్ట్ వాద్రా హర్యానా, రాజస్థాన్‌లో భూ ఆక్రమణలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి దీనికి మీ సమాధానం? రాత్రికి రాత్రే ఆయన లక్షాధికారి నుంచి కోటీశ్వరుడు ఎలా అయ్యారో ప్రజలకు వివరించగలరా? రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 23న విచారణకు అనుమతించింది. గతంలో ఇలాంటి పిటిషన్లు ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించలేదు. ప్రత్యేకించి రాబర్ట్‌వాద్రా కేసును స్వీకరించడంపై మీ స్పందన ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తరఫున మీరు ప్రచారం చేస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికీ కనీస సదుపాయాలు లేవు. ఇక్కడ ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో కాంగ్రెస్ సర్కారే ఉంది. అయినా స్థానికులకు సోనియాగాంధీ కనీస సదుపాయాలు ఎందుకు సమకూర్చలేకపోయారు? పదేళ్లుగా మన్మోహన్సింగ్ను ప్రధాని పదవిలో కూర్చోబెట్టి తెర వెనుక అధికారం అంతా సోనియాగాంధీ చలాయిస్తున్నారని ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు ఇటీవల తన పుస్తకంలో ఆరోపించారు. దీనిపై మీరు దేశ ప్రజలకు ఇచ్చే సమాధానం ఏమిటి? గోద్రా అల్లర్లపై నరేంద్రమోడీకి కోర్టులు క్లీన్చిట్ ఇచ్చినా, కాంగ్రెస్ నాయకులు పదేపదే అవే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ నాయకులు లేవనెత్తేందుకు అంశాల కొరత ఏర్పడిందా? రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని కొన్ని రోజుల క్రితం మీడియాకు చెప్పిన మీరు, సోదరుడు రాహుల్ తరఫున ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏంటి? గుజరాత్ అభివృద్ధి మోడల్‌గా దేశప్రజలంతా హర్షిస్తున్నారు. అభివృద్ధి జరగలేదని మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? -
ఏడు స్థానాలకు 206 నామినేషన్లు
న్యూఢిల్లీ: రాజధానిలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 10 జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 206 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారంతో నామినేషన్ల గడువు ముగిసే సరికి 206 మంది నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కపిల్ సిబల్, హర్షవర్ధన్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖులు బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అన్ని పార్టీల నుంచి నువ్వా-నేనా అనే స్థాయిలోనే అభ్యర్థులు బరిలోకి దిగారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో కూడా ఏ పార్టీ గెలుపు ఖాయమని చేప్పేందుకు వీలులేకుండా అభ్యర్థుల జాబితా కనిపిస్తోందన్నారు. బీజేపీ నేతలు హర్షవర్ధన్, మీనాక్షి లేఖీ, కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, ఆప్ నేతలు అశుతోష్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖుల గెలుపు కొంతవరకు ఖాయంగానే కనిపిస్తున్నా ఢిల్లీ ఓటరు ఎప్పుడూ ఊహించని రీతిలో తీర్పునిస్తున్నాడని చెబుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 221 మంది నామినేషన్లు వేసినప్పటికీ ఉపసంహరణ తర్వాత 160 మంది మాత్రమే బరిలో నిలిచారని, ఈసారి కూడా ఉపసంహరణ తర్వాత అసలైన అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, మరో నటుడు విశ్వజీత్ చటర్జీ, సిట్టింగ్ ఎంపీ కృష్ణాతీరథ్, రమేశ్ కుమార్ వంటి ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఇక తృణముల్ కాంగ్రెస్ కూడా ఢిల్లీలో సత్తాచాటాలని పరితపిస్తోంది. ఈ పార్టీ అభ్యర్థులు చివరిరోజైన శనివారం నామినేషన్లు వేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్న భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, ఆప్ నేత ఆనంద్‌కుమార్‌ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముందంటున్నారు. ఇక కేంద్ర మంత్రి కృష్ణాతీరథ్‌కు కూడా ఆప్ నేత రాఖీ బిర్లా, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన ఉదిత్‌రాజ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక తృణముల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విశ్వజీత్ చటర్జీకి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, బీజేపీ నేత మీనాక్షి లేఖీ, ఆప్ నేత ఆశిష్ కేతన్ నుంచి పోటీ ఎదురుకానుంది. ఇలా ఏడు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల బలాబలాలు పోటాపోటీగా ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నవారికి స్థానికంగా హర్షవర్ధన్‌కు ఉన్న మంచిపేరు, ప్రధాని అభ్యర్థిగా మోడీ చరిష్మా కలిసివచ్చే అంశంకాగా ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమాలు, 49 రోజుల పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆప్ అభ్యర్థుల విజయానికి అనుకూలాంశాలుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం పార్టీ పేరుమీదే గెలుస్తామని చెబుతున్నారు. -
బూత్ మేనేజ్మెంటే ప్రధానం
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే తమ అభ్యర్థుల కోసం బీజేపీ బుధవారం వర్క్‌షాప్ నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో ఏమేం చేయవచ్చు, ఏమేం చేయకూడదనే విషయాలు అభ్యర్థులకు తెలియచెప్పడంతో పాటు నరేంద్ర మోడీ మంత్రాన్ని కూడా అభ్యర్థులకు ఉపదేశించారు. ప్రచారవ్యూహాల నుంచి బూత్‌స్థాయి మేనేజ్మెంట్ వ రకు క్షుణ్ణంగా చర్చించిన ఒకరోజు వర్క్‌షాపులో ఏడుగురు అభ్యర్థులతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, కౌన్సిలర్లు, ఢిల్లీ బీజేపీ కార్యవర్గం, జిల్లాస్థాయి కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలంటే అత్యధిక లోక్‌సభ సీట్లను గెలవాలని గుర్తించిన బీజేపీ ఏ అవకాశాన్ని వదలకుండా ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచార వ్యూహాల రూపకల్పనకు, అమలు చేసేందుకు పార్టీ ఒక ఇన్‌చార్జ్‌ను, కన్వీనర్‌ను నియమించింది. జాతీయ సమస్యలతో పాటు ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యల జాబితాను రూపొందించి నట్లు బీజేపీ నేత చెప్పారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యమైనందువల్ల ఆ లోటును పూడ్చుకోవడం కోసం ముమ్మరంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. మార్చ్ 22న నామినేషన్ల గడువు ముగిసిన తరువాత ప్రచారం ఊపందుకుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సమర్థ నిర్వహణే గెలిపిస్తుంది... బూత్ మేనేజ్మెంటే పార్టీని గెలిపిస్తుందని పార్టీ సీనియర్ నేత హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని, ప్రతి ఓటరును పోలింగ్ బూత్ వద్దకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా వారిదేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చరిత్రాత్మకమైనవని, ఇందులో బీజేపీ చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు దూరమవుతాయని, అందులో పార్టీ కాార్యకర్తలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సవివరంగా కార్యకర్తలకు వివరించారు. అవి... ఓటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడం. ప్రజల సమస్యల గురించి తెలుసుకొని, పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించడం. వివిధ స్థాయిల్లో తరచూ సమావేశాలు నిర్వహించడం. వాటిలో యువకులను, మహిళలను భాగస్వాములు చేయడం. కొత్త ఓటర్లపై దృష్టి సారించి, వారిని పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేసేలా చేయడం. కలసికట్టుగా పనిచేయడం. నిజాయతీగా వ్యవహరించడం. ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం. వ్యతిరేక, అనుకూల బూత్‌ల జాబితాలను సిద్ధం చేసుకొని, పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేయడం. స్థానిక నాయకులు సత్ప్రవర్తనతో మెలగడం. ప్రజల అవసరాలేంటో గుర్తించి, ప్రచారాంశాల్లో వాటిని చేర్చడం. -
బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల సిబల్‌తో హర్షవర్ధన్ ఢీ
న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు శనివారం రాత్రి విడుదలయింది. రాష్ట్రంలోని మొత్తం ఏడు స్థానాలకూ పేర్లను వెల్లడిచేసింది. ఇటీవలే పార్టీలో చేరిన మహేశ్ గిరి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, దళిత నాయకుడు ఉదిత్‌రాజ్‌కు సీట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. చాందినీచౌక్ ఎంపీ, కేంద్రమంత్రి కపిల్ సిబాల్‌పై బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పోటీ చేస్తారని వెల్లడించింది. న్యూఢిల్లీ స్థానాన్ని పార్టీ జాతీయస్థాయి నాయకుల్లో ఒకరికి కేటాయించవచ్చన్న పుకార్లు నిజమయ్యాయి. ఇక్కడి నుంచి మీనాక్షి లేఖీని బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవని హర్షవర్ధన్ ఇది వరకే ప్రకటించారు. అయితే పశ్చిమఢిల్లీ, దక్షిణ ఢిల్లీ స్థానాల లోక్‌సభ టికెట్లను ఎమ్మెల్యేలు ప్రవేశ్ శర్మ, రమేశ్ బిధూరీకి కేటాయించారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాలకు అధికారికంగా పేర్లను ప్రకటించలేదు. ఎవరు ఎక్కడి నుంచి.. డాక్టర్ హర్షవర్ధన్ : చాందినీచౌక్ ఈసారి హర్షవర్ధన్‌కు చాందినీచౌక్‌లో భారీ పోటీ తప్పకపోవచ్చు. కపిల్ సిబాల్‌కు ఇక్కడ జనాదరణ ఎక్కువేనని చెబుతారు. ఢిల్లీలో ఆప్ బలమైన శక్తిగా ఎదిగిన నేపథ్యంలో ఇక్కడ ఆ పార్టీ జర్నలిస్టు ఆశుతోష్‌ను నిలబెట్టింది. పైగా చాందినీచౌక్‌లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ గెలుపు కోసం విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. మైనారిటీల ఓట్లు ఆప్, కాంగ్రెస్ మధ్య చీలుతాయి కాబట్టి అంతిమంగా తమకే ప్రయోజనం ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. మీనాక్షి లేఖీ : న్యూఢిల్లీ బీజేపీ ఈ సీటును తన సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖీకి కేటాయించింది. కాంగ్రెస్ ఇక్కడి నుంచి ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్మాకెన్ను, ఆప్ జర్నలిస్టు ఆశిష్ ఖేతాన్‌ను బరిలోకి దింపాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్‌కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ప్రధానపోరు బీజేపీ, ఆప్ మధ్య ఉంటుంది. ఉదిత్‌రాజ్ : వాయవ్య ఢిల్లీ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి బీజేపీ తరఫున దళిత నాయకుడు ఉదిత్ రాజ్ పోటీ చేస్తారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి కృష్ణాతీరథ్ పోటీలో ఉంటారు. ఆప్ నుంచి మహేందర్ సింగ్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య భారీ పోటీకి అవకాశం ఉంది. రాజ్‌కు దళితవర్గాల్లో పేరు ఉంది కాబట్టి బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువని ఈ పార్టీ నాయకులు చెబుతున్నారు. మనోజ్ తివారీ : ఈశాన్య ఢిల్లీ పార్టీలో ఇటీవలే చేరిన భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి బీజేపీ ఈశాన్యఢిల్లీ సీటు ఇచ్చింది. కాంగ్రెస్ దిగ్గజం, సిట్టింగ్ ఎంపీ, డీపీసీసీ మాజీ అధ్యక్షుడు జైప్రకాశ్ అగర్వాల్‌తో ఆయన పోటీ పడుతున్నారు. ఇక ఆప్ ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్‌ను ఇక్కడి నుంచి నిలబెట్టింది. కుమార్ స్థానికుడు కారని, తాము మద్దతు ఇవ్వబోమంటూ కొందరు ఆప్ అసమ్మతులు ప్రకటించడం ఆయనకు ఇబ్బంది కలిగించవచ్చు. ప్రవేశ్ వర్మ : పశ్చిమ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు అయిన ప్రవేశ్‌వర్మ పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా, ఆప్ అభ్యర్థి, జర్నలిస్టు జర్నైల్ సింగ్ ఆయన తలపడతారు. వర్మ మెహ్రౌలీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహేశ్ గిరి : తూర్పుఢిల్లీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధిపతి శ్రీశ్రీ రవిశంకర్ శిష్యుడిగా పేరున్న మహేశ్‌గిరి ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, ఇది వరకే మూడుసార్లు ఎంపీగా విజయం సాధించిన సందీప్ దీక్షిత్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి. గాంధీ మనవడు, ప్రొఫెసర్ రాజ్‌మోహన్ గాంధీ ఆప్ నుంచి పోటీలో ఉన్నారు. తూర్పుఢిల్లీ వాసులు చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని, ఇక్కడి వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి తాను ప్రయత్నిస్తానని గిరి అన్నారు. రమేశ్ బిధూరి : దక్షిణ ఢిల్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బిధూరికి దక్షిణ ఢిల్లీ ఎంపీ సీటు టికెట్ ఇస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ ఆప్ అభ్యర్థి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ రమేశ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని కులాలు, వర్గాల ఓట్లు వచ్చేలా అభ్యర్థులను బీజేపీ ఎంపిక చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పూర్వాంచలీయుల ఓట్లు కీలకం కాబట్టి తివారీకి సీటు దక్కిందని చెబుతున్నారు. -
ఆప్.. మునుగుతున్న ఓడ!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని మునుగుతున్న ఓడగా అభివర్ణించారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్. ఆ పార్టీ చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటని, ఆ పార్టీ నేతల్లో కొందరి భ్రమలు ఇప్పుడిప్పుడే తొలగుతున్నాయని, ప్రజల్లో కూడా ఆ పార్టీపై అసంతృప్తి పెరుగుతోందన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడుతూ... ఆప్‌పై ఆ పార్టీ తరఫున పనిచేసినవారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి భ్రమలు తొలగిపోతున్నాయని చెప్పారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగైందని, పార్టీ వ్యవస్థాపకుల్లో కీలక సభ్యులే ఆ పార్టీ పనిచేస్తున్న తీరును విమర్శిస్తున్నారని వర్ధన్ ఎద్దేవా చేశారు. విదేశీ సంస్థలతో ఆ పార్టీకి సంబంధాలున్నాయనే విషయం ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందన్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అశోక్ అగర్వాల్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పారు. పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా పనిచేస్తోందని అగర్వాల్ విమర్శించడాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించారు. వ్యక్తిగతంగా కొందరికి లబ్ది చేకూర్చేందుకే కేజ్రీవాల్ పనిచేస్తున్నట్లుగా ఉందని అగర్వాల్ విమర్శించడాన్ని హర్షవర్ధన్ సమర్థించారు. -
ఆప్ ది అవకాశవాదమే
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ అనుసరిస్తున్న ప్రజా, జాతీయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం రాజ్‌ఘాట్‌లో ధర్నా చేయనున్నట్లు బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో గోయల్‌తోపాటు మాజీ అధ్యక్షుడు విజయేంద్రగుప్తా పాల్గొన్నారు. కాశ్మీర్ సమస్యపై అనుచిత వ్యాఖ్యలు, బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం, ప్రస్తుతం అవినీతి పరులైన కాంగ్రెస్ నాయకులను వెనకేసుకురావడం ఆమ్ఆద్మీపార్టీ అవకాశవాదానికి తార్కాణమన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మాజీ మంత్రుల అవినీతిపై కాగ్ నివేదికలు, లోకాయుక్త వంటి ఎన్నో సంస్థలు ఆధారాలు చూపినా ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని వారు ప్రశ్నించారు. ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకే షీలాదీక్షిత్‌పై దర్యాప్తును ఆయన అటకెక్కించారని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌లోని పెద్ద చేపలను పట్టుకునేందుకు కేజ్రీవాల్ జంకుతున్నాడు. అతడికి చిత్తశుద్ధి ఉంటే ముందు అలాంటివారి అవినీతిపై స్పందించాలి. ఎవరో ఒకరు ఆధారాలు ఇచ్చేవరకు ఆగాల్సిన పనేం ఉంది. ఆప్ సర్కార్ ఏర్పడి పది రోజులవుతోంది. అయినా చర్యల్లోకి ఎందుకు వె ళ్లడం లేదు’అంటూ గోయల్ ప్రశ్నించారు. నిత్యావసర ధరలను అదుపు చేయడం, సీఎన్జీ రేట్లు తగ్గించడం వంటి అనేక వాగ్దానాలు నెరవేర్చడంలో ఆప్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. ఆప్ సర్కార్‌లోని మంత్రులు సైతం ఎంతో గర్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వీఐపీ సంస్కృతిని పోగొడతామని గొప్పలు చెప్పిన ఆప్ మంత్రులు ఒక్కొక్కటిగా ప్రభుత్వ సదుపాయాలు తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. -
ఆప్.. దేశానికే ప్రమాదకరం: బీజేపీ
-
ఆప్.. దేశానికే ప్రమాదకరం: బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికే ప్రమాదకరమని బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎన్నికల్లో తగినన్ని స్థానాలు దక్కించుకోవడంతో దేశ ప్రజల్లో ఒక ఆశ పుట్టిందని, కానీ కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్ చేతులు కలపడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. విశ్వాస తీర్మానంపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి కారణాలేంటో కేజ్రీవాల్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు చెత్తబుట్టలో పడేసిన పార్టీతో ఆమ్ఆద్మీపార్టీ ఎందుకు చేతులు కలిపిందని హర్షవర్దన్ ప్రశ్నించారు. నిజాయితీగల పార్టీకి ఓటేయాలని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారని, అందుకే నిజాయితీ గల బీజేపీకే ప్రజలు ఓటేశారని, అసెంబ్లీలో ఎక్కువ సీట్లు తమకే వచ్చాయని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. కాగా, విశ్వాస పరీక్ష అంటే తమకు ఏమాత్రం భయం లేదని.. భయపడితే తాము గుడికి వెళ్లి ఉండేవాళ్లమని ఉదయమే కేజ్రీవాల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎటూ విప్ జారీ చేయడంతో ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గడం లాంఛనప్రాయమే అయ్యింది. -
వెంటవెంట సమస్యలు పరిష్కరించండి
=ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు =శాఖల వారీగా త్వరగా స్పందించాలి కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టిసారించాలని, వెంటవెంట వాటి పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. సోమవారం ప్రజావాణిలో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు.ఎంతో నమ్మకంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రజావాణిపై నమ్మకంతో వస్తున్న ఫిర్యాదుదారులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఏ శాఖ లో కూడా ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దన్నారు. టోల్‌ఫ్రీ ద్వారా వచ్చే, ఇతర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో 232 ఫిర్యాదులు అందా యి. కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ హర్షవర్ధన్ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యార్థుల ఉపకార వేతనా ల విషయంలో ఆధార్ అనుసంధానం రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టర్‌ను కలిసి కోరారు. గాంధారి మండలంలో ఇంత వరకు ప్రభుత్వ పరంగా మొక్కజొన్న కొనుగోలు చేయలేదని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉన్న 500 గజాల భూమి ని ఒడ్డెర లు ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలని మంచిప్ప గ్రామస్తులు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో పాఠశాల కాని అంగన్వాడీ భవనాన్ని నిర్మిం చాలని కోరారు. జిల్లాకేంద్రంలోని నిజాంకాలనీలో ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మానానికి నిధులు మంజూరు చేయాలని పాఠశాల విద్యా కమిటీ సభ్యు లు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. లక్ష్యాలు ఛేదించండి.. పశు సంవర్ధక శాఖలో నిర్ధారించిన లక్ష్యాలను సాధిం చడం సంబంధిత అధికారుల బాధ్యతని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. సోమవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో పశు సంవర్ధకశాఖ అధికారులతో పశుక్రాంతి ,గొర్రెల పెంపకం యూనిట్స్ , ఇతర పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పథకాల లక్ష్యాల సాధన కోసం బ్యాంకర్లు కాన్‌షెంట్ ఇవ్వలేదని అధికారులు తమ బాధ్యత విస్మరించడం సరికాదన్నారు. బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చి యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేయాలన్నారు. వచ్చేనెల మొదటి వారంలో మండలాల వారీగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి పథకాల లక్ష్యాల సాధన కోసం కాన్‌షెంట్ ఇచ్చే విధంగా కృషిచేస్తామన్నారు. పశు సంవర్ధకశాఖ అధికారులు బ్యాంకర్ల సమావేశానికి హాజరై అయా బ్రాంచి మేనేజర్లతో కాన్‌షెంట్ ఇవ్వడానికి కృషిచేయాలన్నారు. సమావేశంలో పశు సంవర్ధకశాఖ జేడీ ఎల్లన్న, అధికారులు పాల్గొన్నారు. -
‘ఆప్ ప్రభుత్వం త్వరలోనే కూలుతుంది’
కొత్త ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటికీ, ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని బీజేపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఏ సమయంలోనైనా ప్రభుత్వాన్ని కూల్చే అవకాశముంది కాబట్టి తాజా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని విధానసభ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు సూచించారు. చరిత్రలోనే అత్యంత అవినీతికరపార్టీ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆప్ పరిశుద్ధ రాజకీయాలు చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఆప్‌కు మద్దతుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. -
ఆప్ ప్రజలను మోసం చేసింది: బీజేపీ
న్యూఢిల్లీ: అవినీతి పార్టీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆప్ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. అవినీతిని అంతమొందిస్తామంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పార్టీ ఇప్పుడు తన మౌలిక సిద్ధాంతాలతోనే రాజీపడుతోందని విమర్శించింది. ప్రజల విశ్వాసాన్నీ వమ్ము చేసిందని మండిపడింది. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్‌తో ఆప్ జట్టుకట్టడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను వంచించారని ఢిల్లీ బీజేపీ సీనియర్ నాయకుడు హర్షవర్ధన్ మీడియాతో సోమవారం అన్నారు. అయినా కొత్త ప్రభుత్వానికి తమ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఆప్ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు. అయితే కాంగ్రెస్ మద్దతు ఇస్తానని చెప్పినా ఆప్ ప్రభుత్వ ఏర్పాటుకు సంశయించడాన్ని బీజేపీ ఇది వరకే విమర్శించింది. ఈ ఎన్నికల్లో 31 సీట్లు సాధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం తెలిసిందే. -
మళ్లీ పోరుకే సై
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మళ్లీ ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఒక అకాలీదళ్ సభ్యుడు, 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సుముఖత చూపడం లేదు. ఇక్కడ సర్కార్‌ని ఏర్పాటుచేయాలంటే 36 మేజిక్ ఫిగర్ ఉండాలి. అయితే బీజేపీ 31, దాని మిత్రపక్షమైన అకాలీదళ్ పార్టీ సభ్యుడితో కలిసి మొత్తం 32 స్థానాలున్నాయి. అయినా అధికార పీఠమెక్కాలంటే మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక్కడే చిక్కుముడి వచ్చి పడింది. ఢిల్లీవాసులు తమ మీద నమ్మకం ఉంచి నిజాయితీతో కూడిన పాలన అందిస్తారని అధిక సంఖ్యలో స్థానాలు ఇచ్చారని, అలాంటి వారి ముందు ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులకు తెరలేపి అభాసుపాలవటం కన్నా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 28 స్థానాలతో రెండోస్థానంలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోమని, ఎవరికీ మద్దతును కూడా ఇవ్వమని ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో ఎన్నికల సంగ్రామంలోకి దిగడమే మేలని యోచిస్తున్నారు. బీజేపీ అగ్రనేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఇవే మాటలు వినబడుతున్నాయి. అసెంబ్లీ పక్ష నేతగా హర్షవర్ధన్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అసెంబ్లీ పక్ష నేతగా డాక్టర్ హర్షవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన రెండు రోజుల అనంతరం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. 31 మంది బీజేపీ, ఒక అకాలీదళ్ శాసనసభ్యుడు మద్దతు పలికారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా హర్షవర్ధన్ విలేకరులతో మాట్లాడారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సంఖ్యా బలం లేకపోవడం వల్ల తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నారు. అవసరమైతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించినా మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువగా ఉండటం వల్ల ఈ అనిశ్చితి నెలకొందన్నారు. అయితే అధికారం కోసం అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఆత్రుతపడడం లేదన్నారు. అసలు ఆ దిశగా ప్రయత్నమే చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసినా చేయకపోయినా, ప్రజలకు సేవచేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. కాగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. మెజారిటీ లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటుచేయకూడదని నిర్ణయించామన్నారు. దొడ్డిదారిన వెళ్లి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తాము ప్రయత్నించడం లేదన్నారు. ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సంతోషిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి మద్దతూ కోరడం లేదని తెలిపారు. ప్రతిపక్షంలో కూర్చోవడానికి, లేకపోతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. మళ్లీ ఎన్నికలు జరిగితే తమ పార్టీ పూర్తి మెజారిటీతో మరోమారు అధిక స్థానాలు గెలిచి అధికారాన్ని దక్కించుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా, అంశాల ప్రాతిపదికన బీజేపీకి మద్ధతిస్తామన్న ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమైనవా? వారి పార్టీ అభిప్రాయమా? అన్న దానిపై స్పష్టత లేదన్నారు. అలాంటి ప్రతిపాదనలపై తామెలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.ఏఏపీ నేతలు తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చుకోకుండా చూసుకోవల్సిన అవసరముందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కోలీపై లైంగిక వేధింపుల ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ సంగతి వారు చూసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి నితిన్ గడ్కారీ, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు కూడా సోమవారం అరవింద్ కేజ్రీవాల్‌ను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
25 మంది ఎమ్మెల్యేలు నేరచరితులే
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 25 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈసారి మళ్లీ 22 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు గెలిచారని, వీరిలో 15 మందిపై కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. బీజేపీ నుంచి 17 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయని, ఆ పార్టీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ కూడా నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ సభ్యుడు తెలిపారు. బీజేపీ నుంచి 31 మంది గెలవగా, వీరిలో 13 మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై దాడులు తదితర తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలో ముగ్గురు, కాంగ్రెస్‌లో ఇద్దరు, శిరోమణి ఆకాళీ దళ్, జేడీ (యూ) స్వతంత్ర అభ్యర్థిపై నేరాభియోగాలు ఉన్నాయని వెల్లడించారు. -
కేజ్రీవాల్‌కు బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ అభినందనలు
తమ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక స్థానాలు కట్టబెట్టినందుకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయగలమన్న విశ్వాసం తమకుందని చెప్పినా.. ప్రభుత్వం ఏర్పాటుపై విలేకరులు వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. అలాగే, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. అంచనాలను మించి ఆయన పార్టీ మంచి విజయాలు సాధించిందని చెప్పారు. 15 సంవత్సరాల పాటు ఢిల్లీకి సేవలు అందించినందుకు షీలా దీక్షిత్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కృష్ణానగర్ స్థానం నుంచి 43 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తనను గెలిపించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు గాను ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. -
బీజేపీదే అధికారం: హర్షవర్ధన్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఆప్‌ల కంటే తామే ముందున్నామని భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ అన్నారు. ఆయన బుధవారం ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఆప్ కంటే బీజేపీ ఎంతో ముందుంది. ఆ రెండు పార్టీలూ రెండోస్థానం కోసమే పోటీపడుతున్నాయి. మా ఓటుబ్యాంక్‌ను ఎవరూ కొల్లగొట్టలేరని అన్నారు. ఆయన కృష్ణనగర్ నియోజకవర్గంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఛత్తిడ్గఢ్ వంటి గిరిజన రాష్ర్టంలో ఓటింగ్ శాతం 74.77 ఉంటే, ఢిల్లీ లాంటి ప్రాంతంలో 80 శాతం ఎందుకు ఉండటంలేదో అర్ధం కావడంలేదన్నారు.. ఈ విషయమై ఢిల్లీవాసుల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
హస్తిన బీజేపీదే! : హర్షవర్ధన్
న్యూఢిల్లీ సాక్షి ప్రతినిధి ఎన్.సత్యనారాయణ: హస్తినలో గత 15 ఏళ్లుగా అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి పీఠాన్ని దక్కించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. వివాద రహితుడు, క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ హర్షవర్ధన్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నేతృత్వంలో ఈమారు దేశ రాజధానిలో కమలం వికాసం ఖాయమని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. హర్షవర్ధన్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. సాక్షి: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి. ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉండబోతోంది. హర్షవర్ధన్: ఢిల్లీలో ఈసారి వంద శాతం బీజేపీ అధికారంలోకి వస్తుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెసే మాకు ప్రధాన ప్రత్యర్థి. సాక్షి: ఢిల్లీలో మహిళలకు భద్రత ప్రధానాంశంగా మారింది. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి చర్యలు ఆశించొచ్చు. హర్ష: కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రీయ హోదా కల్పించేలా కృషి చేస్తాం. అప్పుడు ఢిల్లీ పోలీసు వ్యవస్థ మా పరిధిలోకి వస్తుంది. దాన్ని పటిష్టపర్చడంతో పాటు పోలీసుల సంఖ్య పెంచుతాం. మహిళలకు భద్రత మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: ఢిల్లీలో సామాన్యులకు చుక్కలను చూపిస్తున్న నిత్యావసరాలు, కూరగాయల ధరల అదుపునకు తీసుకునే చర్యలేమిటి. హర్ష: ధరల అదుపు అనేది మా ప్రభుత్వం చేపట్టబోయే చర్యల్లో ముఖ్యమైంది. మేనిఫెస్టోలో ఆ అంశాలన్నీ పొందుపర్చాం. సాక్షి: ఢిల్లీలోనున్న దక్షిణ భారతీయులకు మీరిచ్చే భరోసా? హర్ష: వారినీ ఢిల్లీవాసులుగానే చూస్తాం. మాకు అందరూ సమానమే. స్థానికులున్నట్లే వారికీ అవే సమస్యలు ఉన్నాయి. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా వాటన్నింటికీ పరిష్కారం చూపిస్తాం. సాక్షి: ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణ భారతీయులకు, ముఖ్యంగా దాదాపు 10 లక్షల మంది వరకు ఉన్న తెలుగువారికి ప్రాధాన్యత లభించడం లేదన్న వాదనలున్నాయి కదా. హర్ష: మా పార్టీలో అందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నాం. -
బీజేపీ, ఆప్, ఎస్ఏడీలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలియో ఫ్రీ కార్యక్రమాన్ని ఎన్నికల స్టం ట్‌గా అభివర్ణిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అంతేకాక ఇటీవల ఆప్ వచ్చిన ఆరోపణల వెను క తమ పార్టీ హస్తముందంటూ ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నేతలపై కూడా చర్య తీసుకోవాలని కోరింది. తమ మరో ప్రత్యర్థి శిరోమణి అకాళీదళ్ పంజాబ్ పోలీసులను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుందని, ఆ పార్టీ నేతలపై కూడా చర్య తీసుకోవాలని షకీల్ అహ్మద్ నేతృత్వం లోని ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘాన్ని కోరింది. -
రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. మెట్రోరైలు, బస్సులకు కలిపి ఒకే స్మార్ట్ కార్డును ప్రవేశపెడతామన్నారు. సోమవారం పండిత్ పంత్ మార్గ్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ నగరాన్ని గ్రీన్ క్యాపిటల్‌గా చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందన్నారు. ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో ప్రైవేటు వాహనాల సంఖ్యను అదు పు చేయవచ్చన్నారు. ‘మేం హామీ ఇస్తున్నాం. చౌకైన, అత్యంత సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రజలు తమ కార్లు, స్కూటర్లు వాడడం పక్కనపెట్టేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తామ’న్నారు. ఢిల్లీ మెట్రోరైలు వ్యవస్థను సైతం బీజేపీ ప్రభుత్వ హయాం లోనే ఢిల్లీలో ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఢిల్లీపరిసర ప్రాంతాలకు మెట్రోరైలు వ్యవస్థను మరింత విస్తరిస్తామన్నారు. ఫీడర్ బస్సుల సంఖ్య పెంచడం తోపాటు ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనాలు ప్రతి మెట్రోస్టేషన్లో అందుబాటులోకి తెస్తామన్నారు. కాలం చెల్లిన వాహనాల లెసైన్స్‌లు వెంటనే రద్దు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు సైతం ప్రభుత్వ వాహనాలు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆలస్యం అమృతమయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలోని ప్రతి అంకంలోనూ దూకుడుగా వ్యవహరించే బీజేపీ నాయకులు పార్టీ మేనిఫెస్టో విడుదలలో జాప్యం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న ఈ ఆలస్యం.. పార్టీకి కలిసి వస్తుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. గత ఎన్నికలను పరిశీలిస్తే ప్రతిసారీ అన్ని ప్రక్రియల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒకడుగు మందుగానే బీజేపీ ఉండేది. ఎంసీడీ ఎన్నికల్లోనూ అదే తరహాలో ముందుకు వెళ్లింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య ఉన్న విభేధాల కారణంగా ప్రచారంతో అన్నింట్లోనూ ఆలస్యం కనిపిస్తోంది. అయితే దీన్ని వ్యూహాత్మంగానే చూడాలంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదలలో తొందరపాటుతో చెలరేగిన అసంతృప్తులను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుందని, అలా మరోమారు జరగకుండా తమ వ్యూహాలను బహిర్గతం చేయకుండా ప్రత్యర్థి పార్టీలైన ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు వచ్చిన తర్వాతే తమపార్టీ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే తయారు చేసుకున్న జాబితాలో కాంగ్రెస్, ఆప్‌ల హామీలను కలగలుపుకుని మరింత ఆకర్షణీయంగా మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రధాన సమస్యలపైనే దృష్టి: ఢిల్లీవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేలా మేనిఫెస్టో తయారు చేయాలని ఇప్పటికే బీజేపీ నాయకులు నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ఆమ్ఆద్మీపార్టీ మేనిఫెస్టోకి ధీటుగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు. బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో దీన్ని రూపొందిస్తున్నారు. బీజేపీ ప్రధాన హామీ అయిన 30 శాతం విద్యుత్ చార్జీల తగ్గింపుతోపాటు నీటి సరఫరా, మహిళా భద్రతకు పెద్దపీట వేయనున్నారు. సంక్షేమ పథకాలు, అనధికారిక కాలనీలు, జుగ్గీజోపిడీల అభివృద్ధి, క్రమబద్ధీకరణ అంశాలను ప్రధానగా ప్రస్తావించనున్నట్టు సమాచారం. నేడు బీజేపీ మేనిఫెస్టో: ఢిల్లీ విధానసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో శుక్రవారం విడుదల చేయనున్నట్టు సమాచారం. పండిత్‌పంత్‌మార్గ్‌లోని బీజేపీ నగరశాఖ కార్యాలయంలో బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. -
కాలుష్యాన్ని తరిమేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని కాలుష్యాన్ని పారద్రోలి పచ్చదనం కలిగిన రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్ ప్రకటించారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్‌తోపాటు ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి నితిన్ గడ్కరీ, బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను గొప్పస్థానంలో ఉంచాలని బీజేపీ భావిస్తోందని, అది ఢిల్లీతోనే ప్రారంభిస్తామన్నారు. అందుకోసం తీసుకోనున్న చర్యలు ఆయన వివరించారు. బీజేపీ అధికారంలోకి వ చ్చిన వెంటనే ఢిల్లీని పచ్చదనం కలిగిన రాజధానిగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. 2020 వరకు తాగునీరు, గాలి, నదులను శుద్ధి చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెడతామన్నారు. ప్రతి ఇంటికీ పైన సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమ్యే ఖర్చులో 30 శాతం ఢిల్లీ ప్రభుత్వం, 30 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు బదులుగా ప్రతి ఇంటి నుంచి కొంత కరెంట్‌ను గ్రిడ్‌కి విక్రయించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. 2015వరకు అన్ని ఇళ్లకు సోలార్ వ్యవస్థ ఏర్పాటు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పచ్చదనం పెం పొందించడం తదితర పనుల్లో భాగంగా ఢిల్లీలోని 50 వేల మంది యువతీయువకులకు అదనంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రజా, ప్రైవేట్ రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలు వాడేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హర్షవర్ధన్ వివరించారు. -
అధికారమిస్తే సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పిస్తాం: హర్షవర్ధన్
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న షీలా దీక్షిత్ సర్కార్ ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించలేకపోయిందని బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ విమర్శించారు. తమకు ఓటేసి ఢిల్లీ గద్దెనెక్కిస్తే అందుకోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సీఎం షీలా దీక్షిత్‌కు ఆసక్తిలేకపోయి అయినా ఉండాలి. లేదంటే ఆమె డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయి అయినా ఉండాలని ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్ వద్ద మంగళవారం మీడియాకు తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నికవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక వెళ్లి కలిసి ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించాలని కోరతామన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న షీలా మహిళలకు భద్రత కల్పించేందుకు కృషి చేయకపోవడాన్ని తప్పుబట్టారు. రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉపాధి కల్పనకే తొలి ప్రాధాన్యం: హర్షవర్ధన్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి కల్పనకు తొలి ప్రాధాన్యతనిస్తామని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ హామీనిచ్చారు. కృష్ణానగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న హర్షవర్ధన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు నామినేషన్ సమర్పించారు. మొత్తం ప్రక్రియ 30 నిమిషాలు పట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుంభకోణాలకు, ప్రజావ్యతిరేక విధానాలకు చెక్ పెట్టాలని ఢిల్లీవాసులు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మూడింట రెండు వంతుల స్పష్టమైన మెజార్టీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని సైతం బీజేపీ ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యం ఉపాధి కల్పనకు ఇస్తామని, ఢిల్లీవాసులందరికీ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు భద్రత, గౌరవం పెంచేలా ప్రత్యేక చర్యలు ఉంటాయన్నారు. లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ఈ-గవర్నెన్స్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలలోని ప్రతి పనినీ ఆర్టీఐ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. హర్షవర్ధన్ నామినేషన్ సందర్భంగా ఆయన భార్య నూతన్, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రాతోపాటు పెద్దసంఖ్యలో బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు. -
నమ్మకముంది.. మళ్లీ గెలుస్తాం: షీలా
న్యూఢిల్లీ: రాష్ట్ర విధానసభకు డిసెంబర్ 4న జరగనున్న ఎన్నికల్లో తాను మళ్లీ గెలుస్తానని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న షీలా దీక్షిత్ గురువారం తన కుమారుడు, ఎంపీ సందీప్ దీక్షిత్, కుతురు లతికతో కలిసి జామ్‌నగర్ కార్యాలయానికి మధ్యాహ్నం 1.00 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట కాంగ్రెస్ మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి సంజీవ్ గుప్తాకు నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగోసారి కూడా తన విజయం ఖాయమని, ఈసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. షీలా ఈ మాటలంటున్న సమయంలో మద్దతుదారులు షాజాహాన్ రోడ్డును నినాదాలతో హోరెత్తించారు. -
షీలాపై యుద్ధానికి సిద్ధం
న్యూఢిల్లీ: ‘మా పార్టీని ఈసారి ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టడానికి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సేనతో అసెంబ్లీ ఎన్నికల బరిలో యుద్ధానికి తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ ఎన్నికల టెన్షన్ తనకు లేదన్నారు. ‘నేను చిన్నప్పటి నుంచి పోటీకి ఇష్టపడతాను.. పరీక్ష ఉందంటే ముందే సిద్ధమయ్యేవాడిని తప్పితే చివరి రోజువరకూ ఆ టెన్షన్ పెట్టుకునేవాడిని కాదు.. ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థి షీలాదీక్షిత్‌తో పోటీపడేందుకు సన్నద్ధమయ్యే ఉన్నాం..’ అని ఈ డాక్టర్‌సాబ్ స్పష్టం చేశారు. ‘ప్రస్తుత రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్, నిరాడంబరత ఉన్న వ్యక్తులు పనికిరారనే వాదనలున్నాయి.. అది తప్పు అని నా అభిప్రాయం.. పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన ఢిల్లీ వాసుల సాయంతో ఆ ప్రభుత్వాన్ని ఓడించగలమనే నమ్మకం మాకుంది. నేను ఎటువంటి సంక్లిష్ట పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండగలను..ఆలోచించగలను.. ఈ ఎన్నికలు ఒక సాధారణ పరీక్షల వంటివే..’ అని వర్ధన్ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని, పారదర్శక పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. షీలా ప్రభుత్వంతో ఎన్నికల యుద్ధానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని ఆయన చెప్పారు. ‘ఒకవేళ మున్ముందు ఆ పార్టీ వారు నాయకురాలిని(షీలాను) మారిస్తే అందరికంటే మొదట బాధపడిదే నేనే..’ అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కొద్ది వారాల తర్వాత ఢిల్లీవాసులు అసమర్థ, లంచగొండి పాలననుంచి విముక్తులు కానున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల యుద్ధంలో తాను మృదుస్వభావిగా, మంచివాడిగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు అనుకుంటే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాను తప్పితే తన స్వభావాన్ని మార్చుకోనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ఢిల్లీవాసులు మంచివాళ్లను, మృదుస్వభావులను, తెలివైన వారిని పనికిరానివారిగా భావిస్తే, పదవికి కోసం తాను ఆరాటపడబోనని, సిద్ధాంతాలను వదిలిపెట్టి అధికారం కోసం అర్రులు చాచనని ఆయన స్పష్టం చేశారు. కేజ్రీ వాల్‌పై వ్యాఖ్యానిస్తూ.. ‘కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు మంచి గుర్తింపు వచ్చింది కాని అది పార్టీకి ఎన్నికల్లో లాభపడబోదు..’ అని వర్ధన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలువురు అభినందిస్తున్నట్లు ఈఎన్టీ వైద్యుడు కూడా అయిన వర్ధన్ తెలిపారు. ఢిల్లీవాసులు ప్రస్తుత షీలా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, కాంగ్రెస్‌కు ఈసారి పరాభవం తప్పదని విశ్లేషించారు. 70-80 శాతం ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలనతో అసంతృప్తిగా ఉన్నట్లు తాము పార్టీపరంగా నిర్వహించిన సర్వేల్లో తేలిందని వర్ధన్ తెలిపారు. ‘షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని చాలా సాదాసీదాగా నడుపుతున్నారు.ఈ 15 ఏళ్లలో క్లిష్టమైన సమస్యలేవీ పరిష్కరించలేకపోయారు. నీటిసరఫరాలో వైఫల్యం, నిరుద్యోగం, ఇళ్ల పంపిణీ వంటి సమస్యల పరిష్కారంలో షీలా ప్రభుత్వం విఫలమైంది. ఈ పదిహేనేళ్లలో ఒక్క మురికివాడవాసికైనా ఇంటిని కేటాయించగలిగారా.. 2008లో ప్రతి ఒక్క మురికివాడ వాసికి సొంత ఇళ్లు ఇప్పిస్తామని షీలా హామీ ఇచ్చారు కాని నిలబెట్టుకోలేకపోయారు. అనధికార కాలనీల్లో ఒక్కదానికైనా గుర్తింపు లభించిందా.. నగరంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ మంచినీటికి నోచుకోలేకపోతున్నాయి..’అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ‘నగరంలో మహిళలకు రక్షణ లేదు.. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే అది తమ పరిధిలోలేదని షీలా తప్పించుకుంటున్నారు తప్పితే నష్ట నివారణకు ఆమె తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవు..’ అంటూ దుయ్యబట్టారు. గత పదిహేనేళ్లుగా షీలా ప్రభుత్వానికి అదృష్టం ఉండబట్టే అధికారంలో ఉండగలిగారు.. ప్రజలు మమ్నల్ని తిరస్కరించలేదు.. వారిని ఆదరించారు అంతే.. ప్రజలు స్థానిక ఎన్నికల్లో విజయం అందించడం ద్వారా పదేళ్లుగా మాకూ సమాన అవకాశం ఇచ్చారు..’ అని వర్ధన్ విశ్లేషించారు. -
షీలాపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని అనధికారిక కాలనీల్లో నివసిస్తున్న 50 లక్షల మంది ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసగిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకునేలా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, హోంమంత్రి షిండేలను ఆదేశించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో బీజేపీ నేతలు కోరారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్, విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా సంయుక్తంగా ఈ లేఖను రాశారు. ఈ సందర్భంగా వారు గురువారం మీడియాతో మాట్లాడారు. అనధికారిక కాలనీలను క్రమబద్దీకరిస్తామని చెప్పిన షీలాదీక్షిత్.. 2008లో 50 లక్షల మంది అనధికారిక కాలనీవాసులకు కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతులమీదుగా సర్టిఫికెట్లను ఇప్పించారని పేర్కొన్నారు. అనధికారిక కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా వాటిని క్రమబద్దీకరించడానికి వీలులేదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తెలిసీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించార ని ఆరోపించారు. ఈ అంశంపై లోకాయుక్తాకు ఫిర్యాదు చేసినట్టు హర్షవర్ధన్ తెలిపారు. లోకాయుక్త 2010లో దీనిపై విచారణ జరిపిందన్నారు. సీఎం ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు లక్షల రూపాయల ప్రజాధనాన్ని దినపత్రికలు, టీవీ చానళ్లలో ప్రకటలు ఇచ్చేం దుకు వినియోగించినట్టు నిగ్గుతేల్చిందన్నారు. ప్రతిమారు ఎన్నికల సమయం లో అనధికారిక కాలనీల్లోని 50 లక్షల ఓట్లను కొల్లగొట్టేందుకు షీలా తప్పుడు వాగ్దానాలు చేస్తూనే ఉన్నారని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
బీజేపీ అభ్యర్థులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: భారీ కసరత్తు అనంతరం విధానసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. తీవ్ర చర్చోపచర్చలకు తెరదించుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షత కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఎల్కే.అద్వానీ, డా.మురళీ మనోహర్జోషి,ఎం.వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ, సుష్మాస్వరాజ్,అరుణ్‌జైట్లీతోపాటు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. 70 నియోజకవర్గాలకుగాను మొదటి విడతలో మొత్తం 62 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో నాలుగు టికెట్లను అకాలీదళ్‌కు కేటాయించారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా.హర్షవర్ధన్ వరుసగా నాలుగుమార్లు గెలిచిన కృష్ణానగర్ నుంచే బరిలోకి దిగనున్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఢిల్లీప్రదేశ్ మాజీ అధ్యక్షుడు విజేంద్రగుప్తాను బరిలోకి దించాలని కమలదళం నిర్ణయించింది. కాగా మొదటి విడత అభ్యర్థుల జాబితాలో బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్గోయల్కి చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు అంతంతమాత్రంగానే ఉండడంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. నాలుగుస్థానాల్లో పోటీ చేయనున్న అకాలీదళ్ న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని ఎస్ఏడీ నగర శాఖ అధ్యక్షుడు మంజిత్‌సింగ్ బుధవారం వెల్లడించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకుని నగర పరిధిలోని రాజౌరి గార్డెన్, షహధర, కల్కాజీ, హరినగర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. అభ్యర్థుల పేర్లను తమ పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు. టికెట్లు పొందినవారి జాబితా: క్ర.సం. నియోజకవర్గం అభ్యర్థిపేరు 1 నరేలా నీల్ధామన్ఖాత్రి 2 బురాయి శ్రీకృష్ణత్యాగి 3 బదాలీ విజయ్‌భట్ 4 రిటాలా కుల్వంత్రాణా క్ర.సం. నియోజకవర్గం అభ్యర్థిపేరు 5 ముండ్కా మనోజ్ షకీన్ 6 కిరారీ అనిల్‌ఝా 7 సుల్తాన్పుర్మజారా(ఎస్సీ) సుశీలాబగాడి -
మోడీ.. మహా ఆకర్షక శక్తి
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీలో గొప్ప ఆకర్షణ శక్తి ఉందని బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ సభలకు జనం అంతగా రారన్నారు. కాగా రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రభావం ఉండదంటూ ఇటీవల సీఎం షీలాదీక్షిత్ చేసిన వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ పైవిధంగా స్పందించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈసారి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకుగాను మోడీ నగర పరిధిలో జరిగే అనేక సభల్లో పాల్గొంటారన్నారు. రాహుల్, మోడీలు ఇటీవల నగరంలో నిర్వహించిన సభలను పోలుస్తూ రాహుల్‌గాంధీ సభకు వేల సంఖ్యలో కూడా జనం రాలేదన్నారు. అదే నరేంద్రమోడీ సభకు లక్షల సంఖ్యలో నగరవాసులు తరలివచ్చారన్నారు. దీని ప్రభావం కచ్చితంగా భారీగానే ఉంటుందన్నారు. నరేంద్రమోడీ భావి భారత ప్రధానమంత్రి అంటూ ధీమా వ్యక్తం చేశారు. మోడీ రాకతో కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు నిరాశకు లోనయ్యారన్నారు. అనేక సంవత్సరాలపాటు నరేంద్ర మోడీపై వారంతా నోరుపారేసుకున్నారని, అయిననప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు. మద్దతు తగ్గుతోంది కాంగ్రెస్ పార్టీ తన కంచుకోటగా భావించే మంగోల్‌పురి నియోజకవర్గంలో ఇటీవల రాహుల్‌గాంధీతో సభ నిర్వహించిందని, అయితే ఆ సభకు ఆశించిన రీతిలో జనం రాలేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు. దీంతో ఆ పార్టీకి ప్రజల మద్దతు తగ్గిపోతోందనే విషయం తేటతెల్లమైందన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నాయకుడు రాజ్‌కుమార్ చౌహాన్ వరుసగా నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారన్నారు. రాష్ట్ర కేబినెట్లో రాజ్‌కుమార్ చౌహాన్ మంచి శక్తిమంతమైన మంత్రి అని, అంతేకాకుండా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు అత్యంత సన్నిహితుడన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం ఈసారి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తాము ఓడించడం తథ్యమన్నారు. మోడీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. భారీ జనాకర్షణ కలిగిన వ్యక్తి నరేంద్రమోడీ అనే విషయాన్ని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ గుర్తుంచుకోవాలన్నారు. జయప్రకాష్ నారాయణ్, ఇందిరాగాంధీ సభలను కూడా తాను చూశానని, మోడీ సభకు కనీసం ఎనిమిది లక్షలు మొదలుకుని 12 లక్షల మంది దాకా ప్రజలు హాజరవుతున్నారని మీరు ఊహించగలరా? అంటూ మీడియాను ప్రశ్నించారు. విభేదాలు లేనే లేవు పార్టీలో అంతర్గత విభేదాలు, విజయ్గోయల్తో సంబంధాల విషయమై ప్రశ్నించగా పార్టీ విజయం కోసం నాయకులంతా కలసికట్టుగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పుడుగానీ లేదా గతంలోగానీ తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. గత అనేక సంవత్సరాలుగా విజయ్గోయల్తో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను పార్టీ పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఎంపిక చేసిందన్నారు. అయినప్పటికీ తనకు సంపూర్ణ మద్దతు ఇస్తానని గోయల్ తనకు చెప్పాడన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని కూడా చెప్పాడన్నారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సందేహమూ లేదన్నారు. గోయల్ మంచి చురుకైన వ్యక్తి అంటూ ప్రశంసించారు. గొప్ప పోరాట యోధుడన్నారు. పార్టీకి అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నాడన్నారు. కలసికట్టుగా పనిచేస్తామని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. సమగ్ర అభివృద్ధే లక్ష్యం రాజధాని నగర సమగ్ర లక్ష్యమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. నగరంలోని అనధికారిక కాలనీలు, జుగ్గీజోపిడీలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ)మాదిరి మరో ప్రత్యేక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిద్వారా ఆయా ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలతోపాటు ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని 1639 అనధికారిక కాలనీలతోపాటు 400 గ్రామాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. నేటికీ రాజధాని నగరంలోని 40 శాతం మంది ప్రజలకు మంచినీరు అందడం లేదన్నారు. 40 లక్షల మంది అనధికారిక కాలనీవాసుల ఇబ్బందులను 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగిస్తూనే ఉన్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు, అధిక ధరలతో ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్‌పార్టీ నుంచి నగరవాసులకు త్వరలోనే విముక్తి కలిగిస్తామన్నారు. త్వరలో మళ్లీ ఇంటింటి ప్రచారం షురూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక తర్వాత భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనుంది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వల్ల గత నెలలో ‘ఘర్ ఘర్’ కార్యక్రమం నిలిపివేశామని ఆ పార్టీ నాయకుడు ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు. అక్టోబర్ 16న సివిల్ లైన్స్‌లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ ప్రారంభించారని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. అయితే సీఎం అభ్యర్థి ఎంపిక వల్ల నిలిచిపోయిన దీన్ని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థితో పాటు పార్టీ తరఫున ఐదుగురు సభ్యులు ఇంటింటికి వెళ్లి పార్టీ ఆలోచనలు పంచుకుంటారని వివరించారు. డిసెంబర్ నాలుగున 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికల కోసం 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల ఐదున పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముందన్నారు. -
లిస్టులో ఫస్టెవరో!!
సాక్షి, న్యూఢిల్లీ:ఎన్నికల పరుగులో లక్ష్యాన్ని ముద్దాడాలంటే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. మొదటి అడుగు మరింత కీలకం. ఇలా చూస్తే ఎన్నికల్లో మొదటి అంకం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం. అసలు కథంతా ఇక్కడే దాగి ఉంటుంది. సరైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే అధికార పీఠం దక్కుతుంది. వివిధ కారణాల రీత్యా అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు పార్టీలు తాత్సారం చేస్తున్నాయి. ఎదుటి పార్టీ నిలబెట్టే అభ్యర్థిని బట్టి తాము బరిలోకి దింపాలన్న యోచనతో ఉన్నాయి. ఎన్నికలకు మరో 35 రోజులే గడువున్నా ప్రధాన పార్టీలు జాబితాలు విడుదల చేయడం లేదు. బీజేపీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును ప్రకటించడంతో బీజే పీ స్పీడుకి బ్రేకులు పడ్డాయి. నేర చరితులు లేకుండా, కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న నియమాలు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. ఇరుపార్టీల అభ్యర్థులు తెలిస్తేకానీ రంగంలోకి దిగొద్దని బీఎస్పీ కాసుకూచ్చుంది. అన్నింటికి పరోక్షంగా ఆప్ అనుసరిస్తున్న వ్యూహమూ కారణమవుతోంది. దీంతో అన్ని పార్టీల్లోని ఆశావహులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉన్నదంతా ఖర్చుచేసుకుని మరి తమవంతు ‘ప్రయత్నాలు’చేసుకుంటున్నారు. అభ్యర్థు జాబితా విడుదలలో తాత్సారం ఏ క్షణాన ఎవరి కొంప ముంచుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వర్గపోరుతో నెమ్మదించిన బీజేపీ బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్‌ను కాదని సచ్చీలుడైన వ్యక్తి కావాలంటూ డా.హర్షవర్ధన్ పార్టీ సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ స్పీడు కాస్త తగ్గింది. అంతకముందు తాను సీఎం అభ్యర్థిని అన్న ఉత్సాహంతో పార్టీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ అంతా తానై నడిపించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేయడంతోపాటు తన వర్గంలోని వారికి టిక్కెట్లు వచ్చేలా ప్రణాళిలకు రూపొందించి పెట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వడంతో గోయల్ తెల్లబోయారు. సీఎం అభ్యర్థి హర్షవర్ధన్‌తో పైకి సఖ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అభ్యర్థుల ఎంపికలో తన ముద్ర ఉండేలా ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిత్వంలో ఇప్పటికే పార్టీ బుజ్జగింపులకు తలొగ్గిన విజయ్‌గోయల్...పార్టీ టిక్కెట్ల విషయంలో పట్టుబట్టేలా కనిపిస్తోంది. దీంతో దీపావళికి ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటనలు చేసిన బీజేపీ కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో చేసినట్టే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్జన భర్జనల్లో కాంగ్రెస్... కాంగ్రెస్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ వర్గపోరునకు మించి ఇతర అర్హతలు ఆశావహుల తలరాతలు మారుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలలో వీలైనంత ఎక్కువ మందికి మరోమారు అవకాశం ఇవ్వాలని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఇప్పటికే 31 మందికి ఆమోదం తెలిపినట్టు సమాచారం. నేర చరిత్ర, వయస్సును పరిగణనలోకి తీసుకుని కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను దీపావళి తర్వాత విడుదల చేయాలన్న యోచనలో కాంగ్రెస్‌పార్టీ అధిష్టాన వర్గం ఉన్నట్టు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలను ‘ఆప్’తున్న కేజ్రీవాల్.. తొలిసారిగా ఢిల్లీ విధానసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆమ్ఆద్మీపార్టీ కొత్త పంథాలో వెళుతూ ఇతర పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆమ్ఆద్మీపార్టీ నిజాయితీ కలిగిన అభ్యర్థులకే సీట్లు వచ్చేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. గత రెండు నెలలుగా పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు పార్టీ వెబ్సైట్ ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. దీంతో ఇతర పార్టీలు సైతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నంతలో కాస్త నిజాయితీ కలిగిన నాయకులకు టికెట్ ఇవ్వాలన్న ధోరణిలో ఉన్నాయి. ఈ సరికొత్త విధానం ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా విడుదలలో ఓ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీఎస్పీ సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. డిసెంబర్ నాలుగున జరగనున్న ఎన్నికల్లో పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తుండగా, ఇప్పటికే 63 స్థానాలు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైనట్టు బీఎస్పీ ఢిల్లీప్రదేశ్ నాయకుడు ఎమ్.ఎల్.తోమర్ పేర్కొన్నారు. కాంగ్రెస్,బీజేపీ జాబితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. -
కలి‘విడి’గా హర్షవర్ధన్, గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్‌ను నియమించిన తర్వాత తొలిసారిగా నిర్విహ ంచిన విలేకరుల సమావేశంలో గోయల్, హర్షవర్ధన్ కలి‘విడి’గా కనిపిం చారు. అంతర్గత కలహాల కారణంగానే సీఎం అభ్యర్థిత్వాన్ని పోగొట్టుకున్నానని భావిస్తున్న గోయల్... మరోసారి తనకు ఆ పేరు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హర్షవర్ధన్‌కి గోయల్ సహకరించడని, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పెరగడం ఖాయమంటూ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసేందుకు వారిరువురూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. సమావేశం అనంతరం భోజన సమయంలోనూ ఇద్దరూ కలసి మీడియాతో మాట్లాడారు. ఒక దశలో మీడియా అంతా హర్షవర్ధన్ వెంటే తిరుగుతుండడంతో గోయల్...మొదట కాసేపు విజయేంద్రగుప్తాతో కలసి పక్కన కూర్చున్నారు. అనంతరం కొన్నిమీడియా చానళ్లకు కలసి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతర్గత కలహాలపై మీడియా పదేపదే ప్రశ్నలు సంధించడంతో ఒకింత అసహనానికి గురైన గోయల్... అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అధినాయకత్వం ఆదేశాల మేరకు అంతర్గత కలహాలు బయటపడకుండా ఇద్దరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకుడొకరు తెలిపారు. గోయల్‌పై గడ్కరీ ప్రశంసల జల్లు సీఎం అభ్యర్థిగా డా.హర్షవర్ధన్ పేరును ప్రకటిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ స్వాగతించడాన్ని పార్టీ ఎన్నికల ఇన్చార్జి గడ్కరీ ప్రత్యేకంగా అభినందించారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గోయల్ తన ప్రతిష్టను మరింత పెంచుకున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీ అధ్యక్షుడిగా విజయ్‌గోయల్ నియమితులైనప్పటి నుంచి పార్టీ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. తొమ్మిది నెలల్లో పార్టీ శ్రేణులను నగరవాసులకు మరింత చేరువయ్యేలా చేశారని అన్నారు. నగరంలో ఇటీవల నరేంద్రమోడీ నిర్వహించిన విశాల్ ర్యాలీ విజయవంతం కావడంలోనూ విజయ్ గోయల్ పాత్ర ఎంతో ఉందంటూ కితాబిచ్చారు. కాగా ఢిల్లీ విధానసభ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న గడ్కరీ.... అటు హర్షవర్ధన్‌ను సమర్థిస్తూనే, గోయల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగకుండా చూసేందుకు తాను నిర్వహించనున్న పాత్రను ఈ సందర్భంగా స్పష్టం వివరిం చారు. -
బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్
న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత హర్షవర్ధన్‌ను బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ ఢిల్లీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వ్యతిరేకించినా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు హడావుడిగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ చాలాకాలంగా సీఎం అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కొన్ని నెలలుగా బీజేపీ నాయకత్వం ఈ అంశంలో డోలాయమానంలో కొనసాగింది. చివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
ఢిల్లీలో ‘త్రిశంకు’ సభ!
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈసారి త్రిశంకు సభ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ దక్కే అవకాశాలు లేవని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ‘హ్యాట్రిక్’ సీఎం షీలా దీక్షిత్ ఇన్నింగ్స్ ఇక ముగిసినట్లేనని, ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారానికి కాలం చెల్లినట్లేనని ఈ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఇదివరకటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల నడుమనే ప్రధానంగా పోటీ ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగడంతో త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కారణంగా ఆధిక్యత సన్నగిల్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితిని సానుకూలంగా మలచుకోవడంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ విఫలమైనట్లే కనిపిస్తోంది. షీలా దీక్షిత్‌కు దీటైన అభ్యర్థిని అన్వేషించడంలో నెలల తరబడి తాత్సారం చేసిన బీజేపీ, ఎట్టకేలకు ఆదరాబాదరాగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హర్షవర్ధన్‌ను తన సీఎం అభ్యర్థిగా బుధవారం తెరపైకి తెచ్చింది. బీజేపీ ఢిల్లీ నగర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సీఎం అభ్యర్థిత్వంపై చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నారు. పార్టీ పదవుల్లో తన మనుషులకే ప్రాధాన్యమిస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదులు రావడంతో, బీజేపీ నాయకత్వం ఆయనను కాదని హర్షవర్ధన్‌ను తెరపైకి తెచ్చింది. హర్షవర్ధన్‌ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తేవడంతో గోయల్ తెరవెనుక అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని, ఈ పరిస్థితిని చక్కదిద్దడం హర్షవర్ధన్‌కు అగ్నిపరీక్షేనని బీజేపీ ఢిల్లీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ విజయావకాశాలను మసకబార్చే సూచనలు కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ఈ పరిస్థితిని పూర్తిగా సొమ్ము చేసుకోలేని స్థితిలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో తాజాగా కిలో రూ.90కి చేరిన ఉల్లి ధరలు అధికార కాంగ్రెస్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉల్లి ధరలపై బెంబేలెత్తిన ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్, గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్, ఆహార మంత్రి కేవీ థామస్‌లతో ఈ అంశంపై మాట్లాడనున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ ప్రభావవంతమైన శక్తిగా ఆవిర్భవించింది. కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకూ ఏఏపీ కూడా తన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. త్రిశంకు ఫలితాలు వస్తే, ఏఏపీ ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలదని విశ్లేషకుల అంచనా. యూపీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ, యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న బీఎస్పీ కూడా మొత్తం 70 స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నాయి. సీపీఎం, శిరోమణి అకాలీదళ్, లోక్ జనశక్తిబ వంటి పలు పార్టీలు పరిమిత స్థానాల నుంచి పోటీ చేస్తున్నా, వాటి ప్రభావం అంతంతే. కేంద్రంలోని యూపీఏ సర్కారు వరుస అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో వైఫల్యం వంటి అంశాల కారణంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారిలో పలువురు బీజేపీ లేదా ఏఏపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. -
లోక్‌సభకు విజయ్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: అధిష్టానం ఒత్తిడికి తలొగ్గి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసు నుంచి వైదొలగిన విజయ్ గోయల్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి పోటీచేసే అవకాశముంది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయరని, లోక్‌సభ కు పోటీచేయవలసిందిగా పార్టీ చేసిన ప్రతిపాదనకు అంగీకరించారని ఆయన అభిమానులు తెలిపారు. ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షపదవినుంచి వైదొలగరని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసు నుంచి విజయ్‌గోయల్ రెండు రోజుల కిందటే వైదొలగారని వారు తెలిపారు. బుధవారం ఉదయం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన విజయ్ గోయల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. హర్షవర్ధన్‌కు మద్దతునివ్వాలని తన అభిమానులను కోరారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపికచేయకపోవడంపై అసంతృప్తి ఏమీలేదని విజయ్ గోయల్ ప్రకటించారు. క్రమశిక్షణగల కార్యకర్తగా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయానికి తలొగ్గుతానని ఇదివరకే చెప్పానని ఆయన తెలిపారు. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. హర్షవర్ధన్‌కు అందరూ సహకరించాలని తాను పార్టీ కార్యకర్తలకు చెప్పానని గోయల్ తెలిపారు. పార్టీ ఒక్కతాటిపై ఉందని ఆయన ప్రకటించారు. పార్టీని గెలిపించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. గడచిన ఎనిమిది నెలలుగా పార్టీ నిర్మాణానికి కష్టపడి పనిచేశామని ఆయన చెప్పారు. 40 ఏళ్లుగా పార్టీలో తాను క్రమశిక్షణగల కార్యకర్తగా సేవలందిస్తున్నానని ఈ సందర్భంగా గోయల్ ప్రకటించారు. కొన్నిసార్లు పార్టీ నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉండనంత మాత్రాన బాధపడాల్సిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాననేది మీడియా సృష్టేనని ఆయన ఆరోపించారు. తాను రాజీనామా చేయలేదని, చేయబోనని, పార్టీ కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. నష్టం తెచ్చిన ఒంటెత్తు పోకడ అధ్యక్షుడిగా నియంతృత్వ ధోరణి, ఒంటెత్తు పోకడల వల్లే బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సీఎం అభ్యర్ధిత్వం నుంచి తొలగాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని నెలల కిందట ఆర్ఎస్ఎస్ ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు ఆర్తీ మెహ్రా ఇచ్చిన విందులో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీలో జిల్లా, రాష్ర్ట కార్యవర్గాల నియామకాల తీరుపై చర్చ రాగా, పలువురు స్థానిక నేతలు గోయల్‌పై ఫిర్యాదులు చేశారు. కార్యవర్గాల ఎంపికలో ఆయన ఒంటెత్తు పోకడకు పోయాడని, స్థానిక నాయకులెవరినీ పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు గుప్పించారు. దాంతో పార్టీకి నష్టం కలిగించే విధంగా గోయల్ చర్యలు ఉంటున్నాయన్న భావనతో ఆర్ఎస్ఎస్ సైతం సీఎం పదవికి తగిన అభ్యర్థిగా హర్షవర్ధన్ వైపు మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్‌పై విరుచుకుపడ్డ కేజ్రీవాల్
భారతీయ జనతా పార్టీ న్యూఢిల్లీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విరుచుకు పడ్డారు. 'హర్షవర్ధన్ ఢిల్లీ మన్మోహన్ సింగ్' అని కేజ్రీవాల్ అభివర్ణించారు. కేంద్రం ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలలో అవినీతిని కట్టడి చేయడంలో ప్రధాని మన్మోహన్ ఎలా విఫలమైయ్యారో, అలాగే న్యూఢిల్లీ నగరపాలక సంస్థలో అవినీతిని హర్షవర్దన్ అరికట్టలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ విధంగా చెప్పలంటే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ ఏలాగో భారతీయ జనతాపార్టీ న్యూఢిల్లీ శాఖలో హర్షవర్ధన్ అలా అని ఆయన సోదాహరణగా వివరించారు. బీజేపీకి అంటిన అవినీతి రంగును తుడుచుకునేందుకే హర్షవర్దన్‌ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. 2010 నాటి ఎన్నికల్లో న్యూఢిల్లీ సీఎంగా విజయకేతనం ఎగురువేసిన షీలా దీక్షిత్‌ను హర్షవర్ధన్ మొచ్చుకున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటి హర్షవర్ధన్ ఇప్పుడు ఏలా షిలా దీక్షిత్ పై పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం తన అభిప్రాయాన్ని అరవింద్ కేజీవ్రాల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. -
న్యూఢిల్లీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ : రాజనాథ్ సింగ్
-
న్యూఢిల్లీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ : రాజనాథ్ సింగ్
న్యూఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్‌ను ఎంపిక చేసినట్లు భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఆ సమావేశానికి పార్టీ అగ్రనేత ఎల్.కే.అధ్వానీతోపాటు పలువురు నేతలు హాజరైనట్లు పేర్కొన్నారు. హర్షవర్ధన్ గతంలో న్యూఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. కాగా న్యూఢిల్లీ సీఎం అభ్యర్థి విజయ్ గోయల్ అని గతంలో బీజేపీ వెల్లడించింది. అయితే విజయ్ గోయల్ పలు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వివాదాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకత్వం భావించింది. దాంతో విజయ్ గోయల్‌ను ఒప్పించేందుకు పార్టీ నాయకత్వం రంగంలో దిగింది. దీంతో బీజేపీ నాయకత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని విజయ్ గోయల్ స్పష్టం చేశారు. దాంతో హర్షవర్ధన్ ఎంపిక అనివార్యమైంది. న్యూఢిల్లీ శాసన సభకు డిసెంబర్ 4 వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. -
'ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా నిర్ణయించ లేదు'
ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని బీజేపీ తెలిపింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది అని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్ష వర్ధన్ ను ప్రకటించారనే వార్తలు మీడియాలో వస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రకటన చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నలకు గడ్కారీ జవాబిచ్చారు. త్వరలోనే పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన తెలిపారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో హర్ష వర్ధన్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలో ఆరోగ్య శాఖ మంత్రిగా హర్ష వర్ధన్ సేవలందించారు. కాంగ్రెస్ తరపున ప్రస్తుత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రివాల్ పేర్లు ఖరారైన సంగతి తెలిసిందే.