అధికారమిస్తే సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పిస్తాం: హర్షవర్ధన్ | Harsh Vardhan promises full statehood for Delhi | Sakshi
Sakshi News home page

అధికారమిస్తే సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పిస్తాం: హర్షవర్ధన్

Published Wed, Nov 20 2013 12:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Harsh Vardhan promises full statehood for Delhi

 న్యూఢిల్లీ: పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న షీలా దీక్షిత్ సర్కార్ ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించలేకపోయిందని బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ విమర్శించారు. తమకు ఓటేసి ఢిల్లీ గద్దెనెక్కిస్తే అందుకోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సీఎం షీలా దీక్షిత్‌కు ఆసక్తిలేకపోయి అయినా ఉండాలి. లేదంటే ఆమె డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయి అయినా ఉండాలని ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్ వద్ద మంగళవారం మీడియాకు తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నికవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక వెళ్లి కలిసి ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించాలని కోరతామన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న షీలా మహిళలకు భద్రత కల్పించేందుకు కృషి చేయకపోవడాన్ని తప్పుబట్టారు. రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement