Sheila Dikshit
-
ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..
దేశ రాజధానిని సుదీర్ఘకాలం ఏలిన స్ట్రాంగెస్ట్ విమెన్ సీఎంగా పేరుగాంచి మహిళ లవ్ స్టోరీ గురించి విన్నారా..?. అగ్ర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించారామె. అస్సలు ఆనాటి భయంకరమైన కట్టుబాటుల నడుమ పెళ్లి అవుతుందా..? లేదా అనే రసవత్తరమైన టెన్షన్ల మధ్య ఆమె ప్రేమను గెలిపించుకున్నారు. అలా ఆమెలో ఒక గొప్ప ప్రేమికురాలి తోపాటు బలమైన నాయకురాలు, గొప్ప తల్లి ఉందని నిరూపించారు. ఆమె ఎవరంటే..భారత చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా నిలిచిన వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం షిలా దీక్షిత్. ఆమెలో బలమైన నాయకురాలు, గొప్పతల్లి కంటే ముందుకు ఓ గొప్ప ప్రేమికురాలు కూడా ఉందనే విషయం కొద్దిమందికే తెలుసు. అదికూడా ఆమె ఆత్మకథ "సిటిజన్ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్" ద్వారానే బహిర్గతమైంది. ఆమె తన కాబోయే భర్తను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్‌లో చదువుతున్నప్పుడే గుర్తించారు. ఆయన పేరు వినోద్ దీక్షిత్. అతనిని ఒక తరగతిలో కలిశారు. అదికూడా తమ స్నేహితుల మధ్య నెలకున్న ప్రేమ వివాదాన్ని పరిష్కరించడం నేపథ్యంలో ఇరువురు స్నేహితులుగా మారారు. దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ మూవీ ఖుషీ సినిమాలో మాదిరిగా మొదట స్నేహితులై తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. అయితే షీలా వినోద్‌లు మాత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కన్నాట్‌కు వెళ్లే బస్ నంబర్ 10లో కలుసుకునే మాట్లాడుకునేవారు. అయితే ఇరువురి అంతరంగం వేరుగా ఉన్నా ఆలోచన తీరు ఒకేవిధంగా ఉండేది. అయితే వినోద్ ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు కాబట్టి ఐఏఎస్ ప్రవేశ పరీక్ష పూర్తి అయ్యాకే తల్లిదండ్రులను ఒప్పిస్తానని షీలాతో చెప్పారు. అయితే ఆ రోజుల్లో అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయడం జరుగుతుంది కాబట్టి షీలా పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేవారు. అయితే ఆమె కనీసం ఆయన్ని ప్యూన్ ఉద్యోగమైన సంపాదించే వరకు ఆగమని చెప్పేవారట పేరెంట్స్‌కి. ఇక వినోద్ కూడా 1959లో IAS మెరిట్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచి, ఉత్తర ప్రదేశ్ కేడర్ని ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వారి ప్రేమ పోరాటం మాములగా సాగలేదు. ఎందుకంటే వినోద్ స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ సభ్యుడు ఉమా శంకర్ దీక్షిత్ కుమారుడు. పైగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కి చెందిన ఉన్నత సనాతన కన్యాకుబ్జ్ బ్రహ్మణులలో అత్యున్నతంగా పరిగణించే దీక్షతుల కుటుంబం. అందులోనూ విపరీతమై కట్లుబాట్లు సంస్కృతి సంప్రదాయలతో పాతుకపోయిన కుటుంబం కావడంతో వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో వినోద్ తండ్రికి చూపడంతో ఆయన పెళ్లికి సుమఖం వ్యక్తం చేసినా.. తల్లి అస్సలు ఒప్పుకోలేదు. ఆమె ఆంగీకారం కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదని షీలా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన షీలా కపూర్ భర్త ఎంపికను చూసి తల్లిదండ్రులు కూడా దిగ్బ్రాంతి చెందారు. ఎందుకంటే దీక్షితుల కుటుంబానికి కోడలుగా వెళ్లడం అంత ఈజీ కాదని వాళ్లకు కూడా తెలుసు. అందువల్లే ఆమె తల్లిదండ్రులు అసలు షీలా పెళ్లి అవుతుందా అనే దిగులుతో ఉండిపోయారు. అయితే ఆ ఉత్కంఠకు తెరదించేలా షీలా అత్తగారు ఒప్పుకోవడంతో జూలై 11, 1962న షీలా వినోద్‌ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. అలా ఆమె గొప్ప ప్రేమికురాలిగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూసి తన ప్రేమను ఫలవంతం చేసుకున్నారు. అలాగే సుదీర్ఘకాలం దేశ రాజధానికి సీఎంగా బాధ్యతలు చేపట్టి అత్యంత బలమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు షీలా.(చదవండి: ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్ టిప్స్..! ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి....) -
షీలా లేని లోటు.. ఢిల్లీ కాంగ్రెస్‌కు గడ్డుకాలం?
సుదీర్ఘకాలం పాటు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ సారధ్యం లేకుండా తొలిసారిగా ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. 2019 జూలై 20న షీలా దీక్షిత్ కన్నుమూశారు. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఢిల్లీలో కాంగ్రెస్ ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. షీలా దీక్షిత్ కన్నుమూయడం, పార్టీ సీనియర్ నేతల్లో చాలామందికి వయసు మీద పడటంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ భుజస్కంధాలపై పడింది. ఢిల్లీలోని మూడు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల గెలుపు బాధ్యత లవ్లీపైననే ఉంది. దీనితోపాటు ఇండియా కూటమిలోని నాలుగు సీట్ల విషయంలో అతను ‘ఆప్’కు సహకరించాల్సి ఉంటుంది. 1984 నవంబర్ నాటి అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ దోషిగా తేలడంతో జైలులో ఉన్నారు. ఇదే కేసులో మరో నేత జగదీష్ టైట్లర్ దశాబ్దన్నర కాలంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుభాష్ చోప్రాతో పాటు షీలా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతలలోని పలువురు వృద్ధాప్య దశకు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని రాబోయే ఎన్నికల్లో ముందుకు నడిపించే బాధ్యత లవ్లీపైనే ఉంది. గతంలో ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి లవ్లీ పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో లవ్లీ తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ కూడా ఎన్నికల బాధ్యతలు చేపట్టి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ 1999 లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తూ వచ్చింది. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆమె భారీ విజయాన్ని అందించారు. 2014లో ఆమె కేరళ గవర్నర్‌గా ఉన్నందున ఆమె నేరుగా లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేకపోయారు. అయితే ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా షీలా 2019 లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. షీలాతో సహా కాంగ్రెస్ అభ్యర్థులంతా ఓడిపోయినా, షీలా నాయకత్వంలో పార్టీకి జవసత్వాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది. ఐదు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు 2014 ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. -
కొత్త ఇంటికి మారబోతున్న రాహుల్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్నేయ ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలో తన నివాసం, కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నివాసం, కార్యాలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయని తెలిపాయి. మోదీ ఇంటి పేరుకు సంబంధించిన పరువు నష్టం వ్యాఖ్యల కేసులో జైలు శిక్ష పడడం, తద్వారా లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడంతో ఆయన అప్పటి వరకూ నివసిస్తున్న 12, తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ ప్రస్తుతం తన తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10, జన్‌పథ్‌లో ఉంటున్నారు. అయితే అక్కడి నుంచి మరో చోటుకు మారాలని భావిస్తున్న రాహుల్.. తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలోని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ నివాసాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. షీలాదీక్షిత్ మరణానంతరం ఆ ఇంట్లో నివసించిన ఆమె తనయుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ అక్కడికి దగ్గరిలోనే సమీప బంధువుల ఇంటికి మారడంతో అది ఖాళీగా ఉంది. చదవండి: ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు -
ఢిల్లీ కాంగ్రెస్‌లో కల్లోలం.. పార్టీ ఇన్ఛార్జ్ రిజైన్
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చుకు కారణమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, సీనియర్ నేత అయిన చాకో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం మొదలయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుందన్నారు. పోయిన ఓటు బ్యాంకు తిరిగి పార్టీకి రాలేదని, ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆప్‌తో ఉందని ఆయన పేర్కొన్నారు. పీసీ వ్యాఖ్యలపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర చాకో వ్యాఖ్యలతో విభేదించారు. నిజానికి షీలా అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగిందని మిలింద్ దేవర అభిప్రాయపడ్డారు. (ఆమ్ ఆద్మీ అందగాడు గెలిచేశాడు..!) ఆమె మరణాంతరం ఢిల్లీలో పార్టీ ఓటమికి షీలాను నిందించడం సరికాదన్నారు. ఆమె పార్టీకి, ఢిల్లీ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. కాగామొత్తం 70 స్థానాలకు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలు చేపట్టగా.. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ 2015 మాదిరిగానే ఖాతా తెరవలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. (హస్తిన తీర్పు : ఆప్ 62.. బీజేపీ 8) -
షీలా దీక్షిత్‌కు ప్రధాని మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లొ ఆమె నివాసానికి వెళ్లి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం షీలా కుటుంబ సభ్యులను ప్రధాని ఓదార్చారు. షీలా దీక్షిత్ భౌతిక దేహానికి నివాళులర్పింపిన వారిలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింథియా తదితరులు ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా షీలాదీక్షిత్ మృతికి నివాళిగా ఢిల్లీ ప్రభుత్వం రెండ్రోజుల సంతాప దినాలు ప్రకటించింది. -
షీలా దీక్షిత్ మృతిపై సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆమె మరణ వార్త తనను ఎంతో బాధపెట్టిందన్నారు. భారత దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా షీలా దీక్షిత్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. -
‘ఆమె కాంగ్రెస్ పార్టీ ముద్దుల కూతురు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతి తమకు ఎంతో బాధను కలిగిందని ట్విట్ చేశారు. ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఢిల్లీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. 'కాంగ్రెస్ పార్టీ ముద్దుల కూతురు షీలా దీక్షిత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. I’m devastated to hear about the passing away of Sheila Dikshit Ji, a beloved daughter of the Congress Party, with whom I shared a close personal bond. My condolences to her family & the citizens of Delhi, whom she served selflessly as a 3 term CM, in this time of great grief. — Rahul Gandhi (@RahulGandhi) July 20, 2019 ఢిల్లీ అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి షీలా దీక్షిత్ విశేష కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఆమె మరణ వార్త తనను ఎంతో బాధించిందని ట్విట్ చేశారు. షీలా దీక్షిత్ మృతి దేశానికి తీరని లోటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. Deeply saddened by the demise of Sheila Dikshit Ji. Blessed with a warm and affable personality, she made a noteworthy contribution to Delhi’s development. Condolences to her family and supporters. Om Shanti. pic.twitter.com/jERrvJlQ4X — Narendra Modi (@narendramodi) July 20, 2019 ఆమె మృతి దేశానికి తీరని లోటు : మన్మోహన్ షీలా దీక్షిత్ మృతి దేశానికి తీరని లోటని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. ఆమె మరణవార్త తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రిగా ఆమె అందించిన సేవలను ఢిల్లీ ప్రజలు ఎప్పుడూ మరచిపోరని తెలిపారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్.. ఢిల్లీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. (చదవండి : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత) -
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(81) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్ పని చేశారు. 1998 నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2014 మార్చి నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా సేవలు అందించారు. సార్వత్రిక ఎన్నికల ముందే ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన షీలా దీక్షిత్.. ఈశాన్య ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి చేతిలో ఓడిపోయారు. షీలా దీక్షిత్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. -
డ్యాన్సులకే పనికివస్తారు; అవమానకరం!
న్యూఢిల్లీ : తనను కించపరచడం ద్వారా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పూర్వాంచల్ ప్రజలందరినీ అవమానించారని బీజేపీ నాయకుడు మనోజ్ తివారీ ఆరోపించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మనోజ్ తివారీ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను బరిలోకి దించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ దిలీప్ పాండేను నిలబెట్టింది. ఈ నేపథ్యంలో దిలీప్ పాండేకు మద్దతుగా సీఎం కేజ్రీవాల్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మనోజ్ తివారీ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘ మనోజ్ తివారీకి కేవలం డ్యాన్స్ ఎలా చేయాలో మాత్రమే తెలుసు. కానీ పాండేజీకి డ్యాన్స్ చేయడం తెలియక పోయినా ప్రజల కోసం పనిచేసే గుణం మాత్రం ఉంది. అందుకే ఈసారి డ్యాన్స్ చేసే వాళ్లకు కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారికే ఓటేయాలి. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. అభివృద్ధి చేసేవారిని మాత్రమే గెలిపించాలి. నాచ్నేవాలాకు కాదు’ అని మనోజ్ తివారీపై విమర్శలు గుప్పించారు. కాగా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన మనోజ్ తివారీ... తనను కించపరచడం ద్వారా పూర్వాంచల్ ప్రజలందరినీ కేజ్రీవాల్ అవమానించారని పేర్కొన్నారు. ఇందుకు ఆయన భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా భోజ్‌పురిలో మంచి నటుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందిన మనోజ్ తివారీ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 12న ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. -
ఆమె పనిచేసుంటే ‘ఆప్’ పుట్టేది కాదు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఢిల్లీలో సరైన పాలన అందించుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టేది కాదన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని రోహిణిలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ఈ పరిస్థితుల్లో షీలా దీక్షిత్ ఉన్నా మంచి పాలనే అందించేవారని కొందరు విమర్శిస్తున్నారు. ఆమె ఢిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో విద్య, ఆరోగ్యం లాంటి కీలకాంశాలను నిర్లక్ష్యం చేశారు. మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించలేదు. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో ఆమె ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అందుకే తాను ఆప్ లాంటి కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 70 సంత్సరాలు అధికారంలో ఉంది. ఆ పార్టీ మంచి పాలన అందించుంటే మా పార్టీ అసలు ఉనికిలోనే ఉండేది కాద’ని కేజ్రీవాల్ అన్నారు. షీలా దీక్షిత్ 1998 నుంచి 2003 వరకు జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు గెలిచి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మోదీ సర్కార్‌ను తూర్పారపట్టిన కేజ్రీవాల్.. ఢిల్లీలో తాము నూతనంగా స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు నిర్మించాలనుకున్నప్పటికీ, కేంద్రం ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతూనే ఉందని, సీసీ కెమెరాల బిగింపునకు సంబంధించిన ఫైల్‌ను గత మూడేళ్లుగా ఆమోదించకుండా మోదీ ప్రభుత్వం మోకాలడ్డేస్తోందని దుమ్మెత్తిపోశారు. ‘మేం ఏ పని చేసినా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అదే దేశంలోని మిగతా రాష్ట్రాల విషయంలో ఇవేవీ అవసరం లేదు. వారికా స్వేచ్ఛ ఉంది. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే అలాంటి (బీజేపీ) పార్టీకి ఓటేస్తే, వచ్చే ఐదేళ్లపాటు మళ్లీ అభివృద్ధిని జరగనివ్వరు. కాబట్టి ఆప్‌కు ఓటేయాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చడం లేదని తెలిసింది. కేవలం జాతీయ సమస్యల మీదే తమ ప్రచారం కొనసాగుతుందని, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా అంశాన్ని తాము ఎన్నికల ప్రచారంలో లేవనెత్తబోవడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ మీడియాకు తెలిపారు. -
వివాదాస్పదమైన టైట్లర్ హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్ బాధ్యతలు స్వీకరించిన వేడుకకు ఆ పార్టీ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ హాజరు కావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల సాక్షులను బెదిరించేందుకే టైట్లర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిందని శిరోమణి అకాళీదళ్ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంచిన జగదీశ్ టైట్లర్‌ను షీలా దీక్షిత్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించి ఆయనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని సిర్సా తీవ్రంగా విమర్శించారు. ‘‘1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో సాక్షులను జగదీశ్ టైట్లర్ భయపెట్టారన్న సంగతి బహిరంగ రహస్యమే. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఈ అల్లర్లకు సంబంధించి జగదీశ్ టైట్లర్ తోపాటుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కూడా జైలు శిక్ష పడుతుంది. సిక్కు అల్లర్ల కేసులో సాక్షులను బెదిరించేందుకు, టైట్లర్‌కు అధిష్టానం మద్దతు మెండుగా ఉందన్న సందేశాన్ని తెలియచెప్పేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించింది’’అని ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బుధవారం బాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు కరణ్‌సింగ్, జనార్దన్ ద్వివేది, మీరా కుమార్, పీసీ చాకో, సందీప్ దీక్షిత్, అజయ్ మాకెన్‌తో పాటుగా పార్టీ ఇతర ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. అయితే జగదీశ్ టైట్లర్‌ను ఆహ్వానించడాన్ని షీలా దీక్షిత్ సమర్థించుకున్నారు. ‘ఆయన ఎందుకు రాకూడదు? ఆయనను ఇక్కడ మేము గౌరవించుకున్నామ’ని ఆమె వ్యాఖ్యానించారు. ఇందిర నుంచి రాహుల్ గాంధీ వరకు టైట్లర్ వారికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారని కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. దీన్ని బట్టే సిక్కుల పట్ల కాంగ్రెస్ వైఖరి అర్థమవుతుందన్నారు. -
మహిళల పట్ల రాహుల్‌కూ చిన్న చూపే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఈసారి రాష్ట్ర అసెంబ్లీలో, అలాగే క్యాబినెట్లో ఎక్కువ మంది మహిళలను చూడదల్చుకున్నాను’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఫిబ్రవరి 24వ తేదీన బెంగళూరులోని బీఎల్డీ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగిన మహిళా శక్తి సమ్మేళనంలో వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పరమేశ్వరల వైపు తిరిగి ఈసారి ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడంటూ సభా ముఖంగానే వారిని ఆదేశించారు. చివరకు కర్ణాటక అసెంబ్లీలో 244 సీట్లకుగాను 15 మంది మహిళలకు మాత్రమే పార్టీ టిక్కెట్లు లభించాయి. దాదాపు ఐదు నెలల అనంతరం రాహుల్ గాంధీ జూలై 17వ తేదీన 51 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాను విడుదల చేశారు. వారిలో 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 10 మంది ప్రత్యేక ఆహ్మానితులు ఉన్నారు. మొత్తం 51 శాతం సభ్యుల్లో ఏడుగురంటే ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మహిళలకు 13.7 శాతం ప్రాతినిధ్యం లభించింది. ఆ ఏడుగురు మహిళల్లో కూడా నలుగురు శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ఆహ్వానితులను తీసివేస్తే మొత్తం 23 మంది సీడబ్ల్యూసీ సభ్యులో ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు. వారు ఎవరంటే సోనియా గాంధీ, అంబికా సోని, కుమారి సెల్జా. ఈ రకంగా చూస్తే మహిళలకు 13 శాతమే ప్రాతినిధ్యం లభించినట్లు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, రజనీ పాటిల్, ఆశా కుమారిలను శాశ్వత ఆహ్వానితులుగా తీసుకోగా అఖిల భారత మహిళా కాంగ్రస్ అధ్యక్షురాలు సుశ్మితా దేవ్‌ను ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. అంతకు 72 గంటల ముందే రాహుల్ గాంధీ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు సత్వర ఆమోదానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇక్కడ గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వలేక పోయామని సమర్థించుకున్నారు. మరి పార్టీ విషయంలో ప్రాతినిధ్యం కల్పించక పోవడాన్ని రాహుల్ గాంధీ ఎలా సమర్థించుకుంటారు? -
‘నేను చెప్పింది చేస్తే కాంగ్రెస్ మళ్లీ కళకళ’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హితోపదేశం చేశారు. రాహుల్ కూడా సోనియా గాంధీ అంతటి ఓపికను తెచ్చుకోవాలని, కొన్ని ప్రజలకు అనుకూలమైన విధానాలు నేర్చుకోవాలని అన్నారు. పార్టీ కార్యాలయంలో సోనియా రోజుకు రెండు నుంచి మూడు గంటలు గడిపి పరిస్థితులపై అంచనాలు వేసేవారని, రాహుల్ కూడా అలాంటి నడవడిక నేర్చుకుంటే మంచిదని సూచించారు. పార్టీ నాయకులు వెంట ఉండాలంటే మరిన్ని నాయకత్వ లక్షణాలు రాహుల్ అలవర్చుకోవాలని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె ‘రాహుల్‌గాంధీ మరింత చేరువయ్యేలా ఉండాలి’ అని ఆమె అన్నారు. తల్లి సోనియా మాదిరిగానే రాహుల్ కూడా పార్టీ కార్యాలయంలో రెండు మూడు గంటలు గడిపి పార్టీ నేతలతో మమేకవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాను చెప్పిన సలహాను పాటిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మళ్లీ కళకళలాడుతాయని చెప్పారు. ఇదే మానియా అన్ని పార్టీల కార్యాలయాల్లో చోటుచేసుకుంటుందని అన్నారు. అయితే, రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, అయితే, అవి ఆకట్టుకునేలా సమపాల్లలో తగినంత లేవని చెప్పారు. -
2019లో ప్రధాని మోదీకి సవాల్ తప్పదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రావడం ప్రస్తుతానికి కష్టమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సవాల్ తప్పదని అన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని షీలా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం ఎంతో అవసరమని, పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలది తిరుగులేని నాయకత్వమని అన్నారు. గాంధీ కుటుంబం కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని పాలించిందని చెప్పారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరడంపై ఆమె స్పందిస్తూ.. తాను ఎప్పటికీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని, మరో జన్మలోనూ సిద్ధాంతపరంగా తాము విభేదిస్తామని స్పష్టం చేశారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఓ కూటమిగా ఏర్పడాలని షీలా దీక్షిత్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీల మధ్య అవగాహన కుదరాలని, కూటమి ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మోదీ స్థాయి గల నాయకుడు ఉన్నారా అన్న ప్రశ్నకు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అద్భుతంగా పనిచేశారని, సమయం వచ్చినపుడు మోదీని ఎదుర్కొనే నాయకుడిని ప్రకటిస్తామని షీలా చెప్పారు. -
కాంగ్రెస్ పార్టీకి ఆమె ఓ గుదిబండ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఓ గుదిబండ అని బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ మాలిక్‌తో కలిసి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి షీలా దీక్షిత్ పూర్తిగా పక్కకు తప్పుకొని కాంగ్రెస్‌కు భారంగా మారారు. నేను సైనికుల అభీష్టాలకు అనుగుణంగా పనిచేస్తున్న బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నాను. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ఆయన సుభిక్షంగా ఉండేందుకు ప్రాముఖ్యతనిస్తారు. కష్టపడేందుకు అస్సలు ఇష్టపడరు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మురిగి వాడల్లో రాత్రంతా గడుపుతున్నారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకెన్ మాత్రం లోది గార్గెన్‌లో ప్రచారం చేసి వెంటనే ఇంటికి వెళ్లిపోతున్నారు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకుంటే మంచింది. బీజేపీ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. నరేంద్రమోదీ, అమిత్ షా నాయకత్వంలో రాజకీయాలకు కొత్త నిర్వచనం చెబుతోంది’ అని ఆయన అన్నారు. -
'యూపీలో మా అమ్మను అవమానించారు'
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోయింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించగా, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. గోవా, మణిపూర్ లలో కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమికి అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. యూపీలో దారుణ వైఫల్యంపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదిక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలంగా బాధ్యత వహించాలన్నారు. యూపీలో షీలాదీక్షిత్‌ను అవమానించారని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వల్లే యూపీలో పార్టీ దారుణ ఓటమి చవిచూసిందని సందీప్ దీక్షిత్ ఆరోపించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా మొదటగా షీలాదీక్షిత్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సమాద్ వాదీ పార్టీతో కాంగ్రెస్ జతకట్టడంతో వారి అంచనాలు తారుమారయ్యాయి. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలకు గానూ బీజేపీ 322 సీట్లు, ఎస్పీ కూటమి 53 స్థానాలు, బీఎస్పీ 19, ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. మరో నాలుగు స్థానాల ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు. ఓటమి అనంతరం అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.. 'ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాను. విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు. కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశిస్తున్నానని' అఖిలేశ్ అన్నారు. -
రాహుల్‌పై మాజీ సీఎం ఇబ్బందికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పడేశాయి. షీలా దీక్షిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాహుల్ ఇంకా పరిణతి చెందలేదని, మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ కూటమి.. బీజేపీతో హోరాహోరీగా పోరాడుతుండటం, రాహుల్-యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ కలసి ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటున్న సమయంలో షీలా ఇలా మాట్లాడటం ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టయ్యింది. బీజేపీ నాయకులు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా రాహుల్‌ను విమర్శిస్తుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ వ్యాఖ్యలను ఓ ర్యాలీలో ప్రస్తావించారు. షీలా దీక్షిత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ నాయకులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. రాహుల్ నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని వీడిన రీటా బహుగుణతో పాటు జయంతి నటరాజన్ తదితర సీనియర్ నేతలు రాహుల్‌పై నేరుగా విమర్శలు చేస్తున్నారు. -
‘అందుకే సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకున్నా’
న్యూఢిల్లీ: మిగతా పార్టీకంటే ముందుగా, ఆరు నెలల కిందటే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఘనవిజయానికి ప్రధాన కారకుడైన ‘వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను యూపీ సీఎం అభ్యర్తిగా నిలబెట్టారు. ఆమె ముఖచిత్రంతో రూపొందించిన భారీగా పోస్టర్లతో కొన్నాళ్లు ప్రచారం కూడా నిర్వహించారు. తీరా ఎన్నికలు సమీపించేనాటికి ఆమె పత్తాలేకుండాపోయారు. అటు ప్రశాంత్ కిషోర్కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోయారు. కొన్ని గంటల కిందటే సీఎం అభ్యర్థిత్వాన్ని అధికారికంగా వదులుకున్న షీలా కాసేపు మీడియాతో మాట్లాడారు.. ‘కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఎన్నికల పొత్తుపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నప్పుడే నేనొక మాట చెప్పా.. ఒక్క రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండరని! ఇప్పుడు పొత్తు ఖరారైంది. కాబట్టి నేను బరిలో ఉండను. యువతరానికి బాధ్యతలు అప్పగించేందుకే నేను సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకున్నా. దేశానికి రాహుల్, అఖిలేశ్ లాంటి యువ నాయకుల అవసరం చాలాఉంది. పార్టీ నిర్ణయంమే నాకు శిరోధార్యం. మనం నిర్ణయాలు తీసుకుంటాం, అవి నచ్చితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, లేదంటే తిరస్కరిస్తారని మా యువనేత రాహుల్ గాంధీ నాతో అన్నారు. ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. సీఎం అభ్యర్థిగా నేను తప్పుకోవడం సరైందా? కదా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారు’ అని వివరించారు షీలా దీక్షిత్. ఇక అఖిలేశ్- ములాయం- శివపాల్ యాదవ్‌ల కలహాల గురించి స్పందిస్తూ.. అవి సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత వ్యవహారాలని, వాటిపై తాను వ్యాఖ్యానించబోనని షీలా దీక్షిత్ అన్నారు. ప్రశాంత్ కిషోర్లాగే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ వ్యవహారాలకు దూరంగా ఉంటోన్న ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? అన్న ప్రశ్నకుమాత్రం సూటిగా బదులు చెప్పలేదు. పార్టీ ఆదేశిస్తే ప్రచారంలో పాల్గొంటానని క్లుప్తంగా అన్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో పొత్తులో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ 298స్థానాల్లోనూ, కాంగ్రెస్ 105 స్థానాల్లోనూ పోటీచేస్తున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4వరకు యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
నేను సీఎం అభ్యర్థిగా తప్పుకుంటా!
లక్నో: సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని ఆ పార్టీ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్-ఎస్పీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే.. పార్టీ సీఎం అభ్యర్థిగా తాను తప్పుకొనేందుకు సిద్ధమని అన్నారు. హిందుత్వ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు లౌకికవాద భావసారూప్యమున్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్- ఎస్పీ మధ్య పొత్తు కుదుర్చుకునేందుకు ఇప్పటికే తెరవెనుక మంతనాలు కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే, అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరడంతో ఈ పొత్తు చర్చలు ఒక కొలిక్కి రాలేదని సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో పెద్దగా రాజకీయ అవకాశాలు లేని కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో పొత్తు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పొత్తు ద్వారా కనీసం వంద సీట్లైనా అడుగాలని ఆ పార్టీ కోరుకుంటోంది. -
ఆ విషయంలో మోదీకి సిగ్గెందుకు?
స్వతంత్ర విచారణకు ఎందుకు సిద్దపడటం లేదు? 'సహరా-బిర్లా' ముడుపుల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ తాజాగా రూటు మార్చారు. ఇంతకుముందు ఈ పత్రాల ప్రామాణికతను ప్రశ్నించిన ఆమె.. తాజాగా ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ముడుపుల కేసులో స్వతంత్ర విచారణకు మోదీ ఎందుకు సిగ్గుపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. నిజానికి 'సహరా డైరీల్లో' షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది. దీనిపై విలేకరులు ప్రశ్నించడంతో ఈ పత్రాల ప్రామాణికతను ఆమె కొట్టిపారేశారు. మరోవైపు ఈ పత్రాల ఆధారంగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సహరా, బిర్లా కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. యూపీ సీఎం అభ్యర్థిగా షీలాను కాంగ్రెస్ పార్టీ తొలగించే అవకాశముందని, ఆమె యూపీలో పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను కొట్టిపారేసిన షీలా.. తాజాగా సహరా, బిర్లా ముడుపుల వ్యవహారంలో ప్రధాని మోదీ స్వతంత్ర విచారణకు ఎందుకు సిద్ధపడటం లేదని ప్రశ్నించారు. -
ఇరుకున పడ్డ షీలా దీక్షిత్
-
డబ్బులు తీసుకున్నట్లు గుర్తులేదు: మాజీ సీఎం
సహారా డైరీల అంశంపై తమ సొంత పార్టీ చేసిన ట్వీట్లతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇరుకున పడ్డారు. ఎవరెవరికి ఎంతెంత చెల్లింపులు ఉన్నాయోనన్న మొత్తం జాబితా పార్టీ ట్విట్టర్లో ప్రత్యక్షమైంది. దీనిపై ఇప్పుడు మాట్లాడేందుకు తాను సిద్ధంగా లేనని షీలా అన్నారు. అసలు డబ్బులు తీసుకున్నట్లే తనకు గుర్తులేదని కూడా ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌కు వ్యతిరేకంగా తాను ఏమీ మాట్లాడేది లేదని, తన పేరును ఇందులోకి లాగొద్దని అన్నారు. అసలు ఈ వ్యవహారం గురించి తనకు ఏమీ గుర్తుకు రావడం లేదని కూడా షీలా దీక్షిత్ తెలిపారు. ''నాకు దీంతో సంబంధం లేదు. ఏ డైరీ, ఎవరి డైరీ? అందులో ఎవరు ఏం రాశారో నాకు తెలీదు'' అని వ్యాఖ్యానించారు. ''ఎవరిపేర్లు రాశారో నాకేం తెలుసు? అసలు దీని గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నా పేరును ఇందులోకి లాగొద్దు. నేను కెమెరా ముందు ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదు'' అని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సహారా గ్రూపు రూ. 40 కోట్లు ముట్టజెప్పిందని ఇంతకుముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జాబితాను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో పెట్టింది. అందులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది. ఆమెకు 2013 సెప్టెంబర్ 23వ తేదీన కోటి రూపాయలు చెల్లించినట్లు అందులో ఉంది. ప్రధానమంత్రిని ఇరుకున పెట్టబోయి తమ సొంత పార్టీ సభ్యులనే కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. చదవండి: (సహార పత్రాల్లో మోదీతోపాటు వీరి పేర్లు కూడా...) -
సహార పత్రాల్లో మోదీతోపాటు వీరి పేర్లు కూడా...
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహార గ్రూప్ నుంచి ముడుపులు తీసుకున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఇరువురి మధ్య వ్యాగ్యుద్ధం చెలరేగుతున్నప్పటికీ ఎవరు కూడా వాస్తవాలను ప్రస్తావించడం లేదు. సహార గ్రూపు పత్రాలను తవ్వి మోదీ పేరును వెలికితీసిన రాహుల్ గాంధీ మోదీతోపాటు ఆ పత్రాల్లో ఉన్న ఇతర పేర్లను ఎందుకు ప్రస్తావించడం లేదు? రాహుల్ గాంధీ మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేదంటూ వ్యంగ్యోక్తులు విసిరిన మోదీ తనపై నేరుగా చేసిన ఆరోపణలను నేరుగా ఎందుకు ఖండించడం లేదు? ఎవరెవరి పేర్లున్నాయంటే.... సహార గ్రూప్‌పై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఏ రాజకీయ పార్టీకీ, ఏ సీఎంకు ఏ రోజున ఎన్ని ముడుపులు ఇచ్చారన్న వివరాలు మొత్తం 11 పేజీల్లో ఉన్నాయి. ‘సీఎం చత్తీస్‌గఢ్’కు 2013, అక్టోబర్ 1వ తేదీన నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చామని సహార పత్రాల్లో ఎంట్రీ ఉంది. సీఎం అనే అక్షరాలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినవే అయితే అప్పుడు చత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్ సింగ్ పదవిలో ఉన్నారు. ‘సీఎం ఢిల్లీ’కి 2013, సెప్టెంబర్ 23వ తేదీన కోటి రూపాయలు ఇచ్చినట్లు ఎంట్రీ ఉంది. అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఉన్నారు. ‘సీఎం ఎంపీ’ కి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్యన పది కోట్ల రూపాయలను చెల్లించామని పత్రాల్లో ఎంట్రీ ఉంది. అది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించిన చేసిందే అయితే అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌవాన్ ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ కోశాధికారి షైనా ఎన్సీకి 2013, సెప్టెంబర్ 10 నుంచి 2014, జనవరి 28 మధ్య ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఎంట్రీ ఉంది. రాజకీయ పార్టీల పేర్లు.... ముడుపులు ఇచ్చినట్లు పేర్కొన్న సహార పత్రాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (యూ), రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ, నేషనలిష్ట్ కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్ వికాస్ మోర్చా, తణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, భారతీయ కిసాన్ యూనియన్, శివసేన, లోక్ జనశక్తి పార్టీ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్ని 2013 అక్టోబర్ నుంచి 2014 ఫిబ్రవరి మధ్యలో సహార గ్రూప్ సంస్థలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించినప్పుడే బయటపడ్డాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వీటిని వెల్లడించలేదు. ఎందుకంటే, వాటిలో కాంగ్రెస్ పార్టీ పేరు, షీలాదీక్షిత్ పేర్లు ఉండడమేనని సులభంగానే ఊహించవచ్చు. అందుకని మోదీపై వచ్చిన ఆరోపణలను రాహుల్ గాంధీ అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని ఢిల్లీ ప్రస్తుత సీఎం అరివింద్ కేజ్రివాల్ ప్రశ్నిస్తున్నారు. మోదీపై రాహుల్ చేసిన అవినీతి ఆరోపణలను ముందుగా కేజ్రివాల్ చేసినవే. ఆయన నెలరోజులగా ఈ ఆరోపణలు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ చేయడంతో ఇప్పుడు ఈ అంశం రాజకీయ దుమారం రేగుతోంది. ఐటీ అధికారుల్లో దొరికిన ఈ సహార పత్రాలు అసలువి కావచ్చు. కాకపోవచ్చు. కేవలం పత్రాల్లో పేర్లున్నంత మాత్రాన అవినీతి చేసినట్లు భావించలేమని సుప్రీం కోర్టే స్వయంగా భావించడం ఇక్కడ గమనార్హం. ఈ పత్రాలపై వచ్చే జనవరి 11వ తేదీన సుప్రీం కోర్టు తదుపరి విచారణ జరపాల్సి ఉంది. అసలు పత్రాలో, నకిలీ పత్రాలో కోర్టు నిర్ధారించాలి. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన షీలాదీక్షిత్ పేరు కూడా పత్రాల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ, మోదీ పేరును ఎలా ప్రస్తావించారన్నది ఇక్కడ ఓ ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ఇవ్వడమంటే షీలాదీక్షిత్‌కు ఇవ్వడమేనని రుజువైతే సమర్థించుకోవచ్చు. వ్యక్తిగతంగా రాహుల్‌కు వచ్చే నష్టం ఏమీలేదని, మోదీ పరువు ముందు షీలాదీక్షిత్ పరువు పోయినా ఫర్వాలేదని ఆయన భావించి ఉండవచ్చు. కోర్టు ముందు ఎలాగు కేసు నిలబడదు కనుక నిజాయితీ పరుడిగా ప్రజల్లో మోదీకున్న పేరును దెబ్బ తీయడమే అసలు లక్ష్యం కావచ్చు. -
కిషోర్-ములాయం భేటీపై షీలా ఆశ్చర్యం
న్యూఢిల్లీ: తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్... సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో భేటీ కావడం పట్ల ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఈ సమావేశం నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. ఈ భేటీ ద్వారా ప్రశాంత్ కిశోర్ ఏం చేయదలుచుకున్నారో తెలియద'ని షీలా దీక్షిత్ అన్నారు. నవంబర్ 1న ములాయంతో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. అమర్ సింగ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మహాకూటమి గురించి కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని, తామింకా నిర్ణయం తీసుకోలేదని షీలా దీక్షిత్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించగా... 'ఆయన మా పార్టీకి సలహాదారు, వ్యూహకర్త. ఆయన పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉందా, లేదా అనే విషయం సెక్రటరీలకు తెలుసు. నాకు తెలియద'ని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ పనితీరుపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన పనితీరుపై కాంగ్రెస్ వర్గాలు రెండు చీలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. -
'మేం ఒంటరిగానే బరిలోకి..'
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీతరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ చెప్పారు. ఏ ఒక్కపార్టీతో పొత్తుపెట్టుకోబోమని అన్నారు. 2017లో జరిగే ఈ ఎన్నికల్లో ఫలితాలు ప్రతి ఒక్కరని అబ్బురపరుస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పక ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, మీరు ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని షీలా చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇప్పటికే బీజేపీ, సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ వాది పార్టీల పాలనను చూశారని ఇప్పుడు వారంతా గొప్ప ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అభివృద్ధి నినాదంతో ప్రజల ముందుకెళ్లి వారి మద్దతు పొందుతామని చెప్పారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరిపాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, మతం పేరిట దాడులు పెరిగాయని ఆరోపించారు. -
పక్కా స్కెచ్ గీసిన కాంగ్రెస్ పార్టీ!
లక్నో: రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే సర్వశక్తులొడ్డుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మార్గనిర్దేశంలో ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా లక్నో నుంచి కాన్పూర్ వరకు 600 కిలోమీటర్ల బస్సుయాత్రను ప్రారంభించింది. యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ తదితర సీనియర్ నేతలు పాల్గొనే ఈ బస్సుయాత్రను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం జెండాలు ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు నరేంద్రమోదీ, నితీశ్‌కుమార్‌తో జతకట్టి.. వారికి ఎన్నికల విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్.. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో చేతలు కలిపిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా యూపీ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచార నినాదాన్ని ఖరారు చేశారు. 27 సాల్.. యూపీ బెహాల్ (27 ఏళ్లు యూపీని నాశనం చేశారు) అనే నినాదంతో హస్తం ప్రజల్లోకి వెళ్లనుంది. యూపీలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన గత 27 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని కాంగ్రెస్ ప్రచారం చేయనుంది. మోదీ నియోజకవర్గంలో సానియా మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసిపైనా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆగస్టు 2న వారణాసిలో సోనియాగాంధీ భారీ రోడ్డుషో చేపట్టే అవకాశముంది. ఇక రాహుల్‌గాంధీ వచ్చేవారం లక్నోలో 50వేల పార్టీ కార్యకర్తలతో సదస్సు నిర్వహించనున్నారు. బీజేపీకి ఉన్న వ్యవస్థీకృత కార్యకర్తల బలం వల్లే ఆ పార్టీ విజయాలు సాధిస్తున్నదని గ్రహించిన కాంగ్రెస్ తన కార్యకర్తలను కూడా వ్యవస్థీకరించుకొని..కట్టుదిట్టంగా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. -
షీలా దీక్షిత్ పై జైట్లీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడి విశ్రాంతి తీసుకుంటారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జోస్యం చెప్పారు. షీలాను ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితి తెలుస్తోందని అన్నారు. ఢిల్లీలో మోదీ రెండేళ్ల పాలనపై జరిగిన కార్యక్రమంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి మూడు సార్లు సీఎంగా పనిచేసిన షీలాదీక్షిత్ పై తనకు గౌరవం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నంత బలహీనంగా ఎప్పుడూ లేదని అన్నారు. యూపీ ఎన్నికల్లో ఆపార్టీ ఓడిపోవడం ఖాయమని దీంతో షీలా రాజకీయ విశ్రాంతి తీసుకుంటారని జైట్లీ అన్నారు. -
పాత పద్ధతులకు కాంగ్రెస్ స్వస్తి !
-
ఆమె వృద్ధురాలు.. ఆయన ఊసరవెళ్లి!
లక్నో: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి తేలికచేసి పారేశారు. ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్‌ను తన సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ యూపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆమె పేర్కొన్నారు. 'కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె వృద్ధురాలు' అని విమర్శించారు. మాయావతి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. షీలా ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు దళితుల అభివృద్ధికి చేసేందేమీ లేదని దుయ్యబట్టారు. ఇక యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాజ్ బబ్బర్ నియామకాన్ని కూడా ఆమె తోసిపుచ్చారు. తరచూ పార్టీలను మార్చే రాజ్ బబ్బర్ ఒక ఊసరవెళ్లిలాంటి వారని, ఆయనకు ఒక రాజకీయ పార్టీ మీదగానీ, రాజకీయ భావజాలంపైగానీ విశ్వాసం లేదని విమర్శించారు. -
యూపీ సీఎం అభ్యర్థిగా షీలాదీక్షిత్
ఖరారు చేసిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోం ది. అపార అనుభవమున్న నాయకురాలు షీలాదీక్షిత్‌ను సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది. వరుసగా మూడుసార్లు ఢిల్లీకి సీఎంగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన షీలా పేరును ఖరారు చేస్తూ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, మరో నాయకుడు జనార్దన్ ద్వివేదీతో కలసి గురువారమిక్కడ ప్రకటన చేశారు. యూపీలో ప్రభావం చూపగల స్థాయిలో బ్రాహ్మణులున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన షీలా అభ్యర్థిత్వం రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఏసీబీ విచారణ ఎదుర్కొం టున్న షీలాదీక్షిత్‌ను ఎలా ఎంపిక చేశారని ఆజాద్‌ను ప్రశ్నించగా... ఛత్తీస్‌గఢ్, రాజ స్థాన్, మధ్యప్రదేశ్ సీఎంలతో పాటు మహారాష్ట్రలోని చాలామంది బీజేపీ మం త్రులపై కూడా అవినీతి ఆరోపణలున్నాయన్నారు. ఒకవేళ ఆ సీఎంలు రాజీనామాకు సిద్ధపడితే... తాము కూడా షీలా పేరును వెనక్కి తీసుకొంటామన్నారు. పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన 78 ఏళ్ల షీలాదీక్షిత్ యూపీలోని కాంగ్రెస్ సీనియర్‌నేత శంకర్ దీక్షిత్ కోడలు. కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా సుదీర్ఘ కాలంపాటు ఆయన పనిచేశారు. 1984లో యూపీలోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన షీలా కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బ్రాహ్మణులకు అధిక టికెట్లు ఇచ్చి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టగలిగారు. ఈ క్రమంలో షీలా ఏ స్థాయిలో బ్రాహ్మణ ఓట్లను రాబడతారో వేచిచూడాల్సిందే. -
షీలా దీక్షిత్ కే జై కొట్టిన కాంగ్రెస్
-
షీలా దీక్షిత్ (మాజీ సీఎం)రాయని డైరీ
సమ్‌టైమ్స్.. సూచనలు ఇవ్వగలిగిన వాళ్లే సూచనల కోసం చూస్తుంటారు. సమ్‌టైమ్స్.. ఆదేశాలు ఇవ్వవలసినవాళ్లే ఆదేశాల కోసం చూస్తుంటారు. కాంగ్రెస్ ఇప్పుడు ఆదేశాలు ఇవ్వలేక, సూచనలు తీసుకోలేక సంశయస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. టైమ్ ఈజ్ రన్నింగ్ ఔట్! యు.పి. ఎన్నికలు నెలల్లోకి వచ్చిపడ్డాయి. సోనియాజీ ఏమీ మాట్లాడ్డం లేదు. ఓసారి వచ్చి వెళ్లండి షీలాజీ అన్నారు. వెళ్లాను. ‘‘ఎలా ఉన్నారు షీలాజీ’’ అని కుశలం అడిగారు. ‘‘మంచినీళ్లు తాగుతారా షీలాజీ’’ అని ఫ్రిజ్‌లోంచి వాటర్ బాటిల్ తీశారు. ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు షీలాజీ’’ అని గడప దాకా వచ్చి సాగనంపారు! ఎందుకు పిలిచారో చెప్పడం సోనియాజీ మర్చిపోయారా?! ఎందుకు రమ్మన్నారో అడగడం నేను మర్చిపోయానా?! ఇంటికి వచ్చేటప్పటికి.. నాకోసం ప్రశాంత్ కిశోర్ వరండాలో వెయిట్ చేస్తున్నాడు. ‘‘లోపల కూర్చోలేకపోయావా?’’ అన్నాను. నవ్వాడు. నా వెనుకే లోనికి వచ్చాడు. కుర్రాడు పొలిటికల్ స్ట్రాటజిస్టు. సెంటర్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మోదీని గెలిపించిందీ, స్టేట్‌లో మోదీకి వ్యతిరేకంగా నితీశ్‌కుమార్‌ని గెలిపించిందీ ఇతడేనని కాంగ్రెస్ నమ్మకం. ‘‘2019లో మా రాహుల్‌ని గెలిపిస్తావా?’’ అని ప్రశాంత్‌ని పిలిపించుకుని ఆశగా అడిగారట సోనియాజీ. ‘‘అదెలాగూ ఖాయం సోనియాజీ.. ఇప్పుడైతే యు.పి. సీయెం క్యాండిడేట్‌గా షీలాజీని నిలబెట్టండి’’ అని చెప్పాట్ట. ‘‘నేనలా చెప్పినట్టు సోనియాజీ మీతో అనలేదా షీలాజీ’’ అని అడిగాడు ప్రశాంత్. ‘‘అనలేదు. నా కన్నా బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్నారేమో’’ అన్నాను. తన స్ట్రాటజీని శంకించినట్టుగా ఫీలయ్యాడు. ‘‘కాంగ్రెస్‌తో ఇదే చికాకు. అడుగుతుంది. వింటుంది. విన్నది వదిలేస్తుంది’’ అనుకుంటూ వెళ్లిపోయాడు పొలిటికల్ స్ట్రాటజిస్టు. ఫోన్ రింగయింది. ‘‘ఓసారి రాగలరా షీలాజీ?’’. సోనియాజీ కాల్! వెళ్లాను. ‘‘కాంగ్రెస్ మళ్లీ పవర్లోకి వచ్చేవరకు.. మీరిలాగే వచ్చివెళుతుండాలి షీలాజీ’’ అన్నారు సోనియాజీ నా చెయ్యి పట్టుకుని. ‘‘అలాగే సోనియాజీ’’ అన్నాను. ‘‘ఎలా ఉన్నారు షీలాజీ’’.. కుశలం అడిగారు సోనియాజీ!! సోనియాజీ తర్వాతి ప్రశ్న నేను మంచినీళ్లు తాగడం గురించే అయి ఉంటుందని ఎదురుచూస్తున్నాను. కానీ సోనియాజీ ఫ్రిజ్ వైపే వెళ్లలేదు! ‘‘షీలాజీ.. యు.పి.కి... ’’అంటూ ఊపిరి తీసుకున్నారు సోనియాజీ. నేను ఊపిరి బిగబట్టాను. ‘‘షీలాజీ.. యూపీ క్యాంపెయిన్‌కి ప్రియాంకను పంపడం కరెక్టేనా’’ అన్నారు సోనియాజీ. ‘‘వండర్ఫుల్ సోనియాజీ.. ఆ బ్రిలియెంట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ఐడియానే కదా’’ అన్నాను. ‘‘థ్యాంక్యూ షీలాజీ’’ అన్నారు సోనియాజీ. అన్నాక, ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు షీలాజీ?’’ అంటూ పైకి లేచారు సోనియాజీ. సమ్‌టైమ్స్.. కాంగ్రెస్‌కు మనం గుర్తుచేద్దామనుకున్నది అస్సలు గుర్తుకురాదు. - మాధవ్ శింగరాజు -
సై.. అన్న షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: వచ్చేఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో షీలాదీక్షిత్ (78) ముఖ్యమంత్రి అభ్యర్థిగా తలపడనున్నారా? అందుకు షీలా తన అంగీకారాన్ని తెలిపారా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇన్నాళ్లూ ఉత్తరప్రదేశ్ లో క్రియాశీల బాధ్యతలను కాదంటూ వచ్చిన షీలా.. ఎట్టకేలకు తన అనుమతిని తెలిపినట్టు సమాచారం. పార్టీ తనను ఏమైనా చేయాలని ఆదేశిస్తే.. అందుకు తాను సిద్ధంగా ఉంటానని షీలా ఇటీవల తెలిపారు. ఉత్తరప్రదేశ్ కోడలినని చెప్పుకొంటున్న షీలాను రంగంలోకి దించితే బ్రాహ్మణుల ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు ఆపార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధిష్టానానికి సూచించారని, దీంతో అధిష్టానం ఆదేశాలను షీలాదీక్షిత్ కాదనలేకపోయారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ 2014 లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 2015 లో నితీష్ కుమార్ లకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పని చేశారు. మరోవైపు, ఇందిర మనవరాలు ప్రియాంకగాంధీ సైతం యూపీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కేవలం అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక.. ఈసారి ఎలాగైనా యూపీలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కొందరు నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. -
షీలాకు యూపీ బాధ్యతలు?
సీఎం అభ్యర్థిగా ప్రకటించే యోచనలో కాంగ్రెస్ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత షీలా దీక్షిత్‌ను ప్రకటించే అంశంపై కాంగ్రెస్ తీవ్ర సమాలోచనలు చేస్తోంది. పంజాబ్ రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా నియమించే అవకాశాలపై కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య షీలాగురువారం పార్టీ చీఫ్ సోనియాగాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలోనే కీలకమైన యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణుల్ని ఆకర్షించాలంటే సీఎం అభ్యర్థిగా ఆ వర్గానికి చెందినవారినే ప్రకటించాలని ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. షీలా పేరును హైకమాండ్‌కు ఆయనే సూచించినట్లు సమాచారం. దీంతో మూడు సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలాకు యూపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. మందిర్-మండల్ రాజకీయాల అనంతర పరిస్థితుల్లో అప్పటి వరకూ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులు బీజేపీ వైపు మళ్లారు. 2012 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో వారు బీఎస్పీకి మద్దతిచ్చారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. యూపీ మధ్య, తూర్పు ప్రాంతంలోని అనేక సీట్ల ఫలితాల్ని వీరే ప్రభావితం చేస్తున్నారు. పంజాబ్ ఇన్చార్జిగా తెరపైకి దీక్షిత్ పేరు మరోవైపు షీలాను పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమిస్తారనే వార్తలూ వినిపిం చాయి. సిక్కు అల్లర్ల ఆరోపణలతో ఇన్చార్జి కమల్‌నాథ్ తప్పుకోవడం తెలిసిందే. ఆ రాష్ట్రంతో సంబంధాలున్న షీలాను ఇన్చార్జిగా నియమిస్తే అధికారంలోకి రావడం సులభమని కాంగ్రెస్ ఆలోచన. కాగా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను యూపీలో పార్టీ అధినేతగా చేస్తారన్న వార్తలను గులాం నబీ ఆజాద్ తోసిపుచ్చారు. -
తెరపైకి షీలా దీక్షిత్ పేరు?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆమె భేటీ కావడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కమల్ నాథ్ స్థానంలో పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఆమె నియమించే అవకాశముందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మాట్లాడేందుకు షీలా దీక్షిత్ నిరాకరించారు. పంజాబ్ ఇంచార్జిగా ఉండేందుకు కమల్ నాథ్ విముఖత చూపారు. కాగా, యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్ పేర్లు ఇంతకుముందు వినిపించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెర తీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. 'ఎన్నికలకు ముందు మా వ్యూహాన్ని, అభ్యర్థిని ప్రకటిస్తాం' అని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ఇంతకుముందే తెలిపారు. -
'మోదీని నిద్రపోనివ్వను'
న్యూఢిల్లీ: ఢిల్లీలో బాలికలపై అత్యాచారాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో మోదీని ప్రశాంతంగా నిద్రపోనివ్వనని పేర్కొన్నారు. 'నేను షీలా దీక్షిత్‌ను కాను. ప్రధానిని సైతం నేను పడుకోనివ్వను. తరచూ విదేశాలకు వెళ్లే ఆయన ఎందుకు రేప్ బాధితుల కుటుంబసభ్యులను పరామర్శించడం లేదు' అని ఆయన ఆదివారం విలేకరులతో అన్నారు. ఢిల్లీలో ఇద్దరు బాలికలపై అత్యాచారాలు జరిగిన నేపథ్యంలో ఈ ఘటనలపై సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ పోలీసులను కేంద్ర ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తేవాలని, అప్పుడే హస్తినలో నేరాలను నియంత్రించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
'రేప్‌లు ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటు'
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుబట్టారు. నగరంలో యువతులపై, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని అన్నారు. ఢిల్లీలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడిపట్ల ఆమె స్పందిస్తూ.. 'ముందుగా ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. బాలికలు, యువతులపై లైంగికదాడులు జరగడమనేది ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటే. ఇప్పుడు ఢిల్లీ పాలనకు సంబంధం లేని ప్రధాని నరేంద్రమోదీని ఈ ఘటనలపట్ల బాధ్యుడిగా చేసి మాట్లాడటం మరింత విచారకరం. కేజ్రీవాలే కాదు.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా పోలీసు వ్యవస్థ వారి ఆధ్వర్యంలో ఉండనిదని తెలిసిన విషయమే. అందుకే, వెంటనే పోలీసు వ్యవస్థను ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి. వీవీఐపీలకు, రాయబారులకు ముందస్తు భద్రతకు, ఢిల్లీలో శాంతి భద్రతలకు ప్రత్యేక పోలీసు దళం తప్పక అవసరం' అని ఆమె చెప్పారు. -
మాజీ సీఎం షీలాదీక్షిత్ పై FIR
-
ఢిల్లీ ఏసీబీ చేతికి 'సీఎన్ జీ' స్కాం కేసు
న్యూఢిల్లీ: ఢిల్లీ అవినీతి నిరోధకశాఖ సీఎన్జీ కుంభకోణం కేసుని రీ ఓపెన్ చేసింది. 2002లో సీఎన్జీ గ్యాస్ సిలిండర్ల వ్యవహారంలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని 2012లో న్యూఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో ఏసీబీ శాఖ కేసు నమోదుచేసింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సహా ఆమె ప్రభుత్వంలో పనిచేసిన కొందరు మంత్రులు, అధికారులుల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 49 రోజుల ప్రభుత్వ పాలన ముగిసిన అనంతరం.. తాను ఈ కేసుకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను, ఇతరత్రా పత్రాలను దర్యాప్తు నిమిత్తం సమర్పించాలని ఏసీబీ అధికారులు కోరారని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఈ కేసు విచారణలో జాప్యం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఆప్ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. -
'రాహుల్ నాయకత్వంపై క్వశ్చన్ మార్క్'
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుండగా ఆయన నాయకత్వంపై సీనియర్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ నాయకత్వ లక్షణాలపై అనుమానాలున్నాయని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేర్కొన్నారు. సోనియా గాంధీ నాయకత్వమే కొనసాగాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. సోనియా నేతృత్వమే పార్టీకి శ్రీరామరక్ష అని, ఆమె నాయకత్వంలో పార్టీ విజయవంతమైందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరీక్షించలేదని అలాటప్పుడు ఆయన విజయవంతం అవుతారని ఎలా చెప్పగలమని అన్నారు. సోనియా నాయకత్వాన్ని ఎవరూ విమర్శించడం లేదని, ఆమె నాయకత్వంపై అందరికీ పూర్తి నమ్మకం ఉంది. రాహుల్ నాయకత్వంపై క్వశ్చన్ మార్క్ పెట్టక తప్పదని, ఎందుకంటే ఆయన పూర్తిస్థాయిలో పరీక్ష ఎదుర్కొలేదని షీలా దీక్షిత్ అన్నారు. అయితే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తాను మాట్లాడడం లేదని ఆమె వివరణయిచ్చారు. -
కాంగ్రెస్‌లో నిఖార్సయిన నాయకుడు లేడు
సందీప్ దీక్షిత్ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: తమ పార్టీలో నిఖార్సయిన నాయకుడు లేడని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ పార్టీలోని సంస్కృతి నాయకుల్లో అహంకారాన్ని పెంచుతోందన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో సగం మంది నాయకులు చచ్చిపోయిన చెక్కల వంటివారు. ఇంకా ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్‌లో 70 శాతంమందిదీ ఇదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి మావంటి వాళ్లకు భరింపనలవికాకుండా ఉంది. కొత్త నాయకులను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అన్నారు. కాగా తన తల్లి షీలాదీక్షిత్‌పై అజయ్‌మాకెన్, పీసీ చాకో వంటి నాయకులు గురువారం తీవ్రస్థాయిలో మాట్లాడిన నేపథ్యంలో శుక్రవారం సందీప్ పైవిధంగా స్పందించారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటూ ఎద్దేవా చేశారు. ‘కొత్త వారిని పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే వారు ఎన్నికల ద్వారా రారు. ఎంపికల ద్వారానే వస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త అంశాలను తీసుకొస్తారు. ఇటువంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్రమోదీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు.’ అని అన్నారు. సుపరిపాలన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2013 నాటి తీర్పు కొనసాగింపు షీలాదీక్షిత్‌పై మాకెన్ వ్యంగ్యాస్త్రాలు న్యూఢిల్లీ: ఎన్నికల పరాజయం కాంగ్రెస్‌లో రేపిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనపై గురువారం చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకుడు అజయ్ మాకెన్ ఇంకా మరిచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో షీలాపై మళ్లీ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2013 నాటి విధానసభ ఎన్నికల్లో వచ్చిన తీర్పే పునరావృతమైందన్నారు. ‘నేను వ్యక్తిగతంగా వెళ్లి ఆమెను కలుస్తా. ఎక్కడ తప్పు జరిగిందో తెలియజేయమని అడుగుతా. మున్ముందు అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతా’ అని అన్నారు. -
సోనియా గాంధీ అసహనం!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో అలజడి తలెత్తడంతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్-కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ల మధ్య చోటు చేసుకున్న అంశం కాస్తా తారాస్థాయికి చేరడంతో సోనియా జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జి పీసీ చాకో పార్టీ ఓటమిపై నివేదిక సమర్పించిన సమయంలో సోనియా గాంధీ ఆ విషయాలను అడిగి తెలుసుకున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం పార్టీకి మంచి కాదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆ జగడాన్ని ఆపాలని ఆమె గట్టిగా హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రధసారథి అజయ్ మాకెన్ బాధ్యతలను షీలా తప్పుబట్టడంతో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించడమే కాకుండా అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో చాకో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. దీంతో నేతల మధ్య చోటు చేసుకున్న విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయని గ్రహించిన సోనియా గాంధీ ఆ వార్ కు ఇక్కడతో పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. -
ఓటమిపై కాంగ్రెస్‌లో ‘వార్’ షురూ
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంతో కాంగ్రెస్ పార్టీలో మాటల యుద్ధం మొదలైంది. ఓటమిపై ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అజయ్ మాకెన్ నాయకత్వంపై మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గురువారం విమర్శల వర్షం కురిపించగా, ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో ఎదురుదాడి చేశారు. కాగా, షీలా మాట్లాడుతూ, మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అంతా తానే చేయగలననే భావనలో మాకెన్ ఉండిపోయి నాయకులను విస్మరించారని, అలాగే కార్యకర్తలను ఉత్తేజితులను చేయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు పేర్కొన్నారు. అతని ప్రవర్తన కాంగ్రెస్‌కు కొంచెం కూడా తోడ్పడలేదని విమర్శించారు. చివరి నిమిషంలో మాకెన్‌ను సీఎం అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చి తప్పుచేశారని చెప్పారు. గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలను ప్రచారం చేయడంలో అతను ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అవి తన విజయాలు కాదని, కాంగ్రెస్ విజయాలు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో తన పేరును ఉపయోగించినట్లయితే పార్టీకి మంచి తోడ్పాటునందించి ఉండేదని చెప్పారు. ఢిల్లీలో పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. దుర్భర పరిస్థితిలో ఉన్న పార్టీకి పునరుత్తేజం కల్పించడంపై త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలసి మాట్లాడతానని తెలిపారు. అధినాయకత్వం ఆదేశిస్తే పార్టీ పునరుత్తేజ బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు. ఇదిలా ఉండగా షీలా వ్యాఖ్యలపై పీసీ చాకో ఎదురుదాడి చేశారు. షీలా అభిప్రాయాలను పార్టీ ఆమోదించబోదని, ఆమె నోరు మూసుకుని ఉండటం ఉత్తమమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాకెన్ మద్దతుదారుడైన డీపీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ కూడా షీలా వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సలహాలు ఇవ్వడం వల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు. దీక్షిత్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు-చాకో షీలా దీక్షిత్ ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పీసీ చాకో అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దని ఆయన కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీక్షిత్ ఆ విధంగా వ్యాఖ్యానించడం బాగోలేదు. పార్టీ విజ్ఞిప్తి మేరకు మాకెన్ ప్రచార నాయకత్వం స్వీకరించారు. అలాగే పార్టీ కోరితేనే ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు. తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి పార్టీ గెలుపు కోసం మాకెన్ శ్రమించారన్నారు. మాకెన్, లవ్లీతో కలిసి బుధవారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. ఆ సమావేశంలో పార్టీ ఓటమిపై రాహుల్‌తో చర్చించామన్నారు. అలాగే లవ్లీ మాట్లాడుతూ, ‘ఆమె సలహాలు ఇవ్వాలనుకుంటే ఎన్నికల ముందే ఇచ్చి ఉండాల్సింది. ఆమె మాకంటే సీనియర్ నాయకురాలు. మేము ఆమెను చాలా గౌరవిస్తాం. ఆమె మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు, లేకుంటే పార్టీ అధినాయకత్వానికి అయినా తెలియజేయవచ్చు’ అని లవ్లీ వ్యాఖ్యానించారు. కాగా, బ్లాక్ స్థాయి నుంచి జిల్లా కమిటీలను ఎన్నికల ముందు నియమించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై లవ్లీ స్పందించారు. ‘మేము ఆ కమిటీలను తిరగి నియమిస్తాం. వాటిని తప్పనిసరిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మాకు కింది స్థాయి నుంచి బలమైన సంబంధాలు ఉన్నాయి’ అని తెలిపారు. కాగా, దీక్షిత్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 24 శాతం ఓట్లు సాధించామని, కానీ ఈసారి తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ మద్దతును ఉపయోగించుకుని కింది స్థాయి నుంచి పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. -
హస్తిన పైనే అందరి కన్నూ
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. పోటాపోటీగా సాగనున్న ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు సరితూగే కిరణ్‌బేడీని రంగంలోకి దించి ఆమ్ఆద్మీనే కాక, కాంగ్రెస్‌ను కూడా బీజేపీ ఖంగు తినిపించింది. మోదీ పట్ల ప్రజలు అసంతృప్తితో లేరు. అలా అని సంతోషంగానూ లేరు. స్టాక్ మార్కెట్లను, కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరిస్తే చాలదు. ప్రజలను కూడా తృప్తి పరచాలి. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారితే బీజేపీ దేశవ్యాప్తంగా కుప్పకూలుతుంది. అమెరికా, ఇంగ్లండ్, రష్యా లేదా ఫ్రాన్స్ దేశాల రాజధాని నగరాల మేయర్లు ఎవరో ఎవరూ పట్టించుకోక పోవడం విచిత్రం. అంతదాకా ఎందుకు, హైదరాబాద్ లేదా ముంబై మేయర్ ఎవరో గుర్తుందా? ఆ నగరాలలో చాలావాటికంటే ఢిల్లీ చిన్నది. కానీ ఆ ఎన్నికలే రాజకీయవేత్తలందరికీ అతి కీలకమైనవి. మీడియా సైతం మిగతా రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇచ్చే దాని కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఢిల్లీకి ఇస్తుంది. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత 2013లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ, ఆ పార్టీని నిర్ణయాత్మకంగా ఓడించింది. దాని ఓటు బ్యాంకులన్నిటినీ కొల్లగొట్టింది. ఢిల్లీ శాసనసభ 70 స్థానాల్లో బీజేపీ 31, ఆప్ 28, గెలుచుకోగా, కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితమైంది. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ సైతం ఓటమిపాలై, ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 స్థానాలను భారీ ఆధిక్యతతో గెలుచుకుంది. కానీ రాష్ట్ర స్థాయి ఎన్నికలు అందుకు భిన్నమైనవి. హఠాత్తుగా కేజ్రీవాల్ బాగానే గడబిడ చేస్తున్నారు. కాంగ్రెస్ సైతం తిరిగి పూర్వప్రాభవం గురించి కలలు కంటోంది. షీలా దీక్షిత్‌ను పక్కకు తప్పించి అజయ్ మాకెన్‌ను ప్రచార సారథిని చేసింది. పార్లమెంటు ఎన్నికల తదుపరి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. ఢిల్లీలో ఓడిపోతే, ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. పార్టీ వృద్ధిని నిరోధిస్తుంది. ఏది ఏమైనా బీజేపీని నిలువరిం చాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ వంటి బీజేపీ మిత్రపక్షాలు సైతం అది ఓడిపోతేనే అదుపులో ఉంటుందని సంతోషిస్తాయి. నిజానికి రిటైరయిన బీజేపీ సీనియర్ నాయకత్వం ఢిల్లీలో ఓడిపోవాలనే కోరుకుంటుంది. ఇక కాంగ్రెస్ 2013లో దక్కించుకున్న 8 సీట్ల కంటే మెరుగ్గా రాణించాలి. అప్పుడే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు కాగలుగుతారు. మోదీ విజయాలు, నాయకత్వ శైలి గాంధీ కుటుంబంలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. జైల్లో ఉండాల్సింది పోయి ఆయన ప్రధాని అయ్యారు. అవమానానికి లేదా నిర్లక్ష్యానికి గురికావడానికి గాంధీ కుటుంబం అలవాటు పడినది కాదు. అందుకే ఓటమిని జీర్ణించుకోలేక పోతోంది. ఇక కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలి. లేకపోతే భారీగా నష్టపోయి, మరపునపడి పోతారు. అధికార వర్గేతర పార్టీ ఆమ్ఆద్మీ కేజ్రీవాల్ నేతృత్వాన ఢిల్లీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం గొప్ప రాజకీయ ప్రయోగం. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే అలాంటి ప్రయోగం తిరిగి మరెన్నడూ జరగదు. కాబట్టి ఢిల్లీ ఎన్నికలు కాంగ్రెస్, కేజ్రీవాల్‌లకు అస్తిత్వ సమస్య. ఇక బీజేపీ ఓటమి పాలవడం అంటే మోదీ, అమిత్‌షాలు ప్రతిష్టను కోల్పోవడం. ఇక బీజేపీని నిలవరించడానికి ప్రతిపక్షాలు ఒక్కటవుతాయి. కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్‌కు అపార నిధులున్నాయి. ఢిల్లీలో పెద్ద క్యాడరూ ఉంది. ఆ పార్టీ నేతలు గత 60 ఏళ్లుగా అంతులేని అధికారాన్ని అనుభవించినవారు. సానుభూతి లభిస్తుందేమోనన్న ఆశతో ఈసారి ఆ పార్టీ ప్రతిచోటా సీనియర్ నేతలను బరిలోకి దించుతోంది. దురదృష్టవశాత్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమ పుత్రిక శర్మిష్ట ముఖర్జీని కాంగ్రెస్ తరఫున పోటీకి దిగనిచ్చారు. ఆయన కుమారుడు బెంగాల్ నుంచి ఎంపీ. ఆయనేమో రాష్ట్రపతి. మొత్తం కుటుంబ మంతా ఇలా అధికారానికి అర్రులు చాచడం మంచిది కాదు. కాంగ్రెస్ చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేస్తుంది. 2013లో వచ్చిన 24 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ పార్టీ పునరుజ్జీవనం ఇక కలే. అందుకే ఒకప్పటి కాంగ్రెస్ సానుభూతిపరులంతా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో లబ్ధి పొందిన నామినేటెడ్ ఎంపీలు, గవర్నర్లు, కొందరు ‘మేధావులు’ కూడా వేచి చూస్తు న్నారు. ఓడ ఎప్పుడు మునిగిపోతుందో దాన్లో ఉన్న ఎలుకలు ముందుగా పసిగట్టి దుంకేస్తాయి. అలాగే చాలా మంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కేజ్రీవాల్ వ్యూహం, బలహీనతలు కేజ్రీవాల్ 2013 ఎన్నికలకు ముందు రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ధూషించి, అవమానించిన తీరు సిగ్గుచేటైనది. అయినా ఆయన గొప్ప అద్భుతాలు చేసి కాంగ్రెస్, బీజేపీలను ఓడించి గెలుపొందారు. ముఖ్యమంత్రి అయ్యాక కేజ్రీవాల్ ఆమోదయోగ్యంకాని రీతిలోఅహంకారిగా తనను బయటపెట్టుకున్నారు. షాజియా ఇల్మీ, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర యాదవ్ లు సహా వేలాది మంది ఇతరులు ఆయనను ఎందుకు వదలి పోయారు? అధికారంతో పాటూ సంక్రమించే అహంకారం వ్యక్తిని నాశనం చేస్తుంది. 2013లో ఆమ్ఆద్మీ పార్టీ తరఫున వేలాది మంది ప్రముఖులు ప్రచారం చేశారు. రాజకీయ కార్యకర్తలంతా జీతభత్యాలకు పనిచేసేవారుగా ఉన్న ఈ కాలంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా తెలివి తేటలు, ఉత్సాహోత్తేజాలు గల వేలకొలది కార్యకర్తలు ఢిల్లీలో కేజ్రీవాల్‌కు లభించారు. కానీ ఆయన ఆత్మహత్యా సదృశమైన బాట పట్టి, జనాదరణ గలిగిన నేతలందరినీ అవమానించడం మొదలెట్టారు. చివరికి ఒంటరిగా మిగిలారు. అయినా ఆయనకింకా పేదలలో మంచి మద్దతుంది. కాకపోతే అయన శక్తియుక్తులు, నైపుణ్యం గలిగిన నేతలంతా బీజేపీకి చేరువయ్యారు. వారణాసి నుంచి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయడం, ఆయనపై విమర్శలు గుప్పిస్తుండటం వల్ల కేజ్రీవాల్‌కు ముస్లింల మద్దతు ఉంది. బీజేపీ మధ్య తరగతిని, దళితులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఆయన ఆ వర్గాల మద్దతును కోల్పోవాల్సి వస్తుంది. ‘‘శత్రువు తప్పులు చేస్తున్నప్పుడు ఆటంకం కలిగించవద్దు’’ అని నెపోలియన్ చెప్పాడు. కేజ్రీవాల్ సరిగ్గా దానికి విరుద్ధంగా బీజేపీకి గొప్ప ముఖ్యమంత్రి అభ్యర్ధి లేడని దాడి సాగిస్తూ తప్పు చేశారు. విజయ్ గోయల్, విజేందర్ గుప్త, ముఖి తదితరులు జనాకర్షణ ఏమాత్రం లేని వారే. మిగతావారంతా పనికిరానివాళ్లు కాబట్టి ప్రజలు తననే ఎంచుకుంటారని కేజ్రీవాల్ భావించారు. కానీ అమిత్‌షా తమ తప్పును గ్రహించి షాజియా ఇల్మీ, కిరణ్బేడీలను రంగంలోకి దించారు. అదే పనిగా విమర్శిస్తుండటం అంటే ప్రత్యర్థి తప్పలు సరిదిద్దు కునేట్టు చేయడమేననే గుణపాఠం ఆయన నేర్చుకోవాల్సి ఉంది. ఒకప్పటి కేజ్రీవాల్ మద్దతుదార్లకూ ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష ఉంది. గత ఎన్నికల్లో ఆయనకు జీతభత్యాలు లేని కార్యకర్తలు ఉండేవారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఉన్నది అత్యుత్సాహంతో ఉన్న శత్రువులే. బీజీపీ బలాలు, బలహీనతలు బీజేపీలో కేజ్రీవాల్‌కు సరితూగే నేతలెవరూ లేరని, ప్రజలు బలమైన, చైతన్యశీలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ పార్టీ సర్వేల్లో వెల్లడైంది. అందుకే అది రిటైర్డ్ పోలీస్ అధికారి కిరణ్‌బేడీని పార్టీలో చేర్చుకుంది. ‘‘ఆశ్చర్యంలో ముంచెత్తడం గొప్ప సానుకూలతను కలుగజే స్తుంది’’ అని ప్రాచీన చైనా వ్యూహకర్త సున్ జు అన్నాడు. జనాదరణలో కేజ్రీవాల్‌కు సరితూగే కిరణ్‌బేడీని తెచ్చి బీజేపీ ఆప్ నేతనే కాదు, కాంగ్రెస్‌ను కూడా ఖంగు తినిపించింది. ఆకస్మికమైన ఈ ఆశ్చర్యకరమైన ఎత్తుగడతో బీజేపీ కొంత సానుకూలతను సాధించింది. ఇక బీజేపీకి నరేంద్రమోదీ ఎలాగూ ఉండనే ఉన్నారు. కేజ్రీవాల్‌ను అధికారంలోకి తేవడం వల్ల ఫలితం శూన్యమని, కేంద్రం మద్దతు లేనిదే ఆయనేమీ చేయలేడని ఢిల్లీలో చాలామంది భావిస్తున్నారు. పైగా దళిత, ముస్లిం ఓటర్లలో 2014 నాటికంటే ఇప్పడు బీజేపీ వ్యతిరేకత తక్కువగా ఉంది. కాంగ్రెస్ హయాంలో కంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. చమురు ధరల తగ్గుదల పుణ్యమాని ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ఈ సానుకూల పరిస్థితి బీజేపీకి ఉపయోగపడుతుంది. 2013లో కేజ్రీవాల్‌కు ఓటు వేసిన మధ్యతరగతి, యువత పెద్ద సంఖ్యలో బీజేపీ పక్షానికి చేరారు. నెల క్రితం వరకు బీజేపీ గెలుపుపై చాలా ధీమాగా ఉంది. కానీ మెజారిటీ దక్కకపోవచ్చునేమోనని ఇప్పడు ఆందోళన చెందుతోంది. ఢిల్లీలో అది ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. కేరళ, తమిళనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పార్టీని పెంపొందింపజేయాలన్న లక్ష్యానికి హాని కలుగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడమంటే కాంగ్రెస్, ప్రతి పక్షాలు నీరసపడిపోవడమే. దేశంలో అన్ని చోట్లా తమకు సరిపడేటంతమంది నేతలు లేరనే గుణపాఠాన్ని బీజేపీ ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. పోటాపోటీగా సాగనున్న ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ధీటైన నేత తమకు లేరు కాబట్టే కిరణ్ బేడీని ఆహ్వానించి పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడాలంటే ఇతర పార్టీల నేతలను ఆహ్వానించక తప్పదు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో లేరు. అలా అని సంతోషంగానూ లేరు. ప్రధాని స్టాక్ మార్కెట్లను, కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరిస్తే సరిపోదు. ప్రజలను కూడా తృప్తి పరచాలి. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారితే బీజేపీ దేశవ్యాప్తంగా కుప్పకూలుతుంది. ఆ పార్టీ రేపు ఏ దిశగా సాగనున్నదో ఢిల్లీ ఫలితాలు సూచిస్తాయి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) -
ఎన్నికలకు దూరంగా ఉంటానని నేనే చెప్పా
న్యూఢిల్లీ: సహనేత అజయ్ మాకెన్‌కు ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించడంపట్ల మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలాదీక్షిత్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరూ పక్కన బెట్టలేదని, ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటాననే విషయాన్ని తానే స్వయంగా అధిష్టానానికి చెప్పానన్నారు. మాకెన్.. అనుభవం కలిగిన నాయకుడంటూ అభివర్ణించారు. విధానసభ ఎన్నికల్లో మాకెన్ నేతృత్వంలో తమ పార్టీ ప్రజల మద్దతు పొందుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా మాకెన్, షీలాదీక్షిత్ల మధ్య సంబంధాలు సరిగా లేవని తెలియవచ్చింది. -
భయాందోళనలకు గురిచేసేలా ఉంది
న్యూఢిల్లీ: ఏడు నెలలుగా సాగుతున్న బీజేపీ పాలన భయాందోళనలకు గురిచేసేలా ఉందని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బిల్లుల ఆమోదానికి బదులు ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుందని, దేశంలో మతకలహాల తరహా వాతావరణం నెలకొందని అన్నారు. దేశంలో మత కలహాలకు బీజేపీయే కారణమన్నారు. ఘర్ వాపసి వంటి కొన్ని సంస్థలు చేస్తున్న చర్యలు మైనారిటీలను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయన్నారు. ఇది అత్యంత విచారకరమన్నారు. వారు మంచి చేశారా? లేక చెడు చేశారా? అనే విషయం చెప్పడం సమంజసం కాదన్నారు. బీజేపీ.. ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుందని, అటువంటపుడు ఇక పార్లమెంట్ ఎందుకని ప్రశ్నించారు. ‘నిజంగా మంచిరోజులొచ్చాయా (అచ్చే దిన్ ఆగయే)? వారు దేశమంతటా సృష్టించిన మతఘర్షణ వాతావరణాన్ని గమనించండి’ అని అన్నారు. మతసామరస్యంపై ప్రభావం ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతసామరస్యంపై ప్రభావం పడిందని షీలా పేర్కొన్నారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత నగరంలో మతకలహాలు చోటుచేసుకున్నాయన్నారు. ఓ చర్చి కూడా దగ్ధమైందన్నారు. తక్కువ అంచనా వేశాం: 2013నాటి విధానసభ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువ అంచనా వేసిన మాట నిజమేనంటూ 15 సంవత్సరాలపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తించిన షీలాదీక్షిత్ అంగీకరించారు. ఆ ఎన్నికలకు తాము ఇంకా బాగా సిద్ధమైఉంటే బాగుండేదన్నారు. కాగా 2013లో జరిగిన విధానసభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన షీలాదీక్షిత్.... ఆప్ అధినేత, ఆ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన అరవింద్ కేజ్రీవాల్ చేతిలో పరాజయం పాలైన సంగతి విదితమే. మతతత్వ శక్తులకు మాత్రమే మద్దతు ఇవ్వం విధానసభ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తామంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంపై మీడియా ప్రశ్నించగా మతతత్వ శక్తులకు మాత్రమే (బీజేపీ) తాము మద్దతు ఇవ్వబోమన్నారు. మోదీ... సీఎం కాబోరు విధానసభ ఎన్నికల ప్రచారానికి మోదీని బీజేపీ వినియోగించుకోవడంపై షీలాదీక్షిత్ మాట్లాడుతూ ఢిల్లీకి ఆయన ముఖ్యమంత్రి కాబోరన్నారు. బీజేపీ.. మిగతా అన్నివిషయాలను వదిలేసి మోదీని మాత్రమే ముందుకు తెస్తోందన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాబోడనే విషయం ఢిల్లీ వాసులకు తెలుసని అన్నారు. మోదీ... కేంద్రంలో మాత్రమే బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ‘మిగతా అన్ని రాష్ట్రాలకంటే ఢిల్లీ విభిన్నమైనది. ఇక్కడి అంశాలు కూడా భిన్నమైనవే’అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించనందువల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశముందా అని అడగ్గా అటువంటిదేమీ ఉండబోదన్నారు. అధిష్టానం ఆదేశాలకు లోబడి నడుచుకుంటానన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయమంటే అదే చేస్తానన్నారు.ఏమి చేయమంటే అదే చేస్తానన్నారు. పోటీ చేయబోనని చెప్పా కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అధిష్టానాన్ని కలిశానని, విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని వారికి వివరించానని షీలాదీక్షిత్ స్పష్టం చేశారు. ఏ కమిటీల్లోనూ తనను సభ్యురాలిగా కూడా వేయవద్దని కోరినట్టు చెప్పారు. -
'ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువగా అంచనా వేశాం'
న్యూఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువగా అంచనా వేశామని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. 2013 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని తక్కువగా అంచనా వేయడం వల్లే తాము ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని షీలా స్పష్టం చేశారు. గత ఏడు నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మతతత్వ వాతావరణం సృష్టించిందని ఆ పార్టీపై ఆమె మండిపడ్డారు. 'ఘర్ వాపసి' లాంటి కార్యక్రమాలు చేపట్టి బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. దీంతో మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలా అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో 'మంచి రోజలు' వస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. దేశ రాజధానిలో భయానక వాతావరణాన్ని సృష్టించిన బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. -
ఆప్ కోరితే మద్దతు
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ సర్కార్ ఏర్పడే పరిస్థితే వస్తే.. ఆప్ కోరితే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. ఆప్‌తో మళ్లీ జతకట్టే అవకాశం ఉందా అని మీడియా గురువారం ఆమెను ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. ‘వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు.. మేం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం.. ఒకవేళ హంగ్ ఏర్పడిన పక్షంలో ఆమ్ఆద్మీపార్టీ కోరితే మద్దతు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేద’ని ఆమె తెలిపారు. కాగా, షీలా వ్యాఖ్యలపై ఆప్ మండిపడింది. ఆప్ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. 70 సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటైనా గెలుచుకుంటుందని తాము భావించడంలేదన్నారు. తమ పార్టీకి పూర్తి మెజారిటీ రానుందని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోయేది తమ పార్టీయేనని నొక్కిచెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32, ఆప్ 28, కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 49 రోజుల పాలన తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసింది. ఇదిలా ఉండగా, కొంతమంది ఆప్ నాయకులు, కార్యకర్తలు గురువారం డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ, హరూన్ యూసుఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
కాంగ్రెస్ ప్రచార సారథిగా షీలాదీక్షిత్
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తమ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా ఉంటారని కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. తమ పార్టీ ప్రధాన ప్రచారకర్తగా షీలా క్రియాశీల పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు పీసీ చాకో చెప్పారు. పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు దీక్షిత్ నిరాకరించారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తొలి జాబితాలో ప్రస్తుతమున్న ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థుల పేర్లు కూడా తొలి జాబితాలో ఉంటాయని పేర్కొన్నాయి. ఓ భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సభ జనవరి 10వ తేదీ తరువాత ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అభివృద్ధి, స్థిరత్వం అన్న నినాదంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఎన్నికల ఫలితాలు ఉండకపోవచ్చని, అయితే క్రితంసారి కన్నా ఈసారి బలాన్ని పెరగవచ్చని పార్టీ అంచనా వేస్తోంది. అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి క్రితంసారి వచ్చిన ఫలితాలు పునరావృతం కాకపోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ నేత కేజ్రీవాల్ చేతిలో ఓటమి చవిచూసిన షీలాదీక్షిత్ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇదివరకే స్పష్టం చేశారు. ఢిల్లీకి చెందిన కొందరు మాజీ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దించనున్నట్లు ఊహాగానాలు సాగాయి. కానీ వారెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కొందరు యువ మాజీ ఎంపీలను రంగంలోకి దించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. -
షీలా మా కీలక ప్రచారకురాలు: చాకో
న్యూఢిల్లీ: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తమ కీలకమైన ప్రచారకురాలిగా ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ ఇన్‌ఛార్జి పీసీ చాకో చెప్పారు. ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించకుండా ఆమెను పక్కన పెట్టారని, షీలా సైతం కినుక వహించారని వచ్చిన పుకార్లకు దీంతో తెరపడింది. తాను ఆమెను కలుసుకున్నానని, ఈ ఎన్నికల్లో పార్టీ కోసం షీలాదీక్షిత్ చురుకుగా ప్రచారం చేస్తారని చాకో చెప్పారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తమ ప్రధాన ప్రచారకరురాలు షీలాయేనని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో దీక్షిత్ పోటీ చేస్తారా లేదా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు ఈ నెల 3న జరిగిన సమావేశానికి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర పార్టీ నేతలు హాజరు కాగా, షీలాదీక్షిత్‌తో పాటు ఆమె కుమారుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ గైర్హాజరయ్యారు. అది అనధికార సమావేశమని, ముందస్తు నిర్ణయించుకున్న కార్యక్రమాలుండటం వల్లనే షీలా ఆ సమావేశానికి హాజరుకాలేకపోయారని చాకో వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని షీలాదీక్షిత్ ఇదివరకే స్పష్టం చేశారు. -
షీలాపైనే గంపెడాశలు
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ స్పష్టం చేసినప్పటికీ, ఆమెపై మరిన్ని బాధ్యతలను అప్పగించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది. ప్రధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార పగ్గాలను షీలాదీక్షిత్‌కు అప్పజెప్ప వచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి. 15 సంవత్సరాల పాటు ఢిల్లీని పాలించిన షీలాదీక్షిత్ సేవలను రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఉపయోగించుకొని పార్టీని గట్టెక్కించుకోవాలని అధినాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టనున్న పీసీ చాకో శుక్రవారం షీలాదీక్షిత్‌తో సమావేశం కావడం పై ఊహాగానాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాముద్దీన్ ఈస్ట్‌లోని షీలాదీక్షిత్ నివాసంలో పీసీ చాకో, ఆమె కుమారుడు తూర్పు ఢిల్లీ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా ఢిల్లీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలను కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది.అత్యంత ప్రజాధరణ: షీలాదీక్షిత్ ఢిల్లీలో అత్యంత ప్రజాదరణ గల నాయకురాలని, సమర్థురాలైన, నేత అని కావడంతో ఢిల్లీ రాజకీయాల కీలక బాధ్యతలను అప్పగించాలని షీలా మద్దతుదారులు పార్టీని ఇప్పటికే కోరారు. మతీన్ అహ్మద్ వంటి కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఈ అభిప్రాయాన్ని అధిష్టానం ముందుంచారు. కొందరు గిట్టని సొంతపార్టీ వర్గీయులు షీలాదీక్షిత్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె వల్లనే ఢిల్లీలో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైందని వారి ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనా షిలాదీక్షిత్ సేవలను ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించుకోవాలని, ఆ దిశగా అధిష్టానం కసరత్తు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఢిల్లీ ఇన్చార్జిగా పీసీ చాకో?: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఢిల్లీ కాంగ్రెస్ కొత్త టీమ్‌ను తయారు చేసే ఏర్పాట్లకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి షకీల్ అహ్మద్ స్థానంలో కేరళకు చెందిన సీనియర్ నేత పీసీ చాకోను నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త టీమ్‌ను నియమించే ఏర్పాట్లను పక్కనపెట్టారు. పీసీ చాకోను ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమిస్తూ అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నడుం బిగిస్తుందని భావిస్తున్నారు. కొత్త టీమ్ ఎంపిక చాకో అభీష్టం మేరకు జరుగుతుం దని పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు.త్వర లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేని ఫెస్టో కమిటీ, ఎలక్షన్ కమిటీ, ప్రచార కమిటీతో పాటు వివిధ బ్లాకు, బూతు స్థాయి అధ్యక్షుల నియాకం కోసం ఏర్పాట్లు జరిగాయి. కానీ ఇన్ చార్జి మార్పు నిర్ణయంతో ఈ ఏర్పాట్లన్నీ మూలకుపడ్డాయి. షకీల్ అహ్మద్ కోరిక మేరకే..: ప్రస్తుత ఢిల్లీ ఇన్చార్జి షకీల్ అహ్మద్ రానున్న మూడు నెలల పాటు ఢిల్లీలో ఉండనందు వల్ల చాకోను ఇన్చార్జిగా నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఢిల్లీలో ఉండడం లేదని, ఢిల్లీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తనను తప్పించాలని షకీల్ అహ్మద్ పార్టీని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా చాకో నియామకంపై దృష్టి సారించింది. కేరళ తరహాలో ఢిల్లీలోనూ బూతు కమిటీలను ఏర్పాటు చేసే విషయాన్ని పీసీ చాకో పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కనీసం ఓటరు స్లిప్‌లనే కూడా పంచలేదన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా బూతు కమిటీలు ఏర్పాటు చేయాలని చాకో యోచిస్తున్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఎన్నిక ల కసరత్తు ప్రారంభించాయి. -
విధానసభ ఎన్నికల బరిలో దిగను
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందా అంటూ ఓ టీవీ చానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఢిల్లీవాసుల నుంచి నాకు జవాబు లభించింది. ఢిల్లీ రూపురేఖలను మార్చలేరు. మీరు బయటకు వెళాల్ల్సిన తరుణం ఆసన్నమైందని వారు స్పష్టం చేశారు’ అని తెలిపారు. నగరవాసులు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారన్నారు. కాగా గత విధానసభ ఎన్నికల్లో షీలా దీక్షిత్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 25 వేలకు పైగా ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ప్రజలు తన తలరాతను నిర్ణయించారని, తాను దానిని అంగీకరించానని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసినప్పటికీ అందుకు తగిన గుర్తింపు లభించలేదన్నారు. ఢిల్లీ రాజకీయాలనుంచి బయటపడ్డానని, ఎన్నికలలో పోటీచేయాలన్న ఆసక్తి తనకు లేదన్నారు.ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు ఎలాంటి పాత్ర అప్పగించలేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇస్తానని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని తెలిపారు. ఢిల్లీలో రాజకీయ గందరగోళానికి ఆమ్ ఆద్మీ పార్టీయేనని షీలా అభిప్రాయపడ్డారు. అరవింద్ అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదారిపట్టించారని ఆరోపించారు. ఆప్ విన్నపం మేరకు తాము మద్దతు ఇచ్చామని, అయినప్పటికీ సమర్థంగా పనిచేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల గురించి మాట్లాడుతూ ఆప్, బీజేపీ ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయని, అయితే తమ పార్టీ ఇంకా ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు. గత ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ గుణపాఠం నేర్చుకుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమష్టి నాయకత్వం కింద పనిచేస్తుందన్నారు. కాగా తాను విధానసభ ఎన్నికల బరిలోకి దిగబోనంటూ షీలాదీక్షిత్ ప్రకటించడం ఢిల్లీ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నవారందరికీ నిరాశ కలిగించింది. -
ముందుచూపున్నా.. మెప్పించలేదు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి ముందుచూపు కలిగిన నాయకుడని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అయితే ఆయన పనితీరు తనకు నచ్చలేదన్నారు. నగరంలో ఆదివారం ఓ ఆంగ్ల ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ‘మోదీ ప్రభావం చూపారా లేదా అనే అంశంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుంది. ఆయన అత్యంత విశ్వాసంగా, ధీమాగా కనిపిస్తారు. అలా కనిపించడం ఆయనకు అత్యంత సహజం. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత తొలిసారిగా బీజేపీ తనంతట తానుగా అధికారంలోకి వచ్చింది. మోదీకి ముందుచూపుందనే మాట వాస్తవమే. అయితే అది ఆచరణలోకి రావాల్సి ఉంది. అభివృద్ధి పథకాలను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చకచకా ప్రకటిస్తోంది. రోజుకొకటిగానీ లేదా రెండురోజులకొకటిచొప్పునగానీ ప్రభుత్వం ముందుకొస్తోంది. ఆ పని మేమూ చేశాం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘అచ్చే దిన్ ఆయేంగే’ ఇది జరుగుతుంది. మార్పులు కూడా సంభవమే. ఉన్నతాధికారులు చకచకా పనిచేస్తున్నారు. అవినీతి కనిపించలేదు’ అని అన్నారు. ఏదైనా చేయాలంటే అందుకు కొంత సమయం పడుతుంది. గత ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారు’అని అన్నారు. గవర్నర్ పదవి అనేది రాజకీయాలకు అతీత మైనదన్నారు. ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగబోనన్నారు. అందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురిపించినట్టు ఇటీవల వార్తలొచ్చిన సం గతి విదితమే. దీనిపై అడిగిన ప్రశ్నలకు ఆమె పైవిధంగా స్పందించారు. -
జరిమానాపై హైకోర్టుకు షీలాదీక్షిత్
న్యూఢిల్లీ: విచారణకు రానందుకుగాను దిగువకోర్టు మూడు లక్షల జరిమానా విధించడాన్ని సవాలుచేస్తూ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై గతంలో స్ధానిక న్యాయస్థానంలో పరువునష్టం కేసు దాఖలుచేసిన సంగతి విదితమే. ఈ కేసు ఆగస్టు నెల 26వ తేదీన విచారణకు వచ్చింది. అయితే ఆ విచారణకు మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు రూ. 3 లక్షల మేర జరిమానా విధించింది. దీనిని సవాలుచేస్తూ షీలాదీక్షిత్ శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. -
షీలా దీక్షిత్ భారతీయురాలే: మీనాక్షి
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ భారతీయురాలేనని మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనను షీలా ప్రశంసించడం తప్పు కాదని లేఖి తెలిపారు. మోడీ సమర్ధవంతంగా పాలన అందిస్తున్న కారణంగానే షీలా ప్రశంసించారని లేఖీ అన్నారు. ఓ ప్రత్యేక విజన్ తో మోడీ పాలన సాగుతోంది. గెలిచే ప్రతివ్యక్తిలోనూ విశ్వాసం కనిపిస్తుందని.. మోడీలోనూ అదే కనిపిస్తోందని షీలా దీక్షిత్ వ్యాఖ్యలు చేశారు. Follow @sakshinews -
షీలా రివర్స్‌గేర్..!
సాక్షి, న్యూఢిల్లీ:ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. ప్రజలు, ఎమ్మెల్యేలు ఎన్నికలను కోరుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయగలమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ అంటున్నారని, ఆయన బాధ్యతతోనే ఈ మాటలు అని ఉంటారని షీలాదీక్షిత్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వాలు ఏర్పాటు కావడం మంచిదేనని, ఒకవేళ బీజేపీ ఈ స్థాయికి చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఢిల్లీకి మంచిదేనని షీలాదీక్షిత్ చెప్పారు. ‘ఆప్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారేకాకుండా ఇతరులు కూడా ఎన్నికలను కోరుకోవడంలేదు. మరోవైపు ప్రజలు కూడా ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలనే కోరుకుంటున్నారు తప్ప ఎన్నికలు జరగాలను కోరుకోవడంలేదు. తాము ఎనుకున్న ప్రజాప్రతినిధుల పదవీకాలం కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదనే అభిప్రాయం జనాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి సమయంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బీజేపీ అంటున్నప్పుడు.. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడే ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన బాధ్యతతో మాట్లాడుతున్నారనే భావించారు. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేయడానికి బీజేపీకి అవకాశాన్ని ఇవ్వాలి. ఢిల్లీలోనేకాదు మరే ఇతర రాష్ట్రంలోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోవడం ప్రజాస్వామ్యంలో సరికాదు. ప్రజలకు వ్యక్తిగతంగా, సమిష్టిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేనట్లయితే తమ సమస్యల పరిష్కారం కోసం వారంతా ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలో వారికి అర్థం కాదు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా ఉన్న బీజేపీ ప్రయత్నాన్ని అన్ని పార్టీలు స్వాగతించాల’ని షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఢిల్లీలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం, దీంతో కేరళ గవర్నర్‌గా షీలా వెళ్లిపోవడం వంటివి జరిగిన తర్వాత క్రీయాశీల రాజకీయాలకు ఆమె దూరంగా ఉన్నారు. ఇటీవల కేరళ గవర్నర్ పదవికి షీలాదీక్షిత్ రాజీనామా చేసిన తర్వాత మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో ఆమె క్రీయాశీలంగా వ్యవహరించనుందనే సంకేతాలు కాంగ్రెస్ నేతల నుంచి వెలువడ్డాయి. ఇక ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకోవడం, కాంగ్రెస్, ఆప్‌లు బీజేపీని రోజుకోరకంగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహించిన షీలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. షీలా వ్యాఖ్యలు విశ్లేషకులనుసైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. బీజేపీ హర్షం షీలాదీక్షిత్ మాటలు కాంగ్రెస్‌కు మింగుడుపడకపోయినా బీజేపీ మాత్రం హర్షం వ్యక్తం చేసింది. ఒక రాజకీయ నేతగా షీలాదీక్షిత్ వ్యాఖ్య పరిణితితో కూడినట్లుగా ఉందని సతీష్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. ‘షీలాజీ సీనియర్ నేత, ఆమెకు రాజ్యాంగ ప్రక్రియ గురించి తెలుస’ని సతీష్ ఉపాధ్యాయ అన్నారు. మద్దతిస్తే సిద్ధమే: అమిత్ షాఇదిలాఉండగా ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ సుముఖంగానే ఉందని, మద్దతు ఇవ్వడానికి ఎవరైనా తమంతట తాముగా ముందుకు వస్తే స్వీకరించడానికి సంకోచించమని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమే: కాంగ్రెస్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అందుకు విరుద్ధంగా మాట్లాడడంపై కాంగ్రెస్ నేతలు విస్మయం చెందుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై షీలాదీక్షిత్ చేసిన వ్యాఖ్య ఆమె వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. షీలాదీక్షిత్ వ్యాఖ్య దిగ్భ్రమ కలిగించిందని, దానిని ఆమె వ్యక్తిగత అభిప్రాయంగా తాము భావిస్తున్నామని కాంగ్రెస్ నేత ముఖేష్ శర్మ చెప్పారు. కాంగ్రెస్ వైఖరి షీలాదీక్షిత్ మాటలకు భిన్నంగా ఉందన్నారు. ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని, అనైతిక పద్ధతిలో బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే అసెంబ్లీలో తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే తమ పార్టీ విప్ జారీచేస్తుందని ఆయన చెప్పారు. షీలాదీక్షిత్ వంటి సీనియర్ నేత ఇటువంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యంగా ఉందని మాజీ మంత్రి హరూన్ యూసఫ్ అన్నారు. షీలాదీక్షిత్ తన వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే భీష్మ్ శర్మ డిమాండ్ చేశారు. షీలాదీక్షిత్ బీజేపీతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖరాశారు. షీలాదీక్షిత్‌ను సమర్థించే మతీన్ అహ్మద్ మాత్రం వ్యాఖ్యలను సమర్థించారు. -
బీజేపీకి అవకాశం ఇవ్వండి:షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఆ రకంగా అవకాశం ఇవ్వడం కూడా ప్రజలకు మంచిదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత నోటనుంచి తమకు మద్దతుగా వెలువడిన ఈ వ్యాఖ్యలపట్ల బీజేపీ హర్షం వ్యక్తంచేయగా, ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధంలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ఉండటమే మంచిదని, ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయికి బీజేపీ చేరుకుని ఉంటే బీజేపీ ఆ పనిచేయవచ్చని షీలా దీక్షిత్ గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకోసం బీజేపీ ఎమ్మెల్యేల వేటలో పడిందంటూ ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికలు కావాలని కాంగ్రెస్‌గానీ, ఆప్‌గానీ కోరుకోవడంలేదని షీలా దీక్షిత్ అన్నారు. అయితే,..ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? మైనారిటీ ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లేమిటి?..ఇవన్నీ బీజేపీకి సంబందించినవేనని ఆమె అన్నారు. -
భవితవ్యమేమిటో?
షీలాదీక్షిత్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ ప్రథమ పౌరురాలి పదవికి రాజీనామా చే సిన నేపథ్యంలో ఈ తరహా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ పగ్గాలు షీలాకి అప్పగించాలంటూ ఇప్పటికే కొందరు నాయకులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి విన్నవించారు. షీలా మద్దతుదారులు ఇదే ఆశిస్తున్నప్పటికీ... వ్యతిరేకులు మాత్రం ఆమె ఒంటెత్తు పోకడవల్లనే గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైందని వాదిస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ:కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో షీలాదీక్షిత్ రాజకీయ భవితవ్యంపై ఊహా గానాలు మొదలయ్యాయి. ఇప్పుడే కాకపోయినప్పటికీ కొంతకాలం పోయిన తరువాతైనా షీలాదీక్షిత్ ఢిల్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని అంటున్నారు. త్వరలో ఢిల్లీ విధానసభ ఎన్నికలు జరుగుతాయనే అంచనాల నేపథ్యంలో ఆమె పునరాగమనం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఢిల్లీ కాంగ్రెస్ పగ్గాలను షీలాదీక్షిత్ చేపట్టాలని ఆమె మద్దతుదారులు గట్టిగా కోరుతున్నారు. రాజధానిలో డీలాపడిన కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలిగిన సామర్థ్యం షీలాదీక్షిత్‌కు మాత్రమే ఉందని వారంటున్నారు. ఈ విషయాన్ని మతీన్ అహ్మద్‌తో పాటు కొందరు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఇటీవల సోనియా గాంధీకికూడా విన్నవించారు. మరోవైపు షీలాదీక్షిత్ రాకను కూడా మరికొందరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. షీలాదీక్షిత్ నేతృత్వంలో కాంగ్రె స్ ఘోర ఓటమి పాలు కావడంతోపాటు ఆమె కూడా పరాజయం పాలైన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. నగరంలో కాంగ్రెస్ దుస్థితికి షీలాదీక్షిత్ ఒంటెత్తు పోకడే కారణమని, ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవడం అటుంచి రెండు గ్రూపులుగా విడిపోవడం ఖాయమని వారంటున్నారు. అయితే షీలాదీక్షిత్ మద్దతుదారులు మాత్రం గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయబోరని అందరినీ ఒక్కతాటికి తీసుకొచ్చి ముందుకు సాగుతారని అంటున్నారు.కాంగ్రెస్‌లో విబేధాల సంగతి ఏవిధంగా ఉన్నప్పటికీ ఒకవేల షీలాదీక్షిత్ కనుక మళ్లీ ఢిల్లీ రాజకీయాలలో చురుకైన పాత్ర చేపడితే దానిని బీజేపీ తేలిగ్గా తీసుకోబోదని, ఆమెపై కామన్వెల్త్ క్రీడ లకు సంబంధించిన ఆరోపణలు, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో అవకతవకల ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లు తిరిగి తెరచుకోవడం ఖాయమని కొందరు అంటున్నారు. ఈ ఆరోపణల దర్యాప్తు నుంచి రక్షించడానికే అప్పట్లో షీలాదీక్షిత్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టారని వారు వాదిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలలో పస లేదని, ఈ ఆరోపణలపై దర్యాప్తుకు సిద్ధపడి నిజాయితీపరురాలనే ముద్రతో ప్రజల ముందుకు రావచ్చని సన్నిహితంగా ఉండే నేతలు కొందరు షీలాదీక్షిత్‌కు సలహా ఇస్తున్నారని అంటున్నారు. షీలాదీక్షిత్ కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితురాలు, ఆమె సామర్థ్యంపై కాంగ్రెస్ అధిష్టానానికి అపార నమ్మకం ఉంది. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా ఆమె స్థానం చెక్కుచెదరలేదు. ఇప్పుడు కూడా అధిష్టానం షీలాదీక్షిత్ ఆమెకు పెద్దపీట వేస్తుందని, అది జాతీయ స్థాయిలోనా లేక ఢిల్లీ స్థాయిలోనా అనే విషయం వేచి చూడాల్సిన విషయమని కొందరు అంటున్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీ దళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు.ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా
-
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా
తిరువనంతపురం: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితులయిన గవర్నర్లకు కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉద్వాసన పలుకుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ పదవి నుంచి వైదొలగాలా వద్దా అని షీలా దీక్షిత్ తొలుత డైలామాలో పడ్డారు. ఆ తరువాత రాజీనామా చేయడానికి ఆమె నిరాకరించారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై రాజీనామా విషయం చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. చివరకు ఈరోజు రాజీనామా చేశారు. షీలా దీక్షిత్ సుదీర్ఘకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం అనంతరం యూపీఏ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్‌గా నియమించింది. -
రాష్ట్రపతితో షీలా దీక్షిత్ భేటీ
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. త్రిపురకు బదిలీ అయిన మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ తన పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజు షీలా రాష్ట్రపతిని కలవడం గమనార్హం. రాష్ట్రపతితో భేటీలో రాజీనామా గురించి ప్రస్తావన వచ్చిందా అన్న విషయాన్ని చెప్పేందుకు షీలా నిరాకరించారు. ఢిల్లీకి వచ్చినప్పుడల్లా రాష్ట్రపతిని కలుస్తుంటానని మాజీ ముఖ్యమంత్రి అయిన షీలా చెప్పారు. కాగా సోమవారం ఉదయం ఆమె కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు వైదొలుగుతున్న నేపథ్యంలో షీలా ఢిల్లీ పర్యటన పలు ఊహాగానాలకు తెరలేపింది. -
రాజ్ నాథ్ ను షీలా దీక్షిత్ ఎందుకు కలిశారు?
న్యూఢిల్లీ: ప్రస్తుత కేరళ గవర్నర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. కేరళ గవర్నర్ కు ఉద్వాసన చెప్పవచ్చనే ఉహాగానాల మధ్య రాజ్ నాథ్ ను షీలా దీక్షిత్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిమధ్య సమావేశం పదిహేను నిమిషాలపాటు జరిగినట్టు తెలుస్తోంది. కేరళ గవర్నర్ గా తన కొనసాగింపు అంశంపై రాజ్ నాథ్ తో షీలాదీక్షిత్ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా వీరిమధ్య జరిగిన చర్చలు బయటకు రాలేదు. రాజ్ నాథ్ తో భేటి తర్వాత కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారనే రూమర్లు ఊపందుకున్నాయి. ఎన్ డీఏ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత గవర్నర్ పదవికి రాజీనామా చేయడానికి షీలా నిరాకరించిన సంగతి తెలిసిందే. -
అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు పక్షం రోజుల్లో ముసాయిదా
అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా 15 రోజుల్లో సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ ముసాయిదాను రూపకల్పన చేయనుంది. న్యూఢిల్లీ: అనధికార కాలనీ వాసులకు త్వరలో మంచిరోజులు రానున్నాయి. ఈ కాలనీల క్రమబద్ధీకరణ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా పదిహేనురోజుల్లోగా ఓ ముసాయిదాను రూపొందించనుంది. ఇందుకుసంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా తన శాఖ అధికారులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం జరిగిన సమీక్షా సమీవేశంలో ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని జాతీయ ప్రాదేశిక ప్రాంత అభివృద్ధి, పట్టణీకరణ తదితర అంశాలపై ఆయన చర్చించారు. వీట న్నింటికీ ఇక మంచిరోజులు రానున్నాయన్నారు. డీడీఏతోపాటు ఆయా కార్పొరేషన్లు తమ పరిధిలోని భూమిని వీలైనంత త్వరగా గుర్తించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం జీఐఎస్‌ను వినియోగించాలని కూడా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తమ తమ వెబ్సైట్ల ద్వారా అందుబాటులో ఉంచాలని కూడా నిర్ణయించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇంకా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను అందజేయాల్సిందిగా డీడీయేని ఆదేశించారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి నోటీసులు జారీ చేయాలని ప్రచార కార్యక్రమం చేపట్టాల్సిందిగా డీడీయేని కోరారు. ద్వారక తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం డీడీయే నిర్మించిన మౌలిక వసతులను తన అధీనంలోకి తీసుకోవాల్సిందిగా ఢిల్లీ జల్‌బోర్డును ఆదేశించారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో ఢిల్లీకి చెందిన పార్టీ ఎంపీలు, పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి, మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు, డీజేబీ అధికారులు, ఎన్డీఎంసీ, సీపీడబ్ల్యూడీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పునరాలోచించండి కాగా అనధికార కాలనీల క్రమబద్ధీకరణ అంశాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ నగరంలోని అనేక అనధికార కాలనీలు 2007కు ముందు ఏర్పాటైనవేనన్నారు. కాగా షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 895 అనధికార కాలనీలను క్రమబద్ధీకరించిన సంగతి విదితమే. -
షీలాను తొలగించాల్సిందే
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనధికార కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఆరోపించడంతో వెంటనే ఆమెను కేరళ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని లెఫ్టినెంట్ గరవ్నర్ నజీబ్ జంగ్‌ను కోరినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ తెలిపారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఆమెపై పోలీస్ కేసు నమో దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు 2012-13లో కూడా షీలాదీక్షిత్ ప్రభుత్వం పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని ఉపాధ్యాయ్ ఆరోపించారు. అధికారంలో ఉన్న చివరి రోజుల్లోనూ ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటే 15 ఏళ్లలో షీలా ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడిందో సామాన్య ఢిల్లీవాసికి సైతం అర్థమవుతుందని ఎద్దేవాచేశారు. అనధికార కాలనీల్లో షీలా సర్కార్ చేపట్టిన పనులు, వాటిలో జరిగిన అవకతవకలు తదితర విషయాలపై కాగ్ బయటపెట్టిన విషయాలను అధ్యయనం చేసేం దుకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆదివారం సమావేశం నిర్వహించిందని ఉపాధ్యాయ్ వివరించారు. ‘అనధికార కాలనీలను క్రమబద్ధీకరించనున్నట్లు 2008 ఎన్నికల సమయం లో షీలా సర్కార్ ప్రజలకు ప్రకటించింది. ఆ మేరకు పలు కాలనీల్లో ధ్రువీకరణ పత్రాలను సైతం పంపి ణీ చేసింది. అప్పటినుంచి స్థానికులను భ్రమల్లోనే ఉంచి అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండానే నిధుల దుర్వినియోగానికి పాల్పడిం ది. ఒక్క 2012-13లోనే అనధికార కాలనీల్లో సుమారు రూ. కోట్లాది విలువైన పనులు చేసినట్లు చూపించారు. అయితే అక్కడ సుమారు రూ. 3 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు కాగ్ నివేదిక బహిర్గత పరిచింద’ని ఉపాధ్యాయ్ వివరించారు. అలాగే ఆయా అనధికార కాలనీల్లో రోడ్ల మరమ్మతుల నిమిత్తం డీఎస్‌ఐఐడీసీ రూ. 206 కోట్లు ఖర్చుచేసింది. అయితే నీటిపైపుల ఏర్పాటు నిమిత్తం ఆ రోడ్లను తవ్వేశారు. నిజానికి నగరంలో 685 అనధికార కాలనీలు ఉండగా, కేవలం 158 కాలనీల్లోనే నీటిపైపుల పనులు జరిగినట్లు కాగ్ నివేదించింది. అలాగే డ్రైనేజీ పనుల నిమిత్తం సుమారు రూ.49 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ ప్రభుత్వం లెక్కలు చూపించినా కాగ్‌కు మాత్రం ఏ ఒక్క కాల నీలోనూ డ్రైనేజీలు కనిపించకపోవడం కాంగ్రెస్ అవినీతికి అద్దం పడుతోంద..’ని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా, ఎన్నికలు వెంటనే జరిపించాలని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆమ్ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీపై ఉపాధ్యాయ్ స్పం దిం చారు. ఆప్‌ది మొసలి కన్నీరని ఆయన విమర్శిం చారు. తమ రాజకీయ మనుగడ కోసమే ఆప్ నాయకులు ర్యాలీ డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవేళ వారికి ఢిల్లీవాసులపై అభిమానముంటే, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటుచేయడంలేదని ఉపాధ్యాయ్ ప్రశ్నించారు. ఇంతా చేస్తే ఆ పార్టీ ర్యాలీకి కేవలం 3,500 మంది హాజరయ్యారంటే వారికి ప్రజల్లో ఉన్న గుర్తింపు ఏమాత్రమో అర్థమవుతోందని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రమేష్ బిధూరీ ఎద్దేవా చేశారు. -
గవర్నర్ పదవి నుంచి షీలాదీక్షిత్‌ను తప్పించండి
న్యూఢిల్లీ: పార్లమెంట్‌కు కాగ్ శుక్రవారం సమర్పించిన నివేదికలో షీలాదీక్షిత్ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్టు ఆరోపించిన నేపథ్యంలో ఆమెను కేరళ గవర్నర్ పదవి నుంచి తప్పించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. షీలాదీక్షిత్ ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వివిధ శాఖలు నిధుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డాయని కాగ్ తన నివేదికలో పేర్కొందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆశుతోశ్ పేర్కొన్నారు. 895 అనధికార కాలనీల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, నీటి పైప్లైన్లు, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పన పేరిట షీలా ప్రభుత ్వం దాదాపు రూ. 3,000 కోట్ల నిధులను వెచ్చించిందన్నారు. అందులో అనేక అక్రమాలు జరిగినట్టు కాగ్ పేర్కొందన్నారు. 895 అనధికార కాలనీల్లో మురుగునీటి పారుదల వ్యవస్థే లేదని కాగ్ తన నివేదికలో పేర్కొందని, అయితే అందులోని సగం కాలనీలకు ఈ వసతులే లేవని, మరిఅలాంటప్పుడు నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. అందువల్ల ఆమెను కేరళ గవర్నర్ పదవినుంచి తప్పించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అంతేకాకుండా షీలా ప్రభుత్వంలోని మంత్రులందరిపైనా కేసులు నమోదు చేయించి, ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా ఢిల్లీ ప్రభుత్వ విభాగాల్లో అవకతవకలతోపాటు, ఆర్థిక పారదర్శకత లేమి కారణంగానే సర్కారు రాబడి గణనీయంగా పడిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శుక్రవారం తన నివేదికలో పేర్కొన్న సంగతి విదితమే. ఈ నివేదికను ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాణిజ్యం, పన్నులు, రాష్ట్ర ఎక్సైజ్, రవాణా తదితర శాఖలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశామని, దాదాపు రూ. 2,041 కోట్ల మేర ప్రభుత్వం నష్టపోయినట్టు ఆయా ఫైళ్ల తనిఖీలో తేలిందని పేర్కొంది. -
షీలాదీక్షిత్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా కొనసాగుతున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్నారు. షీలా నేతృత్వం వహిస్తేనే పార్టీ విజయతీరాలకు చేరుకుంటుందని వారంటున్నారు. ఈ విషయాన్ని తాము సోనియాగాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లామంటున్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మతీన్ అహ్మద్, ఆసిఫ్ మహ్మద్ ఖాన్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మంగళవారం కలిశారు. పార్టీ వ్యవహారాలతో పాటు ఢిల్లీలో రాజకీయ పరిస్థితిని కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కేరళ గవర్నర్‌గా ఉన్న షీలాదీక్షిత్‌ను వెనక్కి రప్పించి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని అధిష్టానాన్ని కోరినట్లు వారు చెప్పారు. షీలాదీక్షిత్ లేని లోటును ఢిల్లీవాసులు గుర్తిస్తున్నారని, నగరాన్ని అభివృద్ధి చేసినవైనాన్నివారు గుర్తుకు తెచ్చుకుంటున్నారని ఈ నేతలు చెప్పారు. పార్టీని శాసనసభ ఎన్నికల్లో గెలిపించగల సామర్థ్యం ఆమెకు మాత్రమే ఉందంటూఅధ్యక్షురాలికి చెప్పినట్లు వారు తెలిపారు. కాగా సీలంపుర్ శాసనసభ్యుడు మతీన్ అహ్మద్, ఓఖ్లా ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ చేసినతాజా డిమాండ్ డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, శాసనసభలో కాంగ్రెస్ నేత హరూన్ యూసఫ్ నాయకత్వాన్ని సవాలు చేసినట్టయింది. ఢిల్లీలో కాంగ్రెస్‌కున్న ఎనిమిది ఎమ్మెల్యేల మధ్య విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. క్లిష్టపరిస్థితులోనూ గెలిచినప్పటికీ తమను పార్టీ పట్టించుకోవడం లేదని, షీలాదీక్షిత్ హయాంలో మంత్రులుగా ఉన్న లవ్లీ, హరూన్ యూసఫ్లకే డీపీసీసీ అధ్యక్ష పదవి, శాసనసభాపక్ష నేత పదవి కట్టబెట్టారని, పదవుల్లేని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉన్న ఈ నేతలనే తన వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. అయితే పార్టీని వీడి బీజేపీకి మద్దతు ఇచ్చినట్లయితే ఎన్నికల్లో మళ్లీ గెలవడం కష్టమని గుర్తించిన ఈ నేతలు ఇప్పుడు పార్టీ అధిష్టానం ముందు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. -
అధికారంలోకి వస్తే..షీలా పాలనలో అవినీతిపై దర్యాప్తు
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ఢిల్లీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ ప్రకటించారు. ఆర్థికంగా చోటుచేసుకున్న అవకతవకలతోపాటు కామన్వెల్త్ క్రీడల సమయంలో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రధానంగా దృష్టిసారిస్తామని చెప్పారు. ఇది కక్ష సాధింపు చర్య ఎంతమాత్రం కాదని, అక్రమాలు, కుంభకోణాలతో నగరానికి వచ్చిన చెడ్డపేరును తుడిచివేసేందుకే నిజానిజాల నిగ్గు తేలుస్తామని ఉపాధ్యాయ్ చెప్పారు. దోషులుగా తేలినవారు కఠిన శిక్షలు అనుభవించక తప్పదన్నారు. గత పదిహేనేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతిపై దర్యాప్తు జరిపించడం కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వ బాధ్యత అని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముందుగా సమీక్షించాల్సి ఉంటుందని, ముఖ్యంగా ఎంసీడీని విభజించడం వెనుక ఉన్న కాంగ్రెస్ కుట్ర గురించి ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. కార్పొరేషన్లుగా విభజించి, అందుకు అవసరమైన ఉద్యోగుల నియామకాలు షీలా ప్రభుత్వం చేపట్టలేదన్నారు. తద్వారా కార్పొరేషన్లలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కుట్రలు పన్నారని, దీనివల్ల ప్రజలకు కలిగే కష్టనష్టాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మాత్రం కూడా ఆలోచించలేదన్నారు. షీలా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే కాగ్ చెప్పిందని, షుంగ్లూ కమిటీతోపాటు సీవీసీ పరిశీలనలో కూడా షీలా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడైందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీటన్నింటిపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశిస్తామని చెప్పారు. -
ముఖ్యమంత్రి నివాసంలో 31 ఏసీల
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షీలాదీక్షిత్ అధికారిక నివాసంలో మొత్తం 31 ఏసీలు ఉన్నాయి. దీంతోపాటు 25 హీటర్లు కూడా ఉన్నాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయడంతో వెలుగులోకి వచ్చింది. షీలా అధికారిక నివాసం 3-మోతీలాల్ నెహ్రూమార్గ్లో ఉంది. దీనిని ప్రస్తుతం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. ఇందులో 31 ఏసీలు, 15 డెసర్ట్ కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీసర్లు ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా ఈ భవనంలోని విద్యు త్ పరికరాలు, సామగ్రిని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూ) రూ. 16.81 కోట్లు వెచ్చించింది. కేరళ గవర్నర్‌గా నియమితురాలైన షీలా ఈ నివాసం ఖాళీ చేసి వె ళ్లిపోయిన తర్వాతఅందులో బిగించిన పరికరాల వివరాలను సీపీడబ్ల్యూ వెల్లడిస్తూ... ఇందులో కొన్నింటిని అవసరాలనుబట్టి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చామని పేర్కొంది. ఈ విషయాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త సుభాష్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీకి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్‌కు అప్పట్లో ప్రభుత్వం నాలుగు పడక గదులు కలిగిన బంగ్లాను కేటాయించింది. ఈ భవనం 1920లో నిర్మితమైంది. దీనిని అప్పట్లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపాలవడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి షీలాదీక్షిత్ తప్పుకోవడం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి యూ పీఏ ప్రభుత్వం షీలాదీక్షిత్‌కు కేరళ గవర్నర్ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆమె తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి మధ్యఢిల్లీలోని ఫిరోజ్షారోడ్డు ప్రాంతంలోగల భారీ ఓ ప్రైవేటు భవనాన్ని కిరాయికి తీసుకున్నారు. -
ఆ ఇంట్లో 31 ఏసీలు.. 12 గీజర్లు!!
ఒక ఇంట్లో ఎన్ని ఏసీలు అవసరం అవుతాయి.. మహా అయితే మూడు లేదా నాలుగు అంతే కదా. కానీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో ఎన్ని ఏసీలుండేవో తెలుసా? ఏకంగా 31 ఏసీలు!! వాటితో పాటు 25 రూం హీటర్లు కూడా ప్రత్యేకంగా ఉండేవట. ఈ విషయం అంతా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వివరాలన్నీ వచ్చాయి. నెం.౩ మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ఉన్న షీలా దీక్షిత్ అధికారిక నివాసంలో 31 ఏసీలు, 15 డిజర్ట్ కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లు.. ఇవన్నీ ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా బంగ్లాకు మార్పుచేర్పులు చేయడానికి రూ. 16.81 లక్షలు ఖర్చుచేసినట్లు సీపీడబ్ల్యుడీ తెలిపింది. కేరళ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆమె వెళ్లిపోయేటప్పుడు ఆ ఇంటినుంచి వాటన్నింటినీ తీసేశారు. వాటిలో కొన్నింటిని ప్రస్తుతం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరాల మేరకు ఉపయోగిస్తున్నారు. మిగలిన వాటిని అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తామన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలా దీక్షిత్ నివసించిన ఈ బంగ్లాను 1920లో కట్టారు. ఇది దాదాపు మూడున్నర ఎకరాల్లోవిస్తరించింది. ఇప్పుడీ బంగ్లాను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేటాయించారు. ఆ సమయంలో దానికి రూ. 35 లక్షలతో మరమ్మతులు చేశారు. -
షీలా దీక్షిత్ దిగిపోవాలని ఆందోళన
తిరువనంతపురం: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల నుంచి ఆందోళనలు చేపట్టనున్నట్టు రాష్ట్ర బీజేపీ శాఖ ప్రకటించింది. జూలై 3న గవర్నర్ అధికార నివాసం ఎదుట నిరసన ప్రదర్శన చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి. మురళీధరన్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో షీలా దీక్షిత్ పాత్ర ఉందని లోకాయుక్త చెప్పిన అంశాన్ని ఆందోళనలో లేవనెత్తుతామని చెప్పారు. తనంత తానుగా షీలా తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే జూలై 7 వరకు తమ ఆందోళన కొనసాగుతుందని మురళీధరన్ తెలిపారు. 14 జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేస్తామని చెప్పారు. -
వదంతులపై స్పందించను: షీలా దీక్షిత్
తిరువనంతపురం: యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లను తొలగించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించేందుకు కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ నిరాకరించారు. ఊహాగానాలపై తాను స్పందించబోనని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయిన షీలా దీక్షిత్ ను యూపీఏ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో కేరళ గవర్నర్ గా నియమించింది. కాగా, కర్ణాటక, అసోం, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు నేడు తమ పదవులకు రాజీనామా చేశారు. -
పీఎంవోలో ‘ప్యాకప్’ బిజీ..
న్యూఢిల్లీ: ఒకవైపు ఎన్నికల తతంగం చరమాంకానికి చేరుకుంటుండగా, ప్రధాని కార్యాలయం (పీఎంవో) ప్యాకింగ్ పనుల్లో తలమునకలుగా ఉంది. ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం మరో వారం రోజుల్లో ముగుస్తున్నందున ప్యాకింగ్ పనుల్లో తలమునకలుగా ఉన్నామని పీఎంవో అధికారి ఒకరు చెప్పారు. తన తర్వాత ఈ పదవి చేపట్టే వ్యక్తికి అంతా పద్ధతిగా అప్పగించాలని ప్రధాని మన్మోహన్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. పుస్తకాలు, బహుమతులు, ఇతర వస్తువులన్నింటినీ జాగ్రత్తగా భద్రపరుస్తున్నామని వివరించారు. మన్మోహన్ ఈ ఏడాది ప్రారంభంలోనే తన రిటైర్మెంట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 7 రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసంలో పదేళ్లుగా నివాసం ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులంతా ఆయన రిటైర్మెంట్ తర్వాత 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని భవనానికి తరలి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదివరకు ఆ భవనాన్ని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తన అధికారిక నివాసంగా ఉపయోగించుకున్నారు. ప్రధాని, పీఎంవో సభ్యులు అందుకున్న పెయింటింగ్‌లు, కళాకృతులు, జ్ఞాపికలు వంటి బహుమతులు, కానుకలు వంటివన్నీ ట్రెజరీలో భద్రపరచనున్నట్లు అధికారులు తెలిపారు. 17న ప్రధాని వీడ్కోలు ప్రసంగం: ప్రధాని మన్మోహన్ సింగ్ పదవి నుంచి వైదొలగే ముందు మే 17న జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత పదేళ్ల తన పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలు మే 12 నాటితో ముగియనుండగా, మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా, ప్రధాని తన మంత్రివర్గ సహచరులకు వీడ్కోలు విందు ఇవ్వనున్నట్లు సమాచారం. -
ముక్కోణపు పోటీ తప్పదా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని హైప్రొఫైల్ నియోజకవర్గాలలో ఒకటైన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది ఈ లోక్‌సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఘోరంగా ఓడించిన తీరుతో లోక్‌సభ ఎన్నికలలో ప్రజల తీర్పుపై మరింత ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏడు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో గెలిచినందువల్ల ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుందని కొందరు అంటుండగా, ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచే అవకాశమున్న సీటు న్యూఢిల్లీ ఒక్కటేనని.. అందువల్ల ఇక్కడ ముక్కోణపు పోటీ జరుగుతుందని మరికొందరు అంటున్నారు. కాంగ్రెస్ ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్‌కు టికెట్ ఇచ్చింది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రత్యర్థులను ఓడించిన మాకెన్‌కు ఈ ఎన్నికల్లో విజయం అంత సులువుగా లభించే సూచనలు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు లభించిన ఘనవిజయం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వీస్తోన్న పవనాలతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండని హైప్రొఫైల్ నేత అన్న ముద్ర ఆయనకు మైనస్ పాయింట్లుగా మారాయి. ఈ నియోజకవర్గం రూపురేఖలు గత పదేళ్లలో గణనీయంగా మారినప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అభివృద్ధి మంత్రమొక్కటే సరిపోదని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో షీలాదీక్షిత్ పరాజయం రుజువు చేసింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరుపై నడకలా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మధ్య తరగతి వర్గీయులకు ఆప్‌పై మక్కువ తగ్గడమే ఇందుకు కారణం. ఈ నియోజకవర్గ ఓటర్లలో 14.2 శాతం మధ్య తరగతివాసులు ఉన్నారు. ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పాత్రికేయుడు ఆశీష్ ఖేతాన్‌ను బరిలోకి దింపింది. స్థానికులను పక్కన బెట్టి బయటివ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసన వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆయన సన్నిహితుడు అమిత్ షా కలసి ఒక మహిళపై నిఘా పెట్టారని ఆరోపిస్తూ ఆశీష్ ఖేతన్ తన వార్త పోర్టల్ ద్వారా విడుదల చేసిన ఆడియో టేప్ సంచలనం సృష్టించింది. నేరుగా నరేంద్ర మోడీపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టిన ఖేతన్‌కు స్టింగ్ ఆపరేషన్ నిపుణుడిగా పాత్రికేయరంగంలో పేరుంది. బీజేపీ సుప్రీంకోర్టు న్యాయవాది మీనాక్షీలేఖికి టికెట్ ఇచ్చింది. పార్టీ ప్రతినిధిగా మీడియాలో పార్టీని గట్టిగా సమర్థించే నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. అయితే మీనాక్షీ లేఖీకి సొంతంగా ఓట్లు సాధించే సత్తా లేదు. నమో మంత్రం, పార్టీ పేరు మీదనే ఆమెకు ఓట్లు లభిస్తాయి. -
నాయకులం కాము..
సాక్షి, న్యూఢిల్లీ: అజయ్ మాకెన్, మహాబల్ మిశ్రా, ప్రవేశ్ వర్మ.. వీళ్లంతా నిత్యం రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో తమను తాము వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ అఫిడవిట్లలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో పలువురు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో తమను తాము రాజకీయ నాయకులుగా పేర్కొనలేదు. ఢిల్లీ రాజకీయా ల్లో తలపండిన జైప్రకాశ్ అగర్వాల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన వృత్తిని ‘సామాజిక సేవకుడు’గా పేర్కొన్నారు. 1984లో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన నార్త్ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నారు. అగర్వాల్ మాత్రమే కాదు ఈస్ట్ ఢిల్లీ నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీకి సిద్ధపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కూడా తనను తాను ‘సామాజిక సంస్కరణవాది’ ‘డెయిరీ రైతు’గా పేర్కొన్నారు. న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, వెస్ట్ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా తనను వ్యాపారవేత్తగా పేర్కొన్నారు. ఆప్ అభ్యర్థులు రాజ్‌మోహన్ గాంధీ, జర్నైల్ సింగ్ తమను రచయితలుగా పేర్కొన్నారు. చాందినీచౌక్ నుంచి పోటీ చేస్తోన్న కపిల్ సిబల్ తన వృత్తిని కేం ద్రమంత్రిని పేర్కొనగా, ఆయన ప్రత్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ తాను వైద్యుడు, ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. మీనాక్షి లేఖి తనను న్యాయవాదిగా పేర్కొనగా, ప్రవేశ్‌వర్మ వ్యాపారవేత్తనని తెలిపారు. చాం దినీచౌక్ నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి ఆశుతోష్, న్యూఢిల్లీ నుంచి పోటీచేస్తోన్న ఆశిష్ ఖేతాన్ మాత్ర మే తమను రాజకీయ నేతలుగా పేర్కొన్నారు. -
ఆడిటింగ్‌కు డిస్కంలు సహకరించటం లేదు
న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆడిటింగ్ తమతో సహకరించడంలేదని ఢిల్లీ హైకోర్టుకు బుధవారం కాగ్ నివేదించింది. అనిల్ అంబానీ, టాటా గ్రూపులకు చెందిన ప్రైవేట్ పంపిణీ కంపెనీలు ఏర్పాటు దగ్గరనుంచి వాటి ఆర్థిక వ్యవహారాల ఆడిటింగ్‌కు గత ఆప్ సర్కార్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై స్టే విధించాలని జనవరి 24న ఆయా కంపెనీలు హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ఇదిలా ఉండగా, బుధవారం కోర్టుకు కాగ్ తన నివేదికను అందజేసింది. ఆయా కంపెనీలు ఆడిటింగ్‌కు సహకరించడంలేదని అందులో కాగ్ ఆరోపించింది. కాగా, ఆయా కంపెనీల సహాయ నిరాకరణ విషయమై కాగ్ మూడు వారాల్లో దరఖాస్తుచేయాలని ఆదేశించి, కేసు తదుపరి విచారణను మే 16కు వాయిదావేసింది. దేశ రాజధానిలో మూడు ప్రైవేట్ కంపెనీలు విద్యుత్‌ను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. షీలాదీక్షిత్ సర్కార్ సమయంలో విద్యుత్ టారిఫ్‌లు నగరంలో చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆప్ ఉద్యమాలు నిర్వహించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ఆద్మీపార్టీ తాము అధికారంలోకి వస్తే కరెంటు పంపిణీ కంపెనీల వ్యవహారంపై కాగ్‌తో ఆడిటింగ్ జరిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2013 డిసెంబర్ 27న ఆయా ప్రైవేట్ విద్యుత్ పంపిణీ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై ఆడిటింగ్‌కు కాగ్‌ను ఆదేశించింది. డిస్కంల ఆర్థిక వ్యవహారాలు, ఎకౌంట్లు సరిగా ఉంటే కాగ్ ఆడిటింగ్‌కు భయపడాల్సిన అవసరం ఏముందని ఆప్ సర్కార్ ప్రశ్నించింది. డిప్యూటీ సెక్రటరీ (విద్యుత్) అల్కా శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ మేరకు నిలదీశారు.‘ప్రజాస్వామ్యంలో ఆడిట్ అనేది చాలా ముఖ్యమైన ఆయుధం.. డిస్కంలు దీనికి ఎందుకు భయపడుతున్నాయో.. ఎందుకు స్టే విధించాలని కోరుతున్నాయో అర్థం కావడంలేదు..’ అని అఢిడవిట్లో పేర్కొన్నారు. ఆయా డిస్కంలలో 49 శాతం వాటా ప్రభుత్వానికి ఉన్నందున ప్రజల్లో తన నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రభుత్వం ఆడిటింగ్‌కు ఆదేశించిందన్నారు. ప్రైవేట్ కంపెనీలు దాఖలుచేసిన స్టే పిటిషన్‌ను తిరస్కరించి కాగ్ ఆడిటింగ్‌కు అంగీకరించేలా వాటిని ఆజ్ఞాపించాలని కోర్టును కోరారు. కొంతసేపు వాదనలు విన్న తర్వాత జస్టిస్ మన్మోహన్ మాట్లాడుతూ ఈ మొత్తం విషయాన్ని డివిజన్ బెంచ్‌కు నివేదిస్తానని చెప్పారు. దీనికి డిస్కంలు ఆమోదించగా ఢిల్లీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇదిలా ఉండగా గత జనవరి 24వ తేదీన జస్టిస్ మన్మోహన్ ఇచ్చిన తీర్పుపై డిస్కంలు వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. జనవరి 24వ తేదీన జరిగిన వాదనల్లో జస్టిస్ మన్మోహన్ డిస్కంల స్టే దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా కాగ్ ఆడిటింగ్ పూర్తిగా సహకరించాలని ఆయా కంపెనీలను ఆదేశించారు. రాజధాని నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో 2002 నుంచి ఈ ప్రైవేట్ కంపెనీలు ఢిల్లీలో విద్యుత్ పంపిణీ చేస్తున్నాయి. కాగా, కాగ్ ఆడిటింగ్‌కు డిస్కంలు సహకరించడంలేదని కాగ్ న్యాయవాది వాదించడంపై బుధవారం బీఎస్ఈఎస్ విద్యుత్ సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆడిటింగ్ సక్రమంగా జరుగుతోందని, వారి అడిగే సమాచారాన్నంతా తాము ఆడిటింగ్ అధికారులకు అందజేస్తున్నామని వారి తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించారు. -
కేరళ గవర్నర్‌గా షీలాదీక్షిత్
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళవారం కేరళ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మంజుల చెల్లూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం ఊమెన్ చాందీ, మంత్రులతో పాటు షీలాదీక్షిత్ కుటుంబసభ్యులు, ఆమె సహచరులు పాల్గొన్నారు. 75 ఏళ్ల షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకూ సుదీర్ఘకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన ఆమెను కేరళ గవర్నర్‌గా యూపీఏ ప్రభుత్వం నియమించింది. కాగా, ఇప్పటివరకు కేరళ గవర్నర్‌గా పనిచేసిన నిఖిల్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామా చేశారు. -
కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్ ప్రమాణం
తిరువనంతపురం : కేరళ గవర్నర్‌గా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంజులా చెల్లార్ ... షీలాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ, పలువురు మంత్రులు, స్పీకర్ జి. కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు అయ్యారు. షీలా దీక్షిత్ ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ దుస్తుల్లో విచ్చేశారు. కాగా షీలా దీక్షిత్‌పై ప్రముఖ మలయాళ నటి రీమా కళింగళ్ సెటైర్ వేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేరళ గవర్నర్‌గా బాధ్యతల్ని చేపట్టనున్న షీలాదీక్షిత్‌పై తన ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి కలకలం పుట్టించారు. ఆ మధ్య ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ సంఘటనపై షీలాదీక్షిత్ మాట్లాడుతూ స్త్రీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా రాత్రి ఏడు గంటల్లోపు ఇల్లు చేరుకోవాలని అన్నారు. షీలాదీక్షిత్ మంగళవారం కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి రీమా కళింగళ్ తన ఫేస్బుక్లో షీలా దీక్షిత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా రానున్నారు కాబట్టి ఇకపై కేరళ స్త్రీలందరూ రాత్రి 7 గంటల్లోపే ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక షీలా దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ సీఎంగా 1998 నుంచి 2013 వరకు ఉన్నారు.అదేవిధంగా 1984-89 మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత డిసెంబర్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై ఘోరపరాజయం పాలైన మూడు నెలల వ్యవధిలోనే దీక్షిత్ గవర్నర్‌గా నియమితులు కావడం గమనార్హం. -
షీలా దీక్షిత్‌పై రీమా సెటైర్
-
షీలా దీక్షిత్‌పై రీమా సెటైర్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ప్రముఖ మలయాళ నటి రీమా కళింగళ్ సెటైర్ వేయడం సంచలనం సృష్టిస్తోంది. కేరళ కాంగ్రెస్‌వాదులు ఆమె మీద గుర్రుగా ఉన్నారు. వివరాల్లోకెళితే తమిళంలో ఇవన్ యువతి తదితర చిత్రాల్లో నటించిన కేరళ కుట్టి రీమా కళింగళ్. ఈ బ్యూటీ మలయాళంలో రీతు, హ్యాపీ హజ్బెండ్ కమ్మత్ అండ్ కమ్మత్ చిత్రాల్లో నటించి ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా, ఢిల్లీ మాజీ సీఎం, కేరళ గవర్నర్‌గా బాధ్యతల్ని చేపట్టనున్న షీలాదీక్షిత్‌పై తన ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి కలకలం పుట్టిస్తున్నారు. ఆ మధ్య ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ సంఘటనపై షీలాదీక్షిత్ మాట్లాడుతూ స్త్రీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా రాత్రి ఏడు గంటల్లోపు ఇల్లు చేరుకోవాలని అన్నారు. షీలాదీక్షిత్ మంగళవారం కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి రీమా కళింగళ్ తన ఫేస్బుక్లో షీలా దీక్షిత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా రానున్నారు కాబట్టి ఇకపై కేరళ స్త్రీలందరూ రాత్రి 7 గంటల్లోపే ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. నటి రీమా కళింగళ్ షీలా దీక్షిత్‌ను ఎగతాళి చేస్తున్నారంటూ కేరళ కాంగ్రెస్ వాదులు మండిపడుతున్నారు. అరుునా ఆమె మాత్రం వారి ఆగ్రహాన్ని పట్టించుకో లేదు. -
‘చేయి’కి ఊతమెవరో..
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనేళ్లుగా ఢిల్లీలో కాంగ్రెస్‌కు మారుపేరుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను లోక్‌సభ ఎన్నికలకు ముందు కేరళ గవర్నర్‌గా నియమించడంతో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఎవరు పార్టీకి నేతృత్వం వహిస్తారన్న ప్రశ్న తలెత్తింది. ఓటర్లకు సుపరిచితమైన షీలాదీక్షిత్‌ను కేరళ గవర్నర్‌గా నియమించి కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలకు ముందే పరాజయాన్ని అంగీకరించిందని పార్టీ విమర్శకులు అంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన పార్టీ ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లాలంటే ఓటర్లకు చిరపరిచితమైన వ్యక్తి నాయకత్వం కావాల్సి ఉంటుంది. షీలాదీక్షిత్ లోటును కాంగ్రెస్‌లో ఎవరు పూరిస్తారన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 15 ఏళ్ల షీలా ఏకచత్రాధిపత్యంలో ఢిల్లీ కాంగ్రెస్ నేతలంతా ప్రజల ముందు అనామకులుగానే మిగిలిపోయారు. ఆమె మర్రి చెట్టు చందమని... తన నీడలో మరో కాంగ్రెస్ నేతను ఎదగనీయలేదని అప్పట్లో విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు ఢిల్లీ కాంగ్రెస్‌లో పేరొందిన నాయకులుండేవారు. జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్, దీప్ చంద్ బంధూ, హెచ్‌కెఎల్ భగత్, ఆర్కె ధావన్, జగ్‌ప్రవేశ్ శర్మ, రాంబాబు శర్మ... వంటి హేమాహేమీలు ఢిల్లీ కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించేవారు. జగ్దీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్ వంటివారితో పాటు కపిల్ సిబల్, అజయ్ మాకెన్, జైప్రకాశ్ అగర్వాల్ తదితరులు ఇప్పటికీ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ షీలాదీక్షిత్ మాదిరిగా పార్టీని ఒక్కతాటిపై నడిపించగల సత్తా వీరికెవరికీ లేదు. సిక్కు అల్లర్ల అనంతరం జగదీశ్ టైట్లర్,సజ్జన్ కుమార్ల రాజకీయ జీవితం చిక్కుల్లో పడింది. మొత్తం లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపెకైత్తుకునే ప్రజాదరణ కపిల్ సిబల్ కు లేదు. చాందినీచౌక్ నుంచి గెలుపుకే ఆయన సర్వశక్తులు ఒడ్డవలసిన పరిస్థితి. ఇక అజయ్ మాకెన్, జైప్రకాశ్ అగర్వాల్ విషయానికి వస్తే షీలాదీక్షిత్ ప్రాభవంలో సైతం అధిష్టానం వద్ద కొద్దో గొప్పో గుర్తింపు పొందిన నాయకులుగా చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జై ప్రకాశ్ అగర్వాల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ డీపీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన ఆయనకు లోక్‌సభ ఎన్నికల బాధ్యతను అప్పగించే అవకాశాలు దాదాపుగా లేనట్లే. అగర్వాల్‌తో పోలిస్తే అజయ్ మాకెన్ కొంతవరకు షీలాకు దీటైన నేతగా గుర్తింపు పొందారు. మాకెన్కున్న ఈ గుర్తింపు దృష్ట్యా రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ ఆయననే ప్రచారంలో ముందుంచవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం డీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అర్వీందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలోనే పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జరపవచ్చని మరికొందరు అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల అనుకూల పవనాలు గట్టిగా వీస్తున్న సమయంలోనూ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అర్వీందర్ సింగ్ లవ్లీకి పార్టీని ముందుండి నడిపించడంలో సమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ లోక్‌సభ ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే జరుగుతాయన్నది అనుమానాస్పదమే. మాకెన్‌ను పక్కనబెట్టి ఆయన విధేయుడిగా ముద్రపడిన లవ్లీకి పార్టీ ప్రచార బాధ్యతను అప్పగించకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. -
కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(75) నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించా యి. గవర్నర్‌గా ఆమె నియామకానికి సంబంధించిన విషయాన్ని మంగళవారం ఉదయం ఇక్కడ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసిన సందర్భంలోనే షీలాకు వివరించారని తెలిపాయి. ఇదిలావుంటే, దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ సీఎంగా 1998 నుంచి 2013 వరకు ఉన్నారు.అదేవిధంగా 1984-89 మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా, ప్రస్తుత కేరళ గవర్నర్ నిఖిల్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని ఔరంగాబాద్ నుంచి తలపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గత డిసెంబర్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై ఘోరపరాజయం పాలైన మూడు నెలల వ్యవధిలోనే దీక్షిత్ గవర్నర్‌గా నియమితులు కావడం గమనార్హం. -
షీలా కుమారుడిపై గాంధీ మనవడు అమీతుమీ
లోకసభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం రెండవ జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం సందీప్ దీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి మహాత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీని ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దించడానికి సిద్దం చేసింది. 30 అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను ఆప్ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజన్ సుశాంత్ పోటి చేయనున్నారు. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సుశాంత్ ను బీజేపీ బహిష్కరించింది. ఇటీవలే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు పందీప్ దీక్షిత్ అన్న సంగతి తెలిసిందే. -
అద్దె చెల్లించండి..!
న్యూఢిల్లీ: గడువు ముగిసినా అధికారిక నివాసాల్లోనే ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు ప్రజాపనుల విభాగం నోటీసులు జారీ చేసింది. ఆమె ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కిరణ్ వాలియా, అరవింద్ సింగ్ లవ్లీ, హరూన్ యూసుఫ్‌లకు కూడా తాఖీదులు పంపింది. అనధికారికంగా ఉంటున్నందున మార్కెట్ ధర ప్రకారం షీలా దీక్షిత్ రూ. 3.25 లక్షలు, కిరణ్ వాలియా రూ. 5.8 లక్షలు, అర్విందర్‌సింగ్ లవ్లీ రూ. 6.5 లక్షలు, హరూన్ యూసుఫ్ రూ. 2.9 లక్షల అద్దె చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. వీరిలో షీలాదీక్షిత్, కిరణ్ వాలియాలు ఈ నెలారంభంలోనే తమ అధికారిక నివాసాలను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉన్నన్ని రోజులకుగాను అద్దె నిర్ణయించి, నోటీసులు పంపినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా లవ్లీ, యూసుఫ్‌లు ఇంకా ఖాళీ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై తూర్పు ఢిల్లీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, లవ్లీ, యూసుఫ్‌లు నివసిస్తున్న అధికారిక నివాసాలను ఖాళీ చేయించాలని సూచించామన్నారు. ఈ విషయమై ఎస్టేట్ అధికారి నుంచి వివరణ కోరామని, అప్పటి వరకు వేచిచూస్తామన్నారు. వారి వివరణ ఆధారంగానే లవ్లీ, యూసుఫ్‌లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి నివాసాలను ఆక్రమించుకునేందుకు నెల రోజులు పడుతుందన్నారు. నిబంధనల ప్రకారం పదవులకు రాజీనామా చేసిన తర్వాత 15 రోజులకు మించి అధికారిక నివాసాల్లో ఉండరాదని, ఆరు నెలల వరకు ఉండే అవకాశమున్నా మార్కెట్ ధర ప్రకారం అద్దె చెల్లించాల్సి ఉంటుందని, అందుకే ఐదుగురు కాంగ్రెస్ నేతలకు అద్దె చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. అందిన సమాచారం ప్రకారం ఇంతకుముందే షీలాదీక్షిత్‌కు ప్రజాపనుల విభాగం నుంచి నోటీసులు అందాయని, అందుకే ఆమె ఖాళీ చేశారు. దీంతో కిరణ్ వాలియా కూడా షీలా సూచనల మేరకు ఖాళీ చేశారు. దీంతో ప్రజాపనుల విభాగం అధికారుల దృష్టి ఇప్పుడు లవ్లీ, యూసుఫ్‌లపై పడింది. మార్కెట్ ధర ప్రకారం అద్దె చెల్లించి ఆరు నెలలు ఉంటారా? ఖాళీ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. -
కేజ్రీవాల్ సర్కారు విన్నపంపై 26న విచారణ
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై కేసు నమోదు కాకుండా అడ్డుకునేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన విన్నపంపై ఈ నెల 26వ తేదీన విచారణ జరగనుంది. ఈ కేసుపై వాదించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ అందుబాటులో లేరని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురావడంతో జస్టిస్ వీపీ వైష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ తేదీని 26గా ఖరారుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాఖలుచేసిన విన్నపాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆప్ ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన ఓ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి విదితమే. కాగా అవినీతికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు సభలో ఆమోదం లభించకపోవడంతో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మంత్రిమండలి రాజీనామా చేశారు. ఇదిలాఉంచితే షీలాదీక్షిత్ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆమెపై విచారణ జరపరాదంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందని, అందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదం తెలిపారని, అయితే ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రి పదవిలో లేదని తన విన్నపంలో అధికారం నుంచి ఇటీవల తప్పుకున్న ఆప్ ప్రభుత్వం కోరింది. అధికారంలో లేనందువల్ల ఆమె తరఫున పోరాటం జరిపేందుకు ఈ పిటిషన్‌కు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని పేర్కొంది. -
ఎంతో చేద్దామనుకున్నా!
న్యూఢిల్లీ: ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేద్దామనుకున్నానని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అయితే ఆప్ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ తనపై మంత్రవిద్య ప్రయోగించారని ఆరోపించారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్, విద్య, రహదారులు, ఆస్పత్రులు వంటి వాటిల్లో తాను సాధించిన పురోగతిని కొద్దిసేపు నెమరువేసుకున్నారు. ‘తన ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 97 శాతంమంది ఉత్తీర్ణులయ్యారు. అది దేశంలోనే అత్యధికమన్నారు. అయితే ఢిల్లీని అన్నిరకాలుగా తీర్చిదిద్దాలనే నా కలలు చెదిరిపోయాయి. సాధ్యం కాని హామీలతో ఓట్లు కొల్లగొట్టాడు. ఉచితంగా నీరు ఇస్తామని, తక్కువ చార్జీలకే విద్యుత్ సరఫరా, ఇంకా ఆవాసాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటివాటితో వారి దృష్టి మళ్లించాడు. 49 రోజులపాటు అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి నాపై కేసులు మోపడమే సరిపోయింది. కామన్వెల్త్ క్రీడల వీధిలైట్ల ప్రాజెక్టు కుంభకోణానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని కేజ్రీవాల్ ఆదేశించారు. ఇందులో నా త ప్పు ఏమీ లేదు. 2008 ఎన్నికలకు ముందు నిధులు దుర్వినియోగమయ్యాయంటూ మరో కేసు మోపారు. బీజేపీ నాయకుడు విజేంద్ర గుప్తా ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఈ కేసు నమోదైంది’ అని అన్నారు. కాగా నగరంలోని ఓ భవంతిలోకి నివాసాన్ని మార్చుకున్న 75 ఏళ్ల షీలా...దానిని తనకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడం, సినిమాలు చూడడం తదితరాలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. అయితే మీడియాతో మాట్లాడే సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. అర్వింద్‌పై మీ అభిప్రాయమేమిటని ప్రశ్నిం చగా జవాబిచ్చేందుకు ఆమె నిరాకరించారు. లోక్‌సభ ఎన్నికలపై ఆప్ ప్రభావం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించగా ఇతర రాష్ట్రాల్లోనూ ఢిల్లీ ప్రయోగాన్ని ప్రతిబింబించేలా చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ కచ్చితంగా ప్రయత్నిస్తాడన్నారు. అయితే అరాచక పాలన కావాలా లేక మంచి పాలన, అభివృద్ధి కావాలా అనే విషయాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారా అనేది చూడాల్సి ఉందన్నారు. దేశ ప్రజల్లో 99.99 శాతంమంది ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్నే కోరుకుంటారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని, చ ట్టాలను గౌరవించే ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటారన్నారు. మళ్లీ ఎన్నికలు జరిగితే నాలుగోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తామన్నారు. అయితే ఢిల్లీ విధానసభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై ఆమె ఏమీ చెప్పలేకపోయారు. తాము మాత్రమే నిజాయితీపరులమని, ఇతరులంతా అవినీతిపరులని ఆప్ భావిస్తోందన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై స్పందిస్తూ.. ఇక్కడి ప్రజలు బహుశా మార్పు కోరుకుని ఉండొచ్చన్నారు. ధరల పెరుగుదల, యూపీఏ ప్రభుత్వ పనితీరు ప్రభావం పడి ఉండొచ్చన్నారు. -
ఇల్లు మారిన షీలా దీక్షిత్
హస్తిన శాసనసభకు జరిగిన ఎన్నికలలో 'ఆప్' కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలైన న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఎట్టకేలకు ఇల్లు మారారు. మెతీలాల్ మార్గ్‌లోని 2.5 ఎకరాలలోని అత్యంత విశాలమైన ఆరు బెడ్ రూమ్‌లు గల ఫ్లాట్ నుంచి మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా ప్రాంతంలోని సిల్వర్ ఆర్క్ అపార్ట్మెంట్లో్కి ఐదవ అంతస్తులో ఆమె నివసించనున్నారు. ఆ ఆపార్ట్మెంట్ వైశాల్యం ఎంతో తెలుసా అక్షరాల 2 వేల చదరపు గజాలు. ఆ అపార్ట్మెంట్లోని మూడు గదులు గల ఆ ఇంట్లో ఒకటి షీలా పడక గదిగా మార్చారు. మరోకటి కార్యాలయం కోసం, మిగిలిన గదిని గ్రంధాలయం, వచ్చే అతిధుల కోసం వినియోగించనున్నారు. ఇప్పటికే షీలాకు చెందిన సామానంతా సిల్వర్ ఆర్క్ అపార్ట్మెంట్లో పని వారు పొందికగా అమర్చారు. దక్షిణ ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలో షీలాకు సొంత ఇల్లు ఉంది. అయితే ఆ నివాసంలోకి వెళ్లేందుకు ఆమెకు సుతారాము ఇష్ట పడటం లేదు. ఆ ఇంట్లో ఎలివేటర్ లేకపోవడమే కాకుండా ఆమె హుద్రోగ వ్యాధిగ్రస్తురాలు. అంతేకాకుండా షీలాకు బైపాస్ సర్జరీ జరిగింది. దాంతో ఆమె మెట్లు ఎక్కలేదు. దీంతో షీలా సిల్వర్ ఆర్క్ అపార్ట్మెంట్ వైపే మొగ్గు చూపినట్లు స్థానిక మీడియా సంస్థ మంగళవారం వెల్లడించింది. అయితేఆ అపార్ట్మెంట్లో కేవలం 11 నెలలు మాత్రమే నివసించేందుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌పై షీలా సంతకం చేయడం గమనార్హం. వరుసగా మూడు సార్లు న్యూఢిల్లీ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించిన షీలా దీక్షిత్ గతేడాది చివరలో ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. దాంతో ముఖ్యమంత్రి పీఠాన్ని షీలా వదులుకోవాల్సి వచ్చింది. గతంలో ఆమె సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై విచారణకు 'ఆప్' ప్రభుత్వం ఇప్పటికే సమాయిత్తమైన సంగతి తెలిసిందే. -
షీలాకు ‘లైట్’ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ:మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ఆమ్ఆద్మీ పార్టీ సర్కార్ ముందడుగు వేసింది. షీలాదీక్షిత్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కామన్వెల్త్ క్రీడల సమయంలో స్ట్రీట్లైట్ల కొనుగోలు ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ గురువారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు మొదటి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కామన్వెల్త్ క్రీడల సమయంలో నగరంలో అమర్చిన ఫ్యాన్సీ స్ట్రీట్లైట్ల ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. కామన్వెల్త్ క్రీడల సమయంలో స్ట్రీట్లైట్ల కొనుగోలుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరిపించాలని సర్కార్ ఏసీబీని ఆదేశించిందని పీడ బ్ల్యూడీ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. కామన్వెల్త్ క్రీడల సమయంలో స్ట్రీట్లైట్ల కొనుగోలు సమయంలో ప్రభుత్వానికి రూ. 31 కోట్ల నష్టం జరిగిందని అప్పట్లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయని సిసోడియా అన్నారు. దీనిలో ఎమ్సీడీ అధికారుల హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయని, ఈ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించామని మనీష్ చెప్పారు. లైట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అనుమతించినందువల్ల ఏసీబీ దాఖలుచేసే ఎఫ్ఐఆర్లో ఆమె పేరు ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌తోపాటు ఎమ్సీడీ అధికారులపై కూడా ఎఫ్ ఐఆర్ దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఓ పక్క అధిష్టానం నిర్లక్ష్యంతో డీలాపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు ఆమ్ఆద్మీ పార్టీ సర్కార్ నుంచి చిక్కులు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ మద్దతుతోనే ఆప్ సర్కార్ మనుగడ సాగిస్తుండటం వల్ల ఆ పార్టీ షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతోందని బీజేపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల సమయంలో కాంట్రాక్టు నియమాలను పక్కన బెట్టి విదేశాల నుంచి అధిక ధరలకు స్ట్రీట్లైట్లను కొన్నట్లు షీలా సర్కారుపై ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో షీలాదీక్షిత్ ైస్ట్రీట్ లైట్ల ప్రాజెక్టుపై సంతకం చేశారు. ఈ కేసుకు సంబంధించి షీలాదీక్షిత్‌పై నేరుగా ఫిర్యాదు దాఖలు కాకపోయినా ఎఫ్ఐఆర్లో ఆమె పేరు కూడా ఉండే అవకాశాలున్నాయి. కామన్వెల్త్ క్రీడల సమయంలో ఇందిరాగాంధీ స్టేడియం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఆకర్షణీయమైన స్ట్రీట్ లైట్లను అమర్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్సీడీ స్ట్రీట్ లైట్లను అమర్చింది. అయితే ఈ లైట్లు కాషాయ రంగులో ఉండడం ముఖ్యమంత్రికి నచ్చలేదు. వాటిని మార్చాలని ఆమె ఆదేశించారు. దాంతో పీడబ్ల్యూడీ ఆదరాబాదరాగా విదేశాల నుంచి ఎక్కువ ధరకు లైట్లను కొనుగోలు చేసి కొత్త లైట్లను అమర్చింది. సౌదీఅరేబియాకు చెందిన స్పేస్ ఏజ్ కంపెనీ నుంచి తెప్పించిన స్ట్రీట్ లైట్లను అమర్చారని, బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినస్పేస్ ఏజ్ కంపెనీని షీలాదీక్షిత్ జోక్యంతో బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. ఐదారు వేల రూపాయలకు లభించే లైట్లను ప్రభుత్వం రూ.25 వేల నుంచి రూ.32 వేలకు కొనుగోలు చేసిందని కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి దర్యాప్తు జరిపిన సీఏజీ అభిప్రాయపడింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.31 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఏజీ పేర్కొంది. స్ట్రీట్ లైట్లను సరఫరా చేయడడానికి స్పేస్ ఏజ్ కంపెనీకి కాంట్రాక్టు ఇప్పించడంలో షీలాదీక్షిత్ జోక్యాన్ని ప్రధాన మంత్రి నియమించిన షుంగ్లూ కమిటీ వేలె త్తి చూపింది. షుంగ్లూ కమిటీ నివేదిక ఆధారంగా కామన్వెల్త్ క్రీడల సమయంలో అప్పటి ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి అడ్డదారుల్లో లాభం చేకూర్చిందని మనీష్ సిసోడియా నేతృత్వంలోని పీడబ్ల్యూడీ ఒక నివేదిక రూపొందించినట్లు అనధికార వర్గాలు తెలిపాయి. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయవలసిందిగా అవినీతి నిరోధక శాఖను ఆదేశించారు. 2008లో అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు జారీ చేసిన ప్రొవిజనల్ సర్టిఫికెట్ల వ్యవహారంలో షీలా సర్కార్‌ను తప్పుపడ్తూ లోకాయుక్తా సమర్పించిన నివేదిక అధారంగా చర్యలు చేపట్టవలసిందిగా కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖరాసింది. 1984 సిక్కు అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో దర్యాప్తు జరిపించాలని లెప్టినెంట్ గవర్నర్‌కు సిఫారసు చేసింది. తాజాగా ప్రభుత్వ అడ్వర్టయిజ్మెంట్ల వ్యవహారంలో దర్యాప్తుకు అదేశించే సన్నాహాలలో ఉంది. ఆప్ సర్కారు చేపడుతున్న ఈ చర్యలతో కాంగ్రెస్, ఆప్‌ల మధ్య దూరం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్, ఆప్‌లు కుమ్మక్కయ్యాయని, గత్యంతరం లేకపోవడం వల్ల షీలా సర్కారుపై దర్యాప్తుకు ఆప్ ఆదేశిస్తోందని ఆరోపిస్తోంది. కాగా ఏసీబీ దర్యాప్తులకు కాంగ్రెస్ భయపడదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత హరూన్ యూసఫ్ చెప్పారు. -
షీలాపై చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై చర్యలకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు నడుం బిగించింది. ఒకవైపు కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతునిస్తున్నా, మరోవైపు షీలాపై చర్యల దిశగా అడుగులు వేయడం గమనార్హం. ఢిల్లీలోని అనధికారిక కాలనీలకు తాత్కాలిక క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లను మంజూరు చేయడంలో షీలా అవినీతికి పాల్పడ్డారంటూ ఆమెపై చర్యలకు సిఫారసు చేస్తూ లోకాయుక్త జారీచేసిన ఆదేశాల ఆధారంగా ‘ఆప్’ ప్రభుత్వం సోమవారం రాష్ట్రపతికి లేఖ రాసింది. లోకాయుక్త ఆదేశాల ఆధారంగా దోషులుగా తేలిన వారిపై చర్యలకు తాము రాష్ట్రపతికి సిఫారసు చేశామని ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. ఢిల్లీలో 2008 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనధికారిక కాలనీలకు దాదాపు 1200 తాత్కాలిక క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లను అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ చర్యకు పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చిన లోకాయుక్త జస్టిస్ మన్మోహన్ సరిన్, ఆమెపై చర్యలకు ఆయన రాష్ట్రపతికి సిఫారసు చేశారు. కూలదోసేందుకు మోడీ, జైట్లీ యత్నాలు... కేజ్రీవాల్ సర్కారును కూలదోసేందుకు బీజేపీ నేతలు నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీలు ప్రయత్నిస్తున్నారని ‘ఆప్’ ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆరోపించారు. ఇటీవల తనను ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారని, వారిలో మోడీకి సన్నిహితుడిగా చెప్పుకున్న సంజయ్ సింగ్ అనే వ్యక్తి, పార్టీని చీల్చితే రూ.20 కోట్లు ఇచ్చి, సీఎంను చేస్తానని తనకు ఎరవేశారని చెప్పారు. ‘పదిమంది ఎమ్మెల్యేలను బయటకు రప్పిస్తే, నన్ను సీఎంను చేసి, నా కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు చెల్లిస్తానని ఆశపెట్టాడు’ అని ఆరోపించారు. అలాగే, గత డిసెంబర్ 7న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి, జైట్లీ తనను కలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలనూ బయటపెట్టలేదు. -
షీలాపై చర్యకు సర్కారు సిఫార్సు
న్యూఢిల్లీ: తన మిత్రపక్షం కాంగ్రెస్‌కు ఆప్ సోమవారం షాక్ ఇచ్చింది. అనధికార కాలనీలకు క్రమబద్ధీకరణ పత్రాల జారీలో జరిగిన అవకతవకలకు బాధ్యురాలైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసింది. అనధికార కాలనీలకు క్రమబద్ధీకరణ పత్రాల జారీపై అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ లోకాయుక్త మన్మోహన్ సరీన్ విచారణ జరపడం తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఆమె ఈ పనిచేశారని గత ఏడాది నవంబర్‌లో ఆయన స్పష్టం చేశారు. పత్రాల జారీకి సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలను కూడా 2008లో అప్పటి షీలా దీక్షిత్ ప్రభుత్వం పాటించలేదని, ఎన్నికలకు ముందు హడావుడిగా పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు షీలా దీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ఆప్ సర్కారును ఇటీవల ఆదేశించారు. కాలనీల క్రమబద్ధీకరణలో అక్రమాలపై బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ లోకాయుక్తకు 2010లో ఫిర్యాదు చేశారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి క్రమబద్ధీకరణ పత్రాలు అందజేసిందని ఆరోపించారు. నగరంలోని 1,639 అనధికార కాలనీలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. 2008 ముందు వాటికి తాత్కాలిక క్రమబద్ధీకరణ పత్రాలను (ప్రొవిజనల్ సర్టిఫికెట్స్) పంపిణీ చేసింది. వీటిలో నివసించే 40 లక్షల మందికి అక్కడ కనీస సదుపాయాలు లేకపోవడంతో వాటిని క్రమబద్ధీకరిస్తున్నట్టు ప్రకటించింది. -
షీలాకు ఇక విశ్రాంతే!
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఇక విశ్రాంతి తీసుకోనున్నా రా? రాజ్యసభకు కాంగ్రె స్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థుల జాబితాను చూస్తే అవుననక తప్ప దు. ఫిబ్రవరి 7న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున మోతీలాల్ వోరా, మురళీ దేవరా, రంజీబ్ బిస్వాల్ పేర్లను మాత్రమే ఆ పార్టీ ప్రతిపాదించింది. వీరిలో షీలా పేరు లేకపోవడంతో ఇక ఆమెకు విశ్రాంతినివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
వెనక్కి తగ్గం
న్యూఢిల్లీ:షీలా దీక్షిత్ సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై త్వరలోనే విచారణ చేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీని ఇచ్చారు. కామన్వెల్త్ గేమ్స్, ఢిల్లీ జల్ బోర్డు నివేదికలను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని, కాంగ్రెస్‌పై చర్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన శనివారం మీడియాకు తెలిపారు. ఈ అవినీతి మూలాలను వెలికితీసేందుకు అవినీతి నిరోధక బృందాన్ని(ఏసీబీ) ఏర్పాటుచేస్తామన్నారు. కొన్నిరోజుల్లోనే గత ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇస్తున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతును వెనక్కి తీసుకుంటే ఏమీ చేస్తారన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ అలాంటి బెదిరింపులకు భయపడమన్నారు. అవినీతి విషయాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ సర్కార్ రేపు వెళ్లేది, ఈరోజు పోతుందన్నారు. ఢిల్లీ రాష్ట్ర పరిధిలోకి పోలీసుల వ్యవస్థ వచ్చేలా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అయితే తమపైనే చర్యలు తీసుకోవాలంటూ కొందరు పోలీసులు ఫిర్యాదుచేయడంపై కేజ్రీవాల్ అగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరామని, అయితే వాళ్లు ఈ విధంగా వ్యవహరించడం తగదన్నారు. సెక్స్, డ్రగ్ రాకెట్ విషయంలో చర్యలు తీసుకొని మాల్వియా నగర్ ఎస్‌హెచ్‌వోతో పాటు మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం మందు సోమవారం ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కేసు విచారణకు హాజరుకాని కేజ్రీవాల్ షీలా దీక్షిత్ మాజీ రాజకీయ కార్యదర్శి దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. వ్యక్తిగత హాజ రు నుంచి మినహాయింపు నివ్వాలన్న కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభ్యర్థనను చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సంజయ్ బన్సల్ శనివారం మన్నించారు. ఈ కేసులో వాంగ్మూలాలు నమోదుచేసేందుకు ఏప్రిల్ ఐదున మళ్లీ విచారణ ఉంటుం దని ప్రకటించారు. 2012, అక్టోబర్‌లో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ అనేక ఆందోళనలు నిర్వహించిన కేజ్రీవాల్, అప్పటి సీఎం షీలా ప్రతిష్టకు భంగం కలిగించే ఓ మీడియా షోలో అసభ్య పదజాలాన్ని వాడారని ఆమె రాజకీయ కార్యదర్శి పవన్ ఖేరా కోర్టుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తిలక్‌లేన్‌లో సీఎం కొత్త నివాసం సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలో మరో నివాసం లభించింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కేజ్రీవాల్‌కు తిలక్‌లేన్‌లో మూడు పడక గదుల నివాసాన్ని కేటాయిం చింది. సి2/23 తిలక్లేన్ చిరునామా కలిగిన రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను కేజ్రీవాల్‌కు కేటాయించారు. పైఅంతస్తులో సుప్రీం కోర్టు న్యాయవాది నివాసముంటున్నారు. టైప్ ఆరు కేటగిరీకి చెందిన ఈ నివాసం బిల్టప్ ఏరియా 1,600 చదరపు అడుగులు. ఈ ఇంటిని ఆనుకుని చిన్న లాన్ కూడా ఉంది. ఈ భవనానికి దగ్గరలోనే పార్కు ఉందని, దానిలో ముఖ్యమంత్రి ప్రజలను కలవవచ్చని అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్ త్వరలోనే ఈ ఇంటికి మకాం మారుస్తారని అంటున్నారు. కేజ్రీవాల్‌కు గతంలో భగవాన్‌దాస్ రోడ్లో సువిశాలమైన నివాసాన్ని కేటాయిం చడం, దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన దానిని తీసుకోవడానికి నిరాకరించడం తెలిసిందే. -
అవినీతి కాంగ్రెస్ నేతలకు ఆప్ సర్కారు అండ
న్యూఢిల్లీ: వివిధ కుంభకోణాల్లో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు ఇతర మంత్రులకు కేజ్రీవాల్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈ నెల 23వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేస్తామని ఆ పార్టీ ఢిల్లీ శాఖ మాజీ అధ్యక్షుడు విజయేంద్ర గుప్తా తెలి పారు. పార్టీ సహచరుడు జగదీష్ ముఖితో కలసి శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. షీలా ప్రభుత్వం అధికారంలో ఉండగా నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలను సేకరిం చేందుకు బీజేపీ ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించిందని అన్నా రు. ఈ కమిటీకి జాతీయ న్యాయవిభాగం కార్యదర్శి పింకీ ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారన్నారు. షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని ఆదేశించాలని ఎల్జీని కోరతామన్నారు. అధికారంలోకి రాగానే అవి నీతిని అంతం చేయడమే తమ లక్ష్యమంటూ శాసనసభ ఎన్నికల సమయంలో ఆప్ ప్రచారం సాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు గాలికి వదిలేసిందన్నారు. కామన్వెల్త్ క్రీడాకుంభకోణంపై ప్రధానంగా తాము దృష్టి సారిస్తామంటూ ఆ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిందన్నారు. ఆ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు అనేకమంది అధికారుల ప్రమేయం ఉందన్నారు. -
హస్తంతో దోస్తి చీపురికి చేటు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం చారిత్రక తప్పిదమని యోగా గురువు బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. హస్తంతో దోస్తి చేస్తే చీపురికే చేటు అని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం న్యూఢిల్లీలో రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎం షీలా దీక్షిత్‌పై గతంలో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, అయితే న్యూఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ పాలనా పగ్గాలు చేపట్టాక ఆమెపై విచారణ ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. సిక్కుల ఊచకోత కోసిన కాంగ్రెస్ పార్టీలో ఉండి... మోడీ వినాశకారి అని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొనడం విడ్డూరమని రాందేవ్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి అంశాలవారిగా మద్దతు ఇస్తున్నట్లు బాబా రాందేవ్ పేర్కొన్నారు. మోడీకి తమ మద్దతుపై రేపు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. మోడీ నాయకత్వంపై దేశవ్యాప్తంగా మద్దతు కూడాగట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో నిన్న విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో విలేకర్ల అడిగిన పలు ప్రశ్నలకు మన్మోహన్ సమాధానాలు ఇచ్చారు. మోడీ ప్రధాని అయితే భారతదేశానికి వినాశనమే అని ప్రధాని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దీంతో అటు బీజేపీ, ఇటు పలు పార్టీలు ప్రధాని వ్యాఖ్యాలపై ఘాటుగా స్పందించాయి. -
దెబ్బకుదెబ్బ బదులిస్తోన్న కేజ్రీవాల్
-
షరతులు వర్తిస్తాయ్: షీలా దీక్షిత్
ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయమై కాంగ్రెస్ మాటమార్చింది. బేషరతుగా మద్దతు ఇస్తామని తాము ఎన్నడూ అనలేదని, బయటి నుంచి మాత్రమే ఇస్తామని అంటోంది. ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకరించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆప్ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు. ఆప్‌కు బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మంచి విషయమేనని ఆయన చెప్పారు. తాము మద్దతు ఇచ్చేది ఆప్ మేనిఫెస్టోకే గానీ ఆప్‌కు కాదని ఆయన చెప్పారు. మేనిఫెస్టోను అమలుచేసి ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఆప్ నెరవేర్చాలని ఆయన కోరారు. -
అత్యాచార బాధితులను ఆదుకునేందుకు ట్రస్ట్
అత్యాచార బాధితులను ఆదుకునేందుకు నిర్భయ జ్యోతి ట్రస్ట్ ను నిర్భయ తల్లి ప్రారంభించారు. గత సంవత్సరం దేశ రాజధానిలో 23 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ నిర్భయ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో కాన్ స్ట్యూషన్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్బయ తల్లి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, బీజేపీ నేత సుష్మా స్వరాజ్, బాలీవుట్ నటి షబానా ఆజ్మీలతోపాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. అత్యాచార బాధితుల కోసం ట్రస్్్ ఏర్పాటు చేస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం అని నిర్భయ తల్లి తెలిపారు. షీలా దీక్షిత్, షబానా ఆజ్మిల ఎదుట నిర్భయ తల్లి భోరున విలపించింది. నిర్భయ తల్లి తండ్రులకు పలువురు సంతాపం తెలిపారు. డిసెంబర్ 16 తేదిన అత్యాచారానికి గురైన 'నిర్భయ' మృత్యువుతో పోరాడుతూ డిసెంబర్ 29 తేదిన తుది శ్వాస విడిచారు. -
జేపీ అగర్వాల్ రాజీనామా
న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరవైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ అగర్వాల్ పదవికి రాజీనామా చేసినట్టు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో అగర్వాల్ సహకరించకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలైందని కొందరు ఎమ్మెల్యేలు ఆరోపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2008లో 43 అసెంబ్లీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో పార్టీ తనకు సహకరించలేదని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సైతం ఆరోపించడం తెలిసిందే. -
అంతా జేపీ వల్లే!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పందించారు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆమె సోమవారం మీడియాకు తెలిపారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్‌కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె ఆభిప్రాయపడ్డారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ ఆగర్వాల్ సహకరించకపోవడం వల్లే దారుణ పరాజయాన్ని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, నగరవాసులు చెత్త పాలనను కోరుకోరని, అయితే అది ఇప్పుడు ఎన్నికల్లో జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు, ధరల పెరుగుదల, అవినీతి కుంభకోణాలకు మీరు బలయ్యారా అన్న విలేకరుల ప్రశ్నను ఆమె సమాధానమిస్తూ ఆ వ్యవస్థలో తాను కూడా ఒక భాగమేనన్నారు. అయితే భవిష్యత్ రాజకీయం గురించి ఇంకా ఆలోచించలేదని ముక్తసరి సమాధానమిచ్చారు. అప్పుడే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశమేమి లేదన్నారు. అయితే తొలిసారిగా పోటీచేసిన ఆప్‌ని తాము తక్కువగా అంచనా వేశామని అంగీకరించారు. బీజేపీనే తాము ఈ ఎన్నికలలో ప్రత్యర్థిగా పరిగణించామన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రత్యర్థి పార్టీలు ప్రజలను తప్పుదారిపట్టించాయని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి విద్యుత్ చార్జీలను తగ్గిస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చి చూపాలంటూ ఆమె ఆప్‌కి సవాలు విసిరారు. కలిసికట్టుగా ఎన్నికలలో పోరాడితే కాంగ్రెస్‌కి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని ఆమె చెప్పారు. జాతీయ సమస్యలు ఎన్నికలపై ప్రభావం చూపాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఏ సలహా ఇస్తారని ప్రశ్నించగా, అతను తనకన్నా చాలా తెలివైనవారని అభిప్రాయపడ్డారు. -
'ఆమ్ ఆద్మీకి మద్దతుపై నిర్ణయం తీసుకోలేదు'
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదుర్చుకునే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయమేమి తీసుకోలేదు అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. ఆమ్ ఆద్మీపార్టీకి మద్దతిచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు అవసరం లేదు అని.. వారు ఎవ్వరిని మద్దతు కోరడం లేదు అని షీలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురైన దారుణ ఓటమి కారణాలేంటనే విషయంపై తాము ఇంకా అధ్యయనం చేయలేదు అని ఆమె అన్నారు. ఢిల్లీలో తాము అందించిన సుపరిపాలనతో తాము ధైర్యంగా, నమ్మకంతోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని అన్నారు. -
జెయింట్ కిల్లర్!
సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన కేజ్రివాల్.. ఆతర్వాత అన్నా హజారే జన లోక్ పాల్ ఉద్యమం ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వాలను, ఢిల్లీ ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించిన 'నిర్భయ' ఘటనకు కేజ్రివాల్ ఆయన బృందం స్పందించిన తీరు పౌరులను ఆకట్టుకుంది. ఆటోల మీద ఏర్పాటు చేసే వ్యాపార ప్రకటనల మీద స్థానిక సంస్థలు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమించిన తీరు కే్జ్రివాల్ పై మరింత నమ్మకం పెంచింది. నీటీ, విద్యుత్ బిల్లుల పెంపును వ్యతిరేకిస్తూ.. బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ స్థానికంగా ప్రజల్లోకి దూసుకెళ్లింది. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ఉద్యమాల ద్వారా ఢిల్లీ ప్రజలకు భరోసా కల్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ నాయకులకు ప్రాధాన్యత కల్పించకుండా..సామాన్య వ్యక్తులనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పెట్టి ఓటర్ల దృష్టిని ఆకర్షించడంలో కేజ్రివాల్ సఫలమయ్యారు. రోజు రోజుకూ ఆమ్ ఆద్మీ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో వణుకు పుట్టించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టిస్తున్న ప్రభంజనాన్ని జీర్టించుకోలేక షీలా దీక్షిత్ 'ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే. ఆప్ అసలు పార్టీయే కాదు', విమర్శలు చేయగా, 'దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మాట్లాడాలి' అంటూ ఇతర పార్టీలు విసిరిన సవాళ్లకు ఆమ్ ఆద్మీపార్టీ నేత, కామన్ మ్యాన్ అరవింద్ కేజ్రివాల్ దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పారు. 15 సంవత్సరాలపాటు ఢిల్లీని పాలించిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, క్లీన్ ఇమేజ్ తో బీజేపీ విజయేంద్ర గుప్తాలకు దిమ్మ తిరిగేలా ఓటమి రుచి చూపించిన కేజ్రివాల్ కు రాజకీయ అనుభవం శూన్యమే. అయినా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రివాల్ అనుసరించిన పంథా, పార్టీ విధానాలు ప్రజల్లో, ఓటర్లలో విశ్వాసం పెంచాయి. షీలా దీక్షిత్ ఓడించడమే తన లక్ష్యం అని, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పోటీ చేసినా తాను అక్కడే పోటీ చేస్తానని సవాల్ విసిరి కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంపొందించారు. షీలా దీక్షిత్, కేజ్రివాల్ ల మధ్య పోరులో బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన విజయేంద్ర గుప్తాను రంగంలో నిలుపడంతో పోటీ మరింత ఆసక్తిగా మారింది. పదిహేనేళ్ల షీలా హయాంలో చోటుచేసుకున్న కామన్ వెల్త్ క్రీడల కుంభకోణం, నిర్భయ ఘటన, చార్జీల పెంపుకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమేకాకుండా, చైతన్యాన్ని కూడా కేజ్రివాల్ నింపారు. రాజకీయ ఉద్దండుల ప్రచారం, పార్టీల బలమైన వ్యూహాలు కేజ్రి'వాల్'ను ఏమి చేయలేక చతికిలపడ్డాయి. కొద్దికాలంలో రాజకీయాల్లో దూకుడు, పరిణతి చెందిన నిర్ణయాలకు సానుకూలంగా స్పందించిన ఓటర్లు..ఓ సామాన్యుడికి కూడా రాజకీయాల్లో స్థానం ఉంటుందనే అభిప్రాయాన్ని ఓటు ద్వారా ప్రజలు ఎలుగెత్తి చాటారు. ప్రజలు అందించిన మద్దతుతో రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న షీలా దీక్షిత్ ను, గుప్తాలను మట్టికరిపించి న్యూఢిల్లీ నియోజకవర్గంలో 25,864 ఓట్ల విజయంతో 'జెయింట్ కిల్లర్'గా నిలిచాడు. -
మాది విపక్ష పాత్రే: కేజ్రీవాల్
మాది విపక్ష పాత్రే: కేజ్రీవాల్ ఢిల్లీలో ఏ పార్టీ మద్దతుతోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని జెయింట్ కిల్లర్, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆదివారం వెలువడ్డ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆప్ మట్టికరిపించిన అనంతరం మద్దతుదారులను, మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ఫలితాలను చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు స్పష్టమైన సందేశమిది. కులం, మతం, అవినీతి, నేరాలు, ధన, కండ బలాలే ఇప్పటిదాకా ఈ పార్టీలను నడిపించాయి. ఇకనైనా సంస్కరణ బాట పట్టకుంటే ప్రజలే వాటిని ఇంటికి పంపుతారు’’ అన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కాదని, ప్రజా విజయమని అన్నారు. అవినీతిమయ రాజకీయాలకు, నీతి నిజాయితీలతో కూడిన రాజకీయాలకు మధ్య పోరాటం జరిగిందన్నారు. ఈ స్ఫూర్తితో ఢిల్లీ బయట కూడా విస్తరిస్తామని, మరింత క్రియాశీలకంగా మారతామని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా అని ప్రశ్నించగా లేదని బదులిచ్చారు. తమది విధాన, సైద్ధాంతిక పోరాటమే తప్ప షీలా దీక్షిత్‌తో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వమూ లేదన్నారు. ఢిల్లీలో మోడీ ప్రభావం లేదని పేర్కొన్నారు. మూర్ఖులం: షీలా ‘మేం మూర్ఖులం, కదూ?’ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పందన ఇది. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆదివారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజల మనోగతాన్ని పసిగట్టలేకపోయారా అన్న ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పరాజయాన్ని అంగీకరిస్తున్నాం. పొరపాటు ఎక్కడ జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకుంటాం. 15 ఏళ్ల పాటు మాకు మద్దతుగా నిలిచినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు’’ అన్నారు. శభాష్ కేజ్రీవాల్: హర్షవర్ధన్ ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయానికి గాను అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ అభినందనలు తెలిపారు. తమ పార్టీకి విజయం కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వారు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమన్నారు. ఢిల్లీ సీఎంగా 15 ఏళ్ల పాటు షీలా దీక్షిత్ సేవలందించారంటూ కొనియాడారు. -
కాంగ్రెస్ ను ఊడ్చేసిన ఆప్
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ‘డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మేన్’ అని చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ చెప్పిన డైలాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయానికి అతికినట్టు సరిపోతుంది. సామాన్యుడికి అండగా ఉంటామంటూ వచ్చిన ఆప్‌కు సామాన్యులే అండగా నిలిచారు. 2012 నవంబర్‌లో పురుడు పోసుకున్న ఈ పార్టీ ఏడాది వ్యవధిలోనే కళ్లు చెదిరే ఫలితాలు సాధించింది. 15 ఏళ్ల షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించింది. పార్టీ గుర్తు అయిన చీపురునే ఆయుధంగా మార్చి కాంగ్రెస్‌ను ఢిల్లీ నుంచి ‘ఊడ్చేసింది’. సమాజంలోని అన్ని వర్గాల ఆదరణ పొందడమే దాని విజయానికి మూల కారణమని చెప్పాలి. అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆ పార్టీ సామాన్యుల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజలకు చేరువైంది. రోజువారీ జీవనంలో తామంతా ఏదో ఒక దశలో అనివార్యంగా ఎదుర్కొంటున్న అవినీతి భూతం అంతం ఆప్‌తో సాధ్యమని ఢిల్లీ మధ్యతరగతి ప్రజలు విశ్వసించారు. వారి ఆగ్రహాన్ని పాలక పక్షంపైకి మళ్లించడంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పూర్తిగా సఫలీకృతుడయ్యారు. విద్యుత్, నీటి చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన చేపట్టిన ఉద్యమంతో పార్టీ మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఢిల్లీలో విద్యుత్ సరఫరాను రిలయన్స్, టాటా సంస్థలకు అప్పగించడం తెలిసిందే. బిల్లు కట్టలేనివారి మీటర్లను అధికారులు తొలగిస్తే కేజ్రీవాల్ స్వయంగా ఎలక్ట్రీషియన్ అవతారమెత్తి మరీ వాటిని బిగించారు. వ్యవస్థలో ఉంటూనే దాని లోపాలపై పోరాడతానంటూ ఆకట్టుకున్నారు. సవాళ్లే పునాదిరాళ్లు జన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక ఉద్యమాల సమయంలో.. ‘‘దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మాట్లాడాలి’’ అంటూ పార్టీలన్నీ విసిరిన సవాళ్లను కేజ్రీవాల్ స్వీకరించారు. ఆప్‌ను స్థాపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. మచ్చలేని వ్యక్తులు, సామాన్యులకే టికెట్లు ఇస్తామంటూ చేసిన ప్రకటనకు కట్టుబడ్డారు. వేరే పార్టీల నుంచి వచ్చిన ‘ఆయారాం.. గయారాం’లకు టికెట్లు నిరాకరించారు. విద్యావంతులను, సామాన్యులనే అభ్యర్థులుగా ఎంపిక చేయడం కూడా ప్రజాదరణకు కారణమైంది. వెంట నడిచిన యువత అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్‌తో పాటు ఉన్న యువత.. పార్టీ వెంట కూడా నడిచింది. యువ ఓటర్లలో అధిక శాతం ఓట్లు ఆప్ దక్కించుకుంది. యువత అండతో ప్రచారాన్ని కూడా వినూత్నంగా నిర్వహించి ఓటర్లను ఆకట్టుకుంది. వేలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారులు ఆప్‌కు మద్దతుగా విసృ్తతంగా ప్రచారం చేశారు. అంతెందుకు, ఢిల్లీ నట్టనడుమ ఆప్ ప్రధాన కార్యాలయమున్న భవనం కూడా ఎన్నారై అభిమాని ఒకరు నెలకు రూ.1 అద్దె లెక్కన అభిమానం కొద్దీ ఇచ్చిందే! ఆటోవాలాల అండ.. ఆటోల మీద ఏర్పాటు చేసే వ్యాపార ప్రకటనల మీద స్థానిక సంస్థలు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆటోవాలాల పక్షాన ఆప్ ఉద్యమించింది. దాంతో పన్నును ఉపసంహరిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆటోవాలాలంతా ఆప్‌కు అండగా నిలిచారు. సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ ఘటనకు కేజ్రీవాల్, ఆయన బృందం తీవ్రంగా స్పందించింది. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలనూ తూర్పారబడుతూ ఉద్యమించారు. మహిళల ఆదరణ లభించడానికి ఈ పోరాటం ఎంతగానో దోహదం చేసింది. ఆప్‌కు జాతీయ, స్థానిక మీడియా అధిక ప్రాధాన్యమివ్వడం కూడా ఆప్‌కు కలిసొచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ఓటుకు భారీ గండి ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే. ఆప్ అసలు పార్టీయే కాదు’’ అంటూ షీలా అవహేళన చేయడం అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌ను మూడోస్థానంలోకి నెట్టడమే గాక షీలాను కూడా ఆప్ ఇంటి దారి పట్టించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో ఎక్కువ శాతాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకున్న మురికివాడ(జుగ్గీ జోపిడీ)ల్లోకి చొచ్చుకెళ్లింది. విజయానికి ఆరు మెట్లు అవినీతిపై పోరాడుతుందన్న ట్యాగ్, ప్రజల్లో సానుభూతి తదితరాలన్నీ ఉన్నా, వాటిని ఓట్ల రూపంలోకి మార్చడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి సహకరించిన ఆరంచెల వ్యూహాన్ని ఒకసారి పరిశీలిస్తే... 1. అవగాహన కార్యక్రమం: దీన్ని మార్చిలో చేపట్టారు. ఇందులో భాగంగా మూడు వారాల్లోపే ఒక్క పాలెం ప్రాంతంలోనే 1,100 మందిని కొత్తగా ఓటర్లుగా చేర్చారు. 2. గడప గడపకూ ప్రచారం: ఏప్రిల్ నుంచి రెండు నెలల పాటు చేపట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనే ఏకంగా 72,000 నకిలీ ఓట్లను గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేశారు. 3. కాలింగ్: ఆప్‌ను మెరుగుపరిచేందుకు ఏం చేయాలో సలహాలు చెప్పాల్సిందిగా ప్రజలనే కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వీలైనంత మందికి, విదేశాల్లోని భారతీయులకు ఒక మొబైల్ నంబర్ పంపారు. సలహాలు, సూచనలతో మే-నవంబర్ మధ్య ఏకంగా 5 లక్షల పై చిలుకు ఫోన్లు వచ్చాయి! 4. మార్పు కోసం నాటకాల ప్రదర్శన: ఇది మరో ఆసక్తికర ప్రయోగం. పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు దేశభక్తి గేయాలు ఆలపించడం, ప్రజా సమస్యలు తదితరాలపై నాటకాలాడటం వంటివి ఓటర్లను బాగా ఆకర్షించాయి. వాటిలో భాగంగానే పార్టీ లక్ష్యాలను కూడా వివరించేవారు. ఇందులో కాలేజీ విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 5. మెట్రో వేవ్: ప్రయాణికుల్లో అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఆఫ్ కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమమిది. పార్టీ జెండా, టోపీలతో వారు మెట్రో ప్లాట్‌పారాలపై నడుస్తూ తమ లక్ష్యాల గురించి ప్రయాణికులకు వివరించేవారు. 6. బూత్ మేనేజ్మెంట్: ఆప్ తన ప్రచారాన్ని పోలింగ్ బూత్‌ల వారీగా పక్కాగా నిర్వహించింది. ప్రచార సరళి గురించిన వివరాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరవేసేవారు. అప్పుడప్పుడు కేజ్రీవాల్ స్వయంగా వారితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. -
కుంగిన శిఖరం: షీలాదీక్షిత్
దేశ రాజకీయ కేంద్రమైన ఢిల్లీని వరుసగా 15 ఏళ్ల పాటు పాలించిన తిరుగులేని రికార్డు షీలాదీక్షిత్ సొంతం. అయితేనేం, ‘ఆమ్ ఆద్మీ’ రాజకీయ ప్రభంజనాన్ని తట్టుకుని నిలవలేకపోయారామె. షీలా సారథ్యంలో కాంగ్రెస్ మట్టి కరవడమే గాక స్వయంగా ఆమె కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేతుల్లో ఘోర పరాజయం పాలయ్యారు. 75 ఏళ్ల షీలా తన రాజకీయ జీవితంలో ఇంతటి పరాభవాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ప్రజాగ్రహం, ప్రభుత్వ వ్యతిరేకత, కొత్తగా వచ్చిన ఏఏపీ గాలితో పాటు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు అసమర్థ పాలన, అంతులేని అవినీతి, భారీ కుంభకోణాలు కూడా షీలా పాలిట శాపాలుగా మారాయి. 1938లో పంజాబ్‌లోని కపుర్తలలో జన్మించిన షీలా, కేంద్ర మాజీ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ కోడలిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1984లో యూపీలోని కనౌజ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో అనూహ్య రీతిలో ఢిల్లీ కాంగ్రెస్ శాఖ పగ్గాలతో పాటు సీఎం పదవినీ చేపట్టినా... అభివృద్ధి, సుపరిపాలన నినాదాలతో 2003, 2008ల్లో అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే 2010 కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో రాజ్యమేలిన విచ్చలవిడి అవినీతికి కళ్లెం వేయలేకపోయారన్న అపకీర్తిని ఆమె మూటగట్టుకున్నారు. -
అటు కోలాహలం.. ఇటు నైరాశ్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఆదివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. బాణసంచా కాలుస్తూ సంబరాలు.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు వార్తలు వెలువడుతుండడంతో ఒక్కరొక్కరుగా బీజేపీ కార్యకర్తలంతా అశోకారోడ్డు లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఫలితాలు వస్తున్న కొద్దీ కోలాహలం పెరుగుతూ వచ్చింది. డప్పు చప్పుళ్ల మధ్య నత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా కాలుస్తూ సంతోషంగా గడిపారు. వచ్చిపోయే నేతలకు శుభాకాంక్షలు చెబుతూ బీజేపీ కార్యకర్తలు సందడి చేశారు. బీజేపీకి అనుకూల ఫలితాలు వెలువడడంతో కేంద్ర బీజేపీ కార్యాలయం వద్ద మీడియా కోలాహలం మరింత పెరిగింది. విజయాన్ని అందరితో పంచుకునేందుకు కేంద్ర కార్యాలయానికి వచ్చిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రాకతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులతోపాటు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సైతం సంబరాల్లో పాల్గొన్నారు. చీపుర్లు చూపుతూ నృత్యాలు.. ఆమ్ఆద్మీ పార్టీ అనూహ్య విజయం ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ ఎన్నికల గుర్తు అయిన చీపుళ్లను పెకైత్తి చూపుతూ హనుమాన్రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట నృత్యాలు చేశారు. వందల సంఖ్యలో యువత ఆమ్ఆద్మీ పార్టీ టోపీలు ధరించి అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా అక్కడే గడిపారు. పార్టీ ఫలితాలు తెలుసుకుంటూ కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. షీలాదీక్షిత్‌పై కేజ్రీవాల్ వేల మెజార్టీతో ఉన్నారని చెప్పిన ప్రతిమారు చప్పట్లు, కేకలతో ఆనందం వ్యక్తం చేశారు. 25 వేల పైన ఓట్లతో కే జ్రీవాల్ గెలుపొందడంతోపాటు మొత్తం 28 స్థానాలు ఆప్ గెలుచుకోవడంపై ఆ పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మానుష్యంగా కాంగ్రెస్ కార్యాలయాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం మొదలైన గంట నుంచే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, డీడీయూ మార్గ్‌లోని డీపీసీసీ కార్యాలయం, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాస పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. 2008లో 43 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం ఏడు స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు పనిచేసిన షీలాదీక్షిత్ సైతం ఓటమి పాలుకావడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటంలేదు. -
కాంగ్రెస్‌కు ‘చీపురు’ దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనను బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూకటి వేళ్లతో సహా పెకిలించాయి. పదిహేనేళ్లు ఢి ల్లీ పీఠాన్ని అధిరోహించిన షీలా సర్కార్‌కి ఆదివారం నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం ఎదురైంది. 2008లో 43 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. షీలాదీక్షిత్ కనీసం తన స్థానాన్ని సైతం నిలబెట్టుకోలేకపోయారు. పట్టుపట్టి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ 25 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్న ఢిల్లీవాసులు సహజంగానే తమ ఓటుద్వారా నిరసన తెలపడం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోమారు టిక్కెట్లు ఇస్తే గెలిచి నిలవొచ్చన్న షీలాదీక్షిత్ వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు వరుసగా రెండు మూడు పర్యాయాలు పార్టీ పెద్దలు కూడా ప్రచారానికి విముఖత వ్యక్తం చేయడంతో షీలా ప్రభుత్వం దిగిపోక తప్పలేదు. ఢిల్లీలో మంత్రులుగా కొనసాగుతున్న వారిలోనూ ఎక్కువ మంది ఓటమి పాలుకావడం గమనార్హం. కాంగ్రెస్‌పార్టీ ఓటమిని అంగీకరిస్తూ ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ వెంటనే తన రాజీనామాను ఎల్జీకి పంపారు. -
గుడ్ బై..: షీలా దీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగిన షీలాదీక్షిత్‌కు ఘోర పరాభం ఎదురైంది. విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నడిపించిన ఆమెకే ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన ఈ దుస్థితికి ఆ పార్టీ నేతలందరూ కారణమైనప్పటికీ ఓటమిని షీలా హుందాగా అంగీకరించారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఉండడాన్ని గమనించిన షీలాదీక్షిత్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆమె విలేఖరులతో మాట్లాడూతూ ఢిల్లీ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిచ్చినందుకు ఆమె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములను విశ్లేషిస్తూ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఆమె నిరాకరించారు. వాటికి తరువాత సమాధానమిస్తానంటూ దాటవేశారు. అయితే ఓటర్ల మూడ్ ను కనిపెట్టడంలో విఫలమయాృరా అన్న ప్రశ్నకు మాత్రం కాస్త అసహనంగా, మరికొంత వెటకారంగా.. ‘బేవకూఫ్హూనా’ ( తెలివితక్కువదాన్ని కదా) అని జవాబిచ్చి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నిజానికి ప్రచారానికి పార్టీ పెద్దలు ముఖం చాటేసినా, స్థానిక నాయకులే సహకరించకపోయినా ఆమె తన లక్ష్యంవైపే పయనించారు. పార్టీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశారు. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కీర్తిప్రతిష్టలు మూటగట్టుకున్న ఆమెకు కేంద్రంలో పార్టీ అవలంబిస్తున్న విధానాలు కూడా ప్రతికూలంగా మారాయి. ఎన్నికల బాధ్యతను పూర్తిగా ఆమె భుజాలపైకే నెట్టడం, దీర్ఘకాలంగా ఆమెకే ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తుండడంతో అవకాశం రాని స్థానిక నేతలు సహకరించకపోవడం వంటివే రాజధానిలో కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. వీటికి తోడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రత్యేకించి షీలాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. -
వెధవలమని మీ ఉద్దేశమా?: షీలా దీక్షిత్
ప్రస్తుత్తం మేము వెధవలమని మీ ఉద్దేశమా? (బెవకూఫ్ హై నా) అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియా రిపోర్టర్లపై మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షీలా మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాపులారిటీని, ఢిల్లీ ప్రజలు మనోభావాలను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మేము వెధలమా అంటూ కోపంగా జవాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును అంగీకరిస్తామని షీలా అన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఎదురుగాలి తప్పదు అని సర్వేలు వెల్లడించాయి. గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన షీలా దీక్షిత్ నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలో దిగడంతో షీలాకు ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. -
ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా
ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రాజీనామా సమర్పించారు. గత 15 సంవత్సరాలుగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్ కేజ్రివాల్ కంటే 5500 వేల ఓట్ల తేడాతో షీలా వెనుకంజలో ఉంది. షీలా దీక్షిత్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కి అందచేశారు. ప్రస్తుత ఫలితాలను బట్టి 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పది స్థానాల్లో కూడా గెలిచే పరిస్తితి కనిపించడం లేదు. -
పొత్తుల విషయంలో స్పష్టత ఇవ్వని క్రేజీవాల్
-
న్యూఢిల్లీలో బీజేపీ, ఆప్‌ల మధ్య పోటాపోటీ
న్యూఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా బీజేపీ, ఆప్ పార్టీల మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది.15 మంది బీజేపీ అభ్యర్థులు అధిక్యంలో ఉండగా, ఆప్ పార్టీ అభ్యర్థులు 13 మంది విజయపథంలో దూసుకుపోతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు ముందంజలో ఉన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ కూడా కృష్ణ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా విజయం వైపు దూసుకుపోతున్నారు. అయితే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన షీలా దీక్షిత్ సమీప ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ కంటే అధిక్యంలో కొనసాగుతున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు అధిక్యంలో ఉన్నారు. -
కేజ్రీవాల్‌పై షీలా దీక్షిత్‌కు ఆధిక్యం
న్యూఢిల్లీ: అత్యంత పటిష్టాత్మకంగా మారిన న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటా పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్‌పై షీలా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కృష్ణానగర్ లో బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్థన్ కు ఆధిక్యంలో ఉన్నారు. 14 కేంద్రాల్లో భారీ భద్రత నడుమ ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 810 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
సర్వేలపై నమ్మకం లేదు: షీలా
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, సర్వేలను తాను నమ్మనని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎగ్జిట్ పోల్స్, సర్వేల ఫలితాలపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘సర్వేల ఆధారంగా మేమెప్పుడూ పనిచేయలేదు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తదితర ఫలితాలను నేను ఎంతమాత్రం నమ్మను. మేం చేయాల్సింది చేశాం. లెక్కింపు పూర్తయ్యాక ఫలితాల గురించి మాట్లాడుకుందామ’న్నారు. ఫలితాలు ఎలా ఉంటాయని మీరు ఆశిస్తున్నారు? అని అడిగిన ప్రశ్నకు మళ్లీ అదే సమాధానమిస్తూ... ‘ఫలితాల తర్వాతే మాట్లాడుకుందామ’ని చెప్పారు. -
మండేలామృతికి షీలా సంతాపం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా అస్తమయంపట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మండే లా జీవితం ప్రపంచ వ్యాప్తంగా హక్కుల పోరాట కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలి చిందన్నారు. నిజమైన గాంధేయవాది,ప్రపంచ విశిష్ట నాయకుల్లో ఒకడైన నెల్సన్ మండేలాను యావత్తు భారత జాతి గౌరవిస్తుందని, వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన రాజీలేని పోరాటం భారత జాతి చిరకాలం గుర్తుంచుకుంటుందన్నారు. మండేలా సాగించిన పోరాటమే ఆయనను దక్షిణాఫ్రికా నేతగా నిలబెట్టిందని, సమానత్వం, స్వేచ్ఛల కోసం ఆయన సాగించిన పోరాటం ఆదర్శనీయమన్నారు. మండేల భార త జాతికి విశ్వసనీయ నేస్తమని తన సంతాప సందేశంలో పేర్కొంది. మండేలా అస్తమయం పట్ల ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా సంతా పం ప్రకటించింది. ప్రపంచం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం సల్పి ఆఫ్రికా ప్రజల కు జీవితాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని, ప్రపంచ వ్యాప్త అభ్యుదయ వాదులకు ఆయన జీవితం ఆదర్శమని ఆ పార్టీ కార్యదర్శి జీ దేవరాజన్ పేర్కొన్నారు. -
పోటెత్తిన ఓటరు
సాక్షి, న్యూఢిల్లీ:మిగతా విషయాల్లో చైతన్యవంతులనే పేరున్న ఢిల్లీవాసులపై.. ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరనే ముద్ర పడిపోయింది. ముఖ్యంగా యువత, మహిళలు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు వచ్చి, క్యూ లైన్లలో నిలబడడానికి బద్దకిస్తారనే విషయం ఇప్పటిదాకా జరిగిన పలు ఎన్నికల్లో నిరూపితమైంది కూడా. అయితే తమపై పడిన ఈ ముద్రను బుధవారం జరిగిన విధానసభ ఎన్నికల్లో నగరవాసులు చెరిపేసుకున్నారు. ఢిల్లీవాసులు ఓట్ల పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఓటింగ్ శాతం గత రికార్డులను అధిగమించింది.వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి గంటల తరబడి క్యూలో నిలబడడానికి కూడా వారు వెనుకాడలేదు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 8 గంటలు దాటినా కొనసాగిన ఓటింగ్.. సాధారణంగా సాయంత్రం 5 గంటలు దాటిందంటే పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యమవుతాయి. అయితే బుధవారం జరిగిన ఎన్నికల్లో మాత్రం 8.30 గంటల వరకు ఓటర్లు బూత్‌ల ముందు కనిపించారు. నిబంధనల ప్రకారం 5 గంటలకే ముగియాల్సి ఉండగా ఎన్నికల సంఘం గడువును పొడిగించడంతో దాదాపు మరో మూడున్నర గంటలపాటు ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో అధికారం కోసం పోటీపడ్తోన్న మూడు ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు షీలాదీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్, డాక్టర్ హర్షవర్ధన్ తమ అమ నియోజకవర్గాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముగ్గురూ గెలుపుతమదేనన్న ధీమా వ్యక్తం చేశారు. వీఐపీల విషయానికి వస్తే గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రముఖులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తో పాటు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రస్తుత స్పీకర్ మీరాకుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముఖ్యమంత్రి షీలాదీక్షి త్తో కలిసి నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన తరువాత ఆమె విలేఖరుల ఎదుట విజయం తమదే అన్న ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేతివేళ్లతో విజయం గుర్తు చూపించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఔరంగాజేబ్ లేన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రియాంకా వాద్రా తన భర్త రాబర్ట్ వద్రాతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ఓటింగ్ ప్రారంభమైన వెంటనే హనుమాన్ రోడ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లు తినడానికంటే ముందే ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ కృష్ణానగర్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఆ తరువాత హర్షవర్ధన్ మాట్లాడుతూ... కాంగ్రెస్, కొత్తగా వచ్చిన ఆప్ కన్నా తాము ఎంతో ముందున్నామని, గెలుపు తమదేనని, 100 శాతం నమ్మకంతో ఉన్నామని చెప్పారు. తమ ఓటు బ్యాంకును ఎవరూ కొల్లగొట్టలేరని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఓటరు జాబితాలో నుంచి పలువురి పేర్లు మాయం కావడం వల్ల వారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆరోపించింది. ఇబ్బందిపడిన ఓటర్లు... పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు విధించిన ఆంక్షలు ఓటర్లను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. పోలింగ్ బూత్‌లకు వచ్చేముందు ఓటర్లు తమతో సెల్ఫోన్లు తీసుకురాకూడదని ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రచారం చేయకపోవడంతో చాలా మంది సెల్ఫోన్లతోపాటు వచ్చి బారులు తీరారు. తీరా తమవంతు వచ్చేసరికి సెల్‌ఫోన్ కారణంగా లోపలికి వెళ్లనీయకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సెల్‌ఫోన్ తీసుకురాకూడదనే విషయం ముందుగానే చెబితే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. చాలామందికి దీనిపై అవగాహన లేక తమతోపాటు సెల్ఫోన్లు తీసుకువచ్చి, తీరా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేముందు ఫోను ఉన్నందుకు తిరిగి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల చాలామంది ఇబ్బందిపడ్డారని చార్టెర్డ్ ఎకౌంటెంట్, తూర్పు ఢిల్లీలోని డిఫెన్స్ ఎన్‌క్లేవ్‌లో ఓటరైన శశిగుప్తా తెలిపారు. ఇదిలాఉండగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయని పలువురు ఆరోపించారు. విశ్వాస్‌నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాశ్ చౌదరి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు అరగంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చిందని ఆ పార్టీ కార్యకర్త నరేష్ చౌదరి తెలిపారు. తాను కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 20 నిమిషాలు వేచి ఉన్నానని ఓటరైన అఖిల్ భార్గవ తెలిపారు. పోలింగ్ బూత్‌ల సందర్శనకు విదేశీ బృందం శాసనసభ ఎన్నికలకు జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు 36 మంది సభ్యులున్న విదేశీ బృందం పలు నియోజకవర్గాల్లో పర్యటించిందని ప్రత్యేక ప్రధాన ఎన్నికల అధికారి సింగ్ తెలిపారు. తమ పర్యటన సమయంలో బృందం న్యూఢిల్లీ, షాలిమర్ బాఘ్, కృష్ణనగర్, పటేల్‌నగర్ తదితర నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న విధానాన్ని అధ్యయనం చేసిందని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు చెందిన 8 మంది సభ్యుల బృందం కూడా మంగళవారం ఢిల్లీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిందని సింగ్ వివరించారు. ఓటేసిన సెక్స్ వర్కర్లు స్థానిక జీబీ రోడ్ రెడ్‌లైట్ ఏరియాకు చెందిన సుమారు 1,050 మంది సెక్స్‌వర్కర్లు బుధవారం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ‘భారతీయ పతిత ఉద్ధార్ సభ’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఖైరతీలాల్ భోలా ఈ విషయమై మాట్లాడుతూ.. మధ్యాహ్నం బల్లీమరాన్, అజ్మీర్గేట్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు సుమారు 1,500 మంది సెక్స్‌వర్కర్లు వచ్చారని తెలిపారు. అయితే గుర్తింపు కార్డుల్లో ఉన్న లోపాల వల్ల కొందరిని ఓటింగ్‌కు అధికారులు అనుమతించలేదని చెప్పారు. జీబీరోడ్లో ఉన్న 25 భవనాల్లో నిర్వహిస్తున్న 116 వ్యభిచార గృహాల్లో సుమారు 5,000 మంది సెక్స్‌వర్కర్లు ఉన్నారని ఆయన వివరించారు. 112 ఈవీఎంల మార్పిడి.. నగరంలోని పలు పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) మొరాయించడంతో వాటిని మార్చి కొత్త యంత్రాలను ఉపయోగించినట్లు ఎన్నికల అధికారి నీరజ్ భర్తీ తెలిపారు. నగరవ్యాప్తంగా ఇలా 112 ఈవీఎంలను మార్చామన్నారు. వీవీపీఏటీ విజయవంతం ఓటరు తాను వేసిన ఓటు సరిగా నమోదయ్యిందా లేదా అని తెలుసుకునేందుకు ఉద్దేశించిన ‘ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీపీఏటీ)’ పద్ధతిని నగరంలో మొదటిసారి న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత విజేందర్ గుప్తా మధ్య ఆసక్తికర పోరు నడుస్తున్న నేపథ్యంలో న్యూఢిల్లీ నియోజకవర్గాన్ని తాము మోడల్‌గా ఎంచుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వీవీపీఏటీ పద్ధతిలో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి ఒక ప్రింటింగ్ యంత్రాన్ని అనుసంధానిస్తారు. తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటరు ఈవీఎంలోని బటన్ నొక్కిన తర్వాత ప్రింటింగ్ యంత్రంలో లైట్ వెలుగుతుంది. తర్వాత అందులోంచి బ్యాలెట్ సీరియల్ నంబర్, ఓటరు ఓటేసిన అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు తదితరాలతో ప్రింట్ బయటకు వస్తుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా బుధవారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటరులెవ్వరికీ ప్రింటెండ్ రశీదులను ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. ఓటేశాక ఎవరేమన్నారంటే.... మరోమారు గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఈ ఓట్లు కేంద్రానికి రిఫరెండం కావు. రాజకీయాలను నేను వ్యక్తిగతంగా తీసుకోను. పార్టీకే నామొదటి ప్రాధాన్యం. మోడీ ప్రచారం బీజేపీకి కలిసి వస్తుందనుకోను. హజారే లేఖ ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీపై తప్పక ఉంటుంది. - షీలాదీక్షిత్, ముఖ్యమంత్రి వందశాతం మేమే గెలుస్తామని నమ్మకం ఉంది. ఢిల్లీవాసుల నుంచి మాకు ఎంతో మద్దతు లభిస్తోంది. వారి ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. బీజేపీ మిగిలిన రెండు పార్టీలకంటే ఎంతో ముందుంది. విజయం మాదే. మిగిలిన రెండు పార్టీలు రెండో స్థానం కోసం పోటీపడుతున్నాయి. - డాక్టర్ హర్షవర్ధన్ ఎన్నికల ఫలితాలపై నాకు ఎంతో నమ్మకం ఉంది. ఇది నా గెలుపు కాదు. ప్రజల విజయం అవుతుంది. డిసెంబర్ ఎనిమిదిన ఫలితాల తర్వాత కలుద్దాం. - అరవింద్ కేజ్రీవాల్ అత్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీవాసులకు కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు. మరోమారు మేమే అధికారంలోకి రాబోతున్నాం. - జైప్రకాశ్ అగర్వాల్ ప్రత్యర్థి పార్టీలతో పోలిస్తే మేం ఎంతో ముందు ఉన్నాం. ఢిల్లీ ప్రజలను మార్పు కోరుతూ తమ తీర్పు ఇచ్చారు. ప్రత్యర్థులు పంచిన మద్యం, డబ్బు, కానుకలు మాపై ఉంచిన నమ్మకం ముందు వెలవెలబోయాయి. వాటిని కాదని ప్రజలు బీజేపీకే ఓటు వేశారు. - విజయ్ గోయల్ -
క్యూలో నిలబడి ఓటేసిన సోనియా, షీలా దీక్షిత్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. వీవీఐపీలు కొలువుదీరిన హస్తినలో ప్రముఖులు తమ ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన సోదరి ప్రియాంకవాధ్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా లోథి ఎస్టేట్‌లో ఓటేశారు. అటు... నేవీ చీఫ్ కామ్రాజ్ లేన్‌లో నేవీ చీఫ్ డీకే జోషీ ఓటేశారు.మాజీ కంప్ట్రోలర్ అండ్ జనరల్ వినోద్‌రాయ్, కాంగ్రెస్ నాయకుడు రామ్‌లాల్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామరాజ్లేన్లో వినోద్‌రాయ్, నిర్మన్ భవన్లో రామ్‌లాల్ ఓటు వేశారు. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాలు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ మందిర్మార్గ్లో ఓటు వేశారు. బీజేపీ ముఖ్యమంత్రి హర్షవర్థన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణానగర్‌లో ఆయన ఓటు వేశారు. ఢిల్లీవాసులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకొని గత రికార్డులు బద్దలు కొట్టాలని ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇక ఉదయం 8 గంటలకు మందకొడినన ప్రారంభమైన పోలింగ్ క్రమంగా ఊపందుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీల్లో ఎవరిని గద్దెనెక్కించాలో నిర్ణయించడానికి ఢిల్లీ ఓటర్లు ముందుకు కదిలారు. ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు... ఛత్తీస్గడ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటె ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతుందని చీఫ్ ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ విజయం ఖాయం: షీలాదీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ: తన ప్రభుత్వం గత 15 ఏళ్లలో సాధించిన విజయాలను మరోమారు ప్రస్తావించి, తమను మరోమారు అధికారంలోకి తెస్తే ఏమేం చేయాలనుకుంటున్నామో చెప్పి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ విధాన సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ ఓటర్లను ఆఖరిసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఢిల్లీ కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని, కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఈ అభివృద్ధిని మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నామని చెబుతూ.. కాంగ్రెస్‌కు మరోసారి ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. గడచిన 15 ఏళ్లలో ఢిల్లీ ఎంతో అబివృద్ధి చెందిందని, సాంఘిక, ఆర్థిక రంగాల్లో నగరం అభివృద్ధి చెందిందని, మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని ఆమె చెప్పారు. దేశంతో ఢిల్లీ అభివృద్ధి రేటును పోల్చిచూపుతూ దేశంలో సగటు అభివృద్ధి రేటు 8.33 శాతం ఉండగా, ఢిల్లీ 10.33 రేటుతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. విద్యుత్తు చార్జీలు కూడా దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే ఢిల్లీలో తక్కువగా ఉన్నాయన్నారు. సుఖమయమైన జీవితాన్ని కోరుకునేవారిని ఢిల్లీ ఆకర్షిస్తోందన్నారు. తాము అధికారంలోకి వస్తే చే సే పనులను కూడా ఆమె వివరించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ కామన్ ఎకనామిక్ జోన్‌గా రూపొందాలని తాము కోరుతున్నామని, దాని వల్ల ఎన్సీఆర్ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఎదగాలని కోరుతున్నామని ఆమె చెప్పారు. ప్రతి సంవత్సరం 30 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించేలా నైపుణ్యాల ఆధారిత సేవారంగాన్ని విస్తరించాలని ఆశిస్తున్నామన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం కోసం సెంట్రల్ పార్కింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. నగరంలో కార్లు, ట్రాఫిక్ పెరిగిపోయిందని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు. అన్నశ్రీ యోజన, పీడీఎస్, ఆహార భద్రత పథకాల అమలులో పారదర్శకతను సాధించడం కోసం వెండింగ్ మిషన్లు ఏర్పాటుచేస్తామన్నారు. అనధికార కాలనీలను అనిశ్చితి నుంచి రక్షించడం కోసం క్రమబద్ధీకరించాలనుకుంటున్నామని, కొత్త పాఠశాలలతోపాటు సాయంకాల తరగతులను కూడా ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. -
ఓటుకు ముందు ‘నిర్భయ’ను గుర్తుచేసుకోండి: మోడీ
న్యూఢిల్లీ: షీలాదీక్షిత్ సర్కారు పాలనలో మహిళలకు భద్రత కరువైందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ నెల 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రజలంతా నిర్భయపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనను గుర్తుచేసుకోవాలని సూచించారు. ఆదివారం ఇక్కడి అంబేద్కర్ నగర్లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ ‘అత్యాచార రాజధానిగా ఢిల్లీ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మీరు ఓటు వేసేటప్పుడు ఈ విషయాన్ని మరచిపోకండి. నిర్భయను ఓసారి గుర్తుచేసుకోండి’ అని వ్యాఖ్యానించారు. -
ఆరు ఎన్నికల ర్యాలీలకు హాజరైన షీలా దీక్షిత్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార గడువు ముగిసేందుకు సమయం దగ్గరపడుతుండడంతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ జోరు పెంచారు. వరుస సభలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలోతన 15 ఏళ్ల ప్రభుత్వ పనితీరునే ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోమారు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతామని చెబుతున్నారు. ఇతర పార్టీలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యం కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం మొత్తం ఆరుచోట్ల బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. ఓక్లా, బురాడీ, సదర్‌బజార్, మోతీనగర్, మోడల్‌టౌన్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఢిల్లీలోని ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ ఫలితంగా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారని ఆమె గుర్తు చేశారు. అనధికారకాలనీల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 895 కాలనీలను క్రమబద్ధీకరించడంతో 40 లక్షల మందికి లబ్ధి కలిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పుడు ఆ ఫలాలను పేదలు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అనధికారిక కాలనీలు క్రమబద్ధీకరణను కొనసాగిస్తామని షీలా దీక్షిత్ స్పష్టీకరించారు. తనకు రాజకీయాలకంటే అభివృద్ధి ముఖ్యమన్నారు. -
ప్రచారంలో షీలా బిజీబిజీ
సాక్షి, న్యూఢిల్లీ : విధానసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నా రు. తన సొంత నియోజకవర్గం అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలోని సౌత్‌ఎవెన్యూ, బీజే దత్‌కాలనీ ల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. స్థానికులను వ్యక్తిగతంగా కలుస్తూ మరోమారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. 15 ఏళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్టు షీలా దీక్షిత్ పేర్కొన్నారు. ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వివరించారు. న్యూఢిల్లీ నియోజకవర్గాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో తీర్చిదిద్దినట్టు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. పేద లు వెనుకబడిన తరగతులకు ఆర్థికంగా చేయూ త ఇవ్వడంలో కాంగ్రెస్ ముందుంటుందన్నారు. వారి కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవే శపెట్టామ న్నారు.ఓట్ల కోసం ప్రతిపక్ష బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ బూటకపు హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ చెప్పినట్టుగా విద్యుత్ టారిఫ్ ను 30 శాతం తగ్గించడం అసాధ్య మని స్పష్టం చేశారు. బీకే దత్ కాలనీలో షీలా దీక్షిత్ నిర్వహించిన రోడ్‌షోకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. జీపులో వెళుతూ స్థానికులకు అభివాదం చేస్తూ ముం దుకు సాగారు. కట్పుత్లీ కాలనీని అభివృద్ధి చేస్తాం: మంత్రి రమాకాంత్‌గోస్వామి కట్పుత్లీ కాలనీవాసులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి రమాకాంత్ గోస్వామి హామీ ఇచ్చారు. స్థానికంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పలువురు ఓటర్లతో మాట్లాడారు. స్థానికులు ఈ సందర్భంగా తమ ఇబ్బందుల ను మంత్రికి మొర పెట్టుకున్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తోందని, స్థాని కంగా అభివృద్ధి పనుల ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ కాల నీలోని 3,500కుంటుంబాలకు ప్రభుత్వం త్వరలోనే పునరావాసం కల్పిస్తుందన్నారు. దీనిలో ఎలాంటి జాప్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని మంత్రి రమాకాంత్ గోస్వామి హామీ ఇచ్చారు. -
వలసదారులను ఆదుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: వలసదారులకు భరోసా ఇచ్చేందుకు పలు చర్యలు చేపడతామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ‘దస్ దిన్ మే దస్ ఇరాదే’ పేరు తో శుక్రవారం అశోకా రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ఢిల్లీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పాల్గొన్నారు. వల సలు అనేది మారుతున్న ప్రపంచంలో పెద్ద అంశం గా మారిందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇతర దేశాల్లో వలస వచ్చిన వారికి సరైన సదుపాయాలు కల్పించి గౌరవిస్తుండగా, భారతదేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం వలసవాదులు ఆయా పట్టణాలకు భారమని భావించడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన పౌరులపై సవతిప్రేమ చూపుతున్నారని సింగ్ విమర్శించారు. వలసదారులకు అన్ని సదుపాయాలు కల్పిం చేందుకు బీజే పీ సిద్ధంగా ఉందన్నారు. యునెస్కో ఇటీవల విడుదల చేసిన నివేదికల్లోనూ వలసవాదులపై భారత్‌లో వివక్ష ఉన్నట్టు తెలిపిందన్నారు. ఉపాధి కోసం వేల మంది పట్టణాలకు వలస వస్తున్నారన్నారు. వీరందరికీ సరైన సదుపాయాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 1,639 అనధికారిక కాలనీలు, 860 జుగ్గీజోపిడీ కాల నీలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఎంతో మంది వలసవచ్చిన పేదలు ఉంటున్నారన్నారు. ఢిల్లీ జనాభాలో దాదాపు 49 శాతం మంది ఈ ప్రాంతాల్లోనే దయనీయంగా బతుకులీడుస్తున్నారని పార్టీ జాతీ య అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అటల్ బిహారీ వాజపేయి పునరావాస యోజన పథకాన్ని అమలులోకి తెచ్చి పేదలందరికీ సరైన సదుపాయాలు కల్పిస్తామని బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఢిల్లీలో చేపట్టబోయే పనులను ఆయన ఈ సందర్భంగా వివరించారు. -
షీలా.. మరింత డీలా!
న్యూఢిల్లీ: లిట్మస్ టెస్ట్.. ఓ పదార్థం ఆమ్లమా? క్షారమా? తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్ష. లిట్మస్ పేపర్‌ను ఆ పదార్థంలో ముంచినప్పుడు పేపర్ ఏ రంగులో మారుతుందో గుర్తించి ఆ పదార్థాన్ని ఆమ్లమా? క్షారమా? చెప్పేస్తారు. అయితే 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన షీలాదీక్షిత్ కూడా ప్రస్తుతం దాదాపుగా ఇదే రకమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఆమెనే వరిస్తే ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని, పరాజయం పాలైతే ఆమెకు ప్రజల్లో ఆదరణ తగ్గినట్లేనని తేలిపోతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవముండీ గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితి ఆమెది. అందుకు కారణం ఆమె చేజేతులా చేసుకున్న తప్పిదాలేనంటారు విశ్లేషకులు. 15 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన ఓ నేత తన నియోజకవర్గంలో కనీస మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకోలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో కూడా నిజముందని చెబుతారు. 68 సంవత్సరాల బాలాదేవి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు కృతజ్ఞతలు చెబుతున్న సందర్భాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. బాలాదేవి ఉంటున్న ప్రాంతంలో ఇటీవల ఓ చేతిపంపు వేశారు. అదంతా షీలాదీక్షిత్ చలవేనని ఆమె సంబరపడిపోతున్నారు. అంటే ఇక్కడ నీటి కటకట ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవేకాదు మురుగనీటి పారుదల, తాగునీటి సరఫరా, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాల కొరత ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఏవో కొన్ని పనులు చేసిపెట్టి ఓట్లు రాబట్టుకోవడం ఆనవాయితీగా మారిన ఈ రోజుల్లో షీలా కూడా ఇదే పని చేస్తూ వస్తున్నారు. మురికివాడలు, జుగ్గీజోపిడీలకు కొదవలేని ఆమె నియోజకవర్గంలో ఇటీవల కొన్ని చేతిపంపులు వేయించారు. తీవ్రమైన నీటి కటకటతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా చేయలేని పనిని ఎన్నికల ముందు చేయడమేంటని ప్రతిపక్షాల నుంచేకాకుండా స్థానికుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కావడంతో నగరాభివృద్ధిపై దృష్టిపెట్టిన ఆమె సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారనే అపవాదు కూడా ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోలు, అధికారులు ఉండే ప్రాంతాల్లో మాత్రం ఇరవైనాలుగు గంటల నీటి సరఫరా, పరిశుభ్రమైన రోడ్లు, చక్కటి మురుగునీటి పారుదల వ్యవస్థ ఆమెకు కొంత మంచిపేరు తెచ్చిపెట్టాయి. కానీ వీటికంటే జుగ్గీజోపిడీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆమెకు తలనొప్పిగా మారింది. కేజ్రీవాల్, విజేంద్ర గుప్తా వంటి ప్రముఖులను ఓడించాలంటే ప్రస్తుతం ఆమెకున్న ప్రజాదరణ ఏమాత్రం సరిపోదంటున్నారు. సర్వేల తర్వాత కాంగ్రెస్‌లో నైరాశ్యం... ఎకనమిక్ టైమ్స్ సర్వే ప్రకారం షీలాదీక్షిత్ గెలవడం ఈసారి కష్టమేనని తేలడంతో కాంగ్రెస్ నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది. సర్వే ఫలితాలను తిప్పికొడుతూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా సన్నిహితుల వద్ద షీలా కూడా గెలుపు కోసం తీవ్రం గా శ్రమించాల్సిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. సర్వేలో ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. -
ఆశలన్నీ ఆయనపైనే..
సాక్షి,న్యూఢిల్లీ :నరేంద్ర మోడీ...ఈ పేరు వింటేనే ఢిల్లీ కాం గ్రెస్ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. బీజే పీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ ప్రధాన ఆకర్షణగా నిర్వహించనున్న ర్యాలీలతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం కాంగ్రెస్ నేతల గుబులుకు కారణమవుతోంది. ఢిల్లీ విధానసభ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. జాతీయస్థాయి నాయకులను ప్రధాన ఆకర్షణగా పెట్టి ఢిల్లీవాసుల ఓట్లు కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఢిల్లీలో ఈనెల 23న ద్వారక సెక్టార్-14లో నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. నరేంద్రమోడీ వారం తర్వాత శనివారం మరోమారు ర్యాలీల్లో పాల్గొంటుండడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం రెట్టించింది. శనివారం మోడీ ర్యాలీలకు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రచార ప్రభావం ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పనిచేయకుండా చేసేం దుకు ఏయే అస్త్రాలు ప్రయోగించాలో తెలియక ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సతమతమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రధానిగా చెప్పుకుంటున్న రాహుల్‌గాంధీ సభలకు జనం పలుచగా రావడం ఆపార్టీ నేతలను కలవరానికి గురిచేసింది. లాభం లేదనుకున్న పార్టీ నాయకులు సోని యాగాంధీతో సభ నిర్వహించి కాస్త పరువు నిలుపుకున్నారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం పాల్గొనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ‘ఆప్’పై ఎక్కుపెట్టేనా..! ఇప్పటి వరకు నిర్వహించిన సభల్లో కేవలం కాంగ్రెస్‌పై విమర్శలతోనే సరిపెట్టిన నరేంద్ర మోడీ ఈసారి ఆమ్ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకోనున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఆమ్ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కే జ్రీవాల్పై వస్తున్న ఆరోపణలు మోడీకి అస్త్రాలుగా మారనున్నాయి. ఢిల్లీ విధానసభ ఎన్నికల గడువు దగ్గరపడుతున్నందున కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీపై నరేం ద్ర మోడీ విమర్శల దాడి పెంచవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి ఢిల్లీ రాజకీ యాల్లో ఆప్ కీలకశక్తిగా అవతరిస్తుందని పలు సర్వే లు ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో అటు కాం గ్రెస్, ఇటు బీజేపీ ఆందోళనకు గురవు తున్నాయి. అందుకే ప్రతిచోటా ఇవి ఆప్, ఆర్వింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌పాల్ బిల్లు కోసం కేటాయించిన నిధులను ప్రచారం కోసం వాడుకుం టున్నట్టు వచ్చిన ఆరోపణలు కేజ్రీవాల్‌కు ఇబ్బంది కలిగించాయి. ప్రచారంలో తన పేరును వాడు కోవద్దంటూ అన్నా హజారే కేజ్రీవాల్‌కు లేఖ రాయడం తెలిసిందే. మోడీ ప్రచారం సాగేది ఇలా: శనివారం ఉదయం 11 గంటలకు పాతఢిల్లీలోని షహద్రాలోని సీబీడీ గ్రౌండ్లో ర్యాలీలో పాల్గొం టారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఔటర్ఢిల్లీలోని సుల్తాన్‌పురి, జిలేబీ చౌక్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదింటికి చాందినీచౌక్‌లోని పరేడ్ గ్రౌండ్స్ సమావేశానికి వెళతారు. ఆదివారమూ మోడీ సభ కొనసాగనుంది. సాయంత్రం నాలుగింటికి అంబేద్కర్‌నగర్‌లోని దక్షిణ్‌పురి విరా ట్ సినిమా ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొం టారని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
గూగుల్ హ్యాంగౌట్‌లో షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కంటే ఆమ్ఆద్మీ పార్టీ, బీజేపీ ముందంజలో ఉన్నట్టు కొన్ని ఒపీనియన్ పోల్స్ వెల్లడించడంతో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆన్లైన్ ప్రచారబాట పట్టారు. గూగుల్ హ్యాంగౌట్ ఇన్స్టంట్ మెసేజింగ్, వీడియోచాట్ సదుపాయంతో ఆమె ఢిల్లీవాసులతో సంభాషించనున్నారు. ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల ముందు.. అంటే ఈ నెల 30న ఆమె ఆన్లైన్ ప్రచారం నిర్వహిస్తారు. గూగుల్ సంస్థ కన్నాట్‌ప్లేస్ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి గంటసేపటి వరకు ఆమె వీడియోచాట్లో అందుబాటులో ఉంటారు. ఢిల్లీ ఎన్నికల కోసం పనిచేసే కొందరు ఐటీ నిపుణులు ఈ వీడియోచాట్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఇది వరకే పలుసార్లు వెబ్మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడడం తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వీడియోచాట్ ద్వారా సంభాషించే సదుపాయాన్ని గూగుల్ హ్యాంగౌట్ పేరుతో ఆ సంస్థ ఈ ఏడాది మే 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది.www.sheiladikshit. net/hangout.php లింకు ద్వారా ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడుతూనే ప్రశ్నలూ అడగవచ్చు. ఆమె అధికారిక వెబ్సైట్లో ప్రజలు వేసే ప్రశ్నలకు కూడా షీలా దీక్షిత్ బదులిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రశ్నలను తీరును పరిశీలించాలక వాటిని అడగాల్సిన వ్యక్తులను ఎంపిక చేస్తున్నట్టు చెప్పాయి. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై యువతకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికే ఈ ప్రయత్నమని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. తన హయాంలో మొదలైన అభివృద్ధి ప్రాజెక్టులను షీలా దీక్షిత్ ఎక్కువగా ప్రస్తావి స్తున్నారు. అంతేకాదు ట్విటర్లోనూ ఆమె పేరుపై ఒక పేజీ ఉంది. దీనికి 227 మంది ఫాలోవర్లు ఉన్నా ఇప్పటికీ ఒక్క ట్వీట్ కూడా పోస్టు కాలేదు. -
వారాంతంలో హేమాహేమీల ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల నాయకులు తమదైన శైలిలో నానాతంటాలుపడుతున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఈ వారాంతంతోపాటు, వచ్చే నెల ఒకటో తేదీన హేమాహేమీలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. నవంబర్ 30తోపాటు డిసెంబర్ ఒకటో తేదీన నగరంలో పలుచోట్ల పలు ర్యాలీల్లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోపాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి , బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పలు సభల్లో పాల్గొననున్నారు. పశ్చిమ ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రచార ర్యాలీ జరగనుంది. డిసెంబర్ 30న బీజేపీ నేత నరేంద్ర మోడీ మొత్తం ఐదు సభల్లో పాల్గొంటారు, బీహార్ ముఖ్యమంత్రి నవంబర్ 30, డిసెంబర్ ఒకటో తేదీల్లో జేడీయూ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం చేస్తారు.రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీ తరపున 40 మంది నగరంలో ప్రచారం చేస్తారు. రాజ్‌బబ్బర్ , ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా, కేంద్రమంత్రులు సల్మాన్ ఖుర్షీద్ సచిన్ పైలట్ , మనీష్ తివారీ, జితేంద్ర ప్రసాద, సెల్జా, హరీష్ రావత్, కృష్ణాతీరథ్, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కార్డు లేకున్నా ఓటు వెయ్యొచ్చు వచ్చే నెల నాలుగో తేదీన జరగనున్న ఎన్నికల్లో గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డు తప్పనిసరేం కాదంటున్నారు. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్నవారు, తమ ఐడీ కార్డులో తప్పులు సవరించేందుకు ఇచ్చి కొత్తకార్డులు పొందని వారు సైతం నిశ్చింతగా ఓటు వేయొచ్చని చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో వీరి పేరు ఉంటే సరిపోతుందని, ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. విధానసభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంలోభాగంగా బూత్‌స్థాయి అధికారులే స్వయంగా ఇంటింటికి తిరిగి ఓటర్ల ఫొటోలతో కూడిన స్లిప్పులను పంచాల్సిందిగా అధికారులను ఢిల్లీ ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ఆదేశించారు.ఈ స్లిప్పులను పోలింగ్ బూత్‌కి తీసుకెళ్లి ఓటు వేయొచ్చని వారు తెలిపారు.స్లిప్పులు అందని వారు సైతం దిగులు చెందాల్సిన పనిలేదని, వారికి పోలింగ్‌బూత్‌ల వద్ద ఏర్పాటు చేసే సహాయ కేంద్రాల్లో పేర్లు చెప్పి స్లిప్పులను పొందవచ్చన్నారు. -
బీఆర్టీ హద్దులను చెరిపేస్తాం: షీలాదీక్షిత్
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే బస్ రోడ్ ట్రాన్సిట్(బీఆర్టీ) కారిడార్ హద్దులను చెరిపేస్తామని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రకటించారు. దక్షిణ ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీఆర్టీ కారిడార్ కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా షీలా ప్రభుత్వం అనేకసార్లు విమర్శలపాలైంది కూడా. దీంతో ఈ కారిడార్ విషయమై బుధవారం షీలాదీక్షిత్ మాట్లాడుతూ...‘ఈ కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించలేకపోయింది. అందుకు కారణం దీనికి సమాంతరంగా మరో 14 ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టడడమే. ఆశించిన ఫలి తాలను ఈ కారిడార్ ద్వారా రాబట్టలేకపోయాము. దీంతో ఈసారి అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ కారిడార్ హద్దులను చెరిపేస్తామ’న్నారు. 2008లో ప్రారంభించిన బీఆర్టీ కారిడార్‌పై బీజేపీ మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉంది. తాము అధికారంలోకి వస్తే బీఆర్టీ కారిడార్‌ను రద్దు చేస్తామని అవకాశం దొరికిన ప్రతిచోటా ఆ పార్టీ నేతలు హామీలు ఇస్తూనే ఉన్నారు. దీంతో కమలనాథులకంటే ఓ అడుగు ముందుకేసి తామే బీఆర్టీ హద్దులన చెరిపేస్తామని చెప్పి బీజేపీకి చెక్ పెట్టారు షీలాదీక్షిత్. -
న్యూఢిల్లీ బరి కేజ్రీవాల్‌కే మొగ్గు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ ఫలితాలు అందరినీ అశ్చర్యచకితుల్ని చేసే అవకాశం ఉందని ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను భారీ మెజారిటీతో ఓడించవచ్చని తెలిపింది. బీజేపీ అభ్యర్థి విజేంద్రగుప్తా కంటే షీలాదీక్షిత్‌కు తక్కువ ఓట్లు వస్తాయని ఆ సర్వే పేర్కొంది. ఈ నెల 22-24 మధ్య కాలంలో 188 పోలింగ్ బూత్‌ల పరిధిలోని 2,101 మందిని మౌఖికంగా ప్రశ్నించి ఈ సర్వే నివేదికను రూపొందించారు. ఒకవేళ సర్వే జరిపిన రోజే పోలింగ్ కూడా జరిగినట్లయితే కేజ్రీవాల్‌కు 42 శాతం, విజేంద్ర గుప్తాకు 21 శాతం ఓట్లు, షీలాదీక్షిత్‌కు 20 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సదరు సర్వే తెలిపింది. ఇదిలాఉంచితే షీలాదీక్షిత్‌కు కాంగ్రెస్ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉందని కొందరు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ షీలాదీక్షిత్ ఓడిపోయే ప్రసక్తి లేదని వారు ఢంకా బజాయిస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఓడిస్తే రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా రంగప్రవేశం చేసిన అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర సృష్టించినట్టవుతుంది. అంతేకాకుండా దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత చురుగ్గా ఉందనే సందేశం ప్రజలతోపాటు ప్రపంచానికి అందుతుంది. ఓ మధ్యతరగతి సామాజిక కార్యకర్త.. రాజకీయ సంస్కరణల కోసం ఆరాటపడే వ్యక్తి అధికార పార్టీని గద్దె దించే స్థాయికి ఎదిగినట్టవుతుంది. -
అభివృద్ధే అన్నీ చెబుతుంది
సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో రాజకీయ లబ్ధి పొందవచ్చన్న వారికి కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే సమాధానమిస్తాయని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి అయితే నిజాలు బయటపెట్టాలని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం పలు బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఆయానగర్, మెహ్రోలీ, ఛత్తర్పూర్, దేవ్లీ, సంగంవిహార్, తుగ్లకాబాద్, బదర్‌పురా, ఓక్లా నియోజవర్గాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. మరోమారు తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మొత్తం 895 అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించినట్టు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అనధికారిక కాలనీల్లోని ప్రజల సంక్షేమానికి ఒక్క పైసా సైతం ఖర్చు చేయలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 45 పునరావాస కాలనీలవాసులకు యాజమాన్య హక్కులు కల్పించిందని షీలా వివరించారు. దీంతో దాదాపు 50 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను మరోమారు అధికారంలోకి తీసుకువస్తాయని షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. -
తెలుగు తీర్పు ఎటువైపు!
రాష్ట్ర విభజన అంశం ఐదు రాష్టాల ఓటర్లపై కూడా ప్రభావం చూపనుందా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గతంలో వివిధ రాష్ట్లాలో జరిగిన ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఏపార్టీకి ఓటు వేసినా.. ఈసారి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నెలకొన్న కారణంగా వాళ్ల మూడ్ ఎలా ఉంటుందనే బెంగ రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఢిల్లీ, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లు పార్టీల భవిష్యత్ నిర్ణయించడంలో కీలకం మారనున్నారు. కేవలంలో దేశ రాజధాని ఢిల్లీలోనే పది లక్షల మంది పైగా తెలుగువాళ్లు ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే పదిలక్షల మంది తెలుగు వాళ్లలో అత్యధికంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే అధికమని తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న తెలుగు ప్రజలు ఆ పార్టీకి ఓటేయడం సందేహస్పదమే. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండటంతో గత ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపారనేది కాదనలేని వాస్తవం. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. దానికి తోడు విభజన అంశం సీమాంధ్రలో అగ్గిపుట్టిస్తోంది. ఇలాంటి తరుణంలో తెలుగువాళ్ల నిర్ణయం పార్టీల గెలుపోటములను నిర్ధారించడంలో ప్రధాన అంశంగా మారింది. కేవలం ఢిల్లీలోనే కాకుండా మధ్యప్రదేశ్ లో కూడా తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగానే ఉంది. అభివృద్ధి అంశమే ప్రధాన ఎజెండాగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. చౌహాన్ ఆశలకు తెలుగు వాళ్లు మద్దతు ఇస్తారా లేక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతారా అనే అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ విభజన అంశం తెలుగువాళ్లపై ప్రభావం చూపితే మళ్లీ బీజేపీకే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన అంశాన్ని తెలుగువాళ్లు పక్కన పెడితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా కాంగ్రెస్ అనుకూలించనుందని అనేది మరో వాదన. సమీకరణాలు ఎలా ఉన్నా.. వలసల నగరాలు పేరున్న ఢిల్లీ, భిలాయ్ లాంటి ప్రదేశాల్లో తెలుగు వాళ్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తికరమైందే. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఢిల్లీలోని తెలుగువాళ్లంతా తమవైపే ఉన్నారని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు తెలుగు ఓటర్ల మరోసారి గుర్తు చేసింది. ఢిల్లీలో ప్రధాన పార్టీల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రధాన రాజకీయ పక్షంగా ఈ ఎన్నికల్లో దూసుకుపోతోంది. అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి లేదా అధికార పార్టీకే ఈ ఎన్నికల్లో తెలుగు మొగ్గు చూపుతారా అనే విషయం వేచి చూడాల్సిందే. -
ఢిల్లీ సర్కారుకు పూర్తి పగ్గాలు ఇవ్వండి: షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కేంద్రం ఒకవేళ తమకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వలేకుంటే కనీసం పూర్తిస్థాయి అధికారాలైనా కల్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేంద్రాన్ని కోరారు. దీనివల్ల పాలనాపరమైన అనుమతుల కోసం వివిధ అధికార సంస్థల చుట్టూ తిరగడం తప్పుతుందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారమిక్కడి సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి షీలాదీక్షిత్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 1992లో ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ పోలీసు, భూ లావాదేవీలు, పురపాలక అధికారాలన్నీ కేంద్రం అధీనంలోనే ఉన్నాయి. -
అభివృద్ధి కోసం హస్తానికి ఓటేయండి
న్యూఢిల్లీ: నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ఓటు వేయాలని ఢిల్లీ వాసులను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్ తరఫున ప్రచారం చేసేం దుకు ఇక్కడి డీడీఏ గ్రౌండ్‌లోని శాస్త్రీపార్క్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో సోనియా పాల్గొన్నారు. షీలాదీక్షిత్ ప్రభుత్వం పాలనలో గత 15 సంవత్సరాలుగా ఢిల్లీలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. ఢిల్లీ నగరం దేశంలోని మరెన్నో నగరాలకు ఆదర్శంగా మారిందని, ఢిల్లీ మెట్రో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందన్నారు. ఇక్కడిఉద్యోగులు ఇరుకు బస్సుల్లో ఇబ్బందులు పడుతూ కార్యాలయాలకు ఎంతమాత్రం వెళ్లరని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి పనులను ఏకరువు పెట్టారు. అయితే ప్రతిపక్షం మాత్రం తాము చేసిన అభివృద్ధిని కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను ఢిల్లీ వాసినేనని, ఢిల్లీలో జరిగిన అభివృద్ధి పనులకు తానే సాక్షినన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని కొట్టిపారేశారు. ఇటీవల బీజేపీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చేస్తున్న విమర్శలను మోడీ పేరును ఉచ్ఛరించకుండానే తిప్పికొట్టారు. దేశాభివృద్ధికోసం పాటుపడిన ఎవరినీ కాంగ్రెస్ పార్టీ విస్మరించదన్నారు. సోనియా ప్రసంగం దాదాపు మోడీపై విమర్శలతోనే కొనసాగినా ఢిల్లీలో కాంగ్రెస్ గెలుపుకోసం షీలా పాలనను కూడా ప్రశంసించారు. -
బుకీ రిటన్స్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్‌లేవీ జరగడంలేదు... అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు కూడా అంతగా పోటీ ఉన్న జట్ల మధ్య జరగడంలేదు... అయినప్పటికీ బెట్టింగ్ రాయుళ్లకు చేతినిండా పనే. అందుకు కారణం త్వరలో ఢిల్లీ విధానసభకు జరగనున్న ఎన్నికలే. గతంలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగేవి. దీంతో గెలుపోటములు నిర్ణయించడం పెద్దగా కష్టమయ్యేది కాదు. అప్పుడు బుకీలకు కూడా పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఎక్కడ.. ఏ పార్టీ గెలుస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. ఇది నగరంలోని బెట్టింగ్‌రాయుళ్లకు వరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుందనే విషయంపై కొందరు బెట్టింగ్‌కు పాల్పడుతుంటే మరికొందరు స్థానిక అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే విషయంపై బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మరికొన్నిచోట్ల మెజార్టీల మీద కూడా బెట్టింగ్ జరుగుతోందని సమాచారం. అభ్యర్థులు, మెజార్టీలమీద కాసే పందేలా రేట్లు ప్రాంతానికోరకంగా ఉన్నాయని చెబుతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిలో అభ్యర్థుల మద్దతుదారులే ఎక్కువగా ఉంటున్నారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న బెట్టింగ్ సమాచారం ప్రకారం.. అత్యధికంగా న్యూఢిల్లీపై బెట్టింగ్ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి షీలాదీక్షిత్, బీజేపీ నుంచి విజేంద్ర గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్నారు. అందరూ మహామహులే బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపెవరిదో చెప్పడం కష్టంగా మారింది. దీంతో ఈ నియోజవర్గంలోని అభ్యర్థులపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో సరిపడా మెజార్టీ సాధించి, గద్దెనెక్కే పార్టీల విషయమై జరుగుతున్న బెట్టింగ్ వివరాల్లోకెళ్తే... బీజేపీపై తక్కువగా... ఆప్‌పై ఎక్కువగా... బుకీలు మిగతా పార్టీలకంటే తక్కువగా భారతీయ జనతా పార్టీ రేటును రూ. 2.25గా నిర్ణయించారు. రెండో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. ఈ పార్టీ రేటును రూ.2.40గా నిర్ణయించారు. ఇక అన్ని పార్టీలకంటే ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ రేటును రూ.3.40గా నిర్ణయించారు. బీజేపీపై బెట్టింగ్ కంటే ఆమ్ ఆద్మీపై బెట్టింగ్ కాయడాన్ని ‘మోస్ట్ రిస్కీ’గా బుకీలు అభివర్ణిస్తున్నారు. నగరానికి చెందిన బుకీ ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ... ‘ ఓ పార్టీ రేటును అతి తక్కువగా నిర్ణయించామంటే ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఉదాహరణకు బీజేపీ మీద లక్ష రూపాయల పందెం కట్టారనుకుందాం. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే మీకు రూ. 2.25 లక్షలొస్తాయి. అదే కాంగ్రెస్ మీద కడితే రూ. 2.40 లక్షలు, ఆప్ మీద కడితే రూ. 3.40 లక్షలు వస్తాయి. అయితే చాలా మంది రెండు పార్టీల మీద పందెం కాస్తున్నారు. ఒకదాంట్లో నష్టం వస్తే మరోదాని ద్వారా భర్తీ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఇలా చేస్తారు. అయితే రంగంలో మూడు పార్టీలుండడం, పందెం కాసిన రెండు పార్టీలూ ఓడిపోతే పందెం కాసినవారి పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ప్రస్తుతం రేట్లు ఇలా ఉన్నా నవంబర్ నెలాఖరునాటికి పరిస్థితి మారే అవకాశముంది. అప్పటి పరిస్థితుల ప్రకారం ఎవరు ఏ పార్టీపై ఎక్కువగా బెట్టింగ్‌కు పాల్పడతారో చూసి దాని ప్రకారం రేట్లు నిర్ణయిస్తారు. -
మంచినీరూ కరువే
న్యూఢిల్లీ: దేశరాజధానిని 15 ఏళ్లపాటు పాలించిన షీలా దీక్షిత్ ఒరగబెట్టిందేమీ లేదని, నగరవాసులకు కనీస అవసరమైన మంచినీరు కూడా సరఫరా చేయలేకపోయారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ద్వారకలో శనివారంసాయంత్రం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై నిప్పులు చెరిగారు. ‘షీలా దీక్షిత్ గుజరాత్ అభివృద్ధి నమూనాను తప్పుబడుతున్నారు. ఆమె తన కుమారుడు, కోడలితోపాటు మారుతి కారులో ప్రయాణిస్తూ గుజరాత్భారీ పైప్‌లైన్‌ను పరిశీలించవచ్చు. అది తొమ్మిది వేల గ్రామాలకు నీరు సరఫరా చేస్తోంది. యమునా నది శుద్ధీకరణ కోసం ఆమె ప్రభుత్వం కోట్లాది రూపాయలు కుమ్మరించినా అది ఇప్పటికీ మురికికూపంలాగే ఉంది. గుజరాత్ సబర్మతి తీరాన్ని ఒక్కసారి సందర్శించాలని నేను షీలా దీక్షిత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌గోయల్, ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్దన్ తదితరులు ర్యాలీకి హాజరయ్యారు. -
ప్రముఖులపైనే గురి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వంటి ప్రముఖులపై ఈసారి చాలా మంది చోటామోటా నాయకులు పోటీకి దిగారు. షీలాదీక్షిత్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో విధానసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తరువాత 17 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ పోటీచేస్తున్న కృష్ణానగర్‌లో తొమ్మిది మంది అభ్యర్థులు మిగిలారు. బురాడీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 29 మంది, పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి అతి తక్కువగా నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయ్‌కుమార్ మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రా పోటీచేస్తున్న గ్రేటర్ కైలాష్‌లో ఆరుగురు అభ్యర్థులు ఉన్నా రు. రోహిణి, దేవిలీ నుంచి ఐదుగురు పోటీలో ఉన్నారని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నన్యూఢిల్లీతోపాటు త్రినగర్, బల్లిమారన్, సం గంవిహార్ల్లో 17 మంది అభ్యర్థులు మటియాలాలో 19 మంది, ఓఖ్లాలో 19 మంది కిరారీ, మాటియామహల్ నియోజకవర్గం నుంచి 20 మంది తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంత్రులు అర్విందర్ సింగ్ లవ్లీ పోటీచేస్తున్న గాం దీనగర్‌లో 13 మంది, కిరణ్వాలియా పోటీచేస్తున్న మాళవీయనగర్‌లో 15 మంది, రాజ్‌కుమార్ చౌహాన్ పోటీ చేసే మంగోల్‌పురి నియోజకవర్గంలో ఏడుగురు, హరూన్ యూసుఫ్ పోటీచేసే బల్లిమారన్‌లో 17 మంది, రమాకాంత్ గోస్వామి పొటీచేస్తున్న రాజేంద్రనగర్ నుంచి 16 మంది, ఏకే వాలియా పోటీచేసే లక్ష్మీనగర్ నుంచి 13 మంది పోటీపడుతున్నారు. స్పీకర్ యోగానందశాస్త్రీ పోటీ చేస్తున్న మెహ్రౌలీలో తొమ్మిది మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రత్యర్థుల్లో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేంద్ర గుప్తాతోపాటు ఐదుగురు మహిళలు ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అత్యధిక సంఖ్య లో మహిళలు బరిలోఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
‘చేతి’లోనే అభివృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిని మరింత అభివృద్ధి చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేర్కొన్నారు. ఢి ల్లీ నగర సమగ్ర అభివృద్ధికి తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కశ్మీరీగేట్‌లోని త్రిలోక్పార్క్లో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. చాందినీచౌక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలో ఉపాధి అవకాలు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఇక్కడే స్థిరపడుతున్నారన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలూ తమ ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. ఢిల్లీలోని పాత నగర వైభవాన్ని కాపాడుతూనే ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పాతబడ్డ మంచినీటి పైపులైన్ల పునరుద్ధరణ ఇప్పటికే కొసాగుతోందని వివరించారు. డిసెంబర్ నాలుగున జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందన్న న మ్మకం తనకు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ఏ సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రకటించారు. నగరంలో అభివృద్ధితోపాటు శాంతి నెలకొనాలంటే మరోమారు కాంగ్రెస్‌నే గెలిపించాలని స్థానిక ఓటర్లకు పిలుపునిచ్చారు. చాందినీచౌక్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రహ్లాద్‌సింగ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని షీలా దీక్షిత్ కోరారు. సారథి షీలాయే! ఎన్నికల ప్రచార సారథిగా సీఎం షీలా దీక్షిత్‌ను ఎంచుకోవాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ గురువారం నిర్ణయించుకుంది. వచ్చే నెల నాలుగు జరిగే ఎన్నికల్లో విజయం కోసం గత 15 ఏళ్లుగా ఆమె సాధించిన విజయాలు వివరించాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారం వ్యూహం ఖరారు కోసం కాంగ్రెస్ 87 మంది సభ్యులతో నియమించిన ప్రచార కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డీపీసీసీ కార్యాలయంలో నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి షకీల్ అహ్మద్ వంటి సీనియర్లు హాజరయ్యారు. పార్టీలోని ప్రముఖ ప్రచారకర్తల హాజరు కోసం విజ్ఞప్తులు పంపాలని కూడా కమిటీ అభ్యర్థులకు సూచించింది. ఢిల్లీలో పేదల సంక్షేమం గురించి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవ ర్ధన్ ఎక్కడా ప్రస్తావించడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఢిల్లీ నగరానికి మెట్రోరైలు, 24 గంటల నీటి సరఫరా, ఫ్లై ఓవర్ల వంటి సదుపాయాలు కల్పించిన ఘనత తమదేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. తాము నాలుగోసారి విజయం సాధించడం ఖాయమన్నారు. -
పిసి‘నారి’తనం
న్యూఢిల్లీ: ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని పార్టీలదీ పిసినారితనమే... అని చెప్పుకోవాలేమో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే. అవకాశం దొరికిన ప్రతిచోటా మహిళా బిల్లు పేరెత్తి గంటలతరబడి ఉపన్యాసాలు దంచే పార్టీలు తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం వారికి పెద్దగా అవకాశం కల్పించడంలేదు. పార్టీ అధ్యక్షురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళే అయినప్పటికీ కాంగ్రెస్ కూడా ఈసారి ఎన్నికల్లో మహిళలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక అడుగడుగునా కాంగ్రెస్‌ను విమర్శించే బీజేపీ మహిళలకు సీట్లు కేటాయించే విషయంలో మాత్రం కాంగ్రెస్ అడుగుజాడల్లోనే నడిచింది.సమాజాన్ని మార్చేస్తామంటూ పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తామేమీ మిగతా పార్టీలకు భిన్నం కాదని నిరూపించుకుంది. ఇలా అన్ని పార్టీలు మహిళలకు మొండిచెయ్యి చూపుతూ తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. వారికి సీట్లు కేటాయించడానికి తటపటాయించాయి. ఒకటి.. అరా కేటాయించినా తాము ఎక్కడైతే కచ్చితంగా ఓడిపోతామని నిర్ణయించుకున్న తర్వాతే ఆ స్థానాన్ని మహిళలకు కేటాయించినట్లు పలువురి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆరుగురికి, బీజేపీ నలుగురికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుగురికి మాత్రమే టికెట్లు ఇచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 1,180 నామినేషన్లు దాఖలు కాగా వారిలో 156 నామినేషన్లు మాత్రమే మహిళలవని ఎన్నికల కమిషన్ తెలిపింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. ఆతరువాతి స్థానం రాజేంద్రనగర్‌కు దక్కింది. ఈ నియోజకవర్గంలో ఆరుగురు మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే నగరంలోని 70 నియోజకవర్గాలలో పోటీ ప్రధానంగా మహిళల మధ్యనే జరుగనున్న నియోజకవర్గం మాత్రం మాలవీయనగర్ నియోజకవర్గమొక్కటే అని చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి కిరణ్ వాలియా, బీజేపీ అభ్యర్థి, మాజీ మేయర్ ఆర్తీ మెహ్రాల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆర్కెపురంలోనూ ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు బర్ఖాసింగ్ (కాంగ్రెస్), మాజీ యాంకర్ షాజియా ఇల్మీ (ఆప్)లు బరిలో ఉన్నప్పటికీ ఈ ఇరువురు మహిళలకు బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది మందికి టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి ఆరుగురితోనే సరిపెట్టింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ (న్యూఢిల్లీ), మంత్రి కిరణ్వాలియా (మాలవీయనగర్), డీసీడబ్ల్యూసీ అధ్యక్షురాలు బర్ఖాసింగ్ (ఆర్కేపురం), రాగిణీ నాయక్ (జనక్‌పురి). అమృతా ధవన్(తిలక్‌నగర్), ధన్వంతీ చందీలా (రాజోరీ గార్డెన్)లను కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దింపింది. బీజేపీ నుంచి మాజీ మేయర్ ఆర్తీ మెహ్రా (మాలవీయనగర్), మాజీ మేయర్ రజనీ అబ్బీ (తిమార్పుర్), ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రెటరీ శిఖారాయ్(కస్తూర్బానగర్), ఈస్ట్ పటేల్ నగర్ కౌన్సిలర్ పూర్ణిమా విద్యార్థి(పటేల్ నగర్) పోటీచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నలుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. కానీ వారిలో ఎవరూ విజయం సాధించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున షాజియా ఇల్మీ ఆర్కెపురం నుంచి, ఫర్హానా అంజుమ్ బల్లీ మారన్ నుంచి, భావనా గౌర్ పాలం నుంచి, వందనా కుమారీ పాలిమార్ బాగ్ నుంచి, రాఖీ బిర్లా మంగోల్‌పురి నుంచి, వీణా అనంద్ పటేల్ నగర్ నుంచి పోటీచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 81 మంది మహిళలు పోటీచేయగా కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. -
పాతకు పూత!
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగోసారి ఢి ల్లీ ఓటర్ మనసు ‘గెలుచుకోవడమే’లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. అయితే అందులో ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల కొనసాగింపు మినహా కొత్తదనమేదీ కనిపించలేదు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఉటంకిస్తూ వాటిని భవిష్యత్తులో ఎలా అమలు చేయబోతున్నది వివరించారు. పదిహేనేళ్లలో ఢిల్లీ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మరోమారు అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపుతామన్న హామీఇస్తూ ఆ పార్టీ మేనిఫోస్టోను రూపొం దించింది. ఢిల్లీ విధానసభ ఎన్నికల మేనిఫెస్టోను డీడీయూ మార్గ్‌లోని రాజీవ్‌భవన్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కపిల్‌సిబల్, కృష్ణతీరథ్, డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్, మంత్రి కిరణ్ వాలియా, ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జీ షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మాట్లాడారు. ‘రుకేగా నహీ హమారా ఢిల్లీ’ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. పదిహేనేళ్లలో ఢిల్లీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. నాలుగోమారు అధికారంలోకి వస్తే ఢిల్లీలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మిస్తామన్నారు. ఢిల్లీ నగర సంఘటిత అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వలసవచ్చేవారంతా ఇక్కడి సదుపాయాల చూసి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడరన్నారు. వారికోసం మరిన్నిమెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యధికంగా ఢి ల్లీలో జీడీపీ ఉందని దీన్ని మరో ఐదేళ్లలో రెట్టింపు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇతర పార్టీలమాది రి తప్పుడు హామీలు కాకుండా ఇచ్చిన అన్ని వాగ్ధానాలు గతంలో నెరవేర్చినట్టే నాలుగోమారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని వివరాలు అంశాల వారీగా... ఉన్నత విద్య.. ఢిల్లీయూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో 30 శాతం సీట్లు పెంచడంతోపాటు విద్యార్థులకు సరిపడా రాత్రి కళాశాలల నిర్వహణ. విద్యార్థులకు లోన్లు ఇప్పించడం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత విద్యలో రాయితీలు కల్పిచనున్నట్టు హామీ. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి.. ఢిల్లీలో మహిళల భద్రతపై ప్రత్యేంగా దృష్టి. మహిళలపై జరుగుతున్న నేరాల విచారణకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ. మహిళలను గౌరవించేలా అవగాహన శిబిరాల ఏర్పాటు. పోలీస్ వ్యవవస్థలో మహిళల సంఖ్య పెంపు. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలకు చర్యలు. అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు... ప్రస్తుతం ఢిల్లీలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు చర్యలు. వీటిల్లో భాగంగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా పథకాల అమలు. వృద్ధులకు కంటి పరీక్షలు చేయించడం, వారికి అవసరమైన చేతి కర్రలు, వాకర్లు ఇతర వస్తువులను రాయితీపై ఇవ్వడం. వారికి ఆశ్రయం కల్పించేందుకు పది వృద్ధాశ్రమాలు నిర్మించడం. మానసిక రోగులకు నరేలాలో ఓ ఆసుపత్రి నిర్మాణం. వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాల పెంపు. బిక్షగాళ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు. వీటితోపాటు ఇప్పటికే అమలులో ఉన్న బాగీదారి పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం. ఆహారభద్రత పథకం కింద దాదాపు 73 లక్షల మందికి లబ్ధి చేకూరేలా చేయడం. అంత్యోదయ, అన్నశ్రీయోజన పథకాలతో వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడం. లాడ్లీ పథకాన్ని కొనసాగింపుగా ఆర్థిక సహాయాన్ని రూ.50వేలకు పెంచడం. మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ల నిర్మాణం. ఒక్కో నియోజకవర్గ పరిధిలో కనీసం 20 ఉండేలా చర్యలు. పట్టణాభివృద్ధి... ఢిల్లీ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడం. వీటితోపాటు ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక కాలనీలుల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం. జేజే క్లస్టర్లలోని వారికోసం జేఎన్ఎన్యూ ఆర్ఎం పథకం కింద నాలుగు లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వడం. తాగునీటి సమస్యలపై దృష్టి.. ఢిల్లీ జల్‌బోర్డు ద్వారా తాగునీరు అందేలా చర్యలు. గృహ వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న నీటి సరఫరాను నెలకు 30 కిలో లీటర్ల నుంచి 40కిలో లీటర్లకు పెంచడం. ద్వారకా, బవానా, ఓక్లాల్లో మూడు మంచినీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు. లీకేజీలు అరికట్టేందుకు చర్యలు. నిరంతర విద్యుత్ సరఫరా.. నిరంత విద్యుత్ సరఫరాతోపాటు విద్యుత్ చార్జీల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఉండేందుకు స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్లను ఏర్పాటు చేయడం. మెరుగైన విద్యుత్ సరఫరాకు మరో 15 సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం. మూడు గ్యాస్ గ్రిడ్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం. మెరుగైన రవాణా సదుపాయాలు: మోనోరైలు, ట్రామ్స్‌ను ప్రవేశపెట్టడం. క్లస్టర్ బస్సుల సంఖ్యను 5,500కి పెంచడం. ఫేజ్-3 లో 91 స్టేషన్లతో 136 కి.మీ., ఫేజ్-4లో 113 కి.మీ. మెట్రోలైన్ నిర్మాణం.80 రూట్లలో 400 ఫీడర్‌బస్సులను అందుబాటులోకి తేవడం. డీటీసీలో మరిన్ని లోఫ్లోర్బస్సులు. -
‘న్యూఢిల్లీ’లో ఆసక్తికర పోటీ
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 70 నియోజకర్గాలలో అత్యంత ఆసక్తికరమైన పోటీ న్యూఢిల్లీ నియోజకవర్గంలో జరుగనుంది. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అర్వింద్ కేజ్రీవాల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా తలపడుతున్నారు. తొలిసారిగా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేజ్రీవాల్ షీలాపై గెలిచి తీరుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచార పథంలో ముందుకు దూసుకెళుతున్నారు. బీజేపీ నాయకుడు విజేంద్ర గుప్తా కూడా తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, ఢిల్లీ రూపు రేఖలు మారిపోతాయని ప్రజలను తనవైపుకు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ భవిష్యత్‌లో నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూస్తానని ఓటర్లకు హామీని ఇస్తున్నారు. అయితే వరుసగా నాలుగోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న షీలాదీక్షి త్‌కు ఈ ఎన్నికలలోనే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. షీలాదీక్షిత్ ఢిల్లీలో తన ఎన్నికల రాజకీయాలను పరాజయంతోనే ప్రారంభించారని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు. 1998లో తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఆమె ఓడిపోయారని వారంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీపై దృష్టి సారించారని, అప్పటినుంచి ఆమెను విజయలక్ష్మి వరించిందని చెబుతున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గాన్ని గోల్ మార్కెట్ నియోజకవర్గంగా పేర్కొనేవారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇది న్యూఢిల్లీ నియోజకవర్గంగాా మారింది. అయితే 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తొలిసారిగా జరిగినప్పటి నుంచి ఈ నియోజకవర్గాన్ని ఒక్కసారి మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీజేపీ నాయకుడు కీర్తి ఆజాద్ కాంగ్రెస్‌కు చెందిన బ్రిజ్మోహన్ భామాను ఓడించారు. ఆ తర్వాత నుంచి షీలాదీక్షిత్ బరిలోకి దిగి ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చారు. 1998లో ఆమె కీర్తి ఆజాద్‌ను, 2003లో కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఆజాద్‌ను, 2008లో విజయ్ జోలీని ఆమె ఓడించారు. షీలాదీక్షిత్ ఎన్నికల బరిలోకి దిగినప్పటి నుంచి ఈ నియోజకవర్గం నుంచి మహిళా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఈసారి కూడా మహిళలు అత్యధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా అత్యధికంగా ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఈసారి పోటీచేస్తున్న 25 మందిలో పది మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. వీవీఐపీ ఓటర్లు ఎక్కువే న్యూఢిల్లీ అభ్యర్థులపరంగానే కాక ఓటర్లపరంగానూ హేమాహేమీలున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేతలు, అధికార పక్షనేతలు పలువురు ఈ నియోజకవర్గ ఓటర్ల జాబితాలోనే ఉన్నారు. న్యూఢిల్లీ ఓటర్ల సంఖ్య 1,21 లక్షలుగా ఉంది. వీరిలో అత్యధికులు ప్రభుత్వోద్యోగులే. దక్షిణ భారతీయుల సంఖ్య కూడా భారీగానే ఉంది. లూటియన్స్ జోన్ వంటి వీఐపీ జోన్‌తోపాటు గోల్ప్ లింక్స్వంటి సంపన్న ప్రాంతాలవాసులతో పాటు కాలీబాడీ మార్గ్, తుగ్లక్ క్యాంప్ మురికివాడలు, సర్వెంట్ క్వార్టర్లలో నివసించే పేదలు ఈ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఉన్నారు. మిగతా నియోజకవర్గంలో ఉన్నట్టుగా గతుకుల రోడ్లు, మౌలిక సదుపాయాల కొరత వంటి అభివృద్ధిపరమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అయితే నిత్యావసర సరుకుల ధర పెరుగుదల తమను బాధిస్తోందని ఇక్కడి ఓటర్లంటున్నారు. -
ఎటు చూసినా చిక్కులే!
సాక్షి, న్యూఢిల్లీ:కొత్తగా ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమ్ఆద్మీ పార్టీతోపాటు ఎన్నికల రాజకీయాల్లో తలపండిన కాంగ్రెస్, బీజేపీని కూడా ఎన్నో సమస్యలు ఇరుకునపెడుతున్నాయి. అర్వింద్ కేజ్రీవాల్, అన్నా హజారే వివాదం ఆమ్ఆద్మీ పార్టీని చిక్కుల్లో నెట్టింది. డీపీసీసీ అధ్యక్షుడు జైప్రకాశ్ అగర్వాల్, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మధ్య సఖ్యత లేకపోవడం కాంగ్రెస్‌ను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడు విజయ్ గోయల్, ముఖ్యమంతి అభ్యర్థి హర్షవర్ధన్ మధ్య సామరస్యం లోపించడం బీజేపీకి అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం తన పేరు వినియోగించుకోరాదంటూ సామాజిక సేవకుడు అన్నా హజారే ఆప్‌కు స్పష్టం చేయడం ఆ పార్టీకి దెబ్బలాగే భావించాల్సి ఉంటుంది. ఆప్ ఎన్నికల ప్రచారానికి లోక్‌పాల్ ఉద్యమ విరాళాలను వాడుకుంటోందంటూ విమర్శలు రావడం కేజ్రీవాల్‌కు ఇబ్బందికరంగా మారింది. అన్నా హజారే సృష్టించిన వివాదంతో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని పక్కనబెట్టి సంజాయిషీలు ఇచ్చుకునేపనిలో పడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం తన పేరును ఎంత మాత్రమూ వాడుకోవద్దని హజారే స్పష్టంగా హెచ్చరిస్తూ లేఖ కూడా రాయడం దుమారం రేపింది. అయితే ఉద్యమం కోసం కేటాయించిన నిధులను తాము వాడుకోవడం లేదని, ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమని కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. ఆప్ పలువురు నేరస్తులు, అవినీతిపరులకు టికెట్లు ఇచ్చినట్టు వచ్చిన వార్తలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి.పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించే కార్యక్రమాన్ని కూడా ఆప్ బుధవారానికి వాయిదావేసింది. కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ సభకు లభించిన పేలవమైన ప్రతిస్పందన కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిప్తోంది. తమకు కంచుకోటగా భావించే దక్షిణపురి ప్రాంతంలో నిర్వహించిన సభకు ఆశించినంత ప్రతిస్పందన రాకపోవడం నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ పార్టీని ఆలోచనలో పడేసింది. దక్షిణాపురి పరిధిలోని అన్ని నియోజకవర్గాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరమయ్యాయి. అలాంటి దక్షిణపురిలో పార్టీకి ఇలాంటి స్పందన లభించడం చూసిన వారు కాంగ్రెస్‌కు ముందున్నది గడ్డుకాలమేనని అంటున్నారు. దక్షిణాపురి డీడీఏ పార్కులో ఏర్పాటుచేసిన ఈ సభకు రావడమే జనం తక్కువగా వచ్చారు. వచ్చినవారు కూడా రాహుల్ గాంధీ ప్రసంగం మొదలుపెట్టగానే సభ నుంచి తిరుగుముఖం పట్టారు. దానితో ఆయన తన ప్రసంగాన్ని ఆరు నిమిషాలకే ముగించారు. దీనిపై రాహుల్‌గాంధీ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చకపోయినా ఆయన ముఖంలో కోపం కనిపించిందని కార్యకర్తలు అంటున్నారు. తక్కువ జనం రావడంపై వచ్చిన విమర్శలకు షీలా స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. సర్వేల ఫలితాలు కూడా కాంగ్రెస్‌ను వణికిస్తున్నాయి. ఇక జేపీ అగర్వాల్, షీలాదీక్షిత్ మధ్యనున్న విబేధాలు ఇటీవల రాహుల్ సభతో మళ్లీ బయటపడ్డాయి. ఎడముఖం, పెడముఖంగా మసిలే ఈ నేతలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు తమ విబేధాలను పక్కన పెట్టినట్లే కనిపించారు. ఇదంతా పైపై వ్యవహారమేనని రాహుల్ సభతో తేలిపోయిందని, ఈ సంగతి అధిష్టానం దృష్టికి కూడా వచ్చిందని అంటున్నారు. రాహుల్ ఆధ్వర్యంలో జరిగిన రెండు సభలకు డీపీసీసీ పేరిట ముద్రించిన రెండు ఆహ్వానపత్రికల్లోనూ అగర్వాల్ పేరు లేకపోవడంతో అధిష్టానం షీలాను మందలించిందని అంటున్నారు. తమ నేతలు ప్రచారంలో అనుసరిస్తోన్న ఒంటెత్తు పోకడలు బీజేపీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా, విజయ్ గోయల్ పాదయాత్ర మొదలుపెట్టారు. వీరికి తోడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగిన విజేంద్ర గుప్తా ఒంటరిగా ప్రచారం చేస్తున్నారు. ఒక్కొక్కరం ఒక్కోచోట ప్రచారం చేస్తేనే నగరమంతా బీజేపీ ప్రభావం చూపగలుగుతుందని విజయ్ గోయల్ వాదిస్తున్నారు. ఆయన తన ఒంటెత్తు పోకడను సమర్థించుకోవడానికే ఈ వాదనను పైకి తెస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. నేతల మధ్య సామరస్యం లోపించడం వల్ల మరోమారు ఓటమి పాలు కావలసివస్తుందన్న భయం బీజేపీ అధిష్టానాన్ని వేధిస్తోంది. ఆప్ దూకుడు కూడా బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆ పార్టీకి ఈసారి మంచి ఫలితాలు లభిస్తాయని సర్వేలు తేల్చడం బీజేపీకి రుచించడం లేదు. ఈసారి తాము కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం పార్టీలో కనిపించడం లేదని బీజేపీ కార్యకర్త ఒకరు అన్నారు. -
అధికారమిస్తే సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పిస్తాం: హర్షవర్ధన్
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న షీలా దీక్షిత్ సర్కార్ ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించలేకపోయిందని బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ విమర్శించారు. తమకు ఓటేసి ఢిల్లీ గద్దెనెక్కిస్తే అందుకోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సీఎం షీలా దీక్షిత్‌కు ఆసక్తిలేకపోయి అయినా ఉండాలి. లేదంటే ఆమె డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయి అయినా ఉండాలని ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్ వద్ద మంగళవారం మీడియాకు తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నికవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక వెళ్లి కలిసి ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించాలని కోరతామన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న షీలా మహిళలకు భద్రత కల్పించేందుకు కృషి చేయకపోవడాన్ని తప్పుబట్టారు. రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్లీజ్ కూర్చోండి.. వెళ్లిపోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఘోర పరాభవం ఎదురైంది. సభకు వచ్చిన ఐదు వేల మందిలో చాలా మంది ఆయన ప్రసంగానికి ముందే లేచి వె ళ్లబోయారు. ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ స్వయంగా బతిమాలుకోవడంతో వారంతా కాస్త ఓపిక తెచ్చుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ నగర్లో షీలా అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. సభనుద్దేశించి షీలా తన ప్రసంగంలో భాగంగా తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు ఏకరువు పెట్టడం ప్రారంభించారు. అప్పటికే విసుగు చెందిన మహిళలు లేచి వెళ్లిపోబోయారు. ముఖ్య అతిథి రాహుల్ ప్రసంగం వినకుండానే వెళుతున్న వారిని ఎలా కూర్చోబెట్టాలో తెలియక చివరకు ఆమె తన ప్రసంగాన్ని ఆపి ‘దయచేసి 10 నిమిషాలు కూర్చోండి. రాహుల్ మాట్లాడతారు’ అని బతిమిలాడగా కొందరు కూర్చున్నారు. దీంతో రాహుల్ ప్రసంగిస్తూ మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని బీజేపీ, శివసేనలు లక్ష్యంగా చేసుకుంటూ వారిని తరిమేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అందరినీ సోదరుల్లా కలుపుకుపోతున్నామన్నారు. షీలాకు నాలుగో విడత అధికారం అందించాలని రాహుల్ కోరారు. -
రాహుల్ సుముఖమే
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని చేపట్టేందుకు రాహుల్‌గాంధీ విముఖత చూపడం లేదని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని, ఆయనకు పార్టీకి అండదండగా నిలుస్తుందని రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా నాలుగోసారికూడా విజయం సాధించడంపై దృష్టి సారించిన షీలాదీక్షిత్ ప్రశంసించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రాహుల్‌నే ప్రధానిగా ఎన్నుకుంటుందన్నారు. ప్రతి రోజు, ప్రతి నిమిషం ఆయన ఎక్కడో ఒకచోట పర్యటిస్తున్నారన్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదన్నారు. ఆరు నెలల క్రితమే రాహుల్‌గాంధీ పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టాడన్నారు. ఆ బాధ్యతలనే ఆయన ప్రస్తుతం నిర్వర్తిస్తున్నాడన్నారు. అందువల్ల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాన్ని ప్రస్తుతానికి వదిలేయడమే ఉత్తమమన్నారు. వచ్చే సార ్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం తమతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తదుపరి తరం నాయకుడు రాహుల్‌గాంధీయేనని, అందువల్ల ఆయనను ప్రధానమంత్రిగా చూడాలని ఉందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తన మనసులో మాట చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలనే యోచన మీ మనసులో నుంచి ఏరోజైనా బయటికొచ్చిందా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. ఈసారీ గెలుపు మాదే రాష్ట్ర శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి కూడా తామే విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. తమకు సంపూర్ణ మెజారిటీ లభిస్తుందన్నారు. ఒపీనియన్ పోల్స్‌లో తేలినవిధంగా హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందా అని అడగ్గా అలా జరుగుతుందని తాననుకోవడం లేదన్నారు. ఢిల్లీ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. -
మినీ భారతదేశంలా 'ఢిల్లీ':రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వలసల నగరంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. డిసెంబర్ 4 వ తేదీన ఢిల్లీలో ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నగరంలో వలసల కారణంగా జనాభా పెరిగినట్లు రాహుల్ తెలిపారు. ఇదొక చిన్న భారత దేశంలా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని అనివార్య పరిస్థితులు ఢిల్లీ నగరానికి వలసలు వస్తుంటారని, తమ కుటుంబుం కూడా ఆ రకంగానే ఢిల్లీకి వచ్చిందని తెలిపారు. తొలుత తన కుటుంబం కాశ్మీర్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ వచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం ఢిల్లీకి తాము కూడా వలసలగానే వచ్చామని రాహుల్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా వచ్చే ఇక్కడ స్థిరపడ్డారన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. వలసల కారణంగానే ఢిల్లీ నగరంలో అత్యాచారాలు జరుగుతున్నాయని షీలాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ఖండించిన ఆయన ఢిల్లీ రాష్ట్రాన్ని షీలా అభివృద్ది పథంలో నడింపిచారన్నారు. షీలా ప్రభుత్వంలో రాష్ట్రం రోజు రోజుకూ మార్పు చెందుతూ ముందుకు వెళుతున్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు అంగీకరించక తప్పదన్నారు. -
అందులో నా పాత్ర లేదు
న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డు కాంట్రాక్ట్‌లలో తన ప్రమేయమేమీ లేదని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. డీజేబీ అధికారులు, సాంకేతిక నిపుణులు షరతులు, నిబంధనలతో టెండర్లకు రూపకల్పన చేశారని, అయితే ఆ సంస్థ చైర్మన్‌గా అందులో తన పాత్రేమీ లేదని అన్నారు. ప్లానింగ్ కమిషన్ మోడల్ డాక్యుమెంట్ల ఆధారంగానే డీజేబీ ఈ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరించిందని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా బిడ్డింగ్ నిర్వహించిన డీజేబీ ఈ-టెండరింగ్ విధానంలో పారదర్శకంగా వ్యవహరించిందన్నారు.నంగ్లోయి, మల్వియా నగర్, మెహ్రౌలీ ప్రాంతాలకు నిరంతర నీటి సరఫరాకు సంబంధించి యూరోపియన్ కంపెనీ చేపట్టిన ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం ప్రాజెక్టుకు సంబంధించి మూడు వేర్వేరు ప్రాథమిక విచారణలను సీబీఐ చేపట్టడంపై ఆమె స్పందించారు. ఈ ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు సంబంధింత డాక్యుమెంట్లను సమర్పించాలని సీబీఐ కోరిందన్నారు. విచారణకు ఏ విషయాన్నైనా తీసుకునేముందు ఈ విధంగానే వ్యవహరిస్తుందని చెప్పారు. ఢిల్లీ జల్ బోర్డు అక్రమాలలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కూడా విచారించాలని భారతీయ జనతా పార్టీ శుక్రవారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తామేమీ తప్పు చేయలేదని డీజేబీ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.కాగా, బిడ్డర్లకు లాభం కలిగించే విధంగా డీజేబీ వ్యవహరించిందని సీబీఐ ఆరోపించింది. మౌలికవసతుల మేజర్ ప్రైవేట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన నీటి సరఫరా మీటర్ల నాణ్యత పరీక్షలో అక్రమాలు జరిగాయని మరో కేసును నమోదుచేసింది. ఈ కేసుల్లో గుర్తు తెలియని వ్యక్తులపై అభియోగాలు మోపింది. -
పరాయి ఎవరో స్పష్టత ఇవ్వాలి
న్యూఢిల్లీ: తనను పరాయి వ్యక్తిగా పిలిచిన సీఎం షీలా దీక్షిత్‌పై న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విజేందర్ గుప్తా మండిపడ్డారు. తాను ఢిల్లీవాసినని, అయితే సీఎం షీలా దీక్షిత్ ఏ ప్రాంతానికి చెందినవారనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. గత రాజకీయ వివరాలను ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ నుంచి మూడుసార్లు, తూర్పు ఢిల్లీ నుంచి ఒక్కసారి దీక్షిత్ పోటీచేసి ఓడిపోయారన్నారు. ఇప్పుడు ఎవరు పరాయి వ్యక్తి? ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గంలో పోటీచేసేందుకు ఒకరు ఘజియాబాద్ నుంచి, మరొకరు కనౌజ్ నుంచి ఇక్కడకు వచ్చారని పరోక్షంగా ఏఏపీ అధ్యక్షుడు కేజ్రీవాల్, షీలాలపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ జల్ బోర్డు కుంభకోణంలో సీబీఐ చేపట్టిన ప్రాథమిక విచారణలో దీక్షిత్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. కిలో లీటర్ రూ.రెండు నుంచి రూ.49 వరకు పెరిగిందని, ఒకవేళ తనిఖీ చేయకపోతే రూ.100కు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. డీజేబీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ సీఎం వెంటనే రాజీనామా చేయాలన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గ ప్రజలు నీటి కొరత ఎదుర్కొనేందుకు స్థానిక ఎమ్మెల్యే అయిన షీలానే కారణమన్నారు. ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసింది తప్ప ఏనాడు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమరిశంచారు. ఈసారి ఎమ్మెల్యేను గెలిపించుకొని, ముఖ్యమంత్రిని తప్పిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. -
నమ్మకముంది.. మళ్లీ గెలుస్తాం: షీలా
న్యూఢిల్లీ: రాష్ట్ర విధానసభకు డిసెంబర్ 4న జరగనున్న ఎన్నికల్లో తాను మళ్లీ గెలుస్తానని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న షీలా దీక్షిత్ గురువారం తన కుమారుడు, ఎంపీ సందీప్ దీక్షిత్, కుతురు లతికతో కలిసి జామ్‌నగర్ కార్యాలయానికి మధ్యాహ్నం 1.00 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట కాంగ్రెస్ మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి సంజీవ్ గుప్తాకు నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగోసారి కూడా తన విజయం ఖాయమని, ఈసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. షీలా ఈ మాటలంటున్న సమయంలో మద్దతుదారులు షాజాహాన్ రోడ్డును నినాదాలతో హోరెత్తించారు. -
జెయింట్ కిల్లర్ ఎవరు!
ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ముక్కోణపు పోరులో రసవత్తర, ఉత్కంఠ పోరుకు తెర లేచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ గుండెల్లో అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వెన్నులో చలిపుట్టిస్తోంది. ఎన్నికల్లో కేజ్రివాల్ తన ప్రత్యర్థుల్ని వణికించడం ముందు ఢిల్లీలోని చలి కూడా చిన్న బోతుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాల్లోకెల్లా అత్యంత ఆసక్తికర పోటీ న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే నెలకొంది. న్యూఢిల్లీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తరఫున బరిలోకి దిగుతున్న ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అంటూ సవాల్ విసురుతున్నారు. వరుస విజయాలతోపాటు న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ మరోసారి ఇక్కడి నుంచే తన విజయావకాశాలను పరీక్షించుకోనున్నారు. షీలాదీక్షిత్ ఎక్కడి నుంచి పోటీచేస్తే తానూ అక్కడి నుంచే బరిలోకి దిగుతానని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. వీరిద్దరికీ గట్టిపోటీ ఇవ్వగల అభ్యర్థికోసం జల్లెడపట్టిన బీజేపీ అధిష్టానం స్థానికంగా పట్టు, ప్రజల్లో గుర్తింపు ఉన్న విజయేంద్ర గుప్తాను పోటీకి నిలిపింది. రాజకీయాల్లో అత్యంత అనుభవం, మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించకున్న రాజకీయ చతురత షీలా దీక్షిత్ కలిసివచ్చే అంశాలు కాగా, ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యాచారాలు, కుంభకోణాలు వెంటాడుతున్నాయి. అవినీతిపై పోరాటం ఎజెండాగా ఢిల్లీ రాజకీయాల్లో 'క్రేజీస్టార్' కేజ్రివాల్ 'చీపురు కట్ట' గుర్తుతో దూసుకుపోతున్నారు. ఇక బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన విజయేంద్ర గుప్తాది మొదటి నుంచీ దూకుడుగా ఉండే వ్యక్తిత్వం. పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం, కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే తత్వం బీజేపీ అధిష్టానం వద్ద మంచి మార్కులు పడేలా చేసింది. అయితే, షీలాపై బీజేపీ గతంలో మీనాక్షి లేఖీని పోటీకి నిలిపేది. ఈసారి లేఖీ విముఖత చూపడంతో గుప్తాను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 30 శాతానికి పైగా ఓట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వేలలో తొలుత ఏడు సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పుంజుకొని 18 సీట్ల గెలిచే విధంగా బలాన్ని పెంచుకుంది. సర్వేల పక్కన పెడితే ఈ రసవత్తర పోరులో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మహిళానేతగా షీలా దీక్షిత్, రాజకీయాల్లో లేటెస్ట్ స్టార్ కేజ్రివాల్, దూకుడు స్వభావంతో బీజేపీ అభ్యర్థి గుప్తాలు తమ వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు జెయింట్ కిల్లర్ గా అవతరిస్తారో వేచి చూడాల్సిందే. -
మీకు నిధులు ఎక్కడివి?
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పేర్కొంటూ అధికారంలోకి రావడానికి కృషిచేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని చూస్తున్న ‘ఆప్’నకు అసలు తమ పార్టీని విమర్శించే అర్హత ఉందా అని ఆమె అన్నారు. అసలు మీకు ఎక్కడ నుంచి నిధులు వస్తున్నాయో వాస్తవాలు చెప్పాలని ఆమె ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు సవాలు విసిరారు. ‘మీరు నన్ను అబద్ధాలకోరు అంటున్నారు.. నేను మిమ్నల్ని దొంగ అంటున్నాను. నేను నిజంగానే అబద్ధాలకోరునని నిరూపించడానికి మీ వద్ద సాక్ష్యాలేమైనా ఉన్నాయా.. లేదా మీరు దొంగలు అని నిరూపించడానికి నా వద్ద సాక్ష్యాలేమైనా ఉన్నాయా.. కేవలం ఆరోపణలతో ఎవరినీ అవినీతిపరుడిగా, దోషిగా నిరూపించలేం కదా... మనమందరం అద్దాల మేడల్లో ఉన్నవారమేననే విషయం మీరు గుర్తుంచుకోవాలి..’ అంటూ ఆమె ఆప్ నాయకులను హెచ్చరించారు.తమ ప్రభుత్వంపై ఆప్ చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ..‘ఎక్కడైనా ఎన్నికల యుద్ధం అనేది ఆయా పార్టీల పరిపాలనా విధానాలపై, లక్ష్యాలపై ఉండాలి తప్పితే వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలతో ముందడుగు వేయలేం.. అసలు మీ విధానాలేమిటి.. మీరు దేనిగురించి యుద్ధం చేస్తున్నారు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు..’ అంటూ ఆమె కేజ్రీవాల్ ప్రభృతులను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా షీలాదీక్షిత్, ఆమె సహచరులపైనే ఆప్ ముఖ్యంగా దృష్టిపెట్టింది. షీలా సర్కారు అవినీతిపైనే ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తూ ఆమెను చికాకు పెడుతున్నారు. ఇదిలా ఉండగా, ఆప్ సేకరించిన నిధుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని గత నెల ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. తమ నిధుల సేకరణపై వచ్చిన ఆరోపణలను ఆప్ నాయకులు ఖండించారు. తమ పార్టీ వెబ్సైట్లో చందాల వివరాలన్నీ ఉన్నాయని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని చెప్పారు. కాగా రాజకీయ పార్టీగా ‘ఆప్’ విశ్వసనీయతను షీలాదీక్షిత్ ప్రశ్నించారు. ఆమె మాట్లాడు తూ..‘ రాజకీయ పార్టీలంటే విధి విధానాలు ఉండాలి. ఆయా పార్టీల కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన తప్పకుండా ఉండాలి. సదరు పార్టీలు ఏ విధానాలపై నిలబడుతున్నాయో ప్రజలకు తెలియాలి. ఢిల్లీలో బీజేపీకి కొం త చరిత్ర ఉంది. మేము 15 ఏళ్లుగా నగరంలో పరిపాలన కొనసాగిస్తున్నాం. మరి మీ (ఆప్) సంగతి ఏంటి.. మీకు ఎటువంటి చరిత్రా లేదు.. అంటూ వ్యంగ్యంగా అన్నారు. ‘ఆప్’ గెలుపోటములపై తాను మాట్లాడబోనన్నారు. ఈసారి పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ఆప్ తగినన్ని సీట్లు గెలుచుకుంటుందని వస్తున్న ఎన్నికల సర్వేలపై ప్రశ్నించగా ఆమె తేలిగ్గా తీసిపారేశారు. ఆ సర్వేలు నిష్పక్షపాతంగా జరగలేదని, వాటిని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన పనిలేదని ఆమె తేల్చేశారు. ‘ సదరు సర్వేలన్నీ ఆయా పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను, మేనిఫెస్టోలను విడుదల చేయకముందు నిర్వహించినవి.. ఇప్పుడు వాస్తవ పరిస్థితులను ఆ సర్వేలు ప్రతిఫలించడంలేదు.. ఏదేమైనా మేం నాలుగవ పర్యాయం కూడా అధికారంలోకి వస్తామనే విశ్వాసం మాకుంది..’ అని ఆమె ముక్తాయించారు. ఇదిలా ఉండగా, ఆప్ నాయకులు మాట్లాడుతూ తాము రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 వేల మంది పార్టీ మద్దతుదారుల నుంచి నవంబర్ 8వ తేదీవరకు రూ.19 కోట్లు పార్టీ ఫండ్‌గా సేకరించామని తెలిపారు. ఎన్నికలో తమ పార్టీ ఖర్చుల నిమిత్తం రిక్షా వాలాల దగ్గరనుంచి, చిరువ్యాపారులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వరకు రూ. 10 నుంచి రూ.లక్షల్లో తాము ఈ చందాలు వసూలుచేసినట్లు వారు వివరించారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట
న్యూఢిల్లీ: షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు దఫాలుగా చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ విమర్శించారు. ‘అవి అబద్ధాల పుట్టలు. ఈ ఏడాది వారు చేసే హామీలకు ముందు పాత హామీల మాటేమిటని మేం ప్రశ్నిస్తాం..’ అని ఆయన అన్నారు. ఆయన ఆది వారం మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు అబ ద్ధాలు చెప్పి మభ్యపెట్టడంలో కాంగ్రెస్‌వారికి చాలా అనుభవం ఉంది..’ అని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టో అనే పదానికి అర్థాన్నే మార్చేసిం ది..’ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘నగరంలో రుకేగీ నహీ మేరీ ఢిల్లీ అనే స్లోగన్‌తో వారు చాలా పెద్ద హోర్డింగ్ ఏర్పాటుచేశారు. అది కూడా అబద్ధమే.. నగరంలో చాలా ఏళ్లుగా అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడంలేదు..’ అంటూ ఆయన విమర్శించారు. 2003, 2008 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో పేర్కొన్న సుమారు 21 అంశాలను ఆ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం ముట్టుకోలేదు..’ అంటూ ఆయన ఆరోపించారు. ‘ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాను తీసుకొస్తామని 2003 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది.. ఆ తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీలోనూ, కేంద్రంలోనూ అధికారాన్ని చెలాయిస్తోంది.. ఇప్పటివరకు ఆ అంశంపై అతీగతీ లేదు.. ఈసారి కూడా మేనిఫెస్టోలో అదే హామీని ఆ పార్టీ ఇవ్వబోతోందా..’ అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే 2003, 08 మేనిఫెస్టోల్లోనే ఢిల్లీని విద్యుత్ ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించే రాష్ర్టంగా మారుస్తామని హామీ ఇచ్చిందని, కాని వాస్తవం దానికి విరుద్ధంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. గోయల్ మాట్లాడుతూ మరో 10-12 రోజుల్లో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనుందని తెలిపారు. తాము చేయగలిగే పనులనే అందులో పొందుపరుస్తామన్నారు. పార్టీ టికెట్లు దొరకలేదని రాజీనామాలు చేస్తున్నవారిపై మీ వైఖరేమిటనే ప్రశ్నకు గోయల్ సమాధానమిస్తూ ఎన్నికల సమయంలో ఇలాంటివి మామూలేనన్నారు. సవాళ్లను తాము ఎదుర్కోగలమనే ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాతే మిగిలిన ఎనిమిది సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇదిలాఉండగా ఇస్లాం మతగురువు మౌలానా తౌకీర్ రజాఖాన్‌ను కేజ్రీవాల్ కలవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. అటువంటి పార్టీకి ప్రజలు మద్దతు పలకబోరని ఆ పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీ విమర్శించారు. -
జంగ్ షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: నగర లెఫ్టినెంట్ గవర్నర్ న జీబ్ జంగ్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ శనివారం జారీ చేయడంతో డిసెంబర్ 4న ఢిల్లీ విధానసభకు జరిగే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దీంతో ఆయా పార్టీలు తమ తమ ఎన్నికల సన్నాహాల వేగాన్ని మరింతగా పెంచనున్నాయి. శనివారం నుంచే నామినేషన్ల పర్వం మొద లు కావడంతో ఏ పార్టీ అభ్యర్థి ఎవరు? ఏ స్థానంలో ఏ పార్టీ బలహీనంగా ఉంది? ఏ పార్టీ బలంగా ఉంది? మీడియా సర్వేలు ఏం చెబుతున్నాయి? ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి? తదితర విషయాలపై చర్చలు జోరందుకున్నాయి. 9వ తేదీన ఆరంభమైన నామినేషన్ల పర్వం నవంబర్ 16 వరకు కొనసాగుంది. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరిరోజు నవంబర్ 20. డిసెంబర్ 4న జరిగే పోలింగ్‌లో మొత్తం 1.15 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ 11,763 పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేస్తోంది. నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం కోసం ఎన్నికల కమిషన్ 70 మంది సాధారణ పరిశీలకులను, 18 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. ఓటర్లలో అవగాహనను పెంచి మరింత మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు చేపట్టిన ప్రక్రియను పరిశీలించడం కోసం ఎన్నికల కమిషన్ తొలిసారిగా ముగ్గురు అవేర్నెస్ అబ్జర్వర్లను నియమించింది. ఈ ఎన్నికలలో తొలిసారిగా ‘నోటా’ బటన్ నొక్కే అవకాశాన్ని కూడా ఓటర్లకు కలిగిస్తారు. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 12 నియోజకవర్గాలు షెడ్యూల్డు కులాలకు రిజర్వ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్ 17న ముగుస్తుంది. ఎన్నికలలో అధికారం కోసం పోటీ ముఖ్యంగా మూడు పార్టీల మధ్య నెలకొంది. మూడు సార్లు అధికారంలోనున్న కాంగ్రెస్ మరోమారు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఢిల్లీపై పట్టు ఎలాగైనా సాధించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ రెండు పార్టీలను మట్టికరిపించి ఢిల్లీపై విజయకేతనం ఎగురవేయాలని తొలిసారి ఎన్నికల బరిలోకి దూకుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. వివిధ టీవీ చానళ్లు నిర్వహించిన సర్వేల్లో ఆ పార్టీకి 18 నుంచి 25 స్థానాలు దక్కవచ్చని తేలింది. -
12వ తేదీ నాటికి కాంగ్రెస్ జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులెవరో తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే. దాదాపు పదో తేదీలోగా కాంగ్రెస్ జాబితా వెలువడవచ్చని ఆశించినా అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ జాగ్రత్త గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సెం ట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం సమావేశమై స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లను పరిశీలించింది. అభ్యర్థుల పేర్లను నిశితంగా పరిశీలిస్తున్నామని, అభ్యర్థుల జాబితా 11 లేదా 12వ తేదీ నాటికి వెలువడవచ్చని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ షకీల్ అహ్మద్ తెలిపారు. 12వ తేదీ నాటికి దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని, ఒకటి రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లు మిగిలిపోయినా నవంబర్ 16 వ రకు.. అంటే నామినేషన్ల చివరి రోజునాటికి ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం సమావేశమై అభ్యర్థుల పేర్లను చర్చించింది. స్థానికులు వ్యతిరేకిస్తున్న నేతలకు టికెట్ ఇచ్చినట్లయితే అసమ్మతిని ఎదుర్కోవలసి ఉంటుందని పార్టీ ఆందోళన చెందుతోం ది. బీజేపీలో రేగిన అసమ్మతి జ్వాలతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో జాగ్రత్త పడుతోంది. ఎమ్మ్మెల్యేలందరికీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కోరుతున్నప్పటికీ దాదాపు డజను సీట్లలో ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము వ్యతిరేకిస్తున్న శాసనసభ్యులకు టికెట్ ఇచ్చినట్లయితే తాము తిరుగుబావుటాలను ఎగురవేస్తామని వారు ఇప్పటికే షీలాదీక్షిత్, డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్‌ను హెచ్చరించారు. ఈ సీట్లలో మాల వీయనగర్, పటేల్‌నగర్, రాజేంద్రనగర్, ఆదర్శ్ నగర్, చాందినీ చౌక్, వజీర్పూర్, జంగ్‌పురా, కస్తూర్బాన గర్ నియోజకవర్గాలున్నాయి. నరేలా, రాజోరీ గార్డెన్ , ఓఖ్లా స్థానాల నుంచి టికెట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా చర్చనీయాంశంగా మారింది. జీవితమంతా పార్టీ కోసం పాటుపడ్డవారిని పక్కనబెట్టి ఇప్పుడు పార్టీలో చేరేవారికి వారికి టికెట్ ఇస్తే ఒప్పుకోమని పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.