న్యూఢిల్లీ: కేంద్రం ఒకవేళ తమకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వలేకుంటే కనీసం పూర్తిస్థాయి అధికారాలైనా కల్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేంద్రాన్ని కోరారు. దీనివల్ల పాలనాపరమైన అనుమతుల కోసం వివిధ అధికార సంస్థల చుట్టూ తిరగడం తప్పుతుందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారమిక్కడి సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి షీలాదీక్షిత్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 1992లో ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ పోలీసు, భూ లావాదేవీలు, పురపాలక అధికారాలన్నీ కేంద్రం అధీనంలోనే ఉన్నాయి.