
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లొ ఆమె నివాసానికి వెళ్లి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం షీలా కుటుంబ సభ్యులను ప్రధాని ఓదార్చారు. షీలా దీక్షిత్ భౌతిక దేహానికి నివాళులర్పింపిన వారిలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింథియా తదితరులు ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా షీలాదీక్షిత్ మృతికి నివాళిగా ఢిల్లీ ప్రభుత్వం రెండ్రోజుల సంతాప దినాలు ప్రకటించింది.





Comments
Please login to add a commentAdd a comment