Assembly election campaign
-
PM Narendra Modi: పేదలను లూటీ చేసిన కాంగ్రెస్
ముంబై: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. గరీబీ హఠావో అంటూ నినాదం ఇచ్చిన ఆ పార్టీ పేదరికాన్ని నిర్మూలించకుండా పేదలను విచ్చలవిడిగా లూటీ చేసిందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు జీవితంలో పైకి ఎదగకుండా కుట్రలు చేయడమే కాంగ్రెస్ విధానమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఏనాడూ మేలు జరగలేదన్నారు. ఏదైనా మంచి జరిగితే ప్రజలు సంతోషిస్తారు గానీ కాంగ్రెస్ మాత్రం కళ్లలో నిప్పులు పోసుకుంటుందని విమర్శించారు. ఇతరులకు లబ్ధి చేకూరడం ఆ పార్టీకి ఇష్టం ఉండదన్నారు. గురువారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయిందన్నారు. ఆ పార్టీ ముమ్మాటికీ పేదల వ్యతిరేకి అని ఆరోపించారు. పేదలను ఎప్పటికీ పేదరికంలోనే ఉంచాలన్న ఎజెండాతో పని చేస్తోందన్నారు. అధికారంలోకి రానివ్వకుండా కాంగ్రెస్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత పేద ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో ఒక తరం తర్వాత మరో తరం నాయకులు పేదరిక నిర్మూలన గురించి నినాదాలు ఇవ్వడం తప్ప ఆ దిశగా వారు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. వారి బోగసు నినాదాలను ఎవరూ నమ్మొద్దని కోరారు. ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే... స్వరాజ్.. సురాజ్ ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఎంతోమంది ప్రజలు కూడు, గూడు, గుడ్డ కోసం పోరాటం సాగించారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడ్డారు. గత పదేళ్లలో ఈ పరిస్థితిలో తొలిసారిగా మార్పు వచ్చింది. మా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఛత్రపతి శివాజీ జన్మించిన మహారాష్ట్ర గడ్డ అంటే నాకెంతో అభిమానం. 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నా పేరు ఖరారైన తర్వాత రాయ్‌గఢ్ కోటను సందర్శించా. దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఛత్రపతి శివాజీ ఆశీస్సులు స్వీకరించా. స్వరాజ్(స్వపరిపాలన) అనే ప్రతిజ్ఞను శివాజీ మనకు అందించారు. స్వరాజ్‌తోపాటు సురాజ్(సుపరిపాలన) అనే తీర్మానాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్లాలి. రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్ ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుతంత్రాలు సాగిస్తున్నాయి. ఆర్టికల్ 370 కోసం జమ్మూకశీ్మర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. జమ్మూకశీ్మర్ మన దేశంలో అంతర్భాగం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే అక్కడ అమలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వకూడదు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. అవి దేశ ప్రయోజనాలకు, మెరిట్‌కు వ్యతిరేకమని చెబుతోంది. ఎన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ మనస్తత్వం మారడం లేదు. అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ యువరాజు బహిరంగంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్నచిన్న కులాల పేరిట ముక్కలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. ఒక బీసీ నాయకుడు గత పదేళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతుండడాన్ని ఆ పార్టీ సహించలేకపోతోంది’’. అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్రపతి శంభాజీ అభిమానులకు, ఔరంగజేబ్ ఆరాధకులకు మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు. -
పీఓకే ప్రజలారా.. భారత్‌లో కలవండి
జమ్మూ/బనిహాల్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామ్‌బాన్ నియోజకవర్గంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి యువత పిస్టల్, రివాల్వర్ పట్టుకోవడం వదిలేసి ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నారు. కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. బీజేపీకి మద్దతు పలికితే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇక్కడ మరింత అభివృద్ధిని సాకారం చేస్తాం. ఇక్కడి అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు సైతం భారత్‌తో కలిసిపోతే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటారు. నాదీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఓకే ప్రజలను భారత్‌లో విలీనానికి పిలుపునిచ్చారు. ‘‘ పీఓకే ప్రజలకు నేను చెప్పేదొకటే. పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తోంది. పాక్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుందికూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్‌కు విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే రండి. మాతో కలవండి’’ అని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఆపేస్తే చర్చలకు సిద్ధంజమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం పూర్తిగా ఆపేస్తే ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమని రాజ్‌నాథ్ ప్రకటించారు. ‘‘ ఉగ్రవాదానికి మద్దతు పలకడం అనే చెడ్డపనిని పాక్ ఆపేయాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాల మెరుగు కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం మన మిత్రుడిని మార్చుకోగలంగానీ పొరుగు దేశాన్ని కాదుకదా. పాక్‌తో బంధం బలపడాలనే కోరుకుంటున్నాం. ముందుగా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలి. ఉగ్రవాదాన్ని కశ్మీర్లో ఆపినప్పుడే చర్చలు పట్టాలెక్కుతాయి. ఇక్కడ ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న వారిలో 85 శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఉగ్రఘటనల్లో ముస్లింలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉగ్రవాదం బాటలో పయనించి ప్రాణాలు పోగొట్టుకోకండి’’ అని రాజ్‌నాథ్ హితవు పలికారు. -
చివరిరోజు కాంగ్రెస్ దూకుడు..!
-
నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
-
సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు
-
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై విజయశాంతి కామెంట్స్
-
ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం
-
తెలంగాణలో హోరాహోరిగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
-
ఢిల్లీ టు హైదరాబాద్..గరం గరం
-
తెలంగాణలో బీజేపీ ప్రచార హోరు
-
తెలంగాణలో ప్రచార హోరు
-
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసింది
-
అక్కడ మల్లన్న డ్యాన్స్..ఇక్కడ కేటీఆర్ చిట్ చాట్
-
పార్టీల లెక్కలు పార్టీవి..జనం లెక్కలు జనానివి
-
మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి సతీమణి ప్రచారం
-
వేంసూరు మండల బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి రెడ్డి
-
భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
-
పాలేరు BRS అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు జాతీయ నేతల సందడి
-
ఇంక 5 రోజులే..ప్రచారం స్పీడ్ పెంచిన పార్టీలు
-
ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన బీఆర్ఎస్ అధినేత
-
ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి
-
రేవంత్ రెడ్డి తమ్మున్ని చూశారా ?..సేమ్ టు సేమ్ ఉన్నరు ఇద్దరు..
-
ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ
-
నేడు నల్లగొండ, నకిరేకల్ లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం
-
కేసీఆర్ పోరాట యోధుడు అధికారం మళ్లీ మాదే..
-
Rajasthan Assembly elections 2023: పతుల కోసం సతుల ఆరాటం
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారపర్వంలో కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు సైతం ప్రజల మద్దతు కూడగట్టుకొనేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. దక్షిణ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌తో పాటు మేవాడ్, వగడ్ ప్రాంతాలలోని రాజ్‌సమంద్, చిత్తోడ్‌గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ప్రతాప్గఢ్ల్లోని 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏడుగురికి ఇద్దరు భార్యలున్నారు. వారంతా భర్తల గెలుపు కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రతాప్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఇద్దరేసి భార్యలున్నారు. ఈ అభ్యర్థుల భార్యలిద్దరూ ఇటీవల జరిగిన కర్వా చౌత్ పండుగను కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. అంతేగాక ఇటీవల దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లోనూ ఈ ఏడుగురు అభ్యర్థులందరూ తమ ఇద్దరు భార్యల గురించి పేర్కొన్నారు. వీరిలో ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఉదయ్‌లాల్ డాంగి, ఖేర్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ దయారామ్ పర్మార్, ఝాడోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హీరాలాల్ దరంగి, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ప్రతాప్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమంత్ మీనా, కాంగ్రెస్ అభ్యర్థి రాంలాల్ మీనాల భార్యలు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రజల మధ్యకు వెళ్లి తమ తమ భర్తలకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక వగడ్ ప్రాంతంలోని బాన్స్వాడా జిల్లా గర్హి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాశ్ చంద్ర మీనా, ఘటోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నానాలాల్ నినామాకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వివాహం మాత్రమే చెల్లుబాటు అయినప్పటికీ, రాజస్తాన్ గిరిజనులలో బహుభార్యత్వం ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. -
బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం: కవిత
-
మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ లో మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం
-
లీడర్ల వింత ప్రచారాలు..
-
సీఎం కేసీఆర్ పై ఈటల తీవ్రస్థాయిలో ఆరోపణలు
-
పోటాపోటీ హామీలు..ప్రజల కోసమా..ఎన్నికల నాటకమా ?
-
ఇదెక్కడి ప్రచారం రాజేష్ ?
-
ప్రచారంలో స్నానాలు..
-
ఓటు కోసం కోటి తిప్పలు..
-
గిరిజనులకు చేసిందేమీ లేదు
ఖాండ్వా/సియోనీ: దేశాన్ని దాదాపు 60 ఏళ్ల పాటు పాలించినా గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ చేసిందంటూ ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యప్రదేశ్‌లో ఖాండ్వా, సియోనీ జిల్లాల్లో ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించారు. గిరిజనుల సంక్షేమానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు చేపట్టిన చర్యలను వివరించారు. వాజ్‌పేయీ సారథ్యంలోని బీజేపీ సర్కారు దేశంలో తొలిసారి ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాముని క్షేమం చూసిన, ఆయన్ను పురుషోత్తమునిగా ప్రస్తుతించిన గిరిజనులను పూజించడం బీజేపీ సంస్కృతి అన్నారు. ‘‘కాంగ్రెస్‌కు మాత్రం గాంధీల కుటుంబ క్షేమం తప్ప మరేమీ పట్టదు. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ముఖ్య నేతలిద్దరూ కొట్టుకుంటున్నారు. తమ కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. ఇక్కడ ఎలాగోలా అధికారంలోకి వచ్చి, లోక్‌సభ ఎన్నికల ఖర్చుల నిమిత్తం రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అలాంటి పార్టీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడింది. దాని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఆ పార్టీని ప్రతి ఎన్నికలోనూ ఓడిస్తూ దేశం నుంచి తరిమి కొడుతున్నారు’’అని మోదీ అన్నారు. ప్రస్తుతం నెలకు రూ.300 ఉన్న నెలవారీ మొబైల్ సేవల చార్జీలు కాంగ్రెస్ గనక అధికారంలో ఉంటే ఏకంగా రూ. 4,000–5,000 దాకా ఉండేవన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చినవాడిగా పేదల కష్టాలేమిటో తనకు తెలుసన్నారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ మధ్య అప్పుడే అధికారం కోసం కీచులాట మొదలైందని ఎద్దేవా చేశారు. అద్భుత మిజోరం మా లక్ష్యం ఐజ్వాల్: మిజోరంను అద్భుతంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఓటర్లను ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. మిజోలు తన కుటుంబ సభ్యులతో సమానమని చెప్పారు. విద్య, వైద్య తదితర అన్ని రంగాల్లోనూ మిజోరంను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దుతామన్నారు. అక్టోబర్ 30న మిజోరంలో మోదీ ఎన్నికల సభ జరగాల్సి ఉండగా రద్దయింది. -
Karnataka Assembly election 2023: భూమిపుత్రున్ని: ఖర్గే
కలబురిగి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ కర్ణాటక ప్రజలనుద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం కలబురిగిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘నన్నెవరైనా చంపితే చంపొచ్చు గాక! తుదిశ్వాస దాకా పేదల కోసం, వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా’’ అని స్పష్టం చేశారు. ‘‘నేను కన్నడ భూమిపుత్రున్ని. అందుకు ఎంతగానో గర్వపడతా’’ అన్నారు. ఖర్గేను, ఆయన భార్యాపిల్లలను చంపేందుకు బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపించడం, అందుకు రుజువుగా ఆడియో రికార్డు విడుదల చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అది కచ్చితంగా బీజేపీ అగ్ర నేతల మనసు లోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే అయ్యుంటుందని ఆరోపించారు. వారి దన్ను లేనిదే ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ‘‘చిన్నతనంలోనే కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాను. వాళ్లేమైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడను. నన్ను కాపాడేందుకు అంబేడ్కర్ అందించిన రాజ్యాంగముంది. కర్ణాటక ప్రజలంతా నా వెనక ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాక దేశ ప్రజలంతా నా వెనకే ఉన్నారు. మన దేశంలో సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్లే. నాకు 81 ఏళ్లు. అంటే ఇప్పటికే బోనస్ పీరియడ్‌లో ఉన్నా. మహా అయితే మరో ఎనిమిదేళ్లు బతుకుతానేమో. నన్నూ, నా కుటుంబాన్నీ తుడిచి పెట్టొచ్చు గాక. భయపడేది లేదు. నా స్థానంలో మరొకరు పుట్టుకొస్తారు’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ కూడా పదేపదే నా కుమారుని గురించి మాట్లాడుతున్నారు. అతనిది మోదీ స్థాయి కాదు. నా గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘తాను భూమిపుత్రున్నని గుజరాత్లో మోదీ చెప్పుకుంటారు. తన కోసం బీజేపీని గెలిపించాలని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను కోరారు. అలాగే కర్ణాటక భూమిపుత్రుడినైన నా కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నా’’ అన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండగా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. బెంగళూర్‌లో రాహుల్ బస్సు ప్రయాణం బనశంకరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బెంగళూరులో హల్చల్ చేశారు. కన్నింగ్‌హాం రోడ్డులో కాఫీ డేలో కాసేపు గడిపారు. అక్కడ కాఫీ రుచి చూశాక దగ్గర్లోని లోకల్ బస్టాప్‌లో కాలేజీ విద్యార్థులు, వర్కింగ్ విమెన్‌తో మాటలు కలిపారు. స్టూడెంట్లతో సెల్ఫీ దిగారు. తర్వాత లోకల్ బస్సెక్కి ప్రయాణికురాళ్లతో మాట్లాడారు. లింగరాజపురంలో బస్సు దిగి బస్టాప్‌లో మహిళలతో మరోసారి ముచ్చటించారు. ‘ధరల పెరుగుదల, ఇంటి పెద్ద అయిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ, ఉచిత బస్సు ప్రయాణం తదితరాలపై వారు నాతో లోతుగా చర్చించారు’’ అని చెప్పుకొచ్చారు. -
‘పౌరసత్వం’పై కాంగ్రెస్ రెచ్చగొడుతోంది: అమిత్
గిరిధ్ బాఘ్మారా: పౌరసత్వ సవరణ చట్టం గురించి కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పారు. శనివారం ఆయన జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం కాంగ్రెస్‌కు కడుపునొప్పి తెప్పించిందని, అందుకే ఆ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని అన్నారు. రాహుల్ గాంధీ జార్ఖండ్‌ను ఇటాలియన్ కళ్లజోడుతో చూస్తున్నారని, అందుకే అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అయితే వారికి మద్దతుగా ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన ఘనత ఎన్డీయేదేనని స్పష్టంచేశారు. డిసెంబర్ 16న జార్ఖండ్‌లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. -
రేపటి నుంచి సోనియా ప్రచారం
బెంగళూరు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకుతున్నారు. బీజాపూర్‌లో మంగళవారం ఓ ర్యాలీలో ఆమె ప్రసంగించనున్నారు. 21 నెలల విరామం తర్వాత సోనియా మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు 2016 ఆగస్టు 2న వెళ్తుండగా ఆమె మార్గమధ్యంలో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో శాసనసభ ఎన్నికలు జరగ్గా సోనియా ఏ రాష్ట్రంలోనూ ప్రచారం చేయలేదు. బీజాపూర్‌లో సోనియా ర్యాలీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామంతర్వాత ఆమె తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లోనే ప్రచారం చేయబోతున్నారనీ, ఈ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యమనేందుకు ఇదో ఉదాహరణ అని కర్ణాటక కాంగ్రెస్ తాత్కాలిక కార్యదర్శి మాణిక్యం టాగూర్ పేర్కొన్నారు. 1998లో తొలి ఎన్నికల ప్రసంగం 1998లో సోనియా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది జనవరి 11న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు (సోనియా భర్త రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురైన చోటు)లో తొలిసారి ఆమె ఎన్నికల ప్రసంగం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె రెండుసార్లు మాత్రమే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా విరామం తీసుకున్నారు. ఇటీవలి 21 నెలల వరుస విరామానికి తోడు 2012లో మణిపూర్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా మిలిటెంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరిక మేరకు సోనియా ప్రచారం చేయలేదు. సోనియా బీజాపూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనే మంగళవారమే అదే జిల్లాలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఓ భారీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనుండటం కొసమెరుపు. -
హిమాచల్‌లో ముగిసిన ప్రచారం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. నవంబర్ 9న జరిగే ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గానూ 337 మంది అభ్యర్థులు తుది బరిలో నిలిచారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, అమిత్ షా, కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో భారీ ఎత్తున నగదు, మద్యంతో పాటు బంగారం పట్టుబడ్డాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.1.38కోట్ల నగదు, 6లక్షల లీటర్ల మద్యాన్ని ఎన్నికల ప్రత్యేక నిఘా, నిధుల పర్యవేక్షణ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. -
మళ్లీ ప్రచారం
సాక్షి, చెన్నై : అరవకురిచ్చి, తంజావూరుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మళ్లీ వేడెక్కింది. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ప్రచార పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ రెండు స్థానాల్లో సమరం ఉత్కంఠ భరితంగా సాగనున్నడంతో సర్వత్రా ఎదురు చూపుల్లో పడ్డారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికలకు ముందుగా ఒక్కో రోజు వ్యవధిలో రెండు స్థానాల్లో వాయిదా పర్వం సాగాయి. తొలుత కరూర్ జిల్లా అరవకురిచ్చిలో ఎన్నికల్ని నిలుపుదల చేశారు. తదుపరి తంజావూరు ఎన్నికల్ని వాయిదా వేశారు. ఇందుకు కారణం ఆ రెండు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల మేరకు నగదు బట్వాడా జరిగినట్టుగా ఆధారాలతో సహా ఎన్నికల పర్యవేక్షకులు తేల్చారు. అరవకురిచ్చిలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అన్నాడిఎంకే అభ్యర్థిగా, డిఎంకేలో ఆర్థిక బలం కల్గిన కీలక నాయకుడు కేసి పళని స్వామి ప్రత్యర్థిగా రేసులో దిగడంతో ఇక్కడ నోట్ల క ట్టలు పెద్ద ఎత్తున చేతులు మారి ఉంటాయన్నది స్పష్టం కాక తప్పదు. ఈ ఇద్దరూ గెలుపు కోసం ఓటుకు రూ. ఐదు వేల వరకు పంపిణీ చేసినట్టుగా సంకేతాలు బయలు దేరాయి. అదే సమయంలో తంజావూరు రేసులో డీఎంకే అభ్యర్థిగా అంజుగం భూపతి, అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగస్వామిలు రేసులో ఢీ కొట్టారు. సమరం హోరా హోరీ అన్న సమాచారంతో ఇక్కడ కూడా నోట్ల కట్టల్ని బాగానే చల్లడంతో చివరకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అన్ని స్థానాలతో పాటుగా సోమవారం ఇక్కడ కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నా, నోట్ల కట్టల రూపంలో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 232 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఇక, మిగిలిన ఈ రెండు స్థానాల ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టి పెట్టింది. అదే సమయంలో ఈ నెల 21 వరకు ప్రచారం చేసుకోవచ్చని ఈసీ సూచించడంలో ఓట్ల వేటలో అభ్యర్థులు పడ్డారు. అరవకురిచ్చిలో డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ ఓట్ల సేకరణలో మంగళవారం నిమగ్నం అయ్యారు. ఇక, తమ అభ్యర్థి కేసి పళని స్వామికి మద్దతుగా ప్రచార పయనానికి డిఎంకే దళపతి ఎంకే స్టాలిన్ సిద్ధం అయ్యారు. బుధవారం ఆయన అరవకురిచ్చి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వేలాయుధ పాలయం, పరమత్తి, చిన్నతారాపురం, అరవకురిచ్చి, పల్లం పట్టిల మీదుగా రోడ్ షో సాగించి, ఆయా ప్రాంతాల్లో స్టాలిన్ ప్రసంగించనున్నారు. గురువారం కౌంటింగ్ డే కావడంతో ఫలితాల మేరకు తదుపరి తంజావూరులో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. 21వ తేది సాయంత్రంతో ఈ రెండు స్థానాల్లో ప్రచారంకు తెర పడుతుంది. 23వ తేది ఓటింగ్, 25న ఫలితాల వెల్లడికి అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి. -
కుమరికి మోదీ
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో అడుగు పెట్టనున్నారు. మే ఆరు,ఏడు తేదీల్లో ఆయన పర్యటన సాగే అవకాశాలు ఉన్నాయి. బహిరంగ సభకు స్థల పరిశీలనలో కన్యాకుమారి జిల్లా బీజేపీ వర్గాలు, ఎస్పీ ధర్మరాజన్ నేతృత్వంలోని బృందం నిమగ్నమైంది.చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమ, మిత్ర పక్షాల అభ్యర్థులకు మద్దతుగా ప్రచార పర్యటనకు బీజేపీ జాతీయ నేతలు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరిగా రాష్ట్రంలో పర్యటించి ఓట్ల వేటకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. తిరుచ్చి, కోయంబత్తూరులలో ఉన్న పార్టీ ముఖ్య అభ్యర్థులకు మద్దతుగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రచార పయనం సాగిస్తున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి జిల్లాలోని నియోజకవర్గాల్లో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసింది. పొన్‌రాధాకృష్ణన్ కేంద్ర సహాయ మంత్రిగా ఇక్కడి నుంచే ఎదగడంతో ఆ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని కమలం పెద్దలు సారించి ఉన్నారు. ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా పొన్‌రాధాకృష్ణన్ తీవ్ర ఓట్ల వేటలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తరహాలో ఈ సారి ఇక్కడే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా ప్రచార భేరి మోగించేందుకు నిర్ణయించారు. మోదీ ప్రచార పర్యటన సిద్ధం అవుతుండడంతో బహిరంగ సభ ఏర్పాట్లపై కమలనాథులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ రానున్నడడంతో అందుకుతగ్గ భద్రతా ఏర్పాట్ల మీద సమీక్షకు కన్యాకుమారి పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. మంగళవారం కమలనాథులు స్థల పరిశీలనలో నిమగ్నమయ్యారు. వీరితో పాటు జిల్లా ఎస్పీ ధర్మరాజన్ నేతృత్వంలోని డీఎస్పీలు సెల్వరత్నం, బాల మురుగన్‌లతో కూడిన బృందం పరిశీనలో నిమగ్నమైంది. లోక్ సభ ఎన్నికల సమయంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న భారీ మైదానంలో మోదీ ప్రచార సభ జరిగిన దృష్ట్యా, ఆ వేదికను ఎంపిక చేయడానికి చర్యలు చేపట్టి ఉన్నారు. అలాగే, సమీపంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ క్రీడా మైదానాన్ని సైతం పరిశీలించారు. ప్రధాని మోదీ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు తగ్గ ఏర్పాట్లు, రోడ్డు మార్గంలో కూత వేటు దూరం ఆయన పర్యటన తదితర అంశాలపై సమీక్షించారు. ఇందుకు తగ్గ నివేదికను ఢిల్లీకి కన్యాకుమారి జిల్లా యంత్రాంగం పంపించనుంది. తదుపరి కేంద్రంలోని ఎన్ఎస్జీ వర్గాలు కన్యాకుమారిలో పర్యటించి వేదికను ఖారారు చేయనున్నారు. కుమరితో పాటుగా కోయంబత్తూరులోనూ మోదీ ప్రచార బహిరంగ సభకు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్న దృష్ట్యా, ఆయన పర్యటన రెండు రోజులా, ఒకే రోజా అన్నది తేలాల్సి ఉంది. మే ఆరు, ఏడు తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచార పర్యటన ఉంటుందని కమలనాథులు పేర్కొంటున్నారు. -
విజయ ప్రచారం
అసెంబ్లీ ఎన్నికలకు అమ్మ సన్నద్ధం అవుతోంది. అన్నాడీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ఆదేశించారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఉత్తర్వులు అందాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది మే 15తో ముగుస్తుంది. ఈలోగానే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. 2011 ఏప్రిల్ 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, మే 15వ తేదీన జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కారణంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో అసెంబ్లీ ఎన్నికలను విధిగా నిర్వహించాల్సి ఉంది. మరో ఏడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇందుకు సమాయుత్తం అవుతున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే పార్టీలు అన్నాడీఎంకేను వ్యతిరేకిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ తటస్థంగా వ్యవహరిస్తోంది. అన్నాడీఎంకేను వ్యతిరేకిస్తున్న పార్టీలు ఎన్నికల సమయానికి ఏఏ గూటికి చేరుతాయి, ఎవరితో కూటమిగా మారుతాయనే అంశం తేలేందుకు మరికొంత సమయం వేచి చూస్తేగానే స్పష్టతరాదు. ద్రవిడ పార్టీలతో పొత్తుపెట్టుకోబోమని పీఎంకే ఇప్పటికే ప్రకటించింది. డీఎంకే ఎన్నికలకు సమాయుత్తం అవుతున్న తరుణంలో మద్య నిషేధ ఉద్యమం సాగుతున్నందున అన్నిపార్టీల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అన్నాడీఎంకే ముందడుగు: సంపూర్ణ మద్యనిషేధం పోరులో ప్రతిపక్షాలన్నీ తలమునకలై ఉన్నందున ఇదే అదనుగా అన్నాడీఎంకే జయ ప్రచార వ్యూహం పన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాలని ఆమె ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్‌ల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. సదరు నేత తనకు అప్పగించిన పోలింగ్ బూత్ పరిధిలో ప్రతి ఇంటి తలుపుతట్టి అన్నాడీఎంకే ప్రభుత్వ సాధనపై ముద్రించిన కరపత్రాలను పంచుతూ ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈలెక్కన రాష్ట్రంలో 5.5 కోట్ల ఓటర్లను పార్టీనేతలు వ్యక్తిగ తంగా కలుసుకోవాలని సూచించారు. ఈ ఆదేశాలతో కూడిన సర్క్యులర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆదివారం విడుదల చేశారు. తన నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం మాత్రమే ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిందని జయ అన్నారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజల నుండి ప్రభుత్వానికి భరోసా లభించడం ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్రంలోని 64,094 పోలింగ్ బూత్‌ల పరిధిలో 5,62,06,547 మంది ఓటర్లను పార్టీనేతలు కలుసుకుంటారని ఆమె తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనపై అభిప్రాయసేకరణ చేస్తారని చెప్పారు. దీని ద్వారా చారిత్రాత్మకమైన పురోగతి ప్రజల వల్ల తేటతెల్లం కాగలదని ఆమె అన్నారు. అన్నాడీఎంకే తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, ఓటర్లు సహకరించాలని జయలలిత విజ్ఞప్తి చేశారు. -
ప్రచారంలో ఆమ్ఆద్మీ కొత్త పుంతలు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఇంకా ప్రముఖ నాయకులు బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ఉత్తేజితపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ సానుభూతి పరుడు, ప్రముఖ సంగీత కళాకారుడు విశాల్ దడ్లానీ రూపొందించి ‘పాంచ్‌సాల్ కేజ్రీవాల్’ పాట ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ఓటర్లలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. అదే సందర్భంలో కేజ్రీవాల్ బహిరంగ సభల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు దంచేస్తున్నారు. మెట్రో పరిధిలోని ఆయా నియోజక వర్గాల్లో పార్టీ నాయకులు ప్రచారం డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో, వారి ఇబ్బందులను గురించి వివరిస్తూ, పరిష్కారానికి మార్గ నిర్దేశనం చేస్తున్నారు. వచ్చే వారం వాలంటీర్ల మెరుపు ప్రచారం వచ్చే వారంలో ఆప్ వాలంటీర్లు నగర వ్యాప్తంగా మెరుపు ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గతలోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ‘అచ్చేదిన్ ఆనే వాలే హై’ అనే నినాదం సత్ఫలితాలిచ్చింది. 2007లో కూడా శివసేన కూడా శకాస్, ర్యాలీలు నిర్వహించి ముంబై మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. పాటలు పార్టీ ప్రచారానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ కారణంగానే ఈ సారి ఆప్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారస్త్రంగా పాటను ఎంచుకొంది. బ్లూ, ఎల్లో లైన్లలో.. దీంతోపాటు బస్సుస్టాప్ల్లో అడ్వర్టైజ్మెంట్లను ప్రదర్శిస్తోంది. బ్లూ, ఎల్లో లైన్లలో మహిళల రక్షణ ప్రధానాంశంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ రూట్లలో డీఎంఆర్సీ సర్వే ప్రకారం అత్యంత రద్దీగా ఉంటాయి. పేద మధ్యతరగతి ప్రయాణికులను ఆకట్టుకునేందుకు బస్‌స్టాప్‌ల్లో పోస్టర్ల ప్రదర్శన దోహదం చేస్తుందని ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం కోసం మెట్రో రైళ్లలోని మొదటి కోచ్, చివరి కోచ్‌లపైనే అడ్వర్టైజ్మెంట్ల ప్రదర్శన ఇస్తున్నామని, అందుకే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆ రెండు లైన్లను వినియోగించుకొంటున్నామని నాయకులు పేర్కొన్నారు. పార్టీ వాలంటీర్ మాట్లాడుతూ..రేడియో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా యువతీయువకుల ప్రధాన సమస్యలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, విద్యుత్, పానీ సమస్యలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. 27న లక్నోలో ‘ఆప్ తాలీ’ లక్నో: ఆమ్ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూనే పార్టీకి అవసరమైన నిధుల సేకరణలో ముందుకు సాగుతోంది. వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజల నుంచి నిధులు సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం డిసెంబర్ 27వ తేదీన రూ. 11,000లకే ‘ఆప్ తాలీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అరవింద్‌కు అత్యంత సన్నిహితులైన నాయకులు మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, అశుతోష్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కార్పొరేట్ దిగ్గజాల నుంచి పార్టీ నిధులు సేకరిస్తున్నాయని అన్నారు. తమ పార్టీ అందుకు భిన్నంగా డిన్నర్ల పేరుతో సాధారణ ప్రజల నుంచి నిధులు సేకరిస్తున్నామని పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు వైభవ్ మహేశ్వరీ మీడియాకు చెప్పారు. -
ఎన్నికల ప్రచారానికి ‘సాధ్వీ’
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం - నాయకుల ర్యాలీల రద్దు చేసే ప్రసక్తేలేదు - 60 స్థానాల్లో గెలుపే ధ్యేయం సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ ఎన్నికల ప్రచార సభలో సాధ్వీ నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసనల దృష్ట్యా ఆమె ప్రచార సభలల్లో పాల్గొనరనే ప్రచారం జరిగింది. గోల్ మార్కెట్లో ఆమె పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీలో అలీఘడ్ ఎంపీ సతీష్గౌతం పాల్గొనడంతో ఊహాగానాలను ఊపందుకొన్నాయి. కానీ ఆమె ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన శుక్రవారం తెలియజేయడంతో తెరపడింది. ఢిల్లీలో బీజేపీ ఎంపీలతో పాటు నాయకులందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. నేతల ఎన్నికల ర్యాలీలను రద్దు చేసే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ప్రచార సభలు ప్రారంభం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 60 పైగా సీట్ల లక్ష్యాన్ని సాధించడం కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ అధ్య్యక్షుడు అమిత్ షా నిర్ణయించారు. ఈ మేరకు 300 మంది పార్టీ ఎంపీలతో నగరంలో 2,700 జనసభలు నిర్వహించాలని ఢిల్లీ శాఖను ఆదేశించారు. ఈ ఆదేశం మేరకు సోమవారం సాధ్వీనిరంజన్ జ్యోతితో సహా ఏడుగురు బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు. దుమారం ఇక్కడే.. రాజోరీగార్డెన్‌లో జరిగిన జనసభలో సాధ్వీ నిరంజన్ జ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రామ్జాదోల (రాముని వారసుల) ప్రభుత్వం కావాలా లేక హరామ్జాదోల ( అక్రమ సంతానం) ప్రభుత్వం కావాలో ఢిల్లీవాసులు నిర్ణయిం చుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం లేచింది. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన నిరసనతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. సాధ్వీ నిరంజన్ జ్యోతి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉభయసభలలో ఈ విషయమై ప్రకటన చేయవలసి వచ్చింది. కారణాలేమైనా..ఐదు సభల రద్దు ఈ నేపథ్యంలో సాధ్వీ నిరంజన్ జ్యోతితో పాటు మిగతా ఎంపీలు ఢిల్లీలో నిర్వహిస్తోన్న జనసభల ఆర్భాటం పలచబడింది. గురువారం 30 మంది ఎంపీలతో ప్రచార సభలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ పార్టీ ప్రకటించినప్పటికీ వాటిలో ఐదు సభలు రద్దయ్యాయి. అందులో సాధ్వీ నిరంజన్ జ్యోతి గోల్ మార్కెట్లో నిర్వహించవలసిన సభ ఒకటి. నాంగ్లోయ్ వెస్ట్, వెస్ట్ సాగర్‌పుర్, హర్కేష్ నగర్‌తో పాటు ముండ్కాలో జరగవలసిన రెండు సభలు రద్దయ్యాయి. పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఈసభలు రద్దయినట్లు కొందరు నేతలు చెబుతున్నారు. కానీ, ఎంపీలతో ఎన్నికల ర్యాలీల వ్యూహాన్ని అధినాయకత్వం సమీక్షిస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రముఖులు, వాగ్ధాటి కలిగిన ఎంపీలతో ర్యాలీలు జరిపించాలని, జనసభల సంఖ్య పై కన్నా పకడ్బందీగా నిర్వహించడంపై ఎక్కువ దృష్ట్టిపెట్టాలని పార్టీ యోచిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సభల సంఖ్య ఐదుకు తగ్గించినట్లు చెబుతున్నారు. -
మోడీ సభ నేపథ్యంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం, దాని చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర కమిషనర్ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆంక్షలు ఇలా... ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు. కేవలం నాంపల్లి, ర వీంద్రభారతి వైపు అనుమతిస్తారు. అబిడ్స్, గన్‌ఫౌండ్రిల నుంచి బీజేఆర్ విగ్రహం, బషీర్బాగ్చౌరస్తా వైపు వ చ్చేవాటిని గన్‌ఫౌండ్రి వద్ద దారి మ ళ్లించి..చాపల్రోడ్ మీదుగా పంపిస్తారు. బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు అనుమతించరు. బషీర్‌బాగ్ చౌ రస్తా నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా వెళ్లాలి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు అనుమతించారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్ వైజంక్షన్ మీదుగా వెళ్లాలి. రాజమోహల్లా రోడ్డు నుంచి ఓల్డ్ ఎ మ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనా లు సిమెంట్రీ జంక్షన్ మీదుగా కిగ్కోఠి లేదా నారాయణగూడ మీదుగా వెళ్లాలి. కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యా భవన్ మీదుగా బషీర్‌బాగ్ చౌరస్తాకు వచ్చే వాహనాలను కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ వైపు మళ్లిస్తారు. ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి బషీర్‌బాగ్‌కు వచ్చే వాహనాలు పీసీఆర్ నుంచి నాంపల్లి రోడ్డుకు వెళ్లాలి. లిబర్టీ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ జం క్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ మీదుగా దారి మళ్లిస్తారు. {పతినిధులు, పాస్ కలిగిన వారిని ఎల్బీస్టేడియం వరకు అనుమతిస్తారు. పార్కింగ్ ప్రదేశాలు.... ఎంజీ,ఆర్పీ రోడ్ల నుంచి వచ్చే డీసీఎంలు, లారీలు చిల్డ్రన్‌పార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లి ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. వీవీ విగ్రహం వైపు నుంచి వచ్చేవారు షాదాన్, నిరంకారి, ఓల్ ్డపీఎస్ సైఫాబాద్, తెలుగుతల్లి విగ్రహం, కట్టమైసమ్మ ఆలయం మీదుగా ఎన్టీఆర్ స్టేడియానికి వచ్చి పార్క్ చేయాలి. జూపార్క్, మాసాబ్‌ట్యాంక్, మలక్‌పేట్ నుంచి వచ్చే లారీలు, డీసీఎంలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పార్క్ చేయాలి. ద్విచక్ర వాహనాలు, కార్లలో సభకు వచ్చే వారు నిజాంకళాశాల మైదానం లో పార్క్ చేయాలి. వీఐపీ వాహనాలకు పబ్లిక్‌గార్డెన్, ఆలి యా కాలేజీ, మహబూబియా కళాశాల, నిజాం కాలేజీ ఫుట్‌బాల్ గ్రౌండ్లను కేటాయించారు. పోలీసు తనిఖీలు... మోడీ సభలపై ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశాలున్నాయనే ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. 1500 మంది సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. సోమవారం ఎల్బీస్టేడియంను డాగ్‌స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్లతో క్షుణ్ణంగా పరిశీలించారు, మరోపక్క టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాడ్జీలు, హోటళ్లలోను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాలను కూడా సోదా చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి: డీసీపీ మోడీ సభ జరిగే ఎల్బీస్టేడియం చుట్టుపక్కల ఉన్న బస్తీవాసులు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సెంట్రల్‌జోన్ డీసీసీ కమలాసన్‌రెడ్డి కోరారు. -
ఢిల్లీ సర్కారుకు పూర్తి పగ్గాలు ఇవ్వండి: షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: కేంద్రం ఒకవేళ తమకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వలేకుంటే కనీసం పూర్తిస్థాయి అధికారాలైనా కల్పించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేంద్రాన్ని కోరారు. దీనివల్ల పాలనాపరమైన అనుమతుల కోసం వివిధ అధికార సంస్థల చుట్టూ తిరగడం తప్పుతుందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారమిక్కడి సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి షీలాదీక్షిత్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 1992లో ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ పోలీసు, భూ లావాదేవీలు, పురపాలక అధికారాలన్నీ కేంద్రం అధీనంలోనే ఉన్నాయి.