మోడీ సభ నేపథ్యంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు | Modi today in the wake of the traffic restrictions | Sakshi
Sakshi News home page

మోడీ సభ నేపథ్యంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Published Tue, Apr 22 2014 4:39 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీ సభ నేపథ్యంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు - Sakshi

మోడీ సభ నేపథ్యంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం, దాని చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర కమిషనర్ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
 
ఆంక్షలు ఇలా...
ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు. కేవలం నాంపల్లి, ర వీంద్రభారతి వైపు  అనుమతిస్తారు.
     
అబిడ్స్, గన్‌ఫౌండ్రిల నుంచి బీజేఆర్ విగ్రహం, బషీర్‌బాగ్‌చౌరస్తా వైపు వ చ్చేవాటిని గన్‌ఫౌండ్రి వద్ద దారి మ ళ్లించి..చాపల్‌రోడ్ మీదుగా పంపిస్తారు.
     
బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు అనుమతించరు. బషీర్‌బాగ్ చౌ రస్తా నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి మీదుగా వెళ్లాలి.
     
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్‌‌స నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు అనుమతించారు.  ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్  వైజంక్షన్ మీదుగా వెళ్లాలి.
     
రాజమోహల్లా రోడ్డు నుంచి ఓల్డ్ ఎ మ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనా లు సిమెంట్రీ జంక్షన్ మీదుగా కిగ్‌కోఠి లేదా నారాయణగూడ మీదుగా వెళ్లాలి.
     
కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యా భవన్ మీదుగా బషీర్‌బాగ్ చౌరస్తాకు వచ్చే వాహనాలను కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ వైపు మళ్లిస్తారు.

ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి బషీర్‌బాగ్‌కు వచ్చే వాహనాలు పీసీఆర్ నుంచి నాంపల్లి రోడ్డుకు వెళ్లాలి.
లిబర్టీ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ జం క్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ మీదుగా దారి మళ్లిస్తారు.
     
{పతినిధులు, పాస్ కలిగిన వారిని ఎల్బీస్టేడియం వరకు అనుమతిస్తారు.
 

పార్కింగ్ ప్రదేశాలు....
ఎంజీ,ఆర్‌పీ రోడ్ల నుంచి వచ్చే డీసీఎంలు, లారీలు చిల్డ్రన్‌పార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లి ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి.
     
వీవీ విగ్రహం వైపు నుంచి వచ్చేవారు షాదాన్, నిరంకారి, ఓల్ ్డపీఎస్ సైఫాబాద్,  తెలుగుతల్లి విగ్రహం, కట్టమైసమ్మ ఆలయం మీదుగా ఎన్టీఆర్ స్టేడియానికి వచ్చి పార్క్ చేయాలి.
     
జూపార్క్, మాసాబ్‌ట్యాంక్, మలక్‌పేట్ నుంచి వచ్చే లారీలు, డీసీఎంలు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పార్క్ చేయాలి.
     
ద్విచక్ర వాహనాలు, కార్లలో సభకు వచ్చే వారు నిజాంకళాశాల మైదానం లో  పార్క్ చేయాలి.
     
వీఐపీ వాహనాలకు పబ్లిక్‌గార్డెన్, ఆలి యా కాలేజీ, మహబూబియా కళాశాల,  నిజాం కాలేజీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లను కేటాయించారు.
 
పోలీసు తనిఖీలు...
మోడీ సభలపై ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశాలున్నాయనే ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. 1500 మంది సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. సోమవారం ఎల్బీస్టేడియంను డాగ్‌స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్‌లతో క్షుణ్ణంగా పరిశీలించారు, మరోపక్క టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాడ్జీలు, హోటళ్లలోను  విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాలను కూడా సోదా చేస్తున్నారు.
 
 అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి: డీసీపీ
 మోడీ సభ జరిగే ఎల్బీస్టేడియం చుట్టుపక్కల ఉన్న బస్తీవాసులు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సెంట్రల్‌జోన్ డీసీసీ కమలాసన్‌రెడ్డి కోరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement