Traffic restrictions
-
HYD: పలు చోట్ల రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆదివారం(జనవరి26) పలుచోట్ల ట్రాఫిక్ అంక్షలు అమల్లోకి రానున్నాయి. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రాండ్స్‌లో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమాల దృష్ట్యా ట్రాఫిక్ అంక్షలు విధించనున్నారు. జనవరి 26న ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో, రాజ్ భవన్ పరిసరాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో వచ్చే వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గ్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలైన టివోలీ థియేటర్ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు కాస్త ముందుగా బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. -
న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
-
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
భారత్– బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12న (శనివారం) భారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.వరంగల్ వైపు నుంచి ఎల్బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: ఒక్కసారిగా వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షంరామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి. -
సద్దుల బతుకమ్మ వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
పూల పండుగకు వేళయ్యింది. గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా వాకిళ్లన్నీ పూదోటలుగా మారనుండగా ఊరూవాడ ఆడబిడ్డల ఆటాపాటలతో హోరెత్తనున్నది. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు.ఇవాళ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ విభాగం ప్రకటించింది. అమరవీరుల స్మారకస్థూపం నుండి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు ఈరోజు సాయంత్రం 4గంటల నుండి రాత్రి 11గంటల వరకు కొనసాగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసులు అధికారికంగా ప్రకటించారు.ట్రాఫిక్ ప్రాంతాల్లో వెళ్లే వారు ప్రత్యమ్నాయా మార్గాలు ఎంచుకోవాలని కోరారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. -
Hyderabad: నేటి నుంచి మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
సనత్‌నగర్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. కల్యాణం జరిగే 9న, రథోత్సవం నిర్వహించే 10న భక్తులు విశేషంగా తరలిరానున్న నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు, ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ వద్ద మళ్లించి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్‌నగర్ క్రాస్‌రోడ్డు, సనత్‌నగర్ మీదుగా ఫతేనగర్ రోడ్డు వైపు అనుమతిస్తారు. ⇒ ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలను కొత్త వంతెన వద్ద కట్టమైసమ్మ దేవాలయం, బేగంపేట వైపు మళ్లిస్తారు. ⇒ గ్రీన్‌ల్యాండ్స్–బకుల్ అపార్ట్మెంట్స్, ఫుడ్‌వరల్డ్ నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. ఫుడ్‌వరల్డ్ ఎక్స్ రోడ్డులో సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం లేదా ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ వైపు మళ్లిస్తారు. ⇒ బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం నుంచి వచ్చే వాహనాలు బల్కంపేట వైపు వెళ్లడానికి అనుమతించరు. ఆ ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్, మాతా ఆలయం, సత్యం థియేటర్, ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ ఎడమ మలుపు నుంచి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లిస్తారు. ⇒ ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు బైలేన్లతో పాటు లింక్ రోడ్లు మూసివేస్తారు. వాహనాల పార్కింగ్ ఇలా.. ఎస్ఆర్నగర్ టి–జంక్షన్ సమీపంలో ఆర్అండ్బీ కార్యాలయం, ఫుడ్‌వరల్డ్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ రోడ్డు సైడ్ పార్కింగ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ పార్కింగ్, ఫతేనగర్ రైల్వే వంతెన కింద పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. భక్తులు తమ వాహనాలను నిరీ్ణత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే సక్రమంగా పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 90102 03626కు ఫోన్ చేయాలన్నారు. -
హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.మరోవైపు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. -
ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి మండలం పిసినికాడలో సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, టిప్పర్లు, లారీలు మొదలైన వాహనాలను దారి మళ్లిస్తున్నామని చెప్పారు. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆంక్షలు ఉంటాయన్నారు. ► విశాఖ నుంచి తుని వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలు లంకెలపాలెం జంక్షన్, పరవాడ, అచ్యుతాపురం, యలమంచిలి, రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలి. ► తుని నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు తుని, రేగుపాలెం జంక్షన్, యలమంచిలి బైపాస్, అచ్యుతాపురం, పరవాడ, లంకెలపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా విశాఖ చేరుకోవాలి. ► సబ్బవరం జాతీయ రహదారి మీదుగా వచ్చే వాహనాలు అనకాపల్లి, లంకెలపాలెం జంక్షన్, పరవాడ, అచ్యుతాపురం, యలమంచిలి బైపాస్, రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు ► చోడవరం నుంచి తుని వైపు వెళ్లే వాహనాలు అనకాపల్లి బ్రిడ్జి, మునగపాక, పూడిమడక రోడ్డు, అచ్యుతాపురం జంక్షన్, యలమంచిలి బైపాస్, రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలి. -
ప్రధాని మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సంగారెడ్డి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు నగరంలో ట్రాఫిక్ విధించారు పోలీసులు. పటాన్చెరులో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నేపథ్యంలో ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 9:50 నుంచి 10:15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు మార్గంలో ఆంక్షలు ఉంటాయన్నారు. సభా స్థలికి ఐదుకిలో మీటర్ల మేరకు యాంటీ డ్రోన్స్ నిబంధన విధించనున్నారు. మూడంచెల భద్రతతో రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు.సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని పోలీసులు పేర్కొన్నారు. కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. చదవండి: ‘ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?’ ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటన వివరాలు 10 గంటలకు పటాన్చెరు చేరుకోనున్న ప్రధాని మోదీ. 10:40కి పటేల్‌గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11:20 నిమిషాలకు పటేల్ గూడలో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. పటాన్ చెరులో ప్రధాని పర్యటనకు చకచక సాగుతున్న ఏర్పాట్లు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ. సంగారెడ్డి వేదికగా రూ. 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్‌గా చేయనున్న ప్రధాని మోదీ. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా రూ. 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన. మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన. -
Hyderabad: 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైరదాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్) సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 45 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ► ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బషీర్‌బాగ్, పోలీస్ కంట్రోల్‌రూమ్ వైపు నుంచి వెళ్లే భారీ, ఆర్టీసీ బస్సులను ఎల్బీస్టేడియం మీదుగా బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బేగంబజార్ ఛత్రి, మాలకుంట ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను దారుసలాం జంక్షన్ నుంచి ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు. ► బహదూర్‌పురా పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ మీదుగా నయాపూల్ వైపు మళ్లిస్తారు. -
HYD: బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో శీతాకాలం విడిది కోసం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల దాకా బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తారు. కాబట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ప్రతీయేడులాగే.. ఈసారి కూడా శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ విడిదిలో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే వీలుంది. అయితే అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 20వ తేదీన భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించి చేనేత ప్రదర్శనలో పాల్గొంటారు. ఈనెల 23న రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీ బయల్దేరే అవకాశాలు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో ఉదయం 10 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, సిటీబ్యూరో: సీఎల్పీ నేతగా ఎన్నికై న రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి నగర పోలీసు విభాగం పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా స్టేడియం కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై ఉండే ప్రముఖుల వివరాల ఆధారంగా బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం స్టేడియంలోకి వెళ్లిన సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, మాజీ కొత్వాల్ సీవీ ఆనంద్ సహా ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచే బందోబస్తు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. దీనికోసం పోలీసు విభాగం దాదాపు 2 వేల మందిని వినియోగిస్తోంది. బుధవారం మధ్యాహ్నం స్టేడియం వద్దకు వచ్చిన బలగాలు రిహార్సల్స్ సైతం పూర్తి చేశాయి. ఏర్పాట్లు ఇలా.. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఉన్న మార్గం పర్యవేక్షణకు ప్రత్యేక రూట్ పార్టీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మార్గాలను ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీ చేయిస్తున్నారు. ఎల్బీ స్టేడియం చుట్టూ అనునిత్యం ప్యాట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు ఆక్టోపస్, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గోనున్నారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించనున్నారు. రూఫ్ టాప్ వాచ్ కోసం స్టేడియం చుట్టుపక్కల ఎత్తెన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. స్టేడియం చుట్టూ రహదారుల్లో నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం దాదాపు ఆరు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రతిపాదించారు. ట్రాఫిక్ ఆంక్షలు... ఎల్బీ స్టేడియంలో కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 90102 03626లో సంప్రదించాలని ట్రాఫిక్ చీఫ్ సూచించారు. వీఐపీలు, ఆహుతులతో పాటు సాధారణ ప్రజల కోసం ఆరు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ► నిర్ణీత సమయాల్లో సాధారణ వాహన చోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్–బీజేఆర్ విగ్రహం–బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తించనున్నాయి. -
రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపు కొత్త సర్కార్ కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా వేరే మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు, ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు, సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపటి సభలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక.. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేశారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ, ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్ -
ఎన్నికల కౌంటింగ్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం 15 ప్రాంతాల్లో శాసనసభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు, ప్రజలు తదనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అదనపు కమిషనర్ జీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద పార్కింగ్ ప్రాంతాలు ఇవీ.. నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ (పార్కింగ్ ఏరియా) ► ముషీరాబాద్ ఏవీ కాలేజీ, దోమల్‌గూడ (భారత్ స్కౌంట్స్ అండ్ స్కూల్, ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ, దోమలగూడ) ► చాంద్రాయణగుట్ట నిజాం కాలేజీ (నిజాం కాలేజీ గ్రౌండ్నం–4, గేట్ నం–2) ►అంబర్‌పేట రెడ్డి కాలేజీ (వైఎంసీఏ గ్రౌండ్స్, శాంతి థియేటర్, నారాయణగూడ) ►మలక్‌పేట జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియం,అంబర్‌పేట (ఎంసీహెచ్ అంబర్‌పేట) ►సనత్‌నగర్ ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ (ఎంబీఏ కాలేజ్ ఓపెన్ ప్లేస్) ►సికింద్రాబాద్ పీజీ రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (సైక్లింగ్ వెల్డ్రౌన్ గ్రౌండ్) ►గోషామహల్ కోటి ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ ►చార్మినార్ కమల నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (ఎగ్జిబిషన్ గ్రౌండ్) ►యాకుత్‌పుర సరోజినినాయుడు వనితా మహా విద్యాలయ (భీమ్‌సింగ్ రామ్ బడా పార్కింగ్) ►కార్వాన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, మాసబ్‌ట్యాంక్ (కాలేజ్ వెనక లైన్) ►నాంపల్లి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాసబ్‌ట్యాంక్ (హాకీ గ్రౌండ్ ) ►బహదూర్‌పుర ఆరోరా లీగల్ సైన్స్ అకాడమీ (అరోరా కాలేజ్) ►ఖైరతాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం (బెటాలియన్ ఓపెన్ గ్రౌండ్స్) ►జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ సీఎస్ఐఐటీ, వెస్టీ కాలేజ్ (వెస్టీ కాలేజ్) -
పరేడ్ గ్రౌండ్లో మోదీ సభ.. ఈ మార్గాల్లో రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం కోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి. ప్రధానిమోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ అదనపు (ట్రాఫిక్) పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజ్ ఎక్స్ రోడ్స్‌ను ఊసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సంబంధిత వార్త: నేడు తెలంగాణకు మోదీ ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. ►పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, తివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రహదారులు మూసివేస్తారు. ►సికింద్రాబాద్ సంగీత్ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్ వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు వెళ్లాలి ►బేగంపేట నుంచి సంగీత్ కూడలికి వచ్చే వాహనాలను సీటీఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉప్కార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా మళ్లిస్తారు ►బోయినపల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ►కార్ఖానా, ఏబీఎస్ నుంచి ఎస్బీహెచ్-ప్యాట్ని వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకార్-ఉప్కార్ వద్ద వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లిస్తారు. ►ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్బీహెచ్- స్వీకార్-ఉప్కార్ వైపు అనుమతిలేదు. క్లాక్ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తారు. ►ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్ టివోలి వద్ద స్వీకార్-ఉప్కార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలి. ►జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్ రాజ్‌భవన్ వైపు పంపిస్తారు. -
రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా రేపు(ఆదివారం) సద్దుల బతుకమ్మను సంబురంగా జరుపుకోనున్నారు. ఇక, హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ చివరి రోజు ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. #HYDTPinfo Commuters, please make a note of #TrafficAdvisory in view of #SaddulaBathukamma, celebrated on 22-10-2023 at #LumbiniPark & Upper #TankBund.#TrafficAlert #Bathukamma #Festival #Celebrations #Dussehra #Dussehra2023 @AddlCPTrfHyd pic.twitter.com/WMp9Qcpiqa — Hyderabad Traffic Police (@HYDTP) October 21, 2023 ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. ►తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు. ►సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్ రూట్లోకి మళ్లిస్తారు. ►నల్లగుట్ట నుంచి బుద్దభవన్ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు. ►హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై నుంచి వెళ్లాలి. ►సికింద్రాబాద్ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి అనుమతించరు. ఆ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►ముషీరాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు. ►ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ స్వీకార్-ఉపకార్ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్ వద్ద మళ్లిస్తారు. ►బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న మీ కోసం పార్కింగ్ ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను కేటాయించారు. -
విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు
సాక్షి, ఎన్టీఆర్: విజయవాడ నగరంలో రేపు(08-08-2023) మంగళవారం ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రకటించింది. సామాన్య ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఉదయం 05. గంటల నుండి సాయంత్రం 06.గంటలు ఈ క్రింది ట్రాఫిక్ రూట్లలో మళ్ళింపులు, ఆంక్షలు అమలులో అమలు కానున్నాయి. ఆంక్షలు 🚧 చుట్టుగుంట నుండి రామవరప్పాడు వైపుకు పడవలరేవు మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించబడవు. 🚧 మధురా నగర్ జంక్షన్ నుండి రామవరప్పాడు వైపుకు పడవలరేవు మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించబడవు. 🚧 రామవరప్పాడు నుండి పడవలరేవు(ఏలూరు రోడ్) వైపు ఎలాంటి వాహనములు అనుమతించబడవు. 🚧 గుణదల పోస్ట్ ఆఫీస్ జంక్షన్ నుండి ESI కటింగ్(ఏలూరు రోడ్) వైపు ఎలాంటి వాహనములు అనుమతించబడవు. డైవర్షన్లు 🚧 చుట్టుగుంట నుండి రామవరప్పాడు వెళ్ళవలసిన వాహన దారులు చుట్టూ గుంట జంక్షన్ నుండి నైస్ బార్ జంక్షన్ – మధు చౌక్ – జమ్మి చెట్టు సెంటర్ – సిద్దార్ధ జంక్షన్ – అమ్మ కళ్యాణ మండపం జంక్షన్ వద్ద కుడి వైపుకు -రమేష్ హాస్పిటల్ జంక్షన్ మీదుగా వెళ్ళవలెను. 🚧 రామవరప్పాడు నుండి ఏలూరు రోడ్ మరియు BRTS రోడ్ కు వెళ్ళవలసిన వాహన దారులు రామవరప్పాడు నుండి మహానాడు జంక్షన్ – రమేష్ హస్పిటల్ జంక్షన్ వద్ద కుడి వైపుకు – అమ్మ కళ్యాణ మండపం వద్ద ఎడమ వైపుకు – సిద్దార్ధ కాలేజీ జంక్షన్ – జమ్మి చెట్టు సెంటర్ – మధు చౌక్ – నైస్ బార్ జంక్షన్ – పుష్ప హోటల్ జంక్షన్ – దీప్తి జంక్షన్ మీదుగా వెళ్ళవలెను. 🚧 ESI కటింగ్ (ఏలూరు రోడ్ ) నుండి రామవరప్పాడు కు విద్యుత్ సౌద మీదుగా ఎలాంటి వాహనములు కానీ పాద చారులు కానీ అనుమతి లేదు. కనుక వాహన దారులు ప్రజలు సహకరించాలని.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను అనుసరించి తమ తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు యత్నించాలని సీపీ సదరు ప్రకటనలో పేర్కొంది. -
Hyderabad Bonalu: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16,17 తేదీల్లో పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మండలంలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహదూర్‌పురా ట్రాఫిక్ పోలస్స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నందున వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లింపు ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపులు ఉంటాయన్నారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఆషాఢ మాసం బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటోంది. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. నేడు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది. -
నేడు రాష్ట్రపతి రాక.. గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు
అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం పరిధిలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్‌నాయక్ సోమవారం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వరకు, విప్రో సర్కిల్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు, గచ్చిబౌలి కూడలి నుంచి స్టేడియం వరకు ఉన్న రోడ్లపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, ఇందుకోసం వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలలో రాకపోకలు సాగించాలని ఆయన సూచించారు. పోలీసులకు వాహనదారులంతా సహకరించాలని ఆయన కోరారు. –గచ్చిబౌలి -
నిమ్స్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు నేడు
హైదరాబాద్: నిమ్స్ అనుబంధ భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బుధవారం ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు నిర్ణీత ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని నగర అడిషనల్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్ నుంచి పంజగుట్ట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గ్రీన్‌ల్యాండ్, సోమాజీగూడ రాజీవ్ గాంధీ చౌరస్తా, రాజ్‌భవన్ రోడ్, పీవీ విగ్రహం నుంచి కేసీసీ జంక్షన్, నిమ్స్ మీదుగా పంజాగుట్ట వరకు, పంజగుట్ట నుంచి నాగార్జున సర్కిల్, బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని నిమ్స్ బ్యాక్ గేట్, తాజ్ కృష్ణా, కేసీపీ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. -
నేడే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభివర్ణించిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఆదివారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖు లు హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు 20 విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా, 25 పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించుకోవడానికి దేశ ప్రజలంతా ఒక్కటై, చేతులు కలపిన తీరు అసలు సిసలైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అధీనం మఠం పెద్దలతో మోదీ భేటీ ప్రధాని మోదీ శనివారం తన నివాసంలో అధీనం మఠం పెద్దలతో సమావేశమయ్యారు. వారు ఆయనకు ఆశీస్సులు అందించారు. సెంగోల్తోపాటు కొన్ని బహుమతులు అందజేశారు. అనంతరం మోదీ వారిని సత్కరించారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి అధీనం మఠం పెద్దలు, ప్రతినిధులు తమిళనాడు నుంచి శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతి శకంలో భారత జాతీయవాదానికి తమిళనాడు కేంద్రంగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు ప్రజల భాగస్వామ్యానికి తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెంగోల్‌కు గౌరవం దక్కాల్సి ఉండగా, దాన్నొక ‘వాకింగ్ స్టిక్’గా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్లో మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం దాన్ని ఆనంద్ భవన్ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. దేశ మహోన్నత సంప్రదాయానికి ప్రతీక అయిన సెంగోల్‌ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టిస్తుండడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు. హాజరయ్యే పార్టీలు, ఉభయ సభల్లో వాటి ఎంపీల సంఖ్య ఎన్డీయే పార్టీలు 1. బీజేపీ (394) 2. శివసేన (15) 3. నేషనలిస్టు పీపుల్స్ పార్టీ – మేఘాలయా(2) 4. నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(1) 5. సిక్కిం క్రాంతికారీ మోర్చా(1) 6. జననాయక్ జనతా పార్టీ 7. ఏఐఏడీఎంకే(5) 8. ఐఎంకేఎంకే 9. ఏజేఎస్‌యూ(1) 10. ఆర్పీఐ–అథవాలే(1) 11. మిజో నేషనల్ ఫ్రంట్(2) 12. తమిళ మానిల కాంగ్రెస్(1) 13. ఐటీఎఫ్‌టీ–త్రిపుర 14. బోడో పీపుల్స్ పార్టీ 15. పీఎంకే(1) 16. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 17. ఆప్నా దళ్(2) 18. అస్సాం గణపరిషత్ (1) నాన్–ఎన్డీయే పార్టీలు 1. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (31) 2. తెలుగుదేశం పార్టీ(4) 3. లోక్ జనశక్తి పార్టీ– రామ్ విలాస్ పాశ్వాన్(1) 4. బిజూ జనతాదళ్(21) 5. బీఎస్పీ(10) గైర్హాజరయ్యే పార్టీలు 1. కాంగ్రెస్ (81) 2. డీఎంకే (34) 3. శివసేన–యూబీటీ(7) 4. ఆమ్ ఆద్మీ పార్టీ (11) 5. సమాజ్‌వాదీ పార్టీ (6) 6. సీపీఐ (4) 7. జేఎంఎం (2) 8. కేరళ కాంగ్రెస్–మణి(2) 9. విడుదలై చిరుతైగళ్ కట్చీ(1) 10. రాష్ట్రీయ లోక్‌దళ్ (1) 11. తృణమూల్ కాంగ్రెస్ (35) 12. జేడీ–యూ (21) 13. ఎన్సీపీ (9) 14. సీపీఎం (8) 15. ఆర్జేడీ (6) 16. ఐయూఎంఎల్ (4) 17. నేషనల్ కాన్ఫరెన్స్ (3) 18. ఆర్ఎస్పీ (1) 19. ఎండీఎంకే (1) 20. ఎంఐఎం (2) -
కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
-
ప్రధాని మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు. మోనప్ప జంక్షన్– టివోలి జంక్షన్–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్, ఆర్పీరోడ్-ఎస్పీ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ నేపథ్యంలో పలు జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం) – గ్రీన్లాండ్స్–ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా–సీటీ–ప్లాజా–ఎస్బీహెచ్–వైఎంసీఏ–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్‌రోడ్–ఆలుగడ్డ బావి–మెట్టుగూడ– చిలకలగూడ–బ్రూక్ బాండ్–టివోలి–బాలమ్రాయ్–స్వీకర్ ఉపకార్–సికింద్రాబాద్ క్లబ్–తిరుమలగిరి–తాడ్‌బండ్–సెంట్రల్ పాయింట్ మార్గాల్లో ప్రయాణించొద్దని సూచించారు. టివోలి క్రాస్‌రోడ్ నుంచి ప్లాజా క్రాస్రోడ్ల మధ్య ఉన్న రోడ్డును మూసివేయనున్నట్లు తెలిపారు. ఎస్బీఎస్ క్రాస్రోడ్ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డును మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వేస్టేషన్‌కు ముందుగానే చేరుకోవాలని సూచించారు. చిలకలగూడ జంక్షన్ వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశాలను పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులు, వాహనాలు చిలకలగూడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాలని చెప్పారు. సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్ జంక్షన్-రేతిఫైల్ టీ జంక్షన్-చిలకలగూడ జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, ప్రయాణికులు క్లాక్ టవర్-పాస్‌పోర్ట్ ఆఫీస్-రెజిమెంటల్ బజార్ మెయిన్ రోడ్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ప్రయాణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన ఇలా శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోనున్న మోదీ.. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో పలు అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రైల్వేకు సంబంధించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంవో పేర్కొంది. మొత్తం రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
Alert: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 6న గురువారం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ సికింద్రాబాద్ తాడ్బంద్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగుతుంది. పుత్లిబౌలి క్రాస్‌రోడ్స్, కోఠీ ఆంధ్రబ్యాంక్ క్రాస్‌రోడ్స్, సుల్తాన్‌బజార్, రాంకోఠి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వైస్రాయ్ హోటల్, కవాడిగూడ, మహంకాళి టెంపుల్ తదితర ప్రాంతాల నుంచి తాడ్బంద్ చేరుకుంటుంది. అలాగే కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి వచ్చే మరో ర్యాలీ చంపాపేట్, ఐఎస్ సదన్, దోభీఘాట్, మలక్‌పేట్, సైదాబాద్ కాలనీ, సరూర్‌నగర్, రాజీవ్‌గాంధీ స్టాచ్యూ, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, నల్గొండ చౌరస్తా, కోఠీ విమెన్స్ కాలేజీ చౌరస్తా తదితర మార్గాల నుంచి వచ్చి ప్రధాన ర్యాలీలో కలుస్తుంది. ఈ మేరకు ఈ రెండు రూట్లలో రాకపోకలు సాగించే వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. -
శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పండగ సందర్భంగా ఈనెల 30న హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకుహైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని తెలిపారు. పండగ రోజు రాములవారి శోభాయాత్ర ఉండనున్న నేపథ్యంలో ప్రధానంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకుయాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారిమళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు .పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ వాహనదారులు తమ తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. -
వన్డే మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు
దొండపర్తి : భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్‌కు 27 వేల మంది క్రికెట్ అభిమానులు రానున్నారు. వీరితో సాధారణ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. ●మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు 27 వేల మంది రానున్నారు. వేల సంఖ్యలో వచ్చే వాహనాలతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోతాయి. దీంతో సాధారణ వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలి. ●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి విశాఖకు వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు మారికవలస వద్ద ఎడమ వైపు తిరిగి జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరుకోవాలి. అక్కడి నుంచి కుడి వైపు తిరిగి బీచ్ రోడ్డులో ప్రయాణించి రుషికొండ, సాగర్‌నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్లాలి. ●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి కార్ షెడ్ వద్ద నుంచి మిథిలాపురి కాలనీలో ప్రవేశించాలి. అలా ఎంవీవీ సిటీ వెనుకగా వెళ్లి లా కాలేజీ రోడ్డు మీదుగా ఎన్‌హెచ్ 16 చేరుకుని నగరంలోకి వెళ్లాలి. లా కాలేజీ రోడ్డు నుంచి, పనోరమ హిల్స్ మీదుగా రుషికొండ వైపు వెళ్లి అక్కడి నుంచి నగరంలోకి వెళ్లవచ్చు. ●నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, కమర్షియల్ వాహనాలు హనుమంతవాక నుంచి ఎడమ వైపు తిరిగి, ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్లి, అడివివరం వద్ద కుడి వైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్లాలి. ●నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటివి హనుమంతవాక జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరగాలి. అడవివరం మీదుగా ఆనందపురం వెళ్లవచ్చు. అలాగే విశాఖ వాలీ, ఎండాడ జంక్షన్ నుంచి కుడి వైపు తిరిగి, బీచ్‌రోడ్డుకు చేరుకుని తిమ్మాపురం వద్ద ఎడమ వైపు తిరిగి మారికవలస వద్ద ఎన్‌హెచ్ 16కు చేరుకోవాలి. భారీ వాహనాలకు సూచనలు ●19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎటువంటి భారీ వాహనాలు మధురవాడ స్టేడియం వైపు అనుమతించరు. ●అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు, నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. ●శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా, ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లాలి. ●అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే భారీ వాహనాలన్నీ అనకాపల్లి వైపు నుంచి సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా ప్రయాణించాలి. ●శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి విశాఖకు వచ్చే భారీ వాహనాలన్నీ ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి మీదుగా నగరానికి చేరుకోవాలి. మ్యాచ్‌కు వచ్చే వాహనచోదకులకు సూచనలు ●నగరం వైపు నుంచి స్టేడియానికి వచ్చే వీవీఐపీ, వీఐపీ వాహనచోదకులు ఎన్‌హెచ్ 16లో స్టేడియం వరకు ప్రయాణించి, ఏ, బీ గ్రౌండ్లు, వీ కన్వెన్షన్‌కు పాసుల ప్రకారం చేరుకోవాలి. ●విశాఖ నుంచి స్టేడియానికి వచ్చే టికెట్ ఉన్న వారు ఎన్‌హెచ్ 16లో ప్రయాణించి స్టేడియం వద్ద గల ఓల్డేజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఆన్లైన్ టికెట్లను ఒరిజినల్ టికెట్లుగా మార్చుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్ కాలేజీ పార్కింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాలి. లేదా కారుషెడ్ జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి మిథిలాపురి కాలనీ మీదుగా వచ్చి.. ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవాలి. ●నగరం నుంచి లేదా భీమిలి వైపు నుంచి బీచ్ రోడ్డు మీదుగా స్టేడియానికి వచ్చే వారు ఐటీ సెజ్ మీదుగా ఎంవీవీ సిటీ డబుల్ రోడ్డుకు చేరుకుని అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ●నగరం నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఎన్‌హెచ్ 16లో రాకుండా, బీచ్‌రోడ్డులో వచ్చి ఐటీ సెజ్ మీదుగా లా కాలేజీ రోడ్డులో పార్కింగ్ చేయాలి. ●శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ స్పెషల్ బస్సులు, మారికవలస, తిమ్మాపురం, ఐటీ సెజ్ మీదుగా వచ్చి లా కాలేజీ రోడ్డుకు చేరుకుని పార్కింగ్ చేయాలి. ●పూర్తి భద్రతతో ఎటువంటి అపశ్రుతులూ జరగకుండా స్టేడియం చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ●ప్రేక్షకులు నిర్దేశించిన గేట్ల ద్వారా మాత్రమే స్టేడియంలోకి ప్రవేశించాలి. -
వాహనదారులకు అలర్ట్! విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
విజయవాడ స్పోర్ట్స్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు, వాహనచోదకుల సౌకర్యార్థం విజయవాడ నగరంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా శుక్రవారం తెలిపారు. నగరంలోని పలు మార్గాల్లో సాగే వాహనాల రాకపోకలను వేరే రూట్లకు మళ్లిస్తున్నట్లు వివరించారు. శుక్ర వారం అర్ధరాతి 12 నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఆంక్షల సమయంలో భవానీపురంలోని కుమ్మరిపాలెం నుంచి ఘాట్‌రోడ్డుకు, గద్ద»ొమ్మ సెంటర్ నుంచి ఘాట్ రోడ్డుకు, బస్టాండ్ నుంచి ఘాట్‌రోడ్డుకు బస్సులు, కార్లు, ఆటోలు అనుమతించబోమని స్పష్టంచేశారు. స్క్యూ బ్రిడ్జి నుంచి యనమలకుదురు కట్ట వైపు, పెదపులిపాక నుంచి యనమలకుదురు కట్ట వైపు బస్సులు, భారీ వాహనాలను అనుమతించబోమని సీపీ రాణా పేర్కొన్నారు. వాహనాల దారి మళ్లింపు ఇలా.. ► హైదరాబాద్– విశాఖపట్నం మధ్య తిరిగే వాహనాలు ఇబ్రహీంపట్నం, గొల్లపూడి బైపాస్, సితార జంక్షన్, సీవీఆర్ ఫ్లై ఓవర్, పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డు, రామవరప్పాడు మార్గంలో ప్రయాణించాలి. ► విజయవాడ – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఆర్టీసీ బస్సులు బస్టాండ్ నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్, గొల్లపూడి, స్వాతి జంక్షన్, వైజంక్షన్, ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించాలి. ► బస్టాండ్ నుంచి భవానీపురం, పాలప్రాజెక్ట్కు రాకపోకలు సాగించే సిటీ బస్సులు రాజీవ్‌గాంధీ పార్కు, కనకదుర్గ ఫ్లై ఓవర్, శివాలయం వీధి, జోజినగర్ చర్చి, సితార సెంటర్, చిట్టినగర్ మార్గాన్ని అనుసరించాలి. ► అవనిగడ్డ నుంచి విజయవాడకు కరకట్ట మీదుగా రాకపోకలు సాగించే ఆరీ్టసీ, సిటీ బస్సులు పెదపులిపాక, తాడిగడప, బందరు రోడ్డు, బెంజిసర్కిల్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్ మార్గంలో ప్రయాణించాలి. -
హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, నల్గొండ: హైదరాబాద్– విజయవాడ హైవే(NH 65)పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమం కానుంది. ఫిబ్రవరి 9వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆదివారం నుంచి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 5న తెల్లవారుజాము నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు గమనించాలన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు..టేకుమట్ల నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ఈ వాహనాలన్నీ నామాపురం వద్ద జాతీయ రహదారి 65పై కలుస్తాయని పేర్కొన్నారు. భారీ, సరకు రవాణా వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులను స్వామినారాయణ గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వకట్ట మీదుగా 365బీబీ ఖమ్మం జాతీయరహదారిపైకి రోళ్లబావి తండా మీదుగా మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి వాహనాలు రాయినిగూడెం వద్దకు చేరుకొని హైదరాబాద్ వైపునకు వెళ్తాయి. హెవీ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ను మాత్రం కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకోవాలి. చదవండి: అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన -
ముకరం జా అంతిమ సంస్కారాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూసిన ఎనిమిదో నిజాం ముకరం జా అంతిమ సంస్కారాలు బుధవారం మక్కా మసీదు ప్రాంగణంలో జరగనున్నాయి. వీటి నేపథ్యంలో పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ జి.సుధీర్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి అంతిమ సంస్కారాల తంతు పూర్తయ్యే వరకు ఓల్గా జంక్షన్, ముర్గీ చౌక్, చెలాపుర మహిళ ఠాణా, మిట్టీకా షేర్, మూసాబౌలి జంక్షన్, హిమ్మత్‌పుర జంక్షన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోపక్క బుధవారం ఉప్పల్‌లో జరిగే భారత్–న్యూజిల్యాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. నగరంలోని వివిధ హోటళ్లలో బస చేసిన క్రికెటర్లు రోడ్డు మార్గంలో ఉప్పల్ వెళ్తున్నారు. వీరి రాకపోకల నేపథ్యంలో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల మధ్య సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట, రసూల్‌పురా, సీటీఓ, ఎస్బీఐ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, ఆలుగడ్డ బావి, మెట్టగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్ మార్గంలో కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. -
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు!
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ పార్టీ విషయంలో సభ్యత, భద్రత మరువద్దని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెప్తున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్‌ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తరవాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలివి.. కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. ►వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ►ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. ►యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ►నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. చదవండి: New Year Celebrations: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో .. ►ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గలలో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలు.. భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలకు నగరవాసులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఇదివరకే హెచ్చరించారు కూడా. డిసెంబర్ 31వ తేదీ శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బేగంపేట్, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. న్యూఇయర్ వేడుకలకు ఎక్కువ కోలాహలం కనిపించే.. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను అనుమతించమని చెప్పారు. ట్రక్కులతో పాటు ఇతర భారీ వాహనాలను రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్‌లోకి అనుమతించరు. ఇక నగర వ్యాప్తంగా కఠినంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయని పోలీసులు తెలిపారు. వీవీ స్టాచ్యూ, ఎన్టీఆర్ మార్గ్, రాజ్ భవన్ రోడ్, బీఆర్కే భవన్, తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, రవీంద్ర భారతి, ఖైరతాబాద్ మార్కెట్, నెక్లెస్ రోటరీ, సెన్సెషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి, సంజీవయ్య పార్క్, పీవీఎన్ఆర్ మార్గ్, మినిస్టర్ రోడ్, సైలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్ రోడ్, లోయర్ ల్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. మింట్ కంపౌండ్ రహదారిని కూడా మూసివేయనున్నారు. -
Mumbai: న్యూ ఇయర్ వేడుకలు.. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు..
ముంబై(మహారాష్ట్ర): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు వర్లీలో పార్కింగ్ నిబంధనలు జారీ చేశారు. గేట్‌వే ఆఫ్ ఇండియా, మెరీనా డ్రైవ్, నారీమన్ పాయింట్ ప్రాంతాల్లో పలు ట్రాఫిక్ షరతులను విధించారు. డిసెంబర్ 31 రాత్రి ఎనిమిది గంటల నుంచి జనవరి 1న ఉదయం ఆరు గంటలవరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. కొత్త సంవత్సర సంబురాలను జరుపుకొనేందుకు ముఖ్యంగా గేట్‌వే ఆఫ్ ఇండియా, కొలాబా, మెరీన్డ్రైవ్, నారీమన్‌పాయింట్, ఇతర సముద్ర తీరాలు, బీచుల్లో, హోటల్స్, క్లబ్‌ల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డీసీపీ (సౌత్) గౌరవ్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి ప్రకారం కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ అనుమతులు ఉండవన్నారు. కొన్నిచోట్ల రోడ్లు మూసివేస్తారని పేర్కొన్నారు. అందుకు ప్రత్యామ్నాయ దారులను సూచించారు. మూసేసే దారులు ఇవే.. ► ఎన్ఎస్ రోడ్ నార్త్ బౌండ్లోని ఎన్సీపీఏ నుంచి ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్‌వరకు అన్ని రకాల వాహనాలకు అనుమతులు లేవు (ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి ఎన్ఎస్ రోడ్‌కు వచ్చే మార్గం ఓపెన్ ఉంటుంది) ► మేడమ్ కామారోడ్ నార్త్ బౌండ్ నుంచి మంత్రాలయ జంక్షన్, ఎయిర్ ఇండియా జంక్షన్ వరకు ► ఫ్రీప్రెస్ జర్నల్మార్గ్ (స్థానికులకు మాత్రమే అనుమతి) ► ఛత్రపతి శివాజీ మహరాజ్ మార్గంలో సౌత్‌బౌండ్ పార్కింగ్ అనుమతులు లేని ప్రాంతాలు ఎన్ఎస్ రోడ్, మేడమ్ కామారోడ్, వీర్ నారీమణ్ రోడ్, ఛత్రపతి శివాజీ మార్గ్, మహాకవి భూషణ్ మార్గ్, ఆడమ్ స్ట్రీట్, హెన్రీరోడ్, హాజీ నియాజ్ అహ్మద్ అజ్మీ మార్గ్, పీజే రామ్‌చందానీ మార్గ్, బెస్ట్మార్గ్, మహర్షి కార్వే మార్గ్. వర్లీలో నో పార్కింగ్ నోపార్కింగ్ ప్రాంతాల జాబితాను ట్రాఫిక్ డీసీపీ రాజ్ తిలక్ రోషన్ బుధవారం విడుదల చేశారు. కొత్త సంవత్సర సంబరాలను జరుపుకొనేందుకు వర్లీ సీఫేస్ చౌపట్టీలో ఎక్కువమంది వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిబంధనలు విడుదలచేశారు. సొంత వాహనాల్లో వచ్చేవారు తమ వాహనాలను మేలా జంక్షన్ నుంచి జేకే కపూర్ చౌక్ మధ్య ఉన్న ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ రోడ్లో పార్క్ చేస్తుండటం వల్ల అది ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుందన్నారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని నో పార్కింగ్ జోన్‌గా ప్రకటించారు. అన్ని రకాల వాహనాలనూ నిషేధిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1న ఉదయం ఆరు గంటల వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు. చదవండి: New Year Restrictions: కరోనా విజృంభణ.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. -
Hyderabad: ఐదు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లోనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి నగరానికి రానున్న నేపథ్యంలో సోమవారం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రోజువారీగా ట్రాఫిక్ ఆంక్షలిలా.. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు హకీంపేట నుంచి సోమాజిగూడ మార్గంలోని తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలీ, ప్లాజా, బేగంపేట, రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మంగళవారం ఉదంయం 9 నుంచి 12 గంటల వరకు హకీంపేట, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలీ ప్లాజా, సీఈఓ, ప్యారడైజ్, రాణీగంజ్, కర్బలా, ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హకీంపేట– తిరుమలగిరి– కార్ఖానా– సికింద్రాబాద్ క్లబ్– టివోలీ ప్లాజా, సీటీఓ– బేగంపేట–ఎన్ఎఫ్సీఎల్– బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1/10 జంక్షన్, మాసాబ్‌ట్యాంక్, సరోజినీదేవి ఐ హాస్పిటల్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే ఆరాంఘర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి – బండ్లగూడ, చాంద్రాయణ గుట్ట, పిసల్‌బండ/చారి్మనార్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు బాలాపూర్ లేదా ఐఎస్ సదన్, నల్గొండ ఎక్స్ రోడ్డు మార్గాల్లో వెళ్లాలి. ►బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హకీంపేట– అల్వాల్, లోతుకుంట మార్గంలో మాత్రమే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. తిరుమలగిరి నుంచి శామీర్‌పేట వెళ్లే ట్రాఫిక్‌ను బోయిన్పల్లి సుచిత్ర మీదుగా బాలాజీనగర్– అమ్ముగూడ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాల్‌బజార్, కేవీ జంక్షన్ వైపునకు మళ్లిస్తారు. ►గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు బొల్లారం – షేక్‌పేట మార్గంలోని లోతుకుంట వై జంక్షన్, లాల్‌బజార్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలీ, ప్లాజా, బగేంపేట, పంజగుట్ట, ఎస్ఎన్టీ జంక్షన్, ఫిల్మ్‌నగర్ (బీవీబీ), షేక్‌పేట, ఓయాసిస్ స్కూల్ టోలీ చౌకీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ►తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శంషాబాద్– బొల్లారం మార్గంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే– ఎన్ఎండీసీ– మాసాబ్‌ట్యాంక్– బంజారాహిల్స్ 1/12 జంక్షన్ – రోడ్ నెంబర్ 1/10, తాజ్‌కృష్ణ– జీవీకే– ఎన్ఎఫ్సీఎల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీఓ ఫ్లైఓవర్, ప్లాజా, టివోలీ, సికింద్రాబాద్ క్లబ్, కార్ఖానా– తిరుమలగిరి– లోతుకుంట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ►శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సోమాజిగూడ– బొల్లారం మార్గంలోని సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్డు, బేగంపేట– ప్లాజా– టివోలీ– సికింద్రాబాద్ క్లబ్– కార్ఖానా– తిరుమలగిరి– లోతుకుంట మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. భద్రత కట్టుదిట్టం హిమాయత్‌నగర్: నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల (కేఎంఐ)కు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఆమెకు ఘనంగా స్వాగతం పలకనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం 10.20 గంటలకు కాలేజీకి వచ్చి ఇక్కడ జరిగే సదస్సులో గంటకు పైగా ఉండనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘నైజాం నుంచి హైదరాబాద్ విముక్తి’ అనే అంశంపై జరిగే సదస్సులో రాష్ట్రపతి పాల్గొననున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి నారాయణగూడలోని విద్యాసంస్థలకు సరిగ్గా మంగళవారం ఉదయం 10.20 గంటలకు ఆమె ఇక్కడికి వస్తారు. తిరిగి ఉదయం 11.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు వెళతారు. సదస్సులో ఇక్కడి విద్యాసంస్థల విద్యార్థులతో పాటు నగరంలోని మరో పది కాలేజీల నుంచి విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి కాలేజీ నుంచి 10 మంది విద్యార్థులు, ఒక ఇన్చార్జి లేదా ప్రిన్సిపాల్ ఉంటారు. ఇలా 700 మంది విద్యార్థులు 200 మంది ఇన్చార్జిలు వస్తున్నారు. తొలుత ఆజాదీ కా అమృత్ మహోత్సవ ప్రసంగం ముగిసిన తర్వాత 700 మంది విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి కానున్నారు. తెలంగాణకు చెందిన మహనీయుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె తిలకించనున్నారు. కాగా.. కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలకు 2014లో దేశ ప్రధాని అభ్యరి్థగా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చారు. విద్యార్థులతో మమేకమై.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. -
Hyderabad IRL: కార్ రేసింగ్‌కు సై
సాక్షి, సిటీబ్యూరో: సాగరతీరం మరోసారి ఉత్కంఠభరితమైన కార్ రేసింగ్‌కు సన్నద్ధమైంది. గత నెలలో సాంకేతికంగా ఎలాంటి పోటీలు లేకుండానే ముగిసిన రేసింగ్‌ను ఈ సారి పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాలు జరుగనున్న ఈ పోటీల కోసం రేసింగ్ కార్లు మరోసారి నగరానికి చేరుకున్నాయి. నెక్లెస్‌రోడ్డులోని 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్లో పరుగులు తీసేందుకు రెడీగా ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో జరిగిన ప్రమాదం, బ్రేక్‌డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్‌కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్‌ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. 12 రేసింగ్ కార్లు పాల్గొననున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తదితర నగరాలతో పాటు విదేశాలకు చెందిన రేసర్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నారు.రేసర్లు, నిపుణులు, నిర్వహణ యంత్రాంగంతో పాటు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది నగరానికి చేరుకున్నారు. రేసింగ్ రయ్.... హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్‌స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్‌స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. ట్రాఫిక్ నరకం.. ఇండియన్ రేసింగ్ లీగ్ దృష్ట్యా శుక్రవారం నుంచే నెక్లెస్‌రోడ్డు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. మింట్ కాపౌండ్ నుంచి ఖైరతాబాద్ మార్గంలో వాహనాలను అనుమతించారు. దీంతో భారీ ఎత్తున వాహనాలు ఈ మార్గంలోకి ప్రవేశించడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి రోడ్లపైన పడిగాపులు కాయాల్సి రావడంతో వాహనదారులు నరకం చవి చూశారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్‌రోడ్డు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లించారు. అటు మహాగణపతి వైపు నుంచి, ఇటు ఖైరతాబాద్ నుంచి వెళ్లే వాహనాలతో ప్రధాన రహదారి స్తంభించింది. లోయర్‌ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తదితర రూట్లలోనూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. -
IRL: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ హుస్సేన్ సాగర్ ఒడ్డున మళ్లీ సందడి చేయనుంది. శనివారం, ఆదివారం ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహణ ఉండనుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు వర్తించనున్నాయి. గత నెలలో జరిగిన పోటీలు.. అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తుది దశ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్‌రోడ్ మూసివేస్తారు. బుద్ధభవన్, నల్లగుట్ల జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్, ఐమాక్స్ వైపు వాహనాలకు నో ఎంట్రీ అమలు కానుంది అనుమతులు.. ► విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు వెళ్లే ట్రాఫిక్‌ను షాదాన్ కాలేజ్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. ► బుద్ధభవన్/నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు అనుమతిస్తారు. ► రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ► ఇక్బాల్మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. ► ట్యాంక్‌బండ్/తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్మి నార్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. ► బీఆర్కేఆర్ భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్మినార్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. ► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వైపు అనుమతిస్తారు. ► ఖైరతాబాద్ బడాగణేశ్ వీధి నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను రాజ్‌దూత్ వైపు అనుమతిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్‌రోడ్, లుంబినీ పార్క్‌లు ఈ నెల 9 నుంచి ఈ నెల 11 వరకు మూసి ఉంటాయి. శని, ఆదివారాల్లో హుస్సేన్ సాగర్ తీరం నెక్లెస్ రోడ్డులోని 2.7 కిలోమీటర్ల ట్రాక్‌పై రేసింగ్ కార్లు దూసుకెళ్లనున్నాయి. శనివారం 2 క్వాలిఫయింగ్ సెషన్లు, ఒక స్ప్రింట్ రేసు జరగనుంది. అలాగే ఆదివారం ఒక స్ప్రింట్, మరో ఫీచర్ రేసును నిర్వహిస్తారు. గత నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రౌండ్ జరిగింది. ఆ సమయంలో.. రెండో రోజు పోటీల్లో చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. -
Hyderabad: కార్ రేసింగ్ పోటీలతో మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్ రేసింగ్ పోటీలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. కార్ రేసింగ్ పోటీలతో నగరంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ► ఖైరతాబాద్ ఫ్లైఓవర్,నెక్లెస్ రోడ్,ఐమాక్స్ రోటరీ వైపు రోడ్ మూసివేత. ► బుద్దభవన్,నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు నో ఎంట్రీ. ► రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు రోటరీ ట్రాఫిక్ అనుమతించరు. ► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్,ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలకు నో ఎంట్రీ. ► ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే రోడ్స్ క్లోజ్. ► బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ► ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్,నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్. ► ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ఘాట్,నెక్లెస్ రోడ్,లుంబినీ పార్క్ రోడ్లు మూసివేతయబడతాయి. కాగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో గత నెలలో నిర్వహించిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. నవంబర్ 19, 20న జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లు రద్దు చేశారు. తొలి లీగ్ రౌండ్లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు. ఈ షోకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇండియన్ రేస్ లీగ్ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించింది. చదవండి: Hyderabad: కుర్రకారు.. ‘సోషల్’ జోరు.. రోజుకు 6 గంటల పాటు వీటితోనే -
Vijayawada: రాష్ట్రపతి పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పర్యటన నేపథ్యంలో ఆదివారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా శనివారం పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోకి భారీ, గూడ్స్ వాహనాలను అనుమతించబోమని తెలిపారు. మచిలీపట్న నుంచి విజయవాడకు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కంకిపాడు వద్ద నిలిపివేస్తామన్నారు. ►విశాఖపట్నం–హైదరాబాద్ రాకపోకలు సాగించే వాహనాలు హనుమాన్‌జంక్షన్, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మార్గాన్ని అనుసరించాలి. ఈ రహదారి ఆంక్షలు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటాయి. ►విశాఖపట్నం–చెన్నైకు రాకపోకలు సాగించే వాహనాలు హనుమాన్‌జంక్షన్, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మార్గాన్ని అనుసరించాలి. ఈ ఆంక్షలు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అమలులో ఉంటాయి. ►గుంటూరు – విశాఖపట్నంకు బుడంపాడు, పొన్నూరు, రేపల్లె, అవనిగడ్డ, హనుమాన్‌జంక్షన్ మీదుగారాకపోకలు సాగించాలి. ఈ ఆంక్షలు ఉదయం ఏడు నుంచి 10.30 గంటల వరకు అమలులో ఉంటాయి. ►చెన్నై–హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడకుడి, నార్కెట్‌పల్లి మీదుగా రాకపోకలు సాగించాలి. ఈ ఆంక్షలు ఉదయం ఏడు నుంచి 10.30 గంటల వరకు అమలులో ఉంటాయి. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) -
బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..
సాక్షి, హైదరాబాద్: బేగంపేట రసూల్‌పురా చౌరస్తా– మినిస్టర్ రోడ్డులోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ మధ్య ఉన్న నాలా పునరుద్ధరణ దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ ఎస్ఎన్డీపీ–11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అభ్యర్ధన మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ► బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రసూల్ చౌరస్తా వద్ద రైట్ టర్న్ తీసుకోవడానికి అనుమతించరు. అయితే అక్కడ యూ టర్న్ తీసుకోవచ్చు. బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ మీదుగా రాంగోపాల్‌పేట పీఎస్, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ వైపు అనుమతిస్తారు. ► రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రసూల్‌పురా వైపు అనుమతించరు. వీరు రాంగోపాల్‌పేట పీఎస్, సింథికాలనీ, ఫుడ్‌వరల్డ్, హనుమాన్ టెంపుల్ మీదుగా రసూల్‌పురా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ వైపు నుంచి కిమ్స్ ఆస్పత్రి వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ, రాంగోపాల్‌పేట పీఎస్ వద్ద ఎడమ వైపు మళ్లి మినిస్టర్ రోడ్డులో కిమ్స్ వైపునకు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ప్యారడైజ్, రాణిగంజ్ వద్ద కుడివైపునకు మళ్లి కిమ్స్ వైపు మళ్లవచ్చు. ► అంబులెన్స్‌లు లేదా రోగులు బేగంపేట ఫ్లైఓవర్ నుంచి మినిస్టర్ రోడ్డు కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లేవారు సీటీఓ/ మీటింగ్ పాయింట్ వద్ద యూ టర్న్ తీసుకుని సింథికాలనీ, రాంగోపాల్ పేట పీఎస్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వైపుగా వెళ్లేందుకు బైలేన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ► భారీ వాహనాలు (బస్సులు, డీసీఎంలు, లారీలు) హనుమాన్ దేవాలయం నుంచి సింథికాలనీ, పీజీ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రెండు వైపులా అనుమతించరు. ఆ వాహనాలు మినిస్టర్ రోడ్డుకు చేరుకోవడానికి రాణిగంజ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. నగర పౌరులు ఈ ఆంక్షలను గమనించి సూచించిన మార్గాల్లో గానీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో గానీ తమ గమ్యస్థానాలను సులువగా చేరుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. -
HYD: ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్ బంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. అంతేకాదు.. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై సందర్శక ప్రాంతాలను మూసేయనున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ నెల 18(శుక్రవారం) నుంచి బంద్ చేయనున్నారు. ఈ మూసివేత 20వ తేదీ వరకు ఉంటుంది. తిరిగి 21వ తేదీ నుంచి వాటిని తెరుస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలను 16వ తేదీ రాత్రి పది గంటల నుంచి 20వ తేదీ రాత్రి పది గంటల వరకు అమలు చేస్తామని ఇది వరకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు.. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఖైతరాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం రూట్, ట్యాంక్‌బండ్ పరిసరాలలో వెళ్లవద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ వాహనదారులకు సూచించారు. అనసవసరంగా ఆ రూట్లలో వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు. -
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు.. ఇదిగో ఇలా వెళ్లండి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో ఆ కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షాద్‌నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆంక్షలు అమలు చేశారు. జడ్చర్ల నుంచి సిటీ వైపు వచ్చే వాహనాలను ఒకే లేన్‌లో అనుమతించారు. మరో లేన్‌లో వచ్చే వాహనాలను అమిత్ కాటన్ మిల్, బూర్గుల క్రాస్ రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్‌నగర్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి షాద్‌నగర్ వైపు వచ్చే వాహనాలను కేశంపేట క్రాస్ రోడ్, చటాన్‌పల్లి రైల్వే గేట్ మీదుగా మళ్లించారు. పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వాహనాలను షాద్‌నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు మళ్లించారు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా నేతలు తరలిరావడంతో ఆయా మార్గాలు రద్దీగా మారాయి. సోమవారం రెండోరోజు ఇలా.. ♦పరిగి నుంచి సిటీ వైపు వచ్చే వెహికిల్స్ షాద్నగగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేట్ మీదుగా వెళ్లాలి. ♦సిటీ నుంచి షాద్‌నగర్‌కు వెళ్లే వెహికిల్స్ కొత్తూరు వై జంక్షన్, జేపీ దర్గా క్రాస్ రోడ్, నందిగామ, దస్కల్ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి. ♦జడ్చర్ల నుంచి షాద్‌నగర్ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికిల్స్ వన్‌వేలో వెళ్లాల్సి ఉంటుంది. శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. ♦మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ♦బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వాహనాలు పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్‌గూడ, గొల్లపల్లి, కిషన్‌గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మూడో రోజు (నవంబర్ 1న).. ♦ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. ♦బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వాహనాలు తొండుపల్లి టోల్గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్ రోడ్, జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్‌పాస్, గగన్‌పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: తెలంగాణలో సీబీఐకి ‘నో ఎంట్రీ’.. కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక అంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియం మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించేలా నగర ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల మీదుగా కాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ ♦అబిడ్స్ చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బిజెఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. వాటిని ఎఆర్ పెట్రోల్ పంపు మీదుగా మళ్లిస్తారు. ♦బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ మూసివేసి ఆ వాహనాలను ఎస్బిఐ గన్ఫౌం డ్రీ వైపు మళ్లిస్తారు. ♦రవీంద్రభారతి, ఆదర్శ్‌నగర్ ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలను నాంపల్లి వైపు వెళ్లాలి. ♦నారాయణగూడ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా హిమయత్‌నగర్ వై జంక్షన్ వైపు వెళ్లాలి ♦కింగ్‌కోఠి నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు ఇలా... ♦కెపిహెచ్బి, మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులు ఏఆర్ పెట్రోల్ పుంపు మీదుగా నాంపల్లి వైపు మళ్లించారు ♦కోఠి నుంచి సికింద్రాబాద్ వెళ్లే బస్సులు కాచిగూడ, నారయణగూడ, హిమయత్‌నగర్ మీదుగా వెళ్లాలి పార్కింగ్ ఇలా... ♦వీఐపీ, అధికారుల కోసం టెన్నిస్ గ్రౌండ్ వద్ద. ♦ప్రింట్ ఆండ్ మీడియా ప్రతినిధుల కోసం సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వద్ద. ♦ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం నిజాం కళాశాల మైదానం వద్ద.. -
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు సూచనలివే!
గచ్చిబౌలి: స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఐటీ కారిడార్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రీడమ్ రైడ్ నేపథ్యంలో దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలి వరకు పలు మార్లాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రారంభమయ్యే ఫ్రీడమ్ రన్ ఐకియా రోటరీ వద్ద కుడి వైపు , లెమన్ ట్రీ హహోటల్, ఫీనిక్స్ ఐటీ హబ్, డెల్, టెక్ మహీంద్రా, సీఐఐ జంక్షన్ మీదుగా మెటల్ చార్మినార్ వరకు కొనసాగుతుందన్నారు. అక్కడి నుంచి ఇందిరాగాంధీ విగ్రహం, సైబర్‌టవర్ జంక్షన్లో కుడి వైపునకు వెళ్లి మెడికవర్ హాస్పిటల్ మైండ్ స్పైస్ గేట్, రోటరీలో ఎడమ వైపు టీ హబ్ జంక్షన్, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మై హోం భూజ, ఎన్సీబీ జంక్షన్ నుంచి సైబరాబాద్ కమిషనరేట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, విప్రో జంక్షన్, ఐసీఐసీఐ బ్యాంక్, కోకాపేట్ రోటరీ, యుటర్న్ తీసుకొని ఐసీఐసీఐ జంక్షన్, విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఎడమ వైపు టర్న్ తీసుకొని హెచ్‌సీయూ డిపో వద్ద యూటర్న్ తీసుకొని గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటుంది. (చదవండి: గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్ ) ► కావూరీహిల్స్ జంక్షన్ నుంచి, గచ్చిబౌలి వైపు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు సీఓడీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు. సైబర్ టవర్ నుంచి మైండ్ స్పేస్ అండర్ పాస్ నుంచి బయోడైవర్సిటీ, గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లవచ్చు. ► రోడ్డు నెంబర్ 45 నుంచి ఐటీసీ కోహినూర్ వైపు వచ్చే వాహనాలు, గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను సీవోడీ జంక్షన్, మాదాపూర్ పీఎస్‌కు మళ్లిస్తారు. ► కావూరీహిల్స్ జంక్షన్ నుంచి కొత్తగూడ,, సైబర్ టవర్ జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు. సైబర్ టవర్ నుంచి ఎన్సీబీ జంక్షన్ వరకు, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు అనుమతించరు. విప్రో నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ , కొత్తగూడ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు. ► మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో ట్రక్కులు, లారీలు, రెడిమిక్స్లు, డీసీఎంలకు అనుమతి లేదు. (చదవండి: గురుకుల పోస్టుల భర్తీ.. 9,096 కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం) -
Ujjaini Mahankali Bonalu: జంటనగర వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 17, 18వ తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా... కర్బల మైదాన్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రాణిగంజ్ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్ మీదుగా, ఎస్పీ రోడ్‌లోని బేగంపేట హెచ్‌పీఎస్ వద్ద యూటర్న్ తీసుకుని సీటీవో, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ, సంగీత్, గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల మీదుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తాడ్బంద్, బేగంపేట వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా లేదా క్లాక్ టవర్, వైఎంసీఏ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్ గాస్మండి చౌరస్తా, సజ్జన్‌లాల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా వెళ్లాలి. ► ప్యాట్నీ ఎస్బీఐ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్ ప్యాట్నీ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్, ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ సంగీత్ చౌరస్తా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా చిలకలగూడ వైపు నుంచి వెళ్లాలి. ► ప్యారడైజ్ వైపు నుంచి బైబిల్ హౌస్ వెళ్లాల్సిన వాహనదారులు ఎస్బీఐ, క్లాక్‌టవర్ మీదుగా వెళ్లాలి. ► క్లాక్ టవర్ నుంచి ఆర్పీరోడ్ వెళ్లే వాహనదారులు ప్యారడైజ్, మినిష్టర్ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► సీటీవో, ప్యారడైజ్ నుంచి ఎంజీరోడ్ వెళ్లే వాహనాలు సింధీకాలనీ, మినిష్టర్ రోడ్, కర్బల మైదాన్గా వెళ్లాలి. ► పంజగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్ జంక్షన్, ఐమాక్స్ రోటరీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ చౌరస్తా, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు ఓల్డ్ గాంధీ, మోండా మార్కెట్, బైబిల్ హౌస్, కర్బల మైదాన్ మీదుగా వెళ్లాలి. ► ఉప్పల్ నుంచి పంజగుట్ట వెళ్లే వాహనదారులు రామంతాపూర్, అంబర్పేట్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ రోడ్డును వినియోగించుకోవాలి. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వైపు రెండు వైపుల రోడ్డు మూసి ఉంటుంది ఈ రోడ్డు వైపు రావద్దు. ► మహంకాళి ఆలయానికి వెళ్లే టొబాకోబజార్, హిల్‌స్ట్రీట్, సుభాష్‌రోడ్‌లో బాటా నుంచి రాంగోపాల్‌పేట్ పాత పోలీస్ స్టేషన్ వరకు, ఆదయ్యనగర్ నుంచి దేవాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే... ► బోనాల జాతరకు వచ్చే వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు 8 ప్రాంతాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ► సెయింట్ జాన్సన్ రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీఐ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్‌తో పాటు బెల్సన్ తాజ్ హోటల్, మహబూబ్ కళాశాల, ఎస్వీఐటీలో పార్కింగ్ చేసుకోవచ్చు. ► సుభాష్‌రోడ్, రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ జైల్‌ఖానా వద్ద, కర్బల మైదాన్, బైబిల్ హౌస్, గాస్మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా స్కూల్, రాణిగంజ్, ఆదయ్యనగర్ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలు ఆదయ్య మెమోరియల్ స్కూల్లో, సీటీవో, బాలంరాయి, రసూల్‌పురా నుంచి వచ్చే వాహనాలు గాంధీ విగ్రహం వద్ద, మంజు థియేటర్ వైపు వచ్చే వాహనాలు అంజలి థియేటర్ వద్ద పార్కింగ్ చేసికోవచ్చు. ► ‘సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు 10వ నంబర్ ప్లాట్‌ఫాం వైపు ఉన్న రహదారిని ఉపయోగించుకోవాలి’ అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. (క్లిక్: హైదరాబాద్ ఐఐటీ అదుర్స్) -
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లకపోవడం బెటర్!
సాక్షి,సనత్‌నగర్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మంగళవారం (అమ్మవారి కల్యాణం), బుధవారం (రథోత్సవం) సందర్భంగా ఆయా రోజుల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకుని ప్రయాణించాలని ఆయన కోరారు. ► గ్రీన్‌ల్యాండ్స్, దుర్గామాత టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహ నాలు ఎస్ఆర్నగర్ ‘టీ’ జంక్షన్ వద్ద మళ్లి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్‌నగర్ ఎక్స్‌రోడ్డు, సనత్‌నగర్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► ఫతేనగర్ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట ప్రధాన రహదారి గుండా అనుమతించరు. వాహనదారులు బల్కంపేట–బేగంపేట లింక్‌రోడ్డులోకి మళ్లించి కట్టమైసమ్మ టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► గ్రీన్‌ల్యాండ్స్ బకుల్ అపార్ట్మెంట్స్, ఫుడ్‌వరల్డ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. వాహనదారులు ఫుడ్‌వరల్డ్ ఎక్స్‌రోడ్డు వద్ద మళ్లి సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్ఆర్నగర్ ‘టీ’జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటంది. ► ఎస్ఆర్నగర్ ‘టీ’జంక్షన్ నుంచి ఫతేగర్ వైపు వెళ్లే బై–లేన్స్, లింక్‌రోడ్లను మూసివేయడం జరిగిందని, వాహనదారులు గమనించి ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలన్నారు. పార్కింగ్ ఏరియాలు ఇవే.. ఎల్లమ్మ కల్యాణం వీక్షించేందుకు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం, అమీర్‌పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ రోడ్డు వైపు పార్కింగ్ ప్రాంతం, పద్మశ్రీ, ఫతేనగర్ ఆర్యూబీ ప్రాంతాల్లో భక్తులు పార్కింగ్ చేసుకోవచ్చని జాయింట్ కమిషనర్ తెలిపారు. చదవండి: JEE Mains 2022 Answer Key: ఆన్సర్ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం -
కల్యాణం నేపథ్యంలో.. 15న ట్రాఫిక్ మళ్లింపు
కడప అర్బన్: ఒంటిమిట్టలో ఈనెల 15న సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. భక్తుల వాహనాలు మినహా ఎలాంటి ఇతర వాహనాలను అనుమతించరని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాహనాల మళ్లింపు వివరాలు ఇలా.. ► కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్‌పల్లి, ఇర్కాన్ సర్కిల్ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి. ► పులివెందుల నుంచి కడప నగరానికి, కడప మీదుగా వెళ్లే వాహనాలను సాక్షి సర్కిల్ నుంచి ఊటుకూరు సర్కిల్ వైపు దారి మళ్లిస్తారు. ► తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి. ► రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా మళ్లిస్తారు. ► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సాలాబాద్ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా దారి మళ్లిస్తారు. ► రాజంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను సాలాబాద్ సమీపంలో 15 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి. ► కల్యాణ వేదిక నుంచి కడప మార్గంలో 10 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ పునః ప్రారంభం.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పునః ప్రారంభమైంది. దీనికి వచ్చే సందర్శకుల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయి. ఎస్ఏ బజార్, జామ్‌బాగ్‌ల వైపు నుంచి ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ మీదుగా మళ్లిస్తారు. పోలీసు కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు పంపిస్తారు. (క్లిక్: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!) బేగంబజార్ ఛత్రి వైపు నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ సరుకు రవాణా వాహనాలను అలాస్కా జంక్షన్ నుంచి దారుస్సలాం మీదుగా పంపిస్తారు. దారుస్సలాం నుంచి వచ్చే భారీ వాహనాలు, డీసీఎంలు అలాస్కా వద్ద కుడివైపు తిరిగి ఫీల్‌ఖానా, బేగంబజార్ ఠాణా మీదుగా ఎంజే మార్కెట్, అబిడ్స్ చేరుకోవాలి. (క్లిక్: రూ. 99 వేల కోట్ల..నిజాం నగలున్నాయి) -
భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సాగర్ కె చంద్ర డైరెక్షన్లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి లీడ్ రోల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న(బుధవారం) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇందుకోసం యూసఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది నగర పోలీస్ శాఖ. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ చెక్‌పోస్ట్ వైపు వాహనాలకు అనుమతి నిరాకరిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, క్రిష్ణ కాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమాగమం, కృష్టానగర్ మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుంది. #HYDTPinfo Commuters, please make note of traffic restrictions/diversions in view of the Pre-Release Event of the Telugu movie "Bheemla Nayak" at 1st TSSP Bn. Grounds, Yousufguda on 23.02.2022.@JtCPTrfHyd pic.twitter.com/lUn348As8R — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 pic.twitter.com/xihE3KATJj — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్లిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలల్ని పార్కింగ్ ప్రదేశాలుగా గుర్తించారు. వాహనదారులు ఈ రూట్లలో ప్రయాణించి.. అసౌకర్యానికి గురికాకూడదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్లు చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 21వ తేదీనే ఈ ఈవెంట్ జరగాల్సిన ఉండగా.. ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఈవెంట్‌ను వాయిదా వేశారు. దీంతో 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి ఉండదని, కేవలం 23వ తేదీతో ఉన్న పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం. -
విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు ఇలా..
సాక్షి, విజయవాడ: బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్–2 ప్రారంభోత్సవం, ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ టి.కె.రాణా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారన్నారు. అనంతరం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో నాయకుల ప్రసంగం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాహన రాకపోకలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంక్షలు ముగిసే వరకు నూతన ఫ్లై ఓవర్‌పై, బందరు రోడ్డులో ఎలాంటి వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. వాహనదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. మళ్లింపులు ఇలా.. ►చెన్నై నుంచి విశాఖపట్నంకు వెళ్లే లారీలు, భారీ వాహనాలు ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. ►చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే లారీలు, భారీ వాహనాలు మేదరమెట్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, నకిరేకల్ మీదుగా వెళ్లాలన్నారు. ►ఏలూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే లారీలు, భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. ►గుంటూరు నుంచి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్లే కార్లు, ఇతర వాహనాలను కనకదుర్గ వారధి పైకి అనుమతించమన్నారు. ఈ వాహనాలు ప్రకాశం బ్యారేజీ మీదుగా నగరానికి చేరుకుని అక్కడ నుంచి హైవే పై హైదరాబాద్, ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడు మీదుగా విశాఖపట్నంకు చేరుకోవాలన్నారు. ►ఏలూరు నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు వచ్చే వాహనాలు రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, పోలీస్ కంట్రోల్ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. ►పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి మచిలీపట్నం వెళ్లే వాహనాలు ఏలూరు రోడ్డు, రామవరప్పాడు రింగ్, ఎనికేపాడు, తాడిగడప 100 అడుగుల రోడ్డు మీదుగా వెళ్లాలన్నారు. ►బెంజిసర్కిల్ నుంచి బందర్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే సిటీ బస్సులను రమేష్ హాస్పిటల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్, పోలీస్ కంట్రోల్ రూం రూట్‌కు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ►నూతన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా కోరారు. -
New Year Celebrations: ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్నింటిని శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూసేస్తున్నారు. ►ట్యాంక్ బండ్‌పై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శుక్రవారం రాత్రి 10 నుంచి శనివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ►సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. వీవీ స్టాచ్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్ భవన్ మీదుగా మళ్లిస్తారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్ని ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు పంపుతారు. ►లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ►ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. -
సీఎం కేసీఆర్ క్రిస్మస్ విందు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లు బంద్
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. దీని ప్రకారం, బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు, వాటిని నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుంచి ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఆ వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ట్రాఫిక్ బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అతిథులకు ఎంట్రీ , వారి వాహనాల పార్కింగ్: ► గోల్డ్ కార్డ్ పాస్‌లను (ఏ-1 బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ‘ఏ’ గేట్ వద్ద అంటే కేఎల్కే (ఖాన్ లతీఫ్ ఖాన్) భవనం ఎదురుగా దిగి, లోపలి గేట్ నంబర్ 17 ద్వారా ప్రవేశించి, ఆలియా మోడల్ స్కూల్, ఎస్సీఈఆర్టీ, అలియా కాలేజీలో తమ వాహనాలను పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ► గ్రీన్ కార్డ్ పాస్‌లు (ఏ-2 బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ‘డీ’ గేట్ వద్ద దిగాలి అంటే ఎదురుగా. అలియా మోడల్ స్కూల్, బీజేఆర్ విగ్రహం దగ్గర, ఎస్ఏటీఎస్ గేట్ ద్వారా ప్రవేశించి వారి వాహనాలను అలియా కళాశాల, మహబూబ్ కళాశాల, అలియా మోడల్ స్కూల్, ఎస్సీఈఆర్టీ వద్ద పార్క్ చేయాలి. ► బ్లూ కార్డ్ పాస్‌లు (బి-బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ఆయాకార్ భవన్‌కు ఎదురుగా ఉన్న ‘జి’ గేట్ వద్ద దిగి, లోపలి గేట్ నంబర్ 15 ద్వారా ప్రవేశించి, పబ్లిక్ గార్డెన్లో తమ వాహనాలను పార్క్ చేయాలి. ► పింక్ కార్డ్ పాస్‌లు (సి-బ్లాక్) కలిగి ఉన్న అతిథులు బిజెఆర్ విగ్రహం సమీపంలోని ‘ఎఫ్, ఎఫ్1’ గేట్ల వద్ద దిగి, లోపలి గేట్ నెం. 6 & 8 ద్వారా ప్రవేశించి, నిజాం కళాశాల మైదానంలో తమ వాహనాలను పార్క్ చేయాలి. చదవండి: Hyderabad: ఆ ప్రయాణికులకు షాకిచ్చిన ఓలా, ఉబర్ డ్రైవర్లు -
Hyderabad: సిక్కుల ర్యాలీ: పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సిక్కు మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ జరగనుంది. అశోక్ బజార్ గురుద్వార నుంచి మొదలై మళ్లీ అక్కడికే చేరుతుంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ బజార్, చార్మినార్, గోషామహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవి శివాజీ బ్రిడ్జి జంక్షన్, ఆప్జల్ గంజ్ జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్,శాంతి ఫైర్ వర్క్స్ ప్రాంతాల్లో అమలులో ఉండనున్నాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నా మార్గాలు ఎంచుకోవాలని అధికారులు కోరారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగుతారు. అక్కడ నుంచి గ్రీన్ ల్యాండ్స్‌లోని యోథ డయాగ్నస్టిక్స్‌కు వెళ్తారు. సాయంత్రం 5.50 గంటలకు అక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.29 కు వెళ్లనున్నారు. ఆయా సమయాల్లో, ఆయా మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. -
Hyderabad: నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: మిలాద్– ఉన్– నబీ సందర్భంగా మంగళవారం నగరంలో శాంతి ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పాతబస్తీలోని వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాలీ వెళ్తున్న మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం, పూర్తిగా ఆపేయడం చేస్తారు. ఈ ప్రాంతాల్లోనే.. గులాం ముర్తుజా కాలనీలోని సయ్యద్ ఖాద్రీ చమాన్, ఇంజన్‌లి, షంషీర్గంజ్, లాల్ దర్వాజా మోడ్, రాజేష్ మెడికల్ హాల్, చార్మినార్ వద్ద ఉన్న నారాయణ స్కూల్, మక్కా మసీదు, చార్ కమాన్, గుల్జార్ హౌస్, మచిలీ కమాన్, ఎంఎం సెంటర్, పిస్తా హౌస్, నయాపూల్, సాలార్జంగ్ మ్యూజియం, ఎస్జే రోటరీ, దారుల్షిఫా, పురానీ హవేలీ. నేడు సాలార్జంగ్ మ్యూజియానికి సెలవు చారి్మనార్: మిలాద్–ఉన్–నబీ సందర్భంగా మంగళవారం నగరంలోని సాలార్జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని ఆయన కోరారు. చదవండి: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ -
హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ ట్రాఫిక్ ఆంక్షలు
-
హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోటలో ఆదివారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తమ్మీద 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నగర పోలీసులు వీటినీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (సీసీసీ) అనుసంధానించింది. స్థానిక పోలీసుస్టేషన్, కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పని తీరుపై సీసీసీ అధికారులు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ► 15న ఉ. 7 నుంచి మ. 12 గంటల వరకు కో ట వైపునకు వాహనాలకు అనుమతి లేదు. ► రాందేవ్‌గూడ నుంచి కోటకు ఎ, బి, సి, పాస్ హోల్డర్స్ వాహనాలకే అనుమతి. ► కింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే పాస్ హోల్డర్లు రేతిబౌలి,నానల్‌నగర్ జంక్షన్ నుంచి లంగర్‌హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్‌గూడ జంక్షన్ మీదుగా రావాలి. ► మక్కై దర్వాజ వద్ద ఎ– కారు పాస్ హోల్డర్లు మెయిన్ రోడ్డు పక్కన, బి– పాస్ హోల్డర్లు గోల్కొండ కోట బస్టాప్ వద్ద, సి– కారు పాస్ హోల్డర్లు గోల్కొండ బాయ్స్ గ్రౌండ్ ఫుట్‌బాల్ గ్రౌండ్లో పార్క్ చేయాలి. ► డి– పాస్ హోల్డర్లు ప్రియదర్శిని స్కూల్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి. ఇ– కారు పాస్ హోల్డర్లు సెవన్ టూంబ్స్ బంజారా దర్వాజ మీదుగా రేతిగల్లిలోని ఒౖవైసి గ్రౌండ్లో వాహనాలను పార్క్ చేయాలి. ► లంగర్‌హౌస్ మీదుగా వచ్చే ఇ– పాస్ హోల్డర్లు బడాబజార్, బల్దియా ఐలాండ్ మీదుగా ఒవైసి గ్రౌండ్‌కు వెళ్లాలి. ఎఫ్– కారు పార్క్ హోల్డర్లు లంగర్‌హౌస్ మీదుగా ఫతే దర్వాజ నుంచి హుడా పార్కు వద్ద వాహనాలను పార్క్ చేయాలి. ► షేక్‌పేట్, టోలిచౌకికి చెందిన వారు బంజారా దర్వాజ నుంచి ఆర్టీసి బస్సుల ద్వారా కోటకు చేరుకోవాలి. ► వేడుకలు పూర్తయిన తర్వాత ఏ,బీ,సీ– కారు పాస్ హోల్డర్లు మక్కై దర్వాజ, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్ నుంచి వెళ్లాలి. డి కారు పాస్ హోల్డర్లు బంజారదర్వాజ మీదుగా సెవన్ టూంబ్స్ వైపు వెళ్లాలి. ఇ– కారు పాస్ హోల్డరు బడాబజార్, ఫతే దర్వాజ గుండా వెళ్లాలి. ఎఫ్– కారు పాస్ హోల్డర్లు తమ తమ పార్కింగ్ ప్రదేశాల నుంచి వచ్చిన మార్గం గుండానే వెనక్కి వెళ్లిపోవాలి. అన్ని రకాల పాస్ హోల్డర్లు తమ పాస్‌ను తమ కారుపై డిస్ప్లే చేయాలి. -
సిటీలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, రూట్లు ఇవే!
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్‌బండ్ చౌరస్తా కేంద్రంగా ఈ నెల 14న (బుధవారం) ఉదయం 6 నుంచి కార్యక్రమం ముగిసే వరకు ఇవి అమలులో ఉంటాయి. ఆహూతులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. కర్బలామైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైలింగ్ క్లబ్ వద్ద నుంచి కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా పంపిస్తారు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంబేడ్కర్ స్టాచ్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్ టర్న్ తీసుకుని ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి. సైఫాబాద్ పాత పోలీసుస్టేషన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేడ్కర్ స్టాచ్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి. సాధూరామ్ కంటి ఆస్పత్రి నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్లే ట్రాఫిక్ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్ దర్బార్ హోటల్, జీహెచ్ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. (చదవండి: బాలుడికి ఊపిరి పోసిన ‘సాక్షి’ కథనం ) -
బేగంపేట మినహా అన్ని ఫ్లైఓవర్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో భాగంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్నింటిని గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మూసేస్తారు. ట్యాంక్ బండ్‌పై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. గురువారం రాత్రి 10 నుంచి శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. వీవీ స్టాట్యూ నుంచి – నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్‌భవన్ మీదుగా మళ్లిస్తారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు పంపిస్తారు. లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య మీదుగా మళ్లిస్తారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపించరు. వీటిని కర్బలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. ఓఆర్ఆర్, పీవీ ఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేసి ఉంటాయి. ఎయిపోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు ఉంటుంది. కనిపించని సందడి... నగరంలో ఈసారి న్యూ ఇయర్ సందడి కనిపించట్లేదు. సిటీతో పాటు శివార్లలోనూ ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్స్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కొన్ని రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ఆయా సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లకు సంబంధించి హోర్డింగ్స్ వెలుస్తాయి. ఇతర మాధ్యమాల ద్వారానూ భారీ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఈసారి ఎలాంటి హడావుడి కనిపించట్లేదు. అనేక రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకల్ని నిషేధించాయి. దీనికి తోడు డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. రాజధానిలో ఇలాంటి ప్రకటనలు లేనప్పటికీ అదే పరిస్థితి ఉండనుంది. (చదవండి: ఇంట్లోనే ‘హ్యాపీ న్యూ ఇయర్’!) -
బీసీ సంక్రాంతి సభ: వాహనాలు మళ్లింపు
సాక్షి, విజయవాడ: ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరుగనున్న బీసీ సంక్రాంతి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. వాహనాల మళ్లింపులు: పీఎన్బీఎస్ నుంచి మచిలీపట్నం, ఏలూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు పీసీఆర్, చుట్టుగుంట, రామవరప్పాడు రింగ్ మీదుగా దారి మళ్లింపు బందర్ రోడ్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సిటీ బస్సులకు నిషేధం పీసీఆర్ వైపు నుంచి బెంజి సర్కిల్ వెళ్ళు సాధారణ వాహనాలు డీసీపీ బంగ్లా మీదుగా స్టేట్ గెస్ట్ హౌస్, జమ్మిచెట్టు నుంచి పీవీపీ మాల్ మీదుగా ఎంజీ రోడ్లోకి మళ్లింపు ఆర్టీఏ నుంచి రెడ్ సర్కిల్, రెడ్ సర్కిల్ నుంచి శిఖామణి సెంటర్, శిఖామణి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్లో వాహనాలు అనుమతించబడవు. ఆహ్వానితులకు ప్రత్యేక సూచనలు: బీసీ సంక్రాంతి కార్యక్రమానికి వచ్చే వీఐపీ వాహనాలకు గేట్ నెంబర్-2 ద్వారా ప్రవేశం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు వారి అనుచరులకు గేట్ నెంబర్-3 నుంచి ప్రవేశం డైరెక్టర్ల వాహనాలకు స్వరాజ్య మైదానం ,పోలీస్ ఆర్మడ్ గ్రౌండ్ లో పార్కింగ్ ఏర్పాటు కార్యకర్తలు,అతిధులు స్టేడియం పరిసర ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ వాహనాల పార్కింగ్ చేయరాదు ఇతరులకు అసౌకర్యము కలిగించకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీ బత్తిన శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. -
గణతంత్ర వేడుకలపై డేగకన్ను
సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఆదివారం జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్–డే పరేడ్ జరిగే పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచిస్తారు. పబ్లిక్గార్డెన్స్తో పాటు ఆ చుట్ట పక్కల ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. గార్డెన్స్ చుట్టూ అనునిత్యం పెట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొనున్నాయి. దాదాపు 1500 మంది సిబ్బందిని ఇక్కడ మోహరిస్తున్నారు. నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. పబ్లిక్‌గార్డెన్స్‌కు దారి తీసే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ప్రధాన ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. పరేడ్‌ను వీక్షించడానికి వచ్చే ప్రజలు తమ వెంట హ్యాండ్ బ్యాగ్స్, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, బ్రీఫ్ కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు. బందోబస్తు చర్యల్లో భాగంగా ఈసారి గగనతలంపై నుంచి కూడా నిఘా ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ వాచ్ కోసం ఎత్తయిన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. గణతంత్య్ర వేడుకల నేపథ్యంలో తాజ్ ఐలాండ్, ఛాపెల్ రోడ్ ‘టీ’ జంక్షన్, సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్, బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మీనార్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఆదర్స్‌నగర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ పాయింట్స్ దాటి సాధారణ ట్రాఫిక్‌ను పబ్లిక్‌గార్డెన్స్ వైపు అనుమతించరు. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు గస్తీ, నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఓల్డ్‌సిటీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర కొత్వాల్ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని, వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. ♦ డబీర్‌పుర వైపు నుంచి ఆల్వా బీబీ వైపు వచ్చే వాహనాలను సునార్ గల్లీ ‘టి’ జంక్షన్ నుంచి మత్తాకీ ఖిడ్కీ వైపు మళ్లిస్తారు. ♦ డబీర్‌పుర వైపు నుంచి వచ్చేవాహనాలను షేక్ ఫైజా కమాన్ వైపు అనుమతించకుండా జబ్బీర్ హోటల్ వైపు పంపిస్తారు. ♦ యాకత్‌పుర రైల్వే స్టేషన్ నుంచి షేక్ ఫైజా కమాన్ వైపు వెళ్లే వాహనాలను బడా బజార్ ‘టి’ జంక్షన్ నుంచి చావ్నీ మీదుగా మీర్ జుల్మా తలాబ్‌కట్ట వైపు పంపిస్తారు. ♦ పురానీ హవేలీ నుంచి ఏతిబజార్ చౌక్ వచ్చే వాహనాలను సెట్విన్ చౌరస్తా నుంచి డబీర్‌పుర వైపు మళ్లిస్తారు. ♦ మిట్టీ కా షేర్ నుంచి ఏతిబజార్ వైపు వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మదీనా చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ మొఘల్‌పుర నుంచి కోట్ల అలీజా వైపు వెళ్లే వాహనాలను బీబీ బజార్ చౌరస్తా నుంచి తలాబ్‌కట్ట వైపు మళ్లిస్తారు. ♦ మొఘల్‌పుర వాటర్ ట్యాంక్ నుంచి చౌక్ మదీనా ఖాన్ వైపు వచ్చే వాహనాలను హఫీజ్ ధంకా మసీదు నుంచి శాలిబండ వైపు పంపిస్తారు. ♦ శాలిబండ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను పార్శీ కేఫ్ నుంచి మొఘల్‌పుర వైపు పంపిస్తారు. ♦ పురానాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చౌక్ ముర్గాన్ నుంచి ఛేలాపురా, షాగుంజ్, ఖిల్వత్ వైపు పంపిస్తారు. ♦ హిమ్మత్పురం నుంచి ఖిల్వత్, లాడ్ బజార్ వైపు వెళ్లే వాహనాలను మోతీగల్లీ నుంచి మూసాబౌలి వైపు మళ్లిస్తారు. ♦ షక్కీర్కోటి నుంచి వచ్చే వాహనాలను మిట్టీ కా షేర్ నుంచి ఘాన్సీబజార్, ఛేలాపుర వైపు పంపిస్తారు. ♦ సిటీ కాలేజ్, ముస్లింజంగ్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలను న్యూ బ్రిడ్జ్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు. ♦ నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా చౌరస్తా నుంచి సిటీ కాలేజ్ వైపు పంపిస్తారు. ♦ చాదర్‌ఘాట్, సాలార్జంగ్ బ్రిడ్జి, నూర్ ఖాన్ బజార్ వైపు నుంచి వచ్చే వాహనాలను దారుష్షిఫా చౌరస్తా నుంచి నయాపూల్ వైపు పంపిస్తారు. ♦ చాదర్‌ఘాట్ వైపు నుంచి వచ్చే వాహనాలను కాలీఖబర్ వైపు పంపించరు. వీటిని శాంతి లాడ్జ్ వద్ద నుంచి చాదర్‌ఘాట్ బ్రిడ్జి వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఇలా ♦ మొహర్రం ఊరేగింపు నేపథ్యంలోసికింద్రాబాద్లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవిమంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమలులో ఉంటాయి. ♦ ట్యాంక్‌బండ్, కర్బాలా మైదాన్ వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ నుంచి కవాడీగూడ, బైబిల్‌హౌస్, ఆర్పీ రోడ్ మీదుగా మళ్లిస్తారు. ♦ కర్బాలా మైదాన్ మీదుగా ఆర్పీ రోడ్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను బేగంపేట్ పాత ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ రోడ్ మీదుగా పంపిస్తారు. ♦ ఎంజీ రోడ్, సెంట్రల్ టెలిగ్రాఫిక్ ఆఫీస్ ఐలాండ్, రాణిగంజ్ మధ్య వన్‌వే అమలులో ఉంటుంది. కేవలం రాణిగంజ్ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ట్రాఫిక్‌ను రాణిగంజ్ చౌరస్తా నుంచి మినిస్టర్స్ రోడ్ వైపు పంపిస్తారు. -
రాజ్‌భవన్ దారిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆ దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోనప్ప ఐలాండ్–వీవీ స్టాచ్యూ, పంజగుట్ట–రాజ్‌భవన్ క్వార్టర్స్ మధ్య ఉన్న మార్గాల్లో సాధారణ వాహన చోదకులను అనుమతించరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేట్ నెం.3–అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మధ్య పార్కింగ్ ఏర్పాటు చేశారు. మీడియా వాహనాలకు దిల్కుష గెస్ట్‌హౌస్‌లో, ప్రభుత్వ వాహనాలు, ప్రముఖుల వాహనాలకు ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్లో పార్కింగ్ కేటాయించారు. మిగిలిన వారి వాహనాలను మెట్రో రెసిడెన్సీ–నాసర్ స్కూల్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్–వీవీ స్టాచ్యూ మధ్య మార్గంలో రోడ్డు పక్కన నిలుపుకోవచ్చు. -
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,సిటీబ్యూరో: నారాయణగూడలోని వైఎంసీఏ చౌరస్తాలో శుక్రవారం నిర్వహించనున్న సదర్ ఉత్సవ్ మేళా నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి 7గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 5గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ♦ కాచిగూడ చౌరస్తా నుంచి వైఎంసీఏ వైపు వాహనాలను టూరిస్ట్ హోటల్ మీదుగా, విఠల్‌వాడీ చౌరస్తా నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రామ్‌కోఠి చౌరస్తా వైపు, రాజ్‌మొహల్లా వైపు నుంచి రామ్‌కోఠి వైపు వచ్చే వాహనాలను సబో షాప్ పాయింట్ మీదుగా, రెడ్డి కాలేజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పురా వైపు, ఓల్డ్ బర్కత్‌పురా పోస్టాఫీస్ నుంచి వచ్చే వాహనాలను క్రౌన్ కేఫ్ వైపు, పాత ఎక్సైజ్ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను విఠల్‌వాడీ వైపు, బర్కత్‌పురా చమన్ వైపు నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పురా చౌరస్తా లేదా టూరిస్ట్ హోటల్ వైపు, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజ్ వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ చౌరస్తా వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్: నగరంలో సదర్ ఉత్సవాలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. దున్నపోతుల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ఉత్సవాలను వీక్షించేందుకు సిటీజనులు తరలొచ్చారు. ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా సదర్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంగళారపు చౌదరి సత్తయ్య యాదవ్ అండ్ బ్రదర్స్, నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎం.యాదయ్య, ఎం.లక్ష్మణ్, మహేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పండగగా ప్రకటించాలి... జూబ్లీహిల్స్: ఎల్లారెడ్డిగూడ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో కమాండో (దున్నపోతు), గౌరీ (గుర్రం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకులు గొంటి శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతిలో భాగమైన సదర్‌ను రాష్ట పండగగా ప్రకటించాలని కోరారు. సందీప్ యాదవ్, సాయినాథ్ యాదవ్, శివనాథ్ యాదవ్, శ్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. రూ.9 కోట్ల విరాట్... మారేడుపల్లి: మారేడుపల్లిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో రూ.9కోట్ల విలువైన హర్యానా దున్నపోతు (విరాట్) సందడి చేసింది. విరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి వీధుల్లో ఊరేగించారు. వెస్ట్ మారేడుపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉత్సవాలు నిర్వహించగా... దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యాదవ సంఘం నేతలు కిట్టు యాదవ్, అశోక్‌యాదవ్, సన్నీ యాదవ్, బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సైరన్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవ ఘట్టం ‘సామూహిక నిమజ్జనం’ ఆదివారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ శుక్రవారం తెలిపారు. డీసీపీ ఎల్ఎస్ చౌహాన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడం లేదా పూర్తిగా ఆపేయడం చేస్తారన్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అవసరాన్ని బట్టి వీటినిపొడిగించే అవకాశం ఉందన్నారు. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గం కేశవగిరి–నాగుల్చింత–ఫలక్‌నుమ–చార్మినార్–మదీనా–అఫ్జల్‌గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్–బషీర్‌బాగ్–లిబర్టీ–అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి.. ఆర్పీరోడ్–ఎంజీ రోడ్–కర్బాలా మైదాన్–ముషీరాబాద్ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్‌రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్‌జోన్ నుంచి.. ఉప్పల్–రామంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్లో కలుస్తుంది. ♦ వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ మీదుగా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. ♦ నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించేందుకు కేవలం బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. ♦ వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. ♦ వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్‌రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ 1. సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల్చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్, దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ 2. ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ 3. వెస్ట్ జోన్: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ 4. సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్ ‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు 5. నార్త్‌జోన్: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. గురువారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. ♦ మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్‌నగర్ కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్ ఫుడ్ వరల్డ్, సత్యం థియేటర్ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్‌పేట మీదుగా పంపిస్తారు. సందర్శకులకు పార్కింగ్ ఇలా.. హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధభవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, లోయర్ ట్యాంక్‌బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్ పరిసరాలకు చేరుకోవాలి. నిమజ్జనం తర్వాత.. విగ్రహాలను తెచ్చిన లారీలు/ట్రక్కులు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు కల్పించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాట్యూ, మింట్ కాంపౌండ్స్‌లోకి అనుమతించరు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చిల్డ్రన్స్‌పార్కు, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్‌హౌస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా అనుమతించరు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులకూ.. ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయని పోలీస్ అధికారులు ప్రకటించారు. నిమజ్జనం నేపథ్యంలో మాసబ్‌ట్యాంక్, వీవీ స్టాట్యూ, సీటీఓ, వైఎంసీఏ, రేతిఫైల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఛే నెంబర్, గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్, బహదూర్‌పురా, నల్గొండ చౌరస్తాను దాటి ముందుకు రానీయరు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులకు.. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగరంలోకి అనుమతించరు. వీటిని శివార్లలోనే ఆపేసి అటునుంచే మళ్లిస్తారు. అందుబాటులో హెల్ప్‌లైన్స్ ట్రాఫిక్ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం అందుబాటోకి తెచ్చారు. ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 9490598985, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
గూగుల్‌తో ఒప్పందం.. నిమజ్జనం లైవ్ అప్డేట్స్!
సాక్షి, హైదరాబాద్ : ఏటా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే గణేశ్ ఉత్సవాల్లో కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం గూగుల్‌కు ఎక్కనుంది. దీనికి సంబంధించి తొలిసారిగా ఈ ఏడాది ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ–1 ఎల్ఎస్ చౌహాన్‌తో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా గణేశ్ నిమజ్జనం సందర్భంలో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. వాహనాల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఊరేగింపు మార్గంలో ఉన్న వాహనాలు, విగ్రహాలతో ఉన్న వాహనాలు చేరిన ప్రాంతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆంక్షలు, మళ్లింపుల్లో మార్పులు చేస్తుంటారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఉన్న ప్రధాన ఊరేగింపు మార్గంతో పాటు మరో 20 ఉపమార్గాల్లోని 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటా యి. వీటి ప్రభావం సాధారణ వాహనచోదకుల పైనా ఉంటోంది. ఆయా మార్గాల్లో ఉన్న పరిస్థితులు, ఊరేగింపు ముగింపు ఉన్న ప్రాంతాలపై ప్రజలు సమాచారం ఇవ్వడానికి ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు వారి అధికారిక సోషల్‌మీడియాతోపాటు మీడియాను, రేడియోలను వినియోగిస్తున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగటంతోపాటు గూగుల్ నావిగేటర్, మ్యాప్స్లతోపాటు ట్రాఫిక్ లైవ్‌ను వాహనచోదకులు, ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ గూగుల్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. గణేశ్ ఊరేగింపుతోపాటు ఆ రోజు, ఆయా మార్గాల్లో ఉన్న ట్రాఫిక్ స్థితిగతుల్ని ప్రత్యేకంగా అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు చెందిన అధికారులు ఊరేగింపు, ట్రా ఫిక్ స్థితిగతులు గమనిస్తూ ఉంటారు. దీనికోసం నగరంలోని జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను వినియోగిస్తుంటారు. ఈ వివరాల ను సీసీసీ సిబ్బంది ఎప్పటికప్పుడు గూగుల్‌కు అందిస్తూ మ్యాప్‌లో అప్డేట్ అయ్యేలా చూస్తా రు. ఇది సాధారణ వాహనచోదకులకు ఉపయుక్తమని అనిల్‌కుమార్ అభిప్రాయపడ్డారు. వీక్షణకు యాప్... గణేశ్ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు తొలిసారిగా ఒక యాప్ అందు బాటులోకి వచ్చింది. ఈ వీఆర్ డివోటీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని 360డిగ్రీస్ వర్చువల్ రియాలిటీ పిక్చర్తో 23న హైదరాబాద్‌లో జరిగే నిమజ్జన దృశ్యాలను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీక్షించవచ్చునని రూపకర్తలు కాల్పనిక్ టెక్నాలజీస్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణేశ్ భక్తులు ఎక్కడ నుంచైనా సరే వేలాదిగా ప్రయాణించే వినాయకుడి రూపాలను, ఊరేగింపు విశేషాలను, పండుగ సంబరాన్ని చూడొచ్చునన్నారు. వీక్షకులు తాము సైతం హుస్సేన్‌సాగర్ సమీపంలోనే ఉన్నామని అనుభూతి చెందేలా, స్పష్టంగా ఈ దృశ్యాలను యాప్ అందిస్తుందన్నారు. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఆ ప్రతినిధులు వివరించారు. సిటీని 38 సెక్టార్లుగా విభజించి.. ‘నిమజ్జన ఘట్టం నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగరాన్ని 38 సెక్టార్లుగా విభజించి ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 2,100 మంది సిబ్బంది, అధికారులు విధుల్లో ఉంటారు. సిటీలోని ప్రతీ జంక్షన్‌లోనూ ఓ ఎస్సై, కీలక ప్రాంతాల్లో ఆపై స్థాయి అధికారులు ఉంటారు. మొత్తమ్మీద ఇద్దరు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 10 మంది ఏసీపీలు, 32 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది ఎస్సైలు, 1,950 మంది ఇతర సిబ్బందిని మోహరిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో శాంతిభద్రతల విభాగం అధికారుల సాయం తీసుకోనున్నాం. ప్రజలకు సూచనలు చేయడానికి నగర వ్యాప్తంగా 2 వేల సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. సౌత్జోన్లో ఊరేగింపు పూర్తికావడం కీలకం కావడంతో ప్రతి ఒక్కరూ త్వరగా ప్రారంభించాలి. ఊరేగింపు ముగిసిన ప్రాంతాల్లో ఆంక్షల్ని దశల వారీగా ఎత్తివేస్తాం’ – అనిల్‌కుమార్, ట్రాఫిక్ చీఫ్ -
నేడు తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు
చిత్తూరు, తిరుపతి (అలిపిరి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరగనున్న గరుడసేవకు పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్న దృష్ట్యా తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుం దని ట్రాఫిక్ డీఎస్పీ సుకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతిలో ద్విచక్రవాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకూ నిబంధనలు అమలులో ఉంటాయి. ద్విచక్రవాహనదారుల సౌకర్యార్థం రోడ్డు మార్గం సూచించే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మళ్లింపు ఇలా... ♦ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండుకు కడప, హైదరాబాద్ బస్సులు కరకంబాడి మీదుగా రేణిగుంట, ఆటోనగర్, రామానుజ సర్కిల్ మీదుగా మళ్లిస్తారు. ♦ చిత్తూరు.. మదనపల్లి.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు తుమ్మలగుంట, ఉప్పరపల్లి క్రాస్, వైకుంఠాపురం, ముత్యాలరెడ్డి పల్లి, అన్నమయ్యసర్కిల్, శంకరంబాడి సర్కిల్, రామానుజ సర్కిల్– పూర్ణకుంభం సర్కిల్ వైపు మళ్లిస్తారు. ♦ కర్ణాటక, తమిళనాడు ఆర్టీసీ బస్సులు తిరుపతి బస్టాండ్‌లో కేటాయించిన పార్కింగ్ స్థలంలోనే పార్కింగ్ చేయాలి. బస్టాండ్ బయట ప్రదేశాల్లో, నగరంలోని ప్రదేశాల్లో పార్కింగ్‌కు అనుమతించరు. ♦ బెంగళూరు నుంచి తిరుపతికి కర్ణాటక బస్సులు తిరుపతి బైరాగిపట్టెడ ఆర్చ్ దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం నుంచే రాకపోకలకు అనుమతిస్తారు. ♦ లీలామహల్ జంక్షన్, కరకంబాడిరోడ్డు, బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్, గరుడ సర్కిల్ మార్గాల్లో ఆర్టీసీ బస్సులను అనుమతించరు. ద్విచక్రవాహనాల పార్కింగ్.. ♦ గరుడసేవ సందర్భంగా టీటీడీ పాత చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్రవాహనాల పార్కిం గ్‌కు ఏర్పాటు చేశారు. చెర్లోపల్లి వైపు నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు జూపార్కు, వేదిక్ యూనివర్సిటీ, స్విమ్స్, వివేకానందా సర్కిల్ వరకు అనుమతిస్తారు. ♦ కరకంబాడి వైపు నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు.. లీలామహల్ సర్కిల్, మున్సిపల్ పార్కింగ్ క్రాస్, అన్నారావు సర్కిల్, హరేరామ హరేకృష్ణ రోడ్డు ద్వారా పార్కింగ్ స్థలానికి వెళ్లవచ్చు. ♦ బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు రామకృష్ణా సర్కిల్, స్విమ్స్ క్రాస్, వివేకానంద సర్కిల్, రుయాస్పత్రి జంక్షన్ ద్వారా టీటీడీ పాత చెక్‌పాయింట్ చేరుకోవచ్చు. ♦ నాలుగు చక్రాల వాహనాలు హరేకృష్ణ ఆలయం ఎదుట ఉన్న వినాయక నగర్ గ్రౌండ్లో పార్కింగ్‌కు అనుమతిస్తారు. ♦ టూరిస్ట్ బస్సులను చెర్లోపల్లి జూపార్క్‌రోడ్డులోని క్యాన్సర్ ఆస్పత్రి గ్రౌండ్లో పార్కింగ్‌కు అనుమతిస్తారు. -
బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: బక్రీద్ పండగ నేపథ్యంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంక్ ఈద్గాతో పాటు సికింద్రాబాద్‌లోని ఈద్గా వద్ద ఉదయం 8గంటల నుంచి 11:30గంటల వరకు వన్ వే అమలులో ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. మీరాలం వద్ద... ♦ ఈద్గా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పురా పోలీసుస్టేషన్ మీదుగా పంపిస్తారు. ఈద్గా వైపు నుంచి బహదూర్‌పురా పోలీసుస్టేషన్ వైపు వాహనాలను అనుమతించరు. ♦ శివరామ్‌పల్లి, నేషనల్ పోలీస్ అకాడమీ మీదుగా బహుదూర్‌పురా వచ్చే ట్రాఫిక్‌ను దానమ్మ గుడిసెల వద్ద ఉన్న ‘టీ’ జంక్షన్ నుంచి ఇంజిన్‌బౌలి మీదుగా పంపిస్తారు. ♦ ఈద్గా క్రాస్ రోడ్స్ నుంచి సైకిళ్లు, రిక్షాలను ఈద్గా వైపు అనుమతించరు. నిర్దేశించిన ప్రాంతాల్లో వీటిని పార్క్ చేసుకోవాలి. ♦ కార్లు, ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్ బస్సులు, లారీలు ఇతర వాహనాలను ఈద్గా వద్దకు అనుమతించరు. ఇవి మీరాలం ఫిల్టర్ బెడ్ ‘టీ’ జంక్షన్ నుంచి ముందుకు వెళ్లకుండా కేటాయించిన ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాలి. ♦ ప్రార్థనల అనంతరం ఈద్గాకు వచ్చిన వారిలో వేగంగా వెళ్లే వాహనాలను తాడ్బన్ రోడ్, బోయిస్ టౌన్ స్కూల్, న్యూ రోడ్ షంషీర్గంజ్, ఆలియాబాద్, చార్మినార్ మీదుగా పంపుతారు. సికింద్రాబాద్ ఈద్గా వద్ద... ♦ బ్రూక్‌బాండ్ సెంటర్, సీటీఓ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ఈద్గా ఎక్స్‌రోడ్ నుంచి తాడ్‌బండ్ వైపు పంపిస్తారు. -
నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త అల్లుడు హజ్రత్ ఆలీ అలైహీ సలాం వర్ధంతిని పురస్కరించుకొని పాతబస్తీలో మంగళవారం నిర్వహించిననున్న సంస్మరణ ర్యాలీ సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. చార్మినార్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ చార్కమన్, గుల్జార్ హౌస్, పతర్ గట్టి, మదీనా, టిప్సు ఖానా, చత్తా బజార్, లక్కడ్ కొటే, సలామా స్కూల్ పురానా హవేలి, నుంచి ఏపీఎట్ క్రాస్ రోడ్స్ నుంచి నుంచి కుడివైపునకు మళ్లి దారుషిఫా గ్రౌండ్స్, ఎస్జే రోటరీ, అబిద్ ఆలీఖాన్ ఐ హాస్పిటల్, మసీద్ ఇ ఇమామియా నుంచి కలికాబర్ ఎంజీబీఎస్ వద్ద ముగియనుంది. ఈ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ కోరారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు కూడా ఇతర మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. మళ్లింపులు ఇలా ఈతబర్ చౌక్ నుంచి గుల్జార్ హౌస్‌కు వచ్చే వాహనాలను ఇరానీ గల్లీలోని అర్మన్ కేఫ్ మీదుగా మళ్లించి కోట్ల ఆలీజా/హఫీజ్ దంక మసీదు వైపునకు అనుమతించనున్నారు. గాన్సి బజార్, మిట్టి కి షేర్ నుంచి వచ్చే వాహనాలను మిట్టి కా షేర్ జంక్షన్ వద్ద మళ్లించి గాన్సిబజార్, హైకోర్టు రోడ్డువైపు అనుమతించనున్నారు. చత్తాబజార్ వరకు సంస్మరణ ర్యాలీ వచ్చే వరకు నయాపూల్ వద్ద వాహనాలను నిలిపివేయనున్నారు. ఆ తర్వాత ఏపీఎట్ జంక్షన్ వెళ్లేవరకు చత్తాబజార్‌లో ట్రాఫిక్ ఆపనున్నారు. పురానా హవేలి నుంచి చత్తా బజార్ వెళ్లేవాహనాలను పీలిగేట్, బైతుల్ కయ్యంలోని ఏపీఎట్, మండి మీర్ ఆలం వద్ద మళ్లించనున్నారు. సంస్మరణ ర్యాలీ లక్కడ్ కొటేకు చేరుకోగానే సలామా స్కూల్ వైపునకు వెళుతున్న క్రమంలో ఏపీఏటీ నుంచి చత్తాబజార్ వెళ్లే వాహనాలను ఎస్జే రోటరీ, మండీ మీర్ఆలం, ప్రిన్సెస్ దురేశ్వర్ హాస్పిటల్ వద్ద మళ్లించనున్నారు. ఎస్జే రోటరీ నుంచి ఏపీఏటీ జంక్షన్ వెళ్లే వాహనాలను శివాజీ బ్రిఇడ్జ్, సలార్ జంగ్ మ్యూజియం, నూర్కాన్ బజార్ల మీదుగా అనుమతించనున్నారు. సంస్మరణ ర్యాలీ దారుషిఫా మైదానానికి చేరుకోగానే చాదర్‌ఘాట్ నుంచి వచ్చే వాహనాలను చాదర్‌ఘాట్ రోటరీ వద్ద మళ్లించి విక్టోరియా ప్లే గ్రౌండ్ జంక్షన్ వైపు అనుమతించనున్నారు. -
రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహనీ రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం, శుక్రవారం ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను వాహనదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు గల ప్రాంతాలు: - గురువారం మధ్యాహ్నం 3.55 నుంచి 4.40 గంటల వరకు బేగం పేట విమానాశ్రయం- హాటల్ తాజ్‌కృష్ణ మధ్య - శుక్రవారం ఉదయం 10.15 నుంచి 11 గంటల వరకు హాటల్ తాజ్‌కృష్ణ- సాలార్జంగ్ మ్యూజియం మధ్య, - శుక్రవారం మధ్యాహ్నం 12.15 నుంచి 12.50 గంటల వరకు సాలార్జంగ్ మ్యూజియం-మక్కా మసీదు - శుక్రవారం మధ్యాహ్నం 1.15 నుంచి 2.05 వరకు మక్కా మసీదు-హోటల్ తాజ్ కృష్ణ - శుక్రవారం సాయంత్రం 5.35 నుంచి 5.50 వరకు తాజ్‌కృష్ణ- బేగంపేట విమానాశ్రయం మధ్య ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. నేడు ఇరాన్ అధ్యక్షుడు రాక ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. హసన్ రౌహాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మక్కా మసీదులో శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇరాన్ అధ్యక్షుడి పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
6 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఆరునెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం - 45 లోని శ్రీహరి ఇంటి నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్టు సీపీ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆంక్షలు ఈ నెల 10 నుంచి జులై 10 వతేదీ వరకు అమలులో ఉన్నాయి. ఆంక్షల నేపథ్యంలో మాదాపూర్ నుంచి రోడ్డు జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోకి వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు రోడ్డు నెం. 44 మీదుగా NOC పబ్, ఇక్బాల్యా ఇంటర్నేషనల్ స్కూల్, ఫెర్నాండేజ్ దవాఖానా, రోడ్డు నెం. 39/44 జంక్షన్ మీదుగా రోడ్డు నెం. 45 లోకి రావాలి. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు. రోడ్డు నెం. 1/12లో 15 రోజులు.. బంజారాహిల్స్ రోడ్డు నెం-12లోని 1/12 జంక్షన్ నుంచి హిందు శ్మశాన వాటిక వరకు ఎం-40 గ్రేడ్ సీసీ రోడ్డు, ఫుట్‌పాత్ తదితర పనుల కారణంగా 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ ఆంక్షలు 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అమలులో ఉంటాయి. మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్డు నెం-12 కు వెళ్లే వాహనాలను 1/12 జంక్షన్లో మళ్లిస్తారు. ఈ వాహనాలు 1/10 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం-10, జహీరానగర్, క్యాన్సర్ దవాఖాన, ఒడిశా ఐలాండ్ జంక్షన్ మీదుగా రోడ్డు నెం-12 లోకి రావాలి. బంజారాహిల్స్ రోడ్డు నెం-13 లో ఒన్వేను ఏర్పాటు చేయనున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి రోడ్డు నెం.1 లోకి వన్‌వే ఉంటుంది. రోడ్డు నెం. 1/12 జంక్షన్ నుంచి రోడ్డు నెం-13 కు వాహనాల అనుమతి ఉండదు. ఈ రూట్లోని వాహనాలను రోడ్డు నెం. 1/10 జంక్షన్, రోడ్డు నెం.10, జహీరానగర్, క్యాన్సర్ ఆస్పత్రి, ఒడిశా ఐలాండ్ జంక్షన్, రోడ్డు నెం-12 కు మళ్లిస్తారు. రోడ్డు నెం. 45, ఫిలింనగర్, అపోలో హాస్పిటల్ నుంచి రోడ్డు నెం.12 మీదుగా వచ్చే వాహనాలు.. ఒడిశా ఐలాండ్ జంక్షన్, క్యాన్సర్ ఆస్పత్రి , జహీరానగర్, రోడ్డు నెం-10, రోడ్డు నెం. 1/10 జంక్షన్ నుంచి రోడ్డు నెం-1 లోకి రావాలి. ఏసీబీ అఫీస్ నుంచి రోడ్డు నెం.1/12 జంక్షన్‌కు వచ్చే వాహనాలు.. రోడ్డు నెం-13 బంజారాహిల్స్ రోడ్ , ఫ్యామిలీ హాస్పిటల్ లైన్లోకి ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. -
మంత్రి కోసం ట్రాఫిక్ బంద్
వెలగలేరు (జి.కొండూరు) : అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం అధికారులు చేసే హడావుడి చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. వెలగలేరులో ఆదివారం ఇంటింటికి తెలుగదేశం కార్యక్రమంలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరవ్వడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో జి.కొండూరు నుంచి కొండపల్లి ఐడీఏ, జి.కొండూరు నుంచి చెవుటూరు, వెలగలేరు నుంచి కొత్తూరు తాడేపల్లి వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు, వెలగలేరు మీదుగా ట్రాఫిక్ మళ్లింపు తెలిసిన విషయమే అయినప్పటకీ పోలీసులుప్రత్యామ్నాయ మార్గం చూపకుండా ఆంక్షలు పెట్టడంతో వాహనాలు నిలిపోయాయి. ఒక పార్టీ కార్యక్రమం కోసం గంటల కొద్దీ వాహనాలను నిలిపివేయడం, ప్రయాణి కులను ఇబ్బందులు పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. -
ఎల్బీనగర్-దిల్సుఖ్నగర్ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రేపు జరగబోయే లంబాడా ఐక్య వేదిక సభని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ఎల్బీ నగర్-దిల్సుఖ్ నగర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సభ జరిగే దారిలో భారీ వాహనాలకు అనుమతి లేదు. తెలంగాణ లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ సభ జరుగనుంది. అలాగే ఎల్బీనగర్ జంక్షన్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే వారు ఉప్పల్ ,రామంత పూర్, సంతోష్ నగర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మలక్‌పేట్ నుంచి వచ్చే వారు టీవీ టవర్ నుంచి రామంత్ పూర్, ఉప్పల్ మీదుగా లేదా సంతోష్ నగర్ ద్వారా ఎల్బీనగర్ వెళ్లాలన్నారు. సభకి వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు.. 1. వరంగల్, విజయవాడ వైపు నుంచి వచ్చేవారు నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలోని హెచ్ఎండీఏ లే ఔట్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు 2. ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వారు నాదర్ గుల్లోని ఏవియేషన్ అకాడమీ వద్ద ఏర్పాటు. 3. కర్మన్ ఘాట్ నుంచి వచ్చే వాహనాలకు హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు 4. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలకు ఉప్పల్ స్టేడియం వద్ద ఏర్పాటు 5. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలకు ఎక్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్‌ను తలపిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పర్యటనతో పోలీసులు భారీ భద్రతతో పాటు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. మియాపూర్, కూకట్పల్లి, ఫలక్ నుమా, చంద్రాయణగుట్ట, ఆరాంఘడ్ ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటికే ఆయా మార్గాల్లో వెళ్లే బస్సులను వేరే మార్గంలో మళ్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మియాపూర్‌తో పాటు కూకట్‌పల్లిలోని పలు విద్యాసంస్థలు మంగళవారం సెలవు ప్రకటించాయి కూడా. ఇక ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్ వెళ్లి మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెచ్ఐసీసీ, ఆపై తాజ్ ఫలక్నుమలకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత ప్రధాని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరిగి వెళ్ళనున్నారు. ఇవాంక మాత్రం బుధవారం సాయత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ మూడు రోజుల్లోనూ మొత్తం మూడు విందులు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజ్ ఫలక్నుమలో, రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో, అమెరికా ప్రభుత్వం హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో విందులు ఏర్పాటు చేశాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసులను కేటాయించారు. ప్రధానికి సంబంధించి తాజ్ ఫలక్‌నుమ, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగితా టూర్ మొత్తం హెలీకాఫ్టర్లో జరుగుతుంది. అయినా ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్ళే ప్రముఖులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు. వెస్టిన్ హోటల్, హెచ్ఐసీసీ, తాజ్ ఫలక్‌నుమ చుట్టుపక్కల సైతం ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు విధించలేదు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్ళే వారు కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన ఘట్టాలు కావడంతో అనుకోని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే వేదికలతో పాటు వాటికి దారి తీసే మార్గాల్లో ఉన్న చిరు వ్యాపారులను తొలగించారు. కాన్వాయ్‌లు, అతిథుల వాహనం ప్రయాణించేప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అలాగే మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం హెచ్ఐసీసీలో జరగనున్న జీఈఎస్ సదస్సుకు మోదీ హాజరుకానున్న నేపథ్యంలో సోమవారం సైబరాబాద్ పోలీసులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి ప్రధాని హెలికాప్టర్లో చేరుకోనున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. 20కి పైగా వాహనాలు కాన్వాయ్‌లో పాల్గొన్నాయి. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: గురునానక్ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్కులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గౌలిగూడ, అశోక్బజార్లోని గురుద్వార గురుసింగ్ నుంచి ర్యాలీ బయలుదేరి ఆఫ్జల్‌గంజ్ టీ జంక్షన్, సిద్ది అంబర్‌బజార్, మొజంజాహి మార్కెట్, జాంబాగ్, పుత్లీబౌలి, రామమందిర్ గుండా శంకర్‌షేర్ హోటల్ మీదుగా గౌలిగూడ చమన్‌కు చేరుకుంటుంది. సుమారు వెయ్యి మందితో సాగే ఈ ర్యాలీ బందోబస్తు కోసం 3 గంటల నుంచి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను అనుమతించరని, ఆయా ప్రాంతాల ద్వారా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. -
బతుకమ్మ వస్తోంది.. దారివ్వండి!
సాక్షి, హైదరాబాద్: అప్పర్ ట్యాంక్‌బండ్, ఎల్బీ స్టేడియంల్లో గురువారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. సం దర్శకులు, ఆహుతుల కోసం ప్రత్యేక పార్కిం గ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ♦ సికింద్రాబాద్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్ నుంచి కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. ♦ కట్టమైసమ్మ, కవాడిగూడ వైపు నుంచి చిల్డ్రన్స్ పార్క్ వైపు వచ్చే వాహనాలను డీబీఆర్ మిల్స్ నుంచి కవాడిగూడ వైపు పంపిస్తారు. ♦ ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం పాత గేటు నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు. ♦ ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం చౌరస్తా వైపు ట్రాఫిక్ అనుమతించరు. వీటిని నాంపల్లి/ రవీంద్ర భారతి వైపు పంపిస్తారు. ♦ ఎస్బీఐ జంక్షన్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం చౌరస్తా, బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రీ, చాపెల్‌రోడ్ మీదుగా పంపిస్తారు. ♦ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’జంక్షన్ వైపు మళ్లిస్తారు. ♦ కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్స్ మీదుగా బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ వైపు పంపిస్తారు. ♦ ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపు మళ్లిస్తారు. ♦ హిల్‌ఫోర్ట్ రోడ్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపు పంపిస్తారు. ♦ హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు మళ్లిస్తారు. ♦ పంజగుట్ట, రాజ్‌భవన్ వైపుల నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోకి వచ్చే వాహనాలను ఇందిరాగాంధీ సర్కిల్ వరకే అనుమతిస్తారు నల్లగుట్ట జంక్షన్–బుద్ధభవన్ మధ్య వాహనాలను అనుమతించరు. పార్కింగ్ ప్రాంతాలివే... ♦ మెహిదీపట్నం, కార్వాన్, ఖైరతాబాద్ వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారు ఆయకార్ భవన్ వద్ద దిగాలి. ఈ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవాలి. ♦ ముషీరాబాద్, అంబర్‌పేట, బేగంపేట వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారు బీజేఆర్ విగ్రహం చౌరస్తా వద్ద దిగాలి. ఈ వాహనా లకూ ఎన్టీఆర్ స్టేడియమే పార్కింగ్. ♦ జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, గోషా మహల్ వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారి ఏఆర్ పెట్రోల్‌పంప్ వద్ద దిగాలి. వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలోనే పార్కింగ్ చేసుకోవాలి. ♦ వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులు బీజేఆర్ విగ్రహం వద్ద వాహనాలు దిగాలి. వాహనాలను ఆలియా కాలేజ్, మహబూ బియా కాలేజ్‌ల్లో పార్క్ చేసుకోవాలి. ♦ మంత్రులు స్టేడియం డి గేట్ వద్ద వాహనం దిగాలి. వాహనాలను ఆలియా కాలేజ్‌లో పార్క్ చేసుకోవాలి. ♦ మీడియా ప్రతినిధులు సైతం డి గేట్ వద్దే వాహనం దిగాలి. వాహనాలను సచి వాలయంలో పార్కింగ్ చేసుకోవాలి. -
నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. నిమజ్జనానికి భక్తులు వచ్చేందుకు ప్రధాన రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులకు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలనుంచి వచ్చే బస్సులను నగర శివార్లకు పరిమితం చేస్తారు. ప్రతి అరగంటకు ఒక ఎంఎంటీఎస్ రైలు నడిచేలా ఎర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 24వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడమేగాక 13 కంపెనీల కేంద్ర పారా మిలటరీ దళాలను, సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును రంగంలోకి దించారు. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున గణేష్ యాక్షన్ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ పోలీసులు తొలిసారిగా ఈ కెమెరాను ఉపయోగిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలతో సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల గుండా దారి మళ్లిస్తున్నామన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. -అఫ్జల్‌గంజ్, ఎస్జే బ్రిడ్జి, శంకర్‌షేర్ హోటల్, ముక్తీయార్గంజ్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను గౌలిగూడ చమాన్ నుంచి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం మీదుగా సీబీఎస్ వైపు దారి మళ్లిస్తారు. -ఆంధ్రాబ్యాంక్, రంగ్‌మహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రూట్లోని వాహనాలను పుత్లీబౌలి క్రాస్ రోడ్స్ మీదుగా రంగ్‌మహల్ వైపు దారి మళ్లిస్తారు. -గౌలిగూడ రాంమందిర్ వద్ద ఊరేగింపు ప్రారంభమైన తర్వాత చాదర్‌ఘాట్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను రంగ్‌మహల్ వై జంక్షన్ నుంచి సీబీఎస్ వైపు దారి మళ్లిస్తారు. -పుత్లీబౌలి నుంచి ఆంధ్రాబ్యాంక్ మీదుగా ఊరేగింపు వెళుతున్న సమయంలో జీపీఓ నుంచి కోఠి వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎంజే మార్కెట్ వైపు దారి మళ్లిస్తారు. -ఊరేగింపు కోఠి ఆంధ్రాబ్యాంక్ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో చాదర్‌ఘాట్ నుంచి ఆంధ్రాబ్యాంకు వైపు వచ్చే ట్రాఫిక్‌ను, డీఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్ వద్ద సుల్తాన్‌బజార్ క్రాస్ రోడ్డు వైపు మళ్లిస్తారు. -ఊరేగింపు కాచిగూడ చౌరస్తాకు వచ్చిన సమయంలో వేర్వేరు మార్గాల నుంచి కాచిగూడ చౌరస్తాకు వస్తున్న ట్రాఫిక్‌ను టూరిస్ట్ హోటల్ జంక్షన్ వద్ద నుంచి బడీచౌడీ వైపు మళ్లిస్తారు. -ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు వచ్చే ట్రాఫిక్‌ను మెట్రో కేఫ్ నుంచి రాంనగర్ టీ జంక్షన్ వైపు దారి మళ్లిస్తున్నారు. -హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను నారాయణగూడ ైఫ్లె ఓవర్ మీదుగా అనుమతిస్తున్నారు. నారాయణగూడ ైఫైఓవర్ కింద నుంచి హిమాయత్‌నగర్ జంక్షన్ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. -కింగ్‌కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ సర్కిల్ వైపు వాహనాలు అనుమతించడంలేదు. ఇడెన్ గార్డెన్ వైపు దారి మళ్లిస్తారు. -బర్కత్‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఓల్డ్ పోస్టాఫీస్ చౌరస్తా వద్ద క్రౌన్ కేఫ్, కాచిగూడ వైపు దారి మళ్లిస్తున్నారు. -ఊరేగింపు సమయంలో కవాడిగూడ రోడ్ ప్రాగా టూల్స్ మార్గంలో ట్రాఫిక్‌ను అనుమతించరు. -కర్బలా మైదాన్ నుంచి కవాడిగూడ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను చిల్ట్రన్ పార్కు వద్ద దారి మళ్లిస్తారు. -లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ ఆలయం నుంచి వచ్చే ట్రాఫిక్‌ను డీబీఆర్ మిల్ వద్ద అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు దారి మళ్లిస్తారు. -ముషీరాబాద్ చౌరస్తా నుంచి ట్రాఫిక్‌ను కవాడిగూడ వైపు అనుమతించరు. గాంధీనగర్ నుంచి ప్రాగా టూల్ వైపు దారి మళ్లిస్తారు. -ప్రధాన ఊరేగింపు ఆర్పీ రోడ్డులోకి ప్రవేశించినప్పుడు, కర్బాలా మైదాన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎంజీ రోడ్డు రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. -అడివయ్య ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. -ట్యాంక్‌బండ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్, మినిస్టర్ రోడ్డ్ వైపు మళ్లిస్తారు. -టివోలి చౌరస్తా నుంచి బాలంరాయ్ వైపు ట్రాఫిక్‌ను ఎన్సీసీ ఎక్స్ రోడ్డు వద్ద దారి మళ్లిస్తారు. -సీటీఓ నుంచి బాలంరాయ్ వైపు వచ్చే వాహనాలు, లీ రాయల్ ప్యాలెస్ వద్ద బ్రూక్‌బాండ్ ఎక్స్ రోడ్డు, ఇంపీరియల్ గార్డెన్ మీదుగా మళ్లిస్తారు. -ఎన్సీసీ చౌరస్తా నుంచి డైమండ్ పాయింట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నార్నే ఎక్స్ రోడ్డు నుంచి కార్ఖనా బస్తీ వైపు దారి మళ్లిస్తారు. -బాపూజీనగర్ నుంచి తాడ్బన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సెంట్రల్ పాయింట్, డైమాండ్ పాయింట్, కార్ఖనా మీదుగా దారి మళ్లిస్తారు. -బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బోయిన్పల్లి చౌరస్తా, సేఫ్ ఎక్స్‌ప్రెస్, బాపూజీనగర్, బోయిన్పల్లి మార్కెట్ మీదుగా దారిమళ్లిస్తారు. -
రన్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగర పోలీసులు, షీ టీమ్ కలిసి సంయుక్తంగా ఆదివారం ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు 2కే, 5కే రన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీవీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను వీవీ విగ్రహం వద్ద మళ్లించి సాధన్, నిరంకారి భవన్‌వైపు అనుమతించనున్నారు. అంబేద్కర్, ఐటీ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇక్బల్ మినార్ వైపు మళ్లించనున్నారు. ఇక్బల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మళ్లించనున్నారు. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మళ్లించి బీఆర్కేఆర్ భవన్, తెలుగు తల్లి, ఇక్బల్ మినార్ యూ టర్న్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా అనుమతించనున్నారు. కర్బల నుంచి ట్యాంక్ బండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహాం వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్ పార్క్ నుంచి డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్‌వైపు మళ్లించనున్నారు. నల్లగుట్ట నుంచి సంజీవయ్యపార్కు వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంన్ వద్ద మళ్లించి రాణిగంజ్ ఎక్స్రోడ్డువైపు అనుమతించనున్నారు. డీబీఆర్ మిల్స్ నుంచి చిల్డ్రన్ పార్కు వైపు వాహనాలను అనుమతించమని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ తెలిపారు. రన్లో పాల్గొనేందుకు వచ్చేవారు తమ వాహనాలను మక్తా, ఐమాక్స్ పార్కింగ్, డాక్టర్స్ కారు పార్కింగ్‌లో నిలుపుకోవాలని ఆయన సూచించారు. -
తిరుమలలో పోలీసులపై దాడికి యత్నం
టీటీడీ చైర్మన్ బంధువులమంటూ సీఐ, ఎస్ఐలపై ఫైర్ సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రిస్తున్న పోలీసులపై టీటీడీ చైర్మన్ బంధువులమంటూ కొందరు దాడికి యత్నించారు. ఆదివారమిక్కడ స్థానిక శంకుమిట్ట కూడలి ప్రాంతంలో తిరుమల ట్రాఫిక్ కానిస్టేబుల్ వర ప్రసాద్, కడపకు చెందిన శ్రీరాములు, రేణిగుంట ఎస్ఐ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఎంసీ నుంచి ఎస్వీ గెస్ట్‌హౌస్‌కు వెళ్లేందుకు రెండు కార్లు అక్కడికి వచ్చాయి. ట్రాఫిక్ ఆంక్షలున్నందున ఈ మార్గంలో వెళ్లేందుకు వీలులేదంటూ ఆ కార్లను కానిస్టేబుల్ వరప్రసాద్ అడ్డుకు న్నాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌తో కారులోని ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఇంతలో సీఐ, ఎస్ఐలు జోక్యం చేసుకోగా.. నిగ్రహం కోల్పోయిన కారులోని వ్యక్తులు ‘‘రేయ్.. ’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వారి మాటల్ని సెల్ఫోన్లతో రికార్డు చేస్తుండటంతో వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. ‘‘రేయ్.. వీడియో కాదు.. ఏమైనా తీసుకో’’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఘటన కారణంగా ఎస్ఎంసీ కూడలిలో పది నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఐ, ఎస్ఐలు వెనక్కి తగ్గకతప్పలేదు. అనంతరం ఆ వాహనాలు అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. చైర్మన్ బంధువులమని బెదిరించారు: ట్రాఫిక్ ఆంక్షలుండటంతో వాహనాలను అడ్డుకున్నామని, కానీ వారు తమపై దాడికి ప్రయత్నించారని సీఐ శ్రీరాములు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ‘టీటీడీ చైర్మన్ బంధువులం. ఏం చేస్తావ్’ అంటూ బెదిరించారని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం 10.45 నుంచి 11.45 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం–హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపడం, లేదా దారి మళ్ళించడం చేస్తామన్నారు. రాష్ట్రపతి నిలయం–ఈఎంఈ సెంటర్ హౌస్–ఆరెస్సై జంక్షన్–ఆంధ్రా సబ్–ఏరియా ఆఫీసర్స్ మెస్–నేవీ హౌస్ జంక్షన్–బిసిన్ బేకరీ ఎక్స్టెన్షన్ కౌంటర్–యాప్రాల్ రోడ్–బిసిన్ హెడ్–క్వార్టర్స్ మెయిన్ గేట్–బిసిన్ ఎన్వైర్మెంటల్ పార్క్–హైగ్ లైన్ పంప్ హౌస్–ఫస్ట్ బెటాలియన్ ఈఎంఈ సెంటర్–బొల్లారం చెక్‌పోస్ట్–జేసీఓస్ మెస్ ఈఎంఈ సెంటర్–షహెజ్ ద్వార్–బొల్లారం చెక్‌పోస్ట్–ఎయిర్‌ఫోర్స్ 2 అండ్ 4 బెటాలియన్ గేట్–హకీంపేట ఎయిర్‌పోర్స్ స్టేషన్ ప్రాంతాల్లోని వాహనచోదకులు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. -
జూబ్లీ చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
జూబ్లీ చెక్ పోస్టు వద్ద మంగళవారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మెట్రో నిర్మాణ పనుల కారణంగా మూడు నెలల పాటు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసు కోవాలని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.