రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు: అనురాగ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే. చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు సీపీ అనురాగ్‌శర్మ మీడియాకు వెల్లడించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అనురాగ్ శర్మ తెలిపారు.
ఎస్ బీహెచ్ క్రాస్ రోడ్స్ నుంచి బేగంపేట మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే సీటీవో క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు వైపుకు అనుమతిలేదని సీపీ అనురాగ్‌శర్మ అన్నారు